దివంగత మహానేత డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి(సెప్టెంబర్2) సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్సీర్సీపీ శ్రేణులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ యూఎస్‌ఏ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు, వైస్సార్ అభిమానులు పాల్గొన్నారు.
డాక్టర్ గోసల రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ రక్తదాన శిబిరానికి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన హృదయ నేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ప్రవాసులు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ 14వ వర్ధంతి పాటు అమెరికాలో 9/11 విషాదకర ఘటనను తలచుకుంటూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించినట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.
ప్రతి ఏడాది బ్లడ్ డ్రైవ్ ఏర్పాటు చేయటం పట్ల అమెరికన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు వైఎస్సార్ అభిమానులను ప్రశంసించారు. ఇక ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లో పాల్గొన్న ప్రతిఒక్కరికీ నిర్వహకులు టీ షర్ట్ లు అందజేశారు. కాగా 2001లో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఆల్‌ఖైదా ఉగ్రవాదులు దాడి చేశారు. 9/11 Attack ఘటన జరిగి 22 ఏళ్లు అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment