వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులోకి ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ రాకతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా వెలువడిన ఎన్నికల పోల్స్ ట్రంప్‌పై కమలా హారీస్‌దే పైచేయి అని చెబుతున్నాయి. ఆమె గెలుపు ఖాయమంటూ నంబర్స్ రిలీజ్ చేస్తున్నాయి.
కాగా.. తాజాగా నిర్వహించిన ఐపీఎస్‌ఓఎస్, నేషనల్ పోల్స్ ప్రకారం.. ట్రంప్ కంటే కమలా హారీస్ ముందంజలో ఉన్నారు. ఈ పోల్స్ ఫలితాల్లో కమలా హారీస్‌కు 44 శాతం ఓట్లు నమోదు కాగా, ట్రంప్‌కు మాత్రం 42 శాతం పోలయ్యాయి. దీంతో, రెండు శాతం ఓటింగ్‌లో కమలా ముందంజలో ఉన్నారు. ఇక, సర్వే సందర్భంగా సందర్భంగా ఓటర్లు మాట్లాడుతూ.. తమ మద్దతు కమలా హారీస్‌కే అంటున్నారు. ఆమె సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలరు. ఈ విషయంలో ట్రంప్ కంటే ఆమెనే బెటర్ అంటూ కితాబిస్తున్నారు. ఇదే సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌కు మాత్రం 22 శాతం ఓటు షేర్ రావడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరు దాదాపు ఖరారైంది. అధ్యక్ష అభ్యర్థికి కావాల్సిన 1,976 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు ఆమెకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో డెలావెర్‌లోని ప్రచార ప్రధాన కార్యాలయాన్ని హారిస్ సోమవారం సందర్శించారు. బైడెన్ ప్రచారం బృందంతో ఆమె సమావేశమయ్యారు. అదే బృందంతో కలిసి పనిచేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా 106 రోజులే ఉన్నాయని, గెలుపు కోసం నిర్విరామంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా.. తన రిపబ్లికన్ ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై హారిస్ విరుచుకుపడ్డారు.
ఆయన కుంభకోణాలను గుర్తు చేశారు. నేరాలను ఎత్తి చూపారు. మహిళలను వేధించిన మృగం, మోసగాడు, తన స్వార్థ ప్రయోజనాలకోసం నియమా లను ఉల్లంఘించిన వ్యక్తని విమర్శించారు. ‘ట్రంప్ ఏ రకమో నాకు తెలుసు’ అంటూ ఎద్దేవా హారిస్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి పనిచేయడం తనకు దక్కిన ఒక గొప్ప గౌరవమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment