death anniversary
-
ఐ మిస్ యూ గౌతమ్: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఏపీ మాజీ మంత్రి, దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి మూడవ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) స్పందించారు. నా ప్రియమైన స్నేహితుడంటూ భావోద్వేగ సందేశం ఉంచారాయన. నా ప్రియ మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) మూడో వర్ధంతి సందర్భంగా.. నేను ఆయన్ని మనసారా గుర్తు చేసుకుంటున్నా. ఐ మిస్ యూ గౌతమ్ అంటూ ఎక్స్ ఖాతాలో సందేశం ఉంచారాయన. ఆత్మకూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఏపీ ఏపీ ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (49) 2022 ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్(Hyderabad) లోని తన నివాసంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా.. వైద్యులు తీవ్రంగా శ్రమించినా.. ఫలితం లేకపోయింది. గౌతమ్ మరణంతో తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడైన గౌతమ్ రెడ్డి.. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఆయన విజయం సాధించారు. -
'మిస్ యూ మై సన్'.. ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ తీవ్ర భావోద్వేగం!
ప్రముఖ తెలుగు లేడీ కమెడియన్, కితకితలు హీరోయిన్ గీతాసింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో గీతా సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సరిగ్గా రెండేళ్ల క్రితం చేతికి అందివచ్చిన కుమారుడిని కోల్పోయిన గీతాసింగ్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఫిబ్రవరి 18న తన కుమారుడి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించింది. తన కొడుకు తనతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంటూ.. మిస్ యూ రా అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. (ఇది చదవండి: కమెడియన్ గీతాసింగ్ ఇంట విషాదం)అయితే.. గీతాసింగ్ ఇప్పటివరకు అసలు పెళ్లే చేసుకోలేదు. తన సోదరుడి కుమారులను దత్తత తీసుకుని పోషిస్తున్నారు. వారిలో పెద్దబ్బాయి ఈ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇకపోతే కితకితలు, ఎవడిగోల వాడిది సినిమాలో గీతా సింగ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 50కి పైగా చిత్రాలు చేసింది. ప్రస్తుతం మాత్రం సినిమాలకు దూరంగా ఉంటోంది. View this post on Instagram A post shared by Geeta Singh (@kithakithalu_geetasingh) -
మనం ఇలా విడిపోతామని ఎప్పుడూ అనుకోలేదు: తారకరత్న భార్య ఎమోషనల్
సరిగ్గా రెండేళ్ల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో, నందమూరి తారకరత్న కన్నుమూశారు. ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. బెంగళూరులోని ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఆయన చివరికీ కన్నుమూశారు. తారకరత్న మరణంతో ఆయన కుటుంబంతో పాటు రెండు రాష్ట్రాల్లోని నందమూరి ఫ్యాన్స్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఫిబ్రవరి 18, 2023న నందమూరి అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ఇవాళ తారకరత్న వర్ధంతి కావడంతో ఆయన భార్య అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన ముగ్గురు పిల్లలతో కలిసి తారకరత్నకు నివాళులర్పించింది. ఈ ప్రపంచంలో నువ్వు లేని లోటు పూడ్చలేనిదని ఎమోషలైంది. నిన్ను కోల్పోయిన క్షణం కాలం నయం చేయలేని గాయం.. నీ స్థానం ఎప్పటికీ భర్తీ చేయలేనిదని భావోద్వేగానికి గురయ్యారు. మనం ఎప్పుడూ ఇలా విడిపోవాలని అనుకోలేదు... నువ్వు ఇక్కడ ఉండకపోవచ్చు.. కానీ నీ ఉనికి మా జీవితాల్లో, నువ్వు వదిలి వెళ్లిన కలల్లో వికసిస్తూనే ఉంటుందని రాసుకొచ్చింది. మాటలకు , కాలానికి, జీవితానికి అతీతంగా మేము నిన్ను మిస్ అవుతున్నాం అంటూ అలేఖ్యా రెడ్డి.. తన భర్త తారకరత్నను గుర్తు చేసుకుంది.(ఇది చదవండి: Taraka Ratna Death: నందమూరి తారకరత్న కన్నుమూత)నందమూరి కుటుంబం నుంచి 'ఒకటో నంబర్ కుర్రాడు'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించారు. కాగా.. తారకరత్నకు అలేఖ్యరెడ్డితో పెళ్లి కాగా.. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. వారిలో పెద్ద కూతురు నిష్క, కవల పిల్లలు తాన్యారామ్, రేయా సంతానం. వీరి పిల్లలకు ఎన్టీఆర్ పేరు వచ్చేలా పేర్లు పెట్టారు. మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తారకరత్న తాతగారు అయిన ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు నిష్క లో మొదటి అక్షరం N, తాన్యారామ్‌లో T, రేయాలో R.. ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారు తారకరత్న. View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna) -
Damerla Ramarao అద్వితీయ చిత్రకళా తపస్వి
తెలుగు జాతి సాంస్కృతిక పునరుజ్జీవనానికి అతి పిన్న వయసులో విశిష్టమైన కృషి చేసిన తొలి కళా తపస్వి దామెర్ల రామారావు. బాల్యం నుంచే చిత్రకళ పట్ల నెలకొన్న గాఢమైన అభినివేశం ఆయన్ని అవిశ్రాంత కళా పిపాసిగా చేసింది. 1897, మార్చి 8న జన్మించిన రామారావు రెండు పదుల వయసు నిండకుండానే ముంబైలోని ‘జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్’లో చేరి చిత్రకళలో నైపుణ్యం సంపాదించారు. రాజమండ్రి కళాశాలకు ప్రిన్సిపాల్‌గా చేసిన ఆంగ్ల రచయిత ఆస్వాల్డ్ కూల్డ్రేకు రామారావు అంటే ఎంతో అభిమానం. అందుకే తాను రాసిన ‘సౌత్ ఇండియన్ అవర్’ అనే గ్రంథాన్ని తెలుగులో గొప్ప రచయితలైన కవికొండల వెంకటరావు, అడివి బాపిరాజులతో బాటుగా దామెర్ల రామారావు గారికి కూడా అంకిత మిచ్చారు. ప్రఖ్యాత కవి పండితులు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి దామెర్లవారి గురించి ఇలా అన్నారు: ‘జీవముల వోసి, బొమ్మల జేసెనొకడు/బొమ్మలు గీసి జీవమును వోసేనొకడు/ రాముడాతడు, దామెర్ల రాము డితడు/ లేవు కాలావధులు చిత్ర లీలలందు.’ రవీంద్రనాథ్ టాగోర్‌ను కలిసిన పది నిమిషాల్లో విశ్వకవి చిత్రపటాన్ని గీసిచ్చారు. రామారావు ప్రతిభకు ఆశ్చర్యపోయిన టాగోర్ ‘ప్రపంచంలోకెల్లా గొప్ప చిత్రకరుడివి కాగలవు’ అని దీవించారట.అప్పటి వైస్రాయ్ లార్డ్ రీడింగ్ రామారావు ‘తూర్పు కనుమల్లో గోదావరి’ చిత్రాన్ని చూసి ముగ్ధుడై అప్పటికప్పుడు ఆ చిత్రం కొనేయడమే కాక, ‘స్వదేశీ ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను స్వదేశీ చిత్రాన్ని కొంటు న్నాను చూడండి’ అని చమత్కరించారట. అశ్లీలతకు తావులేకుండా భారతీయ మహిళని తొలిసారిగా నగ్నంగా చిత్రించిన రామారావు నవ్యాంధ్ర చిత్రకళా స్థాపకులు. 1922లో రాజమండ్రిలో ‘ఆంధ్ర సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్’ పేరిట చిత్రకళాశాలను స్థాపించారు. అప్పుడే ‘సత్యవాణి’ అనే చిత్రకారిణిని వివాహం చేసుకున్నారు. రామారావు చిత్రాలకు ఆయన భార్య సత్యవాణిగారే ‘మోడల్’గా ఉండేవారు. స్వదేశంలోనే కాక పారిస్, లండన్, టోరంటో వంటి అంతర్జాతీయ ప్రదర్శనల్లో కూడా రామారావు చిత్రాలు ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు పొందాయ్. ఇంతటి ప్రతిభావంతుడు 28 ఏళ్ళ అతి చిన్న వయసులోనే గుంటూరు జిల్లాలో పర్యటిస్తూ మశూచి వ్యాధికి గురై 1925, ఫిబ్రవరి 6న అకాల మరణం చెందారు. రామారావు చిత్రించిన ‘సిద్ధార్థ రాగోదయం’, ‘పుష్పాలంకరణ’, ‘నంది పూజ’, ‘గోపికాకృష్ణ’, ‘బావి వద్ద’, ‘అజంత’, ‘ఎల్లోరా’, ‘పట్టిసీమ’, ‘మెయిడ్స్ ఆఫ్ కథియావాడ్’... వంటి అత్యద్భుత కళాఖండాల్ని ఎన్నింటి గురించి చెప్పుకున్నా తక్కువే. రామారావు స్మృతిలో రాజమండ్రిలో చిత్రకళా మందిరాన్ని, శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 1925 లోనే ఆ రెంటినీ సందర్శించిన మహాత్మా గాంధీజీ ఆ చిత్రాలని చూసి ముగ్ధులయ్యారు. ప్రస్తుతం రాజమండ్రిలోని గోదావరి స్టేషన్ వద్ద ఉన్న ‘దామెర్ల రామారావు మెమోరియల్ ఆర్ట్ గ్యాలరీలో ఎన్నో కళాఖండాలు ఉన్నాయి. అవన్నీ తెలుగువారు సంరక్షించు కోవలసిన విశేషమైన కళా సంపదలే. – గౌరవ్ ‘ సాంస్కృతిక కార్యకర్త (నేడు దామెర్ల రామారావు శతవర్ధంతి) -
అందరికీ అమ్మ.. వైఎస్ జయమ్మ
పులివెందుల రూరల్ : అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు.. కానీ ఏమీ అడగకుండానే పేదలకు సాయం అందించిన అమ్మ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాతృమూర్తి వైఎస్.జయమ్మ. వైఎస్.జయమ్మ జీవించి ఉన్నంతకాలం పులివెందులకు సంబంధించిన ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ అను నిత్యం దాన,ధర్మాలలో మునిగిపోయేది. మహా నేత వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎం కావాలన్న ఆమె చిరకాల వాంఛ నెరవేరిన తర్వాత 2006 జనవరి, 25న జయమ్మ తుదిశ్వాస వదిలారు. అంతకుమునుపు 2003లో వైఎస్సార్ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొనేందుకు పాదయాత్ర చేసిన సందర్భంలో తల్లిగా వైఎస్.జయమ్మ కుమిలిపోతూనే.. ఇంట్లో పాదయాత్ర చేస్తూ బిడ్డకు మంచి జరగాలని రోజూ ప్రారి్థంచేది. అంతేకాదు 1999లో విపరీతమైన కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు పది మందికి పట్టెడన్నం పెట్టాలని భావించిన మాతృమూర్తి వైఎస్.జయమ్మ. అప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రతి రోజూ ఐదారు వందల మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించి ప్రశంసలందుకున్నారు. అంతేకాకుండా 1995 నుంచి 2000 వరకు పులివెందుల సర్పంచ్‌గా పనిచేసిన వైఎస్.జయమ్మ అప్పటి ప్రభుత్వం నుంచి ఉత్తమ సర్పంచ్ అవార్డుతోపాటు పంచాయతీని ఆదర్శంగా నిలిపి ఉత్తమ పంచాయతీ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే వైఎస్.జయమ్మ జీవించినంత కాలం ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ పులివెందుల అమ్మగా గుర్తింపు పొందారు. ఆమె మరణించి నేటికి సరిగ్గా 18ఏళ్లు అవుతోంది. నేడు వైఎస్ జయమ్మ వర్ధంతి వేడుకలు దివంగత వైఎస్.రాజారెడ్డి సతీమణి వైఎస్.జయమ్మ 19వ వర్ధంతి వేడుకను శనివారం పులివెందులలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులు పాలు పంచుకుంటారు. వైఎస్.జయమ్మ సమాధి వద్ద ప్రార్థనలతోపాటు.. స్థానిక పార్క్ వద్ద ఉన్న జయమ్మ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి, ఆయన తల్లి, మాజీ ఎమ్మెల్యే వైఎస్.విజయమ్మ, దివంగత వైఎస్.జార్జిరెడ్డి సతీమణి వైఎస్. భారతమ్మలతోపాటు వైఎస్సార్ సోదరుడు వైఎస్.సు«దీకర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులరి్పంచనున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. వైఎస్ కుటుంబ సభ్యులతోపాటు పలువురు వైఎస్ఆర్ అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు. -
‘హర్షా భాయ్.. శత్రువుకి కూడా ఇలాంటి పరిస్థితి రాదేమో!’
మొన్నీమధ్యే ‘లక్కీ భాస్కర్’ అనే ఓ సినిమా వచ్చింది. ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి అయిన హీరో.. దేశంలోనే అతిపెద్ద స్కాంలో తెలిసీతెలియకుండానే భాగం అవుతాడు. మోసాన్ని మోసంతోనే జయించి వంద కోట్లు తన ఖాతాలో వేసుకుంటాడు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌కు ప్రేక్షకులు క్లాప్స్.. విజిల్స్. ‘‘ఛస్.. అదొక ఆర్థిక మోసం’’ అనేవాళ్లు లేకపోలేదు. ‘‘సినిమానే కదా గురూ.. పైగా నేరం రుజువు కాలేదు.. అడ్జస్ట్ అయిపో’’ అని సలహా ఇచ్చేవాళ్లు లేకపోలేదు. ఉఫ్.. హీరో కాబట్టి సేవ్ అయిపోయాడు. ప్రేక్షకుల మనన్ననలు పొందగలిగాడు. అదే నిజజీవితంలో జరిగితే..! అఫ్కోర్స్ ఈ సినిమా కూడా వాస్తవ ఘటనల స్ఫూర్తితోనే తెరకెక్కిందనుకోండి. కానీ..”రిస్క్ హై తో ఇష్క్ హై” అనుకునే ఓ దిగువ మధ్యతరగతి వ్యక్తి.. డబ్బు సంపాదించాలనే కసితో వాణిజ్య రాజధానిలో అడుగుపెట్టాడు. కామర్స్ గ్రాడ్యుయేట్ నుంచి ఫైనాన్షియల్ ఎనలిస్ట్‌గా ఆపై ప్రసన్న ప్రాంజివందాస్ దగ్గర శిష్యరికంలో స్టాక్ బ్రోకర్‌గా రూపాంతరం చెందాడు. ఆపై తన సోదరుడితో కలిసి గ్రోమోర్ అనే బ్రోకరేజ్ సంస్థను స్థాపించి.. 1987లో స్టాక్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. అదే సమయంలో.. బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను ఒడిసి పట్టుకున్నాడు. ఎస్బీఐలాంటి ప్రభుత్వ బ్యాంకుతో సహా అవినీతిమయమైన వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేయగలిగాడు. బ్యాంకుల నుంచి కోట్ల డబ్బుని సేకరించి.. దలాల్ స్ట్రీట్‌నే శాసించాడు. వెరసి.. వేల కోట్లను చాకచక్యంగా పిండుకున్నాడు. ఈ కథను Scam 1992 పేరుతో వెబ్ సిరీస్‌గా తీస్తే జనాలు థ్రిల్లయిపోయారు. ఆయన రిఫరెన్స్‌తో లక్కీ భాస్కర్ సినిమా తీస్తే అదిరిపోయిందన్నారు. పైగా ఆ కథల్లోంచి ఆర్థిక పాఠాలను, జీవిత సత్యాలను వెతికారు. ప్చ్.. తప్పులేదు సోషల్ మీడియా జమానా అలాంటిది మరి!.అది 2001 ,డిసెంబర్ 31.. దేశం మొత్తం న్యూఇయర్ సంబరాలకు సిద్ధమవుతోంది. అలాంటి టైంలో పత్రికల్లో, టీవీల్లో వచ్చిన ఓ వార్త అందరినీ ‘అరరె’ అనుకునేలా చేసింది. 47 ఏళ్ల వయసున్న హర్షద్ మెహతా.. థానే జైల్లో గుండె నొప్పితో కన్నుమూశాడు అని. ఓవైపు మెహతా ఫొటో.. మరోవైపు దేశంలోనే అతిపెద్ద ఆర్థిక నేరగాడి అస్తమయం అనే లైన్లు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా వీల్‌చైర్‌లోనే కుప్పకూలిపోయాడంటూ పేర్కొన్నాయవి. ఓ సాధారణ గుజరాతీ జైన్ కుటుంబంలో పుట్టి.. స్టాక్ మార్కెట్ సామ్రాజ్యంలో బిగ్ బుల్గా ఎదిగాడు హర్షద్ మెహతా. ఆరోజుల్లో.. మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలనుకున్న ఎంతో మందికి మూడు పదుల వయసున్న హర్షద్ మెహతా(Harshad Mehta) ఓ రోల్ మోడల్ అయ్యాడు. అలాంటి వ్యక్తి దేశంలోనే అతిపెద్ద స్కాంలో సూత్రధారి అయ్యాడు. అప్పటిదాకా ఆర్థిక మేధావి అనిపించుకున్న వ్యక్తి.. ఆర్థిక మోసగాడనే ముద్రతో విచారణ, ఐదేళ్ల జైలుశిక్ష ఎదుర్కొన్నాడు. చివరకు.. అనామక పరిస్థితుల నడుమ జైలు ఊచల మధ్య కన్నుమూయడం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పుడు మనీలైఫ్ ఎడిటర్‌గా ఉన్న సుచిత్ర దలాల్.. ఒకప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో కాలమిస్ట్. హర్షద్ మెహతా సెక్యూరిటీస్ స్కాం తుట్టెను కదిలించారామె. ఆమె ప్రచురించిన ఆ ఇన్వెస్టిగేషన్ కథనాలు.. ఆ టైంలో మీడియా రంగంలోనే పెద్ద సెన్సేషన్ అయ్యాయి. కట్ చేస్తే.. అదే ఏడాది నవంబర్ 9వ తేదీన సీబీఐ ప్రముఖ స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతాను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి మరణించేదాకా.. తొమ్మిదేళ్లపాటు జ్యూడిషియల్ కస్టడీ కింద జైల్లోనే గడిపారాయన. మరోవైపు ఆయన కుటుంబం న్యాయపోరాటం మొదలుపెట్టింది కూడా అప్పటి నుంచే..స్టాక్ మార్కెట్లో హర్షద్ మెహతా ఎంత హుందాగా ఎత్తుకు ఎదిగారో.. అంతే దీనస్థితిలో పాతాళానికి చేరుకున్నారు. హర్షద్‌మెహతా మరణాంతరం.. ఆయన కుటుంబం 20 ఏళ్ల పాటు మీడియా కంటపడకుండా అజ్ఞాతం జీవితం గడిపింది. అతుర్ మెహతా.. హర్షత్ మెహతా కొడుకు. ఇన్వెస్టర్‌గా, ఎంట్రాప్రెన్యూర్గా ఓ దుస్తుల కంపెనీని నడిపిస్తున్నారు. అతుర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడు. అమెరికాలో స్థిరపడ్డాడని కొందరు.. లేదు ముంబైలోనే ఉన్నాడని మరికొందరు చెబుతుంటారు. అతని ఆస్తిపాస్తులు వగైరా వివరాలు వెతికినా ఇంటర్నెట్లో పెద్దగా కనిపించదు. ఇక.. హర్షద్ సోదరుడు, ఆయనతోపాటు కొన్నాళ్లు జైలు జీవితం గడిపిన అశ్విన్ లా చదవి.. ముంబైలో ప్రాక్టీస్ చేస్తున్నారు. తన అన్న, కుటుంబం పేరిట నడుస్తున్న కేసులను ఆయనే వాదిస్తున్నారు ఇప్పుడు. ఈయన కూడా అంతే.. మీడియా కంట పడకుండా, ఇంటర్వ్యూల జోలికి పోకుండా బతుకుతున్నారు. ఇక జ్యోతి మెహతా(Joti Mehta).. హర్షద్ భార్య. ఆయన మరణాంతరం 20 ఏళ్లకు ఆమె నోరు విప్పారు. అయితే అది తన భర్త పేరిట ఏర్పాటు చేసిన వెబ్సైట్ ద్వారానే.‘‘నా భర్త హర్షద్ మెహతా చనిపోయింది సకాలంలో వైద్యం అందకనే. అసలు అంతకుముందు ఆయనకు ఎలాంటి గుండె సంబంధిత సమస్యలు లేవు. కేవలం జైలు అధికారుల నిర్లక్ష్యం వల్లే నా భర్త చనిపోయాడు. ఆరోజు సాయంత్రం తన ఛాతీలో నొప్పిగా ఉందని ఆయన పక్క సెల్లో ఉన్న తన సోదరుడికి సమాచారం ఇచ్చారు. ఆయన ఆ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. జైల్లో ఉన్న వైద్యులు పరీక్షించి గుండెపోటు మాత్రలు లేవన్నారు. అయితే తన మెడికల్ బాక్సులో అవి ఉన్నాయని ఆయన మాత్రలను తెప్పించి వేసుకున్నారు. ఆ మందు నాలుగు గంటలపాటు మెహతాను బతికించింది. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో.. అర్ధరాత్రి దాటాక ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. నాడు జైలు అధికారులు సకాలంలో స్పందించి ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే.. ఆయన చనిపోయేవారే కాదు’’ అని జ్యోతి తెలిపారు. అంతేకాదు.. తన భర్త మరణానికి సంబంధించి అధికారులు ఎలాంటి విచారణ నివేదిక, పోస్ట్‌మార్టం నివేదిక ఇవ్వలేదని.. జైలు అధికారులను ఎన్నిసార్లు కోరినప్పటికీ స్పందన ఉండడం లేదని అంటున్నారామె. ఏ నోళ్లు అయితే పొగిడియో..అవే నోళ్లు నా భర్తను ఆర్థిక నేరస్థుడిగా ప్రచారం చేశాయి. శత్రువుకు కూడా మాకు వచ్చిన కష్టాలు రాకూడదని కోరుకుంటున్నాం అని చెబుతున్నారామె. అంతేకాదు harshadmehta.in ద్వారా సంచలన విషయాలు తెలియజేసే ప్రయత్నమూ చేస్తున్నారు. కుటుంబ కష్టాలుహర్షద్ మెహతాపై బ్యాంకుల చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఆధారంగా 72 క్రిమినల్ కేసులు, 600కిపైగా సివిల్ అభియోగాలు నమోదు అయ్యాయి. కానీ, అందులో కేవలం నాలుగు అభియోగాల్లో ఆయన జైలు పాలయ్యారు. 1992, జూన్ 4న సీబీఐ మెహతా కుటుంబానికి సంబంధించిన ఆస్తులపై సెర్చ్ ఆపరేషన్ జరిపింది. సోదాల్లో ఎన్నో డాక్యుమెంట్లు, షేర్ మార్కెట్ కు సంబంధించిన సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకుంది. అప్పటికి ఆ కుటుంబం ఆస్తుల విలువ రూ.1,700 కోట్లు అని ఓ అంచనా. అనంతరం హర్షద్ మెహతా తన 1992-93 ఏడాది ఆదాయంపై ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేశాడు. ట్యాక్స్ డిపార్ట్ మెంట్ దాన్ని తిరస్కరించింది. మెహతా ఫ్యామిలీ రూ.4 కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు 1995లో ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. చివరికి ఈ వ్యవహారం కాస్తా ఇన్ కం ట్యాక్స్ ట్రిబ్యునల్ కు చేరింది. ఈలోపు ఆయన మరణించారు. మరోవైపు మెహతా కుటుంబంపై ఆదాయ శాఖ చర్యలు కొనసాగాయి. వరసగా వారి సంబంధిత ఆస్తులపై తనిఖీలు చేపట్టింది. చివరకు 23ఏళ్ళ తరువాత ట్రిబ్యునల్.. మెహతా కుటుంబ పన్ను కట్టాలనే ఐటీ శాఖ డిమాండ్ ను తోసిపుచ్చింది. ఆ కుటుంబానికి క్లీన్ చిట్ ఇస్తూ.. పన్ను కట్టాల్సిన అవసరం లేదని తేల్చింది.అదే టైంలో.. హర్షద్ మెహతా లావాదేవీల కారణంగా చెల్లించాల్సిన బకాయిలు ఆస్తుల కంటే ఎన్నో రేట్లుగా తేలింది. సంపాదించినదంతా దాదాపుగా బకాయిల చెల్లింపుకే సరిపోయింది. వీటిలో చాలావరకు సెటిల్మెంట్ కాలేక కోర్టుల దాకా చేరాయి. అయితే ఈ విషయంలో మెహతా కుటుంబానికే ఊరట లభించింది. ఫెడరల్ బ్యాంకు, కిషోర్ జననీ దావాలో జ్యోతి మెహతా రూ.6 కోట్ల సెటిల్మెంట్ విజయం సాధించారు. అలాగే.. న్యాయపోరాటం తర్వాత వేలంపాట లేకుండా కొన్ని ఆస్తులు తిరిగి ఆ కుటుంబానికే చేరాయి. అలా ఆ వచ్చినదాంతోనే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. స్కాం ఏంటంటే..లక్కీ భాస్కర్ సినిమా చూసినవాళ్లకు హర్షద్ మెహతా చేసిన నేరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ, ఈ కథనం నేపథ్యంలో మరోసారి సింపుల్‌గా గుర్తు చేస్తున్నాం. స్టాక్ మార్కెట్(Stock Market)కు అమిత్ బచ్చన్‌గా పేర్కొందిన హర్షద్ మెహతా.. తన సోదరుడితో కలిసి గ్రోమోర్ అనే బ్రోకరేజ్ సంస్థను ఏర్పాటు చేశాడు. కోట్ల రూపాయలను, బ్యాంకులలో లోన్ పెట్టి తీసుకుని, ఆ డబ్బుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి, లాభాలు గడించి తిరిగి బ్యాంకులకు చెల్లించడం చేసేవాడు. రెడీ ఫార్వడ్ డీల్, బ్యాంకు రీసిప్ట్ లను వాడుకుని.. బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఆ డబ్బును మంచి నీళ్ళకంటే కూడా దారుణంగా తన చుట్టూ తిప్పుకున్నాడు. స్టాక్ మార్కెట్ లో లొసుగులను వినియోగించి కోట్లకు పడగలెత్తాడు. బ్యాంక్ రిసిప్టుల ని, సంతకాలని ఫోర్జరీ చెయ్యడం అతిపెద్ద నేరం. అలా.. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోని (1992 సెక్యూర్టీస్) అతిపెద్ద కుంభకోణానికి హర్షద్ మెహతా పాల్పడ్డాడు. అయితే ఈ కేసు నుంచి తప్పించాలని రూ.1 కోటిని అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుకు లంచంగా ఇచ్చానంటూ హర్షద్ చేసిన ప్రకటన ఆ టైంలో రాజకీయంగానూ దుమారం రేపింది. వేకప్ కాల్.. హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక్కసారిగా కుదిపేసింది. షేర్ల కొనుగోలుకు బ్యాంకులోని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని తెలిసి ఆర్థిక మేధావులు విస్తుపోయారు. బీఎస్ఈ సెక్యూరిటీస్‌ల కుంభకోణం ద్వారా రూ.5,000 కోట్ల మోసానికి పాల్పడ్డారని రకరకాల సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. 1992లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చాక స్టాక్ మార్కెట్లు 72 శాతం పతనమయ్యాయి. ఆ కాలంలో ఇన్వెస్టర్లు రూ.4,000 కోట్లు నష్టపోయారు. మార్కెట్లపై ఈ పరిణామ ప్రభావం రెండేళ్లపాటు కొనసాగింది. దీని తరువాత కొత్తగా అనేక కఠిన చట్టాలను దేశంలో తీసుకురావటం జరిగింది. -
తండ్రికి నివాళులర్పించిన మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తన తండ్రికి నివాళులర్పించారు. చిరంజీవి(Chiranjeevi) తన తండ్రి వెంకట రావు వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మెగాస్టార్ చిరు తల్లి అంజనాదేవితో పాటు నాగబాబు దంపతులు ఆయన చిత్రపటానికి పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి ట్విటర్లో షేర్ చేశారు. 'జన్మనిచ్చిన మహానీయుడిని ఆయన స్వర్గస్తులైన రోజున స్మరించుకుంటూ' అంటూ ఫోటోలు, వీడియోను పంచుకున్నారు.కాగా.. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు మెగాస్టార్‌తో పాటు నాగబాబు, పవన్ కల్యాణ్, మాధవి, విజయ దుర్గ జన్మించారు. కాగా.. చిరంజీవి తండ్రి వెంకటరావు కానిస్టేబుల్‌గా పనిచేశారు.కాగా.. మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర(vishwambhara) చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. విశ్వంభరలో చిరంజీవి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లోత్రిశూలంతో చిరంజీవి కనిపించారు. 'చీకటి, చెడు ఈ ప్రపంచాన్ని ఆక్రమించిన సమయంలో ఒక అద్భుతమైన తార పోరాడేందుకు ప్రకాశిస్తుంది.' అని పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ తెలిపింది.కాగా.. కోలీవుడ్ భామ త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ‘విశ్వంభర’ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ‘విశ్వంభర’ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ విజువల్ వండర్లా ఉండబోతోందని గతంలోనే చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది జనవరికి విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. జన్మనిచ్చిన ఆ మహనీయుడ్ని ఆయన స్వర్గస్తులైన ఈ రోజున స్మరించుకుంటూ… 🙏🙏 pic.twitter.com/MKxIw57pBZ— Chiranjeevi Konidela (@KChiruTweets) December 30, 2024 -
Vallabhbahi Patel: ‘ఉక్కు మనిషి’ చివరి రోజుల్లో..
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎనలేని కృషి చేశారు. ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి తొలి హోంమంత్రిగా వ్యవహరించారు. స్వాతంత్య్రానంతరం భారత్- పాకిస్తాన్ విభజన ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు, ఆ సమయంలో దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న హిందూ ముస్లిం అల్లర్లను నియంత్రించడంలో పటేల్ సహకారం మరువలేనిది. ఇంతటి మహాన్నత వ్యక్తి జీవిత చరమాంకంలో పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ రోజు(డిసెంబరు 15) సర్దార్ పటేల్ వర్థంతి.చదువులో వెనుకబడినా..వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31న గుజరాత్‌లోని నదియాడ్‌లో జన్మించారు. ఝవేర్‌భాయ్ పటేల్- లడ్బా దేవిల ఆరుగురు సంతానంలో వల్లభాయ్ పటేల్ నాల్గవవాడు. అతని చదువు నెమ్మదిగా సాగింది. సర్దార్ పటేల్ తన 22 ఏళ్ల వయసులో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. తదనంతరం ఇంగ్లాండుకు వెళ్లి బారిస్టర్ అయ్యాడు.ఎనలేని సన్మానాలుస్వాతంత్య్రానంతరం దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన సర్దార్ పటేల్‌కు దేశ విదేశాల్లో ఎంతో గౌరవం లభించింది. 1948 నుండి 1949 మధ్యకాలంలో నాగ్‌పూర్, అలహాబాద్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, పంజాబ్ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్ పట్టాలు అందుకున్నారు. 1947 జనవరిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖచిత్రం టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించింది.తప్పిన విమాన ప్రమాదం1949, మార్చి 29న సర్దార్ పటేల్ తన కుమార్తె మణిబెన్,పటియాలా మహారాజుతో కలిసి రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డి హావిలాండ్ డోవ్ విమానంలో ఢిల్లీ నుండి జైపూర్‌కు వెళ్తున్నారు. ఈ సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానయాగ అధికాలు తక్కువ ఎత్తులో ప్రయాణించాలని పైలట్‌కు సూచించారు. ఇంజిన్ వైఫల్యం కారణంగా విమానం ఎడారిలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. నాడు సర్దార్ పటేల్ అక్కడికి సమీప గ్రామంలో బస చేశారు.క్షీణించిన ఆరోగ్యంవిమాన ప్రమాదం నుంచి బయటపడిన పటేల్‌కు పార్లమెంటులో ఘన స్వాగతం లభించింది. విమాన ప్రమాదంపై చర్చల కారణంగా సభా కార్యక్రమాలు అరగంట వరకు ప్రారంభం కాలేదు. కొంతకాలానికి పటేల్ ఆరోగ్యం క్షీణించింది. ఆ సమయంలో పటేల్ ఓ ప్రైవేట్ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నారు. నాటి బెంగాల్ ముఖ్యమంత్రి బిధాన్ రాయ్ వృత్తిరీత్యా వైద్యుడు. ఆయన కూడా పటేల్‌కు చికిత్స అందించారు.ఢిల్లీ నుండి ముంబైకి వచ్చి..1950 నవంబర్ న పటేల్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నేపధ్యంలో ఆయన తరచూ స్పృహ కోల్పోతుండేవారు. అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమయ్యారు. ఢిల్లీలోని వాతావరణం ఆయన ఆరోగ్యాన్ని మరింత దెబ్బలీసింది. డాక్టర్ రాయ్ సలహా మేరకు పటేల్ ఢిల్లీ నుంచి ముంబైకి తరలివచ్చారు. అ సమయంలో జవహర్లాల్ నెహ్రూ, రాజగోపాలాచారి, రాజేంద్రప్రసాద్, వీపీ మీనన్‌లు ఆయనను పరామర్శించారు.మెరుగుపడని ఆరోగ్యంముంబై చేరుకున్న పటేల్ చాలా బలహీనంగా మారారు. విమానాశ్రయం వెలుపలనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అక్కడి నుంచి ఆయనను నేరుగా బిర్లా హౌస్‌కు తీసుకెళ్లారు. ముంబైలో పటేల్ ఆరోగ్యం మెరుగుపడలేదు. 1950, డిసెంబరు 15న తెల్లవారుజామున 3 గంటలకు సర్దార్ పటేల్ గుండెపోటుకు గురయ్యారు. 9.57 గంటలకు కన్నుమూశారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: అయోధ్యలో నూతన రామాలయం.. ట్రంప్ పునరాగమనం.. ఈ ఏడాదిలో ఆసక్తికర పరిణామాలివే -
Video: అరుదైన సన్నివేశం.. మోదీ, ఖర్గే ముచ్చట్లు
న్యూఢిల్లీ: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 69వ వర్థంతి సందర్భంగా ఢిల్లీలో శుక్రవారం అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. పార్లమెంట్ ఆవరణలో నిర్వహించిన మహాపరినిర్వాన్ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామం జరిగింది. ప్రధాని మోదీ, ఖర్గే పరస్పరం పలకరించుకొని కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలను కెమెరామెన్లు క్లిక్‌మనిపించడంతో.. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ కార్యక్రమానికి మోదీ, ఖర్గేతోపాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మోదీ వద్దకు వచ్చి షేక్‌హ్యాండ్ ఇచ్చారు. అనంతరం ఇరువురు నేతలు కాసేపు నవ్వుతూ ముచ్చటించారు. రాజకీయాల్లో ఎప్పుడూ పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకొనే నేతలు ఇలా ఒకేచోట అభివాదం చేస్తూ నవ్వుకుంటున్న దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.. మరోవైపు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అంబేద్కర్‌కు నివాళులర్పించారు.#WATCH | Delhi: Prime Minister Narendra Modi, Vice President Jagdeep Dhankhar, Former President Ram Nath Kovind, Congress President Mallikarjun Kharge and Lok Sabha Speaker Om Birla at the Parliament House Lawns as they pay tribute to Dr BR Ambedkar on the occasion of 69th… pic.twitter.com/TUrefyCY1m— ANI (@ANI) December 6, 2024 -
సామాజిక రాజకీయ దార్శనికుడు
ఇది అంబేడ్కర్ యుగం. అంబేడ్కర్ జీవన గాథలో వ్యక్తిత్వ నిర్మాణ శిల్పం ఉంది. హేతువాద భావనా మూర్తిమత్వం వుంది. ఆయన్ని ఈనాడు ప్రపంచమంతా స్మరించుకోవడానికి కారణం ఆయన ప్రపంచ మానవునిగా, మేధావిగా విస్తరించటమే! ఆయన అణగారిన ప్రజల గుండె దివ్వెలు వెలిగించిన భానుడు. భారతదేశంలో వచ్చిన రాజకీయ పరిణామాలన్నిటిపై ఆయన బలమైన ముద్ర ఉంది. భారత రాజ్యాంగ రూపకల్పనలో లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య భావాలను బౌద్ధ తాత్విక దృక్పథంతో మేళవించారు. అంబేడ్కర్ పోరాటమంతా బహు జనుల రాజ్యాధికార దిశగానే సాగింది. అందుకు సిద్ధాంతాలు, ప్రణాళికలు, పార్టీలు, కార్యాచరణ రూపొందించారు. రాజ్యాధికారమే వారికి సంపదను, సమతను ఇస్తాయని చెప్పారు.అంబేడ్కర్ గుణగణాలు ఎక్కువగా తల్లిదండ్రుల నుంచి రూపొందించుకున్నవే. ఆయన తల్లిదండ్రులు నీతి, నిజాయితీ గలిగిన సంస్కరణ హృదయులు. ఆనాడే వారి వ్యక్తిత్వం నలుగురు నోళ్ళలో నానింది. మహర్లు సహజంగానే నీతిపరులు. అందునా ఇది సైనిక కుటుంబం. మహర్ సైనికులకు అంబేడ్కర్ తండ్రి టీచర్ కూడా! తండ్రి క్రమశిక్షణతో కూడిన జీవితమే అంబేడ్కర్లో ప్రతిఫలించింది. చాలామంది వ్యక్తిస్వార్థంతో జీవిస్తారు, సామాజికంగా జీవించలేరు. అంబేడ్కర్ కుటుంబం మొదటి నుండి సామాజిక స్పృహతో జీవించింది. అంబేడ్కర్ పూర్ణంగా తల్లి, తండ్రి రూపం. ఆయన చిన్నతనం నుండి కూడా తనకు ఎదురైన ప్రతి సంఘటననూ మొత్తం సమాజపరంగా చూసి దానిమీద పోరాటం చేసే తత్త్వాన్ని తండ్రి నుండే నేర్చుకున్నాడు.తల్లిదండ్రుల వారసత్వంఎక్కడా కూడా ఆయన జీవితంలో చిన్న తప్పు చేయలేదు. మచ్చలేని వ్యక్తిగా ఆయన జీవన క్రమం సాగింది. తల్లితో ఎక్కువ గడపకపోయినా, ఆయన బంధువులందరూ తల్లిని గురించే ప్రస్తావించేవారు. ఆమె సంతానాన్ని కనే సమయంలో ప్రసవ వేదనలకు గురై, శక్తి శూన్యమైనప్పుడు కూడ ‘ధైర్యాన్ని వదలని గొప్ప వ్యక్తి’. అంబేడ్కర్ కూడా జీవితంలో ఎన్నో దుఃఖ ఘట్టాలు వచ్చినా సహించాడు, ఎదురుతిరిగాడు, పోరాడాడు, విజయం పొందాడు. తల్లి రూపంలో ఉన్న సౌందర్యం, సౌకుమార్యం, శిల్పం అంబేడ్కర్‌కు వచ్చాయి. ఈనాడు కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏకశిల్పం జాతిని ఏకం చేస్తూ మనకు కన్పిస్తుంది– అదే అంబేడ్కర్ శిల్పం. ఈ రూపాన్ని ఈ దేశానికి, ప్రపంచానికి ఇచ్చిన భీమాబాయి అన్వర్థ నామధేయం గలది. ‘భీమా’ అంటే ‘శక్తి’ అని అర్థం. అంబేడ్కర్ ఒక జాతీయవాదిగా మహర్ రెజీవ్ు వారసునిగా ఎదిగాడు. అంబేడ్కర్ కుటుంబం, వంశం, దేశంకోసం పోరాడిన నేపథ్యం కలిగి వున్నాయి.అంబేడ్కర్ జీవన వర్తనలో కరుణ, ప్రేమ, సామాజిక విప్లవం స్ఫూర్తి, సాంస్కృతికత, తాత్విక అధ్యయనం, ఆచరణ బలంగా ఉన్నాయి. అంబేడ్కర్ తత్వవేత్త, దార్శనికుడుగా ఎదగడానికి కారణం ఆయనలోనే హేతువాద భావనాధ్యయనం ఉండటం. ఆయన వేదాలను, ఉపనిషత్తులను, దర్శనాలను, ఆరణ్యకాలను, ముఖ్యంగా పరాశర స్మృతిని, నారద స్మృతిని అధ్యయనం చేసి, వాటిని నిశితంగా శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషణ చేశారు. భారతదేశంలో వేద వాఙ్మయాన్ని క్షుణ్ణంగా చదివిన పది మందిలో ఆయన ఒకరు. భారత ఉపఖండంలో తన సౌజన్యం ద్వారా, రక్తపాతాన్ని నివారించి, నిర్మాణాత్మక సామాజిక విప్లవాన్ని నడిపించారు. ప్రపంచంలోనే రాజనీతిజ్ఞులుగా పేరొందిన జాన్ డ్యూయికి వారసుడు. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తాత్వికుడు. ప్రజాస్వామ్యంలో దాగున్న నియంతృత్వాన్ని ప్రశ్నించిన పోరాటవీరుడు. భారత స్వాతంత్య్రోద్యమంలో దాగున్న వర్ణ, కులాధిపత్య భావాలను పసిగట్టిన, ప్రకటించగలిగిన రాజకీయ ప్రజా ధురంధరుడు. స్వాతంత్య్రోద్యమ కాలంలోనే అంబేడ్కర్ హిందూ రాజకీయాల నిజ స్వరూపాన్ని గమనించారు. ‘మీరు స్వాతంత్య్రాన్ని కోరుతోంది కేవలం అధికార మార్పిడి కోసమే. కానీ ఈ కులాల ఆధిపత్యాన్ని ఎదిరించడానికి కాదు. కులం నుండి విముక్తి చేయడానికి జరిగే పోరాటమే నిజమైన స్వాతంత్య్ర పోరాటం’ అని అంబేడ్కర్ నొక్కి వక్కాణించారు. అంబేడ్కర్ తన ‘కుల నిర్మూలన’ గ్రంథంలో భారత స్వాతంత్య్రోద్యమ నాయకత్వంలో దాగిన కుల భావాలను బయటకీడ్చారు. భారతదేశంలో కులం చట్రం నుండి బయటకు రాలేక చాలామంది దేశ నాయకులు, ప్రపంచ మేధావులు కాలేకపోయారు. ప్రత్యామ్నాయ తత్వంభారతదేశంలో వచ్చిన రాజకీయ పరిణామాలన్నిటిపై ఆయన బలమైన ముద్ర ఉంది. ముఖ్యంగా భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య భావాలను బౌద్ధ తాత్విక దృక్పథంతో మేళవించారు. రాజ్యాంగ నిర్మాణంలో వున్న పటిçష్ఠత వలన దాని మౌలిక రూపాన్ని మార్చాలనుకునే వారి ప్రయత్నాలు విఫలం అవుతూ వస్తున్నాయి. దానికి కారణం రాజ్యాంగం సత్యనిష్ఠగా రూపొందించబడటమే. కులం, అççస్పృశ్యత, లింగవివక్ష, మతమౌఢ్యాలన్నింటినీ ఆయన ఎదిరించగలిగారు. ప్రత్యామ్నాయ తత్వాన్ని రూపొందించగలిగారు.1913 లోనే ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ వెళ్ళగలిగారు. కొలంబియా విశ్వవిద్యాలయానికి తన ‘ది ఎవొల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా’ గ్రంథాన్ని సమర్పించారు. అంబేడ్కర్ వ్యక్తిత్వంలో ప్రధాన అంశం అవినీతి రహిత జీవనం. ఆయన వ్యక్తిత్వంలో ఉన్న నిక్కచ్చితనం అనేది ఆయన్ని ప్రపంచ మానవుడిగా విస్తరింపజేసింది. అనేక దేశాలలో చదివినా ఒక చిన్న మచ్చ లేకుండా, ఏ విధమైన వ్యసనాలూ లేకుండా ఆదర్శంగా నిలిచిన వ్యక్తిత్వ నిర్మాణ దక్షుడు.రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ, బహిరంగ వేదికల మీదా అనర్గళంగా మాట్లాడారు. నిరంతరం రాయడం ద్వారా గొప్ప వాఙ్మయ సంపదను సృష్టించారు. బ్రిటిష్ ప్రభుత్వం హౌస్ ఆఫ్ కామన్స్ (లండన్ పార్లమెంటు)లో ఆయన శతజయంతిని జరిపింది. ఆ దశకు అంబేడ్కర్ చేరడానికి కారణం ఏమిటి? ఆయనకు ఆ నాయకత్వ లక్షణాలు ఎలా వచ్చాయి? అని పరిశీలిస్తే, కృషి ఉంటే అట్టడుగు లోయల నుండి కూడా పర్వత శిఖరాలను అధిరోహించవచ్చు అని అర్థం అవుతుంది. పాలకులు కండి!అంబేడ్కర్ నిర్మించిన ఇండియన్ లేబర్ పార్టీ 1937లో బొంబాయి ప్రెసిడెన్సీలో కాంగ్రెస్‌కు పటిష్ఠమైన ప్రతిపక్షంగా వ్యవహరించింది. ఇండియన్ లేబర్ పార్టీని విస్తృత పరచాలనే ఉద్దేశంతో 1942 జూలైలో ఆలిండియా షెడ్యూల్డు క్యాస్ట్ ఫెడరేషన్ స్థాపించారు. ఆ సందర్భంగా, దళితుల సాంఘిక, ఆర్థిక హక్కులను సాధించటానికి వారికి రాజకీయాధికారం కావాలని ప్రబోధించారు. తన ‘రణడే, గాంధీ అండ్ జిన్నా’ గ్రంథంలో ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ ప్రతిపక్షపు ప్రాధాన్యాన్ని నొక్కి వక్కాణించారు. 1952 ఎన్నికలకు సన్నద్ధమవుతూ, షెడ్యూల్డు క్యాస్ట్ ఫెడరేషన్ మాత్రమే గెలవడం కష్టమని భావించి ఇతర వామపక్ష పార్టీలను పొత్తు కోసం పిలిచారు. అçస్పృశ్యతను నివారించే క్రమంలో సామాజిక అసమానతలను రూపుమాపే ముఖ్యసూత్రంపైన ఆయన పార్టీల పొత్తును కోరారు. ఆయన ఈ విషయంపై ప్రజా సోషలిస్టు పార్టీతో చర్చించారు. ‘సోషలిస్టులు కొన్ని విషయాల్లో నమ్మదగ్గవారు కాకపోయినా వారు మతశక్తులు కాదు. రాజకీయంగా వారి మార్గం సరైనదే. అందుకే వారితో నేను కలవడానికి వెనుకాడటం లేదు’ అని వ్యాఖ్యానించారు.అంబేడ్కర్ పోరాటమంతా బహుజనుల రాజ్యాధికార దిశగానే సాగింది. అందుకు సిద్ధాంతాలు, ప్రణాళికలు, పార్టీలు, కార్యాచరణ, రూపొందించారు. రాజ్యాధికారమే వారికి సంపదను, సమతను సమసమాజ నిర్మాణాన్ని కలిగిస్తుందని అంబేడ్కర్ ఆశయం. బానిసలుగా బతకవద్దు, పాలకులుగా బతకండి అని చెప్పారు. అందుకు త్యాగాలు అవసరం. అంబేడ్కర్ త్యాగ జీవితమే మనకు దిక్సూచి. ఆ దిశగా నడుద్దాం.- వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695(నేడు డా‘‘ బి.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి)- డా‘‘ కత్తి పద్మారావు -
Mahsa Amini: హిజాబ్‌ను ధిక్కరించి తలెత్తుకుని...
‘‘గుమ్మానికి పరదా కట్టినట్టే అమ్మ ముఖానికి ‘నఖాబ్’ కట్టారు’’ అంటూ ముస్లిం మహిళల జీవితాల్లోని దుఃఖాన్ని వినిపించారో కవయిత్రి. దుఃఖమో.. సంతోషమో.. హిజాబ్ చాటున దాచేది లేదని ఇరాన్ మహిళలు ఇప్పుడు తేల్చి చెబుతున్నారు. సోమవారం ఇరాన్లో పలువురు హిజాబ్‌లను తొలగించి స్వేచ్ఛగా వీధుల్లో సంచరించారు. ఇస్లామిక్ డ్రెస్‌కోడ్‌ను ధిక్కరించారనే కారణంతో 2022లో కుర్దిష్ మహిళ అయిన మహసా అమీనీని ఇరాన్ పోలీసులు అరెస్టు చేయడం, తరువాత ఆమె పోలీస్ కస్టడీలో మరణించడం తెలిసిందే. అయితే మహసా అమీనీ రెండో వర్ధంతి సందర్భంగా స్మారక సభను నిర్వహించాలని తల్లిదండ్రులు భావించగా.. పోలీసులు అందుకు అనుమతిని నిరాకరించారు. అంతేకాదు ఆమె తల్లిదండ్రులను బలవంతంగా గృహ నిర్బంధం చేశారు. అమీనీని ఖననం చేసిన సఖెజ్ నగరంలోని స్మశాన వాటికను సైతం మూసేశారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఇరాన్ మహిళలు మాత్రం ఆమెను స్మరించుకున్నారు. దేశ రాజధాని టెహ్రాన్ వీధుల్లో ‘జిన్.. జియాన్.. ఆజాదీ’(స్త్రీ.. జీవితం.. స్వేచ్ఛ) నినాదాలు చేశారు. ఇక టెహ్రాన్‌లోని ఏవీఎన్ జైలులోని పలువురు మహిళా ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మహిళలతోనే తామూ ఉన్నామని చెబుతూ 34 మంది జైలు ఖైదీలునిరాహార దీక్ష చేశారు. వీరిలో ఇరాన్ ఉద్యమకారులు నర్గీస్ మొహమ్మదీ, వెరిషెహ్ మొరాది, మహబూబ్ రెజాయ్, పరివాష్ ముస్లి కూడా ఉన్నారు. తీవ్రమైన అణచివేత.. 1979లో కొత్త ప్రభుత్వం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పాటయ్యాక ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖొమేనీ ఆవిర్భవించారు. ఇస్లాం మత విలువలను తిరిగి అమల్లోకి తీసుకొచ్చారు. అందులో భాగంగా మహిళలకు హక్కులను కల్పించిన కుటుంబ రక్షణ చట్టాన్ని రద్దు చేశారు. నాటి నుంచి ఇస్లాం డ్రెస్‌కోడ్ పాటించని మహిళలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ధిక్కరించిన మహిళలను గాయపరిచిన, జరిమానాలు విధించిన ఘటనలు అనేకం. మహిళలపై నిరంతరం కెమెరాల నిఘా కొనసాగుతోంది. 2024 టెహ్రాన్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో మహిళలను పర్యవేక్షించడానికి ఏరియల్ డ్రోన్లను కూడా ఉపయోగించారంటే ఎంతటి నిఘా ఉందో అర్థం చేసుకోవచ్చు. హిజాబ్‌ను తిరస్కరిస్తున్న మహిళల సంఖ్య పెరగడాన్ని ప్రభుత్వం గుర్తించకపోగా.. అణచివేత చర్యలకు పాల్పడుతోంది.ఎవరీ మహసా అమీనీ ?2022లో ఇరాన్లో హిజాబ్ నియమాలను ఉల్లంఘించారనే నెపంతో సకెజ్ నగరానికి చెందిన కుర్దిష్ మహిళ 22 ఏళ్ల మహసా అమీనీని ఇరాన్ మొరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉన్న ఆమెను తీవ్రంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయి, కొద్దిసేపటికే కోమాలోకి వెళ్లిపోయారు. మూడు రోజుల తరువాత ఆమె ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. కూతురును చూడటానికి అమీనీ తల్లిదండ్రులను కూడా అనుమతించలేదు. శవ పంచనామా నివేదిక అడిగినా నిరాకరించారు. మహసా అమీనీకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అరెస్టు తరువాత ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని పోలీసులు చెప్పారు. డాక్టర్ కావాలని కలలు కన్న యువతి.. మరో వారం రోజుల్లో యూనివర్సిటీకి వెళ్లే ముందు వారం రోజులు తల్లిదండ్రులతో ఉందామని టెహ్రాన్‌కు వచ్చిన అమీనీ.. పోలీసుల చిత్రహింసలతో ప్రాణాలొదిలింది. -
Acharya Aatreya: అక్షర లక్షలు... ఆ గీతాలు!
‘ఆత్రేయ సాహితి’ సంపాదకులు డా‘‘ జగ్గయ్య – ‘సినిమా పాటకు సాహిత్య మందిరంలో పట్టాభిషేకం చేయించిన అపర శ్రీనాథుడు. మనిషికీ, మనసుకీ కొత్త భాష్యాలు పలికిన అక్షర యోగి...’ అంటూ ఆత్రేయను ప్రశంసించారు.‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ అనే స్వీయ వ్యాస సంపుటిలో వేటూరి ‘శబ్దాడంబరం లేకుండా నిర్మల గంగా ప్రవాహం లాగ చిరు చిరు అలలతో అగాథాల్ని దాస్తూ... ప్రకటిస్తూ సాగిన సాహితీగంగ ఆత్రేయది’ అని మెచ్చుకున్నారు. వెన్నెలకంటి ఆత్రేయను ‘సినీ వేమన’ అన్నారు. శ్రీశ్రీ తెలుగు కవిత్రయంగా తిక్కన, వేమన, గురజాడలను పేర్కొంటే వారి సరసన సినీరంగం నుంచి ఆత్రేయను చేర్చారు వెన్నెలకంటి! ఆత్రేయ మాటలు పాటలు లాగా, పాటలు మాటలు లాగా వుంటాయనీ, ఆత్రేయ పత్రికల్లో వార్తలా వచనం రాసినా, అది మామ మహదేవన్ స్వరకల్పనలో పాటగా ఒదిగేదనీ నిర్మాత మురారి అంటుండేవారు. అటువంటి ఆత్రేయ పాటల్లో పంక్తులు కొన్ని తెలుగునాట నానుడులుగా, నిత్య సత్యాలుగా, హితోక్తులుగా స్థిర పడిపోయాయి కూడా! అలాంటి ఆణిముత్యాలను కొన్నిటిని ఏరుకుందాం.ఆత్రేయకు జనం పెట్టిన పేరు మన‘సు’ కవి. అది జనం మనసుల్లో ఆయనకు పడిన ముద్ర తప్ప, ఏ సన్మాన సభలోనో, సాహితీ సంస్థో, ప్రభుత్వమో ప్రదానం చేసిన బిరుదు కాదు. ఆత్రేయ మనసు పాటల్లో తరళరత్నం ‘ప్రేమనగర్’ చిత్రంలోని ‘మనసు గతి యింతే/ మనిషి బ్రతుకింతే/ మనసున్న మనిషికి/ సుఖము లేదంతే...’ అనే పంక్తులు. అవి విని మురిసిపోయిన దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు ఆత్రేయను మెచ్చుకుంటూనే చిన్న సందేహం వచ్చి ‘చివర్లో ‘అదంతే’ ఎందుకు?’ అని అడిగారట. ‘అదంతే’ అని చిరునవ్వుతో బదులిచ్చారట... మాటల్ని ఆచితూచి ప్రయోగించే అక్షరయోగి ఆత్రేయ.‘ప్రేమలు–పెళ్లిళ్లు’ చిత్రంలోని – ‘మనసులేని దేవుడు మనిషి కెందుకో మనసిచ్చాడు/ మనసు మనసును వంచన చేస్తే/ కనుల కెందుకో నీరిచ్చాడు’ అనే పంక్తులు కూడా నిత్యజీవితంలో అంద రికీ గుర్తొచ్చే గొప్ప అభివ్యక్తులు. పద క్రీడలతో సార్వకాలిక సత్యాలను వెల్లడించిన ఆత్రేయ ‘ఉండడం’, ‘లేకపోవడం’ అనే రెండు పదాలను తీసుకొని అమ్మ గొప్పతనం గురించి ఎంతక్లుప్తంగా, ఆప్తంగా చెప్పారో చూడండి – ‘అమ్మ ఉంటే లేనిదేమీ లేదు/ అమ్మ లేక ఏమున్నా ఉన్నది కాదు’ (కలసిన మనసులు)! ప్రేమ గురించి ‘అది’, ‘ఇది’ అంటూ ఆత్రేయ అంత గోప్యంగా చెప్పిన కవులు అరుదు. ‘నువ్వంటే నాకెందుకో ఇంత యిది, ఇంత యిది’ (అంతస్తులు); ‘ఇదే నన్నమాట – ఇది అదే నన్నమాట/ మది మదిలో లేకుంది – మనసేదో లాగుంది/ అంటే ఇదేనన్నమాట – ఇది అదేనన్న మాట’ (కొడుకు–కోడలు).మరో రెండు వాక్చిత్రాలను కూడా పేర్కొనాలి. అందులో మొదటిది అందరికీ తెలిసిన ‘మూగ మనసులు’ చిత్రంలో నూతన వధూవరులు, పెద్దల సమక్షంలో కథానాయకుడు గోపి పాడిన ‘ముద్ద బంతి పూవులో...’ పాటలోని – ‘నవ్వినా ఏడ్చినా... కన్నీళ్లే వస్తాయి.’ ఇది పది వాక్యాల పెట్టు అని డాక్టర్ సి.నా.రె. వ్యాఖ్యానించిన తర్వాత ఇంకే వివరణ కావాలి? ఇలా అక్షర లక్షల విలువైన జీవిత సత్యాలను గమనిస్తే ఆత్రేయ... వేమనలా కవి మాత్రమే కాదు– ఒక యోగి కూడా అనిపిస్తారు. – డా‘‘ పైడిపాల, సినీ గేయ సాహిత్య పరిశోధకులు, 99891 06162ఇవి చదవండి: కాసేపట్లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు -
వైఎస్సార్‌ను గుర్తు చేసుకుని.. జగన్ భావోద్వేగం
వైఎస్సార్, సాక్షి: మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిన.. వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈ ఉదయం ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల సమర్పించారు. అనంతరం ఎక్స్ ఖాతాలో ఆయన తండ్రికి గుర్తు చేసుకుంటూ ‘డాడ్.. మిస్ యూ’ అనే ఓ సందేశం ఉంచారు. We miss you, Dad pic.twitter.com/lzNm7wSHJn— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2024 -
ప్రపంచ వైద్యశాస్త్ర రంగంలో.. మందుల మహా మాంత్రికుడు!
ప్రపంచ వైద్యశాస్త్ర రంగంలో మందుల మహా మాంత్రికుడని సుస్థిర స్థానాన్ని పొందిన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు తెలుగుజాతి గర్వించదగిన ముద్దుబిడ్డ. ఎన్నో రకాల జాడ్యాలకు దివ్యౌషధాలను కనుగొని మనవాళికి మహోపకారం చేసిన మహోన్నత వైద్య శాస్త్రవేత్త.పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వెంకమ్మ, జగన్నాథం పుణ్య దంపతులకు 1895 జనవరి 12న ఆయన జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. తల్లి పెంపకంలో పెరిగారు. పుస్తెలమ్మి సుబ్బారావును చదివించింది తల్లి. రాజమండ్రిలో పాఠశాల విద్య పూర్తిచేసిన సుబ్బారావు పై చదువుల కోసం మద్రాసుకు వెళ్ళారు. అక్కడ ఉన్నప్పుడే ఆయన సోదరులు కొంత కాల వ్యవధిలో ఒకరి తరువాత ఒకరు ‘స్ప్రూ’ వ్యాధితో మరణించారు. మనోవేదనకు గురైన సుబ్బారావు దానికి మందు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నారు. మద్రాస్ వైద్య కళా శాలలో చేరి వైద్య విద్యను పూర్తి చేశాక, పరిశోధన కోసం లండన్ వెళ్లి డాక్టర్ రిచర్డ్ స్ట్రాంగ్ శిష్యరికంలో ఉష్ణ మండల వ్యాధుల చికిత్సలో డిప్లొమా పొందారు. డాక్టర్ స్ట్రాంగ్ సూచన మేరకు అమెరికా వెళ్లి జీవ రసాయన శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సుబ్బారావు తన పరిశోధనల వల్ల ఫోలిక్ ఆమ్లపు నిజ స్వరూపాన్ని గుర్తించారు. ఇది స్ప్రూ వ్యాధికీ, మైక్రోసైటిక్ ఎనీమియా వ్యాధికీ తిరుగులేని ఔషధంగా నిలిచింది. అలాగే బోధకాలు నివారణ కోసం మందు కనుక్కున్నారు. కీమోథెరపీ కోసం వాడే మెథోట్రెక్సేట్‌ను కనుక్కున్నారు. ఎల్లప్పుడూ పరిశో ధనలలో నిమగ్నం కావడం వల్ల సుబ్బారావు ఆరోగ్యం నశించింది. 1948 ఆగస్టు 8న అమెరికాలో కన్నుమూశారు. ఆయన సేవలు అందించిన అమెరికాకు చెందిన లీడర్లీ సంస్థ సుబ్బారావు మీద గౌరవంతో సుబ్బారోమెసెస్ ఔషధాన్ని ప్రవేశపెట్టింది. కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. ప్రపంచ మానవాళికి తన జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు తెలుగువాడు కావడం మన తెలుగు వారందరి అదృష్టం. – జాధవ్ పుండలిక్ రావు పాటిల్, 94413 33315 -
డా. ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతి అరుదైన ఫోటోలు
-
బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి.. వైఎస్ జగన్ ట్వీట్
-
జగ్జీవన్ రామ్‌కు వైఎస్ జగన్ నివాళులు
తాడేపల్లి, సాక్షి: అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన బాబూ జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయమని అని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇవాళ(జులై 06) జగ్జీవన్‌రామ్ వర్ధంతి సందర్భంగా ఎక్స్ ఖాతాలో నివాళులు అర్పించారాయన. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్ గారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్రమంత్రిగా, దేశ ఉపప్రధానిగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయం. నేడు బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నా అని జగన్ సందేశం ఉంచారు.అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్ గారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్రమంత్రిగా, దేశ ఉపప్రధానిగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయం. నేడు బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 6, 2024మరోవైపు విశాఖపట్నం వైఎస్సార్సీపీ కార్యాయంలో జరిగిన జగ్జీవన్ వర్ధంతి కార్యక్రమంలో జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్సీ కళ్యాణి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సుభద్ర తదితరులు పాల్గొని నివాళులర్పించారు. -
సుశాంత్.. నువ్వు బతికే ఉన్నావ్..!
మనిషి మరణించినప్పుడు రెండు కన్నీటి బొట్లు రాలుస్తారు. రెండు రోజులకు అందరూ మరిచిపోతారు. కాలం గడిచేకొద్దీ ఆ వ్యక్తి గురించి ఆలోచించడమే మానేస్తారు. కానీ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలో మాత్రం ఇప్పటికీ అభిమానులు అతడిని స్మరిస్తూనే ఉన్నారు. సుశాంత్ చనిపోయి నాలుగేళ్లవుతున్నా నిత్యం ఏదో ఒక సందర్భంలో తనను తలుచుకుంటూనే ఉన్నారు.నొప్పి లేకుండా మరణం..2020, జూన్ 14.. సుశాంత్ ఆఖరి శ్వాస విడిచిన రోజు.. చాలామందికి ఇదొక బ్లాక్ డే! తను ఆత్మహత్య చేసుకున్నాడని అధికారుల వివరణ.. లేదు, బాలీవుడ్ రాజకీయాలే తనను బలి తీసుకున్నాయని అభిమానుల ఆవేదన, ఆరోపణ! 'నొప్పి లేకుండా ఎలా చనిపోవాలి? మెంటల్ డిజార్డర్ అంటే ఏమిటి?' అని చనిపోయేముందు సుశాంత్ గూగుల్‌లో సెర్చ్ చేసిన పదాలే తన మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి. తను ఎంత వేదన అనుభవించాడన్నది చెప్పకనే చెప్తున్నాయి.అలిసిపోయాడా..చిచోరె సినిమాలో ఆత్మహత్యలను వ్యతిరేకించే అనిరుధ్ పాత్రలో గొప్పగా నటించాడు. దిల్ బేచారాలో జనన మరణాలు మన చేతుల్లో లేకపోవచ్చు.. కానీ ఎలా జీవించాలన్నది మన చేతుల్లోనే ఉంటుందన్న సందేశాన్ని ఇచ్చాడు. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం దాన్ని పాటించలేకపోయాడో.. పరిస్థితులతో పోరాడీ పోరాడీ అలిసిపోయాడో కానీ తన కలల్ని, ఆశయాలను అలాగే వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అభిమానుల మనసు గెలుచుకున్న సుశాంత్ వారి హృదయంలో ఎప్పటికీ జీవించే ఉంటాడు..కెరీర్..సుశాంత్.. గ్రూప్ డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించాడు. కిస్ దేశ్ మే హై మేరా దిల్ సీరియల్లో చిన్న పాత్రలో నటించాడు. పవిత్ర రిష్తా సీరియల్లో ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. జెర నాచ్కే దిఖా 2, ఝలక్ దిక్లాజా 4 రియాలిటీ షోలలో డ్యాన్సింగ్ స్కిల్స్ చూపించాడు. 2013లో కాయ్ పో చే చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. శుద్ధ్ దేశీ రొమాన్స్, పీకే, డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి, ఎంస్ ఎధోని సినిమాలతో అభిమానులను అలరించాడు. చివరగా దిల్ బేచార చిత్రంలో కనిపించాడు.నా సినిమాలు ఆడకుంటే ఇండస్ట్రీ నుంచి నన్ను పంపించేస్తారు. ఎందుకని ఈ ఇండస్ట్రీ నన్ను తనలో ఒకడిగా భావించడం లేదు.. అంతా ముగిసిపోయినట్లుగా ఉంది.. - సుశాంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు..మసకబారిన జీవితం కన్నీటిబొట్టు రూపంలో ఆవిరవుతోంది. అంతులేని కలలు చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్య బతుకుతున్నాను. - సుశాంత్ తల్లిని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్టు..ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలో 7వ ర్యాంక్ సాధించిన సుశాంత్.. ప్రాణంగా భావించిన నటనకోసం అన్నింటినీ త్యజించాడు. కానీ ఆ సినిమా చివరకు అతడినే బలి తీసుకుంది. Sushant's dream journal: Learn to fly...dive into a blue hole...the dreams that he realised before moving on...💔 #SushantSinghRajput pic.twitter.com/a1MHc8KqWe— Mahim Pratap Singh (@mayhempsingh) June 14, 2020 -
Belli Lalitha: ముక్కలైన దేహానికి పాతికేళ్లు
పాటనే జీవితంగా మలుచుకొని చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించింది తెలంగాణ గానకోకిల బెల్లి లలిత. 1972 ఏప్రిల్ 29న భువనగిరిలో నిరుపేద కుటుంబంలో జన్మించింది. చదువులేని ఆమె పొట్టకూటి కోసం స్థానిక కాటన్ స్పిన్నింగ్ మిల్లులో కార్మికురాలిగా చేరింది. ఈ క్రమంలోనే సీఐటీయూలో సభ్యత్వం తీసుకొని కార్మిక హక్కుల సాధన కోసం పోరాడింది. అనంతరం ‘భువనగిరి సాహిత్య మిత్ర మండలి’లో చేరి ప్రజా సమస్యల పరిష్కారానికి పాటను తన అస్త్రంగా మార్చుకుంది. ‘తాగబోతే నీళ్లు లేవూ తుమ్మెదాలో... తడి గొంతూలారిపాయే తుమ్మెదాలో!’ అంటూ ఫ్లోరైడ్ నీటి సమస్యలపై గళమెత్తింది. 1996లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ ‘తెలంగాణ ఐక్య వేదిక’ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 1997 మార్చి 8న భువనగిరిలో జరిగిన ‘దగాపడ్డ తెలంగాణ’ సభలో బెల్లి లలిత కీలక భూమిక పోషించింది. ఆ తర్వాత 1997 ఆగస్టు 11న బహుజన నేత మారోజు వీరన్న సూర్యాపేటలో నిర్వహించిన ‘తెలంగాణ మహాసభ’తో పాటు 1997 డిసెంబర్ 28న వరంగల్‌లో జరిగిన బహిరంగ సభలో లలిత తన గానంతో గర్జన చేసింది. పీపుల్స్‌వార్ సానుభూతిపరుల ‘తెలంగాణ జనసభ’ అనుబంధ విభాగమైన ‘తెలంగాణ కళా సమితి’ కన్వీనర్‌గా ఊరూరా తిరిగి ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత వివరించింది. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఉద్ధృతం అవుతుండటం ఆనాటి సమైక్య పాలకులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటికే ప్రజా గాయకుడు గద్దర్ పై కాల్పులు జరిపి, బహుజన నేత మారోజు వీరన్నను పొట్టన పెట్టుకున్నారు. ఈ తరుణంలో1999 మే 26న ఇంటి నుండి వెళ్ళిన లలిత తిరిగిరాలేదు. 1999 మే 29న దర్గాబావిలో శరీర భాగాలు ఉన్నాయన్న వార్తతో భువనగిరి ఉలిక్కి పడింది. పదమూడు రోజులు గాలించగా పలు బావులు, చెరువుల్లో 17 ముక్కలైన లలిత శరీర భాగాలు లభ్యమయ్యాయి. 1999 జూన్ 11న జరిగిన అంత్యక్రియలకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. నాటి పాలకులే... మాజీ నక్సలైట్‌ను ఆయుధంగా మార్చుకొని లలితను పాశవికంగా హత్య చేయించారని ప్రజా సంఘాలు నిరసించాయి. ఆరు దశాబ్దాల ఆకాంక్షకై 17 ముక్కలైన లలిత అమరత్వానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ కనీస గౌరవం దక్కలేదు. – పి. నరేష్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి(నేడు బెల్లి లలిత 25వ వర్ధంతి) -
రాజీవ్ వర్ధంతి: 1991 మే 21న ఏం జరిగింది?
ఈరోజు(మే 21) భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి. మే 21న ప్రతి ఏటా ఉగ్రవాద వ్యతిరేక దినంగా జరుపుకుంటారు. 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీ.. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఆత్మాహుతి దాడిలో హతమయ్యారు. ఆత్మాహుతి బాంబర్ బెల్ట్ బాంబును ప్రయోగించారు. రాజీవ్ గాంధీతో పాటు అక్కడున్న పలువురు హతమయ్యారు.రాజీవ్ గాంధీ శ్రీపెరంబుదూర్ ఎన్నికల సభలో పాల్గొనేముందు ప్రజల అభివాదాలను స్వీకరిస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ సమయంలో తన దుస్తులలో పేలుడు పదార్థాలను దాచుకున్న లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఈలం (ఎల్టీటీఈ)కు చెందిన మహిళా సభ్యురాలు రాజీవ్ గాంధీ పాదాలను తాకి, బాంబును పేల్చివేసింది. వెంటనే ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పాటు భారీ ఎత్తు పొగ బెలూన్లా పైకి లేచింది. ఈ ఘటనలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీతో సహా పలువురు అక్కడికక్కడే మృతిచెందారు. పెద్ద సంఖ్యలో జనం గాయపడ్డారు.రాజీవ్ గాంధీ హత్యానంతరం విపి సింగ్ ప్రభుత్వం మే 21న ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించాలని నిర్ణయించింది. ఈ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ సంస్థలలో ఉగ్రవాదాన్ని నిర్మూలనకు పాటుపడతామని ప్రమాణం చేస్తారు. అలాగే, ఈ రోజుకు గల ప్రాముఖ్యతను వివరిస్తూ డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల ద్వారా ఉగ్రవాద వ్యతిరేక సందేశాలు పంపిస్తారు.భారత ఆరవ ప్రధాని రాజీవ్ గాంధీ తన తల్లి, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మరణానంతరం తన 40 ఏళ్ల వయస్సులో దేశానికి ప్రధాని అయ్యారు. తన పదవీ కాలంలో రాజీవ్ పలు గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. అవి నేడు ఎంతో ఉపయోగకరమైనవిగా నిరూపితమయ్యాయి.రాజీవ్ గాంధీ 1986లో జాతీయ విద్యా విధానాన్ని దేశమంతటా విస్తరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా జవహర్ నవోదయ విద్యాలయాలను స్థాపించారు. రాజీవ్ గాంధీ దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీని ఎంతగానో ప్రోత్సహించారు. దేశంలో కంప్యూటర్ల వినియోగానికి ఊతమిచ్చారు. సూపర్ కంప్యూటర్ల రూపకల్పనకు ప్రోత్సాహాన్ని అందించారు. దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేసేందుకు ప్రయత్నించారు. పారిశ్రామిక ఉత్పత్తిని పెంచేందుకు అనేక కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు అందించారు. -
నువ్వు ఎప్పటికీ నా గుండెల్లో ఉంటావ్: సింగర్ చిత్ర ఎమోషనల్
ప్రముఖ సింగర్ చిత్ర తన కుమార్తె నందన వర్ధంతి సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా తన కూతురి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నువ్వు నాతో భౌతికంగా లేనప్పటికీ ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటావని ఎమోషనలైంది. నా చివరి శ్వాస వరకు నాతోనే ఉంటావంటూ ట్వీట్ చేసింది. కాగా సింగర్ కేఎస్ చిత్ర ప్రముఖ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోను పాటలు పాడారు. నాలుగు దశాబ్దాల సినీ సంగీత ప్రయాణంలో దాదాపు 25 వేలకు పైగా పాటలు ఆలపించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఇళయరాజా వంటి సంగీత దిగ్గజాలతో ఆమె పనిచేశారు. సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న చిత్ర విజయ్ శంకర్ అనే ఒక ఇంజినీర్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 18 డిసెంబర్ 2002లో వీరికి నందన అనే అమ్మాయి జన్మించింది. నందనకు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు 2011లో ఓ కచేరిలో పాల్గొనేందుకు చిత్ర దుబాయ్ వెళ్లారు. అదే సమయంలో నందన స్విమ్మింగ్ పూల్‌లో పడి మరణించింది. #Nandana pic.twitter.com/mImedLHMdv — K S Chithra (@KSChithra) April 14, 2024 -
ఏడాది క్రితం తీవ్ర విషాదం.. తారకరత్న భార్య ఎమోషనల్!
సరిగ్గా ఏడాది క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నందమూరి హీరో తారకరత్న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. బెంగళూరులోని ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. తారకరత్న మరణంతో ఆయన కుటుంబంతో పాటు రెండు రాష్ట్రాల్లోని నందమూరి ఫ్యాన్స్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నందమూరి కుటుంబం నుంచి 'ఒకటో నంబర్ కుర్రాడు'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్‌గానూ ప్రేక్షకుల్ని తారక్ అలరించారు. ఆపై రాజకీయాల్లో రావాలనే ఆశయంతో తొలి అడుగు కూడా వేశారు. కానీ ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించారు. ఆయన మరణించి నేటికి ఏడాది పూర్తి అయింది. ఇవాళ తారకరత్న మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అలేఖ్య తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నేను నిన్ను చివరిసారిగా చూసిన రోజు దగ్గరయ్యే కొద్ది.. నేను పడుతున్న బాధ, నా గుండెల్లో నొప్పి ఎవరికీ చెప్పలేనిది.. 18/2/2023 నుంచి నీకు, నాకు ఎలాంటి హద్దులు లేవు. రెండు విభిన్న ప్రపంచాల నుంచి మేము మా ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తాం. ఎలాంటి మార్పు ఉండదు. మీ ఉనికి, మీ ప్రేమ, మీరు మాపై చూపిన ప్రభావం ఎప్పటికీ మరువలేము. నేను నిన్ను తాకలేను కానీ.. నీ ఉనికి ఎల్లప్పుడు మా చుట్టే ఉంటుంది. ఇది ఎప్పటికీ చావదు.. నువ్వే నా బలం.. ఎప్పటికీ మాతోనే ఉంటావు !!' అంటూ పోస్ట్ చేసింది. అంతే కాకుండా తన ముగ్గురు పిల్లలతో ఉన్న వీడియోను షేర్ చేసింది. కాగా.. తారకరత్నకు అలేఖ్యరెడ్డితో పెళ్లి కాగా.. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. వారిలో పెద్ద కూతురు నిష్క, కవల పిల్లలు తాన్యారామ్, రేయా సంతానం. వీరి పిల్లలకు ఎన్టీఆర్ పేరు వచ్చేలా పేర్లు పెట్టారు. మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తారకరత్న తాతగారు అయిన ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు నిష్క లో మొదటి అక్షరం N, తాన్యారామ్‌లో T, రేయాలో R.. ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారు తారకరత్న. View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna) -
పీవీపై సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: దేశ మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు 19వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు పలువురు రాజకీయ నేతలు నివాళులర్పిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పీవీ జ్ఞాన భూమి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిష్ణాతుడైన పండితుడు, రాజనీతిజ్ఞుడు, పరిపాలదక్షకుడు.. తెలంగాణ గడ్డ మీద పుట్టిన గొప్ప బిడ్డ అని పీవీని కొనియాడారామె. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా ఆయన వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు పీవీ జ్ఞాన భూమి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. బంగారాన్ని కుదవ పెట్టి అప్పులు తేవడంపై ఆయన ఒకే మాట చెప్పారు. తెలివైన వాడు సగం ఆస్తిని కుదవపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని ఆయన అన్నారు. భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ. పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారు. పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయం. పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్ లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారు. పీవీ కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది’’ అని అన్నారు. ఇక ఢిల్లీ పర్యటలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి.. అక్కడి తెలంగాణ భవన్లో జరిగిన పీవీ వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ ప్రధాని పీవీ. నరసింహారావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ కూడా పాల్గొన్నారు. భారత ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పీవీని అభివర్ణిస్తూ.. దేశానికి ఆయన అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఉంచింది. On his death anniversary, we pay tribute to the former Prime Minister of India, PV Narasimha Rao. Often remembered as the 'Father of Indian Economic Reforms', who revolutionised the Indian economy, we honour him for his exceptional contributions to the nation. pic.twitter.com/sHD7W01XO0 — Congress (@INCIndia) December 23, 2023 As we observed the 19th death anniversary of former Prime Minister Shri.PV Narasimha Rao Garu,paid floral tributes to him at #Hyderabad. A great son of #Telangana Soil, he's an erudite scholar,a statesman & administrator par excellence.#PVNarasimhaRao pic.twitter.com/atAOi8HkSk — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 23, 2023 దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా పీవీ జ్ఞాన భూమి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎం శ్రీ @revanth_anumula గారు మరియు మంత్రులు. pic.twitter.com/b6Z7w1XHHN — Telangana Congress (@INCTelangana) December 23, 2023 -
నేడు అంబేడ్కర్ వర్ధంతి.. సీఎం జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నివాళులు అర్పించారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ చేసిన సేవలు నిరుపమానమని సీఎం జగన్ అన్నారు. కాగా, సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా..‘భారత రాజ్యాంగ ప్రదాత, దేశ పాలనా మార్గదర్శకాల విధాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి నేడు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు నిరుపమానం. ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ మన ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి అహర్నిశలూ కృషి చేస్తోంది. బాబా సాహెబ్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ ప్రదాత, దేశ పాలనా మార్గదర్శకాల విధాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి నేడు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు నిరుపమానం. ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ మన ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి అహర్నిశలూ కృషి చేస్తోంది. బాబా సాహెబ్ గారి… pic.twitter.com/P3v4M1kxqT — YS Jagan Mohan Reddy (@ysjagan) December 6, 2023 మరోవైపు.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాయలంలో సీఎం జగన్.. అంబేడ్కర్‌కు నివాళులు అర్పించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సీఎం జగన్. ఈ కార్యక్రమానికి మంత్రులు తానేటి వనిత, మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. -
పూలే బాటలో సీఎం జగన్: మంత్రి కారుమూరి
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జ్యోతీరావ్ పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పూలే విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, తెలుగు, సంస్కృత అకాడమి ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పలువురు పార్టీ నేతలు, బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, పూలే బాటలో నడుస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని, పూలే ఆశించిన సామాజిక సాధికారత సీఎం జగన్ సాధించారని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీలను చంద్రబాబు అణగదొక్కాలనుకున్నారని, బలహీన వర్గాల గుండె చప్పుడు సీఎం జగన్ అని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ సీఎం జగన్‌కు ప్రజలు రుణపడి ఉంటారన్నారు. -
నువ్వు లేని జీవితం చాలా మార్పు తెచ్చింది.. సుమలత ఎమోషనల్!
ప్రముఖ సీనియర్ నటి సుమలత పరిచయం అక్కర్లేని పేరు. కర్ణాటకకు చెందిన సుమలత టాలీవుడ్‌లోనూ స్టార్ హీరోలతో నటించారు. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న ఆమె.. తన భర్త, దివంగత నటుడు అంబరీశ్‌ను తలుచుకుని ఎమోషనలైంది. ఆయన మరణించి ఇప్పటికీ ఐదేళ్లు పూర్తి కావడంతో సోషల్ మీడియాలో తన భర్త ఫోటోను పంచుకుంది. సుమలత ఇన్‌స్టాలో రాస్తూ..' నువ్వు లేని ఈ ఒంటరి జీవితం నాలో చాలా మార్పు తెచ్చిపెట్టింది! మన ఆనందం , దుఃఖం , నవ్వు , కన్నీళ్లు ప్రతి ఒక్క క్షణం ఎప్పటికీ గుర్తుంటాయి . మీరు లేని లోటు నా జీవితాంత తీర్చలేనిది. కానీ నీ ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉంటుంది. నిన్ను ఇప్పటికీ.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. నా జీవితంలో నువ్వే నాకున్న ఓకే ప్రపంచం. ఈరోజు నువ్వు గర్వంగా నవ్వుతూ పైనుంచి మన అభిషేక్ చిత్రాన్ని ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నా.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు మిస్ యూ సార్, కన్నడ సూపర్ స్టార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. ఇవాళ సుమలత తనయుడు అభిషేక్ నటించిన చిత్రం బ్యాడ్ మ్యానర్స్ కర్ణాటక వ్యాప్తంగా రిలీజైంది. ఇటీవలే సుమలత తనయుడు అభిషేక్.. అవివా బిడపాను పెళ్లాడారు. జూన్‌లో వీరి విహహం బెంగళూరులో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సూపర్ స్టార్ రజనీకాంత్, యశ్, మోహన్‌బాబు సహా పలువురు సినీతారలు హాజరయ్యారు. అంబరీశ్- సుమలత లవ్ స్టోరీ 1985లో వచ్చిన కన్నడ చిత్రం ఆహుతి సెట్స్‌లో అంబరీష్, సుమలత మొదటిసారి కలుసుకున్నారు. అలా మొదలైన పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత మరింత దగ్గరైన వీరు 1991 డిసెంబర్ 8న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా ఆహుతి, అవతార పురుషా, శ్రీ మంజునాథ, కళ్లరాలై హువగీ తదితర సినిమాల్లో జంటగా నటించారు. వీరి ఏకైక సంతానం అభిషేక్ గౌడ. కన్నడ ఇండస్ట్రీలో రెబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అంబరీష్ రాజకీయంగానూ చురుకుగా ఉండేవారు. 2018 నవంబర్ 24న అంబరీష్ గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగు, కన్నడ భాషల్లో అనేక చిత్రాలు చేసిన సుమలత ప్రస్తుతం మాండ్య నియోజకవర్గం ఎంపీగా సేవలందిస్తోంది. View this post on Instagram A post shared by Sumalatha Ambareesh (@sumalathaamarnath) -
సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి.. కుటుంబ సభ్యుల నివాళులు (ఫొటోలు)
-
Krishna 1st Death Anniversary: నేడు కృష్ణ తొలి వర్ధంతి (ఫోటోలు)
-
'మామయ్య.. ఆగిపోలేదు మీ ప్రస్థానం'.. సుధీర్ బాబు ఎమోషనల్!
ఇటీవలే మామ మశ్చీంద్ర సినిమాతో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో సుధీర్ బాబు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఎమోషనలయ్యారు. మామయ్యను తలుచుకుంటూ సోషల్ మీడియాలో వేదికగా సూపర్ కృష్ణ ఫోటోను పంచుకున్నారు. సుధీర్ బాబు తన ట్వీట్లో రాస్తూ 'మామయ్య , మీకు మాకు ఉన్న దూరం ఎంత? కలవరిస్తే కలలోకి వచ్చేంత, తలచుకుంటే మా గుండెల్లో బ్రతికేంత. ఆగిపోలేదు మీ ప్రస్థానం, ఆరిపోలేదు మా అభిమానం. మరువను నేను, మరువదు నేల. మీ కీర్తి, మీ స్పూర్తి ... అమరం .... అద్భుతం.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. కాగా.. ప్రస్తుతం హరోం హర అనే పాన్ ఇండియా చిత్రంలో సుధీర్ బాబు నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈనెల 22న టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాను సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సుధీర్ బాబు కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా కృష్ణ మొదటి వర్ధంతి సందర్భంగా మరిన్ని సేవ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఎం.బీ ఫౌండేషన్ పేరుతో ఎంతోమంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లకు సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ ఫౌండేషన్ ద్వారా చిన్నారుల చదువు కోసం ఉపకారవేతనాలు కూడా ఇవ్వనున్నారు. మామయ్య , మీకు మాకు ఉన్న దూరం ఎంత? కలవరిస్తే కలలోకి వచ్చేంత, తలచుకుంటే మా గుండెల్లో బ్రతికేంత. ఆగిపోలేదు మీ ప్రస్థానం, ఆరిపోలేదు మా అభిమానం. మరువను నేను, మరువదు నేల. మీ కీర్తి, మీ స్పూర్తి ... అమరం .... అద్భుతం.#SSKLivesOn pic.twitter.com/lYdFgRIcaa — Sudheer Babu (@isudheerbabu) November 15, 2023 -
అల్లూరి జిల్లా వెలగల పాలెంలో మాజీ ఎమ్మెల్యే గొట్టేటి దేముడు 8వ వర్ధంతి
-
భారత్ వెలుపల అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం
వాషింగ్టన్: భారత రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ అంబేద్కర్ అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని అమెరికా రాజధాని వాషింగ్టన్ శివారులోని మేరీల్యాండ్‌లో ఆవిష్కరించారు. అంబేడ్కర్ వర్థంతి రోజైన ఈ నెల 14వ తేదీన అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రెసిడెంట్ రామ్ కుమార్ 19 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’గా పిలుచుకునే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి 500 మందికి పైగా భారతీయ అమెరికన్లతోపాటు, భారత్, తదితర దేశాల నుంచి కూడా తరలివచ్చారు. ‘మేం దీనిని సమానత్వ విగ్రహం అని పిలుస్తున్నాం. అసమానత్వమనే సమస్య భారతదేశంలో మాత్రమే కాదు, ప్రతిచోటా వివిధ రూపాల్లో ఇది ఉనికిలో ఉంది’అని ఈ సందర్భంగా రామ్ కుమార్ అన్నారు. ఈ విగ్రహాన్ని ప్రఖ్యాత శిల్పి రామ్ సుతార్ రూపొందించారు. గుజరాత్లో నర్మదా తీరాన ఏర్పాటైన సర్దార్ పటేల్ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని రూపొందించింది కూడా ఈయనే. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌కు సరిగ్గా 22 మైళ్ల దూరంలో ఉన్న అకోకీక్ టౌన్‌షిప్‌లోని 13 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో బుద్ధా గార్డెన్‌తోపాటు లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ ఉన్నాయి. ఈ సెంటర్ ఆవరణలోనే అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. -
యూకేలో గాన గంధర్వునికి ఘనంగా సంగీత నివాళి!
గాన గంధర్వులు, దివగంత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి తృతీయ వర్ధంతి పురస్కరించుకుని భగవాన్ బోయినపల్లి గారి ఆధ్వర్యంలో Bhagavan’s Soulful presents 'SPB Lives On' పేరుతో అక్టోబర్ 7, 2023 తేదీన సంస్మరణ సంగీత కార్యకమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం యూకేలోని లండన్‌లో నోవర్ హిల్ హైస్కూల్లో నిర్వహించారు. ఇదే కార్యక్రమం 2022లో భగవాన్ 'సోల్‌ఫుల్ ప్రెజెంట్' పేరుతో నిర్వహించిన ‘ట్రిబ్యూట్ టు ది లెజెండ్' కార్యక్రమం ఘన విజయం సాధించింది. అదే స్ఫూర్తితో ఎస్పీబీ గారి స్మృతికి చిహ్నంగా ఇలా ప్రతి యేటా నివాళులర్పించాలనే ఉద్యేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు 300 మందికి పైగా విచ్చేశారు. ఈ సంగీత కార్యక్రమం భగవాన్ బోయినపల్లి గారీ ఉపన్యాసంతో మొదలైంది. తొలుత భగవాన్ గారు గాన గంధర్వని కీర్తిని ప్రశంసిస్తూ సంగీతాన్ని ప్రారంభించగా, చిన్నారులు భరతనాట్యంతో ఆ కార్యక్రమానికి మరింత శోభ తెచ్చారు. ఈ కార్యక్రమంలో బహుముఖ గాయనీ గాయకులు నాలుగు గంటలకు పైగా బాలు గారి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పాడిన సూపర్ హిట్ సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరించారు. ఈ సంగీత కార్యక్రమాన్ని ఇంతలా జయప్రదం చేసిన గాయనీగాయకులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. దసరా పంగుడ ముందే వచ్చిందా అన్నంత రీతీలో వైభవంగా జరగడమే గాక అతిథుల విందు భోజనాలతో కుటుంబ వాతావరణం సంతరించుకుంది. ఈ సందర్భంగా పలువురు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన భగవాన్ బోయన్‌పల్లి గారిని అభినందించగా, మరికొందరూ ఇలా ప్రతి ఏటా నిర్వహించాలన్నా ఆయన సంకల్పాన్ని వేన్నోళ్ల కొనియాడారు. (చదవండి: దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా! చివరికి సుప్రీం కోర్టు..) -
పేదల వైద్యుడు.. ఆదర్శనీయుడు ఈసీ గంగిరెడ్డి
పులివెందుల: దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి పేదల వైద్యుడిగా పేరు పొంది, ఎందరికో ఆదర్శనీయుడిగా నిలిచారు. ఆయన పులివెందులతోపాటు జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన హస్తవాసి తగిలితే ఎంతటి రోగమైనా ఇట్టే నయమవుతుందని ఈ ప్రాంత వాసుల నమ్మకం. ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి చిన్నపిల్లల డాక్టర్‌గా ప్రాచుర్యం పొందారు. 1949 ఏప్రిల్ 20న ఈసీ సిద్ధారెడ్డి, తులశమ్మ దంపతులకు రెండవ సంతానంగా వేముల మండలంలోని గొల్లలగూడూరులో జన్మించారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గొల్లలగూడూరు ఆర్సీఎం స్కూలు, 6 నుంచి 8 వరకు పులివెందుల జెడ్పీ హైస్కూలు, 9 నుంచి 10వ తరగతి వరకు వేముల జెడ్పీ హైస్కూలులో చదివారు. 10వ తరగతిలో జిల్లా టాపర్‌గా నిలిచారు. ఎంబీబీఎస్, పీడీ వారణాసిలోని బెనారస్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభించారు. పులివెందులలోని శ్రీనివాస హాలు వీధిలో తన సతీమణి డాక్టర్ ఈసీ సుగుణమ్మతో కలిసి గంగిరెడ్డి ఆసుపత్రి స్థాపించి దంపతులిద్దరూ వైద్య సేవలు అందించారు. పులివెందులలోని గంగిరెడ్డి ఆసుపత్రి అంటే ఎంతో ప్రాచుర్యం పొందింది. వైద్యం చేయడమే ప్రధాన ఆశయంగా, ప్రతిఫలం ఆశించని డాక్టర్‌గా ఆయన గుర్తింపు పొందారు. ఎలాంటి రోగమైనా ఆయన చేయి పడితే నయమవుతుందని పులివెందుల ప్రాంత ప్రజల నమ్మకం. ఈ ప్రాంత ప్రజలే కాకుండా జిల్లా నలుమూలల నుంచి, పక్క జిల్లాలైన అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి కూడా వచ్చి వైద్య సేవలు పొందారు. మారుతున్న కాలాన్ని బట్టి భాకరాపురంలో అత్యాధునిక వైద్య పరికరాలతో తన కుమారుడి పేరిట దినేష్ నర్సింగ్ హోం (ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి) స్థాపించి వైద్య సేవలు అందించారు. ఈసీ గంగిరెడ్డి కుమారుడు ఈసీ దినేష్‌రెడ్డి కూడా వైద్యునిగా సేవలు అందిస్తున్నారు. ఈసీ గంగిరెడ్డి తన దగ్గరకు వచ్చే రోగుల పట్ల ఎంతో ప్రేమ, ఆప్యాయతలను కనబరిచేవారు. ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా వైద్య సేవలు అందించేందుకు తపన పడేవారు. దినేష్ నర్సింగ్ హోం ద్వారా అనేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేద ప్రజలకు సేవ చేశారు. రాజకీయ ప్రస్థానం డాక్టర్ ఈసీ గంగిరెడ్డి 2001 నుంచి 2005 వరకు పులివెందుల మండల ప్రెసిడెంట్‌గా ప్రజలకు సేవలు అందించారు. వైఎస్ కుటుంబం పోటీ చేసే ప్రతి ఎన్నికలలోనూ ఆయన తనవంతు పాత్ర పోషించారు. ఎన్నికల సమయంలో వైఎస్ కుటుంబానికి మద్దతుగా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. 2003 రబీ సీజన్లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రైతులకు విత్తనాలు సక్రమంగా సరఫరా చేయలేదని పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. నేడు ప్రత్యేక ప్రార్థనలు దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి తృతీయ వర్ధంతి వేడుకలు మంగళవారం పులివెందులలో ఘనంగా జరగనున్నాయి. డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్ సమాధుల తోటలో ఉన్న డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఘాట్ వద్ద మంగళవారం ఈసీ గంగిరెడ్డి, వైఎస్ కుటుంబీకులు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం స్థానిక భాకరాపురంలో గల దినేష్ నర్సింగ్ హోంలో ప్రత్యేక ప్రార్థనలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. -
ఫీజు రీయింబర్సుమెంట్ వల్లే ఇక్కడ ఉన్నాం! సింగపూర్ ఎన్నారైల భావోద్వేగం
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా సింగపూర్‌లోని ఎన్నారైలు ఘనంగా నివాళులు అర్పించారు. జ్యోతి వెలిగించి, వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పాలనను గుర్తు చేసుకున్నారు. పేదప్రజల కోసం పరితపించిన గొప్ప నాయకుడని నెమరువేసుకున్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్సుమెంట్ వల్ల ఈ రోజు ఇక్కడ వున్నాము అని కొంతమంది భావోద్వేగం గురయ్యారు. ఎంత మంది సీఎం లు పాలించిన కూడా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కరే చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో కొలువైనారని, నిజమైన అమరత్వం అంటే ఇదే అని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ ఎన్నారై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్వైసర్ కోటి రెడ్డి, కన్వీనర్ మురళి కృష్ణ, కోర్ కమిటీ సభ్యులు శ్రీనివాసులు, మల్లికార్జున్ రెడ్డి, యుగంధర్, సుధీర్, జీవన్, కిరణ్, శ్రీనాథ్, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: అరిజోనాలో ఘనంగా వైఎస్సార్ వర్థంతి వేడుకలు) -
అరిజోనాలో ఘనంగా వైఎస్సార్ వర్థంతి వేడుకలు
ఆంధ్ర ప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం అరిజోనాలోని ఫీనిక్స్‌లో జరిగింది. ప్రవాసులు జ్యోతి వెలిగించి, డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ వేడుకకు తరలివచ్చిన ఫీనిక్స్‌లోని వైఎస్ఆర్ అభిమానులు తమ ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ సువర్ణ పాలనను గుర్తుచేసుకున్నా. ఆయన ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. వంశీకృష్ణ ఇరువారం, చెన్నారెడ్డి మద్దూరి, సునీల్ అననపురెడ్డి, నాగరాజ్ దాసరి, రశ్వంత్ పొలవరపు , పరితోష్ పోలి, శ్రీధర్ చెమిడ్తి, లక్ష్మీకాంతరెడ్డి, శివ కొండూరు, రమేష్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సంక్షేమం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్లలో నిర్వహించిన కార్యక్రమాలను గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలదని, పేదల సంక్షేమ పథకాలను నెరవేర్చడానికి మరియు తమ ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్థాపించిన ప్రజాకర్షకమైన దీర్ఘకాలిక పథకాలను పూర్తి చేయడానికి స్థాపించబడిందని వారు పునరుద్ఘాటించారు. పలువురు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు సభ్యులు రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పథకాలు మరియు అభివృద్ధిపై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర సంక్షేమం కోసం జగన్‌కు మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. (చదవండి: కువైట్‌లో ఘనంగా వైఎస్సార్ వర్థంతి వేడుకలు) -
కువైట్‌లో ఘనంగా వైఎస్సార్ వర్థంతి వేడుకలు
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి వేడుకలు కువైట్ లో జరిగాయి. వైఎస్సార్ సిపి కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆదేశానుసారం కువైట్‌లోని, మాలియా ప్రాంతంలో గల పవన్ ఆంధ్ర రెస్టారెంట్లోవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమీటీ సభ్యుల ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అభిమానులు రాజన్న 14వ వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులు అర్పించారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు భూమి ఆకాశం ఉన్నంత వరకు మహా నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి ప్రతి తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా ఉంటారని గల్ఫ్ కో-కన్వీనర్ గోవిందు నాగరాజు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు మన్నూరు చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి కుల, మత , పేద ధనిక పార్టీలకు అతీతంగా అందాయని అన్నారు. ఆ జన హృదయ నేతకు గల్ఫ్ ప్రవాసాంధ్రుల తరఫున నివాళులు అర్పించారు. తండ్రి అడుగు జాడల్లోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని.. APNRTS రీజనల్ కోఆర్డినేటర్ నాయని మహేష్ రెడ్డి, వైకాపా బీసీ ఇంచార్జ్ రమణ యాదవ్, యువజన విభాగం ఇంచార్జ్ మర్రి కల్యాణ్ తెలిపారు. స్వర్గీయ వైయస్ఆర్. మహానేత ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చి విద్య ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఒక అడుగు ముందుకేసి రాజన్న బిడ్డ రాజకీయాల్లో కూడా 4 శాతం అవకాశం కల్పించి ముస్లిం సోదరులు రాజకీయ ఎదుగుదలకు అవకాశమిస్తున్నారని.. వైఎస్ఆర్సిపీ కువైట్ కమిటీ మైనారిటీ ఇన్చార్జ్ గఫార్, మరియు షేక్ రహమతుల్లా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు అన్నాజీ రావు, అబు తురాబ్, మీడియా ప్రతినిధి ఆకుల ప్రభాకర్ రెడ్డి, సేవాదళ్ ఇంచార్జ్ గోవిందు రాజు,మైనార్టీ నాయకులు షా హుస్సేన్,మహబూబ్ బాషా,సీనియర్ నాయకులు సుబ్బారావు, యువజన విభాగం సభ్యులు ఏ బాలకృష్ణ రెడ్డి, జగనన్న యూత్ ఫోర్స్ అధ్యక్షులు, లక్ష్మి ప్రసాద్, జగనన్న సైన్యం అధ్యక్షుడు బాషా, పాటూరు వాసుదేవ రెడ్డి, అప్సర్ అలీ, పోలి గంగిరెడ్డి, బి. మహేశ్వర్ రెడ్డి, రెడ్డయ్య రెడ్డి, పి. సుధాకర్ రెడ్డి, మరియు కమిటీ సభ్యులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సోషల్ మీడియా సోదరులు పాల్గొన్నారు. (చదవండి: దుబాయ్‌లో ఘనంగా వైఎస్సార్ 14వ వర్థంతి వేడుకలు) -
వైఎస్సార్ వర్ధంతి: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ప్రత్యేక ప్రదర్శన
వైఎస్సార్.. ఆ పేరు ఓ ప్రభంజనం. నవ్వులో స్వచ్ఛత.. పిలుపులో ఆత్మీయత.. మాట తప్పని, మడమ తిప్పని గుణంతో ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రపంచీకరణ విధానాల యుగంలో అభివృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో మేళవించి చూపిన మహోన్నత నాయకుడు వైఎస్సార్. మహానేతను కోల్పోయి 14 ఏళ్లు గడిచిపోయాయి. కానీ ఆ జ్ఞాపకాలు చెరిగిపోలేదు..ఆ రూపం చెదిరిపోలేదు. ఇక, మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా న్యూయర్ టైమ్స్ స్వ్కేర్‌లో ప్రత్యేక ప్రదర్శన చేపట్టారు. చెదరని జ్ఞాపకం మహానేత వైఎస్సార్ 14వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అని ప్రదర్శించారు. అవధుల్లేని అభిమానం 🙏🏻 In Texas 🔥#YSRVardanthi #JoharYSR pic.twitter.com/1ilcV1iMi4 — Jagananna Connects (@JaganannaCNCTS) September 2, 2023 ఇది కూడా చదవండి: వైఎస్సార్ ఎప్పటికీ మనతోనే ఉంటారు: సజ్జల -
Johar YSR: అజేయుడు
1978లో పులివెందుల శాసనసభ స్థానం నుంచి రాజకీయ అరంగేట్రంవిపక్షంలో ఉన్నా.. అధికారం చేపట్టినా ప్రజల కోసమే పోరాడిన యోధుడుమూడు దశాబ్దాలకుపైగా రాజకీయ జీవితంలో ఓటమే ఎరుగని ధీరుడుపులివెందుల నియోజకవర్గం నుంచి ఆరుసార్లు శాసనసభకు ఎన్నికకడప లోక్‌సభ స్థానం నుంచి 1989 నుంచి వరుసగా నాలుగుసార్లు జయకేతనం సాక్షి, అమరావతి: సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఓటమే ఎరుగని నాయకులు ప్రపంచంలో అత్యంత అరుదుగా ఉంటారు. అలాంటి నాయకుల్లో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముందువరుసలో నిలుస్తారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా ప్రజల సంక్షేమం కోసం ఎందాకైనా పోరాడే ధీశాలికి జనం వెన్నంటి నిలిచి అజేయుడిని చేశారు. మదిలో పదిలం.. ఎన్నటికీ మరువలేం: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జయమ్మ దంపతులకు 1949, జూలై 8న జన్మించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కర్ణాటకలో గుల్బార్గాలోని ఎమ్మార్ వైద్య కళాశాలలో వైద్య విద్యను పూర్తి చేశారు. పులివెందులలో 1973లో తండ్రి వైఎస్ రాజారెడ్డి పేరుతో 70 పడకల ఆస్పత్రిని ప్రారంభించి.. ప్రజా సేవకు జీవితాన్ని అంకితం చేశారు. రూపాయికే వైద్యం చేస్తూ ప్రజలకు చేరువయ్యారు. తక్కువ సమయంలోనే రూపాయి డాక్టర్‌గా ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. పులివెందుల శాసనసభ స్థానం నుంచి 1978లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. శాసనసభకు ఎన్నికైన తొలి సారే అంజయ్య మంత్రివర్గంలో స్థానం దక్కించుకుని 1980 నుంచి 83 వరకూ గ్రామీణాభివృద్ధి, విద్య, ఎక్సైజ్ శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారు. ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ.. సినీనటుడు ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చేసి.. టీడీపీని స్థాపించి 1983 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ పులివెందుల శాసనసభా స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిపై అత్యధిక మెజార్టీతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విజయం సాధించారు. 1985 ఎన్నికల్లోనూ పులివెందుల నుంచి విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ కొట్టారు. వైఎస్‌తోపాటు 1978లో చంద్రగిరి నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన చంద్రబాబు.. 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్పైనే పోటీచేసి విజయం సాధిస్తానని బీరాలు పలికారు. కానీ.. ఆ ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేసిన చంద్రబాబు ఎన్టీఆర్ గాలిలో కొట్టుకుపోయి టీడీపీ పంచన చేరి.. 1985 ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉండిపోయారు. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో చంద్రబాబు కుప్పానికి వలస వెళ్లడం గమనార్హం. వైరిపక్షాలు ఏకమైనా.. రాజీవ్‌గాంధీ సూచన మేరకు 1989 ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి.. 1.66 లక్షల మెజార్టీతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 1991లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి 4.18 లక్షల రికార్డు మెజార్టీతో విజయభేరి మోగించారు. ఎన్టీఆర్‌కు 1995లో వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. 1996 లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఓడించడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడి.. కాంగ్రెస్‌లో వైఎస్ వైరిపక్షాలతో బాబు కుట్రలు చేశారు. కానీ.. ఆ కుట్రలను చిత్తు చేసి విజయకేతనం ఎగురవేసి, ఎంపీగానూ హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత 1998 ఎన్నికల్లోనూ కడప లోక్‌సభ స్థానం నుంచి ఘనవిజయం సాధించారు. డబుల్ హ్యాట్రిక్ పులివెందుల శాసనసభ స్థానం నుంచి 1978, 1983, 1985 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ కొట్టిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించి రెండోసారి హ్యాట్రిక్ సాధించారు. జనం మెచ్చిన ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉభయ రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన మరణించి 14 ఏళ్లు గడిచినా ఆయన పాలనను ఇప్పటికీ రెండు రాష్ట్రాల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారంటే.. ఆయన ఎంత ప్రజారంజకంగా పాలించారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఓట్ల రాజకీయాలకు వైఎస్సార్ స్వస్తి చెప్పారు. ఎన్నికల్లోనే రాజకీయాలు తప్ప.. తర్వాత రాజకీయాలకు అతీతంగా ఉండేవారు. ఓటు వేయని వారితోపాటు ప్రజలందరికీ ముఖ్యమంత్రిననే రీతిలో వైఎస్సార్ పాలన సాగించారు. అర్హులైన వారందరికీ పథకాలను సంతృప్త స్థాయిలో అందించారు. ఇతర పార్టీల వారికి పథకాలు ఇస్తున్నారని స్వపక్ష ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినా.. ప్రజలందరికీ ముఖ్యమంత్రిని గానీ కొందరికే కాదనే సమాధానం వైఎస్సార్ నుంచి వచ్చేది. – రిటైర్డ్ ఐఏఎస్ ఎంజీవీకే భాను భవిష్యత్ తరాల మేలు కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేసిన అరుదైన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా గొప్ప ఆలోచనలతో ధైర్యంగా ముందుకు సాగిన రాజనీతిజ్ఞుడు. హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డు ఆయన దార్శనికతకు నిదర్శనం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వెడల్పు పెంచి రాయలసీమ గొంతు తడిపింది కూడా దివంగత మహానేతే. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి సాయం చేయడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల్లో వైఎస్సార్‌కు ఎవరూ సాటిరారు. తారతమ్యాలు లేకుండా ఎవరికైనా సాయమందించేవారు. – విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రభాకర్‌రెడ్డి -
అభివృద్ధికి దిక్సూచి.. వైఎస్ రాజశేఖరరెడ్డి
వైఎస్ రాజశేఖరరెడ్డి.. వైఎస్సార్.. ఈ పేరు రాష్ట్ర ప్రజలకు ఓ భరోసా. అన్నదాతలకు అండ. సంక్షేమానికి, అభివృద్ధికి చిరునామా. అర్హతే ప్రామాణికంగా సంతృప్తస్థాయిలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన మహనీయుడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థులను ఉన్నత విద్య చదివించిన విద్యా దాత. ఆరోగ్య శ్రీ పథకంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ప్రాణ దాత. పంట ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు. జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన మహా నేత. పారదర్శకమైన పారిశ్రామిక విధానంతో పెట్టుబడులు వరదెత్తేలా చేసి.. ఉపాధి అవకాశాలను పుష్కలంగా కల్పించిన వైఎస్సార్.. మూడు పోర్టులు నిర్మించి ఎగుమతులకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చారు. ఐటీ ఎగుమతుల్లో 566 శాతం వృద్ధి సాధించారు. ఆర్థిక మాంద్యం ముప్పును ఎలా అధిగమించాలో చాటిచెప్పి, అభివృద్ధికి సరైన నిర్వచనం చెప్పారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచిన మహానేత వైఎస్సార్ అమలు చేసిన పథకాలనే కేంద్రం, అనేక రాష్ట్రాలు చేపట్టాయి. పరిపాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న వైఎస్ రాజారెడ్డి, జయమ్మ దంపతులకు జన్మించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రిని ఏర్పాటు చేసి.. రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల మన్ననలు పొందారు. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైఎస్ రాజశేఖరరెడ్డి.. 1978లో రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందే వరకు తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు. సీఎంగా వైఎస్ రాజశేఖరరెడ్డి పాలించింది ఐదేళ్ల మూడు నెలలే ఆ కొద్ది కాలంలోనే ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో చూపించారు. సంక్షేమం, అభివృద్ధికి మానవీయతను జోడించిన మహనీయుడు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల మూడు నెలలే పని చేశారు. మంచి చేయాలన్న మనసుంటే.. ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో ఆ కొద్ది కాలంలోనే చేసి చూపించారు. సమగ్రాభివృద్ధి వైపు రాష్ట్రాన్ని ఎలా పరుగులెత్తించవచ్చో దేశానికే చాటి చెప్పారు. అందుకే ఆ మహానేత భౌతికంగా దూరమై 14 ఏళ్లు దాటిపోయినా, ఇప్పటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పేద బిడ్డల చదువులకు పెన్నిధి.. పేదరికానికి విద్యతో విరుగుడు పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి రూపకల్పన చేశారు. మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులు పేదవాడి సొంతమైతేనే పేదరికం నిర్మూలన సాధ్యమని ఆయన బలంగా నమ్మారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా లక్షలాది మంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న ఓసీ విద్యార్థులు ఉన్నత చదువులను అభ్యసించి.. దేశ, విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. దీనివల్ల లక్షలాది కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి. ఉన్నత చదువులను అందరికీ అందుబాటులోకి తేవడం కోసం జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఉద్యాన వర్శిటీని.. తిరుపతిలో పశు వైద్య కళాశాలను నెలకొల్పారు. ప్రతిష్ఠాత్మక జాతీయ విద్యా సంస్థ ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ని హైదరాబాద్ సమీపంలో కంది వద్ద ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉన్నత చదవులు దక్కేలా చేశారు. నిరుపేదలను విద్యావంతులుగా తీర్చిదిద్దే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఆ తర్వాత అనేక రాష్ట్రాలు అమల్లోకి తెచ్చాయి. పారిశ్రామికాభివృద్ధితో పుష్కలంగా ఉపాధి అవకాశాలు ఉమ్మడి రాష్ట్రంలో 1995 నుంచి 2004 వరకు పరిపాలించిన చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతికి కేంద్రంగా మార్చారు. దాంతో సుదీర్ఘమైన తీర ప్రాంతం, సమృద్ధిగా సహజవనరులు, పుష్కలంగా మానవ వనరులు అందుబాటులో ఉన్నా పెట్టుబడుల ఆకర్షణలో ఏడో స్థానానికి పరిమితమైంది. వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక పారదర్శకమైన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. దాంతో రాష్ట్రంలోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. పెట్టుబడుల ఆకర్షణలో 2004 నుంచి 2009 వరకు రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. భారీ ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవడంతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా వచ్చాయి. సుదీర్ఘమైన తీర ప్రాంతాన్ని వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రచించిన వైఎస్సార్.. యుద్ధప్రాతిపదికన గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు నిర్మించారు. దాంతో ఎగుమతులు భారీ ఎత్తున పెరిగాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి హైదరాబాద్‌ను ప్రపంచ చిత్రపటంలో నిలిపారు. తద్వారా హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ వేళ్లూనుకునేలా చేశారు. దాంతో ఐటీ ఎగుమతులు 566 శాతం పెరిగాయి. జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్‌కు పాదయాత్రతో జీవం అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో వరుస ఓటములతో 2003 నాటికి కాంగ్రెస్ పార్టీ జీవచ్ఛవంలా మారింది. ఆ దశలో రాష్ట్రంలో పాదయాత్ర చేశారు వైఎస్ రాజశేఖరరెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మండుటెండలో 2003 ఏప్రిల్ 9న ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. 2003 జూన్ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. మండుటెండలో 1,475 కిలోమీటర్ల వైఎస్సార్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తన పాదయాత్రతో కాంగ్రెస్‌కు జీవం పోసి 2004లో ఇటు ఉమ్మడి రాష్ట్రంలోను, అటు కేంద్రంలోనూ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ, జలయజ్ఞం ప్రాజెక్టులతో, రైతు పథకాలతో వ్యవసాయాన్ని పండగల మార్చి ప్రజారంజక పాలన అంటే ఏమిటో దేశానికి చూపించారు. పాలకుడంటే ఎలా ఉండాలో చాటిచెప్పిన నేత పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి వైఎస్ రాజశేఖరరెడ్డి పునాది వేశారు. పంటలు పండక విద్యుత్ ఛార్జీలు కట్టలేని రైతులపై టీడీపీ సర్కారు రాక్షసంగా బనాయించిన కేసులను ఒక్క సంతకంతో ఎత్తేయడం ద్వారా పాలకుడంటే ఎలా ఉండాలో చాటిచెప్పారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. దాదాపు 35 లక్షలకు పైగా పంపు సెట్లకు ఉచిత విద్యుత్‌ను అందించారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ఆ తర్వాతి ఏడాదికి రూ.6 వేల కోట్లకు చేరినా ఉచిత విద్యుత్ హామీ అమలుపై వెనక్కు తగ్గలేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని ఎగతాళి చేసిన నేతలు కూడా అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని కొనసాగించాల్సిన పరిస్థితిని కల్పించారు. వైఎస్సార్ స్ఫూర్తితో దేశంలో అనేక రాష్ట్రాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాయి. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించారు. పంట ఎండినా రైతు నష్టపోకూడదనే లక్ష్యంతో పంటల బీమాను అమలు చేశారు. ఇన్‌ఫుట్ సబ్సిడీని అందించారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంతో పోరాడారు. 2004 నుంచి 2009 మధ్య ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.550 నుంచి రూ.1000 వరకు పెరగడమే అందుకు తార్కాణం. మాంద్యం ముప్పును తప్పించిన ఆర్థికవేత్త 2007–08, 2008–09 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసింది. ఆ మాంద్యం ప్రభావం దేశంపైనా పడింది. కానీ.. వైఎస్సార్ దాని ముప్పు ప్రభావం రాష్ట్రంపై పడకుండా చేయగలిగారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదల ఇళ్ల నిర్మాణం, రహదారులు వంటి అభివృద్ధి పనులు చేపట్టి మార్కెట్లోకి ధనప్రవాహం కొనసాగేలా చేశారు. వాటి ద్వారా రాష్ట్రానికి పన్నులు వచ్చేలా చేసి.. మాంద్యం ముప్పు నుంచి రాష్ట్రాన్ని కాపాడారు. వైఎస్సార్ ఆర్థిక ప్రణాళికను చూసి అప్పట్లో ఆర్థిక నిపుణులు ప్రశంసించారు. ఇది కూడా చదవండి: ఒకటో తేదీనే 52.70 లక్షల మందికి రూ.1,451.41 కోట్ల పింఛన్ -
మహారాష్ట్రలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు
సాక్షి, ముంబై: ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా.. మహారాష్ట్రలో కార్యక్రమాలు జరిగాయి. జగ్మోహన్రెడ్డి దాదాను(వైఎస్ జగన్మోహన్రెడ్డి) అభిమానుల ఎన్జీవో దాదాశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా.. ఖో-ఖో బహిరంగ పోటీ వీట్లో జరిగింది, ఇందులో మొత్తం 23 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు ప్రైజ్ మనీతో పాటు పాల్గొన్న క్రీడాకారులకు మొక్కలనూ బహుకరించింది దాదాశ్రీ ఫౌండేషన్. ఇక ఈ పోటీలు 2 రోజుల పాటు కొనసాగాయి. సాల్సే స్కూల్లో చెట్లు నాటే కార్యక్రమంలో.. 501 మొక్కలు నాటారు. వీట్లో రక్తదాన శిబిరం నిర్వహించి 73 మంది రక్తదానం చేసి.. ప్రతి రక్తదాతకు హెల్మెట్లు అందజేశారు. కాకా కాకాడే జగ్‌మోహన్‌రెడ్డికి వీరాభిమాని, ఇప్పుడు షోలాపూర్ జిల్లాలోని ప్రతి పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
మాజీ ప్రధాని వాజ్‌పేయి వర్ధంతి.. రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
ఢిల్లీ: నేడు(బుధవారం) దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్థంతి. ఈ నేపథ్యంలో వాజ్‌పేయికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ సహా కేంద్రమంత్రులు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని 'సదైవ్ అటల్' స్మారక చిహ్నం వద్ద వాజ్‌పేయి కుటుంబ సభ్యులతో సహా వీరంతా నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ.. #WATCH | Delhi: President Droupadi Murmu pays floral tribute at 'Sadaiv Atal' memorial on former PM Atal Bihari Vajpayee's death anniversary. pic.twitter.com/bYUvCv9Idt — ANI (@ANI) August 16, 2023 నివాళులు అర్పించిన స్పీకర్ ఓం బిర్లా.. #WATCH | Delhi: Prime Minister Narendra Modi pays floral tribute at 'Sadaiv Atal' memorial on former PM Atal Bihari Vajpayee's death anniversary. pic.twitter.com/sKhGiQAY2s — ANI (@ANI) August 16, 2023 #WATCH | Defence Minister Rajnath Singh, Union Home Minister Amit Shah and Union Minister Nitin Gadkari pay floral tribute at 'Sadaiv Atal' memorial on former PM Atal Bihari Vajpayee's death anniversary. pic.twitter.com/xTzvgIS90f — ANI (@ANI) August 16, 2023 నివాళులు అర్పించిన వాజ్‌పేయి కుటుంబ సభ్యులు.. #WATCH | Delhi: Former PM Atal Bihari Vajpayee's foster daughter Namita Kaul Bhattacharya pays floral tribute at 'Sadaiv Atal', on his death anniversary. pic.twitter.com/YS49n7xyB9 — ANI (@ANI) August 16, 2023 -
ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్‌ఝన్‌వాలా: హాట్ టాపిక్‌గా ఆ చెక్
బిలియనీర్ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా'గా పాపులర్ అయిన బిలియనీర్ రాకేష్ ఝన్‌ఝన్‌వాలా కన్నుమూసి నేటితో సంవత్సరం. ఇప్పటికీ ఇప్పటికీ, దలాల్ స్ట్రీట్ పెట్టుబడిదారులకు ఆయనంటే ఎనలేని ప్రేమ, అభిమానం. అంతేకాదు మార్కెట్ నిపుణులు అతని పెట్టుబడి సూత్రాలను, సక్సెస్‌మంత్రాను కథలు కథలుగా గుర్తు చేసుకుంటారు. ముఖ్యంగా మార్కెట్ భారీ పతనాన్ని నమోదు చేసిన సమయంలో కూడా ఆయన బుల్లిష్‌గా ఉన్నారు. స్టాక్మార్కెట్లో షేర్ల కొనడం, అమ్మడం అనేది తెలివికి సంబంధించిన చర్యలు కాదు జ్ఞానానికి సంబంధించి అంటారాయన. తాజాగా ఆయనకు సంబంధించి ఒక విషయం విశేషంగా మారింది. రాకేశ్ ఝన్‌ఝన్ వాలా రాసిచ్చిన అతిపెద్ద చెక్ ఇపుడు హాట్‌టాపిక్‌గా మారింది. రేర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ ఉత్పల్ షేత్ ప్రకారం, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కోకి రూ.1,500 కోట్ల చెక్కును రాసిచ్చారట.. అయితే ఇది పోర్ట్‌ఫోలియోలో 10శాతం కూడా కాదు ఆయన పెట్టుబడులను వివిధ షేర్లలో పెట్టేవారని కూడా ఆయన చెప్పారు. చార్టర్డ్ అకౌంటెంట్, రాకేష్ ఝన్‌ఝన్‌వాలా తన స్టాక్ మార్కెట్ పెట్టుబడులను 1980ల ప్రారంభించారు. కేవలం రూ. 5,000తో ప్రారంభించి, అద్భుతమైన విశ్లేషణతో పోర్ట్‌ఫోలియోను విస్తరించుకుని భారీ లాభాలను ఆర్జించారు. 2002 తర్వాత దశాబ్దం తర్వాత, ఆయన సంపాదన బిలియన్ల డాలర్లకు చేరింది.బిగ్ బుల్ మల్టీబ్యాగర్ స్టాక్స్ ఎలా ఎంపిక చేసుకుంటారనే విషయంపై 'ది బిగ్ బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్: హౌ రాకేష్ జున్‌జున్‌వాలా మేడ్ హిస్ ఫార్చ్యూన్' పుస్తకంలో కొన్ని కీలక అంశాలను చర్చించారు. తన అసెట్ మేనేజ్మెంట్ సంస్థ రేర్ (రాకేష్, భార్య రేఖా పేర్లలోని లోని తొలి అక్షరాలను కలిపి) ఎంటర్ప్రైజెస్ ద్వారా ఆగస్ట్ 14, 2022 నాటికి ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం సుమారు రూ. 46,000 కోట్లు పెరిగింది.ఐదు పరిమిత బాధ్యత భాగస్వామ్య సంస్థలతో పాటు రేర్ ఈక్విటీ ప్రైవేట్ లిమిటెడ్, రేర్ ఫ్యామిలీ ఫౌండేషన్ మరియు హోప్ ఫిల్మ్ మేకర్స్ అనే మూడు సంస్థలలో డైరెక్టర్‌గా ఉన్నారు.ఫోర్బ్స్ జాబితా 2022లో 438వ బిలియనీర్‌గా ర్యాంక్‌ను సాధించారు. 2021 జాబితా ప్రకారం అతను భారతదేశంలో 36వ అత్యంత సంపన్నుడు. కాగా 1960 జులై 5న పుట్టిన రాకేష్ ఝన్‌ఝన్‌వాలా 62 ఏళ్ల వయసులో గత ఏడాది ఆగస్టు 14న అనారోగ్యంతో కన్నుమూసారు. మరణానంతరం ఆయనకు వాణిజ్యం మరియు పరిశ్రమల రంగానికి చేసిన కృషికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి పద్మశ్రీ లభించింది. ఈ అవార్డును రేఖా ఝన్‌ఝన్ వాలా అందుకున్నారు -
Actress Manjula 10th Death Anniversary: సీనియర్ నటి మంజుల పదో వర్ధంతి (ఫొటోలు)
-
ధీరూభాయ్ అంబానీ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక చైర్మన్, దివంగత ధీరూభాయ్ అంబానీ 21వ వర్ధంతిని పురస్కరించుకుని, డెక్కన్ బ్లడ్ సెంటర్ సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గురువారం జియో తెలంగాణ ప్రధాన కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. జియో తెలంగాణ సీఈఓ కె.సి.రెడ్డి దివంగత వ్యవస్థాపక చైర్మన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన రక్తదానం చేశారు. సంస్థ ఉద్యోగులు సైతం అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. -
వి మిస్ యూ పప్పా: ఈ రోజు దేశం చేస్తున్న పని ఆయన ఎప్పుడో చేశారు!
ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫౌండర్ ధీరజ్‌లాల్ హీరాచంద్ అంబానీ (ధీరూభాయ్) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జూలై 6 ఆయన వర్ధంతి సందర్భంగా ధీరూభాయ్ అంబానీ సక్సెస్ ఫుల్ జర్నీని తెలుసుకుందాం. "కష్టాలు ఎదురైనా మీ లక్ష్యాలను సాధించండి, ప్రతికూలతలను అవకాశాలుగా మార్చుకోండి’’ అనేది ధీరూభాయ్ అంబానీ సందేశం. నిజ జీవితంలో ఆయన అదే ఆచరించి చూపారు. ఎంతో మంది పారిశ్రామిక వేత్తలకు స్ఫూర్తిగా నిలిచారు. టీనా అంబానీ ఘన నివాళి ఈ రోజు దేశమంతా చేస్తున్న పనిని ఆయన ఎప్పుడో పూర్తి చేశారు. అదీ ఆయన దార్శనికత. చాలా విధాలుగా ఆయన కాలం కంటే ముందే ఉన్నారు. ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించమని,అత్యుత్తమంగా ఉండాలని, మనల్ని మనం అంకితం చేసుకోవాలని ప్రోత్సహించిన నిజమైన దార్శనికుడు. పప్పా ప్రతిరోజూ నిన్ను మిస్ అవుతున్నాం. మీరందించిన అనంతమైన జ్ఞానాన్న మా నిజ జీవితాల్లో వర్తింపజేయడానికి ప్రయత్నిస్తాం అంటూ ఆయన కోడలు, అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ నివాళులర్పించారు. మరోవైపు ధీరూభాయ్ పెద్ద కోడలు, బిలియనీర్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తన "అత్యంత స్ఫూర్తిదాయకమైన గురువు" అంటూ గురు పూర్ణిమ రోజు ఎన్ఎంఏసీసీలో నిర్వహించిన పరంపర కార్యక్రమంలో ఘన నివాళులర్పించారు. ధీరూ భాయ్ అంబానీ కొన్ని ఆసక్తికర విషయాలు దిగ్గజ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరూభాయ్ పదో తరగతి మాత్రమే పూర్తి చేశారంటే నమ్ముతారా? ఒకప్పుడు పెట్రోల్ పంపులో పని.. కానీ ఆ తరువాత వేల కోట్ల రూపాయలతో వ్యాపార దిగ్గజంగాఎదిగిన ధీరూభాయ్ అంబానీ గురించి అంతగా తెలియని ఆసక్తికరమైన విషయాలు సాధారణ కుటుంబంలో జననం, కష్టాలు ధీరూభాయ్ అంబానీ గుజరాత్, జునాగద్ జిల్లాలో చోర్వాడ్ అనే చిన్న గ్రామంలో 1932, డిసెంబరు 28న జన్మించారు. సామాన్య టీచర్ కుటుంబంలో నలుగురు తోబుట్టువులతో జీవితం కష్టాలతోనే ప్రారంభమైంది. ముఖ్యంగా కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ధీరూభాయ్ అంబానీ తన చదువును కూడా మధ్యలోనే వదిలివేసి కుటుంబానికి అండగా ఉండేందుకు చిన్న చిన్న పనులు చేశారు. పెట్రోలు బంకులో పని, నెలకు రూ.300 బిలియన్ డాలర్ల కంపెనీ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ ప్రారంభంలో బ్రిటిష్ కాలనీ ఆఫ్ అడెన్‌లోని పెట్రోల్ బంకులో అటెండెంట్‌గా పనిచేశారు. ఆ సందర్భంగా నెలకు 300రూపాయలు జీతంగా తీసుకునేవారట. అంతకుముందు కుటుంబ పోషణ కోసం అనేక పనులు చేశారు.కానీ అవి నచ్చకపోవడంతో మిడిల్ ఈస్ట్ ఆసియా దేశమైన యెమెన్‌కు వలస వెళ్లి పెట్రోల్ బంకులో పని మొదలు పెట్టారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తీప్పింది. సూయజ్‌కు తూర్పున ఉన్న అతిపెద్ద ఖండాంతర వాణిజ్య సంస్థలో ట్రేడింగ్, అకౌంటింగ్, ఇతర వ్యాపార నైపుణ్యాలను నేర్చుకున్నారు. కొన్నేళ్లలోనే మంచి స్థానానికి ఎదిగారు. ఆ తరువాత అన్నింటినీ వదిలి తిరిగి భారతదేశానికి తిరిగి వచ్చేశారు. రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ ఇండియాకి వచ్చిన తరువాత 1958లో తన బంధువు చంపక్లాల్దమానీతో కలిసి తొలి కంపెనీ రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ (సుగంధ ద్రవ్యాలు, నూలు వ్యాపారం) కంపెనీ స్థాపించారు. నూలు వ్యాపార పరిశ్రమలో పెరుగుతున్న అవకాశాలను గుర్తించిన తర్వాత ధీరూభాయ్ తన వ్యాపారాన్ని మార్చేశారు. మూడేళ్ల తర్వాత 1962లో రిలయన్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను లాంచ్ చేశారు. బంధువు చంపక్లాల్ దమానీతో విడిపోయిన తరువాత 1966లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 'రిలయన్స్ టెక్స్టైల్స్' అనే బట్టల మిల్లును ప్రారంభించారు. దీంతో అతని జీవితంలో అత్యంత మలుపు తిరిగింది. ఇక తరువాత మళ్ళీ ఎప్పుడూ వెనుదిరిగి చూసింది లేదు. అంచెలంచెలుగా రిలయన్స్ సామ్రాజాన్నివిస్తరించారు. అలాగే భారతదేశంలోని సగటు పెట్టుబడిదారులకు స్టాక్ మార్కెట్‌ను పరిచయం చేసిన ఘనత అంబానీకి దక్కుతుందని మార్కెట్ నిపుణులమాట. భారతదేశంలో అతిపెద్ద ఎగుమతిదారుగా ఫార్చ్యూన్ 500లోచోటు దక్కించుకున్న తొలి ఇండియన్ ప్రైవేట్ కంపెనీగా రిలయన్స్ టెక్స్ టైల్స్ నిలిచింది. అలాగే 1996, 1998, 2000 సంవత్సరాల్లో ఆసియావీక్ పత్రిక 'పవర్ 50- ఆసియాలో మోస్ట్ పవర్ఫుల్ పీపుల్' జాబితాలో చేరారు. దీంతోపాటు1999 సంవత్సరంలో బిజినెస్ ఇండియా 'బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును కూడా అందుకున్నారు. 69 ఏళ్ల వయసులో ధీరూభాయ్ అంబానీ 2002 జూలై 6న ముంబైలో కన్నమూశారు. ఖరీదైన రెస్టారెంట్లలో టీ తాగేవారు తాజా వ్యాపార ఆలోచనలకోసం, తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి, ధీరూభాయ్ అంబానీ సంపన్న వ్యాపారవేత్తలతో కలిసి తిరిగేవారట. నెట్వర్క్ , పరిశ్రమ గురించి తెలుసుకోవడానికి, ఖనీదైన రెస్టారెంట్లలో టీ తాగేవారని చెబుతారు. ధీరూభాయ్ అంబానీ భార్య పేరు కోకిలాబెన్. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరు ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ, నినా కొఠారి, దీప్తి సల్గోకర్. ఆస్తులను తన ఇద్దరు కుమారులు ముఖేశ్, అనిల్ అంబానీలకు పంచి ఇచ్చారు. 2002లో ఆయన మరణించే ముందు వరకు కంపెనీని పర్యవేక్షించిన ఆయన 1980ల మధ్యకాలంలో తన కుమారులు ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీలకు అప్పగించారు, ఆయన వారసత్వాన్ని అందుకున్న ముఖేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా అత్యంత సంపన్నుడుగా, ఆసియా బిలియనీర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. -
పులివెందుల చరిత్రలో పెద్దాయనది ఒక ప్రత్యేకత.. జనం గుండెల్లో చెరగని ముద్ర
పులివెందుల : పులివెందుల చరిత్రలో పెద్దాయనది ఒక ప్రత్యేకత. పేద ప్రజలకు.. తమ కుటుంబాన్ని నమ్ముకున్నవారికి అండగా నిలిచేవారు. కరువు లాంటి విపత్కర పరిస్థితులలోనూ ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు దివంగత వైఎస్ రాజారెడ్డి. వైఎస్ రాజారెడ్డి 1925 సంవత్సరంలో వెంకటరెడ్డి, మంగమ్మ దంపతులకు జన్మించారు. ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ అందరినీ ఏకతాటిపై నడిపించిన వైఎస్ రాజారెడ్డికి పులివెందుల పెద్దాయనగా పేరు వచ్చింది. పులివెందుల అభివృద్ధికి సంబంధించి గ్రామ సర్పంచ్‌గా ఆయన ఎనలేని సేవలు అందించారు. క్రమశిక్షణ గల కార్యకర్తలను తీర్చిదిద్దడంలోనూ కుమారులు, కుమార్తెలు ఉన్నతస్థానంలో నిలపడంలోనూ కుటుంబ పెద్దగా పెద్దాయన పాత్ర ఎనలేనిది. పులివెందుల గ్రామ సర్పంచ్‌గా.. రాజకీయాల్లోకి రాకమునుపు నుంచి పులివెందుల్లో వై.ఎస్.రాజారెడ్డికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎలాంటి సమస్య అయినా ఆయన దగ్గరికి వెళితే పరిష్కారమవుతుందని ప్రజల నమ్మకం. ఈ నాటికీ ఆయన వెంట ఉన్న అభిమానులు రాజారెడ్డిని దేవునిగా కొలుస్తున్నారంటే ఎంత ఆరాధిస్తున్నారో అర్థమవుతోంది. ► ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన రాజారెడ్డి పులివెందుల గ్రామ సర్పంచుగా ఎన్నికై ప్రజాప్రస్థానం ప్రారంభించారు. ఆయన పులివెందుల సర్పంచ్‌గా 1988 నుండి 1995 వరకు పనిచేశారు. ఆయన సర్పంచ్‌గా ఉన్న సమయంలోనే పులివెందులలో వీధిలైట్లు, రోడ్లు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంతోపాటు చెరువులను తవ్వించారు. పులివెందుల్లో అభివృద్ధి పనులు చేపడుతూనే ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేవారు. అలనాడు సర్పంచ్‌గా పనిచేస్తున్న సమయంలో పులివెందుల్లో మంచినీటి సమస్య తీవ్రరూపం దాల్చినప్పుడు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి నీటిసమస్య తీర్చడమే కాదు.. రాష్ట్రంలోనే ఇలాంటి సమస్య ఎప్పుడూ రాకూడదని పుత్రులకు హితబోధ చేసిన మహా మనిషి ఆయన. గ్రామ ప్రజలకు సమస్యలు రాకుండా పోరాడుతూనే మరోవైపు తన ఆశయాల సాధనకు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తన సుపుత్రులలో ఇద్దరిని ప్రజల కోసం అంకితం చేశారు. ► తన కుమారుడు వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ ఉన్నతికి ఆయన ఎంతో కృషి, తోడ్పాటు అందించారు. పులివెందుల ప్రాంతంలో ప్రత్యేకంగా వైఎస్ రాజారెడ్డి పేరుతో కాలనీలు కూడా వెలిశాయి. పులివెందుల ప్రజల మనసులో ప్రత్యేక స్థానం పులివెందుల పరిధిలో దివంగత వైఎస్ రాజారెడ్డి, దివంగత జయమ్మ దంపతులు ప్రజల మనసులో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. వైఎస్ రాజారెడ్డి బతికున్న కాలంలో ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండేవారు. వైఎస్ఆర్ రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై ఉండగా.. వైఎస్ రాజారెడ్డి పులివెందుల ప్రాంతంలో ప్రజల సమస్యలపట్ల, రాజకీయాలపట్ల అన్నీ తానై చూసుకొనేవారు. దీంతో వైఎస్ఆర్ రాష్ట్ర రాజకీయాల్లో చురుకై న పాత్ర పోషించగలిగారు. వైఎస్ రాజారెడ్డి తనయుడు వైఎస్ఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలని తపించేవారు. విద్యా ప్రదాతగా.. వైఎస్ రాజారెడ్డి పులివెందుల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూనే పులివెందులలో పేద విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలు నెలకొల్పారు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన ఎంతో తృప్తి పొందేవారు. వైఎస్ రాజారెడ్డి, వైఎస్సార్ చూపిన బాటలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారని ప్రజలు కొనియాడుతున్నారు. ప్రజలు ఈ నాటికీ పులివెందుల పెద్దాయన వైఎస్ రాజారెడ్డిని గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. ఘన నివాళులర్పించిన వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతమ్మ దివంగత వైఎస్ రాజారెడ్డి 25వ వర్ధంతి సందర్భంగా మంగళవారం పులివెందులలోని డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్ సమాధుల తోటలో గల వైఎస్ జయమ్మ, వైఎస్ రాజారెడ్డి సమాధుల వద్ద వైఎస్సార్ కుటుంబీకులు, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతమ్మలతోపాటు ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వైఎస్ రాజారెడ్డి పార్కులోని వైఎస్ రాజారెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పించారు. జీసెస్ చారిటీస్‌లో గల చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -
అల్లూరి సీతారామరాజు వర్ధంతి.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు సీఎం జగన్. స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకునేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆయన పేరు మీద జిల్లాను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు. ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకునేలా మన ప్రభుత్వంలో ఆయన పేరు మీద జిల్లాను ఏర్పాటు చేశాము. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి. — YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2023 చదవండి: ‘మార్గదర్శి’ అక్రమాలు, నిజానిజాలు.. రామోజీ గురించి ఏం చెప్పారంటే? -
సౌందర్య చనిపోతుందని ఆమె తండ్రికి ముందే తెలుసా?
హీరోయిన్ సౌందర్య.. తెలుగు సినీ పరిశ్రమలో ఈమె పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కొందరు మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి సౌందర్య కూడా ఒకరు. మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సౌందర్య తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ గుర్తిండిపోతుంది. చక్కటి చీరకట్టులో, నిండైన రూపంతో పదహారణాల తెలుగింటి అమ్మాయిలా నటించి ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. గ్లామర్ షో చేయకుండానే చీరకట్టులోనే కనిపించి అగ్రకథానాయిగా చక్రం తిప్పిన సౌందర్య అనుకోని ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.ఆమె మరణించి 19 ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ ఆమె రూపం అభిమానుల గుండెల్లో చిరస్మరణీయంగానే ఉంది. నిజానికి సౌందర్యను డాక్టార్ను చేయాలని ఆమె తండ్రి కలలు కన్నాడట. కానీ కూతురి జాతకంలో సినీ నటి అవుతుందని ఉందట. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే ఇండస్ట్రీ నుంచి పిలుపు రావడంతో డాక్టర్ కావాల్సిన సౌందర్య నటిగా అరంగేట్రం చేసింది. ఇక సౌందర్య తండ్రి సజాత్యనారాయణకు జాతకలపై మంచి పట్టు ఉండేదట. తఓ సందర్భంలో ఓ డైరెక్టర్ చిట్టిబాబుతో మాట్లాడుతున్న ఆయన.. సౌందర్య గురించి మాట్లాడుతూ.. నా కూతురి జాతకం ప్రకారం.. ఆమె దక్షణాదిలో టాప్ హీరోలందరితో పనిచేసిన అగ్రనటిగా సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుంటుంది. కానీ 2004లో ఆమె సినీ కెరీర్ ముగుస్తుంది అని చెప్పాడట. అయితే ఆ మాటలు విని బహుశా పెళ్లి చేసుకొని కాస్త గ్యాప్ తీసుకుంటుందేమో అనుకున్నాం..కానీ ఇలా జీవితమే ముగుస్తుందని ఊహించలేదు అంటూ చిట్టిబాబు అప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు. -
డాక్టర్ అంజిరెడ్డి తొలి స్మారకోపన్యాసం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) తమ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ కె. అంజిరెడ్డి పదవ వర్ధంతి సందర్భంగా తొలి స్మారకోపన్యాస కార్యక్రమం నిర్వహించింది. ఇందులో నోబెల్ బహుమతి గ్రహీత .. ఇజ్రాయెల్‌కు చెందిన ప్రొఫెసర్ అడా ఇ. యోనత్, భారత ప్రభుత్వ మాజీ ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహాదారు కె. విజయ రాఘవన్, ఇగ్నైట్ లైఫ్ సైన్స్ ఫౌండేషన్ సీఈవో స్వామి సుబ్రమణియన్, కాంటినెంటల్ హాస్పిటల్స్ సీఎండీ గురు ఎన్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఔషధాలను చౌకగా అందుబాటులోకి తేవాలన్నది అంజి రెడ్డి విజన్ అని డాక్టర్ రెడ్డీస్ సహ చైర్మన్ జి.వి. ప్రసాద్ తెలిపారు. శాస్త్రీయ, సామాజిక అంశాలపై పెద్ద స్థాయిలో చర్చలు జరగడం అంజి రెడ్డికి నిజమైన నివాళి కాగలదని కంపెనీ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. తదుపరి తరం యాంటీబయోటిక్స్ రూపకల్పనలో తన పరిశోధనలు ఏ విధంగా తోడ్పడగలవన్నది యోనత్ ఈ సందర్భంగా వివరించారు. -
ఆంగ్లేయులపై తిరగడ్డ కడప బిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
కడప సెవెన్‌రోడ్స్ : భారతీయుల్లో జాతీయ భా వం అప్పటికి సరిగా మొగ్గతొడగలేదు. ఆధునిక చరిత్రకారులు ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంగా పేర్కొనే సిపాయిల తిరుగుబాటు జరగలేదు. కానీ అంతకు పదేళ్ల క్రితమే నాటి కడప జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన దొరవారి నరసింహారెడ్డి ఆంగ్లేయులపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నేటికి సరిగ్గా 176 ఏళ్ల క్రితం ఉరికొయ్యను ముద్దాడి ఆయన భావి భారత జాతీయోద్యమానికి స్ఫూర్తిగా, దిక్చూచిగా నిలిచారు. తిరుగుబాటులో ముఖ్య సంఘటనలు 1846 జూన్‌లో తనకు రావాల్సిన పెన్షన్ కోసం అనుచరులను కోయిలకుంట్ల ట్రెజరీకి పంపగా తహసీల్దార్ రాఘవాచార్యులు తిట్టి పంపడంతో పోరాటానికి తెర లేచింది. జూలై 7 లేదా 8 తేదీల్లో చాగలమర్రి తాలూకా రుద్రవరం గ్రా మాన్ని కొల్లగొట్టుకుపోతుండగా మిట్టపల్లె వద్ద పోలీసులతో పోరాటం జరిగింది. జూలై 10న కోయిలకుంట్ల ట్రెజరీపై రెడ్డి బృందం దాడి జరిపింది. జూలై 23న గిద్దలూరు వద్ద లెఫ్ట్‌నెంట్ వాట్సన్, 24న ముండ్లపాడు వద్ద కెపె్టన్ నాట్, కెప్టెన్ రసల్ నాయకత్వంలోని సైన్యంతో పోరాటం సాగింది. అక్టోబరు 6న పేరుసోముల కొండల్లో పట్టుబడ్డారు. 1847 ఫిబ్రవరి 22న సో మవారం ఉదయం 7 గంటలకు కోయిలకుంట్లలో 2000 మంది ప్రజలు చూస్తుండగా కడప కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో నరసింహారెడ్డిని ఉరి తీశారు. 1877 వరకు ఆయన తల ఉరి కంభానికి వేలాడుతూనే ఉంచారు. ‘సీమ’ రైతాంగ పోరాటం నరసింహారెడ్డి తన పెన్షన్ కోసం తిరుగుబాటు చేశారే తప్ప బ్రిటీషు పాలకులను వెళ్లగొట్టాలన్న లక్ష్యంతో కాదని ఇటీవల సోషల్ మీడియా వేదికల్లో కొందరు వాదించడంలో నిజం లేదని జిల్లాకు చెందిన చరిత్ర పరిశోధకుల అభిప్రాయం. పెన్షన్ కోసమే అయితే సుమారు 9 వేల మంది ప్రజలు తిరుగుబాటులో ఎందుకు పాలుపంచుకున్నారన్న ప్రశ్నకు విమర్శకుల వద్ద సమాధానం లేదు. కరువులు వచ్చి పంటలు పండకపోయినా భూమి శిస్తు వసూలు చేసేవారు. పైగా శిస్తుల భారం అధికంగా ఉండటంతో అనేక గ్రామాల్లో వేలాది ఎకరాల భూములను రైతులు బీళ్లుగా పెట్టాల్సి వచ్చింది. గ్రామ కట్టుబడి బంట్రోతులు అనుభవించుకుంటున్న మాన్యం భూముల వంశపారంపర్య హక్కులు ప్రభుత్వం రద్దు చేసింది. సంతతి లేకుండా మరణించిన కట్టుబడుల భూములను లాగేసుకున్నారు. గ్రామ విధులను సరిగా నిర్వర్తించలేదని కొందరి తవర్జీ తగ్గించారు. బంట్రోతులను బదిలీ చేయడం, గ్రామ పోలీసు వ్యవస్థ పునర్ నిర్మాణానికి ప్రయత్నించారు. ఇవన్నీ కట్టుబడులలో అలజడి కలిగించడంతో నరసింహారెడ్డి వెంట నడిచారు. ఈ కేసు విచారణ చేసిన స్పెషల్ కమిషనర్ ఇంగ్లిస్ స్వయంగా ఈ వివరాలను బోర్డు ఆఫ్ రెవెన్యూకు నివేదించారు. ఈ కారణాల రీత్యా దీన్ని రాయలసీమ రైతాంగం జరిపిన తొలి తిరుగుబాటుగా భావించాలని చరిత్రకారులు అంటున్నారు. నరసింహారెడ్డి అందరివాడు జాతీయ నాయకుల మాదిరే నరసింహారెడ్డిని కూడా ఒక సామాజిక వర్గానికి అంటగట్టి మాట్లాడే ధోరణి సరికాదని మేధావుల అభిప్రాయం. నరసింహారెడ్డి గురువుగా భావించే గోసాయి వెంకయ్య ప్రధాన అనుచరులైన కరణం అశ్వర్థామ, జంగం మల్లయ్య, వడ్డె ఓబన్నలతోపాటు చెంచులు, యానాదులు, బోయలు, వడ్డెరలు తిరుగుబాటులో ప్రధానంగా పాల్గొన్నారు. చివరకు బ్రాహ్మణులు సైతం పాల్గొన్నారంటే ఆ తిరుగుబాటుకు ఉన్న ప్రజా పునాది అర్థమవుతుందని మేధావులు స్పష్టం చేస్తున్నారు. చరిత్రకారుల చిన్నచూపు సిపాయిల, సన్యాసుల, మోప్లా, చిట్టగాంగ్, రంపా, చీరాల–పేరాల తిరుగుబాట్ల గురించి నాటి చరిత్రకారులు పేర్కొన్నారు. కానీ వాటి కంటే ఎన్నో ఏళ్ల ముందు స్వరూపంలో ఏమాత్రం తీసిపోని నరసింహారెడ్డి తిరుగుబాటు గురించి పట్టించుకోలేదని అంటున్నారు. 1955లో బెంగాలి చరిత్రకారుడు ఎస్బీ చౌదరి మాత్రమే తాను రాసిన ‘సివిల్ డిస్ట్రబెన్సెస్ డ్యూరింగ్ ద బ్రిటీషు రూల్ ఇన్ ఇండియా (1765–1857)’ అనే గ్రంథంలో నరసింహారెడ్డి తిరుగుబాటు గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఆంధ్ర చరిత్రకారులు కనీసం తిరుగుబాటుకు సంబంధించిన కాలక్రమణికను కూడా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. నేడు వర్ధంతి సభ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సభను బుధవారం ఉదయం కడప నగరంలోని రెడ్డి సేవా సమితి కార్యాలయంలో నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా హైసూ్కలు, జూనియర్ కళాశాల విద్యార్థులకు వక్తృత్వ పోటీలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. – లెక్కల కొండారెడ్డి, రెడ్డి సేవా సమితి, కడప నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం నరసింహారెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహించడం, కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఆయన పేరు పెట్టడం అభినందనీయం. భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన విగ్రహాన్ని కడపలో ఏర్పాటు చేయాలి. – కేశవులు నాయుడు, పాలెగార్ వంశీయులు, మాదినేనిపాలెం, గుర్రంకొండ -
తల్లి శ్రీదేవిని తలుచుకొని ఎమోషనల్ అయిన జాన్వీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్. ధడక్‌సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన ఆమె గుంజన్ సక్సెనా ది కార్గిల్ గాళ్ చిత్రంతో గుర్తింపు పొందింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ అలరిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీకపూర్ తాజాగా తల్లి శ్రీదేవిని తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్చేసింది. 'ఇప్పటికీ నీకోసం ప్రతిచోటా వెతుకున్నాను అమ్మా. నేను చేసే ప్రతి పని నిన్ను గర్వించేలా చేస్తున్నానని ఆశిస్తున్నాను. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ప్రతి పని నీతోనే మొదలవుతుంది, నీతోనే ముగుస్తుంది' అంటూ జాన్వీ తల్లితో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా అందాల తార శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి సుమారు ఐదు సంవత్సరాలు కావొస్తుంది. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయ్‌లో అనుమానాస్పదంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
నేడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మొదటి వర్ధంతి
-
మరువలేని నేత.. సదాస్మరామి.. మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రథమ వర్ధంతి
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లిలో నిర్వహించారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని గౌతమ్ రెడ్డికి నివాళులు అర్పించారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మికంగా మృతి చెంది ఏడాది అయినా ఇంకా జనం గుండెల్లో గూడుకట్టుకుని ఉన్నారు. మరువలేని నేతను.. మరోసారి స్మరించుకునేందుకు అభిమానులు వర్ధంతి కార్యక్రమానికి తరలివచ్చారు. ఇందుకుతగ్గట్టుగానే కుటుంబ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని పలువురు ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని మేకపాటి అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వర్ధంతి కార్యక్రమానికి హాజరై ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. -
అమెరికాలో ఘంటసాల వర్ధంతి.. నివాళులర్పించిన ప్రవాసులు
ఘంటసాల గాయకుడే కాదు మానవతా వాది, స్వాతంత్య్ర సమరయోథులని ఎన్ఆర్ఐలు కొనియాడారు. ఫిబ్రవరి 11న ఘంటసాల వర్ధంతి సందర్భంగా అమెరికాలో ఘంటసాల వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఘంటసాల సంగీత కళాశాల ఇంటర్నేషనల్ (GSKI) న్యూజెర్సీ ఆధ్వర్యంలో అన్నా మధుసూదనరావు అద్యక్షతన ఫిభ్రవరి 11న స్థానిక సంగం చెట్టినాడ్ రెష్టారెంట్లో ఈ కార్యక్రమం జరిగింది. సాయిదత్తపీఠం శివ విష్ను టెంపుల్ ఛైర్మన్ రఘుశర్మ శంకరమంచి వేదమంత్రాల ఉచ్ఛారణ తో జ్యోతి వెలిగించి ప్రార్థనాగీతాలతో సభను ప్రారంభించారు. అనంతరం రవి మరింగంటి, రాజ రాజేశ్వరి కలగా, కృష్ణ కీర్తి ,హర్ష శిష్టా, దీప్తి,లాస్య, శ్రీకన్, జీఎస్కే సభ్యులు భక్తిగీతాలాపనలతో ఘంటసాలపై తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. జీఎస్‌కేఐ న్యూ జెర్సీ అడ్వైజర్స్ రఘు శర్మ శంకరమంచి, న్యూజెర్సీ మాజీ అసెంబ్లీ సభ్యులు ఉపేంద్ర చివుకుల ప్రత్యేకంగా ఈ సభలో పాల్గొని సభికులకు తమ సంస్థ గురించి తెలియజేశారు. GSKI హ్యూస్టన్ సభ్యుడు రవి మరింగంటి ఆధ్వర్యంలో ఈ సభ విజయవంతంగా జరిగింది. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన తెలుగు భవనం శ్రీరాజ్ పసల, తెలంగాణ అసోసియేషన్ గ్రేటర్ హ్యూస్టన్ ఆధ్యక్షులు నారాయణ్ రెడ్డి, ఆశా జ్యోతి దేవకి, రాంబాబు కట్టా తదితరులు GSKI చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ఘంటసాల వర్ధంతిని శ్రద్దతో నిర్వహించడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ GSKI ప్రెసిడెంట్ అన్నా మధు, రవి మరింగంటి కృతఙ్ఞతలు తెలియజేశారు. ‘తెలుగు భాషకు వరం.. ఘంటసాల స్వరం’ అన్న నినాదంతో ముందుకు సాగుతూ.. తెలుగు భాషను ముందు తరాలకు పదిలంగా అందించడమే తమ లక్ష్యమని GSKI సభ్యులు తెలియజేశారు. -
మహాత్మునికి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ 75వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాన మంత్రి మోదీ సోమవారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని మహాత్ముని సమాధి రాజ్‌ఘాట్ వద్ద పుష్పగుచ్ఛాలుంచారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. గన్ సెల్యూట్ , సర్వమత ప్రార్థనలు, గాంధీకి ఇష్టమైన గేయాలాపన జరిగాయి. ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు నివాళులర్పించారు. ‘బాపుకు నా నివాళులు. దేశ సేవలో ప్రాణాలర్పించిన ఎందరో అమరుల త్యాగాలు దేశం కోసం పనిచేయాలనే సంకల్పాన్ని మరింత పెంచుతాయి’ అని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీతో కొరోసీ భేటీ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ (యూఎన్జీఏ) అధ్యక్షుడు సాబా కొరోసీ మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్‌తో భేటీ అయ్యారు. పలు అంతర్జాతీయ సవాళ్లపై చర్చలు జరిపారు. జల సంరక్షణ, నీటి వనరుల సమర్థ వినియోగం ఆవశ్యకత కూడా ప్రస్తావనకు వచ్చినట్లు అనంతరం మోదీ ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ సంక్షోభం, జీ20 ఎజెండాతోపాటు ఐరాస సంస్కరణలపై చర్చించినట్లు జై శంకర్ పేర్కొన్నారు. పలు అంశాలపై వారి అవగాహన, స్పందన అద్భుతమని కొరోసీ కొనియాడారు. భారత్‌తోపాటు పలు దేశాలు సీమాంతర ఉగ్రవాదంతో బాధ పడుతున్న విషయం తనకు తెలుసునన్నారు. -
మహాత్మా! చూస్తున్నావా!!
ఓ మహాత్మా! చెడు అనకు, వినకు, చూడకు అన్న పలుకులు నీవైతే నేటి సమాజానికవే ప్రీతిపాత్రం. అహింసాయోధుడవు నీవు, హింసా వీరులు నేటి నాయకగణం. సర్వమత ఐక్యత నీ పథం అనైక్యతే నేటి జనుల మార్గం. మద్యం వద్దని నీవు, అదే ముద్దని నేటి ప్రభుత. మహిళా సాధికారత నీ కల, మరి నేడో కలకంఠి కంట కన్నీరు చూడందే నిద్రపోని పాషండులెందరో! గ్రామ స్వరాజ్యం నీ ఊహాసుందరి, దాని అభావానికై నేటి పాలకుల శక్తివంచన లేని కృషి. నీవు చూపిన నాటి విరి బాట నేటి రాజకీయులకు ముళ్లబాట. సమానతే నీ ధ్యేయం, అసమానతే నేటి తరం లక్ష్యం. నిరాడంబరతే నీ భావనైతే ఆడంబరయుత పోకడలు నేటి యువత చిరునామా! నాటి నీ పాదయాత్ర ఏకతా రాగమైతే నేటి పాదయాత్రలు హింసాయుత మార్గాలు, శాంతి భద్రతల భగ్నానికి దగ్గర దారులు. బాపూ! నీ మార్గంలో నేటితరం పయనించేలా దీవించవా! – వేమూరి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం (నేడు మహాత్మా గాంధీ వర్ధంతి) -
ఆదివాసుల హృదయ దీపాలు
తూర్పు గోదావరి జిల్లా కొండ అడవుల్లో డాక్టర్ ఊర్మిల పింగ్లె తీసిన ఇక్కడ కనిపిస్తున్న ఫొటో... హైమండార్ఫ్ దంపతులు కలిసి ఉన్న దాదాపు తుది చిత్రం. పదవీ ఉద్యోగాలు లేకపోయినా మానవ శాస్త్రవేత్తగా తనతో యాభై ఏళ్లుగా వెన్నెముకలా ఉండి అలుపెరగకుండా కలిసి పని చేసిన బెట్టీ సాహచర్యం గురించి లోతుగా తలపోస్తున్నట్టు క్రిస్టోఫ్ హైమండార్ఫ్ కనిపిస్తున్నారు ఈ చిత్రంలో. ఆ తర్వాత కొద్ది రోజులకే హైదరాబాద్‌లో 11 జనవరి 1987 నాడు బెట్టీ అని అందరూ అభిమానంగా పిలిచిన ఎలిజబెత్ హైమండార్ఫ్ గుండెపోటుతో హఠాత్తుగా ప్రాణాలు విడిచారు. ఆమె మరణం క్రిస్టోఫ్ హైమండార్ఫ్‌ను బాగా కుంగదీసింది. ఆ తర్వాత ఎనిమిదేళ్లకే ఆయన కూడా తనువు చాలించారు. భారత్ ఈశాన్య ప్రాంతంలోని కొన్యక్ నాగాలు, ఆపతానీలు, హైదరాబాద్ నిజాం సంస్థానంలోని చెంచులు, కొండ రెడ్లు, రాజ గోండులు, ఇంకా నేపాల్ షేర్పాలు, మధ్య ప్రదేశ్ భిల్లులు.. ఈ జాతుల గురించి క్రిస్టోఫ్ వాన్ ఫ్యూరర్ హైమండార్ఫ్ చేసిన పరిశోధనలు ఇప్పటికీ ప్రామాణికంగా నిలుస్తున్నాయి. అయితే వీటన్నింటిలో ఆదిలాబాద్ రాజ్ గోండులతో ఆయన 1940ల్లో ఏర్పరచుకొని, జీవన పర్యంతం కొనసాగించిన బాంధవ్యానికి సాటి రాగలిగి నది ఏదీ లేదు. మార్లవాయి గ్రామంలో రాజ్ గోండుల మధ్య వారిలో ఒకరిగా ఒక గుడిసెలో జీవిస్తూ వారి సంప్రదాయాలు, పురాణాలను, వారి గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సాధికారికంగా నమోదు చేస్తూ, ఆదివాసీ జీవన దృక్పథ సార్వజనీనమైన విలువను గుర్తుండి పోయేలా ఆవిష్కరించగలిగారు. హైదరాబాద్ సంస్థానంలోని ఆదివాసీలను దాదాపు మూడు సంవత్సరాల పాటు అధ్యయనం చేసిన తరువాత 1945లో, ఆయన విశ్లేషణల నాణ్యతను చూసిన నిజాం ప్రభుత్వం ఆయనను గిరిజన తెగలు, వెనుకబడిన తరగతుల సలహాదారుగా నియమించింది. సంస్థానంలోని ఆదివాసీల అభ్యున్నతికి కీలకమైన నూతన ప్రణాళికల రూపకల్పన, వాటి అమలు బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఆ పదవిలో ఉంటూ కుమ్రం భీం తిరుగుబాటు, వీర మరణం తరువాత పూర్తిగా ధైర్యాన్ని కోల్పోయి, తీవ్రమైన నిరాదరణకు గురవుతున్న ఆదిలాబాద్ జిల్లా గోండుల కోసం తొలి పాఠశాలలు ఏర్పరిచి, భూములు లేని వేలాది ఆదివాసీ కుటుంబాలకు దాదాపు 160 వేల ఎకరాల భూమిని పట్టాలతో సహా అందించి వారి సమగ్ర పునరుజ్జీవనానికి గొప్ప పునాది వేయగలిగారు హైమండార్ఫ్. 1950లో లండన్‌కు వెళ్లి పోయిన తర్వాత కూడా తరచుగా ఆదిలాబాద్‌ను సందర్శిస్తూ గోండుల బాగోగుల గురించి తెలుసుకుంటూ ఉండేవారు హైమండార్ఫ్ దంపతులు. 1960ల తరువాత బయటి నుండి వచ్చిన చొరబాటుదారుల దురాక్రమణకు ఆదివాసీల భూములు గురికావడం, వారి పరిస్థితి మళ్లీ హీనం కావడం హైమండార్ఫ్ దంపతులను ఎంతో బాధించేది. తమను ఎంతో ఆదరించి, అభిమానించిన గోండుల సన్నిధిలో మార్లవాయి లోనే తమ సమాధులు ఉండాలని హైమండార్ఫ్ దంపతులు కోరుకున్నారు. బెట్టి మరణం తర్వాత, ఆమె అస్థికలను మార్లవాయికి తీసుకు వచ్చి, ప్రేమాభిమానాలతో తరలివచ్చిన వేలాది ఆదివాసీల సమక్షంలో మార్లవాయి గ్రామం పక్కనే ఖననం చేశారు. క్రిస్టోఫ్ అవశేషాలను కూడా ఆయన మరణించిన చాలా ఏళ్ళ తర్వాత బెట్టి సమాధి పక్కనే పూడ్చి మరో సమాధి నిర్మింపజేశారు. బెట్టి వర్ధంతినే హైమండార్ఫ్ దంపతుల ఉమ్మడి సంస్మరణ దినంగా ప్రతి ఏడాది మార్లవాయి గ్రామంలో 11 జనవరి నాడు నిర్వహిస్తూ వస్తున్నారు. గత కొన్నే ళ్లుగా ఇది పెద్ద కార్యక్రమంగా వికసిస్తూ వస్తున్నది. మార్లవాయి గ్రామ గుసాడి నృత్య కళాకారుడు కనక రాజుకు పద్మశ్రీ గౌరవం దక్కడం దీనికి తోడయ్యింది. తమ జాతి సంస్కృతిని అధ్యయనం చేసి, తమ అభ్యున్నతి కోసం పరితపించిన మానవ శాస్త్రవేత్త దంపతులకు ఆ జాతి నుంచి లభించిన ఇటువంటి ఆరాధనకు సాటిరాగల ఉదాహరణ మరెక్కడా లేదేమో! 1980వ దశకం నుండి చివరిదాకా హైమండార్ఫ్ దంపతులను బాగా ఎరిగిన, క్రిస్టోఫ్‌తో కలిసి రెండు పరిశోధన గ్రంథాలను కూడా రాసిన ఊర్మిళ పింగ్లె, బెట్టి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు: ‘తనను కలిసిన వారందరి పట్లా గొప్ప అనురాగం చూపుతూ... గొప్ప చమత్కారం, హాస్య దృష్టిలతో జీవ చైతన్యం ఉట్టిపడుతూ ఉండేది అమె. ఆదివాసీ సమాజాల పరిస్థితి పట్ల ఎనలేని సానుభూతితో వారి అభ్యున్నతి కోసం అంతటా వాదిస్తూ ఉండేది. తన భర్తకు నిజమైన ఆత్మబంధువుగా నిలిచిన వ్యక్తి!’ (క్లిక్ చేయండి: అజ్ఞానం కంటే అహంకారం ప్రమాదం) - సుమనస్పతి రెడ్డి ఆకాశవాణి విశ్రాంత అధికారి (జనవరి 11 హైమండార్ఫ్ దంపతుల సంస్మరణ దినం) -
Turlapati Kutumba Rao: ప్రెస్ – పిక్చర్ – ప్లాట్‌ఫాం!
కలంతో, గళంతో సాహిత్య–సాంస్కృతిక సాఫల్యం సాధించిన తెలుగు పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు. 4,000కు పైగా జీవిత చరిత్రలు, 16,000కు పైగా ప్రసంగాలు చేసి, ప్రపంచ రికార్డు సృష్టించిన తుర్లపాటి కీర్తికాయుడై నేటికి రెండు సంవత్సరాలు. ముక్కుసూటితనం, చొరవ మూర్తీభవించిన నిజాయితీతో తుర్లపాటి మొదటినుండీ ప్రత్యేకమైన, ప్రతిష్ఠాత్మకమైన సందర్భాలను సొంతం చేసు కున్నారు. స్వరాజ్యనిధికి 5 రూపాయలు ఇస్తేగానీ ఆటోగ్రాఫ్ ఇవ్వని మహాత్మాగాంధీ వద్ద నుండి ఉచితంగా ఆటోగ్రాఫ్ పొందారు. తన 19వ ఏటనే టంగుటూరి ప్రకాశం పంతులు వద్ద కార్యదర్శిగా చేరారు. నార్ల వెంకటేశ్వరరావుకు ఏకలవ్వ శిష్యునిగా తనను భావించుకునేవారు. పత్రికా రంగంలో ఆచార్య ఎన్జీ రంగా ప్రారంభించిన ‘వాహిని’తో మొదలై, ‘ప్రతిభ’ పత్రికకు మారి, తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు కోరిక మేరకు ‘ప్రజా పత్రిక’కు తన సేవలందించారు. తదనంతరం ‘ఆంధ్రజ్యోతి’, ‘జ్యోతి చిత్ర’ పత్రికలలో పనిచేస్తూ, అలా 70 సంవత్సరాలకుపైగా వివిధ స్థాయిలలో విలువైన సేవలందించిన అతి కొద్దిమంది పాత్రికేయులలో ప్రముఖమైన స్థానం సంపాయించారు. తెలుగు పత్రికా రంగంలో కళా ప్రపూర్ణ, పద్మశ్రీలను అందుకున్న ఏకైక వ్యక్తి తుర్లపాటి. ఆయనపై బీబీసీ వారు, జపాన్ మీడియా వారు తీసిన ప్రామాణికమైన డాక్యుమెంటరీలు ఆయన ప్రతిభను తేటతెల్లం చేశాయి. ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యునిగా సేవలందించారు. పలు సభలలో జాతీయ స్థాయి నాయకుల, ప్రభుత్వాధినేతల అన్య భాషా ప్రసం గాలకు దీటైన అనువాదకులుగా అందరినీ మెప్పించారు. దశాబ్దాల క్రితమే ఇప్పుడున్నంత సమాచార వ్యవస్థ లేని కాలంలోనే ‘వార్తలలోని వ్యక్తి’ అనే శీర్షికతో దాదాపు 50 సంవత్సరాల పాటు ప్రముఖుల జీవిత రేఖా చిత్రాలు అందించారు. ఆ వివరాలను ఎక్కడెక్కడి నుండి ఆయన సేకరించారో అనే ఆశ్చర్యం చదువరుల వంతయ్యేది. బహుశా 5 దశాబ్దాల పాటు పత్రికలలో కొనసాగిన అరుదైన ఘనత శీర్షికా రచయితగా తుర్లపాటిది. ఆయన ఇతర రచనలు క్లుప్తతనూ, సరళతనూ నింపుకున్న సమాచార సముద్రాలు. 18 మంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో ఆయనకు గాఢమైన సత్సంబంధాలు ఉండేవి. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తుర్లపాటి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన చేతుల మీదుగా సత్కారాలు పొందిన కళాకారులు అందరూ ‘గజా రోహణం – గండపెండేరాలు’ పొందినంత సంబరపడి పోయేవారు. ఆయన ద్వారా ‘నటసామ్రాట్’ అన్న బిరుదు పొందిన అక్కినేని కూడా, తాను పొందిన ఎన్నెన్నో బిరుదులన్నింటికన్నా ఆ బిరుదే అత్యంత ఇష్టమైనదని చెప్పేవారు. (క్లిక్ చేయండి: ఆయన జయంతి, వర్ధంతి.. ఒకేరోజు) ‘మనసున మల్లెల మాలలూగెనే – కన్నుల వెన్నెల డోలలూగెనే’ తుర్లపాటికి ప్రాణప్రదమైన పాట. ఎప్పుడూ ఆ పాటను ఎంతో ఆర్తితో పాడించుకునేవారు. తల్లి – బంధువులు మందలించినప్పటికీ, ప్రేమ వివాహం చేసుకున్న కృష్ణకుమారిని ‘ఏమండీ’ అని సంబోధించే అలవాటు, ఆయనకు మహిళల పట్ల ఉన్న నిజమైన గౌరవానికి సూచిక. ఆమె పట్ల ప్రేమ–గౌరవాలతో ఆయన స్థాపించిన సాంస్కృతిక సంస్థ ‘కృష్ణ కళాభారతి’. పలు సంస్థలవారు చేసే కార్యక్రమాలలో తమ సహ నిర్వహణ సంస్థగా ఈనాటికీ అభిమానంగా పేరు వేస్తూ తమ నివాళి అర్పిస్తున్నారు. తన 87 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో భార్య, కుమార్తెలను పోగొట్టుకున్నా, తనకి కేన్సర్ వ్యాధి వచ్చినా, స్థిత ప్రజ్ఞతతో, దృఢసంకల్పంతో కష్టాలను, అనారోగ్యాన్ని జయించిన విజేత తుర్లపాటి. – గోళ్ల నారాయణరావు, ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జి.ఆర్.కె.– పోలవరపు సాంస్కృతిక సమితి (జనవరి 11 తుర్లపాటి కుటుంబరావు వర్ధంతి) -
Pingali Lakshmikantham: ఆయన జయంతి, వర్ధంతి.. ఒకేరోజు
ఆధునికాంధ్ర సాహిత్యంలో సుప్రసిద్ధ కవి, ఆచార్యుడు, నటుడు, విమర్శకుడు, ఆకాశవాణి కార్యక్రమాల సలహాదారు ఆయన. అష్టదిగ్గజ కవుల్లో పింగళి సూరన వంశానికి చెందిన పింగళి లక్ష్మీకాంతం బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన 1894 జనవరి 10వ తేదీన కృష్ణాజిల్లా అర్తమూరులో జన్మించారు. పాఠశాల విద్య మచిలీపట్నం హిందూ ఉన్నత పాఠశాలలో అభ్యసించారు. అప్పుడు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి అక్కడ తెలుగు పండితుడుగా ఉన్నారు. పింగళి, విశ్వనాథ వంటి వారంతా చెళ్లపిళ్ల వారి శిష్యులే. బందర్ నోబుల్ హైస్కూల్లో తెలుగు పండితుడిగా పింగళి కొన్నాళ్లు పనిచేశారు. తర్వాత మద్రాస్ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో పరిశోధకుడిగా పనిచేశారు. 1931లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఏ ఆనర్స్ కోర్సు ప్రారంభించి పాఠ్య ప్రణాళికను రూపొందించారు. అన్ని విశ్వవిద్యాలయాలకు అదే ప్రామాణికమైన పాఠ్యప్రణాళిక. ఆయన ప్రియమిత్రుడు, సహాధ్యాయి కాటూరి వెంకటేశ్వరరావుతో కలసి తొలి రోజుల్లో శతావధానాలు చేశారు. ఇద్దరూ జంట కవులుగా రచించిన ‘సౌందర నందం’ కావ్యాన్ని తమ గురు వైన చెళ్లపిళ్ల వేంకట శాస్త్రికి అంకితం ఇచ్చారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆచార్యుడిగా 1961–65 మధ్య పని చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 18 సంవత్సరాలు పనిచేసి 1949లో పదవీ విర మణ చేశారు. ఆయన బోధనల నోట్సులు ఆంధ్ర సాహిత్య చరిత్ర, విమర్శకు ప్రామాణి కాలు. తర్వాత వాటిని ఆంధ్ర సాహిత్య చరిత్ర, సాహిత్య శిల్ప సమీక్షలుగా ఆయనే ప్రచురించారు. అవి ఎంతో ప్రసిద్ధి పొందాయి. ఆయన రూపొందించిన సంస్కృత ‘కుమార వ్యాకరణం’ ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పాఠ్య గ్రంథంగా ఉంది. ఆయన రేడియో ప్రసంగాలు, గౌతమ వ్యాసాలు విమ ర్శకు నిలువెత్తు నిదర్శనాలు. ఆయన రచించిన మధుర పండితరాజం, గంగాలహరి, తేజోలహరి ప్రసిద్ధి పొందాయి. ఆయన గౌతమ నిఘంటువు (ఇంగ్లీషు–తెలుగు) ప్రామాణికమైంది. పింగళి 1954 నుండి 1961వరకు విజయవాడ ఆకాశవాణి కేంద్రం సలహాదారుడిగా గొప్ప కార్యక్రమాలు రూపొందించారు. నటుడిగా పాండవోద్యగ విజయాల్లో ధర్మరాజుగా, ముద్రారాక్షసం నాటకంలో రాక్షస మంత్రిగా ప్రేక్షకుల మన్ననలు పొందారు. పింగళివారు 1972 జనవరి 10 తేదీన పరమదించారు. సాహితీ ప్రియుల హృదయాల్లో ఆయన చిరస్మర ణీయులు. – డాక్టర్ పీవీ సుబ్బారావు, సాహితీ విమర్శకులు (జనవరి 10 పింగళి లక్ష్మీకాంతం జయంతి, వర్ధంతి) -
గుడివాడతో అమరజీవి అనుబంధం
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు అంతిమ యాత్రకు నలుగురు మనుషులైనా లేని పరిస్థితుల్లో సాధుసుబ్రహ్మణ్యం గుడివాడకు చెందిన ఘంటసాలను పిలిచాడు. ఆయన వచ్చి శ్రీరాములు శవాన్ని చూసి ఆవేశంతో మద్రాసు వీధుల్లో ఎలుగెత్తి పాటందుకోగానే క్షణాల్లో వేలాది మంది పోగయ్యారు. సాక్షి, కృష్ణా: ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు ఉద్యుక్తుడై బయలుదేరి వెళ్లింది కృష్ణాజిల్లా గుడివాడ నుంచే. మద్రాసులో తెలుగువారికి అవమానాలు చూసి భరించలేక గుంటూరుకు చెందిన గాంధేయవాది స్వామి సీతారాం(ఈయన అసలు పేరు గొల్లపూడి సీతారామశాస్త్రి) గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే రాజాజీ దానిని భగ్నం చేశాడు. పైగా తెలుగువారు ఆరంభశూరులు అని హేళన చేశారు. ఈ విషయం తెలిసి అప్పుడు గుడివాడలో తన మిత్రుడు యెర్నేని సాధుసుబ్రహ్మణ్యం(ఈయన గుడివాడ సమీపంలోని కొమరవోలు గాంధీ ఆశ్రమ వ్యవస్థాపకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు) వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు వెంటనే సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి మద్రాసు చేరుకున్నారు. అక్కడ బులుసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. రాజాజీకి భయపడి కాంగ్రెస్ వారు ఎవరూ పొట్టి శ్రీరాములు దీక్షను పట్టించుకోలేదు. శ్రీరాములు వద్ద గుడివాడకు చెందిన సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఎవరూ లేరు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తనను ఎవరూ పట్టించుకోకపోవడం గురించి పొట్టి శ్రీరాములు తన ఆవేదన అంతా తన మిత్రులైన గుడివాడకు చెందిన సాధు సుబ్రహ్మణ్యం అల్లుడు ముసునూరి భాస్కరరావు, (ఈయన భార్య, సాధు సుబ్రహ్మణ్యం కుమార్తె ముసునూరి కస్తూరీదేవి 1967లో కాంగ్రెస్ పార్టీ తరఫున గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.) మరో స్వాతంత్య్ర సమరయోధుడు కూరాళ్ల భుజంగ భూషణరావులకు లేఖల్లో రాశారు. వారాల తరబడి ఆహారం లేకుండా పోవడంతో పేగులు పుండ్లు పడి పురుగులు నోటి వెంట, కళ్ల వెంట, చెవుల వెంట వచ్చేవి. జీర్ణ వ్యవస్థ తిరగబడి మలం నోటి వెంట వచ్చేది. ఎట్టకేలకు దీక్ష 58వ రోజు అంటే 1952 డిసెంబరు 15 రాత్రి 11.30 గంటల సమయంలో పొట్టి శ్రీరాములు ప్రాణం అనంత వాయువుల్లో కలసిపోయింది. శవం దగ్గర సాధు సుబ్రహ్మణ్యం ఒక్కడే ఉన్నాడు. కనీసం గుడివాడ వాళ్లనయినా నలుగురిని పోగేసుకువచ్చి ఎలాగోలా అంత్యక్రియలు ముగిద్దామనుకున్నాడు. మద్రాసులో ఉన్న గాయకుడు ఘంటసాలది గుడివాడ పక్కనే చౌటపల్లి కాబట్టి ఆయన వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. ఆ సమయంలో ఆయన పక్కన గుడివాడ సమీపంలోని మోపర్రుకు చెందిన హరికథకుడు మోపర్రు దాసు ఉన్నాడు. ఆయన నేను కూడా గుడివాడ వాడినే కదా నేనూ వస్తాను అని బయలుదేరాడు. ఇద్దరూ కలసి సాధుసుబ్రహ్మణ్యం ఇంటి వద్దకు వచ్చారు. అక్కడ తాటాకులు కప్పి ఉన్న శ్రీరాములు శవాన్ని చూసి వారికి వాంతులు అయ్యాయి. తెలుగు జాతి కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు శవయాత్ర ఎవరికీ తెలియకుండా చేయడం సమంజసం కాదని, తెలుగు వాళ్ల కళ్లు తెరిపించేలా ఈ శవయాత్ర సాగాలని ఘంటసాల తలచాడు. అప్పటికప్పుడు అశువుగా ‘చీము, నెత్తురు లేని తెలుగు జాతి కోసం అసువులు బాసిన ఓ అమరజీవి పొట్టి శ్రీరాములూ....’ అంటూ తన గంభీర స్వరంతో ఎలుగెత్తి పాడడం ప్రారంభించాడు. ఒక ఎద్దుల బండి మాట్లాడి అందులో శవాన్ని ఉంచి శవయాత్ర ప్రారంభించారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల ముందుగా శవయాత్ర వెళుతుండగా కాలేజీలో తెలుగు విద్యార్థులు ఘంటసాల గద్గద స్వరంతో, ఆవేశంతో పాడుతున్న పాట విని బయటకు వచ్చి శవయాత్ర వెంట నడవడం ప్రారంభించారు. ఈలోగా పొట్టి శ్రీరాములు మరణ వార్త తెలిసి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మెయిల్లో మద్రాసు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ స్టేషన్‌కు చేరింది. శ్రీరాములు శవాన్ని చూసిన ప్రకాశం పంతులుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తనదైన భాషలో తెలుగుజాతి చేతకానితనాన్ని చీల్చి చెండాడాడు. దాంతో కొద్ది సేపట్లోనే వేలాది మంది పోగయ్యారు. ఆ సందర్భంగా జరిగిన అల్లర్లలో 8 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. తత్ఫలితంగా 1953 అక్టోబరు ఒకటిన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది. -
Dwarkanath Kotnis: భారత, చైనా మైత్రికి స్ఫూర్తి
భారత – చైనా దేశాల మధ్య స్నేహానికి స్ఫూర్తి డాక్టర్ ద్వారాకానాథ్ శాంతారాం కోట్నిస్. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఈ కాలంలో ఆయన జీవితం నుండి స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది. డాక్టర్ కోట్నిస్ 1910 అక్టోబరు 10న మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. భారతదేశంలో స్వాతంత్య్ర పోరాటం ఉధృతం అవుతుండగా, జపాన్ ఫాసిస్టుల దురాక్రమణకు చైనా గురైనకాలం అది. ఈ సమయంలో చైనాకు చెందిన జనరల్ ఛూటే తమ సైనికులకు వైద్యసహాయం అందించటానికి డాక్టర్లను పంపమని జవహర్లాల్ నెహ్రూను కోరారు. ఆ మేరకు 1938లో చైనాకు పంపబడిన 5 మంది డాక్టర్ల బృందంలో 27 ఏళ్ల డాక్టర్ కోట్నిస్ ఒకరు. డాక్టర్ కోట్నిస్, ఆయన బృందం గాయపడిన చైనా సైనికులకు రోజుకు 800 మందికి వైద్యసహాయం అందించేవారు. బృందంలోని డాక్టర్లు తిరిగి ఇండియాకు వచ్చినా కోట్నిస్ అక్కడే ఉండి పోయారు. 1941లో చైనాలోని నార్మన్ బెతూన్ అంతర్జాతీయ శాంతి హాస్పిటల్‌కు ఆయన డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1941 డిసెంబరులో ఆయన అక్కడే యుద్ధ రంగంలో పనిచేస్తున్న ఒక చైనా నర్సును వివాహ మాడారు. వారికి కల్గిన కుమారునికి ‘ఇన్ హువా’ అని పేరు పెట్టారు. ఇన్ అంటే ఇండియా, హువా అంటే చైనా అని అర్థం. 1942లో ఆయన చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నారు. అవిశ్రాంతంగా పనిచేసిన కోట్నిస్‌కు అక్కడి అతిశీతల వాతావరణం వల్ల ఆరోగ్యం దెబ్బతింది. అందుకే తన కుమారుడు జన్మించిన కొద్ది నెలలకే 1942 డిసెంబరు 9న మూర్ఛవ్యాధితో మరణించారు. అప్పటికి ఆయన వయస్సు 32 సంవత్సరాలు మాత్రమే. ఆయన చనిపోయినపుడు ‘‘చైనా సైన్యం ఒక ఆపన్నహస్తాన్ని పోగొట్టుకుంది. చైనాదేశం ఒక స్నేహితుణ్ణి కోల్పోయింది. డాక్టర్ కోట్నిస్ అంతర్జాతీయ స్ఫూర్తిని మనం ఎల్లప్పుడూ మన మనస్సులలో పదిలపరచుకోవాలి’’ అని చైనా విప్లవ నాయకుడు కామ్రేడ్ మావో యువ డాక్టరుకు ఘనంగా నివాళులర్పించారు. చైనా కోట్నిస్ స్మృతికి గుర్తుగా చైనాలోని కొన్ని నగరాలలో వైద్యశాలలు, విగ్రహాలు, స్థూపాలు నిర్మించింది. చైనా నాయకులు ఇండియా పర్యటనకువచ్చినప్పుడల్లా డాక్టర్ కోట్నిస్ కుటుంబసభ్యులను తప్పనిసరిగా కలవటం ఒక ఆనవాయితీ. ప్రస్తుతం ఇరుదేశాల మధ్యగల సరిహద్దు తగాదాను సామరస్యంగాను, ఇచ్చిపుచ్చుకునే ధోరణితోను పరిష్కరించుకోవాలి. భారత, చైనా దేశాల మైత్రికి సంకేతంగానూ, అంతర్జాతీయ సౌభ్రాతృత్వానికి ప్రతీకగానూ నిలిచిన డాక్టర్ కోట్నిస్ ఉద్వేగభరిత జీవితం నుండి స్ఫూర్తిని పొంది భారత, చైనా మైత్రీ ఉద్యమాన్ని నిర్మించటం నేటి తక్షణ కర్తవ్యం. (క్లిక్ చేయండి: తెలుగు నేలపై చైతన్య యాత్ర) – సి. భాస్కర్, యూసీసీఆర్ఐ (ఎమ్ఎల్) (డాక్టర్ కోట్నిస్ 80వ వర్ధంతి సందర్భంగా) -
డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం జగన్ నివాళి
తాడేపల్లి: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. -
BR Ambedkar: తెలుగు నేలపై చైతన్య యాత్ర
నవభారత నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు తెలుగు నేలతో ఎంతో అనుబంధం ఉంది. పలు సందర్భాల్లో తెలుగు ప్రాంతాల్లో పర్యటించి ఇక్కడి ప్రజ లను చైతన్యపరిచారు. భారతదేశంలో అంబేడ్కర్ ఇష్టపడి, ఎన్నోసార్లు విడిది చేసిన అతికొద్ది నగరాల్లో హైదరాబాద్ ఒకటి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించారు. దేశానికి స్వాతంత్య్రంతో పాటు బహుజనులకు కూడా స్వాతంత్య్రం కావాలని కాంక్షిస్తూ పలు చైతన్యయాత్రలు ఆంధ్రలో చేశారు. అటువంటి పర్యటనల్లో 1944 సెప్టెంబరు 27వ తేదీ నుంచి అక్టోబరు 4వ తేదీ వరకూ జరిపిన పర్యటన చారి త్రాత్మకమైనది. అది రెండో ప్రపంచ యుద్ధ సమయం. అందుకే యుద్ధమనేది బ్రిటిష్ వారి సొంత వ్యవహారమనీ, యుద్ధం మన లక్ష్యం కాదనీ, సామాజిక స్వాతంత్య్రం మన గమ్యమంటూ తన ప్రసంగాల ద్వారా ఇక్కడి ప్రజలను చైతన్యపరిచారు. విజయవాడ మొదలు కొని విశాఖపట్నం వరకూ పర్యటించారు. తొలుత బెజవాడ రైల్వేస్టేషన్ లోనూ, గుడివాడ మొయిన్ రోడ్‌లోనూ ప్రజలనుద్దేశించి ఉపన్యసించారు. బాలికల వసతి గృహానికి గుడివాడలో శంకు స్థాపన చేశారు. అనంతరం ఏలూరు సందర్శించారు. అక్కడ మున్సిపల్ కార్యాలయంలో అంబేడ్కర్‌ను అభిమానులు, పురపాలక సభ్యులు ఘన సన్మానం చేశారు. కొవ్వూరులో ఎస్సీ కాలనీని సందర్శించి. షెడ్యూలు కాస్ట్ ఫెడరేషన్ ఫ్లాగ్‌ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. అందుకే ‘జెండా పేట’గా ఆ కాలనీకి నామకరణం చేసుకున్నారు ప్రజలు. అనంతరం, తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, పాలకొల్లు, రామచంద్రాపురం వెళ్లారు. రాజమండ్రి వచ్చిన సందర్భంగా అక్కడి టౌన్ హాల్లో ఘనంగా పౌర సన్మానం జరి గింది. కాకినాడ పర్యటన అనంతరం పిఠాపురం వచ్చి ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శిం చారు. అక్కడి రాజా కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. తుని రైల్వేస్టేషన్ వద్ద ప్రసంగించిన అనం తరం అనకాపల్లి చేరుకోగా భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు అంబేడ్కర్‌కు అక్కడి రైల్వేస్టేషన్ వద్ద స్వాగతం పలికారు. అక్కడి మున్సిపల్ స్కూల్లో జరిగిన సభలో ప్రసంగించిన అనంతరం, పట్టణ ప్రజలు, వైశ్య సంఘం అంబేడ్కర్‌కు ఘన సత్కారం చేశాయి. ఆనాటి అంబేడ్కర్ పర్యటనకు గుర్తుగా ఈ ప్రాంతం ‘భీముని గుమ్మం’ అని ప్రాచుర్యం పొందింది. అక్కడి ప్రభుత్వ పాఠశాలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును పెట్టి ఈ ప్రాంతీయులు నివాళి అర్పించారు. పర్యటన చివరలో విశాఖ సిటీకి వచ్చి పోర్టులో కార్మికులను కలిశారు. తర్వాత కలెక్టరేట్ వద్ద జరిగిన సభలో మాట్లాడారు. అంబేడ్కర్ ఆంధ్రలో పర్యటించినపుడు ఆయన ప్రసంగాలను నందనారు హరి, రావురి ఏకాంబరం, కుసుమ వెంకటరామయ్య, పాము రామమూర్తి, జొన్నల మోహనరావు తదితరులు పలుచోట్ల తెలుగులోకి అనువదించేవారు. మొత్తం మీద అంబేడ్కర్ పర్యటన తెలుగు నేలను చైతన్యపరచింది. (క్లిక్ చేయండి: సామాజిక బందీల విముక్తి ప్రదాత!) - డాక్టర్ జి. లీలావరప్రసాదరావు అసిస్టెంట్ ఫ్రొఫెసర్, బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళం -
Konijeti Rosaiah: మాటల తూటాల అజాత శత్రువు
అరుదైన రాజకీయ నాయకుడు కొణిజేటి రోశయ్య. ఆయన వాగ్ధాటికి అసెంబ్లీ సమావేశాలు దద్దరిల్లేవి. గొప్ప హాస్య చతురతతో పాటూ ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన శైలి. ప్రభుత్వ శాఖలన్నింటిపైనా అపారమైన పట్టు, అవగాహన ఆయనకున్నాయి. వివాదాలకు దూరంగా ఉంటూ, మంచి సలహాదారుగా కూడా వ్యవహరించేవారు. రాజనీతిలో అపర చాణక్యుడు. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన చిరునామా. మాటల మాంత్రికుడిగా వినుతికెక్కారు. తన ప్రసంగంతో ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధుల్ని చేయడమే కాదు, మాటల తూటాలు కూడా పేల్చేవారు. చట్టసభ లోపల, బయట కూడా ఒంటిచేత్తో ప్రతిపక్షాల్ని మాట తూలకుండా ఆటలాడుకునేవారు. కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. రోశయ్య ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, కర్షక నాయకుడు ఎన్జీ రంగా శిష్యులు. నిడుబ్రోలులోని రామానీడు రైతాంగ విద్యాలయంలో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు. ఆయన భారత జాతీయ కాంగ్రెసు పార్టీ తరఫున 1968, 1974, 1980లలో శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు; 1991లో నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు; 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2004, 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్థిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరు పొందారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరు పొందారు. గ్రూపు రాజకీయాలకు దూరంగా, చాలా కాంగ్రెస్ కేబినెట్లలో కీలక మంత్రిగా పని చేయడం సామాన్య విషయం కాదు. తనకు అప్పగించిన ఏ బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహించారు. 1995–97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2007లో ఆంధ్ర విశ్వవిద్యాలయం రోశయ్యకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. ప్రతిపక్షంలో ఉంటే నెగటివ్ పాలిటిక్స్ చెయ్యచ్చు. అదే ప్రభుత్వంలో ఉంటే, నిర్మాణాత్మకమైన పాత్రతో పాజిటివ్ పాలిటిక్స్ నడపచ్చు అనేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పధ్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకున్న తరువాత ఆరోగ్యం సహకరించినప్పుడల్లా సాహితీ, సాంస్కృతిక కార్యాక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై అలరింపజేసేవారు. 2018 ఫిబ్రవరి 11న ఆదివారం నాడు టి. సుబ్బిరామిరెడ్డి లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో కొణిజేటి రోశయ్యను గజ మాలతో సత్కరించి జీవన సాఫల్య పురస్కారం అందించారు. ఆంధ్ర ఉద్యమంతో తన రాజకీయ జీవితం ప్రారంభమైందని రోశయ్య అనేవారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందించిన సహకారంతోనే చట్టసభల్లో తగిన గుర్తింపు లభించిందని విన మ్రంగా చెప్పేవారు. తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసు కుంటూ.. తనకు అప్పగించిన విధిని సక్రమంగా నిర్వహించానని తాను పాల్గొనే కార్యక్రమాలలో ఆత్మ సంతృప్తితో చెప్పేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘ కాలంపాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఘనత రోశయ్యదే. కొణిజేటి రోశయ్య అనారోగ్యంతో బాధపడుతూ 2021 డిసెంబర్ 4న హైదరాబాదులో కన్నుమూశారు. ప్రజాజీవితంలో ఆయన ఒక మహోన్నత నేత. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడంలో ఓ రుషి మాదిరి సేవలందించారు. (క్లిక్ చేయండి: వివక్ష ఉందంటే ఉలుకెందుకు?) - తిరుమలగిరి సురేందర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ (డిసెంబర్ 4న కె. రోశయ్య ప్రథమ వర్ధంతి) -
Bhimbor Deori: భీంబర్ డియోరీ.. ఎవరో తెలుసా?
భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సంరంభంలో ఉన్న మనం ఈశాన్య భారత్‌కు చెందిన భీంబర్ డియోరీని గుర్తుచేసుకోవాలి. ఈయన అసోంను తూర్పు పాకిస్తాన్లో విలీనం చేసే ప్రయత్నాలను విఫలం చేసిన జన నాయకుడు. అలాగే స్వదేశీ వర్గాలను ఉద్ధరించడంలో, అసోం ప్రయోజనాలను పరిరక్షించడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి ఫలితంగా అసోం విధాన సభలో గిరిజనుల కొరకు 5 స్థానాలు రిజర్వు చేయబడ్డాయి. స్వాతంత్య్రేచ్ఛ ఆయన రక్తంలోనే ఉంది. ప్రత్యేక మాతృభూమి కోసం 1945 మార్చి 21– 23 మధ్య ‘ఖాసీ దర్బార్ హాల్ తీర్మానాలు’ చేశారు. ఈ తీర్మానాలతో వివిధ గిరిజన తెగలకు చెందిన స్థానిక నాయకులు తమ స్వతంత్ర మాతృభూమిని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నారు. ఆయన 1903 మే 16న అసోంలోని శివసాగర్ జిల్లాలోని వనిదిహింగ్ గ్రామంలో గోదారం డియోరీ, బజోతి డియోరీ దంపతులకు జన్మించారు. సాధారణ గిరిజన యువకుడైన భీంబర్ అసోం సివిల్ పరీక్షలో ప్రథమ స్థానం సంపాదించారు. కానీ ఈయన గిరిజనుడైనందున బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది. పట్టుదలతో ఆయన డిబ్రుగర్లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1933లో ‘అసోం బ్యాక్వర్డ్ ప్లెయిన్స్ ట్రైబల్ లీగ్’ని స్థాపించి దాని వ్యవస్థాపక జనరల్ సెక్రటరీగా పని చేశారు. 1941 జూన్ 18న వివిధ విద్యా సంస్థలకు చెందిన వసతి గృహాలలో చదువుకుంటున్న గిరిజన విద్యార్థులను జనరల్ డైనింగ్ హాల్లోకి అనుమతించమని పోరాడారు. 1946 జూలై 8న అసోం ప్రభుత్వంలో అటవీ, కార్మిక శాఖ మంత్రిగా నియమితులైనారు. అసోం ప్రజల హృదయాల్లో భీంబర్ డియోరీ ఆదివాసీల నాయకుడిగానేగాక, ఆదర్శ జననేతగా నిలిచి 1947 నవంబర్ 30న తనువు చాలించారు. – గుమ్మడి లక్ష్మీ నారాయణ ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి (నవంబర్ 30న భీంబర్ డియోరీ 75వ వర్ధంతి) -
జ్యోతిరావు పూలేకు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి, ఎంపీ మార్గాని భరత్ రామ్ పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహానికి మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్ నివాళులర్పించారు. చదవండి: 4న విశాఖకు రాష్ట్రపతి రాక -
పాటల తూటాల యోధుడు
పాట పోరాట రూపం. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లేది పాటే. అలాంటి పాటల ప్రవాహానికి బలాన్నీ, బలగాన్నీ సమకూర్చిన వాగ్గేయకారుడు సుద్దాల హనుమంతు. ‘బాంచెన్ దొర కాలు మొక్కుతా’ అన్న వారితో బందూకులను పట్టించిన పాటలు ఆయనవి. హరికథ, బుర్రకథ, యక్షగానాలతో బూజు పట్టిన నిజాం నిరంకుశ పాలకుల కోట గోడలను కూల్చివేసిన జనగీతం ఆయన. 1910లో నేటి యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో లక్ష్మీ నరసమ్మ, బుచ్చి రాములు దంపతులకు జన్మించారు. 14 ఏళ్ల వయసులోనే ఆయన పాటలు తెలంగాణలోని ప్రతి గడపగడపను తట్టి లేపాయి. హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖలో చిన్న ఉద్యోగం చేస్తూ ప్రజోద్యమాలకు ఊతం ఇచ్చేవారు. ఇది గమనించిన ప్రభుత్వాధికారులు ఆయన్ని ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు హెచ్చరించారు. దీంతో హనుమంతు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పాటలతో నిజాం రాక్షస పాలనపై రణభేరి మోగించాడు. 1944లో 11వ ఆంధ్ర మహాసభ సమావేశాలు భువనగిరిలో జరిగాయి. హనుమంతు వాలంటీర్‌గా పని చేశారు. ఆ సమావేశాల్లో నాయకుల ప్రసంగాలను విని హనుమంతు పోరాట మార్గాన్ని ఎంచుకుని తన కలానికి గలానికి మరింత పదును పెట్టాడు. ఆంధ్ర మహాసభ ఇచ్చిన పిలుపునందుకుని ప్రతి గ్రామంలో సంఘం పెట్టడానికి ప్రజలను చైతన్యవంతం చేశాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా 1946–51 మధ్య జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో హనుమంతు కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక దళానికి నాయకత్వం వహించారు. ‘వెట్టిచాకిరి విధానమో రైతన్న /ఎంత జెప్పిన తీరదో కూలన్న’ అంటూ దుర్మార్గమైన వ్యవస్థను సుద్దాల హనుమంతు తన పాటల్లో వర్ణించాడు. ‘పల్లెటూరి పిల్లగాడ!/ పసులగాసే మొనగాడా!/పాలు మరిసి ఎన్నాళ్ళయిందో’ అంటూ వెట్టి చాకిరీతో నలిగిపోతున్న తెలంగాణ బాల్యాన్ని హనుమంతు ప్రపంచానికి పరిచయం చేశాడు. ‘సంఘం వచ్చిందరో రైతన్న మనకు బలం తెచ్చిందిరో కూలన్న‘ అంటూ ఆయన పాడుతూ ఉంటే ప్రజలకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేది. ఏయే దొర కబంధ హస్తాల్లో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో వివరాలను సేకరించి... దొరల భూ అక్రమాలను పల్లె సుద్దుల రూపంలో చెబుతూ ప్రజలను చైతన్యపరిచారు. ఆయన పాటలు తెలంగాణ జనం నాలికల మీద నాట్యం చేసేవి. నాటి తెలంగాణ పోరాటంలో హనుమంతు రాసిన పాటలు పాడని గ్రామం లేదు. ఆయన ప్రజల భాషలో యాసలో, శైలిలో ప్రజాపయోగమైన ఎన్నో పాటలు రాసి, పాడి పలు ప్రదర్శనలు ఇచ్చారు. హనుమంతు బుర్రకథ చెబితే గడ్డిపోచ కూడా యుద్ధానికి సిద్ధమవుతుందనీ, ఫిరంగిలా పేలుతుందనేంతగా ఆనాటి ప్రజల అభిప్రాయం. రాజంపేట మండలం రేణిగుంటలో కమ్యూనిస్టు గ్రామసభలో ‘మాభూమి’ నాటకం గొల్ల సుద్దుల ప్రదర్శనలు చేస్తున్న సమయంలో నిజాం మూకలు వస్తున్నాయని తెలిసి చెట్టుకొక్కరు పుట్టకొకరుగా జనం పారిపోతున్న క్రమంలో... ఓ ముసలావిడ కర్రను హనుమంతు తీసుకొని భూమిపై కర్రతో కొడుతూ ‘వేయ్ వేయ్ దెబ్బకు దెబ్బ’ అంటూ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపి నిజాం సైన్యాన్ని ఊరి పొలిమేర వరకు తరిమికొట్టారు. ఈ ఘటన తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక ఘట్టం. 1982 అక్టోబర్ 10న క్యాన్సర్ వ్యాధి కారణంగా తన జీవన ప్రస్థానాన్ని ముగించిన హనుమంతు చరిత్రను జాగ్రత్తగా భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. – అంకం నరేష్ యూఎఫ్ఆర్టీఐ తెలంగాణ కో–కన్వీనర్ -
K.Balagopal: మానవ హక్కుల వకీలు
అసాధారణ మేధస్సు, నిరంతర అధ్యయనం, విస్తృత విషయ పరిజ్ఞానం, వాగ్ధాటి, రచనా కౌశలం, ఆత్మీయత, ఆచరణశీలత, నిబద్ధత, నిమగ్నత, కార్యదీక్ష, అంకితభావం, మానవీయతా సుగుణం వంటి లక్షణాలన్నింటినీ తనలో మూర్తీభవింపజేసుకున్న అపురూప మేధావి బాలగోపాల్. కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా తలెత్తిన హక్కుల ఉల్లంఘనలపై ఆయన ఉద్యమించారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హక్కుల ఉద్యమాలకు ఆయన దశ–దిశని నిర్దేశించి వెన్నుదన్నుగా నిలిచారు. బాలగోపాల్ మధ్య తరగతి పండిత కుటుంబంలో 1952, జూన్ 10 నాడు నాగమణి, పార్థనాథశర్మ దంపతులకు జన్మించారు. అయినా ఆయన నిరంతరం పేద, దళిత, గిరిజన, మైనారిటీ, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. ఆయన గణితశాస్త్ర విద్యార్థి అయినా... చరిత్ర, తత్వశాస్త్రం, అర్థశాస్త్రాలను విస్తృతంగా అధ్యయనం చేసి సమాజ పోకడలను సునిశితంగా పరిశీలించారు. రాజ్యాంగంలో హక్కుల అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నా నిరంకుశ ప్రభుత్వాల అణచివేత విధానాల వల్ల పౌరులు ఆయా హక్కులు పొందలేకపోవడాన్ని చూసి చలించిపోయారు. బాలగోపాల్ వరంగల్‌లోని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎమ్మెస్సీ అప్లైడ్ మాథ్స్ని అభ్యసించి అక్కడే డాక్టరేట్ చేస్తున్న క్రమంలో రాడికల్ విద్యార్థి సంఘం కార్యకలాపాలను చూస్తూ వాటికి ప్రభావితులయ్యారు. కమ్యూనిస్టులు వాస్తవాన్ని అతిశయం చేసి చెప్తారని మొదట్లో నమ్మిన బాలగోపాల్... కమ్యూనిస్టులు తమ విశ్వాసాల కోసం ప్రాణాలు పణంగా పెట్టడాన్ని గమనించి ముఖ్యంగా విప్లవ కమ్యూనిస్టుల పట్ల తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నారు. రాడికల్ విద్యార్థి సంఘం నాయకులు సూరపనేని జనార్ధన్ ఎన్కౌంటర్, జన్ను చిన్నాలు హత్యా సంఘటనల తర్వాత ప్రజల కోసం ఒక క్రియాశీల కార్యకర్తగా పనిచేయాలని బాలగోపాల్ బలంగా నిర్ణయించుకొని 1981లో ‘ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం’లో చేరారు. వరంగల్ రాజకీయ పరిస్థితులు లెక్కల మేధావిగా ఉన్న బాలగోపాల్‌ని హక్కుల కార్యకర్తగా తీర్చిదిద్దాయి. 1983లో ఖమ్మంలో జరిగిన పౌర హక్కుల సంఘం రాష్ట్ర రెండవ మహాసభలో ఆయన ఆ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో తాను చేస్తున్న గణితశాస్త్ర అధ్యాపక ఉద్యోగం ఉద్యమాలకు అడ్డు రావడంతో ఆ ఉద్యోగాన్ని సైతం తృణీకరించి పూర్తికాలపు హక్కుల కార్యకర్తగా మారారు. బాలగోపాల్ పౌర హక్కుల సంఘంలో గుణాత్మక మార్పులు తీసుకువచ్చి హక్కుల ఉద్యమంలో నూతన ఒరవడితో ఉద్యమించారు. కానీ కాల క్రమంలో తానే తీర్చిదిద్దిన పౌర హక్కుల సంఘం నుండి ఆయన వైదొలిగి 1998, అక్టోబర్ 11 నాడు ‘మానవ హక్కుల వేదిక’ను స్థాపించారు. బాలగోపాల్ పౌర హక్కుల సంఘంలో పనిచేస్తున్న సమయంలో బెంగళూర్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న వివేకానంద న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ డిగ్రీని అభ్యసించారు. 1997లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా తన పేరుని నమోదు చేయించుకున్నారు. ఆయన న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించక పూర్వమే చట్టాలు, న్యాయశాస్త్రంలో ఉన్న ఆనుపానులు, తర్కాన్ని సమగ్రంగా అవగాహన చేసుకోవడం వల్ల... పెద్దగా సీనియర్ న్యాయవాదుల అవసరం రాలేదు. కాని చట్టం పని విధానంలో ముందుకు వెళ్తున్నప్పుడు ప్రొసీజర్ విధానంలో ఆయన సీనియర్ న్యాయవాది కేజీ కన్నాభిరాన్ దగ్గర సలహాలు తీసుకొని ఆ ప్రకారం ముందుకు సాగారు. బాలగోపాల్ ప్రధానంగా హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులలో బాధితుల పక్షం నిలబడి చట్ట ఫలితాలను వారికి అందించారు. దళితులు, గిరిజనులు, కార్మికులు, ఉద్యోగులు, భూవివాదాలకు సంబంధించిన అన్ని కేసులను ఆయన వాదించారు. అలాగే లేబర్ కోర్ట్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటిటివ్ ట్రిబ్యునల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటిటివ్ ట్రిబ్యునల్, లేబర్ కమిషన్ ఆఫీసుల కేసులను కూడా ఆయన వాదించారు. నక్సలైట్లకు సంబంధించి అనేక హెబియస్ కార్పస్ పిటిషన్లను వేసి సబంధిత వ్యక్తులను కోర్టులకు హాజరుపరిచేలా నిరంతర కృషి చేశారు. చుండూరు హత్యాకాండ కేసులో బాలగోపాల్ బాధిత దళితులకు అండగా నిలబడి హైకోర్టులో అత్యున్నత వాదనలు వినిపించి దళిత హక్కులకు బాసటగా నడిచారు. అదేవిధంగా ‘షెడ్యూల్డ్ ట్రైబల్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్’ని అమలు చేయడం కోసం గిరిజనులు చేసిన పోరాటానికి ఆయన బాసటగా నిలిచారు. కోర్టులో ఆ చట్టాన్ని గెలిపించడంలో అసామాన్యమైన కృషి చేశారు. ఈ చట్టం ద్వారా గిరిజనులకు 2009లో భూములు పంచబడ్డాయి. బాలగోపాల్ చేపట్టిన ముఖ్యమైన కేసులలో అత్యంత ముఖ్యమైన కేసు ఎన్కౌంటర్ల కేసు. ‘పోలీసులకు ప్రాణం తీసే హక్కు లేదనీ, పోలీసులు ఎన్కౌంటర్ల నుండి తప్పించుకోవడానికి వీలు లేదనీ, పోలీసులపై కూడా హత్యాచారం కింద కేసులు పెట్టవచ్చ’నీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఆయన బలమైన వాదనలు వినిపించి ‘పోలీసులపై కూడా న్యాయ విచారణని జరిపించాలి’ అనే తీర్పుని తీసుకురాగలిగారు. ఆ తీర్పు రావడం వెనకాల బాలగోపాల్ 30 ఏళ్ల నిర్విరామ కృషి ఉంది. అనేక హక్కుల సంఘాలు మిళితమైన ఈ కేసులో బాలగోపాల్‌తో పాటు కేజీ కన్నాభిరాన్, బొజ్జా తారకం తదితరులు తమ వాదనలు వినిపించారు. (క్లిక్ చేయండి: వికేంద్రీకరణతోనే సమన్యాయం) హక్కుల నిరాదరణకు గురైనప్పుడు ప్రజలు చైతన్యంతో గొంతెత్తి ప్రశ్నిస్తే హక్కులు అమలు కాబడుతాయని బాలగోపాల్ విశ్వసించారు. ప్రజా హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న ఆయన 2009, అక్టోబర్ 8 నాడు తుది శ్వాస విడిచినా ‘చెరగని హక్కుల స్ఫూర్తి’గా వెలుగొందుతున్నారు. (క్లిక్ చేయండి: మంచి అడుగే... మార్పులు అవసరం) - జె.జె.సి.పి. బాబూరావు పరిశోధక విద్యార్థి (అక్టోబర్ 8న కె.బాలగోపాల్ వర్ధంతి) -
Mandali Venkata Krishna Rao: దివిసీమ గాంధీ
మండలి వెంకట కృష్ణారావు అవనిగడ్డ నుంచి 1972లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు, గాంధేయవాది. రాజకీయ విలువల్లో, భాషా భిమానంలో ఆయనకు వారసులు – మాజీ రాష్ట్రమంత్రి మండలి బుద్ధప్రసాద్. కృష్ణారావు 1926 ఆగస్టు 4న కైకలూరు మండలం పల్లెవాడలో జన్మించారు. వీరి స్వస్థలం నాగాయలంక మండలంలోని భావదేవరపల్లి. మండలి కృషి వల్లే దివిసీమలోని నిరుపేదలకు బంజరు భూము లను పంచే కార్యక్రమం ప్రారంభమైంది. 15 వేల ఎకరాల భూములను పేదలకు పంచారు. 1974లో ఆయన విద్యా, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1975 రాక్షస నామ సంవత్సర ఉగాది నాడు ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్వహణ కమిటీకి మండలి కార్యనిర్వాహక అధ్యక్షునిగా వ్యవహరించారు. ‘అంతర్జాతీయ తెలుగు కేంద్రం’ సంస్థను 1975లో నాటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ ప్రారంభించారు. మండలి ఈ సంస్థకు ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించారు. (చదవండి: ప్రగతిశీల వైద్య శిఖామణి) ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల కార్యనిర్వాహక అధ్యక్షులుగా, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించిన మండలి కృషిని గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ తెలుగు కేంద్రం పేరును ‘మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం’గా మార్చారు. దివిసీమలోని పులిగడ్డ – పెనుమూడి వంతెనకు మండలి పేరు పెట్టారు. ‘దివిసీమ గాంధీ’గా ప్రజల మన్ననలు అందుకున్న మండలి 1997 సెప్టెంబర్ 27న మరణించారు. ‘బాధలలో ఉన్న వారిని మనమే వెళ్లి ఓదార్చాలని’ వారు ఆచరించి చెప్పిన మాటలు దివిసీమ ప్రజలకు భగవద్గీతలా వినిపిస్తూనే ఉంటాయి. (చదవండి: మనువును జయించిన విశ్వనరుడు) – డా. జె. వి. ప్రమోద్ కుమార్, పైడిమెట్ట (సెప్టెంబర్ 27న మండలి వెంకట కృష్ణారావు 25వ వర్ధంతి) -
Cartoonist Mohan: బొమ్మలు చెక్కిన శిల్పం
బొమ్మలు కూడా మాట్లాడతాయి. మాట్లాడ్డమే కాదు జనం తరఫున పోట్లాడతాయి. కత్తులు దూస్తూ ముందుకు ఉరుకుతాయి. కదం తొక్కుతూ పరుగులు తీస్తాయి. రాజుగారి దురహంకారాన్ని ఎడంకాలితో తన్ని పారేస్తాయి. అయితే అన్ని బొమ్మలూ అలా చేయవు. బొమ్మకు ప్రాణం పోసే చేయిని బట్టి, ఆ చేతిని కదిపే కళాకారుడి మనసును బట్టి, ఆ మనసులో రెపరెపలాడే ఎర్ర జెండా పొగరును బట్టి బొమ్మలు కాలర్లు ఎగరేస్తాయి. అలాంటి బొమ్మల తాలూకు ఓనర్లలో ముఖ్యులు ఆర్టిస్ట్ మోహన్. తాడి మోహన్ రావు అంటే ఎవ్వరికీ తెలీకపోవచ్చు. కానీ కార్టూనిస్ట్ మోహన్ అంటే మాత్రం తెలీని వాళ్లు ఉండరు. మోహన్ అంటే సకల కళా వల్లభుడు. కార్టూన్లు, ఇలస్ట్రేషన్లు, కేరికేచర్లు, కవర్ పేజీ బొమ్మలు, ఉద్యమాలకు కదం తొక్కండర్రా అని కుర్రకారు గుండెల్లో పౌరుషాగ్ని రగిలించే పోస్టర్లు, రాజ్యాధి కారపు దురహంకారాన్ని కాలరు పట్టు కుని నిలదీసి తిరుగుబాటు చేసే జెండా లపై బొమ్మలు, బిగించిన పిడికిళ్లు, కస్సుమని దూసుకుపోయే కొడవళ్లు, యుద్ధభూమికి కదం తొక్కించే లాంగ్ మార్చ్ కాన్వాస్‌లు! మోహన్ అంటే యుద్ధం. అధర్మంపై అన్యాయంపై చిరు నవ్వుతోనే కత్తులు దూసే యుద్ధమే మోహన్! ఎక్కడో ఏలూరులో పుట్టి, అక్కడెక్కడో పశ్చిమబెంగాల్లో జ్ఞానానికి సానపట్టి, విజయవాడ ‘విశాలాంధ్ర’ మీదుగా హైదరాబాద్‌కు తరలి అదే రాజధానిగా కళాకారుల సామ్రా జ్యాన్ని స్థాపించాడు మోహన్. తెలుగునాట పొలిటికల్ కార్టూన్ అంటే ఇలా ఉండాలిరా నాయనా అన్నట్లు వందల వేల కార్టూన్లతో రాజకీయ నేతల గుండెల్లో అణుబాంబులు పేల్చిన ఉగ్రవాది మోహన్. ఎంత పెద్ద నాయకుడైనా సరే భయం లేదు. ఎంత దుర్మార్గపు నాయకుడైనా సరే ఖాతరే లేదు. తిట్టాలనుకుంటే తిట్టేయడమే. కోపం పెద్దదైతే లాగి లెంప కాయలు కొట్టేయడమే. ఎన్టీఆర్ నుండి నేటి కేసీయార్ వరకు మోహన్ కార్టూన్ బారిన పడని నేత లేరు. మోహన్ తండ్రి తాడి అప్పలస్వామి కమ్యూనిస్టు నాయ కులు. నాన్న నీడలో మండుటెండపు ఉద్యమాలు మోహన్ లోని కళాకారుడికి చిన్నప్పుడే ఓ కర్తవ్య బోధ చేసేశాయి. అదే 5 దశాబ్దాల పాటు తెలుగు నాట ఉద్యమ పోస్టర్లపైనా, తిరుగుబాటు జెండాలపైనా పిడికిళ్లు బిగించిన యోధుల విప్లవ నినాదాలు, కసి ఎక్కిన కొడవళ్ల బెదిరింపులు వగైరాల ఎర్రెర్రటి బొమ్మల రూపంలో మోహన్ సంతకం మెరుస్తూనే ఉంది. (క్లిక్: ఆ రాచరికంలో ఎందుకింత ఆకర్షణ?) ప్రభువెక్కిన పల్లకీలు మోసి, వారి అంతఃపుర రాణుల అందాలు పొగిడి వారిచ్చే చిల్లర బహుమతులు మూట కట్టుకుని మురిసిపోయే కళాకారులు కాలగర్భంలో కలిసి పోతారు. ఎవరికీ గుర్తుకు కూడా రారు. పల్లకి నెక్కిన ప్రభువును కాలర్ పట్టుకుని నీ రాజ్యం చాలా అన్యాయంగా ఉంది గురూ అని అనగలిగిన వాడే నిఖార్సయిన వీరుడు. అసలు సిసలు యోధుడు. అలాంటి వారినే తరతరాలుగా జనం గుర్తు పెట్టుకుంటారు. గుర్తుపెట్టు కోవడమేం ఖర్మ గుండెల్లో గుడి కట్టేసి ఆ గుడిలో ఏనిమేషన్ సినిమాలతో పూజలు చేసేస్తారు. అటువంటి అరుదైన యోధుడూ, కళాకారుడూ మన మోహన్! – సీఎన్ఎస్ యాజులు (సెప్టెంబర్ 21న చిత్రకారుడు మోహన్ వర్ధంతి) -
డాలస్‌లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ రక్తదాన శిబిరం
-
డాలస్‌లో డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ రక్తదాన శిబిరం
డాలస్: డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైయస్సార్ 13వ వర్ధంతి సందర్బంగా అమెరికా, టెక్సాస్ రాష్ట్రం, డాలస్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ సహాయం తో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. డాక్టర్ రామి రెడ్డి బూచిపూడి సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ప్రతీ సంవత్సరం రాజన్నను స్మరించుకుంటూ ఈ శిబిరం ఏర్పాటు చేస్త్నున్నందుకు అమెరికన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు వైఎస్సార్ అభిమానులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రవి ఆరిమండ, రమణ్ రెడ్డి క్రిష్టపాటి, మని అన్నపురెడ్డి, రమణ పుట్లూర్, జయచంద్ర రెడ్డి, సుధాకర రెడ్డి, భాస్కర్ గండికోట, కృష్ణ రెడ్డి కోడూరు, దర్గా నాగిరెడ్డి, ఫాల్గుణ రెడ్డి, ప్రసాద్ చొప్ప, వీరా రెడ్డి వేముల, మోహన్ మల్లంపాటి, రాజేంద్ర పోలు, సుబ్బా రెడ్డి కొండ్రు, ఉమా కుర్రి, సురేష్ పులి, చెన్నారెడ్డి క్రోవి , మల్లిఖార్జున్ మురారితో సహా పలువురు వైఎస్సార్ అభిమానులు, డాలస్ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ రక్త దాన శిబిరంలో చైతన్య కుమార్ రెడ్డి, జయచంద్ర గాజులపల్లి, కార్తీక్ ధర్మానాల, మోహన్ మల్లంపాటి, మోహన్ రెడ్డి పులగం, నాగేశ్వర గంట, నవీన్ కుమార్ రాజు అడ్డలూరి, పార్థసారథి గొర్ల, ప్రసాద్ భీమవరపు, రాఘవ రెడ్డి దాట్ల, రాంబాబు శొంఠి, రాము తవుతూ, శివచంద్ర రెడ్డి పల్లె, శివశంకర రెడ్డి వల్లూరు, సుభాష్ సురు, సుబ్రహ్మణ్యం రెడ్డి రెడ్డివారి, స్వామినాథన్, ఉజ్వల్ కుమార్ వేమన, ఉమా కుర్రి, వీర లేవక, వీరా రెడ్డి వేముల, వీరవెంకట సత్య పోతంశెట్టి, వెంకట రెడ్డి శీలం, యుగంధర్ తిప్పిరెడ్డి తో పాటుగా పలువురు వైఎస్సార్ అభిమానులు రక్త దానం చేశారు. -
YSR: అఖిల భారతావనికి అడుగుజాడ
వ్యక్తిత్వాన్ని రాజకీయాలకు బలిపెట్టని నాయకుడు వైఎస్సార్. నవ్వులో స్వచ్ఛత, పిలుపులో ఆత్మీయత ఉట్టిపడేవి. మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుద్ధం. మాట తప్పని, మడమ తిప్పని ఆయన గుణమే ప్రజల కోసం ఎంతదూరమైనా వెళ్లేటట్టు చేసింది. ఆత్మహత్య తప్ప గత్యంతరం లేని స్థితిలో ఉన్న రైతాంగానికి జీవశక్తిని అందించారు. వ్యవసాయ పునరుజ్జీవనానికి బాటలు పరిచారు. నిరుపేదలకు సైతం కార్పొరేట్ వైద్యం దక్కేలా చూశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో నిరుపేద పిల్లలకు సైతం ఉన్నత చదువులు అందుబాటులోకి తెచ్చారు. అధోగతిలో ఉన్న సహకార వ్యవస్థను ఆదుకున్నారు. పల్లెలు మళ్లీ కళకళలాడేలా చేశారు. ప్రపంచీకరణ విధానాల యుగంలో అభివృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో మేళవించి చూపిన మహోన్నత నాయకుడు వైఎస్సార్. కపటం లేని ఆ మందహాసం... సరిగ్గా పదమూడేళ్ల క్రితం, 2009 సెప్టెంబరు రెండో తేదీన యావత్ తెలుగు ప్రజానీకం పడిన ఆందోళన ఇంకా గుండెల్లో పచ్చిగానే ఉంది. కార్చిన కన్నీటి తడి ఇంకా చెమ్మగానే ఉంది. ఆ విషాద ఘడియల్లో దేశ వ్యాప్తంగా మీడియాలో అత్యధికంగా వినపడ్డ, కనపడ్డ పదం ‘వైఎస్సార్’. ఆ పేరు ఇక ముందు కూడా వినబడు తూనే ఉంటుంది కానీ, ఆ రూపం సజీవంగా కనబడే అవకాశమే లేదు కదా. ఒక వ్యక్తి గుణ గణాలను సమాజం సంపూర్తిగా అవగాహన చేసు కునేది అతడి మరణం తర్వాతనే అన్నది రాజశేఖర రెడ్డిగారి విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజమైంది. ‘రాజశేఖరా! నీపై మోజు తీరలేదురా!’ అని తెలుగు ప్రజానీకం రెండో పర్యాయం ఆయనకు అధికార పగ్గాలు అప్పగించి వంద రోజులు నిండీ నిండగానే, రాజశేఖరుడికి నూరేళ్ళు నిండిపోవడం అత్యంత విషాదకరం. ‘రాజసాన ఏలరా!’ అని మనసారా కోరుకున్న ప్రజలకు ఆయన ఆకస్మిక మరణం విధి విధించిన శాపం. అర్థవంతమైన జీవితాలెప్పుడూ అర్ధంతరంగానే ముగిసిపోతుంటాయి. మాట తప్పని మనిషిగా, మడమ తిప్పని వీరుడిగా పేరు తెచ్చుకున్న వైఎస్సార్ అరవై ఏళ్ళు రాగానే రిటైర్ అయిపోతానన్న మాటని నిలబెట్టుకుంటూ, జీవితం నుంచే రిటైర్ కావడం అన్నది, ఆయన పథకాల ద్వారా బతుకులు పండించుకుంటున్న బడుగు జీవుల దురదృష్టం. 1978 నుంచి ఒక జర్నలిస్టుగా ఆయన్ని కలుసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. విలేఖరులను విందు సమావేశాలకు ఆహ్వానించినప్పుడు ఆయన తరహానే వేరుగా ఉండేది. బిగుసుకుపోయినట్టు ఉండడం, మర్యాద కోసం మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుద్ధం. నవ్వులో స్వచ్ఛత, పిలుపులో అత్మీయత ఉట్టిపడేవి. నమ్మినవాళ్ళని నట్టేట ముంచకపోవడం, నమ్ముకున్నవాళ్ళకోసం ఎంత దూరమైనా వెళ్ళడం జన్మతః అబ్బిన గుణాలు. వీటివల్ల, రాజకీయ జీవితంలో మేలు కన్నా కీడే ఎక్కువగా జరిగిన సందర్భాలున్నా, ఆయన లెక్కపెట్టింది లేదు. తీరు మార్చుకున్నదీ లేదు. ఈ విలక్షణ లక్షణమే వైఎస్సార్‌కు రాష్త్రవ్యాప్తంగా అభిమానులను తయారుచేసి పెట్టింది. ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ తరఫున ప్రచారం చేయగల ఖలేజాను ఆయనకు కట్టబెట్టింది. 1975లో నేను రేడియో విలేఖరిగా హైదరాబాదులో అడుగుపెట్టిన మూడేళ్ళ తరవాత రాజశేఖరరెడ్డి తొలిసారి శాసనసభకు ఎన్నిక కావడం, మంత్రి పదవి చేపట్టడం జరిగింది. వయస్సు మళ్ళిన వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయానికి భిన్నంగా యువరక్తం రాజకీయ రంగంలోకి రావడం అప్పుడే మొదలయింది. వైఎస్సార్‌ను నేను మొదటిసారి చూసింది, ఆ రోజుల్లో సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న సరోవర్ హోటల్ (ఇప్పుడు మెడిసిటీ హాస్పిటల్) టెర్రేస్ మీద. సచివాలయంలో జరిగిన ఒక సంఘటన దరిమిలా వివరణ ఇచ్చేందుకు విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భమది. అప్పట్లో ఆయన ఒక తరహా మీసకట్టులో కనిపించేవారు. కానీ, కపటం లేని మందహాసానికి మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ఆయనదే కాపీ రైట్. ఇటు హైదరాబాదు లోనూ, అటు ఢిల్లీ లోనూ వైఎస్సార్ నివాసాలు జర్నలిస్టులతో కళకళ లాడుతూ ఉండేవి. వేళాపాళాతో నిమిత్తం లేకుండా ఆ ఇళ్ళకి వెళ్ళివచ్చే చనువు ఉండేది. సుదీర్ఘకాలం రాజకీయరంగంలో కొనసాగడం వల్ల, పేరుతో పిలిచి పలకరించగల జర్నలిస్టు స్నేహితులు ఆయనకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉండడం సహజమే. 2004లో ఆయన తొలిసారి సీఎం కాగానే, ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, కేవీపీ ద్వారా నా మనసులోని మాటని ఆయన చెవిన వేశాను. అప్పటికే కొన్ని ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసినందువల్ల, రేడియో కేంద్రానికి వచ్చి తొలి సందేశం రికార్డు చేయడం అన్నది కొద్దిగా ఇబ్బందే. అయినా, ఆయన నా మాట మన్నించి, నేరుగా ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు. అలాగే, హైదరాబాదు దూరదర్శన్‌లో నేను రిటైర్ కావడానికి ముందు కూడా ఆయన స్టూడియోకు వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక విలేఖరికీ, ఒక రాజకీయ నాయకుడికీ నడుమ సహజంగా ఉండే సాధారణ సంబంధాన్ని మహోన్నతంగా పెంచి పెద్ద చేసిన పెద్దమనసు ఆయనది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా పెన వేసుకున్న ఈ బంధం శాశ్వతంగా తెగిపోయిందే అన్న బాధతో, ఆ మహోన్నత వ్యక్తిత్వానికి నివాళి అర్పిస్తూ, ‘రెండు కన్నీటి బొట్లు’ రాల్చడం మినహా ఏమీ చేయలేని చేతకానితనం నాది. - భండారు శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ సంక్షేమానికి చెదరని చిరునామా నాలుగేళ్లక్రితం చెన్నై వెళ్లినప్పుడు మా బంధువొకాయన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఒక ప్రశ్న వేశారు. ‘వైఎస్‌కు ముందు కూడా సంక్షేమ పథకాలు అమలు చేసిన నేతలు న్నారు కదా, కానీ ఆ పథకాలు ప్రస్తావనకు వచ్చి నప్పుడు వైఎస్‌నే అందరూ ఎందుకు గుర్తు చేసు కుంటార’న్నది ఆ ప్రశ్న సారాంశం. నిజమే... ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి నిరుపేదలకు సైతం రోజూ గుక్కెడు బువ్వ అందుబాటులోకి వచ్చేలా చేశారు. అంతకు చాన్నాళ్ల ముందే ‘గరీబీ హఠావో’ అంటూ ఇందిరాగాంధీ కూడా ఎన్నో పథకాలు తెచ్చారు. తమిళనాట అధికారంలోకి రాగానే నిరుపేదలకు కలర్ టీవీలు, మిక్సీలు, గ్రైండర్లు పంచిపెట్టిన ప్రభుత్వాలున్నాయి. ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకే పోటీలుపడి ఇలాంటి వాగ్దానాలు చేసేవి. అయితే వైఎస్ తీరు వేరు. ఆయన అమలు చేసిన పథకాల ఒరవడే వేరు. ఆ పథకాలు జనసంక్షేమానికి అసలు సిసలైన నిర్వచనంగా నిలిచాయి. అందుకు కారణముంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి కాంగ్రెస్ దిగే సమ యానికి రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా నిస్తేజం అలుముకుంది. అప్పటికి ఏడెనిమిదేళ్ల క్రితం వచ్చిపడిన ఉదారవాద ఆర్థిక విధానాల పర్యవసానంగా సమస్త చేతివృత్తులూ దెబ్బతిన్నాయి. వరస కరవులతో, అకాల వర్షాలతో రైతాంగం అల్లాడు తోంది. అప్పుల ఊబిలో దిగబడి ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదనుకుంటోంది. అప్పటికే ఉన్న ధనిక, పేద; పట్టణ, గ్రామీణ అంతరాలు మరింత పెరిగాయి. కొనుక్కునే స్థోమత ఉంటే తప్ప నాణ్యమైన చదువుకు దిక్కు లేకుండా పోయింది. రోగం వచ్చి ఆసుపత్రులకు వెళ్లినవారికి యూజర్ ఛార్జీల బాదుడు మొదలైంది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారయావతో ఇతర సీఎంల కన్నా అత్యుత్సాహంగా సంస్కరణలు అమలు చేయడం వల్ల ఏపీ మరింత దుర్భరంగా మారిందేమో గానీ దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. ‘ఏదీ వూరికే రాద’ని పాలకులు ఉపన్యాసాలు దంచే పాడుకాలమది. నేలవిడిచి సాముచేసే నాయకులను తమ ముఖపత్రాలపై అచ్చోసే అంతర్జాతీయ పత్రికలకు అప్పుడు కొదవలేదు. సరిగ్గా ఆ సమ యంలో వైఎస్సార్ పాద యాత్ర నిర్వహించి ప్రజల దుర్భర స్థితిగతులను దగ్గర నుంచి చూశారు. 1,400 కిలోమీటర్ల పొడ వునా సామాన్యుల గుండె ఘోషను అతిదగ్గర నుంచి వినగలిగారు. వీరందరి జీవితాల మెరుగుదలకు ఏం చేయగలమన్న మథనం ఆయనలో ఆనాడే మొదలైంది. తర్వాత కాలంలో ఆయనే చెప్పుకున్నట్టు ఆ పాదయాత్ర ఎన్నో పాఠాలు నేర్పింది. రాగల అయిదేళ్లకూ పాలనా ప్రణాళికను నిర్దేశించింది. వ్యక్తిగా కూడా ఆయనను ఆ పాదయాత్ర ఎంతో మార్చింది. రాయలసీమ ప్రాంత నేతగా సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యంపై ఆయనకు మొదటి నుంచీ అవగాహన ఉంది. కానీ అది ‘జలయజ్ఞం’గా రూపుదిద్దుకున్నది జనం మధ్యనే! అన్ని ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలన్న ఆ లక్ష్యం వేల కోట్ల వ్యయంతో ముడిపడి ఉంటుంది గనుక అది అసాధ్యమనుకున్నారంతా! కానీ భర్తృహరి చెప్పినట్టు ఎన్ని అడ్డంకులెదురైనా వెరవక తుదికంటా శ్రమించడమే కార్యసాధకుల నైజమని వైఎస్ భావించారు. ఈ అనితర సాధ్యమైన ప్రయత్నానికి సమాంతరంగా ఉచిత విద్యుత్ జీవోపై తొలి సంతకం చేసి అన్నివిధాలా చితికిపోయి ఉన్న రైతాంగానికి తక్షణ జీవశక్తిని అందించారు. బాబు పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయాన్ని మళ్లీ పట్టాలెక్కించి, దాని పునరుజ్జీవానికి బాటలు పరిచారు. అంతేకాదు... అంతవరకూ ఆకాశపు దారుల్లో హడావిడిగా పోయే ఆరోగ్య సిరిని భూమార్గం పట్టించి నిరుపేదలకు సైతం ఖరీదైన కార్పొరేట్ వైద్యం దక్కేలా చూశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో నిరుపేద వర్గాల పిల్లలకు సైతం ఉన్నత చదువులు అందుబాటులోకి తెచ్చారు. అధోగతిలో ఉన్న సహకార వ్యవస్థను ఆదుకున్నారు. పల్లెలు మళ్లీ కళకళలాడేలా చేశారు. ప్రపంచీకరణ విధానాల యుగంలో అభి వృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో మేళవించి చూపిన సాహసిగా, తనకు తెలిసినవారైనా కాకున్నా, తన పార్టీవారు అయినా కాకున్నా సాయం కోరివచ్చిన వారందరి పట్లా ఒకేలా స్పందించిన సహృదయుడిగా వైఎస్ చిరస్థాయిగా నిలుస్తారు. పీవీ హయాంలో కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేసి, ఆర్థిక సంస్కరణలను అమలు చేసిన ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ వంటి నేతను దేశవ్యాప్త రైతాంగానికి రుణమాఫీ తక్షణావసరమని ఒప్పించడంలో వైఎస్ రాజశేఖరరెడ్డిది కీలకపాత్ర. ఇలాంటి నాయకుడు సంక్షేమానికి శాశ్వత చిరునామా కావడంలో, ఆ విషయంలో అఖిల భారతావనికి అడుగుజాడ కావడంలో ఆశ్చర్యమేముంది? -టి. వేణుగోపాలరావు సీనియర్ పాత్రికేయులు -
మార్గనిర్దేశకుడు వైఎస్సార్.. ఆ మూడు పథకాలు సజీవ సాక్ష్యాలుగా..
దేశంలోని అనేక రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయడానికి కారణం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనే. దానిని 2004, మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆయన ప్రారంభించారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయడానికి కారణం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనే. దానిని 2004, మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆయన ప్రారంభించారు. దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నత విద్యను పేదలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు అమలుచేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తొలుత శ్రీకారం చుట్టిందీ వైఎస్సే. పాలకులకు వైఎస్ రాజశేఖరరెడ్డి టార్చ్‌బేరర్‌గా నిలిచారనడానికి ఈ మూడు పథకాలు సజీవ సాక్ష్యాలు. ఆ మహానేత భౌతికంగా దూరమై నేటికి సరిగ్గా 13 ఏళ్లు. సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా వైఎస్ రాజశేఖరరెడ్డి పనిచేసింది కేవలం ఐదేళ్ల మూడు నెలలే. కానీ, ఆ కొద్దికాలంలోనే తెలుగునేల ఆయన్ను కలకాలం గుర్తుంచుకునేలా సుపరిపాలన అందించారు. పాలనకు మానవత్వాన్ని జోడించి పాలకుడంటే ఇలా ఉండాలి అని దేశానికి చాటిచెప్పారు. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 1949, జూలై 8న జన్మించిన వైఎస్.. వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రిని ఏర్పాటుచేసి.. రూపాయికే వైద్యంచేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ప్రజాభ్యుదయమే పరమావధిగా.. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైఎస్ రాజశేఖరరెడ్డి పులివెందుల నియోజకవర్గం నుంచి 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటినుంచి తుదిశ్వాస విడిచే వరకూ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాభ్యుదయమే పరమావధిగా రాజీలేని పోరాటం చేశారు. దాంతో పులివెందుల నుంచి 1978, 1983, 1985.. కడప లోక్‌సభ స్థానం నుంచి 1989, 1991, 1996, 1998.. ఆ తర్వాత పులివెందుల నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రజలు ఆయన్ను అజేయుడిగా నిలిపారు. పాలకులకు మార్గనిర్దేశకుడిగా.. వరుస ఓటములతో ఉమ్మడి ఏపీలో జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్‌ను వైఎస్ మండుటెండలో 1,475 కి.మీల పొడవున పాదయాత్ర చేసి ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను అర్థంచేసుకుని, నేనున్నానని భరోసా ఇచ్చిన ఆయన 2004, మే 14న సీఎంగా తొలిసారి ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఆ తర్వాత ఆయన ప్రజలను ఓటర్లుగా కాకుండా కుటుంబ సభ్యులుగా భావించారు. విద్య, వైద్యం కోసం ప్రజలు అప్పులపాలవుతుండటాన్ని పసిగట్టి.. వాటిని ఉచితంగా అందించేందుకు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టారు. చదవండి: మరో రూపంలో మహానేత అలాగే, ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించడానికి 108 సర్వీసును ప్రారంభించి లక్షలాది మందికి ప్రాణంపోశారు. ఇక అత్యంత ప్రజాదరణ పొందిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 సర్వీసులను అనేక రాష్ట్రాలు అమలుచేస్తుండటం ఆయన దార్శనికతకు నిదర్శనం. ఇక ఐదేళ్లలో సంక్షేమాభివృద్ధి పథకాలతో జనరంజక పాలన అందించిన వైఎస్.. గెలుపోటములకు తనదే బాధ్యత అని 2009 ఎన్నికల్లో ప్రకటించారు. ప్రతిపక్షాలు మహాకూటమి కట్టినా 2009 ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ ఒంటిచేత్తో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి, 2009, మే 20న రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారంచేశారు. రూ.లక్ష కోట్లతో జలయజ్ఞం.. కడలి పాలవుతున్న నదీ జలాలను ప్రాజెక్టుల ద్వారా మళ్లించి, తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. రూ.లక్ష కోట్ల వ్యయంతో కోటి ఎకరాలకు నీళ్లందించేలా ఒకేసారి 84 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నమైన పోలవరాన్ని పట్టాలెక్కించారు. 2009 నాటికే 16 ప్రాజెక్టులను పూర్తిగా.. 25 ప్రాజెక్టులను పాక్షికంగా వెరసి 41 ప్రాజెక్టుల ద్వారా 19.53 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 3.96 లక్షల ఎకరాలను స్థిరీకరించారు. ఐదేళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీళ్లందించే ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా దేశ సాగునీటి రంగంలో రికార్డును నెలకొల్పారు. దార్శనికతకు తార్కాణాలెన్నే.. ప్రపంచవ్యాప్తంగా 2007–08, 2008–09లో ఆర్థిక మాంద్యం అనేక దేశాలను అతలాకుతలం చేసింది. ఆ ప్రభావం భారత్‌పై కూడా పడింది. కానీ.. అది రాష్ట్రంపై పడకుండా వైఎస్ చేయగలిగారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదల ఇళ్ల నిర్మాణం, రహదారుల పనులు వంటి అభివృద్ధి పనులు చేపట్టి.. మార్కెట్లోకి ధనప్రవాహం కొనసాగేలా చేసి.. వాటి ద్వారా రాష్ట్రానికి పన్నులు వచ్చేలా చేసి.. మాంద్యం ముప్పు నుంచి రాష్ట్రాన్ని వైఎస్ కాపాడారని అప్పట్లో ఆర్థిక నిపుణులు ప్రశంసించారు. ఇక ఐటీకి వెన్నుదన్నుగా నిలిచి ఎగుమతులను రెట్టింపయ్యేలా చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శరవేగంగా పూర్తిచేసి హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపారు. పండగలా వ్యవసాయం.. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వైఎస్‌కు రైతుల కష్టనష్టాలు బాగా తెలుసు. అందుకే పంట పండినా.. ఎండినా రైతు నష్టపోకుండా.. వ్యవసాయాన్ని పండగలా మార్చేలా పలు కీలక నిర్ణయాలు అమలుచేశారు. ♦పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు. ♦పంటలులేక విద్యుత్ చార్జీలు కట్టలేని రైతులపై టీడీపీ సర్కార్ రాక్షసంగా బనాయించిన కేసులను ఒక్క సంతకంతో ఎత్తేశారు. ♦రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. దాదాపు 35 లక్షల పంపు సెట్లకుపైగా ఉచిత విద్యుత్‌ను అందించారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ.. ఆ తర్వాత ఏడాదికి రూ.6 వేల కోట్లకు చేరినా వెనక్కు తగ్గలేదు. ♦వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని ఎగతాళి చేసిన నేతలు కూడా అధికారంలోకి వచ్చాక.. ఆ పథకాన్ని కొనసాగించాల్సిన ♦పరిస్థితిని వైఎస్ కల్పించారు. వైఎస్ స్ఫూర్తితో దేశంలో పలు రాష్ట్రాలు సాగుకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి. ♦ఇక పావలా వడ్డీకే రైతులకు రుణాలందించి.. పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితిని తప్పించారు. ♦నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందించారు. పంట పండినా.. ఎండినా రైతు నష్టపోకూడదనే లక్ష్యంతో పంటల బీమాను అమలుచేశారు. ఇన్çపుట్ సబ్సిడీని అందించారు. ♦పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఢిల్లీతో పోరాడారు. 2004 నుంచి 2009 మధ్య ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.550 నుంచి రూ.1,000 వరకూ పెరగడమే అందుకు నిదర్శనం. -
నేటికీ వైఎస్సార్ ను తలుచుకుంటున్న అన్నదాతలు
-
మరో రూపంలో మహానేత
మహానేతలు ప్రజల హృదయాల్లో ఎప్పుడూ నిలిచే ఉంటారు. అందుకు మంచి ఉదాహరణ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. తన మాటల ద్వారా, చేతల ద్వారా ప్రజలకు దగ్గరై వారి అభ్యున్నతికి కృషి చేస్తూ అనుకోకుండా అసువులు బాసిన నేత. ఉచిత విద్యుత్తు, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, ఆరోగ్యశ్రీ, గృహనిర్మాణం, జల యజ్ఞం... ఈ పథకాల్లో కొన్నింటిని ఆయనే రూపొందించి అందిస్తే, మరికొన్నింటిని అమలు చేయడం ఎలాగో చూపించారు. రాజకీయ ప్రత్యర్థులు ఎక్కుపెట్టిన దుష్ప్రచారాన్ని చిరునవ్వుతో ఎదుర్కొని, ప్రజా సంక్షేమ పథకాల ద్వారా వారికి పుట్టగతులు లేకుండా చేశారు. వైఎస్సార్ మరణం తర్వాత ఆయన కుటుంబంపై వ్యాపింపచేసిన అబద్ధాలూ, చేసిన ఆరోపణలూ, పెట్టిన ఇబ్బందులూ... అన్నింటినీ ప్రజలు గమనించారు. అందుకే ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డిని గెలిపించారు. ఆ విధంగా రాజన్న రాజ్యాన్ని పునఃప్రతిష్ఠించారు. ఎన్నో జ్ఞాపకాల భాండాగారం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. దగ్గరగా ఉన్న నాబోటి వ్యక్తులకే కాక, ఏనాడూ ఆయన్ను ప్రత్యక్షంగా చూడని.. కలవని కోట్ల మందికి కూడా వైఎస్సార్ ఆత్మీయుడు, ఆరాధ్యుడు, మనసుకు దగ్గరి మనిషి! అనూహ్య పరిస్థితుల్లో ఆయన మరణించి, నేటికి 13 ఏళ్ళు పూర్తవుతోంది. ఆయన మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రం చెక్కుచెదర లేదు. ఇన్నేళ్ల తరవాత కూడా, ఆయన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో, కోట్ల కొద్దీ తెలుగు హృదయాల్లో అలాగే ఉండిపోయారు. ఉచిత విద్యుత్తు, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, ఆరోగ్యశ్రీ, గృహనిర్మాణం, జల యజ్ఞం... ఈ పథకాల్లో కొన్నింటిని ఆయనే రూపొందించి అందిస్తే, మరి కొన్నింటిని అమలు చేయటం ఎలాగో చూపించారు. రాష్ట్రాలు విడిపోయినా, ముఖ్యమంత్రులు, అధికార పార్టీలూ మారినా, గిట్టక ఈ పథకాల అమలును నీరుగార్చటానికి వారిలో కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా... నీరుగార్చటానికి ప్రయత్నించినవారు నీరుగారి పోయారు తప్ప, ఆ పథకాలు చెక్కు చెదరలేదు. మహానేత ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పరిపా లించినది కేవలం అయిదేళ్ళ మూడు నెలలు. మిగతా కాలం అంతా, ఎవరు అధికారంలో ఉన్నా మహానేత మీద జరిగినదంతా దుష్ప్ర చారమే. సొంత పార్టీలో కొందరికీ; విపక్షానికీ, విపక్షాన్ని సమర్థించే మీడియాకూ... అందరికీ టార్గెట్ నంబర్–1 వైఎస్సార్. ఇంతమంది కడుపుమంటనూ ఓపికగా భరించాడు, చిరునవ్వుతోనే జయించాడు. అందరినీ ఎదురొడ్డి నిలిచాడు, గెలిచాడు! వైఎస్సార్ మరణానంతరం గడచిన 13 సంవత్సరాల్లో, వైఎస్ జగన్‌గారి మీద ఆ దాడి మరింత పెరిగింది. ప్రజలకు మంచి చేసిన చరిత్రే లేని ప్రత్యర్థులు ఈ 13 సంవత్సరాలుగా ఎంచుకున్న మార్గం కూడా అదే. జగన్‌పై దుష్ప్రచారం. అక్రమ కేసుల బనాయింపు. వ్యవస్థల మేనేజ్మెంట్! మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో వైఎస్సార్ ఎంతటి దుర్మార్గమైన దుష్ప్రచారాన్ని ఎదుర్కొన్నారో, ఈ 13 ఏళ్లలో వైఎస్ జగన్ అంతకు మించిన దుష్ప్రచారాన్ని ఎదుర్కొన్నారు. విద్వేషపూరిత యుద్ధం ప్రజా క్షేత్రంలో, ప్రజా సమస్యల మీద పోరాడే సత్తాలేని వారంతా నాడు తండ్రి మీద... ఆ తరవాత తనయుడి మీద చేసినది రాజకీయ పోరాటం కాదు. వ్యక్తిగత ద్వేషాలతో యుద్ధం. ఢిల్లీ స్థాయిలో జాతీయ పార్టీలను కూడా మచ్చిక చేసుకునే నైపుణ్యం ఉన్న చంద్రబాబుకు; ఎల్లో మీడియాకూ, దుష్ట చతుష్టయానికీ ఆ రోజుల్లో ఏనాడూ వైఎస్సార్ లొంగలేదు. ఆ తరవాత, రాజకీయాల్లో ప్రవేశించిన నాటి నుంచి నేటి వరకు జగన్ ఏనాడూ రాజీపడలేదు. కాబట్టి ఆనాడూ ఈనాడూ ప్రత్యర్థులు ఒక్కరే. అక్కసుతో, అసూయతో, ద్వేషంతో చేసే దుష్ప్రచారాలు మాత్రం మరో నాలుగు రెట్లు పెరిగాయి. కాబట్టే, తండ్రిని మించిన తనయుడిగా వైఎస్ జగన్ ఈ ప్రచారాలకు తన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో మరో నాలుగు అడుగులు ముందుకు వేసి సమాధానమిస్తున్నారు. దుష్ప్రచారాలు, అపోహలు, అసత్యాలు వైఎస్సార్‌కు అధికారం దక్కకుండా చాలా కాలమే ఆపాయిగానీ, శాశ్వతంగా అధికారం దక్కకుండా చేసే అంతటి శక్తి ఈ విష ప్రచారాలకు లేదు. ఒక్కసారి ప్రజలు అధికారం ఇచ్చిన తరవాత, ఆ పరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్న తీరును చూశాక, వైఎస్సార్ మీద ఎన్నికల్లో విజయం సాధించి అధికారం తెచ్చుకోవటం ఇక ఏనాటికీ జరగని పని అని ప్రతిపక్షానికి బాగా అర్థమయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ విషయంలోనూ వారికి అదే అర్థమయింది. కేవలం 38 నెలల పాలనలో ఏకంగా రూ. 1.70 లక్షల కోట్లు డీబీటీగా అందించిన నాయకుడిని ఎదుర్కోవటానికి కావాల్సిన పాజిటివ్ సరంజామా నాలుగు దశాబ్దాల టీడీపీ తుప్పు సైకిల్‌కు లేదు. అలాగే దాన్ని తొక్కే శక్తి 73 ఏళ్ల చంద్రబాబుకూ లేదు. కాబట్టే సైకిల్ పెడల్స్ తొక్కే ‘అదృష్టాన్ని’ సొంత పుత్రుడికి కాకుండా దత్తపుత్రుడికీ, గత కాలపు మిత్ర పక్షానికీ అప్పగిస్తానని చంద్రబాబు అందరితోనూ కబుర్లు పంపుతున్నారు, బేరాలు ఆడుతున్నారు. అత్యున్నత న్యాయ నిర్ణేతలు ప్రజలే! వైఎస్సార్ హఠాన్మరణం తరవాత, ప్రజలంతా జగన్ మీద అమిత మైన అభిమానం చూపిస్తే తట్టుకోలేక... వారి కుటుంబాన్ని రాజకీ యంగా, ఆర్థికంగా ఎంతగా టార్గెట్ చేశారో, దేశంలోని అత్యంత శక్తిమంతమైన వ్యవస్థల్ని ఎలా ప్రయోగించి ఎంతగా ఇబ్బందు లపాలు చేశారో కూడా ఈ పదమూడేళ్ల చరిత్రలో అడుగడుగునా కనిపిస్తుంది! ఈ దుర్మార్గ చరిత్రలన్నింటికీ, ఈ వ్యవస్థల దుర్మార్గానికి ప్రజాస్వామ్యంలో అత్యున్నత న్యాయ నిర్ణేతలైన ప్రజలు ఎలా బదులిస్తున్నారో కూడా ఈ 13 సంవత్సరాల చరిత్రే సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. వైఎస్సార్, వైఎస్ జగన్... ఇద్దరూ ముఖ్యమంత్రులు. నాడు తండ్రి... నేడు తనయుడు! వైఎస్సార్ చరితార్థుడు. ఆయన కొడుకు, ఆయన అంచనాలకు మించి, తనకు తానుగా ఎదిగాడు! వైఎస్సార్ కంటే ఎక్కువగా శత్రువులను ఎదుర్కొని రాటుతేలి మరీ ఎదిగాడు! 44 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు ఒక్కడిగా ప్రజల్లోకి వెళ్ళటానికి ధైర్యం చాలనంతగా ప్రజలకు మంచి చేసి ఎదిగాడు. ప్రజలకు మంచి చేసే విషయంలో దేశంలోని ఏ ఇతర రాష్ట్ర ప్రభుత్వానికీ తీసిపోనని ప్రజల మనిషిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూ పిస్తుంటే... ఏ తండ్రి అయినా ఇంతకు మించి కోరుకునేది ఏముంటుంది? మరోవంక, వైఎస్సార్ ప్రత్యర్థి పరిస్థితి చూడండి... నాడు 2004, 2009లో వైఎస్సార్ చేతిలో ఓడాడు, నేడు – వైఎస్ జగన్ చేతిలో కూడా మూడేళ్ళ క్రితం, 2019లో అంతకంటే దారుణంగా ఓడాడు. ప్రత్యర్థి, చివరికి తన కొడుకుని కూడా, అది కూడా అడ్డదారిలో మంత్రిగా నాలుగేళ్ళు కూర్చోబెట్టి కూడా... చిత్తుగా ఓడగొట్టుకున్నాడు. చంద్ర బాబు... బతికి ఉండీ ఎంతటి దురదృష్టవంతుడు! వైఎస్సార్... దివికి ఏగి కూడా ఎంతటి అదృష్ట వంతుడు! తన రెక్కల కష్టంతో... మహానేత మరణం తరవాత సానుభూతి పవనాలతో గెలిచాడన్న అపప్రథ కూడా వైఎస్ జగన్‌కు లేదు. 2019లో 175కు 151 ఎమ్మెల్యేలను ఆయన రెక్కల కష్టంతో, ఒంటి చేత్తో గెలిపించుకున్నారు. చివరికి చంద్ర బాబు కంచు కోట అయిన కుప్పంలో కూడా స్థానిక సంస్థల ఎన్నిక లన్నింటిలో టీడీపీకి బీటలు వారేలా చేసినది ఏమిటంటే... ఇంటింటికీ, మనిషి మనిషికీ కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయం కూడా చూడకుండా జగన్ చేసిన మంచి మాత్రమే. ప్రజల మధ్య, ప్రజల వాడిగా, ప్రజల తోడుగా... ఒంటి చేత్తో అధికారం తెచ్చుకున్న వైఎస్ జగన్ బాణీ విభిన్నమైనది! వైఎస్సార్ – వైఎస్ జగన్... ఇద్దరూ ఎవరి శైలిలో వారు ప్రజల ఛాంపియన్లు. వైఎస్సార్ – వైఎస్ జగన్ ఇద్దరికీ వారి రక్తంలోనే ప్రాంతీయ అసమానతలను తొలగించాలన్న భావం బలంగా ఉంది. చేస్తున్నది మంచి అయినప్పుడు నిర్భయంగా అడుగు ముందుకు వేసే స్వభావం ఇద్దరిదీ. ప్రజల గుండె చప్పుడు స్వయంగా విన్న ప్రజా నాయకులు వీరిద్దరూ! ఒక్కో ప్రాంతంలో మనిషితోపాటు అక్కడి మట్టి, అక్కడి పేదరికం చెప్పే సంగతులు, సామాజిక వర్గాల ఆకాంక్షలు, అక్క చెల్లెమ్మల అంత రంగం, పిల్లల భవిష్యత్తు పట్ల విజన్ ఉన్న నాయకులు వీరిద్దరూ. తండ్రి మీద మమకారం ఆకాశమంత ఉన్నా, వినమ్రంగా 108, 104, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్తు, జలయజ్ఞం వంటి పథకాలకు మరింతగా మెరుగులు దిద్ది కొనసాగించటమే కాకుండా... నేడు ప్రజల ఆర్తిని, అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ రైతు భరోసా, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత వంటి నవరత్నాల పథకాలతో అడుగులు ముందుకు వేస్తున్న ధీశాలి, మనసున్న మనిషి... పేద వర్గాల పెన్నిధి వైఎస్ జగన్. రోల్ మోడల్ మట్టి నుంచి పుట్టిన మొక్కకి... చెట్టు మీద పెరిగే పరాన్నజీవికి ఎంత తేడా ఉంటుందో జనం నుంచి పుట్టిన నాయకుడిని, అధికారం లాక్కున్న నాయకుడికి మధ్య కూడా అంతే భేదం ఉంటుంది. దళిత, బీసీ, ఎస్టీ, మైనార్టీ, మహిళ, రైతు వర్గాలకు న్యాయం చేసే విషయంలో గట్టిగా అడుగులు పడకపోతే... తరాలు మారినా తల రాతలు మారవని గట్టిగా నమ్మి తన ఆచరణను నిర్ణయించుకున్న దార్శనికుడు జగన్. పరిపాలనలో భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ ఆయన. 13 సంవత్సరాల క్రితం దివికి ఏగిన తండ్రి, నేడు భువి మీద తన తనయుడు పాలన చూసి కచ్చితంగా గర్విస్తాడు. అంబటి రాంబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి -
వాజ్‌పేయి వర్ధంతి: రాజకీయ దురంధరుడికి ఘన నివాళి
అటల్ బిహారీ వాజ్‌పేయి.. ముక్కుసూటి నిర్ణయాలతో రాజకీయ దురంధరుడిగా భారత రాజకీయాల్లో తనకంటూ ఒక చెరగని ఒక ముద్ర వేసుకున్నారు. రాజనీతిజ్ఞుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ అజాత శత్రువనే గుర్తింపు దక్కించుకున్న అతికొద్ది మందిలో ఈయనొకరు. సాహితి లోకానికి కవిగా, దాదాపు ఆరేళ్లపాటు భారత దేశానికి ప్రధానిగా, బీజేపీ కీలకనేతగా, అశేష జనాదరణ ఉన్న ప్రముఖుడిగా గుర్తింపు ఉన్న వాజపేయి వర్ధంతి నేడు.. ఆగస్టు 16వ తేదీన అటల్ బిహారీ వాజ్‌పేయి వర్థంతి. ఈ సందర్భంగా.. ప్రముఖులంతా ఈ ఉదయం ఆయన సమాధి ఉన్న న్యూఢిల్లీ స్మారక స్థలం ‘సదైవ్ అటల్’ వద్ద నివాళులర్పించారు. మాజీ ప్రధాని సమాధి వద్ద.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేడీ నడ్డా.. పుష్పాలు ఉంచి నివాళి అర్పించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ తదితరులతో పాటు వాజ్‌పేయి దత్తత కూతురు నమితా కౌల్ భట్టాచార్య సైతం ఈ నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు. #WATCH | Delhi: President Droupadi Murmu pays floral tribute to former Prime Minister #AtalBihariVajpayee on his death anniversary, at Sadaiv Atal. pic.twitter.com/044qWd9R6y — ANI (@ANI) August 16, 2022 #WATCH | Delhi: Prime Minister Narendra Modi pays floral tribute to former Prime Minister #AtalBihariVajpayee on his death anniversary, at Sadaiv Atal. pic.twitter.com/FKBbnrhjbe — ANI (@ANI) August 16, 2022 #WATCH | Delhi: Former PM, late #AtalBihariVajpayee's foster daughter Namita Kaul Bhattacharya pays floral tribute at 'Sadaiv Atal', on his death anniversary today. pic.twitter.com/NOzmLqdZLC — ANI (@ANI) August 16, 2022 ఇదీ చదవండి: వాజ్‌పేయి చివరిసారిగా జనాలకు కనిపించింది ఎప్పుడంటే.. -
మహోజ్వల భారతి: చిరునవ్వుతో ఉరికంబానికి!
ఖుదీరాం బోస్ భారత స్వాతంత్య్ర సమరవీరులలో మొదటి తరానికి చెందిన అతి పిన్నవయస్కుడు. బ్రిటిష్ అధికారిపై బాంబు వేసిన మొదటి సాహసవీరుడు. బాంబు వేసిన కారణంగానే అతడిని ఉరి తీసేనాటికి అతని వయసు కేవలం 18 సంవత్సరాలు. ఖుదీరాం పశ్చిమ బెంగాల్, మిడ్నాపూర్ జిల్లా హబిబ్‌పూర్‌లో 1889 డిసెంబర్ 3న జన్మించాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ఖుదీరాం చిన్నవయస్సులోనే కన్నుమూశారు. ఖుదీరాం పాఠశాలలో చదువుతున్న రోజుల్లో స్వాతంత్య్ర సమర యోధుల గురించి విని జాతీయోద్యమానికి ప్రభావితుడయ్యాడు. నిరంతరం తీవ్రమైన స్వాతంత్య్ర సాధనేచ్ఛతో రగిలిపోతుండే వాడు. మొదట్లో ‘అఖ్రా’ అనే విప్లవ సంస్థలో చేరాడు. 1905లో బెంగాల్ విభజన ఖుదీరాంలో బ్రిటిష్ ప్రభుత్వంపై మరింత కసి రేపింది. 16 ఏళ్ల వయసులోనే ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లను బాంబులతో పేల్చివేశాడు. ఆ తర్వాత ఒక ఘటన జరిగింది. 1907 ఆగస్టు 26న ఒక కేసు విచారణ సందర్భంగా అనేకమంది యువకులు కోర్టు ముందర ఆసక్తిగా గుమికూడి ఉన్నారు. పరిస్థితి శాంతియుతంగా ఉన్నప్పటికీ ఉన్నట్లుండి పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ వ్యవహారాన్ని కొద్దిదూరంలో నిలబడి చూస్తున్న సుశీల్ కుమార్ సేన్ అనే 15 ఏళ్ల యువకుడు ఈ దాడిని చూసి భరించలేక ఆవేశంతో ఒక ఇంగ్లిషు అధికారి ముక్కు మీద ఒక్క గుద్దు గుద్దాడు. వెంటనే పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లారు. ఈ కేసు విచారణ చేసిన జడ్జి కింగ్స్‌ఫోర్డ్ అనే అధికారి. భారతీయులపట్ల క్రూరత్వానికి అతడు పెట్టింది పేరు. ‘యుగాంతర్ ’ పత్రిక మీద అతను ఎప్పుడూ ప్రతికూల నిబంధనలు విధిస్తూ, ఆ పత్రికా కార్యకర్తలకు నరకయాతన పెట్టేవాడు. చిన్నవాడన్న దయ లేకుండా సుశీల్ కుమార్‌కు జడ్జి 15 కొరడాదెబ్బలను శిక్షగా విధించాడు. కానీ సాహసవంతుడైన ఆ యువకుడు ప్రతి కొరడాదెబ్బకు వందేమాతరం అని నినదిస్తూనే ఉన్నాడు. ఈ ఘటన తరువాత స్వతంత్ర వీరులంతా కింగ్స్‌ఫోర్డ్‌కు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. 1908 ఏప్రిల్ మొదటివారంలో యుగాంతర్ విప్లవ సంస్థకి చెందిన విప్లవ కారులు కొందరు కలకత్తాలో ఒక ఇంటిలో రహస్యంగా సమావేశమై కింగ్స్ఫోర్ట్ ను అంతం చెయ్యడానికి ఒక ప్రణాళిక రచించారు. ఆ సమావేశంలో అరవిందఘోష్ కూడా ఉన్నాడు. ఖుదీరాం బోస్‌ను, ప్రఫుల్లచాకి అనే మరో నవ యువకుడినీ ఈ పనికై నియమించారు. 1908 ఏప్రిల్ 30 రాత్రివేళ వీరిద్దరూ ముజఫర్‌పూర్ లోని యురోపియన్ క్లబ్ కు ఒక బాంబు, రివాల్వర్ తీసుకొనివెళ్లారు. కింగ్స్‌ఫోర్డ్ క్లబ్ వాహనం బయటకు రాగానే దానిపై బాంబును విసిరేసి ఇద్దరు చెరో దిక్కుకు పరిగెత్తి వెళ్లిపోయారు. అయితే ఆ వాహనంలో కింగ్స్‌ఫోర్డ్ లేడు. అతని భార్య, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. ఆ తరువాత ఒక రైల్వే స్టేషన్లో టీ తాగుతుండగా ఖుదీరాం బోస్‌ను పోలీసులు పట్టుకోగలిగారు. ఖుదీరాంను నిర్బంధించి రెండునెలలపాటు విచారణ చేశారు. ముజఫర్‌పూర్ బాంబు కేసులో ఫోర్డ్ భార్య, కుమార్తెల మరణానికి కారకుడైన ఖుదీరాంకు మరణశిక్ష విధించారు. 1908 ఆగస్టు 11న ఈ శిక్ష అమలైంది. పెదవులపై చిరునవ్వు చెదరకుండా ఖుదీరాం మృత్యువును ఆహ్వానించాడు. దేశం కోసం బలిదానం చేశాడు. నేడు ఖుదీరాం వర్ధంతి. -
మహోజ్వల భారతి: జాతీయోద్యమ కవియోధుడు
రవీంద్రనాథ్ టాగూర్ స్వాతంత్య్ర సమరయోధులు కూడా అయినప్పటికీ ఆయన ‘విశ్వ కవి’గా మాత్రమే గుర్తింపు పొందారు. తొలి నుంచీ ఆయన జాతీయ భావాలున్నవారు. హిందూ మేళాలో దేశభక్తి గీతాలను పాడారు. పృథ్వీరాజు పరాజయం గురించి ప్రబోధాత్మక పద్యనాటకాన్ని రచించారు. బ్రిటిష్ ప్రభుత్వం తిలక్‌ను నిర్భంధించినపుడు ప్రభుత్వాన్ని రాగూర్ తీవ్రంగా విమర్శించారు. బెంగాల్ విభజన ప్రతిఘటనోద్యమంలో కూడా టాగూర్ పాత్ర తక్కువేమీ కాదు. జాతీయ నిధి కోసం ఆయన జోలె పట్టి విరాళాలు వసూలు చేశారు. 1896లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో.. బంకిం చంద్ర చటర్జీ ‘వందేమాతరం’ గీతాన్ని మొట్టమొదటిగా తనే ఆలపించారు టాగూర్. ఆయన రాసిన ‘జనగణమణ’ ను జాతీయగీతంగా ప్రకటించేముందు ‘వందేమాతరం’, ‘జనగణమన’ లపై దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని సుదీర్ఘ చర్చ, తర్జన భర్జనలు జరిగాయి. అంతిమంగా రవీంద్రుడి ‘జనగణమన’ దే పైచేయి అయింది. దీంతో రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న ‘జనగణమన’ ను జాతీయగీతంగా, వందేమాతరంను జాతీయ గేయంగా ప్రకటించారు. అదే సమయంలో రెండూ సమాన ప్రతిపత్తి కలిగి ఉంటాయని స్పష్టం చేశారు. ‘గీతాంజలి’ రవీంద్రునికి కవిగా ప్రపంచఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ కావ్యంలోని.. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్.. గీతం మహాత్మాగాంధీకి ఇష్టమైనది. తన జీవితంపై రవీంద్రుని ప్రభావమెంతో ఉన్నదని జవహర్లాల్ నెహ్రూ కూడా స్వయంగా చెప్పుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనపుడు టాగూర్ మానసికంగా కృంగిపోయి అనారోగ్యానికి గురి అయ్యారు. చికిత్స వల్ల కూడా ప్రయోజనం లేకపోయింది. 1941 ఆగస్టు 7న తన 80 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. క్విట్ ఇండియా కార్యకర్త ఎం.ఎస్. గురుపాదస్వామి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ కార్యకర్త. రాజకీయ నేత. రెండుసార్లు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. నేడు ఆయన జయంతి. 1924 ఆగస్టు 7న మైసూరు జిల్లాలోని మలంగిలో జన్మించాడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న సమయంలో అఖిల భారత విద్యార్థుల సమాఖ్యలో సభ్యుడిగా ఉన్నాడు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీలో చేరారు. తర్వాత కాంగ్రెస్, జనతా, జనతాదళ్ పార్టీలకు మారారు. -
ఇప్ప నారాయణరెడ్డి.. స్మృతివనంలో త్యాగధనుడు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగువేల లోపు జనాభా కలిగిన ఒక చిన్న ఊరి పేరు దుమాల. 21 మంది రక్త తర్పణలతో అమరుల స్మృతి వనంగా ఈ ఊరు ప్రాధాన్యత సంతరించుకుంది. సరిగ్గా నేటికి 50 సంవత్సరాల క్రితం ‘శ్రీ వేంకటేశ్వర యువజన సంఘం’ స్థాపించి, దుమాలలో నూతన చైతన్యానికి అంకురార్పణ చేసిన ఇప్ప నారాయణరెడ్డి, ఆయన మిత్ర బృందం రైతుకూలీ సంఘం నిర్మాణం ద్వారా విప్లవోద్యమానికి కూడా నాంది పలికారు. మధ్యయుగాల నాటి భూస్వామ్య దోపిడీనీ, దానిపై ప్రజల పోరాటాన్నీ అర్థం చేసుకోవడానికి దుమాల గ్రామం అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. పంచాయితీ వ్యవస్థ అమల్లోకి వచ్చే ముందూ... వచ్చిన తర్వాత కూడా దుమాలలో దొర, మాలి పటేల్, పోలీస్ పటేల్, పట్వారి వ్యవస్థలు కొనసాగిన రోజుల్లో... లక్ష్మయ్య దొర.. దొరగా, కిష్టయ్య దొర మాలిపటేల్గా, నాంపల్లి దొర పోలీస్ పటేల్‌గా, నారాయణ పంతులు పట్వారీగా– దాదాపు 300 ఎకరాల భూములకు యజమానులుగా ఉండేవారు. వీరి దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారు. 1978లో ప్రభుత్వం కల్లోలిత ప్రాంతంగా ఈ ఏరియాను ప్రకటించి భూస్వాములకు అండగా నిలిచింది. దీంతో ప్రజాపోరాటం ఎగసిపడింది. 1989 ఫిబ్రవరి 23న దుమాలకు చెందిన కానవరపు చంద్రయ్యను బెజ్జంకి దగ్గర బూటకపు ఎన్కౌంటర్ చేయడంతో హింసాకాండ రూపమే మారిపోయింది. 2001 వరకు 22 సంవత్సరాలు నిరాఘాటంగా సాగిన ఈ హత్యాకాండలో 21 మంది ఈ గ్రామానికి చెందినవారు మరణించారు. శ్రీ వెంకటేశ్వర యువజన సంఘం ప్రాథమిక పాఠశాలకు తరగతి గదులు కట్టించింది. హైస్కూల్‌కు విశాల స్థలం ఇచ్చింది. రూ. 5 లక్షలతో తరగతి గదులు పెంచడానికి జనశక్తి పార్టీ స్వయంగా పూనుకుంది. మేక పుల్లరి, వెట్టి గొర్లు, వెట్టి నాగళ్ళు, జీతాల వ్యవస్థ అంతమైపోవడానికి పార్టీ కారణమైంది. అన్నింటికీ మించి ఉత్పత్తి శక్తులకు దొరికిన స్వేచ్ఛ ప్రజల జీవితాల్లో కొత్త మార్పునకు నాంది పలికింది. – అమర్, జనశక్తి (జూలై 29న ఇప్ప నారాయణరెడ్డి ప్రథమ వర్ధంతి)