చాలామంది తక్కువ ధర వద్ద ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు ఈ తరహా వాహనాలను మార్కెట్లో లాంచ్ చేశాయి. ఈ కథనాల్లో రూ. 1 లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే.. మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్లను గురించి తెలుసుకుందాం.
యమహా రే జెడ్ఆర్ 125 (Yamaha Ray ZR 125)
యమహా కంపెనీ మార్కెట్లో లాంచ్ చేసిన 'రే జెడ్ఆర్ 125' రూ.1 లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే స్కూటర్లలో ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 87,800 (ఎక్స్ షోరూమ్). 52 కిమీ / లీ మైలేజ్ ఇచ్చే ఈ స్కూటర్ 125 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 8.2 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 5.2 లీటర్ కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఇందులో ఉంటుంది.
సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ 125 (Suzuki Burgman Street 125)
రూ. 96,800 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న.. సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ 125 ఒక లీటరుకు 50 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో 124 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ 8.7 పీఎస్ పవర్ అందిస్తుంది. మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్న బర్గ్‌మన్ స్ట్రీట్ 125 ఏకంగా 5.5 లీటర్ కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది మార్కెట్లోని ఇతర స్కూటర్ల కంటే భిన్నంగా ఉంటుంది.
యమహా ఫాసినో 125 (Yamaha Fascino 125)
యమహా ఫాసినో 125 ధర రూ. 83000 నుంచి రూ. 97500 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఆరు వేరియంట్లలో లభించే ఈ స్కూటర్ 49 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 125 సీసీ ఇంజిన్ 6500 rpm వద్ద 8.2 పీఎస్ పవర్ అందిస్తుంది. రోజువారీ వినియోగానికి ఉపయోగపడే స్కూటర్లలో ఇది కూడా ఒకటి.
హీరో ప్లెజర్ ప్లస్ (Hero Pleasure Plus)
హీరో ప్లెజర్ ప్లస్ ధర రూ. 70,500 నుంచి రూ. 74,000 (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. 50 కిమీ / లీ మైలేజ్ అందించే ఈ స్కూటర్ 4.8 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. 110 సీసీ ఇంజిన్ ద్వారా ఇది 8.15 పీఎస్ పవర్ అందిస్తుంది. సింపుల్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్.. రైడర్లకు కావలసిన ఫీచర్స్ కలిగి ఉంటుంది.
సుజుకి అవెనిస్ 125 (Suzuki Avenis 125)
మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో సుజుకి అవెనిస్ 125 ఒకటి. ఇది 49.6 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 94,500 నుంచి రూ. 95,300 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ స్కూటర్ 124 సీసీ ఇంజిన్ కలిగి 8.7 పీఎస్ పవర్ అందిస్తుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment