
అమరావతి, సాక్షి: మహిళకు బడ్జెట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇవాళ ఆసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మహాశక్తి పథకం కానరాకుండాపోయింది. 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1500 ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల్లో బాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే తాజాగా బాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మహిళలకు ఏడాదికి రూ. 18,000 ఆర్థిక సాయం ఉసేత్తకపోవటం గమనార్హం.
తల్లికి వందనం పథకానికి షాక్
బడ్జెట్‌లో తల్లికి వందనం పథకానికి కేవలం రూ.2,491 కోట్లు కేటాయించారు. సూపర్ సిక్స్ హామీల్లో.. స్కూల్‌కి వెళ్లిన ప్రతి పిల్లాడికి రూ.15,000 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రు. 10 వేల కోట్లకు పైగా అవసరం ఉన్నా.. కేవలం రూ.2,491 కోట్లు మాత్రమే కేటాయించి మమ అనిపించారు. ఇక.. ఇంటర్ విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం లేనట్టే. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి అమలు జరిగింది. ప్రతి ఏటా రూ. 6,400 కోట్లుకి పైగా అమ్మ ఒడి నిధులు గత వైఎస్ జగన్ ప్రభుత్వం జమ చేసింది. అమ్మ ఒడి ఈ ఏడాది ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా చంద్రబాబు ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవటం గమనార్హం.
చదవండి: వ్యవసాయ బడ్జెట్: రైతుల్ని దారుణంగా మోసం చేసిన చంద్రబాబు!
చదవండి: ఏపీలో ఆగని తప్పుడు కేసులు, వేధింపులు.. అక్రమ అరెస్టులు
Comments
Please login to add a commentAdd a comment