హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. సంక్షేమ పద్దులపై తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదంటూ ఆరోపించాయి. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సభలో పలు పద్దులపై చర్చలు కొనసాగుతున్నాయి.
సోమవారం మధ్యాహ్నం గృహనిర్మాణం, వివిధ సంక్షేమశాఖల పద్దులపై చర్చ జరిగింది. దీనిపై తాము లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేదంటూ అందుకు నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నామంటూ బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, వైఎస్ఆర్ సీపీ పార్టీలు చెప్పాయి. దీనిపై మంత్రి హరీష్రావు స్పందిస్తూ ప్రభుత్వ పనితీరుని చూసి ఓర్వలేకే విపక్షాలు వాకౌట్ చేశాయని విమర్శించారు.
తెలంగాణ ప్రతిపక్షాలు వాకౌట్
Published Mon, Mar 21 2016 5:56 PM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM
Advertisement