Rs 1 lakh
-
అప్పటికి బంగారం ధర రూ. లక్ష: కారణం ఇదే..
బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 10 గ్రాముల పసిడి రూ.80,000, కేజీ సిల్వర్ రూ. 1 లక్ష దాటేసింది. ధరలు భారీగా పెరిగినప్పటికీ.. గోల్డ్ కొనుగోలు చేసేవారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ధన త్రయోదశి సందర్భంగా బంగారం ఎక్కువగానే అమ్ముడైనట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.పరిస్థితులను బట్టి చూస్తుంటే.. ధరలు ఎంత పెరిగినా కొనుగోలుచేసి వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదని స్పష్టమైపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది దసరా, దీపావళి నాటికి గోల్డ్ రేటు రూ. 1 లక్షకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వెండి కూడా రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.30 లక్షలకు చేరుకోవచ్చని అంచనా.ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రకారం.. గత కొన్నేళ్లుగా వెండి మంచి లాభాలను ఇవ్వడంతో ధరల విషయంలో బంగారాన్నే మించిపోయింది. రాబోయే రోజుల్లో బంగారం కంటే వెండి అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని సమాచారం.2014లో రూ.28,006.50 వద్ద ఉన్న బంగారం ధర ప్రస్తుతం రూ. 81000 వరకు ఉంది. దీన్ని బట్టి చూస్తే.. పదేళ్లలో బంగారం ధర ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టమవుతోంది.బంగారం ధరలు పెరగటానికి కారణంబంగారం ధరలు భారీగా పెరగటానికి ప్రధాన కారణం కొనుగోలుదారుల సంఖ్య పెరగడం. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పలు దేశాల సెంట్రల్ బ్యాంకుల రేట్లు పెరగడం వంటివి ప్రధాన కారణం అవుతున్నాయి. స్టాక్ మార్కెట్లు పతనమైన సమయంలో.. ఎక్కువమంది ఇన్వెస్టర్లు నష్టాల నుంచి తప్పించుకోవడానికి బంగారం మీద పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టారు. ఓ వైపు పండుగలు, మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా బంగారం అమ్మకాల పెరగటానికి కారణమయ్యాయి. -
ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ బైకులు: ధర లక్ష కంటే తక్కువే..
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మంచి మైలేజ్ ఇచ్చే బైకులకు కొదువే లేదు. అయితే రూ.1 లక్ష కంటే తక్కువ ధర వద్ద అందుబాటులో ఉన్న ఐదు ఉత్తమ బైకులు గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.టీవీఎస్ స్పోర్ట్టీవీఎస్ కంపెనీకి చెందిన స్పోర్ట్ బైక్ అత్యధిక మైలేజ్ ఇచ్చే టూ వీలర్స్ జాబితాలో ఒకటిగా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 59,881 కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 71,383 (ఎక్స్ షోరూమ్). ఇది 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ముందు, వెనుక డ్రమ్ బ్రేక్స్ కలిగిన ఈ బైక్ 80 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది.బజాజ్ సీటీ 110ఎక్స్రూ. 70,176 ప్రారంభ ధర (ఎక్స్ షోరూమ్) వద్ద లభించే బజాజ్ సీటీ 110ఎక్స్ కూడా మంచి మైలేజ్ అందించే బెస్ట్ బైక్. ఇది 70 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 115 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 8.48 హార్స్ పవర్, 9.81 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ ఫోర్ స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.హీరో హెచ్ఎఫ్ డీలక్స్హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ప్రారంభ ధర రూ. 59,998. సెల్ఫ్-స్టార్ట్ ఆప్షన్ కలిగిన టాప్ వేరియంట్ ధరలు రూ. 69,018 (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 7.91 హార్స్ పవర్, 8.05 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఫోర్ స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది 70 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.టీవీఎస్ రేడియన్రూ. 59,880 నుంచి రూ. 81,394 మధ్య (ఎక్స్ షోరూమ్) లభించే టీవీఎస్ రేడియన్ బైక్ 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.08 హార్స్ పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది ఫోర్ స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఈ బైక్ 68.6 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.ఇదీ చదవండి: 90వేల కార్లు వెనక్కి: హోండా కీలక ప్రకటనహోండా ఎస్పీ 125హోండా ఎస్పీ 125 ధరలు రూ. 87,468 నుంచి రూ. 91,468 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ బైక్ 124 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 10.72 Hp, 10.9 Nm టార్క్ అందిస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ కలిగిన ఈ బైక్ రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్స్ పొందుతుంది. ఈ బైక్ 60 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. -
స్విగ్గీ అకౌంట్‌తో రూ.97 వేలు మాయం చేశారు - ఎలా అంటే?
ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ యాప్ స్విగ్గీ ఖాతాలను హ్యాకింగ్ చేసి ప్రజలను మోసగిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాలోని గురుగ్రామ్ నివాసితులైన అనికేత్ కల్రా (25), హిమాన్షు కుమార్ (23) సుల్తాన్‌పూర్‌కు చెందిన ఒక మహిళ స్విగ్గీ అకౌంట్‌ను హ్యాక్ చేసి సుమారు లక్ష రూపాయలు కాజేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు సామాన్య డెలివరీ బాయ్స్.. స్విగ్గీ ఖాతాలను హ్యాక్ చేయడానికి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVR) సిస్టం ఉపయోగించి ఓ మహిళకు ఫోన్ చేసి.. స్విగ్గి అధికారులమని నమ్మించి ఆమె యూజర్ నేమ్, పాస్వర్డ్ వంటివి తెలుసుకున్నారు. అకౌంట్ డీటైల్స్ తెలుసుకున్న తరువాత సుమారు రూ. 97 వేలు మాయమయ్యాయి. అకౌంట్ నుంచి భారీగా డబ్బులు కట్ అవుతుండటం గుర్తించిన మహిళ పోలీసులకు పిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దీనిపైన సమగ్ర విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్విగ్గీ అకౌంట్స్ హ్యాచ్ చేసి తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించేవారు. వచ్చిన డబ్బును చట్టబద్దమైన లావాదేవీలుగా మార్చుకోవడానికి వారు పనిచేసే మెడికల్ షాపుకు వచ్చిన వ్యక్తులకు ఇచ్చి వారి యూపీఐ ఐడీల ద్వారా తమ అకౌంట్లలో పడేలా చేసుకునే వారు. -
లక్ష రూపాయల లోపు లభించే సూపర్‌బైక్స్ ఇవే!
సాక్షి, ముంబై: 190 మిలియన్లకు పైగా వాహనాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా నిలస్తోంది ఇండియా. ముఖ్యంగా హోండా,హీరో, బజాజ్, టీవీఎస్ లాంటి కంపెనీలతోపాటు బీఎండబ్ల్యూ లాంటి లగ్జరీ బైక్‌లో మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఎక్కువ మైలేజీ, స్మార్ట్ ఫీచరలతో లభించే ట్రెండీలుక్స్తో సరసమైన ధరలో లభించే బైక్స్‌పై కొనుగోలుదారులు ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో లక్ష రూపాయలలోపు ధరలో అందుబాటులోఉన్న బైక్‌లపై ఓ లుక్కేద్దాం. హోండా ఎస్పీ125 బీఎస్-6 నిబంధనలకుఅనుగుణంగా వచ్చిన హోండా తొలి బైక్ హోండా ఎస్పీ 125. ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో కూడిన BS6 కంప్లైంట్ 125cc ఇంజన్‌తో10.5bhp గరిష్ట శక్తిని 10.3Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈబైక్ రెండు వేరియంట్లలో, 5 కలర్స్‌లో లభిస్తోంది. ప్రారంభ ధర రూ. 82,243 (ఎక్స్-షోరూమ్) హీరో గ్లామర్ హీరోకు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో ఒకటి హీరో గ్లామర్ ..124.7cc ఇంజన్‌తో పనిచేస్తుంది.ఇది 10.72 bhp శక్తిని, 10.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బీఎస్-6 కంప్లైంట్ మోడల్‌తో చిన్న మార్పులతో మేక్ఓవర్ అయిన ఈ బైక్ ప్రారంభ ధర రూ.78,753 హీరో గ్లామర్ 12 వేరియంట్లు,13 కలర్ ఆప్షన్లలో లభ్యం. హోండా షైన్ హోండా షైన్ కూడా ఈ సెగ్మెంట్లో చాలా పాపులర్ బైక్. 124cc సింగిల్ సిలిండర్ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 10 bhp , 11 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6 కలర్ ఆప్షన్లలో లభ్యమవుతున్న హోండా షైన్ ధర రూ.77,338 (ఎక్స్-షోరూమ్) హీరో సూపర్ స్ప్లెండర్ హీరో ఐకానిక్ బైక్ స్ప్లెండర్ ప్రీమియం వెర్షన్ హీరో సూపర్ స్ప్లెండర్. ఇది 124.7సీసీ ఇంజన్ 10.72 bhp, 10.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రారంభ ధర రూ. 77,939 . టీవీఎస్ రైడర్ 125 టీవీఎస్ రైడర్ 125 124.8cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, త్రీ-వాల్వ్ ఇంజన్‌తో 11.2 bhp శక్తిని , 11.2 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 4 కలర్స్, 3 వేరియంట్లలో లభ్యం. అద్భుతమైన డిజైన్‌తో ఆకట్టుకునే ఈ బైక్ ప్రారంభ ధర రూ. 88,078(ఎక్స్-షోరూమ్) బజాజ్ పల్సర్ 125 బజాజ్ పల్సర్ 125 ప్రస్తుతం భారతదేశంలో విక్రయించబడుతున్న పల్సర్ మోనికర్‌తో అత్యంత సరసమైన బైక్. రూ. 82,712 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర. 4 వేరియంట్లు 3 కలర్ ఆప్షన్లలో లభ్యం.ఈ బైక్‌లోని 124.4 సీసీ, ఎయిర్-కూల్డ్, DTSI ఇంజన్‌తో 1.64 bhp , 10.8 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. -
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: కరోనావైరస్ మహమ్మారి కాలంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) తన ఖాతాదారులకు ఊరటనిస్తోంది. కరోనా చికిత్స లేదా ఏదైనా ఇతర వైద్య అత్యవసర పరిస్థితుల్లో అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే సాయం చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఆకస్మిక వైద్య అత్యవసరాల నిమిత్తం ఈపీఎఫ్‌వో సభ్యులు తమ పీఎఫ్ ఖాతానుంచి లక్ష రూపాయలను అడ్వాన్స్ సదుపాయాన్ని అందిస్తోంది. ఇందుకు ఎటువంటి బిల్లు లేదా అంచనా వ్యయం వివరాలను చూపించాల్సిన అవసరం లేదు, ఈ మేరకు ఈపీఎఫ్‌వో జూన్ 1న ఒక సర్క్యులర్ జారీ చేసింది. కరోనావైరస్ సహా ఏదైనా ప్రాణాంతక వ్యాధి చికిత్సకు అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరినట్లయితే ఒక లక్ష మెడికల్ అడ్వాన్స్ ఇవ్వనున్నామని తెలిపింది. ఇందుకు ఇపిఎఫ్ సభ్యుడు ఎటువంటి బిల్లు లేదా అంచనా వ్యయాన్ని చూపించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసుకున్న గంటలోనే ఆ మొత్తం ఖాతాకు జమ చేస్తామని వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ సభ్యులు ఈ అడ్వాన్స్ ఎలా తీసుకోవచ్చో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ♦ రోగిని చికిత్స కోసం ప్రభుత్వ / ప్రభుత్వ రంగ యూనిట్ / సీజీజహెచ్ఎస్ ప్యానెల్ ఆసుపత్రిలో చేర్చాలి. ఒక వేళ అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరితే, అపుడు ఒక అధికారి వివరాలను పరిశీలించిన అనంతరం దీన్ని మంజూరు చేస్తారు. ♦ ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులెవరైనా ఆసుపత్రి , రోగి వివరాలను తెలియజేస్తూ ఒక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. ♦ అతడు, లేదా కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసిన ఒక గంటలోపే లక్ష రూపాయల మొత్తాన్ని జమచేస్తారు. ♦ ఈపీఎఫ్‌వో బోర్డు మే నెలలో జారీ చేసిన కోవిడ్ -19 అడ్వాన్స్‌కు ఇది పూర్తిగా భిన్నం.. ఇందులో మొత్తం ఫండ్‌లో నాన్ రిఫండబుల్ గా 75శాతం పొందే అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. -
ఇన్వెస్టర్లపై ఎల్టీసీజీ బాంబు
సాక్షి, ముంబై: భయపడ్డట్టుగానే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దీర్ఘకాలిక పెట్టుబడులపై బాంబు వేశారు. ఈక్విటీలలో దీర్ఘకాలిక పెట్టుబడులపైనా పన్ను విధించేందుకు ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఈక్విటీలలో దీర్ఘకాలిక పెట్టుబడులపై రూ. లక్షకు మించి ఆర్జించిన పక్షంలో 10 శాతం ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుందని బడ్జెట్లో జైట్లీ స్పష్టం చేశారు. ప్రస్తుతం సెక్యూరిటీల లావాదేవీల ద్వారా పన్ను(ఎల్టీసీజీ ) ఆదాయం రూ. 9,000 కోట్లుమాత్రమే లభిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఒక దశలో స్టాక్‌మార్కెట్లు 450 పాయింట్లకు పైగా పతనమయ్యాయి. అయితే భారీగా కోలుకుని 200పాయింట్ల లాభాల్లోకి మళ్లినా...తీవ్ర ఒడిదుడుకులతో కొనసాగుతున్నాయి. 10 శాతం పన్ను లక్షకు పైగా పెట్టుబడులుపై 10 శాతం ఎల్టీసీజీ(దీర్ఘకాలిక మూలధన పన్ను)ను విధించనున్నట్టు ప్రకటించారు. ఈ పన్ను విధింపును 2013, జనవరి 31నుంచి లెక్కిస్తారు. అంటే ఈక్వీటీ మార్కెట్లో షేర్లను కొనుగోలు చేసిన సంవత్సరం తరువాత లక్ష రూపాయలకుపైన పెట్టుబడులపై 10శాతం పన్ను (రూ.వెయ్యి) చెల్లించాల్సిందే. ఇది హేతుబద్ధం కాదని మార్కెట్ ఎనలిస్టులు పేర్కొన్నారు. జాబితాలో ఉన్న షేర్లు, యూనిట్ల నుంచి మినహాయించిన మూలధన లాభాలు 2017-2018 సంవత్సరానికి అంచనా వేసిన రిటర్న్స్ ప్రకారం రూ. 3,67,000 కోట్ల రూపాయలని తెలియజేశారు. ఎల్టీసీజీ విధింపుపై ఇన్వెస్టర్లు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఇది ఈక్విటీ పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. అయితే దీర్ఘకాలంగా మంచి ప్రయోజనాన్ని అందిస్తుందని మరికొంతమంది చెబుతున్నారు. తాజా నిర్ణయంతో ఆదాయం మార్పిడికి సంబంధించి భారీ అక్రమాలు తగ్గుముఖం పడతాయని మార్కెట్ విశ్లేషకుడు సందీప్ సబర్వాల్ తెలిపారు. ఈ భయంతో తక్షణమే ప్రాఫిట్బుకింగ్కు ఇన్వెస్టర్లు దిగుతారని మరో విశ్లేషకుడు మనీష్ పాండా పేర్కొన్నారు. ఎస్టీటీ అలాగే ఉంచడం దారుణమన్నారు. దీన్ని రిమూవ్ చేసి వుండాల్సిందని ఐఐఎఫ్ఎల్ ఫౌండర్ నిర్మల్ జైన్ అభిప్రాయపడ్డారు. ఒకే పన్ను ఒకే దేశం అనే బీజేపీ విధానానికి ఈ చర్య వ్యతిరేకమని రిలయన్స్ సెక్యూరిటీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బి.గోపి కుమార్ విమర్శించారు. సెక్యూరిటీల లావాదేవీ పన్నును (ఎస్టీటీ) తొలగించకుండా ఎల్టీసీజీ విధించడం అంటే ఒకే సమయంలో రెండు రకాల పన్నులు విధించడమే అన్నారు. మరోవైపు అమెరికా తరహాలో భారీ పరిశ్రమలకు లభిస్తుందనుకున్న ఊరట కాస్తా ఉసూరు మనిపించింది. కార్పొరేట్ పన్నులపై ఎలాంటి మినహాయింపులు ఇవ్వకపోవడం గమనార్హం. స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను 15 శాతంగానే కొనసాగనున్నట్టు పేర్కొన్నారు. -
భారత అథ్లెట్లందరికీ తలా లక్ష రూపాయలు
రియో ఒలింపిక్ గేమ్స్‌కు భారత గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నటుడు సల్మాన్ ఖాన్ ప్రతీ భారత అథ్లెట్‌కు ప్రోత్సాహకంగా లక్షా వేయి రూపాయల చొప్పున అందిస్తానని ట్విట్టర్లో పేర్కొన్నాడు. ‘మన ఒలింపిక్ అథ్లెట్లకు మరింత ప్రోత్సాహంగా బహుమానం ఇవ్వబోతున్నాను. క్రీడలకు కేంద్రం చాలా మద్దతు ఇస్తోంది. దీంట్లో భాగంగా మనం కూడా తోడ్పాటునందించాలి’ అని సల్మాన్ ట్వీట్ చేశాడు. -
ఆ కారు ధర రూ. లక్ష తగ్గింది..!
రెనాల్ట్ లాడ్జీ ఎంపీవీని కొనాలనుకుంటున్నారా..అయితే మీకు శుభవార్త. రెనాల్ట్ లాడ్జీ ఎంపీవీ ధరను ఏకంగా లక్ష రూపాయల వరకూ తగ్గిస్తూ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. టయోటా ఇన్నోవా క్రిస్టా, మారుతి సుజుకీ ఎర్టిగాలకు పెరుగుతున్న జనాదరణతో, రెనాల్ట్ ఇండియా తన లాడ్జీ ఎంపీవీ ధరను తగ్గించేసింది. ఓల్డ్ ఎంపీవీ అమ్మకాలు పెంచడానికి రెనాల్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపుతో 84బీహెచ్ పీ వేరియంట్ ధరల్లో మార్పులు రాగా.. 108బీహెచ్ పీ వేరియంట్ ధర మాత్రం అదేమాదిరి ఉన్నాయి. రెనాల్ట్ లాడ్జీ ఎంపీవీ కొత్త ధరలు(ఎక్స్ షోరూం, న్యూఢిల్లీ) : లాడ్జీ ఎస్ టీడీ - రూ.7,58,831( తగ్గింపు రూ.96వేలు) లాడ్జీ ఆర్ఎక్స్ఈ - రూ.8,56,831( తగ్గింపు రూ.80వేలు) లాడ్జీ ఆర్ఎక్స్ఎల్ - రూ.9,43,831(తగ్గింపు రూ.55వేలు) లాడ్జీ ఆర్ఎక్స్ జడ్ - రూ.10,99,000(తగ్గింపు రూ.34వేలు) రెనాల్ట్ లాడ్జీ ఎంపీవీను 2015 ఏప్రిల్ లో ఆవిష్కరించారు. 1.5 లీటర్ కే9కే డీజిల్ యూనిట్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్, గరిష్ట అవుట్ పుట్ శక్తి 84 బీహెచ్ పీ.. సిక్స్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్, గరిష్ట అవుట్ పుట్ శక్తి 108 బీహెచ్ పీని ఈ కారు కలిగి ఉంది. ఆటో పోర్టల్ డేటా ప్రకారం... లాడ్జీ ఎంపీవీ ఆవిష్కరణ నుంచి రెనాల్ట్ ఇండియా అమ్మకాలు కేవలం1252 యూనిట్లు మాత్రమే. 2016 మే లో 730 యూనిట్లు అమ్ముడుపోయాయి.