Rates hike
-
పసిడి పరుగులు.. ఇంకెంత పెరుగుతుందో?
-
వీసా ఫీజులు పెంచిన అమెరికా
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ, ఎల్–1, ఈబీ–5 తదితర నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుల ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా పెంపు ప్రకారం..భారతీయ టెక్కీలు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే హెచ్–1బీ వీసా ఫీజు ప్రస్తుతమున్న 460 డాలర్ల నుంచి ఏకంగా 780 డాలర్లకు పెరిగింది. హెచ్–1బీ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా 10 అమెరికన్ డాలర్ల నుంచి 215 డాలర్లకు పెరగనుంది. రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుంది. అదే విధంగా, ఎల్–1 వీసా ఫీజు 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు, ఇన్వెస్టర్ల వీసాగా పిలిచే ఈబీ–5 కేటగిరీ వీసా ఫీజును ప్రస్తుతమున్న 3,675 డాలర్ల నుంచి ఏకంగా 11,160 డాలర్లకు పెంచుతున్నట్లు ఫెడరల్ ప్రభుత్వం బుధవారం ఒక నోటిఫికేషన్లో వివరించింది. 2016 తర్వాత మొదటిసారిగా చేపట్టిన వీసా ఫీజుల పెంపు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు కానుంది. -
పెరుగుతున్న ఉల్లి ఘాటు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉల్లి ఘాటెక్కుతోంది. ఉత్తర భారతంలోని ఢిల్లీ సహా ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో నవరాత్రులు ముగిసిన అనంతరం నుంచి ధరలు పెరుగుతున్నాయి. పది రోజుల కిందటి వరకు ఢిల్లీలో కిలో ఉల్లి ధర రూ.30–40 వరకు ఉండగా ఇప్పుడు రూ.60–70కి చేరుకుంది. ఈ ధర నవంబర్ తొలివారం ముగిసేనాటికి ఏకంగా రూ.100 మార్కును చేరే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఉల్లి సరఫరాలో కీలకంగా ఉన్న మహారాష్ట్రలోని నాసిక్ మార్కెట్లకు సరఫరా తగ్గిందని, ఈ కారణంగా ధరలు పెరుగుతున్నాయని వారు వాదిస్తున్నారు. ధరల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్ నుంచి 1.70 లక్షల టన్నుల ఉల్లి నిల్వలను మార్కెట్లోకి విడుదల చేసింది. మరింత స్టాక్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. శనివారం ఢిల్లీలోని 400 సఫల్ రిటైల్ స్టోర్లలో కేజీ ఉల్లి రూ.67కు విక్రయించారు. బుధవారం ఇవే స్టోర్లలో రూ.54–56 పలికిన కిలో ఉల్లి ఇప్పుడు హఠాత్తుగా పైకి ఎగిసింది. నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్(ఎన్సీసీఎఫ్), జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య(నాఫెడ్) సొంత ఔట్లెట్లు, వాహనాల్లో మాత్రం సబ్సిడీ రేటుకే కేజీ ఉల్లిని రూ.25కే విక్రయిస్తుండం విశేషం. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం శనివారం దేశవ్యాప్తంగా కేజీ ఉల్లి సగటు ధర రూ.45 మాత్రమే. -
డెట్ ఫండ్స్ నుంచి ఉపసంహరణలు
న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఆగస్ట్ నెలలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. జూలై నెలలో నికర పెట్టుబడులను ఈ విభాగం ఆకర్షించగా.. ఆగస్ట్‌లో రూ.25,872 కోట్లు వీటి నుంచి బయటకు వెళ్లిపోయాయి. అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ఇంకా ముగియకపోవడంతో ఇన్వెస్టర్లు డెట్ ఫండ్స్‌లో పెట్టుబడుల పట్ల అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డెట్‌లో 16 విభాగాలకు గాను 9 విభాగాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. లిక్విడ్ ఫండ్స్ (రూ.26,824 కోట్లు), అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ (రూ.4,123 కోట్లు)లో ఎక్కువగా అమ్మకాలు నమోదయ్యాయి. ఇవన్నీ స్వల్పకాల పెట్టుబడుల కోసం ఉద్దేశించిన పథకాలు. అలాగే, బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ విభాగం సైతం నికరంగా రూ.985 కోట్ల పెట్టుబడులను కోల్పోయింది. ఇక ఓవర్ నైట్ ఫండ్స్ రూ.3,158 కోట్లు, ఫ్లోటర్ ఫండ్స్ రూ.2,325 కోట్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్ రూ.1,755 కోట్ల చొప్పున ఆకర్షించాయి. ఈ ఏడాది జూలైలో డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ.61,140 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. ఈక్విటీల్లోకి పెట్టుబడులు.. ‘‘ప్రస్తుత వడ్డీ రేట్ల వాతావరణం, వడ్డీ రేట్ల గమనంపై నెలకొన్న అనిశి్చతితో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది. వడ్డీ రేట్ల గమనంపై స్పష్టత వచ్చే వరకు వేచి ఉండే ధోరణి అనుసరించినట్టుగా ఉంది. అదే సమయంలో ఈక్విటీల్లో ర్యాలీ మొదలు కావడంతో డెట్ నుంచి పెట్టుబడులను అటువైపు మళ్లించినట్టున్నారు’’అని మారి్నంగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ మెలి్వన్ శాంటారియా వివరించారు. తాజా అమ్మకాలతో ఆగస్ట్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని డెట్ ఫండ్స్ పెట్టుబడుల విలువ రూ.14 లక్షల కోట్లకు పరిమితమైంది. జూలై చివరికి ఇది రూ.14.17 లక్షల కోట్లుగా ఉంది. -
'భోళా శంకర్' టికెట్ ధరల పెంపునకు బ్రేక్.. కారణమిదే
ప్రముఖ నటుడు చిరంజీవి నటించిన 'భోళా శంకర్' సినిమా టికెట్ల ధరల పెంపుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. టికెట్ల ధరలను పెంచాలంటే నిబంధనల ప్రకారం నిర్ణయించిన 11 డాక్యుమెంట్లును ఆ చిత్ర నిర్మాతలు సమర్పించలేదని ప్రభుత్వం తెలిపింది. అందువల్ల 'భోళా శంకర్' టికెట్ల ధరలు పెంచేందకు అనుమతి లేనట్లు పేర్కొంది. 101 కోట్లతో సినిమాను నిర్మించినట్టు నిర్మాతలు పేర్కొన్నారు కానీ అందుకు అవసరమైన పత్రాలను నిర్మాతలు ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం సూచించింది. సినిమా నియంత్రణ చట్టం ప్రకారం ఏపీలో 20 శాతం షూటింగ్ చేసినట్లు నిర్మాతలు ఆధారాలు సమర్పించలేదని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా డైరెక్టర్, హీరో, హీరోయిన్ల పారితోషికం కాకుండా సినిమా నిర్మాణానికి రూ.100 కోట్లు ఖర్చు పెట్టిన్నట్లు నిరూపించే పత్రాలను దరఖాస్తుతో జత చేయనందున అనుమతి నిరాకరిస్తున్నట్లు ఏపీ తెలియజేసింది. అన్ని వివరాలతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నట్లయితే టికెట్ ధరలు పెంచుకొనే విషయం పరిశీలిస్తామని తెలియజేసింది. (ఇదీ చదవండి: Bhola Shankar: భోళాశంకర్ ఆపాలంటూ కేసు.. చంపుతామంటూ డిస్ట్రిబ్యూటర్‌కు బెదిరింపులు) గతంలో చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమాకు టికెట్ ధరల పెంచుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పించిందనే విషయాన్ని గుర్తుచేసింది. అప్పుడు ఆ సినిమాకు సంబంధించిన అన్నీ డాక్యుమెంట్లను ఏపీ ప్రభుత్వానికి నిర్మాతలు అందించారని పేర్కొంది. ఇప్పుడు భోళా శంకర్ నిర్మాతలు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించలేదు. కాబట్టే టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు ఇవ్వలేదని ప్రభుత్వం పేర్కొంది. -
అమూల్ పాల సేకరణ ధరలు మరోసారి పెంపు
-
టాటా కార్లు మరింత ప్రియం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ కాస్త ప్రియం కానున్నాయి. మోడల్, వేరియంట్‌ను బట్టి ధర సగటున 0.6 శాతం పెరగనుంది. మే 1 నుంచి సవరించిన ధరలు అమలులోకి రానున్నాయని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. 2023 ఫిబ్రవరి తర్వాత ధరలు పెంచడం ఇది రెండవసారి. నియంత్రణపర మార్పులు, ముడిసరుకు వ్యయం అధికం కావడం తాజా నిర్ణయానికి దారి తీసిందని టాటా మోటార్స్ తెలిపింది. -
మందులు వాడేవారికి ధరల దెబ్బ!
వివిధ రుగ్మతలతో బాధపడుతూ ఉపశమనం కోసం మందులు వాడుతున్నవారికి ధరల దెబ్బ తగలనుంది. పెయిన్ కిల్లర్స్ నుంచి యాంటిబయాటిక్స్ వరకూ పలు రకాల మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి పెరుగుతున్నాయి. హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్లూపీఐ)లో మార్పునకు అనుగుణంగా ఏప్రిల్ 1 నుంచి పలు రకాల మందుల ధరలను 12 శాతం మేర పెంచుకోడానికి ప్రభుత్వం ఫార్మాస్యూటికల్ కంపెనీలకు అనుమతినిచ్చింది. ఇదీ చదవండి: అమ్మగా ఆలోచించి.. రూ. 50 కోట్లకు పైగా ఆదాయం.. ఈమె స్విమ్మింగ్ చాంపియన్ కూడా... ధరలు పెరుగుతున్న మందులలో చాలా వరకు యాంటీ ఇన్ఫెక్టివ్‌లు, పెయిన్కిల్లర్లు, కార్డియాక్ వంటి ప్రాణాలను రక్షించే మందులు ఉన్నాయి. నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్‌లో చేర్చిన దాదాపు 800 ఔషధాల రిటైల్ ధరపై ఈ ధరల పెంపు ప్రభావం ఉంటుందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ జాబితాలో కోవిడ్ చికిత్సకు ఉపయోగించే మందుల దగ్గర నుంచి ఓఆర్ఎస్, డిస్ఇన్ఫెక్టెంట్ మందుల వరకు దాదాపు అన్ని అవసరమైన మందులు ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి ధరలు పెరిగే మందులు ఇవే... హాలోథేన్, ఐసోఫ్లోరేన్, కెటామైన్, నైట్రస్ ఆక్సైడ్ మొదలైన సాధారణ మత్తు మందులు, ఆక్సిజన్ మందులు. పెయిన్ కిల్లర్స్: డిక్లోఫెనాక్, ఇబుప్రోఫెన్, మెఫెనామిక్ యాసిడ్, పారాసెట్మాల్, మార్ఫిన్ పాయిజనింగ్‌లో యాంటీడోట్స్: యాక్టివేటెడ్ చార్కోల్, డి-పెనిసిల్లమైన్, నాలాక్సోన్, స్నేక్ వెనమ్ యాంటీసెరమ్ యాంటికాన్వల్సెంట్స్: క్లోబాజామ్, డయాజెపామ్, లోరాజెపామ్ పార్కిన్సన్స్, డిమెన్షియా: ఫ్లూనారిజైన్, ప్రొప్రానోలోల్, డోనెపెజిల్ యాంటీబయాటిక్స్: అమోక్సిసిలిన్, యాంపిసిలిన్, బెంజైల్పెనిసిలిన్, సెఫాడ్రోక్సిల్, సెఫాజోలిన్, సెఫ్ట్రియాక్సోమ్ కోవిడ్ చికిత్సకు ఉపయోగించే మందులు యాంటీ టీబీ ఔషధం: అమికాసిన్, బెడాక్విలిన్, క్లారిథ్రోమైసిన్ మొదలైనవి. యాంటీ ఫంగల్: క్లోట్రిమజోల్, ఫ్లూకోనజోల్, ముపిరోసిన్, నిస్టాటిన్, టెర్బినాఫైన్ తదితరాలు యాంటీవైరల్ మందులు: ఎసిక్లోవిర్, వల్గాన్సిక్లోవిర్ వంటివి. హెచ్ఐవీ చికిత్సకు వినియోగించే అబాకావిర్, లామివుడిన్, జిడోవుడిన్, ఎఫవిరెంజ్, నెవిరాపైన్, రాల్టెగ్రావిర్, డోలుటెగ్రావిర్, రిటోనావిర్ తదితర మందులు. మలేరియా మందులు: ఆర్టెసునేట్, ఆర్టెమెథర్, క్లోరోక్విన్, క్లిండామైసిన్, క్వినైన్, ప్రిమాక్విన్ మొదలైనవి. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే 5-ఫ్లోరోరాసిల్, ఆక్టినోమైసిన్ డి, ఆల్-ట్రాన్స్ రెటినోయిక్ యాసిడ్, ఆర్సెనిక్ ట్రైయాక్సైడ్, కాల్షియం ఫోలినేట్ మొదలైనవి. ఫోలిక్ యాసిడ్, ఐరన్ సుక్రోజ్, హైడ్రాక్సోకోబాలమిన్ వంటి రక్తహీనత మందులు ప్లాస్మా, ప్లాస్మా ప్రత్యామ్నాయాలు కార్డియోవాస్కులర్ మందులు: డిలిటాజెమ్, మెటోప్రోలోల్, డిగోక్సిన్, వెరాప్రమిల్, అమ్లోడిపైన్, రామిప్రిల్, టెల్మిసార్టెన్ మొదలైనవి. చర్మసంబంధమైన మందులు యాంటిసెప్టిక్స్, క్రిమిసంహారకాలు: క్లోరోహెక్సిడైన్, ఇథైల్ ఆల్కహాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్, పోవిడిన్ అయోడిన్, పొటాషియం పర్మాంగనేట్ మొదలైనవి. బుడెసోనైడ్, సిప్రోఫ్లోక్సాసిన్, క్లోట్రిమజోల్ మొదలైన ఈఎన్టీ ఔషధాలు. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మందులైన ఓఆర్ఎస్, లాక్టులోజ్, బిసాకోడిల్ వంటివి. హార్మోన్లు, ఇతర ఎండోక్రైన్ మందులు, గర్భనిరోధకాలు వ్యాక్సిన్లు: హెపటైటిస్ బి, డీపీటీ వ్యాక్సిన్, జపనీస్ ఎన్సెఫాలిటిస్ వ్యాక్సిన్, మీజిల్స్ వ్యాక్సిన్, రేబిస్ వ్యాక్సిన్ మొదలైనవి. ఆప్తాల్మోలాజికల్ మందులు, ఆక్సిటోసిక్స్, యాంటీఆక్సిటోసిక్స్ మానసిక రుగ్మతల చికిత్సకు ఉపయోగించే మందులు శ్వాసకోశ సంబంధ రుగ్మతలకు వినియోగించే మందులు, విటమిన్లు, మినరల్స్. ఇదీ చదవండి: Charges on UPI: యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు.. యూజర్లకు వర్తిస్తాయా? -
దసరా ఎఫెక్ట్: ప్లాట్‌ఫాం టికెట్ రేట్లు పెంపు.. స్పెషల్ ట్రైన్స్ ఇవే..
దసరా పండుగ వేళ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే షాకిచ్చింది. పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దీనిలో భాగంగానే కాచిగూడ రైల్వే స్టేష్లన్‌లో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచింది. కాగా, పెరిగిన ధరలు నేటి(సెప్టెంబర్ 25) నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు అమలులో ఉంటాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అక్టోబర్ 9 తర్వాత మళ్లీ టికెట్ ధర రూ. 10కి చేరుతుంది. ఇదిలా ఉండగా.. దసర పండుగ సందర్బంగా ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లను సైతం నడుపుతున్నట్టు వెల్లడించింది. సికింద్రాబాద్-యశ్వంత్ పూర్, సికింద్రాబాద్-తిరుపతిల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. Temporary Increase in Platform Ticket Price to Rs. 20/- at #Kacheguda Railway Station during #Dussehra Festival Season. The hike in platform ticket price is applicable up to 09th October, 2022. *Rail users may kindly note the same and extend cooperation. pic.twitter.com/WW7k52GrM3 — South Central Railway (@SCRailwayIndia) September 26, 2022 ప్రత్యేక సర్వీసుల వివరాలు ఇవే.. - సెప్టెంబర్ 28న.. సికింద్రాబాద్ నుంచి యశ్వంత్ పూర్. - సెప్టెంబర్ 29న.. యశ్వంత్ పూర్ నుంచి సికింద్రాబాద్. - అక్టోబర్ 9న.. తిరుపతి నుంచి సికింద్రాబాద్. - అక్టోబర్ 10న.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు నడుస్తుంది. Kindly note: SCR to run #Train No. 07265/66 Secunderabad- Yesvantpur-Secunderabad Special train Ex. Secunderabad on 28.09.22 and Ex. Yesvantpur on 29.09.22 under TOD(trains on demand) to clear extra rush.#SWRupdates .@DDChandanaNews pic.twitter.com/QUJY6oADaN — South Western Railway (@SWRRLY) September 26, 2022 -
వాహనదారులకు అలర్ట్.. పెరిగిన ఫ్యాన్సీ నంబర్ల రేట్లు!
అనంతపురం సెంట్రల్: వాహనం ఉండాలన్నది ప్రతి ఒక్కరి కోరిక. కారు కొన్నాక నచ్చిన నంబర్ ఉండాలన్నది మరో సెంటిమెంట్. లక్కీ నంబర్ కావాలని చాలామంది ఆశ పడుతుంటారు. ఇందు కోసం ఎంత డబ్బు అయినా వెచ్చించడానికి వెనుకాడరు. ఏడాది క్రితం రూ.50 వేలు ప్రారంభ ధర ఉన్న 9999 నంబర్ వేలంలో రూ.7.20 లక్షలు పలికింది. అనంతపురానికి చెందిన ఓ కాంట్రాక్టర్ ఈ నంబర్ కోసం పోటీ పడి మరీ దక్కించుకున్నాడు. ఫ్యాన్సీ నంబర్ రూపంలో రవాణా శాఖకు ఏటా రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది. ఎక్కువశాతం సంపన్నులు ఈ నంబర్లకు పోటీ పడుతున్నారు. గతంలో ఉన్న రేట్లను సవరిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని అనంతపురం ఆర్టీఓ సురేష్ నాయుడు తెలిపారు. సవరించిన ధరలు ఇలా.. - 9999 నంబరుకు రూ. 2 లక్షలు - 1, 9, 999 నంబర్లకు రూ. 1 లక్ష - 99, 3333, 4444, 5555, 6666, 7777 నంబర్లకు రూ.50వేలు - 5, 6, 7, 333, 369, 555, 666, 777, 1116, 1234, 2277, 2345, 2727, 3339, 3366, 3456, 3699, 3939, 4455, 4545, 4599, 6669, 6789, 8055, 8888 నంబర్లకు రూ.20 వేలు - 3, 111, 123, 234, 567, 1188, 1818, 1899, 1999, 2222, 2799, 3636, 3999, 5678, 5999, 6999,7999, 9009 నంబర్లకు రూ.15వేలు - 2, 4, 8, 18, 27, 36, 45, 77, 143, 222, 444, 786, 789, 909, 1122, 1233, 1269, 1314, 1359, 2223, 2255, 2349, 3344, 3399, 3555, 3789 నంబర్లకు రూ.10 వేలు చొప్పున ప్రారంభ ధరలుగా నిర్ణయించారు. పోటీని బట్టి సదరు నంబర్‌కు ఎంత ధర అయినా పలకవచ్చు. -
Repo rate rise: రేట్లకు రెక్కలు.. ఏం చేద్దాం?
ఈ ఏడాది ఏప్రిల్ వరకు గృహ రుణాలపై వడ్డీ రేటు 6.5 శాతం. ఇళ్ల కొనుగోలుదారులను ఈ రేటు ఎంతో ఆకర్షించింది. కనిష్ట రేటును చూసి ఇళ్లను కొనుగోలు చేసిన వారు ఎందరో..? పాశ్చాత్య దేశాల మాదిరే మన ఆర్థిక వ్యవస్థ కూడా తక్కువ రేట్ల దిశగా అడుగులు వేస్తుందన్న విశ్లేషణలు అంతకుముందు వరకు వినిపించాయి. కానీ, కేవలం కొన్ని నెలల్లోనే పరిస్థితులు మారిపోయాయి. రుణ రేట్లు సుమారు ఒక శాతం మేర పెరిగాయి. ఆర్బీఐ రెపో రేటును 0.90 శాతం మేర పెంచింది. ఇది కచ్చితంగా రుణ గ్రహీతలపై భారం మోపేదే. రేట్ల పెంపు కథ ఇంతటితో ముగియలేదు. ఇప్పుడే మొదలైంది. మరిన్ని రేట్ల పెంపులు ఉంటాయన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. మరి ఈ తరుణంలో రేట్ల పెంపు ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉంటుంది..? గృహ రుణాలు తీసుకున్న వారి పరిస్థితి ఏంటి..? తీసుకోబోయే వారి ముందున్న మార్గాలు ఏంటన్న విషయాలను చర్చించే కథనమే ఇది. 80 శాతం రిటైల్ రుణాలు ఫ్లోటింగ్ రేటు ఆధారితంగానే ఉంటున్నాయి. కనుక ఆర్బీఐ రేట్ల సవరణ ప్రభావం దాదాపు అన్ని రకాల రిటైల్ రుణాలపైనా ప్రతిఫలిస్తుంది. ముఖ్యంగా ఈబీఎల్ఆర్ను గృహ రుణాలను లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టిందేనని గుర్తు పెట్టుకోవాలి. రిటైల్ రుణాల్లో సగానికి పైన గృహ రుణాలే ఉన్నాయి. కనుక బ్యాంకులు వేగంగా గృహ రుణ రేట్లను సవరించాయి. కారు, ద్విచక్ర వాహన రుణాలపైనా అదనపు భారం పడింది. అయితే ఈ విభాగంలోని మొత్తం రుణాల్లో ఈబీఎల్ఆర్కు అనుసంధానమై ఉన్నవి 40 శాతం కంటే తక్కువ. ఈ తరహా రుణాలకు ఈబీఎల్ఆర్ కంటే ముందు విధానమైన ఎంసీఎల్ఆర్నే బ్యాంకులు అనుసరిస్తున్నాయి. బ్యాంకులు రెపో మాదిరే గృహ రుణాలపై 0.90 శాతం పెంపును అమలు చేయగా.. ఇతర రుణ ఉత్పత్తులపై పెంపు వాటి విచక్షణకు అనుగుణంగా ఉండడాన్ని గమనించొచ్చు. ఉదాహరణకు యాక్సిస్ బ్యాంకు కారు రుణంపై రేటును 7.45 శాతం నుంచి 8.5 శాతానికి పెంచగా.. ఎస్బీఐ 7.2 శాతం నుంచి 7.7 శాతానికి సవరించింది. ఇంట్రెస్ట్ సేవర్ అకౌంట్ వడ్డీ రేట్ల పెరుగుదల క్రమంలో ఉన్నాం. కనుక గృహ రుణం తీసుకునే వారు డౌన్ పేమెంట్ (తన వంతు వాటా) ఎక్కువ సమకూర్చుకోవడం ఒక మార్గం. ఎక్కువ సమకూర్చుకునేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోతే అప్పుడు ‘హోమ్‌లోన్ ఇంటరెస్ట్ సేవర్ అకౌంట్’ లేదా ‘స్మార్ట్లోన్’ను పరిశీలించొచ్చు. ఒక్కో బ్యాంకు ఒక్కో పేరుతో ఈ తరహా రుణాలను మార్కెట్ చేస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు ‘మనీ సేవర్ హోమ్ లోన్’, ఎస్బీఐ ‘మ్యాక్స్ గెయిన్ హోమ్‌లోన్’, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు ‘హోమ్ సేవర్’ అనేవి ఈ తరహా రుణ ఉత్పత్తులే. రెండు ప్రయోజనాలు.. ఈ రుణం కరెంటు ఖాతాకు అనుసంధానమై ఉంటుంది. మీ దగ్గర ఉన్న మిగులు బ్యాలన్స్ ఎంతైనా కానీయండి ఈ కరెంటు ఖాతాలో డిపాజిట్ చేసుకుంటే చాలు. ఆ మేరకు రుణంపై వడ్డీ భారం తగ్గిపోయినట్టే. ఉదాహరణకు మీరు రూ.50 లక్షల గృహ రుణాన్ని ఇంకా చెల్లించాల్సి ఉందనుకుంటే.. రూ.5 లక్షలు మిగులు మీ వద్ద ఉంటే దాన్ని కరెంటు ఖాతాలో డిపాజిట్ చేసుకోవాలి. అప్పుడు గృహ రుణం రూ.45 లక్షలపైనే వడ్డీ పడుతుంది. మరొక ప్రయోజనం ఏమిటంటే.. మిగులు రూ.5లక్షలను కరెంటు ఖాతా నుంచి ఎప్పుడైనా వెనక్కి తీసేసుకోవచ్చు. కనుక మిగులు నిల్వలను ఈ ఖాతాలో ఉంచుకోవడం ద్వారా గృహ రుణంపై వడ్డీ భారాన్ని కొంత దింపుకోవడం ఇందులో ఉన్న అనుకూలత. మంచి మార్గం అందరూ కాకపోయినా.. కొందరు అయినా అత్యవసర నిధి అంటూ కొంత మొత్తాన్ని నిర్వహిస్తుంటారు. కొందరు బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో ఉంచేస్తుంటారు. లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టేవారు కూడా ఉన్నారు. ఇలా ఉంచేయడానికి బదులు ఆ మొత్తాన్ని తీసుకెళ్లి హోమ్‌లోన్ ఇంట్రెస్ట్ సేవర్ అకౌంట్లో ఉంచుకోవడం మంచి మార్గమని ఆర్థిక సలహాదారుల సూచన. మిగులు నిల్వలు ఏవైనా కానీ ఈ ఖాతాలో ఉంచుకోవడం వల్ల వడ్డీ భారాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవచ్చని లాడర్7వెల్త్ ప్లానర్స్ ప్రిన్సిపల్ ఆఫీసర్ సురేష్ సెడగోపన్ సూచించారు. వడ్డీ రేటు వేరు సాధారణ గృహ రుణాలతో పోలిస్తే,, ఇంట్రెస్ట్ సేవర్ అకౌంట్‌తో కూడిన రుణాలపై వడ్డీ రేటు 0.5–0.6 శాతం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. మిగులు నిల్వలు లేని వారికి ఇదేమంత ప్రయోజనం కాదు. వేతన జీవులు, వ్యాపారులు సాధారణంగా తమ అవసరాల కోసం మిగులు నిల్వలు ఎంతో కొంత నిర్వహిస్తుంటారు. అటువంటి వారికి ఈ తరహా రుణం అనుకూలం. వడ్డీ ఆదా/ముందస్తు చెల్లింపు ఇంట్రెస్ట్ సేవర్ అకౌంట్‌కు బదులు రెగ్యులర్ హోమ్ లోన్ తీసుకుని.. మధ్య మధ్యలో తమకు బోనస్, ఇతర రూపాల్లో అందిన నిధులతో ముందస్తు గృహ రుణం చెల్లింపు మార్గాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇలా కూడా అదనపు రుణ భారాన్ని తగ్గించుకోవచ్చు. కానీ, మిగులు నిల్వలు ఎప్పుడూ ఎంతో కొంత ఉండే వారికి.. వాటిని రాబడి మార్గంగా మలుచుకోవడం తెలియని వారికి ఇంట్రెస్ట్ సేవర్ హోమ్ లోన్ అకౌంట్ మెరుగైన మార్గం అవుతుంది. అయితే, కొన్ని బ్యాంకులే ఈ ఉత్పత్తిని ఆఫర్ చేస్తున్నాయి. ఆయా అంశాలపై ఈ విభాగంలోని నిపుణులు, బ్యాంకర్ల సలహాలను తీసుకోవాలి. ఈఎంఐ పెరుగుదల..? రూ.75 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలవ్యవధిపై ఈ ఏడాది ఏప్రిల్‌లో 6.5 శాతం రేటు మీద తీసుకుని ఉన్నారనుకుంటే.. నెలవారీ ఈఎంఐ రూ.55,918 అవుతుంది. గృహ రుణ రేటు 7.3 శాతానికి పెరిగిందని అనుకుంటే ఈఎంఐ రూ.59,506 అవుతుంది. సుమారు రూ.4,500 పెరిగింది. అది కూడా క్రెడిట్ స్కోరు 791కి పైన ఉన్నవారికే ఇది. 681 నుంచి 790 మధ్య క్రెడిట్ స్కోరు ఉన్న వారికి వడ్డీ రేటు 7.65 శాతం నుంచి 7.9 శాతం వరకు చేరింది. ఈ రేటు ప్రకారం చూస్తే రూ.75 లక్షల గృహ రుణం ఈఎంఐ రూ.55,918 నుంచి రూ.61,109–62,267కు పెరిగినట్టు అవుతుంది. ఏడాదికి చూసుకుంటే వడ్డీ పెంపు వల్ల పడుతున్న అదనపు భారం రూ.46,000–73,000 మధ్య ఉంది. ప్రత్యామ్నాయాలు.. ఇప్పటికే గృహ రుణాలు తీసుకున్న వారు ఈఎంఐ పెరగడకుండా ఉండేందుకు రుణ కాలవ్యవధిని పెంచుకోవచ్చు. నిజానికి చాలా బ్యాంకులు ఈఎంఐ పెంపునకు బదులు వాటంతట అవే రుణ కాలవ్యవధిని పెంచుతుంటాయి. రుణ కాలవ్యవధి ఎంత మేర పెరుగుతుందన్న దానికి ఒక సూత్రం ఉంది. 20 ఏళ్ల కాలానికి గృహ రుణాన్ని తీసుకుని ఉంటే.. తీసుకునే నాటి రేటుపై ప్రతి పావు శాతం పెంపునకు 10 నెలల మేర కాలవ్యవధి పెరుగుతుంది. 6.5 శాతం రేటుపై గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి తీసుకుని ఉన్నారనుకుంటే.. 0.90 శాతం రేటు అధికం కావడం వల్ల రుణ కాలవ్యవధి సుమారు మూడేళ్లపాటు పెరుగుతుంది. మరో 0.75శాతం మేర ఈ ఆర్థిక సంవత్సరంలో రేటు పెరుగుతుందని అనుకుంటే.. ఈఎంఐ ఇప్పటి మాదిరే ఉండాలనుకుంటే రుణ కాలవ్యవధి 5.5 ఏళ్లు పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఈఎంఐ భారం కాకూడదు, రుణ కాలవ్యవధి పెరగొద్దు అనుకుంటే రుణ గ్రహీతల ముందున్న మరో మార్గం ఒకే విడత కొంత మొత్తం గృహ రుణాన్ని చెల్లించడమే. ఒకవేళ గృహ రుణం ముగియడానికి ఇంకా చాలా వ్యవధి ఉంటే, అప్పుడు పలు విడతలుగా కొంత మొత్తం చొప్పున ఈఎంఐకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ గృహ రుణం కాల వ్యవధి చివర్లో ఉంటే.. పెరిగిన మేర ఈఎంఐను కడుతూ వెళ్లాలి. లేదంటే పొదుపు, పెట్టుబడులు ఉంటే వాటితో గృహ రుణాన్ని కొంత చెల్లించేయాలి. కానీ, ఇక్కడ చూడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. గృహ రుణాన్ని ముందుగా తీర్చివేయడం వల్ల పన్ను ప్రయోజనాన్ని కోల్పోవాల్సి రావచ్చు. కనుక పన్ను పరిధిలో ఉన్న వారు లెక్కలు వేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. మిగులు నిల్వలు ఉంటే వాటిని గృహ రుణంగా తీర్చివేయడం కంటే పెట్టుబడి ద్వారా ఎక్కువ రాబడి వచ్చే మార్గం ఉంటే దాన్ని కూడా కోల్పోవాల్సి రావచ్చు. కనుక ఈ కోణాల నుంచి పరిశీలించాకే ఈ నిర్ణయానికి రావాలి. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు రుణాన్ని పరిశీలించొచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకులు ఫిక్స్డ్ రేటుపై గృహ రుణాలను 9.6 శాతం రేటుకు ఆఫర్ చేస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో అయితే ఇది 11.5 శాతం మేర ఉంది. కాకపోతే క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉన్న వారికి ఫ్లోటింగ్ రేటుపై రుణమే నయం. 2023 మార్చి నాటికి గృహ రుణ రేటు 8.15 శాతం! గతంలో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించినా, పెంచినా ఆ ప్రభావం రుణాలపై ప్రతిఫలించడానికి కొన్ని నెలలు పట్టేది. దీన్ని గమనించిన ఆర్బీఐ.. రేట్ల సవరణ సత్వరం అమలయ్యేందుకు వీలుగా.. 2019లో ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును (ఈబీఎల్ఆర్) ప్రవేశపెట్టింది. దీంతో ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న రోజుల వ్యవధిలోనే బ్యాంకులు కూడా సవరణ చేయక తప్పని పరిస్థితి. రెపో రేటు, ట్రెజరీ బిల్లు ఈల్డ్ ఇవన్నీ ఈబీఎల్ఆర్కు ప్రామాణికం. ఆర్బీఐ నూతన విధానం నేపథ్యంలో చాలా వరకు గృహ రుణాలకు రెపో రేటు ప్రామాణికంగా మారిపోయింది. ఈ విధానం కారణంగానే 2020లో రెపో రేటు 4% కనిష్టానికి తగ్గిపోవడం వల్ల రుణ గ్రహీతలు ప్రయోజనం పొందారు. ఇప్పుడు ద్రవ్యోల్బణం అదుపు తప్పిన క్రమంలో మళ్లీ రేట్ల పెంపు ప్రభావం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. తీవ్ర ద్రవ్యోల్బణం సవాళ్లు, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు పెంపు నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే మరో 0.75 శాతం మేర ఆర్బీఐ రేట్లను పెంచుతుందని విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తక్కువలో తక్కువ గృహ రుణ రేటు 7.3 శాతంగా ఉంది. ఆర్బీఐ అంచనాలకు అనుగుణంగా రేట్లను పెంచితే 2023 మార్చి నాటికి గృహ రుణ రేటు ఎంత లేదన్నా 8.15 శాతానికి చేరుతుంది. 2019లోనూ 8 శాతం స్థాయిలోనే గృహ రుణ రేట్లు ఉన్నాయి. -
Monsoon session: ఆగని వాయిదాల పర్వం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో వరుసగా ఐదో రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. ధరల పెరుగుదల, జీఎస్టీపై విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. సభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. శుక్రవారం ఉదయం లోక్‌సభ ఆరంభమైన వెంటనే ధరలు, ద్రవ్యోల్బణం, జీఎస్టీ పెంపు తదితర అంశాలపై ప్లకార్డులతో విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభను 12 గంటలకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు, ఆ తర్వాత మళ్లీ సోమవారం మధ్యాహ్నానికి స్పీకర్ వాయిదా వేయాల్సి వచ్చింది. రాజ్యసభలోనూ విపక్ష ఎంపీల ఆందోళనల కారణంగా మొదట 12 గంటలకు, తర్వాత గంట పాటు కొనసాగిన అనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు సభ వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమైన తర్వాత ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చ కొనసాగింది. ఇక ఉభయ సభల ప్రారంభానికి ముందు టీఆర్ఎస్ సహా విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. జీఎస్టీ పెంపును వెనక్కి తీసుకోవాలని, ప్రజా సమస్యలపై పార్లమెంట్లో తక్షణమే చర్చించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్రావు కోరారు. ఇండియన్ అంటార్కిటిక్ బిల్లుకు ఆమోదం లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళన, నినాదాల మధ్యే ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు–2022 ఆమోదం పొందింది. అంటార్కిటిక్ ప్రాంతంలో భారత్ నెలకొల్పిన పరిశోధనా కేంద్రాల విషయంలో దేశీయ చట్టాలను అమలు చేయడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన మొదటి బిల్లు ఇదే కావడం విశేషం. బిల్లుపై లోక్‌సభలో స్వల్పచర్చ జరిగింది. ‘అగ్నిపథ్’పై మాట్లాడనివ్వడం లేదు డిఫెన్స్‌పై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సమావేశం నుంచి ప్రతిపక్ష సభ్యులు శుక్రవారం వాకౌట్ చేశారు. అగ్నిపథ్ పథకంపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. అగ్నిపథ్‌పై చర్చించాలని కాంగ్రెస్, బీఎస్పీ సభ్యులు కేసీ వేణుగోపాల్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దానిష్ అలీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ జువాల్ ఓరామ్‌ను కోరగా, ఆయన నిరాకరించారు. కేవలం అజెండాలో ఉన్న అంశాలపై చర్చించాలని తేల్చిచెప్పారు. కావాలంటే పార్లమెంట్లో అగ్నిపథ్ అంశాన్ని ప్రస్తావించాలని సూచించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు నిరసనగా వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. -
పార్లమెంట్ సమావేశాలు: ఉభయ సభలు గురువారానికి వాయిదా
Monsoon Session 2022 Day 3 Updates: ►జీఎస్టీ, ధరల పెరుగుదలపై ప్రతిపక్ష నాయకులు వరుసగా మూడో రోజు తమ నిరసనలు కొనసాగించడంతో లోక్‌సభ సైతం గురువారానికి వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నిరసన పర్వం కొనసాగుతోంది. ధరల పెరుగుదలపై విపక్షాల నిరంతర నిరసనల మధ్య లోక్‌సభ వాయిదా పడింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సభ తిరిగి సమావేశం కానుంది. ► ధరల పెరుగుదలపై ఉభయసభల్లో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. విపక్షాల ఆందోళనతో రాజ్యసభ సమావేశాలనుగురువారానికి వాయిదా పడింది. జులై 18 నుండి ఐదు శాతం జిఎస్టి పన్ను అమలులోకి వచ్చిన క్రమంలో పాలు, పెరుగు ప్యాకెట్లను పట్టుకుని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభ వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. దీంతో వరుసగా మూడో రోజు కూడా సభా కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో రేపు ఉదయం 11 గంటలకు రాజ్యసభ వాయిదా పడింది. టీఆర్ఎస్ ఎంపీల నిరసన ► ధరల పెంపు, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు గళమెత్తారు. పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపై జీఎస్టీ పన్నుపోటును నిరసిస్తూ.. నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. పాలు, పాల ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాలను ప్రదర్శిస్తూ నిరసనలో పాల్గొన్నారు. గ్యాస్ ధరల పెంపుపై ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఆందోళనలో టీఆర్ఎస్ ఎంపీలతోపాటు ఇతర విపక్ష ఎంపీలు కూడా పాల్గొన్నారు. ► రాజ్యసభలో ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ధరల పెరుగుదలపై పార్లమెంట్లో చర్చకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని, ఎలాంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు ►ద్రవ్యోల్బణం, కొన్ని నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు. #WATCH Opposition MPs protest in Parliament against the Central government over inflation and recent GST hike on some essential items pic.twitter.com/rgpYrHjlZo — ANI (@ANI) July 20, 2022 రాజ్యసభలోనూ అదే తీరు ► విపక్షాల నినాదాలతో.. రాజ్యసభను మధ్యాహ్నాం 2 గంటలకు వాయిదా వేశారు చైర్మన్ వెంకయ్య నాయుడు. లోక్‌సభ వాయిదా ► ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణాన్ని నిరసిస్తూ ఉభయసభల్లో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. లోక్‌సభలో క్వశ్చన్ అవర్‌కు అంతరాయం కలిగించారు కాంగ్రెస్ సహా మిగిలిన విపక్ష ఎంపీలు. దిగజారుతున్న రూపాయి విలువ, ధరల పెంపుపై చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలని స్పీకర్ ఓంబిర్లా పదే పదే విజ్ఞప్తిచేసినా పట్టించుకోలేదు. దీంతో కాంగ్రెస్ సభ్యుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు స్పీకర్. క్వశ్చన్ అవర్‌ను అడ్డుకోవడం సరికాదన్నారు. పార్లమెంట్ చర్చల కోసమని.. నిరసనల కోసం కాదని స్పష్టంచేశారు. లోక్‌సభను మధ్యాహ్నం 2గంటలవరకూ వాయిదా వేశారు. ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభం. ► వర్షాకాల సమావేశాల మూడో రోజు దరిమిలా.. ధరల పెరుగుదల మరియు ద్రవ్యోల్బణం సమస్యలపై పార్లమెంటులోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున్ ఖర్గే మరియు అధిర్ రంజన్ చౌదరి నిరసనల్లో పాల్గొన్నారు. Delhi | Congress MPs Mallikarjun Kharge & Adhir Ranjan Chowdhury join the Joint Opposition protest in front of the Mahatma Gandhi statue in Parliament on the issues of price rise and inflation, on the third day of the Monsoon session pic.twitter.com/z2OcRAILEv — ANI (@ANI) July 20, 2022 ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు విపక్షాల ఆందోళన ఆటంకంగా మారింది. రెండు రోజులపాటు ఉభయ సభలు సజావుగా సాగలేక.. వాయిదాల పర్వంతోనే నెట్టుకొచ్చాయి. ఈ తరుణంలో.. ► ఆహార పదార్థాలపై పెంచిన జీఎస్టీ, ద్రవ్యోల్బణంపై చర్చించేందుకు బుధవారం ఉదయం రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వాయిదా నోటీసు ఇచ్చారు. ► పార్లమెంట్ ఉభయ సభల్లో అంతరాయాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఆయనెప్పుడూ పార్లమెంట్లో గళం వినిపించింది లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది లేదు. ఎప్పుడూ పార్లమెంట్ కార్యకలాపాలను అగౌరవపరుస్తూ వస్తున్నాడు. పార్లమెంట్లో 40% కంటే తక్కువ హాజరు ఉన్న వ్యక్తి ఆయనే. అలాంటి రాజకీయంగా ఉత్పాదకత లేని వ్యక్తి.. ఇప్పుడు పార్లమెంటులో చర్చ జరగకుండా చూసుకోవడానికి తనను తాను అంకితం చేసుకుంటున్నాడు’’ అంటూ ఎద్దేవా చేశారు స్మృతి ఇరానీ. Rahul Gandhi never posed a question,always disrespected Parliamentary proceedings...He's the one to have less than 40% attendance in Parliament...Today, the person who's been politically unproductive is dedicating himself to ensure there's no debate in Parliament:Smriti Irani,BJP pic.twitter.com/FpA5pnL1zs — ANI (@ANI) July 20, 2022 ► ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. మూడో రోజూ ఆందోళనకు విపక్షాలు సిద్ధం అయ్యాయి. సమావేశాల ప్రారంభం కంటే ముందుగానే నిత్యావసరాలపై జీఎస్టీరేట్ల పెంపు, పెరిగిన ధరలు తదితర అంశాలపై నిరసన తెలపాలని నిర్ణయించుకున్నాయి. ► మరోవైపు ప్రధాని మోదీ అధ్యక్షతన మధ్యాహ్నాం కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. సభలో వ్యవహరించాల్సిన తీరు.. విపక్షాల విమర్శలకు తగిన సమాధానాలు సిద్ధం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. మంత్రులకు సూచించనున్నట్లు తెలుస్తోంది. -
పార్లమెంట్ ఉభయ సభలు బుధవారానికి వాయిదా
-
Monsoon session of Parliament: పార్లమెంట్ ఉభయ సభలు బుధవారానికి వాయిదా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండో రోజు LIVE అప్డేట్స్ 2.00PM ద్రవ్యోల్బణం, జీఎస్టీ రేట్ల, ధరల పెంపుపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తూ సభా వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ, రాజ్యసభ్య రెండూ బుధవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డాయి. 11.48AM ► టీఆర్ఎస్ ఎంపీల ధర్నా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేపట్టారు. ద్రవ్యోల్బణం, పెరిగిన ధరలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసనలో పాల్గొన్నారు. Delhi | TRS MPs hold protest in front of Mahatma Gandhi statue in Parliament on the issues of price rise and inflation pic.twitter.com/agdkAOXVaN — ANI (@ANI) July 19, 2022 11.29AM ► ఆప్ ఎంపీల నిరసన ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ పర్యటనకు అనుమతి మంజూరు ఆలస్యాన్ని.. కేంద్రానికి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం ఎదుట ఆప్ ఎంపీలు నిరసన చేపట్టారు. Delhi | Aam Aadmi Party MPs protest against the Centre in front of Gandhi statue in Parliament against the delay in nod for Singapore visit to Arvind Kejriwal pic.twitter.com/gSpKUYSidX — ANI (@ANI) July 19, 2022 11.17AM ►లోక్‌సభ సైతం వాయిదా విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో లోక్‌సభను మధ్యాహ్నాం 2 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. అంతకు ముందు రాజ్యసభ సైతం మధ్యాహ్నానికి వాయిదా పడింది. 11.05AM ► రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదా విపక్షాల ఆందోళనతో ప్రారంభమైన కొన్ని నిమిషాలకే రాజ్యసభను మధ్యాహ్నాం 2 గంటల వరకు వాయిదా వేశారు చైర్మన్ వెంకయ్యనాయుడు. #SansadUpdate#RajyaSabha adjourned till 2 PM #MonsoonSession2022 pic.twitter.com/55AhC4yv6b — SansadTV (@sansad_tv) July 19, 2022 11.03AM ► లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ధరల పెరుగుదలపై విపక్షాలు నిరసన చేపట్టాయి. గందరగోళం నడుమే లోక్ సభ కార్యాకలాపాలు నడుస్తున్నాయి. Opposition MPs raise slogans against price hike and inflation in Lok Sabha as house proceedings begin on the second day of Parliament pic.twitter.com/c3HTjMRsGj — ANI (@ANI) July 19, 2022 ► సోమవారం మొదటి రోజు సమావేశాల్లో భాగంగా ధరల పెరుగుదల నుంచి అగ్నిపథ్ వరకూ కీలక అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఫలితంగా తొలి రోజు ఉభయసభల్లో ఎటువంటి కార్యకలాపాలు సాగలేదు. ► ఇక రెండో రోజు సమావేశాల ప్రారంభానికి ముందే.. గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. పెరుగుతున్న ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ భారాలు,అగ్నిపథ్ సహా ప్రజా సమస్యల పై పార్లమెంట్ లో చర్చ జరపాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. Delhi | Congress leader Rahul Gandhi joins Opposition protest over the issues of inflation and price rise, at Parliament, on the second day of the Monsoon session pic.twitter.com/KqMp3rrLSM — ANI (@ANI) July 19, 2022 ► ప్రధాని మోదీ.. మంత్రులతో సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపైనా చర్చలు జరిపారు. ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో రోజు సెషన్స్ ప్రారంభమయ్యాయి. తొలి రోజు గందరగోళం నడుమే ఉభయ సభలు వాయిదా పడటంతో రెండో రోజు ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. -
Parliament Monsoon Session: తొలి రోజే రగడ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ధరల పెరుగుదల నుంచి అగ్నిపథ్ వరకు కీలక అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభలను వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో తొలిరోజు ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. లోక్‌సభకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ తదితరులు హాజరయ్యారు. సభ ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. రాష్ట్రపతి ఎన్నికలో ఎంపీలు ఓటు వేయడానికి గాను సభను మధ్యాహ్నం 2 గంటల వరకు స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. ఎన్నికలంటే ఒక పండగ లాంటిదేనని అన్నారు. ఈ పండగలో పాలుపంచుకోవాలని ఎంపీలకు సూచించారు. లోక్‌సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత వామపక్ష సభ్యులు వెల్‌లోకి ప్రవేశించారు. ద్రవ్యోల్బణంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ సభ్యుడు అధిర్‌రంజన్ చౌదరి మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కుటుంబ న్యాయస్థానాల(సవరణ) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన ఆగకపోవడంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలోనూ ఉదయం కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు ప్రారంభించారు. సభను అడ్డుకోవడమే లక్ష్యంగా కొందరు సభ్యులు వచ్చినట్లు కనిపిస్తోందని చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తం చేశారు. ఎంపీలంతా రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయడానికి వెళ్లాలని సూచిస్తూ సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుగుతున్న వేళ ఈ సమావేశాలను చిరస్మరణీయ సమావేశాలుగా మార్చుకోవాలని సూచించారు. చక్కటి పనితీరు ప్రదర్శించాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. గత ఐదేళ్ల మాదిరిగా కాకుండా ఈసారి వైవిధ్యంగా వ్యవహరించాలన్నారు. జపాన్ దివంగత ప్రధాని షింజో అబె, యూఏఈ మాజీ అధ్యక్షుడు, అబూదాబీ నాయకుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, కెన్యా మూడో అధ్యక్షుడు మావై కిబాకీకి, ఇటీవల మరణించిన ఎనిమిది మంది మాజీ ఎంపీలకు ఉభయ సభలు నివాళులర్పించాయి. కొత్త సభ్యుల ప్రమాణం ఎగువ సభకు ఇటీవల ఎన్నికైన సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మాజీ మంత్రులు పి.చిదంబరం, కపిల్ సిబల్, ప్రఫుల్ పటేల్, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, శివసేన నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్ సూర్జేవాలా, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా, వైఎస్సార్సీపీ నేతలు వి.విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, నామినేటెడ్ సభ్యుడు, సినీ కథా రచయిత వి.విజయేంద్ర ప్రసాద్ లోక్‌సభలో శత్రుఘ్న సిన్హా తదితరులు ప్రమాణం చేశారు. ఓపెన్ మైండ్‌తో చర్చిద్దాం ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు లోతైన, వివరణాత్మక చర్చలతో వ్రర్షాకాల సమావేశాలను ఫలవంతం చేయాలని ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అంతా కలిసి ఓపెన్ మైండ్‌తో చర్చిద్దామని సూచించారు. సునిశిత విమర్శ, చక్కటి విశ్లేషణల ద్వారా ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల రూపకల్పనలో భాగస్వాములు కావాలని విన్నవించారు. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మీడియాతో మాట్లాడారు. ‘‘సభలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలి. అందరి కృషితోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అందరి సహకారంతోనే సభ సజావుగా నడుస్తుంది. ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటుంది. సభ గౌరవాన్ని పెంపొందించేలా మన విధులను నిర్వర్తించాలి. పంద్రాగస్టు సమీపిస్తున్న వేళ... దేశ స్వాతంత్య్రం కోసం జీవితాలను దేశానికి అంకితం చేసి, జైళ్లలో గడిపినవారి త్యాగాలను మనం గుర్తుంచుకోవాలి. వారి ఆశలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని మర్చిపోవద్దు’ అని ప్రధాని పేర్కొన్నారు. పార్లమెంట్‌ను పవిత్ర స్థలంగా భావించాలన్నారు. దేశానికి కొత్త శక్తినివ్వాలి ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేళ, మరో పాతికేళ్ల తర్వాత దేశ ప్రయాణం ఎలా ఉండాలనే దానిపై ప్రణాళికలు రూపొందించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. మరింత వేగంగా ముందుకు సాగే తీర్మానాలతో జాతికి దిశానిర్దేశం చేయాలన్నారు. ఎంపీలంతా దేశానికి కొత్త శక్తిని సమకూర్చడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాలు కీలకమన్నారు. -
అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజా సమీక్ష, వడ్డీ రేటును!
న్యూయార్క్: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజా సమీక్షలో వడ్డీ రేటును మరోసారి పెంచింది. ధరల కట్టడి లక్ష్యంగా 0.5 శాతం హెచ్చించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 0.75–1 శాతానికి చేరాయి. గత సమీక్షలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా 0.25 శాతమే పెంచినప్పటికీ.. ఈసారి మరింత కఠినంగా వ్యవహరించింది. కరోనా మహమ్మారి సంక్షోభం తదుపరి ఆర్థిక వ్యవస్థ గాడిన పడటంతో ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) సరళతర విధానాలకు స్వస్తి పలుకుతూ వడ్డీ రేట్ల పెంపునకు మొగ్గు చూపుతోంది. నాలుగు దశాబ్దాల గరిష్టానికి చేరిన ద్రవ్యోల్బణం(సీపీఐ), ఉపాధి ఊపందుకోవడం వంటి అంశాల మద్దతుతో 9 ట్రిలియన్ డాలర్ల ఆస్తుల పోర్ట్‌ఫోలియోను జూన్ నుంచి తగ్గించుకోనుంది. -
ఇళ్ల ధరలకు రెక్కలు!
ముంబై: నిర్మాణ వ్యయం 20–25 శాతం పెరిగిందని రియల్టర్ల సంస్థ క్రెడాయ్ (భారత రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘాల సమాఖ్య– సీఆర్‌ఈడీఏఐ) సోమవారం తెలిపింది. ప్రధానంగా గత 45 రోజులలో ఈ పెరగుదల భారీగా ఉందని పేర్కొంది. ఉక్కు వంటి ముడి ఉత్పత్తుల ధరలు పెరుగడం దీనికి కారణమని వివరించింది. ఈ నేపథ్యంలో బిల్డర్లు వచ్చే నెల నుంచి ప్రాపర్టీ ధరలను సగటున 10–15 శాతం పెంచాల్సి వస్తుందని వెల్లడించింది. క్రెడాయ్, ఆ సంస్థ మహారాష్ట్ర విభాగం ఎంసీహెచ్ఐ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి. డెవలపర్లకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని అనుమతించడంతోపాటు స్టాంప్ డ్యూటీ, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను తగ్గించాలని ఈ ప్రకటనలో డిమాండ్ చేశాయి. తద్వారా పరిశ్రమకు ఉపశమనం కలిగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. ప్రస్తుతానికి నిర్మాణ పనులను నిలిపివేయమని సభ్య డెవలపర్లకు సలహా ఇవ్వబోమని, అయితే ధరల పెరుగుదల కొనసాగితే బిల్డర్లకు ప్రాజెక్ట్ సైట్లలో పనులను నిలిపివేయడం,ముడిపదార్థాల కొనుగోలును వాయిదా వేయడం తప్ప వేరే మార్గం లేదని ప్రకటన తెలిపింది. తక్షణ ప్రాపర్టీ ధరల (10 నుంచి 15 శాతం శ్రేణిలో) పెరుగుదల వల్ల మహా రాష్ట్రలోని 2,773 ప్రాజెక్టులపై (గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ 2021లో ఆమోదించిన) ప్రభావం పడుతుందని ప్రకటన తెలిపింది. దాదాపు 2,60,000 గృహాలు ఈ ప్రాజెక్టులకు సంబంధించి విక్రయించాల్సి ఉందని వివరించింది. క్రెడాయ్ భారతదేశంలోని ప్రైవేట్ రియల్టీ డెవలపర్ల అత్యున్నత వేదిక. 1999లో స్థాపించబడిన ఈ అసోసియేషన్ 21 రాష్ట్రాల్లోని 221 సిటీ చాప్టర్లలో 13,000 మంది డెవలపర్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. చౌక గృహాలపై ఎఫెక్ట్... ‘నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ. 400–500 పెరిగింది. ప్రధానంగా గత 45 రోజుల్లో ధరల తీవ్రత ఎక్కువగా ఉంది. చౌక గృహాల విభాగంపై ఈ ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. భౌగోళిక–రాజకీయ పరిస్థితుల కారణంగా పెరిగిన ముడిసరుకు ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని 5–6% నుండి 3%కి కుదించాలి. సిమెంట్ వంటి ముడి పదార్థాలపై 18% జీఎస్టీ రేటును తగ్గించాలి. సిమెంట్, స్టీల్ ఎగుమతులను కొద్దికాలం పాటు నిషేధించాలి. డెవలపర్లు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని క్లెయిమ్ చేసుకోడానికి అనుమతించాలి. ఇప్పటికే డెవలపర్ల మార్జిన్లు పడిపోయిన పరిస్థితుల్లో డెవలపర్లు వచ్చే నెల నుంచి తమ అపార్ట్మెంట్ల ధరలను పెంచాల్సి ఉంటుంది. ధరల పెరుగుదల సగటున 10–15% వరకు ఉండవచ్చు. పెరుగుతున్న ఇన్పుట్ వ్యయాల భారాన్ని తగ్గించుకోడానికి ఈ తక్షణ పెంపు తప్పని పరిస్థితి ఉంది’ అని క్రెడా య్ సెక్రటరీ (మహారాష్ట్ర) అజ్మీరా చెప్పారు. వ్యయ భారాలు స్టీల్ ధర కిలోకు రూ.35–40 నుంచి రూ.85–90కి చేరింది. సిమెంట్ ధరలు బస్తాకు రూ.100 వరకు పెరిగాయి. ఇంధనం, రవాణా ఖర్చులు పెరిగాయి. దీంతో మొత్తం నిర్మాణ వ్యయం 20–25 శాతం పెరిగింది. గృహ నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపే వ్యయ భారాలివి. – దీపక్ గొరాడియా, క్రెడాయ్–ఎంసీహెచ్ఐ ప్రెసిడెంట్ రికవరీకి విఘాతం రెసిడెన్షియల్ సెక్టార్ సెగ్మెంట్లలో డిమాండ్ ఇప్పుడిప్పుడే పునరుద్ధరణ జరుగుతోంది. తాజా ముడిపదార్థాల పెరుగుదల నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది రికవరీలో ఉన్న పునరుద్ధరణ ప్రక్రియను దెబ్బతీసే అవకాశం ఉంది. – రమేష్ నాయర్, కొలియర్స్ ఇండియా సీఈఓ గత రెండేళ్లుగా సిమెంట్, స్టీల్ ధరలు భారీగా పెరిగాయి. దీనితో ప్రతి చదరపు అడుగుల నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. ఇన్పుట్ ధర పెరుగుదలను మేము వినియోగదారులకు బదలాయించలేకపోతున్నాము. దీనితో మా లాభాల మార్జిన్లు పెద్దఎత్తున దెబ్బతింటున్నాయి. ఈ పరిణామాలు మమ్మల్ని భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించేలా చేస్తున్నాయి. – సరాంశ్ ట్రెహాన్, ట్రెహాన్ గ్రూప్ ఎండీ -
స్టీల్ ధరలు మరింత భారం
న్యూఢిల్లీ: దేశీ స్టీల్ తయారీ కంపెనీలు హాట్ రోల్డ్ క్వాయిల్స్(హెచ్ఆర్సీ) ధరలను టన్నుకి రూ. 1,500–2,000 స్థాయిలోపెంచేందుకు నిర్ణయించాయి. ముడిసరుకుల ధరలు భారీగా పెరగడంతో ఉత్పత్తుల ధరలను హెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్ రీబార్ ధరలను టన్నుకి రూ. 1,250 చొప్పున పెంచింది. గురువారం నుంచీ తాజా ధరలు అమల్లోకి రానున్నాయి. ఇక సెయిల్ సైతం హెచ్ఆర్సీ, కోల్డ్ రోల్డ్ క్వాయిల్స్(సీఆర్సీ) ధరలను టన్నుకి రూ. 1,500 స్థాయిలో హెచ్చించింది. రానున్న రోజుల్లో మరికొన్ని కంపెనీలు సైతం ధరలను పెంచే వీలుంది. ప్రధానంగా స్టీల్ తయారీలో కీలక ముడిసరుకుగా వినియోగించే కోకింగ్ కోల్ ధరల్లో భారీ పెరుగుదల ప్రభావం చూపుతున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. వీటి ధరలు ఇటీవల రెట్టింపునకుపైగా ఎగశాయి. సెప్టెంబర్‌లో టన్నుకి 300 డాలర్లు పలికిన కోల్ ధరలు ప్రస్తుతం 700 డాలర్లకు జంప్‌చేశాయి. ప్రధానంగా గత నెల రోజుల్లోనే రెట్టింపైనట్లు నిపుణులు వెల్లడించారు. కాగా.. ఈ నెల (మార్చి)లోనే స్టీల్ కంపెనీలు ఉత్పత్తుల ధరలను నాలుగుసార్లు పెంచడం గమనార్హం! మరింత పెరిగే చాన్స్ తాజా పెంపుదలతో హెచ్ఆర్సీ ధరలు టన్నుకి రూ. 72,500–73,500కు చేరగా.. సీఆర్సీ ధరలు రూ. 78,500–79,000ను తాకినట్లు తెలుస్తోంది. ఇక రీబార్ ధరలు సైతం టన్నుకి రూ. 71,000–71,500కు చేరినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. భవిష్యత్‌లో స్టీల్ ధరలు మరింత పెరిగే అవకాశముంది. టన్ను ధర రూ. 80,000ను తాకే వీలున్నట్లు సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్టీల్ షేర్లు జూమ్ ఉత్పత్తుల ధరలను పెంచడంతో బుధవారం ట్రేడింగ్‌లో పలు స్టీల్ కౌంటర్లు భారీ లాభాలతో తళతళలాడాయి. ఎన్ఎస్ఈలో సెయిల్ 3.4 శాతం జంప్‌చేసి రూ. 103 వద్ద నిలవగా, జిందాల్ స్టీల్(జేఎస్పీఎల్) 3.5 శాతం ఎగసి రూ. 510 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ. 514 అధిగమించి 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో టాటా స్టీల్ 2 శాతం బలపడి రూ. 1,329 వద్ద స్థిరపడింది. -
టన్నుకు రూ. 5,000 భారం
న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో స్టీల్ ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. హాట్ రోల్డ్ కాయిల్ (హెచ్ఆర్సీ), టీఎంటీ బార్స్ ధరలను టన్నుకు రూ.5,000 మేర కంపెనీలు పెంచేశాయి. దీంతో హెచ్ఆర్ ధర టన్నుకు రూ.66,000కు చేరగా, టీఎంటీ బార్స్ ధర రూ.65,000కు చేరింది. దీంతో మౌలిక రంగం, రియల్ ఎస్టేట్ ఆటోమొబైల్, గృహోపకరణాలు సహా ఎన్నో రంగాలపై దీని ప్రభావం పడనుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం సరఫరాపై పడడం తాజా ధరల పెరుగుదలకు నేపథ్యంగా ఉంది. గత కొన్ని రోజులుగా ధరలు పెరిగాయని, రానున్న వారాల్లో మరింత పెరగొచ్చని, ఉక్రెయిన్–రష్యా సంక్షోభంపై ఇది ఆధారపడి ఉంటుందని తెలిపాయి. ‘‘అంతర్జాతీయ సరఫరా వ్యవస్థపై యుద్ధ ప్రభావం నెలకొంది. దీంతో ముడి సరుకుల ధరలు పెరిగాయి. కోకింగ్ కోల్ టన్ను 500 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కొన్ని వారాల క్రితంతో పోలిస్తే ముడి సరుకుల ధరలు 20 శాతం వరకు పెరిగాయి’’ అని పరిశ్రమ ప్రతినిధి ఒకరు తెలిపారు. స్టీల్ తయారీలో ప్రధానంగా వినియోగించే కోకింగ్ కోల్ అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతులే తీరుస్తున్నాయి. యుద్ధం ఆగకపోతే ధరలపై ప్రభావం ‘‘రష్యా, ఉక్రెయిన్ రెండూ కూడా స్టీల్ తయారీ, ఎగుమతి చేస్తున్న దేశాలు. దీనికి అదనంగా ముడి సరుకులైన కోకింగ్ కోల్, సహజ వాయువులను కూడా అవి సరఫరా చేస్తున్నాయి. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం ముగియకపోతే అది కచ్చితంగా డిమాండ్–సరఫరాపై ప్రభావం చూపిస్తుంది. దాంతో తయారీ వ్యయాలు పెరిగిపోతాయి’’ అని టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ తెలిపారు. ప్రపంచ స్టీల్ అసోసియేషన్లోనూ నరేంద్రన్ సభ్యుడిగా ఉన్నారు. తాము పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని, తమ కస్టమర్లు, భాగస్వాములపై ప్రభావం పడకుండా అత్యవసర ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. -
కూల్ కావాలంటే పర్స్ ఖాళీనే
న్యూఢిల్లీ: నూతన సంవత్సరం తొలి రోజుల్లోనే ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు మొదలైన వినియోగ ఉత్పత్తుల రేట్లు.. కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. ముడి వస్తువుల వ్యయాలు, రవాణా చార్జీలు పెరిగిపోవడంతో కంపెనీలు ఆ భారాన్ని కొనుగోలుదారులకు బదలాయిస్తున్నాయి. ఈ నెలాఖరులో లేదా మార్చి ఆఖరు నాటికి ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు వంటి ఉత్పత్తుల రేట్లు 5–10 శాతం మేర పెంచబోతున్నాయి. పానసోనిక్, ఎల్జీ, హయర్ వంటి సంస్థలు ఇప్పటికే పెంచగా.. సోనీ, హిటాచీ, గోద్రెజ్ అప్లయెన్సెస్ మొదలైనవి ఈ త్రైమాసికం ఆఖరు నాటికి నిర్ణయం తీసుకోనున్నాయి. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) నివేదిక ప్రకారం జనవరి–మార్చి వ్యవధిలో ధరలు 5–7 శాతం మేర పెరగనున్నాయి. ‘కమోడిటీల ధరలు, అంతర్జాతీయంగా రవాణా, ముడి వస్తువుల రేట్లు అసాధారణంగా పెరిగిపోవడంతో ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు వంటి ఉత్పత్తుల రేట్లను 3–5 శాతం పెంచేందుకు మేము చర్యలు తీసుకున్నాం‘ అని హయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ ఎన్ఎస్ తెలిపారు. ఏసీల రేట్లు ఇప్పటికే 8 శాతం వరకూ పెంచిన పానసోనిక్ .. ధరలను మరింత పెంచే యోచనలో ఉంది. ఇతర గృహోపకరణాల రేట్లను పెంచే అంశం పరిశీలిస్తోంది. ‘ఏసీల రేట్లు 8 శాతం వరకూ పెరిగాయి. కమోడిటీల వ్యయాలు, సరఫరా వ్యవస్థ పరిస్థితులు బట్టి ఇవి మరింత పెరగవచ్చు. సమీప భవిష్యత్తులో గృహోపకరణాల రేట్ల పైనా ప్రభావం పడే అవకాశం ఉంది‘ అని పానసోనిక్ ఇండియా డివిజనల్ డైరెక్టర్ ఫుమియాసు ఫ్యుజిమోరి తెలిపారు. దేశీ గృహోపకరణాలు, కన్జూమర్ డ్యూరబుల్ పరిశ్రమ పరిమాణం రూ. 75,000 కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా. పండుగ సీజన్లో వాయిదా.. పండుగల సీజన్ కావడంతో రేట్ల పెంపును కంపెనీలు వాయిదా వేస్తూ వచ్చాయని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. ‘అయితే, ప్రస్తుతం భారాన్ని కస్టమర్లకు బదలాయించడం తప్ప తయారీ సంస్థలకు వేరే మార్గం లేకుండా పోయింది. జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో ధరల పెంపు 5–7 శాతం మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు రేట్లు పెంచేయగా మరికొన్ని దానికి సంబంధించిన ప్రక్రియలో ఉన్నందున పెంపు పరిమాణం వివిధ రకాలుగా ఉండొచ్చని బ్రగాంజా చెప్పారు. అయితే, డిమాండ్ మందగించినా, ముడి వస్తువుల ధరలు తగ్గినా .. ఏప్రిల్ లేదా మే లో రేట్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. సోనీ ఇండియా, గోద్రెజ్ అప్లయెన్సెస్ వంటి సంస్థలు రేట్ల పెంపుపై తాము ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నాయి. వివిధ రకాల ఉత్పత్తుల ధరలు ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు త్రైమాసికంలో పెరిగే అవకాశాలు ఉన్నాయని థామ్సన్, కోడక్ వంటి బ్రాండ్ల తయారీ సంస్థ సూపర్ ప్లాస్ట్రోనిక్స్ (ఎస్పీపీఎల్) సీఈవో అవ్నీత్ సింగ్ మార్వా తెలిపారు. మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తున్నామని, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై వచ్చే నెలలో నిర్ణయం తీసుకుంటామని వీడియోటెక్స్ ఇంటర్నేషనల్ (దైవా, షింకో తదితర బ్రాండ్స్ తయారీ సంస్థ) తెలిపింది. తప్పని పరిస్థితి.. ధరల భారాన్ని వీలైనంత వరకూ తామే భరించేందుకు అన్ని ప్రయత్నాలూ చేశామని, కానీ వ్యాపారం నిలదొక్కుకునేందుకు పెంపు తప్పటం లేదని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ పన్నసల్ తెలిపారు. రేట్ల పెంపు తప్పదని జాన్సన్ కంట్రోల్స్–హిటాచీ ఎయిర్ కండీషనింగ్ ఇండియా సీఎండీ గుర్మీత్ సింగ్ తెలిపారు. ముడివస్తువులు, పన్నులు, రవాణా వ్యయాలు మొదలైనవి పెరిగిపోవడం వల్ల ఏప్రిల్ నాటికి బ్రాండ్లు దాదాపు 10% వరకూ ధరలు పెంచవచ్చని ఆయన పేర్కొన్నారు. ‘ఏప్రిల్ వరకూ దశలవారీగా ధరల పెంపు కనీసం 8–10% మేర ఉండవచ్చు. గతేడాది కూడా ఇదే విధంగా 6–7% వరకూ పెరిగాయి. ముడి వస్తువుల ధరలు పెరిగిపోవడం, అల్యూమినియం .. రిఫ్రిజిరెంట్స్ వంటివాటిపై యాంటీ డంపింగ్ సుంకాల విధింపుతో రేట్లు మరో 2–3 శాతం పెరగవచ్చు‘ అని సింగ్ వివరించారు. -
తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని సినిమా థియేటర్లలో టికెట్ల రేట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నిర్మాతల విజ్ఞప్తి మేరకు రేట్ల పెంపుపై ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపగా.. వాటిని పరిశీలించిన రాష్ట్రప్రభుత్వం టికెట్ రేట్లు నిర్ణయించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా జీవో నెంబర్ 120 జారీచేశారు. దీని ప్రకారం ఏసీ, ఎయిర్ కూల్డ్ థియేటర్లలో సినిమా టికెట్ కనిష్ట ధర రూ.50 కాగా, గరిష్టంగా రూ.150గా నిర్ణయించారు. జీఎస్టీ అదనం. నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ కనీస ధర రూ.30 కాగా, గరిష్టంగా రూ.70గా నిర్ణయించారు. మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ కనీస ధర రూ.100+జీఎస్టీ.. గరిష్టంగా రూ.250+జీఎస్టీగా ఖరారు చేశారు. రిక్లైనర్స్ కోసం రూ.300+జీఎస్టీగా మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ రేట్ల ను నిర్ణయించారు. ఇవికాకుండా నిర్వహణ ఖర్చుల కింద టికెట్‌పై ఏసీ, ఎయిర్ కూల్డ్ థియేటర్లలో రూ.5, నాన్ ఏసీలలో రూ.3 వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. టికెట్ ధరల సవరణకు జీవో ఇచ్చాం సాక్షి, హైదరాబాద్: ఏసీ, నాన్ ఏసీ, మల్టీప్లెక్స్ సినిమా హాళ్లలో టికెట్ల ధరలను సవరించి పెంచుకునేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేశామని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈమేరకు స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ టి.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌పై విచారణను శుక్రవారం ముగించింది. ప్రభుత్వం తాజాగా జారీచేసిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉంటే మరో పిటిషన్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. ప్రభుత్వ జీవో ఏ విధంగా నిబంధనలకు విరుద్ధమో స్పష్టమైన ఆధారాలు సమర్పించాలని పేర్కొంది. సినిమా టికెట్ల ధరలను నియంత్రించాలంటూ గతేడాది జూలైలో తానిచ్చిన వినతిపత్రంపై సంబంధిత అధికారులు స్పందించడం లేదంటూ న్యాయవాది జీఎల్ నరసింహారావు రాసిన లేఖను గతంలో ధర్మాసనం సుమోటో ప్రజాహిత వ్యాజ్యం (పిల్)గా విచారణకు స్వీకరించింది. -
ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన టెస్లా..!
ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టెస్లా భారీ షాకిచ్చింది. పలు మోడళ్ల ధరలను భారీగా పెంచుతూ టెస్లా నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో పేరుగాంచిన టెస్లా లాంగ్రేంజ్ కార్లలో ఎక్స్, ఎస్ మోడళ్ల ధరలను 5వేల డాలర్ల(సుమారు రూ. 3,74,000)కు పైగా పెంచింది. టెస్లా వై లాంగ్ రేంజ్ మోడల్, టెస్లా మోడల్ 3 కారు ధరను 2 వేల డాలర్లకు పెంచింది. చదవండి: అదరగొట్టిన టీవీఎస్ మోటార్స్..! టెస్లా అధికారిక వెబ్సైట్ ప్రకారం...కొత్త ధరలు ఇలా ఉన్నాయి టెస్లా ఎక్స్ మోడల్-104,990 డాలర్లు (సుమారు రూ. 78,74,197) టెస్లా ఎస్ మోడల్- 94990 డాలర్లు (సుమారు రూ.71,24,202) టెస్లా వై మోడల్- 56990 డాలర్లు (సుమారు రూ.42,74,221) టెస్లా మోడల్ 3-43990 డాలర్లు (సుమారు రూ.32,99,228) భారత్‌లోకి టెస్లా..! భారత విపణిలోకి అడుగుపెట్టేందుకు టెస్లా సన్నాహాలను చేస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో టెస్లా ఎక్స్ మోడల్‌ను కంపెనీ భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో దిగుమతి సుంకం ఎక్కువగా ఉండటంతో..టెస్లా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చలను జరుపుతోంది. కాగా పెరిగిన పలు మోడళ్ల ధరలు భారత్‌లో కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: మడత పెట్టే స్మార్ట్ఫోన్లే కాదు..! మడత పడే కార్‌ను చూశారా..! -
కొత్త కారు కొనేవారికి మారుతి సుజుకి షాక్!
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా కొనుగోలు దారులకు షాక్ ఇచ్చింది. మరోసారి కార్ల ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తయారీ, నిర్వహణ, ముడిసరకుల వ్యయాలు పెరగడం వల్ల వచ్చే నెల నుంచి అన్నీ మోడల్స్ ధరలను పెంచనున్నట్లు మారుతి సుజుకి తెలిపింది. "గత ఏడాది కాలంలో ఇన్ పుట్ ఖర్చులు పెరగడం వల్ల వివిధ వాహనాల ధరలు ప్రభావితం అవుతున్నాయి" అని కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. మోడల్ బట్టి ధరల పెరుగుదలలో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. "సెప్టెంబర్ 2021లో విడుదల చేసే అన్నీ మోడల్స్ ధరల పెరగనున్నట్లు" మారుతి సుజుకి ఇండియా తెలిపింది. ప్రస్తుతం కంపెనీ ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్ ఆల్టో(ధర రూ.2.99 లక్షల) నుంచి ఎస్-క్రాస్(ధర రూ.12.39) మోడల్స్ వరకు విక్రయిస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు వాహన ధరలను పెంచింది.(చదవండి: ‘కూ’ కోటి యూజర్ల రికార్డ్) -
ఆర్ఆర్ఆర్లో పెట్టుబడులకు తొందరొద్దు
మన వెంచర్ పక్క నుంచే ఆర్ఆర్ఆర్ వెళుతుంది సార్. అటు పక్కన మనది వంద ఎకరాల్లో టౌన్షిప్ ప్రాజెక్ట్ వస్తుంది! ఆర్ఆర్ఆర్ పనులు మొదలైతే రేట్లు డబుల్ అవుతాయి మేడం. ఇప్పుడు కొంటేనే మంచి లాభం పొందొచ్చు!! రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ఏజెంట్లు, డెవలపర్లకు విక్రయాల మంత్రదండంలా మారింది. ఆర్ఆర్ఆర్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రాత్రికి రాత్రే ధరలను రెండింతలు చేసేశారు. లేఅవుట్ ప్లాన్, అనుమతులు, అభివృద్ధి పనులు ఇవేవీ ఉండవు.. జస్ట్ ఆర్ఆర్ఆర్ పేరిట మధ్యతరగతి ప్రజలను మభ్యపెడుతూ ప్లాట్లను విక్రయించేసి చేతులు దులుపుకుంటున్నారు డెవలపర్లు. సాక్షి, హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో శివార్లలో రియల్ ఎస్టేట్ రంగం కొత్తపుంతలు తొక్కుతుంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, భువనగిరి, నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల మీదుగా ఈ రింగ్ రోడ్డు వెళుతుండటంతో ఆయా ప్రాంతాలలో భూముల ధరలు 35–40 శాతం వరకు పెరిగాయి. శ్రీశైలం హైవేలో కొన్ని ప్రాంతాల్లో 50 శాతం కంటే ఎక్కువే ధరలు పెరిగాయని స్పేస్ విజన్ గ్రూప్ సీఎండీ నర్సింహా రెడ్డి తెలిపారు. హైవే ఫేసింగ్ ఉన్న భూముల ధర ఎకరానికి రూ.2 కోట్లు, కాస్త లోపలికి ఉంటే రూ.1–1.5 కోట్ల వరకున్నాయి. ఆర్ఆర్ఆర్ వెళ్తుందని భావిస్తున్న భూముల్లో వ్యవసాయం దాదాపు నిలిచిపోయింది. ఏ జిల్లాల మీదుగా ఆర్ఆర్ఆర్ వెళుతుందో క్షేత్ర స్థాయిలో పక్కాగా సర్వే జరిగి తుది అలైన్‌మెంటు సిద్దమయ్యాకనే అధికారికంగా ప్రకటిస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రభుత్వ ప్రకటనలతో రేట్లు జూమ్.. ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఆర్ఆర్ఆర్ చుట్టూ శా>టిలైట్ టౌన్‌షిప్పులు, లాజిస్టిక్ పార్క్‌లు ఏర్పాటవుతాయంటే కాసింత అనుమానమే. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ ఆరంభంలో ఇలాగే ఆనాటి ప్రభుత్వం శాటిలైట్ టౌన్‌షిప్పులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇప్పటికీ దాదాపు పదహారేళ్లు దాటినా వాటి ఊసేలేదు. మధ్యలో ప్రభుత్వాలు మారి టౌన్‌షిప్పుల జీవోలను మార్చుతూ వచ్చాయే తప్ప.. ఇవి ఏర్పాటయ్యేందుకు ఎదురయ్యే వాస్తవిక సమస్యల్ని పరిష్కరించేందుకు ముందుకు రాలేదు. ఓఆర్ఆర్ శాటిలైట్ టౌన్‌షిప్పుల పరిస్థితి ఇలాగుంటే ఆర్ఆర్ఆర్ చుట్టూ డెవలప్ అయ్యేందుకు ఇంకెంత సమయం పడుతుందో ఆలోచించుకోవాలి. ఆర్ఆర్ఆర్ చుట్టూ పారిశ్రామిక వాడలు, ఐటీ సెంటర్లు, లాజిస్టిక్ పార్క్‌లు, ఫార్మా పరిశ్రమలు, రిక్రియేషన్ సదుపాయాలు, వాణిజ్య కట్టడాలు, షాపింగ్ మాల్స్, మల్టిప్లెక్స్‌లు వంటివి వాస్తవం కావటానికి ఇంకెంత కాలం అవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. ప్రభుత్వ ప్రకటనల పుణ్యమా అంటూ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఇష్టం వచ్చినట్లు ధరల్ని కృత్రిమంగా పెంచేస్తున్నారు. దీంతో భూసేకరణ జరపడం కష్టంగా మారుతుంది. ఓఆర్ఆర్ను చూసే నిర్ణయం.. ఒకసారి ఔటర్ రింగ్ రోడ్డునే క్షుణ్నంగా పరిశీలిస్తే.. గచ్చిబౌలి నుంచి నార్సింగి వరకు సర్వీస్ రోడ్‌కి ఇరువైపులా కొన్ని హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్ట్‌లు వచ్చాయి. మరోవైపు కొల్లూరు దాకా కొత్త నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇక కొల్లూరులో సర్వీస్ రోడ్డు లేనే లేదు. అక్కడ ఓఆర్ఆర్ నుంచి సర్వీస్ రోడ్‌కు వెళ్లాలంటే మట్టి రోడ్డు మీద ప్రయాణించాల్సిన దుస్థితి. 156 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)కు ఇరువైపులా కి.మీ చొప్పు న గ్రోత్ కారిడార్‌గా ప్రభుత్వం ప్రకటించింది. అంటే 316 కి.మీ. మేర అభివృద్ధి పనులు, ప్రాజెక్ట్‌లు రావాలంటే ఎంత సమయం పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క పశ్చిమ హైదరాబాద్ తప్ప మిగిలిన ప్రాంతాలు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. ఆదిభట్ల వద్ద టీసీఎస్, కాగ్నిజెంట్ వల్ల కొంత కదలికలు వచ్చినప్పటికీ.. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పోచారం వద్ద ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ఏర్పడడంతో ఇక్కడ కొంత ఊపొచ్చింది. పటాన్చెరు వద్ద ప్లాస్టిక్ పరిశ్రమలు, బాటసింగారం వద్ద లాజిస్టిక్ పార్క్‌లు, బుద్వేల్‌లో ఐటీ పార్క్ వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. తీరా చూస్తే రాత్రికి రాత్రే ఆయా ప్రాం తాలలో భూముల ధరలు పెరిగాయే తప్ప ప్రకటించిన అభివృద్ధి పనులు కార్యరూపం దాల్చలేదు. మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే.. గతంలో ప్రయాణ దూరాన్ని కి.మీ. చొప్పున చెప్పేవాళ్లం. కానీ, ఇప్పుడు సమయంలో చెబుతున్నాం. ఎందుకంటే ఓఆర్ఆర్, మెట్రోలతో ప్రయాణం సులువైంది కాబట్టి.. ప్రధాన నగరం నుంచి ఎన్ని కి.మీ. దూరంలో ఆర్ఆర్ఆర్ ఉంటుందనేది మ్యాటర్ కాదు. పట్టణీకరణ, వ్యాపార, ఉద్యోగ అవకాశాలతో నగరం శరవేగంగా అభివద్ధి చెందుతుంది. భవిష్యత్తు తరాల అవసరాలకు తగ్గట్టుగా సిటీ విస్తరణ జరగాల్సిందే. కాకపోతే ఆయా ప్రాంతాలలో ముందుగా రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలి. అప్పుడే గ్రోత్ కారిడార్లలో కంపెనీలు, ఇన్వెస్టర్లు ముందుకొస్తారు. ఫలానా ప్రాంతం మీదుగా ఆర్ఆర్ఆర్ రహదారి వెళుతుందంటూ ఏజెంట్లు చెప్పే మాయమాటలు నమ్మొద్దు. విచక్షణతో కొనుగోలు నిర్ణయం తీసుకోవాలి. – జే వెంకట్ రెడ్డి, మేయర్, పీర్జాదిగూడ. (ఏవీ కన్స్ట్రక్షన్స్ ఎండీ) -
పెరుగుతున్న ఇళ్ల ధరలు, ఇంకా పెరగొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: ఇళ్ల ధరలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో దేశంలోని ఏడు అతిపెద్ద పట్టణాల్లో ఇళ్ల ధరలు ఒక శాతం పెరిగినట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ ‘అనరాక్’ తెలిపింది. ముడి సరుకుల ధరలకు రెక్కలు వచ్చినందున 2021 ద్వితీయ ఆరు నెలల కాలంలో ఇళ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఈ సంస్థ అంచనా వేస్తోంది. ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఏడు ప్రధాన పట్టణాల్లో చదరపు అడుగు సగటు ధర రూ.5,599 నుంచి రూ.6,660కు పెరిగింది. 2020 మొదటి మూడు నెలల్లో ధరలతో పోల్చి ఈ వివరాలు విడుదల చేసింది. నివాస గృహాల ధరల ఆధారంగా ఈ అంచనాకు వచ్చింది. ► ఢిల్లీ-ఎన్సీఆర్ మార్కెట్లో మాత్రం ఇళ్ల ధరలు 2 శాతం పెరిగి చదరపు అడుగు రూ.4,650కు చేరింది. ► ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో (ఎంఎంఆర్) ఒక శాతం పెరిగి చదరపు అడుగు రూ.10,750కు చేరింది. ► బెంగళూరు మార్కెట్లో 2 శాతం పెరిగి చదరపు అడుగు ధర రూ.5,060గా ఉంది. ► పుణెలోనూ ఒక శాతం వృద్ధితో చదరపు అడుగు ధర రూ.5,580కు చేరింది. ► కోల్‌కతా మార్కెట్లో పెద్ద మార్పు లేదు. చదరపు అడుగు ధర రూ.4,385 నుంచి రూ.4,400 వరకు పెరిగింది. ► చెన్నై మార్కెట్లో ఒక శాతం పెరిగి చదరపు అడుగు ధర రూ.4,935గా ఉంది. ► ఇక హైదరాబాద్ మార్కెట్లో ఒక శాతం పెరిగి చదరపు అడుగు విక్రయ ధర రూ.4,195 నుంచి రూ.4,240కు చేరింది. ► 2020 సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఏడు ప్రధాన పట్టణాల్లో 45,200 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదు కాగా.. 2021 మొదటి మూడు నెలల్లో 58,290 ఇళ్ల విక్రయాలు నమోదు కావచ్చని అనరాక్ అంచనా వేస్తోంది. -
ఇప్పటికే రూ.2 వేలు పెంపు, మరింత పెరగనున్న ఏసీల ధరలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్ల (ఏసీ) అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వేసవి ముందుగా ప్రారంభం కావడమే ఇందుకు కారణం. అయితే ముడి సరుకు వ్యయాలు పెరగడంతో మరోసారి ఏసీల ధరలను సవరించే చాన్స్ ఉందని కంపెనీలు అంటున్నాయి. ఈ నెలలో లేదా ఏప్రిల్‌లో ధర 4–5 శాతం అధికం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఈ ఏడాది రెండుసార్లు ధరలను పెంచాయి. లాక్డౌన్ కారణంగా గతేడాది పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం నెలకొన్న డిమాండ్ నేపథ్యంలో 2021లో కోవిడ్ ముందస్తు స్థాయికి అమ్మకాలు చేరతాయని కంపెనీలు ధీమాగా ఉన్నాయి. భారత్‌లో ఏసీల పరిశ్రమ 70–75 లక్షల యూనిట్లుగా ఉంది. భారమవుతున్న ముడిసరుకు.. ఏసీల తయారీలో వాడే కాపర్, స్టీల్, ప్లాస్టిక్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు కంప్రెసర్ల ధరలూ అధికమవుతూనే వస్తున్నాయి. దేశీయ పరిశ్రమ ఇప్పటికీ పెద్ద ఎత్తున కంప్రెసర్ల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో గత్యంతరం లేక ఈ ఏడాది ఒక్కో ఏసీపై రూ.1,500–2,000 వరకు ధర పెంచాల్సి వచ్చిందని కంపెనీలు అంటున్నాయి. మూడు నెలలుగా ముడిసరుకు వ్యయాలు పెరుగుతూనే ఉన్నాయని లాయిడ్ అంటోంది. తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపించడం లేదని, ఇలాగే కొనసాగితే ధరలు మరోసారి పెంచడం తప్ప వేరే మార్గం లేదని స్పష్టం చేసింది. జనవరితోపాటు ఫిబ్రవరిలోనూ ధరలను ఎల్జీ సవరించింది. కొత్త కస్టమర్ల చేరిక.. ఈసారి వేసవిలో ఏసీల అమ్మకాలు జోరుగా ఉంటాయని పరిశ్రమ అంచనా వేస్తోంది. ముందస్తుగా అమ్మకాలు మొదలు కావడంతో వేసవి తాపం మాదిరిగానే విక్రయాలు పెరుగుతాయని కంపెనీలు అంటున్నాయి. ఈ సంవత్సరం కొత్త కస్టమర్లు వచ్చి చేరతారని ఆశగా ఉన్నాయి. పరిశ్రమ రెండంకెల వృద్ధి సాధిస్తుందనే ధీమాతో ఉంది. రవాణా వ్యయాలు భారమవుతున్నాయని హాయర్ చెబుతోంది. 4–5 శాతం ధర పెంచనున్నామని.. అధిక వేసవి దృష్ట్యా సవరించిన ధరల ప్రభావం అమ్మకాలపై ఉండబోదని అంటోంది. 2020తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–మార్చిలో రెండింతల అమ్మకాలు సాధించామని వెల్లడించింది. ముందుగా మొదలైన విక్రయాలు.. విపరీత డిమాండ్ నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్టుగా పూర్తి స్థాయి తయారీ సామర్థ్యంతో ఏసీ ఫ్యాక్టరీలు నడుస్తున్నాయని ఎల్జీ వెల్లడించింది. 2019తో పోలిస్తే 40 శాతం వృద్ధికి చాన్స్ ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. గతేడాది అమ్మకాలు లేకపోవడం, ప్రస్తుతం ఎండలు జోరుగా మొదలు కావడంతో 2021 సీజన్లో ఏసీలకు డిమాండ్ పెద్ద ఎత్తున ఉంటుందని ప్యానాసోనిక్ చెబుతోంది. మూడు నాలుగు నెలలుగా డిమాండ్ 25 శాతం పెరిగిందని, ఈ ట్రెండ్ కొనసాగుతుందని జోస్యం చెబుతోంది. 2019తో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రస్తుతం సేల్స్‌లో 15 శాతంపైగా వృద్ధి ఉందని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. ఫిబ్రవరి నుంచే కస్టమర్ల రాక పెరిగిందని అన్నారు. వాహనం... భారం! ► మరోసారి పెంపునకు కంపెనీల సిద్ధం ► ముడి సరుకు వ్యయాల ప్రభావం ► ఇప్పటికే పెరిగిన పలు మోడళ్ల ధర చెన్నై: వాహనాల ధరలు మరోసారి పెరగనున్నాయి. స్టీల్, అల్యూమినియం, ఇతర ముడి సరుకు వ్యయాలే ఇందుకు కారణం. ఏప్రిల్ నుంచి 1–3 శాతం ధరలు అధికం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కంపెనీ, మోడల్‌నుబట్టి వాహనం ధర రూ.45,000 వరకు పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, అశోక్ లేలాండ్ తమ వాహనాల ధరలను సవరించే అవకాశం ఉంది. మరోవైపు బీఎస్–4 నుంచి బీఎస్–6కి మళ్లిన సమయంలో వాహనాల ధరలకు రెక్కలొచ్చాయి. ముడి పదార్థాల భారం.. ముడి పదార్థాల ఖర్చులు అధికం అయ్యాయని ఐషర్ మోటార్స్ ఎండీ సిద్ధార్థ లాల్ తెలిపారు. వాణిజ్య వాహనాలతోపాటు రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్‌సైకిల్స్ ధరలనూ పెంచుతామన్నారు. ‘అక్టోబరు, జనవరిలో ధరలను పెంచాం. స్టీల్, ప్రత్యేక ఖనిజాల ధరలు గణనీయంగా పెరిగాయి. ఇది ఇలాగే కొనసాగితే ధరల సవరణ తప్ప మరో మార్గం లేదు’ అని అశోక్ లేలాండ్ సీఎఫ్‌వో, డైరెక్టర్ గోపాల్ మహదేవన్ అన్నారు. ఏప్రిల్–జూన్‌లో వాణిజ్య వాహనాలతోపాటు ఎస్‌యూవీల ప్రైస్ పెంచనున్నట్టు మహీంద్రా గ్రూప్ ఆటో ఈడీ రాజేశ్ జేజూరికర్ వెల్లడించారు. -
ఏప్రిల్ 1 విడుదల... ధర దడ
న్యూఢిల్లీ: ఎల్ఈడీ టీవీల ధరలు మరోసారి పెరగనున్నాయి. ఏప్రిల్ నుంచి ఈ వడ్డింపు ఉండనుంది. ఓపెన్–సెల్ ప్యానెళ్లు ఖరీదు కావడమే ఇందుకు కారణం. గత నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ప్యానెళ్ల ధర 35 శాతం వరకు అధికమైందని కంపెనీలు అంటున్నాయి. వచ్చే నెల నుంచి టీవీల ధరలు పెంచాలని ప్యానాసోనిక్, హాయర్, థామ్సన్ భావిస్తున్నాయి. ఇప్పటికే ఎల్జీ ఈ ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంగా 5–7 శాతం ధర పెరిగే చాన్స్ ఉంది. టీవీ స్క్రీన్ తయారీలో ఓపెన్–సెల్ ప్యానెల్ అత్యంత కీలక విడిభాగం. మొత్తం ధరలో దీని వాటాయే అధికంగా 60% వరకు ఉంటుంది. కంపెనీలు టెలివిజన్ ప్యానెళ్లను ఓపెన్–సెల్ స్థితిలో దిగుమతి చేసుకుంటాయి. చైనా సంస్థలే ఓపెన్–సెల్ తయారీ రంగాన్ని శాసిస్తున్నాయి. ఇక అప్లయెన్సెస్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లో టీవీలదే అగ్రస్థానం. దేశంలో ప్రస్తుతం ఏటా 1.7 కోట్ల టీవీలు అమ్ముడవుతున్నాయి. వీటి విలువ రూ.25,000 కోట్లు. 2024–25 నాటికి మార్కెట్ 2.84 కోట్ల యూనిట్లకు చేరుతుందని సియామా, ఫ్రాస్ట్ అండ్ సల్లివాన్ అంచనా. మరో మార్గం లేకనే..: ప్యానెళ్లు ప్రియం అవుతూనే ఉన్నందున టీవీల ధర కూడా అధికం అవుతుందని ప్యానాసోనిక్ ఇండియా, సౌత్ ఆసియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులనుబట్టి టీవీల ధర వచ్చే నెలకల్లా 5–7 శాతం అధికం కానుందని ఆయన వెల్లడించారు. ధరల సవరణ తప్ప తమకు మరో మార్గం లేదని హాయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. ఓపెన్–సెల్ ప్రైస్ గణనీయంగా పెరిగిందని, ట్రెండ్ ఇలాగే కొనసాగనుందని అన్నారు. ఓపెన్–సెల్‌కు అనుగుణంగా టీవీల ధరలను సవరించాల్సిందేనని స్పష్టం చేశా రు. తాము టీవీల ధరను పెంచడం లేదని ఎల్జీ వెల్లడించింది. జనవరి, ఫిబ్రవరిలో ధరలను సవరించామని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హోం అప్లయెన్సెస్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ బాబు తెలిపారు. వాటికి కొరత ఉన్నందునే.. మార్కెట్లో ఓపెన్–సెల్ ప్యానెళ్లకు కొరత ఉందని సూపర్ ప్లాస్ట్రానిక్స్ తెలిపింది. గడిచిన ఎనిమిది నెలల్లో వీటి ధర మూడింతలైందని కంపెనీ సీఈవో అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. అంతర్జాతీయంగా ప్యానెళ్ల మార్కెట్ మందగించిందని, అయినప్పటికీ నెల రోజుల్లో ధర 35% అధికమైందని చెప్పారు. ఏప్రిల్ నుంచి ఒక్కో టీవీ ధర కనీసం రూ.2–3 వేలు పెరగనుందన్నారు. ఫ్రాన్స్ కంపెనీ థామ్సన్, యూఎస్ సంస్థ కొడాక్ టీవీల లైసెన్స్‌ను భారత్‌లో సూపర్ ప్లాస్ట్రానిక్స్ కలిగి ఉంది. అత్యధికంగా అమ్ముడయ్యే 32 అంగుళాల టీవీల ధర రూ. 5–6 వేలు పెరగ వచ్చని వీడియోటెక్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ చెప్పారు. -
వరుసగా అయిదో రోజూ పెట్రో బాదుడు
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా అయిదో రోజూ పెట్రోల్ ధరలు పెరిగాయి. శనివారం పెట్రోల్ ధర లీటరుకు 30 పైసలు, డీజిల్ ధర 36 పైసలు పెరిగింది. దీంతో ముంబైలో పెట్రోల్ ధర రూ. 94.93కి చేరువకాగా, డీజిల్ ధర రూ. 85.70కి చేరుకుంది. ఢిల్లీలో పెట్రోల్ ధర జీవితకాల గరిష్టానికి రూ. 88.414కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 78.74కు చేరకుంది. ఈ 5 రోజుల్లో పెట్రోల్ ధర రూ. 1.51 పెరగ్గా, డీజిల్ ధర రూ. 1.56 పెరిగింది. మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఆయిల్ రేట్లను తగ్గించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని కోరగా, తగ్గించబోయేది లేదని ఆయిల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటు వేదికగా చెప్పిన సంగతి తెలిసిందే. -
టీవీల రేట్లకు రెక్కలు
న్యూఢిల్లీ: ఎల్ఈడీ టీవీలతో పాటు ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్ల వంటి ఉపకరణాల రేట్లకు రెక్కలు రానున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి 10 శాతం దాకా పెరగనున్నాయి. రాగి, అల్యూమినియం, ఉక్కు వంటి ముడిపదార్థాల ధరలతో పాటు రవాణా చార్జీలు పెరగడమే ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ విక్రేతల నుంచి సరఫరా తగ్గిపోవడం వల్ల టీవీ ప్యానెళ్ల రేట్లు రెట్టింపయ్యాయని, అలాగే ముడి చమురు రేట్లు పెరగడంతో ప్లాస్టిక్ ధర సైతం పెరిగిందని తయారీ సంస్థలు వెల్లడించాయి. ధరల పెంపు అనివార్యమంటూ ఎల్జీ, ప్యానసోనిక్, థామ్సన్ వంటి సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. ‘కమోడిటీల రేట్లు పెరగడం వల్ల సమీప భవిష్యత్‌లో మా ఉత్పత్తుల ధరలపైనా ప్రభావం పడనుంది. జనవరిలో 6–7 శాతంతో మొదలుకుని ఆ తర్వాత 10–11 శాతం దాకా పెరగవచ్చు‘ అని ప్యానసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ తెలిపారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా కూడా జనవరి 1 నుంచి ఉపకరణాల రేట్లను కనీసం 7–8 శాతం మేర పెంచనుంది. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (హోమ్ అప్లయెన్సెస్ విభాగం) విజయ్ బాబు చెప్పారు. ఆలోచనలో సోనీ.. మిగతా సంస్థలకు భిన్నంగా సోనీ ఇండియా మాత్రం ఇంకా పరిస్థితిని సమీక్షిస్తున్నామని, రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది. ‘రోజురోజుకు మారిపోతున్న సరఫరా వ్యవస్థను నిశితంగా పరిశీలిస్తున్నాం. దీనిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో, పెంపు ఎంత మేర ఉండాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు‘ అని సంస్థ ఎండీ సునీల్ నయ్యర్ తెలిపారు. వర్క్ ఫ్రం హోమ్ విధానం నేథ్యంలో ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని, అయితే ఫ్యాక్టరీలు ఇంకా పూర్తి సామర్థ్యంతో పని చేయకపోతుండటంతో సరఫరా పరిమితంగానే ఉంటోందని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల రేట్లకు రెక్కలు వస్తున్నాయని వివరించారు. టీవీ ఓపెన్‌సెల్ కొరత తీవ్రంగా ఉందని, దీంతో వాటి ధర 200 శాతం పైగా ఎగిసిందని భారత్‌లో థామ్సన్, కొడక్ ఉత్పత్తులను విక్రయించే సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈవో అవ్నీత్ సింగ్ మార్వా చెప్పారు. భారత్‌లో ప్రత్యామ్నాయంగా ప్యానెళ్ల తయారీ లేకపోవడంతో అంతా చైనాపై ఆధారపడాల్సి వస్తోందని ఆయన తెలిపారు. జనవరి నుంచి థామ్సన్, కోడక్ తమ ఆండ్రాయిడ్ టీవీల రేట్లను 20% మేర పెంచే అవకాశం ఉందని వివరించారు. డిమాండ్‌కు దెబ్బ.. బ్రాండ్లు రేట్లను పెంచిన పక్షంలో వచ్చే త్రైమాసికంలో మొత్తం డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయన్సెస్ తయారీ సంస్థల సమాఖ్య సీఈఏఎంఏ ప్రెసిడెంట్ కమల్ నంది ఆందోళన వ్యక్తం చేశారు. ‘కమోడిటీల ధరలు 20–25 శాతం పెరగడం, కంటెయినర్ల కొరతతో సముద్ర.. విమాన రవాణా చార్జీలు 5–6 రెట్లు పెరిగిపోవడంతో ఉపకరణాల ముడి వస్తువుల వ్యయాలపై భారీగా ప్రతికూల ప్రభావం పడుతోంది. దీనితో సమీప భవిష్యత్‌లో బ్రాండ్లు తమ ఉత్పత్తుల రేట్లను 8–10 శాతం దాకా పెంచే అవకాశం ఉంది. దీనివల్ల వచ్చే త్రైమాసికంలో మొత్తం డిమాండ్ దెబ్బతినే ముప్పు ఉంది‘ అని పేర్కొన్నారు. అయితే, పేరుకుపోయిన డిమాండ్‌కి తగ్గట్లుగా కొనుగోళ్లు జరిగే అవకాశం ఉందని, ఫలితంగా పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని పరిశ్రమ ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు. సీఈఏఎంఏ, ఫ్రాస్ట్ అండ్ సలివాన్ సంయుక్త నివేదిక ప్రకారం 2018–19లో కన్జూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమ పరిమాణం రూ. 76,400 కోట్లుగా నమోదైంది. -
భారీగా పెరగనున్న టీవీ, ఫ్రిజ్‌ల ధరలు!
టీవీ, వాషింగ్ మెషీన్, ఫ్రిజ్, ఏసీ, మైక్రోవేవ్ ఓవెన్ తదితర వైట్ గూడ్స్ ధరలు త్వరలోనే పెరగనున్నాయి. ఉత్పత్తి, రవాణా వ్యయాలు పెరుగుతుండటంతో ఈ వస్తువుల ధరలను కంపెనీలు పెంచక తప్పడం లేదు. ఎల్సీడీ/ఎల్ఈడీ ప్యానెళ్లపై 5 శాతం సుంకం విధించడం, భవిష్యత్తులో ఈ సుంకం మరింత పెరగనుండటంతో టీవీల ధరలు కొండెక్కనున్నాయి. వైట్ గూడ్స్ ధరల పెరుగుదలపై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ... వైట్ గూడ్స్‌కు సంబంధించి ఉత్పత్తి వ్యయాలు 15–40 శాతం మేర పెరిగాయి. ఈ వస్తువుల తయారీలో ఉపయోగపడే రాగి, జింక్, అల్యూమినియమ్, ఉక్కు, ప్లాస్టిక్ తదితర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. రాగి, జంక్, అల్యూమినియమ్ ధరలు గత ఐదు నెలల్లోనే 40–45 శాతం మేర ఎగిశాయి. ఫ్రిజ్‌లు, చెస్ట్ ఫ్రీజర్లలో ఉపయోగించే ఫోమ్స్ తయారీలో వాడే ఎమ్‌డీఐ కెమికల్ ధర 200 శాతం ఎగసింది. ఇక ప్లాస్టిక్ ధరలు 30–40 శాతం పెరిగాయి. మరోవైపు సముద్ర రవాణా 40–50 శాతం మేర ఎగసింది. భారీగా పెరుగుదల...! వైట్ గూడ్స్ ధరలు 20 శాతం మేర పెరగనున్నాయని, ఒకేసారి ఇంత భారీగా ధరలు పెరగడం గత కొన్నేళ్లలో ఇదే మొదటిసారని పరిశ్రమ వర్గాలంటున్నాయి. కరెన్సీ మారకం రేటు నిలకడగా ఉండటం ఒకింత మేలు చేసిందని, లేకుంటే ధరల మోత మరింత అధికంగా ఉండేదని నిపుణులంటున్నారు. మరోవైపు ఏసీ, ఫ్రిజ్‌లకు ఎనర్జీ లేబులింగ్ నిబంధనల అప్‌గ్రేడ్‌ను మరో రెండేళ్ల పాటు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) వాయిదా వేసింది. ఈ నిబంధనలను కఠినతరం చేస్తే ధరలు మరింతగా ఎగబాకేవి. ఈ నిబంధనలు రెండేళ్లు వాయిదా పడటం ఒకింత ఊరట నిచ్చే అంశం. పండుగల సీజన్లోనే పెంచాల్సింది..! అసలైతే సెప్టెంబర్ నుంచే ధరలు పెంచాల్సి ఉంది. కానీ పండుగ అమ్మకాలపై ప్రభావం ఉంటుందనే భయాలతో ధరల పెంపును కంపెనీలు వాయిదా వేశాయి. మొత్తం ఏడాది అమ్మకాల్లో మూడో వంతు ఈ పండగ సీజన్లో ఉండటంతో మార్జిన్లు తగ్గించుకుని, ధరలు పెంచకుండా కంపెనీలు మేనేజ్ చేశాయి. ఇక ఇప్పుడు పండుగల సీజన్ పూర్తి కావడంతో ధరలు పెంచక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నెల చివర్లో గానీ, వచ్చే నెల మొదట్లో గానీ ధరల పెంపుదల ఉండొచ్చని పరిశ్రమ వర్గాలంటున్నాయి. కాగా హెయిర్ ఇండియా కంపెనీ టీవీల ధరలను ఇప్పటికే 5–7 శాతం మేర పెంచింది. వచ్చే నెలలో మరింతగా పెంచే అవకాశాలున్నాయని సమాచారం. ప్యానాసానిక్ ఇండియా తన వస్తువుల ధరలను ఇప్పటికే 7 శాతం మేర పెంచింది. భయపడుతున్న కంపెనీలు... కరోనా కల్లోలం కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకూ వైట్ గూడ్స్ అమ్మకాలు కుదేలయ్యాయి. పండుగల సీజన్ పుణ్యమాని ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటున్నాయి. అమ్మకాలు కూడా రికవరీ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ వైట్ గూడ్స్ ధరలను 20 శాతం మేర పెంచడం అమ్మకాల రికవరీపై తీవ్రంగానే ప్రభావం చూపుతుందని కంపెనీలు భయపడుతున్నాయి. అయితే పెరుగుతున్న ఉత్పత్తి, రవాణా వ్యయాలను భరించే స్థాయిలో కంపెనీలు లేవు. ధరలు పెంచక తప్పని పరిస్థితి. ఇక ఈ ధరల పెరుగుదల మార్చి క్వార్టర్లో అమ్మకాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావమే చూపించగలదని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. టీవీలకు సుంకాల దెబ్బ... ఎల్ఈడీ/ఎల్సీడీ స్క్రీన్ల తయారీలో ఉపయోగపడే ఓపెన్–సెల్ ప్యానెళ్లపై దిగుమతి సుంకాలను కేంద్రం పెంచనున్నది. వీటిని స్థానికంగా తయారు చేయడాన్ని ప్రోత్సహించే నిమిత్తం సుంకాలను మూడేళ్లలో 8–10 శాతానికి పెంచాలనేది కేంద్రం అభిమతం. ఈ ప్యానెళ్ల దిగుమతులపై సెప్టెంబర్ వరకూ ఎలాంటి సుంకాలు లేవు. అక్టోబర్‌లో ఈ సుంకాన్ని కేంద్రం 5 శాతంగా విధించింది. ఈ ప్యానెళ్లపై సుంకం పెంపుదల కారణంగా టీవీల ధరలు కూడా 5 శాతం మేర పెరుగుతాయి. మరోవైపు సెప్టెంబర్ నుంచే ప్యానెళ్ల తయారీ ధరలు ప్యానెళ్ల ధరలను 20–25 శాతం మేర పెంచారు. ప్యానెళ్ల ధరలు పెరగడం, సుంకాల పెంపు... వెరసి టీవీల ధరలు 20 శాతం మేర ఎగిసే అవకాశాలున్నాయి. -
ఢిల్లీలో పెరుగుతున్న టమాటో ధరలు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో టమాటో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అన్ సీజన్ వల్ల సరఫరా తక్కువ ఉండటంతో టమాటో ధరలు పెరిగినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో జూన్ 1 నుంచి టమాటో ధరలు క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కూరగాయల మార్కెట్లలో టమాటో కిలో రూ. 70కి పెరిగే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సాధారణ కూరగాయల మార్కెట్లలోనే కాకుండా.. మదర్ డైరీ జౌట్లెట్స్, బిగ్‌బాస్కెట్‌లో కూడా టమోటో ధరలు భారీగానే ఉన్నాయి. (తెలంగాణలో కొత్తగా 1,269 కరోనా కేసులు) ఆదివారం రోజున బిగ్‌బాస్కెట్‌లో కిలో టమాటోను రూ. 60 నుంచి 66 వరకు విక్రయించారు. టమాటో ఉత్పత్రి చేస్తున్న రాష్ట్రాల నుంచి తక్కువ మొత్తంలో దిగుమతి రావడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని కూరగాయల వ్యాపారులు తెలిపారు. టమాటో పండిస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడంతో అది టమాటో పెంపకంపై ప్రభావం చూపెడుతోందని అంటున్నారు.(రాజస్తాన్ సంక్షోభం : సింధియా ట్వీట్) -
పెరిగిన వంట గ్యాస్ ధర
సాక్షి, న్యూఢిల్లీ : వంట గ్యాస్ ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం (జూలై1) అమల్లోకి వచ్చేలా మెట్రో నగరాల్లో సిలిండర్‌కు 4.50 రూపాయలకు వరకు పెంచారు. ఎల్పీజీ సిలిండర్ల ధరను వరుసగా రెండవ నెలలోనూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. సబ్సిడీ లేని 14.2 కిలోల సిలిండర్ పై ఢిల్లీలో ఒక రూపాయి, ముంబైలో 3 రూపాయల 50 పైసలు , కోల్‌కతాలో 4.50 రూపాయలు, చెన్నైలో 4 రూపాయలు, హైదరాబాద్ లో 4.50 రూపాయలు చొప్పున పెరిగింది సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ రేట్లు (14.2 కిలోలు) హైదరాబాద్ : 645.50 రూపాయలు ఢిల్లీ : 594 రూపాయలు కోల్‌కతా : 620.50 రూపాయలు ముంబై : 594 రూపాయలు చెన్నై : 610.50రూపాయలు -
గోల్డ్ బాజా!
న్యూఢిల్లీ/న్యూయార్క్: ప్రపంచ దేశాలను భయాందోళనలోకి నెట్టిన మహమ్మారి కరోనా వైరస్ ఎప్పటికి కొలిక్కి వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి, దీనితో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థలు, అనిశ్చితి పరిస్థితులు, ఈక్విటీల బలహీన ధోరణి అంతర్జాతీయంగా బంగారానికి బలాన్ని అందిస్తున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు ప్రస్తుతం ప్రధాన మార్గంగా పసిడివైపు చూస్తున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర సోమవారం 26 డాలర్లకుపైగా పెరిగి 1,778.95 డాలర్లను తాకింది. ఈ వార్త రాసే సమయం రాత్రి 9.30 గంటల సమయంలో 1,774 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత్‌లో చూస్తే, అంతర్జాతీయ ధోరణికితోడు డాలర్ మారకంలో రూపాయి బలహీనత పసిడికి వరమవుతోంది. దేశీయంగా 50 వేల దిశగా... హైదరాబాద్, విజయవాడసహా దేశ వ్యాప్తంగా పలు స్పాట్ బులియన్ మార్కెట్లలో సోమవారం 10 గ్రాముల స్వచ్ఛత ధర ఒక దశలో రూ.50,000 దాటినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే అటు తర్వాత రూపాయి బలోపేతం పసిడి ధరను కొంత తగ్గించింది. ఈ వార్త రాసే సమయంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్(ఎంసీఎక్స్)లో ధర స్వల్ప లాభంతో 48,026 వద్ద ట్రేడవుతోంది. రూపాయి విలువ గత శుక్రవారంతో పోల్చితే సోమవారం 17 పైసలు బలపడి 76.03 వద్ద ముగిసింది. కరోనా భయాలు, ఈక్విటీల అనిశ్చితికి తోడు చైనాతో ఉద్రిక్తతలూ ఇప్పుడు రూపాయి విలువను భయపెడుతున్నాయి. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). మళ్లీ ఆ కనిష్టాల దిశగా రూపాయి కదిలితే దేశీయంగా పసిడి ధర వేగంగా రూ 50,000 దాటేస్తుందనేది నిపుణుల అంచనా. 1,800 డాలర్లు దాటితే పరుగే... అంతర్జాతీయంగా పసిడి ధరకు 1,800 డాలర్ల వద్ద పటిష్ట నిరోధం ఉంది. ఈ స్థాయిని దాటితే పసిడి వేగంగా తన చరిత్రాత్మక గరిష్ట స్థాయిలకు దూసుకుపోయే వీలుందని ఈ రంగంలో నిపుణులు పేర్కొంటున్నారు. మాంద్యంలోకి జారుకుంటున్నపలు ప్రధా న దేశాల ఆర్థిక వ్యవస్థలను ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో పసిడి అప్ట్రెండ్వైపు మొగ్గు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కరోనా కట్టడి జరక్కుండా, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఇదే విధంగా కొనసాగి, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీరేటు నెగటివ్‌లోకి వెళితే... పసిడి 2011 ఆగస్టు, సెప్టెంబర్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలు 1,920 డాలర్ల దిశగా తిరిగి వేగంగా దూసుకుపోతుందన్న అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో పసిడి 52 వారాల కనిష్ట స్థాయి 1,362 డాలర్లయితే, గరిష్ట స్థాయి 1,789 డాలర్లు. ప్రపంచ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఏడాది లోపు 2000 డాలర్లను అందుకుంటుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మెన్ శాక్స్ ఇప్పటికే ఒక నివేదికలో పేర్కొంది. మా వద్ద 13,212 కేజీల పసిడి డిపాజిట్లు: ఎస్బీఐ పడిసి డిపాజిట్ స్కీమ్ (గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్– జీఎంఎస్) ద్వారా బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ మొత్తం 13,212 కేజీల పసిడిని సమీకరించింది. బ్యాంక్ వార్షిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. జీఎంఎస్ కింద ఒక్క 2019–20 ఆర్థిక సంవత్సరంలో 3,973 కేజీల పసిడిని సమీకరించినట్లు వెల్లడించింది. వ్యక్తులు, ట్రస్టుల వద్ద నిరుపయోగంగా ఉన్న పసిడి వినియోగానికి ప్రభుత్వం 2015 నవంబర్‌లో ఈ పథకాన్ని ఆవిష్కరించింది. కాగా 2019–20 ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) స్కీమ్ ద్వారా దాదాపు రూ.244 కోట్ల విలువైన 647 కేజీల పసిడిని సమీకరించినట్లు బ్యాంక్ పేర్కొంది. తద్వారా ఈ ఒక్క స్కీమ్‌తో పసిడి సమీకరణ పరిమాణం 5,098 కేజీలకు (రూ.1,561 కోట్లు) చేరినట్లు బ్యాంక్ తెలిపింది. దేశంలో పెట్టుబడులకు సంబంధించి ఫిజికల్ గోల్డ్ డిమాండ్ తగ్గించడం లక్ష్యంగా 2015–16 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎస్జీబీని తీసుకువచ్చింది. -
పదమూడో రోజూ పెరిగిన ధరలు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ మంట అంతకంతకూ పెరుగుతూనే ఉంది. పదమూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కూడా పెట్రోల్ ధర లీటరుకి 56 పైసలు పెరిగింది. డీజిల్ ధర లీటరుకి 63 పైసలు పెరిగింది. రెండు వారాలు పూర్తికాకుండానే పెట్రోల్ ధర రూ.7.11 పైసలు, డీజిల్ ధర రూ.7.67 పైసలు పెరిగింది. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు వెల్లడించిన ధరలను బట్టి ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.77.81 నుంచి రూ.78.37కు పెరిగింది. డీజిల్ ధర లీటరుకి రూ.76.43 నుంచి రూ.77.06కు ఎగబాకింది. జూన్ 7వ తేదీనుంచి కంపెనీలు ధరలు సవరిస్తున్నాయి. అప్పటి నుంచి ధరలు పెరగడం వరసగా ఇది 13వ రోజు. అంతర్జాతీయంగా చమురు ధరలు పుంజుకోవడవంతో ఆయిల్ కంపెనీలు వాటికనుగుణంగా రిటైల్ ధరలను సవరిస్తున్నాయి. -
డీమార్ట్‌లో ధరలు ఎందుకు పెరిగాయంటే..
ముంబై: దేశంలోని వినియోగదారులను విశేషంగా ఆకర్శించిన సూపర్ మార్ట్స్ రిటైల్ బ్రాండ్ డీమార్ట్ ప్రస్తుతం కరోనా ఉదృతి కారణంగా డీలా పడింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నియమాలను పాటిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా స్టోర్లను శుభ్రంగా ఉంచేందుకు సంస్థకు చాలా ఖర్చు అవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కారణంగానే వస్తువుల ధరలు కూడా పెంచామని తెలిపారు. వినియోగదారులు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని సానుకూలంగా ఆలోచించాలని సంస్థ కోరింది. కరోనా నేపథ్యంలో మార్చి నుంచి సంస్థ అమ్మకాల వృద్ధి 11 శాతం తగ్గగా ఏప్రిల్ నెలలో ఏకంగా 45శాతం ఆదాయం కోల్పోయిందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో అమ్మకాల వృద్ధి గణనీయంగా తగ్గడానికి లాక్డౌన్ కారణమని సంస్థ సీనియర్ ఉద్యోగులు అభిపప్రాయపడ్ఢారు. ఈ సంక్షోభ సమయంలో సంస్థ ఆదాయాలను పెంచుకోవడానికి హోం డెలివరీని సమర్థవంతంగా వినియోగిస్తామని తెలిపారు. కాగా ఖర్చులను హేతుబద్దీకరించి ప్రణాళికబద్దంగా వ్యవహరిస్తే లాభాల బాట పట్టడం ఖాయమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సంవత్సరంలో 38 నూతన స్టోర్లనను తెరవనున్నామని.. తమ సంస్థకు రూ.3500కోట్లు మూలధనం ఉందని, ఎలాంటి సంక్షోభానైనా ఎదుర్కొనే సత్తా డీమార్ట్‌కు ఉందని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. చదవండి: ఎల్బీ నగర్ డీమార్ట్‌ను సీజ్ చేసిన అధికారులు -
పెరిగిన ఐఫోన్ ధరలు
న్యూఢిల్లీ: టెక్నాలజీ కంపెనీ ఆపిల్ తన ఉత్పత్తుల ధరలను పెంచింది. జీఎస్టీ 12 నుంచి 18 శాతానికి పెరగడమే ఈ ధరల సవరణకు కారణం. సవరించిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. 64 జీబీ ఐఫోన్ 11 ధర రూ.64,900 నుంచి రూ.68,300లకు చేరింది. 64 జీబీ ఎక్స్ఆర్ మోడల్ రూ.2,600 అధికమై రూ.52,500లకు ఎగసింది. 64 జీబీ 11 ప్రో ధర రూ.1,06,600లుగా ఉంది. అంతక్రితం ఈ మోడల్ ధర రూ.1,01,200 ఉండేది. 64 జీబీ 11 ప్రో మ్యాక్స్ రూ.1,11,200 నుంచి రూ.1,17,100కు చేరింది. 32 జీబీ ఐఫోన్ 7 రూ.1,600 పెరిగి రూ.31,500లుగా ఉంది. రియల్మీ కూడా... స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీ రియల్మీ తన ఉత్పత్తుల ధరను పెంచింది. జీఎస్టీ పెంపు, రూపాయి పతనం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. పాత, కొత్త మోడళ్లపై ధరల పెంపు వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. 2018 తర్వాత ఇలా ధరలను పెంచడం ఇదే తొలిసారి అని స్పష్టం చేసింది. కోవిడ్–19 ప్రభావం స్మార్ట్‌ఫోన్ పరిశ్రమపై తీవ్రంగా పడిందని తెలిపింది. దీంతో సరఫరా కొరతతోపాటు విడిభాగాల ధర అధికమైందని వివరించింది. అటు రూపాయి పతనం కూడా మొబైల్ ధర పెరిగేందుకు కారణమైందని తెలిపింది. జీఎస్టీ పెంపుతో కస్టమర్లపై రూ.15,000 కోట్ల భారం పడుతుందని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ అంచనా వేస్తోంది. -
కరోనా ఎఫెక్ట్: షాకిచ్చిన రైల్వేశాఖ
న్యూఢిల్లీ: మహమ్మారి కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించి.. జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే షాపింగ్ మాల్స్, పబ్లిక్ పార్కులు మూసివేయాలని ఆదేశాలు జారీచేశాయి. అదే విధంగా వివాహ వేడుకలను కూడా వాయిదా వేయాలని కోరుతున్నాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి కట్టడి చేసే చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్టు ధరను రూ. 10 నుంచి రూ. 50కి పెంచినట్లు పేర్కొంది.(చదవండి: ‘గ్రాండ్ ప్రిన్సెస్’లో చిక్కుకున్న భారతీయులు!) ఈ మేరకు రైల్వే శాఖ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘‘దేశంలోని 250 రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ. 10 నుంచి రూ. 50కి పెంచనున్నాం. అయితే ఇది తాత్కాలికమే. రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. పశ్చిమ రైల్వే ముంబై, వడోదర, అహ్మదాబాద్, రట్లాం, రాజ్‌కోట్, భావ్‌నగర్ స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.50కి పెంచింది’’ అని పేర్కొన్నారు. రైల్వే ప్లాట్‌ఫాం ధరను పెంచేందుకు 2015 మార్చిలో డివిజన్ రైల్వే మేనేజర్లకు అధికారం ఇస్తూ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇదిలా ఉండగా.. మంగళవారం భారత్‌లో కొత్తగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 126కు చేరింది. ఇక ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా దేశంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.(‘కరోనా’ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం!) చదవండి: ‘కరోనా’ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం! వైద్యులు ఎన్నిసార్లు చేతులు కడుక్కుంటారో తెలుసా? కరోనా అనుమానితుల చేతిపై స్టాంపులు -
టీవీ రేట్లకు రెక్కలు..!!
న్యూఢిల్లీ: టీవీలకు కూడా కరోనా వైరస్ (కోవిడ్–19) సెగ తగలనుంది. టీవీల్లో కీలకమైన ఓపెన్ సెల్ టెలివిజన్ ప్యానళ్ల సరఫరా తగ్గి, కొరత పెరిగిపోతుండటంతో మార్చి నుంచి రేట్లు 10 శాతం దాకా ఎగియనున్నాయి. ప్రధానమైన ఈ భాగాన్ని దేశీ సంస్థలు ఎక్కువగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. టీవీ యూనిట్ రేటులో దాదాపు 60 శాతం భాగం టీవీ ప్యానళ్లదే ఉంటుంది. చైనా కొత్త సంవత్సరం సెలవులను దృష్టిలో ఉంచుకుని చాలామటుకు కంపెనీలు ముందస్తుగానే వీటిని నిల్వ చేసుకున్నాయి. కానీ ఊహించని విధంగా కరోనా వైరస్ ప్రబలడం, ఉత్పత్తి.. సరఫరా దెబ్బతినడంతో ప్యానళ్ల కొరత ఏర్పడింది. చైనాలో కొన్ని ఫ్యాక్టరీలు తిరిగి తెరుచుకున్నప్పటికీ, అర కొర సిబ్బందితోనే పనిచేస్తున్నాయి. దీంతో ప్యానళ్ల ధరలు దాదాపు 20 శాతం దాకా పెరిగినట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. ‘చైనాలో కరోనా వైరస్ సంక్షోభం వల్ల ముడిసరుకులకు భారీ కొరత నెలకొంది. ఓపెన్ సెల్ ప్యానళ్ళ ధరలు ఏకంగా 20 శాతం ఎగిశాయి. దీంతో మార్చి నాటికి టీవీల ధరలు 10 శాతం మేర పెరగనున్నాయి‘ అని ఎస్పీపీఎల్ సీఈవో అవ్నీత్ సింగ్ మార్వా చెప్పారు. భారత్‌లో థామ్సన్ టీవీలకు ఈ సంస్థ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ లైసెన్సీగా వ్యవహరిస్తోంది. టీవీ ప్యానళ్ల కొరత కారణంగా టీవీల రేట్లూ పెరగవచ్చని పానాసోనిక్ ఇండియా సీఈవో మనీష్ శర్మ తెలిపారు. ‘పరిస్థితి మెరుగుపడితే ఏప్రిల్ నుంచి రేట్లు స్థిరంగానైనా ఉండవచ్చు లేదా ఇదే ధోరణి కొనసాగితే 3–5% దాకా పెరగవచ్చు‘ అని చెప్పారు. ఫ్రిజ్‌లు.. ఏసీలు కూడా.. రాబోయే వారాల్లో ఫ్రిజ్‌లు, ఏసీల ధరలు కూడా పెరుగుతాయని హయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా చెప్పారు. ‘మార్చి ప్రారంభం నుంచి టీవీల రేట్లు పెరుగుతాయి. ఆ తర్వాత ఫ్రిజ్‌లు, ఏసీల ధరలూ పెరుగుతాయి. డీప్ ఫ్రీజర్ల రేట్లు ఇప్పటికే 2.5 శాతం పెరిగాయి‘ అని ఆయన చెప్పారు. చాలా కంపెనీలు ఏసీ, రిఫ్రిజిరేటర్లకు అవసరమైన కంప్రెసర్లను ఎక్కువగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. మరో 3 నెలల్లో సాధారణ స్థాయికి... ఉత్పత్తి, సరఫరా మళ్లీ సాధారణ స్థాయికి రావాలంటే కనీసం ఒక త్రైమాసికమైనా పడుతుందని మార్వా వివరించారు. కన్సల్టెన్సీ సంస్థ ఫ్రాస్ట్ అండ్ సలివాన్, పరిశ్రమ సమాఖ్య సీఈఏఎంఏ అధ్యయనం ప్రకారం.. 2018–19లో 1.75 కోట్ల యూనిట్లుగా ఉన్న టీవీ మార్కెట్ 2024–25 నాటికి 2.84 కోట్లకు చేరగలదని అంచనా. టీవీలో కీలకమైన ఓపెన్ సెల్ ప్యానల్, చిప్స్ ప్రధానంగా చైనాతో పాటు తైవాన్, థాయ్‌లాండ్, వియత్నాం వంటి మార్కెట్ల నుంచి దిగుమతవుతున్నాయి. భారత్‌లో అసెంబ్లింగ్ మాత్రమే జరుగుతోంది. దేశీ తయారీని ప్రోత్సహించేందుకు, టీవీల ఖరీదును తగ్గించేందుకు ఓపెన్ సెల్ ప్యానళ్లపై కేంద్రం దిగుమతి సుంకాలను తొలగించిందని నివేదిక వివరించింది. -
గ్యాస్ మంట
న్యూఢిల్లీ: వంటగ్యాస్ ఎల్పీజీ ధర అమాంతం పెరిగింది. సిలిండర్‌పై ఒక్కసారిగా రూ.144.5 పెంచుతూ కేంద్రం అసాధారణ నిర్ణయం తీసుకుంది. దీంతో ఢిల్లీలో రూ.714గా ఉన్న సిలిండర్ ధర రూ.858.50కి చేరుకుంది. 2014 జనవరి తర్వాత వంటగ్యాస్ ధర ఇంత భారీస్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పెరుగుదలే ఇందుకు కారణమని సమాచారం. అయితే కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌కు ఇచ్చే సబ్సిడీని పెంచడం కొంతవరకు ఊరటనిచ్చింది. ఇంతకు ముందు రూ.153.86 రాయితీ ఇవ్వగా దాన్ని రూ.291.48కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (పీఎమ్‌యూవై) లబ్ధిదారులకు సబ్సిడీని రూ.174.86 నుంచి రూ.312.48కు పెంచింది. సాధారణంగా ప్రతినెలా ఒకటో తారీఖున ధరలను సమీక్షిస్తుంటారు. అయితే ఈసారి రాయితీని భారీగా పెంచడంతో అనుమతుల ప్రక్రియలో జాప్యంతో రెండు వారాలు ఆలస్యమైందని అధికారులు తెలిపారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే వంటగ్యాస్ ధర పెంచడం గమనార్హం. కాగా, ఈ పెంపుపై విపక్షాలు తీవ్రస్థాయిలో స్పందించాయి. వంటగ్యాస్ ధరను పెంచుతూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల జేబులకు చిల్లు పెట్టేలా ఉందని కాంగ్రెస్ పేర్కొంది. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతోనే కేంద్రం వంటగ్యాస్ ధరను పెంచిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరను పెంచడం పేద ప్రజలపై తీసుకున్న ‘క్రూరమైన చర్య’అని బీఎస్పీ అధినేత్రి మాయావతి అభివర్ణించారు. -
ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే..!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ పెంపుతో ఫర్నీచర్, చెప్పుల ధరలు పెరగనున్నాయి. అదే విధంగా ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు సైతం పెరుగనున్నాయి. వైద్య పరికరాలపై 5 శాతం హెల్త్ సెస్, ఆటో మెబైల్ విడి భాగాలపై కస్టమ్స్ సుంకం పెరిగింది. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్‌పై కేంద్రం పన్ను తగ్గించింది. అదే విధంగా ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్ల విడిభాగాలకు పన్ను తగ్గించింది. ప్లాస్టిక్ ఆధారిత ముడి సరుకు కస్టమ్స్ పన్నును సైతం తగ్గించింది.(బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) ధరలు పెరిగేవి ఫర్నీచర్ చెప్పులు సిగరెట్లు పొగాకు ఉత్పత్తులువైద్య పరికరాలు కిచెన్‌లో వాడే వస్తువులు క్లే ఐరన్ స్టీలు కాపర్ సోయా ఫైబర్, సోయా ప్రోటీన్ కమర్షియల్ వాహనాల విడిభాగాలు స్కిమ్డ్ మిల్క్ వాల్ ఫ్యాన్స్ టేబుల్‌వేర్ ధరలు తగ్గేవి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్ ఎలక్ట్రిక్ వాహనాలు మొబైల్ ఫోన్ల విడిభాగాలు ప్లాస్టిక్ ఆధారిత ముడి సరుకు -
భారీగా పెరిగిన మద్యం ధరలు
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకలకు ముందు మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. మద్యంపై పదిశాతం ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్వార్టర్‌పై రూ.20, హాఫ్‌పై రూ.40, ఫుల్‌పై రూ.80 పెంచుతున్నట్లు అబ్కారీశాఖ తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి సోమేష్ కుమార్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పెరిగిన ధరలు రేపటి నుంచి (మంగళవారం) అమల్లోకి రానున్నాయి. పాత మద్యం నిల్వలకు కొత్త ధరల పెంపు వర్తించదని ఎక్సైజ్‌శాఖ తెలిపింది. పెరిగిన ధరలతో ప్రభుత్వానికి రూ.300 నుంచి రూ.400 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనుంది. -
జనవరి నుంచి హీరో బైక్స్ ధరల పెంపు
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ జనవరి నుంచి మోటార్ సైకిల్స్, స్కూటర్ల ధరలను రూ.2 వేల వరకు పెంచనుంది. ప్రస్తుతం హీరో కార్ప్ వాహనాల ధరల శ్రేణి రూ.39 వేల నుంచి రూ.1.05 లక్షల మధ్య ఉన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇప్పటికే మారుతీ సుజుకీ ఇండియా, టొయోటా, మహీంద్రా అండ్ మహీంద్రా, మెర్సిడెస్ బెంజ్ కార్ల కంపెనీలు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించడం తెలిసిందే. -
టాటా మోటార్స్ కార్ల ధరలు పెంపు..
జైసల్మేర్/రాజస్తాన్: దేశీయ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వాహన ధరలను పెంచనున్నట్లు బుధవారం ప్రకటించింది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని తెలియజేసింది. భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా వాహనాలను విడుదల చేయాల్సి వస్తుండడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుం దని, ఎంత మేర పెంచాలన్న అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని సంస్థ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ అన్నారు. హ్యాచ్‌బ్యాక్ టియాగో నుంచి ఎస్యూవీ హ్యారియర్ వరకు పలు మోడళ్లను ఈ సంస్థ భారత మార్కెట్లో విక్రయిస్తోంది. వీటి ధర రూ.4.39 లక్షలు–16.85 లక్షల వరకు ఉంది. -
ఆ రైళ్లలో భోజనం ధరలు పెంపు
న్యూఢిల్లీ: శతాబ్ది, రాజధాని, దురంతో రైళ్లలో ప్రయాణీకులకు అందించే టీ, టిఫిన్, భోజనం ధరలను పెంచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ మూడు రైళ్లలో మీల్స్ ధరలు పెరిగిన నేపథ్యంలో వాటి టికెట్ ధరలలో సైతం స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి. వీటిల్లో ప్రయాణించే వారు మీల్స్‌ను ఎంపిక చేసుకున్న నేపథ్యంలో వారి టికెట్ ధరలపై 3 నుంచి 9 శాతం వరకు పెరుగుదల ఉండనుంది. పెరిగిన కేటరింగ్ చార్జీలు వచ్చే ఏడాది మార్చి 29 నుంచి అమల్లోకి వస్తాయని రైల్వే బోర్డు పేర్కొంది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ మూడు రైళ్లలో ఫస్ట్ క్లాస్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లలో టీ ధర రూ.15 నుంచి రూ.35కి, బ్రేక్‌ఫాస్ట్ ధర రూ.90 నుంచి రూ.140కి, లంచ్, డిన్నర్ ధరలు రూ.140 నుంచి రూ.245కి పెరగనున్నాయి. సెకండ్ క్లాస్ ఏసీ, థర్డ్ క్లాస్ ఏసీ, చైర్ కార్లలో ఉదయం టీ ధర రూ.10 నుంచి రూ.20కి, సాయంత్రం టీ ధర రూ.45 నుంచి రూ.90కి, బ్రేక్‌ఫాస్ట్ ధర రూ.70 నుంచి రూ.105కి. లంచ్, డిన్నర్ ధరలు రూ.120 నుంచి రూ.185కి పెరగనున్నాయి. -
జియో షాక్..కాల్ చేస్తే.. బాదుడే!
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాల్స్ సదుపాయం అందిస్తున్న టెలికం సంస్థ రిలయన్స్ జియో (జియో) తాజాగా చార్జీల వడ్డనకు తెరతీసింది. ఇక నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు విధించనున్నట్లు బుధవారం ప్రకటించి కస్టమర్లకు షాకిచ్చింది. కాల్ టెర్మినేషన్ చార్జీలకు సంబంధించి అనిశ్చితే చార్జీల విధింపునకు కారణమని ఒక ప్రకటనలో వివరించింది. బుధవారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీనివల్ల ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్ కాల్స్ చేయదల్చుకునే వారు ఐయూసీ టాప్–అప్ వోచర్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టాప్ అప్ వోచర్స్ విలువకు సరిసమానమైన డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు, దీంతో నికరంగా యూజరుపై చార్జీల భారం ఉండబోదని జియో తెలిపింది. కాల్ టెర్మినేషన్ చార్జీలు అమల్లో ఉన్నంత వరకూ 6 పైసల చార్జీల విధింపు కొనసాగనున్నట్లు పేర్కొంది. వాట్సాప్, ఫేస్‌టైమ్‌కు మినహాయింపు.. జియో యూజర్లు ఇతర జియో ఫోన్లకు, ల్యాండ్లైన్లకు చేసే కాల్స్‌కు, వాట్సాప్, ఫేస్‌టైమ్ తదితర యాప్స్ ద్వారా చేసే కాల్స్‌కు దీన్నుంచి మినహాయింపు ఉంటుంది. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే ఇన్కమింగ్ కాల్స్ ఉచితంగానే కొనసాగుతాయని జియో పేర్కొంది. ప్రస్తుతం జియో యూజర్లు కేవలం డేటాకు మాత్రమే చార్జీలు చెల్లిస్తున్నారు. దీనితో దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయాన్ని పొందుతున్నారు. తాజా పరిణామంతో జియో యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్ కాల్స్ చేయాలంటే రెగ్యులర్ రీచార్జితో పాటు తప్పనిసరిగా టాప్–అప్ వోచర్స్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిబంధనల్లో అనిశ్చితి వల్లే.. సాధారణంగా ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే కాల్స్‌ను తమ కస్టమర్లకు అందించినందుకు గాను టెలికం సంస్థలు తమ పోటీ సంస్థల నుంచి నిర్దిష్ట చార్జీలు (ఐయూసీ) వసూలు చేస్తుంటాయి. గతంలో నిమిషానికి 14 పైసలుగా ఉన్న ఈ చార్జీలను జియో వచ్చిన తర్వాత టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ 2017లో 6 పైసలకు తగ్గించేసింది. ఇతర కంపెనీలు గగ్గోలు పెట్టినప్పటికీ 2020 జనవరి కల్లా ఐయూసీని పూర్తిగా ఎత్తివేయనున్నట్లు అప్పట్లో పేర్కొంది. అయితే, తాజాగా ఇందుకు సంబంధించిన గడువును పొడిగించాల్సిన అవసరంపై ట్రాయ్ చర్చాపత్రాన్ని విడుదల చేసింది. ఇదే ఐయూసీపై అనిశ్చితికి తెరతీసిందని జియో ఆరోపించింది. తమ నెట్‌వర్క్‌పై వాయిస్ కాల్స్‌ను ఉచితంగానే అందిస్తున్నప్పటికీ .. ఐయూసీ చార్జీల కింద పోటీ సంస్థలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు గడిచిన మూడేళ్లలో ఏకంగా రూ. 13,500 కోట్ల మేర చెల్లింపులు జరపాల్సి వచ్చిందని తెలిపింది. మిస్డ్ కాల్స్ బాగోతం.. పోటీ సంస్థలు 4జీ కస్టమర్లకు వాయిస్ టారిఫ్‌లను తగ్గించినప్పటికీ, 35–40 కోట్ల మంది 2జీ కస్టమర్లపై నిమిషానికి రూ. 1.50 చొప్పున చార్జీలు విధిస్తున్నాయని జియో ఆరోపించింది. 1 జీబీ డేటాకు కనీసం రూ. 500 వసూలు చేస్తున్నాయని పేర్కొంది. దీని కారణంగా ఎయిర్టెల్, వొడాఫోన్–ఐడియా యూజర్లు .. జియో కస్టమర్లకు మిస్డ్ కాల్స్ ఇవ్వడం మొదలుపెట్టారని జియో పేర్కొంది. తద్వారా జియో యూజర్లు సదరు మిస్డ్ కాల్స్ చేసిన వారికి తమ నెట్వర్క్ నుంచి తిరిగి కాల్స్ చేస్తున్నారని, తమపై ఐయూసీ భారం గణనీయంగా పడుతోందని పరోక్షంగా తెలిపింది. తమ నెట్‌వర్క్‌కు నిత్యం 25–30 కోట్ల మిస్డ్ కాల్స్ వస్తుంటాయని, 65–70 కోట్ల నిమిషాల అవుట్గోయింగ్ కాల్స్ నమోదవుతుంటాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రాయ్ తాజా చర్యల కారణంగా వాటిల్లిన నష్టాలను భర్తీ చేసుకునేందుకే నిమిషానికి 6 పైసల చార్జీని ప్రవేశపెట్టాల్సి వచ్చిందని వివరించింది. ‘ట్రాయ్ చర్చాపత్రంతో నియంత్రణ సంస్థ నిబంధనల విషయంలో అనిశ్చితి నెలకొంది. దీంతో తప్పనిసరై ఆఫ్–నెట్ మొబైల్ వాయిస్ కాల్స్‌పై నష్టాలను భర్తీ చేసుకునేందుకు నిమిషానికి 6 పైసల చార్జీలను విధించాల్సి వస్తోంది. ఐయూసీ చార్జీలు అమల్లో ఉన్నంత కాలం ఇది కొనసాగించాల్సి రానుంది. ఐయూసీ టాప్ అప్ వోచర్‌కు సరిసమానంగా అదనపు డేటా అందించడం జరుగుతుంది. తద్వారా నికరంగా కస్టమర్లపై టారిఫ్ పెంపు భారమేమీ ఉండబోదు‘ అని జియో తెలిపింది. మరోవైపు, ఐయూసీ పొడిగింపుపై కేవలం చర్చాపత్రాన్ని ప్రవేశపెట్టినంత మాత్రాన ట్రాయ్‌పై జియో విమర్శలకు దిగడం సరికాదని సీనియర్ ట్రాయ్ అధికారి వ్యాఖ్యానించారు. కొత్త ఐయూసీ ప్లాన్లు ఇవే.. ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్ కాల్స్ కోసం జియో కొత్తగా నాలుగు ఐయూసీ ప్లాన్స్‌ను(టాప్ అప్స్) ప్రవేశపెట్టింది. ప్లాన్స్‌కి సరిపడా డేటా ఉచితంగా ఇస్తున్నందున ఈ ఏడాది డిసెంబర్ 31 దాకా యూజర్లపై నికరంగా అదనపు భారం ఉండబోదని జియో తెలిపింది. ఇక పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు కూడా అఫ్–నెట్వర్క్ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల జార్జీలు వర్తిస్తాయి. తదనుగుణంగా ఉచిత డేటా లభిస్తుంది. కొత్త ఐయూసీ ప్లాన్లు.. ► రూ. 10 ప్లాన్: 124 నిమిషాలు. 1 జీబీ డేటా. ► రూ. 20 ప్లాన్: 249 నిమిషాలు. 2 జీబీ డేటా. ► రూ. 50 ప్లాన్: 656 నిమిషాలు. 5 జీబీ డేటా. ► రూ. 100 ప్లాన్: 1,362 నిమిషాలు. 10 జీబీ డేటా. ఐయూసీని మరింత తగ్గించే ఎత్తుగడలు: ఎయిర్టెల్ ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్ కాల్స్‌పై చార్జీలు వసూలు చేయాలన్న జియో నిర్ణయంపై పోటీ సంస్థ భారతి ఎయిర్టెల్ స్పందించింది. ఐయూసీని బలవంతంగా మరింత తగ్గించేందుకు ఈ ఎత్తుగడలు వేస్తోందంటూ ఆరోపించింది. జియో పేరు ప్రత్యేకంగా ప్రస్తావించకుండా ఎయిర్టెల్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ట్రాయ్ వల్లే చార్జీలు విధించాల్సి వస్తోందనే భావన కలిగించేలా తమ పోటీ సంస్థ వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. నిజానికి ఐయూసీ పొడిగింపు అంశం కొత్తదేమీ కాదని, గతంలో చార్జీలను తగ్గించినప్పుడే ఈ అంశాన్ని ట్రాయ్ ప్రస్తావించిందని ఎయిర్టెల్ స్పష్టం చేసింది. దేశీయంగా 2జీ యూజర్లు భారీగా ఉన్నారని, నిర్వహణ ఖర్చులతో పోలిస్తే ప్రస్తుతం 6 పైసలుగా ఉన్న టెర్మినేషన్ చార్జీలు చాలా తక్కువని పేర్కొంది. మరోవైపు, ఐయూసీపై జియోది అనవసరమైన తొందరపాటు చర్యగా వొడాఫోన్ ఐడియా అభివర్ణించింది. టెలికం రంగంలో సంక్షోభాన్ని పరిష్కరించే సత్వర చర్యల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నంగా వ్యాఖ్యానించింది. -
భగ్గుమన్న పెట్రోల్ ధరలు
సౌదీ అరేబియాలోని ఆయిల్ ప్లాంట్లపై డ్రోన్ దాడుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో సెప్టెంబర్ డెలివరీ ఒక బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 19.5 శాతం ఎగసి 71.95 డాలర్లను తాకింది. ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి డాలర్ల పరంగా ఒక్క రోజులో ఇంతగా ధర పెరగడం ఇదే మొదటిసారి. ఇక అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటరీ్మడియట్ (డబ్ల్యూటీఐ) ఫ్యూచర్స్ 15.5 శాతం ఎగసి 63.34 డాలర్లకు పెరిగింది. 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత ఈ రెండు రకాల ముడి చమురు ధరలు ఈ రేంజ్లో పెరగడం ఇదే మొదటిసారి. ఈ వార్త రాసే సమయానికి అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ నైమెక్స్ క్రూడ్ ధర 12 శాతం ఎగసి 61.38 డాలర్ల వద్ద, బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 12.4 శాతం ఎగసి 67.70 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. మన మార్కెట్లో 9 శాతం అప్... ఇక మన మార్కెట్ విషయానికొస్తే, సోమవారం మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్(ఎమ్‌సీఎక్స్)లో సెపె్టంబర్ డెలివరీ క్రూడ్ ధర 9.14 శాతం ఎగసి రూ.4,273 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమనడంతో స్పెక్యులేటర్లు తాజాగా పొజిషన్లు తీసుకోవడంతో ధరలు పెరిగాయి. ట్రేడర్ల స్పెక్యులేటివ్ పొజిషన్ల కారణంగా సమీప భవిష్యత్తులో ధరలు అధిక స్థాయిల్లోనే ట్రేడవుతాయని నిపుణులంటున్నారు. సౌదీ సగం ఉత్పత్తికి గండి... ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ప్రాసెసింగ్ కేంద్రం, సౌదీ అరేబియాలోని సౌదీ ఆరామ్కో ఆయిల్ ప్లాంట్లపై గత శనివారం ద్రోన్లతో దాడి జరిగింది. సౌదీ అరేబియా తూర్పు ప్రాంతంలోని అబ్క్వైక్ నగరంలోని రిఫైనరీపైనా, రియాద్‌కు 150 కిమీ. దూరంలోని ఖురయాస్ చమురు క్షేత్రంపైనా ద్రోన్లతో దాడి జరిగింది. దీంతో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి సగం (ఇది ప్రపంచ రోజువారీ చమురు సరఫరాల్లో ఐదు శాతానికి సమానం) వరకూ తగ్గుతుందని అంచనా. రోజుకు 5.7 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి గండి పడుతుంది. కాగా ఈ దాడులకు కారణం ఇరాన్ అని అమెరికా ఆరోపిస్తుండగా, ఈ దాడుల్లో తమ ప్రమేయం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ దాడులు తామే చేశామని యెమెన్‌కు చెందిన హౌతి రెబెల్స్ పేర్కొన్నారు. ఇరాన్‌పై వైమానిక దాడులు చేసే అవకాశాలు మరింతగా పెరిగాయని, ప్రతి దాడికి సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హెచ్చరించారు. సౌదీ ఆరామ్కో ఐపీఓ ఆలస్యం...! ఉగ్రవాద దాడుల కారణంగా సౌదీ ఆరామ్కో భారీ ఐపీఓ (ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్) మరింతగా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. దాడుల నష్టా న్ని మదింపు చేస్తున్నామని, ఐపీఓ ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ మార్కెట్లో లిస్టయ్యే ముందు సౌదీ అరేబియా స్టాక్ మార్కెట్లో ఈ ఏడాది నవంబర్‌లో లిస్టింగ్ కావాలని సౌదీ ఆరామ్కో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బ్యాంకర్లనూ నియమించింది. మరింతగా వదలనున్న మన ‘చమురు’... సింగపూర్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచి్చందని సామెత. సామెత అన్వయం సరిగ్గా లేకపోయినప్పటికీ, సౌదీ అరేబియా ఆయిల్ ప్లాంట్లపై దాడుల కారణంగా భారత్‌కు మరింతగా చమురు వదలనున్నది. సౌదీ ఆయిల్ ప్లాంట్లపై డ్రోన్ దాడుల కారణంగా మన దిగుమతి బిల్లు మరింతగా పెరుగుతుందని, ముందుగా రూపాయిపై దెబ్బ పడుతుందని సింగపూర్‌కు చెందిన డీబీఎస్ బ్యాంకింగ్ గ్రూప్ వెల్లడించింది. ముడి చమురు ధరలు 10 శాతం పెరిగితేనే, ద్రవ్యోల్బణం 20 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని, భారత కరంట్ అకౌంట్ లోటు 0.4–05 శాతం మేర పెరుగుతుందని పేర్కొంది. ఒక్కో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కో డాలర్ పెరిగితే, భారత చమురు దిగుమతుల బిల్లు 200 కోట్ల డాలర్ల మేర పెరుగుతుందని వివరించింది. భారత్ తన అవసరాల్లో 83 శాతానికి పైగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. భారత్ అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునేది ఇరాక్ తర్వాత సౌదీ అరేబియా నుంచే. గత ఆరి్థక సంవత్సరంలో భారత్ మొత్తం 2017.3 మిలియన్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకోగా, దీంట్లో సౌదీ అరేబి యా వాటా 40.33 మిలియన్ టన్నులుగా ఉంది. సరఫరాల్లో కొరత ఉండదు సౌదీ అరేబియా ఆయిల్ ప్లాంట్లపై దాడుల కారణంగా మనకు చమురు సరఫరాల్లో ఎలాంటి అవాంతరాలు ఎదురు కాబోవని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. దాడుల అనంతరం సౌదీ ఆరామ్కో కంపెనీ ప్రతినిధులను సంప్రదించామని, సరఫరాల్లో ఎలాంటి కొరత ఉండబోదని వారు భరోసానిచ్చారని వివరించారు. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్‌కంపెనీల వద్ద సెప్టెంబర్ నెలకు సంబంధించిన చమురు నిల్వలపై సమీక్ష జరిపామని, పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నామని, సరఫరాల్లో ఎలాంటి అవాంతరాలు ఉండబోవన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధర రూ.5–6 పైపైకి..! సౌదీ అరేబియాలోని ఆయిల్ ప్లాంట్లపై డ్రోన్ దాడుల కారణంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు మరో రెండు వారాల్లో రూ.5–6 మేర పెరుగుతాయని నిపుణులంటున్నారు. ఈ దాడుల కారణంగా సమీప భవిష్యత్తులో ముడి చమురు ధరలు భగ్గుమంటూనే ఉంటాయని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. సౌదీలో చమురు ఉత్పత్తి సాధారణ స్థాయికి రావడానికి మరికొన్ని వారాలు పడుతుందని తెలిపింది. మరోవైపు సౌదీ అరేబియాలోని ఆయిల్ ప్లాంట్లపై మరిన్ని దాడులు జరిగే అవకాశాలున్నాయి. మరోవైపు సౌదీ అరేబియా అమెరికాతో కలిసి ప్రతీకార దాడులకు దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏతావాతా పశ్చిమాసియాలో సంక్షోభం మరింతగా ముదిరితే ముడి చమురు ధరల ర్యాలీ ఇప్పట్లో ఆగదని విశ్లేషకులు భయపడుతున్నారు. ముడి చమురు, సంబంధిత ఉత్పాదకాలు పలు పరిశ్రమలకు ముడిపదార్ధాలుగా వినియోగమవుతున్నాయని, పెయింట్లు, టైర్లు, ఆయిల్, గ్యాస్, వాహన విడిభాగాల పరిశ్రమలపై పెను ప్రభావం పడుతుందని వారంటున్నారు. ముడి చమురు ధరలు భగ్గుమంటే, అది ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలకు ప్రతికూలమేనని, అమెరికా ఆంక్షల కారణంగా ఇప్పటికే వెనుజులా, ఇరాన్‌ల నుంచి చమురు సరఫరాలు తగ్గాయని కోటక్ ఈక్విటీస్ తెలిపింది. రూపాయి.. ‘క్రూడ్’ సెగ! ముంబై: అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పరుగు భయాలు సోమవారం రూపాయిని వెంటాడాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 68 పైసలు పతనమైంది. 71.60 వద్ద ముగిసింది. వరుసగా ఎనిమిది ట్రేడింగ్ సెషన్లలో లాభాల బాటన పయనించిన రూపాయి సోమవారం మొట్టమొదటిసారి నేలచూపు చూసింది. క్రూడ్ ధరల పెరుగుదల భారత్ కరెంట్ అకౌంట్‌లోటు, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి కీలక ఆరి్థక గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. గత వారాంతంలో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి కేంద్రాలపై డ్రోన్ దాడి నేపథ్యంలో... సోమవారం ట్రేడింగ్‌లో రూపాయి బలహీనంగా 71.54 వద్ద ప్రారంభమైంది. ఒకదశలో 71.63 స్థాయినీ చూసింది. రూపాయి శుక్రవారం ముగింపు 70.92. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు క్రూడ్ ధరల భారీ పతనం, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సంకేతాల వంటి అంశాలతో రూపాయి క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. స్టాక్ మార్కెట్లో ‘మంట’... సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై ద్రోన్లతో దాడి కారణంగా ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. ఇంట్రాడేలో 20% వరకూ క్రూడ్ ధరలు ఎగియడంతో మన స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. చమురు సెగతో డాలర్‌తో రూపాయి మారకం విలువ 67 పైసలు నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపించింది. ఇంట్రాడేలో 356 పాయింట్ల వరకూ పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 262 పాయింట్ల నష్టంతో 37,123 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 72 పాయింట్లు క్షీణించి 11,004 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆరి్థక వ్యవస్థలో వృద్ధి జోష్‌ను పెంచడానికి ప్రభుత్వం శనివారం ప్రకటించిన రూ.70,000 కోట్ల ఉద్దీపన ప్యాకేజీ(ఎగుమతులు, రియల్టీకి) చమురు దాడుల నష్టాల్లో కొట్టుకుపోయింది. ఆయిల్ షేర్లు విలవిల.... సౌదీ చమురు క్షేత్రాల దాడుల నేపధ్యంలో బీఎస్ఈ ఆయిల్ గ్యాస్ అండ్ ఎనర్జీ ఇండెక్స్ భారీగా నష్టపోయింది. చమురు సంబంధిత షేర్లు బాగా నష్టపోయాయి. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ, క్యా్రస్టాల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 7% వరకూ నష్టపోయాయి. స్పైస్‌జెట్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, జెట్ ఎయిర్వేస్ వంటి విమానయాన ఇంధన షేర్లు 4% వరకూ నష్టపోయాయి. ఇప్పటికే అమెరికా–చైనా వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా కుదేలైన ప్రపంచ మార్కెట్లపై సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై తాజాగా జరిగిన దాడి మరింత ప్రతికూల ప్రభావం చూపించిందని షేర్‌ఖాన్ బీఎన్పీ పారిబా ఎనలిస్ట్ గౌరవ్ దువా వ్యాఖ్యానించారు. పశి్చమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరితే, మన ద్రవ్యోల్బణ గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపగలదని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ రాహుల్ గుప్తా పేర్కొన్నారు. ప్రధాన ఆసియా మార్కెట్లు, యూరప్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. -
మండిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధుల కోసం ఇంధనంపై పన్ను పెంచడంతో ఆ ప్రభావం రవాణారంగం, వాహనదారులపై పడింది. శనివారం పెట్రోల్ ధర లీటరుపై కనిష్టంగా రూ.2.40, డీజిల్ ధర రూ.2.36 మేర పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్‌పై రూ.2.45 పెరిగి లీటరు ధర రూ.72.96కు చేరుకుంది. ఇదే ముంబైలో రూ.2.42 పెరిగి లీటరు పెట్రోల్ ధర రూ.78.57కు, కోల్‌కతాలో రూ.2.49 పెరిగి రూ.75.15కు, చెన్నైలో రూ.2.57 పెరిగి లీటర్ పెట్రోల్ ధర రూ.75.76కు చేరిందని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) తెలిపింది. కాగా, ఢిల్లీలో డీజిల్ రూ.2.36 పెరిగి లీటరు రూ.66.69కు, ముంబైలో రూ.2.50 పెరిగి లీటర్ ధర రూ.69.90 కు చేరుకుందని పేర్కొంది. రాష్ట్రాల్లో స్థానిక పన్నులు, వ్యాట్ ఆధారంగా ఈ ధరలు వేర్వేరుగా ఉండే అవకాశముందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ల ఆధ్వర్యంలో నడిచే ఇంధన సంస్థల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో కొద్ది వ్యత్యాసం ఉంటుందని తెలిపింది. ఆర్థిక మంత్రి సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో పెట్రోల్, డీజిల్‌లపై రోడ్లు, మౌలికరంగాల సెస్, పన్నులు కలిపి లీటరుకు రూ.2 మేర విధించడం ద్వారా ఏడాదికి రూ.24 వేల నుంచి రూ.28 వేల కోట్ల మేర సమీకరించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్‌పై మొత్తం పన్ను భారం రూ.17.98 ఉండగా, కేంద్ర బడ్జెట్ ప్రకటన అనంతరం ఇది లీటర్‌పై రూ.19.98కు పెరిగింది. డీజిల్ లీటర్‌పై ఉన్న మొత్తం పన్ను భారం కూడా రూ. 13.83 నుంచి రూ.15.83కు పెరిగింది. వ్యాట్ కూడా రాష్ట్రాలను బట్టి మారుతోంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై వ్యాట్ 27 శాతం, డీజిల్‌పై 16.75 శాతం ఉంది. ముంబైలో వ్యాట్ పెట్రోల్‌పై 26 శాతానికి తోడు అదనపు ట్యాక్స్ రూ.7.12 వసూలు చేస్తున్నారు. డీజిల్‌పై ఇక్కడ 24 శాతం సేల్స్ ట్యాక్స్ పడుతోంది. -
పెట్రోల్‌పై రూ.2.69, డీజిల్‌పై రూ.2.65
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో పెట్రోల్, డీజిల్‌పై అదనపు సుంకాలు విధించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.74.88 ఉండగా, అది రూ.77.57కు చేరింది. అంటే పెట్రోల్‌పై రూ.2.69 పెరిగింది. డీజిల్ ధర బుధవారం లీటర్ రూ.70.06 ఉండగా, అది రూ.72.71కి చేరింది. అంటే డీజిల్‌పై రూ.2.65 పెరిగింది. పెట్రోల్, డీజిల్ ఒక్కో లీటర్‌పై 1 శాతం చొప్పున విధించిన స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ, సెస్‌తో పాటు రాష్ట్రం పరిధిలోని ఇతరత్రా సుంకాలతో కలిపి ఈ మేర పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ ప్రభావం తెలంగాణలోని 90 లక్షల వాహనదారులపై పడనుంది. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 60 లక్షల వాహనాలున్నాయి. ముఖ్యంగా సరుకు రవాణాపై ఈ భారం ఎక్కువ ఉంటుంది. పెరిగిన ధరలకు అనుగుణంగా నిత్యావసరాలు, కూరగాయాలు, పండ్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు సగానికిపైగా పన్నుల భారమే ఎక్కువగా ఉంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతున్నా పెట్రో ధరలు మాత్రం దిగిరావట్లేదు. పన్నులతో బాదుడు.. పెట్రో ఉత్పత్తులపై రెండు రకాల పన్నుల విధిస్తుండటంతో వినియోగదారుల జేబులు గుల్లవుతున్నాయి. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ విధిస్తున్నాయి. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ కింద పెట్రోల్‌పై రూ.17.98లు, డీజిల్‌పై రూ.13.83 వసూలు చేస్తోంది. ఆ తర్వాత మొత్తం ధరపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పన్ను మోత మోగిస్తోంది. తెలంగాణలో పెట్రోల్‌పై 35.2 శాతం, డీజిల్ 27 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. తమిళనాడులో పెట్రోల్‌పై 34 శాతం, డీజిల్‌పై 24 శాతం వ్యాట్ ఉండగా, డిల్లీలో పెట్రోల్‌పై వ్యాట్ పన్ను 27 శాతం ఉండగా, గోవాల్లో అతి తక్కువగా 17 శాతం వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్‌పైనే చమురు ఉత్పత్తుల ధరలు ఆధారపడినట్లు కనిపిస్తోంది. -
ప్రింట్ మీడియాకు గుడ్ న్యూస్
సాక్షి న్యూఢిల్లీ: చిన్న,మధ్య వ్యాపార పత్రికలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వ్యాపార పత్రికలకు జారీ చేసే ప్రకటనల రేట్లను 25శాతం పెంచింది. ప్రింట్ మీడియాలో ప్రకటన రేట్లు సవరిస్తూ సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. 8 వ రేట్ స్ట్రక్చర్ కమిటీ సిఫార్సులు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. సవరించిన రేట్లు మంగళవారం నుంచి మూడు సంవత్సరాల పాటు అమల్లో వుంటాయని ప్రకటించింది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఔట్రీచ్ అండ్ కమ్యూనికేషన్ ఒక ప్రకటన జారీ చేసింది. అంతర్జాతీయంగా న్యూస్ ప్రింట్, ప్రాసెసింగ్ చార్జీలు, ఇతర కారణాల రీత్యా ఈ పెంపును చేసినట్టు వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయం ముఖ్యంగా ప్రాంతీయ మరియు స్థానిక భాషలలోని చిన్నపత్రికలకు ప్రయోజనకరంగా ఉంటుందని పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు. అయితే ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ నిర్ణయంపై విమర్శలు గుప్పించింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఓడిపోతామన్న భయంతో పాలక పార్టీ బీజేపీ వేసిన మరొక ఎత్తుగడగా పేర్కొంది. డబ్బుతో మీడియాను నిశ్శబ్దం చేసేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ఆరోపించారు. కాగా గత ఎన్నికల సందర్భంగా 2013లో వ్యాపార ప్రకటనల రేట్లు పెరిగాయి. 2010 నాటి నుంచి 19 శాతానికి పైగా పెరిగాయి. మరోవైపు ప్రింట్ మీడియా ప్రకటనల రేట్లను ప్రభుత్వం 25శాతం పెంచడంతో హెచ్‌టీ మీడియా, జీ, జాగ్రన్ ప్రకాశన్, డిబీ కార్పొ తదితర మీడియా షేర్లు ఇవాల్టి(జనవరి 9) మార్కెట్లో మెరుపులు మెరిపిస్తున్నాయి. -
అంచనాలు తలకిందులు
అంచనాలు తలకిందులయ్యాయి. ఆర్బీఐ నిర్ణయం విశ్లేషకులు, బ్యాంకర్లను అయోమయానికి గురిచేసింది! ఒకపక్క మన కరెన్సీ రూపాయి రోజురోజుకు డాలర్ ముందు బక్కచిక్కుతోంది. మరోపక్క అంతర్జాతీయంగా చమురు ధరలు ఉరుముతున్నాయి. ఇంకో పక్క దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లిపోతున్నారు. ఇన్నిరకాల సమస్యలు చుట్టుముట్టిన తరుణంలోనూ... ఆర్బీఐ పాలసీ కమిటీ (ఎంపీసీ) 3 రోజులు సమావేశమై... ఒక్క నివారణ చర్య లేకుండా ముగించేయడం ఆశ్చర్యపరిచింది. ముంబై: ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన జరిగిన ఎంపీసీ కమిటీ నాలుగో ద్వైమాసిక సమావేశం, చివరికి కీలక రేట్లలో ఎటువంటి మార్పులు చేయకుండా యథాతథ విధానాన్నే కొనసాగిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. బెంచ్‌మార్క్ రెపో రేటు 6.5 శాతాన్ని మార్చాల్సిన అవసరం లేదని మొత్తం ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ఓటు వేశారు. రివర్స్ రెపో 6.25 శాతంలోనూ మార్పు లేదు. పెరిగే చమురు ధరలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కఠినతరం అవుతుండటం మన దేశ వృద్ధికి, ద్రవ్యోల్బణానికి సవాళ్లను విసురుతున్నాయని పేర్కొన్నా... అందుకు తన వైపు నుంచి చర్యలను ప్రకటించకపోవడం గమనార్హం. కాకపోతే పాలసీ విధానాన్ని తటస్థం నుంచి ‘క్రమంగా కఠినతరం’ (క్యాలిబ్రేటెడ్ టైటనింగ్)కు మార్చింది. అంటే ఇకపై సమీప భవిష్యత్తులో రేట్ల పెంపే గానీ, తగ్గేందుకు అవకాశాల్లేవని సంకేతాలిచ్చింది. మధ్య కాలానికి ధరల పెరుగుదలను (ద్రవ్యోల్బణాన్ని) 4 శాతానికి నియంత్రించాలన్న విధానానికి కట్టుబడి ఉన్నట్టు మరోసారి పేర్కొంది. నిజానికి కీలక రేటును కనీసం పావు శాతం అయినా పెంచుతారని మెజారిటీ విశ్లేషకులు అంచనా వేశారు. రూపాయి బలహీనత చూసి కొందరయితే... ఈ పెంపు అర శాతం కూడా ఉండొచ్చని అనుకున్నారు. కానీ, వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఆర్బీఐ నిర్ణయం వెలువడిన తర్వాత రూపాయి ఫారెక్స్ మార్కెట్లో 74 స్థాయిని కోల్పోయింది. స్టాక్ మార్కెట్లు మాత్రం ఆర్బీఐ విధానంతో కకావికలం అయ్యాయి. పెరిగిపోతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, అస్థిరతలు, పెరుగుతున్న ముడిచమురు ధరలు, అంతర్జాతీయంగా ఆర్థిక మార్కెట్లలో పరిస్థితి కఠినతరం అవుతుండడం మనదేశ వృద్ధి రేటు, ద్రవ్యోల్బణ అంచనాలకు పెద్ద సవాళ్లుగా ఆర్బీఐ పేర్కొంది. ఈ తరహా సమస్యల ప్రభావాన్ని తటస్థ పరిచే విధంగా దేశీ స్థూల ఆర్థిక మూలాలు మరింత బలపడాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది. దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4%గానే ఉంటుందని అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 7.6%కి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. దేశాల రక్షణాత్మక విధానాలు, కరెన్సీ యుద్ధాల ముప్పు, అమెరికాలో వడ్డీరేట్ల పెంపు అన్నవి దేశ ఆర్థిక వృద్ధికి అతిపెద్ద సమస్యలుగా ఎంపీసీ అభిప్రాయపడింది. ఎంపీసీ ఆగస్ట్‌లో జరిగిన సమావేశంలో పాలసీ రేట్లను పావు శాతం పెంచిన విషయం గమనార్హం. రూపాయి ఇప్పటికీ బాగానే ఉంది... దేశీయ కరెన్సీ రూపాయి విలువను మార్కెట్ శక్తులే నిర్ణయిస్తాయని, ఈ విషయంలో ఆర్బీఐకి ఎటువంటి టార్గెట్, బ్యాండ్ లేదని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. వర్ధమాన కరెన్సీలతో పోలిస్తే రూపాయి ఇప్పటికే మెరుగ్గానే ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సెప్టెంబర్ చివరి నాటికి ఉన్న విదేశీ మారక నిల్వలు 400.5 బిలియన్ డాలర్లని, ఇవి పది నెలల దిగుమతులకు సరిపోతాయని చెప్పారు. రూపాయి పతనం కొన్ని అంశాల్లో పలు వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే మోస్తరుగానే ఉందని ఉర్జిత్ చెప్పారు. ద్రవ్యోల్బణం... ద్రవ్యోల్బణం అంచనాలను ఆర్బీఐ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో (అక్టోబర్–మార్చి) రిటైల్ ద్రవ్యోల్బణం 3.9–4.5 శాతం మధ్య ఉంటుందని పేర్కొంది. ఆహార ధరలు ఊహించనంత అనుకూలంగా ఉండడమే కారణం. 2019–20 మొదటి త్రైమాసికంలో 4.8 శాతంగా ఉండొచ్చని, సమస్యలు ఎదురైతే కొంత అధికంగా నమోదు కావచ్చని అంచనా వేసింది. మధ్య కాలానికి వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4%కి (2% అటూ, ఇటూగా) తీసుకురావాలన్న లక్ష్యానికి అనుగుణంగానే... క్రమంగా కఠినతరమనే విధానం తీసుకున్నట్టు తెలిపింది. ద్రవ్యలోటు లక్ష్యాలను దాటితే ప్రమాదమే ద్రవ్యలోటు లక్ష్యాలను దాటకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్బీఐ సూచించింది. లక్ష్యాలు తప్పితే ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావం పడడమే కాకుండా, మార్కెట్లలో అస్థిరతకు దారితీస్తుందని హెచ్చరించింది. ‘‘కేంద్రం లేదా రాష్ట్రాల స్థాయిలో ద్రవ్యలోటు కట్టుతప్పితే అది ద్రవ్యోల్బణ అంచనాలపై, ప్రైవేటు పెట్టుబడులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది’’ అని ఆర్బీఐ పేర్కొంది. ఐఎల్ఎఫ్ఎస్ పరిస్థితి కుదుటపడుతుంది ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభంలో ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకుందని, పరిస్థితిని ఇది సద్దుమణిగేట్టు చేస్తుందని ఆర్బీఐ పేర్కొంది. పూర్తి నిర్మాణాత్మక సంస్థాగత చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. నూతన యాజమాన్యానికి ఆర్బీఐ సహకారం ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ చెప్పారు. స్వల్పకాలిక రుణాలపై అధికంగా ఎన్బీఎఫ్సీలు ఆధారపడడాన్ని హ్రస్వదృష్టి విధానంగా డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య అభివర్ణించారు. ఇది సంస్థలపైనే కాకుండా వ్యవస్థాగత స్థిరత్వంపైనా ప్రభావం చూపించినట్టు చెప్పారు. ఈక్విటీ, దీర్ఘకాలిక రుణాలపై ఆధారపడాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ‘‘వరుసగా రెండు సార్లు రేట్లను పెంచడం, ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుందన్న అంచనాలే యథాతథ స్థితిని కొనసాగించేందుకు, కఠినతర విధానానికి మళ్లేలా చేశాయి. ప్రతి సమావేశంలోనూ రేట్ల పెంపునకు మేమేమీ కట్టుబడలేదు. ఈ సమయంలో అది అవసరం పడలేదు. ఆర్బీఐ, ఎంపీసీ ఇందుకు సంబంధించి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాయి. తటస్థ విధానం నుంచి క్రమంగా కఠినతర విధానానికి మళ్లడం ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరిగేందుకు సమస్యలు పొంచి ఉండడం వల్లే. ఈ విధానంలో రెండే ఆప్షన్లు ఉన్నాయి. రేట్లను పెంచడం లేదా వాటిని స్థిరంగా కొనసాగించడం ’’ – ఉర్జిత్పటేల్, ఆర్బీఐ గవర్నర్ రూపాయి, మార్కెట్లకు ఇబ్బందే! సమస్య తీవ్రమవుతుంది.. ఆర్బీఐ చర్య ఇబ్బందిని సృష్టించేదే. ప్రస్తుతం రూపాయి పతనాన్ని అడ్డుకోవడం ప్రధానం. రూపాయి బలోపేతం మార్కెట్‌కూ అవసరం. కానీ ఆర్బీఐ నిర్ణయం ఈ దిశలో లేదు. రేటు పెంపు లేకపోవడం వల్ల కరెన్సీ, అలాగే ఇతర అసెట్స్ మార్కెట్లు తీవ్ర సర్దుబాటుకు (కరెక్షన్) గురయ్యే అవకాశాలున్నాయి. ఫైనాన్షియల్ సంక్షోభ సమయాల్లో ఒక్క ద్రవ్యోల్బణం లక్ష్యాలను మాత్రమే చూడ్డం సరికాదు. అయితే ఆర్బీఐ పాలసీ వైఖరి మార్చుకోవడం గమనించాలి. వచ్చే నెలల్లో రేటు పెంపు ఉంటుందని ఈ పాలసీ వైఖరి మార్పు తెలియజేస్తోంది. – అభీక్ బారువా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ అనిశ్చితిని సూచిస్తోంది ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని పాలసీ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి తీవ్రతను ఆర్బీఐ పరిశీలనలోకి తీసుకుంది. గ్లోబల్ ట్రేడ్, ఫైనాన్షియల్ స్థిరత్వ పరిస్థితులు బలహీనతకు అవకాశాలు ఉన్నట్లు పాలసీ నిర్ణయాలు సూచిస్తున్నాయి. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ ఆశ్చర్యానికి గురిచేసింది రెపోపై ఆర్బీఐ నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసింది. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలే ఉన్నాయి. రైతులకు కనీస మద్దతు ధరల పెరుగుదల, చమురు ధరలు, అంతర్జాతీయ అనిశ్చితి, కేంద్రం, రాష్ట్ర స్థాయిల్లో ద్రవ్యలోటు లక్ష్యాలు కట్టుతప్పే అవకాశాలు దీనికి కారణం. – సునీల్ మెహతా, ఐబీఏ చైర్మన్ రియల్టీకి సానుకూలమే గడచిన ఆరు నెలల్లో వృద్ధి సంకేతాలను ఇస్తున్న రియల్టీకి తాజా ఆర్బీఐ నిర్ణయం మరింత సానుకూలమైనదే. కొనుగోలుదారులకు ఇది ఒక అవకాశం. పండుగల సీజన్, దేశ వ్యాప్తంగా ప్రొపర్టీ రేట్లు దాదాపు తక్కువగానే ఉండడం వంటి అంశాలు ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ఇవన్నీ రియల్టీ రంగం సెంటిమెంట్‌ను మరింత బలపరుస్తున్నాయి. – జాక్షయ్ షా, క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ ఎఫ్‌పీఐల ఆకర్షణకు వీఆర్ఆర్ మార్గం విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను (ఎఫ్‌పీఐ) ఆకర్షించేందుకు స్వచ్చంద ఉపసంహరణ మార్గాన్ని (వాలంటరీ రిటెన్షర్ రూట్/వీఆర్ఆర్) ఆర్బీఐ ప్రతిపాదించింది. ఈ విధానంలో విదేశీ ఇన్వెస్టర్లకు మరింత వెసులుబాటు ఉంటుందని తెలిపింది. డెట్‌లో ఎఫ్‌పీఐ పెట్టుబడులకు సంబంధించి ఇటీవలి కాలంలో పలు చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. ‘‘దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేలా ఎఫ్‌పీఐలను ప్రోత్సహించేందుకు వీఆర్ఆర్ అనే పత్య్రేక మార్గాన్ని ప్రతిపాదించాం. ఈ మార్గంలో ఇనుస్ట్రుమెంట్ల ఎంపిక పరంగా ఎఫ్‌పీఐలకు మరింత వెసులుబాటు ఉంటుంది. స్వల్పకాలిక పెట్టుబడుల పరంగా నియంత్రణపరమైన మినహాయింపులు కూడా ఉంటాయి’’ అని ఆర్బీఐ తెలిపింది. ఈ వీఆర్ఆర్ మార్గంలో ఇన్వెస్ట్ చేసేందుకు అర్హతగా... పెట్టుబడుల్లో కనీస శాతాన్ని, నిర్ణీత కాలం వరకు భారత్‌లో కొనసాగించేందుకు వారు ఎంచుకోవచ్చని ఆర్బీఐ వివరించింది. -
కార్లు... ప్రియం
న్యూఢిల్లీ: పెరిగిన ముడివస్తువుల ధరల భారాన్ని తగ్గించుకునే దిశగా దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తమ కార్ల రేట్లను పెంచింది. వివిధ మోడల్స్‌పై రూ. 6,100 దాకా (ఎక్స్ షోరూం ఢిల్లీ) ధరలను పెంచినట్లు, ఇది గురువారం నుంచే అమల్లోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. పెరిగిన కమోడిటీల రేట్లు, పంపిణీ వ్యయాలు, విదేశీ మారకం రేట్లపరంగా ప్రతికూల పరిస్థితులు మొదలైన సవాళ్లను కొంత అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఎంట్రీ లెవెల్ ఆల్టో 800 నుంచి మధ్య స్థాయి సెడాన్ సియాజ్‌తో పాటు మారుతీ సుజుకీ వివిధ మోడల్స్‌ను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ. 2.51 లక్షల నుంచి రూ. 11.51 లక్షల దాకా (పెంపునకు ముందు) ఉన్నాయి. మరోవైపు, సెప్టెంబర్ నుంచి వాహనాల రేట్లను 4 శాతం దాకా పెంచనున్నట్లు లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ వెల్లడించింది. పెరిగిపోతున్న ముడివస్తువుల ధరలు, విదేశీ మారకంపరమైన ఒడిదుడుకులు ఇందుకు కారణమని పేర్కొంది. మోడల్‌ను బట్టి సెప్టెంబర్ 1 నుంచి రేట్లు 4 శాతం దాకా పెరుగుతాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ రోలాండ్ ఫోల్గర్ తెలిపారు. సెడాన్ కార్ల నుంచి ఎస్‌యూవీల దాకా సుమారు రూ.27.86 లక్షల నుంచి రూ. 1.94 కోట్ల శ్రేణిలో మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలు ఉన్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, హోండా కార్స్ ఇండియా మొదలైన కంపెనీలు కూడా రేట్లు ఈ నెలలోనే పెంచనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సేవింగ్స్ రేట్ల పెంపు
ముంబై: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సేవింగ్స్ అకౌంట్ డిపాజి ట్లపై వడ్డీని 6.75 శాతానికి పెంచింది. ఈ రేట్లు నేటి నుంచీ అమల్లోకి వస్తాయి. ♦ రూ.10 లక్షల నుంచి రూ.10 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉంచే సేవింగ్స్ అకౌంట్ కస్టమర్లకు ఇచ్చే రేటు 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెరిగి, 6.75 శాతానికి చేరింది. ♦ రూ. లక్ష నుంచి రూ.10 లక్షల మధ్య నిల్వకు సంబంధించి వార్షిక రేటు 50 బేసిస్ పాయింట్లు పెరిగి 6.50కి చేరింది. ♦ లక్షలోపు బ్యాలెన్స్‌పై రేటు మాత్రం 5 శాతంగా కొనసాగనుంది. పొదుపులపై దృష్టి: సీఈఓ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ సంజయ్ అగర్వాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘మా డిపాజిట్ బుక్ విలువ రూ.7,800 కోట్లు. ఇందులో సేవింగ్స్ అకౌంట్ నిల్వల పరిమాణం 23 శాతం. ఈ శాతాన్ని మరింత పెంచుకోవాలని భావిస్తున్నాం’’ అన్నారు. -
బీర్ల ధరలు పెంపు!
సాక్షి, హైదరాబాద్ : ఇటీవలే మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం బీరు ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. బీర్లపై ప్రస్తుతమున్న రేటును 12 శాతం మేరకు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఈ ఫైలు ముఖ్యమంత్రి తుది పరిశీలనలో ఉంది. బీర్ల ధరల పెంపుతో ప్రభుత్వ ఖజానాకు ప్రతి నెలా రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని, ఏటా సుమారు రూ.300 కోట్ల ఆదాయం వస్తుందని ఎక్సైజ్ విభాగం లెక్కలు వేసుకుంది. నాలుగేళ్ల నుంచి బీర్ల ధరలు పెంచలేదని, కనీసం ఈసారైనా ధర పెంచాలని బ్రూవరీ కంపెనీలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఒక్కో బీరుపై కనీసం రూ.6 చొప్పున బేసిక్ ధరపై 20 శాతం అదనంగా చెల్లించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు అందించాయి. ఈ నేపథ్యంలోనే ధరలను సమీక్షించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. మూడు నెలల కిందటే రిటైర్డ్ జడ్జి జస్టిస్ గోపాల్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీకి ధరలను సమీక్షించే బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతమున్న ధరలు, ఉత్పత్తిపై జీఎస్టీ ప్రభావం అంచనాలను వేసిన కమిటీ.. 12 శాతం ధరలు పెంచేందుకు సిఫారసు చేసినట్లు సమాచారం. కమిటీ నివేదిక ఆధారంగా ఎక్సైజ్ విభాగం తాజా ధరల పెంపు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. సీఎం తీసుకునే నిర్ణయం మేరకు ధరల పెంపు ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో బీర్ల వినియోగం ఏటా రికార్డు స్థాయిలో నమోదవుతోంది. రోజుకు 8 లక్షల మంది 13 లక్షల బీర్లు తాగుతున్నట్లు టీఎస్‌బీసీఎల్ నివేదికలున్నాయి. గతేడాది ఎక్సైజ్ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.15 వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి ఎక్సైజ్ ఆదాయం మరింత పెరుగుతుందని ప్రభుత్వం బడ్జెట్లో అంచనాలు వేసుకుంది. బీర్ల ధరలు పెంచటం ద్వారా ఆదాయం పెరుగుతుందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. వారం రోజుల్లోనే ధరల పెంపునకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. -
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్డ్యూటీ తగ్గించం
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్న నేపథ్యంలో వాటిపై విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీని తగ్గించబోమని కేంద్రం తెలిపింది. ఈ విషయమై కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముక్ అధియా సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ దాన్ని సమీక్షిస్తే వెంటనే మీకు తెలియజేస్తాం’ అని వెల్లడించారు. మరోవైపు దేశరాజధానిలో యూరో–6 ప్రమాణాలతో శుద్ధిచేసిన పెట్రోల్, డీజిల్‌లను ఆవిష్కరించిన కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ఇంధన ధరల్ని ప్రతిరోజూ సవరించే విధానంపై వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. కేంద్రానికి అందుతున్న ఆదాయంలో 42 శాతాన్ని రాష్ట్రాలకే తిరిగి చెల్లిస్తున్నామనీ, మిగతా 58 శాతం ఆదాయంతో దేశవ్యాప్తంగా అభివృద్ధి పనుల్ని చేపడుతున్నామని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలో చేర్చిఉంటే సామాన్యులకు ఊరట లభించిఉండేదన్నారు. -
హైవేలపై పెరిగిన టోల్ ఫీజు
ఆగ్రా: జాతీయ రహదారులపై ప్రయాణం మరింత భారంగా మారింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై టోల్ రేట్లను 5 నుంచి 7శాతం పెంచుతూ జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ) నిర్ణయం తీసుకుంది. అత్యవసర వస్తువుల రవాణా వాహనాలకూ ఇది వర్తిస్తుంది. జాతీయ రహదారి–2 ప్రాజెక్టు డైరెక్టర్ మహ్మద్ షఫీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘జాతీయరహదారులపై 372 టోల్ప్లాజాలున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్ రేట్లను టోకు ధరల సూచీ ప్రాతిపదికగా సవరిస్తుంది. దీంతో ఒకే ప్రాంతంలోని టోల్‌ప్లాజాల వద్ద వసూలు చేసే ఫీజులు ఒకేలా ఉండవు. ఎన్‌హెచ్–2పై టోల్ రేట్లలో 5శాతం పెరుగుదల ఉంటుంది’అని షఫీ తెలిపారు. ఎక్కువ శాతం టోల్‌ప్లాజాల వద్ద ఇదే పెరుగుదల ఉంటుందని ఆయన తెలిపారు. నెలవారీ పాస్‌లున్న వాహనాలకూ ఇదే వర్తిస్తుంది. టోల్ రేట్ల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయని వాహనయజమానులు అంటున్నారు. ఎన్‌హెచ్–1, 2లు అధ్వానంగా ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం టోల్ ఫీజు పెంచిందని విమర్శిస్తున్నారు. -
ఎల్పీజీ బాదుడుకు కేంద్రం బ్రేక్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్లపై ప్రతి నెల రూ.4 మేర పెంచాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఓవైపు ఉజ్వల పథకం కింద పేదలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు అందజేస్తూ మరోవైపు ధరలు భారీగా పెంచడమన్నది పరస్పర విరుద్ధంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్లు అక్టోబర్ నుంచి ఎల్పీజీ ధరల్ని పెంచలేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సిలిండర్లపై సబ్సిడీని ఎత్తివేయడానికి వీలుగా ఒక్కో సిలిండర్ ధరను ప్రతినెల రూ.4 మేర పెంచాలని గతేడాది జూన్‌లో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలను కేంద్రం ఆదేశించడం తెల్సిందే. -
శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్..
సాక్షి, తిరుమల : శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం షాక్ ఇచ్చింది. స్వామివారి ప్రసాదం ధరలను టీటీడీ భారీగా పెంచేసింది. 25 రూపాయలున్న సాధారణ లడ్డు ధర ... రూ.50 లకు, వంద వున్న కళ్యాణం లడ్డు ధర, రెండు వందల రూపాయలకు, అదనంగా కేటాయించే లడ్డులపై వంద శాతం ధరను టీటీడీ పెంచేసింది. అదే విధంగా 25 రూపాయలున్న వడ ధరను వందకు పెంచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు సమాచారం లేకుండా.... పెంచిన ధరలను అధికారులు నేటి నుంచి అమలు చేసేశారు. -
పర్యాటకం ఇక ప్రియం
సాక్షి,బెంగళూరు: పర్యాటకం ఇక ప్రియం కానుంది. నిర్వహణ, మౌలిక సదుపాయల పెంపు తదితర కారణాలను చూపుతూ ఆయా పర్యాటక ప్రాంతాల ప్రవేశ రుసుము, బోర్డింగ్ చార్జీలు, బోటింగ్ తదితర వాటి ధరలను పెంచుతూ రాష్ట్ర అటవీశాఖ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుండగా స్వదేశీ పర్యాటకులకు, విదేశీ పర్యాటకులకు వేర్వేరుగా ధరలు నిర్ణయించారు. కొత్త ధరల ప్రకారం బండీపుర, బిళిగిరిరంగినబెట్టచనాగరహళె, దాండేలి తదితర అభయారణ్యాల ప్రవేశ రుసుమును స్వదేశీ పర్యాటకులకు రూ.550గా నిర్ణయించగా విదేశీ పర్యాటకులకు రూ.1,800గా నిర్ణయించారు. అదేవిధంగా నాగరహళె, అంతరసంతె అభయారణ్యాల్లో వైల్డ్‌లైఫ్ సఫారీ ధరలతో పాటు వైల్డ్సఫారీ సమయాన్ని కూడా అదనంగా రెండు గంటల పాటు పెం చుతూ అటవీశాఖ నిర్ణయించింది. ఇక పక్షిధామాల ప్రవేశ రుసుముతో పాటు పక్షిధామాల్లో బోటింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీల ధరలను కూడా పెంచారు. వీటితో పాటు నేషనల్పార్క్, అభయారణ్యాలు, పక్షిధామాలకు వచ్చే పర్యాటకుల వాహనాల పార్కింగ్ చార్జీలను కూడా పెంచారు. కాగా విద్యార్థులు, పిల్లలు, వికలాంగులను మాత్రం కొత్తగా అమలు చేయనున్న ధరల నుంచి మినహాయించారు. మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యం ‘అభయారణ్యలు, పక్షిధామాలకు దేశవిదేశాల నుంచి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఆయా ప్రాంతాల్లో సౌకర్యాలు, నిర్వహణ వ్యయాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో రుసుం పెంచాల్సి వచ్చింది. పర్యాటకులపై భారం పడకుండా స్వల్ప మొత్తంలోనే ధరలను నిర్ణయించాం’–హన్నట్టి శ్రీధర్, అటవీ సంరక్షణ ముఖ్య కార్యదర్శి -
పసిడి దూకుడుకు ‘యెలెన్’ కళ్లెం!
న్యూయార్క్/ముంబై: అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుందని, రేట్ల పెంపు అనివార్యమని ఈ వారం మొదట్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జానెట్ ఎలెన్ చేసిన ప్రకటనతో గడచిన వారంలో అంతర్జాతీయంగా పసిడి దూకుడుకు కళ్లెం పడింది. ఫిబ్రవరి 10తో ముగిసిన వారం స్థాయి ధర వద్దే ఫిబ్రవరి 17వ తేదీనా బంగారం ధర అంతర్జాతీయంగా నిలకడగా ఉంది. న్యూయార్క్ కమోడిటీ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రా) ధర 1,235 డాలర్ల వద్దే స్థిరంగా ఉంది. అంతక్రితం రెండు వారాల్లో ఇక్కడ ధర భారీగా 45 డాలర్లు పెరగడం గమనార్హం. డాలర్ బలహీనతలు, గత వారం ఫెడ్ రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ప్రకటన, అమెరికా ఆర్థిక అనిశ్చితి దీనికి దన్నుగా నిలిచాయి. మొత్తంమీద బంగారానికి 1,210 డాలర్ల వద్ద మద్దతు ఉందని, 1,241 డాలర్ల వద్ద తొలి నిరోధం ఉండొచ్చనే సంకేతాలున్నాయి. అయితే మున్ముందు అమెరికా ఆర్థిక వ్యవస్థపై అంచనాలు, డాలర్‌పై దాని ప్రభావం బంగారం కదలికలకు కారణమవుతుందన్నది నిపుణుల విశ్లేషణ. దేశీయంగా చూస్తే... ఇక దేశీయంగా చూస్తే... అంతర్జాతీయంగా ధర పటిష్టంగా ఉండడం బంగారానికి కలిసి వచ్చింది. వారంలో ముంబై స్పాట్ మార్కెట్లో 99.9 స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ.370 పెరిగి రూ.29,565కు చేరింది. ఇక 99.5 స్వచ్ఛత గలిగిన పసిడి విషయంలో ఈ ధర ఇంతే స్థాయిలో ఎగసి రూ.29,415కు చేరింది. కాగా వెండి కేజీ ధర రూ.965 పెరిగి రూ.43,255కు ఎగసింది. -
'షిర్డీ' వీఐపీ పాస్‌ల ధర పెంపు
ముంబై (మహరాష్ట్ర) : ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలో వీఐపీ దర్శనం పాస్‌ల ధర పెంచుతూ సాయబాబా సంస్థాన్ ట్రస్టు (ఎస్ఎస్ఎస్టీ) నిర్ణయం తీసుకుంది. సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి బాజీరావ్ షిండే ఈ మేరకు శుక్రవారం వివరాలు వెల్లడించారు. వీఐపీ పాస్ ధరను రూ.100 నుంచి రూ.200కు, ఉదయం హారతి (కాకడ్) వీఐపీ పాస్ ధరను రూ.500 నుంచి రూ.600కు పెంచినట్లు చెప్పారు. మధ్యాహ్నం హారతి ధర కూడా రూ.300 నుంచి రూ.400కు పెంచామని, పెంచిన ధరలు మార్చి ఒకటి నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు. సాధారణ భక్తులకు ప్రసాదం (స్వీట్మీట్) ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. భక్త నివాస్‌లో మార్చి ఒకటి నుంచి పాస్ విక్రయ కౌంటర్ ప్రారంభించనున్నట్లు ఎస్ఎస్ఎస్టీ వెల్లడించింది. -
అహనా..కోడంట!
కిలో చికెన్ రూ.200-220 రికార్డు స్థాయిలో ధర రోజురోజుకు పెరుగుతున్న వైనం లైవ్ హోల్‌సేల్ కిలో రూ.115 పేదోడికి దూరమవుతున్న చికెన్ రుచి ప్రాణంతో ఉన్న ఓ కోడిని గుమ్మానికి వేలాడదీసి, దానిని చూస్తూ సినీనటుడు కోటా శ్రీనివాస రావు..ఒట్టి అన్నాన్ని లొట్టలేసుకుంటూ తింటాడు. ‘అహా.. నా పెళ్లంట’ అనే సినిమాలో ఈ దృశ్యం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. హాస్యం కోసం దర్శకుడు ఇలాంటి సన్నివేశాన్ని చిత్రీకరించాడు. అయితే నేడు పెరిగిపోతున్న చికెన్ ధరలతో ఇలా చేయక తప్పదేమో అంటున్నారు మాంసం ప్రియులు. ఆళ్లగడ్డటౌన్: జిల్లాలో కోడిమాంసం ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో కిలో ధర రూ. 150 ఉండగా నేడు రూ.200కు పైగా పలుకుతోంది. రెండు నెలల క్రితం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బ్లర్డ్ ఫ్లూ రావడంతో లక్షల సంఖ్యలో కోళ్లను అధికారులు చంపి వేశారు. ఈ భయంతో ఇతర జిల్లాల్లోని కోళ్ల ఫారం యజమానులు కూడా కోళ్లను పెంచడం పూర్తిగా మానుకున్నారు. దీంతో ఈ ఏడాది కోళ్ల సంఖ్య తగ్గింది. అక్కడక్కడ పెంపకం చేపడుతున్న పాల్ట్రీ యజమానులు ధరలు పెంచేశారు. చర్మంతో కూడిన (విత్ స్కిన్) చికెన్.. పది రోజుల క్రితం కిలో రూ. 140 వరకు పలుకగా ప్రస్తుతం రూ. 200 వరకు అమ్ముతున్నారు. ఇక చర్మం లేకుండా (స్కిన్ లెస్) చికెన్ కిలో రూ. 220 వరకు విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. చికెన్ తినలేమని మాంసాహారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత ధర పెరగడం గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు. గుడ్డుకు గడ్డు కాలమే..! పోషకాహారాల్లో గుడ్డుది ప్రధాన స్థానం. అనేక మంది శాఖహారులు సైతం గుడ్డును ఆహారంగా తీసుకుంటారు. ఇప్పటి కే పప్పుదినుసులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటడంతో గుడ్డు తిందామన్న గడ్డుకాలమే ఎదురౌతోంది. ఒక్కో గుడ్డు చిల్ల ధర రూ. 5 వరకు పలుకుతోంది. హోల్‌సేల్‌గా 100 గుడ్లు రూ 430 ధర ఉంది. సాధారణంగా హోల్‌సేల్ మార్కెట్లో 100 గుడ్లు రూ 275 నుంచి రూ 300 ధర ఉన్నప్పుడు ఒక్కో గుడ్డును రూ 4 అమ్మేవారు. మూడు రోజులుగా హోల్‌సేల్ మార్కెట్లోనే ఒక్కో గుడ్డు రూ. 5 ల పైగా అమ్ముతున్నారు. దీంతో కొన్ని రోజులు గుడ్డు తినడం మానుకోవడం మేలని ప్రజలు భావిస్తున్నారు. రిటైల్ అమ్మకాలపై ప్రభావం మార్కెట్లో చికెన్ ధరలు గణనీయంగా పెరగడంతో రిటైల్ వ్యాపారం బాగా తగ్గింది. కిలో...రెండు కిలోలు కోడి మాసం కొనేవారు పెద్దగా మక్కువ చూపడం లేదు. గతంలో ఆదివారం ఒక్క రోజే మా అంగట్లో 4 వేల కేజీలకు పైగా చికెన్ విక్రయించేవాళ్లం. ప్రస్తుతం 2వేల కేజీలు కూడా విక్రయించలేక పోతున్నావం. 20 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నా ఇంత ధర ఎప్పుడు అమ్మలేదు. చికెన్ ఇంత ధర పలుకుతుందని ఊహించను కూడా లేదు. - షరీఫ్, చికెన్ సెంటర్ యజమాని -
‘పప్పులు’డకవ్.. జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: పప్పు దినుసుల అక్రమ నిల్వలపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. వ్యాపారుల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటోంది. డిమాండ్, సరఫరాకు మధ్య అంతరం పెంచేం దుకు ప్రైవేటు వ్యాపారులు తెరతీశారన్న సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు మూడు రోజుల క్రితం పప్పు ధరలపై అధికారులతో ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. అక్రమ నిల్వలపై దాడులు పెంచాలని పౌరసరఫరాల శాఖ అధికారులను, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రం లో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్లలో పప్పు ధాన్యాల సాగు భారీగా తగ్గింది. ఖరీఫ్‌లో మొత్తంగా 4.67 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాల సాగు కావాల్సి ఉండగా కేవలం 3.17 లక్షల హెక్టార్లకే పరిమితమైంది. పెసర సాగులో భారీ అంతరం ఉండగా, మినుములు, కందుల సాగు 40 నుంచి 50 శాతం మేరకు తగ్గింది. పెసరపప్పు 1.07 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కావాల్సి ఉండగా కేవలం 24 వేల మెట్రిక్ టన్నులకు పడిపోవడంతో దీని ధర కిలో రూ.115 చేరింది. ఈ ధరలు గత ఏడాది ధరతో పోలిస్తే రెండింత లు. కందిపప్పు, మినప్పప్పు ధరలు సైతం రూ.80 నుంచి రూ.90 వరకు చేరాయి. కేంద్ర ప్రభుత్వం 2013 నుంచి నియంత్రణను ఎత్తివేసిన నేపథ్యంలో రాష్ట్రీయంగా ఉత్పత్తవుతున్న పప్పు ధాన్యాలను మహారాష్ట్ర, కర్ణాటకలో అధిక లాభాలకు విక్రయిస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ కృతిమ కొరతను సృష్టించి డిమాండ్‌ను పెంచుతూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో రాష్ట్రీయ మార్కెట్లో ధరలు గతంలో ఎన్నడూ లేనివిధంగా చుక్కలనంటుతున్నాయి. ఇప్పటికే రంగంలోకి దిగిన పౌరసరఫరాల శాఖ వివిధ జిల్లాల్లో నాలుగైదు కేసులు పెట్టగా, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ సైతం మరో పది కేసులు నమోదు చేసినట్లు సమాచారం. -
ముక్కకు మూడుకోట్లు!
పండగ మూడు రోజులూ మాంసాహారం కోసం జిల్లా వాసులు భారీగా ఖర్చు చేశారు. భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాల్లో గతంలో ఎన్నడూలేని విధంగా దాదాపు రూ 3 కోట్ల మాంసాన్ని చక్కగా చప్పరించేశారు. వేకువజామున నాలుగు గంటల నుంచే మాంసం కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్ద క్యూ కట్టారు. వేల సంఖ్యలో కోళ్లు, గొర్రెల తలలు తెగిపడ్డాయి. ఒక్క నెల్లిమర్ల నగర పంచాయతీ విషయమే తీసుకుంటే..ఇక్కడున్న 50 మాంసం దుకాణాల ద్వారా భోగి నుంచి కనుమ వరకూ సుమారు పది లక్షల రూపాయల మాంసం విక్రయాలు జరిగాయి. జిల్లా కేంద్రంలో అత్యధికంగా రూ.30 లక్షలపైనే మాంసం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. ఓ వైపు మటన్, చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయినా జిల్లావాసులు ఎంతమాత్రం జంకలేదు. భోగీ, సంక్రాంతి నాడు కొంతమందే మాంసాహారం తీసుకున్నా, కనుమ రోజు దాదాపు అందరూ నోట ముక్క పెట్టారు. ప్రస్తుతం మటన్ ధర రూ.440 కాగా, చికెన్ ధర రూ 160గా ఉంది. మొన్నటిదాకా బాగా తక్కువగా ఉన్న చికెన్, మటన్ ధరలు పండగ రోజుల్లో అమాంతం పెరిగాయి. భోగికి ముందు వారం రోజుల నుంచి ధరలు చుక్కలను అంటాయి. అయినా సంక్రాంతి ప్రధాన పండగ కావడంతో జిల్లావాసులు మాంసం కొనుగోళ్ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. భోగి మొదలుకొని కనుమ దాకా జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మున్సిపాలిటీలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీలోనే అత్యధికంగా మాంసం విక్రయాలు జరిగాయి. ప్రతి మున్సిపాలిటీలోనూ పది లక్షల రూపాయలకు తక్కువ గాకుండా మాంసం విక్రయాలు జరిగాయి. అలాగే 34 మండల కేంద్రాల్లోనూ అధికంగా అమ్ముడుపోయింది. ఎక్కడా ఐదు లక్షలకు తక్కువకాకుండా మాంసం విక్రయాలు జరిగాయి. దాదాపు అన్ని గ్రామాల్లోనూ పండగ సందర్భంగా మాంసం దుకాణాలు వెలిశాయి. ఒక్క కనుమనాడే భారీ సంఖ్యలో గొర్రెలు, కోళ్ల తలలు తెగిపడ్డాయి. వేకువజామున నాలుగు గంటల నుంచే జిల్లా కేంద్రంలోనూ, మున్సిపాలిటీల్లోనూ, మండల కేంద్రాల్లోనూ మాంసం విక్రయాలు మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటల తర్వాత మాంసం దొరకలేదు. ముఖ్యంగా మటన్ ధర రూ 440కి పెరిగినా కొనుగోలు చేసేందుకు జిల్లావాసులు వెనుకాడలేదు. డిమాండ్ పెరగడంతో దుకాణదారులు అప్పటికప్పుడే ధరలను పెంచేశారు. నాటుకోడి ప్రియులకు ఈ ఏడాది ధరలు చుక్కలు చూపించాయి. మటన్‌తో సమానంగా నాటుకోడి ధరలు సైతం అమాంతం పెరిగాయి. కిలో నాటుకోడి మాంసం రూ.300 పైనే పలికింది. ముక్కనుమ సందర్భంగా శుక్రవారం కూడా మాంసం విక్రయాలు ఎక్కువగానే ఉంటాయి. కొత్త అల్లుళ్లు, దూరప్రాంతాల నుంచి విచ్చేసిన బంధువులున్న వారు శుక్రవారం కూడా భారీగానే కొనుగోలు చేస్తారు. దీంతో జిల్లావ్యాప్తంగా మాంసం విక్రయాలు మరింత పెరిగే అవకాశముంది.