
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా కొనుగోలు దారులకు షాక్ ఇచ్చింది. మరోసారి కార్ల ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తయారీ, నిర్వహణ, ముడిసరకుల వ్యయాలు పెరగడం వల్ల వచ్చే నెల నుంచి అన్నీ మోడల్స్ ధరలను పెంచనున్నట్లు మారుతి సుజుకి తెలిపింది. "గత ఏడాది కాలంలో ఇన్ పుట్ ఖర్చులు పెరగడం వల్ల వివిధ వాహనాల ధరలు ప్రభావితం అవుతున్నాయి" అని కంపెనీ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది.
మోడల్ బట్టి ధరల పెరుగుదలలో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. "సెప్టెంబర్ 2021లో విడుదల చేసే అన్నీ మోడల్స్ ధరల పెరగనున్నట్లు" మారుతి సుజుకి ఇండియా తెలిపింది. ప్రస్తుతం కంపెనీ ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్ ఆల్టో(ధర రూ.2.99 లక్షల) నుంచి ఎస్-క్రాస్(ధర రూ.12.39) మోడల్స్ వరకు విక్రయిస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు వాహన ధరలను పెంచింది.(చదవండి: ‘కూ’ కోటి యూజర్ల రికార్డ్)
Comments
Please login to add a commentAdd a comment