సర్పంచ్‌గా, రోటరీ క్లబ్ ద్వారా సమాజ సేవ
అందరి కష్టంలో పాలుపంచుకున్న జయమ్మ
నేడు వైఎస్ జయమ్మ 19వ వర్ధంతి
పులివెందుల రూరల్ : అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు.. కానీ ఏమీ అడగకుండానే పేదలకు సాయం అందించిన అమ్మ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాతృమూర్తి వైఎస్.జయమ్మ. వైఎస్.జయమ్మ జీవించి ఉన్నంతకాలం పులివెందులకు సంబంధించిన ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ అను నిత్యం దాన,ధర్మాలలో మునిగిపోయేది. మహా నేత వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎం కావాలన్న ఆమె చిరకాల వాంఛ నెరవేరిన తర్వాత 2006 జనవరి, 25న జయమ్మ తుదిశ్వాస వదిలారు. అంతకుమునుపు 2003లో వైఎస్సార్ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొనేందుకు పాదయాత్ర చేసిన సందర్భంలో తల్లిగా వైఎస్.జయమ్మ కుమిలిపోతూనే.. ఇంట్లో పాదయాత్ర చేస్తూ బిడ్డకు మంచి జరగాలని రోజూ ప్రారి్థంచేది.
అంతేకాదు 1999లో విపరీతమైన కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు పది మందికి పట్టెడన్నం పెట్టాలని భావించిన మాతృమూర్తి వైఎస్.జయమ్మ. అప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రతి రోజూ ఐదారు వందల మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించి ప్రశంసలందుకున్నారు. అంతేకాకుండా 1995 నుంచి 2000 వరకు పులివెందుల సర్పంచ్‌గా పనిచేసిన వైఎస్.జయమ్మ అప్పటి ప్రభుత్వం నుంచి ఉత్తమ సర్పంచ్ అవార్డుతోపాటు పంచాయతీని ఆదర్శంగా నిలిపి ఉత్తమ పంచాయతీ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే వైఎస్.జయమ్మ జీవించినంత కాలం ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ పులివెందుల అమ్మగా గుర్తింపు పొందారు. ఆమె మరణించి నేటికి సరిగ్గా 18ఏళ్లు అవుతోంది.
నేడు వైఎస్ జయమ్మ వర్ధంతి వేడుకలు
దివంగత వైఎస్.రాజారెడ్డి సతీమణి వైఎస్.జయమ్మ 19వ వర్ధంతి వేడుకను శనివారం పులివెందులలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులు పాలు పంచుకుంటారు. వైఎస్.జయమ్మ సమాధి వద్ద ప్రార్థనలతోపాటు.. స్థానిక పార్క్ వద్ద ఉన్న జయమ్మ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన తల్లి, మాజీ ఎమ్మెల్యే వైఎస్.విజయమ్మ, దివంగత వైఎస్.జార్జిరెడ్డి సతీమణి వైఎస్. భారతమ్మలతోపాటు వైఎస్సార్ సోదరుడు వైఎస్.సు«దీకర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులరి్పంచనున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. వైఎస్ కుటుంబ సభ్యులతోపాటు పలువురు వైఎస్‌ఆర్ అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment