Live Updates
ఏపీ అసెంబ్లీ రేపటి(సోమవారం)కి వాయిదా
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పీచ్..
- చంద్రబాబు హయాంలో కేవలం స్కిల్ స్కామ్‌లోనే రూ.371 కోట్లు దోపిడీ
- చంద్రబాబు అధికారంలో వచ్చిన 2-3 నెలలకే స్కాం మొదలు
- తన మనుషులను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో పెట్టిన చంద్రబాబు
- కేవలం ఒక నోట్ ఆధారంగా స్పెషల్ ఐటైంగా కేబినెట్ ఆమోదం
- ప్రాజెక్టు డీపీఆర్, సర్టిఫికేషన్ లేకుండానే గ్రీన్ సిగ్నల్
- రూ.3356 కోట్ల ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వం ఆమోదం
- జీవోలో ఇదే అంశాన్ని పేర్కొన్న చంద్రబాబు సర్కారు
- ఒప్పందం సమయానికి వచ్చేసరికి జీవోలోని అంశాలు కనుమరుగు
- జీవోలోని అంశాలు, సంబంధిత లేఖలను ప్రస్తావించకుండానే సంతకాలు
- ఒక్కపైసా సీమెన్స్ నుంచి రాకుండానే డబ్బు విడుదల
- డబ్బు విడుదలకు ఆర్థికశాఖ అధికారుల అభ్యంతరం
- కన్నబాబు మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం ఓ దొంగల ముఠా కథ. డబ్బులు కొట్టేసే కార్యక్రమంలో టీడీపీ వాళ్లకు ఉన్న స్కిల్ ఎవరికీ లేదు.
- నిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది.
- కన్నబాబు మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం ఓ దొంగల ముఠా కథ. డబ్బులు కొట్టేసే కార్యక్రమంలో టీడీపీ వాళ్లకు ఉన్న స్కిల్ ఎవరికీ లేదు. నిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది.
చంద్రబాబు మంత్రి రోజా సవాల్
టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్ విసిరారు. టీడీపీకి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి. చంద్రబాబు, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు రాజీనామా చేసి ఎన్నికలు వస్తారా? అని ప్రశ్నించారు. కొద్ది మంది ఓటర్లు ప్రత్యేక ఎన్నికల్లో గెలుపు కాదు.. ప్రజా తీర్పుతో గెలుపొందాము. టీడీపీకి అంత నమ్మకం ఉంటే స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన లోకేష్ ఎందుకు పోటీ చేయలేదు. వైఎస్సార్‌సీపీ దెబ్బ ఎలా ఉంటుందో 2019లో చూపించాము. మళ్లీ 2024లో కూడా చూపిస్తాము. పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించే మగాడు పుట్టలేదు.
2:20PM
ఏపీ శానసమండలి రేపటికి వాయిదా
Time: 01:40 PM
చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై చర్చ
2014లో చంద్రబాబు ఇంటింటికి ఉద్యోగం అన్నారని.. నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఈఎస్‌ఐ, అమరావతి, స్కిల్ డెవలప్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. ‘‘గంటా సుబ్బారావు అక్రమంగా రూ.371 కోట్లు మళ్లించారు. షెల్ కంపెనీల ద్వారా కోట్లు దోచుకున్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం జరిగింది’’ అని కేతిరెడ్డి మండిపడ్డారు.
Time: 12:00PM
►ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. టీడీపీకి చెందిన 11 మంది సభ్యులను ఒకరోజుపాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.
Time: 11:20AM
►శాసనమండలిలో టీడీపీ సభ్యుల తీరుపై ఛైర్మన్ మోషేన్ రాజు ఆగ్రహం.
►మండలికి సంబంధంలేని అంశాలను ప్రస్తావించడం పట్ల అసంతృప్తి.
►ఎమ్మెల్సీ డిక్లరేషన్ ఇవ్వలేదంటూ టీడీపీ వాయిదా తీర్మానం.
►డిక్లరేషన్ అంశం ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశం.
►ఈ అంశం మండలికి సంబంధించినది కాదు.
►టీడీపీ సభ్యులు కావాలనే సభా సమయాన్ని వృథా చేస్తున్నారు.
►డిక్లరేషన్ అంశం మండలికి సంబంధించినది కాదు: ఉమ్మారెడ్డి.
►సభకు సంబంధంలేని అంశాలను చర్చించాలని టీడీపీ సభ్యులు గొడవ చేయడం మంచిది కాదు.
Time: 10:40AM
►అచ్చెన్నాయుడికి క్యారెక్టర్ లేదు: మంత్రి జోగి రమేష్
►పగటిపూట నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం మాది.
►మాది రైతు పక్షపాత ప్రభుత్వం.
►ఉచిత విద్యుత్ దండగని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు: మాజీ మంత్రి కన్నబాబు.
►చంద్రబాబు పుట్టుక కాంగ్రెస్, మామను చీట్ చేసి పార్టీని లాక్కున్నాడు.
►ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు టీడీప నేతలకు లేదు.
Time: 10:10AM
►ఆర్బీకేల ద్వారా రైతులకు సేవలు: జక్కంపూడి రాజా
►రైతుల సమస్యలను ఆర్బీకేలు పరిష్కరిస్తున్నాయి.
Time: 9:40AM
►రుణమాఫీ హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేశారు: ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్
►మ్యానిఫెస్టోలో చెప్పినదానికంటే రైతులకు అదనంగా సాయం చేస్తున్నాం.
►వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 అందిస్తున్నాం.
►ఆర్బీకేల ద్వారా రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఙానం అందిస్తున్నాం.
Time: 9:15AM
►రైతులను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు: ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి
►రైతులకు రూ. 900 కోట్ల బకాయి పెట్టిన వ్యక్తి చంద్రబాబు.
►చంద్రబాబు, కరువు కవల పిల్లలు.
►చంద్రబాబు హయాంలో మూడేళ్లు కరువే.
►మా ప్రభుత్వంలో ఒక్క కరువు మండలం లేదు.
►ఆర్బీకేల ద్వారా రైతులకు సేవలు అందిస్తున్నాం.
►పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం.
సాక్షి, అమరావతి: ఆరో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అనంతరం పలు శాఖల డిమాండ్లపై చర్చ జరగనుంది. అదే విధంగా గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్, యువతకు స్కిల్ డెవలప్‌మెంట్‌పై చర్చ కొనసాగనుంది.
అటు శాసన మండలిలో 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుంది. మండలిలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్, సమగ్ర భూ సర్వేపై సభ్యులు చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment