వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్.. మాజీ అధ్యక్షుడుపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా రాజకీయ చరిత్ర అనే పుస్తకంలో ట్రంప్ అనే పేజీని తిరగేసేందుకు అమెరికన్లు సిద్ధంగా ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు.
ఇక, తాజాగా కమలా హారీస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా ప్రజలు కొత్త చరిత్ర తిరగరాసేందుకు సిద్ధమయ్యారు. అమెరికా రాజకీయ చరిత్ర అనే పుస్తకంలో ట్రంప్ పేజీని తిరగేసేందుకు ప్రజలు రెడీగా ఉన్నారు. ట్రంప్ మాటలను నమ్మడానికి అమెరికన్లు సిద్ధంగా లేరు. ప్రజలు కొత్త మార్గం కోసం సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. దురదృష్టవశాత్తూ గత దశాబ్దంలో మన దేశాన్ని విభజించడం గురించి ఎజెండాను ముందుకు తెచ్చే వ్యక్తిని మాజీ అధ్యక్షుడి(ట్రంప్)గా కలిగి ఉన్నాము. ఇకపై అలాంటి తప్పు జరగదని భావిస్తున్నాను. ట్రంప్.. అమెరికా అభివృద్ధిలో పలువురి పాత్ర, వారి కృషిని తగ్గించే ప్రయత్నం చేశారు. ఇవ్వన్నీ ప్రజల మనస్సుల్లో ఉన్నాయి.
ఇదే సమయంలో మరో సంచలన ప్రకటన చేశారు. తాను అధికారంలోకి వస్తే కేబినెట్‌లోకి రిపబ్లికన్‌ను తీసుకుంటానని ప్రకటించారు. ఇక, గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని ఆమె ఆకాంక్షించారు. మిత్ర దేశమైన ఇజ్రాయెల్ విషయంలో అధ్యక్షుడు బైడెన్ విధానాలనే తాను కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.
Vice President Harris: I think that people are ready for a New Way Forward. Sadly, in the last decade, we have had in the former president, someone who has been pushing an agenda that is about diminishing the character and the strength of who we are as Americans and dividing our… pic.twitter.com/r78F4cC2ys
— Kamala HQ (@KamalaHQ) August 30, 2024
ఇదే అమెరికా అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. మొదటగా, మధ్యతరగతికి మద్దతు ఇవ్వడానికి, వారిని బలోపేతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నా అత్యంత ప్రాధాన్యతలలో ఇది ఒకటి. నేను అమెరికా ప్రజల ఆకాంక్షలు, లక్ష్యాలు, ఆశయాలను నెరవేర్చడమే మా లక్ష్యం. సరిహద్దుల్లో అక్రమ వలసలపై కఠినంగా ఉండేందుకు ప్లాన్ సిద్ధం చేసుకున్నాం. అక్రమ వలసలను అసలు అంగీకరించేది లేదు. పన్నుల విషయంలో కూడా కొన్ని విధివిధానాలను రూపొందించడం జరిగింది. దాని ప్రకారం ముందుకు సాగుతాం. శిలాజ ఇంధనాలు అధికంగా ఉండే పెన్సిల్వేనియాలో వివాదాన్ని పరిష్కరించాలని స్పష్టమైన లక్ష్యంతో ఉన్నాం అని చెప్పుకొచ్చారు.
మరోవైపు.. ఎన్నికల సందర్బంగా అమెరికన్లను ఆకట్టుకునేందుకు ట్రంప్ వరాలు ఇస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే మహిళలకు ఉచిత ఐవీఎఫ్ చికిత్సను అందించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఐవీఎఫ్ చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. లేనిపక్షంలో బీమా కంపెనీలు తప్పనిసరిగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే, దీన్ని ఎలా అమలు చేయనున్నారు? నిధులను ఎలా సమకూరుస్తారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment