Maruti Suzuki India
-
జీఎస్టీ హీట్: దేశీయ అతిపెద్ద కార్ల కంపెనీకి షోకాజ్‌నోటీసులు
ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు, బీమా , తదితర కంపెనీలు షోకాజ్ నోటీసుల తరువాత తాజాగా ఆటోమొబైల్ మేజర్ మారుతీ సుజుకి ఇండియాకి జీఎస్టీ షాక్ తగిలింది. వడ్డీ , పెనాల్టీలతో పాటు రివర్స్ ఛార్జ్ ప్రాతిపదికన నిర్దిష్ట సేవలపై పన్ను బాధ్యతకు సంబంధించి రూ. 139.3 కోట్లు చెల్లించాలంటూ జీఎస్టీ అధికారులు కంపెనీకి షోకాజ్ నోటిసులు పంపించారు. అయితే దీనిపై స్పందించిన మారుతి ఇప్పటికే చెల్లించిన పన్నుకు, 2017 జూలై -2022 ఆగస్టు వరకు నిర్దిష్ట సేవలపై రివర్స్ ఛార్జ్ విషయానికి సంబంధించిన నోటీసు అని కంపెనీ తెలిపింది. "అడ్జుడికేటింగ్ అథారిటీ ముందు షోకాజ్ నోటీసుకు తమ జవాబును ఫైల్ చేయనున్నామని, అలాగే ఈ నోటీసు తమ ఆర్థిక, కార్యకలాపాలు లేదా ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ సమాచారాన్ని అందించింది. అలాగే 2006 జూన్ నుండి మార్చి 2011 మధ్య కాలంలో సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాఖలు చేసిన అప్పీళ్లు కొట్టివేస్తూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు నుండి తమకు అనుకూలమైన ఉత్తర్వు లభించిందని కంపెనీ తెలిపింది. దీనిపై జరిమానాను కూడా కోర్టు తొలగించినట్టు వెల్లడించింది. డిపార్ట్మెంట్ అప్పీల్లో పెనాల్టీ తోకలిపి మొత్తం పన్ను రూ. 57.2 కోట్లు. కాగా మారుతీ ఈ ఏడాది ఆగస్టు అత్యధిక నెలవారీ అమ్మకాల్లో1,89,082 యూనిట్లతో కీలక మైలురాయిని సాధించింది. వివిధ సబ్-సెగ్మెంట్ మోడల్‌లతో సహా దేశీయ విక్రయాలలో 1,58,678 యూనిట్లను నమోదు చేసింది. తన మొత్తం లైనప్‌లో పూర్తి స్వదేశీకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ప్యాసింజర్ వెహికల్ (PV) మార్కెట్ లీడర్‌గా ఉన్న మారుతి ఇప్పటికీ కొన్ని కీలకమైన భాగాలు, ముఖ్యంగా సెమీకండక్టర్ చిప్‌ల దిగుమతులపై ఆధారపడి ఉన్నప్పటికీ, దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీపై పట్టు సాధిస్తే,విదేశీ మార్కెట్లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని కంపెనీ విశ్వసిస్తోంది. -
పండుగల సీజన్లో కార్ల జోరు
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగల సీజన్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు ఉంటాయని మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా అంచనా వేస్తున్నాయి. పరిశ్రమ వార్షిక అమ్మకాల్లో పండుగల సీజన్ వాటా సగటున 23–26 శాతంగా ఉందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ మంగళవారం జరిగిన సియామ్ సదస్సులో తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా అన్ని కంపెనీలవి కలిపి 40.5–41 లక్షల యూనిట్లు అమ్ముడవుతాయని చెప్పారు. ఇందులో పండుగల సీజన్ వాటా 10 లక్షల యూనిట్లు ఉంటుందన్నారు. ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమ తొలిసారిగా 10 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటుందని వెల్లడించారు. ఇప్పటి వరకు దేశంలో 2021లో అత్యధికంగా పండుగల సీజన్లో 9.34 లక్షల యూనిట్లు నమోదయ్యాయని వివరించారు. ఆ రెండూ జరగకపోతేనే.. ఓనమ్ విక్రయాల్లో 24 శాతం వృద్ధి సాధించామని శ్రీవాస్తవ పేర్కొన్నారు. గతేడాది 3.55 లక్షల యూనిట్లతో పోలిస్తే 2023 సెపె్టంబరులో 3.61 లక్షల యూనిట్ల హోల్‌సేల్ అమ్మకాలు ఆశిస్తున్నట్టు చెప్పారు. గ్రామీణ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే అధిక వడ్డీ రేట్లు, రుతుపవనాల లోటు వృద్ధికి అడ్డుకట్ట అని తెలిపారు. ఇవి రెండూ జరగకపోతే ఉపశమనం లభిస్తుందని అన్నారు. ‘వడ్డీ రేట్లు పెరగకూడదు. ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే అవి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మైనస్ 8 శాతంగా నమోదవుతున్న వర్షపాతం కారణంగా గ్రామీణుల మనోభావాలు దెబ్బతినకూడదు’ అని ఆయన పేర్కొన్నారు. హుందాయ్ వృద్ధి 9 శాతం.. గతేడాదితో పోలిస్తే పండుగల సీజన్లో 9 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు హుందాయ్ మోటార్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. ఈ ఏడాది అర్ధ భాగం విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా 54 శాతం నమోదైందన్నారు. ఎక్స్టర్ రాకతో జూలై, ఆగస్ట్‌లో ఇది 64 శాతానికి ఎగసిందని చెప్పారు. వెయిటింగ్ పీరియడ్ తగ్గిందని, తద్వారా సమయానికి డెలివరీలు అందించేందుకు వీలవుతోందని చెప్పారు. బలమైన తాజా డిమాండ్ రాబోయే కాలానికి మంచి సూచిక అన్నారు. పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని వివరించారు. -
ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తోంది...సూపర్ అప్‌కమింగ్ కార్లు
TopUpcomingCars: పండుగల సీజన్ సమీపిస్తున్నతరుణంలో భారత మార్కెట్లోకి కొత్త కార్లు హల్చల్ చేస్తున్నాయి. వినాయక చవితి దసరా, దీపావళి రోజుల్లో కొత్త వాహనాలను కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పండుగల సీజన్ కార్ల డిమాండ్ నేపథ్యంలో అనేక కంపెనీలు అత్యాధునిక ఫీచర్లు, బడ్జెట్, ఈవీ కార్లు ఇలా రకరకాల సెగ్మెంట్లలో కార్లను లాంచ్ చేస్తుంటారు. ఒకవేళ మీరు కూడా ఈ పండుగ సీజన్లో కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, రానున్న రాబోయే మోడళ్ల కార్లను ఓసారి చూద్దాం! Maruti suzuki invicto మారుతి సుజుకి ఇండియా తన లీడర్ మోడల్ - మారుతి సుజుకి ఇన్విక్టో ఎమ్‌పివిని జీటా ఆల్ఫా అనే రెండు వేరియేషన్లలో అందుబాటులో ఉంది. మారుతి ఇన్విక్టో ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో సరిపోలిన 2.0-లీటర్ పెట్రోల్ మోటారును పొందుతుంది. ఎలక్ట్రిక్ మోటార్ 11 బిహెచ్పి ,206 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఐసిఇ వెర్షన్ 172 బిహెచ్పి మరియు 188 ఎన్ఎమ్ టార్క్‌ను కలిగి ఉంది. ధర రూ. రూ. 24.79 లక్షలు 28.42 లక్షలు (ఎక్స్ షోరూం) Honda Elevate హోండా ఎలివేట్ వచ్చే నెల ( సెప్టెంబరు) లో దేశంలో సేల్ కు రానుంది.హోండా ఎలివేట్ 1.5L NA పెట్రోల్ ఇంజన్‌తో 6-స్పీడ్ MT , CVT అనే రెండు ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌లో లభ్యం. దీని ధర రూ. 10.50-17 లక్షలు ఉంటుందని అంచనా. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైడర్, వోక్స్వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, MG ఆస్టర్ లాంటివాటికి గట్టి పోటీగా ఉండనుంది. Citroen C3 Aircross సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్: 7-సీటర్ SUVని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ బెస్ట్ ఆప్షన్. బోల్డ్ స్టైలింగ్‌తో, బెస్ట్ ఇంటీరియర్‌తో వస్తోంది. అయితే ఇది 1.2L టర్బో-పెట్రోల్ కేవలం ఒక ఇంజన్ ఎంపిక మాత్రమే లభ్యం. దీని ధర రూ. 9-13 లక్షలు ఉంటుందని అంచనా. Toyota Rumion మరో 7-సీటర్ కారు టయోటా రూమియన్. ఈమధ్యనే లాంచ్ అయినా ఈ కారు త్వరలోనే కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. విజువల్ ఫ్రంట్‌లో కొన్ని మార్పులను కలిగి ఉంది. అలాగే రేడియేటర్ గ్రిల్ సవరించిన బంపర్‌తో కొత్తగానూ, అల్లాయ్ వీల్స్ కూడా తాజా డిజైన్‌ను కలిగి ఉన్నాయి. టయోటా లోగో మినహా లోపలి భాగంలో అంతా సేమ్. Tata Punch EV SUV టాటా పంచ్ ఈవీ టియాగో ఈవీ తరహాలో ఇదే ఆర్కిటెక్చర్‌తో పంచ్ ఈవీని విడుదల చేయడానికి టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తోంది. ఇది జిప్ట్రాన్ సాంకేతికతతో బానెట్ కింద ఉంచబడిన ఎలక్ట్రిక్ మోటారుతో వస్తోంది. 350 కిమీల పరిధితో లాంచ్ కానుంది. దీని ధర రూ. 9-12 లక్షలు ఉంటుందని అంచనా. Tata Nexon facelift ప్రమోషనల్ షూట్లో అందరి దృష్టినీ ఆకర్షించిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి ఇది మార్కెట్లోకి వస్తుందని తొలుత అనుకున్నప్పటికీ పండుగ సీజన్లోనే దాదాపు అక్టోబరులోనే దీన్ని లాంచ్ చేస్తుందని తాజా అంచనా.దీని ధర రూ. 8-15 లక్షలు ఉంటుందని అంచనా. Volvo C40 Recharge వోల్వో సీ40 రీఛార్జ్ (VolvoC40) XC40 రీఛార్జ్ SUV-కూపే వెర్షన్. మెరుగు పర్చిన 78kWh బ్యాటరీ ప్యాక్‌తో,530కిమీ పరిధిని అందిస్తుంది. 408PSతో డ్యూయల్-మోటార్ AWD కారణంగా 4.7 సెకన్లలో 100kmph వరకు దూసుకెళ్తుంది. అంచనా ధర రూ. 60 లక్షలు (ఎక్స్-షోరూమ్) సెప్టెంబరు 4న లాంచింగ్ -
నెక్సా కస్టమర్లు 20 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నెక్సా రిటైల్ చైన్ల ద్వారా ఇప్పటి వరకు 20 లక్షల కార్లు రోడ్డెక్కాయని మారుతీ సుజుకీ ఇండియా ప్రకటించింది. ప్రీమియం కార్ల విక్రయాల కోసం 2015లో నెక్సా కేంద్రాలను కంపెనీ ప్రారంభించింది. బలేనో, ఇగ్నిస్, సియాజ్, ఎక్స్ఎల్6, గ్రాండ్ వితారా మోడళ్లు ఇక్కడ కొలువుదీరాయి. త్వరలో మార్కెట్లోకి రానున్న ఎస్‌యూవీలు ఫ్రాంక్స్, జిమ్నీ సైతం వీటి సరసన చేరనున్నాయి. ఇతర మోడళ్లను అరీనా ఔట్లెట్ల ద్వారా విక్రయిస్తున్నారు. హ్యుండై, టాటా మోటార్స్ విక్రయాల కంటే నెక్సా కేంద్రాల ద్వారా వచ్చే ఏడాది అధిక యూనిట్లను నమోదు చేయాలన్నది లక్ష్యమని కంపెనీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. రెండవ స్థానం దిశగా.. తొలి 10 లక్షల యూనిట్లకు నాలుగేళ్లు, ఆ తర్వాతి 10 లక్షల యూనిట్లకు మూడేళ్ల సమయం పట్టిందని శశాంక్ వెల్లడించారు. ‘ప్రస్తుతం మారుతీ సుజుకీ అరీనా, హ్యుండై, టాటా మోటార్స్ తర్వాత నెక్సా నాల్గవ స్థానంలో ఉంది. వచ్చే ఏడాది రెండవ స్థానానికి చేరుతుంది. సంస్థ మొత్తం విక్రయాల్లో 47 శాతం వృద్ధితో నెక్సా వాటా 23 శాతం ఉంది. దేశీయ ప్యాసింజర్ కార్ల రంగంలో నెక్సా 10 శాతం వాటా కైవసం చేసుకుంది. ఈ ఔట్లెట్ల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో 2.55 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022–23లో 3.7 లక్షల యూనిట్లు ఆశిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త మోడళ్లు, గ్రాండ్ వితారా కారణంగా నెక్సా నుంచి 6 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటాం’ అని వివరించారు. పరిశ్రమ కంటే మెరుగ్గా.. 2023–24లో ప్యాసింజర్ వాహన పరిశ్రమ వృద్ధి 5–7.5 శాతం ఆశిస్తున్నామని శశాంక్ తెలిపారు. ‘పరిశ్రమలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 38.9 లక్షల యూనిట్లు, 2023–24లో 41 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదు కావొచ్చు. ఆర్థిక వృద్ధి, రుతుపవనాల సరళి, గ్రామీణ మార్కెట్‌పై దాని ప్రభావం, వడ్డీ రేట్ల పెరుగుదల, నగదు లభ్యత స్థాయిలు, పరిస్థితులకు తగ్గట్టుగా వాహన తయారీ కంపెనీలు చేపట్టిన ధరల పెంపు వంటి అంశాల ఆధారంగా ఈ వృద్ధి ఆధారపడి ఉంటుంది. పరిశ్రమ కంటే మెరుగైన వృద్ధిని మారుతీ సుజుకీ ఆశిస్తోంది’ అని పేర్కొన్నారు. -
టాటా, మారుతి, హ్యుందాయ్: కారు ఏదైనా ఆఫర్ మాత్రం భారీగానే!
సాక్షి, ముంబై: ఆటోమొబైల్ దిగ్గజాలు మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా , టాటా కంపెనీలు తమ పలు మోడళ్ల కార్లపై మార్చి మాసంలో భారీ తగ్గింపు లభిస్తోంది. కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది చక్కటి అవకాశం. మారుతి, హ్యుందాయ్, టాటా కార్లపై ప్రస్తుతం లభిస్తున్న తగ్గింపు వివరాలను చూద్దాం. (రూ. 32 వేల బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 1,999కే ) మారుతి కార్లపై డిస్కౌంట్లు మార్చిలో రూ. 52వేల వరకు తగ్గింపుతో మారుతి సుజుకి ఇగ్నిస్‌ను కొనుగోలు చేయవచ్చు. అలాగే మారుతి సియాజ్పై రూ. 28 వేల వరకు తగ్గింపు లభ్యం. ఇక పాపులర్ కారు ఆల్టోపై రూ. 38వేలు, ఆల్టో కె10, ఎస్-ప్రెస్సోపై రూ. 49వేలు , వ్యాగన్ఆర్ కారు కొనుగోలుపై రూ. 64వేల డిస్కౌంట్ అందిస్తోంది. ఇంకా స్విఫ్ట్ రూ. 54వేల దాకా, డిజైర్ మోడల్ కొనుగోలుపై రూ. 10 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. (ఐటీ మేజర్‌ను నడిపించిన ఈ ధీర వనితల్ని గుర్తుపట్టారా? వీరే లేకపోతే..!) అయితే మారుతి సుజుకి బాలెనో, బ్రెజ్జా, గ్రాండ్ విటారా వంటి మోడళ్లపై ఎలాంటి తగ్గింపు లేదు. హ్యుందాయ్ కార్లపై డిస్కౌంట్లు మార్చిలో గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, ఆరా వంటి మోడళ్లపై హ్యుందాయ్ డిస్కౌంట్లనుఅందిస్తోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ రూ.38 వేలు దాకా, పాపులర్ ఐ20పై రూ. 20 వేలు, హ్యుందాయ్ ఆరాపై రూ.33 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే, క్రెటా, వెన్యూ, అల్కాజార్ , టక్సన్ వంటి SUV మోడళ్లపై ఎలాంటి తగ్గింపు లేదు. టాటా కార్లపై డిస్కౌంట్లు అత్యధికంగా అమ్ముడైన టాటా ప్యాసింజర్ వాహనం టాటా నెక్సాన్ మార్చిలో రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు ఉంది. టాటా హారియర్ ,టాటా సఫారిపై రూ.45వేల రకు తగ్గింపు ఉంది. దీంతోపాటు టాటా టియాగోపై సుమారు రూ. 28వేలు, టాటా టిగోర్‌పై రూ. 30వేల వరకు తగ్గింపు ఉంది. టాటా ఆల్ట్రోజ్ రూ. 28 వేల దాకా తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. -
ఈకో 10 లక్షల యూనిట్ల మార్కు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఈకో వ్యాన్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. తాజాగా 10 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. 2010లో భారత మార్కెట్లోకి ఈకో ప్రవేశించింది. 5, 7 సీట్లు, కార్గో, టూర్, అంబులెన్స్ వంటి 13 వేరియంట్లలో ఇది లభిస్తుంది. వ్యాన్స్ విభాగంలో 94 శాతం వాటా ఈకో కైవసం చేసుకుందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. తొలి 5 లక్షల యూనిట్లకు ఎనమిదేళ్లు పట్టింది. మిగిలిన 5 లక్షల యూనిట్ల విక్రయాలు అయిదేళ్లలోపే పూర్తి చేశామన్నారు. 1.2 లీటర్ అడ్వాన్స్డ్ కె–సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజన్‌తో ఈకో రూపుదిద్దుకుంది. మైలేజీ పెట్రోల్ వేరియంట్ లీటరుకు 20.2 కిలోమీటర్లు, ఎస్–సీఎన్జీ వేరియంట్ కేజీకి 27.05 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ తెలిపింది. -
ఎస్‌యూవీలపై మారుతీ సుజుకీ గురి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) విభాగంపై దృష్టిసారించింది. ఈ సెగ్మెంట్లో 2023–24లో 33 శాతం వాటా చేజిక్కించుకోవడం ద్వారా తొలి స్థానాన్ని కైవసం చేసుకోవాలని లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం బ్రెజ్జా, గ్రాండ్ వితారా ఎస్‌యూవీలను కంపెనీ విక్రయిస్తోంది. మార్చి నుంచి జిమ్నీ, ఫ్రాంక్స్ మోడళ్లు రోడ్డెక్కనున్నాయి. జిమ్నీ ఇప్పటికే 17,500 యూనిట్లు, ఫ్రాంక్స్ 8,500 యూనిట్ల బుకింగ్స్‌ను కైవసం చేసుకోవడం విశేషం. భారత ప్యాసింజర్ వాహన రంగంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ వాటా 42.5 శాతం ఉంది. 2022–23లో ఇది 45 శాతానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ విభాగంలో మారుతీ సుజుకీ వాటా 11.5 శాతం. మొత్తం ప్యాసింజర్ వాహన పరిశ్రమలో సంస్థకు ఏకంగా 45 శాతం వాటా ఉంది. దీనిని 50 శాతానికి పెంచుకోవాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. 2023 జనవరిలో ఎస్‌యూవీల విపణిలో మారుతీ సుజుకీ 15 శాతం వాటా దక్కించుకుంది. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ విభాగంలో 2021–22లో టాటా మోటార్స్‌కు 18 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రాకు 15 శాతం వాటా ఉన్నట్టు సమాచారం. -
అదరగొట్టిన మారుతి:అమ్మకాల జోష్ మామూలుగా లేదుగా!
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. నికర లాభం రెట్టింపు కంటే ఎక్కువలాభాలను నమోదు చేసింది. అలాగే ఆదాయం కూడా 25 శాతం ఎగిసింది. EBIT మార్జిన్ కూడా 350 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 7.6 శాతానికి చేరుకుంది. లాభాల మార్జిన్ 380 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 8.4 శాతంగా ఉంది. ప్యాసింజర్, హై ఎండ్ కార్ల బలమైన డిమాండ్, ఇటీవలి కాలంలో ధరల పెంపు నేపథ్యంలో మారుతీ గణనీయ లాభాలను సాధించింది. త్రైమాసిక ఏకీకృత నికర లాభంలో ఊహించిన దానికంటే మెరుగ్గా 129.55 శాతం జంప్ చేసింది. గత ఏడాదితో రూ.1,041.8 కోట్లతో పోలిస్తే, రూ.2,391.5 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ. 29,057.5 కోట్లను సాధించింది. గత ఏడాది 23,253.3 కోట్ల వార్షిక ప్రాతిపదికన 24.96 శాతం పెరిగింది. జోరందుకున్న అమ్మకాలు, ముడి సరుకు ధర తగ్గడంతో లాభాల్లో పెరుగుదల నమోదైందని కంపెనీ తెలిపింది. ఈ త్రైమాసికంలో మొత్తం 465,911 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 430,668 యూనిట్లు విక్రయించింది. దేశీయ అమ్మకాలు 403,929 యూనిట్లు కాగా, ఎగుమతులు 61,982 యూనిట్లు. ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత ఈ త్రైమాసికంలో సుమారు 46,000 వాహనాల ఉత్పత్తిపై ప్రభావం చూపింది. ఇది మొత్తం 430,668 యూనిట్ల విక్రయాలకు వ్యతిరేకంగా ఉంది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో దేశీయంగా 365,673 యూనిట్లు , ఎగుమతి మార్కెట్లలో 64,995 యూనిట్లు ఉన్నాయని మారుతి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.27,849.2 కోట్ల నికర విక్రయాలను నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో నికర విక్రయాలు రూ.22,187.6 కోట్లుగా ఉన్నాయి. అలాగే మారుతీ సుజుకి 2022 ఏప్రిల్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో అత్యధికంగా రూ. 81,679 కోట్ల నికర అమ్మకాలను నమోదు చేసింది, ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ. 58,284.1 కోట్లుగా ఉంది. ఎఫ్వై22 మొదటి తొమ్మిది నెలల్లో రూ.1,927.4 కోట్ల నుంచి ఏడాది మొదటి తొమ్మిది నెలల నికర లాభం రూ.5,425.6 కోట్లకు పెరిగింది. -
మారుతి కస్టమర్లకు మరోషాక్, 11 వేల కార్లు రీకాల్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోసారి తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. తన పాపులర్ మోడల్ గ్రాండ్ విటారా 11,177 కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్లలో రేర్ సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్స్ సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గత ఏడాది ఆగస్టు ఎనిమిది నుంచి నవంబర్ 15 వరకు తయారైన గ్రాండ్ విటారా కార్లను రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. రేర్ సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్లలో సమస్య తలెత్తింది. దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు రేర్ సీట్ బెల్ట్ లూజ్ అయ్యే అవకాశం ఉందని, దానివల్ల పనితీరు దెబ్బ తింటుందని మారుతి తెలిపింది. గత ఆగస్టు – నవంబర్ మధ్య తయారైన గ్రాండ్ విటారా కార్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు తమ డీలర్ల ద్వారా సమాచారం అందుతుందని తెలిపింది. దెబ్బ తిన్న విడి భాగాలను ఉచితంగా రీ ప్లేస్ చేస్తామని మారుతి ప్రకటించింది. కాగా ఎయిర్‌బ్యాగ్ లోపం కారణంగా వివిధ మోడళ్లకు చెందిన 17,362 కార్లు ఇటీవల మారుతి రీకాల్ చేసింది. ముఖ్యంగా ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, ఈకో, బ్రెజా, బాలెనో, గ్రాండ్ విటారా మోడల్ కార్లు ఉన్న సంగతి తెలిసిందే. -
మారుతి కార్లలో లోపాలు: రీప్లేస్ చేసేదాకా దయచేసి వాడకండి!
సాక్షి, ముంబై: భారతదేశపు అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. పలు మోడళ్ల కార్లలో ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్లలో లోపం కారణంగా వేల కార్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 2022 డిసెంబరు 8, 2023 జనవరి 12 మధ్య తయారు చేసిన 17,362 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు మారుతి బుధవారం తెలిపింది.ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, ఈకో, బ్రెజ్జా, బాలెనో , గ్రాండ్ విటారా వంటి మోడళ్లు ప్రభావితమైనట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్‌లో లోపం కారణంగా 17,362 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ఈరోజు విడుదల చేసింది. ఈ వాహనాల్లో అవసరమైతే ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్‌ను ఉచితంగా తనిఖీ చేసి భర్తీ చేసేందుకు గాను ఈ రీకాల్ చేపట్టినట్టు వెల్లడించింది. ఈ లోపం కారణంగా వాహనం క్రాష్ అయినప్పుడు ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్లు చాలా అరుదుగా పనిచేయకపోవచ్చని తెలిపింది. ప్రభావితమైన భాగాన్ని మార్చే వరకు వాహనాన్ని నడపవద్దని లేదా ఉపయోగించవద్దని వినియోగదారులకు సూచించింది. సంబంధిత కార్ ఓనర్లకు తక్షణమే మారుతి సుజుకి అధీకృత వర్క్‌షాప్‌ల నుంచి సమాచారం వస్తుందని పేర్కొంది. కాగా గత డిసెంబరులో సియాజ్, బ్రెజ్జా, ఎర్టిగా,ఎక్స్ఎల్ 6, గ్రాండ్ విటారా మోడల్స్ 9,125 యూనిట్లను ఫ్రంట్‌లైన్ సీట్ బెల్ట్‌లలోని లోపాలను సరిచేయడానికి రీకాల్ చేసింది. -
మారుతి లవర్స్‌కు అలర్ట్, కొత్త కారు కొనాలంటే..!
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ దారు మారుతి సుజుకి తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఆరంభంలో కార్ల ధరలు పెంచక తప్పదని 2021, డిసెంబరులో ప్రకటించిన మారుతీ సుజుకి ఇండియా జనవరి 16 నుంచి కార్ల ధరల పెంపు అమల్లోకి వస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.వెల్లడించింది. దాదాపు అన్ని మోడళ్ల కార్లపై సగటు పెరుగుదల 1.1 శాతంగా ఉంటుందని తెలిపింది. కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అన్నో మోడళ్ల కార్లను అప్డేట్ చేయడం, ఉత్పత్తి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో పెంపు తప్పడలం లేదని కంపెనీ తెలిపింది. ఢిల్లీలోని ఎక్స్-షోరూమ్ ధరలపై ఇది వర్తిస్తుందని ప్రకటించింది. దీంతో మారుతీ సుజుకీ లవర్స్ కారు కొనాలంటే మరింత ధర పడనుంది. మారుతి ఎంట్రీ-లెవల్ చిన్న కారు ఆల్టో నుండి SUV గ్రాండ్ విటారా వరకు రూ. 3.39 లక్షల నుండి రూ. 19.49 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య వాహనాను విక్రయిస్తోంది. -
వాహన పరిశ్రమ వృద్ధికి విఘాతం
న్యూఢిల్లీ: చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని కార్లకు ఒకే పన్ను రేటు వర్తింపచేయడం సరికాదని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ వ్యాఖ్యానించారు. పరిశ్రమ వృద్ధికి ఇలాంటి ధోరణి మంచిది కాదని ఆయన చెప్పారు. దేశీ ఆటో పరిశ్రమలో కీలక విభాగమైన చిన్న కార్లపై అత్యధికంగా నియంత్రణ నిబంధనలపరమైన భారం ఉంటోందని భార్గవ తెలిపారు. తయారీ రంగం వేగంగా వృద్ధి చెందితే దేశ ఆర్థిక వృద్ది రేటు కూడా అధికంగా ఉంటుందని ఆయన చెప్పారు. కానీ దురదృష్టవశాత్తూ ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో విధానాలు పూర్తిగా అమలు కాకపోతుండటం వల్ల అలా జరగడం లేదని భార్గవ చెప్పారు. ‘పెద్ద కార్లతో పోలిస్తే చిన్న కార్లపై నియంత్రణపరమైన మార్పుల భారం చాలా ఎక్కువగా ఉంటోంది. ఇదే మొత్తం మార్కెట్ ధోరణులను మార్చేస్తోంది. ఇది కార్ల పరిశ్రమకు గానీ దేశానికి గానీ మంచిది కాదని భావిస్తున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. చిన్నా, పెద్ద కార్లకు ఒకే రకమైన పన్నును విధించడం సరికాదని ఆయన తెలిపారు. దాదాపు 50 శాతం స్థాయి పన్నుల భారంతో పరిశ్రమ వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన తెలిపారు. ఏ దేశంలో కూడా ఇంత పన్నులతో ఆటోమొబైల్స్ వంటి పరిశ్రమ వృద్ధి చెందలేదని భార్గవ చెప్పారు. ప్రస్తుతం ఆటోమొబైల్స్‌పై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) 28 శాతంగా ఉండగా, వాహనం రకాన్ని బట్టి 1–22% వరకు సెస్సు అదనంగా ఉంటోంది. పూర్తిగా తయారైన రూపంలో (సీబీయూ) దిగుమతయ్యే కార్లపై కస్టమ్స్ సుంకం 60–100% వరకూ ఉంటోంది. ఆటో ఎక్స్‌పోలో మారుతీ ఎలక్ట్రిక్ కారు వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ.. జనవరిలో జరిగే ఆటో ఎక్స్పో వేదికగా ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని ప్రదర్శించనుంది. అలాగే రెండు సరికొత్త ఎస్‌యూవీలు సైతం కొలువుదీరనున్నాయి. మొత్తం 16 మోడళ్లు ప్రదర్శనకు రానున్నాయి. చదవండి: కొత్త సంవత్సరంలో టీవీ ప్రేక్షకులకు ఊహించని షాక్! -
మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు: ఆలస్యం చేస్తే...!
సాక్షి,ముంబై: దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి డిసెంబరు నెలలో కూడా కొన్ని ఎంపిక చేసిన కార్లపై డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. ముఖ్యంగా వచ్చేఏడాది జనవరి నుంచి అన్ని మోడళ్లకార్ల ధరలను పెంచక తప్పదని ఇటీవల ప్రకటించిన తరువాత అందిస్తున్న ఈ తగ్గింపు ధరలకు ప్రాధాన్యత లభిస్తోంది. స్విఫ్ట్, డిజైర్, వవ్యాగన్ ఆర్, సెలెరియో తోపాటు, న్యూజెన్ ఆల్టో, మారుతి అరేనా మోడళ్లపై కొనుగోలు దారులు డిస్కౌంట్ ఆఫర్‌ను పొందివచ్చు. కార్పొరేట్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్, క్యాష్ బ్యాక్ లాంటి ఆఫర్లుంటాయి. అలాగే నవంబరు నెలలో మాదిరిగానే ఎర్టిగా ఎమ్‌పివి. బ్రాండ్-న్యూ బ్రెజ్జా ఎస్‌యూవీలపై డిస్కౌంట్లు ఉండవు. మారుతి సుజుకి డిసెంబర్ 2022 నెలలో తన అరేనా లైన్ వాహన తగ్గింపును రూ. 52,000 వరకు అందిస్తోంది ఇటీవల విడుదల చేసిన మారుతి సుజుకి ఆల్టో కె10 మాన్యువల్ మోడల్స్‌పై రూ.52,000 వరకు డిస్కౌంట్. ఏఎంటీ మోడల్స్ రూ. 22వేలు, ఇటీవల విడుదలైన సీఎన్జీ మోడల్ కూడా రూ.45,100 తగ్గింపుతో అందుబాటులో ఉంది. సెలెరియో సీఎన్జీ రూ. 45,100, పెట్రోల్-మాన్యువల్ కార్లపై రూ. 36వేల వరకు తగ్గింపు అందు బాటులో ఉంది. ఏఎంటీ వెర్షన్‌పై రూ. 21,000 తగ్గింపు లభ్యం. హై ఎండ్ వేరియంట్లపై రూ. 42,000 వరకు తగ్గింపు , బేసిక్ మోడల్స్‌పై 17వేలు తగ్గింపు అందిస్తోంది. మారుతి మాన్యువల్ ఎస్-ప్రెస్సో వేరియంట్లపై గరిష్టంగా రూ. 46,000, ఏఎంటీ వేరియంట్లు రూ. 20వేలు, సీఎస్జీ వేరియంట్‌పై రూ. 45,100 తగ్గింపు లభిస్తుంది. అలాగే స్విప్ట్ ఏఎంటీ, మాన్యువల్ మోడల్స్ రెండింటిలోనూ దాదాపు రూ. 32వేలు తగ్గింపు. -
సుజుకి కొత్త స్కూటర్, అదిరే ఫీచర్స్, ప్రీమియం లుక్, ధర ఎంతంటే?
సాక్షి,ముంబై: మారుతి సుజుకి ద్విచక్ర వాహన అనుబంధ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా సరికొత్త స్కూటర్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. బర్గ్‌మన్ స్ట్రీట్ ఈఎక్స్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. బర్గ్‌మన్ స్ట్రీట్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ ఈఎక్స్ మోడల్‌ను విడుదలచేసింది. లేటెస్ట్ టెక్నాలజీ,నయా ఫీచర్లతో ప్రీమియం లుక్‌లో ఆకట్టుకునేలా ఆవిష్కరించింది. (వాట్సాప్ అవతార్ వచ్చేసింది..మీరూ కస్టమైజ్ చేసుకోండి ఇలా!) ధర: సుజుకీ బర్గ్‌మన్ స్ట్రీమ్ ఈఎక్స్ ధరను రూ.1,12,300 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. మారుతి సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ స్టాండర్డ్ ఎడిషన్ స్కూటర్ ధర రూ. 89,900 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ), సుజుకి బర్గ్మాన్ స్ట్రీట్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ రూ. 93,300 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)కి అందుబాటులో ఉంది.మెటాలిక్ మ్యాట్ ప్లాటినమ్ సిల్వర్, మెటాలిక్ రాయల్ బ్రాంజ్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ స్కూటర్ లభ్యం. సుజుకీ బర్గ్‌మన్ స్ట్రీమ్ ఈఎక్స్ ఇంజీన్ ఫీచర్లు ఎఫ్ఐ టెక్నాలజీతో పాటు ఎకో పర్ఫార్మెన్స్ ఆల్ఫా (SEP-a) ఇంజిన్‌తో 124cc సీసీ మోటార్‌ను అమర్చింది. ఇది 8.6PS గరిష్ట శక్తిని ,10Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఆటో స్టాప్-స్టార్ట్ సిస్టమ్ ,సైలెంట్ స్టార్టర్ సిస్టమ్ ప్రత్యేకత అని కంపెనీ తెలిపింది. వెనుక 12 అంగుళాల వెడల్పైన, పెద్ద టైర్‌ను అమర్చింది. సుజుకీ రైడ్ కనెక్ట్ బ్లూటూత్ డిజిటల్ ఎనేబుల్డ్ కన్సోల్‌తో కూడిన సుజుకీ రైడ్ కనెక్ట్ ఫీచర్ ను సుజుకీ బర్గ్‌మన్ స్ట్రీట్ ఈఎక్స్ మరో ఫీచర్. ఇది స్మార్ట్‌ఫోన్‌ను సింక్ చేసే సౌలభ్యాన్ని రైడర్‌కు అందిస్తుంది. నావిగేషన్, ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లు, వాట్సాప్ అలెర్ట్స్ ఈ బైక్ డిస్ప్లేలో చూడవచ్చు. స్పీడ్ ఎక్సీడింగ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవల్స్ కూడా డిజిటల్ కన్సోల్‌లో కనిపిస్తాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లను ఈ స్కూటర్ కన్సోల్కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా స్పీడ్ ఎక్సీడింగ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవెల్ లాంటి వివరాలు కూడా ఈ బైక్ డిజిటల్ కన్సోల్‌లో కనిపిస్తాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లను ఈ స్కూటర్ కన్సోల్కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. -
మారుతి కార్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్: ఆ కారణం చెప్పి..!
సాక్షి, ముంబై: దేశీయ కార్ల తయారీదారు మారుతీ సుజుకి తన కస్టమర్లకు షాకిచ్చింది. వచ్చే ఏడాది జనవరి నుంచి కార్ల ధరలను భారీగా పెంచేందుకు యోచిస్తోంది. ప్రధానంగా ద్రవ్యోల్బణం, నియంత్రణ అవసరాల నిమిత్తం 2023, జనవరి నుంచి ధరల పెంపు ఉంటుందని శుక్రవారం ప్రకటించింది. అలాగే ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ కొరత డిసెంబరు కార్ల ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపిస్తుందనే ఆందోళన వ్యక్తం చేసింది. (బెంజ్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేసింది: త్వరపడకపోతే..!) అమ్మకాలు పెరుగుతున్నప్పటికీ, ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ కొరత కారణంగా దేశీయ మోడళ్ల ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. ద్రవ్యోల్బణం, ఖర్చుల నియంత్రణ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ధరల పెరుగుదల 2023 జనవరిలో ఉంటుందని ప్రకటించింది. మోడల్ని బట్టి, ధర పెంపు ఉంటుందని ప్రకటించిన మారుతి పెంపు ఎంత శాతం అనేది ధృవీకరించలేదు.(లగ్జరీ కారు కొన్న కుమార్తెలు: గర్ల్ పవర్ అంటున్న మ్యూజిక్ డైరెక్టర్) కాగా నవంబర్ 2022లో మొత్తం అమ్మకాలలో 14 శాతం పెరుగుదల సాధించింది మారుతీ సుజుకి. గత ఏడాది ఇదే కాలంలో 1,39,18 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది నవంబర్‌లో 1,59,044 యూనిట్లను విక్రయించింది. దేశీయ విక్రయాలు 1,35,055 యూనిట్లుగా ఉన్నాయి. కాంపాక్ట్ సెగ్మెంట్ (స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో , డిజైర్) అమ్మకాలు గతేడాది నవంబర్‌లో 57,019 యూనిట్ల నుంచి 72,844 యూనిట్లకు పెరిగాయి. మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలు 1,554 యూనిట్లుగా ఉండగా, యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్ (విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎర్టిగా) అమ్మకాలు ఈ ఏడాది నవంబర్‌లో 32,563 యూనిట్లకు పెరిగాయి. -
భారత్‌లో వన్ అండ్ ఓన్లీ గుర్తింపు.. మారుతీ సుజుకీ సొంతం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ రెండేళ్లలో ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలో 50 శాతం వాటాను అందుకోవచ్చని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం 42 శాతం వాటా ఉందని సంస్థ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. మారుతీ కంపెనీ 2,250 నగరాల్లో తన కార్యకలాపాలను విస్తరించి ఉంది. దేశంలో 3,500వ ఔట్‌లెట్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘మార్చి నాటికి కొత్తగా రెండు ఎస్‌యూవీలను పరిచయం చేస్తాం. ఎస్‌యూవీల్లో ప్రస్తుతం కంపెనీకి 14.5 శాతం వాటా ఉంది. దీనిని పెంచుకోవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకుంటాం. కంపెనీ తొలి ఎలక్ట్రిక్ కారు 2024–25లో రంగ ప్రవేశం చేయనుంది. ఈవీల కంటే ముందుగా హైబ్రిడ్ కార్లకు ఆదరణ పెరుగుతుంది. చార్జింగ్ మౌలిక వసతులు ఉంటేనే వినియోగదార్లలో ఈవీల పట్ల విశ్వాసం ఉంటుంది. 2030 నాటికి ఈవీల వాటా 15–17 శాతానికి చేరుకోవచ్చని అంచనా. ఇక అమ్మకాల పరంగా హైదరాబాద్ మూడవ స్థానంలో ఉంది’ అని వివరించారు. మారుతీ సుజుకీ మొత్తం విక్రయాల్లో తమ వాటా 2 శాతమని వరుణ్ మోటార్స్ ఎండీ వరుణ్ దేవ్ వెల్లడించారు. భారత్‌లో ఇంత విస్తృత నెట్‌వర్క్‌ను సాధించిన ఏకైక కార్ కంపెనీగా మారుతీ సుజుకీ గుర్తింపు సంపాదించుకుంది. చదవండి: వచ్చే ఏడాదిలోనూ ఉద్యోగాల్లో కోతలు -
అదిరే లుక్.. సీఎన్జీలో బాలీనో, ఎక్స్ఎల్6 కార్లను విడుదల చేసిన మారుతీ సుజుకీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బలీనో, మల్టీపర్పస్ వెహికిల్ ఎక్స్ఎల్6 మోడళ్లను ఎస్–సీఎన్జీ వేరియంట్లో ప్రవేశపెట్టింది. ఈ వారం నుంచే విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఎక్స్‌షోరూంలో ధర రూ.8.28 లక్షల నుంచి రూ.12.24 లక్షల మధ్య ఉంది. సీఎన్జీ వేరియంట్లో 2021–22లో కంపెనీ వివిధ మోడళ్లలో 2.3 లక్షల యూనిట్లను విక్రయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవి 4 లక్షల యూనిట్లకు చేరుకుంటాయని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. తాజా నిర్ణయంతో 16కుగాను 12 మోడళ్లలో సీఎన్జీ వేరియంట్లు ఉన్నాయని గుర్తు చేశారు. 1.23 లక్షల యూనిట్ల సీఎన్జీ వెహికిల్స్ కోసం ఆర్డర్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ విభాగంలో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 30–32 వేల యూనిట్లు. 2010 నుంచి ఇప్పటి వరకు భారత్‌లో కంపెనీకి చెందిన 11.4 లక్షల సీఎన్జీ వాహనాలు రోడ్డెక్కాయి. బలీనో, ఎక్స్ఎల్6 మోడళ్లను నెక్సా షోరూంల ద్వారా మారుతీ సుజుకీ విక్రయిస్తోంది. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి.. లాభాల్లో మారుతీ స్పీడ్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం నాలుగు రెట్లు జంప్‌చేసి రూ. 2,112 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 487 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 20,551 కోట్ల నుంచి రూ. 29,942 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 5,17,395 వాహనాలను విక్రయించింది. వీటిలో దేశీయంగా 4,54,200 వాహనాలను విక్రయించగా.. 63,195 యూనిట్లు ఎగుమతి చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాల కొరత కారణంగా ఉత్పత్తిలో 35,000 వాహనాలవరకూ ప్రభావం పడినట్లు మారుతీ వెల్లడించింది. ఇందువల్లనే గత క్యూ2 లోనూ మొత్తం వాహన విక్రయాలు 3,79,541 యూనిట్లకు పరిమితమైనట్లు ప్రస్తావించింది. పండుగల ప్రభావం ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత, కోవిడ్–19 సవాళ్లు గతంలో వృద్ధిని దెబ్బతీసినప్పటికీ ప్రస్తుతం పరిస్థితులు జోరందుకున్నట్లు వర్చువల్‌గా నిర్వహించిన విలేకరుల సమావేశంలో కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. ప్రధానంగా పండుగల సీజన్ అమ్మకాలకు జోష్‌నిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో కస్టమర్ల పెండింగ్ ఆర్డర్లు 4.12 లక్షల యూనిట్లకు చేరినట్లు వెల్లడించారు. వీటిలో ఇటీవల ప్రవేశపెట్టిన గ్రాండ్ వితారా, కొత్త బ్రెజ్జా తదితర మోడళ్ల కోసమే 1.3 లక్షల ముందస్తు బుకింగ్స్ నమోదైనట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ విడిభాగాల లభ్యత, వ్యయ నియంత్రణ, ఉత్తమ ధరలు వంటి అంశాలపై దృష్టిపెట్టినట్లు వివరించారు. తద్వారా మెరుగైన మార్జిన్లు సాధించే వీలున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో మొత్తం 9,85,326 వాహనాలు విక్రయించగా.. పూర్తి ఏడాదిలో 20 లక్షల యూనిట్ల అమ్మకాలు సాధించే లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు భార్గవ తెలియజేశారు. గతేడాది ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో 7,33,155 వాహనాలను మాత్రమే విక్రయించింది. ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 6 శాతం జంప్‌చేసి రూ. 9,548 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 9,550 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకడం విశేషం! చదవండి: Elon Musk: ఎలాన్ మస్క్‌కు షాక్.. ట్విట్టర్లో యాడ్స్ బంద్! -
ఫలితాల్లో మారుతి అదుర్స్: ఏకంగా నాలుగు రెట్ల లాభం
సాక్షి,ముంబై: దేశీయ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ క్యూ2 ఫలితాల్లో అదరగొట్టింది. సెప్టెంబరు త్రైమాసికంలో నికర లాభం 4 రెట్లు పెరిగి రూ.2,062 కోట్లకు చేరుకుందని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 475.30 కోట్ల లాభంతో పోలిస్తే నాలుగు రెట్లు ఎగిసింది. (షావోమి యూజర్లకు షాకింగ్ న్యూస్: ఆ సేవలిక బంద్!) గత ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్మకాలు రూ.19,297.80 కోట్లనుంచి రూ.28,543.50 కోట్లకు వార్షిక ప్రాతిపదికన 47.91 శాతం వృద్ధి చెందాయి. ఆపరేటింగ్ ఎబిట్ గత ఏడాది త్రైమాసికంలో రూ.98.80 కోట్ల నుంచి 20.71 రెట్లు పెరిగి రూ.2,046.30 కోట్లకు చేరుకుంది. అలాగే ఈ త్రైమాసికంలో ఎబిట్ మార్జిన్ 670 బేసిస్ పాయింట్లు పెరిగి 0.5 శాతం నుంచి 7.2 శాతానికి చేరుకుంది. ఖర్చు తగ్గింపు ప్రయత్నాలు, అనుకూలమైన విదేశీ మారకపు వైవిధ్యం తమకు లాభించిందని పేర్కొంది. అయితే ఎలక్ట్రానిక్ భాగాల కొరత కారణంగా ఈ త్రైమాసికంలో దాదాపు 35,000 వాహనాల ఉత్పత్తిపై ప్రభావం చూపిందని కంపెనీ తెలిపింది. ఈ త్రైమాసికం ముగిసే సమయానికి 4.12 లక్షల వాహనాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో 1.3 లక్షల వాహనాల ప్రీ-బుకింగ్‌లు ఇటీవల లాంచ్ చేసిన మోడళ్లకు సంబంధించినవేనని మారుతి వెల్లడించింది. ఈ ఫలితాల జోష్‌తో మారుతి సుజుకి షేరు ఆరుశాతం ఎగిసి 9,548 వద్ద ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. -
ఆరంభ లాభాలు పోయినా భేష్, మారుతి టాప్ గెయినర్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. అయితే ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గిన సెన్సెక్స్ 60 వేల దిగువన స్థిరపడింది. సెన్సెక్స్ 203 పాయింట్లు ఎగిసి 59959 వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 17786 వద్ద క్లోజ్ అయింది. వరుసగా రెండో సెషన్లోనూ విజయ పరంపరను కొనసాగించాయి. అయితే గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు టెక్ దిగ్గజాలనిరాశాజనక ఫలితాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా దేశీయ సూచీలు గరిష్ట స్థాయిలను కోల్పోయాయి.. లాభాల జోష్‌తో మారుతి సుజుకి ఏకంగా 5 శాతం ఎగిసింది. రిలయన్స్, అపోలో హాస్పిటల్స్, ఎన్టీపీసీ, హీరోమోటా కార్ప్ భారీగా లాభపడగా, టెక్ ఎం, టాటా స్టీల్, గ్రాసిం, సన్ ఫార్మా, దివీస్ లాబ్స్ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయికూడా లాభాలను కోల్పోయి 82.47 స్థాయి వద్ద ముగిసింది. -
మారుతి ఎస్-క్రాస్ ఔట్: వినియోగదారులకు షాకింగ్ న్యూస్
సాక్షి, ముంబై: దేశీయ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకికి చెందిన ఫ్టాగ్‌షిప్ కారు మారుతి ఎస్-క్రాస్ కారును నిలిపివేసింది. గ్రాండ్ విటారాకు కంటే ముందు తీసుకొచ్చిన నెక్సా తొలి కారుఎస్-క్రాస్‌ను మారుతి నెక్సా వెబ్సైట్ నుంచి తొలగించింది. అంటే మార్కెట్‌నుంచి నిలివేసింది. 2015లో నెక్సా ఫస్ట్ అండ్ ఫ్లాగ్షిప్ కార్గా దీన్ని లాంచ్ చేసింది. (‘ప్లీజ్..కొనండి’ సేల్స్‌మేన్‌లా ఎలాన్ మస్క్ లేటెస్ట్ ట్వీట్ సంచలనం) కాంపాక్ట్ ఎస్యూవీ గ్రాండ్ విటారా లాంచ్, ధర ప్రకటన తర్వాత మారుతి తన అధికారిక నెక్సా వెబ్సైట్ నుండి ఎస్-క్రాస్‌ను తీసివేసింది. గ్రాండ్ విటారా ఇప్పటికే 60వేల బుకింగ్‌లను పొందింది. దీనికి 28 వారాల కంటే ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంది. తాజాగా మారుతి ఎస్-క్రాస్ ప్లేస్‌ను 2022 గ్రాండ్ విటారా ఎస్యూవీ ఆక్రమించింది. 1.6-లీటర్, 1.3-లీటర్ డీజిల్ ఇంజీన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో S-క్రాస్ ముందుగా మార్కెట్లోకి వచ్చింది. తర్వాత డీజిల్ వెర్షన్‌ను ఆపేసి, 2020లో పెట్రోల్ వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ సెగ్మెంట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ దూసుకుపోవడంతో S-క్రాస్ అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. ఈ సంవత్సరం జూలై, ఆగస్టులో ఒక్క కారు కూడా విక్రయించలేకపోయారు. ఈ నేపథ్యంలో భారత్ మార్కెట్లో S-క్రాస్ అమ్మకాలు నిలిపివేస్తున్నట్టు మారుతి ప్రకటించింది. గ్రాండ్ విటారాతో మిడ్-సైజ్ ఎస్యూవీ మార్కెట్లో పట్టు నిలుపుకోవాలని మారుతి భావిస్తోంది. క్రెటా, సెల్టోస్‌కు రానున్న రోజుల్లో ఇది గట్టి పోటీ ఇస్తుందని మారుతి అంచనా వేస్తోంది. (క్లిక్ చేయండి: గ్రాండ్ విటారా లాంచ్.. స్టైలిష్ లుక్, మిగతా కంపెనీలకు గట్టి పోటీ గురూ!) -
మారుతి బంపర్ ఆఫర్స్: అన్ని మోడల్స్‌పై ఫెస్టివ్ డిస్కౌంట్స్
సాక్షి, ముంబై: దేశీయ టాప్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి తన కస్టమర్ల కోసం భారీ ఫెస్టివ్ ఆఫర్లను అందిస్తోంది. సీఎన్జీ మోడల్ సహా, పలు కార్ల మోడళ్లపై సుమారు రూ. 56,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అరేనా షోరూమ్‌లు ఈ (అక్టోబర్) నెలలో తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంటాయి. ఇందులో కార్పొరేట్, క్యాస్, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మారుతీ సుజుకి ఆల్టో 800, స్విఫ్ట్ ,వ్యాగన్-ఆర్, సెలెరియో, డిజైర్ సహా పలు కార్లు ఇపుడు తగ్గింపు ధరల్లో లభ్యం. మారుతి సుజుకి డిజైర్ మారుతి సుజుకి ఏఎంటీ వెర్షన్లపై రూ. 52,000 దాకా తగ్గింపు అందిస్తోంది. ఇందులో రూ. 35,000 నగదు తగ్గింపు, రూ. 7,000 కార్పొరేట్ డిస్కౌంట్లు రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్‌లు ఉన్నాయి. అలాగే మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ కార్లపై రూ. 17,000 తగ్గింపు లభ్యం. మారుతీ సుజుకి S-ప్రెస్సో రూ. 35,000 నగదు తగ్గింపు. రూ. 6,000 కార్పొరేట్, రూ. 15,000 ఎక్స్చేంజ్ ప్రోత్సాహకాలున్నాయి. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో S Presso హై-రైడింగ్ హ్యాచ్‌బ్యాక్‌కు మొత్తం తగ్గింపును రూ. 56,000కి తగ్గింపు లభిస్తుంది. అలాగే S ప్రెస్సో AMT మోడల్లకు మొత్తం రూ. 46వేలు డిస్కౌంట్ లభ్యం. మారుతీ సుజుకి స్విఫ్ట్ అక్టోబర్ నెలలో, మారుతి సుజుకి స్విఫ్ట్ యొక్క ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (AMT) వెర్షన్లు రూ. 47,000 మొత్తం ప్రయోజనాలకు అర్హమైనవి, స్విఫ్ట్ యొక్క మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్లు రూ. 30,000 విలువైన మొత్తం ప్రయోజనాలకు అర్హులు. ఆల్టో 800కి మొత్తం రూ. 36,000 తగ్గింపు ఉంటుంది. మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ మారుతి సుజుకి డ్యూయల్‌జెట్ టెక్నాలజీతో వచ్చిన రెండు ఎకనామిక్ పెట్రోల్ కార్ల (1.0 ,1.2 లీటర్లు) వ్యాగన్ ఆర్ కొనుగోలుదారులు మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మోడల్‌లలో రూ. 31,000 ఆదా చేయవచ్చు. అదనంగా, మారుతీ రూ. 15,000 ధర తగ్గింపును కూడా అందిస్తోంది. సీఎన్జీ బేస్ మోడల్, టాప్-టైర్ వేరియంట్‌పై రూ. 5000 తగ్గింపు. మారుతి సుజుకి ఆల్టో K10 కొత్తగా విడుదల చేసిన ఆల్టో కె10 బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ ఆటోమేటిక్ మరియు మాన్యువల్ వెర్షన్లపై రూ.39,500 తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 17,500 విలువైన రూ. 7,000 నగదు తగ్గింపు , రూ. 15,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ రివార్డు ఉన్నాయి. -
సుజుకీ గ్రాండ్ విటారా లాంచ్.. స్టైలిష్ లుక్, మిగతా కంపెనీలకు గట్టి పోటీ గురూ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా నుంచి మధ్యస్థాయి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ గ్రాండ్ విటారా భారత మార్కెట్లో అడుగుపెట్టింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.10.45 లక్షల నుంచి రూ.19.65 లక్షల మధ్య ఉంది. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. ఆరు వేరియంట్లలో మాన్యువల్, ఆటోమేటిక్ మోడల్స్‌లో లభిస్తుంది. మైలేజీ వేరియంట్‌నుబట్టి లీటరుకు 21.1 కిలోమీటర్లు, స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ 27.97 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా హ్యారియర్‌కు ఇది పోటీ ఇవ్వనుంది. 57 వేల పైచిలుకు బుకింగ్స్ నమోదయ్యాయని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ ఈ సందర్భంగా తెలిపారు. మారుతీ సుజుకీ, టయోటా సంయుక్తంగా ఈ కారును అభివృద్ధి చేశాయి. మారుతీ సుజుకీ సబ్‌స్క్రైబ్ విధానంలో నెలకు రూ.27 వేల చందాతో గ్రాండ్ విటారా సొంతం చేసుకోవచ్చు. చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! -
చిన్న కార్ల అమ్మకాలు పెరుగుతాయి..
న్యూఢిల్లీ: మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో చిన్న కార్ల వాటా తగ్గుతున్నప్పటికీ .. పరిమాణంపరంగా చూస్తే మాత్రం విక్రయాలు పెరుగుతాయని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. గతంలో మొత్తం ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో చిన్న కార్ల వాటా 45–46 శాతం వరకూ ఉండేదని, గతేడాది 38 శాతానికి పడిపోయిందని వివరించారు. ఎస్‌యూవీలు 40 శాతం వాటాను దక్కించుకున్నాయని శ్రీవాస్తవ చెప్పారు. అయితే సంఖ్యాపరంగా చూస్తే చిన్న కార్ల విభాగం ఇప్పటికీ భారీ స్థాయిలోనే ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 30.7 లక్షల కార్లు అమ్ముడు కాగా వాటిలో దాదాపు 40 శాతం వాటా హ్యాచ్బ్యాక్లదేనని (దాదాపు 12 లక్షలు), మరో 12.3 లక్షల ఎస్‌యూవీలు (సుమారు 40 శాతం) అమ్ముడయ్యాయని శ్రీవాస్తవ వివరించారు. ఆ రకంగా చుస్తే పరిమాణంపరంగా రెండింటికీ మధ్య భారీ వ్యత్యాసమేమీ లేదని పేర్కొన్నారు. యువ జనాభా, కొత్తగా ఉద్యోగంలోకి చేరే యువత తొలిసారిగా కొనుగోలు చేసేందుకు చిన్న కార్లనే ఎంచుకునే అవకాశాలు ఉండటం ఈ విభాగానికి దన్నుగా ఉండగలదని ఆశిస్తున్నట్లు శ్రీవాస్తవ చెప్పారు. అయితే, ఈ విభాగం కొనుగోలుదారులు ఎక్కువగా అందుబాటు ధరకు ప్రాధాన్యమిస్తారని, అదే అంశం చిన్న కార్లకు కొంత సవాలుగా ఉంటోందని పేర్కొన్నారు. కొత్త ప్రమాణాలను పాటించాల్సి వస్తుండటం, కమోడిటీ ధరలు పెరుగుతుండటం, కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టాల్సి వస్తుండటం తదితర అంశాల కారణంగా.. చిన్న కార్లు అందుబాటు రేటులో లభించడం తగ్గుతోందని ఆయన వివరించారు. ‘గత రెండు మూడేళ్లలో ఆదాయం కన్నా ఎక్కువగా వాహనాల ధరలు పెరిగిపోయాయి. దీంతో అందుబాటులో లభ్యతనేది తగ్గిపోయింది. అందుకే ఎస్‌యూవీలతో పోలిస్తే ఈ విభాగం వాటా తగ్గిందని భావిస్తున్నాం‘ అని శ్రీవాస్తవ వివరించారు. చదవండి: బిగ్ అలర్ట్: అమలులోకి ఆధార్ కొత్త రూల్..వారికి మాత్రం మినహాయింపు! -
ఆల్ న్యూ ఆల్టో కే10- 2022 వచ్చేసింది.. మోర్ ఎనర్జీ ఫీచర్స్‌తో
సాక్షి, ముంబై: మోస్ట్ ఎవైటెడ్ మారుతి సుజుకి ఆల్టో K10 2022 మోడల్ వచ్చేసింది. నేడు (గురువారం, ఆగస్టు 18) మారుతి సుజికి ఇండియా లాంచ్ చేసింది. మారుతి చల్ పడీ అంటూ ఆల్టో K10 2022 ను తీసుకొచ్చింది. రెడ్ అండ్ బ్లూ రంగుల్లో ఆవిష్కరించింది. ఆల్టో K10 2022 కేవలం ప్రారంభ రూ. 3, 99,000 గా కంపెనీ నిర్ణయించింది. మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ న్యూ వెర్షన్ ఆల్టో K10 2022 లభించనుంది. (ప్రత్యేక డిపాజిట్ స్కీమ్: లక్ష డిపాజిట్ చేస్తే దాదాపు లక్షా 28 వేలు!) మారుతి సుజుకి ఇప్పటికే కొత్త 2022 ఆల్టో కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. ఆసక్తిగల కొనుగోలు దారులు ఆల్టోను రూ. 11,000తో బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 మారుతి సుజుకి ఆల్టో 800 ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌తో పాటు కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. (ఇది చదవండి: నా 30 ఏళ్ల అనుభవంలో తొలిసారి: ఎయిర్టెల్ చైర్మన్ ఆశ్చర్యం, ప్రశంసలు) కాగా మారుతి సుజుకి ఆల్టో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. కంపెనీ ఇప్పటి వరకు ఈ కారును 40 లక్షల యూనిట్లకు పైగా విక్రయించింది. ఆల్టో ఫస్ట్ జనరేషన్ 2000లో ఆల్టో 800గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10కి రెనాల్ట్ నుండి మాత్రమే పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. (రియల్మీ 5జీ ఫోన్, ఇయర్ బడ్స్ లాంచ్: ఇంత తక్కువ ధరలోనా సూపర్!)