భారత్‌లోని బెస్ట్ అడ్వెంచర్ బైకులు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే? | Best Adventure Bikes in India Under Rs 3 Lakh | Sakshi
Sakshi News home page

భారత్‌లోని బెస్ట్ అడ్వెంచర్ బైకులు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?

Published Fri, Feb 21 2025 1:06 PM | Last Updated on Fri, Feb 21 2025 3:09 PM

Best Adventure Bikes in India Under Rs 3 Lakh

ఇండియన్ మార్కెట్లో రోజువారీ వినియోగానికి ఉపయోగపడే బైకులకు మాత్రమే కాకుండా.. అడ్వెంచర్ బైకులకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు సంస్థలు దేశీయ విఫణిలో సరికొత్త అలాంటి బైకులను లాంచ్ చేస్తున్నాయి. ఈ కథనంలో రూ. 3 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఐదు బెస్ట్ అడ్వెంచర్ మోటార్ సైకిళ్ళ గురించి తెలుసుకుందాం.

సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ (Suzuki V-Strom SX)
సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ దేశీయ విఫణిలో ఎక్కువ మందిని ఆకర్శించిన బైక్. దీని ధర రూ. 2.16 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ కొనుగోలుపై కంపెనీ ఇప్పుడు (ఫిబ్రవరి) రూ. 15,000 తగ్గింపును అందిస్తోంది. ఈ బైక్ 249 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 9300 rpm వద్ద, 26.1 Bhp పవర్, 7300 rpm వద్ద 22.2 Nm టార్క్ అందిస్తుంది. ఈ బైక్ పొడవైన విండ్‌స్క్రీన్, బీక్ స్టైల్ ఫ్రంట్ ఫెండర్, మస్క్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్‌తో మంచి డిజైన్‌ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, బ్లూటూత్ ఎనేబుల్డ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ స్లాట్ వంటివన్నీ ఉన్నాయి.

హీరో ఎక్స్‌పల్స్ 210 (Hero XPulse 210)
ఈఐసీఎంఏ 2024లో కనిపించిన హీరో ఎక్స్‌పల్స్ 210 అనేది.. అడ్వెంచర్ లైనప్‌లో తాజా వెర్షన్. ఇది ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో లాంచ్ అయింది. దీని ధర రూ. 1.75 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 210 సీసీ ఇంజిన్ 9250 rpm వద్ద, 24.2 Bhp పవర్, 7250 rpm వద్ద 20.7 Nm టార్క్ అందిస్తుంది. కొత్త డిజైన్ కలిగిన ఈ బైక్.. మంచి ఆఫ్ రోడ్‌ అనుభూతిని కూడా అందిస్తుంది.

కేటీఎమ్ 250 అడ్వెంచర్ (KTM 250 Adventure)
అడ్వెంచర్ బైక్ అంటే.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది కేటీఎమ్ బైకులే. కాబట్టి రూ. 3 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో 'కేటీఎమ్ 250 అడ్వెంచర్' ఉంది. దీని ధర రూ. 2.59 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఇందులోని 249 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్.. 9250 rpm వద్ద 30.5 Bhp పవర్, 7250 rpm వద్ద 24 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

యెజ్డీ అడ్వెంచర్ (Yezdi Adventure)
రూ. 2.09 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే.. యెజ్డీ అడ్వెంచర్ కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ బైక్. ఇది 334 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 8000 rpm వద్ద 29.1 Bhp పవర్, 6500 rpm వద్ద 29.8 Nm టార్క్ అందిస్తుంది. ఇది రౌండ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, పొడవైన విండ్‌స్క్రీన్, స్ప్లిట్ సీట్లు, వైర్-స్పోక్ వీల్స్ వంటివి పొందుతుంది. కాబట్టి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్: ఆ టోల్ ప్లాజాలకు వర్తించదు

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ (Royal Enfield Himalayan)
అడ్వెంచర్ చేసేవారికి ఇష్టమైన బైకులలో చెప్పుకోదగ్గ మోడల్ ''రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్''. ఇది 452 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా.. 8000 rpm వద్ద 39.4 Bhp పవర్, 5500 rpm వద్ద 40 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైకులో రౌండ్ TFT డిస్ప్లే, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్, రైడ్-బై-వైర్, మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ధర రూ. 2.85 లక్షలు (ఎక్స్ షోరూమ్).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement