mileage
-
తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్: ఇదిగో టాప్ 5 బైకులు
మార్కెట్లో లక్ష రూపాయల నుంచి రూ.70 లక్షల వరకు బైకులు అందుబాటులో ఉన్నాయి. అయితే.. చాలామంది ధరను మాత్రమే కాకుండా మైలేజ్‌ను దృష్టిలో ఉంచుకుని టూ వీలర్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ కథనంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైకులు గురించి వివరంగా తెలుసుకుందాం.బజాజ్ ఫ్రీడమ్ 125'బజాజ్ ఫ్రీడమ్ 125' అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ బైక్. దీని ధర రూ.89,997 నుంచి రూ. 1.09 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ బైకులోని 125 సీసీ ఇంజిన్ 9.3 బిహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇందులో సీఎన్జీ, పెట్రోల్ కోసం రెండు ఫ్యూయల్ ట్యాంకులు ఉంటాయి. ఈ బైక్ 65 కిమీ/లీ మైలేజ్ ఇస్తుందని సమాచారం.టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల జాబితాలో 'టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్' ఒకటి. ఈ బైక్ ధరలు రూ. 75541 నుంచి రూ. 78541 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ బైకులో ఎకోథ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (ETFi) టెక్నాలజీ ఉంది. కాబట్టి ఇది సాధారణ మోడల్ కంటే కూడా ఎక్కువ పనితీరును అందిస్తుంది. ఈ బైకులోని 110 సీసీ ఇంజిన్ 8 బీహెచ్పీ పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 86 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.బజాజ్ ప్లాటినా 110రూ. 71,354 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభిస్తున్న బజాజ్ ప్లాటినా 110 బైక్ 70 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 115 సీసీ ఇంజిన్ 8.4 బీహెచ్పీ పవర్, 9.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైకులో ఎల్ఈడీ డీఆర్ఎల్, హ్యాండ్ గార్డ్లు, వైడ్ ఫుట్‌పెగ్‌లు, 5 స్పీడ్ గేర్‌బాక్స్ వంటివి ఉన్నాయి.హోండా సీడీ 110 డ్రీమ్ డీలక్స్హోండా సీడీ 110 డ్రీమ్ డీలక్స్ కూడా ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల జాబితాలో ఒకటి. రూ. 74401 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న ఈ బైక్ 110 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది జపనీస్ ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ (ESP) టెక్నాలజీ పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ బైక్ మైలేజ్ 65 కిమీ/లీ అని తెలుస్తోంది.ఇదీ చదవండి: 10 రోజుల్లో 10000 మంది కొన్న కారు ఇదే..హీరో స్ప్లెండర్ ప్లస్భారతదేశంలో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న బైకుల జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగ్గ బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్. ఈ బైక్ ధరలు రూ. 75441 నుంచి రూ. 78286 మధ్య ఉన్నాయి. 100 సీసీ ఇంజిన్, ఐ3ఎస్ టెక్నాలజీ కలిగిన ఈ బైక్ 80.6 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. కాబట్టి దీనిని మైలేజ్ రాజు అని కూడా పిలుస్తారు. -
ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ బైకులు: ధర లక్ష కంటే తక్కువే..
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మంచి మైలేజ్ ఇచ్చే బైకులకు కొదువే లేదు. అయితే రూ.1 లక్ష కంటే తక్కువ ధర వద్ద అందుబాటులో ఉన్న ఐదు ఉత్తమ బైకులు గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.టీవీఎస్ స్పోర్ట్టీవీఎస్ కంపెనీకి చెందిన స్పోర్ట్ బైక్ అత్యధిక మైలేజ్ ఇచ్చే టూ వీలర్స్ జాబితాలో ఒకటిగా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 59,881 కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 71,383 (ఎక్స్ షోరూమ్). ఇది 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ముందు, వెనుక డ్రమ్ బ్రేక్స్ కలిగిన ఈ బైక్ 80 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది.బజాజ్ సీటీ 110ఎక్స్రూ. 70,176 ప్రారంభ ధర (ఎక్స్ షోరూమ్) వద్ద లభించే బజాజ్ సీటీ 110ఎక్స్ కూడా మంచి మైలేజ్ అందించే బెస్ట్ బైక్. ఇది 70 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 115 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 8.48 హార్స్ పవర్, 9.81 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ ఫోర్ స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.హీరో హెచ్ఎఫ్ డీలక్స్హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ప్రారంభ ధర రూ. 59,998. సెల్ఫ్-స్టార్ట్ ఆప్షన్ కలిగిన టాప్ వేరియంట్ ధరలు రూ. 69,018 (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 7.91 హార్స్ పవర్, 8.05 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఫోర్ స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది 70 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.టీవీఎస్ రేడియన్రూ. 59,880 నుంచి రూ. 81,394 మధ్య (ఎక్స్ షోరూమ్) లభించే టీవీఎస్ రేడియన్ బైక్ 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.08 హార్స్ పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది ఫోర్ స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఈ బైక్ 68.6 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.ఇదీ చదవండి: 90వేల కార్లు వెనక్కి: హోండా కీలక ప్రకటనహోండా ఎస్పీ 125హోండా ఎస్పీ 125 ధరలు రూ. 87,468 నుంచి రూ. 91,468 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ బైక్ 124 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 10.72 Hp, 10.9 Nm టార్క్ అందిస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ కలిగిన ఈ బైక్ రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్స్ పొందుతుంది. ఈ బైక్ 60 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. -
చెప్పిన మైలేజీ రాలేదు.. కంపెనీకి షాకిచ్చిన కస్టమర్
ప్రముఖ కార్ల కంపెనీ మారుతీ సుజుకీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు ఓ కస్టమర్. తాను కొన్నకారుకు కంపెనీ చెప్పిన మైలేజీ రాలేదని వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. చాలా ఏళ్ల తర్వాత ఆ కస్టమర్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. కస్టమర్‌కు రూ. లక్ష చెల్లించాలని కంపెనీని ఎన్సీడీఆర్సీ ఆదేశించింది. వివరాలోకి వెళ్తే.. 2004లో రాజీవ్ శర్మ అనే కస్టమర్ లీటరుకు 16-18 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందన్న ప్రకటనలతో ఆకర్షితుడై మారుతీ సుజుకీ కారును కొనుగోలు చేశారు. తీరా కొన్న తర్వాత ఆ కారు లీటరుకు 10.2 కిలోమీటర్లు మాత్రమే మైలేజీ ఇస్తుండటంతో అసంతృప్తి చెందిన రాజీవ్ శర్మ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్‌ను ఆశ్రయించారు. రూ.4 లక్షల మొత్తాన్ని వడ్డీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు, బీమాతో సహా కంపెనీ నుంచి ఇప్పించాలని కోరారు. కస్టమర్ అభ్యర్థనను కొంతమేరకు పరగణనలోకి తీసుకున్న జిల్లా ఫోరమ్ రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ నిర్ణయంపై మారుతీ సుజుకీ రాష్ట్ర కమిషన్‌కి అప్పీల్‌కు వెళ్లింది. అలా కేసు ఎన్సీడీఆర్సీకి చేరింది. ఇరు పక్షాలు లిఖితపూర్వక వాదనలు సమర్పించాయి. శర్మ తన వాదనను ఆగస్టు 7, 2023న సమర్పించగా, మారుతి సుజుకి నవంబర్ 2, 2023న స్పందించింది. మారుతీ సుజుకి ప్రకటన మైలేజ్ క్లెయిమ్‌లు తప్పుదారి పట్టించేవిగా, వినియోగదారుల హక్కులను ఉల్లంఘించేవిగా ఉన్నాయని పేర్కొంటూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) మునుపటి తీర్పులను సమర్థించింది. కస్టమర్‌కు రూ. లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది. -
వాహనంలో పెట్రోల్ ఉదయం పోయించాలా? రాత్రి పోయించాలా?..
పెట్రోల్, డీజిల్ వినియోగానికి సంబంధించి వినియోగదారులలో చాలా అపోహలు తలెత్తుతుంటాయి. కారు మైలేజీ పెంచుకునే ఉపాయాలు మొదలుకొని పెట్రోల్ ధర వరకూ చాలామందిలో నిత్యం చర్చలు జరుగుతుంటాయి. ఈ నేపధ్యంలో కొందరు వాహనంలో పెట్రోల్ పోయించేందుకు ప్రత్యేక సమయం ఉందని చెబుతూ, ఆ సమయంలోనే ఇంధనం పోయించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. పెట్రోల్ పోయించేందుకు ఉదయం తగిన సమయం అని చాలామంది చెబుతుంటారు. కొందరు దీనిని ఖండిస్తూ, రాత్రివేళ వాహనంలో పెట్రోల్ పోయించడం ఉత్తమం అని అంటుంటారు. ఇటువంటి పరిస్థితిలో పెట్రోల్ పోయించేందుకు తగిన సమయం ఏదనే ప్రశ్న మనలో తలెత్తుతుంటుంది. నిజానికి ఇటువంటి వాదనలో ఎంత వాస్తవం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వివరాలు వైరల్ అవుతుంటాయి. పైగా ఈ అంశానికి సంబంధించి ఇంటర్నెట్లో పలు ఆర్టికల్స్ కూడా కనిపిస్తుంటాయి. చదవండి: ఆ రోడ్డుపై ప్రయాణిస్తూ 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా! వీటిలో రాత్రివేళ వాహనంలో పెట్రోల్ పోయించకూడదని, తెల్లవారుజామునే పెట్రోల్ పోయిస్తే డబ్బులు ఆదా అవుతాయని, వాహనంలో అధికంగా పెట్రోల్ పడుతుందని చెబుతుంటారు. అయితే దీనిలో నిజం ఏమేరకు ఉన్నదో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి వేడి కారణంగా ఇంధనం విస్తరిస్తుంది. అందుకే ఉదయం తెల్లవారుతున్న సమయంలో వాహనంలో పెట్రోల్ పోయిస్తే, అధికంగా నిండుతుందని చెబుతుంటారు. అయితే దీనిలో వాస్తవం లేదని నిపుణులు తేల్చిచెప్పారు. ప్రపంచంలోని అత్యధిక ఇంధన స్టేషన్లలో భూమిలోపల ట్యాంకులలో పెట్రోల్ లేదా డీజిల్ రిజర్వ్ చేస్తుంటారు. ఫలితంగా ఇంధన ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి. పైగా ట్యాంకులకు అత్యధిక దళసరితో కూడిన మూతలు ఉంటాయి. ఈ విధంగా చూస్తే వాహనంలో ఏ సమయంలో పెట్రోల్ పోయించినా దానిపై ఉష్ణోగ్రత ప్రభావం పడదు. ఇందన సంకోచ, వ్యాకోచాలలో తేడా ఏర్పడదు. అందుకే ఉదయం వేళలో వాహనంలో పెట్రోల్ పోయించినప్పటికీ ఎటువంటి తేడా రాదు. తెల్లవారుజామున పెట్రోల్ పోయించడం వలన ప్రత్యేక ప్రయోజనం ఏమీ ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
సీఎన్జీ కారు కొనడానికి ఇదే మంచి సమయం - ఇదిగో టాప్ 5 బెస్ట్ కార్లు
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా.. ఎలక్ట్రిక్ & సీఎన్జీ కార్లు విడుదలవుతున్నాయి. భారతీయ విఫణిలో సీఎన్జీ కార్లకు డిమాండ్ భారీగానే ఉంది. ఈ తరుణంలో తక్కువ ధరలో సీఎన్జీ కొనాలనుకునే వారు ఈ బెస్ట్ కార్లను ఎంపిక చేసుకోవచ్చు. మారుతి సుజుకి ఆల్టో 800 సీఎన్జీ: మారుతి సుజుకి కంపెనీకి చెందిన ఆల్టో 800 మన జాబితాలో చెప్పుకోదగ్గ బెస్ట్ సీఎన్జీ కారు. ఈ మోడల్ ధర రూ. 5.13 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 30 కి.మీ/కేజీ మైలేజ్ అని తెలుస్తోంది. మార్కెట్లో తక్కువ ధర వద్ద లభించే వాహనాల్లో మారుతీ సుజుకీ 800 సీఎన్జీ ఉత్తమ మైలేజ్ అందిస్తుందని రుజువైంది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో సీఎన్జీ: ఎస్-ప్రెస్సో సీఎన్జీ కూడా మారుతి సుజుకి కంపెనీకి చెందిన బెస్ట్ సీఎన్జీ కారు. ఇది కేజీకి 32 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 6 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఎల్ఎక్స్ఐ వేరియంట్లో మాత్రమే సీఎన్జీ ఆప్షన్ లభిస్తుంది. ఇందులో 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 56 బీహెచ్పీ పవర్ 82 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మారుతి సుజుకి ఆల్టో కే10 సీఎన్జీ: రూ. 5.96 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద అందుబాటులో ఉన్న మారుతి సుజుకి ఆల్టో కే10 కేజీకి 34 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తూ ఉత్తమ సీఎన్జీ కారుగా నిలిచింది. ఇందులోని 1.0 లీటర్ కే10 సిరీస్ ఇంజిన్ 56 బీహెచ్పీ పవర్ 82 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మారుతి సుజుకి వాగన్ఆర్ సీఎన్జీ: వాగన్ఆర్ సీఎన్జీ ఉత్తమ మైలేజ్ అందించే మారుతి కంపెనీ బ్రాండ్. దీని ధర రూ. 6.43 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఒక కేజీ సీఎన్జీతో 34.05 కి.మీల మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 1.0 లీటర్ కే సిరీస్ ఇంజిన్ 56 బీహెచ్పీ పవర్, 82 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టాటా టియాగో ఐసీఎన్జీ: దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ కూడా ఉత్తమ CNG కార్లను అందిస్తోంది. ఈ విభాగంలో ఒకటైన టియాగో ఐసీఎన్జీ కేజీకి 26.49 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 6.44లక్షలు. టియాగో ఐసీఎన్జీలోని 1.2 లీటర్ ఇంజిన్ 72 బీహెచ్పీ పవర్, 95 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. ఇటీవలే భారతదేశంలో సీఎన్జీ ధరలు బాగా తగ్గుముఖం పట్టాయి. ఈ సమయంలో సీఎన్జీ కారు కొనాలనుకునే వారికి పైన చెప్పిన కార్లు మంచి ఎంపిక అవుతాయని భావిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాలను, సందేహాలను మాతో పంచుకోండి. -
కరెంటు బండి.. కొందాం పదండి
సాక్షి, అమరావతి: దేశమంతా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) ట్రెండ్ నడుస్తోంది. తక్కువ ఖర్చులో ఎక్కువ మైలేజీ ఇచ్చే ఈ వాహనాల పట్ల అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే ఈవీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఇవి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి. సహజంగానే ఏ రాష్ట్రంలో వాహనం తక్కువ రేటుకి వస్తుందో అక్కడ వాహనం కొని, అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకుని సొంత రాష్ట్రానికి తెచ్చుకుని వాడుకోవడం చాలా మందికి అలవాటు. పలువురు వాహన వ్యాపారులు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుంటారు. విద్యుత్ వాహనాలను కూడా ఇదే విధంగా తక్కువ రేటుకు లభించే రాష్ట్రంలో కొని తెచ్చుకోవచ్చు. ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కొత్త సెక్షన్ తెచ్చిన కేంద్రం దేశవ్యాప్తంగా ఈవీలకు కేంద్రం కొన్ని రాయితీలు ఇస్తోంది. దేశంలో ఆదాయ పన్ను చట్టాల ప్రకారం.. కార్లు లగ్జరీ ఉత్పత్తుల కిందకు వస్తాయి. అందువల్ల పౌరులు వీటి కోసం తీసుకునే రుణాలపై పన్ను ప్రయోజనాలను పొందలేరు. కానీ విద్యుత్ వాహనాల (ఈవీ) యజమానులను పన్నుల నుంచి మినహాయించేందుకు ఎనర్జీ ఎఫిషియెంట్ బిల్డింగ్ యాక్ట్‌లో 80 అనే కొత్త సెక్షన్‌ని కేంద్రం తీసుకువచి్చంది. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ జారీకి, పునరుద్ధరించడానికి చెల్లించాల్సిన రుసుము నుంచి ఈవీలకు మినహాయింపు ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2019లో తీసుకువచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్–2) పథకంలో ద్విచక్ర వాహనాలకు (రూ.1.5 లక్షల ధర వరకు) కిలోవాట్అవర్ (కేడబ్ల్యూహెచ్) బ్యాటరీ కెపాసిటీకి రూ.15 వేలు అందిస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లకు ప్రతి కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యానికి రూ.10 వేలు ప్రత్యక్ష ప్రోత్సాహకాన్ని ఇస్తోంది. అలాగే ఈవీలపై 5%జీఎస్టీని మాత్రమే వసూలు చేస్తోంది. అయితే ఇవి ఒక వ్యక్తికి ఒక వాహనం కొనుగోలుకే వర్తిస్తాయి. ఈ విషయంలో రాష్ట్రాలు తమ వెసులుబాటునిబట్టి వేర్వేరుగా రాయితీలు, ప్రోత్సాహకాలను సమకూరుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఈవీలకు ఇస్తున్న రాయితీలు ► ఏపీలో ఈవీలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి పూర్తి మినహాయింపు లభిస్తోంది. ద్విచక్ర వాహనాలకు రూ.15 వేలు, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు కిలోవాట్‌కు రూ.10 వేలు, బస్సులకు రూ.20 వేలు రాయితీలిస్తోంది. నగరాలు, జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు వేల ప్రాంతాలను గుర్తించింది. చార్జింగ్ స్టేషన్ల యజమానులకు రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించింది. ► ఢిల్లీ ప్రభుత్వం మొదటి వెయ్యి ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ రిజిస్ట్రేషన్లను మాత్రమే ప్రోత్సహిస్తోంది. ద్విచక్ర వాహనాలకు బ్యాటరీ సామర్థ్యం కేడబ్ల్యూహెచ్‌కు రూ.5 వేలు చొప్పున రూ.30 వేల వరకు అందిస్తోంది. ఇది రిజి్రస్టేషన్, రహదారి పన్ను మినహాయింపునకు అదనం. ► తెలంగాణ ప్రభుత్వం రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ ఖర్చులపై 100 శాతం మినహాయింపు ఇస్తోంది. మొదటి 2 లక్షల ద్విచక్ర వాహనాలు, 5 వేల నాలుగు చక్రాల వాహనాలు, 20 వేల త్రీవీలర్ ఆటోరిక్షాలకు రాయితీలను అందిస్తోంది. రాష్ట్రంలో బ్యాటరీ ఛార్జింగ్ సౌకర్యాలు ఉన్నాయి. మొదటి 500 బ్యాటరీ చార్జింగ్ పరికరాలపై 25 శాతం మూలధన రాయితీ ఇస్తోంది. పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్ విద్యుత్ టారిఫ్‌పై పదేళ్లపాటు డ్యూటీ మినహాయింపు ఉంటుంది. ► మహారాష్ట్రలోని అన్ని ఈవీలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులను ప్రభుత్వం మాఫీ చేసింది. మొదటి లక్ష ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ప్రతి కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కెపాసిటీకి రూ.5 వేలు ప్రోత్సాహం అందిస్తోంది. ► గుజరాత్ మొదటి 1.1 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన వినియోగదారులకు ప్రతి కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యంకు రూ.10 వేల వరకూ సబ్సిడీ ఇస్తోంది. మొదటి 10 వేల మందికి కేంద్రం ఇచ్చే రాయితీలను సమకూరుస్తోంది. ► మేఘాలయలో మొదటి 3,500 ద్విచక్ర వాహనాలకు ప్రతి కిలోవాట్‌కు రూ.10 వేల సబ్సిడీని అక్కడి ప్రభుత్వం అందిస్తోంది. మొదటి 2,500 నాలుగు చక్రాల వాహనాలకు కేడబ్ల్యూహెచ్‌కు రూ.4 వేలు ప్రోత్సాహకం ఇస్తోంది. ► అసోం ప్రభుత్వం మొదటి లక్ష ద్విచక్ర వాహనాలు, 75 వేల త్రిచక్ర, 25 వేల నాలుగు చక్రాల వాహనాలకు వచ్చే ఐదేళ్లలో వాణిజ్య, వ్యక్తిగత వినియోగానికి వాడుకునే వెసులుబాటు కలి్పస్తోంది. ఈ ఐదేళ్లూ రోడ్డు పన్ను రిజిస్ట్రేషన్ మినహాయింపు వర్తిస్తుంది. ► ఒడిశా 2025 వరకు పన్ను, రిజిస్ట్రేషన్ రుసుముల్లో 100% మినహాయింపును ప్రకటించింది. ► రాజస్థాన్‌లో 2 కేడబ్ల్యూహెచ్ వరకు బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈవీలకు రూ.5 వేలు సబ్సిడీ ఇస్తోంది. 2 నుంచి 4 కేడబ్ల్యూహెచ్ వరకు ఉంటే రూ.7 వేలు అందిస్తోంది. ఇక్కడ ఫోర్ వీలర్లకు ఎలాంటి రాయితీలు లేవు. ► పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈవీలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులను మాఫీ చేసింది. ► గోవా ప్రభుత్వం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదని ప్రకటించింది. -
మారుతీ సుజుకీ టూర్–ఎస్.. అత్యధిక మైలేజీ ఇచ్చే సెడాన్ ఇదే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ సరికొత్త టూర్–ఎస్ సెడాన్‌ను ప్రవేశపెట్టింది. ఎంట్రీ లెవెల్ సెడాన్స్ ట్యాక్సీల్లో అత్యధిక మైలేజీ ఇచ్చే కారు ఇదేనని కంపెనీ ప్రకటించింది. మైలేజీ సీఎన్జీ కేజీకి 32.12 కిలోమీటర్లు, పెట్రోల్ వేరియంట్ లీటరుకు 23.15 కిలోమీటర్లు ఇస్తుందని తెలిపింది. పాత సీఎన్జీ వేరియంట్‌తో పోలిస్తే 21 శాతం అధిక మైలేజీ. అత్యాధునిక 1.2 లీటర్ కె–సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజన్‌ను పొందుపరిచారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, స్పీడ్ లిమిటింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి హంగులు ఉన్నాయి. వేరియంట్‌నుబట్టి ధర ఎక్స్‌షోరూంలో రూ.6.51–7.36 లక్షలు ఉంది. -
ఆ కంపెనీ భారీ ప్లాన్.. లీటర్‌కి 40 కి.మీ వరకు మైలేజ్‌తో నడిచే కార్లు వస్తున్నాయట!
ఇటీవల కార్ల వాడకం పెరుగుతోంది. ఇదివరకు కస్టమర్లు స్టైలిష్ లుక్, సాకర్యాలు, ఫీచర్ల, ధరను చూసేవాళ్లు. ప్రస్తుతం ఇంధన ధరల భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిపై కూడా ఓ కన్నేస్తున్నారు. కొంతవరకు, (CNG) సీఎన్జీ ఇంధనం ఈ సమస్యను పరిష్కరించడంలో సహాయపడింది. అయితే ఇప్పుడు సీఎన్జీ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి, కానీ అవి ప్రస్తుతం కొంచెం ఖరీదుగా ఉండడం, పైగా వాటి ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెద్దగా లేకపోవడంతో ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఇటువంటి సమయంలో, ఎక్కువ మంది కంపెనీలు తమ దృష్టిని హైబ్రిడ్ టెక్నాలజీ కార్ల వైపు మళ్లిస్తున్నాయి. అందుకే రానున్న కాలంలో అదిరిపోయే మైలేజ్‌తో ఉన్న కార్లు మార్కెట్లో విడుదలకు తయారీదారులు ప్లాన్ చేస్తున్నారు. నివేదికల ప్రకారం.. మారుతి నుంచి ఆ రెండు కార్లు ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్, డిజైర్ మారుతి కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. కస్టమర్లు కోరుకునే బడ్జెట్ ధరలతో పాటు ఫీచర్లు, కార్ల పనితీరు కారణంగా ఇవి సేల్స్‌లో దూసుకుపోతున్నాయి. తదపరి మారుతి నుంచి స్విఫ్ట్, డిజైర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో రానున్నాయని నివేదికలు చెప్తున్నాయి. మారుతి ఈ రెండు మోడళ్లలో 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చే అవకాశం ఉంది. ఈ కార్ల ఇంజిన్లు కూడా టయోటా స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో తయారు కావచ్చని సమాచారం. నివేదికల ప్రకారం.. మారుతి స్విఫ్ట్, మారుతి డిజైర్ హైబ్రిడ్ మోడల్ కార్లు దేశంలో అత్యంత ఇంధన-సమర్థవంతమైన వాహనాలుగా మారనున్నాయి. ఇవి 35 km/l నుంచి 40 km/l వరకు మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. హైబ్రిడ్ టెక్నాలజీతో స్విఫ్ట్ , డిజైర్ 2024 తొలి త్రైమాసికంలో మార్కెట్లో రావొచ్చు. ప్రస్తుతం మైలేజ్ పరంగా గ్రాండ్ విటారా SUV 27.97 కిమీ/లీతో ఫ్యూయల్ ఎకానమీ చార్ట్‌లలో ముందుంది. ఇదిలా ఉండగా మారుతీ సుజుకీ మాత్రం ఈ కొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్ల అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. చదవండి: నగదు చెల్లింపుల కోసం క్యూ ఆర్ కోడ్ స్కాన్.. ఇవి తెలుసుకోకపోతే జేబుకి చిల్లే! -
పడిపోయిన ఆర్టీసీ బస్సుల మైలేజీ
సాక్షి, హైదరాబాద్: ప్రజా రవాణా సంస్థల్లో అత్యధిక మైలేజీతో దేశవ్యాప్తంగా రికార్డు సొంతం చేసుకుంటూ వస్తున్న తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు దాన్ని కోల్పోయేలా కనిపిస్తోంది. లీటరు డీజిల్‌కు సగటున 5.4 కి.మీ. మైలేజీ (కేఎంపీఎల్) సాధించి ఇటీవలే పురస్కారాన్ని కూడా సాధించింది. కొన్నేళ్లుగా ఈ రికార్డును సొంతం చేసుకుంటూ వస్తున్న ఆర్టీసీ ఇప్పుడు గతి తప్పింది. ఇప్పుడు అది సగటున 5.2 కంటే తక్కువగా నమోదవుతున్నట్లు సమాచారం. అసలే డీజిల్ ధరలు మండిపోయి చమురు ఖర్చును భరించలేకపోతున్న ఆర్టీసీకి ఇప్పుడు మైలేజీ కూడా పడిపోవడం పెనుభారంగా పరిణమించింది. ఇదే కారణం.. : గతంలో నిత్యం డిపోల వారీగా డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఉండేది. మైలేజీ ఎక్కువగా సాధించాలంటే డ్రైవింగ్ ఎలా ఉండాలన్న విషయంలో సూచనలుండేవి. తక్కువ మైలేజీ తెస్తున్న డ్రైవర్లను గుర్తించి వారికి ప్రత్యేక సూచనలు చేసేవారు. ఇటీవల బల్క్ డీజిల్ ధరలు భగ్గుమనడంతో బస్సులకు ప్రైవేటు బంకుల్లో డీజిల్ పోయిస్తున్నారు. ఇందుకోసం డ్రైవర్ తన డ్యూటీ ముగించుకునే సమయంలో పెట్రోలు బంకు వరకు వెళ్లి డీజిల్ పోయించుకుని రావాల్సి వస్తోంది. ఈ కారణంతో గంటకుపైగా సమయం వృథా అవుతోంది. వారి పని సమయం మించిపోతుండటంతో కౌన్సిలింగ్ నిలిపేశారు. ఇది మైలేజీపై ప్రభావం చూపుతోంది. దీన్ని గుర్తించిన ఎండీ సజ్జనార్ వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. డీజిల్ కోసం బంకు వరకు వెళ్లకుండా, బంకు యజమానులే చిన్నసైజు ట్యాంకర్ల ద్వారా డీజిల్‌ను డిపోకు తెచ్చి లోపల ఉండే ఆర్టీసీ బంకుల్లో లోడ్ చేసే ఏర్పాటు చేస్తున్నారు. తిరిగి కౌన్సిలింగ్ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. -
Photo Feature: సరదా సైకిల్!
కొత్తగా.. వింతగా.. ఆశ్చర్యంగొలిపేలా ఉన్న ఈ వాహనాన్ని చూశారా. దీనిని యూనీ సైకిల్ అంటారు. 4 గంటలు చార్జింగ్ పెడితే సుమారు 100 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. యూనీసైకిల్పై ఒక వ్యక్తి మాత్రమే వెళ్లే అవకాశం ఉంది. రహదారులపై సిగ్నల్ పడినప్పుడు ఆపుకొనేలా బ్రేక్‌లున్నాయి. వేగాన్ని నియంత్రించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇవన్నీ చేతిలోని ఫోన్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ఈ యూనీసైకిల్ భారతీయ విపణిలోకి విడుదల కాలేదు. మరి దీనిపై వెళ్తున్న వ్యక్తికి ఇది ఎలా వచ్చిందనేగా మీ అనుమానం. నగరానికి చెందిన ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు తన సోదరి అమెరికా నుంచి బహుమతిగా పంపించారు. నిత్యం ఇంటి నుంచి ఆఫీస్‌కు దీనిపైనే వెళ్లి వస్తున్నట్లు అతడు చెప్పారు. ఈ దృశ్యం శనివారం బీఎన్‌రెడ్డి నగర్ వద్ద ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. – గడిగె బాలస్వామి, సాక్షి, ఫొటోగ్రాఫర్ -
అత్యధిక మైలేజ్ ఇచ్చే కారును లాంచ్ చేసిన మారుతి సుజుకీ..!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకి భారత మార్కెట్లలోకి సరికొత్త కాంపాక్ట్ సెడాన్ డిజైర్‌లో సీఎన్జీ వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది భారత్‌లో మోస్ట్ ఫ్యూయల్ ఎఫిసియంట్ కారుగా నిలుస్తోందని కంపెనీ పేర్కొంది. న్యూ డిజైర్ ఎస్-సీఎన్జీ గ్రీన్ మొబిలిటే లక్ష్యంగా మారుతి సుజుకీ పలు మోడళ్లను సీఎన్జీ వేరియంట్‌గా మారుస్తోంది. ఈ మోడల్‌తో మొత్తంగా 9 మోడల్ కార్లను సీఎన్జీ టెక్నాలజీతో జతచేసింది. మారుతి సుజుకీ న్యూ డిజైర్ ఎస్- సీఎన్జీ వేరియంట్ ధర రూ. 8 లక్షల నుంచి ప్రారంభం కానుంది. హై-ఎండ్ వేరియంట్ జెడ్ఎక్స్ఐ రూ. 8.82 లక్షల వద్ద లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ మోడల్ కోసం బుకింగ్స్ ప్రారంభించామని, కొనుగోలుదారులు డీలర్ల వద్ద రూ. 11,000 అడ్వాన్స్ రూపంలో చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. దేశీయంగా సీఎన్జీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ వరుసగా సీఎన్జీ మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో డిజైర్ మోడల్‌కు వినియోగదారుల నుంచి అద్భుతమైన ఆదరణ ఉంది. కంపెనీ ఇప్పటికే మారుతి ఆల్టో, మారుతి ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, మారుతీ ఎకో, మారుతీ సెలెరియో, ఎర్టిగా మోడళ్లను సీఎన్జీ వేరియంట్లో విక్రయిస్తోంది. ఈ జాబితాలో ఇప్పుడు డిజైర్‌ను కూడా తీసుకొచ్చింది ఇంజన్ విషయానికి వస్తే..! ఇంధన ధరల నుంచి ఉపశమనం కల్పిస్తూ మోస్ట్ ఫ్యూయల్ ఎఫిసియంట్ కారుగా న్యూ డిజైర్ ఎస్-సీఎన్జీ వేరియంట్‌ను కొనుగోలుదారులకు మారుతి సుజుకీ అందుబాటులోకి తెచ్చింది. కొత్త డిజైర్ ఎస్-సీఎన్జీ సాంకేతికతతో, కే-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT 1.2L ఇంజన్ జతచేశారు. ఇది 57kW గరిష్ట శక్తిని, 98.5Nm గరిష్ట టార్క్‌ను అందించనుంది. ఈ కొత్త డిజైర్ ఒక కేజీకి 31.12 కిమీ మేర మైలేజీని అందిస్తోందని కంపెనీ పేర్కొంది. ఫీచర్స్‌లో సరికొత్తగా.. ఫీచర్ల పరంగా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్, డ్యుయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్, బ్రేక్ అసిస్ట్ లాంటి అనేక అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. చదవండి: క్రేజీ ఆఫర్..! పలు మహీంద్రా కార్లపై రూ. 3 లక్షల వరకు భారీ తగ్గింపు..! -
సంచలన ఆఫర్.. అధిక మైలేజీ గ్యారెంటీ.. లేదంటే బండి వాపస్!
దేశీ ఆటోమొబైల్ కంపెనీల్లో మహీంద్రాకి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఎస్యూవీ కేటరిగిలో ఇప్పటికే పాతుకుపోయిన మహీంద్రా తాజాగా హెవీ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ మార్కెట్‌పై కన్నేసింది. దీంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సంచలన ఆఫర్ ప్రకటించింది. మహీంద్రా గ్రూపులో భాగమైన మహీంద్రా ట్రక్ బస్ (ఎంటీబీ) ఇటీవల ప్రకటించిన ఆఫర్ ఆటోమొబైల్ సెక్టార్లో సంచలనంగా మారింది. ఎంబీటీ నుంచి వచ్చే కమర్షియల్ వెహికల్స్‌లో 3.50 టన్నుల నుంచి 55 టన్నుల లోడు వరకు ఉండే లైట్, మీడియం, హెవీవెహికల్స్ మైలేజీపై ఛాలెంజ్ విసిరింది. బీఎస్ 6 టెక్నాలజీతో వస్తున్న ఈ వాహనాలు అధిక మైలేజీని అందిస్తాయని హామీ ఇస్తోంది. ఎవరైన మైలేజీపై అసంతృప్తి చెందితే వాహనాన్ని వెనక్కి తీసుకుంటామంటూ ప్రకటించింది. ఎంబీటీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో హెచ్‌సీవీ బ్లాజో ఎక్స్, ఐవీసీ ఫురియో, ఎస్సీవీ ఫురియో 7 , జయో రేంజ్ వాహనాలు ఉన్నాయి. అధిక మైలేజీ వచ్చేందుకు వీలుగా ఈ వాహనాల్లో 7.2ఎల్ ఎం పవర్ ఇంజన్, ఎండీఐ టెక్ ఇంజన్, ఫ్యూయల్ స్మార్ట్ టెక్నాలజీ, కటిండ్ ఎడ్జ్ ఐమాక్స్ టెలిమాటిక్ సొల్యూషన్ తదితర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. కమర్షియల్ వాహనాలకు సంబంధించి 60 శాతం ఖర్చు ఫ్యూయల్‌కే అవుతుంది. తాజాగా పెరిగిన ధరలు మరింత ఇబ్బందిగా మారాయి. దీంతో అధిక మైలేజీకి మహీంద్రా ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో గెట్ మోర్ మైలేజ్ ఆర్ గీవ్ బ్యాక్ ట్రక్ పాలసీని హెచ్‌సీవీ బ్లాజో ట్రక్ విషయంలో మహీంద్రా ప్రకటించింది. 2016లో ఈ ఆఫర్ తేగా ఒక్క వాహనం కూడా వెనక్కి రాలేదు. దీంతో ఇప్పుడు కమర్షియల్ సెగ్మెంట్లో బీఎస్ 6 ఇంజన్లు అన్నింటికీ దీన్ని వర్తింప చేయాలని మహీంద్రా నిర్ణయం తీసుకుంది. -
పాత కార్లలో యూత్ రైడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొన్నేళ్ల క్రితం వరకు కొత్త కారు కావాలంటే షోరూంకు వెళ్లి కొన్ని గంటల్లోనే నచ్చిన వాహనంతో రోడ్డుపై దూసుకుపోయేవారు. కొన్ని మోడళ్లకే కొద్ది రోజులు వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాహన రంగంలో పరిస్థితులు మారిపోయాయి. ఏ మోడల్ కారు కావాలన్నా తప్పనిసరిగా కొన్ని వారాలు, నెలలు వేచి ఉండాల్సిన పరిస్థితి. దీనికంతటికీ కారణం సెమికండక్టర్ల కొరత. మరోవైపు ముడి సరుకు వ్యయాలు భా రం కావడంతో వాహనాల ధరలను తయారీ కం పెనీలు ఎప్పుడూ లేని విధంగా క్రమం తప్పకుం డా పెంచుతూ పోతున్నాయి. దీంతో పాత కార్లకు డిమాండ్ అనూహ్యంగా అధికమైంది. అయితే ప్రీ–ఓన్డ్ కార్లను కొనేందుకు నవతరం ముందంజలో ఉన్నారని ఆన్లైన్ యూజ్డ్ కార్ల మార్కెట్‌ప్లేస్ కంపెనీ కార్స్24 నివేదిక చెబుతోంది. కొనుగోలుదార్లదే మార్కెట్.. పరిశ్రమలో అవ్యవస్థీకృత రంగానిదే 95 శాతం వాటా. రూ.2 లక్షల పెట్టుబడితో ఔత్సాహికులు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక కొనుగోలుదార్లు వాహనం ఏ స్థితిలో ఉందో తెలుసుకునేందుకు సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి పరీక్షిస్తున్నారు. కండీషన్నుబట్టి ధర నిర్ణయం అవుతోంది. పైగా కారు ఎక్కడ కొన్నా బ్యాంకులు రుణం ఇవ్వడం కలిసి వస్తోంది. వాహనం ఒకట్రెండేళ్లు వాడి 10,000 కిలోమీటర్లలోపు తిరిగితే యజమాని చెప్పిందే ధర. అదే రెండేళ్లు దాటితే కొనుగోలుదారు చెప్పిన ధరకు విక్రయించాల్సిన పరిస్థితి ఉంది. అయిదేళ్లలోపు వాడిన కార్లకే అత్యధికులు మొగ్గు చూపుతున్నారని వసంత్ మోటార్స్ ఎండీ కొమ్మారెడ్డి సందీప్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్రస్తుతం కొనుగోలుదార్లదే మార్కెట్ అని ఆయన అన్నారు. ఆన్‌లైన్‌లోనూ కొనుగోళ్లకు సై.. పాత కార్ల కొనుగోలుదార్లలో యువత వాటా ఏకంగా 80 శాతం ఉంది. యాప్, వెబ్ ఆధారిత వేదికలు వృద్ధి చెందేందుకు వీరు దోహదం చేస్తున్నారు. వాహన ధరలు పెరుగుతుండడం, మహమ్మారి కారణంగా వచ్చిన జీవనశైలి మార్పులు, ఆన్లైన్ కంపెనీల దూకుడు.. వెరళి డిజిటల్ వేదికల జోరుకు కారణం అవుతున్నాయి. యువ కస్టమర్లలో పురుషులదే పైచేయి. మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక కార్ల విషయానికి వస్తే హ్యాచ్బ్యాక్స్ వైపు మొగ్గు చూపుతున్నవారి సంఖ్య ఏకంగా 43% ఉంది. ఎస్‌యూవీలకు 26% మంది సై అంటున్నారు. పెట్రోల్ వాహనాలకే అత్యధికులు మొగ్గు చూపుతున్నారు. యూజ్డ్ కార్ ఏ స్థితిలో ఉందన్నదే కొనుగోలుదార్లకు కీలక అంశం. ఇదీ దేశీయ మార్కెట్.. భారత్‌లో 2020–21లో 38 లక్షల పాత కార్లు చేతులుమారాయి. ఇందులో 5–7 ఏళ్లు వాడిన వాహనాల వాటా 31 శాతం, 8–10 ఏళ్లవి 29 శాతం ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ 15 శాతం పెరగనుంది. ఏటా 12–14 శాతం వృద్ధితో 2025–26 నాటికి ఈ సంఖ్య 70 లక్షల యూనిట్ల పైచిలుకు నమోదు కానుందని నివేదికలు చెబుతున్నాయి. చవకగా ఉండి అధిక మైలేజీ ఇచ్చే కార్ల కోసం కస్టమర్లు ఎగబడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కొత్త కార్లు 27.11 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనినిబట్టి పాత కార్లకు ఉన్న డిమాండ్ అర్థం అవుతోంది. 2020తో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్ 20–30 శాతం దూసుకెళ్లింది. ముఖ్యంగా దక్షిణాదిన పాత కార్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కోవిడ్ కారణంగా వ్యక్తిగతంగా వాహనం ఉండాలన్న భావన ప్రజల్లో బలపడుతోంది. -
మారుతి మరో సంచలనం.. మార్కెట్లోకి అధిక మైలేజీ ఇచ్చే పెట్రోలు కారు
పెరుగుతున్న పెట్రోలు ధరలతో ప్రజలు అల్లాడిపోతున్న వేళ చల్లని కబురు చెప్పింది మారుతి సూజుకి ఇండియా. డీజిల్ కారుని మించి మైలేజీ అందించే కొత్త కారుని మార్కెట్లోకి తేబోతున్నట్టు ప్రకటించింది. ఎంట్రీ లెవల్ హచ్‌బ్యాక్ మోడల్‌గా ఉన్న సెలెరియో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ని మార్కెట్లోకి తెచ్చేందుకు మారుతి రెడీ అయ్యింది. నవంబరు 10 నుంచి ఈ కొత్త సెలెరియో మోడల్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. రూ.11,000 చెల్లించి ఈ కారుని బుక్ చేసుకోవచ్చు. అయితే బుకింగ్స్‌కి ముందు అదిరిపోయే న్యూస్ చెప్పింది మారుతి. కొత్త సెలెరియో కారు రికార్ఢు స్థాయిలో లీటరు పెట్రోలుకు 26 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందంటూ సంచలన ప్రకటన చేసింది. ఇండియాలోనే అత్యధిక మైలేజీ ఇచ్చే పెట్రోలు కారు తమదేనంటూ తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు మారుతి స్విఫ్ట్, బాలెనో కార్లు 24 కి.మీల మైలేజీ ఇస్తున్నాయి. ప్రస్తుతం వీటినే అత్యధిక మైలేజీ ఇచ్చేవిగా పరిగణిస్తున్నాను. సెలెరియో వాటిని బీట్ చేయబోతుంది. సెలెరియో కారులో 1 లీటరు కే 10సీ డ్యూయల్ జెట్ వీవీటీ పెట్రోలు ఇంజన్‌ను అమర్చారు. ఆటోమేటిక్, మాన్యువల్ గేర్లలో ఈ కారు లభించనుంది. ఈ ఫేస్ లిఫ్ట్ వెర్షన్లో ఏడు వేరియంట్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. టచ్ స్క్రీన్ ఇన్ఫోంటైన్మెంట్, యాపిల్ కార్ప్లే వంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. సెలెరియా పెట్రోలు కారు ఎక్స్‌షోరూం కనిష్ట ధర రూ.4.50 లక్షల దగ్గర ప్రారంభం అవుతుండగా హైఎండ్ వేరియంట్ ధర రూ.6.00 లక్షలుగా ఉంది. కీలక సమయంలో మైలేజీ కారును మార్కెట్లోకి తెస్తూ హ్యుందాయ్ సాంట్రో, టాటా టియాగోలకు గట్టి సవాల్ విసిరింది మారుతి. -
ఇంధన ధరలతో సతమతమవుతున్నారా..! అయితే ..!
దేశవ్యాప్తంగా ఇంధన ధరలు సెంచరీ దాటేసి... తగ్గేదేలే అంటూ.. పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులకు చుక్కలు కన్పిస్తున్నాయి. ఇంధన ధరలు పెరగడంతో కొంత మంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గుచూపుతున్నారు. కొందరైతే ఎలక్ట్రిక్ వాహనాలు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుందని చెప్పి సంప్రాదాయి శిలాజ ఇంధన వాహనాలనే కొనుగోలు చేస్తున్నారు. మనలో చాలా మంది మైలేజీ ఎక్కువ ఇచ్చే వాహనాలపైనే మొగ్గుచూపుతాం. అంతేందుకు ఎవరైనా కొత్త వాహనాలను కొనుగోలు చేస్తే మొదట మనం వారిని అడిగే ప్రశ్న...మైలేజ్ ఎంత ఇస్తుందని..? ఇంధన ధరల మోత తగ్గనప్పటికీ...మైలేజ్ ఎక్కువ ఇచ్చే వాహనాలను కొనుగోలు చేయడంతో కాస్తనైనా ఉపశమనం కలిగే వీలు ఉంది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) స్టాండర్స్ ప్రకారం.. భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లపై ఓ లుక్కేయండి. మార్కెట్లలోని టాప్-10 మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే...! 1. హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ డీజిల్ వేరియంట్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఉత్తమ మైలేజీని అందిస్తోంది. గ్రాండ్ ఐ 10 నియోస్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో డీజిల్ ఇంజిన్‌తో ఎక్కువ మైలేజ్ ఇచ్చే అతికొద్ది కార్లలో ఇది ఒకటి. ARAI రికార్డుల ప్రకారం... డీజిల్ వేరియంట్ 25 kmpl వరకు మైలేజీ, పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్21 kmpl మైలేజీను అందిస్తోంది. 2. మారుతి సుజుకి స్విఫ్ట్ మారుతి స్విఫ్ట్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 23 kmpl కంటే కొంచెం ఎక్కువ, ఆటోమేటిక్ వెర్షన్ 23.76 kmpl రేంజ్‌ను ఇస్తోంది. 3. హ్యుందాయ్ i20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో, హ్యుందాయ్ i20 అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. ఈ కారులో అద్భుతమైన ఫీచర్సే కాకుండా గొప్ప మైలేజ్ ఈ కారు సొంతం. ARAI ప్రకారం...హ్యుందాయ్ i20 డీజిల్ వేరియంట్ 25.2 kmpl, పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ 20.35 kmpl రేంజ్‌ను ఇస్తోంది. 4. మారుతి బాలెనో ఇటీవలి కాలంలో హ్యుందాయ్ ఐ 20 మైలేజీకు సమానంగా మారుతి బాలెనో అందిస్తోంది. ARAI ప్రకారం... బాలెనో పెట్రోల్ ఇంజన్‌తో 23. 87 kmpl రేంజ్ వస్తోంది. 5. హ్యుందాయ్ ఆరా సబ్-కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా ఆరా నిలుస్తోంది. ARAI డేటా ప్రకారం...ఆరా డీజిల్ మాన్యువల్ వేరియంట్ 25 kmpl మైలేజీని అందిస్తుంది.సీఎన్జీ వేరియంట్ కిలోకు 28 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. 6.మారుతి డిజైర్ మారుతి డిజైర్ కూడా సబ్-కాంపాక్ట్ సెడాన్ విభాగంలో ఇది కూడా అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 23.26 kmpl మైలేజీ, ఆటోమేటిక్ వెర్షన్ 24.12 kmpl మైలేజీను అందిస్తోంది. 7. కియా సొనెట్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో అత్యధికంగా కొనుగోలు చేయబడిన మోడల్ కియా సోనెట్. ARAI సర్టిఫికేట్ ప్రకారం... సోనేట్ డీజిల్ వేరియంట్ 24 kmpl మైలేజీను, పెట్రోల్ వేరియంట్ 18 kmpl ను అందిస్తోంది. 8. హ్యుందాయ్ వెన్యూ హ్యూందాయ్ వెన్యూ సుమారు 23.4 kmpl మైలేజీను అందిస్తోంది. 9. హ్యుందాయ్ క్రెటా మిడ్ రేంజ్ ఎస్యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటాకు సాటి లేదు. క్రెటా డీజిల్ మాన్యువల్ వేరియంట్ 21 kmpl అందిస్తోంది. 10. హ్యూందాయ్ వెర్నా ప్రీమియం సెడాన్ విభాగంలో హ్యుందాయ్ వెర్నా డిజీల్ వేరియంట్ 25 కెఎమ్పీఎల్, పెట్రోల్ వేరియంట్ 18.4 కెఎమ్పీఎల్ను అందిస్తోంది. -
ఈవీ స్కూటర్... ఎన్ని డబ్బులు ఆదా చేస్తుందో తెలుసా ?
పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. లీటరు పెట్రోలు ధర సెంచరీ దాటి పరుగులు పెడుతోంది. బండి బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఐదు వందల రూపాయల నోటు ఇచ్చినా ఐదు లీటర్ల పెట్రోలు కూడా రావట్లేదు. దీంతో పెట్రోలు బండ్లకు ప్రత్యామ్నాయంగా ఈవీ స్కూటర్లను పరిశీలిస్తున్నారు. అయితే ఈవీ స్కూటర్ల వల్ల కలిగే ప్రయోజనం ఎంత అనే సందేహం చాలా మంది మదిలో మెదులుతోంది. ఈ సందేహాలకు ‘ఆటోకార్’ ఇలా సమాధానం ఇచ్చింది. టీవీఎష్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల మైలేజీ, మెయింటనెన్స్ తెలుసుకునేందుకు టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ని పరిశీలనలోకి తీసుకున్నారు. టీవీఎస్ ఐక్యూబ్‌లో 2.2 కిలోవాట్ లిథియమ్ ఐయాన్ బ్యాటరీని ఉపయోగించారు. ఈ బ్యాటరీ ఫుల్ చార్జ్ అయ్యేందుకు ఐదు గంటల సమయం తీసుకుంటుంది. పవర్ మోడ్‌లో 48 కిలోమీటర్ల మైలేజీ ఏకోమోడ్లో 74 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అయితే ఏకోమోడ్లో ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 48 కిలోమీటర్లుగా ఉంది. 30 పైసలు బ్యాటరీని ఫుల్ చార్జ్ చేసి కంపెనీ సూచనల మేరకు టైర్లలో ఎయిర్ నింపి సిటీ రోడ్లపై ఏకో, పవర్ మోడ్లలో పరుగులు తీయించగా... సగటున ఒక కిలోమీటరు ప్రయాణానికి 30 పైసలు ఖర్చు వచ్చింది. ఇదే సమయంలో లీటరు పెట్రోలు ధర రూ.107ని తీసుకుంటే పెట్రోలు ఇంజను స్కూటరు ప్రయాణానికి ఒక కిలోమీటరకు రూ. 1.80 వంతున ఖర్చు వస్తున్నట్టు ఆటోకారు పేర్కొంది. 10 వేలకు 15 వేలు ఆదా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న లీటరు పెట్రోలు ధర, యూనిట్ కరెంటు ఛార్జీలను పరిగణలోకి తీసుకుని పెట్రోలు స్కూటరు, ఈవీ స్కూటర్లను పరిశీలిస్తే... పది వేల కిలోమీటర్లు తిరిగే సరికి ఎలక్ట్రిక్ వెహికల్ కేవలం పెట్రోలు రూపంలోనే రూ. 15,000 పెట్రోలు ఆదా చేసేందుకు తోడ్పడుతోంది. ఇక 50,000 కి.మీ ప్రయాణం పూర్తి చేసే సరికి రూ. 75,000ల వరకు మిగులు ఉంటున్నట్టు ఆటోకార్ తెలిపింది. పైగా ఈవీ వెహికల్స్‌కి ఆయిల్ ఛేంజ్, ఫిల్టర్లు ఇలా మెయింటనెన్స్ ఖర్చు కూడా తక్కువే. ఈవీకి డిమాండ్ పెట్రోలు రేట్లు పెరిగిపోతుండటంతో ఈవీ స్కూటర్లకు దేశంలో డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే పలు బ్రాండ్లు ఈవీలను మార్కెట్లోకి తీసుకురాగా.. ఓలా స్కూటర్‌కి అయితే ప్రీ బుకింగ్స్‌లో ప్రపంచ రికార్డు సాధించింది. -
నానో.. ఫెరారీ 'సవారీ'!
అవసరం - సౌకర్యం - విలాసం. అడ్రస్ బట్టి మారిపోతాయి. ఒకచోట అవసరమైనది... మరోచోట విలాసం. ఒకచోట విలాసమైతే.... మరోచోట అనవసరం కూడా!! కారు కూడా అంతే. ఒకపుడు చాలామందికి విలాసం. వారి స్థాయికి గుర్తు. ఇపుడైతే అత్యధికులకు అవసరం. కొందరికైతే అత్యవసరం. మరి ఆ కార్లకు పెట్టే ధరెంత? కొందరైతే లక్షల్లో. మరి కొందరైతే కోట్లలో. అందుకే! మారుతి-800తో మొదలైన భారత దేశ కార్ల ప్రస్థానం... అలా అలా బుగట్టీ, రోల్స్ రాయిస్, బెంట్లీ, ఆస్టిన్ మార్టిన్, ఫెరారీ, లాంబోర్గిణి, బీఎండబ్ల్యూలను దాటిపోతోంది. నిజానికి కారు కొనేటపుడు అత్యధికులు చూసేది దాని ధర, మైలేజీ. ఈ రెండిటి తరవాత ఫీచర్లు. కాకపోతే పిండి కొద్దీ రొట్టె. డబ్బు కొద్దీ కారు. ఈ ధరను బట్టే... ఫీచర్లు, మైలేజీ అన్నీ మారిపోతుంటాయి. లక్ష రూపాయలకేనంటూ సామాన్యుల అవసరాలు తీర్చడానికి నానో ప్రత్యక్షమైతే... నేను కొందరికే సొంతం అంటూ రూ.38 కోట్ల బుగట్టీ వేరన్ రోడ్డుమీదికొస్తుంది. రూ.3 లక్షలు పెడితే మీ కుటుంబాన్నంతటినీ మోస్తానంటూ మారుతి ఆల్టో దేశానికి దగ్గ రైతే... రూ.8 కోట్లకు తక్కువ కాదంటూ రోల్స్‌రాయిస్ పాంథమ్ రోడ్డును మింగేస్తుంది. దేని ధర దానిదే. దేని ఫీచర్లు దానివే. దేని మైలేజీ దానిదే. ఒక్కమాటలో చెప్పాలంటే... దేనికదే సాటి. ఆ స్పెషాలిటీల సమాహారమే... ఈ ప్రాఫిట్ ప్లస్ ప్రత్యేక కథనం... - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ♦ చిన్నకార్ల కొనుగోళ్లలో ధరకే ఓటు ♦ మైలేజీ, ఫీచర్లు పెంచుతూ కంపెనీల ఎంట్రీ ♦ రూ.10 లక్షల లోపు కార్ల సెగ్మెంట్లో పోటాపోటీ ♦ దేశంలో కంపెనీల ఫోకస్ మొత్తంగా ఈ సెగ్మెంట్‌పైనే ♦ లగ్జరీ కార్ల కంపెనీల రూటే వేరు ♦ ప్రత్యేకమైన కస్టమర్ల కోసం ప్రత్యేక కార్లు ♦ బుక్ చేశాక కనీసం 4 నుంచి 8 నెలల దాకా వెయిటింగ్ ♦ దేశంలో అంతకంతకూ పెరుగుతున్న లగ్జరీ కార్లు ‘లక్ష’ నానోతో టాటా హల్చల్... టాటా గ్రూప్‌లో భాగమైన టాటా మోటార్స్... ముంబై కేంద్రంగా 1945లో ప్రారంభమైంది. ప్రపంచ కార్ల కంపెనీల్లో దీనిది 17వ స్థానం. అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లు జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను 2008లో ఇది ఫోర్డ్ నుంచి కొనుగోలు చేసింది. స్పెయిన్‌కు చెందిన బస్, కోచ్ తయారీ సంస్థ హిస్పానో, దక్షిణ కొరియాకు చెందిన కమర్షియల్ వెహికల్ తయారీ సంస్థ డీవో కూడా టాటా అనుబంధ సంస్థలే. సంస్థకు దేశంలో జంషెడ్పూర్, పట్నానగర్, లక్నో, సణంద్, ధార్వాడ్, పుణెతో పాటు అర్జెంటీనా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, యూకేలో ప్లాంట్లున్నాయి. 2008లో లక్ష రూపాయలకేనంటూ నానోను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ధర 2 లక్షలు దాటింది. 800 నుంచి మొదలు పెడితే... ఒకప్పుడు మారుతీ అంటే దేశీ కంపెనీ. ఇప్పుడిది జపాన్‌కు చెందిన సుజుకీ చేతుల్లో ఉంది. మొదట్లో మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్‌గా పిలిచిన ఈ సంస్థ... మారుతీ800తో దేశంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. 2016 జనవరి నాటికి మన దేశీ కార్ల పరిశ్రమలో 47 శాతం వాటా దీనిదే. 1981లో మారుతీ ఉద్యోగ్ ఆరంభమైనా... తొలి 800 కారు బయటికొచ్చింది మాత్రం 1983లో. దేశంలో గుర్గావ్, మానేసర్‌లోని ప్లాంట్లలో సంస్థ ఏటా 14.50 లక్షల కార్లు ఉత్పత్తి చేస్తోం ది. ప్రస్తుతం ఈ సంస్థ హై ఎండ్ కార్ల మార్కెట్లో కూడా విస్తరిస్తోంది. పోటాపోటీగా... హ్యుందాయ్ 1967 డిసెంబర్లో దక్షిణ కొరియాలో ఆరంభమైన హ్యుందాయ్... ఇపుడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద కార్ల కంపెనీ. కొరియాలోని ఉల్సాన్లో దీనికి ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ ప్లాంటుంది. దాన్లో ఏటా 16 లక్షల కార్లు ఉత్పత్తి అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా 193 దేశాల్లో విక్రయాలు సాగిస్తున్న ఈ సంస్థ... 1968లో ఫోర్డ్‌తో కలిసి రూపొందించిన ‘కోర్టినా’తో తన ప్రస్థానాన్ని ఆరంభించింది. దేశంలో చెన్నైలోని శ్రీపెరంబుదూర్‌లో ఉన్న ప్లాంట్ నుంచి ఏటా 6 లక్షల కార్లు ఉత్పత్తి చేస్తోంది. 2007లో హైదరాబాద్ అభివృద్ధి, పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించింది. చౌక కార్లలోనూ డెట్రాయిట్ దిగ్గజం! ఒకనాటి నవలల్లో ‘చెవర్లెట్ కారు’ అని ముద్దుగా పిలిచినా... అసలు పేరు షెవర్లే. అమెరికన్ దిగ్గజం జనర ల్ మోటార్స్ విభాగ మిది. 1911లో స్విస్ రేస్ కార్ డ్రైవర్ లూయీ షెవర్లే, ఫైనాన్సింగ్ పార్టనర్ విలియం సి డురంట్‌తో కలిసి మిషిగన్‌లో ఈ కంపెనీని ఆరంభించా రు. ప్రస్తుతం 140 దేశాలకు విక్రయించిన షెవర్లే వాటా... మన దేశంలో 3 శాతం. గుజరాత్‌లోని హలోల్‌లో ప్లాంట్ ఏర్పాటు చేసిన ఈ సంస్థ... 2014లో 24 వేల కార్లను ఉత్పత్తి చేసింది. క్రూజ్, ఆస్ట్రా, టవేరా తప్ప మిగిలివన్నీ జపాన్ నుంచి దిగుమతి అవుతున్నవే. జేఎల్ఆర్ను వదులుకున్నా.... ఫోర్డ్ మోటార్స్‌ను 1903లో హెన్రీ ఫోర్డ్ మిషిగన్‌లో ప్రారంభించారు. కార్లు, కమర్షియల్ వాహనాలను ‘ఫోర్డ్’ బ్రాండ్‌తో, లగ్జరీ కార్లను ‘లిన్‌కోల్న్’ బ్రాండ్‌తో విక్రయిస్తోంది. కొన్ని విదేశీ కార్ల కంపెనీలనూ కొనుగోలు చేసిన ఈ సంస్థ... జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను మాత్రం టాటాలకు విక్రయించేసింది. జపాన్‌కు చెందిన మజ్దాలో 2.1 శాతం, యూకేకు చెందిన ఆస్టిన్ మార్టిన్‌లో 8 శాతం, చైనాకు చెందిన జింగ్లింగ్లో 49 శాతం వాటా దీనికున్నాయి. దేశంలో గుజరాత్‌లోని సణంద్‌లో ఫోర్డ్ ఇంజిన్, అసెంబ్లింగ్ ప్లాంటుంది. బుగట్టి వేరన్గ్రాండ్ స్పోర్ట్స్ దేశంలో అత్యంత ఖరీదైన కారు ఇది. బుక్ చేశాక డెలివరీకి 6-8 నెలలు పడుతుంది. అది కూడా కస్టమర్ల స్థాయిని బట్టి!!. 100 కి.మీ. వేగాన్ని అందుకోవడానికి కేవలం 2.7 సెకన్లు పడుతుందంటేనే... దీని ప్రత్యేకత అర్థమైపోతుంది. కారులోని ప్రతి అంగుళం ప్రత్యేకమైందే. కార్బన్ ఫైబర్ మోనోకోక్యూతో కారు బాడీ తయారవుతుంది. ⇒ ఖరీదు రూ.38 కోట్లు. ⇒ 8.7 లీటర్ల ఇంజిన్ సామర్థ్యం దీని సొంతం ⇒ 987 బీహెచ్పీ పవర్ : 6,000 ఆర్పీఎం ⇒ 1,250 ఎన్ఎం టార్క్ : 2,200-5,500 ఆర్పీఎం ⇒ 7 స్పీడ్ డీఎస్జీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ⇒ గరిష్ట వేగం గంటకు 407 కి.మీ. ⇒ మైలేజ్ లీటరుకు సిటీలో 2.3 కి.మీ. - హైవేలో 6.8 కి.మీ. ⇒ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 100 లీటర్లు ఆస్టిన్ మార్టిన్ వాన్క్విష్ ⇒ ధర రూ.3.8 కోట్లు ⇒ ఏఎం 29 వీ12 ఇంజిన్ ⇒ 565 బీహెచ్పీ : 6,750 ఆర్పీఎం ⇒ 620 ఎన్ఎం టార్క్ : 5500 ఆర్పీఎం ⇒ 6 స్పీడ్ గేర్ బాక్స్ ⇒ గరిష్ట వేగం గంటకు 295 కి.మీ. ⇒ జీరో నుంచి 100 కి.మీ.లకు చేరుకోవటానికి పట్టే సమయం 4.3 సెకన్లు ⇒ ఇంధన సామర్థ్యం 78 లీటర్లు ⇒ మైలేజీ లీటర్‌కు సిటీలో: 4 కి.మీ., హైవేలో: 8 కి.మీ. రోల్స్ రాయిస్ ఫాంథమ్ సిరీస్-2 ఫాంథమ్ను మొదటిసారి మ్యాగజైన్ల మీద ప్రకటనల్లో కాకుండా నేరుగా చూసినవారెవరైనా... నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఫాంథమ్ పాంథా రోడ్డు మీద వెళ్తుంటే కారు ముందు, వెనక ఇరుసులు రోడ్డును మింగేస్తున్నట్టుగా కనిపిస్తాయి. 5.9 సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ⇒ స్టాండర్డ్ వీల్ బేస్ ధర రూ.8 కోట్లు; ఎక్స్టెండెడ్ వీల్ బేస్ ధర రూ.9 కోట్లు ళీ రెండు వర్షన్లూ 6.7 లీటర్ వీ-2 పెట్రోల్ ఇంజిన్. ⇒ 453 బీహెచ్పీ పవర్ : 5,350 ఆర్పీఎం; 720 ఎన్ఎం టార్క్ : 3,500 ఆర్పీఎం ళీ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్; దీని గరిష్ట వేగం గంటకు 240 కి.మీ. ⇒ ఇంధన ట్యాంక్ కెపాసిటీ 100 లీటర్లు; మైలేజీ లీటరుకు సిటీలో: 4.38 కి.మీ.-హైవేలో 9.8 కి.మీ. లంబోర్గిణి అవెంటడార్ మూడు సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకునే ఈ కారు ధర... రూ.5.36 కోట్లు ⇒ 6,498 సీసీ పెట్రోల్ ఇంజిన్ ⇒ 7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ ⇒ 690.62 బీహెచ్పీ : 8,250 ఆర్పీఎం ⇒ 690 ఎన్ఎం : 5,500 ఆర్పీఎం ⇒ గరిష్ట వేగం గంటకు 350 కి.మీ. ⇒ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 90 లీటర్లు ⇒ మైలేజీ లీటర్‌కు సిటీలో: 3 కి.మీ., హైవేలో 5 కి.మీ. బెంట్లీ ముల్సన్నే దేశంలో పెట్రోల్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉన్న ఈ కారు... 100 వేగాన్ని 5.3 సెకన్లలో చేరుకుంటుంది. ⇒ ధర రూ.7.5 కోట్లు. ⇒ 6.8 లీటర్ వీ 8 ఇంజిన్ ట్విన్ టర్బో చార్జ్డ్ ⇒ 505 బీహెచ్పీ : 4,200 ఆర్పీఎం ⇒ 8 స్పీడ్ ఆటో మేటిక్ గేర్ షిఫ్ట్ ⇒ టార్క్ 1,020 ఎన్ఎం : 1,750 ఆర్పీఎం ⇒ గరిష్ట వేగం గంటకు 296 కి.మీ. ⇒ ఇంధన ట్యాంక్ కెపాసిటీ 96 లీటర్లు ⇒ మైలేజీ లీటర్‌కు సిటీలో: 4.3 కి.మీ. ⇒ హైవేలో: 10.1 కి.మీ. బెంట్లీ ఫ్లయింగ్ స్పౌర్ మన దేశంలో ఫ్లయింగ్ స్పౌర్.. వీ 8, డబ్ల్యూ 12 వేరియంట్స్ అనే రెండు పెట్రోల్ వెర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ⇒ వీ8 ధర రూ.3.2 కోట్లు; 5,988 సీసీ 4 లీటర్ ఇంజిన్ సామర్థ్యం ⇒ 500 బీహెచ్పీ : 6000 ఆర్పీఎం ⇒ 660 ఎన్ఎం : 1,700 ఆర్పీఎం టార్క్ ⇒ 8 స్పీడ్ ఆటో గేర్ బాక్స్; గరిష్ట వేగం గంటకు 295 కి.మీ. ⇒ 3.2 సెకన్లలో వంద కి.మీ. వేగానికి చేరుకుంటుంది. ⇒ మైలేజీ లీటర్‌కు సిటీలో 4.5 కి.మీ., హైవేలో 10.2 కి.మీ. ⇒ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 90 లీటర్లు రోల్స్ రాయిస్ రైత్ ⇒ ధర రూ.4.6 కోట్లు ⇒ ట్విన్ టర్బో వీ-12 ఇంజిన్ ⇒ 8 స్పీడ్ ఆటోమేటిక్ జెడ్ఎఫ్ ట్రాన్స్మిషన్ ⇒ 6,592 సీసీ ఇంజిన్ ⇒ 624 బీహెచ్పీ : 5,600 ఆర్పీఎం ⇒ 800 ఎన్ఎం : 1,500-5,000 ఆర్పీఎం ⇒ 100 కి.మీ. వేగాన్ని చేరుకోవటానికి పట్టే సమయం 4.6 సెకన్లు. ⇒ గరిష్ట వేగం గంటకు 250 కి.మీ.; ఇంధన ట్యాంక్ సామర్థ్యం 83 లీటర్లు ⇒ మైలేజీ లీటరుకు సిటీలో: 4.7 కి.మీ., హైవేలో: 10.2 కి.మీ. పోర్షే 911 టర్బో ఎస్ ⇒ ధర రూ.3 కోట్లు ⇒ బుక్ చేసిన 7-10 నెలల సమయానికి కారు డెలివరీ అవుతుంది. ⇒ 3.1 సెకన్లలో సున్నా నుంచి వంద కి.మీ. వేగానికి చేరుకుంటుంది. ⇒ 3.8 లీటర్ 24 వీ పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యం ⇒ 560 బీహెచ్పీ : 5,750 ఆర్పీఎం ⇒ 700 ఎన్ఎం టార్క్ : 2,100-4,500 ఆర్పీఎం ⇒ 7 స్పీడ్ గేర్ బాక్స్; గరిష్ట వేగం గంటకు 318 కి.మీ. ⇒ మైలేజీ లీటర్‌కు సిటీలో 7.46 కి.మీ., హైవేలో 12.8 కి.మీ. ⇒ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 68 లీటర్లు ఫెరారీ కాలిఫోర్నియా ⇒ ధర రూ.3-5 కోట్లు ⇒ ట్విన్ క్లచ్ గేర్ బాక్స్ ⇒ 4.3 లీటర్ వీ8 ఫ్రంట్ ఇంజిన్ సామర్థ్యం ⇒ 482.7 బీహెచ్పీ : 7,750 ఆర్పీఎం; 505 ఎన్ఎం : 5,000 ఆర్పీఎం ⇒ గరిష్ట వేగం గంటకు 312.2 కి.మీ. ⇒ 7 స్పీడ్ ఆటో షిఫ్ట్‌తో మాన్యువల్ గేర్స్/ఆటోమేటిక్ రెండూ ఉంటాయిందులో. ⇒ 3.7 సెకన్లలో వంద కి.మీ. వేగానికి చేరుకుంటుంది. ⇒ మైలేజీ లీటర్‌కు సిటీలో 4.32 కి.మీ., హైవేలో 7.75 కి.మీ. ⇒ ఇంధన ట్యాంక్ కెపాసిటీ 73 లీటర్లు గమనిక: బీహెచ్పీ: బ్రేక్ హార్స్ పవర్; ఆర్పీఎం: రివల్యూషన్స్ పర్ మినట్; ఎన్ఎం: నానో మీటర్; టార్క్: ఫోర్స్ (బలం); భారతదేశంలో కార్ల కోసం అత్యధికులు పెట్టే బడ్జెట్ రూ.10 లక్షల లోపే. అందుకే ప్రతి కంపేని ఈ సెగ్మెంట్లోనే మోడళ్లను తెస్తోంది. వాటి పోటీ కూడా ఈ సెగ్మెంట్లోనే. మారుతీ, హ్యుందాయ్, టాటా. రెనో, నిస్సాన్, షెవర్లే, హోండా, ఫోర్డ్, ఫోక్స్‌వ్యాగన్, టొయోటా.. ఇలా అన్ని కంపెనీల పోరూ ఈ సెగ్మెంట్లోనే. కాకపోతే మారుతీ, హ్యుదాయ్, టాటాల వాటా ఎక్కువ. రూ.10లక్షల లోపు మోడళ్ల ఫీచర్లు, మైలేజీ తదితర వివరాలను చూస్తే... -
హీరో, హోండాల మధ్య మైలేజీ చిచ్చు
⇒ ఐ స్మార్ట్ బైక్ మైలేజీ 102.5 కిమీ: హీరో మోటో ⇒ బేస్ ఇంజిన్ మేం తయారు చేసిందే, అంత మైలేజీ గ్యారంటీ లేదు: హోండా న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్ కొత్త బైక్ స్ప్లెండర్ ఐ స్మార్ట్ బైక్ లీటర్‌కు 102.5 కిమీ మైలీజినిస్తుందని హీరో మోటోకార్ప్ ప్రచారం హీరో మోటొకార్ప్, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) కంపెనీల మధ్య వివాదం రేపుతోంది. ఇంత మైలేజీ వస్తుందని చెప్పడం వినియోగదారులను మోసం చేయడమేనని, ఇది వాస్తవ విరుద్ధమని హెచ్ఎంఎస్ఐ విమర్శించింది. స్ప్లెండర్ బేస్ ఇంజన్‌ను తామే రూపొందించామని హోండా ఆర్ అండ్ డీ సెంటర్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ కీజి కస తెలిపారు. పూర్తి నియంత్రిత వాతావరణంలోనూ ఇంత మైలేజీ నిలకడగా కొనసాగించడం కష్టమని పేర్కొన్నారు. అయితే ఈ మైలేజీ వివరాలు ప్రభుత్వం ఆధీనంలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ(ఐ క్యాట్) ధ్రువీకరించినవేనని హీరో మోటోకార్ప్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ మైలేజీ వివరాలను సవాల్ చేయడమంటే భారత ప్రభుత్వం నెలకొల్పిన ప్రమాణాలు, నియమనిబంధనలను ప్రశ్నించడమేనని పేర్కొన్నారు. హీరో గ్రూప్, హోండా కంపెనీలు తమ 26 ఏళ్ల భాగస్వామ్య ఒప్పందాన్ని 2010లో రద్దు చేసుకున్నాయి. అప్పటి నుంచి ఈ రెండు కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.