అమరావతి నిర్మాణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.
అమరావతి నిర్మాణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అయితే రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం చేస్తున్న అవినీతిని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
శంకుస్థాపన పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని స్పష్టంచేశారు. అందుకే శంకు స్థాపనను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో సింగపూర్ కంపెనీలతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఎద్దేవా చేశారు. ప్రచార ఆర్భాటం కోసం కోట్ల రూపాయలు వృధా చేస్తోందని విమర్శించారు.