గ్రాండ్ ఐ 10కి పోటీగా మారుతి కొత్త కారు | Maruti Suzuki India to launch rival to Hyundai's Grand i10 early next year | Sakshi
Sakshi News home page

గ్రాండ్ ఐ 10కి పోటీగా మారుతి కొత్త కారు

Published Sun, Aug 11 2013 11:15 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM

Maruti Suzuki India to launch rival to Hyundai's Grand i10 early next year

మారుతి సుజుకీ ఇండియా వచ్చే ఏడాది ఆరంభంలో తన కొత్త మోడల్ కారును మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. హుందయ్ త్వరలో గ్రాండ్ ఐ 10 కారును విడుదలచేయనున్న నేపథ్యంలో దానికి పోటీగా మారుతి కొత్త మోడల్ కారు తయారుచేస్తోంది. మార్కెట్లో పోటీని తట్టుకుని తమ వాటా పెంచుకునేందుకు మారుతి ఈదిశగా అడుగులు వేస్తోంది.

తాము విడుదల చేయబోయే కొత్త మోడల్ వేగనార్ ఆర్, స్విఫ్ట్కు మధ్యలో ఉంటుందని మారుతి సుజుకీ ఇండియా వర్గాలు వెల్లడించాయి. దీన్ని వచ్చే ఏడాది జరగనున్న ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనున్నారు. ఫిబ్రవరి 6 నుంచి 12 వరకు గ్రేటర్ నోయిడాలో ఆటో ఎక్స్పో జరగనుంది. మారుతి స్విఫ్ట్కు పోటీగా గ్రాండ్ ఐ 10 కారును సెప్టెంబర్ 3న విడుదల చేయాలని హుందయ్ భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement