పార్లమెంట్‌ సమావేశాలు: ఉభయ సభలు గురువారానికి వాయిదా | Monsoon Session 2022 LIVE: Day 3 Sessions Highlights | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ సమావేశాలు: ఉభయ సభలు గురువారానికి వాయిదా

Published Wed, Jul 20 2022 10:28 AM | Last Updated on Wed, Jul 20 2022 4:27 PM

Monsoon Session 2022 LIVE: Day 3 Sessions Highlights - Sakshi

Monsoon Session 2022 Day 3 Updates:

జీఎస్‌టీ, ధరల పెరుగుదలపై ప్రతిపక్ష నాయకులు వరుసగా మూడో రోజు తమ నిరసనలు కొనసాగించడంతో లోక్‌సభ సైతం గురువారానికి వాయిదా పడింది.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో నిరసన పర్వం కొనసాగుతోంది. ధరల పెరుగుదలపై విపక్షాల నిరంతర నిరసనల మధ్య లోక్‌సభ వాయిదా పడింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సభ తిరిగి సమావేశం కానుంది.

► ధరల పెరుగుదలపై ఉభయసభల్లో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. విపక్షాల ఆందోళనతో రాజ్యసభ సమావేశాలనుగురువారానికి వాయిదా పడింది. జులై 18 నుండి ఐదు శాతం జిఎస్‌టి పన్ను అమలులోకి వచ్చిన క్రమంలో పాలు, పెరుగు ప్యాకెట్లను పట్టుకుని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభ వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. దీంతో వరుసగా మూడో రోజు కూడా సభా కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో రేపు ఉదయం 11 గంటలకు రాజ్యసభ వాయిదా పడింది.

టీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసన
► 
ధరల పెంపు, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ ఎంపీలు గళమెత్తారు. పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపై జీఎస్టీ పన్నుపోటును నిరసిస్తూ.. నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. పాలు, పాల ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాలను ప్రదర్శిస్తూ నిరసనలో పాల్గొన్నారు. గ్యాస్ ధరల పెంపుపై ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఆందోళనలో టీఆర్ఎస్ ఎంపీలతోపాటు ఇతర విపక్ష ఎంపీలు కూడా పాల్గొన్నారు.

► రాజ్యసభలో ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ధరల పెరుగుదలపై పార్లమెంట్‌లో చర్చకు కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోందని, ఎలాంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు

ద్రవ్యోల్బణం, కొన్ని నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు.

రాజ్యసభలోనూ అదే తీరు

విపక్షాల నినాదాలతో.. రాజ్యసభను మధ్యాహ్నాం 2 గంటలకు వాయిదా వేశారు చైర్మన్‌ వెంకయ్య నాయుడు.

లోక్‌సభ వాయిదా
ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణాన్ని నిరసిస్తూ ఉభయసభల్లో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. లోక్‌సభలో క్వశ్చన్ అవర్‌కు అంతరాయం కలిగించారు కాంగ్రెస్ సహా మిగిలిన విపక్ష ఎంపీలు. దిగజారుతున్న రూపాయి విలువ, ధరల పెంపుపై చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలని స్పీకర్ ఓంబిర్లా పదే పదే విజ్ఞప్తిచేసినా పట్టించుకోలేదు. దీంతో కాంగ్రెస్‌ సభ్యుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు స్పీకర్‌. క్వశ్చన్ అవర్‌ను అడ్డుకోవడం సరికాదన్నారు. పార్లమెంట్ చర్చల కోసమని.. నిరసనల కోసం కాదని స్పష్టంచేశారు. లోక్‌సభను మధ్యాహ్నం 2గంటలవరకూ వాయిదా వేశారు.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభం.

► వర్షాకాల సమావేశాల మూడో రోజు దరిమిలా..  ధరల పెరుగుదల మరియు ద్రవ్యోల్బణం సమస్యలపై పార్లమెంటులోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున్ ఖర్గే మరియు అధిర్ రంజన్ చౌదరి నిరసనల్లో పాల్గొన్నారు.

► పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు విపక్షాల ఆందోళన ఆటంకంగా మారింది. రెండు రోజులపాటు ఉభయ సభలు సజావుగా సాగలేక.. వాయిదాల పర్వంతోనే నెట్టుకొచ్చాయి. ఈ తరుణంలో.. 

► ఆహార పదార్థాలపై పెంచిన జీఎస్టీ, ద్రవ్యోల్బణంపై చర్చించేందుకు బుధవారం ఉదయం రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వాయిదా నోటీసు ఇచ్చారు.

► పార్లమెంట్‌ ఉభయ సభల్లో అంతరాయాలపై కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీపై.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఆయనెప్పుడూ పార్లమెంట్‌లో గళం వినిపించింది లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది లేదు. ఎప్పుడూ పార్లమెంట్‌ కార్యకలాపాలను అగౌరవపరుస్తూ వస్తున్నాడు. పార్లమెంట్‌లో 40% కంటే తక్కువ హాజరు ఉన్న వ్యక్తి ఆయనే. అలాంటి రాజకీయంగా ఉత్పాదకత లేని వ్యక్తి.. ఇప్పుడు పార్లమెంటులో చర్చ జరగకుండా చూసుకోవడానికి తనను తాను అంకితం చేసుకుంటున్నాడు’’ అంటూ ఎద్దేవా చేశారు స్మృతి ఇరానీ. 

► ఇక పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. మూడో రోజూ ఆందోళనకు విపక్షాలు సిద్ధం అయ్యాయి. సమావేశాల ప్రారంభం కంటే ముందుగానే నిత్యావసరాలపై జీఎస్టీరేట్ల పెంపు, పెరిగిన ధరలు తదితర అంశాలపై నిరసన తెలపాలని నిర్ణయించుకున్నాయి.

► మరోవైపు ప్రధాని మోదీ అధ్యక్షతన మధ్యాహ్నాం కేంద్ర కేబినెట్‌ భేటీ కానుంది. సభలో వ్యవహరించాల్సిన తీరు.. విపక్షాల విమర్శలకు తగిన సమాధానాలు సిద్ధం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. మంత్రులకు సూచించనున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement