Adventures
-
భారత్‌లోని బెస్ట్ అడ్వెంచర్ బైకులు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?
ఇండియన్ మార్కెట్లో రోజువారీ వినియోగానికి ఉపయోగపడే బైకులకు మాత్రమే కాకుండా.. అడ్వెంచర్ బైకులకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు సంస్థలు దేశీయ విఫణిలో సరికొత్త అలాంటి బైకులను లాంచ్ చేస్తున్నాయి. ఈ కథనంలో రూ. 3 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఐదు బెస్ట్ అడ్వెంచర్ మోటార్ సైకిళ్ళ గురించి తెలుసుకుందాం.సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ (Suzuki V-Strom SX)సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ దేశీయ విఫణిలో ఎక్కువ మందిని ఆకర్శించిన బైక్. దీని ధర రూ. 2.16 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ కొనుగోలుపై కంపెనీ ఇప్పుడు (ఫిబ్రవరి) రూ. 15,000 తగ్గింపును అందిస్తోంది. ఈ బైక్ 249 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 9300 rpm వద్ద, 26.1 Bhp పవర్, 7300 rpm వద్ద 22.2 Nm టార్క్ అందిస్తుంది. ఈ బైక్ పొడవైన విండ్‌స్క్రీన్, బీక్ స్టైల్ ఫ్రంట్ ఫెండర్, మస్క్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్‌తో మంచి డిజైన్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, బ్లూటూత్ ఎనేబుల్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ స్లాట్ వంటివన్నీ ఉన్నాయి.హీరో ఎక్స్‌పల్స్ 210 (Hero XPulse 210)ఈఐసీఎంఏ 2024లో కనిపించిన హీరో ఎక్స్‌పల్స్ 210 అనేది.. అడ్వెంచర్ లైనప్‌లో తాజా వెర్షన్. ఇది ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో లాంచ్ అయింది. దీని ధర రూ. 1.75 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 210 సీసీ ఇంజిన్ 9250 rpm వద్ద, 24.2 Bhp పవర్, 7250 rpm వద్ద 20.7 Nm టార్క్ అందిస్తుంది. కొత్త డిజైన్ కలిగిన ఈ బైక్.. మంచి ఆఫ్ రోడ్ అనుభూతిని కూడా అందిస్తుంది.కేటీఎమ్ 250 అడ్వెంచర్ (KTM 250 Adventure)అడ్వెంచర్ బైక్ అంటే.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది కేటీఎమ్ బైకులే. కాబట్టి రూ. 3 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో 'కేటీఎమ్ 250 అడ్వెంచర్' ఉంది. దీని ధర రూ. 2.59 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఇందులోని 249 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్.. 9250 rpm వద్ద 30.5 Bhp పవర్, 7250 rpm వద్ద 24 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.యెజ్డీ అడ్వెంచర్ (Yezdi Adventure)రూ. 2.09 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే.. యెజ్డీ అడ్వెంచర్ కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ బైక్. ఇది 334 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 8000 rpm వద్ద 29.1 Bhp పవర్, 6500 rpm వద్ద 29.8 Nm టార్క్ అందిస్తుంది. ఇది రౌండ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, పొడవైన విండ్‌స్క్రీన్, స్ప్లిట్ సీట్లు, వైర్-స్పోక్ వీల్స్ వంటివి పొందుతుంది. కాబట్టి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్: ఆ టోల్ ప్లాజాలకు వర్తించదురాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ (Royal Enfield Himalayan)అడ్వెంచర్ చేసేవారికి ఇష్టమైన బైకులలో చెప్పుకోదగ్గ మోడల్ ''రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్''. ఇది 452 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా.. 8000 rpm వద్ద 39.4 Bhp పవర్, 5500 rpm వద్ద 40 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైకులో రౌండ్ TFT డిస్ప్లే, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్, రైడ్-బై-వైర్, మల్టిపుల్ రైడింగ్ మోడ్లు, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ధర రూ. 2.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). -
మునుపటి కాలం కాదు ఇది, కానీ..
మునుపటి కాలం కాదు ఇది. సెలవులు, తీరిక దొరకగానే ఇంటి నాలుగు గోడలకు పరిమితం కావాలనుకోవడం లేదు మహిళలు. సోలో ట్రావెలర్స్‌గా అవుట్డోర్ థ్రిల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక కోణంలో చూస్తే....‘ఆహా... ఎంత మార్పు’ అనిపిస్తుంది. మరో కోణంలో చూస్తే అవుట్డోర్ అడ్వెంచర్లలో మహిళలకు సౌకర్యాలు, భద్రతాపరంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి..గత కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో మహిళా సాహస బృందాలు, సోలో ఉమెన్ ట్రావెలర్లు పెరిగారు. చాలామంది మహిళలు సెలవుల్లో ఇంటికి పరిమితం కావడానికి బదులు అవుట్డోర్ థ్రిల్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. మన దేశంలో పర్వతారోహణ, స్కీయింగ్, స్కూబా డైవింగ్, పారాగ్లైడింగ్... మొదలైన సాహస విభాగాల్లో శిక్షణను అందించే సంస్థల నుండి ప్రతి సంవత్సరం మహిళలు పెద్ద సంఖ్యలో శిక్షణ తీసుకుంటున్నారు. అయినప్పటికీ..మహిళల నేతృత్వంలోని అడ్వెంచర్ టూరిజం కంపెనీలు కొన్ని మాత్రమే ఉన్నాయి. టూరిజం ఇండస్ట్రీ ఉమెన్ ట్రావెలర్ల అవసరాలను పూర్తిగా తీర్చడం లేదు. మహిళా గైడ్లు, సహాయ సిబ్బంది కొరత గణనీయంగా ఉంది. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మాత్రమే మహిళా గైడ్లను నియమించుకుంటున్నాయి. ‘గైడ్ అంటే పురుషులు మాత్రమే’ అనే భావనను పునర్నిర్వచించడమే కాకుండా మహిళా ప్రయాణికులకు భరోసాగా నిలుస్తున్నారు ఫిమేల్ గైడ్లు. మారుమూల ప్రాంతాలలో సౌకర్యవంతమైన వాతావరణానికి కృషి చేస్తున్నారు.మహిళా భద్రతా కోణంలో జెండర్ సెన్సివిటీ ట్రైనింగ్ అనేది కీలకంగా మారింది. ఈ శిక్షణ మేల్ గైడ్స్ ‘జెండర్ డైనిమిక్స్’ను అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు లైంగిక వేధింపులను నివారించడానికి సహాయపడుతుంది. భద్రత, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఉమెన్ ట్రావెలర్స్‌కు అవసరమయ్యే ఎక్విప్మెంట్ను రూపొందించాల్సిన బాధ్యత టూరిజం కంపెనీలపై ఉంది. శానిటరీ ప్రొడక్ట్స్, మెన్స్ట్రువల్ క్రాంప్స్ కోసం పెయిన్ రిలీఫ్ మందులు, ఆరోగ్యం, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్టాండర్డ్ మెడికల్ కిట్లు అందుబాటులోకి తేవాలి. ‘సోలో ట్రావెలర్, అవుట్ డోర్ ప్రొఫెషనల్‌గా ఎన్నోసార్లు అసౌకర్యానికి గురయ్యాను. మహిళల సాహస ప్రయాణాలలో మౌలిక సదుపాయాల తక్షణ అవసరం ఉంది’ అంటుంది మౌంటెనీర్, ఎంటర్ప్రెన్యూర్ అనూష సుబ్రమణ్యియన్.ఇలా అంటున్నారు.. ఇటీవల ఒక సంస్థ సోలో ఉమెన్ ట్రావెలర్స్ గురించి నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 29 శాతం మంది భద్రత గురించి ఆందోళన చెందారు. మరో 29 శాతం మంది శారీరక సౌకర్యం (ఫిజికల్ కంఫర్ట్), 23 శాతం మంది వెహికిల్ బ్రేక్‌డౌన్స్, 13 శాతం మంది లైంగిక వేధింపుల గురించి ఆందోళన చెందారు. ఎవరి అభిప్రాయం మాట ఎలా ఉన్నా అడ్వెంచర్ టూరిజం ఇండస్ట్రీ మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది అందరి నోటి నుంచి వినిపించిన మాట.ఇవి చదవండి: డ్యాన్సింగ్ సిటీ.. హిప్హాప్ స్టెప్స్.. -
ఈ స్పైడర్ మ్యానుడు చపాతీలు కూడా చేస్తాడు
స్పైడర్ మ్యాన్ అంటే... పది అంతస్తుల బిల్డింగ్ నుంచి అవలీలగా జంప్ చేసేవాడు. అగ్నిగుండంలో హాయిగా మార్నింగ్ వాక్ చేసేవాడు... టోటల్‌గా చెప్పుకోవాలంటే ‘స్పైడర్ మాన్’ అంటే సాహసాల సాగరం.‘స్పైడర్ మ్యాన్ అంటే అస్తమానం సాహసాలేనా? ఇలా కూడా’ అని ఒక జైపూర్ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. 13 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.‘ఇంతకీ అతడు ఏంచేశాడు?’ అనే విషయానికి వస్తే.... స్పైడర్‌మ్యాన్ డ్రెస్ వేసుకొని చపాతీలు చేశాడు. ఇల్లు శుభ్రంగా ఊడ్చాడు. గిన్నెలు శుభ్రం చేశాడు. ఎండలో తల మీద ఇటుకలు మోశాడు. ‘అసలు సిసలు సాహసాలంటే ఇవే’ అన్నారు నెటిజనులు. ‘గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ’ అంటూ స్పైడర్–మ్యాన్ సినిమాలలోని ఐకానిక్ డైలాగును ఉటంకించారు. -
హైదరాబాద్‌లో అడ్వెంచర్స్.. వీకెండ్లో చిల్ అవ్వండి
హైదరాబాద్‌లో అంటేనే నోరూరించే కమ్మని వంటకాలు, అనేక పర్యాటక ప్రదేశాలకు ఫేమస్. వీకెండ్ వచ్చిందంటే చాలు వివిధ ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి వచ్చి రిలాక్స్ అవుతుంటారు. అడ్వెంచర్ యాక్టివిటిస్కి కూడా హైదరాబాద్ అడ్డాగా మారుతుంది. ఒకప్పుడు పారాగ్లైడింగ్ అంటే గోవా, బెంగళూరు వంటి ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ వేదికగా ఎన్నో అడ్వెంచర్ స్పాట్స్, అది కూడా తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చేశాయి. అవేంటో తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే. బంగీ జంపింగ్ లైఫ్‌లో ఒక్కసారైనా బంగీ జంపింగ్‌ను ఆస్వాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొండలు, బ్రిడ్జి వంటి ఎత్తైన ప్రదేశాల నుంచి తాళ్లతో శరీరాన్ని కట్టుకొని కిందకు దూకండి చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. బంగీజంపింగ్ చేయాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ అడ్వెంచర్ యాక్టివిటి కోసం మన హైదరాబాద్‌లోనే చాలా ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. వాటిలో రామోజీ ఫిల్మ్ సిటీ,లియోనియా రిసార్ట్, డిస్ట్రిక్ గ్రావిటి పార్క్ వంటి ప్రాంతాల్లో అందుబాలో ఉంది. దీని ధర సుమారు రూ.3500 నుంచి 4500 వరకు ఉంటుంది. 12 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వ్యక్తులు ఎవరైనా బంగీ జంప్ చేయొచ్చు. దీనికోసం ముందుగానే బీపీ, హార్ట్‌రేట్ వంటివి చెక్ చేస్తారు. ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తులకే బంగీ జంపింగ్ అనుమతిస్తారు. పారాగ్లైడింగ్ రెక్కలు కట్టుకొని ఆకాశలో ఎగురుతూ భూమిపై ఉన్న ప్రకృతి అందాలను చూడాలంటే పారాగ్లైడింగ్ బెస్ట్ ఛాయిస్.ఆకాశంలో పక్షలతో పోటీ పడి ఎగురుతూ భూమి పై అందాలను ఆస్వాదించవచ్చు. అయితే పారాగ్లైడింగ్ అన్ని చోట్ల వీలు పడదు. ఇందుకు కొంత ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులతో పాటు వాతావరణం కూడా అనుకూలించాలి. హైదరాబాద్‌లో కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర్లో అందుబాటులో ఉంది. ధర రూ.3500 జిప్‌లైన్ చాలా ప్రాంతాల్లో జిప్‌లైన్ కోసం 50 మీటర్ల నుంచి ఎత్తులో బ్యూటిఫుల్ నేచర్‌ను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. హైదరాబాద్‌లో శామీర్‌పేట్‌లోని డిస్ట్రిక్ట్ గ్రావిటీ అడ్వెంచర్ పార్క్, ఎక్సోటికా బొటిక్ రిసార్ట్ వంటి ప్రాంతాల్లో జిప్‌లైన్ యాక్టివిటి అందుబాలో ఉంటుంది. ధర రూ. 700-1000 వరకు ఉంటుంది. వీకెండ్స్‌లో ధర మారుతుంది) స్కై డైవింగ్ ఎత్తుగా ఉండే ప్రాంతాల నుంచి గాల్లోకి దూకే సాహసక్రీడను స్కై డైవింగ్ అంటారు. వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం నుంచి ఒక్కసారిగా కిందికి దూకుతూ చేసే స్కై డైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇండోర్‌లో కూడా పొందచ్చు. అది ఎక్కడంటే..గండిపేట సమీపంలో గ్రావిటీజిప్ అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో ఈ ఇండోర్ స్కై డైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందిచ్చు. ఇందుకోసం ఇండోర్ స్కైడైవింగ్ కోసం 23 అడుగుల ఎత్తుతో ప్రత్యేక సిలిండర్ రూపొందించారు. ధర సుమారు రూ. 3300 నుంచి 4300 వరకు ఉంటుంది. (వీకెండ్స్‌లో ధర మారుతుంటుంది) ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ కోసం సిటీలో చాలా ప్రాంతాలు ఉన్నా అనంతగిరి హిల్స్ బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. వీకెండ్ వస్తే చాలు ఇక్కడికి ఫ్రెండ్స్‌తో ఎక్కువగా హైదరబాదీలో ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు. ఇందుకోసం రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. క్లౌడ్ డైనింగ్ సాధారణంగా రెస్టారెంట్లో ఎవరైనా భోజనం చేస్తారు. కానీ ఆకాశానికి, భూమికి మధ్యలో ఎత్తైన ప్రదేశంలో భోజనం చేస్తే ఆ ఫీలింగే వరే. గాల్లోకి ఎగిరిపోయి అక్కడి నుంచి కిందకు చూస్తూ భోజనం చేస్తే ఆ థ్రిల్లింగ్ చెప్పక్కర్లేదు. ఇండియాలోనే మొట్టమొదటిసారి ఇలాంటి ఎక్స్పీరియన్స్ పొందాలంటే హైదరాబాద్‌లోని క్లౌడ్ డైనింగ్‌కు వెళ్లాల్సిందే. ఇది హైటెక్ సిటీ సమీపంలో ఉంటుంది. ఈ క్లౌడ్ డైనింగ్.. భూమికి 160 ఎత్తుల అడుగులో ఉంటుంది. దాదాపు అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ భోజనం చేయాలంటే.. రూ.5,000 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. -
ప్రపంచంలోని టాప్ 10 సాహస ప్రదేశాలు
-
కలల అలలపై... అలలు అలలుగా
అలలు అలలుగా తెరలు తెరలుగా తరగలు తరగలుగా ఎగిసిపడిన కెరటాలుగా నల్ల సముద్రం , నీలి సంద్రం ఎర్ర సముద్రం మొత్తంగా సప్త సముద్రాలు వాటి లోతు తెలిసేలా , వాటి ఆటుపోట్లను అర్థం చేసుకునేలా అన్నింటిని చుట్టేస్తూ ఆమె తన కలల ప్రయాణానికి సిద్ధమైంది. పాఠాలు చెప్పే ఆ పంతులమ్మ జీవిత చరమాంకంలో సముద్ర ఘోష వింటూ తన అనుభూతులకి అక్షరరూపమివ్వాలని ఆశపడుతోంది. హాయిగా మనవలు, మనవరాళ్లతో కాలం గడిపే వయసు. ఏ బాదర బందీ లేకుండా ఎవరో వండిపెడితే తింటూ కాలం గడిపే వయసు. అయినా ఆమెలో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. సర్వస్వతంత్రంగా వ్యవహరించే ఆమె తనకున్న ఆస్తుల్ని అమ్మకానికి పెట్టారు. ఎం.వి.జెమిని అనే నౌకలో ప్రపంచ యాత్ర చెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆమే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన షరాన్ లేన్. ఇప్పుడు ఆమె వయసు 75 ఏళ్లు. హైస్కూలు రిటైర్డ్ టీచర్. చిన్నప్పట్నుంచి ప్రయాణాలంటే ఆమెకు చాలా ఇష్టం. అడ్వంచర్స్ అంటే చెప్పలేనంత థ్రిల్. స్కూల్లో విదేశీ భాషలు బోధించేవారు. స్కూలు పిల్లల్ని తీసుకొని యూరప్ దేశాలన్నీ చుట్టేసి వచ్చారు. అయినా ఆమెకు లైఫ్‌లో ఏదో అసంతృప్తి. ఇంకొన్ని దేశాలు తిరగాలి. అక్కడ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు తెలుసుకోవాలి. సరికొత్త రుచులు చవి చూడాలి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. జీవితంలో అనుక్షణం కొత్తదనం కోసం పరితపించే లేన్‌కు ఎంవి.జెమిని అనే నౌక ప్రయాణం ఒక చుక్కానిలా కనిపించింది. ఈ నౌక ప్రపంచాన్ని చుట్టి వస్తుందని సన్నిహితులు చెబితే తెలుసుకున్నారు. ఒక రోజు కాదు రెండ్రోజులు కాదు ఏకంగా మూడేళ్లు నౌక ప్రయాణం. ఆ నౌకలో అత్యంత తక్కువ ధరకి లభించే ఒక చిన్న కేబిన్లాంటి గదికి ఏడాదికి 30 వేల డాలర్లు చెల్లించాలి. తన ఆస్తిపాస్తుల్ని అమ్మేస్తే మూడేళ్లకి సరిపడా డబ్బులు వచ్చేస్తాయని ఆ గది బుక్ చేసుకున్నారు. ఆ చిన్న గదికి కనీసం కిటికీ కూడా ఉండదు. కానీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక చిన్న స్క్రీన్ ఏర్పాటు చేస్తారు. అదే మహద్భాగ్యంగా భావించారు. నవంబర్ 1 నుంచి ఈ నౌక ప్రయాణం ప్రారంభమవుతుంది. కూతురికి చెబితే ఏమంటుందోనని ఆమెకి మాట మాత్రంగానైనా చెప్పలేదు. గాలి, ఎండ సోకని ఆ గదిలో కేవలం రాత్రి పూట మాత్రమే గడిపి మిగిలిన సమయమంతా తనకెంతో ఇష్టమైన సముద్రాన్ని చూస్తూ గడిపేస్తానని చెబుతున్నారు. నౌకలో తోటి ప్రయాణికులతో మాటలు కలపడం, కొత్త స్నేహితుల్ని చేసుకోవడం కూడా ఆమెకు ఇష్టమే. మొత్తం మూడేళ్ల పాటు సాగే ప్రయాణంలో ఎంవి జెమిని నౌక 375 రేవు పట్టణాల్లో ఆగుతుంది. ఇండియా నుంచి చైనా, మాల్దీవ్స్, ఆస్ట్రేలియా ఇలా అన్ని దేశాలు తిరుగుతుంది. ‘‘నాకున్న లక్ష్యం ఒక్కటే. ప్రతీ రోజూ ఏదో ఒక కొత్త విషయం నా బ్లాగ్‌లో రాయాలి. కలం పేరుతో ఒక బ్లాగ్‌ను ఏర్పాటు చేసి అందులో నా అనుభవాలన్నీ కథలుగా రాస్తాను. ఎవరైనా నాలుగ్గోడల మధ్య మగ్గిపోతూ ఇంట్లో కూర్చుంటే ఏం వస్తుంది. పది మందిలో తిరిగితేనే జీవితంపై అవగాహన వస్తుంది. అందులోనూ సముద్రాన్ని చూస్తూ ప్రయాణమంటే అదో అవధుల్లేని అనుభూతి. ఇల్లంటే మన మనసుకి ఎంతో ఇష్టమైన ప్రదేశమే కావొచ్చు. కానీ విమానమో, పడవో, రైలో ఏదో ఒకటి ఎక్కి బయట ప్రపంచాన్ని చూడండి. అదెంత అద్భుతంగా ఉంటుందో’’ అని లేన్ తన మనసులో మాట వెల్లడించారు. మూడేళ్లంటే తక్కువ కాలం ఏమీ కాదు. అందులోనూ కరోనా సోకిన తర్వాత ఆమె శ్వాసకోశ సంంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. అయినా కూడా ఆమె దేనికీ భయపడట్లేదు. ఇల్లు కంటే పడవే పదిలమంటున్నారు. తాను ప్రయాణించే పడవలో కూడా అనారోగ్యం వస్తే చికిత్స అందించే ఏర్పాట్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఇలా ఒంటరి ప్రయాణం ఆమెకు కొత్తేం కాదు. చాలా కాలంగా ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు. ఇప్పుడీ ప్రయాణం ఆమెలో ఉత్సాహాన్ని నింపి వయసుని మరింత తగ్గించింది. మరి మనమూ లేన్‌కి హ్యాపీ జర్నీ చెప్పేద్దాం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
షీ ఈజ్ అన్‌స్టాపబుల్
నేవీ వెల్నెస్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని, నౌకాదళానికి చెందిన వివిధ విభాగాల మహిళలు ‘షీ ఈజ్ అన్‌స్టాపబుల్’ నినాదంతో ఈ నెల 14న దిల్లీలోని వార్ మెమోరియల్ నుంచి కారు యాత్ర చేపట్టారు. వివిధ నగరాల గుండా సాగిన ఈ కారు యాత్ర మహిళా యోధుల విజయాలను ప్రచారం చేస్తోంది. జైపూర్‌లోని ఒక కళాశాలలో... నావికా దళానికి చెందిన పాయల్ గుప్తా వికాస్ శ్రేయాన్, కుషాల్ పండేకర్లు గోవా నుంచి పోర్ట్ లూయిస్ (ఈస్ట్ ఆఫ్రికా) వరకు చేసిన సంచలన సముద్ర యాత్ర గురించి కళ్లకు కట్టినట్లు వివరించారు. వాతావరణ పరిస్థితులను తట్టుకొని 21 రోజుల పాటు 4.500 కి.మీ నాస్స్టాప్గా సాగిన ఈ సాహస సముద్రయాత్ర గురించి విద్యార్థులు ప్రశ్నల వర్షం కురిపించడంతో పాటు నేవీలో చేరడానికి అవసరమైన విద్యార్హతల గురించి ఆసక్తిగా అడిగారు. బికనేర్‌లోని ఒక స్కూల్లో... లెఫ్టినెంట్ కమాండర్ వర్తికా జోషి నేతృత్వంలో లెఫ్టినెంట్ కమాండర్లు ప్రతిభ జమ్వాల్, స్వాతి, విజయాదేవి, ఐశ్వర్య, పాయల్గుప్తాలు దేశీయంగా తయారుచేసిన ఐఎన్ఎస్వీ తరిణి నౌక ద్వారా వివిధ దేశాలు చుట్టి వచ్చిన ‘నావికా సాగర్ పరిక్రమ’ గురించి ‘షీ ఈజ్ అన్‌స్టాపబుల్’ బృందం చెప్పింది విన్న తరువాత విద్యార్థులు చప్పట్లు కొట్టారు. తమకు కూడా అలాంటి సాహసాలు చేయాలని ఉందని మనసులో మాట చె΄్పారు. నావికాదళానికి సంబంధించి మహిళల సాహసగాథలు మాత్రమే కాకుండా అలనాటి స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను చెప్పి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను గుర్తు తెచ్చుకుంది ఈ బృందం. ఇలా ఎన్నో పట్టణాలలో స్కూల్, కాలేజీ విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి నావికాదళ ప్రాముఖ్యత, నావికాదళంలో ఉద్యోగావకాశాల గురించి తెలియజేయడం మాత్రమే కాదు వ్యక్తిత్వ వికాస కోణంలో ఈ బృందం సభ్యులు స్ఫూర్తిదాయకమై ఉపన్యాసాలు ఇచ్చారు. లైఫ్‌స్కిల్స్ గురించి వారికి అర్థమయ్యే భాషలో వివరించారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలను సందర్శించి అక్కడ ఉంటున్న వారితో ఆప్యాయంగా మాట్లాడారు. మహిళల సముద్ర సాహసయాత్రలు ఆయా కాలాలకు మాత్రమే పరిమితమైనవి కావు. ఆ యాత్రలలో ఎన్నో కథలు దాగున్నాయి. శక్తిమంతమైన స్ఫూర్తి ఉంది. వీటిని ప్రజలకు చేరువ చేయడం ‘షీ ఈజ్ అస్స్టాపబుల్’ యాత్ర ముఖ్య ఉద్దేశం. వచ్చిన స్పందన చూస్తే యాత్ర ఉద్దేశం నెరవేరిందని చెప్పవచ్చు. ‘నారీశక్తి స్ఫూర్తిని ప్రజల చెంతకు తీసుకువెళ్లడానికి, నావికాదళంలో చేరాలనే ఉత్సాహాన్ని యువతలో కలిగించడానికి ఈ యాత్ర ఉపయోగపడింది’ అంటున్నారు వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి. 2,300 కి.మీల ఈ ఆల్–ఉమెన్ కారు యాత్ర ఈరోజు దిల్లీలో ముగుస్తుంది. -
Zoya Agarwal: అబ్బురపరిచే సాహసికి... అరుదైన గౌరవం
మ్యూజియం అంటే వస్తు,చిత్ర సమ్మేళనం కాదు. అదొక ఉజ్వల వెలుగు. అనేక రకాలుగా స్ఫూర్తిని ఇచ్చే శక్తి. అలాంటి ఒక మ్యూజియంలో కెప్టెన్ జోయా అగర్వాల్ సాహసాలకు చోటు దక్కింది... శాన్ఫ్రాన్సిస్కో(యూఎస్)లోని ఏవియేషయన్ మ్యూజియం వైమానికరంగ అద్భుతాలకు వేదిక. అక్కడ ప్రతి వస్తువు, ప్రతి చిత్రం, పుస్తకం...ప్రపంచ వైమానికరంగ వైభవానికి సంబంధించి ఎన్నో విషయాలను చెబుతుంది. అలాంటి మ్యూజియంలో ఇప్పుడు మన దేశానికి చెందిన జోయా అగర్వాల్ సాహస చరిత్రకు చోటుదక్కింది. ఈ ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియంలో చోటు సంపాదించిన తొలి భారతీయ మహిళా పైలట్‌గా చరిత్ర సృష్టించింది జోయా. ఇప్పుడు ఆమె అద్భుత సాహసాన్ని చిత్రాల నుంచి వస్తువుల వరకు రకరకాల మాధ్యమాల ద్వారా తెలుసుకోవచ్చు. స్ఫూర్తి పొందవచ్చు. దిల్లీలో జన్మించిన జోయాకు చిన్నప్పటి నుంచి సాహసాలు అంటే ఇష్టం. పైలట్ కావాలనేది ఆమె కల. అయితే తల్లిదండ్రులు భయపడ్డారు. ‘పైలట్ కావడానికి చాలా డబ్బులు కావాలి. అంత స్తోమత మనకు ఎక్కడ ఉంది తల్లీ’ అని కూడా అన్నారు. అయితే అవేమీ తన మనసును మార్చలేకపోయాయి.ఏవియేషన్ కోర్స్ పూర్తయినరోజు తన ఆనందం ఎంతని చెప్పాలి! మొదటి అడుగు పడింది. ఒక అడుగు అంటూ పడాలేగానీ దారి కనిపించడం ఎంతసేపని! తొలిసారిగా దుబాయ్‌కి విమానాన్ని నడిపినప్పుడు జోయా సంతోషం ఆకాశాన్ని అంటింది. పైలట్ కావాలనుకొని అయింది. ఆ తరువాత కెప్టెన్ కూడా అయింది....ఇక చాలు అని జోయా అక్కడితో ఆగిపోయి ఉంటే ప్రపంచ వైమానికరంగ చరిత్రలో ఆమెకు అంటూ ఒక పుట ఉండేది కాదు. కోవిడ్ కోరలు చాచిన కల్లోల సమయంలో ‘వందే భారత్ మిషన్’లో భాగంగా విమానం ద్వారా విదేశాల్లో ఉన్న ఎంతోమంది భారతీయులను స్వదేశానికి క్షేమంగా తీసుకువచ్చి ‘శభాష్’ అనిపించుకుంది. ఇక అతిపెద్ద సాహసం గత సంవత్సరం చేసింది. నలుగురు మహిళా పైలట్లను కూర్చోబెట్టుకొని ఉత్తరధ్రువం మీదుగా 17 గంటల పాటు విమానం నడిపి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని జోయాను ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధిగా నియమించడం అరుదైన గౌరవం. ‘అంకితభావం మూర్తీభవించిన సాహసి కెప్టెన్ జోయా అగర్వాల్. ఆమె విజయాలు, సాహసాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తాయి. వారి కలను నెరవేర్చుకునేలా చేస్తాయి. మ్యూజియంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చరిత్ర, విజయాలు ఈ తరానికే కాదు, భవిష్యత్తరాలకు కూడా ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి’ అంటున్నారు శాన్ఫ్రాన్సిస్కో ఎవియేషన్ మ్యూజియం అధికార ప్రతినిధి. ‘ఇది కలా నిజమా! అనిపిస్తుంది. ఈ గుర్తింపు నా దేశానికి, నాకు గర్వకారణం’ అంటుంది జోయా. జోయా అగర్వాల్ ప్రతిభ, సాహసం కలగలిసిన పైలట్ మాత్రమే కాదు యువతరాన్ని కదిలించే మంచి వక్త కూడా. ‘రాత్రివేళ ఆరుబయట కూర్చొని ఆకాశాన్ని చూస్తున్న ఎనిమిది సంవత్సరాల బాలికను అడిగేతే, తాను కచ్చితంగా పైలట్ కావాలనుకుంటుంది’ అంటుంది జోయా అగర్వాల్. అయితే అలాంటి బాలికలు తమ కలను నెరవేర్చుకోవడానికి జోయాలాంటి పైలట్ల సాహసాలు ఉపకరిస్తాయి. తిరుగులేని శక్తి ఇస్తాయి. -
అవకాశాలు కల్పిస్తే ఏదైనా సాధిస్తాం
మాదాపూర్(హైదరాబాద్): అవకాశాలు కల్పిస్తే మహిళలు ఏదైనా సాధించగలరని, అందుకు తానే చక్కటి ఉదాహరణ అని మాలావత్ పూర్ణ అన్నారు. తాజాగా నార్త్ అమెరికాలోని మౌంట్ డెనాలి ఆరోహించి.. ఏడు శిఖరాలను అధిరోహించిన అతి చిన్న వయసు భారతీయ మహిళగా, తొలి దక్షిణ భారతీయురాలిగా పూర్ణ రికార్డులు సృష్టించారు.ఈ సందర్భంగా మాదాపూర్‌లోని హోటల్ ఆవాసాలో అమె మీడియాతో ముచ్చటించారు. 35–40 కేజీల బరువుతో... ‘‘ఏడు పర్వతాలు అధిరోహించడం ఆనందంగా ఉంది. నార్త్ అమెరికాలోని డెనాలి పర్వత (6,190 మీటర్ల ఎత్తు గల) శిఖరాన్ని చేరుకోవడానికి ఎంతో కసరత్తు చేయాల్సి వచ్చింది. మిగిలిన పర్వతాలకు సహాయకులు, గైడ్లు, పోర్టర్లు అందుబాటులో ఉంటారు. కానీ ఈపర్వతానికి అలాంటి అవకాశం లేదు. దాదాపు 35 నుంచి 40 కేజీల జరువుగల 25 రోజులకు సరిపడా ఆహారాన్ని, సామగ్రిని మేమే తీసుకెళ్లాం. జూన్ 5వ తేదీన డెనాలి పర్వతాన్ని అధిరోహించాం. ‘ట్రాన్సెండ్ అడ్వెంచర్స్’ ద్వారా 7–సమ్మిట్స్ పూర్తి చేశాను. ఈ యాత్రకు ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ వాళ్లు స్పాన్సర్ చేశారు. కోచ్ శేఖర్‌బాబు, ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ చైర్మన్ వైవీ గోపాల కృష్ణమూర్తి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బూక్యా శోభన్‌బాబుల ప్రోత్సాహం మరువలేనిది’’ అని పూర్ణ తెలిపారు. 7–సమ్మిట్స్ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చిన పూర్ణను ఏస్ ఇంజనీరింగ్ అకాడమీవారు సన్మానించారు. అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వైవీ గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ పిల్లల విజయాలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమన్నారు. ఓయూలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న పూర్ణ మరిన్ని శిఖరాలను అధిరోహించాలని, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. -
ట్రయంఫ్ టైగర్ 1200 అడ్వెంచర్ బైక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం మోటార్‌సైకిల్స్ తయారీలో ఉన్న బ్రిటిష్ బ్రాండ్ ట్రయంఫ్ తాజాగా భారత్‌లో సరికొత్త టైగర్ 1200 అడ్వెంచర్ బైక్‌ను విడుదల చేసింది. జీటీ ప్రో, ర్యాలీ ప్రో, అలాగే సుదూర ప్రయాణాల కోసం జీటీ ఎక్స్‌ప్లోరర్, ర్యాలీ ఎక్స్‌ప్లోరల్ వేరియంట్లలో ఇది లభిస్తుంది. ధర ఎక్స్‌షోరూంలో రూ.19.19 లక్షల నుంచి ప్రారంభం. టైగర్ 1200 చేరికతో అడ్వెంచర్ మోటార్‌సైకిల్ విభాగంలో 660 నుంచి 1200 సీసీ శ్రేణిలో తొమ్మిది మోడళ్లను కంపెనీ పరిచయం చేసినట్టు అయింది. -
వయసుకు సవాలు విసురుతూ.... మరో సాహసానికి సై!
‘ఈ వయసులో సాహసం ఏమిటి!’ అనుకునే వాళ్లు చాలామందే ఉండొచ్చు. ‘సాహసానికి వయసుతో పనేమిటి?’ అని దూసుకుపోయేవాళ్లు చాలా తక్కువమందే ఉండొచ్చు. అయితే రెండో కోవకు చెందిన చాలా తక్కువ మందే చాలా ఎక్కువమందికి స్ఫూర్తి ఇస్తుంటారు బచేంద్రిపాల్ ఈ కోవకు చెందిన మహిళ. బచేంద్రిపాల్... పర్వతాలు పులకరించే పేరు. సాహసాలు అమితంగా ఇష్టపడే పేరు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలిభారతీయ మహిళగా ఆమె పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. అరవై ఏడు సంవత్సరాల పాల్ ఈ వయసులోనూ మరో సాహసయాత్రకు సిద్ధం అవుతున్నారు. సాహసానికి సై అంటున్నారు. యాభై ఏళ్లు దాటిన తొమ్మిదిమంది మహిళలతో కలిసి అపూర్వ సాహస యాత్ర చేయబోతున్నారు. బృందానికి నాయకత్వం వహిస్తారు. అరుణాచల్‌ప్రదేశ్ నుంచి మొదలయ్యే యాత్ర లద్దాఖ్‌లో ముగుస్తుంది. హిమాలయపర్వతశ్రేణుల గుండా సుమారు అయిదు నెలల పాటు సాగే యాత్ర ఇది. ఈ యాత్రలో వయసు పరిమితులు, వాతావరణ ప్రతికూలతలు, పదిహేడువందల అడుగులకుౖ పెగా ఎత్తు ఉన్న ‘లంకాగ’లాంటి పర్వతాలు సవాలు విసరనున్నాయి. ఈ సాహస బృందంలోని సభ్యులు: 1. బచేంద్రిపాల్ (67, ఉత్తర్ కాశీ) 2. గంగోత్రి సోనేజి (62, బరోడా) 3. శ్యామలాపద్మనాభన్ (64, మైసూర్) 4. చేతనా సాహు (54, కోల్‌కతా) 5. పాయో ముర్ము (53, జంషెడ్పూర్) 6. చౌలా జాగిర్దార్ (63, పాలన్పుర్) 7. సవితా దప్వాల్ (52, భిలాయ్) 8. డాక్టర్ సుష్మా బిస్సా (55, బికనేర్) 9. బింబ్లా దేవోస్కర్ (55, నాగ్‌పుర్) 10. మేజర్ కృష్ణ దూబే (59, లక్నవూ) ‘సాహసాలకు ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే, ఇక చాలు అనిపించవు. ప్రతీ సాహసం దేనికదే ప్రత్యేకతగా నిలుస్తుంది. కొత్త అనుభూతులను ఇస్తుంది. యాభై సంవత్సరాల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి సిద్ధమైనప్పుడు సాహసయాత్ర కాదు దుస్సాహస యాత్ర చేస్తున్నావు అని హెచ్చరించిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. యాభై ఏళ్ల వయసులో ఇదేం పని! అని వెక్కిరించిన వాళ్లు ఉన్నారు. అయితే నేను వాటిని మనసులోకి తీసుకోలేదు. లక్ష్యమే నా ప్రాణం అయింది. అలా యాభైఏళ్ల వయసులో నా చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకోగలిగాను. ఇప్పుడు కూడా వెనక్కిలాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాభైనాలుగేళ్ల వయసులో ఈ సాహసం ఏమిటీ అంటున్నారు చాలామంది. ఇప్పుడు కూడా విజయంతోనే సమాధానం చెబుతాను’ అంటుంది ఈ బృందంలో ఒకరైన 54 ఏళ్ల చేతనా సాహు. ఈ పదిమంది ఉత్తరకాశీలో శిక్షణ తీసుకున్నారు. ‘అరవై ఏళ్లు దాటిన తరువాత ఎప్పుడూ నడిచే దారికంటే ఇంకొంచెం ఎక్కువ దూరం నడిస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది. అదేమిటోగానీ శిక్షణ సమయంలో బాగా అలిసిపోయినట్లు నాకు ఎప్పుడూ అనిపించలేదు. మనోబలం అంటే ఇదేనేమో’ అంటుంది గంగోత్రి సోనేజి. ఆమె వయసు అక్షరాల అరవైరెండు! 4,625 కిలోమీటర్ల ఈ సాహసయాత్ర అంతర్జాతీయ మహిళాదినోత్సవం (మార్చి–8) రోజు ప్రారంభమై ఆగస్టులో ముగుస్తుంది. ‘ఆరోగ్యస్పృహ విషయంలో అన్ని వయసుల మహిళలకు స్ఫూర్తి ఇచ్చే యాత్ర ఇది’ అంటుంది బచేంద్రిపాల్. విజయోస్తు -
రోటీన్ లైఫ్‌తో విసిగి పోయారా ?.. ఈ వీడియో మీ కోసమే...
Karimnagar Raikal Waterfall: కరోనా మహమ్మారి దెబ్బకు ఏడాదిన్నరగా మన లైఫ్స్టైల్లో ఎంతో మార్పు వచ్చింది. బయట కాలు పెట్టాలంటే భయం. ఎక్కువ సమయం ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి. పార్కుల్లో అరకొర జనమే, సినిమా థియేటర్లు మూత పడ్డాయి. ఇళ్లు, ఆఫీసు, మార్కెట్ తప్ప మరో ఎక్సైట్మెంట్ కరువైంది జీవితానికి. ఈ బోర్డమ్ను బ్రేక్ చేసేందుకు రా.. రమ్మంటోంది రాయికల్ జలపాతం. జలజల... ఎత్తైన పర్వతశ్రేణిలో ఉండే ఈ జలపాతాన్ని చేరాలంటే అడవిలో రాళ్ల బాటలో ప్రకృతిలో మమేకం అవుతూ కాలినడకన కొంత దూరం వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ అల్లుకున్న పచ్చటి అడవి, పైన జలపాతం నుంచి పారే సెలయేటి గలగల సవ్వడులు, పక్షుల కిలకిలా రావాలు, పట్టణ కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతిమాత ఒడిలో హాయిగా సేద తీరేందుకు ఇదొక చక్కని వేదిక. ఇంట్లో రోటీన్ లైఫ్‌కి భిన్నంగా.. ఆఫీస్ ఒత్తిడికి దూరంగా... ప్రకృతిలో మమేకం అవుతూ జల సవ్వడిలో కష్టాలను కరించేస్తూ.. ఎత్తైన కొండలను ఒక్కో అడుగు వేస్తూ ఎక్కేస్తూ... ఇటు అడ్వెంచర్.. అంటూ నేచర్ బ్యూటీలను ఒకేసారి అనుభవించాలంటే ఇటు వైపు ఓ సారి వెళ్లండి. ఇలా వెళ్లొచ్చు - హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ల నుంచి వచ్చే వారు పీవీ స్వగ్రామమైన భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చేరుకోవాలి. - వంగర నుంచి రాయికల్ గ్రామానికి చేరుకోవాలి - రాయిల్కల్ నుంచి దక్షిణ దిశలో 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఎత్తైన పర్వత పాదాల వద్ద రాయికల్ చెరువు కనిపిస్తుంది. దాదాపుగా ఇక్కడి వరకు బైకులు, కార్లు వెళ్లగలవు - చెరువు సమీపంలో వాహనాలు నిలిపి సుమారు 1.5 కిలోమీటర్లు అడవిలో ప్రయాణిస్తే జలపాతం చేరుకోవచ్చు. కొండల నడుమ వరంగల్ నగరం నుంచి 43 కిలోమీటర్ల దూరంలో హన్మకొండ, కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో సైదాపురం అటవీ ప్రాంతంలో ఎత్తన కొండల నడుమ ఈ జలపాతం ఉంది . ఏళ్ల తరబడి స్థానికులకే తప్ప బయటి ప్రపంచానికి ఈ జలపాతం గురించి తెలియదు. ఇటీవలే ఈ జలపాతానికి వస్తున్న టూరిస్టుల సంఖ్య పెరుగుతోంది. 170 అడుగుల ఎత్తు నుంచి చుట్టూ కొండలు.. జలపాత సవ్వళ్లు తప్ప మరో శబ్దం వినిపించే అవకాశం లేదక్కడ. 170 అడుగుల ఎత్తు నుండి స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో.. పరవళ్లు తొక్కుతూ జలపాతం కిందికి దూకుతుంటుంది. మొత్తం ఐదు జలపాతాల సమాహారం రాయికల్ జలపాతం. పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతిని పంచుతోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: - జలపాతాల వద్ద సరైన రక్షణ ఏర్పాట్లు లేవు, కాబట్టి సందర్శకుల బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. సెల్ఫీ మోజులో నిర్లక్ష్యంగా ఉన్న అనవసరపు సాహాసాలు చేసినా... ఆహ్లాదంగా, ఆనందంగా సాగాల్సిన పర్యటన మరో రకంగా మారుతుంది. - కొండల పై భాగంలో ఎలుగుబంట్లు ఉన్నాయి. కాబట్టి పైకి వెళ్లే ప్రయత్నం చేయకుండా ఉంటే మేలు - మద్యం తాగివెళ్లొద్దు. - ఫొటోల కోసం లోతు ప్రాంతాల దగ్గరకు వెళ్లొద్దు. - జలపాతాలు ఎక్కే ప్రయత్నం చేయకూడదు. - కొండలు ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి షూ ధరిస్తే సౌకర్యంగా ఉంటుంది. - ఫుడ్, వాటర్ తదితర వస్తువులేమీ అక్కడ లభించవు. కాబట్టి పర్యటకులు తమతో పాటు అవసరమైన వస్తువులు తీసుకెళ్లడం బెటర్. టి. కృష్ణ గోవింద్, సాక్షి, వెబ్‌డెస్క్. -
21 ఏళ్లకే అంత సాహసమా!
న్యూఢిల్లీ : కొందరికి ప్రమాదాలతో చెలగాటమంటే ఇష్టం. మరికొందరికి అత్యంత ప్రమాదరకరమైన అత్యున్నత పర్వత శ్రేణులను అధిగమించి కీర్తి కిరీటాలను సాధించడం అంటే ఇష్టం. రెండవ కోవకు చెందిన బ్రిటిష్ పౌరురాలు, 21 ఏళ్ల అన్నా టేలర్, సరికొత్త రికార్డును సాధించారు. గయానా దేశంలో విష సర్పాలకు, విష సాలె పురుగులకు, తేళ్లకు ప్రమాదకరమైన నీటి కాల్వలు, నీటి గుంటలకు నిలయమైన రెయిన్ ఫారెస్ట్‌లోని నిట్ట నిలువుగా రెండువేల అడుగుల ఎత్తైన రొరైమా పర్వతాన్ని అధిరోహించారు. తద్వారా ప్రపంచంలోనే ఈ పర్వతాన్ని అధిరోహించినా తొలి మహిళగా రికార్డు సృష్టించారు. బ్రిటన్ లియో హోల్డింగ్ అనే 39 ఏళ్ల యువకుడి నాయకత్వాన మొత్తం ఆరుగురి బృందంలో ఒకరిగా టేలర్ ఈ పర్వతాన్ని అధిరోహించారు. ఆరుగురిలో ఆమె పిన్న వయస్కురాలు. విష సర్పాలు, విష పురుగులతోపాటు కోసుకుపోయే రాళ్లు, ప్రమాదకరమైన కాల్వలను దాటుకుంటూ 33 మైళ్లు దట్టమైన అడవిలో నడుచుకుంటూ, అంతే ప్రమాదకరమైన వాటర్ ఫాల్స్‌ను అధిరోహిస్తూ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి దాదాపు నెల రోజులపాటు పట్టినట్లు ఆ సాహస బృందం తెలిపింది. పర్వతారోహణకు కేవలం తాళ్లు, కొక్కాలను మాత్రమే ఉపయోగించామని, అక్కడక్కడ విశ్రాంతి కోసం కొక్కాలకు వేలాడే టెంటులను ఉపయోగించినట్లు వారు తెలిపారు. పర్వత శిఖరాన తొమ్మిదివేల అడుగుల వైశాల్యం కలిగిన ఈ పర్వతం ‘ది లాస్ట్ వరల్డ్’ పుస్తకం రాయడానికి సర్ ఆర్థర్ కానన్ డోయల్‌కు స్ఫూర్తినిచ్చింది. డైనోసార్లకు సంబంధించిన ఈ నవలను హాలివుడ్ చిత్రంగా తీసిన విషయం తెల్సిందే. -
షుగర్ కోసం సాహసాలు!
హీరోయిన్లు త్రిష, సిమ్రాన్ అద్భుతమైన సాహసాలు చేస్తున్నారు. వెండితెరపై వారి సాహసాన్ని ఆడియన్స్ ఆస్వాదించడానికి చాలా సమయం ఉంది. సిమ్రాన్, త్రిష ప్రధాన పాత్రధారులుగా సుమంత్ రాధాకృష్ణన్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సిమ్రాన్, త్రిషలపై కొన్ని సాహసోపేతమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ అడ్వంచరస్ మూవీకి ‘షుగర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట టీమ్. ఇందులో సిమ్రాన్, త్రిష అక్కాచెల్లెళ్ల పాత్రల్లో నటిస్తున్నారు. గత ఏడాది విడుదలైన రజనీకాంత్ ‘పేట’ చిత్రం తర్వాత సిమ్రాన్, త్రిష కలిసి ఒకే సినిమాలో నటిస్తున్న చిత్రం ఇదే. -
మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ఎఫ్850 జీఎస్ అడ్వెంచర్
ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూకు చెందిన ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగం బీఎండబ్ల్యూ మోటొరాడ్.. భారత మార్కెట్లోకి మరో అధునాతన ప్రీమియం బైక్‌ను మంగళవారం ప్రవేశపెట్టింది. ‘బీఎండబ్ల్యూ ఎఫ్850 జీఎస్ అడ్వెంచర్’ పేరిట విడుదలైన ఈ బైక్ ధర రూ.15.40 లక్షలు (ఎక్స్‌షోరూం)గా కంపెనీ ప్రకటించింది. అనలాగ్ టాకోమీటర్, మల్టీ–ఫంక్షనల్ డిస్ప్లే, కంట్రోల్ ల్యాంప్స్ వంటి అధునాతన ఫీచర్లు కలిగిన ఈ బైక్.. కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సీబీయూ)గా అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న బీఎండబ్ల్యూ మోటొరాడ్ డీలర్ల వద్ద మంగళవారం నుంచే బుకింగ్స్ ప్రారంభమైనట్లు ప్రకటించింది. -
చిన్నారి శిఖరం
పర్వతారోహణ ఒక సాహసం. సాహసం కన్నా కూడా ఒక దుస్సాహసం. ఇంకా చెప్పాలంటే అదొక జీవన్మరణ ప్రయత్నం. ‘ఆడపిల్ల ఇంత సాహసానికి ఒడిగట్టడం అవసరమా’ అని తన గ్రామంలో ఎవరైనా అంటే.. ‘‘ఆ సాహసమే చేయకపోతే అందరిలో ఒకమ్మాయిగా ఉండిపోయేదాన్ని. ఆ సాహసమే నన్నీ రోజు అరుదైన కొందరిలో ఒక అమ్మాయిగా నిలబెట్టింది. ఎందరో అమ్మాయిలకు నన్ను రోల్ మోడల్ని చేసింది’’ అంటుంది మలావత్ పూర్ణ. ‘అమ్మాయి అనే కారణంగా ఎవరూ తమకొచ్చిన అవకాశాలను, తమ ఆశయాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. లక్ష్యాన్ని చేరడానికి అమ్మాయిగా పుట్టడం అనేది అడ్డంకి కాబోదు’ అని నిరూపించింది పూర్ణ. ‘సంకల్పబలం ముందు పేదరికం పక్కకు తప్పుకుంటుంది’ అంటున్నప్పుడు ఆమె కళ్లలో కనిపించిన ఆత్మవిశ్వాసం శిఖర సమానం అనిపించింది. అందుకే పూర్ణ.. ఒక చిన్నారి శిఖరం. మలావత్ పూర్ణది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పాకాల గ్రామం. ఎనిమిది వందల జనాభా కూడా లేని ఓ కుగ్రామం. ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదివింది. ఆరవ తరగతి నుంచి సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో చదువుకుంటోంది. ఇప్పుడు కామారెడ్డిలోని సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో బీ.ఎ. రెండవ సంవత్సరం చదువుతోంది. డిగ్రీ పూర్తయ్యాక సివిల్స్‌కి ప్రిపేరవ్వాలనేది ఆమె కెరీర్ ప్లాన్. తానీరోజు నడుస్తున్న విజయమార్గానికి తొలి అడుగులు వేయించింది అమ్మానాన్నల ముందుచూపే అంది పూర్ణ. ‘‘మమ్మల్ని (పూర్ణ, ఆమె అన్న నరేశ్) చదివించాలని అనుకోక పోయి ఉంటే ఈ రోజు ఈ సక్సెస్ మా ఊహకు కూడా అందేది కాదు. మా బంజారా తండాల్లో నా వయసు అమ్మాయిలు పెళ్లి చేసుకుని పిల్లల తల్లులయి ఇంటి బాధ్యతల్లో మునిగిపోయి ఉన్నారు. మా నాన్న కల మమ్మల్ని చదివించాలని. నాన్న కలను అమ్మ గౌరవించింది. ఆరవ తరగతిలో వాళ్లు మమ్మల్ని హాస్టల్‌కి పంపించడం వల్లనే నేను కొత్త ప్రపంచాన్ని చూడగలిగాను. మా నాన్న ఆరేడు కిలోమీటర్ల దూరం సైకిల్ మీద వెళ్లి ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకున్నాడు. తనకు చదువు లేదు, మేము చదువుకుంటే చూడాలనుకున్నాడు’’ అంటూ తాను మౌంటనీర్ కావడానికి దారి తీసిన సంఘటనలను పంచుకుంది పూర్ణ. అప్పుడు ఎయిత్ క్లాస్ ‘‘నేను ఎయిత్ క్లాస్‌లో ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ శాఖ సెక్రటరీగా ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌లో చదువుకునే పిల్లల పట్ల సమాజంలో ఉన్న చిన్న చూపును తుడిచేయాలనుకున్నారాయన. ‘ఈ పిల్లలు దేనిలోనూ వెనుకబడరు, అవకాశాలు కల్పించి, ప్రోత్సహిస్తే దేన్నయినా సాధించి తీరుతారు, శిఖరాలను చేరుతారు’ అని సమాజానికి చెప్పాలనుకున్నారు. అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో ఆసక్తి ఉన్న స్టూడెంట్స్ కోసం రాష్ట్రంలోని అన్ని సోషల్ వెల్ఫేర్ స్కూళ్లకూ సర్క్యులర్ పంపించారు. నేను స్పోర్ట్స్‌లో చురుగ్గా ఉండేదాన్ని. ఆల్‌రౌండర్‌గా ఉండడంతో మా స్కూల్ నుంచి నా పేరు కూడా పంపించారు. అలా సెలెక్ట్ చేసిన నూట పదిమంది స్టూడెంట్స్‌ని భువనగిరికి రాక్ క్లైంబింగ్‌కి తీసుకెళ్లారు. అందులో అర్హత సాధించిన పదిమంది అమ్మాయిలు, పదిమంది అబ్బాయిలను పేరెంట్స్ నుంచి అంగీకారం తీసుకున్న తర్వాత స్పెషల్ కోచింగ్‌కి డార్జిలింగ్కి తీసుకెళ్లారు. కోచింగ్ తర్వాత పదిహేను వేల అడుగుల ఎత్తున్న రినాక్ పీక్‌కి చేరుకున్నాను. అది నా తొలి రికార్డు. గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న పిల్లల కేటగిరీలో ఆ రికార్డు వచ్చింది. అప్పటి వరకు ఎవరెస్టు ఆలోచన లేదు. ఆ రికార్డు తర్వాతనే ప్రవీణ్ సర్కి ఎవరెస్టు అధిరోహణలో కూడా వీళ్లు విజయవంతం అవుతారని ఎందుకు నిరూపించకూడదు అనిపించింది. ఎవరెస్టు ఎక్స్‌పెడిషన్ కోసం లధాక్ (3,000 మీటర్లు), స్టోక్ కాంగ్రి (ఎత్తు 6,153 మీటర్లు) పర్వతాలలో ప్రాక్టీస్ చేశాం. 2013 ఇలా ప్రిపరేషన్లో గడిచింది. ఎవరెస్టు శిఖరాన్ని 2014లో ఎక్కాను. అప్పుడు నేను నైన్త్ క్లాస్. నేపాల్‌కు దారి లేదు ఆ ఏడాది వాతావరణం ఏ మాత్రం అనుకూలించలేదు. మంచు చరియలు విరిగిపడడంతో రూట్ ఓపెన్ చేయడానికి వెళ్లిన 17 మంది షెర్పాలు (పర్వతారోహణ సహాయకులు) ప్రాణాలు కోల్పోయారు. దాంతో నేపాల్ వైపు నుంచి దారి మూసేసి, ఆ ఏడాదికి నిషేధం విధించారు. మేము చైనా వైపు నుంచి వెళ్లాం. నా బరువు 45 కిలోలు. మేము మోసుకెళ్లే బ్యాగ్ బరువు 15 కిలోలు. అదేమీ ఇబ్బంది కాలేదు, కానీ ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఇబ్బంది పెడుతుంది. ఆక్సిజన్ అందక తలనొప్పి, వాంతులు వచ్చాయి. రెస్ట్ కోసం రెండు రోజులు బేస్ క్యాంపుకి పంపేశారు. అడ్వాన్స్డ్ బేస్ క్యాంపునకు చేరిన తర్వాత మళ్లీ సిక్నెస్ వచ్చింది. ఆక్సిజన్ పెట్టుకున్న తర్వాత నార్మల్ అయ్యాను, తీసేస్తే వాంతులయ్యేవి. వాతావరణం సహకరించక పది రోజులు బేస్ క్యాంపులో ఉండాల్సి వచ్చింది. అయితే... అవేవీ భయపెట్టవు. మౌంటెనీరింగ్‌కి దేహం కంటే మైండ్ ఫిట్‌గా ఉండాలి. మానసిక స్థైర్యమే ముందుకు నడిపిస్తుంది. అయినప్పటికీ ఒక సంఘటన నాలో వణుకు పుట్టించింది. డ్రస్ కాదది! ఎవరెస్ట్‌ను చేరే క్రమంలో సంభవించే మరణాల్లో ఎక్కువ భాగం మూడవ క్యాంపు తర్వాతనే. నా జర్నీలో స్టెప్ త్రీ దాటిన తర్వాత మరో ఇరవై నిమిషాల్లో శిఖరాన్ని చేరుతాననగా, ఆరెంజ్ కలర్లో ఉన్న డ్రస్ ఒకటి కనిపించింది. పక్కనే ఉన్న షెర్పాతో ‘ఎందుకిలా డ్రస్‌ని ఇక్కడ వదిలేశారు’ అని అడిగాను. ‘డ్రస్ కాదు, డెడ్ బాడీ’ అన్నారు షెర్పా. పరిశీలనగా చూస్తే... బోర్లా తిరిగి ముడుచుకుని పడుకున్నట్లుగా ఉంది బాడీ. అప్పుడు వణికి పోయాను. వెంటనే నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ‘అమ్మాయిలు గెలవగలరని సమాజానికి చెప్పాలని ఇంతదూరం వచ్చాను. పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించాలనేది నా మెంటార్ ప్రవీణ్ సర్ కల. నేను గెలిచి రావాలని ఎదురు చూసే వాళ్లు చాలా మంది ఉన్నారు. నేను ఓడిపోకూడదు, వెనుకడుగు వేయకూడదు’ అని కౌన్సెలింగ్ ఇచ్చుకుని, అందరిలాగానే డెడ్‌బాడీకి దణ్ణం పెట్టుకుని ముందుకు అడుగేశాను. ఎవరెస్టు ఆరోహణలో చివరి రోజు రాత్రి కాళ్లకు శవాలు తగులుతూ, ఒళ్లు గగుర్పొడిచేది. మూడవ క్యాంపు కంటే ముందయితే షెర్పాలు పర్వతారోహకులను రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. మూడవ క్యాంపు తర్వాత రక్షించడం సాధ్యమయ్యే పని కాదు. సంతోషంతో కన్నీళ్లు ఎవరెస్టు శిఖరాన్ని చేరిన తరువాత ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. కొత్త ప్రపంచంలో అడుగుపెట్టినట్లు ఉంది. ఓ పది నిమిషాల సేపు ఫొటోలు తీసుకుంటూ గడిపేశాం. ఎటు చూసినా మనుషులు కనిపించే వాతావరణం నుంచి ఎటు చూసినా మంచు పర్వతాలే కనిపించే శిఖరం మీద ఉన్నాం... అనే భావనను చెప్పడానికి పదాలు దొరకవు. నాకు తెలిసిన పదాల్లోనే ప్రతి జ్ఞాపకాన్నీ డైరీ రాశాను. ఏడు శిఖరాల ఆరోహణ పూర్తయిన తర్వాత పుస్తకం రాస్తాను. ఏడు శిఖరాల ఆలోచన మొదట్లో లేదు. ఎవరెస్టును సాధించిన తరువాత కలిగింది. ఎవరెస్టు తర్వాత మరో మూడు శిఖరాలను అధిరోహించాను. మొదటగా ఎల్తైన శిఖరాన్ని చేరడంతో కావచ్చు అదే తీపిగుర్తుగా ఉండిపోయింది. మిగిలినవి ప్రయాణంలో మైలురాళ్లుగా అనిపిస్తున్నాయి. నా విజయానికి బహుమతిగా ప్రభుత్వం పాతిక లక్షల డబ్బు, ఐదెకరాల వ్యవసాయ భూమి, ఇల్లు, చదువుకి అయ్యే ఖర్చు కూడా శాంక్షన్ చేసింది. స్పానిష్ నచ్చింది ఎవరెస్టు అధిరోహణకు ప్రభుత్వమే స్పాన్సర్ చేసింది. మిగిలిన వాటికి ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ మౌంటెనీరింగ్, ట్రెక్కింగ్ సర్వీసెస్ వాళ్లు స్పాన్సర్ చేస్తున్నారు. మాతోపాటు ఎవరెస్టు ఆరోహణలో కోచ్ శేఖర్‌బాబు కూడా ఉన్నారు కాబట్టి భాష ఇబ్బంది కాలేదు. శిఖరాధిరోహణలో నాకు ఎదురైన మనుషుల్లో అర్జెంటీనా వాళ్లు బాగా నచ్చారు. స్పానిష్, నేపాలీ భాషలు నచ్చాయి. నాకిప్పుడు బంజారా, తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలు వచ్చు. స్పానిష్, నేపాలీ భాషలు కూడా నేర్చుకుంటాను’’ అంటూ పరిపూర్ణంగా నవ్వింది మలావత్ పూర్ణ. ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ఫొటోలు : శివ మల్లాల అందరి బడి ప్రవీణ్ సర్ నా రోల్ మోడల్. ఆయనలాగే సమాజానికి ఉపయోగపడే ప్రోగ్రామ్‌లు చేయాలని కోరిక. ప్రభుత్వం పేద ప్రజల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తోంది. ప్రభుత్వ సేవలను ప్రజలందరూ ఉపయోగించుకునేటట్లు చూడాలి. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకంటే మెరుగ్గా తయారుచేస్తాను. గవర్నమెంట్ స్కూల్ పేదవాళ్ల బడి అనే దురభిప్రాయాన్ని పోగొట్టి, అందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకునేటట్లు మెరుగుపరుస్తాను. అమ్మాయిలకు నేను చెప్పేది ఒక్కటే మాట... ‘ఈ రోజుల్లో అమ్మాయిలు ఇండిపెండెంట్‌గా ఉంటున్నారు. ఎవరెస్టు మీదకే కాదు అంతరిక్షంలోకి కూడా వెళ్తున్నారు. ఒకరి ఆసరా కోసం ఎదురు చూడవద్దు. మీ శక్తిని మీరు తెలుసుకోండి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చదువుని నిర్లక్ష్యం చేయవద్దు’. – మలావత్ పూర్ణ, మౌంటనీర్ ఈ రికార్డు చెరిగిపోదు పూర్ణ మలావత్.. ఎవరెస్టును అధిరోహించిన భారతీయుల్లో అత్యంత చిన్న వయస్కురాలు. ఎవరెస్టు శిఖరం మీద అడుగుపెట్టే నాటికి ఆమె వయసు పదమూడు సంవత్సరాల పదకొండు నెలలు. ఈ రికార్డు కొంతకాలం డిక్కీ దోల్మాకు ఉండేది. డోల్మా 1974లో పుట్టారు, 1993లో ఎవరెస్టును అధిరోహించారు. అప్పటికి ఆమె వయసు 19. అప్పటి నుంచి 2003 వరకు పదేళ్ల పాటు ఆమెదే రికార్డు. 2003లో 15 ఏళ్ల మింగ్ కిపా ఆ రికార్డును బ్రేక్ చేసింది. కిపా పేరుతో ఆ రికార్డు 2010 వరకు కొనసాగింది. ఆ ఏడాది అమెరికాకు చెందిన పదమూడేళ్ల పది నెలల కుర్రాడు జోర్డాన్ రోమెరో సొంతం చేసుకోగా 2014, మే నెల 25వ తేదీన పూర్ణ కొత్త రికార్డును రాసుకుంది. ‘యంగెస్ట్ ఇండియన్, యంగెస్ట్ గర్ల్ ఇన్ ద వరల్డ్ స్కేల్ మౌంట్ ఎవరెస్ట్’ రికార్డులు పూర్ణ సొంతం చేసుకుంది. పూర్ణకు కలిసి వచ్చిన మరో అంశం ఏమిటంటే... ఎవరెస్టును అధిరోహించడానికి కనీస వయసును నేపాల్ 16 ఏళ్లకు, చైనా 18 ఏళ్లకు పెంచేశాయి. ఈ నిబంధన ప్రకారం ఇక ఇంకా చిన్న వయసు వాళ్లెవరూ ఎవరెస్టును అధిరోహించడానికి వీలుకాదు. కాబట్టి పూర్ణకు ఈ రికార్డు ఎప్పటికీ అలాగే ఉంటుంది. పూర్ణ చేరిన శిఖరాలు 2014 : ఆసియాలో ఎవరెస్టు (29 వేల అడుగుల ఎత్తు) 2016 : ఆఫ్రికాలో కిలిమంజారో (19 వేలకు పైగా అడుగులు) 2017 : యూరప్‌లో ఎల్బ్రస్ (18 వేల ఐదొందల అడుగులు) 2019 : సౌత్ అమెరికాలో అకాంకగువా (దాదాపు 23 వేల అడుగులు) (పూర్ణ ఈ నెల 14వ తేదీన అకాంకగువా శిఖరారోహణ పూర్తి చేసి, 21వ తేదీన ఇండియాకి తిరిగొచ్చింది) -
సూపర్... సూపర్... సూపర్... హీరో
ప్రపంచాన్ని అంతం చేయడానికి ఎన్ని శక్తులు పుట్టుకొచ్చినా వాటిని అంతమొందించేందుకు ఒక హీరో పుట్టుకొస్తాడు. విలన్‌కే అంత పవర్ ఉంటే హీరోకు ఇంకెంత పవర్ ఉండాలి? సూపర్ పవర్ ఉండాలి కదూ? అలాంటి సూపర్ పవర్స్‌తో మనల్ని సంవత్సరాలుగా కట్టిపడేస్తోన్న సూపర్ హీరోలందరూ ఒకేసారి తెరపై కనిపిస్తే? ఆ సంబరం ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది. ‘ఐరన్‌మేన్’, ‘స్పైడర్‌మేన్’, ‘కెప్టెన్ అమెరికా’, ‘బ్లాక్‌పాంథర్’.. ఇలా సూపర్ హీరోలుగా ఎన్నో అడ్వెంచర్స్ చేసి మనల్ని మెప్పించిన సూపర్ హీరో క్యారెక్టర్స్ అందరూ ఏకమై ఒక పెద్ద శక్తిపై పోరాడేందుకు చేసే యుద్ధమే ‘అవెంజర్స్’. ఈ సిరీస్‌లో మూడో సినిమా ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ ఏప్రిల్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై ఇప్పటికీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ ఒక్క సినిమా కోసమే సూపర్ హీరో సినిమా ఫ్యాన్స్ అంతా సంవత్సర కాలంగా ఎదురుచూస్తూ వచ్చారు. మన ఇండియన్ సినిమాకు ‘బాహుబలి’ లాంటిది హాలీవుడ్‌కు ఈ సినిమా. అవెంజర్స్ ప్రత్యేకతలేంటీ? హాలీవుడ్ టాప్ ఫోర్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్కి కారణం ఏంటీ? తెలుసుకోవాలంటే అసలు కథలోకి వెళ్లాల్సిందే! మార్వెల్స్ మ్యాజిక్.... మార్వెల్ కామిక్స్ది ఒక చరిత్ర. కామిక్ పుస్తకాలతో దశాబ్దాలుగా ఎందరో సూపర్ హీరోలను సృష్టించిన మార్వెల్, ఆ సూపర్ హీరోలనే సినిమాలుగానూ తీసుకొచ్చి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సూపర్ హీరోలు ఇండియన్ సినిమా ఫ్యాన్స్‌కూ తెగ కిక్ ఇచ్చేస్తుంటారు. అవెంజర్స్.. ఈ సూపర్ హీరోలందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి చేయించే యుద్ధం. 2012లో ‘అవెంజర్స్’ సిరీస్‌లో మొదటి సినిమా వచ్చింది. ఇది అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. ఆ తర్వాత 2015లో ‘అవెంజర్స్ : ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’ వచ్చింది. అదీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. ఇక ఇప్పుడు 2018లో తాజాగా ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ వచ్చేసింది. ఇదీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అనిపించుకుంటూ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతోంది. 2019లో ఈ కొత్త సినిమాకు సీక్వెల్ రానుంది. అవెంజర్స్‌లో సూపర్ హీరోలంతా ఈ ప్రపంచాన్ని కాపాడ్డానికే కష్టపడుతుంటారు. ఒక్కో సినిమాలో ఒక్కో విలన్. ఇన్ఫినిటీ వార్ కథేంటీ? ఇన్ఫినిటీ వార్‌లో థానోస్‌పై యుద్ధం చేస్తున్నారు మన సూపర్ హీరోలంతా. ప్రపంచాన్ని జయించే శక్తిని సంపాదించి, ఈ ప్రపంచాన్నంతా తన చేతుల్లోకి తెచ్చుకోవాలని చూస్తుంటాడు థానోస్. అందుకు ఎంతటి విధ్వంసానికైనా వెనుకాడడు. ఆ థానోస్‌ను ఎదుర్కొని, ప్రపంచాన్ని కాపాడ్డానికి సూపర్ హీరోలంతా ఏకమై ఒక యుద్ధం చేయాలి. అలాంటి ఇలాంటి యుద్ధం కాదది. థానోస్‌ను ఎదుర్కోవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఐరన్‌మేన్, హల్క్, స్పైడర్‌మేన్ తదితర మార్వెల్ సృష్టించిన సూపర్ హీరోలంతా తమకు మాత్రమే సాధ్యమయ్యే విన్యాసాలు, అడ్వెంచర్స్ చేస్తూ థానోస్ పనిపడతారు. ఆద్యంతం కట్టిపడేసే యాక్షన్ ఎపిసోడ్స్‌తో, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌తో ఇన్ఫినిటీ వార్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అవెంజర్స్ టీమ్...మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో పందొమ్మిదో సినిమాగా ఇన్ఫినిటీ వార్‌ను తీసుకొచ్చింది. ఆంథోని రుస్సో, జాయ్ రుస్సో ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాబర్ట్ డోనీ జూనియర్ ఐరన్‌మేన్‌గా, క్రిస్ హెమ్స్‌వర్త్ హల్క్‌గా, క్రిస్ ఈవన్స్ కెప్టెన్ అమెరికాగా, ఛద్విక్ బోస్మన్ బ్లాక్పాంథర్గా, స్కార్లెట్ జోహన్సన్ బ్లాక్ విడోగా నటించిన ఈ సినిమాలో ఎక్కడ చూసినా, ఏ సమయంలో చూసినా, స్క్రీన్ నిండా స్టార్సే కనిపిస్తారు. ఆ స్టార్స్ చేసే సందడి థియేటర్లలో అభిమానులకు పండగ వాతావరణాన్ని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఒక్కో క్యారెక్టర్‌కూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం కూడా ఇన్ఫినిటీ వార్‌కు ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. బడ్జెట్ ‘హీరో’... ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ను ఒక సినిమాటిక్ అద్భుతంలా తెరకెక్కించాలన్నది మార్వెల్ స్టూడియోస్ కల. ఆ కలకు తగ్గట్టే బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ, విజువల్ వండర్‌గా ఇన్ఫినిటీ వార్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇందుకు అయిన బడ్జెట్ కూడా అంతా ఇంతా కాదు. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఇన్ఫినిటీ వార్ తెరకెక్కింది. ఇది హాలీవుడ్ చరిత్రలో టాప్ 4 బడ్జెట్ సినిమాల్లో ఒకటి. అంత బడ్జెట్ పెట్టారు కాబట్టే, ఇంత మంది స్టార్స్ ఒక దగ్గరికి రావడం, ఇంత బెస్ట్ ఔట్పుట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించడం జరుగుతోందని అంటారు ఫ్యాన్స్. బాక్సాఫీస్ ‘సూపర్ హీరో’... టాప్ 4లో చోటు... ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ బడ్జెట్లో దాదాపు 300 మిలియన్ డాలర్లతో హీరో అయితే, బాక్సాఫీస్ వద్ద సూపర్ హీరో రేంజ్లో నాలుగో వారంలోకి అడుగు పెట్టేసరికి 1.7 బిలియన్ డాలర్లు (సుమారు 11 వేల కోట్ల రూపాయలు) వసూలు చేసి 2 బిలియన్ మార్క్ వైపు దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఒక ప్రభంజనమే సృష్టిస్తూ వచ్చిందీ సినిమా. ఇండియన్ బాక్సాఫీస్‌పై ఇన్ఫినిటీ ‘వార్’! ఇండియన్ సినిమా అభిమానులకు సూపర్ హీరో సినిమాలంటే పిచ్చి అభిమానమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక్కడ సూపర్‌హీరోలకు చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు అన్ని వర్గాల వాళ్లూ ఫ్యాన్స్ ఉన్నారు. ఇన్ఫినిటీ వార్ కోసం వీళ్లంతా ఏడాది ప్రారంభం నుంచే ఎదురుచూస్తూ వచ్చారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు రెండు వేల థియేటర్లలో సినిమాను విడుదల చేశారు. కేవలం మొదటిరోజే 30 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టి, ఈ ఏడాది బాలీవుడ్లో అన్ని సినిమాల ఓపెనింగ్ డే రికార్డులను బద్దలు కొట్టింది ఇన్ఫినిటీ వార్. ఇదే జోరు ఈరోజుకీ కొనసాగుతూండడం విశేషంగా చెప్పుకోవాలి. ఇప్పటికే 200కోట్ల మార్క్‌ను కూడా దాటేసి (మూడోవారం ముగిసేసరికి 215 కోట్ల రూపాయలు), ‘ది జంగిల్ బుక్’ రికార్డును కూడా బ్రేక్ చేసి ఇండియాలో ఇప్పటికే పెద్ద బ్లాక్‌బస్టర్‌గా ఇన్ఫినిటీ వార్ నిలిచింది. 200 కోట్ల మార్క్‌ను చేరుకున్న మొదటి హాలీవుడ్ సినిమా ఇదే! మే నెలంతా పిల్లలకు సెలవులే కావడంతో ఇన్ఫినిటీ వార్ ఇండియాలో ఇంకొన్ని రోజులు ఇలాగే కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. విచిత్రంగా ఇప్పటివరకూ మార్వెల్ సినిమాలు పరిచయం లేని వాళ్లు కూడా అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్ గురించి ఆసక్తిగా తెలుసుకుంటూ ఉండటం విశేషంగా చెప్పుకోవాలి! ప్రపంచాన్ని అంతం చేయడానికి ఎన్ని శక్తులు పుట్టుకొచ్చినా వాటిని అంతమొందించేందుకు ఒక హీరో పుట్టుకొస్తాడు. విలన్‌కే అంత పవర్ ఉంటే హీరోకు ఇంకెంత పవర్ ఉండాలి? సూపర్ పవర్ ఉండాలి కదూ? అలాంటి సూపర్ పవర్స్‌తో మనల్ని సంవత్సరాలుగా కట్టిపడేస్తోన్న సూపర్ హీరోలందరూ ఒకేసారి తెరపై కనిపిస్తే? ఆ సంబరం ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది. ‘ఐరన్‌మేన్’, ‘స్పైడర్‌మేన్’, ‘కెప్టెన్ అమెరికా’, ‘బ్లాక్‌పాంథర్’.. ఇలా సూపర్ హీరోలుగా ఎన్నో అడ్వెంచర్స్ చేసి మనల్ని మెప్పించిన సూపర్ హీరో క్యారెక్టర్స్ అందరూ ఏకమై ఒక పెద్ద శక్తిపై పోరాడేందుకు చేసే యుద్ధమే ‘అవెంజర్స్’. ఈ సిరీస్‌లో మూడో సినిమా ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ ఏప్రిల్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై ఇప్పటికీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ ఒక్క సినిమా కోసమే సూపర్ హీరో సినిమా ఫ్యాన్స్ అంతా సంవత్సర కాలంగా ఎదురుచూస్తూ వచ్చారు. మన ఇండియన్ సినిమాకు ‘బాహుబలి’ లాంటిది హాలీవుడ్‌కు ఈ సినిమా. అవెంజర్స్ ప్రత్యేకతలేంటీ? హాలీవుడ్ టాప్ ఫోర్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్కి కారణం ఏంటీ? తెలుసుకోవాలంటే అసలు కథలోకి వెళ్లాల్సిందే! మార్వెల్స్ మ్యాజిక్.... మార్వెల్ కామిక్స్ది ఒక చరిత్ర. కామిక్ పుస్తకాలతో దశాబ్దాలుగా ఎందరో సూపర్ హీరోలను సృష్టించిన మార్వెల్, ఆ సూపర్ హీరోలనే సినిమాలుగానూ తీసుకొచ్చి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సూపర్ హీరోలు ఇండియన్ సినిమా ఫ్యాన్స్‌కూ తెగ కిక్ ఇచ్చేస్తుంటారు. అవెంజర్స్.. ఈ సూపర్ హీరోలందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి చేయించే యుద్ధం. 2012లో ‘అవెంజర్స్’ సిరీస్‌లో మొదటి సినిమా వచ్చింది. ఇది అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. ఆ తర్వాత 2015లో ‘అవెంజర్స్ : ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’ వచ్చింది. అదీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. ఇక ఇప్పుడు 2018లో తాజాగా ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ వచ్చేసింది. ఇదీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అనిపించుకుంటూ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతోంది. 2019లో ఈ కొత్త సినిమాకు సీక్వెల్ రానుంది. అవెంజర్స్‌లో సూపర్ హీరోలంతా ఈ ప్రపంచాన్ని కాపాడ్డానికే కష్టపడుతుంటారు. ఒక్కో సినిమాలో ఒక్కో విలన్. ఇన్ఫినిటీ వార్ కథేంటీ? ఇన్ఫినిటీ వార్‌లో థానోస్‌పై యుద్ధం చేస్తున్నారు మన సూపర్ హీరోలంతా. ప్రపంచాన్ని జయించే శక్తిని సంపాదించి, ఈ ప్రపంచాన్నంతా తన చేతుల్లోకి తెచ్చుకోవాలని చూస్తుంటాడు థానోస్. అందుకు ఎంతటి విధ్వంసానికైనా వెనుకాడడు. ఆ థానోస్‌ను ఎదుర్కొని, ప్రపంచాన్ని కాపాడ్డానికి సూపర్ హీరోలంతా ఏకమై ఒక యుద్ధం చేయాలి. అలాంటి ఇలాంటి యుద్ధం కాదది. థానోస్‌ను ఎదుర్కోవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఐరన్‌మేన్, హల్క్, స్పైడర్‌మేన్ తదితర మార్వెల్ సృష్టించిన సూపర్ హీరోలంతా తమకు మాత్రమే సాధ్యమయ్యే విన్యాసాలు, అడ్వెంచర్స్ చేస్తూ థానోస్ పనిపడతారు. ఆద్యంతం కట్టిపడేసే యాక్షన్ ఎపిసోడ్స్‌తో, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌తో ఇన్ఫినిటీ వార్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అవెంజర్స్ టీమ్...మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో పందొమ్మిదో సినిమాగా ఇన్ఫినిటీ వార్‌ను తీసుకొచ్చింది. ఆంథోని రుస్సో, జాయ్ రుస్సో ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాబర్ట్ డోనీ జూనియర్ ఐరన్‌మేన్‌గా, క్రిస్ హెమ్స్‌వర్త్ హల్క్‌గా, క్రిస్ ఈవన్స్ కెప్టెన్ అమెరికాగా, ఛద్విక్ బోస్మన్ బ్లాక్పాంథర్గా, స్కార్లెట్ జోహన్సన్ బ్లాక్ విడోగా నటించిన ఈ సినిమాలో ఎక్కడ చూసినా, ఏ సమయంలో చూసినా, స్క్రీన్ నిండా స్టార్సే కనిపిస్తారు. ఆ స్టార్స్ చేసే సందడి థియేటర్లలో అభిమానులకు పండగ వాతావరణాన్ని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఒక్కో క్యారెక్టర్‌కూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం కూడా ఇన్ఫినిటీ వార్‌కు ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. బడ్జెట్ ‘హీరో’... ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ను ఒక సినిమాటిక్ అద్భుతంలా తెరకెక్కించాలన్నది మార్వెల్ స్టూడియోస్ కల. ఆ కలకు తగ్గట్టే బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ, విజువల్ వండర్‌గా ఇన్ఫినిటీ వార్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇందుకు అయిన బడ్జెట్ కూడా అంతా ఇంతా కాదు. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఇన్ఫినిటీ వార్ తెరకెక్కింది. ఇది హాలీవుడ్ చరిత్రలో టాప్ 4 బడ్జెట్ సినిమాల్లో ఒకటి. అంత బడ్జెట్ పెట్టారు కాబట్టే, ఇంత మంది స్టార్స్ ఒక దగ్గరికి రావడం, ఇంత బెస్ట్ ఔట్పుట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించడం జరుగుతోందని అంటారు ఫ్యాన్స్. బాక్సాఫీస్ ‘సూపర్ హీరో’... టాప్ 4లో చోటు... ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ బడ్జెట్లో దాదాపు 300 మిలియన్ డాలర్లతో హీరో అయితే, బాక్సాఫీస్ వద్ద సూపర్ హీరో రేంజ్లో నాలుగో వారంలోకి అడుగు పెట్టేసరికి 1.7 బిలియన్ డాలర్లు (సుమారు 11 వేల కోట్ల రూపాయలు) వసూలు చేసి 2 బిలియన్ మార్క్ వైపు దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఒక ప్రభంజనమే సృష్టిస్తూ వచ్చిందీ సినిమా. -
వేసవిలో చల్లగా...విహరిద్దాం హాయిగా..
ఏప్రిల్ ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ముందు ఎండలు ఇంకెంత తీవ్రంగా ఉంటాయో అనిపిస్తుంది కదా. ఎండ తీవ్రతని ఎలాను తగ్గించలేము కాబట్టి ఓ వారం రోజులు అలా చల్లటి ప్రదేశాల్లో విహరించొద్దాము. మళ్లీ దీని కోసం దేశం దాటి వెళ్లాల్సిన పనిలేదు. ఖర్చు గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనకున్న బడ్జెట్లోనే దేశ రాజధాని చుట్టూ ఉన్న అందాలను సందర్శించుకుందా, చల్లగా సేద తీరుదాము. ఒక్కో ప్రదేశానికి ఒక వారంతం సరిపోతుంది. లాన్స్‌డౌన్... ఢిల్లీ నుంచి కేవలం 260కిమీ దూరాన ఉన్న లాన్స్‌డౌన్‌ను చేరుకోవడానికి 6-7 గంటల ప్రయాణం చేయాలి. ఇక్కడ బస చేయడానికి ఖరీదైన హోటల్లు రిసార్టులు ఉండవు. మన బడ్జెట్లోనే ఇంటి వాతవరణాన్ని తలపించే వసతి లభిస్తుంది. ట్రెక్కింగ్ ఆసక్తి ఉన్న వారికి సరిగ్గ సరిపోయే ప్రదేశం లాన్సడౌన్. హిమాలాయాలను సందర్శించడానకి ప్రసిద్ధికెక్కిన టిపి టాప్ పాయింట్లకు నెలవు ఈ ప్రదేశం. ఇవే కాక భీమ్ పకోర, తారకేశ్వర్ మహాదేవ్ ఆలయం, భుల్ల తాల్ ఇక్కడి దర్శనీయ ప్రదేశాలు. కసౌలి... ఢిల్లీ నుంచి సుమారు 290కి.మీ. దూరాన హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఈ ప్రదేశానికి చేరుకోవడానికి అయిదారు గంటల సమయం పడుతుంది. సిమ్లాకు సమీపాన ఉన్న కసౌలి చల్లని ప్రాంతమే కాక హిమాచల్‌లో ఉన్న మిగితా వేసవి విడిది ప్రాంతాల కన్నా చాలా అందమైన ప్రదేశం. నేటికి చెక్కుచెదరకుండా ఉన్న కాలనీల నిర్మాణాలు అలనాటి నిర్మాణ కౌశాలనికి నిదర్శనం. గ్రామీణ వాతావరణాన్ని, అనేక ఆలయాలను, అందమైన ప్రదేశాలను ఇక్కడ చూడవచ్చు. ప్రసిద్ధ మోహన్ మెయ్కిన్ బ్రేవరీ ఇక్కడే ఉంది. ముస్సోరి... ఢిల్లీకి 285 కి.మీ. దూరాన ఉన్న ముస్సోరిని చేరుకోవడానికి ఏడు గంటల సమయం పడుతుంది. అత్యంత రద్దీగా ఉండే ముస్సోరిని చేరుకోవడానికి రోడ్డు మార్గం కన్నా శివారు ప్రాంతాల గుండా వెళ్తే ముస్సోరి అసలు సౌందర్యం కనిపిస్తుంది. భోజన ప్రియులకు స్వర్గధామం ఈ ప్రాంతం. రెస్టారెంట్లు, కేఫేలు కొకొల్లలుగా ఉంటాయి. ఇక్కడ స్థానిక హిమాలయ ప్రాంత ఆహారమే కాకుండా యూరోపియన్ ఆహారం కూడా లభిస్తుంది. రస్కిన్ బాండ్ ప్రముఖ పుస్తకాల దుకాణం ఇక్కడే ఉంది. నౌకుచైతాల్... ఢిల్లీకి 320కి.మీ. దూరాన ఉన్న నౌకుచైతాల్ ప్రాంతాన్ని చేరుకోవడానికి సుమారు ఏడు గంటల ప్రయాణం చేయాలి. నైనితాల్ - భీమ్‌తాల్‌కు సమీపాన ఉండటంతో ఈ ప్రాంతానికి యాత్రికుల రద్దీ తక్కువ. జనావాసాలకు దూరంగా, ఒంటరిగా, ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఈ ప్రాంతం సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ నౌకుచైతాల్ సరస్సు. చుట్టూ కొండలతో ఉండే ఈ సరసుకు తొమ్మిది మూలలు ఉంటాయి. అందువల్లే ఈ ప్రాంతానికి నౌకుచైతాల్ అనే పేరు వచ్చింది. సాహసాలు ఇష్టపడే వారికి ట్రెక్కింగ్‌తో పాటు పారాగ్లైడింగ్, పారాసెయిలింగ్ చేయడానకి కూడా అవకాశం ఉంటుంది. నహాన్... శివాలిక్ పర్వత శ్రేణులకు, హిమాలయాలకు మధ్య ఉన్న ప్రదేశం నహాన్. ఢిల్లీ నుంచి 250కి.మీ. దూరాన ఉన్న ఈ ప్రదేశాన్ని చేరడానికి 4 నుంచి 5గంటల పాటు ప్రయాణం చేయాలి. చుట్టూ పచ్చని పచ్చదనం పరుచుకున్న ప్రదేశం కావడంతో ఇక్కడికి వచ్చే వారు ఎక్కువగా హోటల్లలో కన్నా శివారు ప్రాంతాల్లోఉండటానికి ఇష్టపడతారు. మనలో నూతనోత్సహం నింపే సరైన యాత్రా ప్రదేశం ఇదే. రేణుక సరస్సు, పౌంతా సాహిబ్, త్రిలోక్‌పూర్ ఆలయం, సుకేతి శిలాజాల పార్కు ఇక్కడ చూడవలసిన ముఖ్య ప్రదేశాలు. -
ఈ వీడియోలో కళ్లు చెదిరే విన్యాసాలు..
'సాహసం చేయరా డింబకా' అనే పదానికి న్యాయం చేసేలా కొందరు చేసిన సాహసాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చేసిన సాహసాలను కలిపి ఓ వీడియోలో పొందుపరిచారు. ఈ వీడియోలోని కళ్లు చెదిరే విన్యాసాలు నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తున్నాయి. రెక్కలున్న పక్షిలా గాల్లో ఎగురుతూ, సైకిళ్లతో విన్యాసాలు చేస్తూ, ఏకంగా ఆకాశంలోనే బంతితో ఆడుతూ చేసిన సాహసాలు అందరిని అబ్బురపరిచేలా చేశాయి. గుర్రపు స్వారీ చేస్తూ లక్ష్యం గురి తప్పకుండా బాణాలు సందిస్తూ, ఆకాశ హర్మ్యాల పక్క నుంచి గాల్లో విహరిస్తూ చేసిన సాహసాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. -
చూడముచ్చటైన విన్యాసాలు.. సాహసాలకు కొదవేలేదు
-
సాహస మథనం
దారి తప్పిన పడవలో ఇద్దరు స్త్రీల 150 రోజుల పోరాటం సాగరాన్ని మథనం చేసినప్పుడు అమృతం పుడుతుంది. సాగరం మనిషిని మథనం చేసినప్పుడు సాహసం పుడుతుంది. 48 ఏళ్ల వయసొస్తే మన దేశంలో స్త్రీలు ఏం చేస్తారు? రిటైర్ అయ్యామని భావిస్తారు. కూతుళ్ల ప్రసవాలకు సాయం చేయడానికి సిద్ధమవుతారు. మనవలు, మనవరాళ్లతో గడపాలని అనుకుంటారు. సరిగ్గా చెప్పాలంటే జీవితం దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది... ఇంకా ఏం చేయాలి అని నిర్లిప్త పడతారు. కాని జెన్నిఫర్ ఆపెల్, తాషా ఫుఆవా అనే 48 ఏళ్ల స్త్రీలు మాత్రం అలా అనుకోలేదు. జీవితం ఇప్పుడే మొదలైంది అనుకున్నారు. సాహసం లేని జీవితం నిస్సారమైనదని, పిప్పి కంటే హీనమైనదవి భావించారు. సముద్రాన్ని సవాల్ చేసి జీవితం అంటే థ్రిల్ అని నిరూపిద్దామని అనుకున్నారు. కాని వాళ్లు ఒకటి అనుకుంటే సముద్రం ఒకటి చూపించింది. అయినా ధైర్యానిదే అంతిమ గెలుపు అని నిరూపితం అయ్యింది. ఒహావు నుంచి తహతి వరకు పసిఫిక్ సముద్రం లోతెంతో తెలుసా? 4000 మీటర్ల నుంచి 10 వేల మీటర్లు. మహా మహా ఓడలను, సముద్ర దిగ్గజాలను గడగడలాడించిన మహా సముద్రం అది. అలాంటి సముద్రంలో ఉన్న హవాయి దీవుల్లోని ‘ఒహావు’ దీవి నుంచి ‘తహతి’ దీవి వరకు అంటే 2,700 మైళ్ల దూరాన్ని ఒక పడవలో ప్రయాణించాలని అనుకున్నారు ఇద్దరు మహిళా నావికులు జెన్నిఫర్, తాషా. ఇద్దరికీ సముద్ర యానంలో అనుభవం ఉంది. ఆపెల్కు యాభై అడుగుల పొడవున్న మర పడవ ఉంది. ఆ పడవలో దాదాపు 18 రోజులు ప్రయాణించి ఒహావు నుంచి తహతికి చేరుకోవాలని పసిఫిక్‌లోని సుందర దీవులను చూస్తూ వెళ్లాలని వీరి ఆలోచన. నిజానికి ఇలాంటి ప్రయాణాలు ఓడల్లో చేయాలి. పడవలు పనికి రావు. వచ్చినా ప్రమాదాలు ఎక్కువ. అయినా సరే జెన్నిఫర్, తాషా ఈ ప్రయాణానికి సిద్ధమయ్యారు. మే 3, 2017న మొదలు అవును. ఆ తేదీనే వాళ్ల ప్రయాణం ఒహావు నుంచి మొదలైంది. ఒక పడవ, ఇద్దరు స్త్రీలు, తోడుగా రెండు పెంపుడు శునకాలు. వాటి పేర్లు ‘జీయస్’, ‘వాలెంటైన్’. ప్రయాణం మొదలైంది. పది పదిహేను రోజులు బాగానే సాగింది. కాని హటాత్తుగా పడవలోని ఇంజన్ సరిగ్గా పని చేయడం మొరాయించింది. అనుకున్న విధంగా ముందుకు పోవడం లేదు. ఏం చేయాలో తోచడం లేదు. మే 30న సముద్ర తుఫాను పడవను ముంచెత్తింది. దాంతో పడవలో ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బ తింది. పడవ పూర్తిగా మనం కోరిన దిశలో ప్రయాణించడానికి పనికి రాకుండా పోయింది. చుట్టూ 16 కోట్ల చదరపు కిలోమీటర్ల మహా పసిఫిక్ సముద్రం. మధ్యలో ఎక్కడో చీమ కంటే సూక్ష్మంగా ఒక యాభై అడుగుల పడవ. ఏం చేయాలి? తమ దగ్గర ఉన్న ఫోన్ల నుంచి ప్రమాదాన్ని సూచించే కాల్స్ చేయడం మొదలుపెట్టారు. కాని వేటికీ సమాధానం లేదు. ఆ కాల్స్ ఎవరికీ అందడం లేదు. చీకటి అవుతూ ఉంది. తెల్లవారుతూ ఉంది. శునకాలు తమ యజమానురాళ్లకు వచ్చిన కష్టాన్ని గ్రహించాయి. అవసరానికి మించిన ఉత్సాహం ప్రదర్శిస్తూ వాళ్లను ఉత్సాహపరుస్తున్నాయి. పడవలో పులుల్లా అటూ ఇటూ తిరుగుతున్నాయి. వాటి ఉనికి తప్ప ఆ ఇద్దరు స్త్రీలకు చుట్టూ ఏ ఉనికీ లేదు. పలకరించే జీవి లేదు. స్పందించే నాధుడు లేడు. పెద్దల మాట సద్దిమూట హవాయి దీవుల్లో కాకలు తీరిన నావికులు ఎందరో ఉన్నారు. తమ ప్రయాణాన్ని మొదలెట్టే ముందు ఆపెల్, తాషాలు వారిని సలహాల కోసం కలిసినప్పుడు ‘పసిఫిక్‌తో గేమ్సా’ అన్నట్టు చూశారు. కాని వీళ్ల పట్టుదల చూసి ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు. ‘పడవను అంగుళం కూడా ఖాళీగా ఉంచొద్దు. మీ యాత్ర నెల రోజులకు ఉద్దేశించినదైతే సంవత్సరానికి సరిపడా ఆహారం సిద్ధం చేసుకోండి. మీరెళుతున్నది పసిఫిక్ మీద. ఇవాళ బయల్దేరితే రేపేం జరుగుతుందో ఊహించలేము’ అన్నారు. అందుకు తగ్గట్టుగానే ఆపెల్, తాషాలు ఆహారాన్ని పడవలో నింపేశారు. ఆ ఒక్క విలువైన సలహానే వాళ్ల ప్రాణాలు నిలబెడుతున్నాయి. అదొక్కటే కాక తాషా పడవలో వాటర్ ప్యూరిఫైర్లను ముందు జాగ్రత్తతో ఏర్పాటు చేసింది. అందువల్ల నీటి సమస్య ఏర్పడలేదు. ప్రాణాలు ఉన్నాయి. ఊపిరి కొట్టుకుంటోంది. రోజులు గడుస్తున్నాయి. డిప్రెషన్. హెలూసినేషన్స్. మే మొదటి వారం మొదలెట్టిన ప్రయాణం జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ముగిసి అక్టోబర్‌కు చేరుకుంది. పడవ దాని మానాన అది ఎటో కొట్టుకుపోతోంది. అది పోయి పోయి ఏదో ఒక నేలకు చేరుకుంటుందని ఆపెల్, తాషాల ఆలోచన. కాని ఎంతకీ నేల తగలదే. ఆశ, నిరాశల మధ్య ఆపెల్, తాషాలు తమ దగ్గర ఉన్న మొత్తం పది తారా జువ్వలను కూడా దూరంగా షిప్ కనిపించినప్పుడల్లా కాల్చి అదృష్టం పరీక్షించుకున్నారు. కాని లాభం లేకపోయింది. షిప్, వెస్సెల్ కనిపించిన ప్రతిసారీ ఆశపడటం అవి తమ మానాన తాము వెళ్లిపోవడం... అంతులేని దుఃఖం... కూడగట్టుకోవాల్సిన నమ్మకం... ఈలోపు అనుకోని చుట్టాలొచ్చారు. టైగర్ షార్క్స్. రెండుసార్లు అవి పడవను చుట్టుముట్టాయి మనిషి వాసనకు. కాని కుక్కలు తమ మొరుగుళ్లతో వాటిని బెదరగొట్టగలిగాయి. లేకుంటే వాటి పంటి మధ్య ఆపెల్, తాషాలు ఉప్పు నీటిని సంతరించుకుని రుచిగా ఆహారం అయి ఉండేవి. ఆక్టోబర్ 24, వెలుతురు అప్పటికి దాదాపు 150 రోజులు సమీపించాయి. ఆహారం దాదాపు ముగియ సాగింది. లేదంటే పాడైపోవడం మొదలెట్టింది. కుక్కల ఆహారం అయితే ఇక లేనట్టే. మాట ఇద్దరూ మాట్లాడే ఓపికను కోల్పోయారు. ఇక ఇవాళో రేపో చచ్చిపోతామని వారికి అర్థమైపోయింది. ఆ లోపు దూరంగా ఒక చేపల పడవ. తైవాన్ వారిది. అంటే తాము ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? జపాన్‌కి ఈశాన్యంగా 900 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. తైవాన్ పడవ కూడా వీళ్లను చూడకుండా వెళ్లిపోయేదే. ఆపెల్ తెగించి సముద్రంలో దూకి ఓడ వైపు ఈత కొట్టసాగింది. అప్పటికి గాని పడవ వాళ్లు ఆపెల్ని చూడలేదు. వెంటనే వాళ్లు అక్కడకు దగ్గరగా ఉన్న అమెరికా నావీ బేస్‌కు సమాచారం అందించారు. అమెరికా రక్షణ ఓడ ఆఘమేఘాల మీదకు చేరుకుని ఆపెల్ను, తాషాను వారి రెండు శునకాలను రక్షించారు. ఓడలోకి చేరుకున్నాక వాళ్లు రెండు ధారలను తనివితీరా తాగారు. ఒకటి: ఆనందంతో పొంగుతున్న అశ్రుధార, రెండు: పడవ సిబ్బంది అందించిన నీటి ధార. మళ్లీ సాహసానికే ఆపెల్, తాషా తమ పడవను నడి సముద్రంలో వదిలేశారు. అది ఎప్పటికైనా ఏదో ఒక ఒడ్డుకు చేరుకుని తమకు దక్కుతుందని ఆశ. లేకపోయినా పర్వాలేదు. కొత్త పడవను సిద్ధం చేసుకొని వచ్చే వేసవిలో మళ్లీ సముద్రం మీద పడాలని వారి ఆలోచన. ఇంత జరిగాక? అవును ఇంత జరిగాక. ఊరికే కూర్చున్నా ఎదురుపడి వెళుతున్నా జీవితం తాను ఇచ్చే షాకులు ఇస్తూనే ఉంటుంది. మరి మౌనంగా ఉండి భరించడం ఎందుకు... తిరగబడితో పోలేదా అంటారు వాళ్లు. మనకు ఏదైనా స్ఫూర్తి వస్తున్నదా ఈ కథ చదివితే? ఎందుకు రాదు... ఒక్క సాహసం వేయి తెగింపులకు లంగరెత్తదూ? సహాయక సిబ్బంది రక్షణ చర్యలు -
రిస్క్ తీసుకోవటం ఇష్టమా?
సాహసాలు చేయటం గొప్పే... రిస్క్ తీసుకుంటేనే జీవితంలో థ్రిల్ ఉంటుంది. ఇది అలవాటుగా మారితే? ప్రతిదానికీ రిస్క్ చేయాలనుకుంటే? అతివిశ్వాసం మిమ్మల్ని నడిపిస్తే? ఫలితం... పాజిటివ్ రిజల్ట్స్ కంటే నెగెటివ్ రిజల్ట్సే ఎక్కువ రావచ్చు, ఎన్నో అనర్థాలకు కారణం కావచ్చు. కొన్ని విషయాల్లో రిస్క్ అవసరమైనా ఇది శృతి మించటమే మంచిది కాదు. మీరూ రిస్క్ బీయింగేమో ఒకసారి చెక్ చేసుకోండి. 1. పదిమంది ఒక్కమాటపై ఉన్నా మీరు మాత్రం వారికి వ్యతిరేకంగా ఉంటారు. ఎ. అవును బి. కాదు 2. మీరు చేసే పని ఒప్పు అవుతుందనే నమ్మకం మీలో బలంగా ఉంది. ఎ. అవును బి. కాదు 3. ఏ పనైనా డెడ్‌లైన్ వచ్చేదాకా పూర్తిచేయరు. ఎ. అవును బి. కాదు 4. ప్రమాదకరమైన పందాలు (బంగీ జంప్, బైక్ వీలింగ్ మొదలైనవి) నిర్వహించేటప్పుడు, వాటిలో కచ్చితంగా పాల్గొనాలనుకుంటారు. ఎ. అవును బి. కాదు 5. మీకు అనుభవంలేని వ్యాపారాలు/ ఇతర ఆదాయ మార్గాల్లో పెట్టుబడి పెడుతుంటారు. ఎ. అవును బి. కాదు 6. ప్రమోషన్‌పై చాలా దూరంగా మీ కంపెనీ మిమ్మల్ని బదిలీ చేసినా, (బంధువులు, స్నేహితులు, తెలిసినవారు లేనిచోటికి) ప్రమోషన్‌ను స్వీకరిస్తారు. ఎ. అవును బి. కాదు 7. మీ స్నేహితులంతా కలిసి టూర్ వెళ్లే సమయంలో మీ ఆరోగ్యం సరిగా లేకపోయినా కార్యక్రమాన్ని వాయిదా వేయరు. ఎ. అవును బి. కాదు 8. ముఖ్యమైన నిర్ణయాలను తక్షణమే తీసుకుంటారు (ఆలోచించకుండా) ఎ. అవును బి. కాదు 9. ఇతరులను కామెంట్ చే స్తూ ఆనందిస్తారు. ఎ. అవును బి. కాదు 10. మేనేజర్‌తో మీటింగ్ జరుగుతున్నప్పుడు, సుపీరియర్స్ తీసుకున్న నిర్ణయం మీకు నచ్చకపోతే అక్కడే దానిని ఖండిస్తారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు ఏడు దాటితే మీలో చాలెంజింగ్ స్పిరిట్ ఎక్కువపాళ్లలో ఉంటుంది. దీనివల్ల కొన్ని సార్లు ప్రమాదాలు మీ దరి చేరతాయి. అన్ని విషయాల్లో రిస్క్ తీసుకోకపోవటమే మంచిది. ‘బి’లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే మీరు రిస్క్ తీసుకోవటానికి దూరం. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులకు మీరు గురికారు. ‘ఎ’ లు నాలుగు లోపు వస్తే అవసరమైన విషయాల్లో మాత్రమే రిస్క్ తీసుకుంటారు. -
అయ్ బా....బో...య్!
విడ్డూరం పందొమ్మిది సంవత్సరాల కొబ్జారో చూడడానికి నోట్లో నాలిక లేని వ్యక్తిలా కనిపిస్తుంది. ఈ అమ్మడు చేసే సాహసాలు చూస్తే మాత్రం ‘అయ్ బాబోయ్’ అనిపిస్తాయి. మాస్కో మెట్రో రైళ్లపై ‘ట్రైయిన్ సర్ఫింగ్’ చేయడం ఆమె హాబీ. పదిహేను సంవత్సరాల వయసు నుంచే ట్రైన్లపై ఈ సాహసం చేస్తుంది. ట్రైయిన్ పైన బ్యాలెన్సింగ్‌గా ఉండడం ఆషామాషీ విషయం కాదు. గుండెలు నాన్‌స్టాప్‌గా గుభేలంటాయి. అయితే ఈ టీనేజ్ డేర్డెవిల్కు మాత్రం అలాంటి భయాలేమీ లేవు. ‘జీవితం విలువైనది. ఇలాంటి సాహసాలకు పూనుకోవడం తగునా?’ అని ఆమెకు ఎవరైనా సలహా ఇస్తే... ‘సాహసంలేని జీవితం ఒక జీవితమేనా?’ అని ఎదురు ప్రశ్న వేస్తుంది. రక్తం గడ్డ కట్టే చలికాలాల్లోనూ... ట్రైన్ సర్ఫింగ్ చేయడం కొబ్జారో ప్రత్యేకత. ఎవరైనా కొత్తవాళ్లు హఠాత్తుగా ట్రైన్ పైన కొబ్జారోని చూస్తే... ‘అదిగో... బ్యాట్ వుమెన్’ అని అరవడం ఖాయం. చాలా సందర్భాల్లో ఆమె బ్యాట్‌మెన్ వేషంలో ఈ సాహసం చేస్తుంటుంది మరి! మరి ఈ దుస్సాహసాన్ని పోలీసులు ఎలా సహిస్తున్నారు? చాలా సందర్భాల్లో ఆమెకు పెనాల్టీ విధించారు. అయినా కొబ్జారో ధోరణిలో మార్పు రావడం లేదు. కొబ్జారోను ఆమె తల్లిదండ్రులు చిన్నప్పుడు ‘సాహసం’ అనే పదానికి చాలా దూరంగా, అతి జాగ్రత్తగా పెంచారు. పెద్దయ్యాక మాత్రం... తన ధోరణి ‘సాహసమే నా ఊపిరి’లా తయారైంది. ‘హద్దులను చెరిపేసేవాళ్లు, తమవైన కొత్త నియమాలు రూపొందించుకునేవాళ్లు అంటే ఇష్టం’ అంటున్న కొబ్జారో బ్రిటన్‌లో చదువుకుంది. ‘ట్రైన్ రైడింగ్ చేస్తున్నప్పుడు ఒక విశాల ప్రపంచంలోకి వెళుతున్నట్లు అనిపిస్తుంది’ అంటుంది కొబ్జారో. అంతేనా... ‘ఈ ప్రపంచాన్ని భిన్నమైన కోణం నుంచి చూడడానికి ట్రైయిన్ సర్ఫింగ్ ఎంతో ఉపయోగపడుతుంది’ అని కూడా అంటుంది. మాటలకేంగానీ, కాస్త జాగ్రత్త తల్లి!! -
అమెరికాలో త్రిష సాహస క్రీడలు
చెన్నై : సినీ తారల సాహస క్రీడలు వెండితెరపై చూసి ప్రేక్షకులు తెగ సంబరపడిపోతుంటారు.అయితే వాటి వెనుక చాయాగ్రాహక ట్రిక్స్, సాంకేతిక పరిజ్ఞాన జాలాలు ఉంటాయి. నిజ జీవితంలో సాహస క్రీడల్లో శిక్షణ పొందిన వారు చాలా చాలా అరుదనే చెప్పాలి. అలాంటి సాహస క్రీడల్లో చెన్నై చిన్నది త్రిష దుమ్మురేపుతున్నారు. ఆకాశంలో రౌండులు, మంచుకొండల్లో యమాగా ఎంజాయ్ చేసేస్తున్నారు. అసలు అందాలభామ త్రిష జీవితమే ఒక సంచలనం అనవచ్చు. ఇంకా చెప్పాలంటే తన ఇప్పటి ఉన్నత స్థాయి కోసం తొలి రోజుల్లో పెద్ద పోరాటమే చేశారామె. మొదట మోడలింగ్‌తో జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత నటిగా రాణించాలనే ఆకాంక్షతో సహాయ నటిగా నటించడానికి కూడా సిద్ధమయ్యారు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ నటిగా ఎదిగారు. విశేషం ఏమిటంటే ఆదిలో పలు ఒడిదుడుకులను ఎదుర్కొన్న త్రిష తన సినీ సామ్రాజ్యంలో 12 ఏళ్ల టాప్ హీరోయిన్గా తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ వ్యక్తిగతంగా పలు అవరోధాలను అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా వ్యాపారవేత్త, సినీ నిర్మాత వరుణ్మణియన్లో ప్రేమ పెళ్లికి దారి తీసి, నిశ్చితార్థం జరిగి, ఇక పెళ్లే తరువాయి అన్న సమయంలో పెటాకులవ్వడం, ఒక టాలీవుడ్ నటుడితో ప్రేమ బ్రేకప్ లాంటి అంశాలు త్రిషను బాధింపునకు గురి చేశాయన్నది నిజమే అయినా వాటికీ ఏమాత్రం చలించక ఆ ప్రభావాన్ని తన నట కేరీర్ మీద పడనీయకుండా జాగ్రత్త పడుతూ అదే సమయంలో తన ఆనంద క్షణాలను కోల్పోకుండా నచ్చిన విధంగా జీవిత పయనాన్ని సాగిస్తున్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా త్రిష ప్రతి ఏడాది విదేశాల జాలీ ట్రిప్‌ను మిస్ చేసుకోరు.అదే విధంగా ఈ ఏడాది క్రిస్మస్,నూతన సంవత్సం వేడుకల్ని అమెరికాలో తన నెచ్చెలిలతో జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అమెరికాలోని వేగాస్,గ్రింట్కెన్యాన్,నబ్బాపళ్లతాక్కు తదితర ప్రదేశాల్లో క్రిస్మస్ వేడుకల్ని జరుపుకున్న త్రిష పనిలో పనిగా ఆమె అమెరికాలో ఆకాశంలో ఎగిరే క్రీడలో,మంచు ప్రాంతాల్లో స్కేటింగ్ క్రీడలో శిక్షణ పొందారట. నూతన సంవత్సర వేడుకల్ని శాన్ఫ్రాన్సిస్కోలో జరుపుకోనున్నారట. -
వండర్ బుక్ లో సాహస వీరుడు
హిమాయత్‌నగర్: ఒక కర్ర ముక్క తగిలితేనే ధారగా రక్తం కారుతుండటం మనం చూస్తేనే ఉంటాం. అలాంటిది ఓ యువకుడు పదునైన 5 అంగుళాల మేకును ముక్కులోకి దింపుకొంటే... పైగా దానిపై సుత్తితో కొడితే.. ఆలోచిస్తేనే ఎంత భయంకరంగా ఉంటుంది. అక్కడితో ఆగకుండా గోడలకు రంధ్రాలు చేసే డ్రిల్లింగ్ మిషన్‌తో అదే ముక్కులో డ్రిలింగ్ చేసుకుంటే... ఇంతకీ ఈ సాహసానికి పూనుకున్నది ఎవరనుకుంటున్నారా ఆ యువకుడు నల్గొండ జిల్లా అడ్డగూడూరుకు చెందిన క్రాంతి కుమార్. ప్రపంచంలోనే ఇలాంటి కఠినమైన సాహసాలు చేసేవారిలో ఇతడు మూడో స్థానంలో ఉన్నాడు. తన సాహసాలతో క్రాంతి కుమార్ వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సులో కూడా చోటు దక్కించుకున్నాడు. శుక్రవారం హిమాయత్‌నగర్ మీడియా సెంటర్లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ దక్షిణ భారత సమన్వయ కర్త బింగి నరేందర్ గౌడ్, తెలంగాణ, ఏపీ సమన్వయ కర్త గుర్రం స్వర్ణశ్రీ తదితరులు, విలేకరుల ముందు ఈ ప్రదర్శన చేసి అందర్నీ అబ్బుర పరిచాడు. క్రాంతి కుమార్ ప్రతిభను గుర్తించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు మెమొంటో, గోల్డ్ మెడల్‌ను బహూకరించారు. ఈ కార్యక్రమానికి లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ డెరైక్టర్ డాక్టర్ కోమట్రెడ్డి గోపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి క్రాంతికుమార్ సాహసాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా బింగి నరేందర్ గౌడ్ మాట్లాడుతూ అరుదుగా కనిపించే ఇలాంటి సాహసవంతులను ప్రభుత్వం ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి. రమణాచారి హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. కాగా సాహస విన్యాసాన్ని ప్రదర్శించిన యువకుడు క్రాంతికుమార్ రోజు వారీ కూలీగా వాల్ పెయింటింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. -
పిల్లా? పిడుగా?
-
గాల్లో తేలినట్టుందే..!
ఆల్ఫ్స్ పర్వత శ్రేణులు.. ఫ్రాన్స్ పరిధిలోని అతి ఎత్తై మంచుకొండలు. ఎముకలు గడ్డగట్టే చలి. ఇక్కడ పర్యటించడమే పెద్ద సాహసం. అలాంటిది ఈ పర్వతశ్రేణులను అధిరోహించడం మామూలు విషయం కాదు. అయితే కొందరు ఈ మంచుకొండలను ఎక్కే సాహసాలను చేస్తుంటారు. అటువంటి వారికి కొత్తరకమైన అనుభవాన్ని ఇచ్చే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన ‘గ్లాస్కేజ్’ ఏర్పాటు చేశారు. యూరప్ ఖండ పరిధిలోని అతి ఎత్తై మంచుశిఖరం ‘మౌంట్ బ్లాంక్’కు ఈ గ్లాస్కేజ్ ఏర్పాటు చేశారు. పది అడుగుల చదరపు విస్తీర్ణంతో ఉండే ఈ క్యాబిన్లో నిలబడితే దాదాపు గాలిలో తేలిన ఫీలింగ్ ఉంటుంది. కిందివైపుకు చూస్తూ నాలుగు కిలోమీటర్ల లోతువరకూ కనిపిస్తుంది. శిఖరం మీద నుంచి కిందివైపుకు చూడటం ఒక ఎత్తయితే ఈ కేజ్‌లోకి ప్రవేశించి ఆ పరిసరాలను చూడటం మరో ఎత్తు. ఇదొక అనిర్వచనీైయమెన అనుభవం.