దేశవ్యాప్తంగా ఇంధన ధరలు సెంచరీ దాటేసి... తగ్గేదేలే అంటూ.. పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులకు చుక్కలు కన్పిస్తున్నాయి. ఇంధన ధరలు పెరగడంతో కొంత మంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గుచూపుతున్నారు. కొందరైతే ఎలక్ట్రిక్ వాహనాలు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుందని చెప్పి సంప్రాదాయి శిలాజ ఇంధన వాహనాలనే కొనుగోలు చేస్తున్నారు.
మనలో చాలా మంది మైలేజీ ఎక్కువ ఇచ్చే వాహనాలపైనే మొగ్గుచూపుతాం. అంతేందుకు ఎవరైనా కొత్త వాహనాలను కొనుగోలు చేస్తే మొదట మనం వారిని అడిగే ప్రశ్న...మైలేజ్ ఎంత ఇస్తుందని..? ఇంధన ధరల మోత తగ్గనప్పటికీ...మైలేజ్ ఎక్కువ ఇచ్చే వాహనాలను కొనుగోలు చేయడంతో కాస్తనైనా ఉపశమనం కలిగే వీలు ఉంది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్‌ఏఐ) స్టాండర్స్ ప్రకారం.. భారత మార్కెట్‌లో తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లపై ఓ లుక్కేయండి.
మార్కెట్లలోని టాప్-10 మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే...!
1. హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ డీజిల్ వేరియంట్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఉత్తమ మైలేజీని అందిస్తోంది. గ్రాండ్ ఐ 10 నియోస్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో డీజిల్ ఇంజిన్‌తో ఎక్కువ మైలేజ్ ఇచ్చే అతికొద్ది కార్లలో ఇది ఒకటి. ARAI రికార్డుల ప్రకారం... డీజిల్ వేరియంట్ 25 kmpl వరకు మైలేజీ, పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్21 kmpl మైలేజీను అందిస్తోంది.
2. మారుతి సుజుకి స్విఫ్ట్
మారుతి స్విఫ్ట్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 23 kmpl కంటే కొంచెం ఎక్కువ, ఆటోమేటిక్ వెర్షన్ 23.76 kmpl రేంజ్‌ను ఇస్తోంది.
3. హ్యుందాయ్ i20
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో, హ్యుందాయ్ i20 అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. ఈ కారులో అద్భుతమైన ఫీచర్సే కాకుండా గొప్ప మైలేజ్ ఈ కారు సొంతం. ARAI ప్రకారం...హ్యుందాయ్ i20 డీజిల్ వేరియంట్ 25.2 kmpl, పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ 20.35 kmpl రేంజ్‌ను ఇస్తోంది.
4. మారుతి బాలెనో
ఇటీవలి కాలంలో హ్యుందాయ్ ఐ 20 మైలేజీకు సమానంగా మారుతి బాలెనో అందిస్తోంది. ARAI ప్రకారం... బాలెనో పెట్రోల్ ఇంజన్‌తో 23. 87 kmpl రేంజ్ వస్తోంది.
5. హ్యుందాయ్ ఆరా
సబ్-కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా ఆరా నిలుస్తోంది. ARAI డేటా ప్రకారం...ఆరా డీజిల్ మాన్యువల్ వేరియంట్ 25 kmpl మైలేజీని అందిస్తుంది.సీఎన్‌జీ వేరియంట్ కిలోకు 28 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
6.మారుతి డిజైర్
మారుతి డిజైర్ కూడా సబ్-కాంపాక్ట్ సెడాన్ విభాగంలో ఇది కూడా అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 23.26 kmpl మైలేజీ, ఆటోమేటిక్ వెర్షన్ 24.12 kmpl మైలేజీను అందిస్తోంది.
7. కియా సొనెట్
సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అత్యధికంగా కొనుగోలు చేయబడిన మోడల్ కియా సోనెట్. ARAI సర్టిఫికేట్ ప్రకారం... సోనేట్ డీజిల్ వేరియంట్ 24 kmpl మైలేజీను, పెట్రోల్ వేరియంట్ 18 kmpl ను అందిస్తోంది.
8. హ్యుందాయ్ వెన్యూ
హ్యూందాయ్ వెన్యూ సుమారు 23.4 kmpl మైలేజీను అందిస్తోంది.
9. హ్యుందాయ్ క్రెటా
మిడ్ రేంజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటాకు సాటి లేదు. క్రెటా డీజిల్ మాన్యువల్ వేరియంట్ 21 kmpl అందిస్తోంది.
10. హ్యూందాయ్ వెర్నా
ప్రీమియం సెడాన్ విభాగంలో హ్యుందాయ్ వెర్నా డిజీల్ వేరియంట్ 25 కెఎమ్‌పీఎల్, పెట్రోల్ వేరియంట్ 18.4 కెఎమ్‌పీఎల్‌ను అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment