డాలస్‌లో డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ రక్తదాన శిబిరం | YSR 13th Death anniversary Dr YS Rajasekhara Reddy Foundation Blood Donation Camp Dallas | Sakshi
Sakshi News home page

YSR 13th Death anniversary: డాలస్‌లో డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ రక్తదాన శిబిరం

Published Mon, Sep 5 2022 5:40 PM | Last Updated on Mon, Sep 5 2022 5:58 PM

YSR 13th Death anniversary Dr YS Rajasekhara Reddy Foundation Blood Donation Camp Dallas - Sakshi

డాలస్‌: డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో  వైయస్సార్ 13వ వర్ధంతి సందర్బంగా అమెరికా, టెక్సాస్‌ రాష్ట్రం, డాలస్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ సహాయం తో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. డాక్టర్ రామి రెడ్డి బూచిపూడి సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ప్రతీ సంవత్సరం రాజన్నను స్మరించుకుంటూ ఈ శిబిరం ఏర్పాటు చేస్త్నున్నందుకు అమెరికన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు వైఎస్సార్ అభిమానులను ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో రవి ఆరిమండ, రమణ్ రెడ్డి క్రిష్టపాటి, మని అన్నపురెడ్డి, రమణ పుట్లూర్, జయచంద్ర రెడ్డి, సుధాకర రెడ్డి, భాస్కర్ గండికోట, కృష్ణ రెడ్డి కోడూరు, దర్గా నాగిరెడ్డి, ఫాల్గుణ రెడ్డి, ప్రసాద్ చొప్ప, వీరా రెడ్డి వేముల, మోహన్ మల్లంపాటి, రాజేంద్ర పోలు, సుబ్బా రెడ్డి కొండ్రు, ఉమా కుర్రి, సురేష్ పులి, చెన్నారెడ్డి  క్రోవి , మల్లిఖార్జున్  మురారితో సహా  పలువురు వైఎస్సార్ అభిమానులు, డాలస్ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు  పాల్గొని విజయవంతం చేశారు.

ఈ రక్త దాన శిబిరంలో చైతన్య  కుమార్  రెడ్డి, జయచంద్ర గాజులపల్లి, కార్తీక్ ధర్మానాల, మోహన్ మల్లంపాటి, మోహన్ రెడ్డి పులగం, నాగేశ్వర గంట, నవీన్ కుమార్ రాజు అడ్డలూరి, పార్థసారథి గొర్ల, ప్రసాద్ భీమవరపు, రాఘవ రెడ్డి దాట్ల, రాంబాబు శొంఠి, రాము తవుతూ, శివచంద్ర రెడ్డి పల్లె, శివశంకర రెడ్డి వల్లూరు, సుభాష్ సురు, సుబ్రహ్మణ్యం రెడ్డి రెడ్డివారి, స్వామినాథన్, ఉజ్వల్  కుమార్ వేమన, ఉమా కుర్రి, వీర లేవక, వీరా రెడ్డి వేముల, వీరవెంకట సత్య పోతంశెట్టి, వెంకట రెడ్డి శీలం, యుగంధర్ తిప్పిరెడ్డి   తో పాటుగా పలువురు వైఎస్సార్  అభిమానులు రక్త దానం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement