budget session
-
ఆరేళ్ల తర్వాత తొలి బడ్జెట్
జమ్ము: కొంగొత్త ఆశలతో ఆరేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో తొలి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కేబినెట్ ప్రతిపాదనకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం తెలపడంతో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం మార్చి మొదటి వారంలో తొలి అసెంబ్లీ సమావేశాలకు సమయాత్తమవుతుంది. అసెంబ్లీ సమావేశాలు మార్చి 3నుండి ప్రారంభమై 21 రోజుల పాటు జరగనున్నాయి. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 2025-2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జనవరి 21న ఒమర్ అబ్దుల్లా అధ్యక్షతన జరిగిన జమ్మూకశ్మీర్ కేబినెట్ మార్చి మొదటి వారం నుంచి సెషన్‌ను నిర్వహించాలని ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనకు సిన్హా ఆమోదం తెలిపారని, మార్చి మొదటి వారంలో సెషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.లెఫ్టినెంట్ గవర్నర్ మార్చి 3 నుంచి తొలి రాష్టబడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు స్పీకర్ రహీమ్ రాథర్తో సంప్రదింపులు జరిపారు. ఇరువురి చర్చల అనంతరం అసెంబ్లీ కార్యదర్శి తెలియజేస్తారని, సమావేశాల ప్రారంభ తేదీ,వ్యవధిని చర్చిస్తారని సమాచారం. కాగా, జమ్మూ కశ్మీర్లో శాసనసభ లేకపోవడంతో మునుపటి ఐదు బడ్జెట్లను పార్లమెంటు ప్రవేశపెట్టింది. అయితే పీడీపీ-బీజేపీ ప్రభుత్వం పతనం తర్వాత అప్పటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ నేతృత్వంలోని 2019-2020 బడ్జెట్‌ను ఆమోదించింది. -
31నుంచి బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: జనవరి 31వ తేదీన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. శుక్రవారం పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థికసర్వేను ప్రవేశపెట్టనున్నారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా చర్చ ఇరు సభల్లో కొనసాగనుంది.ఫిబ్రవరి ఒకటో తేదీన అంటే శనివారం రోజు మంత్రి నిర్మలా కేంద్ర సాధారణ బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ లోక్‌సభలో ఫిబ్రవరి 3, 4వ తేదీల్లో కొనసాగనుంది. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ మూడు రోజులపాటు కొనసాగనుంది. ఫిబ్రవరి ఆరో తేదీన చర్చపై రాజ్యసభలో ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు?
తదుపరి పార్లమెంటు బడ్జెట్ (Budget) సెషన్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లును (new income tax bill) ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాన్ని సులభ తరం, అర్థమయ్యేలా చేస్తుందని, అలాగే పేజీల సంఖ్యను 60% తగ్గిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.‘ఇది కొత్త చట్టం. ప్రస్తుత చట్టానికి సవరణ కాదు. ముసాయి దా చట్టాన్ని న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీ లిస్తోంది. దీనిని బడ్జెట్ సెషన్ రెండవ భాగంలో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది’ అని తెలిపాయి. ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం–1961ని ఆరు నెల ల్లో సమగ్రంగా సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 జూలై బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.బడ్జెట్ సెషన్ జనవరి 31 నుండి ఏప్రిల్ 4 వరకు జరగనుంది. మొదటి అర్ధభాగం (జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13) ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 2024-25 ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. 2025-26కి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు.పార్లమెంటు మార్చి 10న తిరిగి సమావేశమై ఏప్రిల్ 4 వరకు కొనసాగుతుంది. ఐటీ చట్టం 1961 సమగ్ర సమీక్ష కోసం సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రకటన మేరకు సమీక్షను పర్యవేక్షించడానికి, చట్టాన్ని సంక్షిప్తంగా, స్పష్టంగా, సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక అంతర్గత కమిటీని సీబీడీటీ ఏర్పాటు చేసింది. అలాగే చట్టంలోని వివిధ అంశాలను సమీక్షించేందుకు 22 ప్రత్యేక సబ్‌కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. -
చంద్రబాబు, పచ్చ మీడియా ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
-
బడ్జెట్లో మహిళలకు షాకిచ్చిన బాబు ప్రభుత్వం
అమరావతి, సాక్షి: మహిళకు బడ్జెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇవాళ ఆసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహాశక్తి పథకం కానరాకుండాపోయింది. 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1500 ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల్లో బాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే తాజాగా బాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళలకు ఏడాదికి రూ. 18,000 ఆర్థిక సాయం ఉసేత్తకపోవటం గమనార్హం.తల్లికి వందనం పథకానికి షాక్బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి కేవలం రూ.2,491 కోట్లు కేటాయించారు. సూపర్ సిక్స్ హామీల్లో.. స్కూల్‌కి వెళ్లిన ప్రతి పిల్లాడికి రూ.15,000 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రు. 10 వేల కోట్లకు పైగా అవసరం ఉన్నా.. కేవలం రూ.2,491 కోట్లు మాత్రమే కేటాయించి మమ అనిపించారు. ఇక.. ఇంటర్ విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం లేనట్టే. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి అమలు జరిగింది. ప్రతి ఏటా రూ. 6,400 కోట్లుకి పైగా అమ్మ ఒడి నిధులు గత వైఎస్ జగన్ ప్రభుత్వం జమ చేసింది. అమ్మ ఒడి ఈ ఏడాది ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా చంద్రబాబు ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవటం గమనార్హం.చదవండి: వ్యవసాయ బడ్జెట్: రైతుల్ని దారుణంగా మోసం చేసిన చంద్రబాబు!చదవండి: ఏపీలో ఆగని తప్పుడు కేసులు, వేధింపులు.. అక్రమ అరెస్టులు -
32 ప్రశ్నలు.. 5 బిల్లులు.. హాట్ హాట్ గా బడ్జెట్ సమావేశాలు
-
లోక్‌సభలో గందరగోళం
updatesవయనాడ్ జల విలయంపై లోక్ సభలో కాంగ్రెస్ సావధాన తీర్మానంమధ్యాహ్నం లోక్ సభలో చర్చ లోక్‌సభలో గందరగోళంఅనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై విపక్షాల ఆగ్రహం.కులగణనపై వ్యాఖ్యలు చేసిన అనురాగ్ ఠాకూర్అనురాగ్కు వ్యతిరేకంగా విపక్షాల నినాదాలు‘తమది ఏ కులమో కూడా తెలియని వారు కులగణన కోరుతున్నారు’ అంటూ మంగళవారం బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం రేపాయి. అవి రాహుల్‌ను ఉద్దేశించినవేనంటూ విపక్ష సభ్యులంతా తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యసభలో బీజేపీ విప్‌గా ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ నియామకం అధికార భాషా కమిటీకి ఎన్నిక కోసం కేంద్ర మంత్రి అమిత్ షా తీర్మానం చేయనున్నారు.Parliament Session Live: Amit Shah to move motion for election to Committee on Official LanguageRead @ANI Story | https://t.co/7FRazcYhbP#ParliamentSession #AmitShah pic.twitter.com/FLKeCljX2S— ANI Digital (@ani_digital) July 31, 2024 మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్వయనాడ్ వరదలు దురదృష్టకర సంఘటన, ఇది జాతీయ విపత్తువయనాడ్లో పరిస్థితిని చాలా సీరియస్‌గా తీసుకున్నాం.రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్‌లో పర్యటిస్తారు.పార్టీ కార్యకర్తలు పునరావాస పనుల్లో నిమగ్నమయ్యారు.రాజ్యసభలో వయనాడ్ వరదల అంశాన్ని లేవనెత్తుతాం.కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.వరద బాధితులకు నష్టపరిహారం అందించాలి. పార్లమెంట్‌లోని సంవిధావ్ సధన్‌లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంపార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశం ప్రారంభంసమావేశానికి హాజరైన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ఎంపీలువాయనాడ్ మృతులకు, రాజేంద్రనగర్ కోచింగ్ సెంటర్లో మృతి చెందిన విద్యార్థులకు సంతాపం తెలిపిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీMoment of silence for the lives lost in the Wayanad landslide and the three UPSC aspirants in Delhi who lost their lives due to flooding, held at the Central Hall, Parliament House, New Delhi.(General Body meeting of CPP in Central Hall, Samvidhan Sadan, Parliament House, New… https://t.co/4c3XFlvFXv— ANI (@ANI) July 31, 2024 కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారుసరిహద్దు పరిస్థితులు, చైనాతో భారీ వాణిజ్య లోటుపై చర్చ జరగాలని ఆయన లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. అస్సాం వరదలపై కాంగ్రెస్ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిందిలోక్సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ అసోంలో వరద నిర్వహణ సమస్యను లేవనెత్తుతూ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు Congress Deputy Leader in Lok Sabha Gaurav Gogoi moved an Adjournment Motion notice to raise ‘flood management issue in Assam’ pic.twitter.com/MosFDood6m— ANI (@ANI) July 31, 2024 -
తెలంగాణ అసెంబ్లీ: ‘హరీశ్ రావు వాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి’
Updatesతెలంగాణ శాసనసభ సోమవారం ఉదయం 10 గంటలకు వాయిదావ్యవసాయ మోటార్ల దగ్గర మీటర్ల అంశంపై సీఎం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆందోళనస్పీకర్ పోడియం వద్ద నిరసన చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలువ్యవసాయ మీటర్ల అంశంపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుఎమ్మెల్యేలు నిరసన చేస్తుండగాని సభను వాయిదా వేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై కొనసాగుతున్న చర్చ.. మైనార్టీలకు మంత్రి వర్గంలో చోటులేదు: హరీశ్ రావుఉద్యోగులకు కొత్త పీఆర్సీలకు అనుగుణంగా కేటాయింపులు లేవుఈ ప్రభుత్వంలో మైనార్టీలకు న్యాయం జరగలేదుబీసీలు 9 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే పెట్టారుఅభయ హస్తం శున్య హస్తంలా మారింది. సభను తప్పుదోవ పట్టించిప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత నాపై ఉంది: సీఎం రేవంత్ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నాం. పూర్తి సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు.విపక్షాలు సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తాం. బడ్జెట్ పై సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులకు ఎక్కువ సమయం ఇచ్చాం.అసత్యాలను రికార్డుల నుంచి తొలగించాల్సిన బాధ్యత నాపై ఉంది..కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, విద్యుత్ సంస్థలు మూడు పార్టీలు కలపి 2017లో ఒప్పందం చేసుకున్నారు.మీటర్లు పెడతాం అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందిగృహాలకు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని ఓప్పందంలో బీఆర్ఎస్ స్పష్టంగా పేర్కొందివిద్యుత్ ఒప్పందాలపై హరీష్ రావు వాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలిహరీష్ రావుకు ఆఫ్ నాలెడ్జ్.. పెద్దాయనకు ఫుల్లు నాలెడ్జ్.. ఇలాంటి వారికి మేం ఏం చెప్తాం హైదరాబాద్ సిటీలో ఆటో ఎక్కిన అమ్మాయిని సామూహిక అత్యాచారం చేశారు: హరీశ్రావుశాంతిభద్రతలు రాష్ట్రంలో లోపించాయిఅర్దరాత్రి ఐస్ క్రీం తినాలనుకున్న మంత్రికి.. ఐస్ క్రీం దొరకలేదట10 గంటలకే హైదరాబాద్‌లో షాపులు మూసేస్తున్నారని.. రివ్యూలో సదరు మంత్రి సీఎంకు చెప్పారట ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్న బీఆర్ఎస్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరిన మంత్రి శ్రీధర్ బాబునడి రోడ్డుపై మిట్టమధ్యాహ్నం ఇద్దరు అడ్వకేట్లను చంపేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు..హరీష్ రావు మాట్లాడుతుంటె దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది చేత గానమ్మకు మాటలు ఎక్కువ అన్న భట్టి వాఖ్యలు కాంగ్రెస్‌కు వర్తిస్తాయి: హరీశ్ రావుకాంగ్రెస్ ఇస్తా అన్న రెండు లక్షల ఉధ్యోగాలు ఏమయ్యాయిసభలో బీఆర్ఎస్ సభ్యులు ఫ్లకార్డులు ప్రదర్శించడంపై స్పీకర్ అభ్యంతరం. 2020 జులై నెలలో పెన్షన్ ఇవ్వకుండా నెల ఆలస్యం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది.అప్పటి నుంచి నెల ఆలస్యం అవుతూ ఉంది..57 ఏళ్ళకే బీఆర్ఎస్ ప్రభుత్వం పెన్షన్ అన్నారు.. ఎందుకు ఇవ్వలేదు.బీఆర్ఎస్ ప్రభుత్వం లో ఏ రోజు నెల మొదటి వారం లో పెన్షన్ ఇవ్వలేదు.వాళ్లు చేసింది మాత్రమే రైట్ అన్నట్లు హరీష్ రావు మాట్లాడుతున్నారు. మే , జూన్ నెల పెన్షన్ ఇంకా ఇవ్వలేదు: హరీష్ రావునాలుగు వేల పెన్షన్ సరికదా.. రెండు వేల పెన్షన్ టైం కు ఇవ్వడం లేదు మంత్రులపై హరీష్ రావు వాఖ్యలు సరికాదన్న విప్ ఐలయ్యతెలంగాణ మొదటి సీఎం దలితుడే అని పదేళ్లలో ఎందుకు చేయలేదురెవెన్యూ వ్యవస్థ ను బిఆర్ఎస్ నాశనం చేసిందివిఆర్ఎ, వీఆర్వో వ్యవస్థను తొలగించి.. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారు కోమటిరెడ్డికి హరీశ్ రావు కౌంటర్కోమటిరెడ్డికి హాఫ్ నాలెడ్జ్ అన్న హరీశ్ రావు.గతంలో డబ్బులిచ్చి టీపీసీసీ తెచ్చుకున్నారని అనేదా? బస్సులు సరిపోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.బస్సులు లేని 15 వందల గ్రామాలు బస్సులు నడపాలిప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది.మహాలక్ష్మీ పథకాన్ని వెంటనే అమలు చేయాలిమద్దతు ధర సన్నాలకు మాత్రమేనని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రైలు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలితెలంగాణ లో 90 శాతం దొడ్డు వడ్లు పండిస్తారుదొడ్డు రకానికి బోనస్ ఇవ్వాలిగృహజ్యోతి పథకం లో పాక్షికంగా ఇబ్బందులు ఉన్నాయియువ వికాసం పథకంపై బడ్జెట్ లో చర్చే లేదుచేయూత గురించి ప్రభుత్వం మాటైనా మాట్లాడడం లేదు హరీశ్ రావు వద్ద సబ్జెక్ట్ లేదు: మంత్రి కోమటిరెడ్డిఅబద్దాలు, గారడీలు అంటే బీఆర్ఎస్సేహరీష్ రావు వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి.హరీష్ రావు బడ్జెట్ పై కాకుండా రాజకీయాలు సభలో మాట్లాడుతున్నారు. ఉద్యమంలో కేసీఆర్ దళితున్ని సీఎం చేస్తా అన్నారు.దళితున్ని సీఎం చేయకపోతే తలనరుక్కుంటా అన్నారు.బీఆర్ఎస్ పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేదు.బడ్జెట్‌పై చీల్చి చెండాడుతా అన్నారు కేసీఆర్.ఈరోజు ఏం చీల్చుతారో అని నేను అసెంబ్లీకి వచ్చాను కానీ కేసీఆర్ రాలేదు.కేసీఆర్‌కు సభకు రావాలంటే భయం.. అందుకే వీళ్లను పంపాడు.గతంలో హరీశ్ రావు ఒక డమ్మీ మంత్రికేసీఆర్ సభుకు రాలేక హరీశ్‌రావును పంపారు.బీఆర్ఎస్ నేతలు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. 24 గంటల కరెంట్ ఎక్కడిచ్చారో చెప్పాలి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీ అమలు చేస్తాం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుబీఆర్ఎస్ నాశనం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం గత ప్రభుత్వం భూములు అమ్మింది అన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సమాధానం ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావుసీఎం గత ప్రభుత్వం భూముల అమ్మింది అంటున్నారు.. మరి ఈ బడ్జెట్లో 24 వేల కోట్ల రూపాయలు భూముల అమ్మో తెస్తాం అనడం ఏంటి?మహబూబ్‌నగర్ జిల్లాకు నీళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. కాలేశ్వరం ప్రాజెక్టుపై నేను ఒకే మాటపై ఉన్నాను. అప్పుడైనా ఇప్పుడైనా రూ. 94 వేల కోట్లు ఖర్చు చేశాం అని చెప్పాను.బతుకమ్మ చీరలపై సీఎం వ్యాఖ్యలు సరికాదు వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలి.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, కాలేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా చర్చ పెడితే అన్నిటికీ సమాధానాలు చెప్తాను.పాలమూరు వెనబాటుకు కాంగ్రెస్సే కారణంమహబూబ్నగర్కు ఐదు మెడికల్ కాలేజీలు ఇచ్చాం.100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. హారీశ్‌రావు వ్యాఖ్యలకు సీఎం రేవత్‌రెడ్డి కౌంటర్గతంలో బతుకున్న చీరలు ఇస్తే.. మహిళలు తగలబెట్టిన పరిస్థితి ఉంది: సీఎం రేవంత్‌రెడ్డితెలంగాణ ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో బతుకుతారు.బతుకమ్మ చీరల విషయంలో అవినీతి జరిగింది.బీఆర్ఎస్ ఆలోచన మారలేదు.. విధానం మారలేదు.బీఆర్ఎస్ తీరు వల్ల కేంద్ర బడ్జెట్లో నిధులు రాలేదు.గొర్రెల పథకంలో 700 కోట్ల స్వాహా చేశారు. వేల కోట్ల విలువైన భూములు అమ్మేశారు.పాలమూరు జిల్లా కేసీఆర్‌కు ఏం అన్యాయం చేసింది? పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి బీఆర్ఎస్ దుర్మార్గ కారణం కాదా?బీఆర్ఎస్ నేతలు ప్రజలను సభ్యపెట్టాలని చూస్తున్నారు.రంగారెడ్డి జిల్లా, కొడంగల్‌కు గోదావరి నీరు ఇవ్వొద్దని కుట్ర చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు భారీ అవినీతి జరిగిందిపార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు గుండు సున్నా ఇచ్చినా వారి బుద్ధి మారలేదుచేవెళ్ల ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రంగారెడ్డి జిల్లా ఆస్తులను భూములను అమ్ముకున్నది గత ప్రభుత్వం.మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్లో ప్రజలు బొంద పెట్టారు.బతుకమ్మ చీరలు, కెసిఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ పై విచారణకు సిద్ధమా?విచారణకు సిద్ధమైతే సవాళ్లు బీఆర్ఎస్ స్వీకరించాలి? ఆరోగ్య శ్రీ పథకం వైఎస్ఆర్ ప్రవేశపెట్టారు - హరీష్ రావుఫీజు రీయింబర్స్ మెంట్, 108 పథకాలను వైఎస్సార్ ప్రారంభించారువైఎస్ఆర్ పెట్టిన పథకాలను కేసీఆర్ సభలో పొగిడారు మంచి పథకాలు అయిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్, 108 ను పేర్లు మార్చకుండా కేసీఆర్ కొనసాగించారు.ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ తెచ్చిన న్యూట్రిషన్ కిట్‌ను పక్కకు పెట్టింది.ఆరోగ్య శ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచటం సంతోషమేకానీ, వైద్య శాఖ బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తే.. ఇది ఎలా సాధ్యం అవుతుంది? రుణమాఫీ కోసం 31వేల కోట్లు ఖర్చు అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు: హరీష్ రావు బడ్జెట్ లో 26వేల కోట్లు మాత్రమే నిధులు కేటాయింపు జరిగింది.5వేల కోట్ల రూపాయలను కోత విధించారు ఎలా బడ్జెట్ తగ్గింది?రుణమాఫీ కోత విధించారు.. రుణమాఫీ అర్హులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రుణమాఫి విషయంలో చాలా కోతలు పెట్టారు. 31వేల కోట్ల రుణమాఫి ఒకేసారి చేస్తామన్నారు. 31 వేల కోట్ల నుంచి 25 వేల కోట్లకు తగ్గించారు.రాజకీయాలు కోసం పేదల కడుపుకొట్టకండి ఎక్సైజ్ ఆదాయం 7వేల కోట్లు ఎలా పెరుగుతుంది?: హరీష్ రావు తెలంగాణ ప్రజలను మద్యం బానిసలు చేస్తున్నారు అని కాంగ్రెస్ ఆరోపణలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మద్యం పై ఆదాయం పెరుగుతుంది అంటే బిర్ల ధరలు పెంచుతారా?బెల్ట్ షాపులను రాష్ట్ర వ్యాప్తంగా పెంచుతారా? భూములు అమ్మి 10వేల కోట్లు, మరో 14వేల అడిషనల్ రెవెన్యూ మొబలైజేషన్ ద్వారా ఆదాయం అని బడ్జెట్ పెట్టారు ఆదాయ మార్గాలను చెప్పకుండా 24వేల కోట్ల రూపాయలను ఆదాయం అని బడ్జెట్లో చూపించారు.వారసత్వ భూములు ఎలా అమ్ముతారు? అని ఆనాడు నేటి సీఎం రేవంత్ అన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ పాలన ప్రజలను మభ్య పెట్టారు -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కప్రతిపక్షంలో కూడా అలానే భ్రమలు కల్పిస్తున్నారుప్రతిపక్ష నేత ఇవ్వాళ సభకు వస్తారు అనుకున్నాం.బడ్జెట్‌పై ఎల్ఓపీ మాట్లాడుతారు అనుకున్నాం.ఎక్సైజ్ టెండర్లు ముందే ఎందుకు పిలిచారు?టానిక్ లాంటి వారితో కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళనివ్వం.ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకువచ్చారు. మేం అధికారంలోకి వచ్చాకు నెలనెలా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పని మొదలు పెట్టాంసర్కార్ సొమ్ము ప్రజలకు చేరేలా చేశాం మా బడ్జెట్ చూసి హరీశ్ రావుకు కంటగింపుగా ఉంది: మంత్రి భట్టి విక్రమార్కహరీశ్ రావు ఎందుకు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు.హరీశ్‌రావు లేనిది ఉన్నట్లు మాట్లాడుతున్నారు.పూర్తి సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారు.పత్రిపక్ష నేత బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే వచ్చారు.ఇవాళ ప్రతిపక్ష నేత సభకు ఎందుకు రాలేదు.పదేళ్లు తెలంగాణను ఆర్థికంగా నాశనం చేశారు.మంత్రి జూపల్లి గల్లీకో బెల్ట్ షాప్ పెడతామని అన్నారా? ఎక్సైజ్ శాఖ పై హరీష్ రావు వ్యాఖ్యలను తప్పుబట్టిన మంత్రి జూపల్లి కృష్ణారావు2014లో పదివేల కోట్ల ఆదాయం ఉండే బీఆర్ఎస్ రాగానే అది 19వేలకు పెరిగింది.అదే విధంగా 2019 నాటికి 19వేల కోట్లు.. గత ఏడాదికి రూ. 35వేల కోట్లు ఎక్సైజ్ నుంచి ఆదాయం వచ్చినట్లు లెక్కలు చెప్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వల్ల రియలేస్టేట్ కుదేలైంది: హరీశ్ రావురాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల తగ్గుతున్నాయి... రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గుతుంది.రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గుతున్నా .. 4 వేల కోట్లు అదనపు ఆదాయం ఎలా తెస్తారు?రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ వ్యాల్యూ పెంచుతారా? రెట్లు పెంచుతారా?7700 కోట్ల రూపాయలు గత ఏడాది కంటే ఎక్కువ ఆదాయం వస్తుందని బడ్జెట్లో పెంచారుమొత్తం ఎక్సైజ్ శాఖ నుంచి గత ఏడాది 25వేల కోట్లు ఆదాయం వస్తె ఇప్పుడు 42వేల కోట్లకు పెంచారు.42వేల కోట్ల ఆదాయం రావాలంటే గల్లీలో బెల్ట్ షాప్ పెట్టాల్సి వస్తది. సభలో హరీష్ రావు స్పీచ్‌కు అడ్డుపడ్డ మంత్రి జూపల్లి కృష్ణారావుజూపల్లి కృష్ణారావు మంత్రిపై మాజీ మంత్రి హరీష్ చురకలుఎవరూ ఆవేశపడకండి.. అన్ని లెక్కలు చెప్తాను, లిక్కర్ లెక్కలు చెప్తా అన్న హరీష్ రావు కాంగ్రెస్ పార్టీకి మమ్మల్ని తిట్టడమే సరిపోతుంది8 నెలల పాలన కాంగ్రెస్ ఏం సాధించింది: హరీశ్ రావుబీఆర్ఎస్ టార్గెట్‌గానే బడ్జెట్ ప్రసంగం ఉంది.ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతోంంది.బడ్జెట్లో వాస్తవాలు విస్మరించారు. గల్లీకో బెల్ట్ షాప్ ఓపెన్ చేశారుమేం అధికారంలోకి వచ్చాక పెన్షన్ రూ. 2 వేలు చేశాం రాష్ట్రంలో దశ, దిశలేని పాలన నడుస్తోంది కరెంట్ అంశంపై కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరిన హరీష్ రావుభట్టి విక్రమార్క, నేను అసెంబ్లీ బయట రోడ్డుపై పదినిమిషాలు ప్రజలను అడుగుదాం- హరీష్ రావుకరెంట్ బీఆర్ఎస్ పాలనలో భగుండేనా?, కాంగ్రెస్ పాలనలో బాగుండేనా? ప్రజలే చెప్తారురాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగా లేదుగ్రామాల్లో విద్యుత్‌పై చర్చకు సిద్దమా? : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుప్రతిపక్ష నేతలు మాట్లాడేటప్పుడు మమ్మల్ని టీవీలో చూపించాలి : హరీష్ రావు.పార్లమెంట్ లో రాహుల్ గాంధీని చూపించడం లేదు అని కోడ్ చేసిన హరీష్ రావు.మమ్ములను సైతం అలా వివక్ష చూపిస్తున్నారు.. మమ్ములను మాట్లాడేటప్పుడు చూపించాలి: హరీష్ రావు హరీష్ రావు పై స్పందించిన స్పీకర్, మంత్రి శ్రీధర్ బాబు.రాహుల్ గాంధీ కంటే పదిరెట్లు ఇక్కడ చూపిస్తాం : శ్రీధర్బాబురాహుల్ గాంధీ బాటలో మేము నడుస్తం - శ్రీధర్బాబుప్రతిపక్ష నాయకులను టీవీలో చూపిస్తున్నారు కదా - స్పీకర్శ్రీధర్ బాబు వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్రాహుల్ గాంధీ బాటలో నడవటం కాదు - ఆయన చెప్పినట్లు ఎమ్మెల్యేలను డిస్క్వాలిపై చేయాలి అని కోరుతున్నాం: హరీష్ రావుతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం బీజేపీ వాయిదా తీర్మానంరాష్ట్రంలో బాలికల మీద పెరుగుతున్న అత్యాచారాలపై వాయిదా తీర్మానం పెట్టిన బీజేపీబీజేపీ తరపున అసెంబ్లీలో మట్లాడనున్న ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ బాబు, రామారావు పటేల్ నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి.శాసన సభలో నేడు క్వశ్చన్ అవర్ రద్దుబడ్జెట్పై సభలో సాధారణ చర్చ జరగనుంది.అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్లుబడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ధి కి 10 వేల కోట్లు కేటాయించిన సీఎంకు , డిప్యూటీ సిఎంకు కృతజ్ఞతలుజీహెఎంసీ, వాటర్ బోర్డు, మెట్రో లకు ప్రభుత్వం ఆర్థిక ఊతం ఇచ్చిందిసికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ కు ఏం తెచ్చారుటూరిజం మంత్రి గా ఉన్నా కిషన్ రెడ్డి చేసిందేమి లేదు.హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధి ని నిరూపించుకోవాలికిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయినా రాష్ట్రానికి ఉపయోగం లేదుహైదరాబాద్ అభివృద్ధి కి నిధులు ఇచ్చినందుకా రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్నారాకేంద్ర బడ్జెట్ ప్రిపరేషన్‌కు ముందే రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రభుత్వం కు తెలియజేసాం. అయినా సహకారం లేదు.గంగా ప్రక్షాళనకు బడ్జెట్ కేటాయింపులు చేసిన కేంద్రం, మూసీ అభివృద్ధికి ఎందుకు ఇవ్వరుకారణం లేకుండా కేసీఆర్ నీతి అయోగ్ సమావేశానికి వెల్లలేదుకేంద్ర బడ్జెట్ లో మాకు అన్యాయం జరిగింది.. అందుకే నిరసన తెలియజేయడం కోసమే నీతిఅయోగ్ సమావేశాన్ని బైకాట్ చేస్తున్నాంతమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టకపోవడం వల్ల భారీ నష్టం జరిగిందిగేట్లు తెరవడానికి మీరు పోటుగాళ్ళా?మెడిగడ్డ దగ్గర నీరు పంప్ చేసే అవకాశం లేదని ఎన్డిఎస్ఎ చెప్పిందికేటీఆర్ యువరాజు కాదు, హుకుంలకు.. అల్టిమేటంకు బయపడేది లేదు -
రుణమాఫీకి రూ.30వేల కోట్లు..
-
పాతబస్తీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు..
-
బీఆర్ఎస్ పాలనలో వామనావతారంలాగా అప్పులు: భట్టి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో బీఆర్ఎస్ పాలనను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క తీవ్రంగా తప్పుబట్టారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, తాము మాత్రం జనరంజకమైన బడ్జెట్ ద్వారా ప్రజల ముందుకు వస్తున్నామని అన్నారాయన. ‘‘గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు పది రేట్లు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యోగాలు, నీళ్లు దక్కలేదు. బంగారు తెలంగాణ చేస్తామని ఉత్తరకుమార ప్రగల్బాలు పలికారు. కానీ, బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైంది. వామనావతారం లెక్క అప్పులు పెరిగాయి. ఒంటెద్దు పోకడలతో ఆర్ధిక వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అప్పులు పెరగడంతో పాటుగా బిల్లులు బకాయిలు భారీగా పెరిగిపోయాయి. కొత్త ఉద్యోగాలు సృష్టించడం కాదు.. ఉన్న ఉద్యోగాలే ఇవ్వలేదు. దశాబ్ద కాలంలో తెలంగాణ పురోగమించలేదు. జీతాలు, పెన్షన్లు చెల్లింపులు కూడా చేయలేని పరిస్థితి. ఆర్థిక క్రమ శిక్షణ పాటించకుండా తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు. పదేళ్ల అస్తవ్యస్త పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. దుబారా ఖర్చు ఆపేసి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం. రాష్ట్రంలో ఏర్పడిన పదేళ్ల తర్వాత వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టాం. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తాం. ఏదో విధంగా ఎన్నికల్లో గెలవాలిని మేము హామీలు ఇవ్వలేదు. ప్రజల గుండె చప్పుళ్లకు స్పందించే హామీలు ఇచ్చాం. మేం అధికారంలోకి వచ్చాక 31,768 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. డిసెంబర్ నుంచి పథకాల కోసం రూ.34,579 కోట్లు ఖర్చు చేశాం. ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. ఆరోగ్యశ్రీని రూ. 10 లక్షలకు పెంచాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఎన్నో ఏళ్లు ప్రజలు ఉద్యమం చేశారు అని భట్టి అన్నారు. ఒకానొక దశలో బడ్జెట్ ప్రసంగానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు నినాదాలు చేశారు. అయినా భట్టి తన ప్రసంగం కొనసాగించారు.2024-25 బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ... ‘ఆయిల్ పామ్ సాగుకు రైతులకు అవసరమైన సాయం అందిస్తాం. రాష్ట్రంలో లక్ష ఎకరాల ఆయిల్ పామ్ సాగును లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు, పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరిస్తాం. మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు మెట్రోను విస్తరిస్తాం. ఉచిత బస్సులు పథకం రాష్ట్ర అభివృద్ధి సాయపడుతోంది’ అని తెలిపారు. -
Watch Live: తెలంగాణ బడ్జెట్ 2024
-
కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయంపై స్టాండర్డ్ డిడక్షన్ 50 వేల నుంచి 75 వేల రూపాయలకు పెంపు... కొత్త పన్నుల విధానం శ్లాబుల్లో స్వల్ప మార్పులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
వరుసగా ఏడోసారి కేంద్ర బడ్జెట్‌తో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (ఫొటోలు)
-
పార్లమెంట్లో ‘నీట్’పై మాటల మంటలు
Live Updates:లోక్‌సభలో నీట్ అంశంపై నిరనసకు దిగిన విపక్షాలునీట్పై పార్లమెంట్లో మాటల మంటలు పేపర్ లీకేజీలో ప్రభుత్వం రికార్డు సృష్టించిందంటూ విపక్షా ఫైర్ పేపర్ లీక్ చాలా పెద్ద సమస్య: ప్రతిపక్ష నేత రాహుల్గాంధీఈ సమస్య మూలాల నుంచి పెకిలించాలి. డబ్బులు ఉన్నవాళ్లు విద్యావ్యవస్థనే కొనేస్తున్నారు. విద్యార్థులు జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడటం తగదు. విద్యాశాఖమంత్రి తనను తప్ప అందిరినీ తప్పు పడుతున్నారు.దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు: అఖిలేష్ యాదవ్రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్పేపర్ లీక్‌పై సీబీఐ విచారణ జరుపుతోంది. నీట్‌పై తాము ఏమి దాచటం లేదు. నీట్ పరీక్షను యూపీఏ ప్రభుత్వమే తీసుకు వచ్చింది.విద్యా వ్యవస్థను రాహుల్ గాంధీ తప్పుపట్టడం దారుణంరాజ్యసభ ప్యానెల్ వైస్‌ఛైర్మన్‌గా అయోధ్య రామిరెడ్డిరాజ్యసభ ప్యానెల్ వైస్‌ఛైర్మన్‌గా వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి నియామకంరాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ పునర్వ్యవస్థీకరణప్యానెల్ వైస్ ఛైర్మన్ హోదాలో సభా కార్యక్రమాలను నిర్వహించనున్న అయోధ్య రామిరెడ్డిరాజ్యసభలో నూతన ప్యానెల్‌ను ప్రకటించిన జగదీప్ ధన్కడ్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయిపార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ మీడియా మాట్లాడారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాం. అమృతకాలంలో ఇదొక అద్భుతమైన బడ్జెట్. 2047 నాటికి వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దుతాం. మూడోసారి అధికారంలోకి రావటం సంతోషకరం. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తాం: ప్రధాని మోదీబడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. రేపు (మంగళవారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నీట్ లీకేజీ, కన్వర్ యాత్ర, రైల్వే ప్రమాదం అంశాలపై ప్రశ్నించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.ఏపీలో శాంతి భద్రతలు క్షీణించిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్సార్సీపీ నిరసనకు దిగుతోంది. 45 రోజుల చంద్రబాబు పాలనలో 31 రాజకీయ హత్యలు జరిగిన వైనంపై వైఎస్సార్సీపీ అఖిలపక్షంలో గళం విప్పింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆల్ పార్టీ మీటింగ్‌లో వైఎస్సార్సీపీ కోరిగా.. టీడీపీ సైలెంగా ఉండిపోయింది. అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏఐ డీప్ ఫేక్, పౌరసత్వ సవరణ చట్టం, రిటైర్డ్ న్యాయమూర్తులు రాజకీయాల్లోకి రావడం సహ పలు అంశాలపై 23 బిల్లులు ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. -
వాడివేడిగా అఖిలపక్ష భేటీ.. ‘నీట్’పై నిలదీసిన విపక్షాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఆదివారం(జులై 21) అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఈ భేటీ కొనసాగుతోంది. జులై 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పలు అంశాలపై ప్రభుత్వం విపక్షాలతో చర్చిస్తోంది. బడ్జెట్‌తో పాటు సభ ముందుకు రానున్న పలు బిల్లుల జాబితాను వారికి వివరిస్తోంది. నీట్ పేపర్ లీకేజీ, రైల్వే భద్రత అంశాలపై అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నిలదీసింది. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ ఈ సమావేశాల్లో కోరినట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి జైరామ్ రమేశ్, కె.సురేశ్, జేడీయూ, ఆప్, సమాజ్‌వాదీ, ఎన్సీపీ పార్టీల ప్రతినిధులు అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. కేంద్ర ప్రభుత్వం జులై 23న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ఆరు బిల్లులను తీసుకురానుంది. -
ఈ నెల 23 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 25న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపట్టనున్నారు. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ అసెంబ్లీ సెక్రటరీ గురువారం జారీ చేశారు. ఈనెల 23 నుండి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా, 24 నుంచి మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి. అలాగే రైతు భరోసా పథకంపై చర్చతో పాటు, జాబ్ కాలెండర్ను విడుదల చేయటం వంటి అంశాలను ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
బడ్జెట్ సమావేశాలకు మూహుర్తం ఫిక్స్.. 23న బడ్జెట్
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోదీ 3.0 కేబినెట్లో తొలి బడ్జెట్‌ను ఈ నెల 23న ప్రవేశపెట్టనుంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.కాగా ఈనెల 22వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు శనివారం ప్రకటించారు. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను జులై 23న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.కాగా లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఫిబ్రవరి 1న పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు అప్పట్లోనే చెప్పారు. ఎప్పటిలా సూట్‌కేసులో కాకుండా రాజముద్ర ఉన్న ఎరుపు రంగు వస్త్రంలో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చే కొత్త సంప్రదాయానికి నిర్మలా శ్రీకారం చుట్టారు.. -
Updates: సభలో తీర్మానం పెట్టింది మేమే: సీఎం రేవంత్‌రెడ్డి
Telangana Assembly Budget Session 2024 Last Day Updates తీర్మానం ఫలవంతం కావాలంటే చట్టభద్దత తేవాలి: మాజీ మంత్రి కేటీఆర్ ఓబీసీ శాఖ, జస్టిస్ సచార్ కమిషన్ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర ఉంది. మేము ప్రయత్నం చేశాం.. న్యాయపరమైన చిక్కులు అడ్డు వచ్చాయి\ మీరు ఎన్నికల్లో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ అమలు కావాలంటే సభ పొడిగించి బిల్లు పెట్టండి. మమ్మల్ని బీజేపీ బి-టీమ్ అంటున్నారు: అక్బరుద్దీన్ఓవైసీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ అభివృద్ధిలో మైనార్టీల పాత్ర ఉంది. ముస్లింలు ఇందిరా నుంచి సోనియా గాంధీ వరకు మద్దతు ఇస్తున్నాం రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్లకు సహకరించాము బీసీ, దళిత వర్గాల కోసం కొట్లాడితే లీడర్లు అంటారు. మేము మా మైనార్టీల కోసం కొట్లాడితే మమ్ములను బీజేపీ బి - టీమ్ అంటున్నారు. అసెంబ్లీ పనితీరుపై అక్బరుద్దీన్ ఓవైసీ ఆగ్రహం 13వ తేదీ వరకు BAC పెట్టారు... తరువాత బిజినెస్ గురించి BAC పెట్టలేదు. కుల గణన పై ఎన్నికల హామీ ఇవ్వలేదు అయినా సభలో తీర్మానం చేస్తున్నారు. ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీలపై తీర్మానం చేయండి. కుల గణన కంటే ముందు సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ సభలో పెట్టాలి. సమగ్ర కుటుంబ సర్వే వల్ల ఎవరికి లాభం జరిగింది? నేను ఈ తీర్మానంకు మద్దతు ఇస్తున్నాం కానీ క్లారిటీ, న్యాయమైన అంశాల పై జాగ్రతగా ఉండాలి. సభలో తీర్మానం పెట్టింది మేమే: సీఎం రేవంత్‌రెడ్డి కులగణన తీర్మానం పై అనుమానం ఉంటే సూచనలు సలహాలు ఇవ్వాలి. తీర్మానం పై ఏదైనా లీగల్ చిక్కుల పై అంశాలు ప్రతిపక్షాలకు తెలుస్తే తీర్మానం అమలు అయ్యే విధంగా సహకరించాలి. కులగణన వల్ల అరశాతం ఉన్న వాళ్లకు బాధ ఉంటుంది. కడియం శ్రీహరిని ఆయన పార్టీ నేతలే తప్పుదోవ పట్టిస్తున్నారు. కడియంను తప్పుదోవ పట్టించే వాళ్ళను బయటకు పంపాల్సిందే లేదంటే గాలి సోకుతుంది. ఆనాడు రిజర్వేషన్లు అయితేనే ఆయా సామాజిక నేతలు చట్ట సభల్లోకి వస్తున్నారు మేనిఫెస్టోలపై ఓరోజు చర్చ పెడదాం 2014, 2018, 2023లో పార్టీల మ్యానిఫెస్టో లపై ప్రత్యేకంగా చర్చిద్దాం ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపే మంత్రివర్గ ఆమోదంతో సభలో తీర్మానం పెడుతున్నాం. ఈ పదేళ్లు మీరేం చేశారు.. ఈ 60 రోజుల్లో మీరు ఏం చేశారన్నది చర్చిద్దాం సభలో తీర్మానం పెట్టింది మేమే ఈ తీర్మానం.. బలహీన వర్గాలను బలంగా తయారు చేయడమే మా ఉద్దేశం బాధితులుగా ఉన్నవాళ్లను పాలకులుగా చేయాలన్నదే మా ఆలోచన కులగణనపై అనుమానాలొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి కులగణనపై.. ప్రజలకు అనుమానం లేవనెత్తేలా విపక్షాల వ్యాఖ్యలు చట్ట సభల్లో అన్నికులాలకు న్యాయం చేసేందుకే కులగణన గతంలో కాంగ్రెస్ హయాంలో జస్టిస్ కమిటీ ఏర్పాటు చేశాం సమగ్ర కుటుంబ సర్వే చేశామని బీఆర్ఎస్ గొప్పగా చెప్పుకుంటుంది బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే సభలో ప్రవేశపెట్టారా? ఎన్నికల కోసమే బీఆర్ఎస్ అప్పుడు ఆ సర్వే వివరాలను వాడుకుంది మాకు రాజకీయ దురుద్దేశాలు లేవు కులగణనపై అనుమానాలొద్దు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నకి మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం మేము మీలాగా సకల జనుల సర్వే అని చెప్పి బొంబాయి నుండి బస్సుల రమ్మని.. ఎక్కడైకైనా రమ్మని చెప్పలేదు మీకున్న సందేహాలు నివృత్తి చేసే బాధ్యత మాది... మాజీ మంత్రి 10 ఏళ్లుగా మంత్రిగా ఉండి ఎమ్మెల్యే గా ఉండి అప్పుడు బలహీన వర్గాల గొంతు వినిపించలేదు కాబట్టి అపుడు చెప్పేలేదని ఇప్పుడు చెబుతున్నారు కావొచ్చు ఎవరు ఏమి చెప్పిన వింటాం..జవాబు చెబుతాం.. మా ప్రభుత్వం చిత్తశుద్ది తో ఉంది. మీరేమైనా సలహాలు ఇవ్వండి.. దానిపై ప్రత్యేక చర్చ చేయండి. పాత మేనిఫెస్టో లో ఉంటే చర్చ చేయండి.. మీరు 10 ఏళ్లుగా నియంత్రుత్వ ప్రభుత్వంలో మీరు ఎం చెప్పలేకపోయారు కాబట్టి ఇప్పుడు అన్నీ చెప్పుకుంటా అంటే నడవదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ.. కులగణనను మేం ఆహ్వానిస్తున్నాం కానీ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టత లేదు కులగణనపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి జన, కులం అంటూ ద్వంద్వ వైఖరి కనిపిస్తోంది జనగణన చేసే హక్కు రాష్ట్రాలకు లేదు కులగణన మాత్రమే చేసే హక్కు ఉంటుంది తీర్మానంకు చట్ట బద్ధత అయిన కల్పించండి లేదంటే న్యాయ పరంగా అయినా ముందుకు వెళ్ళాలి. ఎలాంటి చట్ట బద్ధత లేకుండా తీర్మానం పెడితే లాభం ఉండదు. కులగణన చేప్పట్టిన ఆయా రాష్ట్రాలు న్యాయపరంగా ఇబ్బందులు పడ్డాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మాణం ప్రవేశపెట్టడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకం దేశంలో ఉన్న సంపద, రాజ్యాధికారం జనాభా ధమాషా ప్రకారం దక్కాలని మా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధి గ ఆనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. దేశ వ్యాప్తంగా కుల గణన జరుగాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఎన్నికల్లో చాలా స్పష్టంగా మేము అధికారంలోకి రాగానే కుల గణన చేస్తామని చెప్పాము. కులగణన తెలంగాణ నుంచి మొదలు పెడతామని చెప్పి క్యాబినెట్లో చాలా కులంకుశంగా చర్చించి నేడు అసెంబ్లీలో కుల గణనపై తీర్మాణం పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన తో పాటు సోషల్, ఎకానమిక్, ఎడ్యుకేషన్, పొల్టికల్, ఎంప్లాయిమెంట్ అంశాలపై సర్వే చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటిని, అన్ని కులాలు, ఆర్ధిక స్థితిగతలపై సర్వే చేస్తాము. ఈ సర్వే ద్వారా సంపద ఎక్కడ కేంద్రీకృతమైంది. ఆ సంపదను అన్ని వర్గాలకు జనాభా దమాషా ప్రకారం ఏలా పంచాలన్నదానిపై అన్ని రకాల ప్రణాలికలు తయారు చేస్తాము. ప్రతిపక్ష సభ్యులు కుల గణనపై ఏలాంటి ఆందోలన గందరగోళం కావొద్దు. సామాజిక ఆర్ధిక రాజాకీయ మార్పునకు పునాధిగా తెలంగాణ మారబోతుంది. 10 సంవత్సరాలు అధికారంలోకి ఉన్న గత బిఆర్ఎస్ ప్రభుత్వం కుల గణన చేయలేదు. ఇప్పుడు కుల గణన చేయాలని ఈ ప్రభుత్వం తీసుకున్న మంచి కార్యాక్రమానికి మద్దతు ఇవ్వకుండ రన్నింగ్ కామెంట్రీ చేయడం సరికాదు ప్రతి ఇంటిని, కులాన్ని సర్వే చేస్తాం.. ఆర్థిక స్థితి గతులు కూడా సర్వే చేస్తాం సర్వేలో అన్ని వివరాలు పొందుపరుస్తాం.. సర్వరోగ నివారిణిలాగా సర్వే ఉంటుంది అసెంబ్లీలో కుల జనగణన తీర్మానంపై చర్చ బీసీ కుల గణనతో బీసీలే నష్టపోతారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల 2017లోనే సమగ్ర సర్వే చేశాం.. మళ్లీ ఎందుకు?: బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల తెలంగాణ శాసన సభలో కులగణన తీర్మానం బీసీ కుల గణన తీర్మానం శాసన సభలో ప్రవేశ పెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి @అసెంబ్లీ గత ప్రభుత్వంలోనే 60 CMRF చెక్ లు పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ ఉన్న CMRF నిదుల పై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎన్నికలకు ముందు 1లక్ష కోట్ల శాంక్షన్స్ ఇచ్చి పోయింది. గత ప్రభుత్వంలో శాంక్షన్స్ పై కీలకమైన అంశాల గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. మంత్రి జోన్ ల వ్యవస్థ అస్థవ్యస్థంగా ఉంది జోన్ ల మార్పు పై చర్చిస్తాం సునితా లక్ష్మారెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సిరిసిల్ల జోన్ నుంచి మెదక్ ను చార్మినార్ జోన్ కు మార్చాలి. రాజ్ ఠాకూర్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే బొగ్గు గని కార్మికుల కు మెరుగైన వసతులు కల్పించాలి సింగరేణి ఆసుపత్రికి తగినన్ని నిధులు వెంటనే విడుదల చేయాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో 2017 లో సైనిక్ స్కూల్ కు అనుమతి వచ్చింది.. దాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు తరలించాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం.. వర్దన్న పేట ,స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం మధ్యలో ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల రెండు నియోజకవర్గ ప్రజలకు ఇబ్బంది అవుతుంది.. దాన్ని మరో చోటు కు తరలించాలి.. రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం నుంచి కాకతీయ కళా తోరణం తొలగించకూడదని ప్రభుత్వం కు విజ్ఞప్తి జీరో అవర్ లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరు పెట్టారు కానీ.. కల్వకుర్తి వరకు నీరు రాలేదు రైతులకు పరిహారం 40 కోట్లు పెండింగ్ ఉంది కల్వకుర్తి రైతులకు నీరు అందించాలి.. భూమి కోల్పోయిన రైతులకు పరిహారం వెంటనే అందించాలి జీరో అవర్ లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొండగట్టు దేవాలయం అభివృద్ధికి నిధులు కేటాయించాలి లెదర్ పార్క్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి నారాయణ పూర్ రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల పనులు వెంటనే పూర్తి చేయాలి జీరో అవర్ లో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ఊసే లేకుండా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ 80 శాతం పూర్తి అయ్యిందని చెప్పారు షాద్ నగర్ కు సాగు, తాగు నీరు రాలేదు మిషన్ భగీరథ లో లీకేజీలు జరుగుతున్నాయి.. ఇష్ట రాజ్యంగా తవ్వుతున్నారు డబుల్ బెడ్ రూం ఇల్లు పంపిణీ చేయకపోవడంతో కట్టిన ఇల్లు నిరుపయోగంగా ఉన్నాయి ►తెలంగాణ శాసనసభ లో జీరో అవర్ ప్రారంభం ►ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ నేడు అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేత పత్రం విడుదల చేయనున్న తెలంగాణ ప్రభుత్వం నేడు ఇరిగేషన్ పై స్వల్ప కాలిక చర్చ చేపట్టనున్నట్లు అసెంబ్లీ బిజినెస్ రూల్స్ లో ప్రస్తావన ఇరిగేషన్ పై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశం నేడు ఇరిగేషన్ చర్చలో ప్రధాన అస్త్రంగా మారనున్న కాగ్ రిపోర్ట్ ప్రధాన అస్త్రంగా.. గురువారం నాటి సభలో కాగ్ రిపోర్టును పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం కాగ్ రిపోర్టులో సైతం కాళేశ్వరం పై అనేక ఆరోపణలు కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అవకతవకలు జరిగినట్లు ప్రస్తావించిన కాగ్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ చేసిన మంత్రులు ఎమ్మెల్యేలు నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆఖరి రోజు నేడు మాజీ మంత్రి హరీష్ చిట్ చాట్ అసెంబ్లీ దెబ్బకే సీఎం రేవంత్ ఈ రోజు ప్రజాభవన్ కు వెళ్తానన్నారు రోజూ ప్రజాభవన్ కు వెళ్తానని చెప్పిన సీఎం తొలి రోజు మాత్రమే వెళ్లారు. ఇదే అంశాన్ని మొన్న అసెంబ్లీలో మేము ఆధారాలతో సహా నిలదీశాం. దీంతో ఈ రోజు హడావుడిగా కేవలం అరగంట ముందు సమాచారం ఇచ్చి అసెంబ్లీకి వెళ్లారు. సీఎం ప్రజాభవన్ కు వస్తారని నిన్ననే సమాచారం ఇస్తే ఈ రోజు చాలా మంది తమ బాధలు చెప్పుకునేందుకు వెళ్లేవారు -
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
Telangana Assembly Budget 2024 Session Updates ప్రభుత్వం కావాలనే మా గొంతు నొక్కుతోంది: వేముల ప్రశాంత్ రెడ్డి నేను కూడా శాసన సభ వ్యవహారాల మంత్రి గా పనిచేశాను అసెంబ్లీ సమావేశం నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడ వద్దనే నిబంధన ఏదీ లేదు ప్రభుత్వం కావాలనే మా గొంతు నొక్కుతోంది సీఎం రేవంత్ ఎన్ని రోజులైనా మాట్లాడండి అవకాశం ఇస్తామన్నారు ..మేము మాట్లాడితే తట్టుకోలేక పోతున్నారు సీఎం చెప్పేదొకటి చేసేదొకటి అసెంబ్లీ ఆవరణ సభ్యుల హక్కు ..నియంత్రణ ఎలా పెడతారు ఇలాంటి వాటిని తట్టుకుంటాం ..పోరాడతాం అసెంబ్లీ లో సీఎం రేవంత్ అనుచిత భాష ను ఖండిస్తున్నాం: కడియం శ్రీహరి చెప్పలేని భాషలో రేవంత్ మాట్లాడుతున్నారు.. అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయి రికార్డుల నుంచి తొలగించాలని మేము కోరుదామంటే మాకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వడం లేదు సీఎం భాష కు ధీటుగా బదులు ఇవ్వగలం ..కానీ పార్లమెంటరీ సంప్రదాయాల మీద మాకు గౌరవం ఉంది ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై సీఎం దిగజారి మాట్లాడుతున్నారు ఇదే విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడతామంటే అవకాశం ఇవ్వలేదు బయట మీడియాతో మాట్లాడతామంటే నిబంధనల పేరిట అడ్డుకుంటున్నారు కంచెలు తొలగిస్తామని.. ఇదేమి కంచెల పాలనా? తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత మీడియా పాయింట్ వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బారికేడ్లు అడ్డుపెట్టి మరీ ఆపిన పోలీసులు, మార్షల్స్ సభ జరుగుతున్న సమయంలో మాట్లాడ వద్దనే నిబంధన ఉందన్న పోలీసులు కొత్తగా ఈ రూల్స్ ఏంటని పోలీసులతో హరీష్‌రావు, కేటీఆర్ వాగ్వాదం మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు యత్నం స్పీకర్ నుంచి తమకు ఎలాంటి నోట్ రాలేదన్న బీఆర్ఎస్ కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు.. పోలీస్ పాలన:బీఆర్ఎస్ సభలో మైక్ ఇవ్వరు.. బయట కూడా మాట్లాడనివ్వరా? ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తోందని బీఆర్ఎస్ నిరసన తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడితే మేము ఊరుకోవాలా: మంత్రి శ్రీధర్‌రెడ్డి సీఎం రేవంత్ భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు.. కేసీఆర్ భాషపై ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదు రాజగోపాల్ రెడ్డి, కడియం శ్రీహరి వాఖ్యలలో అభ్యంతరాలు ఉంటే రికార్డుల నుంచి తొలగించాలి రేపు సభలో ఇరిగేషన్‌పై శ్వేత పత్రం రిలీజ్ చేస్తాం.. అప్పుడు కాళేశ్వరంపై మాట్లాడండి. ముఖ్యమంత్రి బాష అభ్యంతరకరంగా ఉంది: కడియం శ్రీహరి పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడడం వేరు.. సీఎం హోదాలో మాట్లాడటం వేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలా సీఎం మాట్లాడటం సరైంది కాదు కాంగ్రెస్ పార్టీకి చీడ పురుగు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిందే రాజగోపాల్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిని ఏం పీకడానికి పోయావ్ అంటారా?: సీఎం రేవంత్ మేడిగడ్డకు వెళ్లి సమస్యను పరిశీలించాం: సీఎం రేవంత్ ప్రభుత్వం సరైన భాష మాట్లాడటం లేదంటున్నారు కేసీఆర్ మాట్లాడిన భాష సరిగా ఉందా? తప్పందా కొత్త ప్రభుత్వానిదే అన్నట్టు కేసీఆర్ మాట్లాడారు ఒక ముఖ్యమంత్రిని ఏం పీకడానికి పోయావ్ అంటారా? ఇప్పటికే కేసీఆర్ ప్యాంట్ ఊడదీశారు.. ఇప్పుడు చొక్కా లాగుతారు ప్రాజెక్టులపై చర్చిద్దాం ప్రతిపక్ష నాయకుడిని సభకు రమ్మనండి అవినీతి బయటపడుతుందని సభకు రాకుండా దాక్కుంటున్నారు సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేత పత్రం పెడుతుంది కాళేశ్వరంపై చర్చకైనా మేం సిద్ధంగా ఉన్నాం కడియం వ్యాఖ్యలను తప్పుబట్టిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఐటీలో లక్షల ఉద్యోగాలను సృష్టించినందుకు కేటీఆర్‌కు థాంక్స్: కడియం ఐటీని తారా స్థాయికి కేటీఆర్ తీసుకెళ్లారు గత ప్రభుత్వం చేసుకున్న ఎంవోయూలను మళ్లీ ఎంవోయూలు చేసుకున్నారు: కడియం. ఎంవోయూలపై కడియం వ్యాఖ్యలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు గత ప్రభుత్వంలో చేసుకున్న ఎంవోయూలు ఒక్కటి కూడా మొన్నటి ఒప్పందాల్లో లేవు: శ్రీధర్ బాబు టీసీఎస్ లాంటి ఒప్పందాలు గత ప్రభుత్వంలో లేవు: శ్రీధర్ బాబు కాంగ్రెస్ ప్రభుత్వఃపై బీఆర్ఎస్ బురదజల్లుతుంది. కాంగ్రెస్ మేడిగడ్డ టూర్‌పై సభలో స్పందించిన బీఆర్ఎస్ మేడిగడ్డపై ప్రభుత్వం పూర్తి విచారణ చేయాలి: కడియం శ్రీహరి విచారణలో ఎవరు దోషులని తెలితే వాళ్లకు శిక్ష పడుతుంది మేడిగడ్డ బ్యారేజీని వెంటనే రిపేరు చేయాలి మేడిగడ్డను రాజకీయం కోసమే కాకుండా ప్రజల కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలి జూలై నెల వరకు మేడిగడ్డపై కాపర్ డ్యాం నిర్మించి ప్రజలకు నీళ్లు అందించేలాగా చర్యలు చేపట్టాలి. అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పున్నం ప్రభాకర్ మాట్లాడుతుండగా కూర్చో కూర్చో అంటూ కేటీఆర్ రన్నింగ్ కామెంట్స్ మాట్లాడేది వినబుద్ధి కాకపోతే సభలో నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ కేటీఆర్‌ను సూచించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రన్నింగ్ కామెంట్స్ భార్య పిల్లలను అడ్డం పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యే అయిన వాళ్లు కూడా సభలో మాట్లాడుతున్నారు: మంత్రి పొన్నం కౌశిక్ రెడ్డి, కేటీఆర్ నన్ను భయపెడితే నేను భయపడను: మంత్రి పొన్నం భయపడితే భయపడడానికి నేను బానిసను కాదు: మంత్రి పొన్నం ఇరిగేషన్‌పై తెలంగాణ శాసనసభలో రసాభాస కడియం శ్రీహరి వ్యాఖ్యలను తప్పుబడుతూ ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పదేళ్లు మా యువరాజు సిరిసిల్లకు అన్యాయం చేశారు కుర్చీ వేసుకుని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న ఇప్పటికీ పూర్తి చేయలేదు గత కాంగ్రెస్ ప్రభుత్వం లోనే 80 శాతం పూర్తయిన గౌరవెల్లి ఇప్పటికీ నీలి ఇవ్వలేకపోతోంది: మంత్రి పొన్నం ప్రభాకర్ లోయర్ మానేరు ఎల్లంపల్లి శ్రీరాంసాగర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కాలువలు తవ్వింది. శాసన సభలో ఆరు గ్యారెంటీల అమలుపై రసాభాస ఆరు గ్యారెంటీల అమలు కోసం 53వేల కోట్లు బడ్జెట్లో కేటాయించారు ఆరు గ్యారెంటీలతో పాటు డిక్లరేషనలు, 420 హామీలు కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు, 13 హామీలు అమలు కావాలంటే 1లక్ష 36వేల కోట్లు కావాలి ఆరు గ్యారెంటీల అంశం పై కడియం శ్రీహరి వ్యాఖ్యలను తప్పు పట్టిన మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వం ఏర్పడి 60 రోజులే అవుతుంది.. తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం:శ్రీధర్ బాబు. ఆరు గ్యారెంటీల హామీలను ప్రజలు నమ్మారు.. తీరా గెలిచిన తరువాత ప్రజల నెత్తిమీద భస్మాసుర హస్తం పెడుతున్నారు: కడియం వనరులు చూసుకోకుండా, లెక్కలు చెయ్యకుండా హామీలు ఇచ్చారా?: కడియం బడ్జెట్‌పై చర్చలో కడియం శ్రీహరి వర్సెస్ మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ మాత్రమే ఎమర్జెన్సీ అనగానే కడియం ను అడ్డుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ దేశం ఏర్పడిన రోజు సూది తయారు చేసుకునే పరిస్థితి లేకుండే - మంత్రి పొన్నం కడియం బడ్జెట్ పై మాత్రమే మాట్లాడాలి పదేళ్లలో గత ప్రభుత్వం ఏమైనా చేసిందా? నేను బుక్ లో ఉన్నది మాత్రమే చర్చ చేస్తున్నా: కడియం శ్రీహరి ఎమ్మెల్యే మంత్రులకు ఏమైనా డౌట్ ఉంటే బడ్జెట్ పుస్తకం చదువుకోవాలి బడ్జెట్ పుస్తకం తయారు చేసేటప్పుడు సరిచేసుకోవాలి అందరి కోసం కాదు... కొందరి కోసం చేస్తుందే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు లెక్కల్లో గత ప్రభుత్వాన్ని పొగుడుతూ... మరో వైపు బయట తిడుతున్నారు గత ప్రభుత్వం పాలన సరిగ్గా లేకపోతే తలసారి ఆదాయం ఎలా పెరుగుతుంది? అభివృద్ధి జరగకపోతే ఓటాన్ అకౌంట్ బడ్జెటే 2లక్షల 75వేలు ఎలా పెడతారు? తెలంగాణ శాసన సభలో బడ్జెట్ పై మొదలైన చర్చ బడ్జెట్ పై BRS నుంచి చర్చను మొదలు పెట్టిన కడియం శ్రీహరి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదు:కడియం శ్రీహరి. బడ్జెట్‌పై చర్చ జరుగుతుంటే ఆర్థిక మంత్రి, సీఎం రేవంత్ లేరు: కడియం శ్రీహరి బడ్జెట్‌పై చర్చలో ఒక్క అధికారి తప్ప ఎవ్వరూ లేరు అసెంబ్లీలో.. మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ప్రసంగం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి ఇరిగేషన్‌పై సభలో మంత్రి ఉత్తమ్ శ్వేతపత్రం ప్రవేశపెట్టనున్నారు నేడు తెలంగాణ అసెంబ్లీలో.. కాసేపట్లో ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ సమాధానం ఇవ్వనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్న అసెంబ్లీ ఇరిగేషన్‌పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల మేడిగడ్డ విజిలెన్స్ రిపోర్ట్, కాగ్ రిపోర్ట్‌ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ఇరిగేషన్‌పై చర్చకు రావాలని కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు -
Live: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
-
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఓవరాక్షన్
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ సభ్యులు తమ తీరు మార్చుకోలేదు. అసెంబ్లీ బడ్జెట్ సంయుక్త సమావేశాల్లో భాగంగా రెండో రోజైన సోమవారంటీడీపీ సభ్యులు అనుచితంగా ప్రవర్తించారు. అసెంబ్లీ ప్రారంభమైన కాసేపటికే స్పీకర్ చాంబర్ వైపు దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు.. స్పీకర్‌పై పేపర్లు విసిరారు. రెడ్‌లైన్ దాటి మరీ స్పీకర్ చాంబర్లోకి వెళ్లిన టీడీపీ సభ్యులు.. దురుసుగా ప్రవర్తించారు. నినాదాలు చేస్తూ తమ చేతిల్లో ఉన్న పేపర్లను స్పీకర్‌పై విసిరారు. టీడీపీ సభ్యుల తీరుతో సభను వాయిదా వేశారు స్పీకర్ తమ్మినేని. -
బడ్జెట్ సమావేశాలు.. ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం జగన్ పూర్తి ప్రసంగం విశ్వసనీయత ఎప్పటికైనా గెలుస్తుంది: సీఎం జగన్ చంద్రబాబు కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తారు వాగ్దానాలు అమలు చేసిన చరిత్ర చంద్రబాబుకి లేదు మనసు లేని నాయకుడు.. మోసం చేసే నాయకుడు చంద్రబాబు చేయలేనివి చెప్పకూడదు.. మాట ఇస్తే తప్పకూడదు ఒక్క అబద్ధం ఆడని కారణంగా ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నా అలివి కానీ హామీలిచ్చి వాటి అమల్లో దారుణంగా విఫలమైనందుకు, అన్ని వర్గాల వారిని మోసం చేసినందుకు 2019లో 175 స్థానాల్లో కేవలం 23 స్థానాలు మాత్రమే బాబుకు దక్కాయి. మాట మీద నిలబడ్డాం కాబట్టే ప్రజలు 151 స్థానాలు కట్టబెట్టారు ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు గెలిపించి గుండెల్లో పెట్టుకున్నారు విశ్వసనీయతకు అర్థం జగనే విశ్వసనీయత ఎప్పటికైనా గెలుస్తుంది 99 శాతం హామీలు అమలు చేశాం జరిగిన మంచిపై ప్రతి ఇంటా చర్చ జరగాలి అలా ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది.. సీఎం జగన్ ఐదేళ్లలో మ్యానిఫెస్టోలో 99 శాతం హామీలను నిబద్ధతతో అమలు చేశాం. హామీల అమలుపై ప్రజల చేతనే శెభాష్ అనిపించాం 2014లో చంద్రబాబు నాయుడు కూటమికి వచ్చిన ఓట్లు, మనకు వచ్చిన ఓట్లు ఎంతని పరిశీలిస్తే ఒక్క శాతం ఓట్లు మాత్రమే తేడా కనిపిస్తుంది. 46 శాతం వాళ్లకొచ్చాయి. మనకు 45 శాతం వరకూ వచ్చాయి. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇద్దామని చాలామంది శ్రేయోభిలాషులే సలహా ఇచ్చారు. అయితే చేయలేదని చెప్పకూడదు. మాట ఇస్తే తప్పకూడదని వాళ్లందరికీ చెప్పా ఆ ఒక్క మాట నేను అబద్ధం చెప్పని కారణంగా.. ఆ ఒక్క రోజు అధర్మం చేయని కారణంగా ఒక్క శాతం ఓట్ల తేడాతో ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. బాబును నమ్మడం అంటే.. సీఎం జగన్ నోట మళ్లీ బంగారుకడియం-పులి ప్రస్తావన వాగ్దానాలు అమలు చేసే ఉద్దేశమే ఆయనకు లేదు అమలు చేసిన చరిత్ర అంతకన్నా లేదు రాష్ట్ర ప్రజలకు వినమ్రంగా తెలియజేసేది ఏమిటంటే.. బాబు మేనిఫెస్టోను నమ్మడం అంటే బంగారు కడియమిస్తానన్న పులిని నమ్మడమే సంపద సృష్టించారా.. ఎక్కడ? రూ.70 వేల కోట్లకే రాష్ట్రం శ్రీలంక అవుతుందని అంటున్న చంద్రబాబు రూ.1.26 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నిస్తే ఈనాడు వంటి గోబెల్స్ సంస్థలు ‘బాబు సంపద సృష్టిస్తాడు’’ అంటారు. మరి... పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి గతంలో ఏ మేరకు ఆయన సంపద సృష్టించాడో ఒకసారి చూద్దాం... సంపద సృష్టిలో బాబు ట్రాక్ రికార్డు... ఆయన ముఖ్యమంత్రి కాక మునుపు వరకూ 1993 వరకూ రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ ఆ తరువాత ఏ ఏడాదిని తీసుకున్నా (మచ్చుకు పదేళ్లు చూపుతున్నాం) రాష్ట్రం రెవెన్యూ డెఫిషిట్ 2004లో దివంగత నేత, నాన్నగారు సీఎం అయిన తరువాత మళ్లీ రెవెన్యూ సర్ప్లస్ 2014లో బాబు మళ్లీ ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్లీ రెవెన్యూ డెఫిషిట్‌లోకి వెళ్లిపోయింది,. నిజంగానే బాబు అంత గొప్ప విజనరీ అయితే ఆయన పాలనలో రాస్ట్రం మెరుగుపడి ఉంటే.. ఆయన హయాంలో దేశం జీడీపీలో మన వాటా 4.47 శాతం. గత ఐదేళ్లలో 4.82 శాతం భాగస్వామ్యం మనది. దీన్నిబట్టి చూస్తే ఎవరు సంపద సృష్టించారో స్పష్టంగా తెలుస్తుంది బాబు వాగ్దానాల ఖర్చెంతంటే.. : సీఎం జగన్ ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు వాగ్ధానాలు ఉంటాయి మనం ఏడాదికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తే.. శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు ప్రచారం చేస్తన్నారు చంద్రబాబు కొత్త వాగ్ధానాలకు ఏడాదికి రూ.73 వేల కోట్లు ఖర్చు అవుతుంది ఇప్పటివరకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కలుపుకుంటే రూ.2 లక్షల 26 వేల 140 కోట్లు ఖర్చు అవుతుంది మరి అప్పుడు రాష్ట్రం ఏమవుతుంది? మనం రూ.70 వేల కోట్లకే చాలా కష్టాలు పడుతూంటే బాబు రూ.1.26 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం సాధ్యమేనా? ఇలా మోసం చేయడం, కుట్రలు పన్నడం ధర్మమేనా బాబు! సంపద సృష్టించానని బాబు ప్రతీ మీటింగ్‌లో చెబుతున్నారు చంద్రబాబు సీఎంగా ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో రెవెన్యూ లోటు బాబు సంపద సృష్టిస్తే.. రెవెన్యూ లోటు ఎందుకు వస్తుంది? చంద్రబాబు కంటే మన హయాంలోనే ఎక్కువ సంపద సృష్టించాం ఇదీ తేడా.. సీఎం జగన్ తల్లికి వందనం అంటూ చంద్రబాబు మరో కొత్త డ్రామా మొదలుపెట్టారు వేరే రాష్ట్రాల్లో ప్రజల్ని ఆకట్టుకున్న వాగ్ధానాల్ని తీసుకొచ్చారు మా హయాంలో ఎవరూ టచ్ చేయలని పథకాలు తీసుకొచ్చాం 8 పథకాలకే రూ. 52 వేల కోట్లు ఖర్చు చేశాం 650 వాగ్ధానాలతో గత మేనిఫెస్టో ఇచ్చారు చంద్రబాబు వాటిలో పదిశాతం హామీలే చేశారు చంద్రబాబు ఇప్పుడు తాజాగా చేస్తున్న ఆరు హామీలను కూడా కలిపితే మహిళా మహా శక్తికి రూ.36000 కోట్లు తల్లికి వందనం రూ.12450 కోట్లు యువ గళం రూ.7200 కోట్లు దీపం పథకం రూ.4600 కోట్లు అన్నదాత రూ.11000 కోట్లు అన్నీ కలిపితే రూ.73 వేల కోట్లు. వీటికి రద్దు చేయలేని ఎనిమిది పథకాలకు పెడుతున్న ఖర్చు కూడా కలుపు కుంటే మొత్తం 1,26140 వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టాలి. డీబీటీ, నాన్ డీబీటీలు రెండింటినీ కలిపి తీసుకున్నా రాస్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు మొత్తమ్మీద సంవత్సరానికి 77 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని కొన్ని పథకాలు రద్దు చేయలేదు. పెన్షన్లకు అయ్యే రూ.23600 కోట్లు రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తు రూ.11,000 ఖర్చు సబ్సిడీ బియ్యం రూ.4600 కోట్లు ఆరోగ్య శ్రీ, ఆరోగ్య ఆసరా రూ.4,400 కోట్లు ఫీజ్ రీయంబర్స్మెంట్ రూ.2,800 కోట్లు వసతి దీవెన రూ.2,200 కోట్లు సంపూర్ణ పోషణ కింద బాలింతలు, గర్భిణులు, ఆరేళ్ల లోపు చిన్నారులకు రూ.2,200 కోట్లు గోరుముద్ద కింద పోషకాహారం.. రోజుకో మోనూతో ఇస్తున్నాం - రూ.1,900 కోట్లు ఈ ఎనిమిది పథకాలకు 52,700 కోట్లు ఖర్చు అవుతోంది. వీటిని ఏ ప్రభుత్వం కూడా రద్దు చేయలేవు బాబు ఏ మేనిఫెస్టో తీసుకున్నా ఇవే మోసాలు: సీఎం జగన్ ప్రభుత్వం మంచి చేయలేదని నమ్మితే.. ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఏముంది? వీళ్లు ఏ ఒక్కరు కూడా అధికారం అన్నది ప్రజలకు మంచి చేసేందుకు ఉపయోగించుకోవాలని రావడం లేదు. ప్రజలను మోసం చేసేందుకు వీళ్లు దోచుకుని, పంచుకునేందుకు మాత్రమే వీళ్లకు అధికారం కావాలి మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తొలగించిన ఘనత చంద్రబాబుది పేదలకు మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధం అయ్యారు పక్క రాష్ట్రాల్లోని వాగ్ధాలను మేనిఫెస్టోలో పెడుతున్నాడు కనీసం పది శాతం హామీలను కూడా నెరవేర్చలేదు ఏ మేనిఫెస్టో తీసుకున్నా ఇవే మోసాలు కనిపిస్తాయి. 1994, 1999 -2014లో ఇచ్చిన మేనిఫెస్టోల్లోనూ ఇవే మోసాలు కనపడతాయి తొలి సంతకాలు, సామాజిక వర్గాలు, రైతులు, పిల్లలు, అక్కచెల్లెమ్మలు, నిరుద్యోగులకు ఇచ్చిన దాదాపు 655 వాగ్దానాలుచ్చి.. వాటిల్లో పది శాతం కూడా తీర్చకుండా.. మేనిఫెస్టోను మాయం చేశాడంటే పరిస్థితి ఏమిటన్నది ప్రజలు ఆలోచించుకోవాలి ఇలాంటి వ్యక్తిని 2024 ఎన్నికల్లో నమ్మడం కరెక్టేనా అన్నది ప్రజలు ఆలోచించాలి. ఎలాగూ ప్రజలు తమకు అధికారం ఇవ్వరని అనుకుంటన్న చంద్రబాబు గ్యాంబ్లింగ్ తరహాలో హామీలిస్తున్నాడు వేర్వేరు రాష్ట్రాల్లోని హామీలను పట్టుకుని పేకాట ఆడటం మొదలుపెట్టాడు చంద్రబాబు నమ్మే ఫిలాసఫీ ఇదే: సీఎం జగన్ నమ్మినవాడు మునుగుతాడు.. నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు చంద్రబాబు ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు ఎన్నికల ముందు చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో పెద్ద బుక్ తెస్తారు ఎన్నికలయ్యాక మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్తుంది ఏ గ్రామానికి వెళ్లినా చంద్రబాబు చేసిందేమీ లేదు చంద్రబాబు పాలన అధ్వాన్నంగా సాగింది ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి: సీఎం జగన్ బాబు వయసు 75. రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లు అయ్యింది. మొదటిసారి సీఎం అయి కూడా 30 ఏళ్లు అవుతోంది. మూడుసార్లు సీఎం అయిన తరువాత కూడా ఇప్పటికి కూడా.. ఫలానా పని చేశా కాబట్టి నాకు ఓటేయండి ఆయన అడగలేకపోతున్నాడు. మరోసారి ఛాన్స్ ఇస్తే అది చేస్తా.. ఇది చేస్తా అని మాత్రమే అంటున్నాడు ప్రతి ఒక్కరూ ఈ విషయమై ఆలోచన చేయాలి. బాబు మీ సామాజిక వర్గాలకు చేసిన మేలు ఏమైనా ఉందా? అన్నది కూడా ప్రతి సామాజిక వర్గం కూడా ఆలోచించాలి మేనిఫెస్టో అంటే లావు పుస్తకం పెడతారు వాళ్లు. ప్రతి సామాజిక వర్గానికీ బోలెడన్ని హామీలిస్తాడు. ఎన్నికల తరువాత ఆ మేనిఫెస్టో ఎక్కడికి వెళుతుందో ఎవరికీ తెలియదు. ఆన్‌లైన్‌లోనూ కనిపించదు. చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చేది.. : సీఎం జగన్ చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా? బాబు పేరు చెబితే.. ఈనాటికీ గుర్తుకొచ్చేది వెన్నుపోటే చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దైర్యం లేదు చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు చంద్రబాబు ప్రతీ సామాజిక వర్గాన్ని మోసం చేశారు చంద్రబాబు కొత్త కొత్త వాగ్ధానాలతో గారడీ చేస్తున్నారు ఇప్పటికీ చంద్రబాబు ఏం చేశాడో చెప్పి ఓట్లు అడగలేకపోతున్నారు ఇన్ని కుట్రలు, పొత్తులు, కుతంత్రాలు ఎందుకు? ఆ అవసరం ఏముంది?: సీఎం జగన్ మనం చేసిన 2,91,000 కోట్ల అప్పును ఒకరు 13 లక్షల కోట్లు అంటారు.. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కుటుంబాలకు ఏ మంచి చేయలేదు. ఎక్కడా ఈ విషయాన్ని చెప్పుకోనూ లేడు. ఇటీవలి కాలంలో నేను చేస్తున్న ప్రసంగాల్లోనూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నా. పది సంవత్సరాల బ్యాంక్ అకౌంట్లో బాబు హయాంలో ఒక్క రూపాయి అయినా వారికి చేరిందా అని వాళ్లనే చూసుకోమంటున్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్ ఉన్నా.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారినా ఎందుకు బాబు హయాంలో ఎక్కువ అప్పులు చేసినా ఎవరికీ లబ్ధి ఎందుకు చేకూర్చలేకపోయారు? ఆడబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి చేరాయో ప్రజలు ఆలోచన చేయాలి? ప్రతికూల పరిస్థితుల్లోనూ చిత్తశుద్ధి, పట్టుదల, నిబద్ధతలతో రాష్ట్రంలో రైతన్నలకు, పిల్లలకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, సామాజిక వర్గాల సంక్షేమం కోసం ఎలా అడుగులు ముందుకేసామో చరిత్ర మనల్ని గుర్తుంచుకుంటుంది. కేంద్రం నుంచి ఆశించినంత మేరకు నిధులు రాకపోయినా బాబు చేసిన అప్పులకు వల్లమాలిన వడ్డీ కట్టుకుంటూ.. కోవిడ్ కారణంగా ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగినా ఎన్ని కారణాలున్నా.. ఇబ్బందులన్నా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్న లక్ష్యంతో పనిచేశామని, మేనిఫెస్టోలో 97 శాతం హామీలను నెరవేర్చిన పార్టీగా అవతరించాం. ఏ ప్రభుత్వమైనా ఐదేళ్ల పాలనలో ప్రజలకు చెడు చేసిందని కానీ.. మంచి చేయలేదని కానీ, మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయలేదని కానీ ప్రతిపక్షం నమ్మితే.. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఏముంది? జాతీయ పార్టీతో, ప్రత్యక్షంగా ఒకరితో, పరోక్షంగా ఇంకొకరితో అవగాహన కుదుర్చుకుని, కుట్రలతో పరువు దక్కించుకోవాల్సిన పరిస్థితిలో ప్రతిపక్షం ఉందంటే దాని అర్థమేమిటో ఆలోచన చేయాల్సిన అవసరముంది? ఇంటింటి ఆర్థిక స్థితిని మార్చాం: సీఎం జగన్ చంద్రబాబు హయాంలో ఏ కుటుంబానికి మంచి జరగలేదు ఆయన హయంలో సంక్షేమ పథకాలు లేవు 14 ఏళ్లు సీఎంగా అనుభవం ఉందని చంద్రబాబు అంటున్నారు రాష్ట్రానికి ప్రజలకు పనికిరాని అనుభవం ఎందుకు? తాను చేయని అభివృద్ధిన తానే చేశానని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరం మాకు అనుభవం లేకపోయినా పరిపాలన ఎలా చేయాలో చేసి చూపించాం మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాం రూ.2 లక్షల 55 వేల కోట్లు పేదలకు ఇచ్చాం ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే మా తాపత్రయం ఆ ప్రయత్నంలో భాగంగానే ఇంటింటి ఆర్థిక స్థితిని మార్చాం.. పేదలకు అండగా నిలిచాం చంద్రబాబు ఏనాడూ మంచి చేసింది లేదు: సీఎం జగన్ కేంద్రం కంటే రెట్టింపు స్థాయిలో బాబు అప్పులు తెచ్చాడు కానీ, ఎక్కువ అప్పులు చేశామని మన మీద అబద్ధాల బ్యాచ్ ప్రచారం చేస్తోంది మన హయాంలో కేంద్ర ప్రభుత్వం 6.5 శాతం అప్పులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు 5.2 శాతం మాత్రమే ఏ రకంగా చూసినా గత ప్రభుత్వానికి, మనకూ ఎంత వ్యత్యాసముందో చెప్పేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ఈ మాత్రం చేయగలిగామనేందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది జనాలకు మంచి చేశామన్న సంతృప్తి మాకు ఉంది అంత అప్పుతో మన ప్రయాణం.. : సీఎం జగన్ విభజన నాటికి రూ.లక్షా 53 వేల కోట్ల అప్పు ఉంటే.. చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.4.12 లక్షల కోట్లకు చేరింది. 2019 మే నెల నాటికి 4,12,288 కోట్ల రూపాయలు రూ.4.12 లక్షల కోట్ల అప్పుతో ప్రయాణం ప్రారంభించాం. ఇప్పుడది ఏడు లక్షల కోట్ల పై చిలుకుగా ఉంది. మన హయాంలో ఆర్థిక సంఘం సిఫారసుల కంటే రూ. 366 కోట్లు తక్కువ తీసుకున్నాం ఈనాడు, టీవీ-5, ఆంధ్రజ్యోతి వంటి వాళ్లు మనపై చేసే ఇంకో ఆరోపణ విపరీతంగా అప్పులు చేశారని! హద్దు పద్దూ లేకుండా లక్షల కోట్లు చేసేశారని ఆరోపిస్తూంటారు గ్యారెంటీలతో కలిపి వివిధ సంస్థలు చేసిన అప్పులు.. గ్యారెంటీల్లేని అప్పులను కూడా పరిగణలోకి తీసుకుంటే విభజన నాటికి.. రాష్ట్ర ప్రభుత్వం అప్పు 132000 కోట్లు (రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినవి.. చేసిన అప్పులు కలిపి) గ్యారెంటీల్లేని ప్రభుత్వ అప్పులు కూడా కలుపుకుంటే మొత్తం అప్పు రూ. 1,53,000 కోట్లు బాబు హయాంలో అప్పులు పెరగింది 21.87 ఏడాదికైతే... మన హయాంలో ఇది కోవిడ్ వల్ల ఆదాయాలు తగ్గినప్పటికీ... ఖర్చులు పెరిగినప్పటికీ.. బటన్లు నొక్కినప్పటికీ కూడా బాబు హయాయంలో ఉన్న 21. 87 శాతం అప్పుల పెరుగుదల రేటు ఉంటే మన హయాంలో మాత్రం అది 12.13 శాతం మాత్రమే. అంటే.. అప్పుల పెరుగుదల 12 శాతానికి పరిమితం చేశాం యెల్లో మీడియా దుష్ఫ్రచారం: సీఎం జగన్ ఎల్లో మీడియా ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తోంది ఇలాంటి వారిపై మనం యుద్ధం చేస్తున్నాం చంద్రబాబు హయాంలో కంటే.. అభివృద్ధి కోసం అదనంగా మేం అదనంగా ఖర్చు చేస్తున్నాం చంద్రబాబు హయాంలో రూ. 15,227 కోట్లు సగటున ఖర్చు చేస్తే.. మా హయాంలో రూ.17,757 కోట్లు ఖర్చు చేశాం అప్పులపై యెల్లో మీడియా దుష్ఫ్రచారం చేస్తోంది లంచాలు, వివక్ష లేకుండా పారదర్శక పాలన అందించాం రూ.2లక్షల 55 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం నాన్ డీబీటీ ద్వారా రూ.లక్షా 76 వేల కోట్లు అందించాం దురదృష్టవశాత్తూ మనకు శత్రువులు ఎక్కువ గోల చేసే వాళ్లు ఎక్కువ.. ఒకే విషయాన్ని మళ్లీమళ్లీ చెబుతూ గందరగోళం సృష్టించే వాళ్లూ ఎక్కువే కేపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ తక్కువని వీరు ఆరోపణలు చేస్తూంటారు. జగన్ కేవలం బటన్లు మాత్రమే నొక్కుతూంటారన్నది కూడా అబద్ధం సమర్పించిన అంకెలన్నీ కాగ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చినవే కడుతున్న మూడు పోర్టులను కూడా కలుపుకుంటే ఈ మొత్తానికి ఇంకో పన్నెండు వేల కోట్లు చేర్చాల్సి వస్తుంది ప్రతీ రూపాయి ప్రజలకే: సీఎం జగన్ రూ.2 లక్షల 55 వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో వేశాం 57 నెలల ప్రయాణంలో ఎక్కడా అవినీతికి తావివ్వలేదు ఎలాంటి వివక్ష లేకుండా ప్రతీ రూపాయి ప్రజలకు చేరుతోంది బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేశాం అయినా ప్రతిపక్షాలు యెల్లో మీడియాతో విష ప్రచారం చేస్తున్నాయి విభజన నష్టం భారీగానే.. :సీఎం జగన్ మనది రైతులు, వ్యవసాయంతో కూడిన ఎకానమీ తెలంగాణతో పోలిస్తే ఏపీ ఆదాయం తక్కువ రాష్ట్రాన్ని అడ్డంగా విడగొట్టారు విభజన కారణంగా ఏటా రూ.13 వేల కోట్లు నష్టపోయాం ఈ ఐదేళ్లలో లక్ష కోట్ల అదనపు ఆదాయం కోల్పోయాం కనీస చట్టంలోనూ ఆ వెసులుబాటు కల్పించలేదు ఆ లోటు ఇప్పటికీ వెంటాడుతోంది: సీఎం జగన్ గత ప్రభుత్వ విధానాల వల్ల కూడా బాగా నష్టం జరిగింది ఆర్థిక వ్యవస్థ కుదేలు అయ్యింది గత ప్రభుత్వ విధానాల వల్ల విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి రంగాలు కుదేలయ్యాయి రైతులను చంద్రబాబు మోసం చేశారు ఐదేళ్లలో చంద్రబాబు రైతులకు రూ.15వేలకోట్లు కూడా ఇవ్వలేదు పొదుపు సంఘాల వడ్డీ కూడా మాఫీ చేయలేదు ప్రతీ రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌజ్ ఉండాలి అలాంటి పవర్‌హౌజ్ లేకపోతే రాష్ట్ర ఆదాయాలు ఎప్పటికీ పెరగవు ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్‌ను కోల్పోయాం రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతోంది రాష్ట్ర తలసరి ఆదాయం తగ్గిపోయింది అందుకే విశాఖ గురించి పదే పదే చెబుతున్నా రాష్ట్రం ఆర్థికంగా ఎదగడానికి పెద్ద పెద్ద నగరాలు అవసరం ఓ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ఉండాలి ఇలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించలేదు: సీఎం జగన్ 2015-19 మధ్య కేంద్రం ఇచ్చిన పన్నుల వాటా కేవలం 31.5 శాతమే 15వ ఆర్థిక సంఘం 41 శాతం సిఫారసు చేసిన మనకు 31 శాతం మాత్రమే దక్కింది. బాబు హయాంలో 35 శాతం వరకైనా తగ్గింది. మేము అధికారంలోకి వచ్చేటప్పటికీ బాగా తగ్గిపోయాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటా గత ఐదేళ్లలో.. 2018 - 19లో 32780 వేల కోట్లు వస్తే 2019- 20లో 28000 కోట్లు 2020-21 - 24000 కోట్లకు 2021-22 - 36 వేల కోట్లు 2023-23లో 38 000 కోట్లకు చేరుకుంది కరోనా కారణంగా రెండు ఆర్థిక సంవత్సరాలు తీవ్రంగా నష్టపోయాం ఆదాయం తగ్గడంతో పాటు ఖర్చులూ పెరిగాయ్ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గాయ్ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ఐదేళ్లు పాలించాం: సీఎం జగన్ కరోనా కారణంగా ఆదాయం తగ్గింది మూడేళ్లలో రాష్ట్రం 66 వేల కోట్లు ఆదాయం నష్టపోయింది కోవిడ్ మహమ్మారి వల్ల అనూహ్యంగా కొన్ని ఖర్చులు పెరిగిపోయాయి. ఈ ఐదేళ్లలో చూసిన అనూహ్య పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే వాటా (డెవల్యూషన్స్) తగ్గిపోవడం ఒకటి. చంద్రబాబు పాలన కాలంతో పోలిస్తే ఈ ఐదేళ్లలో మన రాష్ట్రంతోపాటు అన్ని రాష్ట్రాలకూ తగ్గాయి. రాష్ట్రానికి అత్యంత కీలకమైన వ్యవసాయం, విద్య, మహిళ సాధికారిత వంటి రంగాలపై గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం, ప్రజలపై ఎంతో తీవ్ర ప్రభావం పడింది ఈ కష్టాలను కూడా ఎదుర్కొని ఐదేళ్లు పాలన సాగించాం కరోనా వల్ల మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు నష్టపోయాయి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి మనల్ని రెవెన్యూ లోటు వెంటాడుతోంది. అయినా సరే.. ఈ ఐదేళ్లలో సుపరిపాలన అందించగలిగాం. జూన్‌లో మళ్లీ బడ్జెట్ పెడతాం: సీఎం జగన్ సంప్రదాయం ప్రకారం.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం ఈ సమావేశాల్లో తెలపనున్నాం జూన్‌లో కొలువుదీరబోయే మన ప్రభుత్వం.. ఇదే సభలో మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పిస్తుంది ఇప్పటిదాకా ఐదు ప్రజా బడ్జెట్లు ప్రవేశపెట్టాం ప్రతిపక్షం వేస్తున్న నిందలు.. వాస్తవాలేంటన్నది ప్రజలకు వివరించబోతున్నాం కఠినమైన పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చాం ఈ ఐదు సంవత్సరాల్లో అనూహ్య పరిస్థితులెన్నో చూశాం.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కరోనా లాంటి సంక్షోభం ఎప్పుడూ రాష్ట్రం చవిచూడలేదు గత ప్రభుత్వ పాలన ప్రభావం కూడా రాష్ట్రంపై కనిపించింది ఈ పరిస్థితులన్నీ అధిగమించి గొప్ప పాలన అందించాం సీఎం జగన్ పాలనతో పేదరికం తగ్గింది సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగింది సీఎం జగన్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు రూ.2 లక్షల 53 వేల కోట్లు పేదల ఖాతాలో వేశారు సీఎం జగన్ పాలనతో పేదరికం తగ్గింది మీకు మంచి జరిగితేనే నాకు అండగా నిలబడండి అని సీఎం జగన్ చెప్పారు నాయకత్వం అంటే సీఎం జగన్‌ది నాయకుడికి ఉండాల్సిన లక్షణం చంద్రబాబుకి లేదు ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందాలో ప్రతిపక్షం ఆలోచిస్తోంది శాసనసభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ధృడ సంకల్పంతో సీఎం జగన్ పనిచేస్తున్నారు: జక్కంపూడి రాజా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ పేదలకు చేయూత ఇచ్చారు. ఆపై రాజశేఖర్‌రెడ్డి గారి మరణ తర్వాత మళ్లీ వెనుకబడ్డామనే భావన కల్గింది 2009 నుంచి 2019 వరకూ గడ్డు పరిస్థితుల్నే ఎదుర్కొన్నాం 2014లో చంద్రబాబు నాయుడు ఏదో రకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకోవాలని దురాలెచనతో 650 హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఆపై ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు చంద్రబాబు ఆ తరుణంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను జగన్ చూశారు. అందుకోసం సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన జగన్.. ప్రజల కష్టాలను తెలుసుకున్నారు అప్పట్నుంచి పేదవాడి కష్టాలను తీర్చాలనే లక్ష్యంతో పని చేస్తున్న నాయకుడు సీఎం జగన్ జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచీ నేటి వరకూ ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ధృడమైన సంకల్పంతో పని చేస్తున్నారు స్పీకర్‌పై టీడీపీ సభ్యులకు గౌరవం లేదు: అబ్బయ్య చౌదరి తొడలు కొడితే కుర్చీరాదు.. ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది విలువలేకుండా ఏదో మాయ మాటలు చెప్పాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి పేదల కోసం ఆలోచించి, పేదల కోసం జీవించే ప్రభుత్వం మనది పేదలకు అండగా ఉండాలనే సిద్ధాంతంతో ముందుకు వెళుతున్న సీఎం జగన్ చూసి చాలా ఆనందంగా ఉంది నిజమైన నాయకుడు అనేవాడు ప్రజల అభివృద్ధిపైనే ఫోకస్ చేస్తాడు అదే సీఎం జగన్ చేస్తున్నారు అంబేద్కర్‌ను వ్యక్తిలా కాకుండా సిద్ధాంతంలా తీసుకుని ముందుకు వెళుతున్న నాయకుడు సీఎం జగన్ విద్యా వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మార్చి పిల్లలకు మేనమామలా ఉన్న వ్యక్తి మనం సీఎం జగన్ హెల్త్ కేర్‌ను ప్రతీ పేదవాడికి అందిస్తున్న నాయకుడు సీఎం జగన్ ప్రతీ ఒక్కరికి హెల్త్ కేర్ అనేది అభివృద్ధి చెందిన దేశాల్లోనే సాధ్యం కాలేదు.. కానీ పేదవారికి వైద్యం అందించాలనే ఆలోచన చేసిన నాయకుడు సీఎం జగన్ ఆరోగ్యశ్రీని రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ఎంతో గొప్పది ఆరోగ్యానికి పేదవాడి చేతిల్లో నుంచి డబ్బు ఖర్చు పెట్టకూడదని ఆలోచన చేసిన నాయకుడు సీఎం జగన్ ఈరోజు పేదవాడికి మెరుగైన వైద్యం అందుతుంటే అందుకు కారణం సీఎం జగన్ టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం పదే పదే స్పీకర్ కుర్చీ దగ్గరకు వచ్చి ఆందోళన చేయడం అనైతికం ప్రజలకు తెలియ చేయాల్సిన విషయాలను పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నారు టీడీపీ సభ్యులు సాక్షాత్తు స్పీకర్‌పై దాడి చేయడం విలువల్లేని రాజకీయాలకు నిదర్శనం ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ టీడీపీ సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేసిన స్పీకర్ పదే పదే స్పీకర్ పోడియాన్ని చుట్టిముట్టి ఆందోళన సృష్టిస్తున్న నేపథ్యంలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ మళ్లీ స్పీకర్ పోడియంను చుట్టిముట్టిన టీడీపీ సభ్యులు అసెంబ్లీలో స్పీకర్ చాంబర్ వైపు దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు స్పీకర్ చాంబర్ వైపు దూసుకెళ్లి.. విజిల్స్‌వేస్తూ టీడీపీ సభ్యుల రగడ సభలో గందరగోళం సృష్టించి సభా సమయాన్ని వృథా చేస్తున్న టీడీపీ సభ్యులు రెడ్‌లైన్ దాటి స్పీకర్చాంబర్లోకి వెళ్లిన టీడీపీ సభ్యులు సభా నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ సభ్యుల తీరు సభలో విజిల్స్‌వేస్తూ అనుచితంగా ప్రవర్తిస్తున్న టీడీపీ సభ్యులు ప్రారంభమైన శాసన మండలి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై టిడిపి, డీఎస్సీ పోస్టుల సంఖ్యపై పీడీఎఫ్ వాయిదా తీర్మానాలు. వాయిదా తీర్మానాలను తిరస్కరించిన ఛైర్మన్ పోడియం వద్ద పోస్టర్లతో ఆందోళనకు దిగిన టీడీపీ సభ్యులు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన మర్రి రాజశేఖర్ శాసనమండలి 10 నిమిషాల పాటు వాయిదా టీడీపీ సభ్యుల తీరుతో సభ వాయిదా టీడీపీ సభ్యులకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదు: సుధాకర్‌బాబు టీడీపీ సభ్యులు సభా సంప్రదాయాలను పాటించడం లేదు బలహీన వర్గాలకు చెందిన స్పీకర్‌ను అవమానించారు టీడీపీ సభ్యులు నీచ రాజకీయాలు చేస్తున్నారు పేద విద్యార్థులకు విద్యను చేరువ చేశాం టీడీపీ పాలనలో అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదు సీఎం జగన్.. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు విద్యాకానుక కింద రూ. 11,901 కోట్లు అందించాం విద్యా దీవెన కింద రూ. 4, 276 కోట్లు అందించాం రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం సీఎం జగన్ హయాంలో విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లుకు ఆమోదం ఏపీ అడ్వకేట్స్ అండ్ క్లర్క్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లుకు ఆమోదం గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించిన స్పీకర్ స్పీకర్‌పై పేపర్లు విసరడం మర్యాద కాదు: అంబటి రాంబాబు స్పీకర్‌పై టీడీపీ సభ్యుల వ్యవహారశైలి సరికాదు పేపర్లు చింపి ఇలా చేస్తూ స్పీకర్‌ను అవమానిస్తున్నారు మీరు సభా సంప్రదాయాను తప్పుతున్నారు ఇది మర్యాద కాదు మీరు అసలు సభలో ఉండాలనుకుంటున్నారో.. లేదో తేల్చుకోండి ఇలా ప్రతీసారి సభను అడ్డుకోవడం సరికాదు టీడీపీ సభ్యుల మమ్మల్ని రెచ్చగొడుతున్నారు జాగ్రత్త ►అసెంబ్లీకి బయలుదేరిన సీఎం జగన్ టీడీపీ నేతలు ఓవరాక్షన్ సభకార్యకలాపాలకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు. స్పీకర్‌పై పేపర్లు విసిరిన టీడీపీ సభ్యులు. స్పీకర్ తమ్మినేని పోడియం వద్దకు దూసుకెళ్లి హంగామా. ►ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలు సీఎం వైఎస్ జగన్ పక్షానే ఉన్నారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పేర్నినాని కామెంట్స్ ప్రజలే కృష్ణుల్లాగా జగన్‌ను ముందుకు నడిపిస్తారు జగన్ ఫోటో పెట్టుకొని బాలశౌరి ఎంపీగా గెలిచాడు ఇప్పుడు సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నాడు జంపింగ్ జపాంగ్ ని వీరుడిలా పవన్ భావిస్తున్నాడు కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత పవన్ కి లెదు చిరంజీవి జనరంజక నటుడు చిరంజీవి కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు పవన్ ఏ పాత్ర పోషించారు శత్రువులతో షర్మిల చేతులు కలిపారు బజారుకెక్కి సొంత అన్ననే ధూషిస్తున్నారు జగన్ అనుచరులు చూస్తూ ఊరుకొంటారా నీతులు చెప్పే ముందు మీ గతాన్ని తలుచుకోండి తల్లిని తిట్టిన వాళ్ళ పల్లకీ మోసే పవన్‌ని ఏమనాలి జరగబోయే కురుక్షేత్రంలో పవన్ ది శల్యుడి పాత్ర పవన్‌ని సీఎంగా చూడాలన్న కార్యకర్త స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాడు చంద్రబాబు రిజెక్ట్ చేసి బాలశౌరిని పవన్ పక్కకు పంపాడు పదవులకోసం నేతలు గడ్డికరుస్తున్నారు నాదెండ్ల మనోహర్ కాళ్ళు పట్టుకొని బాలశౌరి జనసేనలో దూరారు ఆశ్రయం ,అధికారం ,అర్హత కల్పించిన సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత బాలశౌరికి లేదు శక్తులన్నీ ఏకమై కౌరవుల్లా వచ్చినా జగన్ లాంటి అర్జునుడిని ఏమీ చేయలేరు కాపు కులాన్ని పణంగా పెట్టి చంద్రబాబు పల్లకీ మోయవద్దు అని హరిరామ జోగయ్య కూడా లేక రాసారు హుందాగా వ్యవహరించాలని పవన్ కి సూచించారు కమ్మలు ,రెడ్లు లాగే అధికారం కోసం పోరాడామని లేఖలో కోరారు వ్యక్తిత్వ హననం చేస్తూ సీఎం వైఎస్ జగన్‌ని మాట్లాడితే చూస్తూ ఊరుకోము చంద్రబాబుకి మతిభ్రమించి మాట్లాడుతున్నారు నన్ను సర్వర్‌లా చంద్రబాబు అభివర్ణించారు పెత్తందారీ చంద్రబాబుకి సర్వర్లంటే అంత చిన్నచూపా పవన్ అసహాయ రాజకీయ నాయకుడు: మంత్రి చెల్లుబోయిన అసెంబ్లీ మీడియా పాయింట్ మంత్రి చెల్లుబోయిన కామెంట్స్ ప్రజాక్షేమాన్ని కాంక్షించే వాళ్లే రాజకీయ పార్టీ పెట్టాలి చిరంజీవి పార్టీ పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేశారు తప్పు సరిదిద్దుకొనేందుకే పవన్ పార్టీ పెట్టారనుకొన్నాము చంద్రబాబు కోసం పార్టీ పెట్టారన్న విషయం బయటపడింది. లోకేష్ అవినీతి పరుడని మాట్లాడిన పవన్ ఇప్పుడు వారితో అంటకాగుతున్నాడు ప్రజాసంక్షేమం అందించటంలో సీఎం వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు పేదరిక నిర్ములనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఎన్టీఆర్ ఫ్యామిలీకి ద్రోహం చేసిన చంద్రబాబుకు పవన్ వంతపాడుతున్నాడు పేదలకు సాయం చేస్తున్న సీఎం జగన్ ఓడిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు పవన్ అసహాయ రాజకీయ నాయకుడు ►ఆంధప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సంయుక్త సమావేశాల్లో భాగంగా రెండో రోజు(మంగళవారం) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ►ఉదయం తొమ్మిది గంటలకు రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం ►తీర్మానంపై చర్చను ప్రారంభించనున్న ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్‌బాబు, అబ్బయ్య చౌదరి ►చర్చ అనంతరం సీఎం జగన్ ప్రసంగం ►పది గంటలకు శాసనమండలి సమావేశాలు ►గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ►చర్చను ప్రారంభించనున్న ఎమ్మెల్సీ లు మర్రి రాజశేఖర్, వరుదు కల్యాణి ►బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజు సోమవారం శాసనసభ, శాసన మండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించారు. -
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. అప్డేట్స్
Updates.. అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా ముగిసిన బీఏసీ సమావేశం ఈనెల 8వరకూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఇంధన రంగంలో సబ్సిడీలు, రాయితీలను ప్రభుత్వం కల్పిస్తోంది రాష్ట్రంలో 19.41 లక్షల వ్యవసయ పంపుసెట్లకు పగట పూట కరెంట్ 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం రాష్ట్రంలో దిశయాప్ ద్వారా 3040 కేసులు పేదలందరికీ ఇళ్ల పథకం కింద 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం ఇప్పటికే 9 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందించాం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యత పీడీఎఫ్ కుటుంబాలకు సానుభూతితో పునరావాసం కల్పించాం పోలవరం ప్రాజెక్టులో ఇప్పటివరకూ 74.01 శాతం పూర్తి ఎల్ఏ అండ్ ఆర్ ఆర్ పనిలో 22.42 శాతం పూర్తి జగనన్న చేదోడు ద్వారా దుకాణాలు, నాయిబ్రాహ్మణులు, దర్జీలకు ప్రభుత్వం రూ. 10 వేలు అందిస్తోంది జగనన్న తోడు ద్వారా వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు రూ. 10 వేల వడ్డీలేని రుణం అందిస్తున్నాం వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా రూ. 350.89 కోట్లు అందిస్తున్నాం నాన్ డీబీటీ కింద 4.23 లక్షల కోట్ల సంక్షేమ ఫలాలు అందించాం 2023-24లో 268 కి.మీ పొడవునా 58 బీటీ రోడ్లు వేశాం రూ. 71 కోట్ల వ్యయంతో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల కొనుగోలు దీని ద్వారా 3, 27, 289 మంది తల్లులకు లబ్ది వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 66.34 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నాం 2024 జనవరి 1వ తేదీ నుంచి రూ. 3వేలు పెన్షన్ అందిస్తున్నాం నెలవారీ పెన్షన్ బడ్జెట్ రూ. 1961 కోట్లకు పెరిగింది ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ మొబైల్ డిస్పెన్సింగ్ ఓనర్లకు రూ. 10 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కోసం రూ. 4,969.05 కోట్లు వైఎస్సార్ చేయూత ద్వారా రూ. 14, 129 కోట్లు పంపిణీ వైఎస్సార్ కాపునేస్త కింద రూ. 2, 029 కోట్లు జమ వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా ఏడాదికి రూ. 15 వేలు అందిస్తున్నాం ఐదేళ్లలో రూ. 75 వేలు అందిస్తున్నాం 3, 57, 844 మంది అర్హుల ఖాతాల్లో రూ. 2,029 కోట్లు జమ వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద రూ. 1,257.04 కోట్లు జమ మహిళా సాధికారత, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక కృషి రాష్ట్రంలో 55,607 మెయిన్, మినీ అంగన్ వాడీ కేంద్రాలు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా 6.4 లక్షల మంది గర్భిణీలు, 28. 62లక్షల మంది పిల్లలకు లబ్ధి పౌష్టికాహార పథకాలకు రూ. 6,688 కోట్లు అంగన్వాడీ కేంద్రాలకు రూ. 21.82 కోట్ల విలువైన గ్రోత్ మానిటరింగ్ పరికరాలు అందించాం వైఎస్సార్ ఆసరా ద్వారా మహిళా గ్రూపులకు ఆర్థిక సాయం 78.84 లక్షల మంది మహిలలకు నాలుగేళ్లలో రూ. 25, 571 కోట్లు ఆక్వా రైతుల విద్యుత్ చార్జీల రాయితీ కోసం రూ. 3,186. 36 కోట్లు అందించాం రూ. 50.30 కోట్లతో 35 ఆక్వాల్యాబ్‌లు ఏర్పాటు 2.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఆక్వా కల్చర్ రొయ్యల ఉత్పత్తిలో 75 శాతం వాటాలో ఆక్వా హబ్ ఆఫ్ఇం డియాగా ఏపీ మత్స్య కార కుటుంబాలకు రూ. 540 కోట్లు అందించాం మత్స్యకార భరోసా కింద 2.43 లక్షల లబ్ధిదారుల రూ. 540 కోట్ల జమ చేపల వేట నిషేధ కాలంలో పరిహారం రూ. 10 వేలకు పెంచాం చేపల వేటకు వెళ్లి మరణిస్తే నష్టపరిహారం రూ. 5లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాం ఫిషింగ్ బోట్లకు డీజిల్ సబ్సిడీ కోసం రూ. 128.27 కోట్లు ఇచ్చాం రైతులు రాష్ట్రానికి వెన్నుమక 62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు 10, 778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఇప్పటివరకూ 53. 53 లక్షల రైతులకు రైతు భరోసా ఇచ్చాం రైతు భరోసా కింద రూ. 33, 300 కోట్లు పంపిణీ చేస్తున్నాం రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం 22.85 లక్షల రైతులకు రూ. 1, 977 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం మిచాంగ్ తుపానులో నష్టపోయిన రైతులకు రూ. 347.55 కోట్ల సాయం నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల్లో మెరుగు 53 ఏరియా ఆసుపత్రుల్లో, 9 జిల్లా ఆసుపత్రుల్లో వసతుల అభివృద్ధి 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా 10, 132 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పారా మెడికల్ సిబ్బందిని నియమించాం ఇప్పటివరకూ రూ. 1.32 కోట్లు రోగులకు అందించాం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యం దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా బోధన 8,9 తరగతుల విద్యార్థులకు 9, 52, 925 ట్యాబ్‌లు పంపిణీ చేశాం వచ్చే ఏడాది జూన్ నుంచి 1వ తరగతి నుంచి ఐబీ విధానం ప్రతి ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తాం విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు అత్యున్నత విద్యాసంస్థల్లో గుర్తించిన 21 ఫ్యాక్టరీలలో ఏ విభాగంలోనేనా విదేశీ విద్యను అభ్యసించవచ్చు ఇందుకోసం రూ. 1.25 కోట్లు వరకు మొత్తం ఫీజులు రీయింబర్స్ చేస్తున్నాం ప్రభుత్వ కృషితో స్కూళ్లలో డ్రాప్ఔట్లు గణనీయంగా తగ్గాయి ఉన్నత విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం 26.98 లక్షల మంది విద్యార్థులకు రూ. 11.901 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ 1 నుంచి 10 తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నాం పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నాం ఇప్పటివరకూ గోరుముద్దకు రూ. 4,417 కోట్లు ఖర్చు చేశాం జగనన్న గోరుముద్ద కోసం ఏటా రూ. 1, 910 కోట్లు ఖర్చు చేస్తున్నాం జగనన్న విద్యాకానుక కోసం ఇప్పటివరకూ రూ. 3, 367 కోట్లు ఖర్చు చేశాం విద్యాసంస్కరణల్లో డిజిటల్ లెర్నింగ్ కీలకమైనది మా ప్రభుత్వం ఇప్పటివరకూ నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టింది సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం పని చేస్తోంది విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అభినందనీయం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తున్నాం నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది దేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం మనబడి నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపరేఖలు మార్చాం విద్యారంగంపై రూ. 73, 417 కోట్లు ఖర్చు చేశాం ►ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం ►అసెంబ్లీకి చేరుకున్న సీఎం జగన్ మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు: మంత్రి అంబటి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్.. హామీల అమలుపై చంద్రబాబు అసత్యప్రచారం చేస్తున్నారు దేశంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు మేనిఫెస్టోని ఇంటింటికీ తీసుకెళ్లి అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలను గెలవబోతున్నాము సీట్ల ముష్టి కోసం చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్ళాడు పవన్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని సముద్రం ఈదినట్టే జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా నిద్రమేలుకోవాలి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎంగా చరిత్రలో జగన్ నిలిచిపోతారు దుష్టచతుష్టయం పన్నే పద్మవ్యూహాలని ఛేదించి రాగల అర్జునుడు సీఎం వైఎస్ జగన్ లోకేష్ బయట ఉంటే పార్టీ అవుట్ అని దాచేసారు టికెట్ లేదని చెబితే బఫున్లు పార్టీలు మారుతారు బాలశౌరీ అన్యాయాలు అక్రమాలు చేసిన బఫూన్ బాలశౌరీ ఎరికైనా నమ్మకద్రోహం చేసే వ్యక్తి ►అసెంబ్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ►గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం ►అసెంబ్లీ సమావేశాల అజెండాను ఖరారు చేయనున్న బీఏసీ ►ఈనెల 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ►మూడు నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి బుగ్గన ►కాసేపట్లో ప్రారంభం కానున్న రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు ►ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగం ►అనంతరం సమావేశాలు ప్రారంభం ►అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశమై ఈ సమావేశాలు ఎప్పటి వరకు నిర్వహించాలనేది నిర్ణయించనుంది. ►అదేవిధంగా త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ, ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం పొందనున్నారు. ►ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉద్యోగుల జీతభత్యాలు, సామాజిక పింఛన్లు, కొనసాగుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలకు అవసరమైన నిధుల వ్యయానికి అసెంబ్లీ ఆమోదం తీసుకోనున్నారు. అంతకుముందు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించడానికి ఏడో తేదీ ఉదయం 8గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. -
పేదలకు గుడ్ న్యూస్..ఉచిత విద్యుత్ పై కీలక ప్రకటన
-
Budget 2024: కీలక అంశాలు ఇవే
-
రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం..సంచలన ప్రకటన
-
మాల్దీవ్స్ కు షాక్..లక్షద్విప్ పై కీలక ప్రకటన
-
ఉద్యోగులకు గుడ్ న్యూస్ 7 లక్షల వరకు No Tax
-
వచ్చే ఐదేళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం
-
మహిళలకు 30 కోట్ల ముద్రా రుణాలు
-
మా దృష్టి అంతా గరీబ్, మహిళ, యువ, అన్నదాత
-
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
-
AP Budget: మహిళా సాధికారతే ధ్యేయంగా..
సాక్షి, అమరావతి: మహిళా సాధికారత కోసం బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు కేటాయించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. పేద మహిళలు ఆర్థికంగా బలపడేందుకు, స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. మహిళా పాడిరైతులను ఏకీకృతం చేయడానికి అదే విధంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలతో సమానంగా మహిళా పాల సహకార సంఘాలను(ఎండీఎస్‌ఎస్) ప్రోత్సహించడానికి జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టును వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. 17 జిల్లాలలో సుమారు 2.5 లక్షల మంది మహిళా పాడి రైతుల కోసం ఈ ప్రాజెక్టును అమలు చేసింది. దళారులను తొలగించి పాడి రైతుల నుంచి నేరుగా 561 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేసి రూ.250 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు చెల్లించింది. ఈ విధానం ద్వారా పాల నాణ్యతను బట్టి గతంలో లభించే ధర కంటే లీటరుకు రూ.5-20 వరకు మెరగైన ధర లభిస్తోంది. వైఎస్సార్ ఆసరా.. స్వయం సహాయక సంఘాలలోని గ్రామీణ, పట్టణ పేద మహిళలకు ఏప్రిల్ 4, 2019 నాటికి బకాయి ఉన్న బ్యాంకు రుణాల మాఫీ కోసం వైఎస్సార్ ఆసరా పథకం కింద 4 విడతలుగా చెల్లిస్తామని ప్రభుత్వ ప్రకటించింది. ► దీని కోసం బడ్జెట్లో రూ.6,700 కోట్లు కేటాయించింది. వైఎస్సార్ సున్నా వడ్డీ సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే సంస్కృతిని ప్రోత్సహించడానికి 3 లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలను కలిగి ఉన్న అన్ని స్వయం సహాయక సంఘాలపై వడ్డీ భారాన్ని తగ్గించడానికి సీఎం జగన్ ప్రభుత్వం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి గాను 2019 సంవత్సరం నుండి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలను కలుపుకొని స్వయం సహాయక సంఘాలకు చెందిన 1.02 కోట్ల మహిళలకు 3,615 కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ చర్య మహిళా సాధికారత ప్రయత్నాలను బలోపేతం చేసి స్వయం సహాయక సంఘాలకు చెందిన పేద మహిళల ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసింది. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కోసం 1,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ( ఫైల్ ఫోటో ) వైఎస్సార్ చేయూత ప్రభుత్వం షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతుల మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల 25 లక్షల మంది మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున గత నాలుగేళ్లలో 75,000 వేల రూపాయలను ఇచ్చింది. ఈ మొత్తాన్ని లబ్దిదారులు తమ ఎంపిక ప్రకారం ప్రస్తుత జీవనోపాధి కార్యకలాపాలలోను లేదా కొత్త సంస్థల స్థాపనకు పెట్టుబడిగా పెట్టుకోవడంలోను ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు 26.7 లక్షల మంది మహిళా సభ్యులకు 3 విడతలుగా 14,129 కోట్ల రూపాయలను అందజేయడం జరిగింది. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్సార్ చేయూత పథకం కోసం 5,000 కోట్ల రూపాయల కేటాయించింది. ఉజ్జావల, స్వధార్ గృహ పథకం మహిళలకు సహాయం అందించడం కోసం 'ఉజ్జావల', 'స్వధార్ గృహ పథకం' క్రింద నడిచే గృహాలు, వన్ స్టాప్ సెంటర్లు, మహిళా ఉద్యోగినిల వసతి గృహాలు, సేవాగృహములు, ఉచితంగా పనిచేసే మహిళా హెల్ప్ లైన్ నెంబర్లు పనిచేస్తున్నాయి. సమీకృత మహిళా సాధికారత కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు మిషన్ శక్తి పథకం కింద రాష్ట్ర కమిటీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మహిళా అభివృద్ధి, పిల్లల సంక్షేమం కోసం 3,951 కోట్ల రూపాయలు కేటాయించింది. చదవండి: ఏపీ వార్షిక బడ్జెట్.. సంక్షేమ పథకాలకు పెద్దపీట -
ఏపీ అసెంబ్లీలో నేడు 2023-24 వార్షిక బడ్జెట్
-
Budget Session 2023-24: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. తొలి రోజు దృశ్యాలు
-
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, అమరావతి: శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక ఆయన పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం ఇదే. నజీర్ ప్రసంగం తర్వాత రెండు సభలు వాయిదా పడనున్నాయి. ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశం జరగనుంది. ఇందులో సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి, రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీని నిర్ణయించనున్నారు. ఈ నెల 14 నుంచి 24 వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కనీసం 7, 8 రోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కాగా మంగళవారం బీఏసీ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలోనే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులను కేబినెట్ ఆమోదించనుంది. ఇక.. కీలకమైన 2023-24 వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 17వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24వ తేదీ వరకు జరిగే అవకాశాలున్నాయి. ఈ ఏడాది రూ. 2లక్షల 60 వేల కోట్లకు పైగా బడ్జెట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమంతో పాటు వ్యవసాయం, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్ రూపకల్పన దిశగా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. పైగా వచ్చే ఏడాదిలో ఎన్నికల నేపథ్యంలో ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో దృష్టి సారించింది. మరోవైపు కీలక అంశాలపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. నాలుగేళ్ల పాలనతో పాటు మూడు రాజధానులు, సంక్షేమం, వైజాగ్ గ్లోబల్ సమిట్ ముఖ్యమైన అంశాల ఎజెండాతో సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. -
సచివాలయ వ్యవస్థకు చట్టబద్ధత.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు
సాక్షి, అమరావతి: కుగ్రామం, నగరం అన్న తేడా లేకుండా ప్రజలందరికీ వారి సొంత ఊళ్లో ప్రభుత్వ సేవలన్నీ అందుబాటులో తెచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు పూర్తిస్థాయి చట్టబద్ధత కలి్పంచేందుకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేస్తూ 2022 డిసెంబర్లో జారీచేసిన ఆర్డినెన్స్ స్థానంలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి.. ఆ వ్యవస్థకు పూర్తి చట్టబద్ధతను కల్పించనుంది. ఇప్పుటికే ఆర్డినెన్స్‌లో పేర్కొన్న వివరాల మేరకు ఇందుకు సంబంధించి ముసాయిదా బిల్లును గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు రూపకల్పన చేస్తున్నారు. ఈ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ముందు ఈ నెల 14న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదానికి వెళ్లనున్నట్టు అధికారులు వెల్లడించారు. జగన్ సీఎం అయ్యాక 4 నెలలకే ఈ వ్యవస్థకు శ్రీకారం జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే 2019 అక్టోబరు 2వ తేదీ నుంచి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సచివాలయాల్లో పనిచేసేందుకు అప్పటికప్పుడే కొత్తగా 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మంజూరు చేశారు. వెంటనే ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇవన్నీ కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ప్రభుత్వం పూర్తిచేసింది. ► గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి రెండువేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు కొలువుదీరాయి. ► అంతకుముందు వరకు కనీసం ఒక్క శాశ్వత ఉద్యోగి కూడా నియామకం జరగని చాలా గ్రామాల్లో కొత్తగా ఏర్పాటైన సచివాలయాల్లో పది నుంచి 11 మంది వరకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది. ► కుగ్రామాలతోసహా ప్రతి చోటా.. ప్రజలకు తమ గ్రామ సచివాలయంలోనే ప్రభుత్వ సేవలన్నీ అందేలా ఏర్పాటు చేసింది. 545 రకాల ప్రభుత్వ సేవలను సచివాలయాల్లో అందుబాటులోకి తీసుకొచి్చంది. ప్రతి సచివాలయానికి ఇంటర్నెట్ వసతితోపాటు కంప్యూటర్లు, ప్రింటర్లసహా ఇతర ఫర్నిచర్‌ను ప్రభుత్వం అందజేసింది. ► ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలు వారి సొంత ఊరు దాటాల్సిన అవసరం కూడా లేకుండా దాదాపు ఏడుకోట్లకు పైగా ప్రభుత్వ సేవలను వినియోగించుకున్నారు. చదవండి: స్కాములన్నీ బాబు హయాంలోనే -
అసెంబ్లీలో ఈటల రాజేందర్ వర్సెస్ మంత్రి కేటీఆర్
అప్డేట్స్ ►బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇండోనేషియా వెళ్తే.. వాళ్ల ఫ్రెండ్‌కు గనులు వస్తాయని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కును తుక్కు కింద అమ్ముతుంది కేంద్రం కాదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం పోడు భూములంటే దురాక్రమణే అడవులను నరికేయడం కరెక్టేనా ప్రభుత్వ షరతులు ఒప్పుకుంటేనే పోడు భూములు పంపిణీ పోడు భూములు న్యాయపరమైన డిమాండ్ కాదు ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్‌ను ఎవరు చంపారు గొత్తికోయల గూండాగిరి మంచిది కాదు ఫిబ్రవరిలో పోడు భూముల పంపిణీ పోడు భూములకు విద్యుత్, రైతు బంధు ఇస్తాం అటవీ సంపదకు ఇబ్బంది కల్గిస్తేనే పోడు భూములు రద్దు ►రాష్ట్రంలో గుణాత్మక, విప్లవాత్మక మార్పులు రావడానికి కారణం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమేనని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య రంగాన్ని పటిష్టం చేశారన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ‘సమైక్య రాష్ట్రంలో 20 యేండ్లకు ఒక్క కాలేజ్ మాత్రమే పెట్టారు. సీఎం కేసీఆర్ మాత్రం ఒక్క సంవత్సరం లోనే 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మెడిజల్ కాలేజీలు లేక ఉక్రెయిన్తోపాటు ఇతర దేశాలకు వెళ్లారు. ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో 4 మెడికల్ కాలేజీలు వచ్చాయి. వరంగల్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాము. మహబూబ్ నగర్ లో ఇప్పటికే మూడు వచ్చాయి రానున్న రోజుల్లో మరో రెండు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య 157 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా మంజూరు చేస్తే రాష్ట్రానికి ఒక్కటి అంటే ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. అప్పటి వైద్యారోగ్యా శాఖ మంత్రులు లేఖలు రాసినా పట్టించుకోలేదు’ అని అన్నారు. -
పార్లమెంట్లో మోదీ ప్రసంగం.. రాహుల్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా ఆయన లోక్‌సభలో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలందరికీ మార్గ నిర్దేశం చేసిందని అన్నారు. మంగళవారం సభలో కొందరు చాలా ఉత్సాహంగా వ్యాఖ్యలు చేశారని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి మోదీ అన్నారు. అవి చూసి చాలా మంది థ్రిల్ అయ్యారని సెటైర్లు వేశారు. ఆ వ్యాఖ్యలు వారి మనసులోని ద్వేషాన్ని బయటపెట్టాయని కౌంటర్ ఇచ్చారు. భారత్ తన సమస్యల పరిష్కారం కోసం ఒకప్పుడు ఇతరులపై ఆధారపడేదని, ఇప్పుడు భారతే ఇతరుల సమస్యలను పరిష్కరించే స్థాయికి చేరుకుందని రాష్ట్రపతి అన్నారని గుర్తు చేశారు. తాము దేశంలో అవినీతిని నిర్మూలించామని మోదీ అన్నారు. ఈ క్షణం కోసం దేశం చాలా ఏళ్లుగా ఎదురుచూసిందని పేర్కొన్నారు. 'ఇవాళ జీ-30 నిర్వహించే స్థాయికే భారత్ ఎదగడం గర్వకారణం. ఇది కొంతమందికి కంటగింపు కావచ్చు. నాకైతే గర్వకారణమే. నిరాశలో ఉన్న కొందరు దేశ ప్రగతిని అంగీకరించలేకపోతున్నారు. చాలా దేశాలను నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వేధిస్తున్నాయి. భారత్ మాత్రం బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. దేశ విజయాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. మొబైళ్ల తయారీలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇంధన వినియోగంలో మూడో స్థానంలో ఉంది. 104 యూనికార్న్స్ ఈ మధ్య ఏర్పడ్డాయి. 150 దేశాలకు వ్యాక్సిన్లు పంపించాం. వ్యాక్సిన్ సర్టిఫికేట్లు క్షణాల్లో మొబైల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. ప్రతి రంగంలో భారత్ చరిత్ర సృష్టిస్తోంది. ఇవన్నీ కొందరికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మా విజయాలు చూసి నిరాశవాదులకు నిద్రపట్టడంలేదు. వారు ప్రశాంతంగా పడుకోలేక పోతున్నారు. 2014 నుంచి ఇప్పటిదాకా మా ప్రభుత్వం ఏం చేసిందో దేశ ప్రజలకు తెలుసు. ప్రజలు పదే పదే మాకు మద్దతు ఇస్తున్నారు. 2004-14 వరకు దేశంలో అవినీతి రాజ్యమేలింది. భారీ కుంభకోణాలు జరిగాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉగ్రవాదం రాజ్యమేలింది. 2జీ, బొగ్గు స్కాం, కామన్వెల్త్ క్రీడల్లో అవినీతి జరిగింది. 2004-14 అనేది దేశంలో అవినీతి దశాబ్దమైంది. దేశంలో ఆ పదేళ్లు రక్తపుటేరుల పారాయి. టెలికాం మూమెంట్ 2జీ స్కామ్ అయింది. న్యూక్లియర్ మూమెంట్ ఓటుకు నోటు అయ్యింది. కామన్వెల్త్ గేమ్స్ మూమెంట్ సీడబ్ల్యూసీ స్కామ్ అయింది. ఆ దశాబ్ద కాలం భారత్ తీవ్రంగా నష్టపోయింది. అవినీతిపై కొరడా ఝుళిపిస్తే దర్యాప్తు సంస్థలను తప్పుబడుతున్నారు.' అని కాంగ్రెస్‌కు మోదీ గట్టి కౌంటర్ ఇచ్చారు. 'అవినీతిపై చర్యలు తీసుకుంటున్న దర్యాప్తు సంస్థలపై విపక్షాలన్నీ విమర్శలు గుప్పిస్తాయి. విపక్షాలన్నింటినీ ఈడీ ఏకతాటిపైకి తెచ్చింది. అందుకు ఈడీకీ థ్యాంక్స్ చెప్పాలి. కరోనా టైంలో విపక్షాలు విచిత్రంగా మాట్లాడాయి. కరోనా వల్ల భారత్ పతనంపై హార్వర్డ్ యూనివర్సిటీలో పరిశోధనలగు జరుగుతున్నాయన్నాయి. కానీ కాంగ్రెస్ పతనంపై హార్వర్డ్‌లో పరిశోధన జరిగింది. మిగతా వర్సిటీలు కూడా దీనిపై పరిశోధలను జరిపాయి. మోదీపై బురదజల్లి లబ్ధి పొందాలని విపక్షాలు అనుకుంటున్నాయి. టీవీలు, పేపర్లలో నాపై వివర్శలు చేసి లబ్ధి పొందలేరు. దేశ ప్రజలకు నాపై విశ్వాసం ఉంది. వన్ నేషన్ వన్ రేషన్‌తో లబ్ధి పొందిన పేదలు మీ మాటలు నమ్ముతారా? ప్రధాన మంత్రి ఆవాస్ యోజనతో సొంతింటి కల సాకారం చేసుకున్న సామాన్యులు మీ విమర్శలు నమ్ముతారా? కొందరు ఒకే కుటుంబానికి సేవ చేస్తారు. కానీ 25 కోట్ల కుటుంబాల్లో నేను సభ్యుడిని. 140 కోట్ల మంది ప్రజలే నాకు రక్షణ కవచం. దాన్ని మీరు ఛేదించలేరు' అని మోదీ విపక్షాలను ఏకిపారేశారు. బీఆర్ఎస్ వాకౌట్... మరోవైపు మోదీ ప్రసంగానికి ముందే బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని వారు డిమాండ్ చేయగా.. స్పీకర్ దీన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో బీఎర్ఎస్ ఎంపీలు సభను వీడారు. చదవండి: 2014 తర్వాతే ‘అదానీ మ్యాజిక్’ -
Mahua Moitra: సారీనా? నేనెందుకు చెప్పాలి?
ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా క్షమాపణలు చెప్పేదే లే అంటున్నారు. మంగళవారం బడ్జెట్ సెషన్లో టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతున్న సమయంలో.. మెహువా లేచినిలబడి బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై పెను దుమారమే రేగింది. బీజేపీ ఎంపీలు ఆమె వైఖరిని తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నారు. అయితే వివరణాత్మక క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ డిమాండ్‌పై ఎంపీ మహువా మోయిత్రా తీవ్రంగా స్పందించారు. అసలు క్షమాపణలు ఎందుకు చెప్పాలని ఆమె ఎదురు ప్రశ్నిస్తున్నారు. యాపిల్‌ను యాపిల్ అనే అన్నాను. అందులో తప్పేం ఉంది. నేను ఏదైతే అన్నానో.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా అని బుధవారం పార్లమెంట్ బయట మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారామె. సారీనా? ఎందుకు చెప్పాలి?. గతంలో ఇదే పెద్దమనిషి(రమేశ్ బిదూరిని ఉద్దేశించి) రైతులను వ్యభిచార గృహాల నిర్వాకులని వ్యాఖ్యానించాడు. అది పార్లమెంట్ రికార్డుల్లోనూ ఉంది. అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాను. Mahua Moitra using cuss word like “harami” in Parliament And Brut won’t show this 😀 pic.twitter.com/y8gMNXTR3i — Rishi Bagree (@rishibagree) February 7, 2023 బీజేపీకి చెందిన గౌరవనీయులైన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిగారూ రాజ్యసభలో.. డాక్టర్ శాంతనూ సేన్‌ను ఉద్దేశించి అభ్యంతరకర పదం వాడారు. అయినా పార్లమెంట్లో ఇలాంటి పదాలు ఉపయోగించడం కొత్తేం కాదు కదా. ఒక మహిళ అయి ఉండి అలా ఎలా మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు వాళ్లు. మంచిగా తిరిగి ఇవ్వడానికి నేను పురుషుడినే కావాలా ఏంటి?. అయినా.. బీజేపీ వాళ్లు పార్లమెంటరీ మర్యాదలు బోధించడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోందని అన్నారామె. ఇదిలా ఉంటే మెహువా వ్యాఖ్యలపై పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఎంసీ క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ ఎంపీ హేమా మాలిని సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. నాలుకను అదుపులో ఉంచుకోవాలని. భావోద్వేగంలో ఏది పడితే అది మాట్లాడొద్దని.. పార్లమెంట్లో సభ్యులకు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని హేమమాలిని వ్యాఖ్యానించారు. -
HYD: డొక్కు బస్సులే దిక్కా?
సాక్షి, సిటీబ్యూరో: ఏడాదికోసారి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ఊరించి ఉసూరుమనిపిస్తూనే ఉంది. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ఏళ్లకు ఏళ్లుగా కాలం చెల్లిన సిటీ బస్సులే నడుస్తున్నాయి. దశాబ్ద కాలంగా ఒక్క కొత్త బస్సు కూడా రోడ్డెక్కలేదు. మరోవైపు హైదరాబాద్ మహానగరం విస్తరిస్తోంది. ఔటర్‌కు వెలుపల సైతం వదలాది కాలనీలు వెలిశాయి. ఆయా కాలనీలన్నీ ప్రజా రవాణాకు దూరంగానే ఉన్నాయి. ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, వ్యక్తిగత వాహనాలపైనే ఆధారపడి లక్షలాది మంది నగరవాసులు రోజువారీ రాకపోకలు సాగిస్తున్నారు. పొరుగున ఉన్న ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ప్రజా రవాణా పరుగులు తీస్తుండగా హైదరాబాద్‌లో మాత్రం చతికిలపడటం గమనార్హం. ఈ– బస్సులేవీ? రెండేళ్లుగా ఎలక్ట్రిక్ బస్సులపై ఊరిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క సర్వీసు కూడా అందుబాటులోకి రాలేదు. అద్దె ప్రాతిపదికన ఈ బస్సులను నడిపేందుకు గతేడాది టెండర్ల ఆహ్వానించారు. కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. వాటిలో ఒక సంస్థ సాంకేతిక సామర్థ్యంపై అనర్హత కారణంగా టెండర్ల ప్రక్రియలో వివాదం చోటుచేసుకుంది. అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ వివాదం పరిష్కారమైనప్పటికీ ఇంకా ప్రతిష్టంభన తొలగిపోలేదు. దీంతో గతేడాది డిసెంబర్ నాటికే నగరంలోని వివిధ మార్గాల్లో సుమారు 300 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని భావించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. ప్రస్తుతం గ్రేటర్‌లోని 28 డిపోల పరిధిలో సుమా రు 2,850 బస్సులు ఉన్నాయి. వీటిలో కనీసం వెయ్యికిపైగా డొక్కు బస్సులే. కాలం చెల్లిన వీటితోనే ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నారు. ప్రతి రోజు సుమారు 22 లక్షల మంది ప్రయాణం చేస్తుండగా ఈ అరకొర బస్సులతోనే ఆర్టీసీ అధికారులు పాట్లు పడుతున్నారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు బస్సులను ఏర్పాటు చేయలేకపోతున్నట్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లోని కాలనీలకు రోజుకు 8 ట్రిప్పుల డిమాండ్ ఉంటే కేవలం 4 ట్రిప్పులే నడుపుతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 6 వేల బస్సులు అవసరం.. రవాణారంగ నిపుణుల అంచనా మేరకు విస్తరిస్తున్న హైదరాబాద్ అవసరాల మేరకు ఇప్పటికిప్పుడు కనీసం 6 వేల బస్సులు కావాలి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో వేలకొద్దీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరులో నిత్యం 6వేల బస్సులు నడుస్తుండగా అదనంగా మరిన్ని కొనుగోలుకు చర్యలు చేపట్టారు. ముంబైలో ఎలక్ట్రిక్ డ బుల్ డెక్కర్ బస్సులు అందుబాటు లోకి వచ్చాయి. వాహన కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీలో సీఎన్జీ బస్సులను భారీ ఎత్తున కొనుగోలు చేసి నడుపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అందుకు విరుద్ధంగా బస్సుల సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. -
కేటీఆర్ ప్రసంగం మతలబేంటి?
హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శాసనసభ నాయకుడిగా సీఎం సమాధానం ఇవ్వడం ఆనవాయితీ. కానీ శనివారం మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. ఉమ్మడి ఏపీగా ఉన్నప్పటి నుంచి చూసినా ఇలా జరగడం ఇదే తొలిసారి కూడా. ప్రస్తుతం ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్‌కు బదులు కేటీఆర్ సమాధానమివ్వడం ద్వారా భవిష్యత్ బీఆర్ఎస్ రాజకీయ వ్యూహానికి అసెంబ్లీ వేదికగా నాంది పలికారని కొందరు అంటుండగా.. గవర్నర్‌తో విభేదాల క్రమంలోనే ఆమె ప్రసంగానికి సమాధానం ఇవ్వకుండా కేసీఆర్ సభకు గైర్హాజరయ్యారని మరికొందరు పేర్కొంటున్నారు. -
వారి ఆకాంక్షలను బడ్జెట్ నెరవేర్చింది.. విపక్షాల స్పందన ఇదే!
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023-24పై విపక్షాలు పెదవి విరిచాయి. ఈ బడ్జెట్ వల్ల పేదలు, సామాన్యులు నిరుద్యోగులకు ఒరిగేదేమీ లేదని మండిపడ్డాయి. ఇది అంబానీ, అదానీ, గుజరాత్‌కు మాత్రమే లాభం చేకూర్చేలా ఉందని ధ్వజమెత్తాయి. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలోనే ఉంచుకునే బీజేపీ అవకాశవాద బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని మండిపడ్డాయి. వాళ్ల కోసమే: కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ ఈ బడ్జెట్‌ను 'ప్రో కార్పొరేట్‌గా' అభివర్ణించారు. అంబానీ, అదానీ, గుజరాత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కేంద్రం బడ్జెట్‌ను రూపొందించిందని ఆరోపించారు. అదానీ ఆకాంక్షలను ఇది నెరవేర్చిందని ధ్వజమెత్తారు. కానీ సామాన్యుడిని మాత్రం కేంద్రం అసలు పట్టించుకోలేదని విమర్శించారు. బడ్జెట్లో కొన్ని అంశాలు బాగానే ఉన్నాయని .. కానీ గ్రామీణ పేదలు, ఉపాధి హామీ పథకం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంచి కీలక అంశాల ప్రస్తావనే లేదని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. ప్రజా వ్యతిరేకం: మమత ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే దీన్ని రూపొందించారని విమర్శించారు. ఆదాయపన్ను శ్లాబులు మార్చడం వల్ల ఎవరికీ మేలు జరగదని అన్నారు. దేశంలో కీలక సమస్యగా మారిన నిరుద్యోగం గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు. పేదలు మరింత పేదలుగా, ధనికులు మాత్రం మరింత సంపన్నులుగా మారేలా బడ్జెట్ ఉందని ఫైర్ అయ్యారు. సమాజంలో ఒక వర్గానికి మాత్రమే ఇది ప్రయోజనం చేకూర్చేలా ఉందన్నారు. సవతి ప్రేమ: కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది 1.75 లక్షల కోట్లు ఇన్‌కం ట్యాక్స్ కట్టిన ఢిల్లీ నగరానికి బడ్జెట్లో కేవలం రూ.325 కోట్లు మాత్రమే కేటాయించడం బాధాకరమన్నారు. కేంద్రం మరోసారి ఢిల్లీపై సవతి ప్రేమను చూపించి తీరని అన్యాయం చేస్తోందన్నారు. అలాగే ధరల పెరగుదల, నిరుద్యోగం వంటి కీలక అంశాల గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదని విమర్శించారు. ఈ బడ్జెట్‌తో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని కేజ్రీవాల్ అన్నారు. విద్య కోసం బడ్జెట్ కేటాయింపులు 2.64 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించడం దురదృష్టకరమన్నారు. అలాగే ఆరోగ్య రంగానికి కేటాయింపులు 2.2 శాతం నుంచి 1.98 శాతానికి తగ్గించడం హానికరం అన్నారు. ఆశ లేదు నిరాశే: అఖిలేష్ కేంద్ర బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. 10 ఏళ్లుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న బీజేపీ ఈసారి కూడా ప్రజలకు ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్‌తో దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుందని అన్నారు. రైతులు, కార్మికులు, యువత, మహిళలుకు ఆశకు బదులు నిరాశే మిగిలిందన్నారు. కేవలం కొందరు ధనికులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్ ఉందన్నారు. ఎప్పటిలాగే చేశారు: మాయావతి ఎప్పటిలాగే ఈసారి కూడా దేశంలోని 100 కోట్ల మంది పేదల ఆశలపై నీళ్లు జల్లేలా బడ్జెట్ ఉందని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బడ్జెట్ రూపొందించే ముందు దేశంలో 130 కోట్ల మంది పేదలు, కార్మికులు, అణగారిన వర్గాలు, రైతులు ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. వీరంతా అమృత కాలం కోసం ఎదురుచూస్తున్నారని, కానీ ఈసారి కూడా నిరాశే ఎదురైందన్నారు. కాస్త భిన్నం: మెహబూబా ముఫ్తీ గత 8-9 ఏళ్లతో పోల్చితే ఈసారి బడ్జెట్ కాస్త భిన్నంగా ఉందని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. పన్నులు పెంచారని, సంక్షేమ పథకాలు, సబ్సీడీలకు కేటాయింపులు లేవని అన్నారు. ధనవంతులు, బడా వ్యాపారవేత్తల కోసమే ప్రజల నుంచి పన్ను వసూలు చేస్తున్నారని విమర్శించారు. చదవండి: బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయింపులు పెంపు.. ఎన్ని కోట్లంటే..? -
గవర్నర్ ప్రసంగం సాఫీగా సాగుతుందని ఆశిస్తున్నా..
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీలో అక్కడి గవర్నర్ ప్రసంగం తరహాలో బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో తెలంగాణ గవర్నర్ ప్రసంగం ఉండదని భావిస్తున్నట్లు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేంద్రం చెప్పినట్లు రాష్ట్రాల గవర్నర్లు వ్యవహరిస్తున్నారని, గవర్నర్ ప్రసంగం సాఫీగా జరగాలని ఆశిస్తున్నానన్నారు. శాసనమండలి ఆవరణలో మంగళవారం గుత్తా సుఖేందర్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ నడుమ వివాదం సర్దుకుంటుందని తానే ముందే చెప్పానని, గవర్నర్‌తో విభేదాలు రావడం, పోవడం సహజమని వ్యాఖ్యానించారు. గవర్నర్, ప్రభుత్వం, అసెంబ్లీ పరస్పర సంబంధం కలిగి ఉంటాయని, ఇందులో ఏ ఒక్కరిదో విజయం అంటూ ఉండదని పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలు కలిసి పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. విపక్ష సభ్యులకు సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తామని, సభ్యుల సంఖ్య తక్కువగా ఉండటంతో వారికి కేటాయించే సమయం తక్కువగా ఉంటోందని చెప్పారు. ఫిబ్రవరి 3న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు 14వ తేదీ వరకు కొనసాగే అవకాశముందన్నారు. బీఆర్ఎస్కు జాతీయ స్థాయిలో ఆదరణ బీఆర్ఎస్కు జాతీయస్థాయిలో ఆదరణ ఉంటుందని, కొన్ని రాష్ట్రాల్లోని రాజకీయ శూన్యత బీఆర్ఎస్కు కలిసి వస్తుందని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రాజకీయ నాయకులు ఎన్నడూ తెరమరుగు కారని, వారి పని అయిపోయిందని భావించకూడదని, సమయం వచ్చినపుడు సత్తా చూపుతారన్నారు. ఇటీవల బీఆర్ఎస్లో చేరిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ చాలా సీనియర్ నేత అనే విషయాన్ని గుర్తు చేస్తూ నీలం సంజీవరెడ్డి చాలా ఏళ్ల పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండి తర్వాతి కాలంలో ఎంపీగా, లోక్‌సభ స్పీకర్‌గా, రాష్ట్రపతిగా పదవులు చేపట్టారన్నారు. చనిపోయిన టీడీపీకి తెలంగాణలో జీవ గంజి పోసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నా అది సాధ్యం కాదన్నారు. పవన్ కల్యాణ్ వంటి వారి ప్రభావం ఎంతమాత్రం ఉండబోదని చెప్పారు. జగదీశ్‌రెడ్డితో విభేదాల్లేవు ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మంత్రి జగదీశ్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, పంచాయతీలు, వ్యవహారాల్లో తలదూర్చను అని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధిస్తుందని, వామపక్షాలతో పొత్తు కలిసి వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని తన కుమారుడు అనుకుంటున్నా, తుది నిర్ణయం పార్టీదే అని చెప్పారు. -
గవర్నర్ వ్యవస్థపై చర్చ జరగాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని గవర్నర్ వ్యవస్థపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరగాలని బీఆర్ఎస్ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావులు పాల్గొని పార్టీ వైఖరిని కేంద్ర ప్రభుత్వానికి తెలియచేశారు. అనంతరం వీరిద్దరూ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కోసం కోర్టు సహాయం కోరాల్సి రావడం వంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదురుకాలేదన్నారు. బడ్జెట్‌కు ఆమోదం తెలపకుండా గవర్నర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ, ఢిల్లీ, తమిళనాడు, కేరళసహా అనేక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు గవర్నర్ వ్యవస్థతో ఇబ్బందులు పడుతున్నాయని.. అందువల్ల గవర్నర్ వ్యవస్థతో పాటు సమాఖ్య వ్యవస్థపై పార్లమెంట్లో చర్చ జరగాలన్నారు. అంతేగాక అఖిలపక్ష సమావేశంలో రైతుల పంటల మద్దతు ధర రెట్టింపు చేయలేదన్న అంశంతో పాటు, నిరుద్యో గం అంశంపైనా చర్చ జరగాలని కోరామన్నారు. వీటితో పాటు పార్లమెంట్ సమావేశాలు కేవలం బిల్లుల ఆమోదం కోసం ఏర్పాటు చేయడం కాదని... ప్రజా సమస్యలతో పాటు దేశంలోని అనేక సమస్యలపై చర్చ జరపాలని కోరా మని కేకే, నామా తెలిపారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన సమస్యలను పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తి పోరాడతామని పేర్కొన్నారు. -
ఏపీలో 2100 కిలోమీటర్ల రోడ్లు ఆధునీకరణ
-
నిన్న అనేది జ్ఞాపకం.. రేపు అనేది లక్ష్యం
-
పట్టు వదలని విక్రమార్కుడు మన సీఎం జగన్
-
జగనన్న అమ్మ ఒడి పై బుగ్గన కవిత అదుర్స్..
-
టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం
-
టీడీపీ సభులపై మంత్రి బుగ్గన కామెంట్స్
-
సభ ద్వారా సీఎం జగన్ గారికి ధన్యవాదాలు
-
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం
-
టీడీపీకి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు: చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి
-
బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్న సీఎం కేసీఆర్
-
Rajasthan: ఆహా.. ఏమి అదృష్టం! ఫ్రీగా ఐఫోన్లు
Rajasthan Budget 2022: ఈ ఫ్రీ ఐఫోన్ ఆఫర్ కేవలం అక్కడి ప్రజాప్రతినిధులకు మాత్రమే.. గమనించగలరు. ప్రజాసేవ సంగతి ఏమోగానీ.. ప్రజాప్రతినిధులకు అందే సౌకర్యాలు మాత్రం ఘనంగా ఉంటాయి. అందుకు మరో ఉదాహరణ.. రాజస్థాన్‌లో బుధవారం కనిపించిన దృశ్యాలు. బుధవారం రాజస్థాన్ అసెంబ్లీలో బడ్జెట్‌ను సమర్పించింది ప్రభుత్వం. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల అనంతరం.. ఎమ్మెల్యేలకు ఆనవాయితీగా లెదర్ బ్రీఫ్‌కేసులు అందించారు. అయితే ఈసారి రాజస్థాన్ 200 మంది ఎమ్మెల్యేలకు అందించిన బ్రీఫ్‌కేసులో సర్ప్రైజ్గా బ్రాండ్ న్యూ ఐఫోన్ 13ను కానుకగా ఇచ్చింది ప్రభుత్వం. ఆ ఫోన్ కాస్ట్ 75 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల మధ్య ఉంది. ఇంతే కదా అనుకోకండి.. కిందటి ఏడాది ఇలాగే బడ్జెట్ సందర్భంగా ఐప్యాడ్లను ఎమ్మెల్యేలకు అందించింది అశోక్ గెహ్లాట్ సర్కార్. సాధారణంగా.. ఎమ్మెల్యేలకు బడ్జెట్ అయిపోగానే.. ఆ ప్రతులను ఉంచిన బ్యాగులు ఇవ్వడం పరిపాటి. కానీ, అక్కడేమో బడ్జెట్ పేపర్స్‌తో పాటు ఇలా కాస్ట్లీ గాడ్జెట్స్ అందించేస్తున్నారు. ఈసారి అందించిన ఐఫోన్ కానుకల విలువ మొత్తం కోటిన్నర రూపాయలుగా తేలింది. పార్టీలకతీతంగా సంబురంగా ఆ కానుకలు తీసుకుని.. కొత్త ఫోన్‌తో ఫొటోలకు ఫోజులిచ్చారు అక్కడి ఎమ్మెల్యేలు. ఇక అశోక్ గెహ్లాట్ సర్కార్.. ఎమ్మెల్యేల కోసం ఖరీదైన ఐఫోన్లను కొనుగోలు చేయడానికి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని కొందరు ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. -
కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలే భారత్‌కు ప్రధాన శత్రువు: మోదీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏడోరోజు ఉభయ సభలు మంగళవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ సమావేశంలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. తమ రాజవంశానికి మించి ఎక్కువ ఆలోచించకపోవడం కాంగ్రెస్ సమస్య అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలే భారత్ కు ప్రధాన శత్రువన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రభుత్వం తరపున సమాధానమిస్తూ ప్రధాని మంగళవారం రాజ్యసభలో మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి అతి పెద్ద ముప్పు ఈ వంశపారంపర్య పార్టీలేనని నిప్పులు చెరిగారు. మహాత్మాగాంధీ కాంగ్రెస్‌ని రద్దు చేయాలని కోరారని, గాంధీ కోరికను అనుసరించినట్లయితే భారతదేశం ఈ బంధుప్రీతి నుంచి విముక్తి పొంది ఉండేదని వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ లేకపోయి ఉంటే దేశంలో ఎమర్జెన్సీ మరక ఉండేది కాదు. దశాబ్దాలుగా అవినీతి సంస్థాగతంగా ఉండేది కాదు. కులతత్వం లేదా ప్రాంతీయత వంటివి ఉండేవి కావు. సిక్కుల ఊచకోత జరిగి ఉండేది కాదు. కశ్మీర్ నుంచి వలసలు ఉండేవి కావు. మహిళలను తాండూరులో కాల్చిచంపేవారు కాదు. సామాన్యులు కనీస సౌకర్యాల కోసం చాలా కాలం వేచి ఉండాల్సిన అగత్యం ఉండేది కాదు’ అంటూ విమర్శలు గుప్పించారు. చదవండి: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం అయితే రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసిన చరిత్ర కూడా ఆ పార్టీకే ఉందన్నారు. పైగా వారు అపఖ్యాతి, అస్థిరత, తొలగింపులను విశ్వసించారని మోదీ చెప్పుకొచ్చారు. అంతేకాదు అర్బన్ నక్సల్స్ భావజాలంలో కాంగ్రెస్ ఇరుక్కుపోయిందని అందుకే వారి మనసులు విధ్వంసకరం అంటూ ప్రధాని విమర్శించారు. తాను రాష్ట్రాల ప్రగతికి వ్యతిరేకం కాదని, అయితే ప్రాంతీయ ఆకాంక్షలు దేశ ప్రగతికి విరుద్ధంగా ఉండొద్దని ప్రధాని అన్నారు. దేశ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ ఆకాంక్షలను పరిష్కరించినప్పుడే భారతదేశ పురోగతి మరింత బలంగా ఉంటుందని, రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగమిస్తుంది అని ప్రధాని మోదీ రాజ్యసభలో నొక్కి చెప్పారు. -
నో లగ్జరీ ఫుడ్: ఆసక్తి రేపుతున్న సీఎం స్టాలిన్ నిర్ణయాలు!
సాక్షి, చెన్నై: ఆర్థిక కష్టాల నేపథ్యంలో పొదుపుగా నిధుల్ని వాడుకోవాలని సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశాలినట్టు సమాచారం. దీంతో ఆయా శాఖల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులకు సభకు వచ్చే సమయంలో క్యారియర్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందనే చర్చ సాగుతోంది. ఈనెల 13న బడ్జెట్ దాఖలుతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. మరుసటి రోజున వ్యవసాయ బడ్జెట్ దాఖలు చేశారు. ఆదివారం సెలవు తదుపరి సోమవారం సభ ప్రారంభమైంది. సాధారణంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయా శాఖల వారీగా నిధుల కేటాయింపులు, చర్చలు సాగుతున్న సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పోలీసులు అంటూ వెయ్యి మందికి పైగా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగేది. ఇవన్నీ స్టార్ హోటళ్ల నుంచి పంపిణీ చేసేవారు. అలాగే, ఆయా శాఖల తరపున గిఫ్ట్‌లు సైతం అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఖర్చు అంతా ఆయా శాఖలకు కేటాయించిన నిధుల నుంచి వాడుకోవాల్సిందే. ఇందుకోసం రోజుకు లక్షల్లో నగదు ఖర్చుపెట్టాల్సిందే. చదవండి: Tamilnadu: వారంలో స్థానిక నగారా..? అయితే, తాజాగా ఈ పద్ధతికి స్వస్తి పలికి ఉండటం గమనార్హం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కరోనా పుణ్యమా కష్టాల్లో ఉన్న నేపథ్యంలో నిధుల పొదుపు మీద స్టాలిన్ స్పష్టమైన ఆదేశాల్ని ఆయా శాఖల మంత్రులు, అధికారులకు ఇచ్చినట్టు సచివాల యం వర్గాల సమాచారం. దీంతో తాజా సమావేశాల్లో తొలిరోజు బడ్జెట్ చర్చలో మంత్రులకు , అధికారులకు ఎలాంటి లగ్జరీ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. గిఫ్ట్‌ల పంపిణీ కూడా జరగలేదు. ఎవరికి వారు తమ సొంత ఖర్చులతో భోజనాలు తెప్పించుకోక తప్పలేదు. కొందరు క్యాంటీన్ల బాట పట్టగా, మరికొందరు, ఇక ఇంటి నుంచే క్యారీర్లు తెచ్చుకోవాల్సిందేనా అన్నట్టుగా చలోక్తులు విసురుకోవడం గమనార్హం. చదవండి: తమిళనాడు: స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం -
ప్రాణం విలువ తెలిసిన వాడిని: సీఎం జగన్
చంద్రబాబు.. ఎల్లో మీడియా తరహాలో మేమూ విమర్శలు చేయగలం. కానీ సాధించేదేంటి? కోవిడ్ సమయంలో అందరూ కలిసి పని చేయాలి. వేలెత్తి చూపేకన్నా ఒకరినొకరం ప్రోత్సహించు కోవడం, ఒకరికి ఒకరం మద్దతు ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రజల మనోధైర్యాన్ని దెబ్బ తీసే వార్తలు రాయొద్దని ఎల్లో మీడియాను కోరుతున్నాం. నిలబడే ప్రాణాలను, ఆడే గుండెలను ఆపేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : ‘ప్రాణం విలువ తెలిసిన వాడిని కాబట్టే కోవిడ్ నుంచి ప్రజలను కాపాడేందుకు నిజాయితీగా పోరాడుతున్నాం. ఎంత ఖర్చు చేసైనా సరే కోవిడ్ వ్యాక్సిన్ తెప్పిస్తాం. ప్రజలందరికీ ఉచితంగా ఇప్పిస్తాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా గురువారం ప్రకటించారు. ప్రభుత్వ కృషి ఫలితంగానే మరణాల రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ చేరిందన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆయన సూచన మేరకు కోవిడ్ మృతులకు సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ప్రాణం విలువ బాగా తెలిసిన వాడిని కాబట్టే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయినప్పుడు గుండె పగిలిన కుటుంబాలకు అండగా ఉండేందుకు ఓదార్పు యాత్ర చేశానని చెప్పారు. అధికారంలోకి రాగానే ప్రజలకు ప్రాణం పోసేలా ఆరోగ్య శ్రీని తీర్చిదిద్దానన్నారు. రూ.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వాళ్లకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నామని, వెయ్యి జబ్బులకే పరిమితమైన ఈ పథకాన్ని 2,400 జబ్బులకు అమలయ్యేలా విస్తరించామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 104, 108 వాహనానాలు 1180 కొనుగోలు చేశామన్నారు. వైద్య సదుపాయాలున్న ఈ వాహనాలు ఫోన్ చేసిన 20 నిమిషాల్లోనే ‘కుయ్.. కుయ్.. కుయ్..’ అంటూ వచ్చేలా ప్రతి మండలానికి చేరవేశామని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి 2 వేల మందికి హెల్త్ వర్కర్‌ను నియమించామని, ప్రతి గ్రామంలోనూ వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు కడుతున్నామని తెలిపారు. అక్కడ 91 రకాల మందులు అందుబాటులో ఉంటాయని, 24 గంటలూ ఏఎన్ఎం ఉంటారని, ప్రతీ మండలానికి రెండు పీహెచ్‌సీలు.. ప్రతీ పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు, ఒక 104 వాహనం అనుసంధానమయ్యేలా ఫ్యామిలీ డాక్టర్ విధానం తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేస్తున్నామని సీఎం వివరించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఆయువు నిలిపేలా ఆస్పత్రులు ►ఊహించని విధంగా కోవిడ్ సవాల్‌ను ఎదుర్కొంటున్నాం. గతేడాది మార్చిలో ఏపీలో తొలి కేసు నమోదైంది. అప్పట్లో కోవిడ్ పరీక్షల కోసం శాంపుల్స్ పూనెకు పంపాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 150 లేబొరేటరీలు.. రోజూ లక్ష పరీక్షలు చేస్తున్నాయి. ►తొలి కోవిడ్ వేవ్ వచ్చినప్పుడు 261 ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు వైద్య సేవలందిస్తే.. ఇవాళ 649కి పైగా ఆస్పత్రుల్లో వైద్య సేవలందిస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరం (టైర్ వన్ సీటీ) లేకుండా పోయింది. ఆదునిక వైద్యం టైర్వన్ సిటీల్లోనే లభిస్తోంది. ఈ వాస్తవాల్ని గ్రహించే నాడు–నేడు కార్యక్రమం ద్వారా అన్ని స్థాయిల ఆస్పత్రుల రూపు రేఖలు మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ►కొత్తగా ప్రతి పార్లమెంట్ పరిధిలో బోధనాసుపత్రి, నర్సింగ్ కాలేజీ పెట్టబోతున్నాం. ప్రతి వ్యక్తి దగ్గరకు వైద్యాన్ని తీసుకెళ్లాలనే తపనతోనే ఇవన్నీ చేస్తున్నాం. మొదటి వేవ్ కరోనా సమయంలో 261 ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు వైద్యం చేసేందుకు వీలుగా ప్రభుత్వ పరిధిలోకి తీసుకున్నాం. ఇందులో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఉన్నాయి. అక్కడ డాక్టర్లు, ఆక్సిజన్, మందులు అన్నీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 649 ఆసుపత్రుల్లో 47,285 బెడ్స్ ►రెండో వేవ్‌లో 649 ఆస్పత్రులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. గత సెప్టెంబర్ నాటికి ప్రభుత్వం తీసుకున్న 261 ఆస్పత్రుల్లో 34,441 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు 649 ఆసుపత్రుల్లో 47,285 బెడ్స్ అందుబాటులోకి తెచ్చాం. కోవిడ్ కేర్ సెంటర్స్‌లోనూ మెరుగైన వైద్యం, నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం. మరో 52,471 బెడ్స్ అందుబాటులోకి తెచ్చాం. ►కోవిడ్ సెంటర్లలో 18 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కొనుగోలు చేసి, అక్కడ పెట్టే ఏర్పాట్లు చేస్తున్నాం. కోవిడ్‌ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చి, ఉచితంగా వైద్యం అందిస్తున్న రాష్ట్రం మనదేనేమో. ప్రతిరోజు 25 వేల మంది ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం పొందుతున్నారు. 14 నెలల్లో రూ.2,229 కోట్లు ఖర్చు ►గడిచిన 14 నెలల కాలంలోనే కోవిడ్ కోసం రూ.2,229 కోట్లు ఖర్చు చేశాం. బ్లాక్ ఫంగస్ వస్తోందని తెలిసిన వెంటనే ఏ ఒక్క పేదవాడికి ఇబ్బంది లేకుండా.. దాన్నీ ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. ఇందుకోసం ఈ నెల 18వ తేదీన 17 ఆస్పత్రులను గుర్తించాం. కోవిడ్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించేందుకు స్పెషలిస్టులు, డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లను 18,270 మందిని విధుల్లోకి దించాం. ►104 నంబర్‌కు ఫోన్ చేస్తే కోవిడ్ సమాచారం ఇచ్చేలా చేశాం. ఈ నంబర్‌కు ఈ నెల 16వ తేదీ నాటికి 3.12 లక్షల కాల్స్ వచ్చాయి. ఇందులో 60,634 మందిని ఆస్పత్రుల్లో చేర్చారు. మరో 46,421 మందికి పరీక్షలు చేశారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్ రోగులకు.. 680 మంది స్పెషలిస్టులతో కలిపి 3,991 మంది డాక్టర్లు టెలీ మెడిసిన్ వైద్యం అందిస్తున్నారు. ఆక్సిజన్ కోసం అనుక్షణం పరుగు ►రాష్ట్రానికి ఆక్సిజన్ తెప్పించే ప్రక్రియలో ఏమాత్రం ఆలస్యం కాకూడదని.. రోజుకు నాలుగైదు ట్యాంకులను ఒరిస్సాకు ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నాం. విదేశాల నుంచి ఆక్సిజన్, క్రయోజెనిక్ ట్యాంకర్లను తెప్పిస్తున్నాం. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్స్ ద్వారాను తెప్పిస్తున్నాం. ఆక్సిజన్ ఎన్ని వందల కిలోమీటర్లలో దొరుకుతుందన్నా.. ఎంత ఖర్చుకైనా సిద్ధపడి, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాం. ►రాబోయే తరాలకు మంచి జరగాలనే ఉద్దేశంతో 53 ఆస్పత్రుల్లో కూడా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు నాంది పలికాం. మరో 50 క్రయోజెనిక్ ట్యాంకర్లు తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. కోవిడ్ కేర్ సెంటర్లలో ఉన్న వాళ్లకు 5 నుంచి 10 లీటర్ల ఆక్సిజన్ అందించేలా 18,500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల కొనుగోలుకు సిద్ధమయ్యాం. అవి కూడా ఈ నెలాఖరులో వస్తాయి. ►10 వేల డి టైప్ సిలెండర్ల కొనుగోలుకు రూ.309 కోట్లతో ఆర్డర్ ఇచ్చాం. గ్రామ స్థాయి ఆశ వర్కర్ల దగ్గర్నుంచి నర్సులు, డాక్టర్లు, శానిటేషన్ పనివాళ్లు, కలెక్టర్లు అందరూ కష్టపడి పని చేస్తున్నారు కాబట్టే కోవిడ్ మరణాలు అతి తక్కువగా ఉన్న రాష్ట్రాలో ఏపీ ఒకటి అని సగర్వంగా చెప్పగలుగుతున్నాం. వీరందరికీ హ్యాట్సాఫ్. అందరికీ లబ్ధి ►బీసీలను బ్యాక్‌బోన్ క్లాస్‌గా చేసేందుకు కట్టుబడి ఉన్నాం. రెండేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద, మధ్య తరగతి వర్గాల కోసం నిలబడ్డాం. సంక్షేమానికి రూ.93,708 కోట్లు ఖర్చు చేశాం. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే నేరుగా పంపాం. ►మరో రూ.31,714 కోట్లు పరోక్ష లబ్ధి ద్వారా ఇవ్వడం జరిగింది. మొత్తంగా రూ.1.25 లక్షల కోట్లు ప్రజలకు అందించాం. ►ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని నేను భావిస్తాను. మా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు ఇదే చెబుతాను. మనమంతా ప్రజలకు సేవకులం అని గుర్తు పెట్టుకుని పని చేయాలి. అనుభవం లేకున్నా.. హామీలన్నీ పూర్తి ►నాది పెద్ద వయసు కాకపోవచ్చు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం లేకపోవచ్చు. కానీ, చిత్తశుద్ధితో, నిజాయితీగా పని చేస్తున్నా. కోవిడ్ కష్టాల్లోనూ 129 వాగ్దానాల్లో 107 పూర్తిగా అమలు చేశాం. మరో 14 వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకా 8 అమలు చేయాల్సి ఉంది. 2019లో ఇచ్చిన మేనిఫెస్టోలో 94.5 శాతం హామీలు పూర్తి చేశాం. పాలనలో కులం, మతం, రాజకీయం, వర్గం చూడలేదు. రాబోయే తరానికి మంచి జరగాలని చూస్తున్నాం. ►విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేశాం. శిథిలావస్తలో ఉన్న స్కూళ్ల రూపురేఖలు మార్చాం. మన ప్రభుత్వ స్కూళ్లలోనే ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. ఇంగ్లిష్ మీడియం చదువులు, సీబీఎస్ఈ సిలబస్, గోరుముద్ద, ఇలా అనేక పథకాలతో విద్యా రంగం రూపురేఖలు మారుస్తున్నాం. అన్ని పథకాలలో అమ్మ ఒడి కూడా గొప్పది. ►అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, సున్నా వడ్డీ పథకం, 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు, ఇళ్లు కట్టించే కార్యక్రమం, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తింప చేస్తూ చట్టం చేయడం.. ఇవన్నీ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ ఎదిగేందుకు తోడ్పడతాయి. ఇదీ అభివృద్ధి అంటే. పైసా లంచం ఇవ్వకుండా, సిఫార్సులు లేకుండా నేరుగా ఇంటి గడప వద్దకే వచ్చి, తలుపు తట్టి పథకాలను వర్తింప చేస్తుంటే దాన్ని అభివృద్ధి అంటారు. ►గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ గ్రామంలోనే వార్డు, గ్రామ సచివాలయాలు తీసుకొచ్చాము. ఆ గ్రామంలోనే ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించాం. ఆ ఇళ్ల నుంచే వలంటీర్‌ను ఎంపిక చేసి, వారికి తోడుగా ఉండే వ్యవస్థను తీసుకువచ్చాం. ►62 శాతం మంది వ్యవసాయంపై బతికే రైతు బతుకు మార్చకుండా.. నాలుగు బిల్డింగ్లు కడితే అది అభివృద్ధి కాదు. అందుకే రైతుల చేయి పట్టుకుని అడుగులు వేస్తూ, విత్తనం మొదలు పంట అమ్ముకునే వరకు రైతుకు తోడుగా ఉంటున్నాం. ►అందుకే పంచాయతీ, మున్సిపల్.. తిరుపతి ఉప ఎన్నికలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని దీవించారు. కుట్రలు చేసిన వాళ్లు పంచాయతీ కార్యాలయాల మీద నీలం, ఆకుపచ్చ రంగులు తుడిచి వేయగలిగారు కానీ, జనం గుండెల్లోని రంగులను మాత్రం తుడిచేయలేకపోయారు. చివరకు అసెంబ్లీలోకి అడుగు పెట్టేందుకు కూడా మొహం చెల్లని విధంగా ప్రతిపక్షాన్ని ప్రజలు తుడిచేశారు. వ్యాక్సిన్ వాస్తవం ఇదీ ►వ్యాక్సినేషన్‌పై కొంతమంది పనిగట్టుకుని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దేశంలో 45 ఏళ్లు పైబడ్డ వాళ్లు 26 కోట్ల మంది ఉన్నారు. వీళ్లకు 52 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్ కావాలి. 18–45 ఏళ్ల మధ్య వాళ్లు 60 కోట్ల మంది ఉన్నారు. వీళ్లకు 120 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్ కావాలి. మొత్తం 172 కోట్ల డోస్‌లు అవసరం. ►కానీ భారత్‌లో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ నెలకు 7 కోట్ల డోస్‌లు మాత్రమే. ఇందులో సీరం ఇన్స్టిట్యూట్ కోవీషీల్డ్ 6 కోట్ల డోసులు, భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ కోటి డోసులను తయారు చేస్తున్నాయి. అందుకే ఇప్పటివరకు 18.44 (11 శాతం లోపు) కోట్ల మందికే వ్యాక్సినేషన్ జరిగింది. ఏపీలో 45 ఏళ్లు నిండిన వాళ్లు.. ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌తో కలిపితే 1.48 కోట్లు ఉన్నారు. వీరికి రెండు డోసులు వేయడానికి 3 కోట్ల డోస్‌లు కావాలి. 18–45 ఏళ్ల లోపు వాళ్లు 2 కోట్ల మంది ఉన్నారు. వీళ్లకు 4 కోట్ల డోస్‌లు కావాలి. మొత్తంగా ఏపీకి 7 కోట్ల డోస్‌లు కావాలి. ఇప్పటివరకు కేంద్రం ఇచ్చింది 76,29,580 డోసులు..అంటే 11 %లోపు. ూ వ్యాక్సిన్ ఇవ్వడం లేదంటూ, డబ్బులు ఖర్చు పెట్టడం లేదని రాజకీయ నిందలేçస్తూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. భారత్ బయోటెక్ సంస్థ ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు కొడుకు వియ్యంకుడిదే. చంద్రబాబుకూ వాళ్లు బంధువులే. ఆ సంస్థ ఉత్పత్తి సామర్థ్యం ఎంతో తెలిసి కూడా ఆరోపణలు చేయడం ఏమిటి? ఇలాంటి దుర్మార్గపు ఆరోపణలు చేస్తుంటే బాధేస్తోంది. పరిష్కారం వ్యాక్సినే ►ఈ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్స్‌కు వెళ్లింది. జూన్ 3న బిడ్స్ వస్తాయి. గ్లోబల్ టెండర్లకు వెళ్లిన రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉంటుంది. కోవిడ్‌ను అడ్డుకునే పరిష్కారం వ్యాక్సినేషనే. గ్లోబల్ టెండర్లలో కంపెనీలు ముందుకు వస్తాయని, కేంద్రం ఆమోదం తెలుపుతుందని ఆశిస్తున్నాం. ఇదీ మా సంక్షేమ క్యాలెండర్ ఏప్రిల్ 2021 ♦జగనన్న వసతి దీవెన మొదటి విడత ♦జగనన్న విద్యా దీవెన మొదటి విడత ♦రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ (2019 రబీ) ♦పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ సున్నా వడ్డీ చెల్లింపులు మే 2021 ♦వైఎస్సార్ రైతు భరోసా మొదటి విడత. దాదాపు 50 లక్షల రైతులకు ఇచ్చాం. ♦మత్స్యకార భరోసా (వేట నిషేధ సబ్సిడీ, డీజిల్ సబ్సిడీ) ఇచ్చాం. ♦వైఎస్సార్ ఉచిత పంటల బీమా (2020 ఖరీఫ్) మే 25న ఇవ్వబోతున్నాం. జూన్ 2021 ♦జగనన్న తోడు తొలి విడత ♦వైఎస్సార్ వాహనమిత్ర రెండో విడత ♦వైఎస్సార్ చేయూత మూడో విడత చెల్లింపులు ♦జూన్ 8న జగనన్న తోడు బ్యాలెన్స్ ఇవ్వబోతున్నాం. ప్రతి మంగళవారం ఒక్కో కార్యక్రమం. జూన్ 8న జగనన్న తోడు, 15న వాహనమిత్ర, 22న చేయూత. జూలై – 2021 ♦జగనన్న విద్యా దీవెన రెండో విడత ♦వైఎస్సార్ కాపు నేస్తం ♦విద్యా కానుక ఆగస్టు 2021 ♦రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు (2020 ఖరీఫ్). ♦ఎంఎస్ఎంఈ, స్పిన్నింగ్ మిల్లులకు పారిశ్రామిక రాయితీలు. ♦వైఎస్సార్ నేతన్న నేస్తం. ♦అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు. సెప్టెంబర్ 2021 ♦వైయస్సార్ ఆసరా అక్టోబర్ 2021 ♦వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత ♦జగనన్న చేదోడు (రజకులు, దర్జీలు, నాయీ బ్రాహ్మణులు) నవంబర్ 2021 ♦వైఎస్సార్ ఈబీసీ నేస్తం. ఇది ఈ ఏడాది అమలు చేసే కొత్త పథకం. ఏటా రూ.15 వేలు చొప్పున సహాయం. అగ్ర వర్ణాల్లోని 45 ఏళ్లు దాటిన పేద అక్కలకు సహాయం. డిసెంబర్ 2021 ♦జగనన్న వసతి దీవెన రెండో విడత ♦జగనన్న విద్యా దీవెన మూడో విడత ♦వైయస్సార్ లా నేస్తం జనవరి 2022 ♦పెన్షన్ నగదు పెంపు. ఈ నెల నుంచి నెలకు రూ.2,500. ♦వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత ♦జగనన్న అమ్మ ఒడి ఫిబ్రవరి 2022 ♦జగనన్న విద్యా దీవెన నాలుగో విడత చదవండి: AP Budget 2021: ఏపీ బడ్జెట్ హైలైట్స్ ఇవే.. -
అభివృద్ధి అంటే నాలుగు బిల్డింగులు కట్టడం కాదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: చిత్తశుద్ధితో నిజాయితీగా పరిపాలన చేస్తున్నామని.. కుల, మత, ప్రాంత, రాజకీయాలు చూడకుండా సంక్షేమం అందించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశం సందర్భంగా గురువారం ఆయన మాట్లాడారు. ''నాలుగు బిల్డింగ్లు కడితే అభివృద్ధి జరిగినట్లు కాదు. నిన్నటికంటే ఈరోజు బాగుండాలి.. రేపు మరింత బాగుంటుందనే భరోసా కల్పించాలి. నాడు-నేడు ద్వారా విద్యావ్యవస్థ రూపురేఖలు మారుస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సాధికారతపై దృష్టి పెట్టాం. రాష్ట్రంలో 62 శాతంమంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వారి బతుకులు మార్చకుండా అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది. గతంలో మ్యానిఫెస్టో అంటే ఎన్నికల ప్రచారానికి మాత్రమే. కానీ మేం రెండేళ్ల కాలంలోనే 94.5 శాతం హామీలు నెరవేర్చాం. విత్తనం దగ్గర నుంచి పంట అమ్మకం వరకు..రైతులకు తోడుగా ఉంటున్నాం. కుట్రలు పన్ని గోడలపై ఉన్న రంగులు తుడిచివేయగలిగారు గానీ.. ప్రజల గుండెల్లో రంగులను తాకలేకపోయారు. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, తిరుపతి ఉపఎన్నిక సహా ఏ ఎన్నిక వచ్చినా దేవుడి దయతో ఒకే జెండా ఎగిరింది. గత 23 నెలల్లో ప్రజలకు నేరుగా రూ.93,708 కోట్లు అందించాం. మరో రూ.31,714 కోట్లు ప్రజలకు పరోక్షంగా అందించాం. మొత్తం రూ.లక్షా 25 వేలకోట్లు ప్రజలకు చేరవేశాం. మనం ప్రజలకు సేవకులమని గుర్తుపెట్టుకుని పనిచేయాలి'' అని తెలిపారు. చదవండి: నాకు ప్రాణం విలువ బాగా తెలుసు: సీఎం జగన్ AP Budget 2021: లైవ్ అప్డేట్స్.. -
భయపెట్టి ఆడే గుండెను ఆపేయకండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్లో మీడియా చేస్తున్న అసత్య ప్రచారంపై అసహనం వ్యక్తం చేశారు. భయాలు, అపోహలతో ఆడే గుండెలను ఆపకండంటూ ఆవేదన చెందారు. గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో చిన్నచిన్న తప్పులు జరిగినా ఒకరినొకరు కలుపుకుని పోవాలని అన్నారు. ప్రజల మనోధైర్యాలను దెబ్బతీసే వార్తలు, అసత్యాలను ప్రచారం చేయొద్దని ఎల్లో మీడియాకు విజ్ఞప్తి చేశారు. మహమ్మారి కరోనాపై పోరు గురించి సీఎం జగన్ మాట్లాడుతూ... ‘‘కోవిడ్ రోగుల కోసం 47 వేల బెడ్లను అందుబాటులోకి తీసుకొచ్చాం . కోవిడ్ కేర్ సెంటర్లలోనూ 52 వేల బెడ్లను అందుబాటులోకి తెచ్చాం.18 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందుబాటులోకి తెస్తున్నాం. కోవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందిస్తున్నాం. గడిచిన 14 నెలల్లో కోవిడ్ నియంత్రణకు రూ.2,229 కోట్లు కేటాయించాం. కోవిడ్ సమాచారం కోసం 104ను అందుబాటులోకి తెచ్చాం. ఇప్పటివరకు 3.12 లక్షలమంది 104 సేవలు వినియోగించుకున్నారు. 104 ద్వారా 60 వేలమందికిపైగా కోవిడ్ రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు ఏర్పాటు చేశాం. టెలీమెడిసిన్ ద్వారా 3,991 మంది వైద్యులు సేవలు అందిస్తున్నారు. విదేశాల నుంచి ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు. చదవండి: నాకు ప్రాణం విలువ బాగా తెలుసు: సీఎం జగన్ -
నాకు ప్రాణం విలువ బాగా తెలుసు: సీఎం జగన్
-
ఏపీ బడ్జెట్ 2021: వ్యవసాయ బడ్జెట్ రూ.31,256.36 కోట్లు
-
AP Budget 2021: విపత్తులో వెన్నుదన్ను!
సాక్షి, అమరావతి: లాక్డౌన్లు, కర్ఫ్యూలున్నా దేశ మనుగడ కోసం నిరంతరం శ్రమించే అన్నదాతల సంక్షేమానికి అగ్ర ప్రాధాన్యమివ్వడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విధానమని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై పెట్టే పెట్టుబడినే ఆకలి, పేదరికంపై పోరాటానికి ఆయుధాలుగా భావిస్తూ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. వ్యవసాయం, అనుబంధ శాఖలకు మొత్తం రూ.31,256.36 కోట్ల కేటాయింపులతో 2021–22 వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా రెండో ఏడాది కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా రైతు సంక్షేమం, వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. గత ఏడాది కంటే అధికంగా నిధులు కేటాయించింది. నిత్యం స్వేదం చిందిస్తూ సేద్యం చేసే రైతుల సంక్షేమం కోసం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించామని మంత్రి కన్నబాబు తెలిపారు. మంత్రి కన్నబాబు ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. గత సర్కారు మిగిల్చిన బకాయిలూ చెల్లించాం.. ►అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతులకు రూ.68 వేల కోట్ల మేర సహాయం అందించింది. టీడీపీ సర్కారు మిగిల్చిన బకాయిలు రూ.2,771 కోట్లు కూడా చెల్లించింది. ► విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని సేవలు అందించేలా గ్రామీణ ప్రాంతాల్లో 10,544, పట్టణ కేంద్రాల్లో కొత్తగా 234 కేంద్రాలతో కలిపి మొత్తం 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. వివిధ ఉత్పత్తులను నిల్వ చేసి ఆర్బీకేలకు అందించేందుకు 154 హబ్‌లను అందుబాటులోకి తెచ్చాం. ఒక్కోటి రూ.21.80 లక్షల చొప్పున మొత్తం 10,417 ఆర్బీకే భవనాల నిర్మాణం కొనసాగుతోంది. ►వైఎస్సార్ పొలం బడుల ద్వారా రైతు సాధికారిత సాధిస్తున్నాం. 10,246 కస్టమ్ హైరింగ్ సెంటర్లు నెలకొల్పాం. ► వైఎస్సార్ రైతు భరోసా కింద 2020–21లో 51.95 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.6,928 కోట్లు జమ చేశాం. 2021–22 తొలి విడత సాయంగా 52.38 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.3,928.88 కోట్లు ఇచ్చాం. ఇంతవరకు మొత్తం రూ.17,029.88 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. ► విత్తనాల కోసం వ్యయ ప్రయాసలు, సుదూర ప్రయాణాలు, క్యూ లైన్లు, పోలీసుల పహారా లాంటి వాటికి ముగింపు పలికాం. రైతులకు కల్తీలేని నాణ్యమైన విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందిస్తున్నాం. తొలిసారి టెండర్లు లేకుండా రైతుల నుంచే నేరుగా విత్తనాలు సేకరించి, శుద్ధి చేసి నాణ్యంగా మార్చి తిరిగి అన్నదాతలకే అందజేశాం. రైతులపై రూపాయి భారం లేకుండా... ► దేశంలో రైతులపై ఒక్క రూపాయి కూడా బీమా ప్రీమియం భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ► వైఎస్సార్ సున్నావడ్డీ పథకం కింద ఏటా రూ.లక్ష లోపు పంట రుణం తీసుకున్న వారికి వడ్డీ రాయితీని ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం. తద్వారా 82 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ► రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు కలిసి కూర్చొని పంటల ప్రణాళిక రూపొందించేలా వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేసి క్రియాశీలం చేశాం. ►రైతులకు వారి పొలాల్లోనే శిక్షణ ఇచ్చేందుకు వైఎస్సార్ పొలంబడి పథకాన్ని సమర్థంగా అమలు చేస్తున్నాం. మత్స్య సాగుబడి, పశు విజ్ఞాన బడి, తోటబడి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. 2020–21లో నిర్వహించిన 18,840 పొలం బడులలో 5.65 లక్షల మంది రైతులు శిక్షణ పొందారు. ►ఈ ఏడాది కొత్తగా సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని తెస్తున్నాం. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం, భూ సారాన్ని పరిరక్షించడం, సేంద్రీయ పద్ధతులు పాటించటాన్ని ప్రోత్సహిస్తాం. ఇప్పటికే ఆర్బీకేల ద్వారా ‘ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నాచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్ఎఫ్) అమలు చేస్తున్నాం. ► విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను తనిఖీ చేసిన తరువాతే వినియోగించేలా వైఎస్సార్ సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాలను వచ్చే ఖరీఫ్‌కి అందుబాటులోకి తెస్తాం. ► ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం చెల్లించే విధానాన్ని దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి సమర్థంగా అమలు చేస్తున్నాం. ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేసి ఏటా రూ.2 వేల కోట్లు కేటాయిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్ కచ్చితంగా అమలు చేస్తున్నారు. 2020 ఖరీఫ్‌లో జూన్ నుంచి అక్టోబరు వరకు పంటలు నష్టపోయిన 3.80 లక్షల మంది రైతులకు రూ.285.51 కోట్లు పరిహారం జమ చేశాం. 2020 నవంబర్‌లో నివర్ తుపాను వల్ల నష్టపోయిన 8.34 లక్షల మంది రైతులకు రూ.645.99 కోట్లు వెంటనే డిసెంబర్లోనే చెల్లించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ► ఆత్మహత్యలకు పాల్పడ్డ అన్నదాతల కుటుంబాలను ఆదుకునేందుకు తక్షణమే రూ.7 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నాం. టీడీపీ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న 462 మంది రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందచేశాం. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. గత ఏడాది లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది. 2019 నుంచి 2021 మే వరకు రూ.31,782 కోట్లతో 157 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశాం. సీఎం యాప్ ద్వారా ధరల నమోదు.. ►సీఎం యాప్ ద్వారా ప్రతి గ్రామంలో ఏ పంట ఎంత ధరలు ఉన్నాయో నమోదు చేస్తున్నాం. రైతులకు చెల్లింపుల్లో పారదర్శకతక కోసం ఇ–సంతకం విధానాన్ని ప్రవేశపెట్టాం. గోనె సంచులపై క్యూఆర్ ట్యాగులతో అనుసంధానించాం. ►దేశవ్యాప్తంగా వ్యాపారులతో మన గ్రామస్థాయి మార్కెట్లను అనుసంధానించేందుకు ‘ఇ–ఫార్మ్ మార్కెటింగ్’ వేదికను అందుబాటులోకి తెచ్చాం. ►మహిళా సాధికారికత కోసం మార్కెటింగ్ కమిటీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాం. ► ప్రతి గ్రామంలో మార్కెటింగ్ మౌలిక వసతుల కల్పన కోసం రూ.14 వేల కోట్లతో ఫామ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థను నెలకొల్పుతున్నాం. ►వ్యవసాయ ఉత్పత్తులను పొలాల్లోనే కొనుగోలు చేసేందుకు పంట కోత ముందు, తరువాత అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2,718.11 కోట్లతో బహుళార్ద సాధక సదుపాయాల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ►డీసీసీబీల్లో హెచ్ఆర్ పాలసీని తెచ్చి పీఏసీఎస్‌లను కంప్యూటరీకరిస్తున్నాం. ►సమీకృత సహకార అభివృద్ధి పథకం రెండో దశ కింద చిత్తూరు, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో రూ.609.39 కోట్లతో పనులు మంజూరు చేశాం. మొదటి ఏడాది 67 గిడ్డంగుల నిర్మాణంతోపాటు 44 పాత గిడ్డంగుల మరమ్మతులు, కార్యాలయాల నిర్మాణ పనులు చేపడతాం. ►ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు కోసం రూ.2,850 కోట్లతో ప్రణాళికను ఆమోదించాం. ►రూ.460 కోట్లతో 2020–25లో రాష్ట్రంలో 10,035 సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలను నెలకొల్పేలా ప్రణాళిక రూపొందించాం. ► ఉద్యానవన పంటల విస్తరణ పథకంలో భాగంగా ఈ ఏడాది అదనంగా లక్ష ఎకరాల్లో నూతన పంటల క్లస్టర్లను అభివృద్ధి చేస్తాం. ►బైవోల్టైన్ సెరీ కల్చర్‌ను ప్రోత్సహించేందుకు బైలోల్టైన్ పట్టు గూళ్ల ఉత్పత్తిపై కిలోకు రూ.50 ప్రోత్సాహకం అందిస్తున్నాం. బైవోల్టైన్ ముడి పదార్థం నుంచి సిల్క్ రీలర్స్ ఉత్పత్తికి కిలోకు రూ.130 చొప్పున ప్రోత్సాహకం ఇస్తున్నాం. ►పశువులకు గ్రాసం అందించేందుకు దేశంలో మన రాష్ట్రమే తొలిసారిగా రూ.250 కోట్లతో పశుగ్రాస పథకాన్ని ప్రవేశపెట్టింది. ►రూ.40.86 కోట్లతో పులివెందులలో ముర్రాజాతి గేదెల పునరుత్పత్తి కేంద్రాన్ని ఐదేళ్లలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తాం. ►పాల సేకరణ, విక్రయంలో ప్రపంచంలోనే సహకార రంగంలో పెద్దదైన అమూల్ డెయిరీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని నూతన అధ్యాయానికి తెరతీశాం. ఈ పథకం అమలవుతున్న గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో పాడి రైతులకు అదనంగా రూ.5 నుంచి రూ.17 వరకు లబ్ధి చేకూరుతోంది. ►చేపలు, రొయ్యల దాణా, నాణ్యత పరీక్షలు, సేవలు అందించేందుకు రాష్ట్రంలో 9 తీరప్రాంత జిల్లాల్లో 35 సమీకృత ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటుకు రూ.50.30 కోట్లు కేటాయించాం. ► ఆక్వా కల్చర్ రంగంపై పర్యవేక్షణ, నియంత్రణ, సుస్థిర అభివృద్ధి కోసం ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీని స్థాపించాం. ►పశ్చిమ గోదావరి జిల్లాల్లో షిషరీష్ విశ్వవిద్యాలయం నెలకొల్పేందుకు చర్యలు చేపట్టాం. n తీరప్రాంతాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు మొదటి దశలో నిజాంపట్నం(గుంటూరు), మచిలీపట్నం(కృష్ణా)లలో ఫిషింగ్ హార్బర్ల ఆధునీకరణ, ఉప్పాడ (తూర్పు గోదావరి), జువ్వలదిన్నె (నెల్లూరు)లలో కొత్త ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు చేపట్టాం. రెండో దశలో బుడగట్లపాలెం(శ్రీకాకుళం), పూడిమడక(విశాఖపట్నం ), బియ్యపు తిప్ప(పశ్చిమ గోదావరి), కొత్తపట్నం (ప్రకాశం)లో హార్బర్ల నిర్మాణం చేపడతాం. ►వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ కోసం ఫీడర్ల బలోపేతానికి రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ►వైఎస్సార్ జలకళ పథకం కింద నాలుగేళ్లలో రూ.2,340 కోట్లతో 2 లక్షల బోర్లు ఉచితంగా వేస్తాం. చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలిగించేందుకు రూ.1,700 కోట్లతో మోటార్లను కూడా ఉచితంగా అందిస్తాం. దీంతో ఐదు లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చి 3 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారు. చదవండి: AP Budget 2021: విద్యా రంగానికి రూ.24,624 కోట్లు -
AP Budget 2021: ఏపీ వ్యవసాయ బడ్జెట్.. కీలక కేటాయింపులు
సాక్షి, అమరావతి: మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మండలిలో డిప్యూటీ సీఎం కృష్ణదాస్ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఒక చరిత్ర అన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు రైతులకు కార్యాలయాలు వంటివన్నారు. 1,778 రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. నాణ్యమైన యంత్రాల కొనుగోలుకు 40 శాతం రాయితీ ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ►వ్యవసాయ బడ్జెట్ రూ.31,256.36 కోట్లు ►ఉపాధి హామీ పథకం కోసం రూ.8,116.16 కోట్లు ►వైఎస్ఆర్ జలకళ పథకం కోసం రూ.200 కోట్లు ►వ్యవసాయ పథకాల కోసం రూ.11,210.80 కోట్లు ►వైఎస్ఆర్ రైతు భరోసా కోసం రూ.3,845.30 కోట్లు ►వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాకు రూ.1802.82 కోట్లు ►వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు రూ.739.46 కోట్లు ►రాష్ట్రీయ కృషి వికాస యోజన(RKVY) రూ.583.44 కోట్లు ►ధరల స్థిరీకరణ ఫండ్ రూ.500 కోట్లు ►రైతులకు సున్నా వడ్డీ చెల్లింపుల కోసం రూ.500 కోట్లు ►ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన(PMKSY) రూ.300 కోట్లు ►రైతులకు విత్తనాల సరఫరా కోసం రూ.100 కోట్లు ►వ్యవసాయ మార్కెట్ మౌలిక వసతుల కోసం రూ.100 కోట్లు ►వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ కోసం రూ.88.57 కోట్లు ►రైతులకు ఎక్స్‌గ్రేషియా కోసం రూ.20 కోట్లు ►పశువుల నష్టపరిహార పథకం కోసం రూ.50 కోట్లు -
ఏపీ బడ్జెట్ 2021: స్కూళ్లలో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు
-
AP Budget 2021: విద్యా రంగానికి రూ.24,624 కోట్లు
సాక్షి, అమరావతి: పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బలంగా నమ్ముతారు. రాష్ట్ర విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన 2021-22 వార్షిక బడ్జెట్లో విద్యా రంగానికి సంబంధించిన కేటాయింపులతో ఈ విషయం మరోమారు స్పష్టమైంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. విద్యా రంగానికి రూ.24,624.22 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా.. పాఠశాలల్లో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు, జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు, జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు, ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు కేటాయించారు. కాగా గత బడ్జెట్లో ప్రాథమిక ఉన్నత విద్యకు రూ. 22,604.01 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 2021-22 వార్షిక బడ్జెట్: విద్యా రంగానికి రూ.24,624.22 కోట్లు స్కూళ్లలో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు చదవండి: AP Budget 2021: హైలెట్స్ -
AP Budget 2021: ఏపీ బడ్జెట్ హైలైట్స్ ఇవే..
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,29,779.27 కోట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శాసన మండలిలో హోం మంత్రి మేకతోటి సుచరిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తొలిసారి జెండర్ బేస్డ్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మహిళలు, చిన్నారులకు బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. రూ.47,283 కోట్లతో జెండర్ బడ్జెట్ తెచ్చింది. ►2021-22 రాష్ట్ర బడ్జెట్ అంచనా రూ.2,29,779.27 కోట్లు ►రెవెన్యూ వ్యయం - రూ.లక్షా 82 వేల 196 కోట్లు ►మూలధన వ్యయం - రూ.47,582 కోట్లు ►రెవెన్యూ లోటు - రూ.5 వేల కోట్లు ►ద్రవ్యలోటు - రూ.37,029.79 కోట్లు ►జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.49 శాతం ►రెవెన్యూ లోటు 0.47 శాతం ►బీసీ సబ్ ప్లాన్‌కి రూ.28,237 కోట్లు ►కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు ►ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు ►బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు ►ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు ►ఎస్టీ సబ్ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు ►మైనార్టీ యాక్షన్ ప్లాన్‌కు రూ.1,756 కోట్లు ►చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు ►మహిళల అభివృద్ధికి రూ.47,283.21 కోట్లు ►వ్యవసాయ పథకాలకు రూ.11,210 కోట్లు ►విద్యా పథకాలకు రూ.24,624 కోట్లు ►వైద్యం, ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు ►వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు రూ.17 వేల కోట్లు ►వైఎస్ఆర్ రైతు భరోసా కోసం రూ.3,845 కోట్లు ►వైఎస్ఆర్-పీఎం ఫసల్ బీమా యోజనకు రూ.1802 కోట్లు ►రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.500 కోట్లు ►రైతులకు ఎక్స్‌గ్రేషియా కోసం రూ.20 కోట్లు ►జగనన్న వసతి దీవెన కోసం రూ.2,223.15 కోట్లు ►డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.865 కోట్లు ►పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు రూ.247 కోట్లు ►వైఎస్ఆర్ జగనన్న చేదోడు పథకానికి రూ.300 కోట్లు ►వైఎస్ఆర్ కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు ►వైఎస్ఆర్ వాహన మిత్ర కోసం రూ.285 కోట్లు ►వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు ►మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు ►అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపుల కోసం రూ.200 కోట్లు ►వైఎస్ఆర్ నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు ►లా నేస్తం కోసం రూ.16.64 కోట్లు ►ఈబీసీ నేస్తం కోసం రూ.500 కోట్లు ►వైఎస్ఆర్ ఆసరా కోసం రూ.6,337 కోట్లు ►జగనన్న విద్యా దీవెనకు రూ.2,500 కోట్లు ►అమ్మఒడి పథకం కోసం రూ.6,107 కోట్లు ►వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు రూ.1,556.39 కోట్లు ►వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్‌కు రూ.243.61 కోట్లు ►వైఎస్ఆర్ చేయూత కోసం రూ.4,455 కోట్లు ►రైతు పథకాల కోసం రూ.11,210.80 కోట్లు ►వైఎస్ఆర్ టెస్టింగ్ ల్యాబ్‌లకు రూ.85.57 కోట్లు ►వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాకు రూ.1802.82 కోట్లు ►వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు రూ.739.46 కోట్లు ►వైఎస్ఆర్ పశువుల నష్టపరిహారానికి రూ.50 కోట్లు ►జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు ►విద్యా రంగానికి రూ.24,624.22 కోట్లు ►స్కూళ్లలో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు ►జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు ►ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు ►ఆరోగ్య రంగానికి రూ.13,840.44 కోట్లు ►ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు ►ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు ►కోవిడ్‌పై పోరాటానికి రూ.1000 కోట్లు ►ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్‌కు రూ.100 కోట్లు ►శ్రీకాకుళం జిల్లా పలాస ఆస్పత్రికి రూ.50 కోట్లు ►హౌసింగ్, మౌలిక వసతులకు రూ.5,661 కోట్లు ►పరిశ్రమలకు ఇన్సెంటివ్‌ల కోసం రూ.1000 కోట్లు ►ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్‌కు రూ.200 కోట్లు ►కడప స్టీల్ ప్లాంట్ కోసం రూ.250 కోట్లు ►ఏపీఐఐసీకి రూ.200 కోట్లు కేటాయింపు ►ఎంఎస్ఎంఈలో మౌలిక వసతులకు రూ.60.93 కోట్లు ►పారిశ్రామిక మౌలిక సదుపాయాలకు రూ.3,673.34 కోట్లు ►రోడ్లు భవనాల శాఖకు రూ.7,594.6 కోట్లు ►ఎనర్జీ రంగానికి రూ.6,637 కోట్లు ►దిశ కోసం రూ.33.75 కోట్లు ►అంగన్వాడీల్లో నాడ-నేడు కార్యక్రమాలకు రూ.278 కోట్లు ►వైఎస్ఆర్ బీమాకు రూ.372.12 కోట్లు ►అర్చకుల ఇన్సెంటివ్‌లకు రూ.120 కోట్లు ►ఇమామ్, మౌజాంల ఇన్సెంటివ్‌లకు రూ.80 కోట్లు ►పాస్టర్ల ఇన్సెంటివ్‌లకు రూ.40 కోట్లు ►ల్యాండ్ రీసర్వే కోసం రూ.206.97 కోట్లు ►పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖకు రూ.8,727 కోట్లు ►నీటిపారుదల శాఖకు రూ.13,237.78 కోట్లు అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభం.. బీఏసీ సమావేశం అనంతరం తిరిగి అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభమైంది. సభలో పలువురికి సంతాప తీర్మానాలు చేశారు. పలువురు మాజీ ఎమ్మెల్యేల మృతిపట్ల అసెంబ్లీ సంతాపం తెలిపింది. కాసేపట్లో ప్రభుత్వం 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు. ముగిసిన బీఏసీ సమావేశం.. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. బీఏసీ భేటీకి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి హాజరయ్యారు. ఒక్క రోజు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానించనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు మహిళలకు ప్రత్యేకంగా ఉప ప్రణాళికలు పొందుపరిచిన 2021–22 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను కొద్దిసేపట్లో శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. కోవిడ్‌పై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సెల్యూట్: గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి వర్చువల్ విధానంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఏపీ.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ అన్నారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నుంచి కోవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉందన్నారు. ‘‘దేశవ్యాప్తంగా రోజుకు 4 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఏపీలోనూ ఉంది. కోవిడ్‌పై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సెల్యూట్. కొత్తగా కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. తి ప్రైవేట్ ఆస్పత్రిలోనూ కోవిడ్ చికిత్స కోసం ఆరోగ్యశ్రీ కింద ఏర్పాటు చేశాం. ఆక్సిజన్ కొరత లేకుండా ఇతర దేశాల నుంచీ క్రయోజనిక్ ఆక్సిజన్ తెప్పించాం’’ అని గవర్నర్ తెలిపారు ‘‘ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ దుష్ప్రభావం చూపినప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగించాం. ప్రజల సంక్షేమం ప్రాధాన్యతగా 95 శాతం హామీలను పూర్తి చేశాం. ఇప్పటి వరకు కోటి 80 లక్షల మంది టెస్టులు చేయగా 14 లక్షల 54 వేల మందికి పాజిటివ్ వచ్చింది. ప్రతిరోజూ 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశాం. జగనన్న విద్యాకానుక కింద 47 లక్షల మందికి విద్యాకానుక అందించాం. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఏపీ ఆర్థిక పురోగతిని కనబరిచింది. 2020-21లో జాతీయ అభివృద్ధి రేటు నెగిటివ్ ఉండగా ఏపీ 1.58 శాతం అభివృద్ధి రేటు కనకబరిచింది. రాష్ట్రంలో 53.28 లక్షల మందికి తొలిడోసు ఇచ్చాం. 21.64 లక్షల మందికి సెకండ్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని’’ గవర్నర్ పేర్కొన్నారు. ‘‘జగనన్న విద్యాదీవెన కోసం 4879.30 కోట్లు, జగనన్న వసతి దీవెనకు రూ.1049 కోట్లు కేటాయించాం. మనబడి-నాడు నేడు కింద 15717 స్కూళ్ల ఆధునికీకరణ చేపట్టాం. స్కూళ్ల ఆధునికీకరణకు రూ.3,948 కోట్లు కేటాయించాం. విద్యాశాఖకు అన్ని పథకాల కింద రూ.25,714 కోట్లు కేటాయించాం. 44.5 లక్షల మంది తల్లులకు జగనన్న అమ్మఒడి వర్తింప చేశాం. జగనన్న అమ్మఒడి కింద రూ.13,022 కోట్లు, జగనన్న గోరుముద్ద కింద 36.88 లక్షల మందికి రూ.1600 కోట్లు ఇచ్చాం. ఇరిగేషన్ కింద 14 ప్రాజెక్టులు పూర్తి చేశాం. వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ కింద 2019-20 ఏడాదికి 52.38 లక్షలమంది రైతులకు 17030 కోట్లు కేటాయించాం. వైఎస్ఆర్ కాపు నేస్తంలో 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారికి కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాల మహిళలకు 5 విడతల్లో రూ.75 వేలు. ఈ ఏడాది 3.2 వైఎస్సార్ కాపు నేస్తం కింద 491 కోట్లు కేటాయించి 3.27 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చాం. వైఎస్సార్ నేతన్న నేస్తం కోసం 390.74 కోట్లు కేటాయించి నేతన్నలకు 81,783 మంది లబ్ధి చేకుర్చాం. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను బీసీలకు వేగంగా అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని’’ గవర్నర్ తెలిపారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద 87,74,674 మంది మహిళలకు 6792.21 కోట్లు కేటాయించాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 8.78 లక్షల మహిళా సంఘాలకు రూ.1399.79 కోట్లు, వైఎస్సార్ చేయూత కింద 45 నుంచి 60 మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహళలకు 4604.13 కోట్లు కేటాయించాం. పరిశ్రమల్లో 75 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలు లభించేలా చట్టం చేశాం. ఒక స్కిల్ వర్శిటీతోపాటు 25 మల్టీ స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్రంలోని 3 ప్రధాన ఇండస్ట్రియల్ కారిడార్లలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహకాలు. విజయనగరంలో భోగాపురం ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నాం. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టును ప్రారంభించాం. రాష్ట్రంలో 6 పోర్టులు, 2 ఫిషింగ్ హార్బర్లను రెండు విడతల్లో అభివృద్ధి చేస్తామని’’ గవర్నర్ అన్నారు. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సిద్ధంగా ఉందని గవర్నర్ తెలిపారు. ప్రజలను కోవిడ్ నుంచి కాపాడుకోవడం కోసం సర్వశక్తులను వినియోగిస్తామన్నారు. ప్రజలందరూ కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నానన్నారు. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభమైంది. తొలిసారిగా మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ... అందుకు తగ్గట్టే కేటాయింపులు చేసిన జెండర్ బేస్డ్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు రాబోతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు మహిళలకు ప్రత్యేకంగా ఉప ప్రణాళికలు పొందుపరిచిన 2021–22 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను గురువారం శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఉదయం 11 గంటలకు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో బడ్జెట్‌ను హోంమంత్రి సుచరిత ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెట్టనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
AP Budget 2021: ముగిసిన కేబినెట్ సమావేశం
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. తొలిసారిగా మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ... అందుకు తగ్గట్టే కేటాయింపులు చేసిన జెండర్ బేస్డ్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు రాబోతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు మహిళలకు ప్రత్యేకంగా ఉప ప్రణాళికలు పొందుపరిచిన 2021-22 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను నేడు శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభలో పలువురి సంతాప తీర్మానాలు చేయనున్నారు. అనంతరం స్పీకర్, ఛైర్మన్ అధ్యక్షతన బీఏసీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో బడ్జెట్‌ను హోంమంత్రి సుచరిత ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెట్టనున్నారు. చదవండి: AP Budget 2021: ఇది అందరి బడ్జెట్ -
నేడు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం
-
తెలంగాణ బడ్జెట్: ఏ శాఖకు ఎన్ని నిధులు...
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో పేదలకు లబ్ధి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లోని పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద అందిస్తున్న సాయం ఎంతో ఉపయోగపడుతోందని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. 2014–15 నుంచి 2020–21 మధ్య ఎస్సీల్లో 1.64 లక్షల మందికి ప్రభుత్వం రూ.1,235 కోట్లు అందచేసింది. అలాగే గిరిజనుల్లో లక్ష మంది వరకు లబ్ధి పొందగా వారికి రూ. 764 కోట్లు పంపిణీ చేసింది. ఇక బీసీల్లో 2.98 లక్షల మంది కల్యాణ లక్ష్మి పథకం కింద లబ్ధి పొందగా.. వీరికి రూ.2,752 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. ఇక షాదీ ముబారక్ పథకం కింద మైనారిటీల్లో 1.68 లక్షల మందికి లబ్ధి చేకూరగా రూ.1,112 కోట్లను ప్రభుత్వం వారికి ఆర్థిక సాయంగా అందించింది. పెరుగుతున్న పట్టణ జనాభా పట్టణాల్లో మౌలిక సదుపాయల కల్పన, ఉద్యోగ అవకాశాలు ఉండడంతో పట్టణ జనాభా పెరుగుతున్నట్లు సామాజిక ఆర్థిక సర్వే తెలిపింది. నగరాల్లో ప్రస్తుతం 46.1 శాతం ఉన్న జనాభా 2036 నాటికి 57.3 శాతం వరకు పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇది జాతీయ సగటుతో పోలిస్తే దాదాపు 18 శాతం అధికంగా ఉంటుందని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. 2011లో పట్టణ జనాభా 28.9 శాతం ఉంటే.. ఇప్పుడది 46.1 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో 31.1 శాతం నుంచి 34.5 శాతానికి పెరిగింది. గ్రామాల నుంచి ఉపాధి కోసం పట్టణాలకు వస్తున్న వారు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోందని సర్వే పేర్కొంది. రాష్ట్ర జనాభా ప్రస్తుతం 3.8 కోట్ల వరకు ఉంటే అందులో 2 కోట్లకుపైగా జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నట్లు వెల్లడించింది. ►పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ రూ. 29,271కోట్లు ►ఐటీ రూ. 360 కోట్లు ►వైద్య, ఆరోగ్య శాఖ రూ. 6,295కోట్లు ►మహిళా,శిశు సంక్షేమం రూ. 1,632కోట్లు ►రోడ్లు, భవనాలు రూ. 8,788కోట్లు ►పశుసంవర్థక,మత్స్య శాఖ రూ. 1,730కోట్లు ►వ్యవసాయం రూ. 25,000కోట్లు ►పాఠశాల విద్య రూ. 11,735కోట్లు ►ఉన్నత విద్య రూ. 1,873కోట్లు ►విద్యుత్ రూ. 11,046కోట్లు ►హోం శాఖ రూ. 6,465కోట్లు ►అటవీ శాఖ రూ. 1,276కోట్లు ►బీసీ సంక్షేమ శాఖ రూ. 5,522కోట్లు ►మైనారిటీ సంక్షేమం రూ. 1,606కోట్లు ►ఎస్సీల ప్రత్యేక అభివృద్ధి నిధి రూ. 21,306కోట్లు ►ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి రూ. 12,304కోట్లు ►సాంస్కృతిక, పర్యాటక శాఖ రూ. 726కోట్లు ►సాగునీటి రంగం రూ. 16,931కోట్లు ►పరిశ్రమలు రూ. 3,077కోట్లు ►పౌర సరఫరాలు రూ. 2,363కోట్లు ►పురపాలిక, పట్టణాభివృద్ధి శాఖ రూ. 15,030కోట్లు -
దళిత అభివృద్ధికి దండిగా..
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్) కింద ఈసారి భారీగా ఖర్చు చేయనున్నారు. గతంలో ఎన్నడూ లేనంత అధిక మొత్తంలో నిధులను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021–22 బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి (సబ్‌ప్లాన్) కింద రూ.33,611.06 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీ ఎస్డీఎఫ్)కి రూ.21,306.84 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీ ఎస్డీఎఫ్) కింద రూ.12,304.22 కోట్లు చూపించింది. 2020–21తో పోలిస్తే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.7,304.81 కోట్లు అదనంగా ఖర్చు చేయనున్నారు. పథకాల పరుగులు... గతేడాది కోవిడ్–19 వ్యాప్తి వల్ల నెలకొన్న పరిస్థితులతో పలు సంక్షేమ పథకాలు డీలా పడ్డాయి. ప్రస్తుతం ఈ పరిస్థితులను అధిగమిస్తున్నప్పటికీ కొన్ని పథకాల్లో అవాంతరాలు వచ్చాయి. ఈసారి భారీ కేటాయింపులు జరపడంతో సంక్షేమ పథకాల అమలు వేగం పుంజుకోనుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా అమలు చేసే ఆర్థిక చేయూత పథకాలు పరుగులు పెట్టనున్నాయి. అదేవిధంగా ఇదివరకు పెండింగ్‌లో ఉన్న కార్యక్రమాలు సైతం పరిష్కారం కానున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక అభివృద్ధి నిధి మొత్తాన్ని సంబం ధిత సంక్షేమ శాఖలు.. ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఖర్చు చేయా ల్సి ఉంటుంది. ఈసారి భారీగా కేటాయింపులు జరపడంతో ఆయా శాఖలు తలపెట్టిన కార్యక్రమాలన్నీ -
పురపాలకానికి నిధుల వరద
సాక్షి, హైదరాబాద్: పురపాలక శాఖకు బడ్జెట్లో నిధుల వరద పారింది. 2020–21లో ఈ శాఖకు రూ.12,287.29 కోట్లు ఇవ్వగా.. ఈసారి (2021– 22లో) రూ.14,112.24 కోట్లకు పెంచారు. ఇందు లో నిర్వహణ పద్దు కింద కేటాయింపులు రూ.1,261.98 కోట్ల నుంచి రూ.3,978.01 కోట్లకు పెరగగా.. ప్రగతిపద్దు కేటాయింపులు రూ.11,020.31 కోట్ల నుంచి రూ.10,134.23 కోట్లకు తగ్గాయి. హైదరాబాద్ నగరానికి ఈసారి కూడా భారీగా కేటాయింపులు ఉన్నాయి. నిర్వహణ పద్దు కింద జల మండలికి రుణాలను రూ.900 కోట్ల నుంచి రూ.738.52 కోట్లకు తగ్గించారు. అభివృద్ధి పనుల కోసం కొత్తగా రూ.668 కోట్లను కేటాయించారు. కృష్ణా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులో భాగంగా సుంకిశాల ఇంటేక్ నుంచి హైదరాబాద్‌కు నీటి సరఫరా చేసే పనుల కోసం రూ.725 కోట్ల రుణానికి ఓకే చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.వెయ్యి కోట్లు, ఓఆర్ఆర్ కోసం హెచ్ఎండీఏకు రూ.472 కోట్లు రుణాలుగా కేటాయించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటాగా స్మార్ట్‌సిటీలకు రూ.288.60 కోట్లు, అమృ త్ నగరాలకు రూ.203.02 కోట్లు కేటాయించారు. పట్టణాల్లో పనుల కోసం.. రాష్ట్ర పథకాల కింద మూసీ పరీవాహక ప్రాంత అభి వృద్ధికి రూ.200 కోట్లు, టీయూఎఫ్ఐడీసీకి రూ.219.33 కోట్లు, హైదరాబాద్ ప్రజలకు 20వేల లీటర్ల ఉచిత నీటిసరఫరా కోసం జలమండలికి రూ.250 కోట్లు, కొత్త ఎయిర్‌స్ట్రిప్‌లకు రూ.75.47 కోట్లు, వరంగల్ మెట్రో ప్రాజెక్టుకు రూ.150.94 కోట్లు, హైదరాబాద్ అర్బన్ అగ్లోమెరేషన్ పనులకు రూ.1,962.22 కోట్లు కేటాయించారు. యాదాద్రికి రూ.350 కోట్లు గత బడ్జెట్ తరహాలోనే యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ (వైటీడీఏ)కు రూ.350 కోట్లు, వేములవాడ ఆలయాభివృద్ధి సంస్థ (వైటీడీఏ)కు రూ.50 కోట్లు ఇచ్చారు. పదిలక్షలపైన జనాభా గల నగరాలకు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల కింద హైదరాబాద్ నగరానికి రూ.318 కోట్లు, ఇతర నగరాలకు రూ.354 కోట్లను ప్రతిపాదించారు. స్వచ్ఛ భారత్‌కు భారీగా.. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద స్వచ్ఛ భారత్‌కు రూ.783.75 కోట్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)కు రూ.166.50 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. మున్సిపాలిటీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను రూ.889 కోట్ల నుంచి రూ.672 కోట్లకు తగ్గించారు. పురపాలికలకు ఆరోగ్య రంగం కింద ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లుగా రూ.107.51 కోట్లను కొత్తగా కేటాయించారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వడ్డీలేని రుణాల కింద నిధుల కేటాయింపులను రూ.226.41 కోట్ల నుంచి 566.02 కోట్లకు పెంచారు. -
పల్లెకు పట్టం..రూ.29,271 కోట్ల కేటాయింపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సింహభాగం కేటాయించారు. ఈ శాఖకు ప్రగతి, నిర్వహణ పద్దులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఇతర సంక్షేమ పథకాలు, కేటాయింపులు, తదితరాలు కలుపుకొని మొత్తం రూ.29,271 కోట్లు ప్రతిపాదించడం విశేషం. ఇది గతేడాదితో పోల్చితే రూ.6,266 కోట్ల మేర అధికం. బడ్జెట్లో పీఆర్, ఆర్డీ శాఖకు భారీగా నిధుల కేటాయింపుతో పల్లె ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట వేసినట్లయింది. రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి చేపట్టిన చర్యల్లో భాగంగా గ్రామీణ వికాసానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్న సర్కార్.. అదే ఒరవడిని కొనసాగించేలా బడ్జెట్‌ను ప్రతిపాదించింది. పల్లెప్రగతి కింద గ్రామ పంచాయతీలకు ఇప్పటివరకు రూ.5,761 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి పీఆర్, ఆర్డీ శాఖకు రూ.23,005.35 కోట్లు కేటాయించింది. అంతకుముందు ఏడాది (2019–20)తో పోలిస్తే ఇది రూ.7,880.46 కోట్లు అధికం. ఇక 2021–22 బడ్జెట్లో భాగంగా ప్రగతి పద్దు కింద పంచాయతీరాజ్‌కు రూ.5,433.99 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.10,154 కోట్లు, నిర్వహణ పద్దు కింద పీఆర్‌కు రూ.6,898.08 కోట్లు, ఆర్డీకి రూ.67.13 కోట్లు ప్రతిపాదించారు. 39,36,521 మందికి ‘ఆసరా’ 2021–22 బడ్జెట్లో ఆసరా పింఛన్ల కోసం రూ.11,728 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్రంలో 39,36,521 మందికి ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఇందులో 2019–20లో కేంద్రం ఒక్కొక్కరికి రూ.200 చొప్పున 6,66,105 కోట్ల మందికి రూ.105 కోట్ల మేర సహాయం అందజేసింది. వీరందరికీ ఒక్కొక్కరికి రూ.1,816 రాష్ట్ర ప్రభుత్వం జతచేసి, రూ.2,016 పింఛను అందిస్తున్న విషయం తెలిసిందే. వీరే కాకుండా 31,31,660 అసహాయులకు నెలకు రూ.2,016 చొప్పున, దివ్యాంగులకు రూ.3,016 చొప్పున పూర్తి మొత్తాన్ని రాష్ట్రమే భరిస్తూ ఆసరా పింఛన్లను అందిస్తోంది. 2019–20 ఆడిట్ నివేదిక ప్రకారం పింఛన్ల పంపిణీలో కేంద్ర వాటా 1.20 శాతం మాత్రమే కాగా మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. అసహాయులకు జీవన భద్రత కల్పనకు వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఒంటరి మహిళలకు రూ.2,016 చొప్పున, దివ్యాంగులకు రూ.3,016 చొప్పున ఆసరా పింఛన్లు అందజేస్తున్నారు. ‘పరిషత్’లకు రూ.500 కోట్లు.. బడ్జెట్లో తొలిసారిగా జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లకు రూ.500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో జెడ్పీలకు రూ.252 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.248 కోట్లు ప్రతీ ఏడాది అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. దీనికి అవసరమైన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేసి ప్రకటించనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు విడుదల చేసే నిధుల్లో రాష్ట్రానికి రూ.699 కోట్ల మేర కోత విధించింది. ఈ నేపథ్యంలో గ్రామాలకు ఎలాంటి కోత లేకుండా నిధులు అందించడంతో పాటు నిరాటంకంగా అభివృద్ధి కొనసాగేందుకు తొలిసారిగా బడ్జెట్‌ను కేటాయించారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో మరణించిన వారికి సగౌరవంగా అంతిమ సంస్కారాలు చేసేందుకు వీలుగా ఇప్పటికే పలు పల్లెల్లో వైకుంఠధామాల నిర్మాణాలు మొదలయ్యాయి. 2021–22 బడ్జెట్లో వైకుంఠధామాల నిర్మాణాల కోసం రూ.200 కోట్లు ప్రతిపాదించారు. వడ్డీలేని రుణాలకు రూ.3 వేల కోట్లు.. బడ్జెట్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.3 వేల కోట్ల మేర భారీ మొత్తాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం అంది స్తున్న సహకారంతో ఈ çస్వయం సహాయక సంఘాలు వృద్ధి చెందడంతోపాటు, వారిలో పొదుపు చైతన్యం సైతం వెల్లివిరుస్తోంది. రాష్ట్రంలో 4,29,262 స్వయం సహాయక సంఘాలుండగా, వాటిలో 46,65,443 మంది సభ్యులున్నారు. వీరంతా పొదుపు చేసుకుంటూ బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు పొంది, క్రమం తప్పకుండా తిరిగి చెల్లింపులు చేస్తుండటంతో వారి పరపతి గణనీయంగా పెరిగింది. 2020–21లో మహిళా సంఘాల సభ్యులకు రూ.9,803 కోట్ల రుణాలు వడ్డీలు లేకుండా అందించగా, రుణాల రికవరీ రేటు 97.25 శాతంగా నిలుస్తోంది. త్వరితంగా పూర్తి చేసేందుకు వీలుంటుంది. -
తెలంగాణ బడ్జెట్: కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్రేటర్ సిటీజన్లకు కొంత మోదం.. కొంత ఖేదం కలిగించింది. తాగునీటి పథకాలకు నిధుల వరద పారించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. కృష్ణా మూడుదశల ప్రాజెక్టుల నీటిని గ్రేటర్‌కు తరలించేందుకు ఉద్దేశించిన సుంకిశాల జాక్వెల్ పథకం, కేశవాపూర్ భారీ స్టోరేజీ రిజర్వాయర్ నిర్మాణం, ఔటర్ చుట్టూ వాటర్ గ్రిడ్ ఏర్పాటు, సీవరేజ్ మాస్టర్‌ప్లాన్ అమలుకు భారీగా నిధులు దక్కడం విశేషం. మూసీ సుందర స్వప్నాన్ని సాకారం చేసేందుకు భారీగా నిధులు దక్కాయి. అదే క్రమంలో సిటీలో తీరైన రహదారుల విస్తరణ పథకాలతోపాటు ఏటా వర్షాకాలంలో నగరాన్ని ముంచెత్తుతున్న వరద నీరు సాఫీగా ప్రవహించేందుకు అవసరమైన నాలాల విస్తరణ పథకాలకు నిధులు కేటాయించకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. బల్దియాకు సర్కారు వరుసగా మూడోసారి శూన్యహస్తమే చూపించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నగరంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుపేదల ఆశలపై ఈ బడ్జెట్ నీళ్లు చల్లిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పథకాలకు కేవలం రూ.10 లక్షల నిధులే దక్కడం నిరాశపరిచింది. ఈ సంస్థకు జైకా రుణ వాయిదాల చెల్లింపునకు రూ.472 కోట్లు మాత్రమే దక్కాయి. హెచ్ఎండీఏ ప్రతిపాదించిన బాలానగర్ ఫ్లైఓవర్, పలు చోట్ల ప్రతిపాదించిన ఆకాశ మార్గాలకు నిధులు దక్కలేదు. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు నిధులు దక్కకపోవడం గమనార్హం. గ్రేటర్లో ప్రజా రవాణా రంగాన్ని పరిపుష్టం చేసేందుకు సంతృప్తికర స్థాయిలో నిధులు కేటాయించారు. గ్రేటర్ ఆర్టీసీ పరిధిలో 25 డబుల్ డెక్కర్ బస్సులు.. మరో 50 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో సిటీ రహదారులపై దూసుకెళ్లనున్నాయి. ఎంఎంటీఎస్ రెండో దశకు యథావిధిగా ప్రభుత్వం శూన్యహస్తమే చూపింది. అత్యంత కీలకమైన ప్రజారోగ్య విభాగానికి, సర్కారు దవాఖానాల అభివృద్ధికి నిధులు దక్కకపోవడం పేదలను ఆశ్చర్యపర్చింది. ప్రధానంగా ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం, నిమ్స్ నెఫ్రాలజీ విభాగం, నిలోఫర్, చెస్ట్ ఆస్పత్రుల్లో నూతన భవనాల నిర్మాణం, ఇతర వైద్య సదుపాయాలు, మౌలికవసతుల కల్పనకు నిధుల కేటాయింపులు దక్కకపోవడం గమనార్హం. జలమండలికి రూ.2,381 కోట్ల కేటాయింపులు రాష్ట్ర బడ్జెట్లో జలమండలికి నిధుల ధార పారింది. కీలక పథకాలకు భారీగా కేటాయింపులు దక్కాయి. ప్రధానంగా కృష్ణా మూడు దశల ప్రాజెక్టుల ద్వారా గ్రేటర్‌కు తాగునీటిని తరలించేందుకు అవసరమైన అత్యంత లోతైన జాక్‌వెల్స్ ఏర్పాటుకు ఉద్దేశించిన సుంకిశాల పథకానికి రూ.725 కోట్ల మేర కేటాయింపులు దక్కాయి. ఈ ప్రాజెక్టుకు రూ.1450 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి జలమండలి ఇటీవల నివేదించిన విషయం విదితమే. శామీర్‌పేట్ సమీపంలోని కేశవాపూర్ వద్ద 5 టీఎంసీల గోదావరి జలాల నిల్వ సామర్థ్యంతో నిర్మించనున్న భారీ స్టోరేజీ రిజర్వాయర్ నిర్మాణంతో పాటు, నగరంలో మురుగునీటి శుద్ధికి పది ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణం, ఔటర్ చుట్టూ సుమారు 158 కి.మీ మార్గంలో ఏర్పాటు చేయనున్న జలహారం (వాటర్‌గ్రిడ్) పనులకు మరో రూ.668 కోట్లు కేటాయించారు. గతంలో కృష్ణా రెండు, మూడో దశల ప్రాజెక్టులతో పాటు గోదావరి మంచినీటి పథకానికి సంబంధించి వివిధ ఆర్థిక సంస్థల నుంచి జలమండలి తీసుకున్న రుణ వాయిదాల చెల్లింపునకు రూ.738 కోట్లు కేటాయించారు. నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటిసరఫరా పథకం అమలుకు రూ.250 కోట్లు కేటాయించడం విశేషం. గత ఏడాది జలమండలికి కేవలం రూ.1250 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో సింహభాగం బోర్డు రుణ వాయిదాలు, వడ్డీ చెల్లింపులకే కనాకష్టంగా సరిపోవడం గమనార్హం. తాజా బడ్జెట్లో జలమండలి కీలక పథకాలకు భారీగా నిధులు దక్కడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ‘సుంకిశాల’ ఎందుకంటే.. ⇔ నగరానికి కృష్ణా మూడు దశల ప్రాజెక్టుల ద్వారా నిత్యం 270 మిలియన్ గ్యాలన్ల నీటి తరలింపునకు ప్రస్తుతం నాగార్జున సాగర్‌కు సమీపంలో భారీ నీటిపారుదల శాఖ నిర్వహిస్తున్న పుట్టంగండి పంప్‌హౌజ్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు. ⇔ వేసవిలో నాగార్జున సాగర్‌లో నీటి మట్టాలు 510 అడుగుల దిగువనకు చేరినపుడు అత్యవసర పంపింగ్ ద్వారా కోదండాపూర్ నీటిశుద్ధి కేంద్రానికి కృష్ణా జలాలను తరలించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు లేకపోవడంతో ప్రతీ వేసవిలో సాగర్ బ్యాక్‌వాటర్ వద్ద డ్రెడ్జింగ్ పక్రియను చేపట్టడం, భారీ మోటార్లు ఏర్పాటు చేసి పంపింగ్ చేయాల్సి వస్తోంది. ⇔ ఈ నేపథ్యంలో కృష్ణా మూడు దశల నీటిని అత్యంత లోతు నుంచి కూడా సులువుగా తోడేందుకు భారీ జాక్‌వెల్స్ నిర్మాణం చేసుకోవాలని ఇరిగేషన్ శాఖ జలమండలికి సూచించింది. దీంతో ముంబైకి చెందిన టాటా కన్సల్టెన్సీ బృందాన్ని జలమండలి రంగంలోకి దించింది. ఈ బృందం సుంకిశాల పథకం పూర్తి చేసేందుకు రూ.1450 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది. తాజా బడ్జెట్లో ప్రభుత్వం ఈ పథకానికి రూ.725 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో అండర్ గ్రౌండ్ షాప్ట్, ఇన్‌టేక్ టన్నెల్, పంప్ హౌజ్ సూపర్ స్ట్రక్చర్, ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్, సుంకిశాల నుంచి కోదండాపూర్ నీటి శుద్ధి కేంద్రం వరకు భారీ పైప్‌లైన్ ఏర్పాటుకు ఈ నిధులను వెచ్చించనున్నట్లు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్, ఈడీ సత్యనారాయణలు తెలిపారు. సుంకిశాల పథకంతో వేసవిలో నగరానికి కృష్ణా జలాల తరలింపు మరింత సులువు కానుందని, అత్యవసర పంపింగ్ కష్టాలు తీరనున్నాయని వారు స్పష్టం చేశారు. -
కరోనాను ఎదిరించి నిలిచాం: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సంక్షోభ సమయంలో కూడా తెలంగాణ పల్లెలు తట్టుకుని నిలబడ్డాయని.. ఇది రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపు ఫలితమని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కొన్నేళ్లుగా బ్రహ్మాండమైన ఉపాధి అవకాశాలు కల్పించిన వాణిజ్య సేవలు, సమాచార, సాంకేతిక, స్థిరాస్తి నిర్మాణ రంగాలు కరోనా కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాయని.. కరోనా ప్రభావాన్ని తట్టుకొని నిలబడిన ఒకే ఒక్క రంగం వ్యవసాయమని చెప్పారు. కష్టకాలంలోనూ తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్ధి క్రియాశీలకంగా ఉందని.. గత ప్రభుత్వాలు దండగ అని ఈసడించిన వ్యవసాయమే నేడు కరోనాను తట్టుకుని అభివృద్ధి సాధించిందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో తీసుకున్న ఉద్దీపన చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22) బడ్జెట్ అంచనాలను హరీశ్‌రావు గురువారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.2,30,825.96 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ.29,046.77 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.6,743.50 కోట్లు, ఆర్థిక లోటు రూ.45,509.60 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎన్నో సమస్యలు, సవాళ్లు, ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయని, వాటన్నింటినీ చాకచక్యంగా అధిగమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు నడిచిందని హరీశ్‌రావు చెప్పారు. రాష్ట్రం అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కిందని, సంక్షేమంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని పేర్కొన్నారు. ప్రజల నుంచి గొప్ప సహకారం, అండదండలు లభించాయన్నారు. దేశ ఆదాయం తగ్గిన పరిస్థితుల్లో కూడా తెలంగాణ ఆదాయం పెరిగిందని.. నేడు తెలంగాణ ఒక ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతోందని స్పష్టం చేశారు. ముందుచూపుతోనే బయటపడ్డాం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అన్ని రంగాలవారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు ఇప్పుడు కరో నా కష్టకాలంలో కలిసి వచ్చాయని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. శాఖల వారీగా కేటాయింపులు, ఇంతకాలం ప్రభుత్వం చేసిన కృషితో ఆయా శాఖ ల్లో జరిగిన పురోగతి వివరాలను అంకెలతో సభ ముందుంచారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఇంటా, బయటా మన్ననలు పొందుతోంది. ఏడేళ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రం.. ఏడు పదుల వయసున్న రాష్ట్రాలతో పోటీపడుతూ అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచింది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. ముందస్తు అంచనాల ప్రకారం.. 2020–21లో స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) ప్రస్తుత ధరల ప్రకారం రూ.9,78,373 కోట్లుగా ఉంటుం దని అంచనా. లాక్డౌన్ కారణంగా 2019–20లో జీఎస్డీపీ 13.5 శాతం నుంచి 1.3 శాతానికి తగ్గింది. జాతీయ జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతం నుంచి మైనస్ 3.8 శాతానికి పడిపోయింది. జీడీపీ వృద్ధి రేటుతో పోలిస్తే రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు మెరుగ్గా ఉంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం వల్ల కరోనా సంక్షోభం చుట్టుముట్టినా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తట్టుకొని నిలబడింది. మెరుగైన విద్యుత్ సరఫరా, పెరిగిన సాగునీటి వసతి, రైతుబంధు, గొర్రెల పంపిణీ, చేపల పెంపకాన్ని విస్తృతం చేయటంతోపాటు పలు సంక్షేమ కార్యక్రమాల అమలు ద్వారా 2020– 21లో ప్రాథమిక రంగం అంచనాలో 17.7 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది’’అని వివరించారు. తలసరి ఆదాయం పెరిగింది రాష్ట్ర తలసరి ఆదాయం 2020–21 సంవత్సరానికి రూ.2,27,145గా ఉంటుందని కేంద్ర గణాంక శాఖ అంచనా వేసిందని.. ఇది గతేడాది కంటే +0.6 శాతం ఎక్కువని హరీశ్‌రావు తెలిపారు. దేశ తలసరి ఆదాయం 2020–21కి రూ.1,27,768గా ఉంటుందని అంచనా వేశారని.. ఇది ముందటి ఏడాది కంటే 4.8 శాతం తక్కువ అని స్పష్టం చేశారు. తెలంగాణ తలసరి ఆదాయం దేశ సగటుతో పోలిస్తే ఏకంగా రూ.99,377 అధికంగా ఉందని తెలిపారు. అయితే కరోనా వల్ల ఆర్థిక రంగం పెద్ద కుదుపునకు లోనయిందని, దాన్ని అధిగమించేందుకు పకడ్బందీ ప్రణాళికతో రాష్ట్రం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం రాష్ట్ర జీఎస్డీపీలో మంచి వృద్ధి ఉంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. భూ పరిపాలనలో సంస్కరణలు తెచ్చాం భూ పరిపాలనలో తెలంగాణ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని హరీశ్‌రావు చెప్పారు. ఎన్నడూ లేనట్టుగా భూరికార్డుల ప్రక్షాళనను ప్రారంభించామని, 95 శాతం భూముల యాజమాన్య హక్కులపై స్పష్టత వచ్చిందని వివరించారు. రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందాయని.. వివరాలు స్పష్టంగా ఉండటంతో 60 లక్షల మంది రైతులకు ఏ ఇబ్బందీ లేకుండా రైతుబంధు అందించగలుగుతున్నామని తెలిపారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై దృష్టి తెలంగాణ నుంచి బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన కార్మికులను సానుభూతితో ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని హరీశ్‌రావు చెప్పారు. ఆ దిశగా కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయడానికి ప్రత్యేక బృందం పర్యటించి వచ్చిందన్నారు. ఇక కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తున్న పోలీసులు, వైద్యులు, పారిశుధ్య కార్మికులకు ప్రోత్సాహకంగా రూ.235 కోట్లు ఇచ్చామన్నారు. జర్నలిస్టులు, న్యాయవాదులకూ సాయం అందించామని తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర ఆదాయం తగ్గకుండా ఉండేలా కృషి చేసిన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు–రిజిష్ట్రేషన్లు, రవాణా, గనుల శాఖల అధికారులను మంత్రి అభినందిం చారు. అసెంబ్లీలో హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. మండలిలో మంత్రి వేముల సమర్పించారు. మొదలు.. ముగింపు.. దాశరథి మాటలతోనే.. సాధారణంగా బడ్జెట్ ప్రసంగాల్లో ప్రముఖుల మాటలు, చలోక్తులు ప్రస్తావిస్తుంటారు. హరీశ్‌రావు కూడా తాజా బడ్జెట్ ప్రసంగంలో మహాకవి దాశరథి చెప్పిన మాటలను ఉటంకించారు. దాశరథి మాటలతోనే ప్రసంగాన్ని ప్రారంభించి, ఆయన మాటలతోనే ముగించారు. ‘‘ఏదీ సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము’అని మహాకవి దాశరథి అన్నట్టు ఈ అద్భుతమైన రాష్ట్ర ప్రగతి కూడా అంత సులభంగా సాధ్యం కాలేదు. రాష్ట్రం ఏర్పడినప్పటి అస్పష్ట, గందరగోళ పరిస్థితులను ఛేదిస్తూ.. ఆదాయ, వ్యయాలను ఆకళింపు చేసుకుంటూ, నూతన రాష్ట్రానికి తగిన విధానాలతో వడివడిగా అడుగులు వేశాం..’’అని ప్రసంగం మొదట్లోనే హరీశ్‌రావు అన్నారు. ‘‘ధ్యేయాన్ని బట్టి ప్రతి పనీ దివ్యమగును’’అన్న దాశరథి మాటలను మేం ఆచరణలో పెడుతున్నాం. మా ధ్యేయం సకల జనుల సంక్షేమం, మా లక్ష్యం ప్రజల బతుకులు పండించే బంగారు తెలంగాణం. అట్టడుగున ఆఖరి వ్యక్తి దాకా ప్రగతి ఫలాలను అందిద్దాం. ప్రజలే చరిత్ర నిర్మాతలన్న విశ్వాసంతో మున్ముందుకు పురోగమిద్దాం. ప్రజలు కేంద్రంగా తెలంగాణ ప్రస్థానం కొనసాగుతుంది’అంటూ ప్రసంగాన్ని ముగించారు. రైతుల హృదయాల్లో సంతోషం నింపాం ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్ర చరిత్రలో ఓ అపురూప ఘట్టం. మేడిగడ్డ వద్ద సముద్రమట్టానికి వంద మీటర్ల ఎత్తులో ప్రవహించే గోదావరి నీటిని.. 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండ పోచమ్మ సాగర్ లోకి తీసుకువచ్చిన అద్భుత సన్నివేశానికి మనమంతా సాక్షులుగా నిలిచాం. రిజర్వాయర్లను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేశాం. యాసంగి పంటలకు నీళ్లిచ్చి రైతుల హృదయాల్లో సంతోషాన్ని నింపాం. ఇవాళ ఈ ప్రాజెక్టుల నీరందుతున్న ఏ ఊరికి పోయినా మా చెరువు నిండింది, మా కాల్వ పారింది, మా పొలం పండిందని సం బురంగా చెబుతున్నారు. మరింతగా సాగునీ టి సదుపాయాన్ని పెంచేందుకు ఈ బడ్జెట్లో రూ. 16,931 కోట్లు కేటాయిస్తున్నాం.’’ కేసీఆర్ అప్పుడు పాట రాశారు.. ఇప్పుడా కష్టాలు తీర్చారు ‘‘చూడు చూడు నల్లగొండ.. గుండె మీద ఫ్లోరైడు బండ. బొక్కలొంకరపోయిన బతుకులా మన నల్లగొండ. దుక్కమెల్లదీసేదెన్నాళ్లు..’.. ఇది నల్లగొండ తాగునీటి కష్టాలను చూసి కేసీఆర్ స్వయంగా రాసిన పాట. ఆయనే ఇప్పుడు ఫ్లోరైడ్ పీడను శాశ్వతంగా తొలగించి నల్లగొండ కష్టాలు తీర్చారు. నల్లగొండ ఫ్లోరైడ్ పీడ అంతమైందని, కొత్తగా ఎవరూ ఫ్లోరోసిస్ బారిన పడటం లేదని కేంద్రం పార్లమెంటు వేదికగా ప్రకటించింది. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర జల్ జీవన్ మిషన్ అధికారికంగా ప్రకటించింది.’’ -
తెలంగాణ 2021-22 బడ్జెట్ హైలైట్స్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021-22 ఏడాదికి సంబంధించి రూ. 2,30,825.96 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1,69,383.44 కోట్లు.. ఆర్థిక లోటు అంచనా రూ. 45,509.60 కోట్లు.. పెట్టుబడి వ్యయం రూ. 29,046.77 కోట్లు.. రెవెన్యూ మిగులు రూ. 6,743.50 కోట్లుగా ఉంది. కాగా బడ్జెట్ ప్రసంగం అనంతరం శాసనసభ శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాగా బడ్జెట్లో కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి. ►2020-21 జీఎస్డీపీ అంచనా రూ.9,78,373 కోట్లు.. తలసరి ఆదాయం అంచనా రూ.2,27,145 కోట్లు ►సీఎం దళిత్ ఎంపవర్మెంట్కు రూ. వెయ్యి కోట్లు.. మూసీ సుందరీకరణకు రూ.200 కోట్లు.. హైదరాబాద్‌లో ఉచిత నీటి సరఫరాకు రూ.250 కోట్లు.. ఎయిర్‌స్ట్రిప్ నిర్మాణానికి రూ. 100 కోట్లు ►మెట్రో రైలు కోసం రూ. 1000 కోట్లు.. పురపాలక, పట్టణాభివృద్ధి అభివృద్ధి కోసం రూ.15, 030 కోట్లు ►వైద్య ఆరోగ్య శాఖ కోసం రూ.6295 కోట్లు ►పాఠశాల విద్య కోసం రూ.11,735 కోట్లు.. ఉన్నత విద్య కోసం రూ.1873 కోట్లు.. రూ.4 వేల కోట్లతో సరికొత్త విద్యా పథకం ►విద్యుత్ రంగానికి 11, 046 కోట్లు.. పరిశ్రమ శాఖ కు రూ.3077 కోట్లు.. ► ఐటీ రంగానికి రూ. 360 కోట్లు .. దేవాదాయ శాఖకు రూ. 720 కోట్లు.. హోమ్ శాఖకు రూ.6465 కోట్లు ► ఆర్ అండ్ బీ కి రూ. 8,788 కోట్లు.. రీజనల్ రింగ్ రోడ్డు భూ సేకరణ కోసం రూ.750 కోట్లు ►పౌర సరఫరాల శాఖకు రూ.2, 363 కోట్లు ►చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.338 కోట్లు.. బీసీ కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు.. గీత కార్మికుల సంక్షేమానికి రూ.25 కోట్లు.. సాంస్కృతిక పర్యాటక రంగానికి 726 కోట్లు ►స్త్రీ, శిశు సంక్షేమానికి రూ.1502 కోట్లు.. మైనార్టీల సంక్షేమానికి రూ.1606 కోట్లు ►డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.11వేల కోట్లు ► పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.29,271 కోట్లు ► సాగునీటి రంగానికి రూ.16,931 కోట్లు ► ఆసరా పింఛన్లకు రూ.11,728 కోట్లు.. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలకు రూ.2,750 కోట్లు ► రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయరంగానికి పెద్దపీట వేసింది. ఈ సారి బడ్జెట్లో ఆ రంగానికి దాదాపు రూ. 25వేల కోట్లు కేటాయించింది. ఈసారి బడ్జెట్లో రైతు బంధు కోసం రూ. 14, 800 కోట్లు కేటాయించగా.. రైతు రుణమాఫీ కోసం రూ. 5, 225కోట్లు.. రైతు బీమా కోసం రూ. 1200 కోట్లు కేటాయించింది. ►రీజనల్ రింగ్‌రోడ్డు భూ సేకరణకు రూ.750 కోట్లు.. నూతన సచివాలయం నిర్మాణానికి రూ.610 కోట్లు.. పశు సంవర్ధక, మత్స్య శాఖకు 1730 కోట్లు ►దేవాదాయశాఖకు రూ.720 కోట్లు.. అటవీ శాఖకు రూ.1,276 కోట్లు.. ఆర్టీసీకి రూ.1500 కోట్లు కేటాయింపు ► 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ. 2,30, 825.96 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1, 69, 383.44 కోట్లు.. క్యాపిటల్ వ్యయం రూ. 29, 046.77 కోట్లు.. రెవెన్యూ మిగులు రూ. 6, 743.50 కోట్లు.. ఆర్థిక లోటు రూ. 45, 509.60 కోట్లుగా ఉంది. ► శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి హరీష్‌రావు. ఆర్థిక శాఖ మంత్రిగా హరీష్ శాసనసభలో రెండోసారి బడ్జెట్‌ను విజయవంతంగా ప్రవేశపెట్టారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. అన్ని వర్గాల ఆకాంక్షలకు తగ్గట్టుగా బడ్జెట్ ఉంటుందని ఆయన ఆకాంక్షించారు. ►జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల ఆశలకు అనుగుణంగానే బడ్జెట్ ఉంటుందని ఆయన తెలిపారు. అనంతరం బడ్జెట్ ప్రతులతో హరీష్ రావు అసెంబ్లీకి చేరుకున్నారు. సాక్షి, హైదరాబాద్: 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల కోట్ల అంచనా వ్యయంతో వార్షిక బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఉదయం 11:30 గంటలకు ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుండగా.. మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి వి.ప్రశాంత్‌రెడ్డిలు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమం, అభివృద్ధి ప్రధానాంశాలుగా, ప్రస్తుతం అమల్లో అన్ని సంక్షేమ పథకాలు యథాతథంగా కొనసాగేలా ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలుంటాయని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి రంగాలకు అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. అలాగే రైతుబంధు, పెన్షన్లు, రుణమాఫీకి భారీగా నిధులు కేటాయించనుంది. దీంతోపాటు ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీకి సంబంధించి నిధుల ప్రతిపాదన బడ్జెట్ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
బడ్జెట్ సమావేశాలు: 74 ఏళ్లలో ఇదే ప్రథమం..
న్యూఢిల్లీ: మరి కొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్‌గా ఉండనుండటం మాత్రం ఖాయం. అవును మరి కోవిడ్ దేశ ఆర్థిక వ్యవస్థని దారుణంగా దెబ్బ తీసింది. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్థిక వ్యవస్థకి బడ్జెట్ కేటాయింపులతో బూస్ట్ ఇస్తారా.. లేక మరింత డీలా పడేలా చేస్తారానే విషయం మరి కొద్ది రోజుల్లో తేలనుంది. ఇక ఈ ఏడాది బడ్జెట్ రూపం, కేటాయింపులు సరికొత్తగా ఉండనుండటం మాత్రం వాస్తవం. ఈ సారి ప్రారంభం కానున్న బడ్జెట్ ప్రక్రియ దాదాపు 70 ఏళ్ల సంప్రదాయనికి ముగింపు పలకనుంది. అవును బడ్జెట్ సమావేశాలు ప్రారంభైన 74 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ ఏడాది బడ్జెట్ కాపీలను ప్రింట్ చేయడం లేదు. నవంబర్ 26, 1947 తరువాత మొదటిసారి ఈ ఏడాది బడ్జెట్ కాపీల ప్రింటింగ్‌ని నిలిపివేయనున్నారు. నార్త్ బ్లాక్‌లోని ఇళ్లని బడ్జెట్ ప్రింటింగ్ కోసం వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. ఇక డాక్యుమెంట్లు ముద్రించి, సీల్ చేసి.. బయటకు పంపే వరకు అధికారులంతా ఇంటికి, కుటుంబానికి దూరంగా ఇక్కడే ఉంటారు. (చదవండి: ఈ దఫా ‘నెవ్వర్ బిఫోర్’ బడ్జెట్) అయితే ప్రస్తుతం కోవిడ్-19 భయాలు.. కొత్త స్ట్రెయిన్ కలకలంతో బడ్జెట్ కాపీలను ప్రింట్ చేయడం లేదని అధికారులు తెలిపారు. అంతేకాక ప్రతి ఏటా బడ్జెట్ కాపీ ప్రింటింగ్ సమయంలో నిర్వహించే హల్వా వేడుకకు కూడా ఈ ఏడాది బ్రేక్ ఇవ్వనున్నారని తెలిసింది. ఇక ఈ ఏడాది బడ్జెట్ కాపీలను డిజిటల్ రూపంలో అందిస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సారి పార్లమెంట్‌లోని 750 మంది సభ్యులకు బడ్జెట్, ఎకానమిక్ సర్వే డిజిటల్ కాపీలను అందించనున్నారు. కరోనా మూలంగా 2020-2021 ఏడాదిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిలో పేపర్‌లెస్ బడ్జెట్ సమావేశాలు ఒకటి. రికార్డులను డిజిటలైజ్ చేయాలని పార్లమెంట్ ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. ఇక కరోనా మూలంగా అది ఆచరణ సాధ్యం అయ్యింది. బడ్జెట్‌తో పాటు మిగతా ప్రతులను కూడా డిజిటలైజ్ చేస్తే బాగుంటుందని అధికారలు భావిస్తున్నారు. -
16 నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఏపీ శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు ఈనెల 16న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఉభయసభలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. ఈ మేరకు శాసనసభ, శాసనమండలి సచివాలయ కార్యదర్శి గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం ఆనవాయితీ. అందుకే అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులు బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు శాసనసభలోనే సమావేశమవడం రివాజు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రెండు సభల సభ్యులు ఒకే ప్రాంగణంలో సమావేశమైతే భౌతిక దూరం పాటించడం వీలు కాదు. అందువల్ల కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా భౌతిక దూరం పాటిస్తూ సమావేశాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీలు మండలిలోనూ, ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనూ సమావేశమయ్యేలా ప్రణాళిక రూపొందించారు.