భారత స్వాతంత్య్ర దినోత్సవం, సింగపూర్ జాతీయ దినోత్సవం(ఆగస్టు9)ను పురస్కరించుకొని రెడ్‌క్రాస్ సహకారంతో సింగపూర్‌లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. HSA ఔట్రం రోడ్,కొత్తగా ఏర్పాటైన వన్ పుంగోల్‌లో ఏకకాలంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 75మంది దాతలు ఈ కార్యక్రమంలో పాల్గొని మానవత్వాన్ని చాటుకున్నారు.కుంకు వరలక్ష్మి-నాగేశ్వరరావు అనే దంపతులిద్దరూ రక్తదానంలో పాల్గొని అందరికి స్ఫూర్తిగా నిలిచారు.
సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు శ్రీ బొమ్మా రెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. రక్తదానం గురించి అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. అందరూ రక్తదానం చేయాలని, దీనివల్ల మరింత ఆరోగ్యంగా ఉంటామని పేర్కొన్నారు. గత ఏళ్లుగా వరుసగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సోషల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఎవరైనా రక్తం కావాలని సహాయం అడిగితే వెంటనే స్పందించాలని పిలుపునిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి కార్యక్రమం 29 అక్టోబర్ 2023న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment