
సర్ ఐజాక్ న్యూటన్(Sir Isaac Newton).. ప్రపంచంలోని ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకనిగా గుర్తింపు పొందారు. ఆయన రూపొందించిన సూత్రాలు నేటికీ గణితం, విజ్ఞాన శాస్త్రంలో ఉపయుక్తమవుతున్నాయి. ఆయన జీవితం ఎన్నో రహస్యాలతో కూడి ఉందంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనత సాధించిన న్యూటన్ అనుమానాస్పద స్థితిలో మరణించడంపై నేటికీ చర్చలు కొనసాగుతుంటాయి.
ఐజాక్ న్యూటన్ 1727, మార్చి 31న బ్రిటన్‌లోని మిడిల్‌సెక్స్‌లోని కెన్సింగ్టన్‌లో కన్నుమూశారు. నేడు ఆయన వర్థంతి(Death anniversary). ఈ సందర్భంగా పలుచోట్ల ఆయనను గుర్తు చేసుకుంటూ, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. న్యూటన్ గణిత శాస్త్రవేత్తగా, భౌతిక శాస్త్రవేత్తగా, ఖగోళ శాస్త్రవేత్తగా, రచయితగా, గొప్ప ఆధ్యాత్మికవేత్తగా గుర్తింపు పొందారు. న్యూటన్ కనుగొన్న కలన గణిత సిద్ధాంతం గణిత శాస్త్రానికి కొత్త ఆధారాన్ని అందించింది. అదేవిధంగా న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని అందించి, శాస్త్రీయ భౌతిక శాస్త్ర సిద్ధాంతానికి పునాది వేశారు.
ఖగోళ శాస్త్రంలో విశేష కృషి చేసిన ఆయన గ్రహాల కదలికల గురించి వివరించారు. తొలి ఇమేజ్ ఆధారిత టెలిస్కోప్(Telescope)ను తయారు చేశారు. ప్రిజం ద్వారా ఆప్టికల్ రంగులపై అధ్యయనం చేశారు. ధ్వని వేగాన్ని లెక్కించడం, శీతలీకరణ నియమం మొదలైనవి న్యూటన్‌కు ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆయనకు వేదాంతశాస్త్రంలో కూడా ఆసక్తి ఉంది. న్యూటన్ బైబిల్‌ను అధ్యయనం చేశారని చెబుతారు
న్యూటన్ మరణంలోనూ రెండు వాదనలు వినిపిస్తాయి. న్యూటన్ నిద్రలో మరణించారని, అనంతరం అతని శరీరంలో పాదరసం కనిపించిందని చెబుతారు. ఈ నేపధ్యంలోనే ఆయనకు రసవాదంతోనూ సంబంధం ఉందని అంటారు. న్యూటన్ తన చివరి రోజులను ఎంతో రహస్యంగా గడిపారు. ఆ సమయంలో ఆయన మానసిక అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారని, సమాజానికి దూరంగా మెలిగారని చెబుతారు. న్యూటన్ తన మరణానికి ముందు తన ఆవిష్కరణలకు సంబంధించిన కొన్ని పత్రాలను తగులబెట్టారని కొందరు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అవి రసవాదానికి సంబంధించినవని భావిస్తారు. న్యూటన్ అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.
ఇది కూడా చదవండి: మయన్మార్‌లో దారుణ పరిస్థితులు.. రెస్య్కూ వేళ వైమానిక దాడులు!