సాక్షి, మేడ్చల్ జిల్లా: ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగంలో తెలంగాణ దేశంలోనే తలమానికంగా ఉందని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కె. తారకరామారావు అన్నారు. గురువారం మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో గేట్ వే ఐటీ పార్కు, పూడూరులో ఆదర్శ ఫార్మర్స్ సర్వీస్ కో– ఆపరేటర్ భవన నిర్మాణానికి ఆయన జిల్లామంత్రి మల్లారెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు. కండ్లకోయ, పూడూరుల్లో ఏర్పాటు చేసిన సభల్లో కేటీఆర్ మాట్లాడుతూ కండ్లకోయగేట్ వే ఐటీ పార్కు ద్వా రా తెలంగాణ మరింత అభివృద్ధి చెందడంతోపాటు ఐటీపరంగా అంతర్జాతీయస్థాయిలో పేరు సాధించ గలదన్నారు.
ఐటీ కంపెనీల ఏర్పాటుకు మేడ్చల్ ఎంతో అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. ము ఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజున ఐటీ పార్కుకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంద న్నారు. ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కండ్లకోయ ఐటీ పార్కు ఏర్పాటు చేయడం మంచి పరిణామమని అన్నారు. మేడ్చల్, కొంపల్లి ప్రాంతాల్లో పలు యూనివర్సిటీలతోపాటు ఎంఎం టీఎస్, జాతీయ రహదారులు ఉండటం ఐటీ హబ్‌కు కలసి వచ్చే అంశాలని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, రైతులందరూ ఆనందంగా ఉన్నారని మంత్రి తెలిపారు.
టాప్ –5 కంపెనీలు నగరంలోనే
గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ఐదు ప్రపం చ అగ్రశేణి సంస్థల అతిపెద్ద కార్యాలయాలు హైద రాబాద్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌కు పెట్టుబడులు పె ద్దఎత్తున వస్తున్నాయని, ఈ విషయంలో ప్రపంచం లోనే రెండోస్థానంలో ఉందని పేర్కొన్నారు. నైపు ణ్యాలు పెంచుకుంటే ఈ సంస్థల్లో ఉద్యో గాలన్నీ స్థానికులకే దక్కుతాయన్నారు. దేశ జీడీపీలో తెలం గాణ 5 శాతాన్ని అందిస్తోందని తెలిపారు.
ఓటమికి భయపడితే తెలంగాణ వచ్చేదికాదు
సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన ప్రజాజీవితం గురించిన పలు ఆసక్తికర విషయాలను కేటీఆర్ వెల్లడించారు. ‘ప్రత్యక్ష రాజకీయాల్లో మొదటిసారిగా కేసీఆర్ సింగిల్ విండో ఎన్నికల్లో డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. రాఘవపూర్ సొసైటీ చైర్మన్ అయ్యేందుకు మిగతా డైరెక్టర్ల మద్దతు కూడగట్టినప్పటికీ ఓడిపోయారు. ఇది కేసీఆర్‌కు ప్రజాజీవితంలో మొదటి ఎదురుదెబ్బ. ఆయనకు 29 ఏళ్లున్నç ³్పుడే 1983లో అప్పటి టీడీపీ అధినేత ఎన్టీఆర్ పిలిచి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చారు. సర్వశక్తులు ఒడ్డినా 750 ఓట్ల తేడాతో కేసీఆర్ ఓడిపోయారు.
ఆ ఓటమితో కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకుని ఉంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉండేదా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవారా’అని అన్నారు. ఎదురుదెబ్బలు తగిలినా, అపజయా లు కలిగినా, మొండిగా ముందుకెళ్తేనే విజయాన్ని ముద్దాడగలమని కేటీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ కుమార్, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ హరీశ్, ఎమ్మెల్యేలు వివేకానంద్, కృష్ణారావు, టీఆర్‌ఎస్ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment