ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ బైకులు: ధర లక్ష కంటే తక్కువే.. | Five Best Bikes Under Rs 1 Lakh With Highest Mileage in India | Sakshi
Sakshi News home page

ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ బైకులు: ధర లక్ష కంటే తక్కువే..

Published Sat, Oct 26 2024 7:58 PM | Last Updated on Sat, Oct 26 2024 8:21 PM

Five Best Bikes Under Rs 1 Lakh With Highest Mileage in India

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మంచి మైలేజ్ ఇచ్చే బైకులకు కొదువే లేదు. అయితే రూ.1 లక్ష కంటే తక్కువ ధర వద్ద అందుబాటులో ఉన్న ఐదు ఉత్తమ బైకులు గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

టీవీఎస్ స్పోర్ట్
టీవీఎస్ కంపెనీకి చెందిన స్పోర్ట్ బైక్ అత్యధిక మైలేజ్ ఇచ్చే టూ వీలర్స్ జాబితాలో ఒకటిగా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 59,881 కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 71,383 (ఎక్స్ షోరూమ్). ఇది 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ముందు, వెనుక డ్రమ్ బ్రేక్స్ కలిగిన ఈ బైక్ 80 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది.

బజాజ్ సీటీ 110ఎక్స్
రూ. 70,176 ప్రారంభ ధర (ఎక్స్ షోరూమ్) వద్ద లభించే బజాజ్ సీటీ 110ఎక్స్ కూడా మంచి మైలేజ్ అందించే బెస్ట్ బైక్. ఇది 70 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 115 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 8.48 హార్స్ పవర్, 9.81 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ ఫోర్ స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ప్రారంభ ధర రూ. 59,998. సెల్ఫ్-స్టార్ట్ ఆప్షన్‌ కలిగిన టాప్ వేరియంట్ ధరలు రూ. 69,018 (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 7.91 హార్స్ పవర్, 8.05 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఫోర్ స్పీడ్ గేర్‌బాక్స్‌ ఆప్షన్ పొందుతుంది. ఇది 70 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

టీవీఎస్ రేడియన్
రూ. 59,880 నుంచి రూ. 81,394 మధ్య (ఎక్స్ షోరూమ్) లభించే టీవీఎస్ రేడియన్ బైక్ 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.08 హార్స్ పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది ఫోర్ స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఈ బైక్ 68.6 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

ఇదీ చదవండి: 90వేల కార్లు వెనక్కి: హోండా కీలక ప్రకటన

హోండా ఎస్పీ 125
హోండా ఎస్పీ 125 ధరలు రూ. 87,468 నుంచి రూ. 91,468 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ బైక్ 124 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 10.72 Hp, 10.9 Nm టార్క్ అందిస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ ఆప్షన్ కలిగిన ఈ బైక్ రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్స్ పొందుతుంది. ఈ బైక్ 60 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement