దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా సింగపూర్లోని ఎన్నారైలు ఘనంగా నివాళులు అర్పించారు. జ్యోతి వెలిగించి, వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పాలనను గుర్తు చేసుకున్నారు. పేదప్రజల కోసం పరితపించిన గొప్ప నాయకుడని నెమరువేసుకున్నారు.
వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్సుమెంట్ వల్ల ఈ రోజు ఇక్కడ వున్నాము అని కొంతమంది భావోద్వేగం గురయ్యారు. ఎంత మంది సీఎం లు పాలించిన కూడా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కరే చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో కొలువైనారని, నిజమైన అమరత్వం అంటే ఇదే అని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ ఎన్నారై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్వైసర్ కోటి రెడ్డి, కన్వీనర్ మురళి కృష్ణ, కోర్ కమిటీ సభ్యులు శ్రీనివాసులు, మల్లికార్జున్ రెడ్డి, యుగంధర్, సుధీర్, జీవన్, కిరణ్, శ్రీనాథ్, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment