Oppositions
-
సైఫ్‌పై దాడి.. ఘాటుగా స్పందించిన సీఎం ఫడ్నవిస్
నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటన గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అన్ని వివరాలను ఎప్పటికప్పుడు పోలీసులు వెల్లడిస్తున్నారని చెప్పారు. అయితే.. ఈ ఘటన ఆధారంగా ప్రతిపక్షాలు చేస్తున్న తీవ్ర విమర్శలకు ఆయన అంతే ఘాటుగా బదులిచ్చారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయని, వరుసగా ప్రముఖులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ప్రతిపక్షాలు ఫడ్నవిస్ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. మరోవైపు.. ఈ విమర్శలకు సినీ ప్రముఖుల గొంతు కూడా తోడైంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నాం ఎమర్జెన్సీ చిత్ర ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆ చిత్ర నటి కంగనా రనౌత్‌తో మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంలో ఆయన్ని సైఫ్‌పై దాడి గురించి మీడియా ప్రశ్నించింది. దేశంలో ఉన్న మెగాసిటీ(Megacities)ల్లో ముంబై అత్యంత సురక్షితమైన నగరం. నగరంలో ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు జరిగిన మాట వాస్తవం. వాటిని అంతే తీవ్రంగా మేం వాటిని భావించి దర్యాప్తు జరిపిస్తున్నాం. అలాగని.. ఏదో ఒక ఘటనను పట్టుకుని ముంబై ఏమాత్రం సురక్షితం కాదని అనడం సరికాదు. ఇది ముంబై ప్రతిష్టను దెబ్బ తీసే అంశం. ముంబైను మరింత సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది’’ అని అన్నారు. మహారాష్ట్ర హోం శాఖ ప్రస్తుతం ఫడ్నవిస్ వద్దే ఉంది.#WATCH | Mumbai: Maharashtra CM Devendra Fadnavis on the attack on actor Saif Ali Khan says, “Police have provided all the details. What kind of attack this was, the motive behind it, and the intention are all before you.”#SaifAliKhan #DevendraFadnavis #Mumbai pic.twitter.com/L7hGKE8XnE— Organiser Weekly (@eOrganiser) January 16, 2025ముంబై మహానగరంలో అత్యంత విలాసవంతమైన ఏరియాగా బాంద్రాకు ఓ పేరుంది. వీవీఐపీలు ఉండే ఈ ఏరియాలో కట్టుదిట్టమైన పోలీస్ పహారా కనిపిస్తుంటుంది కూడా. అలాంటి ప్రాంతంలో..గత అర్ధరాత్రి అలజడి రేగింది. ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించాడు ఓ దుండగుడు. ఈ క్రమంలో జరిగిన సైఫ్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆయన్ని లీలావతి ఆస్పత్రికి తరలించారు. రెండు కత్తిపోట్లు లోతుగా దిగడం, వెన్నెముకకు దగ్గరగా కత్తికి దిగడంతో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. అయితే ఆయనకు ప్రమాదం తప్పిందని, రెండ్రోజుల తర్వాత డిశ్చార్జి చేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదంలో సైఫ్‌తో పాటు ఆయన ఇంట్లో పని చేసే మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమెకు చికిత్స అందించి వైద్యులు ఇంటింకి పంపించేశారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాంద్రా(Bandra Police) పోలీసులు.. నిందితుడిని దాదాపుగా గుర్తించినట్లు తెలుస్తోంది. అతన్ని పట్టుకునేందుకు ఏడు బృందాలను రంగంలోకి దింపాయి.ఊహాజనిత కథనాలొద్దుఈ ఘటనపై మీడియా, అభిమానులు సంయమనం పాటించాలని సైఫ్ టీం కోరుతోంది. ‘‘సైఫ్ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ఈ క్రమంలో ఆయనపై దాడి జరిగింది. సైఫ్ భార్య కరీనా కపూర్, ఇతర కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారు. ఆయనకు గాయాలయ్యాయి. శస్త్రచికిత్స జరిగి ఆయన కోలుకుంటున్నారు. కాబట్టి.. అంతా సంయమనం పాటించాలి. కల్పిత కథనాలు రాయొద్దు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు అందించే సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాం’’ అని ఆయన టీం తెలిపింది. -
వాళ్లకేం పని లేదు.. CAAను వెనక్కి తీసుకోం: అమిత్ షా
ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో సీఏఏను వెనక్కి తీసుకోమని స్పష్టం చేశారాయన. ‘ప్రతిపక్షాలకు ఏ పనీ లేదు. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్‌ను కూడా స్వార్థ రాజకీయాల కోసం చేసినట్లు వారు విమర్శిస్తుంటారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకూడదా?. ఆర్టికల్ 370 రద్దును కూడా రాజకీయ లబ్ధి కోసం చేసినట్లు ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. వాళ్ల చరిత్ర అంతా చెప్పింది చేయకపోవడమే.. కానీ మోదీ ఇచ్చిన ప్రతి గ్యారంటీని సాకారం చేశారు’ అని అమిత్ షా తెలిపారు. ‘‘రాజ్యాంగం ప్రకారం ఏ దేశ ముస్లింలైనా భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్లలో పీడనకు గురైన ముస్లిమేతర మైనారిటీల కోసం ఉద్దేశించినది. ముస్లింలు ఈ దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేయకుండా ఈ చట్టం నిషేధించదు. దీని గురించి నేను చాలా వేదికలపై మాట్లాడాను. ఏ పౌరుడి హక్కులను ఈ చట్టం తొలగించదు. అందువల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు’’ అని అమిత్ షా వెల్లడించారు. ఆశ్రయం కోరి వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పించడమనేది మన సార్వభౌమ నిర్ణయమని, దానిపై రాజీపడేది లేదు. పౌరసత్వం కోసం అందరికీ తలుపులు తెరిచే ఉన్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని వాళ్లు చేస్తున్న వాదనలో ఎలాంటి వాస్తవం లేదు. అది ఆర్టికల్ 14కు ఎలాంటి భంగం కలిగించదు. అలాగే.. NRC(జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)తో సీఏఏకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చారాయన.. చట్టం అమలు కేంద్రం అంశం.. సీఏఏను తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు చేసిన వ్యాఖ్యలను షా తప్పుబట్టారు. ‘‘ఇది కేంద్రానికి సంబంధించిన అంశం. రాష్ట్రాలది కాదు. ఎన్నికల తర్వాత అందరూ దీనికి సహకరిస్తే మంచిది. బుజ్జగింపు రాజకీయాల కోసం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దు’’ అని షా గట్టిగా చెప్పారు. సీఏఏపై ఆందోళనలు ఉద్ధృతమైతే చట్టం అమలుపై పునరాలోచనలు చేస్తారా? అన్న ప్రశ్నకు అమిత్ షా స్పందిస్తూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘‘తాము అధికారంలోకి వస్తే చట్టాన్ని ఉపసంహరిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కానీ, వారు ఎన్నటికీ అధికారంలోకి రాలేరని ఇండియా కూటమికి కూడా తెలుసు. ఈ చట్టాన్ని మోదీ సర్కారు తీసుకొచ్చింది. దీన్ని రద్దు చేయడం అసాధ్యం. దీనిపై మేం దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తాం’’ అని స్పష్టం చేశారు. ‘‘ఈ చట్టంతో బీజేపీ కొత్త ఓటు బ్యాంకు సృష్టించుకుంటోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వారికి ఏం పనిలేదు. వాళ్లు చెప్పింది ఎన్నడూ చేయరు. ఒవైసీ, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, మమతా బెనర్జీ లాంటి వాళ్లు అసత్య రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల కోసం సీఏఏను ఇప్పుడు అమలు చేయలేదు. 2019లోనే దీన్ని పార్లమెంట్లో ఆమోదించాం. కానీ కొవిడ్, ఇతర కారణాల వల్ల ఆలస్యమైంది. సీఏఏను ఎందుకు వద్దంటున్నారో రాహుల్ గాంధీ బహిరంగంగా చెప్పాలి. మీ వ్యాఖ్యలను రుజువు చేసుకునే బాధ్యత మీదే. ఈ చట్టాన్ని ఎందుకు తెచ్చామో మేం స్పష్టంగా చెప్పాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మీరూ వివరణ ఇవ్వండి’’ అని అమిత్ షా సవాల్ చేశారు. సీఏఏపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలనూ షా దుయ్యబట్టారు. ‘‘అవినీతి బయటపడిన తర్వాత ఆయన సహనం కోల్పోయారు. వలసలపై అంత ఆందోళన ఉంటే.. బంగ్లాదేశీ చొరబాట్లు, రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడలేదు?విభజన రోజులను ఆయన మర్చిపోయినట్లున్నారు’’ అని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్లో త్వరలోనే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు అక్రమ చొరబాట్లను అడ్డుకుంటామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. -
ఇండియా కూటమి ఎన్నికల భేరి
పట్నా: ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు బిహార్ రాజధాని పట్నా వేదికగా ఎన్నికల ప్రచార నగారా మోగించారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలో ఆదివారం జరిగిన ‘జన్ విశ్వాస్ మహా ర్యాలీ’లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తదిపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే ప్రసంగిస్తూ..రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గరిష్టంగా సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలను ఉసి గొల్పుతూ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. వాటిని చూసి తాము భయపడటం లేదని చెప్పారు. దేశ సంపదను, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. కేవలం ఇద్దరు, ముగ్గురు బడా పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలను కాపాడుతున్న మోదీ ప్రభుత్వం, దేశ జనాభాలో 73 శాతం మేర ఉన్న వెనుకబడిన వర్గాలు, దళితులను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్ ప్రసంగిస్తూ.. ఇటీవల తమను వదిలేసి ఎన్డీఏ పక్షంలో చేరిన సీఎం నితీశ్‌పై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల కోసం సిద్ధం కావాలంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ‘కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేలా మీలో నైతిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు నేను ఇక్కడే ఉంటాను’అని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ..యూపీ, బిహార్లలో కలిపి 120 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీని ఓడిస్తే కేంద్రంలో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. వామపక్ష పార్టీల నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా, దీపాంకర్ భట్టాచార్య కూడా ర్యాలీలో ప్రసంగించారు. రైల్వేపై రాహుల్ విమర్శలు కేంద్ర ప్రభుత్వం ధనికులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని రైల్వే విధానాలను రూపొందిస్తోందని రాహుల్ ఆరోపించారు. ప్రధాని మోదీని నమ్మితే నమ్మక ద్రోహం గ్యారెంటీ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘డైనమిక్ ఫేర్ పేరుతో ఏటా 10 శాతం చొప్పున రైలు చార్జీలను ప్రభుత్వం పెంచుతోంది. క్యాన్సిలేషన్ చార్జీలను, ప్లాట్‌ఫాం టిక్కెట్ల ధరలను సైతం పెంచింది’’ అని విమర్శించారు. -
విద్యా సంస్కరణలపై వక్రభాష్యాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యా సంస్కరణలపై రాజకీయ విష ప్రచారం జరుగుతోందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పేదింటి బిడ్డలను అంతర్జాతీయ స్థాయి విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంటే.. ఎల్లో మీడియా, విపక్షాలు విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వక్రభాష్యం పలుకుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. ఎల్లో మీడియా రాతల ఆధారంగా సెలబ్రెటీ పార్టీ (జనసేన) టోఫెల్ శిక్షణపై కాకిలెక్కలతో బహిరంగ లేఖ విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. సచివాలయంలో గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. బైజూస్, టోఫెల్‌పై ఎల్లో మీడియా, ప్రతిపక్షాలు విషం చిమ్ముతున్నాయి. బహిరంగ లేఖ రాసే ముందు కొంచెమైనా వాస్తవా లు ధ్రువీకరించుకోవాలి. దావోస్ పర్యటనలో భాగంగా ఏపీ విద్యా సంస్కరణల్లో సీఎం జగన్ విజన్ నచ్చి.. బైజూస్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఉచితంగా కంటెంట్ అందించేందుకు ముందుకొచ్చింది. బైజూస్ ఒప్పందంలో ఎక్కడా ఆర్థిక లావాదేవీలకు చోటులేదు. ఆ తర్వాత 5.18 లక్షల ట్యాబ్‌లలో బైజూస్ కంటెంట్‌ను ఇన్స్టాల్ చేసి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉచితంగా అందించాం. దీనివల్ల 35 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఒక్కో విద్యార్థికి టోఫెల్ టెస్టు ఫీజు రూ.7.50 మాత్రమే.. విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనతో పాటు ప్రాథమిక స్థాయి నుంచే స్పోకెన్ ఇంగ్లిష్ నైపుణ్యాన్ని పెంచేలా టోఫెల్ పరీక్షలను నిర్వహిస్తున్నాం. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థ ఈటీఎస్ (ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసు)తో ఒప్పందం చేసుకుని ప్రభుత్వ పాఠశాలల్లోని 3–9వ తరగతి విద్యార్థులకు టోఫెల్ ప్రైమరీ, జూనియర్ శిక్షణ ఇస్తున్నాం. ప్రైమరీలో 6.31లక్షలు, జూనియర్లో 14.39లక్షల మంది విద్యార్థులు కలిపి మొత్తం 20.70 లక్షల మందికి శిక్షణ ఇస్తున్నాం. ఒక్కో విద్యార్థికి ఆన్లైన్ టెస్టు ఫీజు కింద కేవలం రూ.7.50 మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇందుకు రూ.1.50 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. ఇందులో అర్హత సాధించిన వారిలో ఆ తర్వాతి దశలో ప్రైమరీ, జూనియర్ విభాగాల్లో 40వేల మంది చొప్పున మాత్రమే ఓరల్ టెస్టు (సర్టిఫికేషన్)కు హాజరవుతారు. వీరికి టోఫెల్, ఏపీ ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేషన్ కోసం రూ.600 చెల్లిస్తాం. ఇందుకు రూ.4.80 కోట్లు వెచ్చిస్తున్నాం. ఈ లెక్కన తొలి ఏడాది రూ.6.35 కోట్లు మాత్రమే టోఫెల్ శిక్షణకు ఖర్చుచేస్తున్నాం. కానీ, ఎల్లో మీడియా, సెలబ్రెటీ పార్టీ మాత్రం ఏ లెక్కన రూ.వెయ్యికోట్లు అవుతుందని రాస్తున్నారో చెప్పాలి. 2027–28 నాటికి రూ.145కోట్లే ఖర్చు.. ఇక విద్యార్థులకు టోఫెల్లో రెండో ఏడాది నుంచి జూనియర్ స్పీకింగ్ టెస్టు ఉంటుంది. ఇందుకు రూ.2, 500 చెల్లిస్తాం. 5వేల విద్యార్థులతో స్పీకింగ్ టెస్టు మొదలుపెట్టి ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్యను పెంచుతాం. ఇంతచేసినా 2027–28 నాటి కి టోఫెల్ శిక్షణకు రూ.145 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. అలాగే, తమ ప్రభుత్వంలో నాణ్యమైన ఇంటరాక్టీవ్ ప్యాన్సల్‌ను రూ.1.25లక్షలకు కొనుగోలు చేయగా.. టీడీపీ హయాంలో రూ.3 లక్షల నుంచి రూ.4లక్షలు వెచ్చించినప్పుడు ఎల్లో మీడియా ఎందుకు మాట్లాడలేదు. 3,295 అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్.. ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపక పోస్టులను భర్తీచేస్తున్నాం. వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో కలిపి మొత్తం 3,295 అధ్యాపక పోస్టులకు సోమవారం నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. డీఎస్సీపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి కోసమే సీఎం జగన్ విశాఖ కేంద్రంగా ఉంటూ పర్యవేక్షించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాయలసీమ అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. వచ్చే ఉగాదికి టీడీపీ, సెలబ్రిటీ పార్టీ రాష్ట్రంలో వాష్ అవుట్ అవడం ఖాయం. ఇక లోకేశ్, పురందేశ్వరి కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసి తమ బాధలు చెప్పుకోవడంలో తప్పేముంది. వాళ్ల కలయిక మా పార్టీకి చర్చనీయాంశం కాదు. -
విపక్షాల తీరుపై ప్రధాని ఆవేదన
-
మోదీకే కాదు INDIAకూ అతిపెద్ద సవాల్
విపక్ష కొత్త కూటమి ఆవిర్భావంతో అధికారంలో ఉన్న ఎన్డీయే National Democratic Alliance కూడా అప్రమత్తమైంది. బెంగుళూరులో జరిగిన కాంగ్రెస్, తదితర ప్రతిపక్షాల కూటమి సమావేశానికి పోటీగా.. ఢిల్లీలో బిజెపి ఆధ్వర్యంలోని NDA కూటమి కూడా భేటీ అయింది. ఈ రెండు కూటములకు హాజరైన నేతలను గమనిస్తే, చూడడానికి విపక్ష కూటమిలో బలమైన నేతలు ఉన్నారు. అదే ఎన్డీయే కూటమిలో ప్రధాని నరేంద్ర మోదీనే అన్నిటింకి కర్త,కర్మ,క్రియగా ఉన్నట్లు కనిపించింది. గత తొమ్మిదేళ్లలో విపక్షం ఈ భేటీతో తొలిసారిగా మోదీకి ఒక సవాలు విసిరిందని చెప్పవచ్చు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఇంతకాలం సర్వేలు చెబుతూ వచ్చాయి. ఇప్పుడు ఇండియా పేరుతో కొత్త కూటమి పూర్థి స్థాయి రూపానికి వస్తే రాజకీయ వాతావరణం కొంత మారే అవకాశం కూడా ఉంది. ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలియన్స్ Indian National Developmental Inclusive Alliance అన్నది పూర్తి పేరు అయినా, ఇండియా మొత్తం బీజేపీ పోరాడబోతోందన్న సంకేతం ఇవ్వడానికి ఇండియా కూటమిగానే ప్రచారం చేస్తారు. అందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇండియాపై యుద్దానికి దిగితే గెలుపెవరిదో అందరికి తెలుసు అని సెంటిమెంట్ డైలాగు వాడారు. కానీ, నితీష్ కుమార్ ఈ పేరును వ్యతిరేకించారట. ఈ కూటమికి ఉండే ప్రధాన సమస్య పార్టీల మద్య వైరుధ్యాలు. అలాగే అందరూ పెద్ద నాయకులు కావడం కాబోలు. వీరిలో ప్రధాని అభ్యర్ధి ఎవరు అన్నది తేలడం కూడా అంత తేలికకాదు. కాంగ్రెస్, తదితర విపక్షాలు అవినీతి పార్టీలని, కుటుంబం కోసం పనిచేసే పార్టీలని, ఎన్డీయే మాత్రం ప్రగతిదాయకమని అని మోదీ వ్యాఖ్యానిస్తే.. దేశ రాజ్యాంగాన్ని బీజేపీ భ్రస్టుపట్టించిందని, రాష్ట్ర ప్రభుత్వాలను దర్యాప్తు సంస్థల ద్వారా వేధిస్తోందని, ప్రత్యర్ధి పార్టీల నేతలపై వాటిని ప్రయోగిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటూ ఇండియా కూటమి పిలుపు ఇస్తోంది. ఇందులో కీలకమైన పాయింట్ ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ప్రధాని పదవిని వదలుకోవడానికి సిద్దం అవడం అని చెప్పాలి. బీజేపీ అధికారంలోకి రాకుండా ఉంటే చాలు అనే గట్టి ధోరణిని కాంగ్రెస్ కనబరుస్తోంది. ✍️ ఎన్డీయే తరపున భేటీ అయిన పార్టీలు పేరుకు 38 అయినా వాటిలో 24 పార్టీలకు ఒక్క ఎమ్.పి కూడా లేరట!. రెండు పార్టీలకు ఇద్దరు ఎమ్.పిలు ఉంటే, ఏడు పార్టీలకు ఒక్క ఎమ్.పి చొప్పునే ఉన్నారట. దానిని మోదీ సమర్ధించుకునే ప్రయత్నం చేసినా, చూసేవారికి అర్ధం అయ్యేదేమిటంటే, అసలు బలం లేని, ఎంపీలు లేని ,చిన్నా,చితక పార్టీలను పోగుచేసి , విపక్ష కూటమి కన్నా తమ వద్దే ఎక్కువ పార్టీలు ఉన్నాయని చెప్పుకోవడానికి ప్రయత్నించినట్లు కనబడుతుంది. కొన్ని పార్టీల పేర్లను గతంలో ఎప్పుడూ విని ఉండకపోవచ్చు. వీటిలో కూడా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన చిన్న పార్టీలు, అలాగే యూపీ, తమిళనాడుకు చెందిన చిన్న పార్టీలు కొన్ని ఉన్నాయి. ఏపీ నుంచి జనసేన హాజరు అయింది.ఆ పార్టీకి ఒక్క ఎమ్.పి కూడా లేరు. అలాగే ఒక్క ఎమ్మెల్యే ఆ పార్టీ పక్షాన గెలిచినా, ప్రస్తుతం ఆ పార్టీలో లేరు. మహారాష్ట్రలో చీలిక వర్గానికి చెందిన ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్.సి.పి చీలికవర్గం మాత్రం ఎన్డీయే సమావేశానికి హాజరయ్యాయి. అదే.. విపక్ష కూటమి సమావేశానికి సోనియా గాంధీ , రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే వంటి కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు, ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, మమత బెనర్జీ, స్టాలిన్ , మహారాష్ట్ర నుంచి శరద్ పవార్, ఉద్దావ్ ఠాక్రే వంటి హేమాహేమీలు హాజరవడం విశేషం. ఒంటరి కేసీఆర్ తెలంగాణ లో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఈ రెండు సమావేశాలలో దేనికి వెళ్లలేదు. కొన్నాళ్లు ఫెడరల్ ప్రంట్ అని, ఆ తర్వాత జాతీయ రాజకీయ పార్టీని స్థాపించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి ప్రధాన ప్రత్యర్ధులుగా ఉండడంతో ఆయన ఎటువైపు మొగ్గలేకపోయారు. కాంగ్రెస్ , బీజేపీయేతర కూటమి కట్టాలన్న ఆయన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆయనను ఇంతకుముందు కలిసిన అఖిలేష్ యాదవ్ కాని, జార్ఖండ్ ముఖ్యమంత్రి సొరేన్ కాని విపక్ష కూటమికే జై కొట్టారు. స్టాలిన్, నితీష్ కుమార్ వంటివారు ఇప్పటికే కాంగ్రెస్ తో జట్టు కట్టారు. దీంతో కేసీఆర్ ఒంటరిగా మిగిలిపోయినట్లయింది. ✍️ 2018 లో ఎన్డీయే నుంచి బయటకు వచ్చి తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా క్రాస్ రోడ్స్ లో నిలబడి ఎదురు చూస్తున్నారు. ఆయన ఎన్.డి.ఎ. కూటమి నుంచి పిలుపు వస్తుందని ఆశించారు కాని అది జరగలేదు. కాకపోతే ఆయన దత్తపుత్రుడుగా పేరుపడ్డ పవన్ కల్యాణ్ ఆ కూటమిలో ఉండడం ద్వారా తన వాయిస్ ను బీజేపీకి చేరవేసే అవకాశం కల్పించుకున్నట్లయింది. ఏపీలో అధికారంలో ఉన్న వైఎఎస్ ఆర్ కాంగ్రెస్ ఎప్పుడూ ఏ కూటమిలో లేదు కనుక ఆ చర్చే రాదు. అలాగే ఒడిషాలో బిజు జనతాదళ్ కూడా స్వతంత్రంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల తర్వాత జాతీయ కూటములు రెండిటిలో దేనికి మెజార్టీ రాకపోతే వైఎస్సార్సీపీ, బీజేడీ, బీఆర్ఎస్ వంటి పార్టీలకు ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంటుంది. ✍️ 2019 నాటికన్నా విపక్షాలు ఈసారి ఒక స్పష్టతతో ముందుకు వచ్చినట్లు కనిపిస్తుంది. అయినా ఆయా పార్టీల మధ్య పరస్పర వైరుధ్యాలు లేకపోలేదు. పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు సీపీఎం, కాంగ్రెస్ లు ప్రత్యర్ధి పార్టీలుగా ఉన్నాయి. కాకపోతే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఏర్పడడంతో వాతావరణం మారింది. వచ్చే ఎన్నికలలో కనుక కాంగ్రెస్, సీపీఎంలు టీఎంసీతో రాజీపడి సీట్ల సర్దుబాటు చేసుకోగలిగితే బిజెపికి ఇప్పుడు ఉన్న లోక్ సభ సీట్లు రావడం కష్టం కావచ్చు. ✍️ బీహారులో రెండు చిన్న పార్టీలను బీజేపీ చేర్చుకున్నా, జేడీయూ, ఆర్జేడీ ,కాంగ్రెస్ కూటమి అత్యధిక సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. డిల్లీ, పంజాబ్ లలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు సర్దుబాటు చేసుకోగలుగుతాయా?అనే సందేహం ఉన్నా.. కలిస్తే మాత్రం బీజేపీకి కొంత సమస్య ఎదురుకావచ్చు. గతసారి కర్నాటకలో జెడిఎస్ ,కాంగ్రెస్ ల ప్రభుత్వం ఉన్నా.. లోక్ సభ ఎన్నికలలో మోడీ హవా బాగా పనిచేసింది. అది అలాగే ఉండాలంటే జెడిఎస్ తో బిజెపి కూటమి కట్టాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి రావడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశం. ఇలా.. వెస్ట్ బెంగాల్, కర్నాటక, తమిళనాడు, పంజాబ్, డిల్లీ జార్కండ్, బీహార్ ,కేరళ, రాజస్తాన్ ,చత్తీస్ గడ్ వంటి విపక్ష పాలిత రాష్ట్రాలలో ఇండియా కూటమి పుంజుకుంటే బిజెపికి దానిని అధిగమించడం పెద్ద సవాలు కావచ్చు. ✍️ కాకపోతే ఈ కూటమి పార్టీలలో ఉండే అంతర్గత వైరుధ్యాలను క్యాష్ చేసుకోవడానికి బిజెపి ప్రయత్నించక మానదు. ఎన్నికల ముందు ఏదైనా సరికొత్త సెంటిమెంట్ ను ముందుకు తీసుకు వస్తుందా? అనే చర్చా నడుస్తోంది కూడా. ప్రత్యేకించి యూనిఫాం సివిల్ కోడ్ ద్వారా మతపరంగా ఓట్ల పోలరైజేషన్ కు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. తెలుగుదేశం, అకాలీదళ్ వంటి పార్టీలను ఎన్.డి.ఎ.లో కలుపుకుంటారా?లేదా? అన్నది అప్పుడే చెప్పలేం. మహారాష్ట్రలో శరద్ పవార్ లేని ఎన్.సిపి అజిత్ పవార్ చీలికవర్గం, ఉద్దావ్ ఠాక్రే లేని శివసేన చీలికవర్గం ఎంతవరకు ప్రజలను ప్రభావితం చేస్తాయన్న సందేహాలు ఉన్నాయి. యూపీ, మధ్యప్రదేశ్, వంటి రాష్ట్రాలు బిజెపికి కీలకంగా మారతాయి. అందుకే.. ఇండియా కూటమికి విజయావకాశాలు ఉన్నాయన్న సంకేతాలు ప్రజలలోకి వెళితే తమకు నష్టం జరుగుతుందని భావించే బిజపి హడావుడిగా పోటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి తమకు అంతకన్నా ఎక్కువ పార్టీల మద్దతు ఉందని చూపించుకునే యత్నం చేసింది. కాంగ్రెస్ నిజంగానే ప్రధాని పదవిని వదలుకుంటే నితీష్ కుమార్ లేదా మమత బెనర్జీ వంటివారు ప్రదాని పదవి రేసులోకి వచ్చే అవకాశం ఉంది. ఇండియా కూటమి ఒక ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోబోతోంది. బిజెపికి ఇంతకాలం డివైడెడ్ అప్పోజిషన్ కలిసి వచ్చింది. ఈసారి అలాకాకుండా ప్రతిపక్షం అంతా ఒకటైతే మాత్రం పలు రాష్ట్రాలలో గట్టి పోటీనే ఎదుర్కొనాల్సి రావచ్చు. ✍️ ఇప్పటికి బీజేపీదే అధికారం అనే భావన ఉన్నప్పటికీ.. వచ్చే కొద్ది నెలల్లో జరిగే పరిణామాలను బట్టి ప్రజాభిప్రాయంలో మార్పు వచ్చే అవకాశం లేకపోలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని విపక్ష కూటమి బలపడడానికి ముందే మోదీ ప్రభుత్వం జనవరి నాటికే లోక్ సభ ఎన్నికలకు వెళుతుందా? అన్న సంశయం కూడా కొన్ని వర్గాలలో ఉంది. 2004లో ఎన్డీయే, యూపీఏకి మద్య ఎలాంటి పోటీ జరిగిందో ఇప్పుడు కూడా అదే స్థాయిలో దేశంలో పోటీ ఉండవచ్చు. కాకపోతే అప్పటి బిజెపి ప్రదాని వాజ్ పేయి సాప్ట్ కాగా, ప్రస్తుత ప్రదాని మోడీ హార్డ్ . ఆ రోజులలో యూపీఏ గెలిచినంత ఈజీగా ఇప్పుడు ఇండియా కూటమి గెలుస్తుందని చెప్పలేం. కానీ, ఐక్యమత్యంగా పోటీచేస్తే మాత్రం ఎన్డీయే తీవ్రమైన పోటీని ఎదుర్కోక తప్పదన్న భావన కలుగుతోంది. ::: కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
రేటు కార్డా? సేఫ్గార్డా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో వారసత్వ పార్టీలు ఉద్యోగాల పేరిట ‘రేటు కార్డ్‌ల’తో యువతను దోచుకుంటున్నాయని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం యువత ప్రయోజనాల పరిరక్షణ కోసం(సేఫ్‌గార్డ్) పని చేస్తోందని ఉద్ఘాటించారు. వారసత్వ పార్టీలా? లేక మంచి చేసే ప్రభుత్వమా? యువత భవిష్యత్తు ఎవరిపై ఆధారపడాలన్నది దేశమే తేల్చుకుంటుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ మంగళవారం రోజ్‌గార్ మేళాలో పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన 70,000 మందికిపైగా యువతీ యువకులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఇప్పటి విపక్షాలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డాయని పరోక్షంగా కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. పథకాల పేరిట ప్రజాధనం దోచుకున్నాయని ఆరోపించారు. ఉద్యోగాల నియామకాల్లోనూ అవినీతి, అవకతవకలు జరిగాయన్నారు. రిక్రూట్మెంట్ ప్రక్రియలో అవినీతి, ఆశ్రిత పక్షపాతాన్ని ప్రోత్సహించడం ద్వారా వారసత్వ పార్టీలు యువతను దగా చేస్తున్నాయని ఆక్షేపించారు. తమ ప్రభుత్వం వచ్చాక పూర్తి పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు ప్రజా సాధికారతే లక్ష్యంగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. గతంలో నియామక ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాదికిపైగా సమయం పట్టేదని, ఇప్పుడు నెలల వ్యవధిలోనే పారదర్శకంగా పూర్తి చేస్తున్నామని గుర్తుచేశారు. నిర్ణయాత్మకత.. మన గుర్తింపు సమాజంలో విభజన తెచ్చేందుకు, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని పార్టీలు భాషను ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇలాంటి పెడపోకడలు కనిపిస్తున్నాయని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు బీజేపీని, హిందీ భాషను బూచిగా చూపిస్తూ పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ప శ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు రేటు కార్డులు, కట్ మనీ వంటివి కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ రేటు కార్డులు యువత కలలను, సామర్థ్యాలను ఛిద్రం చేస్తున్నాయని చెప్పారు. ఉద్యోగాలు ఇప్పించినందుకు బదులుగా పేద రైతుల నుంచి భూములు తీసుకున్నందుకు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. ఆర్థిక వ్యవస్థకు కొత్త ధీమా దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ముద్రా యోజన, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి కార్యక్రమాలతో స్వయం ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు. ఆర్థికంగా వేగంగా ముందుకు సాగుతున్నామని, మన దేశ ఆర్థిక వ్యవస్థకు గతంలో ఇలాంటి విశ్వాసం, ధీమా ఎన్నడూ లభించలేదన్నారు. -
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై 19 ప్రతిపక్ష పార్టీల కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 28న లాంఛనంగా ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, జేడీ(యూ), ఎన్సీపీ, ఎస్పీ, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), కమ్యూనిస్ట్‌లు సహా 19 ప్రతిపక్ష పార్టీలు ముక్త కంఠంతో ప్రకటించాయి ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ప్రజాస్వామ్యానికి అవమానం పార్లమెంట్ భవనాన్ని ప్రధాని తన చేతుల మీదుగా ప్రారంభించడాన్ని విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రణాళికలో భాగంగనే మోదీ ఇలా చేస్తున్నారని మండిపడ్డాయి. రాష్ట్రపతితో ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే విధంగా మహాత్మాగాంధీని జీవితాంతం వ్యతిరేకించిన హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ జయంతి రోజు ఈ కార్యక్రమం షెడ్యూల్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. (చూడండి : కొత్త పార్లమెంటు లోపల ఎలా ఉంది?) ద్రౌపది ముర్ముని పూర్తిగా పక్కకు పెట్టి కొత్త పార్లమెంట్ భవనాన్ని తానే స్వయంగా ప్రారంభించాలనుకున్న మోదీ నిర్ణయం ప్రజాస్వామ్యానికి తీవ్ర అవమానమని తెలిపాయి. ఈ చర్య రాష్ట్రపతి అత్యున్నత పదవికి, రాజ్యంగ స్పూర్తిని, తొలి ఆదివాసీ మహిళా గౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుందని ప్రతిపక్షాలు తమ ప్రకటనలో పేర్కొన్నాయి. అందరికీ ఆహ్వానం: అమిత్ షా ప్రతిపక్షాల ఆరోపణలపై కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్క పార్టీని ఆహ్వానించామని తెలిపారు. ఉభయ సభల ఎంపీలకు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలకు.. ఇతర నేతలకు భౌతిక, డిజిటల్ రూపాల్లో ఆహ్వానాలు పంపినట్లు పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి రావడం.. రాకపోవడంపై నిర్ణయం వారి విజ్ఙతకే వదిలేస్తున్నామన్నారు. మరోవైపు కార్యక్రమాన్ని బహిష్కరించాలనేకునే తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ప్రతిపక్షాలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సూచించారు. చదవండి: కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక రాజదండం 'సెంగోల్'.. విశేషాలివే.. రాష్ట్రపతిని విస్మరించారు కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడంపై ప్రతిపక్షాల అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేడుకను బహిష్కరిస్తున్నట్లు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అలాగే రాష్ట్రపతిని ప్రధాని మోదీ దాటవేస్తున్నారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన జరిగినప్పుడు మోడీ రాష్ట్రపతిని విస్మరించారని. ఇప్పుడు ప్రారంభోత్సవంలో కూడా అలాగే చేస్తున్నారని, ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేస్తున్నామని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రకటించారు. పార్లమెంట్ కేవలం భవనం కాదు అంతకుముందు.. ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. రాష్ట్రపతిని ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడంపై తలెత్తుతున్న ప్రశ్నల దృష్ట్యా ఆప్ ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ తెలిపింది. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ట్విటర్ ద్వారా పార్టీ నిర్ణయాన్ని ప్రకటించారు. ‘పార్లమెంట్ కేవలం కొత్త భవనం కాదు. ఇది పాత సంప్రదాయాలు, విలువలు, నియమాలతో కూడిన స్థాపన. ఇది భారత ప్రజాస్వామ్యానికి పునాది. ప్రధాని మోదీకి అది అర్థం కాదు. ఆదివారం నాటి కొత్త భవనం ప్రారంభోత్సవం నేను, నాకోసం అనే ఆయన ఆలోచిస్తున్నారు’ అని ఆయన ట్వీట్ చేశారు. ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన 19 పార్టీలు: 1. కాంగ్రెస్ 2. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 3. ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) 4.రాష్ట్రీయ జనతా దళ్ 5. శివసేన (ఉద్దవ్ వర్గం) 6. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 7. జనతాదల్ యునైటెడ్(జేడీయూ) 8. సమాజ్ వాదీ పార్టీ 9. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 10. జార్ఖండ్ ముక్తి మోర్చా 11 కేరళ కాంగ్రెస్ (మణి) 12 విడుతలై చిరుతైగల్ కట్చి 13. రాష్ట్రీయ లోక్ దళ్ 14. తృణమూల్ కాంగ్రెస్ 15. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 16. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 17 నేషనల్ కాన్ఫరెన్స్ 18 రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ 19. మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం -
బెట్టు వీడని విపక్షాలు.. ప్రధాని స్పందనకై డిమాండ్
సాక్షి, ఢిల్లీ: అదానీ గ్రూప్ వ్యవహారంపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయి. సహకరిస్తామని చెప్పడంతో.. మంగళవారం ఇరు సభలు సజావుగా జరుగుతాయని అంతా భావించారు. అయితే టర్కీ, సిరియా భూకంప బాధితుల సంతాపం ప్రకటన అనంతరం.. పార్లమెంటరీ సంయుక్త కమిటీ(జేపీసీ) వేయాలంటూ ఇరు సభలను అడ్డుకునే యత్నం చేశాయి. దీంతో ఉభయ సభలు కాసేపటికి వాయిదా పడ్డాయి. తొలుత బీఆర్ఎస్, ఆప్‌లు మాత్రమే సమావేశాలకు దూరంగా ఉంటాయని అంతా భావించారు. ఈ క్రమంలో మిగతా పార్టీలలో దాదాపుగా అన్నీ పార్లమెంట్ వ్యవహారాలకు సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ జైరామ్ రమేశ్ ప్రకటించారు. అయితే.. లోక్‌సభలో పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నా రాజ్యసభలో మాత్రం విపక్షాలు కార్యకలాపాలను ఏమాత్రం ముందుకు కదలకుండా అడ్డుకున్నాయి. Rajya Sabha adjourned till 2 pm as Opposition MPs walked to the Well of the House and demanded that the PM come to the House and respond over #Adani row. pic.twitter.com/OR1nh85pO4 — ANI (@ANI) February 7, 2023 అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హౌజ్ వెల్‌లోకి వెళ్లాయి. దీంతో రాజ్యసభ మధ్యాహ్నాం రెండు గంటల దాకా సభ వాయిదా పడింది. మరోవైపు లోక్‌సభ ప్రారంభంలో ప్రతిపక్షాల నిరసనతో మధ్యాహ్నం 12 గంటలకు, ఆపై మరోసారి మధ్యాహ్నం 1.30 నిమిషాలకు వాయిదా పడగా.. ఆ తర్వాత ప్రారంభమైన సభ కాస్త సజావుగానే నడిచింది. అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ నివేదిక వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ దర్యాప్తుగానీ, సీజేఐ పర్యవేక్షణలో దర్యాప్తునకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రధాని మోదీ సైతం వివరణ ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. -
సరిహద్దు ఘర్షణ పార్లమెంట్‌ను కుదిపేయనుందా?
న్యూఢిల్లీ: సరిహద్దు ఘర్షణ.. దేశ చట్ట సభను కుదిపేయనుందా?. అవుననే సంకేతాలు అందిస్తున్నాయి ప్రతిపక్షాలు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 2022లో భాగంగా.. ఇవాళ(మంగళవారం) చైనా-భారత్ సరిహద్దు ఘర్షణ అంశాన్ని లేవనెత్తి.. కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని ప్రధానంగా ప్రతిపక్ష కాంగ్రెస్ భావిస్తోంది. డిసెంబర్ 9వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ వాస్తవ నియంత్రణ రేఖ వెంట భారత్-చైనా బలగాలు గొడవ పడ్డాయని, ఈ ఘనటలో ఇరు వర్గాలకు స్వల్ఫ గాయాలు అయ్యాయనేది సమాచారం. ఈ సమాచారం తెలియగానే.. కాంగ్రెస్ కేంద్రాన్ని ఏకిపారేయడం ప్రారంభించింది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సీనియర్లు మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇక ఈ అంశంపై పార్లమెంట్లో చర్చించడం ద్వారా ప్రభుత్వ తీరును దేశం దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు ఇరు సభల్లో వాయిదా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు ఎంఐఎం అధినేత, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సైతం వాయిదా తీర్మానం కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని.. ఎందుకు బహిర్గత పర్చలేదని ఆయన అధికార పక్షాన్ని నిలదీస్తున్నారు. సరిహద్దు విషయంలో నిజాలు బయటకు రాకుండా మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతోందనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. అయితే.. ఈ విషయంలో ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని కేంద్రం భావిస్తోందట. కేంద్రం ఎప్పుడూ ఎలాంటి చర్చలకు వెనుకాడలేదని, వాస్తవాలతో సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా పార్లమెంట్లో ప్రకటన చేయొచ్చని భావిస్తున్నారు. 2020లో లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీ వద్ద 20 మంది భారతీయ సైనికులు మరణించిన భీకర ఘర్షణ తర్వాత.. భారత్-చైనా మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ ఘర్షణలో ఐదుగురు చైనా సైనిక అధికారులు, సైనికులు మరణించారని చైనా ప్రకటించినా.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందన్న కథనాలు వినిపించాయి. Congress MP Randeep Singh Surjewala gives Suspension of Business Notice under Rule 267 in Rajya Sabha to discuss the India-China face-off in Tawang sector, Arunachal Pradesh on 9th December; urges the PM & Defence Minister to make a statement & have a discussion in the House. — ANI (@ANI) December 13, 2022 ఇదీ చదవండి: మోదీ సర్కారు మెతక వైఖరి వల్లే చైనా ఆగడాలు! -
Rajya Sabha: ఆరోపణలు సరే.. ఆధారాలేవీ?
న్యూఢిల్లీ: సభలో తగిన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకూడదని రాజ్యసభ సభ్యులకు చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ హితవు పలికారు. అలాంటి ఆరోపణలు చేయడం సభా హక్కులను ఉల్లంఘించడంతో సమానమని తేల్చి చెప్పారు. రాజ్యసభలో సోమవారం జీరో అవర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడారు. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆక్షేపించారు. ప్రతిపక్ష నాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గత ఎనిమిదేళ్లలో ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా 3,000 సోదాలు నిర్వహించిందని, కానీ, కేవలం 23 మంది దోషులుగా తేల్చారని చెప్పారు. సంజయ్ సింగ్ వ్యాఖ్యలపై అధికార ఎన్డీయే ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కలుగజేసుకోవాలని సభాపతిని కోరారు. దీంతో చైర్మన్ ధన్‌ఖడ్ స్పందించారు. సభలో ఎవరు ఏం మాట్లాడినా అది కచ్ఛితత్వంతో కూడినది అయి ఉండాలని సూచించారు. తగిన ఆధారాలతో మాట్లాడాలన్నారు. ఆధారాలు లేని గణాంకాలను సభలో చెబుతామంటే అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇష్టారీతిన తోచింది మాట్లాడడం సభా హక్కులను ఉల్లంఘించడంతో సమానమేనని ఉద్ఘాటించారు. ఇలాంటి అంశాలను తీవ్రంగా పరిగణిస్తానన్నారు. పత్రికల్లో వచ్చిన రిపోర్టులు లేదా ఎవరో వెల్లడించిన అభిప్రాయాలకు ప్రాముఖ్యం ఇవ్వబోమన్నారు. సభలో ఏదైనా ఆరోపణ చేసినప్పుడు చట్టబద్ధ∙డాక్యుమెంటేషన్ ఉండాలన్నారు. అనంతరం కేంద్ర మంత్రి గోయెల్ మాట్లాడారు. ఎనిమిదేళ్లలో ఈడీ 3,000 సోదాలు చేసిందనడం పూర్తిగా అవాస్తవమని తేలి్చచెప్పారు. కోర్టు ఆదేశాల మేరకే దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటాయని అన్నారు. సంజయ్ స్పందిస్తూ.. అధికార పార్టీతో సంబంధాలున్న అవినీతిపరులపై దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. -
ప్రధాని మోదీకి వెంకయ్యనాయుడి సలహా
న్యూఢిల్లీ: ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోదీ.. ప్రతిపక్ష నేతలను కలవాలని సలహా ఇచ్చారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు.. ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుస్తక ఆవిష్కరణలో ముందుగా ప్రధాని మోదీపై ప్రశంసలు గుప్పించారు వెంకయ్యనాయుడు. భారతదేశం ఇప్పుడు లెక్కించదగిన శక్తి. దాని స్వరం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. మోదీ పాలనలో దేశం ఆరోగ్య రంగం, విదేశాంగ విధానం, సాంకేతికత.. ఇలా అన్ని రంగాల్లో లక్ష్యసాధనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుందని కొనియాడారు. ఇంత తక్కువ టైంలో ఇలాంటి ఘనత సాధించడం సర్వసాధారణ విషయం కాదని, అద్బుతమన్న వెంకయ్యనాయుడు.. మోదీ నిర్ణయాలు, ఆ మార్గంలో యావత్ దేశపౌరులు పయనించడమే కారణమని చెప్పారు. కానీ, మోదీ పాలనాపరమైన విధానాలపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఉందని.. అందుకు రాజకీయపరమైన కారణాలు, అపార్థాలు కూడా కారణం అయ్యి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు వెంకయ్యనాయుడు. వాటిని చెరిపేసేందుకు తరచూ మోదీ రాజకీయ వర్గాలను కలుస్తూ ఉండాలని, ముఖ్యంగా ప్రతిపక్షాలను కలుస్తూ ఉండాలని వెంకయ్యనాయుడు సూచించారు. తద్వారా అపార్థాలు తొలగిపోతాయన్నారు. అదే సమయంలో, రాజకీయ పార్టీలు కూడా విశాల దృక్పథంతో ఉండాలని, ప్రజల ఆదేశాన్ని గౌరవించాలని నాయుడు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు రాజకీయ ప్రత్యర్థులే తప్ప.. శత్రువులు కారని గుర్తించాలని అని సూచించారు. ముఖ్యమంత్రి, రాష్ట్రపతి.. ఇలా ఉన్నతపదవులకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారాయన. 2019 మే-2010 మే మధ్య ప్రధాని మోదీ ప్రసంగాలతో కూడిన ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఐబీ సెక్రెటరీ అపూర్వ చంద్ర హాజరయ్యారు. ఇదీ చదవండి: హర్తాల్ కోసమే కాంగ్రెస్ యాత్రకు బ్రేక్! -
కష్టం మేడం! అందరూ ప్రధాని అభ్యర్థిగా ఊహించుకుంటున్నారు!!
కష్టం మేడం! అందరూ ప్రధాని అభ్యర్థిగా ఊహించుకుంటున్నారు!! -
ప్రధాని పదవిపై వ్యామోహం లేదు
న్యూఢిల్లీ: ఎన్డీయే కూటమి నుంచి వైదొలగి.. ప్రాంతీయ పార్టీలతో పాత కూటమి ద్వారా తిరిగి అధికారం నిలబెట్టుకున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. ఈ క్రమంలో.. జాతీయ రాజకీయాల మీద ఆసక్తితోనే నితీశ్ కూటమిని వీడారని, ప్రధాని రేసులో నిలవాలని ఆశపడుతున్నారని బీజేపీ ఆరోపణలు గుప్పించింది. ఈ క్రమంలో ఈ ఆరోపణపై ఇవాళ నితీశ్ కుమార్ స్పందించారు. ఢిల్లీలో నేడు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో ఆయన భేటీ అయ్యి.. దేశరాజకీయాలపై చర్చించారు. అనంతరం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చాలనే ప్రయత్నం జరుగుతోంది. నా ప్రయత్నమల్లా.. సార్వత్రిక ఎన్నికలనాటికి విపక్షాలను ఒక్కటి చేయడమే. అంతేగానీ.. ప్రధాని పదవిపై నాకు వ్యామోహం లేదు. నన్ను ప్రధాని అభ్యర్థిగా విపక్షాలు నిలబెట్టాలనే ఉద్దేశ్యం నాకు ఏమాత్రం లేదు’’ అని స్పష్టం చేశారాయన. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న ఈ జేడీయూ నేత.. ఎన్సీపీ శరద్ పవార్, ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, జనతా దల్ సెక్యూలర్ చీఫ్ హెచ్డీ కుమార్‌స్వామి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. మరికొందరితో భేటీ అయ్యే అవశాలున్నాయి. ఇదీ చదవండి: ప్రధాని మోదీ తర్వాతి టార్గెట్ రైతుల భూములే! -
ద్రౌపది ముర్ము: విపక్షాలే దగ్గరుండి గెలిపించాయ్!
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కీలకంగా మారడం ఇప్పుడు పెద్ద చర్చకే దారి తీసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ చెల్లదు. అంటే.. క్రాస్ ఓటింగ్‌కు లైన్ క్లియర్ అన్నమాట. అయితే ఆత్మప్రభోధానుసారం ఓటేయాలన్న పిలుపును సీరియస్‌గా తీసుకున్న చాలామంది ప్రజాప్రతినిధులు.. గిరిజన బిడ్డ ద్రౌపది ముర్ము(64)ను గెలిపించుకోవడం గమనార్హం. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు గట్టి దెబ్బే తగిలింది. యశ్వంత్ సిన్హాకే ఓటేయాలన్న ఆయా పార్టీల అధిష్టానాల పిలుపును లైట్ తీసుకుని.. ద్రౌపది ముర్ముకే ఓటేశారు చాలా మంది. మొత్తం ఎంపీల ఓట్లలో 540 (72.19 శాతం) ముర్ముకే పడ్డాయి. సిన్హాకు 208 మంది మాత్రమే ఓటేశారు. అలాగే అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల నుంచి భారీగా క్రాస్ ఓట్లు ముర్ముకు పోలయ్యాయి. ముర్ముకు విపక్షాలకు చెందిన పలువురు గిరిజన, ఎస్సీ ప్రజాప్రతినిధులు కూడా జైకొట్టారు. సుమారు 17 మంది ఎంపీలతో పాటు దాదాపు 104 మందికి పైగా విపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు ఓటేసినట్టు తెలుస్తోంది. బీజేపీ ఏమో ఆ సంఖ్యను 18 రాష్ట్రాల నుంచి 126 ఎమ్మెల్యేలుగా చెబుతోంది. మొత్తం ఎలక్టోరల్ కాలేజీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్ల ద్వారా ముర్ముకు మద్దతుగా 64 శాతం ఓట్లు పోలయ్యాయి. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి ఆమెకు మద్దతు లభించడం గమనార్హం. While President-elect #DroupadiMurmu got a vote in all states, Opposition's Presidential candidate Yashwant Sinha drew a blank in Andhra Pradesh, Nagaland, & Sikkim. pic.twitter.com/QTVtiRqBYS — ANI (@ANI) July 21, 2022 అస్సాంలో 22 మంది ఎమ్మెల్యేలు, మధ్యప్రదేశ్‌లో 20, మహారాష్ట్రలో 16, గుజరాత్లో 10, జార్ఖండ్‌లో 10, బిహార్‌లో 6,, ఛత్తీస్‌గఢ్‌లో 6, గోవాలో నలుగురు చొప్పున విపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు. మరోవైపు యూపీ, మహారాష్ట్ర అసెంబ్లీల నుంచి ద్రౌపది ముర్ముకు గరిష్ఠంగా ఓట్లు వచ్చాయి. అలాగే యశ్వంత్ సిన్హాకు పశ్చిమ బెంగాల్, తమిళనాడు నుంచి భారీ మద్దతు లభించింది. राष्ट्रपति पद के लिए मध्यप्रदेश से श्रीमती द्रौपदी मुर्मू जी को भारतीय जनता पार्टी के अतिरिक्त भी वोट मिले हैं। मैं अन्य दलों के उन विधायक साथियों को, जिन्होंने अंतरात्मा की आवाज पर श्रीमती द्रौपदी मुर्मू जी को राष्ट्रपति बनाने के लिए वोट किया है, उनको हृदय से धन्यवाद देता हूं। pic.twitter.com/pEWiY4O50Y — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 21, 2022 మధ్యప్రదేశ్ సీఎం కృతజ్ఞతలు గిరిజన వర్గానికి చెందిన సోదరి విజయంలో భాగస్వామ్యులైనందుకు కృతజ్ఞతలంటూ విపక్షాల ప్రజాప్రతినిధులకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని ఆయన విడుదల చేయడం గమనార్హం. స్వతంత్రం అనంతరం పుట్టి.. రాష్ట్రపతి హోదాకు ఎన్నికైన అతిచిన్న వయస్కురాలిగా ద్రౌపది ముర్ము సరికొత్త చరిత్ర సృష్టించారు. జులై 25వ తేదీన ఆమె రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు. ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. విపక్షాలకు షాక్ -
పార్లమెంట్ సమావేశాలు: ఉభయ సభలు గురువారానికి వాయిదా
Monsoon Session 2022 Day 3 Updates: ►జీఎస్టీ, ధరల పెరుగుదలపై ప్రతిపక్ష నాయకులు వరుసగా మూడో రోజు తమ నిరసనలు కొనసాగించడంతో లోక్‌సభ సైతం గురువారానికి వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నిరసన పర్వం కొనసాగుతోంది. ధరల పెరుగుదలపై విపక్షాల నిరంతర నిరసనల మధ్య లోక్‌సభ వాయిదా పడింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సభ తిరిగి సమావేశం కానుంది. ► ధరల పెరుగుదలపై ఉభయసభల్లో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. విపక్షాల ఆందోళనతో రాజ్యసభ సమావేశాలనుగురువారానికి వాయిదా పడింది. జులై 18 నుండి ఐదు శాతం జిఎస్టి పన్ను అమలులోకి వచ్చిన క్రమంలో పాలు, పెరుగు ప్యాకెట్లను పట్టుకుని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభ వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. దీంతో వరుసగా మూడో రోజు కూడా సభా కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో రేపు ఉదయం 11 గంటలకు రాజ్యసభ వాయిదా పడింది. టీఆర్ఎస్ ఎంపీల నిరసన ► ధరల పెంపు, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు గళమెత్తారు. పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపై జీఎస్టీ పన్నుపోటును నిరసిస్తూ.. నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. పాలు, పాల ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాలను ప్రదర్శిస్తూ నిరసనలో పాల్గొన్నారు. గ్యాస్ ధరల పెంపుపై ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఆందోళనలో టీఆర్ఎస్ ఎంపీలతోపాటు ఇతర విపక్ష ఎంపీలు కూడా పాల్గొన్నారు. ► రాజ్యసభలో ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ధరల పెరుగుదలపై పార్లమెంట్లో చర్చకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని, ఎలాంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు ►ద్రవ్యోల్బణం, కొన్ని నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు. #WATCH Opposition MPs protest in Parliament against the Central government over inflation and recent GST hike on some essential items pic.twitter.com/rgpYrHjlZo — ANI (@ANI) July 20, 2022 రాజ్యసభలోనూ అదే తీరు ► విపక్షాల నినాదాలతో.. రాజ్యసభను మధ్యాహ్నాం 2 గంటలకు వాయిదా వేశారు చైర్మన్ వెంకయ్య నాయుడు. లోక్‌సభ వాయిదా ► ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణాన్ని నిరసిస్తూ ఉభయసభల్లో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. లోక్‌సభలో క్వశ్చన్ అవర్‌కు అంతరాయం కలిగించారు కాంగ్రెస్ సహా మిగిలిన విపక్ష ఎంపీలు. దిగజారుతున్న రూపాయి విలువ, ధరల పెంపుపై చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలని స్పీకర్ ఓంబిర్లా పదే పదే విజ్ఞప్తిచేసినా పట్టించుకోలేదు. దీంతో కాంగ్రెస్ సభ్యుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు స్పీకర్. క్వశ్చన్ అవర్‌ను అడ్డుకోవడం సరికాదన్నారు. పార్లమెంట్ చర్చల కోసమని.. నిరసనల కోసం కాదని స్పష్టంచేశారు. లోక్‌సభను మధ్యాహ్నం 2గంటలవరకూ వాయిదా వేశారు. ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభం. ► వర్షాకాల సమావేశాల మూడో రోజు దరిమిలా.. ధరల పెరుగుదల మరియు ద్రవ్యోల్బణం సమస్యలపై పార్లమెంటులోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున్ ఖర్గే మరియు అధిర్ రంజన్ చౌదరి నిరసనల్లో పాల్గొన్నారు. Delhi | Congress MPs Mallikarjun Kharge & Adhir Ranjan Chowdhury join the Joint Opposition protest in front of the Mahatma Gandhi statue in Parliament on the issues of price rise and inflation, on the third day of the Monsoon session pic.twitter.com/z2OcRAILEv — ANI (@ANI) July 20, 2022 ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు విపక్షాల ఆందోళన ఆటంకంగా మారింది. రెండు రోజులపాటు ఉభయ సభలు సజావుగా సాగలేక.. వాయిదాల పర్వంతోనే నెట్టుకొచ్చాయి. ఈ తరుణంలో.. ► ఆహార పదార్థాలపై పెంచిన జీఎస్టీ, ద్రవ్యోల్బణంపై చర్చించేందుకు బుధవారం ఉదయం రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వాయిదా నోటీసు ఇచ్చారు. ► పార్లమెంట్ ఉభయ సభల్లో అంతరాయాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఆయనెప్పుడూ పార్లమెంట్లో గళం వినిపించింది లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది లేదు. ఎప్పుడూ పార్లమెంట్ కార్యకలాపాలను అగౌరవపరుస్తూ వస్తున్నాడు. పార్లమెంట్లో 40% కంటే తక్కువ హాజరు ఉన్న వ్యక్తి ఆయనే. అలాంటి రాజకీయంగా ఉత్పాదకత లేని వ్యక్తి.. ఇప్పుడు పార్లమెంటులో చర్చ జరగకుండా చూసుకోవడానికి తనను తాను అంకితం చేసుకుంటున్నాడు’’ అంటూ ఎద్దేవా చేశారు స్మృతి ఇరానీ. Rahul Gandhi never posed a question,always disrespected Parliamentary proceedings...He's the one to have less than 40% attendance in Parliament...Today, the person who's been politically unproductive is dedicating himself to ensure there's no debate in Parliament:Smriti Irani,BJP pic.twitter.com/FpA5pnL1zs — ANI (@ANI) July 20, 2022 ► ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. మూడో రోజూ ఆందోళనకు విపక్షాలు సిద్ధం అయ్యాయి. సమావేశాల ప్రారంభం కంటే ముందుగానే నిత్యావసరాలపై జీఎస్టీరేట్ల పెంపు, పెరిగిన ధరలు తదితర అంశాలపై నిరసన తెలపాలని నిర్ణయించుకున్నాయి. ► మరోవైపు ప్రధాని మోదీ అధ్యక్షతన మధ్యాహ్నాం కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. సభలో వ్యవహరించాల్సిన తీరు.. విపక్షాల విమర్శలకు తగిన సమాధానాలు సిద్ధం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. మంత్రులకు సూచించనున్నట్లు తెలుస్తోంది. -
పార్లమెంట్ ఉభయ సభలు బుధవారానికి వాయిదా
-
Monsoon session of Parliament: పార్లమెంట్ ఉభయ సభలు బుధవారానికి వాయిదా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండో రోజు LIVE అప్డేట్స్ 2.00PM ద్రవ్యోల్బణం, జీఎస్టీ రేట్ల, ధరల పెంపుపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తూ సభా వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ, రాజ్యసభ్య రెండూ బుధవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డాయి. 11.48AM ► టీఆర్ఎస్ ఎంపీల ధర్నా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేపట్టారు. ద్రవ్యోల్బణం, పెరిగిన ధరలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసనలో పాల్గొన్నారు. Delhi | TRS MPs hold protest in front of Mahatma Gandhi statue in Parliament on the issues of price rise and inflation pic.twitter.com/agdkAOXVaN — ANI (@ANI) July 19, 2022 11.29AM ► ఆప్ ఎంపీల నిరసన ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ పర్యటనకు అనుమతి మంజూరు ఆలస్యాన్ని.. కేంద్రానికి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం ఎదుట ఆప్ ఎంపీలు నిరసన చేపట్టారు. Delhi | Aam Aadmi Party MPs protest against the Centre in front of Gandhi statue in Parliament against the delay in nod for Singapore visit to Arvind Kejriwal pic.twitter.com/gSpKUYSidX — ANI (@ANI) July 19, 2022 11.17AM ►లోక్‌సభ సైతం వాయిదా విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో లోక్‌సభను మధ్యాహ్నాం 2 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. అంతకు ముందు రాజ్యసభ సైతం మధ్యాహ్నానికి వాయిదా పడింది. 11.05AM ► రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదా విపక్షాల ఆందోళనతో ప్రారంభమైన కొన్ని నిమిషాలకే రాజ్యసభను మధ్యాహ్నాం 2 గంటల వరకు వాయిదా వేశారు చైర్మన్ వెంకయ్యనాయుడు. #SansadUpdate#RajyaSabha adjourned till 2 PM #MonsoonSession2022 pic.twitter.com/55AhC4yv6b — SansadTV (@sansad_tv) July 19, 2022 11.03AM ► లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ధరల పెరుగుదలపై విపక్షాలు నిరసన చేపట్టాయి. గందరగోళం నడుమే లోక్ సభ కార్యాకలాపాలు నడుస్తున్నాయి. Opposition MPs raise slogans against price hike and inflation in Lok Sabha as house proceedings begin on the second day of Parliament pic.twitter.com/c3HTjMRsGj — ANI (@ANI) July 19, 2022 ► సోమవారం మొదటి రోజు సమావేశాల్లో భాగంగా ధరల పెరుగుదల నుంచి అగ్నిపథ్ వరకూ కీలక అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఫలితంగా తొలి రోజు ఉభయసభల్లో ఎటువంటి కార్యకలాపాలు సాగలేదు. ► ఇక రెండో రోజు సమావేశాల ప్రారంభానికి ముందే.. గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. పెరుగుతున్న ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ భారాలు,అగ్నిపథ్ సహా ప్రజా సమస్యల పై పార్లమెంట్ లో చర్చ జరపాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. Delhi | Congress leader Rahul Gandhi joins Opposition protest over the issues of inflation and price rise, at Parliament, on the second day of the Monsoon session pic.twitter.com/KqMp3rrLSM — ANI (@ANI) July 19, 2022 ► ప్రధాని మోదీ.. మంత్రులతో సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపైనా చర్చలు జరిపారు. ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో రోజు సెషన్స్ ప్రారంభమయ్యాయి. తొలి రోజు గందరగోళం నడుమే ఉభయ సభలు వాయిదా పడటంతో రెండో రోజు ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. -
Parliament Monsoon Session: ఉభయ సభలు మంగళవారానికి వాయిదా
Parliament Monsoon Session 2022 LIVE అప్డేట్స్ ► పార్లమెంటు ఉభయసభలు మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైన రాజ్యసభలో విపక్షాలు ఆందోళనలు కొనసాగించడం వల్ల సభను రేపటికి వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత సభ 2 గంటలకు తిరిగి ప్రారంభమైన వెంటనే మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ► విపక్షాల ఆందోళన నడుమ రాజ్యసభను రేపటికి(మంగళవారం) వాయిదా వేశారు చైర్మన్ వెంకయ్యనాయుడు. ► జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, యూఏఈ మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జయద్ అల్ నహన్ మృతి నేపథ్యంలో భారత పార్లమెంట్ నివాళి అర్పించింది. Rajya Sabha observes silence as a mark of respect to the memory of the departed. Chairman Naidu made obituary reference to former Japanese PM Shinzo Abe, ex-UAE President Sheikh Khalifa Bin Zayed Al Nahyan, legendary Hindustani classical musician Pandit Shivkumar Sharma & others pic.twitter.com/GlWBNIVPhc — ANI (@ANI) July 18, 2022 ► పార్లమెంట్ ఆవరణలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతున్నందునా.. మధ్యాహ్నం రెండు గంటల వరకు లోక్‌సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ ఓం బిర్లా. Monsoon session of Parliament | Lok Sabha adjourned till 2pm for voting in Presidential election in Parliament premises pic.twitter.com/knnvVEhl22 — ANI (@ANI) July 18, 2022 ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మొత్తం 32 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లోనే తెలంగాణ గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ బిల్లు ప్రస్తావనకు రానుంది. ► కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ కార్యక్రమం జరిగింది. Delhi | Newly elected MPs take oath as Rajya Sabha members as the Monsoon session of Parliament begins pic.twitter.com/tFLspbBm7b — ANI (@ANI) July 18, 2022 BJP MP from Azamgarh (Uttar Pradesh) Dinesh Lal "Nirahua" Yadav, TMC MP from Asansol (West Bengal) Shatrughan Sinha, and BJP MP from Rampur (Uttar Pradesh) Ghanshyam Singh Lodhi take oath as Members of the Lok Sabha.#MonsoonSession pic.twitter.com/AKVAXg2qRQ — ANI (@ANI) July 18, 2022 ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 2022 ప్రారంభం అయ్యాయి. ఆగష్టు 12వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. #MonsoonSession of the Parliament commences; visuals from Lok Sabha. pic.twitter.com/UYj92rMHzW — ANI (@ANI) July 18, 2022 ► పార్లమెంట్ సమావేశాలు: ఓపెన్ మైండ్‌తో చర్చించాలి ఈ కాలం చాలా ముఖ్యమైనది. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాలం. ఆగస్ట్ 15 & రాబోయే 25 సంవత్సరాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది - దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించుకోబోయే సమయానికి, మన ప్రయాణాన్ని, కొత్త ఎత్తులను నిర్ణయించడానికి ఒక తీర్మానం చేయాల్సిన సమయం ఇది. పార్లమెంట్లో ఓపెన్ మైండ్‌తో చర్చలు జరగాలి, అవసరమైతే చర్చ జరగాలి. ఎంపీలందరూ లోతుగా ఆలోచించి చర్చించాలని నేను కోరుతున్నాను. ప్రస్తుతం రాష్ట్రపతి & ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరుగుతున్నందున ఈ సెషన్ కూడా ముఖ్యమైనది. ఈరోజు (రాష్ట్రపతి ఎన్నికలకు) ఓటింగ్ జరుగుతోంది. ఈ సమయంలో, కొత్త రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి దేశానికి మార్గనిర్దేశం చేయడం ప్రారంభిస్తారు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు ►రాజ్యసభలో విపక్షాల వాయిదా తీర్మానాలు రాజ్యసభలో విపక్షాల వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. అగ్నిపథ్ పథకంపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రూల్ 297 కింద వాయిదా తీర్మానాలు ఇచ్చిన కాంగ్రెస్, సీపీఎం ఎంపీలు. ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం(ఇవాళ్టి) నుంచి ప్రారంభం కానున్నాయి. ► సైనిక దళాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని విపక్ష నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ధరల పెరుగుదల, దేశ ఆర్థిక పరిస్థితిపై పార్లమెంట్లో తప్పనిసరిగా చర్చించాలంటున్నారు. 14 రోజుల్లో 32 బిల్లులా? అన్ని పార్టీల సమావేశంలో 13 అంశాలను లేవనెత్తామని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే చెప్పారు. వీటిపై ఉభయ సభల్లో చర్చించాలని అఖిలపక్ష భేటీలో కోరామన్నారు. వర్షకాల సమావేశాల్లో 32 బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోందని, కేవలం 14 రోజుల్లో వాటిపై చర్చించి, ఆమోదించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో చెప్పాలన్నారు. అఖిలపక్ష భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కాకపోవడం పట్ల కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ట్విట్టర్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశాల్లో 32 బిల్లులూ పెడతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. వీటిపై ఇప్పటికే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలు చర్చించాయన్నారు. సభల్లో ప్రజాస్వామ్య యుతంగా వీటిపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి అన్‌పార్లమెంటరీ పదాల జాబితాపై వివాదం అవసరం లేదని బిజూ జనతాదళ్ సీనియర్ నేత పినాకీ మిశ్రా చెప్పారు. శీతాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలన్నారు. ఒడిశాకు శాసన మండలిని ప్రకటించాలని విన్నవించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడానికి ఇదే సరైన సమయమని ఏఐఏడీఎంకే నాయకుడు ఎం.తంబిదురై పేర్కొన్నారు. శ్రీలంకలో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత్ చొరవ తీసుకోవాలని తంబిదురైతోపాటు డీఎంకే నేత టీఆర్ బాలు కోరారు. అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధం అఖిలపక్ష సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ నిబంధనలు, ప్రక్రియ ప్రకారం అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ప్రతిపక్షాలు ప్రతి చిన్న విషయానికి అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. పార్లమెంట్ ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నాయని తప్పుపట్టారు. శ్రీలంక సంక్షోభంపై చర్చించడానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్.జైశంకర్ నేతృత్వంలో మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. -
రాష్ట్రపతి ఎన్నికలు.. విపక్షాల తీరుపై శివసేన అసహనం
ముంబై: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక కోసం విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ తరుణంలో శివసేన పార్టీ.. విపక్షాల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రపతి ఎన్నికలను ఇకనైనా సీరియస్‌గా తీసుకోవాలంటూ సూచించింది. బలమైన రాష్ట్రపతినే ఎంపిక చేయడంలో తడబడితే.. రాబోయే రోజుల్లో ప్రధానికి సమర్థవంతమైన అభ్యర్థిని ఎలా ఎంపిక చేస్తారంటూ విపక్షాలకు శివసేన సూటి ప్రశ్న సంధించింది. ఈ మేరకు అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. పవార్ కాకపోతే.. ఇంకెవరు?. అభ్యర్థి విషయంలో కనీసం ఆరు నెలల ముందు నుంచైనా మంతనాలు జరపాల్సింది. ఇప్పుడు చర్చించడం వల్ల ఈ ఎన్నికలను తేలికగా తీసుకున్నారనే సంకేతాలను ప్రజల్లోకి పంపించినట్లయ్యింది. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఇంత చర్చలు జరుపుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రధాని అభ్యర్థిగా.. అది సమర్థుడిని ఎలా నిలబెడతారు? అని ప్రజలు నిలదీసే అవకాశాలు ఉన్నాయి. గోపాకృష్ణగాంధీ, ఫరూఖ్ అబ్దుల్లా.. ఇలా రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎప్పటిలా వినిపించే పేర్లే ఈసారి వినిపిస్తున్నాయి. గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి ఎవరూ కనిపించడం లేదా అని విపక్షాలను పశ్నించింది శివసేన. అదే సమయంలో బలమైన అభ్యర్థి కోసం కేంద్రం కూడా పెద్దగా ఆలోచన చేయడం లేదని అనిపిస్తోంది. ఐదేళ్ల కిందట.. రామ్‌నాథ్ కోవింద్ పేరును ఇద్దరు ముగ్గురు మాత్రమే షార్ట్ లిస్ట్ చేశారు. ఈసారి కూడా అలాగే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి, ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని విపక్షాలకు సూచించింది శివసేన. -
పవార్‌ను కలిసిన దీదీ.. విపక్షాల భేటీపై ఉత్కంఠ
న్యూఢిల్లీ: టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిశారు. బుధవారం నిర్వహించబోయే వివక్షాల సమావేశం, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఆమె పవార్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల రేసులో విపక్ష పార్టీలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని నిలిపే ప్రయత్నంలో భాగంగా ఆమె భేటీ నిర్వహించనున్నారు. బుధవారం నిర్వహించబోయే ఈ విపక్షాల సమావేశానికి 22 మంది నేతలను ఆహ్వానించారు సీఎం మమతా బెనర్జీ. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం విజయన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌థాక్రే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్‌లకు ఆహ్వానం పంపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి సైతం ఆహ్వానం పంపారు దీదీ. ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లిఖార్జున ఖర్గే, జైరాం రమేష్, రణదీప్ సింగ్ సుర్జీవాలే భేటీకి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఐక్యమయ్యాయనే.. సంకేతాన్నిపార్టీలు చూపిస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో రేపటి భేటీకి ఎవరెవరు హాజరవుతారనే చర్చ జోరుగా నడుస్తోంది. చదవండి: విపక్షాలకు శరద్ పవార్ షాక్ -
Sakshi Cartoon: ఓటు బ్యాంకును ప్రయివేట్‌కు ఇవ్వడం కుదరదు సార్!
ఓటు బ్యాంకును ప్రయివేట్‌కు ఇవ్వడం కుదరదు సార్! -
ప్రభుత్వ ప్రతిపక్షాలు రెండు కళ్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రతిపక్షాలు తనకు రెండు కళ్లని రాజ్యసభ ౖచైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ఇరుపక్షాలు సమష్టి బాధ్యతతో వ్యవహరిస్తేనే పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరుగుతాయన్నారు. రాజ్యసభలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో వెంకయ్య అభిప్రాయాలతో ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార, విపక్ష పార్టీల పరస్పర మొండి వైఖరితో ఉభయ సభలూ వాయిదాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పెగసస్, వివాదాస్పద వ్యవసాయ చట్టాలుపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో పాటు నిరసన ప్రదర్శనలతో ఉభయ సభల్ని స్తంభింపజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు కళ్లతోనే సరైన దృష్టి కుదురుతుందని, ఇరుపక్షాలను తాను సమానంగా గౌరవిస్తాననని వెంకయ్య చెప్పినట్లు ప్రకటన తెలిపింది. చట్టసభలు చర్చలకోసం ఉద్దేశించినవని గుర్తు చేశారు. బయట చేసుకోవాల్సిన రాజకీయ పోరాటాలను సభలో చేయాలనుకోవడం సరికాదని ఆయన హితవు చెప్పారు. రభస ఘటనలపై పరిశీలన ఇటీవలి సమావేశాల్లో కొందరు అనుచితంగా ప్రవర్తించి సభా గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన విషయంలో చర్యలు తీసుకోవడంపై లోతుగా పరిశీలిస్తున్నట్టు వెంకయ్యనాయుడు చెప్పారని ప్రకటన తెలిపింది. బుధవారం సమావేశాల్లో విపక్ష సభ్యులు, పార్లమెంట్ సెక్యూరిటీ మధ్య తీవ్ర ఘర్షణ నెలకొన్న సంగతి తెలిసిందే! గురువారం సాయంత్రం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో జరిగిన సమావేశంలో కూడా పార్లమెంట్లో ఘటనలపైనే చర్చించారని తెలిసింది. -
పెగసస్ ఆరోపణలు నిరాధారం: నడ్డా
పణజి: పెగసస్ స్పైవేర్ అంటూ వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించి లేవనెత్తే అంశా లేవీ లేకనే ప్రతిపక్షాలు ఇటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నాయని విమర్శించారు. పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తుతున్న అంశాలు నిరాశాపూరితాలు, అవి అసలు అంశాలే కావని పేర్కొన్నారు. ఏం చేయాలో తెలియకనే, పార్లమెంట్లో ఇలా అవాంతరాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తు న్నాయని చెప్పారు. అన్ని విషయాలపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆదివారం గోవాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సఫలతలో పార్లమెంట్ సమావేశాలు గత రికార్డులను తుడిచిపెట్టాయని చెప్పారు. ప్రధాని ప్రకటన చేయాలి: చిదంబరం పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై ప్రధాని మోదీ పార్లమెంట్లో ఒక ప్రకటన చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం డిమాండ్ చేశారు. హ్యాకింగ్ ఆరోపణలపై ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ చేయించాలి లేదా దీనిపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని నియమించాలన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ విజయానికి పెగసస్ స్నూపింగ్ కూడా సాయపడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. -
పార్లమెంట్లో రైతు గర్జన
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల ఉపసంహరణ డిమాండ్‌తో సుదీర్ఘకాలంగా రైతులు చేస్తున్న ఆందోళన గురువారం పార్లమెంట్లో ప్రతిబింబించింది. రైతుల డిమాండ్లను ప్రస్తావిస్తూ విపక్షాలు ఆందోళన నిర్వహించాయి. తొలుత పార్లమెంట్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టాయి. తర్వాత ఉభయ సభలు సమావేశమయ్యాక వెల్‌లోకి దూసుకెళ్లి విపక్ష సభ్యులు సభాకార్యకలాపాలను స్తంభింపజేశారు. రైతులు డిమాండ్లు నెరవేర్చాలని, నల్ల చట్టాలు రద్దు చేయాలని నినదించారు. రైతుల ఉద్యమం, పెగసస్ ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై లోక్‌సభలో కాంగ్రెస్ తదితర విపక్షాలు వాయిదా తీర్మానానికి నోటీసులు ఇవ్వగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేత మిథున్‌రెడ్డి పోలవరం అంశంపై సావధాన తీర్మానం కోసం నోటీసులు ఇచ్చారు. ఇక రాజ్యసభలో విపక్షాలు రైతు ఆందోళన, పెగసస్ ఫోన్ల హ్యాకింగ్ అంశాలపై చర్చకు నోటీసులిచ్చారు. లోక్‌సభ సభాపతి ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య ఆయా నోటీసులను తిరస్కరించారు. వాయిదాల పర్వం.. గురువారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల ఎంపీలు ఆందోళన ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభా కార్యక్రమాలు కొద్దిసేపు కొనసాగినా తర్వాత పదేపదే సభ వాయిదాపడింది. తొలుత 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం రెండు గంటల వరకు, ఆ తర్వాత నాలుగు గంటలకు వాయిదాపడింది. నాలుగింటికి సభ మొదలైనా నిరసనలు ఆగకపోవడంతో సభను శుక్రవారానికి వాయిదావేశారు. అటు రాజ్యసభలో ఇదే గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, టీఎంసీ తదితర పార్టీలు ఆందోళన చేపట్టాయి. పోడియం చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఆందోళన మధ్య చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తర్వాత సభ ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో కొద్దిసేపటికే 2 గంటలకు వాయిదాపడింది. తర్వాత మొదలైనా గందరగోళం నెలకొనడంతో శుక్రవారానికి వాయిదా వేశారు. గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నూతన వ్యసాయ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో గురువారం ఉదయం ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, డీఎంకే తదితర పార్టీలు వేర్వేరుగా ఆందోళన చేపట్టాయి. తొలుత కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్, శశి థరూర్, మనీష్ తివారీ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, రక్షణ రంగ ఉపకరణాలు, ఉత్పత్తుల్ని తయారుచేసే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో సిబ్బంది సమ్మెలను నిరోధించడానికి ఉద్దేశించిన ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దేశీయజల్లాల్లో సరకు రవాణాకు ఉద్దేశించిన ఇన్‌ల్యాండ్ వెసెల్స్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆంక్షల నడుమ ‘కిసాన్ సంసద్’ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు సుమారు ఎనిమిది నెలలుగా పోరాటం చేస్తున్న రైతన్నలు ఎట్టకేలకు పార్లమెంట్‌కు కూతవేటు దూరానికి చేరుకున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా తమ గళాన్ని తీవ్రతరం చేసే దిశలో సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా ఏర్పాటుచేసిన కిసాన్ సంసద్(రైతు పార్లమెంట్) కార్యక్రమం గురువారం పోలీసు ఆంక్షల నడుమ ప్రారంభమైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కిసాన్ సంసద్ కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో 200 మంది రైతులు పాల్గొన్నారు. కిసాన్ సంసద్‌కు స్పీకర్‌గా ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా వ్యవహరించగా డిప్యూటీ స్పీకర్‌గా మన్జీత్ సింగ్ ఉన్నారు. తమ నిరసనల వాడి తగ్గలేదనీ, పార్లమెంట్ సమావేశాలు ఎలా నిర్వహించాలో తమకు కూడా తెలుసుననే విషయం ప్రభుత్వానికి తెలిపేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో రైతు సమస్యలను ప్రస్తావించని అధికార, ప్రతిపక్ష సభ్యుల నియోజకవర్గాల్లో వారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు కిసాన్ పార్లమెంట్ వేదిక వద్దే ఉంటామని తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ, పశ్చిమబెంగాల్, గుజరాత్, పంజాబ్, హరియాణా, యూపీలకు చెందిన రైతులు వచ్చి సంఘీభావం తెలిపారు. -
ప్యాకేజీ ఒక క్రూయల్ జోక్ : సోనియా
సాక్షి, న్యూఢిల్లీ : విపక్షాల సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మార్చిన 24న కేవలం 4 గంటల వ్యవధిలో లాక్డౌన్ ప్రకటించారని, ఎలాంటి సంసిద్ధత లేకుండానే లాక్డౌన్ అమల్లోకి తెచ్చారని మండిపడ్డారు. అయినా సరే ప్రభుత్వానికి విపక్షాలు మద్ధతు ప్రకటించాయని గుర్తు చేశారు. 21 రోజుల మొదటి విడత లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు వస్తాయనుకున్నామని, ప్రస్తుతం వ్యాక్సిన్ కనిపెట్టే వరకు వైరస్ మన మధ్యే ఉండే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ప్రభుత్వం 4 లాక్డౌన్లు అమలు చేసినా, కరోనా మహమ్మారి నుంచి బయటపడే విధానం లేకుండా ఉన్నట్టు అనిపిస్తోందని ధ్వజమెత్తారు. వరుస లాక్డౌన్లు తీవ్ర దుష్ఫలితాలను అందించాయన్నారు. టెస్టింగ్ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. ఈలోగా మహమ్మారి ప్రజల ప్రాణాలు తీస్తూనే ఉందని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఒక క్రూయల్ జోక్‌గా నిలిచిందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా వలస కూలీలు తీవ్రంగా దెబ్బతిన్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారితో పాటు 13 కోట్ల మంది రైతులు, చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని పేర్కొన్నారు. -
ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా వచ్చాయి కాబట్టే..
సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాలకు తక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తే సాధారణంగానే వారు ఆ ఫలితాలను తప్పుపడతారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాదవ్ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. దీనిపై మాదవ్ స్పందిస్తూ.. ‘‘ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విపక్షాలకు అనుకూలంగా వస్తే అవి సరైనవి. వారికి వ్యతిరేకంగా వస్తే సరైనవి కావు అనే విధంగా ప్రతిపక్ష పార్టీల సభ్యులు వ్యవహరిస్తున్నారు. ఓటమిని అంగీకరించలేక ఎన్నికల సంఘం, ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు. ఫలితాలు వారికి అనుకూలంగా వస్తే ఎవరినీ ప్రశ్నించరు. వారికి వ్యతిరేకంగా వస్తే వ్యవస్థనే తప్పుపడతారు. మమతా బెనర్జీ, చంద్రబాబు నాయడు, కూమరస్వామి వీరంతా ఎగ్జిట్ పోల్స్‌ను ప్రశ్నిస్తున్నారు. గతంలో వారు కూడా ఇవే ఈవీఎంలతో గెలిచిన విషయాన్ని మర్చిపోయారు. గతంలో కంటే ఈసారి తమకు మెరగైన ఫలితాలు వస్తాయి. మోదీ నాయకత్వంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మే 23న వచ్చే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. 300లకు పైగా స్థానాలకు గెలుచుకుంటాం’’ అని అన్నారు. కాగా హోరాహోరీగా సాగిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీకే ప్రజామోదం ఉంటుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. మోదీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఆదివారం సాయంత్రం విడుదల చేసిన అంచనాల్లో పేర్కొన్నాయి. -
‘దమ్ముంటే ప్రధాని అభ్యర్థిని ప్రకటించండి’
లక్నో: సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్న వేళ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చివరి విడత లోకసభ ఎన్నికలు ఈనెల 19న జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కీలకమైన యూపీలో బీజేపీ, ఎస్పీ-బీఎస్పీ కూటమి ప్రచారంలో మునిగితేలుతున్నాయి. లక్నోలో పర్యటించిన కేంద్రం హోం శాఖమంత్రి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి రాజ్‌నాథ్ సింగ్ విపక్షాలపై విమర్శల వర్షం కురిపించారు. కూటమి నేతలకు దమ్ముంటే ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలని సవాల్ విసిరారు. లక్నోలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ, మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ మధ్య ఎన్నికల పోరు జరిగింది.ఈసారి ప్రతిపక్షాలకు సరైన ప్రధాని అభ్యర్థి కూడా లేరు. మోదీని ఎదుర్కొనే నాయకడు మీలో ఎవరు? ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి.. ఇంకా దాగుడు మూతలెందుకు.. దమ్ముంటే అభ్యర్థిని ప్రకటించండి’ అని అన్నారు. గత ఎన్నికల కంటే ఈసారి బీజేపీ జాతీయ స్థాయిలో మెరగైన ఫలితాలను సాధిస్తుందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో కూడిన కూటమి పార్టీలపై ప్రజలకు నమ్మకంలేదన్నారు. -
నిజాయితీ నిరూపించుకునేందుకే!
సాక్షి, హైదరాబాద్: ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రగతిశీల పథకాలను ప్రతిపక్షాలు వ్యతిరేకించడంతోపాటు అవినీతి ఆరోపణలు చేశాయని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సి.ఆర్యమ సుందరం హైకోర్టుకు వెల్లడించారు. ప్రభుత్వ పనితీరుపై దాదాపు 200ల పిల్లు దాఖలు చేసిన నేపథ్యంలో.. నిజాయితీని నిరూపించుకునేందుకే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నామని ఆయన పేర్కొన్నారు. ముం దస్తు ఎన్నికలు, ఓటరు జాబితా సవరణ సహా తది తర అంశాలపై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టులో విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము నిజాయితీపరులని భావిస్తే ప్రజలు తమకు పట్టంకడతారని, లేని పక్షంలో భిన్నమైన తీర్పునిస్తారని సుందరం పేర్కొన్నారు. అసెంబ్లీని 9 నెలల ముందు రద్దు చేసేందుకు కేబినెట్ ఆమోదం, గవర్నర్ ఆమోదముద్ర పడిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174(2)(బీ) ప్రకారం అసెంబ్లీ రద్దు చేసినప్పుడు గవర్నర్ నిర్వర్తించే పాత్రకు.. ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలనకు సంబంధించి నివేదిక ఇచ్చేటప్పుడు గవర్నర్ నిర్వర్తించే పాత్రకు స్పష్టమైన తేడా ఉందన్నారు. రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు గవర్నర్ తన విచక్షణాధికారాల మేరకు స్వతంత్రంగా వ్యవహరించి రాష్ట్రపతికి నివేదిక పంపిస్తారని తెలి పారు. అధికరణ 174(2)(బీ) కింద సభ రద్దయినప్పుడు గవర్నర్‌కు విచక్షణాధికారం ఉపయోగించే అవకాశమే లేదని, కేవలం మంత్రి మండలి సిఫారసును ఆమోదించి తీరాల్సిందేనన్నారు. ఈ కేసులో కూడా గవర్నర్ ఇలాగే వ్యవహరించారని తెలిపారు. సందేహ నివృత్తి కోరిన ధర్మాసనం 9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిం చాలని, దీని వల్ల 20 లక్షల మంది యువత ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును కోల్పోతున్నారని సిద్దిపేట జిల్లాకు చెందిన పోతుగంటి శశాంక్ రెడ్డి, అభిలాష్ రెడ్డిలు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ల ధర్మాసనం గతవారం విచారించింది. అసెంబ్లీని రద్దు చేసినప్పుడు గవర్నర్.. సభ అభిప్రాయం తీసుకోవడం తప్పనిసరా? కాదా? చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. అటు, ఎన్నికల షెడ్యూల్‌ను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత డీకే అరుణ ఇటీవలే పిల్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలను కలిపి ధర్మాసనం విచారించింది. గవర్నర్‌ను అడ్డుకునేవారెవరు? పిటిషనర్ల తరఫు న్యాయవాది నిరూప్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, అసెంబ్లీ రద్దు విషయంలో గవర్నర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించవచ్చన్నారు. సహ జ న్యాయ సూత్రాలకు అనుగుణంగానే ఆయన వ్యవహరించాలన్నారు. కేబినెట్ సిఫారసులను గవర్నర్ పట్టించుకోని సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తుచేశారు. అసెంబ్లీ రద్దయినప్పుడు సభ అభిప్రాయం, ఆమోదం తీసుకోకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. అసెంబ్లీ రద్దు విషయంలో సభ విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందేనన్నారు. సీఎం చెప్పుచేతల్లో ఈసీ! అసెంబ్లీని రద్దుచేసిన తర్వాత ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న విషయంలో సీఎం చెప్పినట్లు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నడుచుకుంటోంద ని నిరూప్ రెడ్డి అన్నారు. సీఎం చేసిన ప్రకటనలే నిదర్శనమన్నారు. సభ రద్దు అనంతరం సీఎం మీడియా తో మాట్లాడుతూ అక్టోబర్ మొదటి వారంలో ఎన్నిక ల షెడ్యూల్ విడుదల అవుతుందని చెప్పారని, దీనిక నుగుణంగానే ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుద ల చేసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. డిసెంబ ర్లో ఎన్నికలు ఉంటాయని సీఎం చెప్పినట్లుగానే.. డిసెంబర్ 7న ఎన్నికలను ఈసీ ప్రకటించిందన్నారు. సీఎం జోస్యంతోనే సమస్య! ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈసీ తీసుకున్న నిర్ణయంతో 18 ఏళ్లు నిండిన 20 లక్షల మంది కొత్త ఓటర్లు తమ హక్కును కోల్పోతున్నారని నిరూప్ రెడ్డి పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. దీని పై ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వ్యవహారంలో పైకి కనిపించని ఎజెండా (హిడెన్) ఉందని పిటిషనర్లపై ఏమంటారని న్యాయవాది సుందరంను ప్రశ్నించిం ది. పత్రికల కథనాల ఆధారంగానే పిటిషనర్లు ఈ ఆరోపణలు చేస్తున్నారని, ఎలాంటి హిడెన్ అజెండా లేదన్నారు. ఓటర్ల జాబితా పూర్తిగా ఈసీ పరిధిలోని వ్యవహారమన్నారు. ఈ జాబితాలో తప్పులున్నాయ నే కారణంతో సభను రద్దు చేయడం సరికాదని విమర్శించడం అర్థరహితమన్నారు. ‘పిటిషనర్ల ఆరోపణ లు, పత్రికల్లో వస్తున్న కథనాలను పరిశీలిస్తే.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీల విషయంలో సీఎం చేస్తున్న ప్రకటనలతోనే సమస్యలు వస్తున్నట్లున్నాయి. షెడ్యూల్, ఎన్నికల తేదీ తదితర విషయాల్లో భవిష్యత్తుల్లో ఏం జరగబోతోందో సీఎం ముందే జోస్యం చెప్పేస్తుండటంతో.. ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పెరిగిన సీట్ల సంఖ్య 2014లో ప్రస్తుత ప్రభుత్వానికి 63 సీట్లు వచ్చాయని, ఆ తరువాత ఫిరాయింపులను ప్రోత్సహించి ఆ సంఖ్యను 93కు పెంచుకుందని నిరూప్ రెడ్డి పేర్కొన్నారు. ఫిరాయింపులపై స్పీకర్ సైతం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా చోద్యం చూశారన్నారు. ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ నిరంతరం జరిగే ప్రక్రియని ఈసీ చెబుతున్నందున.. 20 లక్షల మందికి ఈసారి తొలిసారి ఓటువేసే అవకాశాన్ని ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఇందుకోసం ఎన్నికలను ఓ నెలపాటు వాయిదా వేస్తే వచ్చే నష్టం ఉండదన్నారు. సుప్రీంతీర్పు ఆధారంగానే: ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ, అసెంబ్లీ రద్దు అయినప్పుడు ఎన్నికల నిర్వహణపై పూర్థిస్తాయి స్పష్టత లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. అసెంబ్లీ రద్దయిన నాటి నుంచి 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని ధర్మాసనానికి తెలిపారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగడం మంచిది కాదన్న ఉద్దేశంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. -
ఈ ఏడాది జాగృతి బతుకమ్మ లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడం లేదని సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎన్నికల ఏడాది కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటేలా.. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ఆడబిడ్డలను కోరారు. కవిత ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘తెలంగాణ జాగృతి నిర్వహించే బతుకమ్మను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాలు చేసిన దిగజారుడు ఆరోపణలు నన్ను బాధించాయి. తెలం గాణ జాగృతి ఉమ్మడి ఏపీలోగానీ, తెలంగాణ ఏర్పడ్డ తర్వాతగానీ ప్రభుత్వం నుంచి ఏ రకంగానూ ఒక్క రూపాయి తీసుకోలేదు. ఈసారి ఎన్నికల సందర్భం అయినందున బతుకమ్మను రాజకీయాలకు ముడిపెట్టి నిరాధార ఆరోపణలు చేసేందుకు కొందరు కాచుకుని ఉన్నారని ప్రజలకు తెలుసు. అందుకే ఈ ఏడాది జాగృతి నుంచి బతుకమ్మ నిర్వహణ ఉండ దు. దిగజారుతున్న రాజకీయాలకు బతుకమ్మ ఒక అంశం కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ వాదులకు, తెలంగాణ ఆడబిడ్డలకు, జాగృతి అభిమానులకు సవినయంగా మనవి చేస్తున్నాను. సహృదయంతో అర్థం చేసుకుని, సహకరించగలరని కోరుతున్నాను. ఇది ఎన్నికల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం కనుక జాగృతి విదేశీ శాఖలకు వర్తించదు. తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని సమున్నతంగా నిలిపే క్రమంలో తెలంగాణ జాగృతి ఎప్పటికీ కృషి చేస్తూనే ఉంటుంది’ అని పేర్కొన్నారు. కవితను కలిసిన ఎర్రోళ్ల.. జహీరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఆశిస్తున్న ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రస్తుత ఎన్నికలకు టీఆర్ఎస్ సోషల్ మీడి యా ప్రచార ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న కవితను శుక్రవారం కలిసినట్లు తెలిసింది. టీఆర్ఎస్ అధిష్టానం ఎర్రోళ్లను జహీరాబాద్ అభ్యర్థిగా దాదాపుగా ఖరారు చేసింది. టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించాల్సిన 14 స్థానాలకు ఈ నెల 11న అభ్యర్థులను ప్రకటించనుందని తెలిసింది. జగిత్యాలలో గులాబీ జెండా: కవిత వచ్చే ఎన్నికల్లో జగిత్యాల జిల్లాపై గులాబీ జెండా ఎగరవేస్తామని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిలో భాగస్వాములు అయ్యేందుకు టీఆర్ఎస్లో చేరిన వారితో సమన్వయం చేసుకోవాలని జగిత్యాల టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్‌కుమార్‌కు సూచించారు. జగిత్యాల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు శుక్రవారం టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కవిత వీరికి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. జగిత్యాల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ జి.ఆర్ దేశాయ్, మాజీ కౌన్సిలర్ మానాల కిషన్‌తోపాటు బీసీ, ఎంబీసీ నేతలు చదువుల కోటేశ్, మర్రిపెల్లి నారాయణ తదితరులు టీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు. -
ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే కుట్ర: రమణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. ఆది వారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ రేవంత్‌రెడ్డిని పరామర్శించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. అనంతరం రమణ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలపై నమ్మకం పోతోందని, ముగి సిన కేసులను తిరగదోడుతున్నారన్నారు. ప్రజల్లో ఆదరణ ఉన్న ప్రతిపక్ష నాయకులను కావాలనే దెబ్బతీసే యత్నం చేస్తున్నారన్నారు. హైకోర్టు, ఎన్నికల కమిషన్ ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా సీఎం కేసీఆర్‌లో మార్పు రావట్లేదని, ప్రజలే కేసీఆర్, మోదీని శిక్షిస్తారని పేర్కొన్నారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, కంటి వెలుగుతో ప్రజలను గుడ్డివాళ్లను చేస్తున్నారని విమర్శించారు. వంద సీట్లు గెలుస్తామనే భ్రమలో కేసీఆర్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. అంతకుముందు రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత అజిత్‌సింగ్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా రమణ, చాడ ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను వివరించారు. కంటి వెలుగు ఆపరేషన్లు వికటించి ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రమణ, చాడ పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, అరవింద్ కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
తొందరేముంది?
సాక్షి, హైదరాబాద్: ‘‘ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వస్తా యో ప్రకటించడం అప్రజాస్వామికం. కేంద్ర ఎన్నికల సంఘం సైతం తొందరగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు ప్రారంభించడం దురదృష్టకరం. ఎన్నికల సంఘం చేయాల్సిన పని ఇదా? కేసీఆర్ చెప్పినట్లు కాకుండా చట్ట ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు నిర్వహించుకోవడానికి 6 నెలల సమయముంది. తక్షణమే నిర్వహించాల్సిన అవసరమేంటి?’’అని విపక్ష పార్టీలు మండిపడ్డాయి. వచ్చే నెల 10 లోగా ఓటర్ల జాబితా రూపకల్పన కోసం హడావుడిగా ఎన్నికల సంఘం ప్రత్యేక షెడ్యూల్ జారీ చేసిందని, మధ్యలో మొహర్రం, వినాయక చవితి పర్వదినాలు రానుండటంతో ఆశించిన మేరకు ఓటర్ల నమోదుకు స్పందన రాదని ఆందోళన వ్యక్తం చేశాయి. ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిపేందుకు సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేశ్ సిన్హా నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం హైదరాబాద్ చేరుకుంది. సచివాలయంలో రాత్రి వరకు 8 గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల నేతలతో విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు, సలహాలు స్వీకరించింది. ఏపీలో విలీనమైన ఏడు ముంపు మండలాల పరిస్థితి తదితర సమస్యలను పరిష్కరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ, బీఎస్పీ డిమాండ్ చేశాయి. అనంతరం రాజకీయ పార్టీల నేతలు విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ చెప్పినట్లు వద్దు: కాంగ్రెస్ ఎన్నికలు ఎప్పుడు రానున్నాయో కేసీఆర్ ప్రకటించడం, త్వరలో జరగాల్సిన 4 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో కాకుండా అంతకు ముందే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోందని వార్తలు రావడం అత్యంత దారుణమని కాంగ్రెస్ సీనియర్‌నేత మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఏపీలో వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేసి 3 నెలలైనా అక్కడ ఎన్నికలు నిర్వహించడం లేదని, రాష్ట్రంలో ఎందుకు అంత తొందరపడుతున్నారని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం 4 వారాల్లో ఓటర్ల జాబితా రూపకల్పన సాధ్యం కాదని తేల్చి చెప్పారు. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వ్యక్తులందరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. ఇందు కోసం పాత ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. ఏపీలో విలీనమైన 7 మండలాల ఓటర్ల విషయంతో తేల్చాలని, ఈ మేరకు నియోజకవర్గాల పునర్విభజన జరిపిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని, లేని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. త్వరగా నిర్వహించాలి: టీఆర్ఎస్, ఎంఐఎం సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్ కుమార్ కోరారు. మొహర్రం, వినాయక చవితి పండుగల ప్రభావం ఓటర్ల జాబితా రూపకల్పనపై ఉండదని అసదుద్దీన్ స్పష్టం చేశారు. 2014 తరహాలో ఈసారి కూడా తెలంగాణలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. 4 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించే వరకు ఆగకుండా అంతకు ముందే నిర్వహించాలన్నారు. వినోద్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏపీకి కొంత మంది వలస వెళ్లడం, ఇతర కారణాలతో జాబితా నుంచి ఓట్లు తొలగించి ఉండవచ్చని, ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకునే సీఎం కేసీఆర్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చెప్పారని తెలిపారు. రజత్ కుమార్‌తో కేంద్ర ఎన్నికల సంఘం కమిటీ భేటీ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేశ్ సిన్హా నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నత స్థాయి కమిటీ... రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్ కుమార్‌తోపాటు వాణిజ్య పన్ను, ఆదాయ పన్ను, ఎక్సైజ్, రవాణా శాఖల అధికారులతో సచివాలయంలో సమావేశమై చర్చలు జరిపింది. సంఘటనలను ఆరా తీయడంతోపాటు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఆయా శాఖ ల సన్నద్ధతకు వివరాలను అడిగి తెలుసుకుంది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయం త్రం 4.15 గంటలకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈ కమిటీ సమావేశం కానుంది. సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆర్థిక, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖల కార్యదర్శులతో సమావేశం కానుంది. ఓటర్ల నమోదు సాగడం లేదు.. చట్టప్రకారం ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ నేతలు చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. 2019 జనవరి 1 అర్హత తేదీతో ఓటర్ల జాబితా రూపకల్పన చేసి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ నేతలు ఇంద్రసేనా రెడ్డి, మల్లారెడ్డి, వెంకట్ రెడ్డి కోరారు. గత ఎన్నికల్లో 2.83 కోట్లు ఉన్న ఓటర్లు తాజాగా ప్రకటించిన ముసాయిదా జాబితాలో 2.61 కోట్లకు ఎలా తగ్గారని సీపీఎం నేతలు డీజీ నర్సింగరావు, నంద్యాల నరసిం హా రెడ్డి ప్రశ్నించారు. ఆగమేఘాల మీద ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ అన్నారు. కేసీఆర్ తన పరిమితులు దాటకుండా చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత రావుల సూచించారు. బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించాలని బీఎస్పీ నేత సీహెచ్ మల్లన్న ప్రతిపాదించారు. -
బీహార్ బంద్ ప్రశాంతం
-
నాపై ద్వేషమే వారిని కలుపుతోంది!
న్యూఢిల్లీ: అధికార కాంక్ష, మనుగడ కోసమే ప్రతిపక్షాలన్నీ ఒక పంచకు చేరుతున్నాయని, మోదీపై ద్వేషమే విపక్షాల్ని కూటమిగా కలిపి ఉంచే ప్రధానాంశంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విపక్షాల పరుగంతా ప్రధానమంత్రి పదవి కోసమేనని ఆయన విమర్శించారు. ‘స్వరాజ్య’ ఆన్లైన్ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. విపక్షాల ఐక్యతను అవకాశవాద రాజకీయంగా ప్రధాని అభివర్ణించారు. తనను పదవి నుంచి ఎలా తప్పించాలన్న ఆలోచన తప్ప ప్రతిపక్షానికి మరో ఎజెండా లేదని ఆరోపించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ బీజేపీకే ఓటేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీది అస్తిత్వం కోసం పోరాటమని, ఆ పార్టీ అక్రమాల్ని ప్రజలు తిరస్కరించడంతో పదవి కోసం మిత్రపక్షాల సాయాన్ని అర్ధిస్తోందని మోదీ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో అవకాశవాద పొత్తు ‘కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారింది. బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసే శక్తి ఆ పార్టీకి లేదు. రాబోయే ఎన్నికలు పరిపాలన, అభివృద్ధికి.. గందరగోళ రాజకీయాలకు మధ్య పోరుగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. ఏ ఎన్నికల్లోనైనా సైద్ధాంతికంగా పొసగని పార్టీల మధ్య అవకాశవాద పొత్తులు గందరగోళానికి దారితీస్తాయని.. అందుకు కర్ణాటకనే ఉదాహరణ అని చెప్పారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ప్రజా తీర్పును సైతం తిరస్కరించిందని ప్రధాని తప్పుపట్టారు. ఎవరైనా ఇద్దరు మంత్రులు అభివృద్ధిపై చర్చించేందుకు సమావేశమవుతారని, కర్ణాటకలో మాత్రం తగవులాట కోసం కలుసుకుంటున్నారన్నారు. ప్రధాని పదవి కోసమే తాపత్రయం 1977, 1989 నాటి ప్రతిపక్షాల ఐక్యతతో.. ప్రస్తుత ప్రతిపక్షాల కూటమి రాజకీయాల్ని పోల్చడం హాస్యాస్పదమన్నారు. ‘ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు 1977లో ప్రతిపక్షాలు చేతులు కలిపాయి. 12 ఏళ్ల తర్వాత బోఫోర్స్ కుంభకోణం దేశానికి అప్రతిష్ట తీసుకొచ్చిన వేళ మళ్లీ ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. ప్రస్తుతం ప్రతిపక్షాలు దేశ ప్రయోజనం కోసం కాకుండా వ్యక్తిగత స్వార్థం, అధికార దాహంతో కలిసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మోదీని తప్పించడం తప్ప వారికి వేరే అజెండా లేదు. ప్రధాని పదవి చేపట్టేందుకు సిద్ధమని ఒకవైపు రాహుల్ గాంధీ చెపుతుంటే.. మరోవైపు తృణమూల్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కూడా ఆ పదవిని కోరుకుంటున్నారు. ప్రధాని అయ్యేందుకు తమ నేతకే అన్ని అర్హతలు ఉన్నాయని సమాజ్‌వాదీ పార్టీ భావిస్తోంది. వీరి దృష్టంతా ప్రజా సంక్షేమంపై కాకుండా అధికార కాంక్షపైనే ఉంది’ అని మోదీ తప్పుపట్టారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సరిపడా స్థానాలు గెలుచుకున్నా.. మిత్రపక్షాలకు తగిన గౌరవం ఇచ్చిన వాటిని ప్రభుత్వంలో భాగం చేసుకున్నామని.. 20కి పైగా పార్టీలతో ఎన్డీఏ ఒక కుటుంబంలా కలిసి మెలిసి ఉందన్నారు. నేనేం చక్రవర్తిని కాదు రోడ్డుకిరువైపులా ప్రజలు అభివాదం చేస్తుంటే.. స్పందించకుండా ఉండేందుకు తానేమీ షెహన్షాను కానని ప్రధాని చెప్పారు. ప్రజలతో సంభాషిస్తుంటే తనకు చెప్పలేనంత బలం వస్తుందన్నారు. ‘నేను ఎక్కడికైనా వెళ్లినప్పుడు చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు అభివాదం చేసేందుకు, ఆహ్వానించేందుకు వస్తుంటారు. అటువంటి వాళ్లను చూస్తూ నేను కారులో కూర్చొని ఉండలేను. అందుకే వారి కోసం కారు దిగి వెళ్లి వారితో మాట్లాడతా’ అని చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మోదీకి ప్రాణహాని ఉందని ఇటీవల నిఘా వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్లో సుపరిపాలన సాధించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని మోదీ చెప్పారు. -
వైఎస్ఆర్ జిల్లా బంద్ చేపట్టిన వైఎస్ఆర్సీపీ,వామపక్షాలు
-
వారేం పీకారు?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. కర్నూలు జిల్లాలో అభివృద్ధి జరగడం లేదని, కేవలం శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకుంటున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. గతంలో వారు(ప్రతిపక్షాలు) ఏం పీకారని ప్రశ్నించారు. పెళ్లయిన వెంటనే పిల్లలు పుట్టరని, ఏడాది సమయం పడుతుందని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు కూడా సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. గతంలో ఎప్పుడూ లేనన్ని పరిశ్రమలు ఇప్పుడు కర్నూలు జిల్లాకు వస్తున్నాయని, ఈ అభివృద్ధి కనిపించడం లేదా? అని మండిపడ్డారు. వాళ్లు (ప్రతిపక్షాలు) ఏం మాట్లాడితే అదే మీరు మాట్లాడితే ఎలా? అంటూ విలేకరులను ఎదురు ప్రశ్నించారు. అందరూ నాకు మద్దతివ్వాలి కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలోని గుట్టపాడు గ్రామం వద్ద 0.7 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రూ.3,000 కోట్ల పెట్టుబడితో జైరాజ్ ఇస్పాత్ సంస్థ నెలకొల్పనున్న ఉక్కు పరిశ్రమ, అబ్దుల్ హఖ్ ఉర్దూ యూనివర్సిటీ భవనాలు, క్లస్టర్ యూనివర్సిటీకి సీఎం చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేశారు. కర్నూలు జిల్లాను శ్రీసిటీ తరహాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో నిమిషంపాటు చంద్రబాబు మాట్లాడారు. జర్నలిస్టులకు త్రిబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని వర్తింపజేయాలని కోరగా... తర్వాత చేస్తామని బదులిచ్చారు. అనంతరం ఓర్వకల్లులో బహిరంగ సభ, కర్నూలులో మేధావులతో ప్రత్యేక హోదాపై ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను పోరాడుతున్నానని, అందరూ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఢిల్లీలో నన్నెవరూ పట్టించుకోలేదు కర్ణాటక ఎన్నికల్లో ఫలానా పార్టీకి ఓటు వేయాలని తాను ఎన్నడూ చెప్పలేదని చంద్రబాబు పేర్కొన్నారు. కేవలం మనకు అన్యాయం చేసిన వారిని ఓడించాలని మాత్రమే కోరానని వివరించారు. రాష్ట్రాభివృద్ధి కోసం 29 సార్లు ఢిల్లీకి వెళ్లానని, అక్కడ తనను కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్క ఓటు కూడా లేదని తేల్చిచెప్పారు. ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 25 ఎంపీ సీట్లు ఇవ్వాలని ప్రజలను కోరారు. పోలవరం ప్రాజెక్టు పనులు 53 శాతం పూర్తయ్యాయని, కేంద్ర ప్రభుత్వం రూ.3,000 కోట్ల నిధులు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలో కేంద్ర విద్యా సంస్థల పనులేవీ ప్రారంభం కాలేదన్నారు. రాయలసీమలో ఎవరూ చేయని విధంగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి కాలేజీలో వైఫై సౌకర్యం కల్పిస్తామని, ప్రతి పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. త్వరలోనే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు భూమా అఖిలప్రియ, కాలువ శ్రీనివాసులు, అమర్నాథ్రెడ్డి, ఎంపీలు టీజీ వెంకటేశ్, బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘2019లోనూ మేమే.. ఆశ పెట్టుకోవద్దు..’
గోరఖ్‌పూర్: ఇక ప్రతిపక్షాలు తమ వ్యూహాలను 2024కు సిద్ధం చేసుకోవాల్సిందేనని బీజేపీ పార్టీ ఫైర్‌బ్రాండ్ నేత యోగీ ఆదిత్యానాధ్ అన్నారు. వచ్చే 2019 ఎన్నికలపై ప్రతిపక్ష పార్టీలు ఇక ఆశలు వదులుకోవాల్సిందేనని చెప్పారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ విజయాన్ని బీజేపీ సాధించిన విషయం తెలిసిందే. గోవా, మణిపూర్‌లో హంగ్ పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో అక్కడ కూడా అధికారం చేపడతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఈ విజయం నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు, ప్రత్యామ్నాయ ఎజెండా తీసుకొచ్చేందుకు మరో వ్యూహాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనిపై వెంటనే స్పందించిన యోగీ ఆదిత్యానాథ్ ‘అమిత్‌షా వ్యూహంతోపాటు కేంద్రం అనుసరిస్తున్న విధానాల ద్వారానే మాకు ఇంత పెద్ద విజయం దక్కింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ మాత్రమే గొప్ప నాయకుడిగా ఎదిగారు. 2019 ఎన్నికలను పక్కకు పెట్టి ఇక ప్రతిపక్షాలు 2024 ఎన్నికలకు వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సిందే’ అని చురకలంటించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈవీఎంల నిర్వహణను చూసింది సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వమేనని, అలాంటి ఆపార్టీకి అనుకూలంగా ఈవీఎంలను మార్చుకునే అవకాశం ఉంటుందేగానీ తమకు ఎలా అవకాశం ఉంటుందని అన్నారు. ఈ ఆరోపణలన్నీ మానుకోని వారి వ్యూహాలు 2024కు పదును పెట్టుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. -
అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
-
అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అసెంబ్లీ, మండలిలో బుధవారం ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమంపై చర్చ జరగనుంది. అసెంబ్లీలో ప్రతిపక్షాలు వివిధ అంశాలపై ఇచ్చిన వాయిదా తీర్మానాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ : రైతులకు ఏకకాలంలో రుణమాఫీ బీజేపీ : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, విద్యార్థులకు కనీస వసతులు టీడీపీ : వ్యవసాయ కమిషన్ ఏర్పాటు. -
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై టికాంగ్రెస్ ఫైట్
-
నోట్ల రద్దుపై చర్చకు భయపడే..
హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు తదనంతర పరిణామాలపై చర్చించడానికి కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలు భయపడే పార్లమెంట్ సమావేశాలు జరగకుండా అడ్డుకున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, తృణాముల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు పార్లమెంటులో చర్చను జరగకుండా స్తంభింపజేయడం దురదృష్టకరమన్నారు. పెద్దనోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం చర్చకు సిద్ధమేనని ప్రకటించినా ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుకున్నాయో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. -
ప్రధాని క్షమాపణకు పట్టు
ప్రతిపక్షాల ఆందోళనతో ఏడో రోజూ సాగని ఉభయ సభలు న్యూఢిల్లీ: వరుసగా శుక్రవారం ఏడో రోజూ పార్లమెంట్ సమావేశాలు చర్చ లేకుండానే వారుుదా పడ్డాయి. నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న తమను విమర్శిస్తున్న ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు ఇరు సభలను స్తంభింపచేశారుు. ఈ డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చడంతో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలు ఉభయ సభల్లో నినాదాలు చేస్తూ వెల్‌లో ఆందోళన చేపట్టారు. నల్లధనం మార్చుకునేందుకు సమయం ఇవ్వనందునే నోట్ల రద్దును విమర్శిస్తున్నారన్న మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డాయి. దీంతో ఉభయ సభలు సోమవారానికి వారుుదాపడ్డారుు. రాజ్యసభ ప్రారంభం కాగానే మాజీ సభ్యుడు దిపెన్ ఘోష్ మృతికి సంతాపం తెలిపారు. ప్రతిపక్షాల వద్ద నల్లధనం ఉందంటూ ప్రధాని తప్పుడు ఆరోపణలు చేశారని, క్షమాపణలు చెప్పాలంటూ బీఎస్పీ చీఫ్ మాయావతి డిమాండ్‌చేశారు.ప్రధాని సభకు రాకపోవడం సభకు, ప్రతిపక్షాలకు అవమానమని విపక్ష నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. ప్రధాని క్షమాపణలు చెప్పరని, ప్రతిపక్షాలే క్షమాపణలు చెప్పాలంటూ పార్లమెంటరీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ స్పష్టం చేశారు. మరోపక్క.. లోక్‌సభలో కూడా ప్రధాని క్షమాపణలకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో గందరగోళం కొనసాగింది. ప్రతిపక్ష పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ప్రధాని సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో గందరగోళం రేగింది. ‘వెల్‌లో నినాదాలు చేస్తూ... పేపర్లు చింపే మీకు మాట్లాడే అవకాశం ఇవ్వాలా? నేను అనుమతించను? అంటూ సభను స్పీకర్ సుమిత్ర అన్నారు. లోక్‌సభలో యువకుడి హల్చల్ న్యూఢిల్లీ: లోక్‌సభలో శుక్రవారం ఓ యువకుడు కొద్దిసేపు అలజడి సృష్టించాడు. పార్లమెంటు సభ్యుల విజిటింగ్ పాస్‌తో ఓ యువకుడు లోనికి ప్రవేశించాడు. సభ వారుుదా ప్రకటన వెంటనే లోక్‌సభ సాధారణ ప్రజల గ్యాలరీ నుంచి సభలో దూకేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతడిని మధ్యప్రదేశ్ రాష్ట్రం శివ్‌పురికి చెందిన రాకేశ్ సింగ్ బాఘెల్‌గా గుర్తించారు. -
ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతిపక్షాల హక్కు
విజయ్‌కాంత్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య సాక్షి ప్రతినిధి, చెన్నై: పరువునష్టం దావా కేసుల్ని ప్రభుత్వాల్ని విమర్శించే వారిపై రాజకీయ అస్త్రాలుగా ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతిపక్షాల హక్కని, విమర్శిస్తే పరువునష్టం దావాలు వేస్తారా? అంటూ అత్యున్నత ధర్మాసనం ప్రశ్నించింది. డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, ఆయన భార్య ప్రేమలతలపై పరువునష్టం దావా కేసులో తిరుప్పూరు కోర్టు పీటీ వారెంట్‌పై గురువారం స్టే మంజూరు చేస్తూ తమిళనాడు ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసింది. పరువునష్టం కేసులో హాజరుకాకపోవడంతో తిరుప్పూరు కోర్టు బుధవారం విజయకాంత్, ఆయన భార్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. జయలలితపై తప్పుడు ఆరోపణలు చేశారని, ప్రభుత్వ పనితీరును విమర్శించారంటూ నవంబర్ 6, 2015న తిరుప్పూరు జిల్లాకు చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కేసు పెట్టారు. తమిళనాడు ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై ఇంతవరకు దాఖలు చేసిన పరువునష్టం దావాల జాబితాను రెండు వారాల్లోగా సమర్పించాలని ఆదేశించింది. విమర్శలపై సహనం పాటించాలని, ఎవరైనా అవినీతి, అసమర్థ ప్రభుత్వం అని విమర్శిస్తే పరువునష్టం దావా వేయలేరని న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ఆర్.ఎఫ్.నారిమన్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తే తమిళనాడులో మాత్రమే ఎందుకు పరువునష్టం దావాలు వేస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు బనాయించడం లేదని, విమర్శించడం ప్రతిపక్షాలకు ఉన్న హక్కని సుప్రీం వ్యాఖ్యానించింది. తమిళనాడులో మాత్రమే ఇన్ని పరువునష్టం కేసులు ఎందుకు దాఖలవుతున్నాయని, తమిళనాడు ముఖ్యమంత్రి తరఫున ప్రభుత్వ న్యాయవాదులు ఎవరెవరిపై ఇంతవరకు దావాలు వేశారో ఆ జాబితాను రెండువారాల్లోగా కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అనంతరం కేసును సెప్టెంబర్ 21కి వాయిదావేసింది. -
విపక్షాలది అనవసర రాద్ధాంతం
చిలుకూరు : మల్లన్న సాగర్‌పై విపక్షాలు కావాలని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం చిలుకూరు మండలంలోని బేతవోలు గ్రామానికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం అన్ని విధాలుగా నిబంధనల ప్రకారం డిజైన్ చేసిందన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 2.70 లక్షల ఎకరాలకు సాగునీరందనుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఎక్కడ కూడా చట్ట వ్యతిరేకంగా పోలేదని, చట్ట ప్రకారమే భూసేకరణ చేపట్టిందన్నారు. విపక్షాలు విమర్శలు చేసేటప్పుడు ఆలోచించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్రావు, తిప్పన విజయసింహారెడ్డి, డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, మాజీ ఎంపీపీ బజ్జూరి వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. -
సీఎంకు ప్రతిపక్షాలంటే చిన్నచూపు: చాడ
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షాలంటే సీఎం కేసీఆర్‌కు ఎలర్జీ, చిన్నచూపు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి మరింత కరువు సహాయాన్ని సాధించేందుకు ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లాలన్న విజ్ఞప్తులను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని, మండలానికి రూ.10 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంచినీరు, పశుగ్రాసం సరఫరా చేయాలని కోరినా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరువుపై మే 6న ఇందిరాపార్కు వద్ద సామూహిక ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొన్ని మండలాలను కాకుండా మొత్తం రాష్ట్రాన్ని కరువుగా ప్రభావితంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణ ప్రతిపక్షాలు వాకౌట్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. సంక్షేమ పద్దులపై తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదంటూ ఆరోపించాయి. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సభలో పలు పద్దులపై చర్చలు కొనసాగుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం గృహనిర్మాణం, వివిధ సంక్షేమశాఖల పద్దులపై చర్చ జరిగింది. దీనిపై తాము లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేదంటూ అందుకు నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నామంటూ బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, వైఎస్ఆర్ సీపీ పార్టీలు చెప్పాయి. దీనిపై మంత్రి హరీష్‌రావు స్పందిస్తూ ప్రభుత్వ పనితీరుని చూసి ఓర్వలేకే విపక్షాలు వాకౌట్ చేశాయని విమర్శించారు. -
'గ్రేటర్ ఎన్నికలు ఇష్టానుసారంగా నిర్వహించొద్దు'
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలను ఇష్టానుసారంగా నిర్వహించొద్దని తెంగాణలోని విపక్ష పార్టీల సభ్యులు రాష్ట్ర ఎన్నికల సంఘాన్నికోరారు. వైఎస్ఆర్సీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని శనివారం కలిశాయి. రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత ఎన్నికలకు 45 రోజుల సమయం ఉండాలని విపక్షాలు ఈసీని కోరాయి. జనవరిలోగా ఎన్నికల ప్రక్రియ ముగించాలన్న హైకోర్టు ఆదేశాలను సవరించేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఎలక్షన్ కమిషన్‌కి విపక్షాలు విజ్ఞప్తి చేశాయి. ఈ విషయంలో తాము కూడా కోర్టును ఆశ్రయిస్తామని విపక్షాలు తెలిపాయి. -
'ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవు'
సాక్షి, హైదరాబాద్ : అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపిస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్, టీడీపీలకు అభ్యర్ధులే దొరకడం లేదని, ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా భాన్సువాడ నియోజవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీల నుంచి పలువురు ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కార్యకర్తలను ఉద్ధేశించి మంత్రి ప్రసంగించారు. వరంగల్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్, టీడీపీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఆ రెండు పార్టీలు ఎన్ని రాజకీయ ఎత్తుగడలు వేసినా తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన అభిప్రాయ పడ్డారు. సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తున్నామని, ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా అభివృద్ధి పథకాలు తీసుకున్నామని, సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని మంత్రి పోచారం పేర్కొన్నారు. నారాయణ ఖేడ్ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికల్లోనూ విజయం టీఆర్ఎస్దే అని ఇప్పటికే అన్ని గ్రామాలూ మద్దతు పలుకుతున్నాయని మంత్రి వివరించారు. -
'ప్రజల్ని మభ్యపెడుతున్న విపక్షాలు'
హైదరాబాద్: తెలంగాణలో విపక్షాలు ప్రజలను మభ్యపెడుతున్నాయని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే విపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అంశంపైనైనా అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధమని సవాల్ విసిరారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. -
అమానుషం.. పేదల వ్యతిరేకం
న్యూఢిల్లీ: ఊహించినట్లుగానే జరిగింది. భూసేకరణ బిల్లును చట్టరూపంలోకి తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి గండికొట్టేందుకు సిద్ధపడ్డాయి. ఈ బిల్లు అమానుషమైనదని, పేదలకు వ్యతిరేకమైందనీ నినదించాయి. కార్పొరేట్లకు అప్పనంగా భూమిని అప్పగించేందుకు మోదీ సర్కారు కుట్రపన్నుతోందని నిరసించాయి. సోమవారం ‘భూసేకరణ, పునరావాస చట్టంలో సముచిత పరిహారం, పారదర్శకత-2015’ సవరణ బిల్లును కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేందర్ సింగ్ లోక్‌సభ ముందుంచారు. భూసేకరణ బిల్లులోని 2, 3ఏ సెక్షన్లపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం చెప్పాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టంలో రైతులకు రక్షణగా ఉన్న సామాజిక ప్రభావ అంచనా(ఎస్ఐఏ) అధ్యయనాన్ని ఈ సెక్షన్లు కాలరాస్తున్నాయని సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆరోపించాయి. దీంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు బిల్లులో కనీసం ఏడు సవరణలకు సూచనప్రాయంగా సంసిద్ధత వ్యక్తంచేశారు. పారిశ్రామిక కారిడార్ల కోసం భూమిని తగ్గించటం, సామాజిక ప్రభావ అంచనా మినహాయింపు నుంచి మౌలిక సౌకర్యాలు, పీపీపీ ప్రాజెక్టులను తొలగించటం వీటిలో ఉన్నాయి. నేడు జరగ నున్న ఓటింగ్ సందర్భంలో ప్రభుత్వం ఈ సవరణలను ప్రతిపాదించే అవకాశం ఉంది. 2013భూసేకరణ చట్టంలో సవరణల ఆర్డినెన్సు బిల్లును ఫిబ్రవరి 24న ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. బిల్లుతో పాటు దీన్ని తిరస్కరిస్తూ ఎన్డీఏ మిత్రపక్షం స్వాభిమాని పక్ష తీసుకువచ్చిన తీర్మానాన్ని కూడా సభ చర్చకు చేపట్టింది. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందినా.. రాజ్యసభలో దాన్ని అడ్డుకోవటానికి ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. అంతకు ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బీరేంద్రసింగ్‌లు విపక్ష పార్టీల నేతలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆహార దిగుమతి దేశంగా మారుస్తారా? భూసేకరణ చట్టాన్ని ప్రస్తుతం ఆర్డినెన్సులో ఉన్న రూపంలో ఆమోదిస్తే ఈ దేశంలో ప్రజలకు ఆహార భద్రత అన్నది లేకుండా పోతుందని కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. బహుళ పంటల భూమిని ప్రైవేటు వ్యక్తులు కొల్లగొట్టుకుపోతారన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే రైతులు ఈ దేశం నుంచి ఇక ఆశించేదేమీ మిగలదని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు రైతుల నుంచి భూమిని లాక్కోకుండా, వారి దగ్గరి నుంచి లీజుకు తీసుకోవటం ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలని అరవింద్ సావంత్ (శివసేన) సూచించారు. కొందరు సభ్యులు బిల్లును పార్లమెంటు స్థాయీసంఘానికి నివేదించాలని కోరారు. బిల్లుపై తమ వైఖరిని పార్టీ చీఫ్ ఉద్ధవ్‌ఠాక్రే నిర్ణయిస్తారని సేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. వ్యతిరేకంగా ఓటేస్తాం..: కాంగ్రెస్ సవరణలను వాపసు తీసుకోకపోతే బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కీలకమైన బిల్లుల ఆమోదానికి వీలుగా బీజేపీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది. ఈ వారం రోజులూ తప్పనిసరిగా ఉభయసభలకు హాజరు కావాలంది. తీసుకురానున్న సవరణలు... భూసేకరణ చట్టంలో విపక్షాల డిమాండ్ మేరకు వీలైనన్ని సవరణలకు సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు లోక్‌సభలో చెప్పారు. బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో మధ్యలో జోక్యం చేసుకున్న వెంకయ్యనాయుడు దేశ ప్రయోజనాల దృష్ట్యా బిల్లును ఆమోదించాలని సభను కోరారు. సభ్యులు ప్రతిపాదించిన మొత్తం 52 సవరణలను పరిశీలించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే మంగళవారం ఓటింగ్ సమయానికి 7 సవరణలతో ప్రభుత్వం ముందుకు రానుందని సమాచారం. వీటికి సంబంధించి వెంకయ్య సోమవారం సభలోనే సంకేతాలిచ్చారు. ప్రభుత్వం తీసుకురానున్న సవరణలు ఇవీ... పారిశ్రామిక కారిడార్లకు భూమిని తగ్గించటం బంజరు భూముల కోసం ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు . ఆ భూములను పారిశ్రామిక ప్రాజెక్టులకు వినియోగించటం. నిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలన్న నిబంధన చేర్పు. పునరావాస సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ. రైల్వే ట్రాకులు, హైవేలకు రెండువైపులా భూసేకరణను పరిమితం చేయటం. భూసేకరణపై హైకోర్టు అప్పీలుకు వెళ్లకుండా, ముందుగా జిల్లా అధికారులకు అప్పీలు చేసే అవకాశాన్ని కల్పించటం సామాజిక ప్రభావ అంచనా(ఎస్ఐఏ) అధ్యయనం మినహాయింపు, జరీబు భూముల సేకరణకు అనుమతికి అవకాశం కల్పించిన 5 రంగాల నుంచి సామాజిక మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులు, పీపీపీ ప్రాజెక్టులను తొలగించటం అయితే ఏదైనా ప్రాజెక్టు అయిదేళ్లలో పూర్తికాకపోతే భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిబంధనను తొలగించటాన్ని ఆయన సమర్థించుకున్నారు. ఈ నిబంధనను ఉంచినట్లయితే భారతదేశం పూర్తికాని ప్రాజెక్టుల దేశంగా మిగిలిపోతుందని చెప్పారు. ఏప్రిల్ 5 నాటికల్లా ఆర్డినెన్సు చట్టరూపం దాల్చాల్సి ఉందని, లోక్‌సభ మార్చి 20 వరకే జరుగుతుందని ఈ లోపు బిల్లు ఆమోదం పొందాలని ఆయన అన్నారు. -
జీతభత్యాలను పెంచుకునే సమయమిదా?
సమస్యలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రాష్ర్ట ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్షాలు సాక్షి, హైదరాబాద్: రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రజాప్రతినిధులకు జీతభత్యాలు పెంచడం సమంజసం కాదని విపక్షాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుత, మాజీ శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు జీతభత్యాలు, ఇతర సదుపాయాల గురించి చర్చించడానికి స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన సదుపాయాల కమిటీ మంగళవారం సమావేశమైంది. సభ్యుల జీతభత్యాలను రెట్టింపు చేయడాన్ని మజ్లిస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ సభ్యులు వ్యతిరేకించారు. పెరిగిన ఖర్చులు, జీవన ప్రమాణాలకు అనుగుణంగా జీతభత్యాలను పెంచాలని పలువురు కోరుతున్నారని, అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్ వివరించారు. రైతాంగం సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సమయంలో బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులు జీతభత్యాలను పెంచుకుంటే ఎలాంటి సంకేతాలను ఇచ్చినట్టవుతుందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, చింతల రామచంద్రారెడ్డి(బీజేపీ), సున్నంరాజయ్య(సీపీఎం), రవీంద్రకుమార్(సీపీఐ) ప్రశ్నించారు. హరీశ్ స్పందిస్తూ... ‘అనుదినం ప్రజల్లో ఉంటున్న వారికి రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. వచ్చీపోయే వారికి కనీసం టీ పోయడానికి కూడా ఇప్పుడున్న జీతం సరిపోవడం లేదని కొందరు సభ్యులు అంటున్నారు. జీవన ప్రమాణాలకు అనుగుణంగా జీతభత్యాలను పెంచడం ద్వారా చట్టసభలో సభ్యులుగా ఉన్నవారు పక్కదారులు, పర్సంటేజీలకు పోకుండా నిజాయితీగా పనిచేయడానికి వీలుంటుందని చాలామంది ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అవినీతికి దూరంగా ఉండాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు జీతాలను పెంచడం ద్వారా మరింత నిజాయితీతో పనిచేయడానికి వీలుంటుందని ప్రభుత్వం భావించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది’ అని వివరించారు. హరీశ్ వాదనకు అక్బరుద్దీన్ ఘాటుగా స్పందించారు. ‘మనకు ఇష్టం వచ్చినట్టు జీతాలను పెంచుకుంటూ పోతున్నాం. దీనికి ఒక విధానమంటూ లేదా? మిగతా రాష్ట్రాల్లో పాటిస్తున్న ప్రాతిపదిక ఏమిటి? వీటిపై దేశవ్యాప్తంగా అధ్యయనం చేయండి. తర్వాత వాటికి అనుగుణంగా ఇక్కడి పరిస్థితులను బట్టి జీతభత్యాలపై నిర్ణయం తీసుకుంటే బాగుం టుంది’ అని సూచించారు. మిగతా పార్టీల సభ్యులు కూడా దీనికి అంగీకరించారు. ప్రస్తుత సభ్యులతో పాటు మాజీ సభ్యులకు పెన్షన్లు, నగదురహిత వైద్యం, వైద్య చికిత్సలకు పరిమితిని పెంచాలన్న అంశాలపైనా చర్చ జరిగింది. శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, డిప్యూటీ స్పీక ర్ పద్మా దేవేందర్ రెడ్డి, మంత్రి ఈటెల రాజేం దర్, వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.