foundation
-
సమాజ హితం కోసం.. సకినీ ఫౌండేషన్
సమాజ హితం కోసం తాను ఏదో చేయాలనుకున్నాడు.. అనుకున్నదే తడవుగా.. తనకు తోచిన మేరకు పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాహాయం చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా ఆపదలో ఉన్న పలువురు బస్తీ వాసులకు ఆపద్భాంధవుడిగా నిలుస్తున్నాడు. మురికి వాడల్లో నివసించే పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. ఓ వైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే సమాజ సేవలోనూ ముందు వరుసలో ఉంటున్నాడు.. – గోల్కొండ నగరంలో అది పెద్ద లేబర్ అడ్డాల్లో టోలిచౌకీ లేబర్ అడ్డా ఒకటి. పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా నగర పరిసరాల నుంచి ఎందరో నిరుపేదలు ఉపాధి కోసం స్థానిక లేబర్ అడ్డాలకు వస్తుంటారు. పని దొరకక వారిలో అనేక మంది రోజుల తరబడి పస్తులు ఉంటుంటారు. ఇది గమనించిన ఆసిఫ్ హుసేన్స్న్ సోహెల్ సూర్యనగర్ కాలనీలో మాషా అల్లా పేరిట కిచెన్ ఏర్పాటు చేశాడు. దీని ద్వారా నిత్యం 250 మందికి మధ్యాహ్న సమయంలో భోజనం అందిస్తున్నాడు. వలస కూలీలకు అండగా.. ఆసిఫ్‌హుస్సేన్ సోహెల్ సేవలపై ప్రశంసలునగరంలో గోల్కొండకు చెందిన ఆసిఫ్‌హుస్సేన్ సోహెల్ సమాజంలో మార్పు కోసం తన వంతు కృషి చేస్తున్నాడు. మురికివాడల్లో చదువుకు నోచుకోని నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నాడు. చదువు మధ్యలో ఆపేసిన వారిని గుర్తించి వారికి అవగాహన కల్పించి, పై చదువులకు ప్రైవేటు పాఠశాలల్లో చేరి్పంచడం వంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. దీంతో పాటు ఆయా మురికి వాడల్లోని మహిళల సాధికారత కోసం సకీనా ఫౌండేషన్ ద్వారా సలహాలు, సూచనలు ఇస్తూ.. వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నాడు. మహిళలకు ఉచితంగా వివిధ ఉపాధి పథకాల్లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. పేదల బస్తీలైన విరాట్‌నగర్ వంటి ప్రాంతాల్లో ఫ్యాషన్ డిజైనింగ్, ఫస్ట్ ఎయిడ్, జిగ్‌జాగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా, వారి ఆర్థిక స్థితికి తోడ్పడుతూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. కరోనా సమయంలో.. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో వలస కూలీలకు తాను అండగా ఉన్నానంటూ నిత్యావసరాలు అందించడంతో పాటు వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఉచిత రవాణా కలి్పంచాడు. టోలిచౌకీ ముంపు కాలనీగా పేరుగాంచిన నదీమ్ కాలనీలో వరదల సమయంలో బోట్లతో రంగంలోకి దిగి ఎందరినో సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. వీటన్నింటికీ తోడుగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ బస్తీలో రోగులకు వారి ఇంటి ముందే మందులు అందిస్తున్నారు. మున్ముందు కూడా సకీనా ఫౌండేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని సోహెల్ చెబుతున్నారు. -
రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో బ్యూటీ సెన్సేషన్ ప్రొడక్ట్..!
సౌందర్య ప్రియులు, బ్యూటీ ఇండస్ట్రీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫౌండేషన్ ప్రొడక్ట్ షీగ్లామ్(SheGlam) ఇండియాలో లాంచ్ అయ్యింది. మేకప్ ప్రియులు ఇష్టపడే ఈ ప్రొడక్ట్‌ని రిలయన్స్ రిటైల్(Reliance Retail)కు చెందిన టిరా(Tira) ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మేకప్ ప్రోడక్ట్స్‌లో ది బెస్ట్ షీగ్లామ్ ప్రొడక్ట్స్. బ్యూటీ ప్రియులు అత్యంత మెచ్చే ప్రోడక్ట్ ఇది. ఈ షీగ్లామ్ ప్రొడక్ట్స్‌లో గ్లో బ్లూమ్ లిక్విడ్ హైలైటర్, డైనమాట్ బూమ్ లాస్టింగ్ లిప్‌స్టిక్‌లు, స్కిన్ఫైనెట్ హైడ్రేటింగ్ ఫౌండేషన్ వంటి ఇతర ఉత్పత్తలు అందుబాటలో ఉంటాయి. ఇవి ముఖానికి చక్కటి అందమైన మేకప్(Make Up)ని ఇస్తాయి. అంతేగాక సరసమైన ధరలో లభించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ల, మేకప్ ఆర్టిస్ట్‌లు తక్కవ ధరలోనే మంచి నాణ్యతతో కూడిన ఉత్పత్తి లభిస్తుందని ప్రశంసించిన ప్రొడక్ట్ ఇది. ఇప్పుడు టిరాలో షెగ్లామ్ అరంగేట్రంతో అందాల ఔత్సాహికులకు చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది. సమగ్ర సౌందర్యానికి భారతదేశాన్ని గమ్యస్థానంగా చేసేలా టిరా ఈ ప్రొడక్ట్ లాంచ్‌తో బలపరుస్తోంది. యావత్తు ప్రపంచం మెచ్చిన ఈ బ్రాండ్‌ని టిరా వెబ్సైట్లో, యాప్‌లలో అందుబాటులో ఉంటుందని రిలయన్స్ రిటైల్ టిరా ప్రకటించింది. ఇక త్వరలో టిరా స్టోర్లలో కూడా అందుబాటులో ఉండనుందని పేర్కొంది.చర్మ సంరక్షణ జాగ్రత్తలు..ఎంతటి బ్రాండెడ్ ఉత్పత్తులైనా.. చర్మానికి సరిపోతుందో లేదో పరీక్షించాలిఅవసరమైతే చర్మ నిపణలను సంప్రదించి వినియోగించడం మంచిదిఏ బ్యూటీ ప్రొడక్స్ట్ అయినా.. అతిగా వాడితే ప్రమాదమేనిద్రించే సమయంలో తప్పనిసరిగా మేకప్‌ని తొలగించుకోవాలి. (చదవండి: మహాకుంభమేళాలో ఆకర్షణగా మరో వింత బాబా..ఏకంగా తలపైనే పంటలు..!) -
దివ్యాంగుల్లో కొత్త వెలుగులు, మన ‘సారా’ సేవకే అంకితం
తమ కోసం ఏదైనా పని చేసుకుంటే స్వార్థం.. అదే సమాజం కోసం చేస్తే సేవ. ఇందులోనూ ఒక్కొక్కరి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది. కొంత మంది వృద్ధులకు సహాయం చేస్తే, మరి కొందరు అనాథలకు, పేద పిల్లలకు సహకారం అందిస్తారు. ఇలా పేద విద్యార్థులు, దివ్యాంగులు, అనాథ వృద్ధుల సంక్షేమం కోసం పరితపిస్తూ, తనకు తోచిన సేవలు అందించడమే కాకుండా, తన లాంటి ఎంతో మందికి దక్సూచిలా నిలుస్తున్నారు. అంగవైకల్యం కలిగిన వారికి భరోసా కల్పిస్తూ వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేయూతనిస్తున్నారు. ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా 200 మంది విద్యార్థులు, 150 మంది దివ్యాంగులకు అండగా ఉన్నారు డాక్టర్ సారథామురుగన్. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందారు ఈ సేవకురాలు.. – అడ్డగుట్ట కేరళకు చెందిన ఈమె పదిహేను ఏళ్ల క్రితం నగరానికి వచ్చి సికింద్రాబాద్‌లోని తన బంధువులతో కలిసి ఉంటున్నారు. మొదట ఐటీ ఉద్యోగం చేస్తూ జీవనం సాగించిన సారా అనంతరం, ఉద్యోగం మానేసి పేద విద్యార్థులు, దివ్యాంగుల సేవకు 2016లో సెవెన్ రేస్ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈమె సేవలను గుర్తించి ఇటీవల డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ నేషనల్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెలలో మహారాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు డాక్టర్ సారా. దివ్యాంగుల్లో స్ఫూర్తి నిపుతూ.. దివ్యాంగుల్లో స్ఫూర్తిని నింపి మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తోంది. సొంత కాళ్లపై నిలబడేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా దివ్యాంగులతో చిరు వ్యాపారాలు పెట్టించడం, కుట్టు మిషన్లు పంపిణీ వంటి ఉపాధి మార్గాలను కల్పిస్తున్నారు. మురికివాడల్లోనూ, రోడ్లపైనా ఎలాంటి ఆసరా లేని వారికి ఆహారం పంపిణీ చేస్తారు. దాదాపు 150 మంది దివ్యాంగులకు కుట్టు మిషన్లతో పాటు 200 వీల్ చైర్లు పంపిణీ చేశారు. 30 వేల గ్రాసరీ కిట్ల పంపిణీ.. కోవిడ్ మహమ్మారి సమయంలో రెక్కాడితే కానీ డొక్కాడని పేదలకు సెవెన్ రేస్ ఫౌండేషన్ ద్వారా 30 వేల నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఎంతో ముఖ్యమైన ఆక్సిజన్ సిలిండర్లు కూడా సప్లై చేశారు. సహాయం కోసం ఎదురు చూస్తున్న ఎందరికో అండగా నిలిచారు. విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం.. ప్రస్తుత సమాజంలో ధనిక, పేద అనే భేదాలు లేకుండా ఉండాలంటే అది విద్యతోనే సాధ్యమని నమ్ముతాను. అందుకే మా ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులు, వికలాంగులకు సహాయ సహకారాలు అందించే దాతల సహాయంతో విద్యార్థులను చదివిస్తాం. ఇటీవల బాబా సాహెబ్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపిక చేయడం గర్వంగా ఉంది. – డాక్టర్ సారా, సెవెన్ రేస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు పేదలకు ఉన్నత విద్య లక్ష్యంగా..ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు మెరుగైన ఉన్నత విద్యను అందించేందుకు సారా నిరంతరం శ్రమిస్తున్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఓల్డ్ సఫీల్‌గూడ, మౌలాలి ప్రాంతాల్లోని 6 ప్రభుత్వ పాఠశాలను సెవెన్‌రేస్ ఫౌండేషన్ దత్తత తీసుకుంది. ప్రతి ఏడాదీ ఉచితంగా నోటు పుస్తకాలు, స్టేషనరీ, విద్యారి్థనులకు శానిటరీ కిట్స్ పంపిణీ చేస్తుంటారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను సెవెన్‌రేస్ సంస్థ సొంతంగా చదివిస్తుంది. -
కొత్త బంగారు లోకం.. అనాథ చిన్నారులకు ఆహ్వానం
సాక్షి, సిటీబ్యూరో: మన చుట్టూనే ప్రేమ, ఆదరణ నోచుకోని బాల్యాలెన్నో..తల్లిదండ్రులు లేకపోవడం వలనో, పేదరికం కారణంగానో అనాథ శరణాలయాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులు ఎందరో.. అందమైన భవిష్యత్ కలలు కంటూ, ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు సాగుతుంటాయి ఆ పసి హృదయాలు. ఆ పిల్లలకు ప్రపంచ విజ్ఞానం, సంస్కృతుల సమ్మేళనం, ప్రస్తుత ఆధునిక జీవన శైలి గురించి తెలియాల్సిన అవసరం ఉందని కొందరి ఆలోచన. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని అనాథ చిన్నారులను హైదరాబాద్‌కు ఆహ్వానించి, విలాసవంతమైన ఆతిథ్యమిచ్చి వారి సంతోషాలకు, విజ్ఞానానికి ప్రోత్సాహం అందించే ‘యూనిటీ–ఎక్స్’ అనే అద్భుత ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడి చిన్నారులను సైతం వివిధ నగరాలకు తీసుకెళ్లే నూతన సంస్కృతికి నాంది పలికారు. గతేడాది సెప్టెంబర్ నెలలో చెన్నైలోని ఫరెవర్ ట్రస్ట్‌కు చెందిన 45 మంది చిన్నారులు నగరానికి చేరుకుని 4 రోజుల విజ్ఞాన, వినోద పర్యటనను ఆస్వాదించారు. ఈ యూనిటీ–ఎక్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా నగరంలోని పర్యాటక ప్రాంతాలు, పరిశోధన కేంద్రాలను వీక్షించారు. అదేవిధంగా కొద్ది రోజుల క్రితమే నగరంలోని వాల్మీకి గురుకుల్కు చెందిన 20 మంది చిన్నారులు చెన్నైకి సుసంపన్నమైన యాత్ర చేశారు. ఐకమత్యం, కల్చరల్ ఎక్స్చేంజ్ లో భాగంగా ఈ చిన్నారులు ఎన్నో మధుర జ్ఞాపకాలను, సామాజిక–వాస్తవిక అవగాహన పెంచుకుంటున్నారు. ఇలాంటి వినూత్న ప్రాజెక్టును హైదరాబాద్‌లోని వాల్మీకి ట్రావెల్ అండ్ టూరిజం సొల్యూషన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ హరి కిషన్ వాల్మీకి ప్రారంభించారు. ఈ గొప్ప ప్రయత్నానికి చెన్నైలోని స్కల్ ఇంటర్నేషనల్ సంస్థ కూడా భాగస్వామిగా చేరింది. ఈ సంస్థల సీఎస్ఆర్ నిధులతో యూనిటీ–ఎక్స్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా జీఆర్టీ రాడిసన్, టెంపుల్ బే, రెయిన్ ట్రీ, ది పార్క్ హోటల్, రెసిడెన్సీ హోటల్స్ తదితర 5–స్టార్ హోటళ్లలో బస చేయడం, అక్కడి ఆహారాన్ని విందు చేయడం, విలాసవంతమైన బెంజ్ బస్సులతో గరుడ లాజిస్టిక్స్‌లో ప్రయాణం చేయడం వంటి అవకాశాలను కల్పిస్తున్నారు. ముఖ్యంగా విద్య, విజ్ఞానం, కెరీర్ సెమినార్స్ తదితర అంశాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు విభిన్న సంస్కృతుల సమ్మిళిత ప్రయాణం, అనుభవాలు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా గొప్ప ఉపాధ్యాయుడితో సమానం. ఈ కోణంలోనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వ్యవస్థాపకులు డాక్టర్ హరికిషన్ వాల్మీకి తెలిపారు. మా ప్రయత్నానికి చెన్నైలోని స్కల్ అధ్యక్షుడు షబిన్ సర్వోత్తమ్ వంటి వారు భాగస్వామ్య సహకారం అందించడం శుభపరిణామం అన్నారు. ఈ ప్రాజెక్టును నగరంలోని వాల్మీకి ఫౌండేషన్ పర్యవేక్షిస్తూ, అవసరమైన మద్దతు, సహకారం అందిస్తోంది. ఐక్యతకు నిదర్శనంగాప్రేమ, ఆదరణ పొందకపోవడమే కాకుండా సామాజికంగా నిర్లక్ష్యానికి గురైన పిల్లలు ఈ అనాథలు. వారిని భావిపౌరులుగా తీర్చిదిద్దాలనుకుంటే సౌలభ్యాలు, విద్య మాత్రమే సరిపోదు. అధునాతన ప్రపంచం, ఈ తరం జీవనశైలి, సామాజిక పరిపక్వత చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఇలాంటి చిన్నారులు సైతం అందరి పిల్లలమాదిరిగానే వారి జీవితాన్ని ఆస్వాదించడంలో ప్రాజెక్ట్ యూనిటీ–ఎక్స్ విశేషంగా కృషి చేస్తుంది. ఈ తరహా కార్యక్రమాలు సామాజిక సమానత్వానికి, ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తాయి. – డాక్టర్ సూర్య గణేష్ వాల్మీకి, వాల్మీకి ఫౌండేషన్ అధ్యక్షుడు. ఆలోచన మారింది.. మా ఆశ్రమం తప్ప మరే ప్రపంచం తెలియని మేమంతా చెన్నై వెళ్లడం మంచి అనుభూతి. ఈ ప్రయాణం విజ్ఞానంతో పాటు చెన్నైలో మంచి మిత్రులనూ చేరుకునేలా చేసింది. మళ్లీ అక్కడి పిల్లలు హైదరాబాద్ రావడం కుటుంబ సభ్యులను కలిసినట్లే అనిపించింది. యూనిటీ–ఎక్స్ నా ఆలోచనా విధానాన్ని, భవిష్యత్ ప్రణాళికలను మార్చింది. ప్రపంచం చాలా పెద్దది, అవకాశాలకు కొదువ లేదు అనే నమ్మకాన్ని ఇచ్చింది. – మారుతి, వాల్మీకి గురుకుల్ విద్యార్థి ఇదీ చదవండి: 2025లో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే..బెస్ట్ టిప్స్! -
డాక్టర్ సతీష్ కత్తులకు రేవా అవార్డు
హైదరాబాద్: రేవా ఫౌండేషన్ – 2024 (రేవా – రైజింగ్ అవేర్నెస్ ఆఫ్ యూత్ విత్ ఆటిజం) ప్రతిష్టాత్మక గాలా అవార్డును డాక్టర్ సతీష్ కత్తుల (ఎఎపిఐ ప్రెసిడెంట్, యూఎస్)కు ప్రకటించింది. న్యూయార్క్ నగరంలోని ప్రెస్టీజియస్ ఫెర్రీ హోటల్ లో గురువారం ఆయన ఈ అవార్డును అందుకున్నారు. రేవా ఫౌండేషన్ ఆటిజంతో యువతకు అవగాహన కల్పిస్తూ, బాధితులకు మద్దతుగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఆయా రంగాల్లో ఇతరులకు స్ఫూర్తినిచ్చే వారిని సత్కరిస్తూ, స్ఫూర్తిదాయక అవార్డు గాలా ను ప్రదానం చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరానికి చెందిన డాక్టర్ సతీష్ కత్తుల సేవలను గుర్తించిన ఫౌండేషన్ ఆయనకు ద ఇన్ఫిరేషనల్ అచీవర్ 2024 అవార్డును ప్రదానం చేసి సత్కరించింది. అవార్డు గ్రహీత డాక్టర్ సతీష్ కత్తుల ఈ సందర్భంగా మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా రేవా ఫౌండేషన్ ఆటిజం బాధితులకు మద్దతుగా చేస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఫౌండేషన్ ప్రతినిధులు మణికాంబోజ్, డాక్టర్ రష్మీ శర్మలకు అభినందనలు తెలియజేశారు. తన సేవలను గుర్తించి అవార్డును బహూకరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
వివాహబంధంతో ఒక్కటైన 37 జంటలు
సోలాపూర్: సోలాపూర్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ శాసనసభ్యుడు సుభాష్ దేశ్‌ముఖ్ నేతృత్వంలో లోకమంగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజాపూర్ రోడ్డు వైపునున్న డీఈడీ కళాశాల మైదానంలో పట్టణంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో 37 జంటలు వివాహబంధంతో ఒక్కటయ్యాయి. ఈ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా ముస్తాబైన వధూవరులను గుర్రపు బగ్గీల్లో, బ్యాండ్ బాజాలతో ఊరేగించారు. ఈ వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే సుభాష్ దేశముఖ్, మాజీ ఎంపీ జయసిద్ధేశ్వర మహాస్వామి, లోకమంగల్ ఫౌండేషన్ అధ్యక్షుడు రోహన్ దేశముఖ్, మనీష్ దేశముఖ్, పంచాక్షరి శివాచార్య మహాస్వామిజీ, శ్రీకాంత్ శివచార్య మహాస్వామి, సిద్ధ లింగ మహాస్వామి లతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇకపై ప్రతిగ్రామంలో నిర్వహిస్తాం: ఎమ్మెల్యే సుభాష్ దేశ్‌ముఖ్ భవిష్యత్తులో లోకమంగల్ ఫౌండేషన్ దక్షిణ సోలాపూర్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని ప్రతి గ్రామంలో సామూహిక వివాహాలను నిర్వహించాలని సంకల్పించినట్లు సుభాష్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. వివాహం చేసుకోదలచిన జంటలు ముందస్తుగా తమ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామపంచాయితీ మెంబర్ల ద్వారా లోక్‌మంగల్ ఫౌండేషన్‌ను సంప్రదించాలని కోరారు. ఒక్కో గ్రామం నుంచి కనీసం ఐదు జంటలు లేదా అంతకుమంచి ఎందరు ముందుకు వచ్చినా వారిని వివాహబంధంతో ఒక్కటి చేస్తామని, వివాహ వేడుకల నాడు గ్రామప్రజలందరికీ విందును కూడా ఏర్పాటుచేయనున్నట్లు వివరించారు. -
ఆర్ట్‌తో మూగ జీవుల సంక్షేమంపై అవగాహన..!
’ది కైండ్ అవర్’ ఫౌండేషన్ ద్వారా రెండు వందల యాభైకి పైగా వీధి కుక్కలను కాపాడుతోంది లక్నో వాసి మౌలి మెహ్రోత్రా. కళ ద్వారా జంతువుల పట్ల ప్రేమను ప్రజలకు తెలియజేస్తుంది. వీధుల్లో సృజనాత్మక కుడ్యచిత్రాల ఏర్పాటు, కమ్యూనిటీ ఔట్‌రీచ్‌లు, వర్క్‌షాప్‌ల ద్వారా పిల్లలకు బాధ్యతను బోధిస్తోంది.‘జంతు హక్కుల‘ గురించి చెబుతున్నప్పుడు చాలామందిలో ‘ఇది అవసరమా?’ అన్నారు. కానీ, ఎవ్వరి మాటలను పట్టించుకోను అంటోంది మౌలి. నలుగురు తిరిగే వీధుల్లో మూగ జంతువులకు సంబంధించిన చిత్రాలను ఉంచుతుంది. తనలాగే ఆలోచించే శ్రేయోభిలాషుల బృందం నుంచి ఆలోచింపజేసే పెయింటింగ్ తెప్పించి, వీధుల్లో ఏర్పాటు చేస్తుంది.కళ– వృత్తి సమతుల్యత23 ఏళ్ల వయస్సులో మౌళి తన చుట్టూ ఉన్న కుక్కలకు ఆహారం ఇవ్వడం, రక్షించడం, సంరక్షణ చేయడం ప్రారంభించింది. ‘నేను దాదాపు 200 కుక్కల బాధ్యత తీసుకున్నాను. ఒక ఏడాది పాటు ప్రతిరోజూ వాటి సంరక్షణ చూశాను. కానీ ఒంటరిగా చేయలేమని గ్రహించాను. నేను ప్రయాణాలు చేయవలసి వస్తే,.. ఈ పని ఎలా కొనసాగుతుంది? నేను చని΄ోతే ఏమి జరుగుతుందో... అని కూడా ఆలోచించడం మొదలుపెట్టాను. జంతు సంక్షేమం పట్ల తనలో పెరుగుతున్న నిబద్ధతతో కళలలో వృత్తిని సమతుల్యం చేసుకోవడంలో అన్నీ సవాళ్లే. అందుకే, ఈ అభిరుచిని ఒక సంస్థగా మార్చాలనుకున్నాను. అప్పుడే ప్రతి జంతువుకు మరింత ప్రేమను పంచవచ్చు అనుకున్నాను’ అని ఆమె వివరిస్తుంది.లోతైన అవగాహనమౌళి చేసే ప్రయాణంలో సంస్థను ఎలా నమోదు చేసుకోవాలో తెలియక΄ోయినప్పటికీ, చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి సహాయం కోరింది. ‘నేను దీన్ని రిజిస్టర్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు సొసైటీగానా, ట్రస్ట్గానా లేదా సెక్షన్ 8గా జాబితా చేయాలనుకుంటున్నారా అని అధికారులు అడిగారు. నాకు అవేవీ తెలియవు. కానీ, మెల్లగా అర్ధం చేసుకున్నాను. నల్సార్ యూనివ ర్శిటీ నుంచి లా లో మాస్టర్స్ చదువుతున్నప్పుడు జంతు సంరక్షణ పట్ల అంకితభావం మరింత పెరిగింది. దీంతో వీటిలో శిక్షణ తీసు కున్నా. ఇది నాకు సబ్జెక్ట్‌లో చాలా లోతైన అవగాహనను ఇచ్చింది. ఈ విషయాలపై పూర్తిగా భిన్నమైన ఆలోచనలతో ఉన్న నేను ఎవరితోనైనా కూర్చున్నప్పుడు చేస్తున్న పని గురించి తప్పు పట్టాలని చూస్తుంటారు. కానీ, వారితో చర్చలు చేయను’ అని వివరిస్తుంది.గోడల నుంచి మనసుల వరకుకైండ్ అవర్ ఫౌండేషన్ పనుల్లో కళను చేర్చడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొంది మౌళి. అదే వీధి కళ. మౌళి చెబుతున్నట్టుగా వారు నివసించే వ్యక్తులకు విషయం చేరే శక్తివంతమైన వ్యక్తీకరణ ఇది. ‘వారు కుక్కను ఎందుకు చిత్రీకరిస్తున్నారు?‘ అని వీ«ధిలో ఎవరైనా అడుగుతారు. ‘అతను ఈ వీధిలో నివసిస్తున్నాడు కాబట్టి అని మేం చెబుతాం’ అని వివరిస్తుంది మౌళి. మౌళి చిత్రించిన కుక్కల వీధి కుడ్యచిత్రాలు లక్నో చుట్టూ, బయట గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. లక్నోలోని పాత పాడుబడిన ప్రభుత్వ భవనంపై కుక్కను చిత్రించడం ఆమె అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి. దీనికి మంచి స్పందన లభించింది. చాలా మంది ప్రజలు పెయింటింగ్‌ను గమనించడం ప్రారంభించారు. రిషికేశ్‌లోని బ్యాక్‌ప్యాకర్స్ హాస్టల్లో మరొక కుడ్యచిత్రం ఏర్పాటు చేసింది.‘నాలుగేళ్ల క్రితం ఆ చిత్రం ఏర్పాటు చేశాం. ఇప్పటికీ ఆ పెయింటింగ్‌ను ప్రజలు ఇష్టపడతారు’ అని చెప్పే మౌళి కుడ్యచిత్రాలతో పాటు, ఫౌండేషన్ వర్క్‌షాప్‌ల ద్వారా విద్యార్థులతో కలిసి పనుల్లో నిమగ్నమై ఉంటుంది. ‘‘ఒక పాఠశాలలో మేం పిల్లలతో కలిసి గోడకు పెయింట్ చేశాం. వారు ఆ పనిలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. పెయింటింగ్‌లో ఉన్న జంతువుల గురించి మేం వారికి నేర్పించాం. వాటిని ఎలా చూసుకోవాలో చెబితే చాలా బాగా అర్ధం చేసుకున్నారు ’అంటూ నాటి విషయాలను గుర్తుచేసుకుంటుంది. వీధి జంతువుల పట్ల బాధ్యతను ్ర΄ోత్సహించడానికి ఫౌండేషన్ స్థానిక సంఘాలతో కలిసి పనిచేస్తుంది. వారు స్థానిక పశువైద్యులతో కలిసి ఆహారం, రెస్క్యూ సేవలు, సంరక్షణనూ అందిస్తున్నారు.పంచుకునే వ్యక్తులతో కలిసి..బాలీవుడ్ నిర్మాత అమన్ విషేరాతో సహా మౌళి నిబద్ధత చాలా మందికి నచ్చింది. ‘ఎప్పటినుండో ఒక షోలో పాల్గొనాలని, జంతు సంక్షేమం కోసం పని చేయాలని ఉందని అడిగాను. అలా మేమిద్దరం కళాకారులం కాబట్టి, ఇతర జీవులు, జంతువుల గురించి పిల్లలకు నేర్పించడంలో కళ నిజంగా సహాయపడుతుందని, మనలాగే వాటికీ భావోద్వేగాలు, బాధలు ఎలా అనుభవిస్తాయో వాస్తవాన్ని గ్రహించాం. ఇప్పుడు పాఠ్యాంశాలు, స్టడీ మెటీరియల్స్, జంతు సంక్షేమం గురించి పిల్లలకు బోధించడానికి పంచుకునే కథలను రూపొందించడానికి కలిసి పని చేస్తున్నాం’ అని వివరించారు. టీమ్‌లోని మరొక సభ్యురాలు మేఘన మాట్లాడుతూ– ‘ఎవరో ఒక కుక్కపిల్లని నా ఇంటి బయట పడేశారు. ఏమి చేయాలో గుర్తించే ప్రయత్నంలో నేను మౌళి గురించి తెలుసుకున్నాను. నాకు ఆ సంస్థ పనులు చాలా బాగా నచ్చాయి. నేను కూడా వారితో కలిసి పనిచేయడం ప్రారంభించాను’ అని చెబుతుంది. (చదవండి: సోషల్ మీడియా గెలిపించింది..!) -
ఉల్లాసంగా నారీ ఫౌండేషన్ ‘గ్రాండ్ గార్బా’
సాక్షి ముంబై: నారీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం వర్లీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హాల్లో ‘గ్రాండ్ గార్బా’కార్యక్రమం ఘనంగా జరిగింది. దాదాపు 150 మంది మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ కిషోర్ కకేరా న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా లక్కీడ్రా నిర్వహించి ఉత్తమ ఆహార్యం, ఉత్తమ నృత్య ప్రదర్శన కనబరిచిన మహిళలకు బహుమతులను అందజేశారు. ప్రతి ఏడాది అక్టోబర్ నెలలో ఇలాగే గ్రాండ్ గార్బా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నారీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ సంజయ్ అల్లె తెలియజేశారు. ఈ ఈవెంట్‌ను విజయవంతం చేసేందుకు పవిత్ర కిరణ్ దొంత, నితిన్ దోమల్, గణేష్ గడ్డిమిడి, ఆకాష్ నంది, రాకేష్ గడిపెల్లి, రాజేంద్ర ఆడెపు, శ్రీమతి మయూరి, శ్రీమతి సమత, శ్రీమతి వినోద గుజ్జేటి తదితరులు ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు. -
దేశ భద్రతే మాకు ముఖ్యం
-
సమీకృత గురుకులాలకు అంకురార్పణ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ సౌకర్యాలతో, అత్యాధునిక డిజైన్లతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలకు అంకురార్పణ జరిగింది. తొలిదశలో భాగంగా రాష్ట్రంలోని 28 నియోజకవర్గాల్లో 28 రెసిడెన్షియల్ పాఠశాలలకు శుక్రవారం శంకుస్థాపనలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందుర్గులో సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయగా, ఇతర ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలం గోవిందాపురంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని గంధంవారి గూడెంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్‌పల్లిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం తంగళపల్లి, మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ పరిధిలోని యాదవులపల్లిలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఖమ్మం జిల్లా పొన్నేకల్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సమీకృత పాఠశాల భవనాలకు భూమిపూజ చేశారు.కొడంగల్, హుజూర్నగర్, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, ఆందోల్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, జడ్చర్ల, పరకాల, నారాయణఖేడ్, దేవరకద్ర, నాగర్‌కర్నూల్, నర్సంపేటల్లో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ నేతలు శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ పాఠశాలల్లో విద్యాబోధన అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటుందని, ఒక్కో స్కూల్ కాంప్లెక్స్‌లో 2,560 మంది చదువుకునే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ గురుకులాల్లో లైబ్రరీ, డిజిటల్ క్లాస్రూంలు, డైనింగ్ హాల్, డారి్మటరీ, బాత్రూమ్లు, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు నివాస సముదాయాలు, ఇండోర్, అవుట్డోర్ క్రీడా మైదానాలు, ఆడిటోరియం, హాస్పిటల్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. ఐదో తరగతి నుంచి ఇంటరీ్మడియట్ వరకు ఇక్కడ చదువుకోవచ్చు. -
ఆర్య ఏజీ, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఆధ్వర్యంలో విజయవంతంగా రిత్ సమ్మిట్ 2.0
భారత్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రెయిన్ కామర్స్ ప్లాట్‌ఫారమ్. ఆర్య ఏజీ (arya.ag) బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్ స్థాపించిన అమెరికన్ ప్రైవేట్ ఫౌండేషన్ బిల్& మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి దేశ రాజధాని ఢిల్లీలో రిత్ సమ్మిట్ రెండో ఎడిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఇండియా హాబిటాట్ సెంటర్లో జరిగిన ఈ రిట్ సమ్మిట్ ప్రముఖ అగ్రిబిజినెస్లు, టెక్నాలజీ ప్రొవైడర్లు, అంతర్జాతీయ నిపుణులు, అభివృద్ధి సంస్థలను ఒకచోట చేర్చిందివీరంతా వ్యవసాయ రంగంలో వాతావరణ స్థితిస్థాపకతను పెంపొందించడానికి భాగస్వామ్యాలు, కార్యక్రమాలు, ఆచరణాత్మక సాంకేతికతలను అన్వేషించడానికి వ్యవసాయ కమ్యూనిటీలకు స్థిరమైన భవిష్యత్తును అందించడంలో సహాయపడటానికి నిపుణులను కనెక్ట్ చేయడానికి, జ్ఞానాన్ని పంచుకోవడానికి, వినూత్న పరిష్కారాలను కనుగొనడానికి సమ్మిట్ ఒక వేదికగా మారింది.arya.ag. సహ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ చంద్ర తన ప్రసంగంతో సమ్మిట్‌ను ప్రారంభించారు. వాతావరణాన్ని తట్టుకోగలిగేలా వ్యవసాయం చేయడానికి ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చే మార్కెట్-నేతృత్వంలోని నమూనా ప్రాముఖ్యతను తెలియజేశారు. దేశంలో అతిపెద్ద, ఏకైక లాభదాయకమైన అగ్రిటెక్ కంపెనీని నిర్మించడమే లక్ష్యమని తెలిపారు.ప్రతి వాటాదారులకు ప్రయోజనం చేకూర్చే మార్కెట్ నేతృత్వంలోని నమూనాను రూపొందించకపోతే వ్యవసాయ వాతావరణాన్ని స్థితిస్థాపకంగా మార్చడం అసాధ్యమని పేర్కొన్నారు, వాటాదారులందరూ కలిసి ఈ దిశలో తమ వంతు కృషి చేసేందుకు కట్టుబడి ఉంటే తప్ప ఇది కూడా సాధ్యం కాదని, అలాగే రిత్ వెనుక ఉన్న మా తత్వశాస్త్రం అదేనని ఆనంద్ పేర్కొన్నారు. -
గొప్పమనసు చాటుకున్న అతియా శెట్టి- కేఎల్ రాహుల్ దంపతులు!
బాలీవుడ్ భామ, హీరోయిన్ అతియా శెట్టి బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్లో కొద్ది సినిమాలే చేసినా.. గతేడాది క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో పెళ్లి తర్వాత మరింత ఫేమస్ అయింది. అయితే తాజాగా తన భర్తతో కలిసి ఓ ఛారిటీని స్థాపించింది ముద్దుగుమ్మ. విప్లా ఫౌండేషన్ కోసం నిధులను సేకరించేందుకు 'క్రికెట్ ఫర్ ఎ కాజ్' పేరుతో ఛారిటీని ప్రకటించారు. కాగా... ముంబయిలో సేవ్ ది చిల్డ్రన్ ఇండియాగా పిలువబడే సంస్థను ఆ తర్వాత విప్లా ఫౌండేషన్‌గా మార్చారు. మరికొందరు క్రికెటర్లతో కలిసి ఛారిటీ తరఫున నిధులు సమీకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వేలం పాట నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అతియా మాట్లాడుతూ.. 'విప్లా ఫౌండేషన్ నా చిన్నతనంలోనే ఓ ముఖ్యమైన భాగం. నేను స్కూల్ అయిపోయిన తర్వాత చాలా రోజుల పాటు ఇక్కడ పిల్లలకు పాఠాలు బోధిస్తూ వారితో గడిపేదాన్ని. మేము నిర్వహించే వేలం ద్వారా వినికిడి లోపం, వైకల్యం ఉన్న పిల్లల అవసరాలను తీర్చాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టాం. విప్లా ఫౌండేషన్‌ను ప్రారంభించిన నాని వారసత్వాన్ని కొనసాగించాలనేదే నా ఆశయం'అని తెలిపారు.కేఎల్ రాహుల్ మాట్లాడుతూ..' ఇలాంటి పాఠశాలకు మొదటిసారి రావడం చాలా ఉద్వేగభరితంగా అనిపించింది. అతియా కుటుంబం భాగమైన ఈ గొప్ప పనికి సహకరించడానికి ఈ పిల్లలే నన్ను ప్రేరేపించారు. వీరికి అన్ని రకాలుగా తోడ్పాటు అందించడంలో విప్లా ఫౌండేషన్ చేస్తున్న అద్భుతమైన పనికి మద్దతు ఇవ్వడానికి వేలం నిర్వహిస్తున్నాం. నేను నాతోటి క్రికెట్ సోదరులను సంప్రదించినప్పుడు.. వారు తమ విలువైన క్రికెట్ వస్తువులను వేలం ద్వారా వచ్చే డబ్బును విరాళం ఇచ్చేందుకు సహకరించారు. వేలంలో పాల్గొని ప్రత్యేకమైన ఈ పిల్లల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం మాతో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.' అని అన్నారు.కాగా.. అతియా శెట్టి, కేఎల్ రాహుల్ జనవరి 23, 2023న వివాహం చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే అతియా చివరిసారిగా 2019 చిత్రం 'మోతీచూర్ చక్నాచూర్'లో కనిపించింది. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటించింది. ఆమె 2015లో వచ్చిన 'హీరో'లో మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అంతేకాకుండా అర్జున్ కపూర్ నటించిన 'ముబారకన్' చిత్రంలోనూ నటించింది. -
TG: ఫౌండేషన్ పేరుతో భారీ మోసం.. ప్లాట్స్ ఇస్తామని 540 కోట్లు..
సాక్షి, హైదరాబాద్: ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో తెలంగాణలో భారీ మోసం జరిగింది. ఫౌండేషన్‌లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశ చూపించి భారీ మొత్తంలో డబ్బులు దండుకున్నారు. తాజాగా ఇది మోసమని తేలడంతో బాధితులకు పోలీసులను ఆశ్రయించారు.వివరాల ప్రకారం..‘ధన్వంతరి ఫౌండేషన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్వాహకులు కమలాకర్ శర్మ బాధితులను కోరారు. పెట్టుబడులకు అధిక వడ్డీ ఇస్తామని వారిని మభ్యపెట్టారు. ఈ క్రమంలోనే పెట్టుబడులు పెట్టిన వారికి ప్లాట్స్ ఇస్తామని ఆశ చూపించారు. ఇలా దాదాపు నాలుగు వేల మంది దగ్గర సుమారు రూ.540 కోట్ల డిపాజిట్లు సేకరించారు. ఇక, బాధితులందరూ ఒకే కమ్యూనిటీకి చెందిన వారు కావడం గమనార్హం.ఇక, తాజాగా బాధితులందరూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బాధితుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీసీఎస్ డీసీపీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ.. కమలాకర్ శర్మను అరెస్ట్ చేసి ధన్వంతరి ఫౌండేషన్ పేరు మీద ఉన్న ఆస్దులను సీసీఎస్‌కు అటాచ్ చేసినట్టు తెలిపారు. అలాగే సీజ్ చేసిన ఆస్తులను అమ్మి బాధితులకు డిపాజిట్లు చేసిన డబ్బులు వచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. -
అయ్యో వైష్ణవి
దుండిగల్: మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడే తల్లి వదిలేసి వెళ్లిపోయింది.. రెండేళ్ల క్రితం తండ్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదకొండేళ్ల వయస్సులోనే ఈ రెండు ఘటనలు ఆ బాలికను కలచివేశాయి. అయినాసరే తట్టుకుని చదువుతోంది.. కానీ ఇప్పుడు అర్ధంతరంగా ఏమైందో ఏమో అనుమానాస్పద స్థితిలో అనాథాశ్రమంలో బలవన్మరణానికి పాల్పడింది. సూరారం ప్రాంతానికి చెందిన దివంగత నీలం సతీశ్ కుమార్తె వైష్ణవి(11) దుండిగల్‌లోని స్పూర్తి ఫౌండేషన్‌లో ఆరవ తరగతి చదువుతూ అక్కడే ఉంటోంది. వదిన పెళ్లి ఉండటంతో ఈ నెల 3న ఇంటికి వెళ్లిన వైష్ణవి అక్కడ బంధువులతో సంతోషంగా గడిపింది. 8న తిరిగి ఫౌండేషన్‌కు వచ్చింది. ఉదయం తోటి స్నేహితులతో కలిసి ఆనందంగా ఆటలు ఆడింది. అదే రోజు మధ్యాహ్నం తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వైష్ణవి ఉరి వేసుకున్న గదిలోనే గతేడాది మరో బాలిక ఇదే విధంగా ఆత్మహత్యకు పాల్పడటంపై మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి వచ్చినప్పుడు సంతోషంగా ఉందని, 8వ తేదీ మధ్యాహ్నం వరకు స్నేహితులతో ఆటలు ఆడిందని, ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవడం వెనుక తమకు అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా సమగ్ర దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. -
రూ.266 కోట్లతో కడప విమానాశ్రయం అభివృద్ధి
కడప కోటిరెడ్డిసర్కిల్/కడప కార్పొరేషన్: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని విమానాశ్రయంలో రూ.266 కోట్లతో నిర్మించనున్న నూతన టెర్మినల్ భవనానికి ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ విమానాశ్రయం 25 లక్షల మంది ప్రయాణికుల వార్షిక సామర్థ్యం మేరకు ఆధునిక సొబగులద్దుకుంటోంది. ఇక్కడి రన్‌వేని 45 మీటర్ల వెడల్పున 2,515 మీటర్ల పొడవున విస్తరించనున్నారు. పనులు పూర్తయిన తరువాత ఈ విమానాశ్రయం పీక్ అవర్ సరి్వంగ్ కెపాసిటీ 1,800 మంది ప్రయాణికులుగా ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషితో విమానాశ్రయం విస్తరణకు రూ.75 కోట్లతో స్థలం సేకరించారు. దీంతో రన్‌వే పొడిగిస్తున్న నేపథ్యంలో విమానాల నైట్ ల్యాండింగ్‌కు కూడా అవకాశం లభిస్తుంది. ఇప్పటికే ఇక్కడి నుంచి నిరంతరాయ సర్విసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కూడా భరించింది. 2015లో ప్రారంభమైన ఈ విమానాశ్రయం నుంచి 2017లో ట్రూ జెట్ సంస్థ ఉడాన్ స్కీమ్ కింద ఆర్సీఎస్ (రీజినల్ కనెక్టివిటీ స్కీమ్) అమలు చేసింది. 2021లో ఆ సంస్థ తన విమానాలను ఉపసంహరించుకుంది. 2022 మార్చి నుంచి ఇండిగోసంస్థ విమానాలను ప్రారంభించింది. ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజద్‌బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ విమానాశ్రయంలో అభివృద్ధి పనులతోపాటు టెర్మినల్ నిర్మాణంతో రూపురేఖలు మారిపోయి మహర్దశ పట్టనుందని చెప్పారు. ఈ విమానాశ్రయం ఏర్పాటుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కృషిచేయగా, ఎయిర్‌పోర్టు అభివృద్ధికి ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు సుందరీకరణలోను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. ఎయిర్‌పోర్టుకు అతి సమీపంలో అటవీప్రాంతం ఉండడంతో అటవీశాఖ అనుమతులు తీసుకుని భూసేకరణ చేసినట్లు తెలిపారు. ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులు చేపట్టిన ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర విమానయానశాఖ మంత్రి జ్యోతిరావు సిందియాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయరామరాజు, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ సుజిత్‌కుమార్ పోదార్, ›ప్రొటోకాల్ ఆఫీసర్ సురేష్‌బాబు, టెర్మినల్ మేనేజర్ జోసెఫ్ పాల్గొన్నారు. ముసుగు తొలగించారంతే: ఎంపీ అవినాశ్‌రెడ్డి అనంతరం ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎప్పటినుంచో పొత్తులో ఉన్న టీడీపీ, పవన్‌కళ్యాణ్, బీజేపీ ఇప్పుడు ముసుగు తొలగించారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పొత్తులు కొత్తేమీ కాదని, ఎన్నికలు వచ్చాయంటే ఆయనకు పొత్తులు గుర్తొస్తాయని చెప్పారు. 2019లో టీడీపీ ఓటమి పాలుకాగానే చంద్రబాబు తన అనుచరులైన సుజనాచౌదరి, సీఎం రమేశ్‌లను బీజేపీలోకి పంపారని గుర్తుచేశారు. అప్పటి నుంచి ప్రత్యక్షంగా పొత్తులో ఉన్న టీడీపీ, వవన్‌కళ్యాణ్, బీజేపీ.. పరోక్షంగా కాంగ్రెస్, ఇతర పార్టీలతో కూడా కలిసే ఉన్నట్లు చెప్పారు. ఎంతమంది కలిసొచి్చనా, ఎల్లో మీడియా వారికి ఎంత మద్దతు ఇచ్చినా గెలిచేది వైఎస్సార్సీపీయేనని ఆయన తెలిపారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీతో పొత్తుకోసం టీడీపీ వెంపర్లాడిందని ఎద్దేవా చేశారు. సింహం సింగిల్‌గానే వస్తుందని, జగన్ సింగిల్‌గా పోటీచేసి మళ్లీ సీఎం కావడం తథ్యమని చెప్పారు. -
18 ఏళ్ల నిరీక్షణకు తెర.. కల్కి ధామ్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన
‘తాను నెరవేర్చేందుకే కొందరు మంచి పనులను తన కోసం వదిలి వెళ్లారని’ ప్రధాని నరేంద్ర మోదీ యూపీలో జరిగిన కల్కి ధామ్ శంకుస్థాపన కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పరిధిలోని ఐంచోడ కాంబోహ్‌లోని శ్రీ కల్కి ధామ్ ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేయడం తనకు దక్కిన వరమని, ఈ ఆలయం భారతీయుల విశ్వాసానికి మరో కేంద్రంగా అవతరిస్తుందని అన్నారు. ఇక్కడి ప్రజల 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేసే అవకాశం తనకు లభించిందని మోదీ పేర్కొన్నారు. తన కోసమే కొందరు మంచి పనులు వదిలి వెళ్లారని, భవిష్యత్తులో ఏ మంచి పని మిగిలిపోయినా మహనీయులు, ప్రజల ఆశీస్సులతో వాటిని పూర్తి చేస్తామన్నారు. ఈ ఆలయంలో పది గర్భాలయాలు ఉంటాయని తెలిపారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి అని, ఈ రోజు మరింత పవిత్రమైనదని, ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా మారుతుందని అన్నారు. ఒకవైపు దేశంలోని యాత్రా స్థలాలను అభివృద్ధి చేస్తూనే, మరోవైపు నగరాల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారీ స్థాయిలో నిర్మితం కాబోతున్న ఈ కల్కిధామ్ ఎంతో ప్రత్యేకంగా నిలవనున్నదని, గర్భాలయంలో దశావతారాలు ఉంటాయన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ నేడు భారతదేశ వారసత్వ సంపద ప్రపంచ వేదికపై గుర్తింపు పొందుతున్నదన్నారు. #WATCH | At the foundation stone laying ceremony of Hindu shrine Kalki Dham in Sambhal, Uttar Pradesh CM Yogi Adityanath says, "In the last 10 years, we have seen a new Bharat... The country is moving ahead on the path of development in the new Bharat..." pic.twitter.com/fjSfnwyLpa — ANI (@ANI) February 19, 2024 -
KOITA FOUNDATION: నై‘పుణ్య’ సేవ
కెరీర్లో దూసుకుపోతే ఆ కిక్కే వేరు. ‘అంతమాత్రాన సామాజిక బాధ్యత మరచిపోతే ఎలా’ అనుకునేవారు కొద్దిమంది ఉంటారు. అలాంటి వారిలో రేఖ–రిజ్వాన్ దంపతులు ఒకరు. తాము పనిచేస్తున్న రంగాలలో మంచి పేరు తెచ్చుకున్న రేఖ–రిజ్వాన్‌లు స్వచ్ఛందసేవారంగం లోకి వచ్చారు. ‘కోయిట ఫౌండేషన్’ ద్వారా హెల్త్‌కేర్ రంగంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మేనేజ్మెంట్ కన్సల్టెంట్, స్టార్టప్ ఫౌండర్స్‌గా విజయపథంలో దూసుకుపోయిన రిజ్వాన్, రేఖ కోయిటలు దాతృత్వం దారిలో ప్రయాణం ప్రారంభించారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసిన రేఖకు వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో తెలిశాయి. ఈ నేపథ్యంలోనే స్వచ్ఛంద సంస్థలకు సాంకేతిక సహాయం తోడైతే ఎలా ఉంటుంది అనే అంశంపై దృష్టి పెట్టింది. సాంకేతిక సహకారంతో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయనే విషయాన్ని అవగాహన చేసుకుంది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్(ఎన్ఏబీహెచ్)లో సభ్యుడిగా ఉన్న రిజ్వాన్ డిజిటల్ హెల్త్ స్పేస్‌లో ఎన్నో ఆస్పత్రులతో కలిసి పనిచేశాడు. విలువైన అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు. ‘కోయిట ఫౌండేషన్’ తరఫున ఐఐటీ–ముంబైలో కోయిట సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ (కెసీడీహెచ్)ను ప్రారంభించారు. క్లినికల్ అప్లికేషన్స్, హెల్త్‌కేర్ డాటా మేనేజ్మెంట్(హెల్త్‌కేర్ డాటా ప్రైవసీ, సెక్యూరిటీ), హెల్త్‌కేర్ ఎనాలటిక్స్... మొదలైన వాటిని తన ప్రాధాన్యత అంశాలుగా ఎంపిక చేసుకుంది కెసీడీహెచ్. ఆసుపత్రుల నిర్వహణ, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు కూడా రూపొందించుకుంది కేసీడీహెచ్. హెల్త్ కేర్ కెరీర్‌కు సంబంధించి యంగ్ ప్రొఫెషనల్స్‌ను ఉత్సాహపరచడం తన ప్రధాన లక్ష్యం అంటున్నాడు రిజ్వాన్. లీడింగ్ ఇంజనీరింగ్ కాలేజీలు, హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూట్లు పూనుకొని తగిన కోర్సులకు అవకాశం కల్పిస్తే తన లక్ష్యం నెరవేరడం కష్టమేమీ కాదంటాడు రిజ్వాన్. ‘టాటా మెమోరియల్ సెంటర్’లో క్యాన్సర్ ఆస్పత్రులు డిజిటల్ హెల్త్టూల్స్ను ఎడాప్ట్ చేసుకోవడంలో సహాయపడటానికి ‘కోయిట సెంటర్ ఫర్ డిజిటల్ ఆంకాలజీ’ని ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్‌ను నిర్వహించడం అనేది ఆస్పత్రులకు సవాలుగా మారిన నేపథ్యంలో దీనికి పరిష్కార మార్గాలు కనుక్కునే దిశగా ఆలోచనలు చేస్తుంది కేసీడీహెచ్. ‘మహారాష్ట్ర యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’తో ఒప్పందం కుదుర్చుకుంది కేసీడీహెచ్. డిజిటల్ హెల్త్‌కు సంబంధించి పరిజ్ఞానం విషయంలో వైద్యులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు... మొదలైన వారికి ఈ విశ్వవిద్యాలయంలో శిక్షణ ఇస్తారు. ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు రూపొందించే విషయంపై చొరవ చూపుతున్నారు రిజ్వాన్–రేఖ దంపతులు. ‘మెటర్నల్ హెల్త్’కు సంబంధించి ఫౌండేషన్ ఫర్ మదర్ అండ్ చైల్డ్‌హెల్త్(ఎఫ్ఎంసిహెచ్)తో కలిసి పనిచేస్తోంది కోయిట సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్. ‘ఎఫ్ఎంసిహెచ్’ తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పర్యవేక్షించే లక్ష్యంగా ఏర్పడిన స్వచ్ఛంద సంస్థ. ఇందులో ప్రతి ఫీల్డ్వర్కర్కు కొన్ని కుటుంబాల పర్యవేక్షణ బాధ్యత ఉంటుంది. ‘నూట్రీ’ యాప్ ద్వారా ఫీల్డ్ ఆఫీసర్లకు ఇన్పుట్ డాటాతో ఔట్పుట్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. మ్యాజిక్ బస్, స్నేహా, విప్ల ఫౌండేషన్‌లాంటి ఎన్నో సంస్థలతో కలిసి పనిచేస్తోంది కోయిట ఫౌండేషన్. ‘చేయాల్సిన పని సముద్రమంత పెద్దదిగా ఉంది. అయినప్పటికీ చేయాలనే ఆసక్తి ఉంది’ అంటుంది రేఖ. -
ఏపీ సీఎం జగన్ పై అభిమానాన్ని చాటుకున్న దాదాశ్రీ ఫౌండేషన్
-
సీఎం జగన్ బర్త్‌డే.. ఉదారత చాటుకున్న దాదాశ్రీ ఫౌండేషన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ('దాదా' అని ప్రేమగా పిలుస్తారు) పుట్టినరోజు సందర్భంగా మహారాష్ట్రలోని ఆయన అభిమానుల సంఘం ఎన్జీవో ‘దాదాశ్రీ ఫౌండేషన్ తమ ఉదారతను చాటుకుంది. ఏపీ ప్రజల సంక్షేమం పట్ల సీఎం నిబద్దత, నాయకత్వాన్ని మెచ్చుకుంటూ కాక కాకడే, ధోకేశ్వర్లోని మాతోశ్రీ గ్లోబల్ స్కూల్ & జూనియర్ కాలేజీకి 54 సీట్ల పాఠశాల బస్సును విరాళంగా అందజేసింది. విద్యార్థులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు రూ. 33 లక్షల విలువైన ఏసీ బస్సును విరాళంగా అందించి ఓదార్యం చాటుకుంది. బస్సు అందించడంపై పాఠశాల యాజమాన్యం స్పందించింది. ఫౌండేషన్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసింది. ఈ బస్సు గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు పాఠశాలకు చేరవేసేందుకు గొప్పగా ఉపయోగపడుతుందని తెలిపింది. పాఠశాల విద్యార్ధులు సైతం సీఎం జగన్ ఫోటోతో కృతజ్ఞత తెలిపారు. -
ఎస్ఎస్ఈలో తొలి లిస్టింగ్
ముంబై: నైపుణ్యాన్ని పెంపొందించే నాన్‌ప్రాఫిట్ కంపెనీ.. ఎస్‌జీబీఎస్ ఉన్నతి ఫౌండేషన్ సోషల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎస్ఎస్ఈ)లో లిస్టయ్యింది. తద్వారా ఎస్ఎస్ఈలో లిస్టయిన తొలి సంస్థగా నిలిచింది. పారదర్శక, విశ్వాసపాత్ర మెకనిజం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్ ఇన్వెస్టర్లు సామాజిక సేవా కంపెనీలను గుర్తించేందుకు వీలు కల్పిస్తుందని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్ సభ్యురాలు అశ్వనీ భాటియా పేర్కొన్నారు. ఇలాంటి కంపెనీల గుర్తింపు, విలువ మదింపునకు వీలుంటుందని తెలియజేశారు. వీటికి మద్దతివ్వడం ద్వారా సమాజంలో సానుకూల మార్పులకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇంతవరకూ ప్రపంచంలో ఎక్కడా ఎస్ఎస్ఈ ఆలోచన విజయవంతంకాకపోవడం గమనార్హం! 2019లోనే 2019 ఆర్థిక బడ్జెట్లో ప్రభుత్వం ఎస్ఎస్ఈ ఏర్పాటుకు ప్రతిపాదించింది. సెబీ ఇటీవల నిబంధనలను రూపొందించింది. వెరసి తొలి ఎన్పీవో ఉన్నతి రూ. 2 కోట్ల సమీకరణకు తెరతీయగా.. 90 శాతం సబ్స్క్రిప్షన్ లభించింది. నిధుల్లో రూ. 1.8 కోట్లను గ్రాడ్యుయేషన్ చివరి ఏడాదిలో ఉన్న 10,000 మంది కాలేజీ విద్యార్ధులపై వెచి్చంచనున్నట్లు ఉన్నతి తెలియజేసింది. తద్వారా నైపుణ్య పెంపుతో పరిశ్రమకు అవసరమైన విధంగా విద్యార్ధులను సిద్ధం చేయనుంది. సామాజిక సంస్థలకు ఎస్ఎస్ఈ కొత్త అవకాశాలను కలి్పంచనున్నట్లు ఈ సందర్భంగా భాటియా పేర్కొన్నారు. తమ వర్క్, కార్యకలాపాల విస్తరణ, జవాబుదారీతనం, సుపరిపాలనను పెంపొందించుకునేందుకు వీలు కల్పిస్తుందని తెలియజేశారు. తొలి కంపెనీ లిస్ట్‌కావడం ద్వారా సోషల్ ఫైనాన్స్ శకం ప్రారంభంకానున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎస్‌ఎస్‌ఈపై త్వరలోనే సెబీ సవరించిన మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు ఇష్యూ కనీస పరిమాణాన్ని రూ. 50 లక్షలకు, దరఖాస్తు మొత్తాన్ని రూ. 10,000కు కుదించనుంది. 39 కంపెనీలు ఇప్పటికే రిజిస్టరైన 39 ఎన్‌పీవోలతో ఎస్ఎస్ఈ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్నట్లు దిగ్గజ స్టాక్ ఎక్సే్ఛంజీ ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశి‹Ùకుమార్ చౌహాన్ వెల్లడించారు. వీటిలో చాలావరకూ నిధుల సమీకరణ ప్రణాళికలకు తెరతీసినట్లు తెలియజేశారు. ఎన్జీవోలకు ఎస్ఎస్ఈ గుర్తింపునిస్తుందని ఉన్నతి వ్యవస్థాపక డైరెక్టర్ రమేష్ స్వామి పేర్కొన్నారు. దీంతో సంస్థ విశ్వసనీయత, డాక్యుమెంటేషన్, ప్రభావాలను ప్రశ్నించేందుకు ఎవరూ సాహసించరని వ్యాఖ్యానించారు. దేశంలో సొమ్ము అనేది సమస్యకాదంటూ మందిరాలు, మసీదులు, చర్చిలలోనే రూ. 80,000 కోట్ల సంపద ఉన్నట్లు ప్రస్తావించారు. -
పల్నాడు జిల్లా : వరికపూడిశెల ఎత్తిపోతల ప్రత్యేక (ఫొటోలు)
-
‘డౌనూరు’లో కాఫీ క్యూరింగ్ కేంద్రం
కొయ్యూరు: దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డౌనూరులో కాఫీ క్యూరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. కొయ్యూరు మండలంలోని డౌనూరులో రూ.4 కోట్లతో ఏర్పాటు చేస్తోన్న కాఫీ క్యూరింగ్, రోస్టింగ్, ప్యాకింగ్ యూనిట్‌కు శుక్రవారం వైఎఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి రాజన్నదొర శంకుస్థాపనచేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ..నాణ్యమైన సేంద్రియ ఎరువులతో కాఫీని పండించడం వల్ల రుచి అద్భుతంగా ఉంటుందన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ 20 సదస్సులో అతిథులకు ప్రధాని మోదీ అరకు కాఫీని బహూకరించారని గుర్తు చేశారు. అల్లూరి జిల్లా పాడేరు డివిజన్లో ప్రస్తుతమున్న 2.5 లక్షల ఎకరాలకు అదనంగా మరో లక్ష ఎకరాల్లో కాఫీని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తమ ప్రభుత్వం రూ.20 వేల కోట్లు గిరిజన సంక్షేమానికి ఖర్చు చేసిందన్నారు. గిరిజనుల నుంచి పసుపును కూడా కొనుగోలు చేయాలని జీసీసీ ఎండీ సురేష్‌కుమార్‌ను ఆదేశించారు. గిట్టుబాటు ధర విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. కాఫీ రైతులకు రుణాలిచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీ మాధవి, ఎమ్మెల్సీ రవిబాబు, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, ఐటీడీఏ పీవో అభిషేక్ పాల్గొన్నారు. -
వైద్య విద్యకు శ్రీకారం.. 30 ఎకరాల్లో.. రూ.180 కోట్లు
మెదక్: మెతుకు సీమగా పేరుగాంచిన మెదక్ జిల్లా త్వరలో వైద్య విద్యకు కేరాఫ్‌గా మారనుంది. స్పెషలిస్ట్‌లు లేక అత్యవసర వైద్యం కోసం ఇంతకాలం ఇతర ప్రాంతాలకు పరుగులు తీసిన ప్రజల కష్టాలు తప్పనున్నాయి. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కృషితో జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కావడంతో పాటు త్వరలో మెరుగైన వైద్యం స్థానికంగా అందనుంది. గత నెలలో సీఎం కేసీఆర్ మెదక్ పర్యటనలో మెడికల్ కళాశాల నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన జీఓ విడుదల కావటంతో ఈ నెల 5న మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా కళాశాల పనులు ప్రారంభించేందుకు జిల్లా వైద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుబాటులో 400 బెడ్స్ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు, బెడ్స్, వైద్యుల నియామకం చేపట్టి ప్రభుత్వ వైద్యాన్ని మెరుగుపరిచేందుకు సర్కారు చర్యలు ప్రారంభించింది. జిల్లాకో మెడికల్ కళాశాలను మంజూరు చేసిన ప్రభుత్వం.. వైద్యశాలకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తోంది. ప్రస్తుతం మెదక్లోఉన్న మాతా, శిశు ఆస్పత్రి పక్కనే 30 ఎకరాల్లో వైద్య కళాశాలను నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పనులు పూర్తిచేసి వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభించేందుకు జిల్లా వైద్యాధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే నర్సింగ్ కళాశాలకు స్థలం కేటాయించిన అధికారులు మెడికల్ కళాశాలతో పాటు వసతి గృహం పనులు వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నిబంధన ప్రకారం మెడికల్ కళాశాలకు భవనంతో పాటు 400 బెడ్స్ అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం ఉన్న ఎంసీహెచ్‌లో 150 బెడ్స్ ఉండగా క్రిటికల్ కేర్ కోసం మరో 100 పడకల ఆస్పత్రితో పాటు జిల్లా ఆస్పత్రిలో 250 బెడ్స్‌తో ఉండాలి. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో 200 పడకలకు అప్‌గ్రేడ్ చేసినా మరో 50 పడకల ఆస్పత్రిని నిర్మించాల్సి ఉంది. మెడికల్ కళాశాల ఏర్పాటైతే అన్నిరకాల స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉంటారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చేసిన ప్రయత్నాల ఫలితంగా ఏర్పాటవుతున్న మెడికల్ కళాశాలతో జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. సీఎం కేసీఆర్ కృషితో.. సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కృషితో మెడికల్ కళాశాల మంజూరైంది. వచ్చే ఏడాదిలో 100 మంది మెడికోలతో తరగతులు ప్రారంభిస్తాం. కళాశాల ఏర్పాటుతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది. – పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే, మెదక్ అన్ని రకాల వైద్యసేవలు.. మెడికల్ కాళాశాల ఏర్పాటుతో అన్నిరకాల స్పెషలిస్టులు అందుబాటులో ఉంటారు. అన్ని రకాల వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందుతాయి. వైద్యం రంగంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. – చందూనాయక్, డీఎంహెచ్ఓ, మెదక్ -
పని పూర్తి చేసే సంస్కృతి మాది
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శంకుస్థాపన చేస్తే ఆ పనిని కచ్చితంగా పూర్తి చేయాలనే సంస్కృతిని తమ ప్రభుత్వం పాటిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. మంగళవారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని రూ.8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ కీలకమని.. ఉత్పత్తి, సరఫరా నిరంతరాయంగా ఉంటే పరిశ్రమల వృద్ధికి ఆలంబన అవుతుందని చెప్పారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల యూనిట్‌ను ప్రస్తుతం ప్రారంభించుకున్నామని, త్వరలో రెండో యూనిట్ సైతం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో అధిక భాగం తెలంగాణ ప్రజలకు దక్కుతుందన్నారు. ధర్మాబాద్– మనోహరాబాద్– మహబూబ్‌నగర్– కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణతో రైళ్ల సరాసరి వేగం, రాష్ట్రంలో కనెక్టివిటీ మరింత పెరుగుతాయని చెప్పారు. మనోహరాబాద్– సిద్దిపేట మధ్య కొత్త రైల్వేలైన్‌తో పరిశ్రమలు, వ్యాపారానికి తోడ్పాటు అందుతుందన్నారు. ఇక ప్రతి జిల్లాలో వైద్య సదుపాయాల నాణ్యత కోసం పీఎం ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ తీసుకొచ్చామని.. తెలంగాణలోని 20 జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాకులు ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని వివరించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తెలంగాణలో 50 పెద్ద ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, ప్రజల ప్రాణాలను కాపాడటంలో అవి కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, కె.లక్ష్మణ్, ధర్మపురి అరి్వంద్, సోయం బాపూరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీకి పసుపు రైతుల సన్మానం పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో పసుపు రైతులు నిజామాబాద్ సభా వేదికపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానం చేశారు. పసుపు కొమ్ములతో తయారు చేసిన ప్రత్యేక దండ వేసి, పసుపు మొక్కలను అందించారు. మోదీ ఆ మొక్కలను పైకెత్తి ప్రదర్శించారు. తెలుగులో ప్రారంభించి.. ప్రధాని మోదీ నిజామాబాద్ సభలో తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పలుమార్లు ‘నా కుటుంబ సభ్యులారా..’అని ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు మోదీ.. మోదీ.. అంటూ బీజేపీ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేస్తూ కనిపించారు. ఓ చిన్నారి భరతమాత వేషధారణలో వచ్చిన విషయాన్ని చూసి.. ‘‘ఓ చిన్ని తల్లి రూపంలో భారతమాత ఇక్కడికి వచ్చింది. ఆ చిన్నారికి నా తరఫున అభినందనలు..’’అని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఇవీ.. ప్రధాని మోదీ నిజామాబాద్‌లోని సభా స్థలిలో విడిగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి రూ.8 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన మరో వేదికపై సభను ఉద్దేశిస్తూ రాజకీయ ప్రసంగం చేశారు. తొలి వేదికపై ప్రధాని అభివృద్ధి కార్యక్రమాలివీ.. రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్‌లో 800 మెగావాట్ల యూనిట్ జాతికి అంకితం. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రంలోని 20 జిల్లా ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు శంకుస్థాపన. ∙మనోహరాబాద్ – సిద్దిపేట మధ్య కొత్త రైల్వే లైన్ ప్రారంభం.. సిద్దిపేట–సికింద్రాబాద్ రైలు సర్వీస్‌కు పచ్చజెండా.. ధర్మాబాద్ – మనోహరాబాద్ – మహబూబ్‌నగర్ – కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణ పనుల ప్రారంభం -
పసుపు బోర్డు..గిరిజన వర్సిటీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రానికి పలు వరాలు ప్రకటించారు. రాష్ట్ర రైతులు ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తున్న జాతీయ పసుపు బోర్డును, ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో ఆదివారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో.. రూ.13,545 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో పసుపు పంట విస్తృతంగా పండుతుంది. దేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేయడంతోపాటు వినియోగించేది, ఎగుమతి చేసేది ఈ పంటే. కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. దీనిపై పరిశోధనలు పెరిగాయి. పాలమూరు సభ సాక్షిగా ఇక్కడి పసుపు రైతుల సంక్షేమం కోసం తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు (నేషనల్ టర్మరిక్ బోర్డు)ను ఏర్పాటు చేస్తాం. ములుగులో ట్రైబల్ వర్సిటీ.. ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రూ.900 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ యూనివర్సిటీకి సమ్మక్క–సారలమ్మ పేరు పెడుతున్నాం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో వివిధ భవనాలను ప్రారంభించాం. హెచ్సీయూకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా కలి్పంచి, ప్రత్యేక నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. నారీశక్తి వందన్ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించడం ద్వారా నవరాత్రులకు ముందే శక్తి పూజ స్ఫూర్తిని నెలకొల్పాం. వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమ రంగాలకు ప్రయోజనం తెలంగాణ ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చేలా అనేక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేయడం సంతోషంగా ఉంది. నాగ్‌పూర్–విజయవాడ కారిడార్ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. ఈ మూడు రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ కారిడార్‌లో కొన్ని ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలను కూడా గుర్తించాం. ఇందులో ఎనిమిది ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఐదు మెగా ఫుడ్ పార్కులు, నాలుగు ఫిషింగ్ సీఫుడ్ క్లస్టర్లు, మూడు ఫార్మా అండ్ మెడికల్ క్లస్టర్లు, ఒక టెక్స్టైల్ క్లస్టర్ ఉన్నాయి. దేశంలో నిర్మిస్తున్న ఐదు టెక్స్టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. హన్మకొండలో నిర్మించే ఈ పార్క్‌తో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వేలాది మందికి ఉపాధి ఇచ్చేలా.. ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ఇంధన భద్రతపై చర్చ జరుగుతోంది. కేవలం పరిశ్రమలకే కాకుండా ప్రజలకు కూడా ఇంధన శక్తిని అందిస్తున్నాం. దేశంలో 2014లో 14 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉంటే 2023 నాటికి 32 కోట్లకు పెరిగాయి. ఇటీవల గ్యాస్ సిలిండర్ల ధరలను కూడా తగ్గించాం. దేశంలో ఎల్పీజీ వినియోగాన్ని పెంచడంలో భాగంగా పంపిణీకి సంబంధించి నెట్‌వర్క్‌ను విస్తరించాల్సి ఉంది. ఇందులో భాగంగా హసన్–చర్లపల్లి ఎల్పీజీ పైప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఇది ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో దోహదపడుతుంది. కృష్ణపట్నం–హైదరాబాద్ మధ్య మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్ వల్ల తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది..’’అని ప్రధాని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపనలు ఇవీ.. రూ.3,397 కోట్లతో మూడు ప్యాకేజీలుగా వరంగల్ నుంచి ఖమ్మం వరకు చేపట్టనున్న ఎన్‌హెచ్–163 పనులు రూ.3,007 కోట్లతో మూడు ప్యాకేజీలుగా ఖమ్మం నుంచి విజయవాడ వరకు నిర్మించే ఎన్‌హెచ్–163జీ పనులు కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ వరకు రూ.1,932 కోట్లతో చేపట్టే మల్టీ ప్రొడక్ట్ పైపులైన్ నిర్మాణ పనులు ప్రారంభించినవి ఇవీ.. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు రూ.2,457 కోట్లతో నిర్మించిన నాలుగు లేన్ల 365 బీబీ నంబర్ జాతీయ రహదారి మునీరాబాద్–మహబూబ్‌నగర్ రైల్వేలైన్‌లో భాగంగా జక్లేర్ నుంచి కృష్ణా వరకు రూ.505 కోట్లతో పూర్తి చేసిన కొత్త లైన్ రూ.81.27 కోట్లతో హెచ్‌సీయూలో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ భవనాలు రూ.2,166 కోట్లతో హసన్ (కర్ణాటక) నుంచి చర్లపల్లి వరకు నిర్మించిన ఎల్పీజీ పైప్‌లైన్ జాతికి అంకితం నారాయణపేట జిల్లాలోని కృష్ణా స్టేషన్ నుంచి కాచిగూడ–రాయచూర్– కాచిగూడ డీజిల్, ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (డెమూ) రైలు సర్విస్ ప్రారంభం -
బిల్ గేట్స్ కు దోమలకు సంబంధం ఏమిటి? అసలు అమెరికాలో ఏం జరుగుతోంది?
బిల్ గేట్స్ స్వయంగా దోమలను తరిమిగొట్టే పనేమీ చేయడం లేదు. అయినప్పటికీ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ దీనికి సంబంధించిన ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని తగ్గించేందుకు జన్యుపరంగా మార్పు చెందిన దోమలను అభివృద్ధి చేయడానికి కృషిచేస్తున్న బయోటెక్ కంపెనీ ఆక్సిటెక్‌కు నిధులు అందజేసినందుకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు అవార్డు ప్రకటించారు. ఏప్రిల్ 2021లో ఫ్లోరిడాలోని ఆరు ప్రదేశాలలో ఆక్సిటెక్ సుమారు 150,000 దోమలను విడుదల చేస్తుందని ఆక్సిటెక్ ప్రకటించింది. అయితే ఈ నిర్దిష్ట ప్రాజెక్ట్‌కు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చలేదని కంపెనీ పేర్కొంది. అంటు వ్యాధులను వ్యాప్తిచేసే దోమల జాతి అయిన ఈడెస్ ఈజిప్టిని జన్యుపరంగా సవరించడానికి బహుళ-సంవత్సరాల పరిశోధన ప్రాజెక్ట్ 2021లో ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక బిల్ గేట్స్ ఉన్నారని ఇంటర్నెట్లో వార్తలు వెలువడ్డాయి. ఈజిప్టి దోమలను జన్యుపరంగా సవరించడం, తరువాత వాటిని అడవిలోకి విడుదల చేయడం అనేది ఇది మొదటిసారేమీ కాదు. పరిశోధకులు ఒక దశాబ్దానికి పైగా దీనిపై పలు ప్రయత్నాలు చేస్తున్నారు. 2010లో కేమాన్ దీవులలో మార్పు చెందిన దోమల విడుదలను విడుదల చేశారు. 2011, 2012, 2015లో ఆక్సిటెక్ బ్రెజిల్‌లోని పలు ప్రాంతాలలో జన్యుపరంగా మార్పు చెందిన దోమలను విడుదల చేసింది. ఆడ అనాఫిలిస్ దోమల ద్వారా మాత్రమే మలేరియా అనేది మనుషులకు వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈజిప్టి దోమ స్వయంగా మలేరియాను వ్యాప్తి చెందించదు. ఆక్సిటెక్ సంస్థ అనాఫిలిస్ దోమలను జన్యుపరంగా మార్చడానికి పలు ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ సంస్థ వ్యాధులను వ్యాప్తిని అరికట్టేందుకు జీవసంబంధ పరిష్కారాలను అన్వేషించే పరిశోధనలు సాగిస్తుంటుంది. గేట్స్ ఫౌండేషన్ గ్రాంట్ డాక్యుమెంట్లలో ప్రపంచవ్యాప్తంగా 43 నెలల్లో మలేరియా సంబంధిత ప్రాజెక్టుల కోసం జూన్ 2018లో ఆక్సిటెక్‌కు $5.8 మిలియన్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అమెరికా, కరేబియన్లలో మలేరియా దోమలను అరికట్టడానికి ఈ నిధులను అందజేస్తున్నట్లు గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. సెప్టెంబరు 2020లో $1.4 మిలియన్ల రెండవ దఫా గ్రాంట్‌ను ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో మలేరియా దోమల నివారణ కోసం ఈ ప్రాజెక్ట్‌కు అందించినట్లు పేర్కొన్నారు. అయితే అమెరికాలో ఈపనులు చేపట్టేందుకు గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చలేదని కంపెనీ ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఆక్సిటెక్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ మొదటి దశలోనే ఉంది. 2020లో యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ జన్యుపరంగా మార్పు చెందిన దోమలను ఫీల్డ్ టెస్ట్ చేయడానికి ఆక్సిటెక్‌కు ఆమోదం తెలిపింది. అయితే దీనికిముందు కంపెనీ స్థానిక అధికారుల నుంచి ఆమోదం తీసుకోవలసి ఉంటుంది. అలాగే దీనిపై రెండు సంవత్సరాలలో మొత్తం 6,600 ఎకరాల్లో అధ్యయనం జరగాల్సి ఉంది. అయితే ఇంతలో ఈ కంపెనీకి 31 వేలకు మించిన పబ్లిక్ కామెంట్లు వచ్చాయి. వీటిలోని చాలా వ్యాఖ్యలలో ఈ అధ్యయనానికి అనుమతించకూడదని లేదా మరింత సమాచారం అందుబాటులోకి వచ్చే వరకు వేచి ఉండాలని సూచించారు. అయితే దీనిపై సంస్థ 150 పేజీల ప్రతిస్పందనను తెలియజేసింది. జూన్ 2020లో ఫ్లోరిడా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కన్స్యూమర్ సర్వీసెస్ ఈ అధ్యయనం కోసం అనుమతిని మంజూరు చేసింది. అలాగే ఫ్లోరిడా కీస్ మస్కిటో కంట్రోల్ డిస్ట్రిక్ట్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్‌తో పాటు ఏడు స్టేట్ ఆఫ్ ఫ్లోరిడా ఏజెన్సీలు దీనికి ఆమోదం తెలిపాయి. కాగా ఈజిప్టి దోమలు ఆఫ్రికాకు చెందినవి. ఈ జాతి పెట్టే గుడ్లు పొడి వాతావరణంలో నెలల తరబడి నిద్రాణంగా ఉంటాయని, వర్షం పడినప్పుడు జీవం పోసుకుని వ్యాప్తి చెందుతాయని సంస్థ తెలిపింది. ఫ్లోరిడా కీస్‌లోని మొత్తం దోమల జనాభాలో ఈజిప్టి దోమ కేవలం 4% మాత్రమే ఉన్నాయి. కానీ దోమల ద్వారా సంక్రమించే వ్యాధులకు ఈజిప్టి దోమలు బాధ్యత వహిస్తాయి. కాగా ఆడ దోమ మాత్రమే చికున్‌గున్యా, జికా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను వ్యాపిస్తుంది. ఆడ దోమలు మనుషులకు కుట్టి, తమ లాలాజలంలో బ్యాక్టీరియాను మానవ రక్తంలోకి ప్రసారం చేస్తాయి. వీటిని ఎదుర్కొనేందుకు ఆక్సిటెక్ పరిశోధకులు టెట్రాసైక్లిన్ ట్రాన్స్-యాక్టివేటర్ వేరియంట్ అనే ప్రోటీన్‌ను దోమల నియంత్రణకు ఒక సాధనంగా గుర్తించారు. ఇది కూడా చదవండి: రాబోయే ఏళ్లలో 100 కోట్లమంది మృతి? Bill Gates is not a Scientist or Doctor. Why the Hell is Bill Gates releasing mosquitos on Americans? How much more proof do people need in order to acknowledge his Diabolical Schemes? Arrest Bill Gates. pic.twitter.com/sC2iLpvCVP — Liz Churchill (@liz_churchill10) September 3, 2023 -
అమ్మానాన్నల విడాకులు.. డిప్రెషన్‌కి వెళ్లాను: అమీర్ ఖాన్ కూతురు
మానసిక అనారోగ్యం వెంటనే తెలియదు. తమకు మానసిక అనారోగ్యం ఉంది అని చాలామంది తామే అంగీకరించరు. కుటుంబ సభ్యులు గమనించినా నామోషి వల్ల వైద్యుని దగ్గరకు తీసుకెళ్లరు. ‘వైద్యులే ఇంటింటికి వెళ్లి చెక్ చేస్తే చాలా సమస్యలు తెలుస్తాయి’ అంటుంది ఇరా ఖాన్. ఆమిర్ ఖాన్ కూతురైన ఇరా ఖాన్ మానసిక సమస్యలతో బాధ పడుతూ తనలా బాధ పడేవారి కోసం ‘అగత్సు ఫౌండేషన్’ స్థాపించి మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను ప్రచారం చేస్తోంది. బాంద్రాలోని పాలీ విలేజ్‌లో ఉంటుంది రెండంతస్తుల అగత్సు ఫౌండేషన్. ముంబైలో ముఖ్యంగా బాంద్రాలో ఉన్న మానసిక సమస్యల బాధితులు అక్కడికి వచ్చి సహాయం పొందవచ్చు. చుట్టుపక్కల బస్తీల్లో ఉన్నవారు కూడా వచ్చి అందులోని కమ్యూనిటీ సెంటర్లో వైద్య సహాయం పొందవచ్చు. నిజానికి మానసిక వైద్యం, కౌన్సిలింగ్, థెరపీ కొంచెం ఖరీదుతో కూడినవి. కాని ఇక్కడ 50 రూపాయల నుంచి 750 రూపాయల లోపు ఎంతైనా ఫీజు కట్టవచ్చు. ఇక్కడ నలుగురు సైకియాట్రిస్ట్‌లు ఉంటారు. వైద్యసూచనలు చేస్తారు. దీనికి తోడు నిర్ణీత రోజులలో బాంద్రాలో డోర్ టు డోర్ తిరిగి ఇళ్లల్లో ఉన్నవాళ్ల మానసిక సమస్యలను తెలుసుకుని వైద్య సహాయం ఎంత అవసరమో చెబుతారు. ఈ పనులన్నీ మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అగత్సు ఫౌండేషన్ స్థాపించి ఈ పనంతా చేస్తున్న వ్యక్తి ఇరా ఖాన్. ఆమిర్ ఖాన్– రీనా దత్తా (మొదటి భార్య)ల కుమార్తె. ‘శరీరానికే కాదు.. మనసుకూ గాయాలవుతాయి. ఆ గాయాల వల్ల మనసు ప్రభావితం అవుతుంది. దానికి సరైన వైద్య సహాయం అందాలి’ అంటుంది ఇరా ఖాన్. స్వయంగా బాధితురాలు ‘మా కుటుంబంలో మానసిక సమస్యలు ఉన్నాయి. నా మానసిక సమస్యకు అనువంశికత కొంత కారణం అనుకుంటాను. నాకు 12వ ఏట స్కూల్లో ఉన్నప్పటి నుంచే డిప్రెషన్ సూచనలు కనిపించాయి. అయితే గుర్తించలేదు. ఇంటర్ తర్వాత నెదర్లాండ్స్‌లో లిబరల్ ఆర్ట్స్ చదవడానికి వెళ్లినప్పుడు నేను తీవ్ర డిప్రెషన్‌తో బాధ పడ్డాను. రోజంతా ఏడుస్తూ... నిద్రపోతూ ఉండేదాన్ని. నా డిప్రెషన్‌కు నా తల్లిదండ్రుల విడాకులు వేసిన ప్రభావం కూడా కారణం కావచ్చు. అక్కడ నేను చదువు డిస్కంటిన్యూ చేసి ఇండియా వచ్చి ఒక సంవత్సరం బ్రేక్ తీసుకున్నాను. మళ్లీ వెళ్లి జాయిన్ అయినా చదవలేకపోయాను. 2018లో చదువు మానేసి ఇండియా వచ్చేశాను. ఇక్కడకు వచ్చాక నా బాధ లోకానికి చెప్పాలనిపించింది. 2019లో మొదటిసారి నా డిప్రెషన్ గురించి చెప్పాను. ఇందుకు నా తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదు. నాకు వారెంతో సపోర్ట్‌గా నిలిచారు. అంతేకాదు మానసిక ఆరోగ్యం విషయంలో చాలా మంది చూపే నిర్లక్ష్యానికి ముగింపు పలికే చైతన్యం కోసం పని చేయాలంటే అందుకూ సపోర్ట్ చేశారు. అలా ఈ అగత్సును మొదలెట్టాను’ అని తెలిపింది ఇరా ఖాన్. మానసిక శుభ్రత ‘మనందరికీ శారీరక శుభ్రత తెలుసు. అలాగే మానసిక శుభ్రత కూడా ఉండాలి. భావోద్వేగాల శుభ్రత ఉండాలి. నా విషయమే చూడండి... డబ్బుంది.. తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది... మంచి వైద్య సహాయం ఉంది... అయినా సరే డిప్రెషన్ నన్ను చావగొట్టింది. అలాంటిది పై మూడింటిలో ఏది లేకపోయినా అలాంటి వారు ఎంత బాధ పడుతుంటారో అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ పరంగా, ప్రయివేటుగానూ ప్రజల మానసిక ఆరోగ్యం గురించి చేయవలసిన పని చాలా ఉంది. యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటి వాటిని మనసును శుభ్రం చేసుకోవడం వల్ల తొలగించుకోవాలి. ఇందుకు చేయవలసిన పనులతో పాటు మందులు కూడా తీసుకోవాల్సి రావచ్చు. మేం ఏం చేస్తామంటే ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నవారిని అలాంటి సమస్యతోనే బాధ పడుతున్నవారితో కలుపుతాము. వారంతా ఒక కమ్యూనిటీ అవుతారు. ఒకరికొకరం సాయంగా దీనిపై పోరాడవచ్చనే ధైర్యం తెచ్చుకుంటారు. ఆ విధంగా మేము పని చేస్తాం’ అంటుంది ఇరా ఖాన్. గమనించుకోవాలి ‘మానసిక సమస్యలు పునరావృత్తం అవుతుంటాయి. మీరు ఏం చేస్తే సమస్య అధికమవుతుంది, ఏం చేయకపోతే సమస్య తక్కువ అవుతుంది గమనించుకోవాలి. ఎన్ని రోజులకొకమారు సమస్య కనపడుతూ ఉంది... ఎన్నాళ్లకు దూరమవుతుంది ఇదంతా గమనించుకుని మనకు మనమే సమస్య పై పోరాడాలి. మంచి నిద్ర అలజడి తగ్గిస్తుంది. నిద్ర సరిగా పట్టేలా చూసుకోవాలి’ అంటుంది ఇరా ఖాన్. మానసిక సమస్యలను దాచుకోవద్దని, అవి శారీరక సమస్యల్లాంటివేనని చెబుతోంది ఇరా ఖాన్. ‘సెలబ్రిటీ కూతురినై ఉండి నేను బయటకు చెప్పినప్పుడు మీరు కూడా చెప్పండి. సహాయం పొందండి’ అని కోరుతోందామె. -
ఎదుగుతున్నానుకున్నాడు..సడెన్ బ్రేక్‌లా ఫుట్‌పాత్‌పై పడ్డాడు అదే..
ఓ సాధారణ పట్టణంలో పుట్టి పెరిగాడతడు. కంప్యూటర్ కోర్సు కోసం హైదరాబాద్ వచ్చాడతడు. నేర్చుకున్నాడు... తను నేర్చిన విద్యను ఇతరులకు నేర్పించేపనిలో మునిగిపోయాడు. ఎదుగుతున్నాననుకున్నాడు... అగాధంలోకి జారిపోయాడు. ఫుట్ పాత్ మీదే నిద్ర... అతడిని మార్చిన రోజది. సంజీవకుమార్ పుట్టింది, పెరిగింది మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో. పాలిటెక్నిక్, ఐటీఐ, గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకునే నాటికి సమాజంలో సాంకేతికంగా మరో విప్లవం మొదలైంది. అదే కంప్యూటర్ ఎడ్యుకేషన్. రాబోయే కాలంలో కంప్యూటర్ లేనిదే ఏ పనీ చేయలేమని తెలుసుకున్నాడు సంజీవ్‌కుమార్. హైదరాబాద్‌కు వచ్చి డీటీపీతో మొదలు పెట్టి డీసీఏ, పీజీడీసీఏ, పీజీ డీఎస్ఈ వరకు అప్పటికి అందుబాటులో ఉన్న కోర్సులన్నీ చేశాడు. తన మీద నమ్మకం పెరిగింది. సైబర్‌టెక్ పేరుతో నల్లకుంటలో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ స్థాపించాడు. కంప్యూటర్స్‌లో ప్రపంచాన్ని ఆందోళనలో ముంచెత్తిన వైటూకే సమస్య సద్దుమణిగింది. కానీ అంతకంటే పెద్ద ఉత్పాతం సంజీవకుమార్ జీవితాన్ని ఆవరించింది. ఆ వివరాలను సాక్షితో పంచుకున్నాడతడు. అప్పు మిగిలింది! ‘‘నా మీద నాకున్న నమ్మకం, దానికితోడు అందరినీ నమ్మడం నా జీవిత గమనాన్ని మార్చేశాయి. నా మీద నమ్మకంతో కంప్యూటర్ సెంటర్లు ప్రారంభించాను. స్నేహితుల మీద నమ్మకంతో పదకొండు బ్రాంచ్‌లకు విస్తరించాను. కొన్ని బ్రాంచ్‌ల నిర్వహణ స్నేహితులకప్పగించాను. కొందరు స్నేహితులు పెట్టుబడి కోసం డబ్బు అప్పు ఇచ్చి సహకరించారు. నా పెళ్లి కోసం ఒకటిన్నర నెలలు మా ఊరెళ్లాను. పెళ్లి చేసుకుని హైదరాబాద్‌కి వచ్చేటప్పటికి పరిస్థితి తారుమారుగా ఉంది. ఫ్రాంచైసీలు తీసుకున్న స్నేహితులు మోసం చేశారు. నా కళ్ల ముందు తొంబై ఐదు లక్షల అప్పు. నా భార్య బంగారం, నేను నిర్వహిస్తున్న కంప్యూటర్ సెంటర్లను అమ్మేసి కూడా ఆ అప్పు తీరలేదు. అప్పు ఇచ్చిన స్నేహితుల నుంచి ఒత్తిడి పెరిగింది. నా భార్యను పుట్టింట్లో ఉంచి హైదరాబాద్‌కొచ్చాను. నా దగ్గర డబ్బున్నప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్లెవరూ నాకు ఒక్కరోజు అన్నం కూడా పెట్టలేదు. ఆకలితో ఫుట్‌పాత్ మీద పడుకున్న రోజును నా జీవితంలో మర్చిపోలేను. డబ్బులేని మనిషికి విలువ లేదని తెలిసి వచ్చిన క్షణాలవి. మరి ఫుట్‌పాత్ మీదనే బతికేవాళ్ల పరిస్థితి ఏమిటి... అనే ఆలోచన మొదలైన క్షణం కూడా అదే. వైద్యం... ఆహారం! నేను స్కై ఫౌండేషన్ స్థాపించింది 2012లో. అప్పటి నుంచి వీధుల్లో బతికే వాళ్లకు ప్రతి ఆదివారం అన్నం పెట్టడం, మందులివ్వడం, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నాను. ఆఫీస్‌లోనే వండి రెండు వందలకు పైగా పార్సిళ్లతో మా వ్యాన్ బయలుదేరుతుంది. వాటిని ఫుట్‌పాత్ మీద, చెట్టుకింద పడుకున్న వాళ్లకు ఇస్తాం. అలాగే ప్రతి బిడ్డా పుట్టిన రోజు పండుగనూ, కేక్ కట్ చేసిన ఆనందాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో పిల్లలకు సామూహికంగా పుట్టిన రోజులు చేస్తున్నాను. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజు పిల్లల చేత జెండావందనం చేయిస్తాను. కోఠీలో పాత పుస్తకాలు తెచ్చి పంచుతాను. వీటన్నింటికంటే నేను గర్వంగా చెప్పుకోగలిగిన పని వీళ్లందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించడం. ఫుట్‌పాత్‌ల మీద బతుకీడ్చే వాళ్లకు ఆధార్ కార్డు ఉండదు, మొబైల్ ఫోన్ ఉండదు. కరోనా వ్యాక్సిన్ వేయాలంటే ఈ రెండూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసి ప్రత్యేక అనుమతి తీసుకుని వాళ్లందరికీ వ్యాక్సిన్ వేయించాను. కరోనా సమయంలో సేవలందించిన వైద్యులకు, వైద్య సిబ్బందికి సన్మానం చేశాను. ఒక్క అవకాశమివ్వండి! వీధుల్లో బతుకు వెళ్లదీసే వాళ్లకు తాత్కాలికంగా అన్నం పెట్టడం, దుస్తులివ్వడం శాశ్వత పరిష్కారం కాదు. ఈ బతుకులు రోడ్డు పక్కనే ఉండిపోకూడదంటే వాళ్లకు బతుకుదెరువు చూపించాలి. ప్రభుత్వాలు వాళ్లను షెల్టర్ హోమ్‌లో ఉంచి ఆహారం పెట్టడంతో సరిపెట్టకూడదు. చిన్న చిన్న పనుల్లో శిక్షణ ఇచ్చి సమాజంలోకి పంపించాలి. వడ్రంగం, బుక్ బైండింగ్, అగరుబత్తీల తయారీ, విస్తరాకుల కటింగ్ వంటి చిన్న పనులు నేర్పించినా చాలు. వాళ్లకు ఒక దారి చూపించినవాళ్లమవుతామని ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలిచ్చాను. పైలట్ ప్రాజెక్టుగా ఒక ఏరియాకి బాధ్యత ఇవ్వండి. విజయవంతం చేసి చూపిస్తానని కూడా తెలియచేశాను. అలా చేయగలిగినప్పుడు వీధి జీవితాలు ఇంటివెలుగులవుతాయి’’ అన్నారు సంజీవకుమార్. ఫుట్‌పాత్ మీద కొత్త ఉపాధి! కంప్యూటర్ సెంటర్లను అమ్మేసిన తర్వాత కన్సల్టెంట్‌గా మారాను. తార్నాకలోని సన్మాన్ హోటల్ ముందున్న ఫుట్ పాతే నా వర్క్ ప్లేస్. నా భుజాన ఒక్క బ్యాగ్‌తో పాన్ కార్డ్ సర్వీస్ రూపంలో జీవితం కొత్తగా మొదలైంది. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు వచ్చేవి. నెలకు రెండు వేల అద్దెతో ఒక గదిలో ‘స్కై క్రియేషన్స్’ పేరుతో సర్వీస్‌ను రిజిస్టర్ చేశాను. పాన్ కార్డు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్‌లు, ప్లేస్మెంట్ల వరకు సర్వీస్‌లను విస్తరించాను. పద్మారావు నగర్లో ఓ చిన్న ఫ్లాట్ కొనుకున్న తర్వాత స్కై ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవ మొదలు పెట్టాను. అద్దె ఇంట్లో ఫౌండేషన్ రిజిస్టర్ చేయాలంటే ఇంటి యజమాని అనుమతించరు. కాబట్టి సొంత గూడు ఒకటి ఏర్పరుచుకునే వరకు ఆగి అప్పటి నుంచి వీధి పాలైన జీవితాల కోసం పని చేయడం మొదలుపెట్టాను. – సంజీవకుమార్, ఫౌండర్, స్కై ఫౌండేషన్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అందరికీ కంటి వైద్యం అందేలా..ప్రత్యేక సేవకు శంకర నేత్రాలయ శ్రీకారం
శంకర నేత్రాలయ దాతలు డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారితో మీట్ అండ్ గ్రీట్ శంకర నేత్రాలయ యూఎస్ఏ (SN USA) అడాప్ట్-ఎ-విలేజ్ మొబైల్ సర్జికల్ యూనిట్ దాతలు డాల్లస్ మహానగరంలో డా. ప్రేమ్‌రెడ్డి గారితో కలిసి జరిపిన కార్యక్రమములో అంధత్వ నిర్మూలనకై 350,000 డాలర్లు (భారత కరెన్సీలో రూ. 2 కోట్లు) భూరి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ గారు ప్రత్యేక అతిథిగా రాగా, ఎందరో ప్రముఖ దాతలు వివిధ నగరాల నుంచి రావడం ఒక ప్రత్యేక ఆకర్షణగా జరిగింది. గత నాలుగు దశాబ్దాలుగా, శంకర నేత్రాలయ లక్షలాది మంది కంటి చూపు లేని నిరుపేదలకు దృష్టిని పునరుద్ధరించింది. శంకర నేత్రాలయ అందించే ప్రత్యేక సేవలలో ఒకటి మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (మేసు - మొబైల్ ఐ సర్జికల్ యూనిట్). ఈ రంగంలో రిమోట్‌గా కంటి శస్త్రచికిత్సలు చేయడానికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఏకైక సంస్థ శంకర నేత్రాలయ. మేసు అనేది రెండు ప్రత్యేక వాహనాలు కలిసి ఒక వైద్య శిబిరంగా మారి మారుమూల ప్రాంతాల్లో ఉన్న పేదవారికి ఉచిత కంటి చికిత్స చేస్తుంది. మేసు అనగా చక్రాలపై ఉన్న ఆసుపత్రి, ఇది రెండు బస్సుల్లో ఆస్పత్రి మాదిరి వైద్యం అందిస్తుంది. ఒకటి రోగి ప్రిపరేటరీ గదిగా మరొకటి ఆపరేషన్ థియేటర్‌గా పనిచేస్తుంది. ఈ బస్సుల్లో దాదాపు 25 మంది వైద్య సిబ్బంది కలిసి మారుమూల గ్రామాలకు వెళ్లి, సుమారు 2 వేల నుంచి 3 వేల మంది రోగులను పరీక్షించి, రెండు వారాల వ్యవధిలో 150 నుంచి 300 మంది రోగులకు కంటి శుక్లం శస్త్రచికిత్స చేసి, శస్త్రచికిత్స అనంతర సంరక్షణ తర్వాత తిరిగి బేస్ ఆస్పత్రికి చేరుకుంటారు. వేరే కీలక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులను బేస్ ఆసుపత్రికి పంపుతారు. శంకర నేత్రాలయ యూఎస్ఏ అనేది శంకర నేత్రాలయ ఇండియా నిధుల సేకరణ విభాగం. ప్రతియేటా నిధులు సేకరించి భారతదేశంలో ఉన్న శంకర నేత్రాలయకు పంపుతుంది. ఇప్పటివరకు, రెండు మేసు విభాగాలు ఉన్నాయి - ఒకటి చెన్నైలో మరొకటి జార్ఖండ్‌లో. జనవరి 2023 నుంచి మూడవ మేసు యునిట్ హైదరాబాద్లోలో ప్రారంభమైంది . ఈ కార్యక్రమానికి ఏ. ఐ. జి. సంస్థ అధినేత డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు పూర్తి మద్దతు ప్రకటించారు. ఒక్కో మేసు యునిట్ బేస్ హాస్పిటల్ నుంచి 500 కిలోమీటర్ల వ్యాసార్థం వరకు వెళ్ళి కంటి శుక్ల సేవలు నిర్వహిస్తుంది. దీంతో పూర్తి తెలంగాణా ప్రాంతానికి మేసు ద్వారా ఉచిత కంటి వైద్య సేవలు నిర్వహిస్తుంది . 2023 నుంచి ఝార్ఖాండ్, హైదరాబాద్, చెన్నై నుండి 500 కిలోమీటర్ల వ్యాసార్థం వరకు ఏ మారుమూల ప్రాంతానికైనా ఈ వసతి లభిస్తుంది. శంకర నేత్రాల యూఎస్ఏ అధ్యక్షుడు శ్రీ. బాలా రెడ్డి ఇందుర్తి విదేశాలలో నివసిస్తున్న భారతీయులలో అడాప్ట్-ఎ-విలేజ్ కార్యక్రమం ద్వారా భారతదేశంలో మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ సేవలు పెంచడానికి ప్రశంసనీయమైన పని చేస్తున్నారు. అతని అమూల్యమైన సేవలకు ఆ సంస్థలో అత్యున్నత పురస్కారమైన శంకరరత్నను ప్రదానం చేసింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా - నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ) కూడా ఇటీవల డల్లాస్‌లో నిర్వహించిన సమావేశంలో అతని అత్యుత్తమ సేవలను గుర్తించి, ప్రతిష్టాత్మకమైన కమ్యూనిటీ సర్వీస్ అవార్డును ప్రదానం చేసింది. శంకర నేత్రాలయ గురించి అవగాహన పెంచడానికి, శంకర నేత్రాలయ యూఎస్ఏ జులై 1, 2023న నాటా కన్వెన్షన్‌లో ప్రముఖ వైద్యుడు, పారిశ్రామికవేత్త మరియు పరోపకారి డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంని నిర్వహించింది. ఆయన ఇటీవల తన స్వస్థలమైన నెల్లూరు సమీపంలోని నిడిగుంటపాలెంలో స్పాన్సర్ చేసిన అడాప్ట్-ఎ-విలేజ్ కార్యక్రమం కంటి సమస్యలతో బాధ పడుతున్న వందలాది మంది పేద రోగుల చూపుని పునరుద్ధరించింది. బాల ఇందుర్తి, కోర్ కమిటీ సభ్యులు ఆనంద్‌బాబు దాసరి, శ్రీధర్‌రెడ్డి తిక్కవరపులతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శంకర నేత్రాలయ యు. యస్. ఏ. బృందం డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారిని ప్రపంచవ్యాప్తంగా భారతీయ సమాజానికి చేసిన విశిష్ట సేవలకుగానూ ధీన బంధు పురస్కారంతో సత్కరించింది. ఈ సమావేశంలో, హైదరాబాద్, చెన్నై మరియు జార్ఖండ్‌లలో 2023, 2024లో అడాప్ట్-ఎ-విలేజ్ కార్యక్రమానికి సహకరించిన శంకర నేత్రాలయ యూఎస్ఏ జట్టు మరియు మేసు దాతలను డాక్టర్ ప్రేమ్ రెడ్డి సత్కరించారు. MESU అడాప్ట్-ఎ-విలేజ్ 2023 దాతలు: డాక్టర్ రాఘవ రెడ్డి గోసాల, రమేష్ రెడ్డి వల్లూరు, ప్రసాద్ రెడ్డి మల్లు, డాక్టర్ కిషోర్ రెడ్డి రాసమల్లు, రూబీ నహర్, ఆనంద్ బాబు దాసరి. MESU అడాప్ట్-ఎ-విలేజ్ 2024 దాతలు: మూర్తి రేకపల్లి, కిరణ్ రెడ్డి పాశం, కరుణాకర్ ఆసిరెడ్డి, కృష్ణదేవ్ రెడ్డి లట్టుపల్లి, డాక్టర్ చీమర్ల నరేందర్ రెడ్డి, రమేష్ చాపరాల, డాక్టర్ బాల్ టి. రెడ్డి, ఎ. జలంధర్ రెడ్డి, ప్రియా కొర్రపాటి , రవి రెడ్డి మరక, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, డా. మోహన్ మల్లం, నారాయణ రెడ్డి గండ్ర, తిరుమల రెడ్డి కుంభం, ప్రసూన దోర్నాదుల, మీనల్ సిన్హా BOXA, శ్రీని రెడ్డి వంగిమళ్ల, సతీష్ కుమార్ సెగు, రాజేష్ తడికమళ్ల, చైతన్య మండల, భాస్కర్ గంటి, బాల రెడ్డి ఇందుర్తి, నారాయణరెడ్డి ఇందుర్తి, రవి ఇందుర్తి. ఈ కార్యక్రమానికి హాజరైన SNUSA ఎగ్జిక్యూటివ్ కమిటీ, ట్రస్టీల బోర్డు గత ధర్మకర్తల మండలి: బాల రెడ్డి ఇందుర్తి (అధ్యక్షుడు), మూర్తి రేకపల్లి (వైస్ ప్రెసిడెంట్), శ్యామ్ అప్పాలి (జాయింట్ సెక్రటరీ), సోమ జగదీష్ (జాయింట్ ట్రెజరర్), ప్రసాద్ రాణి, శ్రీని రెడ్డి వంగిమళ్ల, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, ఆనంద్ బాబు దాసరి, రాజశేఖర్ రెడ్డి ఐల, మెహర్ చంద్ లంక, డాక్టర్ జగన్నాథ్ వేదుల, నారాయణరెడ్డి ఇందుర్తి, వంశీకృష్ణ ఏరువరం, రాజు పూసపాటి, వినోద్ పర్ణ, ప్రియా కొర్రపాటి, రమేష్ బాబు చాపరాల, డాక్టర్ రెడ్డి ఉరిమిండి, మరియు రవి రెడ్డి మరక. నిరుపేద రోగుల చూపుని పునరుద్ధరించే ఈ ఉదాత్త కారణానికి ఇచ్చే మద్దతు అందరిచే మీట్ అండ్ గ్రీట్‌లో చాలా ప్రశంసించబడింది. ఆ సమావేశంలో పలువురు దాతలు ముందుకు వచ్చి, అడాప్ట్-ఎ-విలేజ్ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఉదార సహకారాలు పేద రోగుల జీవితాల్లో మార్పు తెస్తాయి. ఈ ఉదాత్తమైన కారణం కోసం పనిచేస్తున్న వాలంటీర్లకు చాలా ప్రోత్సాహాన్ని అందిస్తాయి. వ్యవస్థాపకుడు ఎస్వీ ఆచార్య, ఎస్ఎన్ ఇండియా వ్యవస్థాపకుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్ఎస్ బద్రినాథ్, చెన్నై నాయకత్వం డాక్టర్ గిరీష్ రావు, డాక్టర్ సురేంద్రన్, కన్నన్ నారాయణన్, రామచంద్రన్ గోపాల్, సురేష్ కుమార్‌లకు నిరంతర మద్దతు కోసం ధన్యవాదాలు. కోర్ కమిటీ సభ్యులు బాలారెడ్డి ఇందుర్తి, ఆనంద్ బాబు దాసరి, శ్రీధర్ రెడ్డి తిక్కవరపులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మూర్తి రేకపల్లి, శ్యామ్ అప్పల్లి, వంశీ కృష్ణ ఏరువరం, సోమ జగదీష్, నారాయణరెడ్డి ఇందుర్తి, వినోద్ పర్ణ, మీనల్ సిన్హా, తీగరాజన్, దీనదయాళన్ మరియు కులతేజలకు ధన్యవాదాలు. (చదవండి: ఆస్ట్రేలియాలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు) -
ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా స్కూలు అభివృద్ధికి రూ.4 లక్షల విరాళం
-
ఆర్ఐ స్వర్ణలత జీవితంలో ఈ కోణం కూడా చూడాల్సిందే..
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో కలకలం రేపిన నోట్ల మార్పిడి కేసులో జనసేన నాయకుడి అనుచరుడు సూరి అరెస్ట్ అయ్యారు. రూ. 2వేల నోట్లు మార్పిడి కేసులో పోలీసులు ఇప్పటి వరకు నలుగురిపై కేసు నమోదు చేశారు. అయితే, ఈ ముఠాకు ఏఆర్ ఆర్ఐ స్వర్ణలత నాయకత్వం వహించినట్లు పోలీసులు తేల్చారు. దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. కాగా, స్వర్ణలత జీవితంలో మరో కోణం బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. స్వర్ణలత సొంత జిల్లా విజయనగరంలో ఆమె పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్వర్ణ ఫౌండేషన్(www.swarnafoundationgroup.com) పేరుతో పేద విద్యార్థులకు, మహిళలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయితే, తాజాగా స్వర్ణలతపై ఆరోపణల నేపథ్యంలో ఆర్ఐ స్వర్ణలత ఫౌండేషన్ కార్యకలాపాలు బయటకు వచ్చాయి. కాగా, స్వర్ణ ఫౌండేషన్ సంస్థ గ్రామీణ ప్రాంతంలోని పేద ప్రజల ఆరోగ్యం, విద్య కోసం పనిచేస్తోంది. ఆరోగ్యం, విద్యకున్న ప్రాముఖ్యత గురించి అవగాహాన కల్పిస్తోంది. ఈ ఫౌండేషన్ అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలను ఆదుకోవడం, పిల్లల విద్య, ఆరోగ్య సమస్యల కోసం ఆర్థికంగా వెనుకబడిన ప్రజలను ఆదుకోవడం అనే ప్రాథమిక లక్ష్యంతో ఏర్పడింది. ఇది కూడా చదవండి: జీడిపై చీడ రాతలు! అప్పుడు కిమ్మనని రామోజీ ఇప్పుడు మాత్రం గుండెలు బాదుకుంటున్నాడు -
ఉదయనిధి స్టాలిన్ ఫౌండేషన్ ఆస్తుల అటాచ్
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి నడిపే ఫౌండేషన్‌కు చెందిన రూ.36 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఫౌండేషన్‌కు చెందిన తమిళనాడులోని రూ.36 కోట్ల విలువైన స్థిరాస్తులను, రూ.34.7 లక్షల బ్యాంక్ డిపాజిట్లను ఈనెల 25న అటాచ్ చేసినట్లు వివరించింది. ఈ కేసు దర్యాప్తులో కల్లాల్ గ్రూప్, యూకే కేంద్రంగా పనిచేసే లైకా గ్రూప్ అనుబంధంగా భారత్‌లోని లైకా ప్రొడక్షన్స్, లైకా హోటల్స్‌లో సోదాలు జరిపినట్లు తెలిపింది. -
ఇక మచిలీపట్నం పోర్టుకు పూర్వవైభవం
సాక్షి, అమరావతి: మచిలీపట్నం వాసుల చిరకాల వాంఛ కార్యరూపం దాల్చుతోంది. సుమారు రూ.11,464 కోట్ల భారీ పెట్టుబడితో పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మొత్తం 16 బెర్తులతో.. 115.97 మిలియన్ టన్నుల సామర్థ్యంతో దీన్ని నిర్మించనుంది. ఇందులో భాగంగా తొలి దశలో రూ.5,156 కోట్లతో నాలుగు బెర్తుల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 22న శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశలో 35 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును నిర్మిస్తారు. ఇందుకు సంబంధించి రూ.3,668.83 కోట్ల విలువైన పనుల కాంట్రాక్టును రివర్స్ టెండరింగ్ విధానంలో మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ దక్కించుకుంది. తొలి దశలో నిర్మించే నాలుగు బెర్తుల్లో రెండు సాధారణ బెర్తులు కాగా ఒకటి కోల్, మరొకటి మల్టీపర్పస్ బెర్తు. ఈ పోర్టు నిర్మాణం ద్వారా తెలంగాణతో పాటు మన రాష్ట్రంలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. ఎరువులు, బొగ్గు, వంట నూనెలు, కంటైనర్ల దిగుమతులకు ఈ పోర్టు అనువుగా ఉంటుందని అంచనా. అలాగే వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్ క్లింకర్, గ్రానైట్ బ్లాక్స్, ముడి ఇనుము ఎగుమతికి ప్రయోజనకరంగా ఉంటుందని అంచనా వేశారు. ఈ పోర్టు అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభిస్తుంది. దక్షిణాసియాకు ముఖద్వారంగా.. దేశ తూర్పుతీరంలో దక్షిణాసియా దేశాలకు అత్యంత దగ్గరగా మచిలీపట్నం పోర్టు ఉండటంతో పూర్వకాలంలో మసూలీపటా ఓడరేవు పేరుతో ఇక్కడి నుంచి పర్షియన్ (గల్ఫ్) దేశాలకు ఎగుమతులు, దిగుమతులు జరిగేవి. మచిలీపట్నం ప్రాంతపు చేనేత, కలంకారీ, అద్దకం దుస్తులకు పర్షియా దేశాల్లో మంచి డిమాండ్ ఉండేది. దీంతో ఆంగ్లేయులతోపాటు, డచ్, పోర్చుగీసు వారు మచిలీపట్నంలో వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. 1970 వరకు కార్యకలాపాలు కొనసాగించిన బందరు పోర్టు కాలక్రమంలో కనుమరుగైపోయింది. అన్ని అనుమతులతో ముందుకు.. స్థానిక ప్రజల చిరకాల కోరిక అయిన మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008, ఏప్రిల్ 23న శంకుస్థాపన చేశారు. అయితే వైఎస్ అకాల మరణానంతరం నిర్మాణ పనులు అటకెక్కాయి. 2014లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టు గురించి అసలు పట్టించుకోలేదు. 2019లో ఎన్నికలకు నెలన్నర ముందు పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగా పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన అంటూ ఒక కొబ్బరికాయ కొట్టి మమ అనిపించారు. అయితే దీనికి భిన్నంగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిధులు సమకూర్చడం దగ్గర నుంచి అన్ని అనుమతులు వచ్చాకే నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే 2020 ఫిబ్రవరి 4న మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. రూ.5,156 కోట్లతో పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులను మంజూరు చేయడమే కాకుండా నిధులను కూడా సమకూర్చారు. ఆ తర్వాత రూ.3,668.83 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించడానికి టెండరు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్‌తో ఈ ఏడాది ఫిబ్రవరి 26న ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే పోర్టు నిర్మాణానికి అవసరమైన కీలకమైన పర్యావరణ అనుమతులు ఫిబ్రవరి 28న వచ్చాయి. పోర్టును జాతీయరహదారితో అనుసంధానిస్తూ 6.5 కి.మీ నాలుగులైన్ల రహదారి, ఏడు కి.మీ రైల్వే లైన్ నిర్మాణాలకు కూడా అనుమతులు సాధించారు. తీర ప్రాంతంపై ప్రత్యేక దృష్టి రాష్ట్రంలో 974 కి.మీ. సుదీర్ఘ తీరప్రాంతాన్ని వినియోగించుకోవడం ద్వారా పారిశ్రామికంగా, వాణిజ్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నది సీఎం వైఎస్ జగన్ దృఢసంకల్పం. ఇందులో భాగంగా ఏపీ మారిటైమ్ బోర్డును ఏర్పాటు చేయడమే కాకుండా ఏకకాలంలో నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు నాన్ మేజర్ పోర్టుల వార్షిక సామర్థ్యం 320 మిలియన్ టన్నులుగా ఉంది. 2022–23లో 175 మిలియన్ టన్నుల ఎగుమతులు, దిగుమతులు జరిగాయి. 2025–26 నాటికి ఈ మొత్తానికి అదనంగా మరో 110 మిలియన్ టన్నులు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో భాగంగా రూ.16 వేల కోట్లతో రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టులతో పాటు పీపీపీ విధానంలో కాకినాడ వద్ద గేట్‌వే పోర్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఈ నాలుగు పోర్టుల నిర్మాణం ద్వారా రాష్ట్రంలో అదనంగా 75 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. – ప్రవీణ్ కుమార్, సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు, వీసీ అండ్ ఎండీ ఏపీఐఐసీ -
శభాష్ సిస్టర్స్
రాజుపాళెం : ఆడపిల్లలు తమ జడలను అపురూపంగా చూసుకుంటారు. ఒక్క వెంట్రుక రాలిపోతున్నా ఎంతో మనోవేదనకు గురవుతారు. క్యాన్సర్ బారిన పడిన వారికి కీమోథెరపీ ఇవ్వడం కారణంగా తల వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయి గుండు ఏర్పడుతుంది. ఇలాంటి వారికి తల వెంట్రుకలు దాదాపుగా తిరిగి రావు. ఒక వైపు క్యాన్సర్ మహమ్మారి సోకిందనే వేదన.. మరోవైపు ఎంతో అపురూపంగా చూసుకున్న తలవెంట్రుకలు పోయి అందవిహీనంగా మారామనే బాధ వారిని తీవ్రంగా కలచి వేస్తుంది. ఇలాంటి వారికి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు విగ్గులు తయారు చేసి ఉచితంగా అందిస్తున్నాయి. క్యాన్సర్ పేషెంట్ల కోసం మేము సైతం అంటూ అక్కా చెల్లెళ్లు తమ పొడవాటి జుట్టును దానం చేశారు. పుట్టిన రోజు సందర్భంగా.. రాజుపాళెం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన అప్సానా, సుహానా అక్కాచెల్లెళ్లు. క్యాన్సర్ పేషెంట్ల కోసం పలువురు యువతులు, బాలికలు జుట్టు దానం చేసిన వీడియోలను వారు ఇటీవల సోషల్ మీడియాలో చూశారు. చూసిందే తడవుగా తాము కూడా తమ వంతుగా క్యాన్సర్ బాధితులకు జుట్టు ఇచ్చి సాయపడేందుకు నిర్ణయించుకున్నారు. సుహానా జన్మదినం సందర్భంగా శుక్రవారం చెల్లెలుతోపాటు అక్క అప్సానా కూడా జుట్టును దానం చేయడం విశేషం. కత్తిరించిన ఇరువురి జడలను ప్రొద్దుటూరులోని స్టార్ ఫౌండేషన్ అధ్యక్షుడు సిరాజ్‌కు అందజేశారు. చిన్నారుల్లో కలిగిన మంచి ఆలోచనను ఆయన అభినందించారు. కురులను క్యాన్సర్ పేషెంట్ల కోసం హైదరాబాద్‌లోని ప్రముఖ స్వచ్ఛంద సంస్థకు పంపనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ వీరి మాదిరే జుట్టును దానం చేసి క్యాన్సర్ పేషెంట్లకు సాయపడాలని ఆయన కోరారు. -
శిలాఫలకాలకే పరిమితమైన చంద్రబాబు పాలన
-
కేశిరాజు విజయ కుమారి: 19 X 7 = ?
‘‘డిజిటల్ యుగంలో లెక్కలు చేయడం సులువైంది. స్మార్ట్ ఫోన్ ఉంటే చేతిలో కంప్యూటర్ ఉన్నట్లే. ఈ విజ్ఞాన పరిణామం ఎటు దారి తీసిందో తెలుసా? ఏడెనిమిదులు ఎంతో చెప్పలేకపోతున్న తరం తయారైంది. అవన్నీ గుర్తు పెట్టుకోవడం తన పని కాదనుకుంటోంది మెదడు. కాలిక్యులేటర్ ఉండగా తనకెందుకు శ్రమ అని విశ్రాంతిలోకి వెళ్తోంది. కాలిక్యులేటర్ ఉండాల్సింది చేతిలో కాదు... తలలో. నిజమే! కాలిక్యులేటర్ బుర్రలో ఉండాలి... ఎక్కాలు నాలుక మీద నాట్యం చేయాలి.’’ అని... పిల్లలకు ఎక్కాలు నేర్పించడానికి ముందుకొచ్చారు కేశిరాజు విజయ కుమారి. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ చిన్న గ్రామం కవిటం. థింక్ బిగ్ అని ఏపీజే అబ్దుల్ కలామ్ చెప్పగా ఆమె వినలేదు. కానీ తనకు తానుగా పెద్ద కలనే కన్నారు. ఐఏఎస్ కావాలనే కల నెరవేరకపోవడానికి ఒకటి కాదు రెండు కాదు కుటుంబ రీత్యా అనేక కారణాలు. అడ్డంకులు ఐఏఎస్ కాకుండా ఆపగలిగాయి, కానీ సమాజానికి సేవ చేయడానికి కాదు కదా అనుకున్నారామె. తన ఎదురుగా కనిపించిన ప్రతి సమస్యకూ పరిష్కారాన్ని వెతుకుతూ, పరిష్కరించే వరకు విశ్రమించకుండా శ్రమించారు. బాల్యంలోనే నాన్న పోవడం, పిల్లల పెంపకం బాధ్యతను మోస్తూ అమ్మ భుజాలు అరిగిపోవడం చూస్తూ పెరిగారామె. అంతేకాదు... తొలి ఉద్యోగం ఒక ఎన్జీవోలో టీచర్‌గా. దాంతో ఆ తర్వాత కూడా ఆమె అడుగులు సర్వీస్ వైపుగానే సాగాయి. దశాబ్దాలపాటు మహిళల కోసమే సేవలందించారామె. ఈ ప్రయాణంలో ఆమెకో కొత్త సంగతి తెలిసింది. డిగ్రీ చదువుకున్న వాళ్లకు కూడా ఎక్కాలు రావడం లేదు. నేర్చుకుని మర్చిపోయారా అంటే... అదీ కాదు. బడి గడప తొక్కని, అక్షరాలు నేర్వని బాల్యం ఉంటుంది. కానీ బడికి వెళ్లి అక్షరాలు నేర్చుకుని ఎక్కాలు నేర్వని బాల్యం ఉంటుందని ఊహించలేదామె. మరింత క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తెలిసిందేమిటంటే... నేటి బాల్యానికి ఎక్కాలు నేర్చుకోవడం టైమ్ వేస్ట్ పనిగా ఉంటోందని. కాలిక్యులేటర్ లేకుండా వందలో నాలుగోవంతు ఎంత అంటే చెప్పడం చేతకావడం లేదని. ఇన్ని తెలిసిన తర్వాత ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి ఎక్కాల పుస్తకాలు పంచు తున్నారు. ఒకటి రెండు నెలల పాటు వాళ్లకు నేర్చుకునే టైమ్ ఇచ్చి ఆ తర్వాత పోటీలు పెడుతున్నారు. ప్రతి క్లాసులో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు పాల్గొన్న వాళ్లకు కూడా ప్రోత్సాహకాలిస్తున్నారు. రకరకాలుగా సాగిన తన సామాజిక ప్రస్థానాన్ని ఆమె సాక్షితో పంచుకున్నారు. ఆడపిల్ల పుట్టాలి... చదవాలి! ‘‘మా వారి ఉద్యోగరీత్యా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎక్కువ కాలం ఉన్నాను. పెళ్లికి ముందు చదువు చెప్పిన అలవాటు ఉండడంతో అక్కడ ఖాళీగా ఉండలేకపోయేదాన్ని. పైగా మేము నార్త్‌లో ఉన్న రోజుల్లో అక్కడి మహిళలు దాదాపుగా నిరక్షరాస్యులే. నేనిక్కడ చదివింది సెకండ్ లాంగ్వేజ్ హిందీ మాత్రమే. కానీ అక్షరాలు, వాక్యాలు నేర్పించడానికి సరిపోయేది. వాళ్లకు నేర్పిస్తూ నేను హిందీ మాట్లాడడం నేర్చుకున్నాను. భాష మీద పట్టు రావడంతో వాళ్లకు కౌన్సెలింగ్ ఇవ్వడం సులువైంది. ఘూంఘట్ చాటున, అత్తింటి నియమాల మాటున జీవించడమే వాళ్లకు తెలిసింది. కడుపులో ఉన్నది ఆడపిల్ల అయితే బిడ్డను కనకూడదని, గర్భస్రావం చేయించుకోవాలని నూరిపోసింది అక్కడి సమాజం. యువతులు కూడా అదే నిజమనే విశ్వాసంతో ఉండేవాళ్లు. స్త్రీ లేని సమాజం ఎలా మనుగడ సాగిస్తుందో చెప్పమని, దక్షిణాదిలో ఆడపిల్ల çపుడితే లక్ష్మీదేవి పుట్టినట్లు భావిస్తారని వాళ్లకు నచ్చచెప్తుంటే... ‘ఇద్దరు మగపిల్లలున్న తల్లి ఆమె ఏ మాటైనా చెబుతుంది. ఆడపిల్లకు కట్నాలిచ్చేది ఎవరు’ అని అక్కడి మగవాళ్లలో నా మీద వ్యతిరేకత పెల్లుబుకుతుండేది. నాది నిశ్శబ్ద ఉద్యమం కాబట్టి నా మీద దాడులు జరగలేదు. ఇంటిముందు మురుగు కాలువ ఓపెన్ డ్రైనేజ్‌లో పిల్లలు పడుతుంటారు కూడా. పరిశుభ్రత లేమిని, ఇలాంటి సమస్యలను ప్రశ్నిస్తూ, మహిళలను కలుపుకుని స్థానిక మున్సిపల్ ఆఫీసులకు వెళ్లేదాన్ని. రోడ్డు శుభ్రం చేసిన తర్వాత ఆ కాలనీలో నివసించే ఆడవాళ్ల చేత సంతకం చేయించుకునే నియమం పెట్టారు మున్సిపల్ కమిషనర్. నేర్చుకోవడానికి వయసు పరిమితి ఎందుకు! నా ఉద్దేశం ఒక్కటే. ‘మహిళ కుటుంబ భారాన్ని మోయాల్సి వస్తే... ఆ క్షణంలో బెంబేలెత్తిపోకూడదు. ప్రతి ఒక్కరి చేతిలో ఏదో ఒక పని ఉండాలి. ఆర్థిక స్వావలంబన సాధించాలి’... అని. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత ఇక్కడి మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేకం చేశాను. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్‌లో వయో పరిమితి ఉంటుంది. అందులో ఇమడని వాళ్లు ‘మాకూ నేర్చుకోవాలని ఉంది’ అంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నాది. అలాంటి వాళ్ల కోసం కేవీఎస్ ఫౌండేషన్ స్థాపించి ఉచితంగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. శిక్షణ కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు 2006 నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. శిక్షణ కార్యక్రమాల నుంచి పుట్టుకు వచ్చిన అవసరమే ఈ ఎక్కాల ఉద్యమం’’ అన్నారు విజయకుమారి. టైలరింగ్ నేర్పించేటప్పుడు నడుము చుట్టు కొలత లో నాలుగో వంతు మార్క్ చేయమంటే చాలామందికి తెలిసేది కాదు. దాంతో ముందు లెక్కలు నేర్పించాల్సి వచ్చేది. ఏదో సందేహం వచ్చి హైదరాబాద్‌లోని మా అపార్ట్మెంట్ పిల్లలను అడిగాను. ఎక్కాలు చదవడం ఏంటన్నట్లు చూశారు. అపార్ట్మెంట్లో ఎక్కాల పోటీలు పెట్టాను. పాల్గొనడానికే సిగ్గుపడుతున్నారు కొందరు. స్కూళ్లకు వెళ్లాను. ప్రైవేట్ స్కూళ్లు పెద్దగా స్పందించలేదు. ప్రభుత్వ పాఠశాలలు స్వాగతించాయి. సిటీలో ఇప్పటికి మూడువేల ఎక్కాల పుస్తకాలు పంచాను. ఉప్పరపల్లి, ప్రభుత్వ పాఠశాల లో రెండవ తరగతి పిల్లాడు చాలా త్వరగా ఇరవై ఎక్కాలు నేర్చుకున్నాడు. పిల్లలకు చక్కగా నేర్పిస్తే మెరికల్లా తయారవుతారు. ప్రైవేట్ విద్యారంగం పిల్లలను మార్కుల పోటీలోకి నెట్టేస్తూ, లెక్కలకు పునాది వంటి ఎక్కాలను నిర్లక్ష్యం చేస్తోంది. మహిళలకు స్కిల్ డెవలప్‌మెంట్‌తోపాటు పిల్లలకు ఎక్కాలు నేర్పించే మరో నిశ్శబ్ద ఉద్యమాన్ని చేపట్టాను. – కేశిరాజు విజయకుమారి, సామాజిక కార్యకర్త, కేవీఎస్ ఫౌండేషన్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : అనిల్ కుమార్ మోర్ల -
అమ్మగా ఎదిగాను!
‘అమ్మా!’ అనే పిలుపును ఆస్వాదించని మహిళ ఉండదు. ఆ పిలుపును ఎన్ని గొంతులతో వింటే అంత సంతోషం. అందుకే అమ్మలేని పిల్లలకు అమ్మ అయ్యారామె. వాళ్లకు అన్న... అక్క... అమ్మమ్మ... నానమ్మలనూ ఇచ్చారు. అనాథలకు ఆశ్రయంతోపాటు అనుబంధాలనూ ఇస్తున్నారు. ఆరోగ్యరాణి సొంతూరు గుంటూరు జిల్లా, మేడికొండూరు మండలం, వరగాణి. ఆమె సేవకు కేంద్రం వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల. గుంటూరు నుంచి కడపకు సాగిన సేవాప్రస్థానాన్ని ఆమె సాక్షితో పంచుకున్నారు. ‘‘మా నాన్న ఆడపిల్లల చదువు కోసం చాలా గట్టిగా నిలబడ్డారు. అదే నేను ఈ రోజు బాలికల కోసం హోమ్ నడపడానికి మూలకారణం. ఆయన కొంతకాలం టీచర్‌గా ఉద్యోగం చేసి ఊరికి దూరంగా ఉండడం ఇష్టం లేక హైదరాబాద్ నుంచి వరగాణికి వచ్చేసి వ్యవసాయంలో స్థిరపడ్డారు. బంధువులు, ఊరి వాళ్లు ‘ఆడపిల్లకు పెళ్లి చేయకుండా ఇంకా ఎంతకాలం చదువుకు పంపిస్తావ్’ అని ఎంత ఒత్తిడి తెచ్చినా సరే ఆయన అవన్నీ పట్టించుకోకుండా నన్ను, మా మేనమామ కూతురిని కూడా బీఈడీ వరకు చదివించారు. పోరుమామిళ్లకు పిలుపు! టెన్త్ క్లాస్ వరకు నెల్లూరు సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదివాను. నేను బీఈడీ పూర్తి చేసిన టైమ్‌లో మా స్కూల్ హెడ్మిస్ట్రెస్ పోరుమామిళ్లలో ఉన్నారు. తెలిసిన వాళ్ల ద్వారా నా గురించి వాకబు చేశారట. మాథ్స్ టీచర్ అవసరం ఉందని పిలిపించారు. అలా 1994లో పోరుమామిళ్లలోని ‘అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా’ స్కూల్లో మాథ్స్ అసిస్టెంట్‌గా చేరాను, ఇప్పుడు అదే స్కూల్ హెడ్మాస్ట్రిస్ని . ఆ తర్వాత ఏడాది నాకు పెళ్లయింది. మా అత్తగారు కూడా ఇదే స్కూల్లో టీచర్‌గా చేశారట. ఆ సంగతి మా పెళ్లయిన తరవాత తెలిసింది. నాకు ఈ ఊరితో ఈ స్కూల్‌తో అనుబంధం నాకు తెలియక ముందు ఏనాడో ముడిపడి ఉందనిపిస్తుంది. ఇక హోమ్ స్థాపనకు దారి తీసిన పరిస్థితులు కూడా అలాంటివే. ముందస్తు ప్రణాళిక ఏమీ లేదు, అప్రయత్నంగా బాధ్యత తీసుకున్నాను. బాధ్యత ఇంటికి వచ్చింది! మా బంధువుల్లో ఒక పెద్దాయన కలసపా డులో తన ఇంట్లోనే పద్దెనిమిది మంది అబ్బాయిలకు ఆశ్రయం ఇచ్చేవారు. ఆయనకు వయసు మీద పడిన తరవాత ఓ రోజు మా వారి దగ్గరకు వచ్చి ‘‘వీళ్లంతా బాగా చదువుకుంటున్నారు. నాకు శక్తి తగ్గిపోయింది. ఈ పిల్లలను వాళ్ల ఊళ్లకు పంపించేస్తే చదువు ఆగిపోతుంది. వీళ్ల జీవితాలు మీ చేతిలో పెడుతున్నాను. చేయగలిగింది చేయండి’’ అన్నారు. అలా మా ఇంటికి వచ్చిన పిల్లలందరికీ అమ్మనయ్యాను. అందరికీ వండి, నేను బాక్సు పెట్టుకుని స్కూల్‌కి వెళ్లేదాన్ని. వాళ్లలో కొంతమంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. మా హోమ్‌కి వచ్చి ఆ రోజు భోజనం స్పాన్సర్ చేస్తుంటారు. ఇది ఇలా ఉంటే మా మామగారి పేరు మీద 2002 నుంచి సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాం, ఆ తరవాత మదర్ థెరెస్సా ఫౌండేషన్ పెట్టి వరదలు, సునామీ వంటి విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాలు చేస్తుండేవాళ్లం. నాకు ఎక్కడికెళ్లినా చదువు లేకుండా చిన్న వయసులోనే పెళ్లితో ఇంటి బాధ్యతలు మోస్తున్న టీనేజ్ బాలికల మీద దృష్టి ఆగిపోయేది. అలాగే అమ్మానాన్నలు లేకపోవడంతో బంధువుల ఇళ్లలో ఇంటి పనులతో రోజులు వెళ్లదీస్తున్న బాలికలు కూడా. అప్పుడు మా నాన్న ఆడపిల్ల చదువు గురించి ఎంత గట్టిగా నిలబడ్డారో కళ్ల ముందు మెదిలేది. చాలామంది ఆడపిల్లలకు తమకోసం ఆలోచించేందుకు అమ్మానాన్నలు కూడా లేరు. ఒకవేళ తల్లి లేక తండ్రి మాత్రమే ఉన్నప్పటికీ ఆ ఇంటి ఆడపిల్ల పరిస్థితి దయనీయంగానే ఉంటుంది. అలాంటి బాలికల కోసం పనిచేయాలని గట్టిగా సంకల్పం చెప్పుకున్నాను. ఆడపిల్లల విషయంలో ఆశ్రయం, చదువుతోపాటు భద్రత కూడా చాలా ముఖ్యం. సరిగ్గా నిర్వహించగలనా అనే సందేహం పీడించింది. అప్పుడు మా వారు ‘‘భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు సమాజానికి తిరిగి ఇవ్వాలి. అలా చేయకపోతే దేవుడికి ఏమని లెక్క చెప్పాలి? ధైర్యంగా మొదలు పెట్టు’’ అన్నారు. అలా 2012లో 30 మంది మా హోమ్‌కి వచ్చారు. ఈ పదేళ్లలో ఆ నంబరు 250కి దగ్గరైంది. కరోనా తరవాత కొత్త అడ్మిషన్లు తీసుకోలేదు. ఇప్పుడు 52 మంది ఉన్నారు. అనుబంధాల నిలయం! మా పిల్లల్లో ఇద్దరు ఎంబీయే చేశారు, బీటెక్ చేసి లండన్ వెళ్లారు, చాలామంది బీటెక్ చేస్తున్నారు. కొంతమంది టీచర్ ట్రైనింగ్‌లో ఉన్నారు. మా బాధ్యతగా సమాజానికి బాధ్యతగల ΄పౌరులను ఇస్తున్నాం. నేను కన్న పిల్లల్లో అబ్బాయి ఎంబీయే. మా చారిటీ హాస్పిటల్ చూసుకుంటున్నాడు. అమ్మాయి సివిల్స్‌కి ప్రిపేరవుతోంది. హోమ్‌లో పిల్లలకు నేను అమ్మని, మా అబ్బాయి అన్న, అమ్మాయి అక్క. ఇక మా అమ్మని అమ్మమ్మ, అత్తమ్మని నానమ్మ అని పిలుస్తారు. హోమ్ అంటే ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టడమే కాదు, బంధాలతో అనుబంధాలను అల్లుకోవాలి. మరొకరి ఆశ్రయంలో ఉన్నామనే భావన కలగకూడదు. అందుకే అందరం ఇదే హోమ్‌లో ఉంటాం’’ అని చెప్పారు ఆరోగ్యరాణి. - చిత్తా ఆరోగ్యరాణి, ఫౌండర్, మదర్ థెరెస్సా ఫౌండేషన్, పోరుమామిళ్ల, కడప జిల్లా – వాకా మంజులారెడ్డి ఫొటోలు: పాలకొలను వెంకటరామిరెడ్డి, సాక్షి, బద్వేల్, కడపజిల్లా -
ముందుకు సాగడమే జీవితం.. సేవ కోసం ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని..
కిన్నెర నాగ చంద్రికాదేవి పుట్టింది అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణం (కడప జిల్లా). పెరిగింది కడప జిల్లా ఎర్రగుంట్లలో. ఉన్నత విద్యావంతుల కుటుంబంలో పుట్టిన నాగచంద్రాదేవికి పదో తరగతితోనే పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని ఊహించలేదు. అలాగే రెండు వందల తులాల బంగారంతో మొదలైన ఆమె జీవితంలో కాలంతోపాటు బంగారం కరిగిపోవడమూ ఊహించలేదు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని, సమాజ సేవ కోసం ఆ ఉద్యోగాన్ని వదిలేయాల్సి వస్తుందని కూడా ఊహించని సంఘటనలే. అలాగే సోదరులున్నప్పటికీ తల్లిదండ్రుల దహన సంస్కారాలు తన చేతులతో చేయాల్సి వస్తుందని కూడా ఊహించని పరిణామమే. అలాగే తన హోమ్‌లో కాలధర్మం చెందిన ఆరు వందల మందికి స్వయంగా అంత్యక్రియలు చేయడం కూడా ఊహించని సంఘటనలే. తన సేవా ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారామె. ‘జీవితం అంటేనే గమ్యం ఏమిటో తెలియకనే మొదలు పెట్టే ప్రయాణం. ఊహకందని మలుపులతో సాగే ఈ ప్రయాణంలో స్పీడ్ బ్రేకర్లుంటాయి, గతుకులుంటాయి, వాహనం మొరాయిస్తుంది, మరమ్మతులు చేసి ముందుకు సాగబోతే ఇంధనం నిండుకోనూవచ్చు. ఇన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగడమే మనం చేయగలిగింది. వృద్ధుల సేవలో నా జీవితానికి ఒక అర్థాన్ని నిర్వచించుకున్నాననే అనుకుంటున్నాను’ అన్నారామె. నైరాశ్యం– నేను– నా బిడ్డ ‘‘మా నాన్న మెడికల్ ఆఫీసర్. అమ్మానాన్నలకు తొలి సంతానం నేను. నన్ను మా మేనత్తకు దత్తత ఇచ్చారు. అత్త, మామ ఇద్దరూ హైస్కూల్ టీచర్లు. ఎందుకు నిర్ణయం తీసుకున్నారో కానీ టెన్త్ క్లాస్‌తోనే పెళ్లి చేశారు. అయితే పెళ్లి తర్వాత కాలేజ్‌కెళ్లే అవకాశం ఉండింది. ఇంటర్ తర్వాత విద్యుత్‌సౌధలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాను. ఈ లోపు బాబుకి తల్లి కావడం... బిడ్డనెత్తుకుని ఇంటి నుంచి బయటపడడం వరకు జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ చిన్నవయసుకే పూర్తయిపోయాయి.. ఉద్యోగం చేసుకుని ఇంటికి వస్తే నాలుగ్గోడల మధ్య నేను, నా కొడుకు. నైరాశ్యం ఆవరించినట్లయ్యేది. దాని నుంచి బయటపడడానికి వేసిన ఒక్కో అడుగూ నన్ను ఇవాళ ఇలా సేవకు ప్రతీకగా నిలబెట్టాయి. నా పనిని గుర్తించి అవార్డులు వరించాయి. నన్ను అంటిపెట్టుకుని నేడో రేపో అన్నట్లు కళ్లలో ప్రాణాలు నిలుపుకుని రోజులు లెక్కపెట్టుకుంటున్న వాళ్లు ఉన్నారు. నేను కనిపించగానే వాళ్ల కళ్లలో కనిపించే వెలుగు నన్ను నడిపిస్తోంది. ఒకరికి ఒకరు తోడు మగవాడి మోసానికి గురయి ఒంటరైన మహిళలకు నా ఇంట్లో ఉంచుకుని వాళ్లు ఏదో ఒక పని నేర్చుకుని వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే వరకు ఆసరా ఇస్తూ వచ్చాను. అలాగే ఏ దిక్కూలేని వృద్ధులను ఇంటికి తీసుకురావడం కూడా. ఏ బంధుత్వం లేని వాళ్లను అలా ఇంట్లో ఉంచుకోవడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం అని తెలిసి 2003లో మా ఇంటి పేరుతోనే కిన్నెర ఫౌండేషన్ స్థాపించాను. అక్కడి నుంచి నా సర్వీస్ విస్తరణ కూడా మొదలైంది. స్కూల్లో ఉండాల్సిన పిల్లలు వీథుల్లో ఉంటే వారిని సమీకరించి కౌన్సెలింగ్ ఇచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్చాను. ఎందుకో తెలియదు కానీ అక్కడ కూడా సింగిల్ పేరెంట్ సంరక్షణలో ఉన్న పిల్లలే ఎక్కువగా ఉండేవారు. ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నా బిడ్డల్లా అనిపించేవారు. సామాజిక చైతన్యం మహిళలకు ఎదురయ్యే ఇబ్బందులను వివరిస్తూ ప్రభుత్వపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో షీ టీమ్‌తో కలిసి పని చేశాను. నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట దగ్గర జప్తేసద్గూడ గ్రామాన్ని దత్తత తీసుకుని ప్లోరోసిస్ బాధితులకు మంచి నీటి ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలు నా చేతుల మీదుగా చేయగలిగాను. వృద్ధుల సేవనే ప్రధానంగా తీసుకోవడానికి కారణం మా అమ్మమ్మ, అత్త మంచం పట్టిన రోజులను దగ్గరగా చూడడమే. వాళ్ల మీద మనకు ఎంత ప్రేమ ఉన్నప్పటికీ వాళ్ల బాధను పంచుకోలేం. మనం చేయగలిగింది వారికి తోడుగా ఉంటూ భరోసా ఇవ్వడం మాత్రమే. అందుకే మా హోమ్‌లో హాస్పిస్ సేవలే ప్రధానంగా ఉంటాయి. హోమ్ నిర్వహణకు నెలకు మూడు లక్షల ఖర్చు వస్తుంది. ఒక కంపెనీ నుంచి అద్దెలో కొంత ఆర్థిక సహాయం, మరో కంపెనీ నుంచి బియ్యం నెలనెలా అందుతున్నాయి. పుట్టినరోజులు హోమ్‌లో చేసుకోవడానికి కొంతమంది వస్తారు. మిగిలిన ఖర్చుల కోసం ... ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లో సంపాదించుకున్న ఇల్లు, రెండు ప్లాట్లు అమ్ముకున్నాను. బంగారం బ్యాంకులో తాకట్టు పెడుతూ విడిపిస్తూ, పెద్ద అవసరంలో అమ్ముకుంటూ అలా 30 తులాలు ఖర్చయింది. మాసాబ్ ట్యాంకులో అద్దె ఇంట్లో హోమ్ నిర్వహిస్తున్నాను. నా శక్తి తగ్గిపోతోందనే సమయం వచ్చిందని కాబోలు భగవంతుడు హోమ్ కోసం సొంత భవనాన్ని నిర్మించే మార్గం చూపించాడు. చిన్న జీయర్ స్వామి సూచనతో ముచ్చింతల్‌లో హోమ్ నిర్మాణం పూర్తయితే మా హోమ్ అక్కడికి మారుతుంది’’ అని వివరించారు నాగ చంద్రికాదేవి. సేవలోనే సాంత్వన నా సర్వీస్‌కి గుర్తింపుగా స్టేట్ అవార్డు, ఉత్తమ మహిళ అవార్డు, సేవాధార్మిక, గవర్నర్ అవార్డు, నేషనల్ అవార్డు అందుకున్నాను.ఈ పనుల్లో నన్ను నేను ఎంగేజ్ చేసుకున్నాను. ఈ సేవలో నాకు సాంత్వన లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏపీలో గుణదలలో పోస్టింగ్ వచ్చింది. నేను హైదరాబాద్ వదిలి వెళ్లాలంటే హోమ్‌లో ఉన్న వాళ్ల సంరక్షణ ప్రశ్నార్థకమైంది. వాళ్లను ఎవరి మీద వదలాలి? తాత్కాలికంగా బాధ్యత అందుకోవడానికి కూడా ఏ ఆసరా లభించలేదు. దాంతో 2016లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. – నాగ చంద్రికాదేవి, ఫౌండర్, కిన్నెర ఫౌండేషన్ – వాకా మంజులారెడ్డి -
ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వారందరికీ ధన్యవాదాలు : సీఎం జగన్
వైఎస్సార్ జిల్లా పులివెందులలో సీఎం జగన్ పర్యటన అప్డేట్స్ 04:15PM పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై.. లింగాల మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిలో, సంక్షేమ పథకాల అమలులో అలుపెరగకుండా శ్రమిస్తున్న లింగాల మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులకు.. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సహకరిస్తున్న ప్రజలకు, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న అందరికీ ఈ సందర్భంగా సీఎం జగన్ ధన్యవాదాలు తెలియజేశారు. 02:05PM పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం ప్రజలు, ముఖ్య నేతలతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వివరించిన స్థానికులు. 01:35PM వైఎస్సార్ లేక్‌వ్యూ రెస్టారెంట్ వద్ద దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ 01:20PM సీఎం జగన్ బోటింగ్ సీబీఆర్ వద్ద బోటింగ్ జెట్టీలో సీఎం జగన్.. ఎంపీ అవినాష్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఇతర అధికారులతో కలిసి బోటింగ్ చేశారు. 01:15PM ►సీబీఆర్ వద్ద బోటింగ్ జెట్టీని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ 01:00PM వైఎస్సార్ జిల్లా: పార్నపల్లి రిజర్వాయర్‌కు చేరుకున్న సీఎం జగన్ ►కాసేపట్లో బోటింగ్ జెట్టిని ప్రారంభించనున్న సీఎం జగన్ ►చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో రూ.6.50 కోట్లతో అభివృద్ధి పనులు ►రిజర్వాయర్ వద్ద టూరిజం పార్క్, రెస్టారెంట్, బోటింగ్ ఏర్పాటు 12:50PM వైఎస్సార్ జిల్లా: చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ►స్వాగతం పలికిన కడప ఎంపి వైయస్ అవినాష్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జిల్లా అధికారులు. 11:42AM ►గన్నవరం విమానాశ్రయం నుంచి వైఎస్సార్ కడప జిల్లాకు బయల్దేరిన సీఎం జగన్ 11:20AM కృష్ణాజిల్లా: తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►గన్నవరం విమానాశ్రయం నుంచి కాసేపట్లో వైఎస్సార్ కడప జిల్లా బయల్దేరనున్నారు. సాక్షి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప జిల్లా పర్యటనకు బయలుదేరారు. డిసెంబరు 2, 3వ తేదీల్లో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. నేటి పర్యటన ఇలా.. ►లింగాల మండలంలోని పార్నపల్లె వద్ద సీబీఆర్ రిజర్వాయర్ వద్ద బోటింగ్ జెట్టిని ప్రారంభిస్తారు. ►అనంతరం వైఎస్సార్ లేక్ వ్యూ పాయింట్‌కు చేరుకుని వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తారు. ►అనంతరం లింగాల మండల నాయకులతో మాట్లడతారు. అంతేకాకుండా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులు ఇవే..
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో రూ.10,742 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆంధ్రా యూనివర్శిటీ (ఏయూ) గ్రౌండ్స్‌లో శనివారం జరిగే బహిరంగ సభా వేదికగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొననున్నారు. ప్రాజెక్టుల వివరాలు.. ► రూ. 460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ► రూ. 3,778 కోట్లతో రాయిపూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ గ్రీన్ ఫీల్డ్ హైవే ► రూ. 566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ వరకు రోడ్డు నిర్మాణం ► రూ. 152 కోట్లతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు ► రూ. 2658 కోట్లతో గెయిల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంగుల్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు నిర్మాణ పనులకు శంకుస్థాపన ► రూ. 211 కోట్లతో నరసన్నపేట పాతపట్నం రహదారి అభివృద్ధి పనులు జాతికి అంకితం ► రూ. 2,917 కోట్లతో నిర్మించిన ఓఎన్జీసీ యు ఫీల్డ్ ఆన్ షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్ట్ జాతికి అంకితం ఇదీ చదవండి: ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన సీఎం జగన్ -
పునాదిపై పోయిన ప్రాణం
ధర్మవరం అర్బన్: నూతన ఇంటి పునాదికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం ధర్మవరంలో చోటు చేసుకుంది. వన్ టౌన్ ఎస్ఐ మహమ్మద్ రఫి తెలిపిన వివరాల మేరకు... ప్రియాంకనగర్‌కు చెందిన రషీద్(30) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితమే హర్షియాతో వివాహం కాగా, అప్పటి నుంచి ‘వర్క్ ఫ్రమ్ హోం’ కింద ఇంటి వద్ద నుంచే ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే రషీద్ కుటుంబం శ్రీలక్ష్మీచెన్నకేశవపురంలో నూతన ఇంటి నిర్మాణం చేపట్టింది. శనివారం పునాదికి నీరు పెట్టేందుకు వెళ్లిన రషీద్, కరెంటు మోటర్ త్రీపిన్ ప్లగ్ పిన్ నీటితో తడిసిపోయి ఉండటాన్ని గమనించిన స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నించాడు. ఈక్రమంలో విద్యుత్ షాక్ కొట్టడంతో అక్కడే పడిపోయాడు. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరీక్షించి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఎస్ఐ మహమ్మద్ రఫి సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. (చదవండి: ‘ఫ్యామిలీ డాక్టర్’తో మెరుగైన వైద్య సేవలు) -
Sunitha Krishnan: దయచేసి మారండి!
మహిళల అక్రమ రవాణా... ప్రభుత్వాలకు పెద్ద సవాల్. సమాజానికి తలవంపులు. బాధిత మహిళకు విషమ పరీక్ష. మహిళల రక్షణ ఆమె ఆకాంక్ష. తనకు తెలిసిన మార్గం పోరాటమే. పోరాటం... పోరాటం... పోరాటం. అసాంఘిక శక్తులతో పోరాటం. సామాజిక పరిస్థితులతో పోరాటం. మనసు మారితే సమాజం మారుతుంది. ఇప్పుడు ఆ మార్పు కోసం అభ్యర్థిస్తోంది. సునీతాకృష్ణన్ ‘నా బంగారు తల్లి’ సినిమా తీసి దాదాపుగా దశాబ్దమవుతోంది. మహిళలను మోసగించి అక్రమ రవాణాకు పాల్పడే దుర్మార్గాన్ని ఆ సినిమాలో కళ్లకు కట్టారు సునీతా కృష్ణన్, ఆమె భర్త రాజేశ్ టచ్‌రివర్. ప్రతి సన్నివేశమూ వాస్తవానికి అద్దం పట్టింది. సినిమా క్లైమాక్స్ దృశ్యాలు కన్నీటి పర్యంతం చేస్తాయి, మనసు ద్రవించిపోతుంది. సమాజంలో మహిళ ఎదుర్కొనే దాష్టీకాలకు మౌనంగా రోదిస్తూ బయటకు వస్తారు ప్రేక్షకులు. వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం అది. ఆ సందర్భంగా నిర్మాత సునీతా కృష్ణన్ మాట్లాడుతూ ‘‘1996లో ప్రజ్వల ఫౌండేషన్ ప్రారంభించినప్పటి నుంచి పోరాడుతున్నాను. అంతకంటే ముందు ప్రజ్వల వంటి ఫౌండేషన్ అవసరం ఉందని గ్రహించే వరకు నేను గుర్తించిన సామాజికాంశాలన్నింటి మీదా పోరాడాను. ‘స్త్రీ అంగడి సరుకు కాదు, దేహం మీద దాడి చేస్తే ఆమె మనసు ఎంతగా రోదిస్తుందో ఆలోచించండి’ అని గొంతుచించుకుని చెప్తున్నాను. నా ఉద్యమం సమాజంలో ప్రతి ఒక్కరినీ చేరాలంటే, ఏకకాలంలో ఎక్కువమందిని సెన్సిటైజ్ చేయాలంటే ప్రభావవంతమైన మాధ్యమం అవసరం అనిపించింది. అందుకే సినిమా తీశాను. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ఎవరైనా కనీసం ఒక్క క్షణమైనా ఆలోచించకపోతారా, స్త్రీ దేహాన్ని మాత్రమే కాంక్షించే మగవాళ్లకు తమ ఇళ్లలో ఉండే ఆడబిడ్డలు కళ్ల ముందు మెదలకపోతారా’ అనేది మా ఆశ. నేను యాక్టివిస్ట్‌ని, నా భర్త సినిమా దర్శకుడు కావడంతో మా ఆలోచన అనుకున్నది అనుకున్నట్లే కార్యరూపం దాల్చింది. ఎటువంటి సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా చిత్రించాం’’ అని చెప్పారామె. ఆమె సామాజిక సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2016లో పద్మశ్రీతో సత్కరించింది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు (మహిళాసాధికారత విభాగం)కు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆమె సాక్షితో పంచుకున్న అనుభవాలివి. ఎక్కడ ఉన్నా పోరాటమే! ‘‘నేను బెంగళూరులో పుట్టిన మలయాళీని. నేను పుట్టిన నెలరోజులకే మా నాన్నకు హైదరాబాద్‌కు బదిలీ అయింది. నా బాల్యం మూడేళ్లు ఇక్కడే గడిచింది. నేను మహిళల కోసం పని చేయడానికి హైదరాబాద్‌ను ఎంచుకోవడం అనుకోకుండా జరిగింది. బెంగళూరులో స్టూడెంట్‌గా నేను ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. స్త్రీ దేహం కాస్మటిక్ కంపెనీల నిబంధనల చట్రంలో ఇమడాలనే భావనను వ్యతిరేకించాను. స్త్రీ దేహం ఫలానా కొలతల్లో ఉంటేనే అందం అని ఒకరు నిర్ణయించడమేంటి, ఆ మాయలో చిక్కుకుని అమ్మాయిలు తమ దేహాన్ని నియంత్రించుకోవడానికి తంటాలు పడడం ఏమిటి? అని... స్త్రీ దేహాన్ని మార్కెట్ వస్తువుగా పరిగణించే ధోరణిని నిరసిస్తూ అందాల పోటీల నిర్వహణను అడ్డుకుని రెండు నెలలు జైల్లో ఉన్నాను. అప్పుడు నాకు ఇరవై రెండేళ్లు. నేను ఉద్యమించి జైలుకెళ్లడాన్ని మా ఇంట్లో సమ్మతించలేకపోయారు. అలా ఇల్లు వదిలి వచ్చేశాను. ఎక్కడికెళ్లాలో తెలియదు. రైల్వే స్టేషన్‌కెళ్లి కౌంటర్లో ఎటువెళ్లే రైళ్లున్నాయని అడిగాను. వాళ్లు చెప్పిన పేర్లలో ‘హైదరాబాద్’ వినిపించగానే ‘టికెట్ ఇవ్వండి’ అనేశాను. అలా హైదరాబాద్, చాదర్‌ఘాట్‌లో నివసిస్తున్న ఓ మిత్రురాలింటికి వచ్చాను. ఇక్కడ కూడా ఉద్యమించాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు మూసీ నది తీరాన్ని ‘నందనవనం’గా మార్చాలని ప్రభుత్వం అక్కడి ఇళ్లను ఖాళీ చేయించాలని నిర్ణయం తీసుకుంది. ‘పునరావాసం కల్పించిన తర్వాత మాత్రమే మా ఇళ్లను కూలగొట్టండి’ అంటూ రోడ్డెక్కాను. ఆ తర్వాత హైదరాబాద్‌లో ‘మెహబూబ్ కీ మెహందీ’లో నివసిస్తున్న వారిని తొలగించే ప్రయత్నం జరిగింది. ఆ మహిళల కోసం ఏదైనా చేయాలని పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాను. లైంగికహింస, అక్రమ రవాణాలకు గురయ్యి జైళ్లు, హోమ్‌లలో ఉన్న మహిళలను కలిశాను. వాళ్లలో చాలామంది తమ పిల్లలకు భవిష్యత్తు ఇవ్వమని కోరారు. అలా ఐదుగురు పిల్లలతో స్కూలు ప్రారంభించాను. ఆ తర్వాత పదిమంది పిల్లలతో షెల్టర్ హోమ్ పెట్టాను. అలా మొదలైన చిన్న ప్రయత్నం ఇప్పుడు పదిహేడు ట్రాన్సిషన్ సెంటర్లలో ఏడు వందల మంది పిల్లలు చదువుకునేంతగా పరిణమించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు పన్నెండు వేల మంది చదువుకుని గౌరవప్రదమైన జీవితాల్లో స్థిరపడ్డారు. ఈ ఫౌండేషన్ అవసరం ఉండకూడదు! ఆడపిల్లల అక్రమ రవాణాదారులు ఒక అమ్మాయిని తీసుకువచ్చినట్లు సమాచారం అందగానే దూకుడుగా వెళ్లిపోయేదాన్ని. అడ్డువచ్చిన వాళ్లతో బాహాబాహీకి దిగి మరీ ఆడపిల్లలను బయటకు తీసుకువచ్చేదాన్ని. అలా లెక్కలేనన్నిసార్లు నా మీద దాడులు జరిగాయి. చెవి మీద తగిలిన దెబ్బ కారణంగా వినికిడి కూడా తగ్గింది. ఆ దాడులను పట్టించుకోలేదు. కానీ నా అనుచరుడిని హత్య చేశారు. అప్పుడు నా పంథా మార్చుకుని పోలీస్, మహిళా సంక్షేమశాఖల వంటి ప్రభుత్వ వ్యవస్థలతో కలిసి పని చేయడం మొదలుపెట్టాను. ఇప్పటికి 96 వేల మంది బాలికలు, యువతులు, మహిళలను రక్షించగలిగాను. ఆ నంబరు ఇంత పెద్దదిగా ఉన్నందుకు గర్వపడడం కాదు మనం సిగ్గుపడాలి. స్త్రీల రక్షణ కోసం ప్రజ్వల ఫౌండేషన్ ప్రారంభించాను. సమాజంలో స్త్రీల అక్రమ రవాణా పూర్తిగా అంతరించిపోవాలి. నేను బతికి ఉండగానే ఈ ఫౌండేషన్‌ను మూసివేయాలనేది నా ఆకాంక్ష. సమాజంలో సున్నితత్వం పెరిగి, మంచి మార్పు రావాలని అందరం ఆశిద్దాం. – సునీతాకృష్ణన్, సామాజిక ఉద్యమకారిణి మగవాళ్లకు చెప్పాలి! నా బంగారు తల్లి సినిమాతో సమాజాన్ని ఆలోచింపచేయగలిగాను. ఆ సినిమాకి మూడు నేషనల్ అవార్డులు వచ్చాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ నాలుగు నంది అవార్డులు ప్రకటించింది. ఇప్పుడు మగవారి మీద దృష్టి పెట్టాను. ఆడవాళ్ల మీద జరిగే దాడులను, మోసాలను అరికట్టడానికి భుజబలం ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనం కంటే మగవాళ్లను చైతన్యవంతం చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చనిపించింది. అందుకే ఇప్పుడు ‘మ్యాన్ అగెనెస్ట్ డిమాండ్ (మ్యాడ్)’ నినాదంతో ముందుకు వెళ్తున్నాను. ‘మీ లైంగిక అవసరాలకు ఇతర స్త్రీలను కోరుకోవడం మానేయండి, మీలో ఈ మార్పు వస్తే స్త్రీల అక్రమ రవాణా మాఫియా దానంతట అదే అంతరించిపోతుంది’ అని అభ్యర్థిస్తున్నాను. మనిషిలో సహజంగానే సున్నితత్వం ఉంటుంది. ఆ సున్నితత్వాన్ని పురుషాహంకారంతో అణచివేయకుండా ఉంటే చాలు. మార్పు వచ్చి తీరుతుంది’’ అని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు సునీతా కృష్ణన్. ఇరవై ఆరేళ్ల తన పోరాటంలో తిరస్కారాలు తప్ప పురస్కారాలు అందలేదని, తన సొంతరాష్ట్రం కేరళలో ప్రభుత్వ పురస్కారం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో దక్కిన తొలి గౌరవం ‘వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ అని సంతోషం వ్యక్తం చేశారామె. – వాకా మంజులారెడ్డి -
హైదరాబాద్ : మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పరిశ్రమకు శంకుస్థాపన
-
ఘంటసాల తెలుగు పాట చిరునామా మాత్రమే కాదు పాటల సౌధానికి పునాది: అనంత్ శ్రీరామ్
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకలు సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదం ఊపందుకున్న విషయం విదితమే. శంకర నేత్రాలయ యు.ఎస్.ఏ. అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో 190 టీవీ చర్చ కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ పాల్గొన్న ఈ ప్రత్యేక కార్యక్రమం, 10 మంది సహ నిర్వాహకులు అయిన రత్నకుమార్ కవుటూరు, శారద ఆకునూరి, రెడ్డి ఉరిమిండి, శ్యాం అప్పాలి, విజు చిలువేరు, నీలిమ గడ్డమణుగు, రామ్ దుర్వాసుల, ఫణి డొక్కా, జయ పీసపాటి, శ్రీలత మగతలతో కలిసి ప్రపంచవ్యాప్తంగా 100 మంది పైగా గాయకులు / గాయనీమణులతో ఘంటసాల శత గళార్చన కార్యక్రమంను నిర్వహించగా.. మొదటి మూడు భాగాలు 21, 28 ఆగస్టు, 4 సెప్టెంబర్ నాడు ప్రసారం చేయగా అనూహ్యమైన స్పందన వచ్చిందని, 11 సెప్టెంబర్ నాడు చివరి భాగం ప్రసారమైందని నిర్వాహకులు తెలిపారు. ముందుగా బాల రెడ్డి ఇందూర్తి శత గళార్చన నాల్గవ (చివరి) భాగంలో పాల్గొన్న ముఖ్యఅతిథి ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ ఘంటసాల అంటే తెలుగు పాటకి చిరునామె కాదు తెలుగు పాటల సౌధానికి పునాది లాంటి వారని కీర్తించారు. ఘంటసాలతోనే తెలుగు పాట ప్రపంచవ్యాప్తమైందన్నారు. అలాగే జర్మనీ లాంటి తెలుగుకి ఏ మాత్రము సంబంధం లేని దేశాలలో కూడా ఆయన ప్రదర్శన అక్కడ ప్రజల్ని ఆకట్టుకుంది అంటే అది తెలుగు బాషాకి ఎంత ఔన్నత్యం ఉందొ తెలుగు బాషాని ప్రాచుర్యం చేసిన ఆయన గొంతుకి కూడా ఉన్నతి, ఆ ఘనత దక్కుతుందన్నారు. పాటలకు చమత్కారం జోడించి పాడటం అనేది అది వారికొక్కరికే సాధ్యమయ్యిందని తెలిపారు. నిజంగా ఇలాంటి గాయకుడు ఉండటం వల్లనే తెలుగు భాష ఇంత పరిఢవిల్లుతుంది అని అనిపించింది.. ఘంటసాల గారి పుష్పవిలాపం, కుంతి విలాపం, గోవిలాపం గాని పద్యాలు మనం వింటే చదువుతున్నప్పుడు ఆ పద్యం లోని భావం అర్ధం కొంతవరకు అవగతం అవుతుందేమో కానీ వారు పాడుతున్నప్పుడు భావం, అర్ధంతో పాటు కవిలోని ఆర్ద్రత కూడా ఆవిష్కరించబడింది. ఇలాంటి గాయకుడు దొరకడం తెలుగు వారిగా మన అదృష్టం.. ఇలాంటి గాయకుడు పాడిన బాషాని విని అర్థం చేసుకోవడం మన పూర్వజన్మ సుకృతం, అటువంటి గాయకుడు నభూతో నభవిష్యత్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదన్నారు. శత గళార్చన నాలుగు భాగాల స్వాగతోపన్యాసంతో మనల్ని అలరించిన శారద ఆకునూరి (హ్యూస్టన్, USA), ఈ చివరి భాగంలో తన బృందం నుంచి వరప్రసాద్ బాలినేని, పేరూరి వెంకట సోమశేఖర్, కృష్ణ నాలాది, రాజశేఖర్ సూరిభొట్ల, సురేష్ ఖాజా, జ్యోతిర్మయి బొమ్ము, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, రమణ జువ్వాది, సత్యనారాయణ ఉల్మురి, ఉష మోచెర్ల ఘంటసాల పాటల ద్వారా ఆయనను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమములో శ్యామ్ అప్పాలి (లాస్ ఏంజెలెస్, USA) బృందం నుంచి సాయి కాశీభొట్ల, శ్రీనివాస్ రాణి, ప్రసాద్ పార్థసారధి, సుధాకర్, వర్మ అల్లూరి, శ్రీహర్ష, శ్రీవల్లి శ్రీధర్, శ్రీయాన్ కంసాలి, ఆదిత్య కార్తీక్ ఉపాధ్యాయుల, అనూష వెన్నల, గౌరిధర్ మధు, రాజ్యలక్ష్మి వుదాతు, మీనాక్షి అనిపిండి, శాంత సుసర్ల, రఘు చక్రవర్తి, శ్రీధర్ జూలపల్లి, హరీష్ కొలపల్లి, నారాయణరెడ్డి ఇందుర్తి, వంశీకృష్ణ ఇరువరం పాల్గొన్నారు. శ్యాం అప్పాలి శత గళార్చన 4 భాగాలకు సాంకేతిక సహాయాన్ని కూడా అందించారు. శతగళార్చన కార్యక్రమంపై ఘంటసాల సతీమణి సావిత్రమ్మ, వారి కోడలు కృష్ణకుమారి మాట్లాడుతూ ముందుగా "ఘంటసాల కు భారతరత్న" కోసం కృషి చేస్తున్న 33 దేశాల నుంచి 119 మంది పాల్గొనడం చాలా సంతోషం కలిగిందని, వారందరికీ మా ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము. అలాగే విశిష్ట అతిధులుగా దర్శకుడు సుకుమార్, ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, రచయిత, నటులు దర్శకులు తనికెళ్ళ భరణి, గేయ రచయితలు చంద్రబోస్ అనంత శ్రీరామ్ తదితరులుకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఇన్ని కార్యక్రమాలను విజయవంతం నిర్వహించిన బాలరెడ్డి ఇందుర్తి, సింగపూర్ రత్న కుమార్ కవుటూరు ధన్యవాదములు తెలియచేసారు. శత గళార్చనకు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని. చాలా మంది ప్రముఖులు "ఘంటసాల గారికి భారతరత్న" విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న ఘంటసాల కుటుంబ సభ్యులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ బాల రెడ్డి ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
డాలస్‌లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ రక్తదాన శిబిరం
-
డాలస్‌లో డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ రక్తదాన శిబిరం
డాలస్: డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైయస్సార్ 13వ వర్ధంతి సందర్బంగా అమెరికా, టెక్సాస్ రాష్ట్రం, డాలస్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ సహాయం తో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. డాక్టర్ రామి రెడ్డి బూచిపూడి సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ప్రతీ సంవత్సరం రాజన్నను స్మరించుకుంటూ ఈ శిబిరం ఏర్పాటు చేస్త్నున్నందుకు అమెరికన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు వైఎస్సార్ అభిమానులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రవి ఆరిమండ, రమణ్ రెడ్డి క్రిష్టపాటి, మని అన్నపురెడ్డి, రమణ పుట్లూర్, జయచంద్ర రెడ్డి, సుధాకర రెడ్డి, భాస్కర్ గండికోట, కృష్ణ రెడ్డి కోడూరు, దర్గా నాగిరెడ్డి, ఫాల్గుణ రెడ్డి, ప్రసాద్ చొప్ప, వీరా రెడ్డి వేముల, మోహన్ మల్లంపాటి, రాజేంద్ర పోలు, సుబ్బా రెడ్డి కొండ్రు, ఉమా కుర్రి, సురేష్ పులి, చెన్నారెడ్డి క్రోవి , మల్లిఖార్జున్ మురారితో సహా పలువురు వైఎస్సార్ అభిమానులు, డాలస్ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ రక్త దాన శిబిరంలో చైతన్య కుమార్ రెడ్డి, జయచంద్ర గాజులపల్లి, కార్తీక్ ధర్మానాల, మోహన్ మల్లంపాటి, మోహన్ రెడ్డి పులగం, నాగేశ్వర గంట, నవీన్ కుమార్ రాజు అడ్డలూరి, పార్థసారథి గొర్ల, ప్రసాద్ భీమవరపు, రాఘవ రెడ్డి దాట్ల, రాంబాబు శొంఠి, రాము తవుతూ, శివచంద్ర రెడ్డి పల్లె, శివశంకర రెడ్డి వల్లూరు, సుభాష్ సురు, సుబ్రహ్మణ్యం రెడ్డి రెడ్డివారి, స్వామినాథన్, ఉజ్వల్ కుమార్ వేమన, ఉమా కుర్రి, వీర లేవక, వీరా రెడ్డి వేముల, వీరవెంకట సత్య పోతంశెట్టి, వెంకట రెడ్డి శీలం, యుగంధర్ తిప్పిరెడ్డి తో పాటుగా పలువురు వైఎస్సార్ అభిమానులు రక్త దానం చేశారు. -
Hyderabad: మట్టి ప్రతిమలకే జై కొడుతున్న నగరవాసులు
సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న వినాయకచవితి వేడుకలకు నగరం సన్నద్ధమవుతోంది. మండపాల్లో కొలువుదీరేందుకు బొజ్జ గణపయ్య ముస్తాబవుతున్నాడు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలపై ఆంక్షలు తొలగిపోవడంతో విగ్రహాల అమ్మకాలు మొదలయ్యాయి. మరోవైపు పర్యావరణహితమైన మట్టి ప్రతిమలకే నగరం పట్టం కడుతోంది. ముఖ్యంగా ఇళ్లల్లో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని పూజించేందుకు నగర వాసులు ఒక అడుగు నుంచి అయిదడుగుల మట్టి విగ్రహాలను ఎక్కువగా కోరుకుంటున్నారు. గతేడాది కంటే ఈసారి మట్టి విగ్రహాలకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, పీసీబీ వంటి ప్రభుత్వ సంస్థలు, పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి ప్రతిమల పంపిణీకి సన్నాహాలు చేపట్టాయి. సుమారు 6 లక్షల విగ్రహాలు.. ఈ ఏడాది సుమారు 6 లక్షల విగ్రహాలకు డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ప్రైవేట్ సంస్థలు తయారు చేసే మట్టి విగ్రహాలకు సైతం డిమాండ్ భారీగా ఉండనుంది. ‘ప్లాన్ ఏ ప్లాంట్’ వంటి సంస్థలు మొలకెత్తే విగ్రహాలను అందజేస్తుండగా మరి కొన్ని సంస్థలు ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసిన ప్రకృతి ప్రతిమలను అందుబాటులోకి తెచ్చాయి. ‘బాధ్యత ఫౌండేషన్’ అనే సంస్థ స్వచ్ఛమైన పల్లె మట్టితో చేసిన వినాయక ప్రతిమలను, సేంద్రీయ పద్ధతిలో సిద్ధం చేసిన పూజా ద్రవ్యాలను అందజేస్తోంది. ఈ మట్టి విగ్రహంతో పాటే విత్తనాలు కూడా ఉంటాయి. వేడుకలు పూర్తయ్యే నాటికి మొక్కలై ఎదుగుతాయి. ప్రకృతిని ఆరాధించడమే దైవంగా భావిస్తూ గత 8 ఏళ్లుగా ఏఎస్‌రావునగర్ కేంద్రంగా ప్రకృతి వినాయకుడి ప్రతిమలను భక్తులకు అందజేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ముంబై, చెన్నై, బెంగళూరు తదితర నగరాలకు, బ్రిటన్, అమెరికా, మలేషియా, తదితర దేశాలకు సైతం పెద్ద ఎత్తున విగ్రహాలను పంపించినట్లు పేర్కొన్నారు. పల్లెల్లోంచి నగరానికి.. బాధ్యత ఫౌండేషన్ అందజేసే గణపతి కిట్లు అన్నీ పూర్తిగా పల్లెల నుంచి సేకరించినవే. పల్లెల్లోని చెరువు మట్టి నుంచి ఈ ప్రతిమలను తయారు చేస్తారు. ఈ ప్రతిమలతో పాటు మట్టి పాత్రలను, ప్రమిదలను, చేనేత పూజా వస్త్రాలను, ఎలాంటి పురుగుమందులు, రసాయనాలు లేకుండా సహజమైన పద్ధతుల్లో పండించిన పెసరపప్పు, బెల్లం, పసుపు, కుంకుమ, అక్షింతలు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, 21 రకాల ఆకులను సైతం పల్లెల నుంచి సేకరించి గణపతి కిట్లను అందుబాటులోకి తెచ్చారు. 60 పేజీల వినాయక పూజా పుస్తకాన్ని అందజేస్తారు. పదకొండు రోజుల పాటు పూజలకు అవసరమయ్యే వివిధ రకాల వస్తువులు ఉంటాయి. తేనె, ఆవుపాలు, ఆకుల డొప్పలు, ఖర్జూర వంటివి కూడా ఈ కిట్‌లో ఉంటాయి. పల్లెల్లోని చేతి వృత్తులను కాపాడేందుకు సహజమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి ప్రతిమలకు శ్రీకారం చుట్టినట్లు చంద్రశేఖర్ తెలిపారు. (చదవండి: ప్రీలాంచ్ మాయ ) -
Mittal Gohil: మేడం దీదీలా ఎదగాలి
ఆడపిల్లలు పెద్ద చదువులు చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు... వంటి కట్టుబాట్లు ఉన్న గ్రామంలో పుట్టిన మిత్తల్ గోహిల్ ఇంగ్లిష్ లిటరేచర్‌లో డిగ్రీ చదువుకుని, అంతర్జాతీయ వేదికలపై మాట్లాడడమేగాక, ఎనిమిది రాష్ట్రాల్లోని బాలికలు, మహిళలను చక్కగా తీర్చి దిద్దడంతోపాటు, తన సొంత గ్రామంలో ఎంతోమంది బాలికలకు ప్రేరణగా నిలుస్తోంది. గుజరాత్‌లోని మారుమూల గ్రామం అంకోట్. ఈ గ్రామంలోని రాజ్‌పుత్ కుటుంబంలో పుట్టింది మిత్తల్ గోహిల్. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ వ్యవసాయం చేసేవారు. వెయ్యిమంది ఉన్న గ్రామంలో మూఢాచారాలు ఎక్కువ. అమ్మాయిల్ని చదవనివ్వరు. చిన్నవయసులోనే పెళ్లి చేసి పంపిస్తారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పెరుగుతున్నప్పటికీ మిత్తల్ మాత్రం జీవితంలో ఉన్నతంగా ఎదగాలని కలలు కనేది. కానీ గ్రామంలో అందరికీ విరుద్ధంగా తనని ఒక్కదాన్నే చదువుకోవడానికి పంపిస్తారా? అని కంగారు పడేది. కానీ మిత్తల్ తండ్రి ప్రోత్సహించడంతో పాఠశాల విద్య వరకు నవోదయ స్కూల్లో హాస్టల్ లో ఉండి చదువుకుంది. మిత్తల్ హాస్టల్ లో ఉండి చదవడాన్ని కూడా గ్రామస్థులు వ్యతిరేకించారు. కానీ మిత్తల్ ఇంగ్లిష్ మాట్లాడాలని పట్టుబట్టి మరీ ఆమె తండ్రి చదివించడంతో.. ఇంగ్లిష్ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తిచేసి, తరువాత సోషల్ వర్క్‌లో మాస్టర్స్ కూడా చేసింది. ముగ్గురి నుంచి వందలమంది... కాలేజీ రోజుల్లో నవలలు చదివే అలవాటు ఉన్న మిత్తల్ నవలల్లోని రచనల ద్వారా భారతదేశంలో మహిళల పరిస్థితులపై అవగాహన పెంచుకుంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఆదివాసీలకోసం పనిచేసే అవకాశం వచ్చినప్పటికీ ఇంట్లోవాళ్లు పంపించకపోవడంతో తన గ్రామానికి దగ్గర్లో ఉన్న భారుచ్‌లో మహిళా శిశు సంక్షేమ ప్రాజెక్టులో ఏరియా మేనేజర్‌గా చేరింది. ఇక్కడ మూడున్నరేళ్లు పనిచేసిన అనుభవంతో 2017లో ‘దేశాయ్ ఫౌండేషన్’లో చేరింది. ముగ్గురు ఉద్యోగులు మాత్రమే ఉన్న ఈ ఫౌండేషన్‌లో చేరిన కొద్దిరోజుల్లోనే తన పనితీరుతో దాదాపు ఐదు వందలమంది పనిచేసే అతిపెద్ద సంస్థగా తీర్చిదిద్దింది. దీంతో ఫౌండేషన్‌లో చేరిన రెండేళ్ల తరువాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యింది. ఫౌండేషన్ టీమ్‌తో కలిసి యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని ముప్పై లక్షలమంది మహిళలు, బాలికల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ప్లెజర్ పిరియడ్... దేశాయ్ ఫౌండేషన్ ద్వారా.. మహిళాభివృద్ధి, సమాజంలో ఉన్నతంగా బతికేందుకు కావాల్సిన అన్ని ప్రోత్సాహకాలు అందిస్తోంది. దీనిలో భాగంగా ‘ప్లెజర్ పిరియడ్’ పేరిట పిరియడ్స్, మహిళల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళలు తమ కాళ్ల మీద తాము ఆర్థికంగా నిలబడేలా వృత్తిపరమైన శిక్షణలు, కంప్యూటర్ ట్రైనింగ్, బ్యూటీ కోర్సులో శిక్షణ, పచ్చళ్లు, అప్పడాల తయారీ, క్యాండిల్స్, జ్యూవెలరీ తయారీలో శిక్షణ, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి స్టార్టప్ పెట్టడానికి కావాల్సిన రుణసదుపాయం కల్పించడం వరకు అన్ని రకాలుగా సాయపడుతూ మహిళా అభ్యున్నతికి పాటుపడుతోంది. మిత్తల్ తన నైపుణ్యంతో ఫౌండేషన్‌తోపాటు తన సొంత గ్రామంలో మార్పు తీసుకురావడం విశేషం. ‘‘అక్కలా చదవాలి...’’ నాన్న చిన్నప్పటి నుంచి నేను ఇంగ్లిష్‌లో మాట్లాడాలని కోరుకునేవారు. తొలిసారి 2018లో అమెరికా వెళ్లినప్పుడు నాలుగు వందలమంది ముందు ఎంతో ధైర్యంగా ఇంగ్లిష్ మాట్లాడాను. నాన్న నా ఇంగ్లిష్ ప్రసంగాలను మెచ్చుకున్నారు. దేశాయ్ ఫౌండేషన్‌లో పనిచేస్తూ ఎంతోమంది బాలికలు, మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం. మా గ్రామంలో ఎంతోమంది చిన్నారులకు నేను ప్రేరణగా నిలుస్తున్నాను. గ్రామంలోని చాలా మంది తల్లిదండ్రులు మిత్తల్ అక్కలా, ఆ మేడంలా చదవాలి అని తమ కూతుళ్లకు చెబుతున్నారు. నా స్ఫూర్తితో గ్రామంలో ముప్పైమందికి పైగా అమ్మాయిలు డిగ్రీ పూర్తి చేశారు. ఏడుగురు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఎప్పుడూ ముసుగులు వేసుకుని సిగ్గుపడుతూ వచ్చే మహిళలు ఇప్పుడు ముసుగు తీసి ఎంతో ధైర్యంగా మా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. వారి మాటతీరు, కట్టుబొట్టు అంతా మారిపోయింది. ఇంతమంది జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపడం చాలా సంతోషంగా ఉంది’’. – మిత్తల్ గోహిల్ -
‘సర్దుబాటు’తో అపరిమిత ప్రయోజనాలు
మార్పు నిరంతర ప్రక్రియ. పాత వాటి స్థానంలో అంత కన్నా మెరుగైన కొత్త విధానాలు, వ్యవస్థలు రావడం అనివార్యం, అభిలషణీయం కూడా. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలులో భాగంగా మన రాష్ట్రంలో పాఠశాలల సర్దుబాటుకు చూపుతున్న చొరవను ఇందులో భాగంగానే చూడాలి. అర్థం చేసుకోకుండా ఒక విధానాన్ని వ్యతిరేకించడం సరైన చర్య కాదని విద్యార్థుల తల్లిదండ్రులు, విమర్శకులూ గ్రహించాలి. కొంతమంది ‘మా పాఠశాలను తరలించవద్దు’ అంటూ ధర్నాలకు దిగడం మనం చూస్తున్నాం. ప్రభుత్వం పాఠశాలలను తరలిస్తున్నామని ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదు. మరి ఈ ఆందోళనకారులను ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు? మన రాష్ట్రంలో చాలా గ్రామాలలోని ప్రాథమిక పాఠశాలల్లో ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. వారు ఒకటి నుండి 5వ తరగతి వరకు రోజుకు 9 నుండి 18 సబ్జెక్టులను బోధించాల్సి ఉంటుందనే విషయం తల్లిదండ్రులకు చాలామందికి తెలియదు. బోధనేతర పనులైన మధ్యాహ్న భోజనం ఏర్పాటు, టాయిలెట్ మెయింటెనెన్స్, పాఠశాల ఆవరణ శుభ్రత వంటి పనులను కూడా వీరు రోజూ పర్యవేక్షించాలి. ఈ పరిస్థితుల్లో పిల్లలకు హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం సాధ్యంకాదు. ఒక సబ్జెక్టును దానిలో నిష్ణాతుడైన ఒక టీచర్ బోధించినప్పుడే పిల్లలు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఇదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్న నూతన విధానం. ఇది తెలియక పాఠశాలల ముందు ధర్నా చేస్తున్నారు. జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి మన రాష్ట్రంలో విద్యా విధానంలో మరిన్ని మార్పులు వస్తాయి. శాటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్, హై స్కూల్, హై స్కూల్ ప్లస్‌లు విద్యా విధానంలో ప్రవేశిస్తాయి. ఈ విధానంలో ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లు... హైస్కూల్ ప్లస్‌లుగా మారిపోతాయి. ఈ ప్లస్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ కూడా ఉంటుంది. అంటే మూడవ తరగతి నుంచీ ఇంటర్మీడియట్ వరకూ మన ప్రభుత్వ పాఠశాలలు ఒకే చోట విద్యను బోధిస్తాయన్నమాట. ఎన్ఈపీలో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో చదువుకునే 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులను మూడు కిలోమీటర్ల లోపు ఉన్న అప్పర్ ప్రైమరీ లేదా హైస్కూల్లో చేర్చుతారు. దీనర్థం ఉన్న ప్రాథమిక పాఠశాలలను ఎత్తివేస్తారని కాదు. ప్రైవేటు పాఠశాలల్లో ఉండే ఎల్కేజీ, యూకేజీల్లాగానే గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్లలో ప్రీ పైమరీ–1(పీపీ–1), ప్రీ పైమరీ–2 (పీపీ–2) క్లాసులు ఏర్పాటు చేస్తారు. అలాగే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ తరగతులు కూడా ఉంటాయి. ఈ పాఠశాలల్లో రెండవ తరగతి వరకూ చదువుకున్న తర్వాత పిల్లలను మూడు కిలోమీటర్ల లోపు ఉన్న హైస్కూల్లో చేర్చుకుంటారు. ఇందువల్ల పిల్లలకు అపరిమిత ప్రయోజనాలు చేకూరుతాయి. మూడు, నాలుగు, ఐదు తరగతులను హైస్కూళ్ళలో సర్దుబాటు చేయడం ద్వారా పిల్లలకు ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్ ఉంటారు. కాబట్టి, అక్కడ హైస్టాండర్డ్తో సబ్జెక్టు బోధించడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదివించడానికి ఏడెనిమిది మైళ్ల దూరంలో ఉన్న స్కూళ్లకు పంపించడంలో లేని ఇబ్బందులను మూడు కిలోమీటర్ల లోపలే... అన్ని హంగులతో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించడానికి బాధపడటం సరికాదేమో తల్లిదండ్రులు ఆలోచించాలి. పాఠశాలల సర్దుబాటు విషయంలో టీచర్లు కూడా అపోహాలను తొలగించుకోవాలి. వారి ఉద్యోగాలకు వచ్చే ముప్పు ఏమీ ఉండదు. కాంప్లెక్స్ లెవల్లో ఉపాధ్యాయులకు సర్దుబాటు, ఎన్ఈపీపై ప్రత్యక్ష తరగతులు అవసరం. - వి. వి. రమణ సామాజిక విశ్లేషకులు -
అమ్మాయిల్లో ఆకాష్‌ను చూస్తూ...
జీవితంలో ఎన్నో ఆటుపోట్లకు లోనవుతుంటాము. మనకెంతో ఇష్టమైన వారిని శాశ్వతంగా కోల్పోయినప్పుడైతే ఆ బాధ వర్ణనాతీతం. ఆ దూరమైన వారే సర్వసం అయినప్పుడు జీవితం మొత్తం శూన్యమైపోయినట్లు అనిపిస్తుంది. అనుపమా సక్సేనాకు కూడా తన కొడుకు చనిపోయినప్పుడు తీవ్రమైన నైరాశ్యం ఆవహించి, జీవితం మొత్తం చీకటైపోయింది. ఎప్పటికీ ఈ బాధనుంచి తేరుకోలేననుకుంది. కానీ తన కొడుకుకున్న ఒక మంచి లక్షణంతో ఊరట పొంది, కొడుకు పేరుమీద ఫౌండేషన్‌ను స్థాపించి వందలమంది అమ్మాయిలకు చదువు చెబుతూ.. వారి భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుతోంది. తన కొడుకుని ఆ అమ్మాయిల్లో చూసుకుంటూ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది అనుపమ. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన వందల మంది అమ్మాయిల టీచరమ్మే అనుపమా సక్సేనా. ఆమె భర్త స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగి. అనుపమ దంపతులకు ‘ఆకాష్’ ఒక్కగానొక్క సంతానం. చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. తల్లిదండ్రుల మాటలను బుద్దిగా పాటిస్తూ చక్కగా చదువుకున్నాడు ఆకాష్. డిగ్రీ పూర్తి కాగానే మంచి కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగం వచ్చిన తరువాత తల్లిదండ్రులు మంచి అమ్మాయితో 2008 నవంబర్‌లో నిశ్చితార్థం చేశారు. మరికొద్దిరోజుల్లో పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయించారు. కాబోయే అమ్మాయి పెళ్లికి అన్నీ సిద్ధం చేసుకుంటూ, ఆకాష్‌తో తన కొత్త జీవితంపై కలలు కంటోంది. ఇంతలో 2009 జనవరి 7న లక్నోలో ఆకాష్‌కు యాక్సిడెంట్ అయ్యింది. ఈ యాక్సిడెంట్లో తలకు తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయాడు. కేవలం 25 ఏళ్లకే తన కొడుకుకు నిండు నూరేళ్లు నిండాయని అనుపమ కుప్పకూలిపోయింది. ఆకాష్ మైండ్ వాల్ ఫౌండేషన్ రెండేళ్లపాటు ఆకాషపకాల్లో కూరుకుపోయిన అనుపమ ..పదేపదే ఆకాష్‌నే గుర్తుచేసుకుంటూ బాధపడుతుండేది. అలా తనతో ఆకాష్ ఊసులాడిన సందర్భాలు గుర్తు చేసుకుంటోన్న క్రమంలో... ఎవరైనా సాయం కావాలని అడిగితే వారికి కాదనకుండా వీలైనంత సాయం అందించడానికి ఆకాష్ ప్రయత్నించడం గుర్తుకొచ్చింది. ‘ఆకాష్‌లా నేనెందుకు చేయకూడదు. వాడికి నచ్చిన పనిచేస్తే నా కొడుకు కళ్ల ముందే ఉంటాడు కదా...’ అన్న ఆలోచన వచ్చింది అనుపమ కు. భర్త, బంధువుల సాయంతో 2011లో ‘ఆకాష్ మైండ్ వాల్ ఫౌండేషన్’ను స్థాపించింది. అర్ధంతరానికి ఆయువు పోసి... ఘజియాబాద్‌లోని వైశాలీలో టీచర్‌గా పనిచేస్తోన్న అనుపమకు..ఆ ప్రాంతంలో ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా లేదని తెలిసింది. అంతేగాకుండా చదువుకోవడానికి ఎనిమిదో తరగతి వరకే అవకాశం ఉంది. నిరుపేద బాలికలు పై చదువులు చదువుకునే స్థోమత లేక అక్కడితో చదువుని ఆపేస్తున్నారు. ఇలా చదువు ఆపేసిన వారు కొంత మంది ఇళ్లలో పనులు చేస్తుంటే, మరికొందరు చిన్న వయసులో పెళ్లిచేసుకోవాల్సి వస్తుంది. వీటన్నింటినీ ప్రత్యక్షంగా చూసిన అనుపమ.. అర్ధాంతరంగా ఆగిపోయిన చదువులకు ఆయువు పోసేందుకు పాఠాలు చెప్పడం ప్రారంభించింది. తన దగ్గరకు వచ్చే అమ్మాయిలందరికి ఉచితంగా చదువు చెప్పి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్ఐఓఎస్) ద్వారా పరీక్షలు రాయించి తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పూర్తి చేయించడమే పనిగా పెట్టుకుంది. ఇంకా పై చదువులు చదివించడానికి, స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్(ఎస్ఓఎల్)లో డిగ్రీలు కూడా చేయిస్తోంది. బ్యాచ్‌కు ఇరవై మంది చొప్పున పదుల సంఖ్యలో బ్యాచ్‌లు నడుపుతోంది. వీరికి సంవత్సరానికి రెండున్నర లక్షల రూపాయలకు పైగా అయ్యేఖర్చు మొత్తాన్ని అనుపమ దంపతులే భరిస్తున్నారు. -
చిన్ని ప్రాణుల చలివేంద్రాలు
సాక్షి, విశాఖపట్నం: వేసవి వచ్చిందంటే చాలు నీటి చుక్క కోసం అల్లాడిపోతాం. కాలు బయటపెడితే.. కాసిన్ని నీళ్లు ఎక్కడ దొరుకుతాయా అని ఆశగా వెదుకుతుంటాం. ఎప్పటికప్పుడు ఉష్ణతాపాన్ని తీర్చుకునేందుకు ఏదో రూపంలో నీటిని శరీరానికి అందిస్తుంటాం. అందుకే వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చాలాచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మరి మూగజీవాల పరిస్థితి ఏమిటి? చుక్క నీటి కోసం మైళ్ల దూరం ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. పక్షి జాతుల్లో కొన్ని అంతరించిపోవడానికి వేసవీ ఒక కారణమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయలేమా? అని కెన్ ఫౌండేషన్ సభ్యులకు కలిగిన ఆలోచన.. నేడు నగరంలో వేలాది పశుపక్ష్యాదుల దాహార్తిని తీరుస్తోంది. 10 ఏళ్లుగా ఎన్నో జీవాలకు వేసవిలో ఊపిరిపోస్తోంది. సాధారణంగా పక్షుల శరీర సాధారణ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్. ఈ ఉష్ణోగ్రత దాటితే ఎక్కువ సేపు జీవించలేవు. అందుకే చాలా పక్షులు ఎక్కడ నీరు కనిపిస్తే అందులో మునకేస్తూ శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకుంటాయి. ప్రస్తుతం నగరంలో వేసవి నేపథ్యంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు సమీపిస్తోంది. ఈ తరుణంలో పక్షుల సంరక్షణకు నడుం బిగించింది నగరానికి చెందిన కెన్ ఫౌండేషన్. సేవే మార్గంగా.. విద్యార్థులు వలంటీర్లుగా.. సంస్థ అధ్యక్షుడు పుల్లేటికుర్తి సంతోష్ ఈ సంస్థ తరఫున వాటర్ బౌల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. 100 తొట్టెలతో ప్రారంభమై.. పక్షులను వేసవి తాపం నుంచి రక్షించి వాటి దాహార్తి తీర్చే ఉద్దేశంతో 2012లో కెన్ ఫౌండేషన్ నగరంలో వాటర్ బౌల్ పేరుతో సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలి ఏడాది ఫౌండేషన్ వలంటీర్లే నగరంలోని పలుచోట్ల 100 నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. ఆ వాటర్ బౌల్స్ వద్దకు పక్షులు, మూగజీవాలు వచ్చి నీటిని తాగుతుండటం చూసి నగర ప్రజలు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తామూ ఈ వాటర్ బౌల్ ప్రాజెక్ట్‌లో భాగస్వాములమవుతామని ముందుకువచ్చారు. దీంతో వాటర్ బౌల్ ప్రాజెక్ట్‌ను విస్తరించారు. పిచ్చుకలు, రామచిలుకలు, పావురాలు, కోయిలలు, కాకులతో పాటు ఉడుతలు, ఆవులు, కుక్కలు కూడా ఈ వాటర్ బౌల్స్ వద్దకు చేరుకుని తమ దాహార్తిని తీర్చుకుంటున్నాయి. సంస్థ చైర్పర్సన్ గీతానారాయణ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నీటి తొట్టెల ఖర్చును భరిస్తూ.. అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. 2017 వరకు 750 నీటి తొట్టెలు పంపిణీ చేయగా.. 2021 నాటికి ఆ సంఖ్య 1800 కు చేరింది. ఈ ఏడాది 150 నుంచి 200 వరకు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నగరమంతా విస్తరణ నగరంలోని అనేక చోట్ల నుంచి జంతు ప్రేమికులు ఈ వాటర్ బౌల్స్‌ను తీసుకుని వెళ్తున్నారు. ఇంకా ఎవరైనా పక్షి ప్రేమికులుంటే మరికొన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెందుర్తి, విశాలాక్షినగర్, కొత్తవలస, స్టీల్‌ప్లాంట్, అనకాపల్లి, డాల్ఫిన్ నోస్... ఇలా శివారు ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు వచ్చి నీటితొట్టెలను తీసుకెళ్తున్నారు. ఈ నీటితొట్టెల్లో నీటిని నింపి మేడ చివర్లో కానీ, పెరడులో గానీ పెడితే పక్షులు అక్కడికి చేరి దాహాన్ని తీర్చుకుని ఉపశమనం పొందుతున్నాయి. ఐదేళ్లుగా సరఫరా చేసిన నీటి తొట్టెల వద్దకు ఎన్నో పక్షులు కాలంతో పనిలేకుండా వస్తుండటం విశేషం. ఉచితంగా అందిస్తాం.. వేసవి వస్తే మనుషుల కోసం అడుగడుగునా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ మూగజీవాల గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అందుకే మా ఫౌండేషన్ తరఫున వాటర్ బౌల్ ప్రాజెక్ట్ ప్రారంభించాం. ఇవి జంతువులకు, పక్షులకు చలివేంద్రాలు. నగరంలోని అనేక కళాశాలలు, ప్రైవేట్ సంస్థల్లో కూడా వీటిని ఏర్పాటుచేశాం. మూగ జీవాలను ప్రేమించేవారు ఎవ్వరు వచ్చినా.. ఉచితంగా నీటితొట్టెలు అందిస్తాం. ఆసక్తి ఉన్న వారు 98856 74949ను సంప్రదించవచ్చు. – పుల్లేటికుర్తి సంతోష్, కెన్ ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రజల స్పందన అనూహ్యం కెన్ ఫౌండేషన్ తరఫున ముందుగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. 100 చోట్ల పెట్టి వాటినే ప్రతి ఏటా కొనసాగించాలని భావించాం. అయితే.. నీటి తొట్టెలు చూసిన వారు ఇళ్ల వద్ద కూడా పెడతామని సంప్రదించారు. దీంతో ఆరేళ్లుగా దీన్ని కొనసాగిస్తున్నాం. – గీతానారాయణ్, చైర్పర్సన్, కెన్ ఫౌండేషన్ -
ఆర్కిటెక్చర్ విద్యార్థులకు గీతాబోధ
తమ చుట్టూ ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు కొందరైతే.. పనిచేస్తోన్న రంగంలో మూలాల వరకు ఉన్న లోటుపాట్లు, అవకాశాలను వ్యక్తిగతంగా శోధించి తెలుసుకుని, వాటిని సరిచేయడానికి, సమాజాభివృద్ధికి తోడ్పడే విధంగా కార్యరూపం దాల్చుతారు. ఈ కోవకు చెందిన వారే 53 ఏళ్ల ఆర్కిటెక్ట్ గీతా బాలకృష్ణన్. కోల్‌కతాకు చెందిన గీతా బాలకృష్ణన్.. ఢిల్లీలోని స్కూల్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో బీఆర్క్ చదివింది. కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో ప్రాక్టికల్ శిక్షణ తీసుకుంది. తరువాత వివిధ ఆర్టిటెక్ట్ల దగ్గర ఉద్యోగం చేసింది. కానీ ఆమెకు అక్కడ చేసే పని సంతృప్తినివ్వలేదు. దీంతో ‘నిర్మాణ రంగంలో ప్రత్యామ్నాయ పద్ధతులు’ పై కోర్సు చేసింది. ఈ కోర్సు చేసేసమయంలో ప్రొఫెసర్ కేఎస్ జగదీష్‌తో పరిచయం ఏర్పడింది. ఈయన మార్గదర్శకంలో సాంప్రదాయేతర ఆర్కిటెక్ట్ డిజైన్లపై గీతకు మక్కువ ఏర్పడింది. దీంతో పర్యావరణానికి హాని కలగని డిజైన్లు చేస్తూనే..బెంగళూరుకు చెందిన ఎన్జీవో ఆవాస్ (అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్ అండ్ సర్వీసెస్) పరిచయంతో ఎన్జీవో తరపున సేవాకార్యక్రమాలు నిర్వహించేది. ఇలా చేస్తూనే పట్టణాల్లో నివసిస్తోన్న నిరుపేదలకు ఆవాసం కల్పిస్తున్న మరో సంస్థతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ఈవిధంగా సామాజిక సేవచేస్తూనే మరోపక్క ఎంతోమంది కలల ఇంటినిర్మాణాలకు ప్లాన్లు రూపొందించేది. ఇథోస్ అనేక ప్రాజెక్టుల్లో పనిచేసిన తరువాత ఆర్కిటెక్చర్ విద్యార్థులకు, నిర్మాణ రంగంలో ఉన్న ఇంజినీరింగ్ వృత్తి నిపుణులకు మధ్య సమన్వయం కొరవడిందని గుర్తించింది గీత. ఈ గ్యాప్‌కు ఏదైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ‘ఇథోస్’ సంస్థను స్థాపించి విద్యార్థులకు, సివిల్ ఇంజినీరింగ్ నిపుణులకు మధ్య వారధిని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆరువందల కాలేజీల్లోని మూడువేలకుపైగా విద్యార్థులను వివిధ ఆర్టిటెక్ట్ సెమినార్లు నిర్వహించి వారికున్న సందేహాలను నివృత్తి చేసేలా, ఇంజినీరింగ్ పట్ల వృత్తిపరమైన అవగాహన కల్పించేలా వృత్తినిపుణులకు, విద్యార్థులను ముఖాముఖి పరిచయ కార్యక్రమాల ఏర్పాటు చేస్తున్నారు. దీనిద్వారా ఆర్కిటెక్ట్ విద్యార్థులు తమ డిగ్రీ అయిన వెంటనే వారి ఆసక్తికి తగిన ఉద్యోగం సులభంగా దొరికే సదుపాయం కల్పిస్తోంది ఇథోస్. 2018లో ఇథోస్.. ఏసీఈడీజీఈ పేరిట ఆన్లైన్ ఎడ్యుకేషన్‌ను ప్రారంభించింది. దీనిద్వారా కన్స్ట్రక్షన్ ఇంజినీరింగ్ అండ్ డిజైనింగ్‌లో ఆన్లైన్ మాడ్యూల్స్‌ను అందిస్తోంది. ఆరు రాష్ట్రాలు..1700 కిలోమీటర్లు మానవుని జీవన శైలిపై అతను నివసించే భవన నిర్మాణ ప్రభావం కూడా ఉంటుందని గీత గట్టిగా నమ్ముతోంది. ఆర్కిటెక్ట్‌లు అందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్లు రూపొందించాలని ఆమె చెబుతోంది. అలా చెప్పడం దగ్గరే ఆగిపోకుండా తన ఇథోస్ ఫౌండేషన్ స్థాపించి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా కోల్‌కతా నుంచి ఢిల్లీవరకు అర్కాజ్ పేరిట 1700 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఈ పాదయాత్రలో భాగంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీలలో పర్యటించింది. కాలినడకనే ఆరు రాష్ట్రాల్లో తిరుగుతూ అక్కడి సంప్రదాయాలు, భవన నిర్మాణ శైలిని దగ్గరగా పరిశీలించింది. ఆయా ప్రాంతాల్లో నివసిస్తోన్న కొంతమందితో మాట్లాడి వారి ఇంటి నిర్మాణం, ఆ ఇంటితో ఉన్న అనుబంధం, ఎలాంటి అనుభూతిని పొందుతున్నారో అడిగి తెలుసుకుంది. ఇంటి నిర్మాణానికి మంచి ప్లానింగ్ ఉంటే జీవితం మరింత సుఖమయమవుతుందని పాదయాత్రలో అనేకమందికి అవగాహన కల్పించింది. వందల కిలోమీటర్ల ప్రయాణంలో తాను తెలుసుకున్న అనేక విషయాలను యువ ఆర్కిటెక్ట్‌లకు తెలియ జెబుతోంది. బాగా స్థిరపడిన వారు వృద్ధాప్యం లో తమ సొంత గ్రామాల్లో జీవించేందుకు వసతి సదుపాయాల డిజైన్లు, నిరుపేదలు కనీస వసతి సదుపాయాల కోసం ఏం కోరుకుంటున్నారో దగ్గరగా చూసిన గీత వారికి తగిన డిజైన్లు ఎలా రూపొందించాలి? ఆ డిజైన్లు నిరుపేదల జీవన శైలిపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో కాబోయే ఆర్కిటెక్ట్‌లకు వివరిస్తోంది. చేస్తోన్న పనిలోని లోటుపాట్లు్ల, అవకాశాలను లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్ తరాలను మెరుగుపరిచేందుకు కృషిచేస్తోన్న గీత లాంటి వాళ్లు మరింత మంది ఉంటే నాణ్యమైన వృత్తి నిపుణులుగా మరెందరో ఎదుగుతారు. -
తెలంగాణ ఐటీకి ‘గేట్ వే’
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగంలో తెలంగాణ దేశంలోనే తలమానికంగా ఉందని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కె. తారకరామారావు అన్నారు. గురువారం మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో గేట్ వే ఐటీ పార్కు, పూడూరులో ఆదర్శ ఫార్మర్స్ సర్వీస్ కో– ఆపరేటర్ భవన నిర్మాణానికి ఆయన జిల్లామంత్రి మల్లారెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు. కండ్లకోయ, పూడూరుల్లో ఏర్పాటు చేసిన సభల్లో కేటీఆర్ మాట్లాడుతూ కండ్లకోయగేట్ వే ఐటీ పార్కు ద్వా రా తెలంగాణ మరింత అభివృద్ధి చెందడంతోపాటు ఐటీపరంగా అంతర్జాతీయస్థాయిలో పేరు సాధించ గలదన్నారు. ఐటీ కంపెనీల ఏర్పాటుకు మేడ్చల్ ఎంతో అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. ము ఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజున ఐటీ పార్కుకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంద న్నారు. ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కండ్లకోయ ఐటీ పార్కు ఏర్పాటు చేయడం మంచి పరిణామమని అన్నారు. మేడ్చల్, కొంపల్లి ప్రాంతాల్లో పలు యూనివర్సిటీలతోపాటు ఎంఎం టీఎస్, జాతీయ రహదారులు ఉండటం ఐటీ హబ్‌కు కలసి వచ్చే అంశాలని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, రైతులందరూ ఆనందంగా ఉన్నారని మంత్రి తెలిపారు. టాప్ –5 కంపెనీలు నగరంలోనే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ఐదు ప్రపం చ అగ్రశేణి సంస్థల అతిపెద్ద కార్యాలయాలు హైద రాబాద్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌కు పెట్టుబడులు పె ద్దఎత్తున వస్తున్నాయని, ఈ విషయంలో ప్రపంచం లోనే రెండోస్థానంలో ఉందని పేర్కొన్నారు. నైపు ణ్యాలు పెంచుకుంటే ఈ సంస్థల్లో ఉద్యో గాలన్నీ స్థానికులకే దక్కుతాయన్నారు. దేశ జీడీపీలో తెలం గాణ 5 శాతాన్ని అందిస్తోందని తెలిపారు. ఓటమికి భయపడితే తెలంగాణ వచ్చేదికాదు సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన ప్రజాజీవితం గురించిన పలు ఆసక్తికర విషయాలను కేటీఆర్ వెల్లడించారు. ‘ప్రత్యక్ష రాజకీయాల్లో మొదటిసారిగా కేసీఆర్ సింగిల్ విండో ఎన్నికల్లో డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. రాఘవపూర్ సొసైటీ చైర్మన్ అయ్యేందుకు మిగతా డైరెక్టర్ల మద్దతు కూడగట్టినప్పటికీ ఓడిపోయారు. ఇది కేసీఆర్‌కు ప్రజాజీవితంలో మొదటి ఎదురుదెబ్బ. ఆయనకు 29 ఏళ్లున్నç ³్పుడే 1983లో అప్పటి టీడీపీ అధినేత ఎన్టీఆర్ పిలిచి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చారు. సర్వశక్తులు ఒడ్డినా 750 ఓట్ల తేడాతో కేసీఆర్ ఓడిపోయారు. ఆ ఓటమితో కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకుని ఉంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉండేదా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవారా’అని అన్నారు. ఎదురుదెబ్బలు తగిలినా, అపజయా లు కలిగినా, మొండిగా ముందుకెళ్తేనే విజయాన్ని ముద్దాడగలమని కేటీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ కుమార్, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ హరీశ్, ఎమ్మెల్యేలు వివేకానంద్, కృష్ణారావు, టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
పేద పిల్లలకు అండగా తెలుగు పీపుల్ ఫౌండేషన్
తెలుగు పీపుల్ ఫౌండేషన్ సంస్థ పిల్లల చదువు కోసం ప్రతి ఏడాది ఒక ఈవెంట్ నిర్వహిస్తుంది. ఈ సంస్థ చదువును కొనసాగించాలనే అభిరుచి ఉన్న తెలుగు విద్యార్థుల కోసం అండగా నిలబడుతుంది. గత ఏడాది విద్యార్థులకు స్కాలర్ షిప్ రూపంలో రూ. 2 కోట్ల డబ్బును పంచినట్లు తెలుగు పీపుల్ ఫౌండేషన్ తెలిపింది. ఈ ఏడాది తెలుగు పీపుల్ ఫౌండేషన్ 13వ వార్షికోత్సవాన్ని డిసెంబర్ 11న జరపనున్నట్లు తెలిపింది. తెలుగు పీపుల్ ఫౌండేషన్ ప్రచార కర్తగా ఆర్.పీ పట్నాయక్ వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని వార్షికోత్సవాన్ని విజయవంతం చేయగలరు తెలుగు పీపుల్ ఫౌండేషన్ పేర్కొంది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బును పేద పిల్లల చదువు కోసం వియోగించనున్నట్లు సంస్థ తెలిపింది. -
అలా అనిపిస్తేనే పెళ్లి చేసుకోవాలి.. వివాహ బంధంపై పూజా హెగ్డే ఆసక్తిర వ్యాఖ్యలు
పూజా హెగ్డే సినిమాలను ప్రేమించారు.. అభిమానులు ఆమెని ప్రేమించారు. పూజ అంకితభావం చూసి ఇండస్ట్రీ ఆమెను ప్రేమించింది. ‘లక్కీ చార్మ్’ అని ఫ్యాన్స్, ఇండస్ట్రీ పూజాని ప్రేమగా పిలుచుకుంటోంది. సినిమా ద్వారా ఇంత ప్రేమని పొందారు కాబట్టి సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నారు. ‘ఆల్ అబౌట్ లవ్’ అనే ఫౌండేషన్ ఆరంభించారు పూజా హెగ్డే. ‘ప్రేమ.. ఒక బలమైన భావోద్వేగం’ అంటున్నారు పూజ. ఇంకా ‘సాక్షి’తో పూజా హెగ్డే పంచుకున్న విశేషాలు తెలుసుకుందాం. ► ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆరు సినిమాలతో మీ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది... పూజా హెగ్డే: అవును.. కెరీర్ బిజీగా ఉంది. డేట్స్ అడ్జస్ట్ చేయలేనని నేను ఆలోచించినా ‘ఏం ఫర్వాలేదు.. మ్యానేజ్ చేద్దాం.. ఒప్పుకోండి’ అని నా నిర్మాతలు అభిమానంగా అంటున్నారు. ఎందుకంటే నేను పనిని ఎంత శ్రద్ధగా చేస్తానో, నా ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు తెలుసు. ‘మీ కోసమే ఈ పాత్ర రాశాం’ అని డైరెక్టర్లు అన్నప్పుడు మరింత బాధ్యతగా ఉండాలనిపిస్తుంది. అందుకే చేసే ప్రతి పాత్రకు వంద శాతం ఎఫర్ట్ పెడతాను. ► మీరుంటే సినిమా హిట్ అని, ‘లక్కీ చార్మ్’ అని టాక్... ఈ ట్యాగ్ పెద్ద బరువు కాబట్టి సినిమా రిలీజ్ ముందు మీకు నిద్రలేని రాత్రులు ఉంటాయా? (నవ్వుతూ) ఇంత ప్రేమను ఇస్తున్న ఫ్యాన్స్ దొరకడం, మంచి పాత్రలు ఇస్తున్న దర్శక–నిర్మాతలు దొరకడం నా ‘లక్’ అని నేను అనుకుంటాను. ఏ సినిమా చేసినా అది పెద్ద హిట్ అవ్వాలని శాయశక్తులా కృషి చేస్తాను. అయితే లక్కీ చార్మ్ ట్యాగ్ లేకపోయినా సినిమా రిలీజ్‌కు ముందు నాకు టెన్షన్ ఉంటుంది. నేను చేసే ప్రతి సినిమా నాకు ముఖ్యమే. అలాగే లక్కీ చార్మ్ అనేది ఫస్ట్ కొన్నిసార్లే బావుంటుంది. ఒకటి రెండు సినిమాలు హిట్ అయితే లక్. ఐదోసారి ఆరోసారి కూడా హిట్స్ సాధిస్తే అది కేవలం లక్ కాదు. సరైన స్క్రిప్ట్స్ ఎంచుకోవడమే కారణం. కథ విన్నాక, ఈ సినిమా చేసే తీరాలనిపిస్తే చేసేస్తాను. అలా ధైర్యంగా నమ్మి చేసిన సినిమాలు విజయం సాధించాయి. నేను వదులుకున్న కొన్ని సినిమాలు సరిగ్గా ఆడలేదు. నమ్మిన సినిమాలు హిట్టవడంతో నా జడ్జిమెంట్ మీద నమ్మకం పెరిగింది. అందుకే నా సినిమాలు హిట్ కావడమనేది పూర్తిగా లక్ మాత్రమే కాదు. ► ‘పెళ్లిలో సర్దుకుపోవడం’ అనే కాన్సెప్టే నచ్చని విభా పాత్ర (‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’లో పూజ పాత్ర పేరు) చేశారు. రియల్ లైఫ్‌లో ఒక రిలేషన్ సక్సెస్ అవ్వడానికి సర్దుకుపోవాలేమో? అన్నయ్య, ఫ్రెండ్, లవర్, లైఫ్ పార్ట్నర్... ఇలా ఎవరికైనా మన ఇష్టంతో చేసేదాన్ని సర్దుకుపోవడం అనం. వాళ్లతో ఉన్న అనుబంధం వల్ల చేస్తాం. పిల్లలు అర్ధరాత్రి నిద్రలేచి ఆకలి అంటే అప్పటికప్పుడు అమ్మ ఏదైనా చేసి పెడుతుంది కదా. వాళ్లు తిని హాయిగా బజ్జుంటారు. కానీ నిద్ర త్యాగం చేశానని అమ్మ ఎప్పటికీ అనుకోదు. ఎందుకంటే పిల్లల కోసం ఇష్టంగా చేస్తుంది. ఇష్టపడేవారికి ఇష్టంతో చేసింది ఎప్పుడూ ‘కాంప్రమైజ్’ కాదు. ఒక బంధం కోసం చేసేది ‘సర్దుకుపోవడం’ అనే ఫీలింగ్ వారి వారి ఆలోచనా ధోరణి బట్టి ఉంటుంది. నా వరకు నేను దాన్ని సర్దుకుపోవడం అనను. మనవాళ్ల కోసం చేస్తున్నాం అనుకుంటాను. ► ‘మ్యారీడ్ టు వర్క్’ అంటున్నారు. పెళ్లెప్పుడు? ఇప్పుడు పెళ్లి ఆలోచన లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా చాలా బిజీగా ఉన్నాను. ► వివాహ బంధం గురించి మీ అభిప్రాయం? ‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు’ అంటారు కదా. సో.. అవి చేసిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఈ మధ్యే నేను ముంబైలో ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు కట్టుకోవడమే ఇలా ఉంటే ఇక పెళ్లి ఎలా ఉంటుందో (నవ్వుతూ). కానీ నేను నమ్మేది ఒకటే. వీళ్లతో జీవితాంతం కలిసుంటే బావుంటుంది అనిపిస్తేనే పెళ్లి చేసుకోవాలి. ఇంట్లో ఒత్తిడి వల్లో, అందరూ పెళ్లి చేసేసుకుంటున్నారనో మాత్రం చేసుకోకూడదు. ► హీరోయిన్ అంటే వదంతులు కామన్. మీరు వాటిని తట్టుకునేంత ధైర్యం ఉన్న అమ్మాయేనా? మా అమ్మగారు ఇండిపెండెంట్ ఉమన్. కానీ వాళ్ల నాన్నగారు చాలా స్ట్రిక్ట్. అయినా మా అమ్మ చాలా ఇండిపెండెంట్‌గా ఉన్నారు. మా నాన్న ఓపెన్ మైండెడ్. పరిస్థితులను వివరిస్తూ సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా నన్ను పెంచారు. హీరోయిన్ని కాబట్టి చాలా గాసిప్స్ వస్తుంటాయి. అవన్నీ తట్టుకునేంత ధైర్యం ఉన్న అమ్మాయిలా మా అమ్మానాన్న నన్ను పెంచారు. మనవాళ్లతో మనం క్లియర్‌గా, ఓపెన్‌గా, హార్ట్‌ఫుల్‌గా ఉండాలి. మన అభిప్రాయాలను వారితో ధైర్యంగా చెప్పగలిగేలా ఉండాలి. ఇంట్లో మనకంత స్వేచ్ఛ ఉన్నప్పుడు దేన్నయినా ఎదుర్కొంటాం. మా ఇంట్లో ఆ స్వేచ్ఛ ఉంది. అయితే సమాజంలో అందరూ తమకు అనిపించినది అనిపించినట్లుగా చెప్పుకోగలిగే పరిస్థితి ఇంకా రావాలన్నది నా ఫీలింగ్. ► ఏదైనా విషయాన్ని సున్నితంగా చెప్పొచ్చు... కఠినంగా చెప్పొచ్చు. మీరు వదంతులకు రియాక్ట్ అవ్వాలనుకుంటే ఎలా అవుతారు? నేను కూల్ పర్సన్. నాకు పెద్దగా కోపం రాదు. కోపం వచ్చినా, అప్సెట్ అయినా అరవను... ఏడ్చేస్తాను. ప్రతిదానికీ మనం కఠినంగా ఉండాల్సిన అవసరం లేదనుకుంటాను. అయితే మన ఆత్మగౌరవం దెబ్బతీసేలాంటి పరిస్థితుల్లో మాత్రం కఠినంగా ఉండొచ్చని నమ్ముతాను. అంతేకానీ ప్రతి చిన్నదానికీ బీపీ పెంచుకోవడం వేస్ట్ అని నా ఫీలింగ్. దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది. ► ‘ఆల్ అబౌట్ లవ్’ అనే ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు... దాని గురించి? ఉన్న ఎమోషన్స్‌లో ‘ప్రేమ’ చాలా బలమైనదని నా నమ్మకం. ప్రేమతో ఏం చేసినా మనసుకి బాగుంటుంది. ఎప్పుటి నుంచో చారిటీ చేస్తున్నాను. అయితే ఫౌండేషన్ ద్వారా చేస్తే ఇంకా చాలా చేయొచ్చనిపించింది. అందుకే ‘ఆల్ అబౌట్ లవ్’ ఆరంభించాను. చిన్నప్పుడు చాలామంది సేవా కార్యక్రమాలు చేయడం చూసి, ‘పెద్దయ్యాక మనం కూడా చేయాలి’ అని ఫిక్స్ అయ్యాను. సొసైటీకి తిరిగి ఇవ్వాలనుకున్నాను. ఈసారి నా బర్త్‌డేకి నా ఫ్యాన్స్ సేవా కార్యక్రమాలు చేస్తే, నేను సంతోషడ్డాను. ‘ఇంతే చేయాలి’ అని గిరి గీసుకోలేదు. ఎంతైనా చేయాలని నిర్ణయించుకున్నాను. సంపాదించుకుంటూ.. అందులో కొంత సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళితే ఓ ఆత్మతృప్తి దక్కుతుంది. -
Jeff Bezos: పిల్లికి బిచ్చం పెట్టడని తిట్టారు కదా! ఇప్పుడేమో ఏకంగా..
Jeff Bezos donates Million Dollars to Obama Foundation: ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌లో ఉన్నప్పటికీ.. దాతృత్వం విషయంలో మాత్రం ఆ ఇద్దరి మీద ‘పిసినారులు’ అనే ట్యాగ్ వినిపిస్తుంటుంది. వాళ్లే ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్‌లు. ఛారిటీ ఫండ్ పేరుతో స్పేస్ టూరిజాన్ని ప్రమోట్ చేసుకుంది ఒకరైతే.. అసలు పిల్లికి బిచ్చం వేయడంటూ రెండో ఆయనపై విమర్శలు వినిపిస్తుంటాయి. ఈ తరుణంలో నెంబర్ టూ, అమెజాన్ బాస్ అయిన జెఫ్ బెజోస్ భారీ వితరణ ద్వారా తన పెద్ద మనసు చాటుకోవడంతో పాటు విమర్శకుల నోళ్లు మూయించారు. 57 ఏళ్ల ఈ అమెరికన్ వ్యాపార దిగ్గజం ఏకంగా 100 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో దాదాపు 750 కోట్ల రూపాయలు) డొనేషన్ ప్రకటించాడు. ఆ సొమ్మును అమెరికా మాజీ అధ్యక్షుడైన బరాక్ ఒబామా నడిపిస్తున్న ఫౌండేషన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చేశాడు. అమెరికా పొలిటీషియన్, పౌర హక్కుల నేత జాన్ లూయిస్(దివంగత) గౌరవార్థం ఈ భారీ దానం చేస్తున్నట్లు బెజోస్ ప్రకటించారు. అంతేకాదు ఒబామా ప్రెసిడెన్షియల్ సెంటర్ పేరును జాన్ లూయిస్ ప్లాజాగా పేరు మార్చాలని అమెజాన్ చీఫ్, ఒబామా ఫౌండేషన్‌ను రిక్వెస్ట్ చేశారు. జెఫ్ బెజోస్ సంపదతో పోలిస్తే ఈ దానం చాలామందికి చిన్నదే అనిపించొచ్చు.. కానీ, సాయం అందుకునే ఎందరికో ఇది పెద్దదే అని Obama Foundation ప్రతినిధి కోర్ట్నీ విలియమ్స్ వెల్లడించారు. ప్రపంచ కుబేరుల జాబితాలో ఉంటూ.. కనీస దానాలు కూడా చేయట్లేదని, భూమి మీద సమస్యలు పట్టించుకోకుండా స్పేస్ టూరిజం మీద ఫోకస్ పెడుతున్నారంటూ మస్క్, బెజోస్లపై విమర్శలు ఉన్నాయి. బిల్ గేట్స్ లాంటి వాళ్లు సైతం వీళ్లను విమర్శిస్తూ వస్తున్నారు. ఆ విమర్శల సంగతి ఎలా ఉన్నా.. బెజోస్ దానాలు మాత్రం భారీగానే ఉంటున్నాయి. తాజాగా ఓవైపు ఒబామా ఫౌండేషన్‌తో పాటు మరోవైపు న్యూయార్క్ యూనివర్సిటీ ఆధర్వ్యంలోని ఓ ఆస్పత్రికి సైతం 166 మిలియన్ డాలర్ల డొనేషన్ ఇవ్వడంతో ఆయన మీద ప్రశంసలు కురుస్తున్నాయి. మాక్‌కెంజీ స్కాట్‌తో జెఫ్ బెజోస్ (పాత చిత్రం) ఇక అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్నాక.. ఈ ఒక్క ఏడాదిలోనే సుమారు 600 మిలియన్ డాలర్లు డొనేషన్లు ఇచ్చినట్లు పక్ మీడియా ఓ కథనం ప్రచురిచింది. ఇవిగాక క్లైమేట్ ఛేంజ్ పోరాటం కోసం ఎర్త్ ఫండ్ ప్రతిజ్ఞ, నిరాశ్రయులైన వాళ్ల కోసం 2 బిలియన్ల దాకా సాయం ప్రకటించారు. బెజోస్ మాత్రమే కాదు.. ఆయన మాజీ భార్య మాక్‌కెంజీ స్కాట్ విడాకుల భరణం రూపంలో దక్కిన 8.5 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 2.7 బిలియన్ డాలర్లు దానం చేసి సంచలనం సృష్టించింది. చదవండి: మనిషి పుట్టుక ఇక అంతరిక్షంలోనే! కానీ.. -
AP పటిష్టంగా ఫౌండేషన్.. మూడు దశల్లో స్కూళ్ల మ్యాపింగ్ ప్రక్రియ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఫౌండేషన్ విద్యను పటిష్టంగా అమలు చేసేందుకు వీలుగా స్కూళ్ల మ్యాపింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మూడు దశల్లో ఆయా స్కూళ్లను ఫౌండేషన్ పరిధిలోకి చేర్చేలా మ్యాపింగ్ ప్రక్రియను అధికారులు పూర్తి చేయనున్నారు. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే తొలిదశ మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టారు. ఇందులో 1,790 ప్రాథమిక పాఠశాలలు, 108 ప్రాథమికోన్నత పాఠశాలలు, 1,144 ఉన్నత పాఠశాలల మ్యాపింగ్‌కు ప్రతిపాదించారు. ఈ పాఠశాలల్లో 3 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న మొత్తం 79,127 మందిని మ్యాపింగ్ ద్వారా ఈ ఏడాది ఫౌండేషన్ పరిధిలోకి చేర్చేలా ప్రణాళిక రూపొందించారు. అయితే అమలుకు వచ్చేసరికి ఈ సంఖ్య మరింత పెరిగింది. అదనంగా మరో 2,857 ప్రాథమిక పాఠశాలలు, 2,663 ఉన్నత పాఠశాలలు మ్యాపింగ్ పరిధిలోకి వచ్చాయి. దీంతో ఉన్నత పాఠశాలల పరిధిలో చేరే 3, 4, 5 తరగతుల విద్యార్థుల సంఖ్య 2,05,071కు చేరింది. రెండో దశ కింద.. రెండో దశ కింద 2022–23కు సంబంధించి మ్యాపింగ్ ప్రక్రియలో మరికొన్ని స్కూళ్లను ప్రతిపాదించారు. వీటిలో 10,249 ప్రాథమిక పాఠశాలలు, 1,429 ప్రాథమికోన్నత, 3,844 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 5,273 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉన్నవే. వీటి మ్యాపింగ్ ద్వారా 4,66,659 మంది 3, 4, 5 తరగతుల విద్యార్థులు ఫౌండేషన్ పరిధిలోకి వస్తారు. ఇక 2023–24లో 13,357 ప్రాథమిక పాఠశాలలు, 2,584 ప్రాథమికోన్నత, 5,576 ఉన్నత పాఠశాలల మ్యాపింగ్‌కు ప్రతిపాదనలు చేశారు. వీటిలో 1,945 స్కూళ్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. వీటిలోని 3,32,564 మంది 3, 4, 5 తరగతుల విద్యార్థులు ఉన్నత పాఠశాలలకు అనుసంధానమవుతారు. అనేక జాగ్రత్తలతో మ్యాపింగ్ ఈ మ్యాపింగ్ ప్రక్రియలో పాఠశాల విద్యా శాఖ అనేక జాగ్రత్తలు చేపట్టింది. ఈ విధానంలో ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను అదే ఆవరణ లేదా 250 మీటర్ల లోపు ఉన్నత పాఠశాలలకు అనుసంధానించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చిన్నప్పటి నుంచే చదువుల్లో గట్టి పునాది వేసేందుకు ఫౌండేషన్ స్కూల్ విధానం అమలులో భాగంగా పిల్లలకు ఆరేడేళ్లు వయసుకే అక్షర జ్ఞానాన్ని పెంపొందించడం, 3వ తరగతి నుంచి సబ్జెక్టుల వారీ బోధనతో ఆ పునాదులను మరింత పటిష్టం చేయడానికి వీలుగా ఈ ఏర్పాట్లు చేశారు. శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూల్ ప్లస్ స్కూళ్లు అనే ఆరంచెల విధానాన్ని ప్రవేశపెట్టారు. విద్యార్థులకు అందుబాటులోకి అనేక సౌకర్యాలు.. మ్యాపింగ్ ద్వారా ఉన్నత పాఠశాలల ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, ఆట స్థలం, క్రీడా పరికరాలు 3, 4, 5 తరగతుల విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. అదే సమయంలో 1, 2 తరగతులతో ఉండే ప్రాథమిక పాఠశాలలకు దగ్గరలోని అంగన్వాడీ కేంద్రాలను అనుసంధానిస్తారు. టీచర్ల నియామకానికి కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 3, 4, 5 తరగతుల్లో 4 సబ్జెక్టులకు నలుగురు, 6, 7 తరగతుల్లో 6 సబ్జెక్టులకు ఆరుగురు, 8, 9, 10 తరగతుల్లో 7 సబ్జెక్టుల బోధనకు ఏడుగురు టీచర్లు ఉండనున్నారు. కొత్త విధానంలో ప్రాథమిక పాఠశాలల్లోని 1, 2 తరగతుల విద్యార్థులతో పాటు వాటికి అనుసంధానమయ్యే అంగన్వాడీ విద్యార్థులకు పీపీ–1, పీపీ–2 కింద తరగతులు ఏర్పాటు చేయడం ద్వారా వారికీ మంచి బోధన అందుతుంది. హైస్కూళ్ల సిబ్బంది ద్వారా 3, 4, 5 తరగతుల విద్యార్థులకు కూడా మేలు చేకూరుతుంది. -
పిల్లాడి పెద్దమనసు..మేక్ ఎ విష్
భరించలేని బాధ, కష్టం కలిగినప్పుడు చుట్టపక్కల ఏం జరుగుతున్నా పట్టించుకోము. ఆ పరిస్థితిని అర్థం చేసుకుని, బయటపడే ఆలోచనల్లో మునిగిపోతాం. అటువంటిది ఓ చిన్నపిల్లాడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ, ఎన్నాళ్లు జీవించి ఉంటాడో తెలియనప్పటికీ ... కూడు, గూడు లేనివాళ్ల ఆకలి తీర్చండి అని చెబుతూ, నిరాశ్రయుల ఆకలి తీరుస్తున్నాడు. అమెరికాలోని మిస్సిసీపికి చెందిన పదమూడేళ్ల అబ్రహం ఒలెబెగికి గతేడాది ‘అప్లాస్టిక్ ఎనీమియా’ ఉన్నట్టు తెలిసింది. అరుదైన అప్లాస్టిక్ ఎనీమియా కారణంగా..శరీరంలో సరిపడినంతగా కొత్త రక్తకణాలు ఉత్పత్తి కావు. దీని వల్ల క్రమంగా ఆరోగ్యం క్షీణించి ప్రాణాంతకంగా మారుతుంది. ఈ విషయం తెలిసినప్పుడు అబ్రహం ఏ మాత్రం భయపడలేదు. రెగ్యులర్‌గా డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నాడు. ఇటువంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతోన్న పిల్లల కోరికలను తీర్చే ‘మేక్ ఏ విష్’ ఫౌండేషన్ అబ్రహం గురించి తెలిసి అతని విష్ను తీర్చేందుకు సంప్రదించింది. అందరు పిల్లలు కోరుకున్నట్లే తన జీవిత లక్ష్యాన్ని కోరుకుంటాడని ఫౌండేషన్ అనుకుంది. కానీ అందరికంటే భిన్నంగా ‘‘ఇల్లు లేని వారికి ఏడాది పాటు ఆకలి తీర్చండి, అదే నా మేక్ ఏ విష్’’ అని కోరాడు. అబ్రహం కోరిక నచ్చిన మేక్ ఏ విష్ అతని కోరిక మన్నించడంతోపాటు, మరికొన్ని బహుమతులు కూడా ఇచ్చింది. పౌండేషన్ సాయంతో గూడులేని నిరాశ్రయులకు ఆహారం అందించి, ఆకలి తీరుస్తున్నాడు అబ్రహాం. తన తల్లితో కలిసి వందమంది ఆకలిని తీర్చాడు. అబ్రహం పెట్టే ఫుడ్ తిన్న వారంతా థ్యాంక్స్ బాబు అంటూ అబ్రహంకు కృతజ్ఞతలు చెబుతూ ..ఆయుష్షు పెరగాలని దీవిస్తున్నారు. ఈ కార్యక్రమం ఫౌండేషన్ సాయంతో 2022 ఆగస్టు వరకు కొనసాగనుంది. అబ్రహం టేబుల్.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటూనే..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం అబ్రహం ఎదురుచూస్తున్నాడు. ఎవరైనా దాత దొరికితే అతని సమస్య దాదాపు తీరుతుంది. ఫౌండేషన్ సాయంతో నిరాశ్రయుల ఆకలి తీరుస్తూ ఎంతో సంతోషంగా ఉన్న అబ్రహం భవిష్యత్‌లో ‘‘అబ్రహం టేబుల్’’ పేరు మీద ఓ ఎన్జీవోని ప్రారంభించి ఈ సేవలను మరింతగా విస్తరించాలనుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన ప్రపంచ వ్యాప్త నెటిజన్లు అబ్రహంను మెచ్చుకోవడమేగాక, అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. -
ఒకప్పుడు నేరస్తుడు.. ఇప్పుడు అనాథలకు మార్గదర్శకుడు!
ఏవో ఏవో కారణాలతో లేక సామాజిక మాధ్యమాల కారణంగానో లేక టెక్నాలజీ కారణంగానో తెలియదు కానీ యువత పెడదోవ పడుతోందంటూ రకరకాల కథనాలను మనం టీవిల్లోనూ, పేపర్లలోనూ చూస్తున్నాం. కానీ కొంతమంది మాత్రమే ఏదో ఒక దశలో తాము మారాలని గట్టిగా నిర్ణయించుకోవటమే కాక మంచి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి చూపిస్తున్నారు. అదే కోవకు చెందిన వారు బెంగళూరుకి చెందిన ఆటో రాజా(థామస్ రాజా). అసలెవరా వ్యక్తి ? అతను ఏం చేశాడో కదా! బెంగళూరు: ఈ ఆటో రాజా అసలు పేరు థామస్ రాజా. ఇతను చిన్నతనంలో దొంగతనాలు, చిన్న చిన్న నేరాలు చేస్తుండేవాడు. తన ప్రవర్తన కారణంగా థామస్ తండ్రి అతన్ని 16 ఏళ్ల వయసులోనే ఇంటి నుంచి గెట్టేశాడు. అయితే ఈ నేర ప్రవృత్తి కారణంగానే అతను కొన్నాళ్లూ జైల్లో ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అక్కడి జైలు వాతావరణం, నేరస్తుల పట్ల పోలీసుల కఠిన వ్యవహార శైలి తనలో కొత్త జీవన గమ్యానికి నాంది పలికింది. ఆ తర్వాత అతనూ ఇంకెప్పుడూ ఎవర్నీ మోసం చేయడకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. (చదవండి: నేను గిటారు వాయిస్తాను... మీరు పాట పాడండి ప్లీజ్!) ఆ తర్వాత ధామస్ బెంగళూరు వెళ్లి ఒక ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను ఆటో నడుపుకుంటూ వెళ్తున్నప్పుడూ మార్గమధ్యలో చెత్తకుప్పల వద్ద ఉండే నిరుపేదలు, అభ్యాగ్యులు తరచుగా తనకు తారసపడుతుండే వారు. ఇక అతను తినడానికి కూడా వెళ్లకుండా ఇలాంటి అభ్యాగుల్నీ సుమారు 13 మందిని చేరదీసి వారి కోసం ఒక ఇల్లును అద్దెకు తీసుకుని వారికి ఆశ్రయం ఇస్తున్నాడు. ఈ మేరకు న్యూ ఆర్క్ మిషన్ ఆఫ్ ఇండియా అనే ఫౌండేషన్ సాయంతో "హోమ్ ఆఫ్‌హోప్" అనే పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఆ పునరావాస కేంద్రంలో దాదాపు 750 మందికి ఆశ్రయం ఇచ్చాడు, 19 వేల మంది అనాథలను రక్షించాడు. అంతేకాదు అతను అక్కడితో ఆగిపోలేదు. అభాగ్యుల కనీస భోజనం, తాగునీరు లేక ఖైదీల్లా జీవిస్తున్నారంటూ... థామస్ ఇనుపగొలుసలను ధరించి విన్నూతన రీతిలో వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నాడు. అయితే అనుకోకుండా అది కాస్త పేపర్లలోనూ, టీవిల్లోనూ బాగా వైరల్ అయ్యింది. ఏదీఏమైనప్పటికీ ఒక చెడు మార్గంనుంచి మంచి మార్గం వైపుకి మళ్లడమే కాక ఒక ఆదర్శవంతమైన గమ్యాన్ని ఏర్పరుచుకుని దాని కోసం పోరాడుతున్న ఆటో రాజా(థామస్ రాజా)ను "శభాష్" అని అభినందించకుండా ఉండలేం కదా. (చదవండి: మిస్ వరల్డ్ అమెరికాగా తొలిసారి భారత సంతతి అమెరికన్) -
మనీషాయే దిక్కు.. ‘తమిళనాడు థెరిస్సా’
దిక్కు లేని వారికి దేవుడే ఏదో ఒక దిక్కు చూపిస్తాడు. తమిళనాడులో అయితే ఆ దిక్కును ‘మనీషా’ పేరుతో పిలుస్తారు. 24 ఏళ్ల మనీషా ఈరోడ్‌లో నర్సింగ్ కాలేజీలో పాఠాలు చెబుతుంది. కాని ఆ కాసేపు మినహాయిస్తే తక్కిన సమయమంతా దీనులకు ఆమె అమ్మగా మారుతుంది. మతిస్తిమితం తప్పి వీధుల్లో ఉన్నవారిని మామూలు మనిషిని చేసే వరకూ ఆమె విశ్రమించదు. దూరం నుంచి దానం అందరూ చేస్తారు. దగ్గరి నుంచి సేవ చేసే మనీషి మనీషా. మనీషా చిన్నప్పుడు చెన్నైలో తన తండ్రితో పాటు కలిసి తండ్రి నడిపే మటన్షాప్కు వెళ్లేది. నాలుగు రోజులు వెళ్లాక తండ్రి ఎంత కష్టంగా సంపాదన చేస్తున్నాడో, ఎంత కష్టంగా పేదరికంలో తాము బతకాల్సి వస్తోందో ఆమెకు అర్థమైంది. మూడు పూట్ల అంతో ఇంతో తినడానికి ఉన్న తమ పరిస్థితి ఇలా ఉంటే రోడ్డు మీద ఏ దిక్కూ లేకుండా తిరిగే దౌర్భాగ్యుల పరిస్థితి ఏమిటి అని ఆ వయసులో ఆమెకు అనిపించేది. ఎందుకంటే షాపులో ఉన్నంత సేపు పిచ్చివాళ్లో, దిక్కులేని వాళ్లో కనిపిస్తూనే ఉండేవారు. పెద్దయ్యాక అయినా వారి కోసం ఏమైనా చేయగలనా అనుకునేది మనీషా. డాక్టర్ అవ్వాలని బాగా చదివి డాక్టర్ అవ్వాలని అనుకునేది మనీషా. కాని అంత డబ్బు లేదు. అందుకు ప్రిపేర్ అయ్యేందుకు కూడా డబ్బు లేదు. సైన్యంలో చేరి దేశం కోసం పని చేయాలనుకుంది. కాని ఆడపిల్లను పంపడానికి తల్లిదండ్రులు, బంధువులు ఎన్నో విధాలుగా సంశయించారు. అందుకని నర్సింగ్ కోర్స్ చదివి ఈరోడ్‌లో లెక్చరర్ అయ్యింది మనీషా. డాక్టర్‌గా చేయాల్సిన సమాజ సేవ, సైనికురాలిగా చేయాల్సిన దేశ సేవ రెండూ ఒక సామాజిక కార్యకర్తగా చేయాలని నిశ్చయించుకుంది. 2018లో ఒక న్యూస్పేపర్లో ఆమె తంజావూరులో ఒక దీనుడి ఫొటో చూసింది. ఎవరూ పట్టించుకోక ఆ దీనుడు ఆకలితో అలమటిస్తున్నాడని ఆ ఫొటో సారాంశం. వెంటనే మనీషా ఆ ఫొటోను ఫేస్బుక్లో పెట్టి అందరి సాయం కోరింది. తంజావూరు వెళ్లి మరీ ఆ దీనుడి షెల్టర్‌కు చేర్చడంలో సాయపడింది. అలా ఆమె పని మొదలయ్యింది. ఇలాంటి వారు కావాలి డబ్బు సాయం చేయమంటే చేసేవారు చాలామంది ఉంటారు. కాని ప్రత్యక్షంగా సేవ చేయమంటే వెనుకాడుతారు. కాని మనీష తానే స్వయంగా సేవ చేస్తుంది. పిల్లలు బాగా మురికి పడితే కన్న తల్లే విసుక్కుంటుంది. కాని సంవత్సరాల తరబడి స్నానపానాలు లేకుండా శుభ్రత లేకుండా తిరిగే పిచ్చివాళ్లకు, డ్రగ్ అడిక్ట్స్‌కు, అనాథలకు, ఇళ్ల నుంచి పారిపోయిన వారికి తానే స్వయంగా సేవ చేస్తుంది మనీషా. వారికి క్షవరం చేస్తుంది. స్నానం చేసేలా చూస్తుంది. బట్టలు ఇస్తుంది. వారి షెల్టర్ కోసం ప్రయత్నిస్తుంది. ఈరోడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తూ ఆదుకుంటోంది. వీరిలో ఎవరైనా పనిచేసి సంపాదించే సత్తా ఉన్నవారికి వివిధ నైపుణ్యాలలో శిక్షణ ఇప్పించి ఉపాధి మార్గాలను చూపుతోంది. జీవితం ఫౌండేషన్ తాను సంపాదించే దాంట్లో తన ఖర్చులకు పోగా మిగిలిందంతా ఊరి దిమ్మరుల కోసం ఖర్చు చేస్తుంది మనీష. కాని అది చాలదు. సమాజం ఆసరాతో ఈ పని చేయాలని ‘జీవితం ఫౌండేషన్’ పేరుతో ఒక సంస్థను ప్రారంభించింది. దాదాపు 500 మంది దిమ్మరులకు స్వస్థత, భద్రత, భరోసా కలిగించడంలో కృషి చేసింది. ఆమెతో పాటు అలాంటి స్ఫూర్తి ఉన్న యువతరం కూడా తోడయ్యింది. వీరంతా ఒక టీమ్‌గా పని చేస్తూ దీన బాంధవులుగా మారారు. ముఖ్యంగా కరోనా సమయంలో మనీష ఒక గొప్ప మానవిగా మారింది. ఆ సమయంలో అన్నీ మూతపడగా ఈరోడ్ చుట్టుపక్కల కొత్తగా వచ్చే లేదా ముందు నుంచి ఉన్న దిమ్మరులకు అన్నమే లేకుండా పోయింది. వారికి నిలువ నీడ లేదన్న సంగతి కూడా కనిపెట్టింది. వెంటనే ఆమె ఈరోడ్ కమిషనర్ని కలిసి ఒక స్కూల్‌ను టెంపరరీ షెల్టర్‌గా అడిగింది. వెంటనే కమిషనర్ అందుకు అంగీకరించాడు. మనీష ఆ ఇరుగు పొరుగు వారికి వంట చేయమని దినుసులు సరఫరా చేసింది. ఊళ్లో ఉన్న దాదాపు 80 మంది అభాగ్యులను ఆ స్కూల్లో ఉండేలా చూసింది. వారికి మాస్కులు, శానిటైజర్లు, రేషన్, మూడుపూటల భోజనాన్ని అందించింది. వ్యాయామం చేయించి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమేగాక, కొంతమందికి వొకేషనల్ ట్రైనింగ్ ఇప్పించి 54 మందికి ఉపాధి కల్పించింది. మరికొంత మందిని వృద్ధాశ్రమాలకు, కుటుంబాల ఆచూకి తెలిసిన వారిని, కుటుంబ సభ్యులకు అప్పచెప్పింది. మైనర్లకు అరిక ప్లేట్లు, గ్లాసులు తయారు చేసే మెషిన్లను అందించి వారికి ఉపాధి కల్పించింది. మనిషి బాధ్యత ‘ఎదుటివారి కష్టానికి స్పందించడం మనిషి కనీస బాధ్యత. మన దేశంలో ఎందరో ఎన్నో కారణాల రీత్యా రోడ్డు మీదే బతుకుతుంటారు. వారి గోడు ఎవరూ పట్టించుకోరు. వారి వేదన ప్రభుత్వాలకు అర్థం కాదు. కాని వారిని అక్కున జేర్చుకుని మనుషులుగా చేసే ప్రయత్నం చేసినప్పుడు వారి ముఖాల్లో కూడా చిరునవ్వు వెలుగుతుంది. అలాంటి చిరునవ్వు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నేను నా జీవితం అంతా ఆ పనికి వెచ్చిస్తాను. పిల్లలు గెంటేసిన వృద్ధులు, డ్రగ్స్ బానిసలైన యువకులు, వీధి బాలలు... వీరందరి కోసం ఒక సొంత షెల్టర్ కట్టాలని నా కోరిక. ఏదో ఒకరోజు దానిని సాధిస్తాను. ఈలోపు సమాజంలోని మంచి మనసున్న వారితో ఈ సహాయాన్ని కొనసాగిస్తాను’ అంటోంది మనీషా. భవిష్యత్తులో ఆమెను జనం తమిళనాడు థెరిస్సా అని పిలిచినా ఆశ్చర్యం లేదు. -
కూకట్‌పల్లిలో ఉచిత ఫిజియోథెరపీ సేవలు, టైమింగ్స్ ఇవే..
మోతీనగర్: ప్రస్తుత కాలంలో కాస్త అనారోగ్యానికి గురైనా రూ. వేలల్లో మొదలుకొని లక్షల్లో ఖర్చు అవుతున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తే వివిధ రకాల వైద్య పరీక్షలు, స్కానింగ్‌ల పేర్లతో ఇష్టానుసారంగా బిల్లులు వసూలు చేస్తున్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో తమకు వంతు సాయంగా ఫిజియోథెరపీ అందిస్తున్నారు ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్ సభ్యులు. సుమారు దశాబ్దంన్నర క్రితం కూకట్పల్లి వివేకానందనగర్ వ్యవస్థాపక అధ్యక్షుడు హరీష్, ప్రస్తుత అధ్యక్షుడు కొలసాని రాథా మోహన్‌రావు ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్‌ను స్థాపించారు. ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్, అమెరికా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మురికి వాడల్లో నివసిస్తున్న పేద బడుగు వర్గాల వారికి ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంగా నాటి నుంచి నేటి వరకూ ఫిజియోథెరపీ చేస్తున్నారు. ♦ సంచార ఫిజియోథెరపీ కేంద్రం ద్వారా, ఫిజియోకేర్, రీహాబిలేషన్ కేంద్రం ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారు. అంతేకాక అనాథ, వృద్ధాశ్రమాల్లో ఉండే వారికి సైతం ఫిజియోథెరపీ చేస్తున్నారు. ♦ సహజంగానే ఎదుర్కొనే వ్యాధులలో ప్రధానంగా వెన్ను, అరికాళ్లు, పిక్కలు, మోకాళ్లు, భుజాలతో పాటు ఇతర నొప్పుల నివారణకు నిపుణులైన వైద్యులతో ఫిజియోథెరపీతో పాటు ప్రముఖ యోగా గురువుతో ఆసనాలు వేయిస్తున్నారు. ♦ రోగులు సూచించిన నొప్పిని బట్టి దాని నివారణకు వివిధ రకాల వ్యాయామాలతో పాటు పలువురు ప్రముఖ యోగా గురువులు ఆసనాలు చేయిస్తున్నారు. ♦ అంతేకాక వ్యాధి తగ్గిన తర్వాత కూడా వైద్యులు, ఫౌండేషన్ ప్రతినిధులు యోగక్షేమాలు తెలుసుకుని సలహాలు, సూచనలు చేస్తుంటారు. ♦ కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ పరిధిలోని మురికి వాడల్లో నివసించే వారితో పాటు నగరంలోని పలు వృద్ధాశ్రమాల్లోనూ ఉచితంగా సేవలు అందిస్తున్నారు. ♦ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. ఆదివారం మినహాయించి ఒక్కో ప్రాంతంలో రెండు వారాల పాటు శిబిరాలు నిర్వహిస్తున్నారు. కూకట్పల్లి సాయికృప ప్లాట్ నెంబర్ 332, శ్రీవివేకానందనగర్, డీఏవీ స్కూల్ రోడ్డులో శిబిరాలు నిర్వహిస్తున్నారు. ♦ మూసాపేట డివిజన్ మోతీనగర్‌లోని కమ్యూనిటీ హాల్లో గత నాలుగేళ్ల నుంచి నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారు. ♦ కోవిడ్ కారణంగా గత కొన్ని రోజుల నుంచి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు మాత్రమే వైద్యులు అందుబాటు ఉంటున్నారు. అదే విధంగా గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ఆవరణలోనూ వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ♦ హ్యాండ్ గ్రిప్పర్, టెన్స్, ఐఎఫ్‌టీ, ఆల్ట్రాసౌండ్, స్విస్ బాల్, షోల్డర్ పుల్లీ, షోల్డర్ వీల్, డెలాయిడ్ మైల్ స్టోన్స్, సైక్లింగ్ వంటి సామగ్రితో వైద్యం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. చిన్నారికి ఫిజియో థెరపీ చేస్తున్న సిబ్బంది ఉచితంగా చేయడం సంతోషం.. : ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. వేలకు వేలు చెల్లించి వైద్యం చేయించుకున్న నయం కాలేదు. మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో ఉచితంగా ఫిజియోథెరపీ కేంద్రం కొనసాగుతుందని నా మిత్రుల ద్వారా తెలుసుకొని వచ్చిన తర్వాత వివిధ రకాల నొప్పులు తగ్గుముఖం పట్టాయి. వైద్యం అందని ద్రాక్షగా ఉన్న ఈ రోజుల్లో ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించటం సంతోషం -టి.నారాయణ చదవండి : రికార్డు కొట్టేసిన వంటలక్క, లక్కీ చాన్స్! అర్థమయ్యే రీతిలో కౌన్సెలింగ్.. చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి విసుగు చెంది మా వద్దకు వస్తుంటారు. అలాంటి వారికి ముందుగా అర్థమైన రీతిలో కౌన్సెలింగ్ ఇచ్చి వారికి ఏయే నొప్పులకు ఏ రకంగా వైద్యం చేయాలో పరిశీలిస్తాం. ఆ తర్వాత సుమారు వారం రోజుల నుంచి నెల పాటు నిత్యం క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేస్తాం. – డాక్టర్ కె. కామాక్షి, ఎంపీటీ న్యూరాలజీ ఆరోగ్యంగా ఇంటికెళ్లడమే మాకు ఆనందం.. చాలా మంది వివిధ నొప్పులతో బాధపడుతూ తమ కేంద్రానికి వస్తుంటారు. వయస్సు పై బడిన వారు నొప్పులతో బాధపడుతూ రావటం చూసి మాకే ఒక్కోసారి బాధ కలుగుతోంది. వారి సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించి వైద్యం ప్రారంభిస్తాం. వారు వ్యాధి తగ్గిన తర్వాత సంతోషంగా వెళ్లటమే మాకు ఆనందం. మాకు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అమోఘం. – డాక్టర్ బి. కృష్ణకుమారి, ఎంపీటీ స్పోర్ట్స్ -
గుజరాత్లో కీలక ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
వడోదర: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ సోమ్‌నాథ్ ఆలయంలో కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొన్ని ప్రాజెక్టుల ప్రారంభోత్సవంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సోమనాథ్ ప్రొమెనేడ్, సోమనాథ్ ఎగ్జిబిషన్ సెంటర్, పాత (జునా) సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. తన సొంత రాష్ట్రమైన గుజరాత్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన మోదీ సోమ్‌నాథ్ ఆలయంపై జరిగిన దాడులను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని వెల్లడించారు. తద్వారా కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకంతో భవిష్యత్తరాలు మన సంస్కృతీ సంప్రదాయాలకు అనుసంధానమవుతారని పేర్కొన్నారు. విధ్వంసక, తీవ్రవాద శక్తుల ఆధిపత్యం కొంతకాలమేనని ప్రధాని హెచ్చరించారు. ఉగ్రవాద శక్తులు ప్రజలను ఎక్కువకాలం తొక్కిపెట్ట లేవని పేర్కొన్నారు. అఫ్గాన్‌లో తాలిబన్ల ఆక్రమణలు, హింస నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధ్యానతను సంతరించుకున్నాయి. ప్రారంభించిన ప్రాజెక్టులలో సోమనాథ్ ప్రొమెనేడ్, సోమనాథ్ ఎగ్జిబిషన్ గ్యాలరీ, పాత (జూనా)సోమనాథ్ పునర్నిర్మించిన ఆలయ ప్రాంగణం ఉన్నాయి. ప్రధాని అధ్యక్షుడిగా ఉన్న సోమనాథ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ. 3.5 కోట్లతో అహిల్యాబాయి దేవాలయాన్ని నిర్మించారు. పిలిగ్రిమేజ్ రెజువనేషన్ అండ్ స్పిరిచ్యువల్, హెరిటేజ్ అగ్మెంటేషన్ డ్రైవ్) పథకం కింద సోమనాథ్ ప్రొమెనేడ్‌ను రూ.47 కోట్లకు పైగా ఖర్చుతో అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. -
సమాజానికి మనం కూడా తిరిగి ఇవ్వాలి
‘‘సమాజం మనకు ఎంతో ఇచ్చినప్పుడు మనం కూడా తిరిగి ఇవ్వాలి’’ అంటున్నారు పూజా హెగ్డే. అందుకే ‘ఆల్ ఎబౌట్ లవ్’ అనే ఫౌండేషన్‌ను ఆరంభించారామె. ఈ విషయం గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ – ‘‘సమాజానికి సేవ చేయడానికి ‘ఆల్ ఎబౌట్ లవ్’ ఓ చిన్న మార్గంలా భావిస్తున్నాను. ఒకరి జీవితంలో మంచి మార్పు తెచ్చే స్థితిలో నన్ను చేర్చిన ప్రజలకు నా కృతజ్ఞతలు. చిన్నదో.. పెద్దదో.. ఏదో ఒకటి సమాజానికి చేయాలన్నదే నా ఆశయం. ప్రేమ అనేది ఒక శక్తిమంతమైన భావోద్వేగం అని నమ్ముతాను. ప్రేమతో చేసే ఏ సేవ అయినా ప్రపంచంలో మంచి మార్పుకి కారణం అవుతుందని కూడా నమ్ముతాను. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి, వైద్య సహాయం కావాలనుకున్నవారికి నా ఫౌండేషన్ హెల్ప్ చేస్తుంది’’ అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే... తెలుగులో ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, తమిళంలో ‘బీస్ట్’, హిందీలో ‘సర్కస్’, సల్మాన్ ఖాన్‌తో ఒక సినిమా చేస్తున్నారామె. అలాగే ఎన్టీఆర్–కొరటాల శివ సినిమాలో, రామ్‌చరణ్– శంకర్ సినిమాలో, ధనుష్–శేఖర్ కమ్ముల చిత్రంలోనూ పూజా హెగ్డేని కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి.. ఈ మూడు సినిమాల్లో పూజా లిస్ట్‌లో ఏ సినిమా చేరుతుందో? -
నన్ను మోసం చేశారు.. సల్మాన్ ఖాన్‌పై చీటింగ్ కేసు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌పై చండీగఢ్‌లో చీటింగ్ కేసు నమోదైంది. సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రితో పాటు ఆయనకు చెందిన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్‌కు చెందిన ఏడుగురిపై అరుణ్ గుప్తా అనే వ్యాపారి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ ఫిరాదుపై జూలై 13లోపు వివరణ ఇవ్వాలని సమన్లు కూడా జారీ చేశారు. ఈ ఆరోపణలలో ఏదైనా నేర కోణం దాగుంటే తప్పక చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేతన్ బన్సాల్ తెలిపారు. అరుణ్ గుప్తా ఆ ఫిర్యాదులో.. ఇద్దరు బీయింగ్ హ్యూమన్ ఉద్యోగులు నన్ను ఆ సంస్థ ఫ్రాంచైజీని తెరవమని అడిగారు. ఇందుకు పెట్టుబడి ఖర్చు రూ.2 కోట్లు అవుతుందని చెప్పగా అందుకు అంగీకరించి అంత మోత్తాన్ని ఖర్చు పెట్టినట్లు తెలిపాడు. కాగా షోరూమ్ తెరిచిన సంవత్సరం గడుస్తున్న, తనకు సదరు సంస్థ నుంచి ఏవీ రాలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొదట్లో ఈ విషయమై ఆ సంస్థ ఉద్యోగులు సల్మాన్ ఖాన్‌తో సమావేశం అయ్యేలా చూస్తామని చెప్పారు. ఈ క్రమంలో అతను సల్మాన్‌ను కలుసుకోగా, షోరూమ్ ప్రారంభించేందుకు కూడా వస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపాడు. కానీ ఆ తర్వాత సల్మాన్ రాలేదని ఆ వ్యక్తి పేర్కొన్నారు. ఈ మేరకు సల్మాన్, ఆయన సోదరి అల్విరా, సంస్థ సీఈఓ ప్రకాశ్ కాపరే సహా మరో ఏడుగురిపై కేసు నమోదైంది. షోరూమ్ ప్రారంభించి 1.5 సంవత్సరాలు గడిచినప్పటికీ నాకు ఎటువంటి సమాధానం వాళ్ల నుంచి రాలేదని వాపోయాడు. Chandigarh police summon Bollywood actor Salman Khan, his sister Alvira Khan and 7 others associated with Being Human in an alleged case of fraud. "They have been given till July 13 to reply. If there's anything criminal, action will be taken," Chandigarh SP Ketan Bansal. pic.twitter.com/Ye2dI97aN5 — ANI (@ANI) July 8, 2021 -
అక్కున చేర్చుకుందాం
మూడున్నర కోట్లకు పైగా వీథికుక్కలున్నాయి మనదేశంలో. పెంపుడు కుక్కలకు ఉన్నట్లు వాటి పొట్టను చూసి ఆకలి తీర్చే పెట్ పేరెంట్స్ ఎవరూ వీథి కుక్కలకు ఉండరు. వాటి ఆహారాన్ని అవి సొంతంగా సంపాదించుకుంటాయి. అది ప్రకృతి నియమం కూడా. అయితే... వాటికి ఎదురయ్యే ప్రధాన కష్టం ఆరోగ్యరక్షణ లేకపోవడమే. ‘‘ప్రతి పాణికీ జీవించే హక్కు ఉంది. వీథికుక్కలు అయినంత మాత్రాన వాటి జీవించే హక్కును కాలరాసే అధికారం మనిషికి ఉండదు. చేతనైతే వాటిని పరిరక్షించడానికి ముందుకు రండి’’ అంటున్నారు ఎన్ఆర్ఐ ఉజ్వల చింతల. ఇందుకోసం ఆమె ‘స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ ను స్థాపించి అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇండియాలోని వీథికుక్కల కోసం పని చేస్తున్నారు. మాది మహేశ్వరం ఉజ్వల చింతల 2019లో యూఎస్, ఫ్లోరిడాలో ‘స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ సంస్థను స్థాపించారు. అంతకు ముందు కొన్నేళ్లుగా ఆమె వీథి కుక్కల కోసం పని చేస్తూనే ఉన్నారు. ‘‘మాది హైదరాబాద్ సమీపంలోని మహేశ్వరం. నాన్న నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయంలోనే చదివాను. బాండింగ్ నా బలం, బలహీనత కూడా. ఇంటర్‌కి విజయవాడలోని మేరీస్టెల్లా కాలేజ్‌లో చేరిస్తే అమ్మానాన్నలకు దూరంగా ఉండలేక, మూడు నెలల్లో వెనక్కి వచ్చేశాను. డిగ్రీ హన్మకొండ, ఎంబీఏ బెంగళూరులో చేసిన తర్వాత పెళ్లితో యూఎస్ వెళ్లాల్సి వచ్చింది. యూఎస్‌లో కంప్యూటర్స్ కోర్సులు చేసి ఉద్యోగంలో చేరాను. పేరెంట్స్ మీద బెంగ తో తరచూ ఇండియాకి వస్తూనే ఉంటాను. అలా రావడమే ఈ సేవాపథంలో నడిపించింది. పాలు తాగే పిల్లల్ని విసిరేశారు 2013లో ఇండియా వచ్చినప్పుడు ఒక ఇంటి వాళ్లు చిన్న కుక్కపిల్లల్ని పాలుతాగే పిల్లలని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా బయటపడేయడం నా కంట పడింది. అప్పుడు తల్లి కుక్క పడిన ఆరాటం, ఆవేదన వర్ణించడానికి మాటలు చాలవు. మరోసారి పెళ్లిలో భోజనాల దగ్గర... పదార్థాలన్నీ పారవేస్తున్నారు. ఆ ప్లేట్ల కుప్ప మీదకు కుక్కలు ఎగబడుతున్నాయి. ఓ వ్యక్తి కర్ర తీసుకుని వాటిని విచక్షణరహితంగా కొడుతున్నాడు. అలాంటిదే మరోటి... ఓ కుక్కకు వెనుక కాళ్లు రెండూ విరిగిపోయాయి. దేహాన్ని నేల మీద ఈడ్చుకుంటూ పోతోంది. దానికి ట్రీట్మెంట్ చేయించడానికి ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. పర్మిషన్ తీసుకుని నాతోపాటు మూడు కుక్కలను యూఎస్ తీసుకెళ్లాను. అక్కడ చికిత్స చేయించి కోలుకున్న తర్వాత పెంచుకునే వాళ్లకు దత్తత ఇచ్చాను. అప్పటి నుంచి స్ట్రే యానిమల్స్ కోసం పని చేస్తున్నాను. అమెరికాలో లడ్డూ హౌస్ హైదరాబాద్, అమీన్పూర్లో షెడ్ వేసి, ముగ్గురు ఉద్యోగులతో ఓ సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించాను. ఇప్పడు తొంభై ఉన్నాయి. నెలనెలా వాటి పోషణ, ట్రీట్మెంట్ కోసం డబ్బు పంపిస్తున్నాను. నా జీతం నుంచి కొంత భాగం, నా లడ్డూ హౌస్ రాబడితో వాటిని సంరక్షిస్తున్నాను. లడ్డూ హౌస్ బ్రాండ్ మీద నేను ఆర్గానిక్ ప్రోడక్ట్స్‌తో తినుబండారాలు తయారు చేసి, ఆదివారం ‘స్ట్రే యానిమల్స్ కోసం’ అని బోర్డు పెట్టి సేల్ చేస్తున్నాను. యూఎస్‌లో చారిటీ కోసం సేల్స్ చేసినప్పుడు... ఒక వస్తువు ధరను ఆ పదార్థానికి ఆపాదించి చూడరు, చారిటీ కోసం ధారాళంగా ఖర్చు చేస్తారు. మేము ప్రధానంగా గాయపడిన కుక్కలకు వైద్యం చేయించడం, కోలుకున్న తర్వాత పెంపకానికి ఇచ్చేయడం లేదా స్వేచ్ఛగా వదిలేయడం మీద దృష్టి పెట్టాం. ముసలితనం వల్ల ఎటూ పోలేని కుక్కలకైతే జీవితకాలపు సంరక్షణ బాధ్యత మాదే. ఇక కుక్కలకు స్టెరిలైజేషన్ వంటి కొన్ని సహకారాలను బ్లూ క్రాస్ నుంచి తీసుకుంటాం’’ అని చెప్పారు ఉజ్వల. భారతీయ సమాజాన్ని ఆమె కోరుకునేది ఒక్కటే... మనం మనుషులం, మానవీయంగా మసలుకుందాం. కుక్క అనగానే తక్కువగా చూడవద్దు. వాటి జీవితం మన అధికారం ప్రదర్శించవద్దు. మనవి ‘ప్రాణాలను హరించే చేతులు కావద్దు, రక్షించే చేతులు కావాలి’ అన్నారు. – వాకా మంజులారెడ్డి -
Hanuma vihari: ఫౌండేషన్ లోగో చూశారా!
సాక్షి,న్యూఢిల్లీ: ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ టీమిండియా టెస్టు బ్యాట్స్‌మన్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి పలువురి ప్రశంసలందుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్‌లో హనుమ విహారి అనేక మంది బాధితులకు సాయం చేసి రియల్ హీరోగా నిలిచారు. ఈ క్రమంలో హనుమ విహారి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. తాజాగా ఈ ఫౌండేషన్ లోగోను ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఈ లోగోను పరిచయం చేస్తూ "మనం అందరికీ సాయం చేయలేకపోవచ్చు.కానీ ప్రతీవాళ్లు కొందరికి సాయం చేయొచ్చు’’ రోనాల్డ్ రీగన్ మాటలను కోట్ చేశారు. ‘అందరం ఐక్యమవుదాం. కలిసికట్టుగా సాయపడదాం’ అని విహారి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా తన ఫౌండేషన్ ద్వారా కరోనా బాధితులకు పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ, రక్తదానం లాంటి విశేష సేవలను అందిస్తున్నారు హనుమ విహారి. ఇంకా కేన్సర్ పీడితులు, అనేక మంది చిన్నారులకు సాయం అందిస్తూ భరోసానిస్తున్నారు. 24 గంటలూ బాధితులకు అండగా ఉంటూ ఆయన అందిస్తున్న సేవలు ఆయన ట్విటర్ టైం లైన్ పరిశీలిస్తే అర్థమవుతాయి. అంతేకాదు తనతోపాటు సాయం చేసేలా పదిమందిని ప్రోత్సహిస్తుండటం విశేషం. Hi All- "We can't help everyone, but everyone can help someone" by Ronald Reagan.🙂 On this note happy to introduce our logo. Let us unite together and reach our help and efforts to needy people. Team Hv 🤝🏻@Hanumavihari pic.twitter.com/cblAvHLFAy — Hanuma Vihari Foundation (@HanumaVihariFdn) June 11, 2021 చదవండి: ప్రేమోన్మాది చేతిలో గాయపడిన అమ్మాయికి హనమ విహరి ఆర్ధిక సాయం పద్మ అవార్డు: ట్రెండింగ్‌లో సోనూసూద్ -
నిధి అగర్వాల్ మంచి మనసు
సినిమా హీరోలు కరోనా కష్టకాలంలో సాయానికి ముందు రావట్లేదనే విమర్శలు ఎక్కువ వినిపిస్తుంటాయి. అయితే కొందరు సినీ సెలబ్రిటీలు మాత్రం తమ శక్తిమేర సాయంతో అండగా నిలుస్తున్నారు. రీసెంట్గా ఈ లిస్ట్‌లో చేరింది అందాల భామ నిధి అగర్వాల్. ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ పేరుతో ఒక ఆర్గనైజేషన్‌ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. త్వరలో డిస్ట్రిబ్యూట్ లవ్ పేరుతో ఛారిటబుల్ ఆర్గనైజేషన్‌ను మొదలుపెడుతున్నా. ఈ కష్టకాలంలో సాయం కావాలనుకున్న వాళ్లు ఎవరైనా సరే ఈ వెబ్‌సైట్‌కు రిక్వెస్ట్‌లు పెట్టొచ్చు. వాళ్లకు అవసరమైన సాయాన్ని నాకు చేతనైనంత మేర అందిస్తా. నిత్యావసరాలు, మందులు.. ఇలా ఏవైనా సరే సాయానికి నేను సిద్ధం అని చెప్పింది నిధి. ఇక కొవిడ్ కోసమే ప్రత్యేకంగా. ఆమెతో పాటు ఆమె టీం ఈ ఆర్గనైజేషన్ కోసం పని చేస్తాయని తెలిపింది. కాగా, 2017లో మున్నా మైకేల్ బాలీవుడ్ ఫిల్మ్ ద్వారా ఫేమ్ అయిన నిధి అగర్వాల్, తెలుగు, తమిళ సినిమాల్లో వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. కోలీవుడ్ అభిమానులు ఏకంగా ఆమెకు ఓ గుడి కట్టడం విశేషం. కాగా, ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా ‘హరిహరవీరమల్లు’లో నిధి హీరోయిన్గా నటిస్తోంది. -
కిడ్నీ రోగులకు ఐసీఐసీఐ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ గ్రూపునకు చెందిన కార్పొరేట్ సామాజిక బాధ్యతా విభాగం ‘ఐసీఐసీఐ ఫౌండేషన్’ కిడ్నీ రోగులకు భారీ ఉరటనిస్తోంది. డయాలసిస్ కేంద్రాల్లో పేద రోగులకు నిరంతరాయంగా ఆపరేషన్లు జరిపేలా దిగుమతి చేసుకున్న అత్యాధునిక యంత్రాలను సేకరించి గుర్తించిన ఆసుపత్రులకు నాలుగేళ్ల వారంటీతో అందిస్తున్నట్లు ఐసీఐసీఐ ఫౌండేషన్ తెలిపింది. పేదలకు ఉచిత డయాలసిస్ సేవలను అందించేందుకు ఉద్దేశించిన జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలోని 'ప్రధాన మంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం' కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫౌండేషన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 100 దిగుమతి చేసుకున్న డయాలసిస్ పరికరాలను దేశంలోని 14 రాష్ట్రాల పరిధిలోని పలు ఆస్పత్రులకు వీటిని ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది. 60 జిల్లాల పరిధిలో అందుబాటు ధరలకే చికిత్సలు అందించేందుకు ఇది వీలు కల్పిస్తుందని పేర్కొంది. నాలుగేళ్ల వారంటీతో వీటిని అందించనున్నట్టు తెలిపింది. -
పేదల చదువుకు "లియోన్ హ్యూమన్ ఫౌండేషన్" చేయూత
హైదరాబాద్: సుఖ సంతోషాలతో జీవిస్తున్న కుటుంబంలో అనుకోకుండా జరిగిన ప్రమాదం వలన , ఆ కుటుంబానికి ఆధారమైన నరసింహాచారి మంచానికే పరిమితమయ్యారు. పిల్లల చదువులు, ఇల్లు గడవడం కష్టంగా మారింది. విషయం తెలుసుకున్న లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ (ఆస్టిన్ - టెక్సాస్ ) డైరెక్టర్స్ పుల్లారెడ్డి యెదురు, పరమేశ్వర రెడ్డి నంగి అడ్వయిజరీ కౌన్సిల్ మెంబర్ రవి కుమార్ పులిమి పేద విద్యార్థుల చదువుకు మా సంస్థ తమ వంతు సహాయం చేస్తుందని తెలిపారు. లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ అనుబంధ సంస్థ అయినటువంటి విన్ ఫౌండేషన్ ద్వారా పిల్లల చదువుకు ఒక లక్ష ఎనిమిదివేల రూపాయలచెక్ ని నరసింహాచారితల్లికి అందచేశారు. అయితే, ఈ విషయాన్ని లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ దృష్టికి తీసుకొచ్చిన మాధవ రెడ్డి గారిని అభినందించారు . -
నాడు-నేడుకి తానా ఫౌండేషన్ రూ.50 లక్షల విరాళం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు-నేడు (స్కూల్ ఎడ్యుకేషన్)లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాల నిమిత్తం తానా ఫౌండేషన్(ఇండియా) రూ.50 లక్షల విరాళం ప్రకటించింది. శుక్రవారం.. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో తానా ఫౌండేషన్(ఇండియా) మేనేజింగ్ ట్రస్టీ, సెక్రటరీ కేఆర్కే ప్రసాద్ తరపున రూ.50 లక్షల విరాళం చెక్కును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతినేని పద్మావతి, తాతినేని వెంకట కోటేశ్వరరావు దంపతులు అందజేశారు. చదవండి: పోలవరం ప్రాజెక్టు: మరో కీలక అంకం పూర్తి.. ట్రాకింగ్ మెకానిజం పటిష్టంగా ఉండాలి: సీఎం జగన్ -
ఫౌండేషన్ ద్వారా సచిన్ కార్యక్రమాలు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సృష్టించిన రికార్డులు మనందరికి తెలిసిందే. క్రికెట్ చరిత్రలో ఎన్నో మైలురాళ్లను సచిన్ సాధించాడు. కేవలం క్రికెట్లోనే కాక ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించాడు. తాజాగా ప్రముఖ ఎన్జీఓ సంస్థ పరివార్‌తో కలిసి ఆర్థికంగా వెనుకబడిన 560 గిరిజన చిన్నారులకు చేయుత ఇవ్వనున్నాడు. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లోని సేహోర్ జిల్లాల్లో (గ్రామీణ ప్రాంతాలు) సేవా కుటిర్స్‌ను పరివార్ సంస్థ నిర్మించింది. మరోవైపు సేవానియా, బీల్పాటి, కాపా తదితర గ్రామాలలో మధ్యాహ్మ భోజనం, ఉచిత విద్యను టెండూల్కర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాలలో పోషకాహార లోపం, నిరక్షరాస్యత తదితర సమస్యలను పత్రికలో చూసి సచిన్ గిరిజన గ్రామాలలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. -
పాట్నాలో సుశాంత్ మెమోరియల్
‘‘సుశాంత్ మెరిసే కళ్లను మళ్లీ చూడలేమని, ఆ నవ్వులను ఇక వినలేమనే నిజాన్ని అంగీకరించలేకపోతున్నాం. సైన్స్ గురించి అతను చెప్పే విషయాలను ఇక వినలేమనే బాధ వెంటాడుతోంది. తన మరణం మా ఇంట్లో శాశ్వతమైన శూన్యాన్ని మిగిల్చింది’’ అని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నటుడు సుశాంత్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతను చనిపోయిన (జూన్ 14) 13 రోజులకు శనివారం సుశాంత్ కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘సైన్స్, స్పోర్ట్స్, సినిమా.. ఇలా సుశాంత్ బాగా ఇష్టపడిన ఈ రంగాల్లో ప్రతిభావంతులైన యువతీయువకులను ప్రోత్సహించడానికి ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫౌండేషన్’ (ఎస్ఎస్ఆర్ఎఫ్) ఆరంభిస్తున్నాం. పాట్నాలో సుశాంత్ పుట్టి, పెరిగిన ఇంటిని ‘మెమోరియల్’గా మార్చుతున్నాం’’ అని ఆ ప్రకటనలో తెలిపారు. సుశాంత్ వాడిన టెలీస్కోప్, వేలాది పుస్తకాలు, అతని ఇతర విలువైన వస్తువులను మెమోరియల్‌లో ప్రదర్శనకు ఉంచుతామని, ఇకనుంచి అతని ఇన్స్టాగ్రామ్, ట్వీటర్, ఫేస్‌బుక్‌లను యాక్టివ్‌గా ఉంచుతూ, సుశాంత్ జ్ఞాపకాలు సజీవంగా ఉండేలా చేస్తామని కూడా పేర్కొన్నారు. -
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫౌండేషన్ : కీలక ప్రకటన
సాక్షి, ముంబై: చెట్టంత కొడుకును కోల్పోవడాన్ని మించిన విషాదం ఈ ప్రపంచంలో బహుశా మరొకటి ఉండదేమో. 13 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబం అంతటి విషాదాన్నుంచి ఇపుడిపుడే కోలుకుంటోంది. సుశాంత్ కు తుది నివాళులర్పించిన కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫౌండేషన్ (ఎస్ఎస్ఆర్ఎఫ్) పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే పాట్నాలో సుశాంత్ చిన్నతనంలో తిరిగిన ఇంటిని ఒక స్మారక చిహ్నంగా మార్చనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సుశాంత్ కుటుంబం ఒక ప్రకటనలో విడుదల చేసింది. (నాకూ లోతైన గాయాలు : పాపం సుశాంత్!) సుశాంత్ కు నివాళిగా సినిమా, క్రీడలు, విజ్ఞాన రంగాలలో ప్రతిభావంతులైన వారికి సాయం చేయాలని నిర్ణయించింది. అలాగే పాట్నాలోని రాజీవ్ నగర్‌లోని ఏర్పాటు చేయబోయే స్మారక చిహ్నంలో సుశాంత్ వ్యక్తిగత జ్ఞాపకాలు, వస్తువులు ఉంచుతామని తెలిపింది. అందులో వేలాది పుస్తకాలు, టెలిస్కోప్, ఫ్లైట్-సిమ్యులేటర్ మొదలైనవి అభిమానుల కోసం అందుబాటులో ఉంటాయనీ వెల్లడించింది. దీంతోపాటు అతని జ్ఞాపకాలు సజీవంగా ఉంచేందుకు సుశాంత్ ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్ పేజీని లెగసీ ఖాతాలుగా నిర్వహించాలని భావిస్తున్నామని తెలిపింది. (సుశాంత్ ఫైనల్ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్) “గుడ్ బై సుశాంత్!” సుశాంత్ కలల్ని, ఆ కళ్లలోని మెరుపును ఇక చూడలేం. తన కలల ప్రపంచాన్ని, తనకెంతో ఇష్టమైన చుక్కలను, టెలీస్కోప్ను వదిలి.. తానెప్పుడూ కలలుగనే అనంత విశ్వంలో ఆకాశంలోని చుక్కల్లో కలిసి పోయాడు. సైన్స్ గురించి అతని తపనను మళ్లీ చూడలేం. ఈ లోటు తీరనిది. ఎప్పటికీ పూడని శాశ్వత శూన్యతను సృష్టించింది. సింహంలా కలలు గన్న సుశాంత్ తమకు ప్రేరణ. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇక మాకు గుల్షన్ మాత్రమే.. అభిమానులలో ప్రతి ఒక్కరినీ నిజంగా ప్రేమించాడు. ఎంతో ఇష్టపడ్డాడు. గుల్షన్‌ను ఎంతో ప్రేమతో నింపినందుకు అందరికీ ధన్యవాదాలు'' కాగా జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం సినీ ప్రపంచాన్ని, అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. నెపొటిజమ్ లేదా బంధుప్రీతి బాలీవుడ్‌ను ఏలుతోందంటూ దుమారం రేగిన సంగతి తెలిసిందే. . -
నీతా అంబానీకి సముచిత గౌరవం
ముంబై : కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన నీతా అంబానీకి అరుదైన గౌరవం లభించింది. అమెరికాకు చెందిన ప్రముఖ మ్యాగజైన్ టౌన్ అండ్ కంట్రీ వెల్లడించిన 2020 సంవత్సరానికి అత్యంత వితరణశీలుల జాబితాలో ఆమెకు చోటు దక్కింది. కరోనా వైరస్‌తో కష్టాలు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవడంతో పాటు మహమ్మారిపై ముందుండి పోరాడే యోధులకు అవసరమైన సహాయ సహకారాలు అందించారని, భారత్‌లో తొలి కోవిడ్-19 ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకువచ్చారని ఈ మ్యాగజైన్ నీతా సేవలను కొనియాడింది. లక్షలాది మంది అన్నార్తులకు భోజనం సమకూర్చడంతో పాటు నీతా అంబానీ పెద్ద సంఖ్యలో పలువురిని తమ వితరణతో ఆదుకున్నారని పేర్కొంది. వైద్యులు, వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లను సరఫరా చేశారని గుర్తుచేసింది. ఇక నీతాతో పాటు టిమ్ కుక్, ఆఫ్రా విన్ఫ్రే, లారిన్ పావెల్ జాబ్స్, ది లాడర్ ఫ్యామిలీ, మైఖేల్ బ్లూంబర్గ్, లియనార్డో డిపాక్రియో వంటి ప్రముఖులకు టౌన్ అండ్ కంట్రీ మ్యాగజైన్ జాబితాలో స్ధానం లభించింది. భారత్ నుంచి ఈ జాబితాలో కేవలం నీతా ఒక్కరికే చోటుదక్కడం గమనార్హం. కరోనా సంక్షోభంతో ప్రపంచం అల్లాడుతున్న క్రమంలో వీరంతా సాయం చేసేందుకు ముందుకొచ్చారని పేర్కొంది. సంక్షోభం తలెత్తితే తక్షణ స్పందన : నీతా అంబానీ సంక్షోభం వచ్చినప్పుడు తక్షణం స్పందించేలా రిలయన్స్ ఫౌండేషన్‌ను తాము తీర్చిదిద్దామని, కోవిడ్-19 సమయంలో తమ సేవలకు అంతర్జాతీయ స్ధాయి గుర్తింపు రావడం గౌరవంగా భావిస్తున్నామని రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ అన్నారు. టౌన్ అండ్ కంట్రీ మ్యాగజైన్ టాప్ ఫిలాంత్రఫిస్ట్ జాబితాలో స్థానం దక్కడం సంతోషకరం. ఎప్పుడు ఎలాంటి అవసరం ఎదురైనా తమ ప్రభుత్వానికి, ప్రజలకు సాయం చేస్తామని చెప్పారు. చదవండి : నిరుపేదల కోసం ‘రిలయన్స్’ ముందడుగు -
కోటి 70 లక్షల సహాయం: విజయ్ దేవరకొండ ఫౌండేషన్
హైదరాబాద్: టాలీవుడ్ యూత్ సెన్సెషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కేవలం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకుంటున్నాడు. కరోనా వైరస్, లాక్డౌన్ కష్ట కాలంలో పేద ప్రజలను ఆదుకోవడానికి తన చారిటీ ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్న విషయం తెలిసిందే. పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు, మందులు అందిస్తు తన వంతు సహాయం చేస్తున్నాడు. ఇందులో భాగంగా రూ. కోటితో ‘ది దేవరకొండ ఫౌండేషన్(టీడీఎఫ్)’, రూ. 25 లక్షలతో ‘మిడిల్ క్లాస్ ఫండ్(ఎంసీఎఫ్)’ అనే రెండు చారిటీ సంస్థలను ప్రారంభించాడు. అయితే గత 36 రోజులుగా తమ ఫౌండేషన్ ద్వారా కోటి 70లక్షల ఆర్థిక సహాయంతో 17,000 మంది పేద ప్రజలకు సహాయం చేసినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా జూన్ 2 నుంచి లాక్డౌన్ సడలింపు వల్ల వ్యాపారాలు, కార్యకలాపాలు ప్రారంభమయినందున తమ సేవా కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. అలాగే కేవలం పేద ప్రజలకు సహాయం చేయడమే కాకుండా.. నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పనే ద్వేయంగా విజయ్ దేవరకొండ ఫౌండేషన్ పని చేస్తుందని ఫౌండేషన్ వర్గాలు పేర్కొన్నాయి. 2019లో తమ ఫౌండేషన్ ద్వారా 50 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తే.. ఇద్దరు విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయని, మిగతా 48 మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు పౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. విజయ్ దేవరకొండ చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల అతడి అభిమానులు ఫిదా అవుతున్నారు. చదవండి: కాబోయే భార్య అలా ఉండాలి : విజయ్ -
లక్ష మందికి ఉపాధి
‘‘ఇలాంటి ఒక సమస్య మన ముందుకు వస్తుందని ఎవరం ఊహించలేదు. కానీ మనందరం యోధులం. కలసికట్టుగా దీనిపై పోరాటం చేద్దాం’’ అంటున్నారు విజయ్ దేవరకొండ. కరోనా కష్ట సమయంలో సమాజానికి తన వంతు సహాయంగా రెండు ప్రకటనలు విడుదల చేశారు విజయ్. ఈ రెండు ప్రకటనలను ఒకటి అత్యవసరంగా కావాల్సినవి, భవిష్యత్తులో కావాల్సినవిగా విభజించారాయన. మొదటిది ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా యువతకు ఉపాధి కల్పించడం. గత ఏడాదిగా వర్కవుట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం లక్ష మంది యువతకు ఉపాధి కల్పించడమే అని పేర్కొన్నారు. దీనికోసం కోటి రూపాయిలు ఖర్చు చేస్తున్నట్టు విజయ్ తెలిపారు. రెండవది ‘మిడిల్ క్లాస్ ఫండ్’. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేని మధ్య తరగతి కుటుంబాలకు ఈ ఫండ్ ద్వారా సహాయం చేయనున్నారు ఆయన. దీనికోసం 25 లక్షలు ప్రకటించారు. అవసరం ఉన్నవారు ‘ది దేవరకొండ ఫౌండేషన్.ఆర్గ్’ ద్వారా టీమ్‌ను సంప్రదించవచ్చన్నారు. ‘‘లాక్ డౌన్ కారణంగా మా టీమ్ మీ ఇంటి దగ్గరికి వచ్చి హెల్ప్ చెయ్యలేదు. అందుకే మీరు మీ ఇంటి దగ్గరే ఉన్న షాప్‌లో సరుకులు కొనవచ్చు. ఆ బిల్‌ను మేము ‘ది మిడిల్ క్లాస్ ఫండ్’ నుండి చెల్లిస్తాం. ఈ సమయంలో మనందరికీ కావాల్సింది ప్రేమ. ఒకరి నుంచి ఒకరికి భరోసా’’ అన్నారు విజయ్. ‘మిడిల్ క్లాస్ ఫండ్’కి ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ లక్ష రూపాయిలు విరాళంగా ప్రకటించారు. విజయ్ చేస్తున్న ఈ పనిని దర్శకులు కొరటాల శివ, పూరి జగన్నాథ్ అభినందించారు. -
దీక్షాయణి
జీవితంలో స్థిరత్వాన్ని సాధించిన తర్వాత ‘సమాజానికి తిరిగి ఇవ్వడం’ అనే యజ్ఞాన్ని దీక్షగా నిర్వహిస్తున్నారు దాక్షాయణి. ప్రభుత్వం చట్టం చేయడానికంటే ముందే స్వచ్ఛందంగా ఆ బాధ్యతను తలకెత్తుకున్నారామె. రామ్కీ ఫౌండేషన్ స్థాపించి దేశవ్యాప్తంగా వేలాది మంది జీవన స్థితిగతులను మెరుగుపరుస్తున్నారు. జీవితం వడ్డించిన విస్తరిలా ఉండేది కొందరికే. ఆ కొందరిలో ఒకరు దాక్షాయణి రెడ్డి ఆళ్ల. ఆమెకు జీవితంలో ఎటువంటి కష్టమూ ఎదురు కాలేదు. కానీ బతకడం కోసం కష్టపడే వాళ్ల ‘కష్టం’ విలువ తెలుసు. కష్టం చేసుకుని బతుకును గాడిలో పెట్టుకోవాలనే వాళ్ల ఆకాంక్షను అర్థం చేసుకున్నారు. ఆకు ఆకు పేర్చి విస్తరి కుట్టుకుని పదార్థాలు వండి వడ్డించుకోవాలనే వాళ్ల గుండె లోతుల్లో ఉండే ఆర్ద్రతను తెలుసుకోగలిగారు. విస్తరాకులు చేయడం వచ్చిన వాళ్లకు ఆ పనిలోనే ఉపాధి కల్పించారు. వండడం వచ్చిన వాళ్లకు అందులోనే నాలుగు డబ్బులు సంపాదించుకునే మార్గాన్ని చూపించారు. సకాలంలో వర్షాలు లేక పంటలు పరిహసించినప్పుడు ఆ కుటుంబాన్ని ‘పాడి’ ఆదుకుంటుందని కుటుంబానికి రెండు గేదెలిచ్చి మరీ నిరూపించారు. ఇవేవీ చేయడం కుదరని చోట మహిళలను సంఘటిత పరిచి దుస్తులు కుట్టడం నేర్పించారు. వర్క్ ఆర్డర్లు తెచ్చి ఆ మహిళలకు నిరంతరాయంగా పని కల్పించడానికి ఆమె సొంతంగా ఒక నెట్‌వర్క్‌నే అభివృద్ధి చేశారు. గృహిణిగా ఉన్న ఆమెను ఇవన్నీ చేయడానికి ప్రేరేపించింది గొప్ప స్ఫూర్తి ప్రదాతలు, ప్రముఖ దార్శనికులు కాదు. పల్నాడులో రాజ్యమేలిన పేదరికమే తనను ‘సమాజం మనిషి’గా మార్చిందన్నారు దాక్షాయణి. ఆమె రామ్కీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చట్టాన్ని ప్రభుత్వం 2013లో తెచ్చింది. కానీ తమ సంస్థ పాతికేళ్ల కిందటే సమాజానికి తిరిగి ఇవ్వడం అనే బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు దాక్షాయణి. 1996 నుంచి తమ గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడి వాళ్లు అడిగిన అవసరాలను తీరుస్తూ వచ్చామని, 2006 ఆగస్టు 12వ తేదీ నుంచి ఈ సర్వీస్‌ను వ్యవస్థీకృతంగా మొదలు పెట్టామని చెప్పారామె. కనకమ్మవ్వ హాస్టల్ ‘‘గ్రామాల్లో దిగువ మధ్య తరగతి, అల్పాదాయ వర్గాలకు ఆడపిల్లను కాలేజ్‌లో చదివించడం అనేది ఇప్పటికీ శక్తికి మించిన పనిగానే ఉంటోంది. ముఖ్యంగా గ్రామాల నుంచి పట్టణాలకు పంపించడానికి రవాణా సరిగ్గా ఉండదు. హాస్టల్లో పెట్టి చదివించడానికి ఖర్చులు భరించలేక బాగా చదివే అమ్మాయిలను కూడా చదువు మాన్పిస్తున్నారు. అలాంటి వాళ్ల కోసం నర్సరావు పేటలో హాస్టల్ పెట్టాం. ఆ హాస్టల్ పేరు కనకమ్మవ్వ హాస్టల్. అది మా వారి (ఆళ్ల అయోధ్య రామిరెడ్డి) నానమ్మ పేరు. ఆయనకు వాళ్ల నానమ్మ అంటే చాలా ఇష్టం. ఆమె పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని కోరిక. అందుకే హాస్టల్‌కి ఆ అవ్వ పేరు పెట్టాను. ఏటా నలభై ఐదు మంది విద్యార్థినులకు ప్రవేశం ఉంటుంది. ఆ హాస్టల్ నుంచి ఇప్పటి వరకు ఐదు వందల యాభై మంది చదువు పూర్తి చేసుకున్నారు. మా రామ్కీ ఫౌండేషన్ ద్వారా పర్యావరణ పరిరక్షణ, చిన్న పరిశ్రమల స్థాపన, ఆరోగ్య చైతన్య సదస్సులు, ఆదివాసీల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల నిర్వహణ వంటివి 20 రాష్ట్రాల్లో, 125 గ్రామాల్లో చేస్తున్నాం. ఆరు వందల మంది మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్‌లో ట్రైనింగ్, రెండు వందల నలభై మందికి పాడి గేదెలు, మరో నాలుగు వందల మందికి బ్యూటీషియన్ వంటి కోర్సుల్లో శిక్షణ ఇప్పించాం. కానీ అన్నింటిలోనూ నాకు వ్యక్తిగతంగా సంతృప్తినిస్తున్న సర్వీస్ ఆడపిల్లలను చదివించడమే. వాళ్లు చదువుకున్న సర్టిఫికేట్లు, జాబ్ ఆర్డర్లు చూపించి ‘నేను ఇంజనీరింగ్ పాసయ్యాను మేడమ్, పీజీ పూర్తయింది మేడమ్, ఉద్యోగం వచ్చింది మేడమ్’ అని చెబుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది’’ అని చెప్పారు దాక్షాయణి రెడ్డి ఆళ్ల. – వాకా మంజులారెడ్డి, ఫొటో: అమర్ నాన్న బాధ్యత రామ్కీ వాళ్లు తీసుకున్నారు మాది ప్రకాశం జిల్లా, మారెళ్ల పంచాయితీలోని గంగన్నపాలెం గ్రామం. అద్దంకికి పద్నాలుగు కిలోమీటర్లు. మా ఊరికి బస్సు లేదు. రెండు కిలోమీటర్ల దూరానున్న మారెళ్లకు నడిచి వెళ్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుకున్నాను. ఇంటర్‌కి అద్దంకి వెళ్లాల్సిందే. అద్దంకిలో జూనియర్ కాలేజ్‌కి వెళ్లాలంటే మారెళ్లకు నడిచి వెళ్లి, అక్కడ బస్సెక్కాలి. తిరిగి వచ్చేటప్పుడు అలాగే మారెళ్ల వరకు బస్సులో వచ్చి, రెండు కిలోమీటర్లు నడిస్తే ఊరు చేరతాం. మా దగ్గర ఆడపిల్లలకు కాలేజ్ చదువు అందని ద్రాక్షగా అవడానికి ఇదే ప్రధాన కారణం. అలాంటి చోట నేను ఇంటర్ వరకు చదవగలిగాను. మెడిసిన్‌లో సీటు వచ్చింది. మా ఊర్లో పెద్దాయన యలమందారెడ్డి తాతగారు నన్ను పిలిపించి మాట్లాడి, రామ్కీ ఫౌండేషన్ వాళ్లకు చెప్పారు. వాళ్లు నాలుగేళ్ల పాటు ఏటా లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం చేశారు. ఈ ఫౌండేషన్ నుంచి వందలమంది సహాయం పొందుతున్నారు. ఈ నెల 27వ తేదీన నేను ఎంబీబీఎస్ పట్టా అందుకోబోతున్నాను. నేను సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత నా వంతుగా ఒక స్టూడెంట్‌కి సహాయం చేస్తాను. – పోతిరెడ్డి నాగలక్ష్మి, వైద్య విద్యార్థిని -
సీతానగరంలో మునకల్లంల వంతెనకు శంకుస్థాపన
-
కడపలో అభివృద్ధి పరుగులు
-
కడప ఉక్కు కల సాకారం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి కడప: రాయలసీమ ప్రజల దశాబ్ధాల కల నేడు సాకారం కానుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి కల్పించాలన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు అయిన కడప ఉక్కు కర్మాగారానికి సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న ఈ కర్మాగారానికి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,275.66 ఎకరాలను కేటాయించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు వడివడిగా అడుగులు వేశారు. ఇందుకోసం రూ.10 లక్షల మూల ధనంతో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరిట ఒక ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేశారు. విభజన హామీ చట్టం ప్రకారం వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ఉక్కు కర్మాగారానికి సంబంధించి కేంద్రంతో పలుదఫాలు చర్చించి కీలకమైన ముడి ఇనుము సరఫరా కోసం ఎన్ఎండీసీతో డిసెంబర్ 18న ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ యూనిట్ ఏర్పాటుకు ప్రస్తుతం 4.8 మిలియన్ టన్నుల ముడి ఇనుము అవసరం కాగా, ఎన్ఎండీసీ 5 మిలియన్ టన్నులు సరఫరా చేయడానికి అంగీకరించింది. గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటిని సరఫరా చేయనున్నారు. ఈ యూనిట్‌కు కేటాయించిన స్థలం నుంచే కడప–నంద్యాల రైల్వే ట్రాక్ ఉండటంతో పాటు ఏడు కిలోమీటర్ల దూరంలోనే 400 కేవీ సబ్‌స్టేషన్ కూడా ఉంది. ఇలా కీలకమైన అన్ని వనరులు సమకూరిన తర్వాతే శంకుస్థాపన చేస్తుండటం.. ఈ ప్రాజెక్టుపై సీఎంకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో ఈ కర్మాగారానికి రూ.250 కోట్లు కేటాయించగా అందులో ఇప్పటికే రూ.62 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. కేంద్రం నుంచి రాయితీల డిమాండ్ ఈ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలకు అదనంగా కేంద్రం నుంచి కూడా పలు రాయితీలను కోరుతోంది. ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి తొలి ఏడేళ్లు ఐజీఎస్టీ మినహాయింపు, పదేళ్ల పాటు ఆదాయపు పన్ను మినహాయింపు, దిగుమతి చేసుకునే ముడి సరుకులపై సుంకాల మినహాయింపులను కోరుతోంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లపాటు యూనిట్ విద్యుత్ రూపాయికే ఇవ్వనుంది. స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, భూమి కొనుగోలు లేదా లీజు ఫీజుపై 100 శాతం మినహాయింపు, ఏడేళ్లపాటు ఎస్జీఎస్టీ వంటి అనేక రాయితీలను ఆఫర్ చేస్తోంది. కడపలో అభివృద్ధి పరుగులు వైఎస్ జగన్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే వైఎస్సార్ జిల్లాలో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, రాయచోటి నియోజకవర్గాల్లో పలు నీటి పారుదల ప్రాజెక్టులతోపాటు వైద్యశాలలు, రోడ్లు, డ్రైనేజీలు, గ్రామ సచివాలయ భవనాలతోపాటు పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తుండటంతో జిల్లా దశ తిరిగినట్లేనని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ వల్ల స్థానికంగా వేలాది మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలగనుంది. సీఎం శంకుస్థాపనలు, ప్రారంబోఉత్సవాలు ఇలా.. ►23వ తేదీ ఉదయం 10 గంటలకు జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ►కుందూనదిపై కుందూ – తెలుగుగంగ ఎత్తిపోతల పథకానికి, కర్నూలు – వైఎస్సార్ జిల్లాల సరిహద్దులో నిరి్మస్తున్న రాజోలి ఆనకట్ట నిర్మాణానికి, కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం జోలదరాశి వద్ద నిర్మించనున్న ఆనకట్టకు సంబంధించి దువ్వూరు మండలం నేలటూరు వద్ద శంకుస్థాపన శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ►సాయంత్రం కడపలో రిమ్స్ పరిధిలో రూ.107 కోట్లతో ఏర్పాటు చేయనున్న క్యాన్సర్ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్, రూ.175 కోట్లతో నిర్మించే సూపర్ స్పెషాలిటీ విభాగం, రూ.40.80 కోట్లతో నిర్మించే మానసిక చికిత్సాలయం, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లకు శంకుస్థాపన చేస్తారు. ఇదే సందర్భంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సొంత నిధులతో నిరి్మంచిన ఉచిత అన్నదాన, వసతి భవనాన్ని ప్రారంభిస్తారు. ►రూ.20 కోట్లతో కడపలో నిరి్మంచనున్న డి్రస్టిక్ట్ పోలీసు కార్యాలయ భవనాలకు శంకుస్థాపన. ►కడప – రాయచోటి రోడ్డులో రూ.82.73 కోట్లతో నిరి్మంచిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. ►24వ తేదీ రాయచోటి ప్రాంతంలో రూ.1,272 కోట్లతో ఎత్తిపోతల ద్వారా జీఎన్ఎస్ఎస్ (గాలేరు నగరి సుజల స్రవంతి) – హెచ్ఎన్ఎస్ఎస్ (హంద్రీ నీవా సుజల స్రవంతి) అనుసంధాన పథకానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం రాయచోటి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. రాయచోటి జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ►25వ తేదీ పులివెందులలో రూ.347 కోట్లతో నిరి్మంచనున్న మెడికల్ కళాశాల, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రూ.17.50 కోట్లతో నిరి్మంచిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. -
బడికి ప్రేమతో..!
ఆ గదుల్లో నేర్చుకున్న పాఠాలు వృథాపోలేదు ఆ బడి పంచిన జ్ఞాపకాలు చెదిరిపోలేదు ఆ బడి నేర్పిన సంస్కారం మరుగునపడలేదు తన ఎదుగుదలకు పునాది వేసిన తల్లిలాంటి బడిని మరచిపోలేదు. తాను చదువుకున్న బడి శిథిలావస్థకు చేరుకున్న దృశ్యం ఆ పూర్వ విద్యార్థి మనస్సును కలచివేసింది. తన కొడుకు వివాహానికి పెట్టాలనుకున్న పెళ్లి ఖర్చు కోటి రూపాయలతో చదువులమ్మ చెంతకు చేరాడు వజ్రపు వెంకటేష్. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన వజ్రపు వెంకటేష్ తన తండ్రి ‘వజ్రపు నర్శింహమూర్తి పౌండేషన్’ (విఎన్‌ఎం పౌండేషన్) ద్వారా కొంతకాలంగా సేవా కార్యక్రమాలను నిర్వ స్తున్నారు. ఒకరోజు తాను చదువుకున్న పాఠశాలలోని పేద విద్యార్థులకు దుస్తులు, బ్యాగులు, నోటు పుస్తకాలు అందించేందుకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లిన ఆయన అక్కడ బడి దుస్థితిని చూసి చలించిపోయారు. చక్కని వాతావరణంలో చదవాల్సిన విద్యార్థులు చెట్లనీడల్లో, గాలికి పడుతున్న సిమెంట్ రేకుముక్కల మధ్య బిక్కుబిక్కుమంటూ చదువుతున్నారు. అక్కడ విద్యార్థులను పలకరించగా ‘ఎండాకాలంలో నేరుగా సూర్యుడు తమ నెత్తిపైనే తాండవిస్తుంటాడని, వర్షాకాలంలో తామంతా గుంపుగా ఓ చోటుకు చేరి తలదాచుకోవలసిన పరిస్థితుల్లో చదువుతున్నామంటూ’ విలపించారు. అప్పుడే వజ్రపు వెంకటే ష్ ఓ గట్టి నిర్ణయం తీసుకున్నారు. జత కలిసిన కుటుంబం తన భార్య అనూష, తల్లి శంకర లక్ష్మీ, కుమారులు జాన్ వికాస్, ఆశీష్‌తో తన మనోగతాన్ని పంచుకున్నాడు. కుటుంబ సభ్యులూ వెంకటేశ్ మనోగతాన్ని అర్థం చేసుకొని ఓ నిర్ణయానికి వచ్చారు. కుమారుడు జాన్ వికాస్ వివాహానికి పెట్టే ఖర్చు కోటి రూపాయలతో కోట్లమందికి ఉపయోగపడే చదువుల గు(బ)డికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ ఆశను, ఆకాంక్షను వినతిపత్రం రూపంలో తెలియజేశారు. కలెక్టర్ నుంచి వెంటనే అనుమతి లభించింది. కోటి అభినందనలు శిథిలావస్థకు చేరుకున్న బడిని పడగొట్టించారు వజ్రపు వెంకటేష్. గత ఏడాది ఆగష్టు 31న అప్పటి జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి సాయిరామ్ చేతుల మీదుగా కోటి రూపాయలతో పది గదుల భవనానికి శంకుస్థాపన జరిగింది. తాను చదువుకున్న బడి రుణం తీర్చుకుంటున్నందుకు ధన్యుడనంటూ చెప్పిన వెంకటేష్ మాటలు విన్న జిల్లా కలెక్టర్ ఉప్పొంగి పోయారు. సొంత లాభాలకు పాకులాడే ఈ రోజుల్లో ఆడంబరంగా జరుపుకునే కన్న కొడుకు పెళ్లికి అయ్యే ఖర్చును బడికి వెచ్చించిన వెంకటేష్‌ను సాక్షాత్ దేవుడిగా అభివర్ణించారు. మరో అరకోటి వజ్రపు వెంకటేష్ ఆధ్వర్యంలో తన సంస్థ ద్వారానే భవన పనులు శరవేగంగా జరిగాయి. ధరలు పెరిగినా వెనుకంజ వేయకుండా మరో అడుగు ముందుకేసి అరకోటి అదనపు ఖర్చుతో ఈ ఏడాది నవంబరు 28న రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా పాఠశాల భవన సముదాయాన్ని ప్రారంభించారు. శిథిలావస్థలో ఉన్న బడిని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టి అందరి మదిలో సమున్నతంగా నిలుచున్నారు వజ్రపు వెంకటేష్. – మద్దిలి కేశవరావు, సాక్షి, ఇచ్ఛాపురం రూరల్ -
పారా అథ్లెట్ల విన్యాసాలు
-
నూతన గృహాలకు శంకుస్థాపన చేసిన మోపిదేవి
-
ప్రస్తుతం జిల్లాల్లో.. తర్వాత నియోజకవర్గాల్లో!
సాక్షి, హైదరాబాద్: జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ఈనెల 24న ఏకకాలంలో శంకుస్థాపన చేసేందుకు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. శంకుస్థాపన ఏర్పాట్లపై పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు శనివారం మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, పార్టీ ముఖ్యనేతలతో జిల్లాల వారీగా ఫోన్లో సమీక్షించారు. భూమి పూజ జరిగే స్థలాలను శనివారం సాయంత్రంలోగా పరిశీలించి, ఏర్పాట్లపై దృష్టి సారించాల్సిందిగా సూచించారు. నూతనంగా నిర్మించే పార్టీ భవనాల నమూనాను సీఎం కేసీఆర్ త్వరలో ఎంపిక చేస్తారని వెల్లడించారు. సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల నడుమ మంచి ముహూర్తం ఉన్నందున శంకుస్థాపన నిర్వహించాలన్నారు. మంత్రుల ప్రాతినిథ్యం ఉన్నచోట ఆయా జిల్లా కేంద్రాల్లో వారే శంకుస్థాపన చేస్తారని, మిగతా జిల్లాల్లో జెడ్పీ చైర్మన్లు నిర్వహిస్తారన్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కేటీఆర్ ఆదేశించారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు పార్టీ పక్షాన ఎన్నికైన ప్రాదేశిక సంస్థల ప్రతినిధులు, సర్పంచ్‌లు, పార్టీ సీనియర్ నేతలను కూడా ఆహ్వానించాలని పార్టీ కీలక నేతలకు సూచించారు. భూమి పూజలో పాల్గొనే తొమ్మిది మంది మంత్రులతోపాటు, 19 మంది జిల్లా పరిషత్ చైర్మన్ల జాబితాను కేటీఆర్ విడుదల చేశారు. జిల్లాకు ఎకరా చొప్పున కేటాయింపు జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయం నిర్మాణానికి వీలుగా ఈ నెల 18న సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ ఒక్కో జిల్లాలో ఎకరా చొప్పున భూమి కేటాయించింది. సీఎం ప్రకటనకు అనుగుణంగా ఈ నెల 21న 24 జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ భవనాల నిర్మాణానికి భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 34 జిల్లాలకుగాను ఖమ్మంలో ఇదివరకే పార్టీ జిల్లా కార్యాలయాన్ని నిర్మించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ కొద్ది రోజులకే గత ఏడాది డిసెంబర్ 20న వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. రాజధాని హైదరాబాద్‌లో ఇప్పటికే రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ ఉన్నా, నగర శాఖ కోసం మరో కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అయితే హైదరాబాద్ నగరంతో పాటు, వరంగల్ రూరల్ జిల్లా కేంద్రంలో కార్యాలయ నిర్మాణం కోసం అనువైన స్థలం కోసం పార్టీ అన్వేషిస్తోంది. మరో ఆరు జిల్లా కేంద్రాల్లో భూ కేటాయింపుపై స్పష్టత రావాల్సి ఉంది. రూ.19.20 కోట్లు పార్టీ నిధులు క్షేత్ర స్థాయిలో పార్టీని వ్యవస్థీకృతం చేయాలని భావిస్తున్న టీఆర్ఎస్.. తొలుత జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం పార్టీ పేరిట రూ.225 కోట్ల డిపాజిట్లు ఉండగా, వడ్డీ రూపంలో రూ.1.25 కోట్ల ఆదాయం వస్తోంది. పార్టీ నిధుల నుంచే ఒక్కో భవనానికి రూ.60లక్షల చొప్పున కేటాయిస్తున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తమిళనాడులో డీఎంకే తరహాలో ఇంటికో పార్టీ కార్యకర్త ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్న టీఆర్ఎస్.. త్వరలో నియోజకవర్గ స్థాయిలోనూ పార్టీ కార్యాలయాలను నిర్మించాలనే యోచనలో ఉంది. నియోజకవర్గ కేంద్రాల్లో స్థల కేటాయింపులో సాధ్యాసాధ్యాలపై పార్టీ అధినేత కేసీఆర్ అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. -
బడుగు రైతుకు ఆదాయ భద్రత!
కేవలం 5 గుంటల(12.5 సెంట్లు) స్థలం..రూ. 3 లక్షల బ్యాంకు రుణంతోనెట్ హౌస్ నిర్మాణం..రైతు వాటా రూ. 35 వేలతోపాటు రోజుకు 2 గంటలు శ్రమ..అతి తక్కువ నీటితో, మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలు కరువు కాలంలోనూనిశ్చింతగా పండించడం..పొలం దగ్గరే రైతులకుగిట్టుబాటు ధర చెల్లించడం..ప్రతి వంద రోజులకో పంట..ప్రతి సారీ పంటల మార్పిడి..పంట పంటకూ రూ. 50 వేల నికరాదాయం..ఇదంతా అందమైన కల లాగా ఉందా?కల కాదు.. నిజమే. నిజంగా నిజమే!చిన్న, సన్నకారు రైతుల అనుభవంలో నిగ్గుతేలిన విషయమిది. ‘ఖేతీ’ అనే లాభాపేక్ష లేని సంస్థ మార్గదర్శనంలో పలువురు రైతులు ఏడాది పొడవునా, తీవ్ర కరువు కాలంలోనూ, ఆదాయ భద్రత పొందుతున్నారు!! మెతుకు సీమ మెదక్ జిల్లా ఇప్పుడు భూగర్భ జలాలు ఇంకిపోయి కరువు సీమగా మారింది. నాలుగైదు వందల అడుగుల లోతుకు బోరు వేస్తే కానీ నీరు రాని పరిస్థితి.. వేసిన బోర్లలో కూడా సక్రమంగా నీరు వస్తుందనే నమ్మకం లేదు. ఒకటికి పది బోర్లు వేసినా నీటి కొరత తీరక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఈ ప్రాంతంలోనే అధికంగా ఉన్నారు. అందుకోసమే నష్టాలతో సాగు చేయలేక హైదరాబాద్, ముంబై, దుబాయ్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లి బతుకు జీవుడా అని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో ఏడారిలో ఒయాసిస్సులాగా ‘ఖేతీ’ లాభాపేక్ష లేని సంస్థ రైతులకు అండగా నిలుస్తోంది. వ్యవసాయం దండుగ అన్న చోటనే పండుగలా చేసేందుకు ప్రయత్నిస్తున్నది. అన్నీ తానై చిన్న, సన్నకారు రైతులతో లాభసాటి వ్యవసాయం చేయిస్తోంది. 5 గుంటల (12.5 సెంట్లు) భూమిలో బ్యాంకు రుణం రూ. 3 లక్షల(8.8% వడ్డీ)తో నెట్ హౌస్ నిర్మిస్తోంది. రైతు వాటా రూ. 35 వేలు చెల్లించాలి. చుట్టూ పురుగులను లోనికి రానీయకుండా నెట్ ఉంటుంది. లోపల పంటల పైన షేడ్ నెట్ ఉంటుంది. ఎండ ఎక్కువగా ఉండే రోజుల్లోనే ఈ షేడ్‌నెట్‌ను వాడుతుంటారు. ఎండ తీవ్రతను 2 డిగ్రీల సెల్షియస్ మేరకు తగ్గిస్తే 20% దిగుబడి పెరుగుతుందని ‘ఖేతీ’ చెబుతోంది. ఆరు బయట డ్రిప్ ద్వారా వాడే నీటిలో కేవలం 10 శాతం నీటిని (రోజుకు వెయ్యి లీటర్లు) మాత్రమే వాడుతుండడం మరో విశేషం. 100 రోజుల్లో రూ. 90 వేల విలువైన కనీసం 3 టన్నుల కీర దోస వంటి స్వల్పకాలిక పంటలు పండించేలా బడుగు రైతులకు ‘ఖేతీ’ మార్గదర్శనం చేస్తున్నది. ఆరుబయట డ్రిప్‌తో ఇంత దిగుబడి తీయడానికి రోజుకు పది వేల లీటర్ల నీరు, అదే నీరు పారగట్టే పద్ధతిలో అయితే 50 వేల లీటర్ల నీరు అవసరమవుతుందని ‘ఖేతీ’ అంచనా. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం 90% తగ్గించగలుగుతోంది. పండించడం వరకే కాదు.. పంటను మార్కెట్ ధర చెల్లించి పొలం దగ్గరే మార్కెట్ ధరకే కొంటున్నది. మార్కెట్లో ధర మరీ తగ్గినప్పుడు కూడా కిలోకు రూ. 20 చొప్పున రైతులకు చెల్లించడం విశేషం. ఉన్న కొద్దిపాటి నీటి వనరులను ఉపయోగించుకొని కీరదోస సాగు లాభసాటిగా ఉందని సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం రైతులు చెబుతున్నారు. 1హెచ్‌పి మోటర్, వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్ నుంచి డ్రిప్ ద్వారా నీరు, ద్రవరూప ఎరువులు అందిచడంతో పంట దిగుబడి అధికంగా వస్తున్నదని రైతు గుండ తిరుమలగిరి, వజ్రమ్మ దంపతులు చెబుతున్నారు. పంట నాటిన నెల రోజుల నుంచి దిగుబడి మొదలైందన్నారు. పంటలు వేసి నష్టపోయిన రైతులకు ‘ఖేతీ’ స్వచ్ఛంద సంస్థ అండగా నిలిచింది. సంస్థ అధ్యక్షులు సత్య రఘు రైతులను కలిసి, ఉమ్మడి మెదక్, మేడ్చల్ జిల్లా పరిధిలో 500 మంది రైతులను ఎంపిక చేశారు. కీర పంట నాటిన నెల రోజులకు దిగుబడి ప్రారంభమవుతుంది. రోజు తప్పి రోజు కీర దోసకాయలను రైతులు కోస్తున్నారు. ‘ఖేతీ’ సంస్థ ప్రతినిధులు నెట్ హౌస్ వద్దకే వచ్చి కాంటా పెట్టుకొని ఆన్లైన్ మార్కెట్లలో ఆ రోజు ఉన్న రేటుకు కొనుగోలు చేసి.. నగరాల్లోని మాల్స్‌కు సరఫరా చేస్తున్నారు. రైతులకు నెలకోసారి డబ్బు చెల్లిస్తున్నారు. గరిష్టం ఐదేళ్లలో బ్యాంకు రుణం తీరిపోతుంది. అప్పటి వరకూ ‘ఖేతీ’ సంస్థ రైతులకు వెన్నుదన్నుగా ఉంటుంది. ఆ తర్వాత రైతులే నిర్వహించుకోవాలి. – ఈరగాని బిక్షం, సాక్షి, సిద్ధిపేటఫొటో జర్నలిస్టు : కె. సతీష్ పనులు మేమే చేసుకుంటాం..! నాకు మూడున్నర ఎకరాల భూమి ఉంది. బోరు కొద్డిగా పోయడంతో పంటలు మధ్యలోనే ఎండిపోయేవి. కానీ ఈ సార్లు వచ్చి కొద్దిపాటి నీళ్లతో 5 గుంటల్లో పంటలు సాగు చేసుకోవచ్చని చెప్పారు. మా వాటా రూ. 35 వేలు ఇచ్చాం. బ్యాంకు లోన్ వచ్చింది. నెట్ హౌస్ వేశాం. పంటలు వేయడం, మందులు వాటం అంతా వారే చెప్పారు. రోజు వారీగా తోటలో పనులు మేమే చేసుకుంటున్నాం. ఇప్పుడు రెండు నెలలైంది. మాకు 2 టన్నుల కీర దోస పండింది. కిలో రూ. 32 నుండి రూ. 35 వరకు పలుకుతున్నది. ఇప్పటి వరకు మాకు రూ. 60 వేలు వచ్చినయి. మరో టన్ను దిగుబడి వస్తుంది. వంద రోజుల్లో రూ. 90 వేల పంట పండుతుంది. ప్రతి రోజూ పని చేస్తే మంచి లాభాలు వస్తాయి.– గుండ తిరుమలగిరి, కీర రైతు,(88976 74823), దాచారం, గజ్వేల్ మండలం, సిద్ధిపేట జిల్లా తక్కువ విస్తీర్ణం.. ఎక్కువ లాభం! తక్కువ విస్తీర్ణంలో చిన్న, సన్నకారు రైతులతో లాభసాటి వ్యవసాయం చేయించడం, వ్యవసాయం దండుగ కాదని రుజువు చేయడమే మా సంస్థ లక్ష్యం. కేవలం 5 గుంటల స్థలంలో నెట్ హౌస్ నిర్మించడంతో పాటు డ్రిప్ తదితర వసతులన్నీ కల్పించాం. మా వ్యవసాయ నిపుణులు రైతుల పొలాల వద్దకు వెళ్లి ఎప్పటికప్పుడు సూచనలిస్తున్నాం. తీవ్ర కరువులోనూ మంచి దిగుబడి వస్తున్నది. మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా పొలం వద్దకే వెళ్లి మేమే కొనుగోలు చేస్తున్నాం. కీర దోస, క్యాప్సికం, చెర్రీ టమాటా, కర్బూజ, మిర్చి పంటలను పంటల మార్పిడి పద్ధతిలో సాగు చేయిస్తున్నాం. రైతులకు లాభసాటిగా ఉంది.– దిలీప్ (83400 65000),ఖేతీ సంస్థ ప్రతినిధి రోజుకు 2 గంటలు పని! నేను ఉదయం మిల్క్ డైరీలో పనిచేస్తా.. నాకు వ్యవసాయం ఉంది. కానీ దిగుబడి రాక వ్యవసాయం చేయడంలేదు. ‘ఖేతీ’ సంస్థ వారు చెప్పిన మాటలు విని 5 గుంటల్లో నెట్ హౌస్ వేసి కీర దోస వేశాను. ఉదయం గంటసేపు, సాయంత్రం గంటసేపు పంట బాగోగులు చూసుకుంటున్నా. డ్రిప్ ద్వారా నీళ్లు, మందులు వేస్తాం. పంట వేసి 70 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు నాకు రూ. 68 వేల ఆదాయం వచ్చింది. కాయలు కోయగానే పొలం దగ్గరకు వచ్చి వాళ్లే కొనుగోలు చేస్తారు. అమ్ముకోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. మంచి సౌకర్యంగా, లాభంగా ఉంది. పాల డైరీ పనిచేసుకుంటూనే ఈ కీర దోస పండించిన. ఈ పంట అయిపోగానే క్యాప్సికం లేదా చెర్రీ టమాటా వేస్తాం.– వెంకటస్వామి, కీర రైతు(9030189288), దాచారం, గజ్వేల్ మండలం, సిద్ధిపేట జిల్లా -
సూర్యకు బతుకునిచ్చిన సాక్షి
సాక్షి, కోరుట్ల: ‘బాబుకు.. బతుకునివ్వరూ’ శీర్షికన ఈ నెల 8వ తేదిన సాక్షిలో ప్రచురితమైన కథనానికి పలువురు స్పందించారు. పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన గొడిసెల సూర్య(14) అనే బాలుడు బ్రెయిన్ ఫీవర్‌తో బాదపడుతున్నాడు. తల్లిదండ్రులకు వైద్యం చేయించడం భారంగా మారింది. ఈ క్రమంలో సాక్షి ఆ కుటుంబ దయనీయ స్థితిపై కథనం ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు రూ.15 వేలు విరాళం అందించారు. జగిత్యాల జిల్లా బీజేపీ కార్యదర్శి ఇందూరి సత్యం రూ.5 వేలు విరాళం అందించారు. కోరుట్ల ప్రెస్‌క్లబ్ తరపున రూ.10వేల విరాళం ప్రకటించారు. ఆదుకున్న అర్వింద్ ఫౌండేషన్ బ్రెయిన్ ఫీవర్‌తో బాధపడుతున్న సూర్య వైద్య సాయం కోసం అర్వింద్ ఫౌండేషన్ నిర్వహాకులు స్పందించారు. కోరుట్ల బీజేపీ నాయకులు ఇందూరి సత్యం సూర్య పరిస్థితిని అర్వింద్ ఫౌండేషన్ దృష్టికి తీసుకెళ్లగా.. గురువారం ఫౌండేషన్ నిర్వహాకులు ధర్మపురి ప్రియాంక రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూర్యను పరామర్శించారు. సూర్య వైద్యానికి ఆసుపత్రిలో అయిన ఖర్చులో దాదాపు రూ.68 వేలు ఫౌండేషన్ నుంచి చెల్లించేందుకు ఏర్పాట్లు చేశా రు. కుమారుని అనారోగ్యం విషయంలో మానవతా దృక్పథంతో స్పందించిన అర్వింద్ ఫౌండేషన్ నిర్వహకులు, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు సూర్య తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. -
‘సారు..కారు..16’కు మద్దతు
పంజగుట్ట: టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, నిరుపేదలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అములు చేస్తోందని సినీనటుడు, ‘మనంసైతం’ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ అన్నారు. ‘చిన్న సారు.. కారు.. 16’ లక్ష్యంగా తాము సైతం టీఆర్ఎస్కు సహకారం అందిస్తామని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న ముగ్గురి కుటుంబాలకు గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థికసాయం అందించారు. ఈ సంరద్భంగా కిరణ్ మాట్లాడుతూ.. తన 35 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, పేదరికం నుండి పైకి వచ్చానన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమన్నారు. బెల్లంపల్లిలో ఓ రైతు భూమిని వీఆర్ఓ అక్రమంగా లాక్కుంటే వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి అప్పటికప్పుడు బాధితుడికి సాయం చేశారని, పేదవారు ఇబ్బందుల్లో ఉంటే ఎలా స్పందిస్తారో సీఎం స్వయంగా చూపించారన్నారు. తమ వంతు బాధ్యతగా 16 లోక్‌సభ స్థానాల్లో ప్రచారం నిర్వహించి టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫిలిం ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్రావు(బందర్ బాబీ), జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అనిల్ వల్లభనేని, సురేష్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా, వరంగల్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు బొట్టుపల్లి రాజ్‌కుమార్ కొడుకు సోమేశ్వర్ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ తీవ్రంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. వాచ్‌మెన్‌గా జీవనం కొనసాగిస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పుల్లయ్యకు, ఇటీవలే భార్య చనిపోయి, తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న డ్రైవర్ నాగేశ్వర రావుకు ఈ సందర్భంగా కిరణ్ ఆర్థిక సాయం అందించారు. -
అసహాయుల్లో అక్షర కాంతులు
మెరుపు మెరిస్తే.. వాన కురిస్తే.. ఆకసమున హరివిల్లువిరిస్తే.. అది తమ కోసమేనని సంబరపడే చిరుప్రాయం వారిది. చిట్టిచిట్టి మాటలు, బుడిబుడి అడుగులతో అలరించే ఆనందలోకం వారిది. కానీ బుద్ధిమాంద్యం వారి పాలిట శాపంలా మారింది. చదువుకునే వయసొచ్చినా అక్షరజ్ఞానం పొందలేని దయనీయ స్థితి. ఇలాంటి ఎంతోమందిని తన శిక్షణతో విద్యావంతులుగా తీర్చిదిద్ది.. రెండు దశాబ్దాలుగా వారి జీవితాల్లో అక్షరకిరణాలు ప్రసరింపజేస్తున్నారు ప్రముఖ సామాజిక కార్యకర్త శ్రీదేవి. బుద్ధిమాంద్యుల జీవితాల్లో ఘనీభవించిన చీకటి తెరలను తొలగిస్తున్నారు. శంకర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ స్థాపించి 20 ఏళ్లుగా బుద్ధిమాంద్యులకు విద్యాగంధాన్ని అద్దుతున్నారు. ఇలా ఇప్పటివరకు ఇక్కడ అక్షరాలు నేర్చుకున్న ఎంతోమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. తమకు నచ్చిన ఉపాధి మార్గాలను ఎంచుకున్నారంటే ఇది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. బుద్ధిమాంద్యం పిల్లల తల్లిదండ్రుల భాగస్వామ్యంతో సేవా తత్పరతను చాటుతున్నారు శ్రీదేవి. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న ఆమె తనఅనుభవాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. సాక్షి, సిటీబ్యూరో : సైకాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత బుద్ధిమాంద్యులైన పిల్లలకు చదువు చెప్పడం కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థల్లో చేరాను. కానీ ఏ సంస్థలోనూ వారికి కొద్దిపాటి అక్షర జ్ఞానం నేర్పిస్తే చాలు ఎంతో గొప్పగా భావించేవారు. బుద్ధిమాంద్యత పిల్లలు ఎప్పటికీ బాగా చదవలేరు. రాయలేరు అనే భావన ఉండేది. వారి కోసం ప్రత్యేక కరిక్యులం రూపొందించి చదివిస్తే అద్భుతాలు చేయవచ్చనిపించింది. ఈ క్రమంలో ఎంతో ఘర్షణకు గురయ్యాను. దీంతో ఏ సంస్థలోనూ మనస్ఫూర్తిగా పని చేయలేకపోయాను. బుద్ధిమాంద్యులకు చదువు చెప్పేందుకు ప్రత్యేక శిక్షణ కోసం లండన్‌కు వెళ్లాను. ఎక్వల్ రాబర్ట్ అనే నిపుణురాలి వద్ద శిక్షణ తీసుకున్నాను. కొంతకాలం లండన్‌లో ఉన్నా. ఆ తర్వాత మా కుటుంబ సభ్యులు స్థాపించిన శంకర్ ఫౌండేషన్ కేంద్రంగా నా కార్యాచరణ ప్రారంభించాను. ఎక్వల్ రాబర్ట్ గైడెన్స్, తల్లిదండ్రుల ప్రోత్సాహం నాకెంతో ఉపకరించింది. మొదట 100 మంది పిల్లలను పదో తరగతి పరీక్షలు రాయించాను. ఇందుకు చాలా కాలమే పట్టింది. ఈ 20 ఏళ్లలో 500 మందికిపైగా పిల్లలు పదోతరగతి, ఇంటర్, డిగ్రీ కోర్సులు పూర్తి చేశారు. ఫిజియోథెరపిస్టులుగా, హార్డ్‌వేర్ నిపుణులుగా, డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా పని చేస్తున్నవాళ్లూ ఉన్నారు. ఈ విజయం నాకు గొప్ప సంతృప్తినిచ్చింది. మూడు అనుబంధ సంస్థలతో ఉపాధి.. శంకర్ ఫౌండేషన్ ద్వారా విద్యనభ్యసించిన వాళ్లకు వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా తల్లుల కమిటీలను కూడా ఏర్పాటు చేసి భాగస్వాములను చేశాం. బేగంపేట్ కేంద్రంగా ‘శ్రద్ధ సబూరి’ పని చేస్తోంది. ఇక్కడ రకరకాల థెరపీలు, ఆక్యుపంక్చర్ వంటి చికిత్సలు అందజేస్తున్నాం. పేపర్ ప్లేట్లు, కోల్డ్‌ప్రెస్ ఆయిల్, సబ్బులు, జ్యూట్ బ్యాగులు వంటివి తయారు చేసి విక్రయించడం ద్వారా పిల్లల నుంచి వారి కుటుంబాలకు ఆదాయం అందుతోంది. ఖైరతాబాద్ కేంద్రంగా ‘సమర్థ సహకార్’ పని చేస్తోంది. ఇది కూడా ఒక స్థాయి ఉపాధి శిక్షణ కేంద్రమే. కోహెడలో బుద్ధిమాంద్యులైన వారి తల్లిదండ్రులు, కుటుంబాలతో కలిసి ఉండేవిధంగా ‘సన్నిధి సాంత్వన’ ఏర్పాటు చేశాం. ఇది ప్రత్యేక వసతులతో కూడిన గృహ సముదాయం. బుద్ధిమాంద్యులైన పిల్లల కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ప్రత్యేక కరిక్యులమ్‌ను రూపొందించి చదివిస్తున్న సంస్థ మాది. ఫలితాలు కూడా అలాగే లభిస్తున్నాయి. -
పదవి లేకున్నా శంకుస్థాపనలు చేస్తున్న మంత్రి తనయుడు
పశ్చిమగోదావరి, పోడూరు: రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి పితాని సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంట నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది. ఏ పదవీ లేకున్నా మంత్రి పితాని తనయుడు వెంకట్ నియోజకవర్గంలో ప్రభుత్వం తలపెట్టిన పనులకు శంకుస్థాపనలు చేసేస్తున్నారు. పోడూరు మండలం తూర్పుపాలెంలో ఇటీవలే బీసీ కమ్యునిటీ హాలు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ భవనం నిర్మాణానికి ప్రభుత్వ నిధులు రూ.10 లక్షలు మంజూరయ్యాయి. పెనుగొండ మండలం ఇలపర్రు గ్రామంలో కూడా మంత్రి తనయుడు వెంకట్ ఇటీవల ఎస్సీ కమ్యునిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏహోదా లేకుండానే.. సాధారణంగా ప్రభుత్వ నిధులతో ప్రభుత్వశాఖల పర్యవేక్షణలో చేపట్టే ఏ అభివృద్ధి పని నిర్మాణ పనులకైనా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను ప్రజాప్రతినిధుల హోదాలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల హోదాలో ఉన్నవారు చేస్తారు. అయితే దీనికి భిన్నంగా కొన్నిచోట్ల మంత్రి తనయుడు శంకుస్థాపనలు నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. తూర్పుపాలెంలో మంత్రి తనయుడు నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శి , ఐకేపీ సిబ్బంది హాజరయ్యారు. పనులు మాత్రం పూర్తి కావడం లేదు అలాగే 10 ఏళ్ల కిందట పెనుగొండ మండలం వెంకట్రామపురంలో కూడా ఎస్సీ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి మంత్రి తనయుడు వెంకట్ శంకుస్థాపన నిర్వహించగా ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. అప్పటి నుంచి భవన నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి పితాని దగ్గరకు తిరగడానికి దాదాపుగా రూ.25 వేలు ఖర్చయ్యాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌కుఫిర్యాదు చేసే యోచనలో ప్రతిపక్షం మంత్రి తనయుడు వెంకట్ ఇలపర్రు, వెంకట్రామపురంలో ఎస్సీ కమ్యూనిటీ హాలు నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించడంపై పెనుగొండ మండల వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ కన్వీనర్ బళ్ల శ్రీను(బద్రి) ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని ఇటీవల పత్రికా విలేకరుల సమావేశంలో పేర్కొన్న సంగతి విదితమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధుల చేతులమీదుగా జరగాల్సిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల మీదుగా జరపడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వంతపాడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అఫ్గానిస్తాన్‌లో లైబ్రరీ ఎందుకు?
వాషింగ్టన్: అంతర్యుద్ధంతో అతలాకుతలమైన అఫ్గానిస్తాన్‌లో భద్రతను పట్టించుకోకుండా భారత ప్రధాని మోదీ అక్కడ లైబ్రరీ స్థాపనకు సాయం చేశారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హేళన చేశారు. అఫ్గాన్ భద్రతకు భారత్ సహా ఇతర దేశాలు చేయాల్సినంతగా చేయలేదని విమర్శించారు. అఫ్గానిస్తాన్‌కు బలగాలు పంపాలని అమెరికా తరచూ ఒత్తిడి చేస్తున్నా భారత్ తిరస్కరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అఫ్గానిస్తాన్‌లో భారత్ చేపట్టిన అభివృద్ధి పనుల్ని అమెరికా అధ్యక్షుడు పరిహసిస్తూ వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ట్రంప్ ఏ లైబ్రరీ ప్రాజెక్టును ఉద్దేశించి పై వ్యాఖ్యలు చేశారో తెలియరాలేదు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో అఫ్గానిస్తాన్ భద్రతకు చేస్తున్న ఖర్చుపై మాట్లాడుతూ ట్రంప్..భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించారు. ‘ మోదీని కలిసినప్పుడు అఫ్గానిస్తాన్‌లో లైబ్రరీ నిర్మిస్తున్నానని పదేపదే చెప్పారు. మోదీ లాంటి నాయకులు అఫ్గానిస్తాన్ అభివృద్ధికి ఎంతో ఖర్చు చేశామని చెబుతున్న మొత్తం మనం చేస్తున్న వ్యయం కన్నా చాలా తక్కువ. ఆ లైబ్రరీని ఆ దేశంలో ఎవరైనా వినియోగిస్తున్నారా? నాకైతే తెలీదు. అయినా లైబ్రరీ ఏర్పాటుచేసినందుకు మనం భారత్‌కు ధన్యవాదాలు చెప్పాల్సి వచ్చింది. మనం అక్కడ ఐదు గంటలకు చేసే ఖర్చుతో ఆ లైబ్రరీ సమానం’ అని ట్రంప్ వెటకారంగా అన్నారు. ట్రంప్ వ్యాఖ్యల్ని భారత విదేశాంగ శాఖ కొట్టివేసింది. భారత్ చేస్తున్న సాయం ఆ దేశ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపింది. అఫ్గాన్ ప్రజల అవసరాల మేరకు పలు మౌలిక ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల్ని అమలుచేస్తున్నామంది. లాటరీకి ముగింపు పలకాలి ప్రతిభ, నైపుణ్యం ఉన్నవారికే అమెరికా తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఆ ట్రంప్ స్పష్టం చేశారు. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో కొన్ని లొసుగులు ఉన్నాయని వాటిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. లాటరీ విధానంలో వీసాలు ఇవ్వడం సరికాదని.. దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. -
ప్రకృతి వ్యవసాయంలో వరి, మిరప సాగుపై 11న శిక్షణ
గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి, మిరప సాగుపై ఈ నెల 11వ తేదీన ఉ. 10 గం.ల నుంచి సా. 5 గం.ల వరకు నాగర్‌కర్నూలుకు చెందిన సీనియర్ రైతు శ్రీమతి లావణ్యా రమణారెడ్డి, గుంటూరు జిల్లా రైతు శివనాగమల్లేశ్వరరావు శిక్షణ ఇస్తారు. కషాయాలు, మిశ్రమాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తారు. పేర్ల నమోదుకు, వివరాలకు.. 83675 35439, 97053 83666. -
‘అన్నం’కు ‘సాయిస్ఫూర్తి’ విరాళం
సత్తుపల్లి : జిల్లా కేంద్రంలో అన్నం సేవా ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై సత్తుపల్లి మండలం గంగారం సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం, సాయిస్ఫూర్తి స్టూడెంట్స్ సేవా సమితి బుధవారం రూ.లక్ష విరాళాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ అన్నం శ్రీనివాసరావుకు అందించారు. అన్నం ఫౌండేషన్‌లో కళ్లులేని, మూగవారికి, వికలాంగులకు, మతిస్థిమితం లేనివారికి, వయోవృద్ధులు, పక్షవాతం, పైలేరియా వ్యాధులతో బాధపడుతున్న అనాథలకు అందిస్తున్న సేవల కోసం విరాళాన్ని అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు దిలీప్, రఘువంశీ, దివ్య, నవ్య, నాగరాజు, మానస, షణ్ముఖరెడ్డి, అన్నం సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. -
తొమ్మిదినెలల బిడ్డకు గ్లకోమా శస్త్రచికిత్స
గోపాలపట్నం(విశాఖపశ్చిమ): శంకర్‌ఫౌండేషన్ కంటి ఆస్పత్రి వైద్యులు మరో మారు సాహసోపేత శస్త్రచికిత్స చేశారు. తొమ్మిది నెలల బిడ్డకు రెండు నేత్రాలకూ అరుదైన శస్త్రచికిత్స జరిపి ప్రశంసలందుకున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం జగన్నాథపురం గ్రామానికి చెందిన నడుపూరు నాగేశ్వరరావు, దేవి దంపతులకు తొమ్మిది నెలల చిన్నారి గగనప్రియ ఉంది. నెల రోజుల క్రితం గగన ప్రియ రెండు కళ్లలో నల్లగుడ్డును కప్పేస్తూ తెల్లపొరలు కమ్ముకొస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అక్కడి వైద్యులను సంప్రదించారు. విశాఖనగరం వేపగుంట శంకర్‌ఫౌండేషన్ కంటి ఆస్పత్రిలో ఈతరహా వైద్యం అందుబాటులో ఉందని అక్కడి వైద్యులు సూచించారు. గగనప్రియను ప్రముఖ డాక్టర్ రవీంద్ర వైద్యబృందంతో పరిశీలించారు. రెండు కళ్లకూ కంజెంటల్ గ్లకోమా వచ్చినట్లు వెల్లడించారు. ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ మణిమాల స్పందించారు. ఇక్కడ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఈబిడ్డకు రెండుకళ్లకూ శస్త్రచికిత్స చేయాలంటే ఆషామాషీ కాదు. ఇటీవల శస్త్రచికిత్సకు అన్ని ఏర్పాట్లూ చేసే సరికి ఆ బిడ్డకు జ్వరం సోకింది. దీంతో ఆపరేషన్ వాయిదా వేసి పరిశీలనలో ఉంచారు. ఇలా గగన ప్రియ ఆరోగ్యం సహకరించడంతో శుక్రవారం డాక్టర్ రవీంద్ర బృందం శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ విజయవంతమైంది. ఆయన కృషిని మదనమాల, ఏజీఎం వడలి రమేష్‌కుమార్ ప్రశంసించారు. కౌన్సిలర్ అనురాధను కూడా అభినందించారు. సాహసమే చేశాం తొమ్మిది నెలల బిడ్డకు అదీ రెండు కళ్లకూ కంజెంటల్ గ్లకోమా శస్త్రచికిత్స సాహసంగానే చే శాం. టైలర్ నాగేశ్వరరావుకు పెద్ద మొత్తంలో ఈచికిత్స చేయించే స్తోమత లేని తరుణంలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స ఉచితంగా చేశాం. ఇక్కడ తప్పితే చెన్నైకో, హైదరాబాద్‌కో వెళ్లి ఆపరేషన్ చేయించాలి.–డాక్టర్ రవీంద్ర -
విశ్వ శాంతి ప్రారంభం
ఏదైనా మంచి పని స్టార్ట్ చేయటానికి మంచి రోజు కోసం వెతుకుతాం. మోహన్‌లాల్ కూడా ఒక మంచి పనిని తన బర్త్‌డే రోజే స్టార్ట్ చేశారు. మోహన్‌లాల్ బర్త్‌డే మే 21న. తన బర్త్‌డే సందర్భంగా విశ్వ శాంతి ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నట్టు మోహన్ లాల్ తెలిపారు. పేదలకు సహాయం చేయాలనే మంచి ఆలోచనతో ఈ ఫౌండేషన్ మొదలుపెట్టారట మోహన్‌లాల్. ఈ ఫౌండేషన్, దాన్ని మొదలు పెట్టాలనే ఆలోచన గురించి మోహన్‌లాల్ మాట్లాడుతూ – ‘‘నా బర్త్‌డే రోజు నేను ఎక్కువగా మా తల్లిదండ్రుల గురించే ఆలోచిస్తుంటాను. విశ్వ శాంతి పేరుని మా అమ్మా నాన్న పేర్ల (విశ్వనాధన్ నాయర్, శాంతకుమారి) నుంచి తీసుకున్నాను. నా ఫ్యాన్స్, నా వెల్ విషర్స్ అందరూ ఈ ఫౌండేషన్‌లో భాగం అవ్వండి. అదే మీరంతా నాకిచ్చే బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్’’ అని పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన
-
పీఎస్ భవన నిర్మాణానికి మంత్రి శంఖుస్థాపన
రామగుండం : అంతర్గాం మండల కేంద్రంలో నూతన పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణ పనులను గురువారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ప్రత్యేక చొరవతో రూ.1.50 కోట్ల నిధులతో నూతన భవన నిర్మాణానికి కేటాయించారు. రామగుండం కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్, ఏసీపీ రక్షిత కె.మూర్తి, డీసీపీ సుదర్శన్‌గౌడ్, హోంమంత్రికి స్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఐజీ నాగిరెడ్డి, రామగుండం సీఐ సాగర్, ఎస్సై శీలం ప్రమోద్‌రెడ్డి, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, తహసీల్దార్ పుప్పాల హన్మంతరావు, గ్రామ సర్పంచులు శశికళ, పద్మ, ఎంపీటీసీ పద్మ, రాజయ్య, వైస్ ఎంపీపీ పవన్, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గౌరవ వందనం స్వీకరించిన నాయిని.. పాలకుర్తి : హోంమంత్రికి గురువారం పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌లో కేశోరాం ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అంతర్గాంలో నూతనంగా నిర్మించనున్న పీఎస్ నిర్మాణం ప్రారంభోత్సవానికి వచ్చిన హోంమంత్రి కేశోరాం అతిథి గృహంలో బస చేశారు. కాగా ప్లాంట్ హెడ్ రాజేశ్‌గర్గు, మేనేజర్ కేఎన్‌రావులు ఆయనకు స్వాగతం పలికారు. అంతకుముందు ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌లున్నారు. మంత్రికి ఘన స్వాగతం.. జ్యోతినగర్ : మంత్రి నాయిని ఎన్టీపీసీ పీటీఎస్ అతిథి గృహంలో పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. గురువారం ‘ఖని’లో పలు శంకుస్థాపనల నేపథ్యంలో ఎన్టీపీసీ రామగుండం పీటీఎస్ జ్యోతిభవన్ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు పోలీసులు గౌరవందనం చేశారు. ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగ గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి హోంమంత్రికి స్వాగతం పలికారు. సారయ్య, సత్యనారాయణ, రమేశ్‌బాబు, గట్టయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశం గౌడ్‌కు పీటీఎస్ అతిథి గృహంలో పెద్దపల్లి అభివృద్ధి ఫోరం అధ్యక్షుడు పెద్దం పేట శంకర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం తెలిపారు. చెన్న య్య, డాక్టర్ విజయభాస్కర్, సింగం సత్త య్య, పలువురు గౌడ సంఘం ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
గోదాములకు మంత్రి హరీశ్ భూమి పూజ
సాక్షి, నల్లగొండ : జిల్లాలోని కేతేపల్లి మండలం ఇప్పలగూడెంలో 3 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములకు మంత్రి హరీశ్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నల్లగొండ జిల్లాలో ఎక్కడ చూసిన ధాన్యం రాశులే కన్పిస్తున్నందుకు చాలా ఆనందగా ఉంది. జిల్లా ధాన్యం కొనుగోల్లలో నంబర్ వన్ స్థానంలో ఉంది. డిండి ప్రాజెక్టులో నీళ్లు లేకున్నా కల్వకుర్తి నుంచి నీరిచ్చాం. సాగర్ కింద వారబందితో రైతులకు నీరందించాం. తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారు. సాగు చేసే ప్రతి రైతుకు పెట్టుబడి పథకాన్ని అమలు చేస్తాం. మరికొద్ది రోజుల్లో ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద రైతులకు సాగు నీరు ఇస్తాం. నకిరేకల్‌లో నెల రోజుల్లో నిమ్మ మార్కెట్ ప్రారంభిస్తాం. నల్లగొండలో బత్తాయి మార్కెట్ పనులు పూర్తయ్యాయి, దాన్ని కూడా త్వరలో అందుబాటులోకి తెస్తాం’ అని అన్నారు. -
పవన్..నువ్వు సాధించావ్..
సాక్షి,సిటీబ్యూరో: నలుగురినీ సంతోష పెట్టాలనే గొప్ప సంకల్పంతో ముందుకు సాగే బ్లేడ్ రన్నర్ పవన్ నేటి సమాజంలోని ఎంతోమందికి స్ఫూర్తి అని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో బ్లేడ్ రన్నర్ పవన్ కుమార్ ఫౌండేషన్‌ను ఆయని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. తల్లిదండ్రులను పిల్లలు ఓ ఏటీఎంలా చూస్తున్న రోజులివని, కానీ ఇండియన్ ఫస్ట్ బ్లేడ్ రన్నర్ చల్లా పవన్ విధివంచితుడైనా తల్లిదండ్రులను ఎంతో గౌరవంగా చూసుకుంటూ వారికి కీర్తి వచ్చేలా ఫౌండేషన్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత అరుణిమ సివ్హా, పవన్ తల్లిదండ్రులు చల్లా పవన్ కుమార్, గాయత్రి, వంశీ రామరాజు, డాక్టర్ దంటు నాగార్జున శర్మ, పద్మప్రియ, డాక్టర్ కొత్త క్రిష్ణవేణి పాల్గొన్నారు. -
వారికి దీపిక ఇచ్చే సలహా
ఒత్తిడి, ఉరుకులు, పరుగుల జీవితం. శారీరక ఆరోగ్యాన్ని పట్టించుకునేందుకే తీరకలేకుండా పోతున్నకాలం ఇది. ఇక మానసిక ఆరోగ్యం గురించి ఏం ఆలోచిస్తాం. ఫలితంగా కోపం, అసహనం, నిరాశ, నిస్పృహలకు లోనవడంవంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికి మన దేశంలో మానసిక ఆరోగ్యాన్ని ఒక ప్రత్యేక అంశంగా పరిగణించము. అసలు మానసిక సమస్యలతో బాధపడుతున్నామని కూడా మనలో చాలామంది గుర్తించలేరు.. ఒక వేళ గుర్తించినా బయటకు చెప్పుకోలేరు. ఈ మౌనాన్ని చేధించి, మానసిక ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణ్ ‘ది లవ్, లీవ్, లాఫ్’ ఫౌండేషన్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ ఫౌండేషన్ మానసిక ఆరోగ్యంపట్ల దేశ ప్రజలకు ఏ మేరకు అవగాహన ఉందనే అంశం గురించి ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడమే కాకుండా ఆ సమస్యలను పై పోరాడటానికి కావాల్సిన సహాయ సహకారాలను అందించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ నివేదిక విడుదల చేసిన సందర్భంగా దీపికా మాట్లాడుతూ 'నేను ఒకప్పుడు డిప్రెషన్‌తో బాధపడ్డాను. ఆ సమయంలో చాలా మారిపోయాను. కారణం లేకుండా ఏడ్చేదాన్ని. ఒంటరిదాన్నని భావించేదాన్ని. ఆ విషయాన్ని నేను నా సన్నిహితులతో పంచుకున్నాను. వారి ప్రేమ, వైద్యుల సహాకారంతో ఆ సమస్య నుంచి బయటపడ్డాను. ఆ సమయంలోనే ఇలాంటి ఓ ఫౌండేషన్‌ను స్థాపించి ప్రజలకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని అనుకున్నాను. మనలో చాలామంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. కానీ బయటకు చెప్పుకోరు. అందుకు కారణం ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని. కానీ ఇందులో దాచిపెట్టి ఉంచాల్సిందేమి లేదు. ముందు మనలో జరుగుతున్న మార్పులను మనమే అర్థం చేసుకోవాలి. అందరితో చెప్పుకోక పోయినా మనల్ని నమ్మే వారి దగ్గర మన సమస్యను చెప్పుకోవాలి. అక్కడికే సగం సమస్య తీరుతుంది. ఆ తర్వాత దానికి తగిన చికిత్స తీసుకుంటే సరిపోతుంది. ఈ ఫౌండేషన్ తరుపున పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను స్వయంగా ఈ సమస్యను ఎదుర్కొన్నాను. ఆ తర్వాతే నేను నా ఆలోచనలు, భావాలు, భావోద్వేగాల గురించి మరింత అవగాహన పెంపొందించుకున్నాను. కేవలం నా గురించి మాత్రమే కాదు నా చుట్టూ ఉన్న వారి గురించి కూడా అవగాహన పెంపొందించుకున్నాను. డిప్రెషన్‌తో బాధపడుతున్నవారికి నేను ఇచ్చే సలహ ఏంటంటే ‘నేను దీన్ని ఎదుర్కొన్నాను, నాకు దీని గురించి తెలుసు, దాని నుంచి కోలుకోవచ్చు. కాబట్టి వదిలివేయకండి ప్రయత్నిస్తూనే ఉండండి స్టీఫేన్ ఫ్రై చెప్పినట్లు ఏదో ఒక రోజు ఆహ్లాదంగా ఉంటుంది’ అని దీపికా సలహా ఇచ్చారు. -
నిత్యాన్నదాత
అన్నార్థుల ఆకలి తీరుస్తున్నాడు. వారున్న చోటకే వెళ్లి ఆహారంఅందిస్తున్నాడు. నేనున్నానంటూ నిరాశ్రయులు, అనాథలకు భరోసా ఇస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు విద్యార్థి ఎండీ సుజాతుల్లా. బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని సుల్తాన్ ఉల్ ఉలూం ఫార్మసీ కళాశాలలో ఫార్మా–డీ చదువుతున్న ఎండీ సుజాతుల్లా(24) సేవా కార్యక్రమాల్లో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సమాజసేవలో మమేకమవుతూ సేవా దృక్పథాన్ని చాటుతున్నాడు. ప్రతిరోజు ఉదయం 2వేల మందికి అల్పాహారం అందజేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ఏకంగా ఏడాదిన్నరగా నిర్విరామంగా ఈ కార్యక్రమం కొనసాగిస్తూ నిత్యాన్నదాతగా మారాడు. ముషీరాబాద్‌కు చెందిన సుజాతుల్లా ఈ కళాశాలలోనే బీ–ఫార్మసీ పూర్తి చేశారు. మలుపు తిప్పిన సబ్జెక్టు... సుజాతుల్లా బీ–ఫార్మసీ మూడో సంవత్సరంలో ఒక సబ్జెక్టు తప్పాడు. అందులో పాస్ అయితే 10 మందికి భోజనం పెడతానని దేవుడికి మొక్కుకున్నాడు. మొత్తానికి ఆ సబ్జెక్టులో పాస్ అయ్యాడు. ఆ తెల్లవారే ఓ హోటల్లో పది మందికి భోజనం ప్యాక్ చేసుకొని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిరాశ్రయులకు అందించేందుకు వెళ్లాడు. అయితే 50 మంది వరకు వచ్చి మాకు కూడా ఇవ్వవా.. అంటూ అర్థించారు. ఇంతమంది ఆకలితో ఉంటున్నారా? అని ఆయన మనసు కలిచి వేసింది. మరుసటి రోజు కూడా పది అన్నం ప్యాకెట్లు తీసుకెళ్లి అక్కడే పంపిణీ చేశాడు. అప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురైంది. ‘హ్యూమానిటీ ఫస్ట్’ స్థాపన... దీంతో యూఎస్ఏ, యూకేలలోని బంధుమిత్రులను సంప్రదించాడు సుజా తుల్లా. ‘మేం సహాయం చేస్తాం..’ రోజూ భోజనం పంపిణీ చేయమని వారు ప్రోత్సహించారు. అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సుజాతుల్లా ‘హ్యూమానిటీ ఫస్ట్’ ఫౌండేషన్ స్థాపించాడు. మొదట వారంలో నాలుగు రోజులు రాత్రిపూట వివిధ ఆస్పత్రుల వద్ద 150 మందికి భోజనం పంపిణీ చేసేవాడు. ఇక గత ఏడాదిన్నర కాలంగా ప్రతిరోజు ఉదయం 2వేల మందికి అల్పాహారం పంపిణీ చేస్తున్నాడు. వానొచ్చినా, వరదొచ్చినా ఈయన సేవా దృక్పథంలో ఏ మాత్రం మార్పు రాలేదు. తన తల్లిదండ్రులు, సుల్తాన్ ఉల్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవ కార్యదర్శి జాఫర్ జావెద్, ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్ అనుపమా కోనేరుల ప్రోత్సాహంతో ఈ సేవలు విజయవంతంగా కొనసాగిస్తున్నానని చెప్పారు సుజాతుల్లా. ఇదీ దినచర్య... ప్రతిరోజు తెల్లవారుజామునే టిఫిన్ బాక్సు ఆటోలో తీసుకొని కోఠిలోని మెటర్నిటీ ఆస్పత్రి, నీలోఫర్ ఆస్పత్రుల వద్దకు వెళ్తాడు. 9గంటల వరకు టిఫిన్ పంపిణీ చేస్తాడు. అనంతరం కాలేజీకి వెళ్తాడు. అల్పాహారం, భోజనానికి ప్రతిరోజు రూ.3,500 ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
మధుర క్షణం
రైల్వే స్టేషన్లలో.. రైలు బళ్లలో.. చిరిగిన బట్టలతో.. దుమ్ము పట్టిన జుట్టుతో దీనంగా జీవచ్ఛవాల్లా కదిలే వీధి బాలలను గుర్తు తెచ్చుకోండి. వారిలో చాలా మంది ఒకప్పుడు తమ ఇళ్లలో గారాల పట్టీగానో, ముద్దుల బాబుగానో నిండు కళతో తిరిగినవాళ్లే. ఇంటి మీద అలిగో, చదువు భారంతోనో, దారి తప్పో, ఇంకెవరి మీదో కోపంతోనో రైలెక్కేసి అమ్మ ఒడి వీడారు.. నాన్న వేలు వదిలారు. ఇంటి నుంచి పారిపోయి వీధి బాలలుగా మారారు. పలకా బలపం పట్టాల్సిన చేతులతో యాచించారు. చింపిరి జుట్టు.. చిరిగిన బట్టలతో.. చెత్త కుప్పలే లోగిళ్లుగా బతికారు. క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయంతో హాయిగా సాగాల్సిన వీరి బాల్య జీవితం.. అథోగతి పాలైంది. ఇలా తెగిన గాలిపటంలా సాగుతున్న వీరి జీవితాన్ని ‘సాథి’ సంస్థ దరికి చేర్చింది. వాళ్లను తిరిగి ఇంటికి చేర్చి 20 కుటుంబాల గుండె కోతను, వ్యథను తీర్చింది.అమ్మానాన్నలను హత్తుకున్న పిల్లలు... పిల్లలను చూసి ఉద్వేగంతో కన్నీరుపెట్టుకున్న తల్లిదండ్రులు.. వారి మధ్య ప్రేమ, ఆప్యాయతను చూసి మురిసిపోయిన అధికారులు, సంస్థ ప్రతినిధులు.. శనివారం బాలుర వసతి గృహం ప్రాంగణంలో భావోద్వేగ వాతావరణం కనిపించింది. ఆరిలోవ(విశాఖ తూర్పు): ప్రభుత్వ బాలుర గృహంలో సుమారు ఏడాదికిపైగా ఉంటున్న పిల్లలు శనివారం వారి తల్లిదండ్రుల చెంతకు చేరారు. తప్పిపోయిన తమ పిల్లలను చూసి.. వెంటనే హత్తుకుని తల్లిదండ్రులు ఆనందభాష్పాలు రాల్చారు. ‘సాథి’ సంస్థ ఆధ్వర్యంలో 20 మంది పిల్లలను కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఏడీసీపీ ఫకీరప్ప, రైల్వే డీఆర్ఎం ముకుల్ శరణ్ మాథూర్ సమక్షంలో వారి తల్లిదండ్రులను అప్పగించారు. విశాఖ రైల్వే స్టేషన్లో కనిపించిన వీధి బాలురు, ఇంటి నుంచి తప్పిపోయిన 26 మంది పిల్లలను సాథి సంస్థ గుర్తించింది. వీరిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ) అనుమతితో ముడసర్లోవ వద్ద ప్రభుత్వ బాలుర గృహంలో చేర్పించింది. ఏడాదిన్నర నుంచి వీరంతా ఇక్కడే వసతి పొందుతున్నారు. ఒడిశా, బిహార్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తదితర ప్రాంతాలకు చెందిన వీరి చిరునామాలను సాథి ప్రతినిధులు కనుగొని ఆయా రాష్ట్రాల పోలీసులను సంప్రదించారు. వీరి తల్లిదండ్రులను శనివారం ఇక్కడకు రప్పించి, పిల్లలను అప్పగించారు. ఏడాదికి పైగా దూరమైన పిల్లలు, వారి తల్లిదండ్రులు ఒకరినొకరు హత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు. పిల్లల కోసం చాలా చోట్ల వెతికామని.. మళ్లీ కలుస్తామనే ఆశ లేకుండా పోయిందని.. సాథి సంస్థ కృషితో మళ్లీ కలిసామంటూ కన్నీరు పెట్టుకున్నారు. కాగా.. బీజేపీ మహిళా మోర్చా నగర కన్వీనర్ మాధవీలత చార్లెస్ సహకారంతో ఒడిశాకు చెందిన పునిక్చాంద్ను కలెక్టర్ సమక్షంలో తల్లిదండ్రులను అప్పగించారు. పిల్లలను ప్రేమతో పెంచాలి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలను ప్రేమతో పెంచాలని తల్లిదండ్రులకు సూచించారు. వారి అవసరాలను తీరుస్తూ.. క్రమశిక్షణ నేర్పించాలన్నారు. కుటుంబ సభ్యులంతా ఆధార్ అనుసంధానం చేసుకోవాలన్నారు. దీనివల్ల తప్పిపోయిన పిల్లలను గుర్తించడం సులభమవుతుందన్నారు. పిల్లలను తల్లిదండ్రులను అప్పగించడానికి కృషి చేసిన సాథి సభ్యులను ఆయన అభినందించారు. ఏడీసీపీ ఫకీరప్ప మాట్లాడుతూ పిల్లలను ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారి తల్లిదండ్రులకు చేర్చడంలో పోలీస్ బందోబస్తు అందిస్తామన్నారు. రైల్వే డీఆర్ఎం ముకుల్ శరణ్ మాథూర్ మాట్లాడుతూ తప్పిపోయిన బాలురను సీడబ్ల్యూసీకి అప్పగించేవరకు.. సంరక్షణ కోసం స్టేషన్లో ప్రత్యేక వసతి సదుపాయం కల్పిస్తామన్నారు. సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ఆర్.శ్యామలరాణి, బాలుర గృహం సూపరింటెండెంట్ వీరయ్య, అబ్దుల్ రకీబ్, సాథి ప్రతినిధులు పాల్గొన్నారు. -
కొంచెం దృష్టి పెడదాం
... అంటున్నారు అమలా పాల్. ఏ విషయంపై దృష్టి పెడదామంటున్నారంటే ‘చూపు’పై. అర్థం కావడంలేదా? చూపు లేనివాళ్లకు చూపునిద్దాం అంటున్నారు. ఈ విషయం గురించి అమలా పాల్ మాట్లాడుతూ – ‘‘ఓ సంస్థకు చెందిన ఐ క్యాంపైన్ స్పీచ్‌కు రెడీ అవుతున్నప్పుడు కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ల మంది చూపులేక బాధపడుతున్నారని, అందులో ఎక్కువమంది ఇండియాలోనే ఉన్నారని తెలుసుకుని షాక్ అయ్యాను. నేత్రదానంపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు ఒక కారణమై ఉంటుందనిపించింది. అంతా సవ్యంగా ఉంటే ఏటా 40 వేలకుపైగా సర్జరీలు జరుగుతాయి. వారందరూ ఎంతో సంతోషంగా ప్రపంచాన్ని చూడగలరు.. చూపులేని వాళ్లు ఈ రంగుల ప్రపంచాన్ని చూసేందుకు మన వంతు సాయం చేద్దాం’’ అని అమలాపాల్ పేర్కొన్నారు. అంతేకాదు కళ్లను దానం చేసేందుకు ‘అమలహోమ్’ అనే ఫౌండేషన్‌ను కూడా స్టార్ట్ చేశారు. నేత్రదానం చేయాలనుకునేవాళ్లు ఈ ఫౌండేషన్‌ని సంప్రదించవచ్చు. కంటి ఆపరేషన్స్‌కి ఆర్థిక సహాయం అందజేయడానికి ఈ ఫౌండేషన్ కృషి చేయాలనుకుంటోంది. -
తెలంగాణలోనే పెద్ద‘పల్లి’
సాక్షి, పెద్దపల్లి/గోదావరిఖని: వ్యవసాయ, పారిశ్రామీకరణలో గణనీయ వృద్దిని సాధించి రాష్ట్రంలోనే ధనిక జిల్లాగా పెద్దపల్లి అవతరించబోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జోస్యం చెప్పారు. అంతర్గాం మండలం ముర్మూరు వద్ద రూ.80 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకానికి మంగళవారం సీఎం శంకుస్థాపన చేశారు. లిఫ్ట్‌ల నిర్మాణానికి సంబంధించి అధికారులు మ్యాప్ ద్వారా సీఎంకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చే నీళ్లతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎండిపోవడమనేది జరగదన్నారు. గోదావరి నది జలకళను సంతరించుకొంటుందదన్నారు. ఫలితంగా ఈ ప్రాంతం సుభిక్షంగా మారబోతుందన్నారు. ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల ప్రాజెక్ట్‌లో భాగంగా, 1600 మెగావాట్ల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మరో 2400 మెగావాట్ల నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. ఓ వైపు వ్యవసాయం, మరో వైపు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ, రాష్ట్రంలోనే పెద్దపల్లి ధనిక జిల్లాగా ఏర్పడబోతుందన్నారు. కాగా ముర్మూరు ఎత్తిపోతల పథకాన్ని ఐదు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. 136 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా, అక్కడి నుంచి 32 కిలోమీటర్ల దూరం బ్రాంచి కాలువ ద్వారా, మరో 16 కిలోమీటర్ల దూరం పిల్ల కాలువ ద్వారా సాగునీళ్లు ఈ ప్రాంతానికి రాని పరిస్థితి ఏర్పడిందన్నారు.ఎల్లంపల్లి ప్రాజెక్టు చెంతనే ఉన్నా రామగుండంలోని వ్యవసాయ భూములకు సాగునీరు రావడం లేదనే ఈ పథకానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. రెండు లిఫ్ట్‌లతో పాటు, మూడో లిఫ్ట్‌కు కావాల్సిన రూ.12 కోట్లు కూడా ఇస్తామన్నారు. ఈ పథకంతో దాదాపు 20 గ్రామాలకు లబ్ధి చేకూరుతుందని, 22 వేల ఎకరాలకు సాగునీళ్లు అందుతాయన్నారు. ప్రారంభోత్సవానికి మళ్లీ వస్తా... రామగుండం ఎత్తిపోతల పథకాన్ని శంఖుస్థాపన చేసిన తాను తిరిగి, ప్రారంభోత్సవానికి కూడా వస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ పథకం త్వరగా పూర్తి కావాలంటే అక్కడక్కడ కొంత స్థలం అవసరముంటుందని, దానిని ప్రభుత్వానికి అప్పగించేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ ప్రాంతం తొందరగా బాగుపడాలనేది తన ఆకాంక్ష అన్నారు. ఎమ్మెల్యే గ్రూప్ జోష్ సీఎం కే సీఆర్ సభలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణపై ప్రశంసలు కురిపించడంతో ఆయన వర్గీయులు సంబరాల్లో మునిగిపోయారు. రామగుండంలో వర్గపోరు, ఆశావాహులు అధికంగా ఉన్న ‘ప్రత్యేక’ పరిస్థితుల్లో, స్వయంగా గులాబీ బాస్ బహిరంగంగా పొగడడంతో వారు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ‘ఇగ దుకాణాలు బంద్’ అంటూ వ్యాఖ్యానిస్తూ, ఎమ్మెల్యేకు అనుకూలంగా నినాదాలతో హోరెత్తించారు. ఆర్టీసీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీలు కె.కేశవరావు, బాల్క సుమన్, జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ప్రభుత్వ సలహదారు డాక్టర్ జి.వివేక్, పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, టీఎస్టీఎస్ చైర్మన్ చిరుమల్ల రాకేశ్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, కలెక్టర్ శ్రీదేవసేన, పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్, రామగుండం మేయర్ కొంకటి లక్ష్మినారాయణ, మాతా, శిశు సంక్షేమ శాఖ రీజినల్ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ఎంపీపీ ఆడెపు రాజేశం, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నిన్ను నువ్వు నమ్ముకో
దైవం కొందరికి ఆలంబన. మనిషిని ఆలంబన చేసుకోవాలి అంటారు ఏబీకే. దైవం మానసికం. మనిషికి హేతువు ఉండాలి అంటారు ఏబీకే. ప్రగతిశీల భావజాలాన్ని ఆదరించే ఈ జగమెరిగిన జర్నలిస్టుతో ఈవారం ‘నేను – నా దైవం’ ప్రముఖ పాత్రికేయులు ఎ.బి.కె ప్రసాద్ తెలుగునాట సుపరిచితులు. కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి. ఎనిమిది పదులు దాటినా ఇప్పటికీ రచనా వ్యాసాంగమే ఊపిరిగా జీవిస్తున్నారు. అరవై ఏళ్ల పాత్రికేయ జీవితాన్ని చవిచూసిన ఆయన మనోఫలకంలో దైవం భావం ఎలా ఉందో తెలుసుకుందామనిపించింది. హైదరాబాద్ కొండాపూర్‌లోని సి.ఆర్.ఫౌండేషన్‌లో ఉంటున్న ఆయన వద్దకు వెళ్లాం. ‘ఇప్పుడే లంచ్ ముగించుకొని వచ్చాను. మీరు భోజనం చేసి వచ్చారా..?’ అని ఆప్యాయంగా పలకరించారు. విషయం చెప్పి, దైవం గురించి అడిగినప్పుడు ‘అస్సలు నమ్మకం లేదం’టూ ఎన్నో విషయాలను ఇలా ముందుంచారు. దైవాన్ని నమ్మను అంటున్నారు. మీకు ఈ నాస్తిక భావాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఉండటం మూలంగానే. మా మేనమామ ఇన్ఫ్లూయెన్స్ కూడా నా మీద ఉంది. దైవం అనేది ఎవరికి వారికి ఓ నమ్మకం. ఆలంబనగా ఎంచుకునే అంశం. నాకా నమ్మకం లేదు. మా పూర్వీకులు శైవ సంప్రదాయాన్ని అనుసరించేవారు. మా అమ్మ చంద్రావతి భక్తురాలు. పూజలు బాగా చేసేది. ఆమె పూజ చేస్తూ నన్నూ తన దగ్గర కూర్చోమనేది. గుళ్లకు తీసుకెళ్లేది. చెప్పినట్టు చేయకపోతే దేవుడు కోప్పడతాడు అనేది. పదేళ్ల వయసు వరకు ఆమె చెప్పినట్టు చేసుంటాను. ఆ తర్వాత ఎప్పుడూ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న గుర్తు కూడా లేదు. ఎంత నాస్తికులైనా ఈ ప్రకృతిని ఏదో శక్తి నడుపుతుందని అంటారు. దీనికి మీరేమంటారు? రుగ్వేదంలో ‘ఈ విశ్వం అంతా దైవ సృష్టి’ అని ఉంటుంది. మరి ‘ఆ దేవుడిని సృష్టించిన వాడెవడు’ అని చాలామందిని అడిగాను ఎవరి దగ్గరా సమాధానం లేదు. వేదాల్లో దేవుడు అనే వాక్యాన్ని మేధావులు బాగా వంటపట్టించుకున్నారు కానీ, అదే రుగ్వేద సూక్తంలో ‘సర్వేజన సుఖినోభవంతు’ అనే సూక్తిని మాత్రం వదిలేశారు. ఈ సూక్తిని ‘దేవుడు’ అనేదానికి సమానంగా పట్టించుకుంటే ఇప్పటికీ కులాలు, మతాలు అంటూ సర్వజనులు కొట్లాడుకునే పరిస్థితి వచ్చేది కాదుగా! వివేకానందుడు ‘జబ్బు చేస్తే వెళ్లాల్సిది వైద్యుడు దగ్గరకు గానీ జ్యోతిష్యుడు, బాబాల వద్దకు కాదన్నా’డు. ‘మనిషి తన భవిష్యత్తుకు తనే నిర్ణయాధికారి’ అన్నాడు. మనమంతా బుద్ధుడి సూచనలు తీసుకోవచ్చు. ‘నిన్ను నువ్వు నమ్ముకో, నేను చెప్పినా సరే విశ్వసించకు. ఇంకొకడి మీద ఆధారపడకు’ అన్నాడు. రాహుల్ సాంకృత్యాన్ అనే వ్యాసకర్త నిత్య ప్రయాణికుడు. రచయిత. తత్త్వవేత్త. దేశవిదేశాలను సందర్శించాడు. ఆయనకు 60 భాషలు వచ్చు. 30 భాషలు అనర్ఘళంగా మాట్లాడగలడు. ‘నీ కృషి మీదనే నీ భవిష్యత్తు’ అని చాటి చెప్పిన వ్యక్తి. ఇలాంటి వాళ్లు ఎంతోమంది మన కళ్ల ముందే ఉన్నారు. కానీ, వీరిని మనం గుర్తించం. అదే దొంగబాబాలను, మూఢనమ్మకాలను పెంపొందించేవారిని ఇట్టే గుర్తిస్తాం, నమ్మేస్తాం. సామాజిక పూజా క్రతువులు, పండగలు, వ్రతాలు.. వగైరా వాటిల్లో పాల్గొనాల్సి వచ్చినప్పుడు మనసుకు విరుద్ధంగా ఉన్నామే అనే ఒత్తిడి ఉంటుంది. దీనిని ఎలా ఎదుర్కొన్నారు? ఈ విషయంలో ఒత్తిడి ఎప్పుడూ ఎదుర్కోలేదు. అలాంటి క్రతువులకు వెళ్లింది లేదు. కాకపోతే ఎవరైనా ప్రసాదం పెడితే కాదనను. మా ఇంట్లో కూడా పూజలు అంటూ నా పై ఎన్నడూ ఒత్తిడి తీసుకురాలేదు. పదేళ్ల క్రితం వరకు మా ఆవిడ పూజ చేసింది లేదు. ఎక్కడ మనసు చెదిరిందో పదేళ్లుగా పూజలు చేస్తోంది. నేను ఈ పనులు మానుకోమని చెప్పలేదు. సందర్భం వచ్చినప్పుడు తనే చెబుతుందని ఎదురుచూస్తున్నాను. ఐదేళ్ల క్రితం ఓ రోజు తిరుపతి తీసుకెళ్లమని పట్టుబట్టింది. నేనూ కాదనలేకపోయాను. తీసుకెళ్లాను. దర్శనానికి మాత్రం నేను వెళ్లలేదు. మీ పేరులోనే (అన్నె భవానీ కోటేశ్వర ప్రసాద్) దైవం ఉంది కదా! ఈ పేరు ఎలా వచ్చింది, మీ పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టారు? మా అమ్మకు పెళ్లయి పన్నెండేళ్లయినా సంతానం లేదట. దాంతో కనపడిన రాయికల్లా మొక్కి, ముడుపులు కట్టిందట. అలా ఒకసారి గుంటూరు జిల్లాలోని కోటప్పకొండకు వెళ్లి మొక్కుకుందట. ఆ ఏడాది నేను పుట్టానట. మా పూర్వీకులు అంతా శైవభక్తులు కావడంతో పార్వతీ మాత పేరు వచ్చేలా భవానీ అని, కోటప్పకొండ మొక్కు కాబట్టి కోటేశ్వర అని, వారిద్దరి ప్రసాదం కాబట్టి ప్రసాద్ అని వచ్చేలా పేరు పెట్టిందట. ‘మరి పెళ్లెందుకు చేసుకున్నావమ్మా, కోటప్పకొండకు వెళ్లి మొక్కుకుంటే సరిపోయేదిగా!’ అని ఓ రోజు అంటే తిన్న తిట్లు ఇప్పటికీ గుర్తే! నాకు ముగ్గురు కూతుళ్లు ‘హేమలత, విశ్వభారతి, స్వర్ణలత’... ఇవన్నీ వాడుకలో ఉన్న పేర్లే! జీవితంలో ఏదో వీక్ మూమెంట్లో ఇక నా చేతుల్లో ఏమీ లేదనుకున్న సందర్భం ఉందా? వీక్ మూమెంట్స్ ఉండనివారుండరు. కానీ, ఆ సమయంలోనూ దేవుని ఆలంబనగా చేసుకోలేదు. ఎందుకిలా చేశావని ఎవరినీ నిందించింది లేదు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా భార్య అండగా నిలబడింది. ‘పోతే పోయిందిలే..’ అందే తప్ప ‘నీ వల్లే నాశనమైంది’ అనలేదు. ‘ఎక్కువగా మనసు కష్టపెట్టుకోకండి. ఏదో మార్గం దొరుకుతుందిగా’ అనేది. కానీ, ఎప్పుడూ తన నోట రేపటి భయాన్ని చూళ్లేదు. ఒక జర్నలిస్టుగా దైవానికి సంబంధించిన ఆర్టికల్స్ ఎడిట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యేవారు. మూఢంగా నమ్మే విషయాలను అవి వ్యాసాలు అయినా ప్రోత్సహించేవాడిని కాదు. కానీ, ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగితే న్యూస్‌గా మాత్రమే కవర్ చేయమనేవాడిని. నా నుంచి హేతువాదాన్ని పెంచే వ్యాసాలే ఉంటాయి. పత్రికారంగంలో ఒక విభజన పెట్టుకోవాలి. న్యూస్‌ను న్యూస్‌లా ఇవ్వాలి. మొండిగా వ్యతిరేకిస్తూ ఇవ్వకూడదు. అవగాహనతో వ్యవహరించాలి. అసలు దేవుడిని నమ్మితే మీకొచ్చిన నష్టమేంటి? నమ్మకపోతే నష్టమేంటి? ఇప్పుడు నా వయసు 83. ఇప్పటికీ రచనలు చేస్తుంటాను. నా భార్య వయసు కూడా దాదాపు నా వయసే. ఇద్దరమూ ఇన్నాళ్లూ జీవించాం. కష్టసుఖాలను పంచుకున్నాం. ముగ్గురు అమ్మాయిల జీవితాలూ బాగున్నాయి. దేవున్ని నమ్మకపోయినంత మాత్రానా కష్టపెడతాడు అనే ఆలోచన ఎందుకు? కారణం లేని తోరణం ఉండదు. మనమే మన సమస్యల పట్ల అవగాహన చేసుకోవాలి. ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. దేవుడిని నమ్మని మీరూ గుళ్లకు వెళ్లిన సందర్భాలున్నాయి. వాటిలో మీకు ఏ గుడి నచ్చుతుంది? శ్రీశ్రీ తన రచనల్లో ఒక చోట ఇలా అన్నాడు..‘దేశంలోని దారిద్య్రాన్ని చూడాలంటే గుళ్ల వద్దకు వెళ్లాలని’ చెప్పాడు. ఎందుకంటే అక్కడే భిక్షగాళ్లు ఎక్కువగా కనిపిస్తారు. గుడి నిర్మాణం, అలనాటి కళలను చూడటానికి చారిత్రక ఆలయాలను సందర్శించిన రోజులున్నాయి. మహాశిల్పులు ఆవేశంలో మాత్రమే గుళ్లకు సౌందర్యాన్ని చేర్చారని వాటిని సందర్శించినప్పుడు అర్ధమైంది. మీరు పదేళ్లుగా పూజలు చేస్తున్నారని చెప్పారు. అప్పటి నుంచే దైవాణ్ణి నమ్మడంలో ఆంతర్యం ఏంటి? ఆరోగ్యం విషయంలో కొన్నాళ్ల క్రితం మనసు కలత చెందింది. దేవుడు అనే ఆలంబనను అవసరం అనిపించింది. కానీ, దేవుడున్నాడని ఇప్పటికైతే నమ్మకం లేదు. అది ఒక మానసిక అవసరం మాత్రమే. – సుధారాణి, ఏబీకే సతీమణి – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
ఐటీ @ కరీంనగర్
ఒప్పందం చేసుకున్న సంస్థలివే.. నివి ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఆస్ట్రేలియా ఎస్–2 ఐటీ గ్రూప్ అల్పరేటా, అట్లాంటా, అమెరికా టెక్నిక్స్ ఇంటిగ్రేషన్ టెక్నాలజీస్ లిమిటెడ్, అమెరికా వే ఐటీ సొల్యూషన్స్, కరీంనగర్ ళీడిజిటల్ సర్వీసెస్, కరీంనగర్ సంస్కృతి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ టీజే నోవండీ ఎల్ఎల్పీ, హైదరాబాద్ పీఎస్ఆర్ సర్వీసెస్, హైదరాబాద్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని మరింతగా విస్తరిస్తున్నామని, కరీంనగర్‌ను ఐటీకి కేరాఫ్‌గా మార్చుతామని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాష్ట్ర యువతకు చదువుకున్న చోటే ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తు న్నామని చెప్పారు. మంత్రి కేటీఆర్ సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ) సమీపంలో రూ.25 కోట్లతో చేపట్టిన ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఐటీ ఎగుమతులు రూ.56 వేల కోట్ల మేర ఉండగా.. గతేడాది నాటికి రూ.87 వేల కోట్లకు చేరాయని కేటీఆర్ చెప్పారు. ఐటీ రంగంలో వేల సంఖ్యలో ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. తెలంగాణ యువతకు ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లలో ఐటీ టవర్లను నిర్మిస్తున్నామని తెలిపారు. కరీంనగర్లో ప్రస్తుతం నిర్మించనున్న టవర్‌తో పాటు మరో టవర్ కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఐటీ కంపెనీలను రాష్ట్రమంతటా విస్తరిస్తామన్నారు. శంకుస్థాపనతోనే 8 కంపెనీల ఒప్పందాలు కరీంనగర్ ఐటీ టవర్ పనులకు శంకుస్థాపన చేసిన రోజునే కాసర్ల నాగేందర్రెడ్డితోపాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు స్థాపించిన 8 విదేశీ కంపెనీలు ఒప్పందం చేసుకోవడం గర్వకారణమని మంత్రి కేటీఆర్ చెప్పా రు. ఐటీ టవర్‌ను ఏడాదిలో పూర్తిచేసి.. ప్రారంభం రోజే 1,000 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడ్డ మన ప్రాంతానికి చెందినవారితో మాట్లాడుతామని, మరిన్ని కంపెనీలు తీసుకొస్తామని తెలిపారు. అందుకోసమే మరో ఐటీ టవర్‌ను నిర్మించనున్నట్లు వెల్లడించారు. దేశంలో 50 శాతం జనాభా 27 ఏళ్లలోపు యువతేనని, 65 శాతం జనాభా 35 ఏళ్లలోపు వారేనని.. ప్రపంచంతో పోటీపడే పౌరులుగా మనం తయారుకావాలని పిలుపునిచ్చారు. ఉపాధిని సృష్టించాలి ప్రపంచంలో ప్రముఖమైన 100 కంపెనీలకు భారతీయులే నాయకత్వం వహిస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. వాటికి భారతీయులు మేధో సంపత్తిని, నైపుణ్యాన్ని ధారపోస్తున్నారన్నారు. విదేశాల్లో ఐటీ కంపెనీలను నెలకొల్పడంలో తెలంగాణ ఇంజనీర్ల పాత్ర కీలకమన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్, కరీంనగర్‌లను అవకాశాలకు గమ్యంగా మార్చుతామని, అమెరికాలోని మనవాళ్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నిస్తామని తెలిపారు. యువత ఉద్యోగం చేసేవారుగానే ఉండిపోకుండా.. ఉన్నతమైన, కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉద్యోగాల సృష్టికర్తలుగా ఎదగాలని కేటీఆర్ ఆకాంక్షించారు. యువతకు నాణ్యమైన శిక్షణ కల్పిస్తే ఉపాధి కల్పన సాధ్యమవుతుందని.. ఇందుకోసం తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ (టాస్క్)ను, టీ–హబ్‌ను కొత్తగా నిర్మించే జరిగే ఐటీ టవర్‌లో నెలకొల్పుతామని తెలిపారు. ఆశయాలకు తగ్గట్టు పనిచేస్తున్నాం రాష్ట్ర ప్రజల ఆశయాలకు తగినట్టుగా ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. కరెంటు కష్టాలను జయించామని.. కేవలం మూడున్నరేళ్లలో దేశంలోనే సులభతర వాణిజ్య విధానమున్న రాష్ట్రంగా ఎదిగామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శ్రమతో ఆర్థికవృద్ధి రేటు పెరిగిందని.. దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా ఆవిర్భవించిందని చెప్పారు. త్వరలోనే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు, ప్రతీ ఎకరానికి సాగునీరు అందివ్వబోతున్నామని తెలిపారు. ఐటీ, వాటర్‌హబ్‌గా కరీంనగర్: ఈటల అభివృద్ధిలో కరీంనగర్ తెలంగాణకు ఆదర్శం కాబోతోందని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఐటీ టవర్ల ఏర్పాటుతో హైదరాబాద్‌తో సమానంగా కరీంనగర్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ యావత్తుకు నీరందించే జిల్లాగా కరీంనగర్ ఉంటుందని పేర్కొన్నారు. కాగా సభలో ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, సోమారపు సత్యనారాయణ, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. రిసోర్స్ పర్సన్స్‌కు వీఏవోలతో సమానంగా వేతనాలు మహిళా సంఘాలను ముందుండి నడిపిస్తున్న రిసోర్స్ పర్సన్స్ (ఆర్పీ)లకు వీఏవోలతో సమానంగా వేతనాలు అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. సోమవారం కరీంనగర్లో పలు అభివృద్ధి పనుల పైలాన్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని రిసోర్స్ పర్సన్లందరికీ దీనిని వర్తింపజేయాలని, ఈ మేరకు ఫైలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక మెప్మా ఉద్యోగులకు ఇంటి అద్దె (హెచ్ఆర్) పాలసీని అమలు చేస్తామని ప్రకటించారు. -
రమ్యమైన హృదయం
ఆమె ఒక నటి. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీ. అయితేనేం సమాజానికి తనవంతు సహాయం చేయాలనుకున్నారు. ‘రమ్య హృదయాలయ ఫౌండేషన్’ ఏర్పాటు చేసి.. అనాథలు, యాచకులు, వృద్ధులకు అండగా నిలుస్తున్నారు. ఆమే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రమ్యశ్రీ. విశాఖపట్టణానికి చెందిన సుజాత అలియాస్ రమ్యశ్రీ 1997లో హైదరాబాద్‌కు వచ్చి తెలుగు ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. ఇప్పటి వరకు 8 భాషల్లో 300లకు పైగా చిత్రాల్లో నటించారు. నటి, డ్యాన్సర్, దర్శకురాలిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో స్వీయ దర్శకత్వంతో తాను నటించిన ‘ఓ మల్లీ’ చిత్రం జ్యూరీ విభాగంలో బెస్ట్ దర్శకురాలిగా నంది అవార్డు గెలుచుకొంది. ఇదంతా ఒకవైపు.. మరోవైపు ఆమె సేవా హృదయురాలు. చిన్నప్పటి నుంచి యాచకులను చూసి చలించిపోయేది. ఇంట్లో తెలియకుండా వారి వద్దకు వెళ్లి దుస్తులు, డబ్బులు ఇచ్చేది. అలా మొదలైన సేవ.. నేటికీ కొనసాగుతోంది. అవసరాలు తీరుస్తూ... రోడ్డుపై యాచకులు కనిపిస్తే చాలు.. రమ్యశ్రీ కారు ఆగిపోతుంది. వారి దగ్గరికి వెళ్లి అవసరాలు తెలుసుకుంటుంది. షూటింగ్ లేని రోజుల్లో వారుండే ప్రాంతానికి వెళ్లి దుస్తులు, దుప్పట్లు, డబ్బులు అందజేస్తుంది. భోజనం కూడా తీసుకెళ్లి ఇస్తుంది. రమ్యశ్రీ సేవలను గుర్తించిన హెల్త్‌కేర్ ఇంటర్నేషనల్ సంస్థ ఇటీవల ఆమెకు ‘మదర్ థెరిస్సా’ అవార్డు ప్రదానం చేసింది. పిల్లల దత్తత.. వృద్ధుల బాధ్యత రమ్యశ్రీ ఇద్దరు అనాథ పిల్లలను దత్తత తీసుకున్నారు. ఆరుగురు వృద్ధుల ఆలనాపాలన చూసుకుంటున్నారు. పిల్లల్లో ఒకరు ఆరో తరగతి, మరొకరు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ ప్రయోజకులు అయ్యే వరకు తన బాధ్యతేనని చెప్పారు రమ్యశ్రీ. ఆదుకోవాలి.. అనాథలకు ఎన్నో ఆశలు, కోర్కెలు ఉంటాయి. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం సహకరించాలి. వారి కలల్ని సాకారం చేయాలనేది నా లక్ష్యం. అందుకు ప్రభుత్వం సహకరిస్తుందని ఆశిస్తున్నాను. – రమ్యశ్రీ, నటి -
69 రోజులు.. 10 లక్షల కండోమ్స్
సాక్షి, బెంగళూరు : దేశంలోని శృంగార పురుషులు కండోములను విచ్చలవిడిగా ఉపయోగించేస్తున్నారు. గర్భధారణ నిరోధక సాధనాల మార్కెట్లో కేవలం 5 శాతం ఉన్న కండోముల అమ్మకాలు.. ఆన్లైన్లో ఫ్రీ కండోమ్ స్టోర్ ఆరంభించాక.. ఒక్కసారిగా డిమాండ్ఆకాశాన్ని అంటుకుంది. ఆన్ స్టోర్ ప్రారంభించిన 69 రోజుల్లోనే 10 లక్షల కండోములను ఉచితంగా డెలివరీ చేసినట్లు సదరు సంస్థ ప్రకటించింది. ఎయిడ్స్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ అనే సంస్థ ఏప్రిల్ 28న ఆన్లైన్లో ఫ్రీ కండోమ్ స్టోర్‌ను ఆరంభించింది. ఈ స్టోర్‌లో ఇప్పటి వరకూ 9.56 లక్షల కండొమ్లను ఉచితంగా పంపిణీ చేసినట్లు సంస్థ తెలిపింది. ఎన్జీవో సంస్థలు, ఇతర వర్గాలకు 5.14 లక్షల కండోములు సరఫరా చేయగా.. వ్యక్తిగత ఆర్డర్లు 4.41 లక్షలు వచ్చినట్లు సంస్థ తెలిపింది. ఢిల్లీ, కర్నాటక రాష్ట్రాల్లో కండోములకు అధికంగా డిమాండ్ ఉన్నట్లు ఆర్డర్ల ద్వారా తెలుస్తోంది. దేశంలోని శృంగార పురుషుల కోసం హిందుస్తాన్ లేటెక్స్ లిమిటెడ్ ఈ కండోములను ప్రత్యేకంగా అభివృద్ధి చేసినట్లు ఎయిడ్స్ హెల్త్ కేర్ ఫౌండేషన్ ఇండియా డైరెక్టన్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. డిసెంబర్ నెలాఖరు వరకు 10 లక్షల కండోములు వస్తాయని అంచనా. అయితే స్టోర్ ప్రారంభించిన కొద్ది రోజులకే స్టాక్ పూర్తవడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, తాజాగా 20 లక్షల కండోములకు ఆర్డర్ ఇచ్చినట్లు శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా.. మరో 50 లక్షల కండోములు జనవరికల్లా అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. -
ఇజ్రాయెల్ పునాదికి వందేళ్లు!
సాక్షి నాలెడ్జ్ సెంటర్: ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురైన యూదులకు సొంత రాజ్యం పేరుతో 1948 మే 23న ఇజ్రాయెల్ ఏర్పాటుకు ఊతమిచ్చిన ‘బేల్ఫర్ ప్రకటన’కు గురువారంతో వందేళ్లు నిండుతున్నాయి. ప్రత్యేక దేశం కావాలన్న యూదుల ఆకాంక్షకు ఇంగ్లండ్ మద్దతుకు హామీ ఇస్తూ బ్రిటన్ విదేశాంగమంత్రి ఆర్థర్ బేల్ఫర్ 1917 నవంబర్ 2న బేల్ఫర్ డిక్లరేషన్ విడుదల చేశారు. బేల్ఫర్ ప్రకటన నాటికి మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతోంది. బ్రిటన్ వ్యతిరేక శిబిరంలోని ఒట్టోమన్ సామ్రాజ్యంలో అంతర్భాగమైన పాలస్తీనా ప్రాంతం ఈ యుద్ధంలో ఇంగ్లండ్, ఫ్రాన్స్ నాయకత్వంలోని మిత్రదేశాల కూటమి ఆక్రమణలోకి వచ్చింది. అప్పటికే అనేక మంది కుబేరులకు జన్మనిచ్చిన యూదు జాతి నుంచి యుద్ధానికి విరాళాలు, ఆర్థికసాయం సంపాదించే లక్ష్యంతో ఇంగ్లండ్ ఇజ్రాయెల్ స్థాపనకు అనుకూలంగా ఈ ప్రకటన చేసింది. బేల్ఫర్ డిక్లరేషన్ విడుదలైన నాటి నుంచి పాలస్తీనా ప్రాంతానికి ఇతర దేశాల నుంచి యూదుల వలస ఊహించని స్థాయిలో ఊపందుకుంది. ఇజ్రాయెల్ పునాదికి వందేళ్లు! 1947 నవంబర్ 29న ఐరాస తీర్మానం 181 ప్రకారం కొత్తగా ఏర్పడే ఇజ్రాయెల్‌లో యూదులకు 55 శాతం భూభాగాన్ని కేటాయించారు. వాటిలో పాలస్తీనా అరబ్బులు మెజారిటీగా ఉన్న విలువైన మధ్యధరా సముద్రతీర నగరాలున్నాయి. నిజానికి జనాభాలో యూదుల వాటా అప్పటికి మూడో వంతు మాత్రమే. వారి చేతుల్లో ఆరు శాతం కన్నా తక్కువ భూములున్నాయి. దీంతో పాలస్తీనీయులు ఐరాస తీర్మానాన్ని తిరస్కరించారు. వెంటనే పాలస్తీనా అరబ్బులకు, యూదుల జియోనిస్ట్ సాయుధ గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల్లో అరబ్బుల ఆస్తి, ప్రాణనష్టం విపరీతంగా జరిగింది. రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటన్ సేనలతో కలిసి పోరాడిన అనుభవం యూదులకు కలిసొచ్చింది. పాలస్తీనాలో పాలనా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు 1948 మే 15న బ్రిటన్ ప్రకటించింది. అదే నెల 23న యూదుల సొంత దేశం పాలస్తీనా గడ్డపై ఇజ్రాయెల్గా అవతరించింది. అప్పటి నుంచి యూదు జాత్యహంకార ప్రభుత్వాల హింస ఫలితంగా పాలస్తీనా అరబ్బులు లక్షలాది మంది ఇతర దేశాలకు వలసపోయారు. ప్రపంచవ్యాప్తంగా కోటీ 24 పాలస్తీనీయులుండగా, యూదుల ఆధిపత్యంలో జాతి వివక్ష అమలవుతున్న ఇజ్రాయెల్‌లో వారి సంఖ్య నేడు దాదాపు 17 లక్షల(20%)కు పడిపోయింది. యూదుకు సొంత రాజ్యం ఉనికిలోకి వచ్చినప్పటి నుంచీ ఏడు దశాబ్దాలుగా పాలస్తీనీయులు సొంత పాలన కోసం పోరాడుతూనే ఉన్నారు. పాలస్తీనా విమోజన సంస్థ నేత యాసిర్ అరాఫత్ నాయకత్వాన 1994లో పాలస్తీనా అథారిటీ పేరిట పరిమిత అధికారాల ‘సర్కారు’ను సాధించారు. సంపూర్ణ స్వరాజ్యం వారికి కనుచూపు మేర కనిపించడం లేదు. వందేళ్ల క్రితం బ్రిటన్ ‘బేల్ఫర్ డిక్లరేషన్’మూడు దశాబ్దాలకే యూదులకు సొంత రాజ్యం అందించిందిగాని అక్కడి మెజారిటీ పాలస్తీనీయులకు సొంత దేశం లేకుండా పోయింది. మూడు శాతం నుంచి 75 శాతానికి పెరిగిన యూదుల సంఖ్య! మొదటి ప్రపంచయుద్ధకాలంలో ఒట్టోమన్ సామ్రాజ్యం పతనమయ్యాక పశ్చిమాసియా ప్రాంతాన్ని ఇంగ్లండ్, ఫ్రాన్స్ పంచుకున్నాయి. 1920లో పాలస్తీనా తన పాలనలోకి రావడానికి ముందే తనదికాని ఈ భూభాగాన్ని యూదుల పరం చేస్తామని బేల్ఫర్ ప్రకటన ద్వారా బ్రిటన్ వారిని ఆకట్టుకుంది. ఈ ప్రకటన తర్వాత అంతకుముందు ఉగాండా, అర్జెంటీనాలో ఏదోఒక చోట యూదు రాజ్యం స్థాపన జరుగుతుందనుకున్న ఈ జాతి జనం ‘ఇజ్రాయెల్’వైపునకు పెద్ద సంఖ్యలో పయనమయ్యారు. 1880ల్లో పాలస్తీనాలోని స్థానిక యూదుల జనాభా మూడు శాతం మాత్రమే. బేల్ఫర్ ప్రకటనతో వరదలా వచ్చిపడిన విదేశీ యూదుల్లో ఇజ్రాయెల్ స్థాపనే బలమైన ఆకాంక్ష. 1922–33 మధ్య యూదుల సంఖ్య మొత్తం పాలస్తీనా జనాభాలో 9 నుంచి 27 శాతానికి పెరిగింది. బ్రిటన్ సర్కారు అండతో ధనిక యూదులు పాలస్తీనీయుల భూములను ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు. జర్మనీలో నాజీల పాలనలో ఎదురైన వేధింపుల వల్ల 1933–36 మధ్య దాదాపు 60 వేల యూదులు దేశం వదలి పాలస్తీనా చేరుకున్నారు. -
కలెక్టరేట్లకు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల కలెక్టరేట్లకు ఎట్టకేలకు సొంత భవనాలు సమకూరనున్నాయి. పాత జిల్లాల్లో కూడా అవసరమైన చోట్ల కొత్త భవనాలు రానున్నాయి. గతేడాది దసరా రోజున ఒకేసారి అన్ని జిల్లాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తరహాలోనే ఈ నెల 11, 12 తేదీల్లో కొత్త కలెక్టరేట్ భవనాలకు భూమి పూజ చేయబోతున్నారు. కలెక్టర్, జేసీ, ఇతర ఉన్నతాధికారుల నివాస భవనాలకు కూడా శంకుస్థాపనలు చేస్తారు. సిద్దిపేటలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా, మిగతా జిల్లాల్లో మంత్రులు ఈ పనులు ప్రారంభిస్తున్నారు. 26 కలెక్టరేట్ భవనాల నిర్మాణానికి టెండర్లు, కాంట్రాక్టర్లతో ఒప్పందం ఖరారయ్యాయి. వీటిలో 21 చోట్ల అధికారుల గృహ సముదాయాల నిర్మాణమూ చేపట్టనున్నారు. వాటిలో భూ సేకరణ పూర్తైన 18 చోట్ల ప్రస్తుతం శంకుస్థాపన జరుగుతోంది. ఈ జాబితాలో సిద్దిపేట, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్ పట్టణ, జనగామ, వికారాబాద్, మేడ్చల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నిజామా బాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూలు, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేటల్లో పనులు ప్రారంభం కానున్నాయి. ఖమ్మం, మెదక్, కొత్తగూడెంలలో స్థలాలను గుర్తించి భూ సేకరణ జరుపుతున్నారు. మంచిర్యాల, నిర్మల్, వరంగల్ గ్రామీణ, మహబూబాబాదుల్లో గుర్తించిన స్థలాలు బాగాలేక ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించాలని నిర్ణయించారు. విశేషాలు... ♦ పనులు చేపట్టబోయే భవనాల నిర్మాణానికి 1,032 కోట్లు ఖర్చవుతుందని అంచనా. పర్యావరణ హితంగా వీటిని నిర్మిస్తారు. ♦ వరంగల్ పట్టణ, రంగారెడ్డి, సిద్దిపేట సహా కొన్ని కలెక్టరేట్లు లక్షన్నర చదరపు అడుగుల్లో, మిగతావి 1.2 లక్షల చ.అ.ల్లో నిర్మితమవుతాయి. కలెక్టర్ల నివాసాలు 6,000 చ.అ., జేసీల గృహాలు 3,000 చ.అ., జిల్లా రెవెన్యూ అధికారుల గృహాలు 2,500 చ.అ., ఇతర జిల్లా అధికారులకు 148 గృహాలను 1,500 చ.అ.ల్లో నిర్మిస్తారు. ♦ అన్ని నిర్మాణాలను ఏడాదిలోగా పూర్తి చేసి వచ్చే దసరా నాడు గృహప్రవేశాలు జరపాలన్నది లక్ష్యం. -
నగరంలో మరో దివ్య క్షేత్రం
శ్రీ మహా కాళేశ్వరాలయానికి శంకుస్థాపన రాజమహేంద్రవరం కల్చరల్: ఆధ్యాత్మికత క్షేత్రాలకు ఆటపట్టయిన రాజమహేంద్రవరంలో మరో దివ్యక్షేత్రం రూపుదిద్దుకుంటోంది. అదే శ్రీ మహాకాళేశ్వరాలయం. ఉజ్జయినిలో కొలువుదీరిన శ్రీ మహాకాళేశ్వరుని సందర్శించుకోలేని భక్తులకోసం ఆ మహాదేవుడే గోదావరీతీరానికి విజయం చేయనున్నాడని ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానందగిరి పేర్కొన్నారు. రోటరీక్లబ్ ఆఫ్ రాజమండ్రి ఆధ్వర్యంలో ఆదివారం ఇన్నీసుపేట కైలాసభూమి పక్క ప్రాంగణంలో శ్రీమహాకాళీ కాళేశ్వరాలయ శంకుస్ధాపన మహోత్సవంలో ఆధ్యాతిక, సారస్వత, రాజకీయరంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానందగిరి మాట్లాడుతూ మనం చేసే ప్రతిపనీ భగవదర్పితం కావాలన్నారు. జ్ఞాన సరస్వతి డాక్టర్ ప్రభల సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ కాలస్వరూపుడే కాళేశ్వరుడని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ సిటీ కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ దక్షిణకాశీగా పేరుగాంచిన రాజమహేంద్రవరానికి ఈ ఆలయం రావడం మన సుకృతమన్నారు. శాసనమండలి మాజీ సభ్యుడు కందుల దుర్గేష్ మాట్లాడుతూ నగర ఆధ్యాత్మిక శోభను ఇనుమడించే విధంగా ఆలయం రూపుదిద్దుకోనుందన్నారు. హిమాలయవాసి సూర్యభాస్కర సరస్వతీస్వామి మాట్లాడుతూ కంటికి కనిపించేదంతా కనుమరుగైపోతుందన్నారు. భస్మాభిషేక ప్రియుడు, భస్మవిభూషిత సుందరుడు శంకరుడన్నారు. ఆలయ నిర్మాణకర్తలు పట్టపగలు వెంకటరావు దంపతులు, తోట సుబ్బారావు దంపతులు శంకుస్థాపన పూజల్లో పాల్గొన్నారు. నాలుగు ద్వారాలు, నాలుగు నందీశ్వరులు, నాలుగు మండపాలు, నాలుగు ధ్వజస్తంభాలు, నాలుగు రాజగోపురాలు, నాలుగు శివకోటి స్ధూపాలతో రెండేళ్లలో ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని పట్టపగలు వెంకటరావు తెలిపారు. రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యుడు మాగంటి మురళీమోహన్, నగర మేయర్ పంతం రజనీ శేష సాయి, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామసుబ్రహ్మణ్యం, 20వ వార్డు కార్పొరేటర్ మింది నాగేంద్ర, సీతారాం మహేశ్వరి, పట్టపగలు ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ స్టేషన్లు ఆధునిక దేవాలయాలు
సైదాబాద్: నగరంలో పోలీస్స్టేషన్లను దేవాలయాలుగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మోడల్ పోలీస్స్టేషన్ల ఏర్పాటులో భాగంగా గురువారం ఆయన సైదాబాద్ పోలీస్‌స్టేన్ నూతన భవనానికి నగర పోలీస్‌కమిషనర్ మహేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో 23 పోలీస్స్టేషన్లను రూ.75 కోట్లతో మోడల్ పీఎస్లుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇందులో 16 శాంతిభద్రతలు, 6 ట్రాఫిక్, 1 మహిళా పోలీస్స్టేషన్లు ఉన్నట్లు తెలిపారు. నేరాలపై కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు సమాచారం అందుతుందన్నారు. పోలీసులు ప్రజలకు చేరువైనప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమన్నారు. ప్రజల పోలీస్స్టేషన్లు: కమిషనర్ మహేందర్‌రెడ్డి ఇది మా పోలీస్స్టేషన్లు అని ప్రజలు చెప్పుకునేలా ప్రతి పోలీస్‌స్టేషన్‌ను తీర్చిదిద్దనున్నట్లు నగర పోలీస్‌కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. పోలీస్‌స్టేషన్‌ను సర్వీస్ సెంటర్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు హైదరాబాద్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, నగరంలో చీటింగ్, డ్రగ్స్, కల్తీని రూపుమాపేందుకు కృషి చేస్తున్నామన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాల సహాయంతో నగరంలో ఎక్కడ ఎం జరుగుతుందో తెలుసుకుంటున్నామన్నారు నేరం చేస్తే పోలీసులకు దొరికిపోతామని భయం కల్గించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్, ఐజీలు మల్లారెడ్డి, శ్రీనివాస్, అధికారులు మురళీకృష్ణ, ప్రేమ్‌కుమార్, ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్, ఏసీపీ సుధాకర్, కాట్న సత్తయ్య, డీఐ కోరుట్ల నాగేశ్వర్రావు, సిబ్బంది, కార్పొరేటర్లు సింగిరెడ్డి స్వర్ణలతరెడ్డి, సామ స్వప్నరెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. స్టేషన్ కు రూ.75 వేలు కాచిగూడ: రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతున్నామని హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి అన్నారు. గురువారం ఆయన కాచిగూడ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నెలా పోలీస్ స్టేషన్లకు రూ.75వేలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నగరంలో దొంగతనాలు, క్రైమ్‌రేటు తగ్గిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎం.ఎస్. ప్రభాకర్, కార్పొరేటర్లు ఎక్కాల చైతన్య కన్నా, కాలేరు పద్మవెంకటేష్, గరిగంటి శ్రీదేవి రమేష్, పోలీస్ అధికారులు మల్లారెడ్డి, రవీందర్, లక్ష్మినారాయణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
19న కాంక్రీట్ పనులు ప్రారంభం
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో ఫౌండేష¯ŒSకు సంబంధించి కాంక్రీట్ పనులను ఈ నెల 19న ప్రారంభించనున్నట్లు జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులను ఆయన గురువారం పరిశీలించారు. స్పిల్‌వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, డ్యామ్ నిర్మాణ ప్రాంతాలను పరిశీలించి పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాంక్రీట్ పనులు ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు ఉమాభారతి, వెంకయ్యనాయుడును ఆహ్వానించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణం పనులకు రూ.2,200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. కాంక్రీట్ నిర్మాణం పనులకు 18వేల మెట్రిక్ టన్నుల ఇనుము, 10 లక్షల టన్నుల సిమెంట్ సిద్ధం చేస్తున్నామన్నారు. డ్యామ్ నిర్మాణ ప్రాంతంలోనే గేట్లు తయారు చేస్తారన్నారు. రోజూ 2లక్షల 10వేల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో 14,828 వేల ఎకరాల భూమి సేకరించామని, పాత భూసేకరణ చట్టం ప్రకారం రూ.520 కోట్లు ఖర్చు అయ్యిందని పేర్కొన్నారు. ఇంకా కుక్కునూరు, వేలేరు పాడు ప్రాంతాల్లో 12వేల ఎకరాలు భూమి సేకరించాల్సి ఉందన్నారు. నెలలో భూసేకరణ పనులు పూర్తిచేస్తామన్నారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఎకరానికి రూ. 10.50 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. పనుల పరిశీలన అనంతరం ట్రా¯Œ్సట్రాయ్ ఏజెన్సీ కార్యాలయంలో ఇరిగేష¯ŒS అధికారులు , ఏజెన్సీ ప్రతినిధులతో పనులు జరుగుతున్న తీరుపై ఉమామహేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు, ప్రాజెక్టు సీఈ ఎస్.హరిబాబు, ఏఎంసీ చైర్మ¯ŒS పారేపల్లి రామారావు, ఎంపీపీ పైల అరుణకుమారి, జెడ్పీటీసీ కుంజం సుభాషిణి, ఆర్డీవో ఎస్.లవన్న, డీఎస్పీ కేటీవీ రవికుమార్, డిప్యూటీ ఎస్ఈ కె.వెంకటేశ్వరరాజు, ఈఈ పి.మునిరెడ్డి పాల్గొన్నారు. -
రూ.10 కోట్లతో పట్టణాభివృద్ధి పనులు
మంత్రి జోగు రామన్న పనులకు శంకుస్థాపన ఆదిలాబాద్ కల్చరల్ : ఆదిలాబాద్ మున్సిపాల్టీలోని 36 వార్డుల్లో రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం పట్టణంలోని 26, 31వ వార్డుల్లో రూ.4 లక్షల చొప్పున వ్యయంతో నిర్మించనున్న మురికి కాలువల పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ నల్లా కనెక్షన్ అందించడానికి రూ.4 వేల కోట్లతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అర్హులైన వారికి రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని, విద్యుత్ సౌకర్యం లేని వీధులకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరూఖ్ అహ్మద్, కౌన్సిలర్లు నజీర్ ఆస్మపర్వీన్, వెంకన్న, కమిషనర్ కమిషనర్ మంగతాయారు, ఈఈ నాగమల్లేశ్వర్రావు, సానిటరీ ఇన్స్పెక్టర్ ఆయాజ్‌ఖాన్, టీఆర్ఎస్ నాయకులు సాజిదొద్దీన్, అడ్డి బోజారెడ్డి, కౌన్సిలర్లు బండారి సతీష్, జహీర్‌రంజానీ, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు -
రూ.15 వేల కోట్లతో రోడ్ల ఆధునీకరణ: తుమ్మల
హైదరాబాద్: రాష్ర్టంలో మరో మూడేళ్లలో రూ.15 వేల కోట్లు వెచ్చించి ఆర్ అండ్ బి రహదారులను ఆధునీకరిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ చౌరస్తా నుంచి బాచుపల్లి వరకు రూ.15 కోట్లతో చేపట్టనున్న రోడ్డు వెడల్పు పనులకు ఆయన రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో కలసి ఆదివారం శంకుస్థాపన చేశారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, విడతలవారీగా రహదారుల పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, రోడ్డు మధ్యలో డివైడర్లు, వీధిలైట్లు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద్, జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆగ్రహం వస్తే అంతే!
ఆస్పత్రి శంకుస్థాపనను అడ్డుకున్న వంగపల్లిపేట వాసులు ► కార్యక్రమం చేసి తీరాలంటూ మంత్రి పీఎస్ ఒత్తిళ్లు ► ఎలాగైనా అడ్డుకుంటామని బైఠారుుంచిన మహిళలు ► స్థానికంగా ఉన్నా... హాజరుకాని మంత్రి ► ఎట్టకేలకు నిలిచిపోరుున శంకుస్థాపన ‘మంత్రరుునా.. సర్పంచ్ అరుునా... మాకు ఒక్కటే. నచ్చకపోతే ఎవరిపైనైనా ఎదురు తిరుగుతాం. మాకు ముప్పు తెచ్చే పనులేవైనా చేస్తే కలసికట్టుగా పోరాడుతాం. అనుకున్నది సాధించి తీరుతాం.’ అని నిరూపించారు చీపురుపల్లి మండలం వంగవల్లిపేటవాసులు. ఏఎంసీలో ఒద్దంటే ఆస్పత్రి ఎలా నిర్మిస్తారు. వాటి వ్యర్థాలతో మా ఆరోగ్యాలు పాడవ్వాలా... ఆ సొసైటీపైనే ఆధారపడిన మా భవిష్యత్తు నాశనం చేసుకోవాలా... సహించం... అని పోలీసులను సైతం లెక్క చేయలేదు. మహిళలు, గ్రామస్తులు ఎదురు తిరిగారు. ప్రజాప్రతినిధులు రాకముందే శంకుస్థాపన కోసం తవ్విన గోతులను రాళ్లు, మట్టితో కప్పేందుకు ప్రయత్నించారు. దీంతో గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చీపురుపల్లి: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని సొంత నియోజకవర్గకేంద్రమైన చీపురుపల్లి పట్టణంలో అధికారానికి అవమానం జరిగింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో గురువారం తలపెట్టిన 30 పడకల ఆస్పత్రి అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని వంగపల్లిపేట గ్రామస్తులు అడ్డుకున్నారు. విషయం ముందే తెలుసుకున్న రాష్ట్ర మంత్రి మృణాళిని చీపురుపల్లి మండలంలోనే ఉన్నప్పటికీ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఎట్టి పరిస్థితుల్లో అధికారులతో శంకుస్థాపన చేరుుంచాలని మంత్రి పీఎస్ ఫోన్లో స్థానిక అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆదేశించినప్పటికీ గ్రామస్తులు ఎదురు తిరిగారు. స్థానిక నాయకులు చేసిన యత్నాలు ఫలించకపోవడంతో శంకుస్థాపన నిలిచిపోరుుంది. మొదట్నుంచీ వద్దంటున్న గ్రామస్తులు ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి పనుల కోసం మూడేళ్ల క్రితమే ఏపీఎంఎస్ఐడీసీ నుంచి రూ.3.84 కోట్లు మంజూరయ్యారుు. ఏఎంసీ ఆవరణలో 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి పనుల కోసం గురువారం శంకుస్థాపన కార్యక్రమాన్ని తలపెట్టారు. ఏఎంసీలో ఆప నుల్ని తొలి నుంచీ ఆస్పత్రి పనులను వ్యతిరేకిస్తున్న వంగపల్లిపేట వాసులు ఉదయం 9 గంటలకే పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అప్పటికే అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆస్పత్రి పనుల వల్ల తామెంతో నష్టపోవాల్సి వస్తుందని, గ్రామంలోకి వ్యర్థాలు వచ్చి కలుషితమవుతుందనీ, మార్కెట్ యార్డు నిర్వీర్యం అరుుతే దీనిపై ఆధారపడి ఉన్న వందలాది మంది కూలీలకు జీవనోపాధి పోతుందని గ్రామస్తులు వివరించారు. ప్రజాప్రతినిదులు వచ్చేంత వరకు శాంతించాలని పోలీసులు కోరారు. 11 గంటల వరకు ప్రజాప్రతినిధులెవ్వరూ రాకపోవడంతో సహనం కోల్పోరుున మహిళలు శంకుస్థాపన కోసం తవ్విన గోతులు రాళ్లు, మట్టితో కప్పేసేందుకు ప్రయత్నించారు. మరోసారి పోలీసులు వారిని వారించారు. ఎట్టి పరిస్థితుల్లో శంకుస్థాపన జరగనివ్వబోమంటూ ఆ గోతిలో మహిళలు బైఠారుుంచారు. స్థానిక నేతలకూ తప్పని సెగ అక్కడకు చేరుకున్న టీడీపీ మండల అధ్యక్షుడు రౌతు కామునాయుడు, నియోజకవర్గ ఇన్చార్జి కె.త్రిమూర్తులురాజు, జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడులకు గ్రామస్తుల నుంచి నిరసన తప్పలేదు. విషయం తెలుసుకున్న వారు ముందుగా శంకుస్థాపన చేశాక తరువాత మంత్రి వద్ద చర్చలు జరుపుదామని గ్రామ పెద్దలు వెంపడాపు నీలకంఠం, బోడసింగి సత్యం, గిరడ రాందాసు, యల్లంటి శివ, మీసాల సీతారాం లకు చెప్పిన్పటికీ గ్రామస్థులు వినలేదు. ఎట్టి పరిస్థితుల్లో శంకుస్థాపన జరగనివ్వబోమని, గ్రామంలో ఉన్న వారెవ్వరికీ ఇష్టం లేని పని చేయాలనుకుంటే ఫలితం తీవ్రంగా ఉంటుందని తేల్చి చెప్పారు. గ్రామ పెద్ద బోడసింగి సత్యం మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నప్పుడు తమ గ్రామానికి రోడ్డు వేశారని ఇప్పటికీ ఎప్పటికీ ఆ మంచి చెప్పుకుంటున్నామని, ఇప్పుడు ఆస్పత్రి కడితే ఆ చెడ్డ టీడీపీ మూట కట్టుకోక తప్పదని హెచ్చరించారు. కొబ్బరికాయ కొట్టాలంటూ పీఎస్ ఆదేశాలు ఇదిలా ఉండగా ఎలాగైనా కొబ్బరికాయ కొట్టాలంటూ మంత్రి మృణాళిని పీఎస్ నుంచి తహసీల్దార్ గోవిందరావుకు ఫోన్ ఒత్తిళ్లు ఎక్కువయ్యారుు. తహసీల్దార్ అటు గ్రామస్తులు, ఇటు ప్రజాప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేక పోరుుంది. ముందు మంత్రితో చర్చలు ఏర్పాటు చేయాలని తరువాతే శంకుస్థాపన జరపాలని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఇక చేసేదేమీ లేక ఈ నెల 21న మంత్రితో చర్చలు ఏర్పాటు చేశారు. అంతవరకు శంకుస్థాపన జరగదని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. -
తిరుపతిలో సైన్స్ మ్యూజియం
అంతర్జాతీయ {పమాణాలతో నిర్మాణం జనవరి 3న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన తిరుపతి: తిరుపతిలో అంతర్జాతీయ స్థారుు సైన్స్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఇందుకోసం 50 ఎకరాలు కేటారుుం చాలని భావిస్తోంది. సోమవారం సాయంత్రం విజయవాడలో జరిగిన ఏపీ సైన్స కాంగ్రెస్ 2016 ప్రారంభ సభలో సీఎం చంద్రబాబునాయుడు సైన్స్ మ్యూజియంను ప్రకటించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేషమైన అభివృద్ధిని చూరగొంటున్న తిరుపతి పట్టణంలో మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. జనవరి 3న మొదలయ్యే ఇండియన్ సైన్స కాంగ్రెస్ సదస్సును ప్రారంభిం చేందుకు హాజరయ్యే ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా సైన్స మ్యూజియం నిర్మాణ పనులకు శంకుస్థాపన జరుగుతుని సీఎం చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణా లు, అన్ని వసతులతో దీన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 3 నుంచి ఏడో తేదీ వరకూ జరిగే ఇండియన్ సైన్స కాంగ్రెస్ ముఖ్యాంశాలను రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా నుంచి యువ శాస్త్రవేత్తలుగా ఎంపికై న నలుగురు శాస్త్రవేత్తలను సీఎం చంద్రబాబునాయుడు అభినందించారు. యువ శాస్త్రవేత్తలకు అవార్డులు ఆంధ్రప్రదేశ్ సైన్స అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో జరిగిన 2016-ఏపీ సైన్స కాంగ్రెస్ వేడుకల్లో జిల్లాకు చెందిన నలుగురు యువ శాస్త్రవేత్తలకు అవార్డులు లభించారుు. సైన్స పరంగా అభివృద్ధి, పరిశోథన రంగాల్లో రాణిస్తోన్న వీరిని ప్రత్యేకంగా అభినందించారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఎస్ శాంతిసుధ (కెమికల్ సైన్స), డాక్టర్ రోజా రమణ్ (అట్మాస్పియరిక్ సైన్స)లతో పాటు గాదంకి రాడార్ కేంద్రం (ఎన్ఏఆర్ఎల్) శాస్త్రవేత్తలు డాక్టర్ వరాహ రవికిరణ్, షేక్ గౌస్భాషాలకు అవార్డులు లభించారుు. సీనియర్ శాస్త్రవేత్తల సమక్షంలో వీరు అవార్డులను అందుకున్నారు. -
నిధుల గోల్మాల్
ఐఐటీ ఫౌండేషన్ కోర్సుకు గ్రహణం కాకినాడలో పలు పాఠశాలల నిర్వహణ తీరుపై ఆరోపణలు భానుగుడి (కాకినాడ) : సమాజాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాల్సిన అధ్యాపకులే ’కంచె చేను మేసిన చందం’గా మారారు. ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఐఐటీ ఫౌండేషన్ కోర్సుకు తూట్లు పొడిచేందుకు తెగించారు. ఈ కోర్సు లక్ష్యం చేరుకోవాలంటే మరిన్ని సంస్కరణలు తీసుకు రావాలని ఉపాధ్యాయ లోకం కోడై కూస్తుంది. లేకుంటే దీని కోసం వెచ్చిస్తున్ననిధులు ఆమ్యామ్యాలకే సరిపోతాయని ఉపాధ్యాయులు అంటున్నారు. 36 సెంటర్లు.. 3,655 మంది విద్యార్థులు జిల్లాలో 9 మున్సిపాల్టీలకు సంబంధించి ఇంగ్లిషు మీడియం బోధన జరుగుతున్న 36 పాఠశాలల్లో ఈ ఫౌండేషన్ కోర్సు అందిస్తున్నారు. వేలమంది విద్యార్థులున్నప్పటికీ ఈ కోర్సుకు ఆసక్తి చూపుతున్న విద్యార్థులకు మాత్రమే బోధన జరుగుతుంది. జిల్లాలో 3,655 మంది విద్యార్థులు ప్రస్తుతం ఫౌండేషన్ కోర్సు అభ్యసిస్తున్నారు. కాకినాడలో 11 పాఠశాలలకు సంబంధించి 10 సెంటర్లలో 1200 మంది విద్యార్థులు కోర్సు నేర్చుకుంటున్న వారిలో ఉన్నారు. ఈ కోర్సుకు సంబం«ధించి జిల్లా కో ఆర్టినేటర్తో పాటు ఐదుగురు కన్వీనర్లు పనిచేస్తున్నారు. నిధులు విడుదల మున్సిపల్ కమిషనర్‌కు, పద్దుల నిర్వహణ పాఠశాల ప్రధానోపాధ్యాయునికి ప్రభుత్వం అప్పగించింది. ఇవిగో ఆరోపణలు కాకినాడ, రామచంద్రపురం మున్సిపాల్టీల్లో వేసవిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు రాకున్నా తరగతులు నిర్వహించినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. వేసవిలో 24 రోజుల పాటు, రోజుకు 4 గంటల చొప్పున తరగతులు నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులు లేకపోవడంతో ఆరు నుంచి 9 వరకు విద్యార్థులకు తరగతులు జరిగాయి. వేసవిలో జరిగిన తరగతులకు సంబంధించి ఒక్కో సెంటర్‌కు రూ.96 వేల వరకు నిధులు విడుదలయ్యాయి. జిల్లాలో కాకినాడలో 8, రామచంద్రపురంలో 6 సెంటర్లలో వేసవిలో ఐఐటీ ఫౌండేష¯ŒS తరగతులు నిర్వహించినట్లు సమాచారం. జిల్లాకు సంబం«ధించి రూ.14 లక్షల వరకు నిధులు విడుదలయ్యాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులే తూతూ మంత్రంగా తరగతులు నిర్వహించి, ఆనక ఉపాధ్యాయులతో బలవంతంగా సంతకాలు చేయించుకుని డబ్బులు డ్రా చేశారని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులే ఆరోపిస్తున్నారు. కాకినాడలోని ఆనందభారతి, గుడారిగుంట పాఠశాలల్లో ఈ తరహా మోసం జరిగినట్లు సమాచారం. డబ్బులు డ్రా చేసుకుని పాఠశాల ఉపాధ్యాయులు నోరుమెదపకుండా ఉండేందుకు ’విందు’భోజనాలిచ్చారని దీనిపై అధికారులు సమగ్ర విచారణ నిర్వహించి నిజానిజాలు వెలికితీయాలని ఉపాధ్యాయ వర్గాలు కోరుతున్నాయి. ఇటువంటి అక్రమాలను సహిస్తూ పోతే విద్యావ్యవస్థకే చేటు వచ్చే ప్రమాదముందని గగ్గోలు పెడుతున్నాయి. ఆది నుంచీ సిగపట్లే మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థులు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు పొందేందుకు, కాంపిటేటివ్ పరీక్షలకు పాఠశాల స్థాయి నుంచే సన్నద్ధం చేసేందుకు ప్రత్యేకంగా ఐఐటీ ఫౌండేష¯ŒS కోర్సును ప్రభుత్వం 2015లో ఏర్పాటు చేసి, ఈ ఏడాది జులై 29న ప్రారంభించింది. కోర్సు ప్రారంభానికి ముందు ప్రైవేటు సిబ్బందిని నియమించడంతో ఉపాధ్యాయులు కోర్సును వ్యతిరేకించారు. తర్వాత పాఠశాల ఉపాధ్యాయులకే ఈ బాధ్యతను అప్పగించడంతో ఆమోదం తెలిపారు.పిరియడ్‌కు రూ.250 చొప్పున ప్రభుత్వం సబ్జెక్టు టీచర్‌కు అందిస్తుంది. పాఠశాల పనివేళల్లో కాకుండా పాఠశాల ముగిశాక తరగతులు నిర్వహించేలా కార్యక్రమం రూపుదిద్దుకుంది. ప్రస్తుతం అన్ని పాఠశాలల్లోను వాల్యుమ్–1 చివరి దశలో ఉంది. వారానికి 12 పిరియడ్ల చొప్పున కేటాయించారు. ఇందులో గణితం–4, ఫిజిక్స్–2, కెమిస్ట్రీ–2, బయాలజీ–2, ఇంగ్లిష్–1, వారానికి ఒక పరీక్షతో కలుపుకుని 12 పిరియడ్లు. వాల్యుమ్–1కు సంబంధించి 106 పిరియడ్లు. ప్రతి తరగతికి రెండు వాల్యుమ్లు ఉంటాయి. విద్యార్థి పదో తరగతి పూర్తయ్యే నాటికి 12 వాల్యుమ్లు పూర్తవుతాయి. అవాస్తవాలే..! పాఠశాలల్లో ఇటువంటి గోల్మాల్ వ్యవహారాలు జరిగే అవకాశమే లేదు. వేసవి తరగతులకు సంబం«ధించి జిల్లా కో ఆర్డినేటర్‌తో పాటుగా, కన్వీనర్లు సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. వారంతంలో పరీక్షలు సైతం నిర్వహించారు. ఇవన్నీ కింది నుంచి పై స్థాయి వరకు పరిశీలన జరిగాకే నిధులు మంజూరు చేశారు. అందువల్ల ఏ పరిస్థితిలోను ఇలాంటి డబ్బులు కాజేసే పనులు జరగలేదు. ఉన్నతాధికారులకు ఈ ఆరోపణలపై ఫిర్యాదు చేస్తాం. – ఎస్వీఎల్ రాజు, ఐఐటీ ఫౌండేషన్ కోర్సు జిల్లా ప్లానింగ్ కో ఆర్డినేటర్ -
రాజధాని పేరుతో నాలుగు శంకుస్థాపనలు
పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సాక్షి, హైదరాబాద్/అమరావతి: నూతన రాజధాని పేరుతో ఇప్పటికే నాలుగు సార్లు శంకుస్థాపనలు చేశారని చంద్రబాబుపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో వారు మాట్లాడారు. ఈ నెల 28న పరిపాలన భవనాల కోసం అంటూ అరుణ్ జైట్లీని చంద్రబాబు, బాబును వెంకయ్య అభినందించడానికే శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు.ప్రజల సొమ్ముతో ఇంకా ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారో తెలియడం లేదని మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వం పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చట్టంలో పేర్కొంటే బాబు అసమర్థత, చేతగానితనం, బలహీనతల వల్లనే తన మకాం హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చాడని ఆరోపించారు. స్విస్ చాలెంజ్లోని అవకతవకలు కప్పి పుచ్చుకోవడానికి ప్రభుత్వానికి అనుకూలంగా ఆర్డినెన్స్‌ను మార్చుకున్నారని విమర్శించారు. -
ఏపీ రాజధానికి ఎన్ని శంకు స్థాపనలో !
-
తెలుగు వెలుగులు
-
ఆలయ నిర్మాణానికి భూమి పూజ
చౌటుప్పల్: ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని ధర్మోజిగూడెంలో సీతారామచంద్ర స్వామి దేవాలయ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొంతం రాంరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్ బత్తుల శ్రీహరి, కొంతం కృష్ణారెడ్డి, బుచ్చిరెడ్డి, సుశీల, పద్మ, పగిళ్ల నర్సిరెడ్డి, భూపాల్‌రెడ్డి, సామిడి అంజిరెడ్డి, రాంచంద్రారెడ్డి, కొంతం దామోదర్‌రెడ్డి, లింగారెడ్డి, రాఘవరెడ్డి, సింహాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
తుంగతుర్తి విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిత్ర సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు కె.వేణు కోరారు. మంగళవారం మండలంలోని పసునూర్ జెడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాలల్లోని గ్రంథాలయాలకు పుస్తకాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి తన జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం పుస్తకాలు ఎంతో ఉపయోగపడుతాయని చెప్పారు. ఉన్నత పాఠశాలలో రూ.10వేలు విలువ చేసే పుస్తకాలు, ప్రా«థమిక పాఠశాలలో రూ.5వేల విలువ చేసే పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ తొడుసు లింగయ్య, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మురళి, వెంకటమల్లు, మిత్ర సేవా ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ ఏ.రఘు, కోశాదికారి విజయ్‌కుమార్, సభ్యులు సంపత్, కిరణ్, ప్రవీణ్, ఉపేందర్ తదితరులు ఉన్నారు. -
సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
బరాఖత్‌గూడెం(మునగాల): మండంలోని బరాఖత్‌గూడెం గ్రామపంచాయతీలోని ఒకటవ వార్డులో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నిధలు నుంచి రూ.ఐదు లక్షలతో నిర్మించే సీసీరోడ్డు నిర్మాణపు పనులకు శనివారం జెడ్పీటీసీ సభ్యుడు కోల ఉపేందర్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే నిధులు నుంచి ఇప్పటికే లక్షల రూపాయల నిధులతో మండలంలోని పలు గ్రామాలలో సీసీరోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. జిల్లా పరిషత్ సమవేశాల్లో ఎప్పటికప్పుడు మండల సమస్యలను ప్రస్తావిస్తూ పరిష్కారానికి తన వంతు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కాలే జయమ్మ, ఎంపీటీసీ సభ్యులు అమరబోయిన మట్టయ్య యాదవ్, జిల్లా వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ వేనేపల్లి రమేష్, మాజీ సర్పంచ్ గడ్డం చంద్రారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలే సామియేలు, షేక్ హాబీబ్, గ్రామపెద్దలు ఎనుగుల నాగేశ్వరరావు, కాలే సామియేలు, మొలుగూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
గోదాంల నిర్మాణానికి శంకుస్థాపన
వాయిలసింగారం(నడిగూడెం): మండల పరిధిలోని వాయిలసింగారంలో నిర్మించనున్న వ్యవసాయ గోదాం నిర్మాణపు పనులకు టాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంపటి రూప వెంకటేశ్వరరావు, జిల్లా సహకార సంఘం చైర్మన్ ముత్తవరపు పాండు రంగారావు, తెల్లబెల్లి సింగిల్‌విండో చైర్మన్ చుండూరు వెంకటేశ్వరరావు, సీఈఓ దేవబత్తిని శ్రీనివాసరావు, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
కూచిపూడి(కోదాడరూరల్): మండల పరిధిలోని కూచిపూడిలో రూ.3లక్షల జెడ్పీ నిధులతో చేపటì ్టన సీసీ రోడ్డు పనులకు సోమవారం డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తగిన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మందలపు శేషు, సర ్పంచ్ చిన్నపంగు సుందర్రావు, ఉపసర్పంచ్ చేతుల రామకృష్ణ, శిరంశెట్టి తిరపతయ్య, బాబురావు, పూర్ణచందర్రావు, ముత్యాలు, వీరయ్య, రాము, నాగేశ్వరావు, చంద్రయ్య పాల్గొన్నారు. -
సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
కూచిపూడి(కోదాడరూరల్): మండల పరిధిలోని కూచిపూడిలో రూ.3లక్షల జెడ్పీ నిధులతో చేపటì ్టన సీసీ రోడ్డు పనులకు సోమవారం డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తగిన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మందలపు శేషు, సర ్పంచ్ చిన్నపంగు సుందర్రావు, ఉపసర్పంచ్ చేతుల రామకృష్ణ, శిరంశెట్టి తిరపతయ్య, బాబురావు, పూర్ణచందర్రావు, ముత్యాలు, వీరయ్య, రాము, నాగేశ్వరావు, చంద్రయ్య పాల్గొన్నారు. -
పరిశ్రమల స్థాపనకు ప్రజాపోరాటాలు
రాజంపేటః వైఎస్సార్ జిల్లాపై సీఎం చంద్రబాబు వివక్ష చూపిస్తున్నారని, పరిశ్రమల ఏర్పాటుకు ప్రజాపోరాటలే శరణ్యమని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడి అన్నారు. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలంటూ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపే కార్యక్రమాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆధ్వర్యంలో రాజంపేటలో ఎంపీ మిథున్‌రెడ్డిని కలిసి కోరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ టీడీపీ పాలన రెండేళ్లలో జిల్లాకు ఏ ఒక్క పరిశ్రమ రాలేదన్నారు. జిల్లాకు ఏమైనా చేయాలంటే అది ఒక్క వైఎస్సార్సీపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయినా తర్వాతే సాధ్యపడుతుందని తెలిపారు. సీఎం తనయుడు లోకోష్ డైరక్షన్లో కార్పొరేట్ పాలిట్రిక్స్ రాష్ట్రంలో కొనసాగుతున్నాయన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ ఉపాధి లేక నిరుద్యోగ యువత దిక్కుతోచని పరిస్థితిలో ఉందన్నారు. 2007లో దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో బ్రహ్మిణి ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన జరగడంతో సీమవాసుల ఆశలు చిగురించాయని, ఆ ఆశలు నేడు నీరుగారాయని పేర్కొన్నారు. పంచాయతీ, మండలపరిషత్తులు, జిల్లా పరిషత్తులు, ఎంపీ, ఎమ్మెల్యేలు జిల్లాలో తక్షణమే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టి శంకుస్థాపన చేయాలని తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి, సహాయకార్యదర్శి టీ.రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
కొమరబండలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
కొమరబండ(కోదాడరూరల్): మండలంలోని కొమరబండలో రూ.9లక్షల ఎంపీ, ఎమ్మెల్యే అభివృద్ధి నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు బుధవారం సర్పంచ్ సంపెటరవిగౌడ్, ఎంపీటీసీ బత్తుల వెంకన్నలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వంగవీటి రామారావు, పీఆర్ఎఈ సీహెచ్.లక్ష్మారెడ్డి, ఉపసర్పంచ్ శకుంతల, కార్యదర్శి రాబిన్, వీఆర్వో దిలావర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
బస్‌షెల్టర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
ఇంద్రియాల (భూదాన్‌పోచంపల్లి) : మండలంలోని ఇంద్రియాలలో ఆదివారం రూ.2లక్షల వ్యయంతో నిర్మిస్తున్న కొప్పుల దామోదర్‌రెడ్డి స్మారక బస్‌షెల్టర్ నిర్మాణ పనులకు సర్పంచ్ బండి కృష్ణగౌడ్ ప్రారంభించారు. ఈ షెల్టర్ నిర్మాణానికి కొప్పుల దామోదర్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఆర్థికసాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో కొప్పుల లింగారెడ్డి, ఎంపీటీసీ సంతోష్‌కుమార్, చింతల రామకృష్ణ, జగతి, గరిసె జంగయ్య, శ్రీశైలం, బద్దం రాజేశ్వర్, జంగారెడ్డి, వెంకటేశ్, శంకర్, మధు, గోవర్ధన్ పాల్గొన్నారు. -
పాలిటెక్నిక్ భవన నిర్మాణాలకు రూ.18కోట్లు
పాలిటెక్నిక్ భవన నిర్మాణాలకు రూ.18కోట్లు మెదక్‌లో పలు అభివృద్ధి పనులకుశంకుస్థాపనలు భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మెదక్: మెదక్ జిల్లాలో 7పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా, వసతి గృహాలు లేని మూడు కళాశాలల్లో భవన నిర్మాణాలకై రూ. 18కోట్లు మంజూరు చేయించడం జరిగిందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. శనివారం మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెదక్జిల్లాలోని జహీరాబాద్, నర్సాపూర్, నారాయణఖేడ్, చేగుంట, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌లలో పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయన్నారు. వీటిలో మూడింటికి వసతి గృహాలకోసం రూ.18కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 22 పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా రూ.66కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. మెదక్ పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలకు రూ.2.27కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే మహిళా జూనియర్ కళాశాల నిర్మాణం కోసం రూ.1.25కోట్లు మంజూరు కాగా శంకుస్థాపన చేశారు. మెదక్ బాలుర జూనియర్ కళాశాలలో అదనపు గదుల కోసం రూ.1.25కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రహరిగోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రహరిగోడ నిర్మాణానికి రూ.75లక్షలు మంజూరు చేయించడం జరిగిందన్నారు. మైనార్టీ రెసిడెన్సియల్ కళాశాల భవనం కోసం రూ.20కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అలాగే మెదక్,సిద్దిపేట, సంగారెడ్డిలలో ఎస్సీ మహిళా రెసిడెన్సియల్ కళాశాలలకోసం పక్కా భవనాల నిర్మాణానికి రూ.90కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. వచ్చే ఆగస్టు మాసం నుండి అన్ని కళాశాలల్లో మధ్యాహ్న భోజనం సన్నబియ్యం పెట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, డీసీసీబి చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్‌చైర్మన్ రాగి అశోక్, ఆర్డీఓ మెంచు నగేష్, తహశీల్దార్ అమీనొద్దీన్, ఎంపీడీఓ రాంబాబు, ఎంపీపీ లక్ష్మికిష్టయ్య, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఆయా అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
వంతెన నిర్మాణానికి తుమ్మల శంకుస్థాపన
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ మండలంలోని మూలవాగుపై నిర్మించబోయే నూతన వంతెన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ వంతెనను సుమారు రూ. 28 కోట్లతో నిర్మిస్తున్నారు. అనంతరం హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రమేశ్ బాబుతో పాటు పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
మేడిగడ్డకు త్వరలోనే శంకుస్థాపన
► మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ ► శంకుస్థాపనకు రానున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, కేంద్ర మంత్రి గడ్కరీ సాక్షి, హైదరాబాద్: గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో వీలైనంత త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. మహారాష్ట్ర పర్యటన అనంతరం క్యాంపు కార్యాలయంలో తనను కలవడానికి వచ్చిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం మాట్లాడారు. ముంబై పర్యటన విజయవంతమైందని, మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని పేర్కొన్నారు. త్వరలోనే మేడిగడ్డ బ్యారేజీకి శంకుస్థాపన చేస్తామని, ఈ కార్యక్రమానికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరవుతారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో వరంగల్, కరీంనగర్ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని, ఈ రెండు జిల్లాలు గోదావరి జిల్లాలుగా మారబోతున్నాయని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాకు పూర్వవైభవం వస్తుందన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్‌తో ఎస్సారెస్పీకి కూడా మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీరు పంపించవచ్చని, ఉత్తర తెలంగాణతో పాటు అవసరమనుకుంటే దక్షిణ తెలంగాణకు నీటిని అందించేలా ప్రాజెక్టులు డిజైన్ చేసుకోవాలని అన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి ద్వారా పెద్ద మొత్తంలో నీరు గోదావరిలో కలుస్తోందని, ఏడాదికి సగటున2,423 టీఎంసీల నీరు దిగువకు పోతోందని సీఎం చెప్పారు. ఈ నీటిని పంట పొలాలకు అందించటమే లక్ష్యంగా పని చేయాలని నేతలకు సూచించారు. ఖమ్మం జిల్లాలో గోదావరిపై దుమ్ముగూడెం బ్యారేజీ నుంచి జగన్నాథపురం, రోళ్లపాడు రిజర్వాయర్ల ద్వారా జిల్లా మొత్తానికి నీరందించగలుగుతామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భూసేకరణ తదితర పనులను దగ్గరుండి పర్యవేక్షించాలని, ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, జగదీష్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీలు బాల్క సుమన్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా, హైదరాబాద్ నుంచి బోధన్ వరకు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు. ఈ మేరకు మంగళవారం గడ్కరీతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. హైదరాబాద్-నర్సాపూర్-మెదక్-బోధన్ రహదారిలో రద్దీ ఎక్కువైందని, అందుకే జాతీయ రహదారిగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. బోధన్ నుంచి ఇప్పటికే మహారాష్ట్రకు జాతీయ రహదారి ఉన్నందున 2 రాష్ట్రాల మధ్య రవాణాకు ఇది దోహదపడుతుందని సీఎం చెప్పారు. మహారాష్ట్రతో జరిగిన ఒప్పందాన్ని వివరించి, ఒప్పందానికి సహకరించినందుకు గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ శంకుస్థాపనకు రావాల్సిందిగా ఆహ్వానించారు. మహారాష్ట్ర గవర్నర్‌కు కృతజ్ఞతలు అంతర్రాష్ట ప్రాజెక్టులపై మహారాష్ట్రతో ఒప్పందం కుదరడంలో ముఖ్య పాత్ర పోషించటంతో పాటు సహకరించిన మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుకు కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముంబైలో ఒప్పందం కుదిరిన తర్వాత ఆయన రాజ్‌భవన్‌లో విద్యాసాగర్‌రావును కలిశారు. మేడిగడ్డ బ్యారేజీకి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని, ఆ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. -
కొత్త అధికార నివాసానికి కేసీఆర్ శంకుస్థాపన
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కొత్త అధికార నివాసానికి శంకుస్థాపన చేశారు. శనివారం కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి భూమి పూజ చేశారు. హైదరాబాద్‌లో సీఎం ప్రస్తుత క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న ఐఏఎస్ క్వార్టర్స్‌ను కూల్చివేసి నూతన భవనాన్ని నిర్మించనున్నారు. భూమిపూజ కార్యక్రమానికి తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, సీఎంవో అధికారులతో పాటు పలువురు నేతలు, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్‌రావు హాజరయ్యారు. -
విశాఖలో ‘సమీర్’కు కేంద్రమంత్రి శంకుస్థాపన
► ఏర్పాటుకానున్న ఎలక్ట్రానిక్ రీసెర్చ్, ఇంక్యుబేషన్ కేంద్రాలు విశాఖపట్నం: సాగర నగరిలో మరో ప్రతిష్ఠాత్మక కేంద్రం ఏర్పాటు కానుంది. విశాఖలో కేంద్ర కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో రూ.80.02 కోట్లతో గంభీరం ఐటీ సెజ్‌లో ఏర్పాటు కానున్న సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్(సమీర్) సెంటర్‌కు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం శంకుస్థాపన చేశారు. ఎలక్ట్రానిక్ రీసెర్చ్ సెంటర్, ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేసే ‘సమీర్’ విశాఖలో ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఇంటర్ఫిరెన్స్ అండ్ కంపాటిబిలిటీ విభాగంలో పరిశోధనలు చేస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలకు అవసర మైన ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్‌కు ఇది వేదిక కానుంది. దీనివల్ల రక్షణ రంగంతో పాటు అకడమిక్ ఇన్స్టిట్యూషన్స్, పబ్లిక్, ప్రైవేటు రంగాల్లో పరిశోధనల స్థాయి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. ఎలక్ట్రోమ్యాగ్నటిక్ సంబంధిత ఇంటర్ఫిరెన్స్, కంపాటిబిలిటీ, పల్స్ తదితర సౌకర్యాలను ఈ కేంద్రం కల్పిస్తుంది. దీని ద్వారా తూర్పు తీరం లో ఐటీ ఉత్పత్తుల విక్రయ, వినియోగదారులకు ల బ్ధి చేకూరనుంది. ఆర్మీ, నేవల్ సైన్స్ అండ్ టెక్నాల జీ ల్యాబ్, డీఆర్డీవో తదితర సంస్థల అవసరాలకు అనుగుణంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రూ.45 కోట్లతో ఇంక్యుబేషన్ కేంద్రం కాగా విశాఖలో ఐటీకి ఊతమిచ్చే ఇంక్యుబేషన్ సెంటర్ ప్రతిపాదన ఎట్టకేలకు కార్యరూపం దాల్చుతోంది. ఈ కేంద్ర నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని వుడా కేటాయించగా, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కు ఆఫ్ ఇండియా నిర్మాణం చేపట్టబోతోంది. సిరిపురం జంక్షన్లో ఉన్న వుడా స్థలంలో ఈ కేంద్రాన్ని రూ.45 కోట్లతో నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర కమ్యూనిషన్ అండ్ ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ల సమక్షంలో గురువారం దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకోనున్నారు. ఈ రెండు కేంద్రాల ఏర్పాటుతో సుమారు 25వేల మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. -
లోక్ నాయక్ ఫౌండేషన్ వార్షికోత్సవ వేడుకలు
-
విద్యాయంత్ర సంస్థ ఉచితంగా కంప్యూటర్ల పంపిణీ
-
డబుల్‌బెడ్ రూం ఇళ్ల కోసం క్యూ...
కలెక్టరేట్‌కు తరలివస్తున బస్తీవాసులు మహిళలతో కిటకిలాడుతున్న ‘మీ కోసం’ సర్దిచెప్పలేక అధికారుల తంటాలు సిటీబ్యూరో: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దరఖాస్తులతో వచ్చిన మహిళలతో హైదరాబాద్ కలెక్టరేట్ కోలాహలంగా మారింది. త్వరలో జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నేతలు నగరంలోని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై హామీలు కురుపిస్తుండటంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఏ ఆసరా లేని నిరుపేద ప్రజలు ఇళ్ల దరఖాస్తులతో కలెక్టరేట్‌కు తరలి వస్తున్నారు. దీంతో మీ కోసం కార్యక్రమం వచ్చిందంటే చాలు అధికారులు భయపడుతున్నారు. వందల సంఖ్యలో వస్తున్న మహిళలు ఇళ్ల కోసం ఎక్కడ గందరగోళం సృష్టిస్తారోనన్న అందోళన వారిని వెంటాడుతున్నది. గతంలో అలాంటి పరిస్థితులు తలెత్తటమే ఇందుకు కారణం. దీనికి తగ్గట్టుగానే నగరంలో ఇటీవల నలుగురు రాష్ట్ర మంత్రులు వివిధ బస్తీల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయటం వంటి కార్యక్రమాలు...అనూహ్యంగానే మహిళలను కలెక్టరేట్‌కు రప్పిస్తున్నాయి. సోమవారం ఇళ్ల దరఖాస్తులు సమర్పించుకోవటానికి వచ్చి మహిళలతో కలెక్టరేట్ ప్రాంగణం నిండిపోయింది. వందలాదిగా మహిళ లు తమ ప్రాంతాల నుంచి వాహనాలు కట్టుకొని తరలివచ్చారు. దీంతో ఏమి చేయా లో తోచని అధికారులు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి కొంత మేరకు ఇళ్ల దరఖాస్తులను స్వీకరించారు. మధ్యాహ్నం వరకు ఈ సంఖ్య పెరుగటంతో దరఖాస్తుల స్వీకరణకు స్వస్తిచెప్పారు. కలెక్టరేట్ నుంచి వారిని సాగనంపారు. ఫలితంగా మహిళలు ఆవేదనకు గురయ్యారు. ఈ సందర్భంగా జేసీ భారతి హోళికేరి మాట్లాడుతూ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు సంబంధిత వెబ్సైట్లో నమోదు చేశామని, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు మాత్రమే అందజేయాలన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు కూడా పదే పదే వస్తున్నారని, ఇది సరికాదన్నారు. అర్హత, సీనియారిటీని బట్టి ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. -
19న ఎయిమ్స్‌కు శంకుస్థాపన
విజయవాడ: అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్ర సంస్థ (ఎయిమ్స్) నిర్మాణానికి కేంద్రప్రభుత్వం రూ.16,018 కోట్లు కేటాయించిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 19న మంగళగిరిలో ఎయిమ్స్ శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి చెప్పారు. మొత్తం 193 ఎకరాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎయిమ్స్ నిర్మాణం జరుగుతుందని వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతారని ఆయన తెలిపారు. -
డబుల్ బెడ్రూం ఇళ్ళకు KTR శంకుస్థాపన
-
'తిరుపతిని డిజిటల్ హబ్‌గా మార్చుతాం'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేణిగుంట విమానాశ్రయం సమీపంలో సెల్కాన్ మొబైల్ కంపెనీకి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సెల్కాన్ కంపెనీ ద్వారా యువతకు వేలాది ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రత్యక్షంగా 20 వేల ఉద్యోగాలు, పరోక్షంగా 40 వేల ఉద్యోగాల వరకు అందనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో తిరుపతిని డిజిటల్ హబ్‌గా మార్చనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రానికి త్వరలో మరిన్ని హార్డ్‌వేర్ కంపెనీలు రానున్నాయని తెలిపారు. -
అందరినీ నిరాశపరిచావు చంద్రబాబూ..!
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగర శంకుస్థాపన వేదికపై ప్రధాని మోదీని సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగకపోవడంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ తప్పుబట్టారు. చంద్రబాబు ప్రజలందరినీ నిరాశపరిచారని పేర్కొన్నారు. శనివారం ఆయన ట్వీటర్లో పలు విమర్శలు సంధించారు. ‘‘పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా అమలు చేయకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్లను విస్మరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. దాని కోసం పోరాటం చేస్తుంది. చంద్రబాబు కనీసం రాజధాని శంకుస్థాపన వేడుకలో ప్రత్యేక హోదాపై డిమాండైనా చేయలేదు. యూ డిసప్పాయింటెడ్ అజ్ బాబూ..!’’ అంటూ దిగ్విజయ్ ట్వీట్ చేశారు. Congress demands Special Status to AP and shall fight for it. Chandra Babu didn't even demand in the function. You disappointed us Babu — digvijaya singh (@digvijaya_28) October 24, 2015 -
రాజధానిలో 'అంతిమ యాత్ర' పై ఆంక్షలు!
-
రాజధానిలో 'అంతిమ యాత్ర' పై ఆంక్షలు!
-పశువులు వీధుల్లోకి రావొద్దుట -ఆంక్షలపై ప్రజల ఆగ్రహం తుళ్లూరు : ఏపీ రాజధాని ప్రాంతంలో మితిమీరిన ఆంక్షలతో ప్రజులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజధాని అమరావతికి శంకుస్థాపన నేపథ్యంలో పశువులు, కోళ్లు , పందులను వీధుల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవలంటూ అధికారులు బుధవారం గ్రామాల్లో మైక్ ద్వారా ప్రచారం చేయించారు. అంతటితో ఊరుకోకుండా ఎవరైనా చనిపోతే అంతిమయాత్రలూ నిర్వహించరాదంటూ ఆంక్షలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం స్థానిక దళితవాడలో ఓ యువకుడు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. యువకుడి మృతదేహాన్ని గురువారం ఊరేగింపుగా తీసుకుని ఖననం చేయాలని బంధువులు నిర్ణయించారు. అయితే ఇందుకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్నందున మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లకూడదని చెప్పడంతో స్ధానికలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో మృతదేహాల ఖనన కార్యక్రమాలపై కూడా ఆంక్షలా.. అంటూ మండిపడుతున్నారు. -
కొత్త కళ
మరో నాలుగు బస్తీల్లో డబుల్బెడ్రూమ్ ఇళ్లు పేదలకు సర్కారు దసరా కానుక నేడు శంకుస్థాపన సిటీబ్యూరో: స్లమ్ ఫ్రీ సిటీలో భాగంగా నగరంలో మరో నాలుగు బస్తీల్లోని ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్ బోయిగూడ ఐడీహెచ్ కాలనీ తరహాలో గ్రేటర్‌లోని నాలుగు నియోజకవర్గాల పేదలకు దసరా కానుకగా ఇవి ప్రారంభం కానున్నాయి. ఈ ఇళ్లకు నేడు (గురువారం) శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర మంత్రులు నాయిని నరసింహారెడ్డి, టి.పద్మారావు, మహేందర్‌రెడ్డి, కె.టి.రామారావులు వీటికి శంకుస్థాపనలు చేస్తారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షత వహించనున్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ క్రాస్‌రోడ్స్ దగ్గర చిత్తారమ్మబస్తీ, సనత్‌నగర్ నియోజకవర్గంలోని హమాలీ బస్తీ, సికింద్రాబాద్ నియోజకవర్గంలోని చిలకలగూడ దోబీఘాట్, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ దగ్గరి ఎరుకల నాంచారమ్మ నగర్లలో ఈ ఇళ్ల నిర్మాణానికి స్థలాలు ఎంపిక చేశారు. బోయిగూడలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌కూ గురువారమే శంకుస్థాపన చేయనున్నారు. అందరికీ అవకాశం కల్పించాలని... రజకులు తదితరుల కోసం దోబీఘాట్లో ఇళ్లు నిర్మిస్తుండగా... మిగతా ప్రాంతాల్లో స్థానికంగా గుడిసెల్లో, చిన్నా చితకా ఇళ్లల్లో తలదాచుకుంటున్న వారి కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించనున్నారు. జ్లీపస్ 2 పద్ధతిలోనా లేక అంతకంటే ఎక్కువ అంతస్తుల్లోనా అనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. లబ్ధిదారుల సంఖ్య, స్థానికుల నుంచి ఎదురేయ్యే అభ్యంతరాలు తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని దీన్ని ఖరారు చేయనున్నారు. ఎక్కువ అంతస్తుల్లో ఎక్కువ ఇళ్లు నిర్మిస్తే స్థానికంగా ఉంటున్న అందరికీ అవకాశం కల్పించవచ్చని భావిస్తున్నారు. త్వరలో ఐడీహెచ్ కాలనీ ప్రారంభం గత సంవత్సరం దసరా రోజున శంకుస్థాపన జరిగిన ఐడీహెచ్ కాలనీలోని ఇళ్లను గురువారం ప్రారంభించాలని తొలుత భావించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తుండటం.. పూర్తయిన ఇళ్లకు రంగులు, రహదారుల నిర్మాణం వంటివి పూర్తి కావాల్సి ఉండటంతో కొద్ది రోజుల తర్వాత ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఏర్పాట్లు పూర్తి చిలకలగూడ : చిలకలగూడ దోబీఘాట్ స్థలంలో సుమారు 200 ఇళ్ల నిర్మాణానికి గురువారం పంచాయితీరాజ్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు ఆబ్కారీ మంత్రి పద్మారావు బుధవారం రాత్రి దోబీఘాట్ స్థలాన్ని సందర్శించి హౌసింగ్, రెవెన్యూ అధికారులు, క్రాంతి రజక అభివృద్ధి సంఘం సభ్యులతో చర్చించారు. శంకుస్థాపన పనులను పరిశీలించారు. చిలకలగూడ దోబీఘాట్పై ఆధారపడి సుమారు 200 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఏళ్ల తరబడి సొంత ఇళ్లు లేక వీరంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నాళ్లకు మంత్రి పద్మారావు చొరవతో హౌసింగ్స్కీం అమలు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. -
కేసీఆర్ అమరావతి పర్యటన ఖరారు
-
ఏపీ రాజధాని శంకుస్ధాపనకు వెళ్తున్నా : సీఎం కేసీఆర్
మెదక్ : ఏపీ రాజధాని శంకుస్ధాపనకు గురువారం అమరావతికి వెళ్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చెప్పారు. అదే రోజు సాయంత్రం ఎర్రవెల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్ధాపన చేయనున్నట్లు తెలిపారు. ఎర్రవెల్లిలో 5 నెలల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని కూడా దసరా రోజున ప్రారంభించాలని తొలుత నిర్ణయించారు. కానీ, కేసీఆర్ అమరావతి పర్యటన కారణంగా ఈ ఇళ్ల ప్రారంభోత్సవం వాయిదా పడే అవకాశముంది. -
రాజధాని నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు: బొత్స
అమరావతి నిర్మాణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అయితే రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం చేస్తున్న అవినీతిని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. శంకుస్థాపన పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని స్పష్టంచేశారు. అందుకే శంకు స్థాపనను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో సింగపూర్ కంపెనీలతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఎద్దేవా చేశారు. ప్రచార ఆర్భాటం కోసం కోట్ల రూపాయలు వృధా చేస్తోందని విమర్శించారు. -
రోశయ్యకు 'కొరియర్' ఆహ్వానం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానాలు పంపడంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్యకు శంకుస్ధాపనకు సంబంధించి ఆహ్వాన పత్రికను కొరియర్లో పంపడంపై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలను రాచమర్యాదలతో పిలుస్తూ..రోశయ్యలాంటి సీనియర్ రాజకీయ నేతకు మాత్రం కొరియర్లో ఆహ్వానాన్ని పంపడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. -
శంకుస్థాపన ఖర్చుపై జగన్ లేఖ ఎఫెక్ట్
-
'మర్యాదల్లో తేడా చూపొద్దు'
గుంటూరు : ఏపి రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లు పై గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే సమీక్ష నిర్వహించారు. జెడ్పీ మీటింగ్ హల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దే శప్రదానితో పలు దేశాల నుంచి అతిథులు వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అతిథులకు ఎలాంటి మర్యాదలు చేస్తామో సామాన్య ప్రజలకు అదే స్థాయిలో మర్యాదలు చేయాలని కలెక్టర్ అన్నారు. అధికారులంతా సమన్వయంతో పని చేసి మంచి పేరు తీసుకురావాలన్నారు.