సూపర్‌... సూపర్‌... సూపర్‌... హీరో | Infinity War Is Facing Its Biggest Box Office Challenge | Sakshi
Sakshi News home page

సూపర్‌... సూపర్‌... సూపర్‌... హీరో

Published Sun, May 20 2018 2:08 AM | Last Updated on Sun, May 20 2018 2:12 AM

Infinity War Is Facing Its Biggest Box Office Challenge - Sakshi

ప్రపంచాన్ని అంతం చేయడానికి ఎన్ని శక్తులు పుట్టుకొచ్చినా వాటిని అంతమొందించేందుకు ఒక హీరో పుట్టుకొస్తాడు. విలన్‌కే అంత పవర్‌ ఉంటే హీరోకు ఇంకెంత పవర్‌ ఉండాలి? సూపర్‌ పవర్‌ ఉండాలి కదూ? అలాంటి సూపర్‌ పవర్స్‌తో మనల్ని సంవత్సరాలుగా కట్టిపడేస్తోన్న సూపర్‌ హీరోలందరూ ఒకేసారి తెరపై కనిపిస్తే? ఆ సంబరం ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది. ‘ఐరన్‌మేన్‌’, ‘స్పైడర్‌మేన్‌’, ‘కెప్టెన్‌ అమెరికా’, ‘బ్లాక్‌పాంథర్‌’.. ఇలా సూపర్‌ హీరోలుగా ఎన్నో అడ్వెంచర్స్‌ చేసి మనల్ని మెప్పించిన సూపర్‌ హీరో క్యారెక్టర్స్‌ అందరూ ఏకమై ఒక పెద్ద శక్తిపై పోరాడేందుకు చేసే యుద్ధమే ‘అవెంజర్స్‌’. ఈ సిరీస్‌లో మూడో సినిమా ‘అవెంజర్స్‌ : ఇన్ఫినిటీ వార్‌’ ఏప్రిల్‌ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై ఇప్పటికీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ ఒక్క సినిమా కోసమే సూపర్‌ హీరో సినిమా ఫ్యాన్స్‌ అంతా సంవత్సర కాలంగా ఎదురుచూస్తూ వచ్చారు. మన ఇండియన్‌ సినిమాకు ‘బాహుబలి’ లాంటిది హాలీవుడ్‌కు ఈ సినిమా. అవెంజర్స్‌ ప్రత్యేకతలేంటీ? హాలీవుడ్‌ టాప్‌ ఫోర్‌ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్‌ పర్ఫార్మెన్స్‌కి కారణం ఏంటీ? తెలుసుకోవాలంటే అసలు కథలోకి వెళ్లాల్సిందే!

మార్వెల్స్‌ మ్యాజిక్‌....
మార్వెల్‌ కామిక్స్‌ది ఒక చరిత్ర. కామిక్‌ పుస్తకాలతో దశాబ్దాలుగా ఎందరో సూపర్‌ హీరోలను సృష్టించిన మార్వెల్, ఆ సూపర్‌ హీరోలనే సినిమాలుగానూ తీసుకొచ్చి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సూపర్‌ హీరోలు ఇండియన్‌ సినిమా ఫ్యాన్స్‌కూ తెగ కిక్‌ ఇచ్చేస్తుంటారు. అవెంజర్స్‌.. ఈ సూపర్‌ హీరోలందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి చేయించే యుద్ధం. 2012లో ‘అవెంజర్స్‌’ సిరీస్‌లో మొదటి సినిమా వచ్చింది. ఇది అప్పట్లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌. ఆ తర్వాత 2015లో ‘అవెంజర్స్‌ : ఏజ్‌ ఆఫ్‌ అల్ట్రాన్‌’ వచ్చింది. అదీ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌. ఇక ఇప్పుడు 2018లో తాజాగా ‘అవెంజర్స్‌ : ఇన్ఫినిటీ వార్‌’ వచ్చేసింది. ఇదీ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అనిపించుకుంటూ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతోంది. 2019లో ఈ కొత్త సినిమాకు సీక్వెల్‌ రానుంది. అవెంజర్స్‌లో సూపర్‌ హీరోలంతా ఈ ప్రపంచాన్ని కాపాడ్డానికే కష్టపడుతుంటారు. ఒక్కో సినిమాలో ఒక్కో విలన్‌.

ఇన్ఫినిటీ వార్‌ కథేంటీ?
ఇన్ఫినిటీ వార్‌లో థానోస్‌పై యుద్ధం చేస్తున్నారు మన సూపర్‌ హీరోలంతా. ప్రపంచాన్ని జయించే శక్తిని సంపాదించి, ఈ ప్రపంచాన్నంతా తన చేతుల్లోకి తెచ్చుకోవాలని చూస్తుంటాడు థానోస్‌. అందుకు ఎంతటి విధ్వంసానికైనా వెనుకాడడు. ఆ థానోస్‌ను ఎదుర్కొని, ప్రపంచాన్ని కాపాడ్డానికి సూపర్‌ హీరోలంతా ఏకమై ఒక యుద్ధం చేయాలి. అలాంటి ఇలాంటి యుద్ధం కాదది. థానోస్‌ను ఎదుర్కోవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఐరన్‌మేన్, హల్క్, స్పైడర్‌మేన్‌ తదితర మార్వెల్‌ సృష్టించిన సూపర్‌ హీరోలంతా తమకు మాత్రమే సాధ్యమయ్యే విన్యాసాలు, అడ్వెంచర్స్‌ చేస్తూ థానోస్‌ పనిపడతారు. ఆద్యంతం కట్టిపడేసే యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో, కళ్లు చెదిరే విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఇన్ఫినిటీ వార్‌ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.  

అవెంజర్స్‌ టీమ్‌...మార్వెల్‌ స్టూడియోస్‌
ప్రతిష్టాత్మకంగా మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో పందొమ్మిదో సినిమాగా ఇన్ఫినిటీ వార్‌ను తీసుకొచ్చింది. ఆంథోని రుస్సో, జాయ్‌ రుస్సో ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాబర్ట్‌ డోనీ జూనియర్‌ ఐరన్‌మేన్‌గా, క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ హల్క్‌గా, క్రిస్‌ ఈవన్స్‌ కెప్టెన్‌ అమెరికాగా, ఛద్విక్‌ బోస్మన్‌ బ్లాక్‌పాంథర్‌గా, స్కార్లెట్‌ జోహన్సన్‌ బ్లాక్‌ విడోగా నటించిన ఈ సినిమాలో ఎక్కడ చూసినా, ఏ సమయంలో చూసినా, స్క్రీన్‌ నిండా స్టార్సే కనిపిస్తారు. ఆ స్టార్స్‌ చేసే సందడి థియేటర్లలో అభిమానులకు పండగ వాతావరణాన్ని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఒక్కో క్యారెక్టర్‌కూ సపరేట్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండడం కూడా ఇన్ఫినిటీ వార్‌కు ఒక స్పెషల్‌ అట్రాక్షన్‌ అని చెప్పుకోవాలి.

బడ్జెట్‌ ‘హీరో’...
‘అవెంజర్స్‌ : ఇన్ఫినిటీ వార్‌’ను ఒక సినిమాటిక్‌ అద్భుతంలా తెరకెక్కించాలన్నది మార్వెల్‌ స్టూడియోస్‌ కల. ఆ కలకు తగ్గట్టే బెస్ట్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తూ, విజువల్‌ వండర్‌గా ఇన్ఫినిటీ వార్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇందుకు అయిన బడ్జెట్‌ కూడా అంతా ఇంతా కాదు. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఇన్ఫినిటీ వార్‌ తెరకెక్కింది. ఇది హాలీవుడ్‌ చరిత్రలో టాప్‌ 4 బడ్జెట్‌ సినిమాల్లో ఒకటి. అంత బడ్జెట్‌ పెట్టారు కాబట్టే, ఇంత మంది స్టార్స్‌ ఒక దగ్గరికి రావడం, ఇంత బెస్ట్‌ ఔట్‌పుట్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగించడం జరుగుతోందని అంటారు ఫ్యాన్స్‌.

బాక్సాఫీస్‌ ‘సూపర్‌ హీరో’... టాప్‌ 4లో చోటు...
‘అవెంజర్స్‌ : ఇన్ఫినిటీ వార్‌’ బడ్జెట్‌లో దాదాపు 300 మిలియన్‌ డాలర్లతో హీరో అయితే, బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హీరో రేంజ్‌లో నాలుగో వారంలోకి అడుగు పెట్టేసరికి 1.7 బిలియన్‌ డాలర్లు (సుమారు 11 వేల కోట్ల రూపాయలు) వసూలు చేసి 2 బిలియన్‌ మార్క్‌ వైపు దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి షోతోనే సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్‌ దగ్గర ఒక ప్రభంజనమే సృష్టిస్తూ వచ్చిందీ సినిమా.

ఇండియన్‌ బాక్సాఫీస్‌పై ఇన్ఫినిటీ ‘వార్‌’!
ఇండియన్‌ సినిమా అభిమానులకు సూపర్‌ హీరో సినిమాలంటే పిచ్చి అభిమానమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక్కడ సూపర్‌హీరోలకు చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు అన్ని వర్గాల వాళ్లూ ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇన్ఫినిటీ వార్‌ కోసం వీళ్లంతా ఏడాది ప్రారంభం నుంచే ఎదురుచూస్తూ వచ్చారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు రెండు వేల థియేటర్లలో సినిమాను విడుదల చేశారు. కేవలం మొదటిరోజే 30 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టి, ఈ ఏడాది బాలీవుడ్‌లో అన్ని సినిమాల ఓపెనింగ్‌ డే రికార్డులను బద్దలు కొట్టింది ఇన్ఫినిటీ వార్‌. ఇదే జోరు ఈరోజుకీ కొనసాగుతూండడం విశేషంగా చెప్పుకోవాలి. ఇప్పటికే 200కోట్ల మార్క్‌ను కూడా దాటేసి (మూడోవారం ముగిసేసరికి 215 కోట్ల రూపాయలు), ‘ది జంగిల్‌ బుక్‌’ రికార్డును కూడా బ్రేక్‌ చేసి ఇండియాలో ఇప్పటికే పెద్ద బ్లాక్‌బస్టర్‌గా ఇన్ఫినిటీ వార్‌ నిలిచింది. 200 కోట్ల మార్క్‌ను చేరుకున్న మొదటి హాలీవుడ్‌ సినిమా ఇదే! మే నెలంతా పిల్లలకు సెలవులే కావడంతో ఇన్ఫినిటీ వార్‌ ఇండియాలో ఇంకొన్ని రోజులు ఇలాగే కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని ట్రేడ్‌ అంచనా వేస్తోంది. విచిత్రంగా ఇప్పటివరకూ మార్వెల్‌ సినిమాలు పరిచయం లేని వాళ్లు కూడా అవెంజర్స్‌ : ఇన్ఫినిటీ వార్‌ గురించి ఆసక్తిగా తెలుసుకుంటూ ఉండటం విశేషంగా చెప్పుకోవాలి!

ప్రపంచాన్ని అంతం చేయడానికి ఎన్ని శక్తులు పుట్టుకొచ్చినా వాటిని అంతమొందించేందుకు ఒక హీరో పుట్టుకొస్తాడు. విలన్‌కే అంత పవర్‌ ఉంటే హీరోకు ఇంకెంత పవర్‌ ఉండాలి? సూపర్‌ పవర్‌ ఉండాలి కదూ? అలాంటి సూపర్‌ పవర్స్‌తో మనల్ని సంవత్సరాలుగా కట్టిపడేస్తోన్న సూపర్‌ హీరోలందరూ ఒకేసారి తెరపై కనిపిస్తే? ఆ సంబరం ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది. ‘ఐరన్‌మేన్‌’, ‘స్పైడర్‌మేన్‌’, ‘కెప్టెన్‌ అమెరికా’, ‘బ్లాక్‌పాంథర్‌’.. ఇలా సూపర్‌ హీరోలుగా ఎన్నో అడ్వెంచర్స్‌ చేసి మనల్ని మెప్పించిన సూపర్‌ హీరో క్యారెక్టర్స్‌ అందరూ ఏకమై ఒక పెద్ద శక్తిపై పోరాడేందుకు చేసే యుద్ధమే ‘అవెంజర్స్‌’. ఈ సిరీస్‌లో మూడో సినిమా ‘అవెంజర్స్‌ : ఇన్ఫినిటీ వార్‌’ ఏప్రిల్‌ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై ఇప్పటికీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ ఒక్క సినిమా కోసమే సూపర్‌ హీరో సినిమా ఫ్యాన్స్‌ అంతా సంవత్సర కాలంగా ఎదురుచూస్తూ వచ్చారు. మన ఇండియన్‌ సినిమాకు ‘బాహుబలి’ లాంటిది హాలీవుడ్‌కు ఈ సినిమా. అవెంజర్స్‌ ప్రత్యేకతలేంటీ? హాలీవుడ్‌ టాప్‌ ఫోర్‌ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్‌ పర్ఫార్మెన్స్‌కి కారణం ఏంటీ? తెలుసుకోవాలంటే అసలు కథలోకి వెళ్లాల్సిందే!

మార్వెల్స్‌ మ్యాజిక్‌....
మార్వెల్‌ కామిక్స్‌ది ఒక చరిత్ర. కామిక్‌ పుస్తకాలతో దశాబ్దాలుగా ఎందరో సూపర్‌ హీరోలను సృష్టించిన మార్వెల్, ఆ సూపర్‌ హీరోలనే సినిమాలుగానూ తీసుకొచ్చి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సూపర్‌ హీరోలు ఇండియన్‌ సినిమా ఫ్యాన్స్‌కూ తెగ కిక్‌ ఇచ్చేస్తుంటారు. అవెంజర్స్‌.. ఈ సూపర్‌ హీరోలందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి చేయించే యుద్ధం. 2012లో ‘అవెంజర్స్‌’ సిరీస్‌లో మొదటి సినిమా వచ్చింది. ఇది అప్పట్లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌. ఆ తర్వాత 2015లో ‘అవెంజర్స్‌ : ఏజ్‌ ఆఫ్‌ అల్ట్రాన్‌’ వచ్చింది. అదీ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌. ఇక ఇప్పుడు 2018లో తాజాగా ‘అవెంజర్స్‌ : ఇన్ఫినిటీ వార్‌’ వచ్చేసింది. ఇదీ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అనిపించుకుంటూ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతోంది. 2019లో ఈ కొత్త సినిమాకు సీక్వెల్‌ రానుంది. అవెంజర్స్‌లో సూపర్‌ హీరోలంతా ఈ ప్రపంచాన్ని కాపాడ్డానికే కష్టపడుతుంటారు. ఒక్కో సినిమాలో ఒక్కో విలన్‌.

ఇన్ఫినిటీ వార్‌ కథేంటీ?
ఇన్ఫినిటీ వార్‌లో థానోస్‌పై యుద్ధం చేస్తున్నారు మన సూపర్‌ హీరోలంతా. ప్రపంచాన్ని జయించే శక్తిని సంపాదించి, ఈ ప్రపంచాన్నంతా తన చేతుల్లోకి తెచ్చుకోవాలని చూస్తుంటాడు థానోస్‌. అందుకు ఎంతటి విధ్వంసానికైనా వెనుకాడడు. ఆ థానోస్‌ను ఎదుర్కొని, ప్రపంచాన్ని కాపాడ్డానికి సూపర్‌ హీరోలంతా ఏకమై ఒక యుద్ధం చేయాలి. అలాంటి ఇలాంటి యుద్ధం కాదది. థానోస్‌ను ఎదుర్కోవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఐరన్‌మేన్, హల్క్, స్పైడర్‌మేన్‌ తదితర మార్వెల్‌ సృష్టించిన సూపర్‌ హీరోలంతా తమకు మాత్రమే సాధ్యమయ్యే విన్యాసాలు, అడ్వెంచర్స్‌ చేస్తూ థానోస్‌ పనిపడతారు. ఆద్యంతం కట్టిపడేసే యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో, కళ్లు చెదిరే విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఇన్ఫినిటీ వార్‌ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.  

అవెంజర్స్‌ టీమ్‌...మార్వెల్‌ స్టూడియోస్‌
ప్రతిష్టాత్మకంగా మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో పందొమ్మిదో సినిమాగా ఇన్ఫినిటీ వార్‌ను తీసుకొచ్చింది. ఆంథోని రుస్సో, జాయ్‌ రుస్సో ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాబర్ట్‌ డోనీ జూనియర్‌ ఐరన్‌మేన్‌గా, క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ హల్క్‌గా, క్రిస్‌ ఈవన్స్‌ కెప్టెన్‌ అమెరికాగా, ఛద్విక్‌ బోస్మన్‌ బ్లాక్‌పాంథర్‌గా, స్కార్లెట్‌ జోహన్సన్‌ బ్లాక్‌ విడోగా నటించిన ఈ సినిమాలో ఎక్కడ చూసినా, ఏ సమయంలో చూసినా, స్క్రీన్‌ నిండా స్టార్సే కనిపిస్తారు. ఆ స్టార్స్‌ చేసే సందడి థియేటర్లలో అభిమానులకు పండగ వాతావరణాన్ని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఒక్కో క్యారెక్టర్‌కూ సపరేట్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండడం కూడా ఇన్ఫినిటీ వార్‌కు ఒక స్పెషల్‌ అట్రాక్షన్‌ అని చెప్పుకోవాలి.

బడ్జెట్‌ ‘హీరో’...
‘అవెంజర్స్‌ : ఇన్ఫినిటీ వార్‌’ను ఒక సినిమాటిక్‌ అద్భుతంలా తెరకెక్కించాలన్నది మార్వెల్‌ స్టూడియోస్‌ కల. ఆ కలకు తగ్గట్టే బెస్ట్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తూ, విజువల్‌ వండర్‌గా ఇన్ఫినిటీ వార్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇందుకు అయిన బడ్జెట్‌ కూడా అంతా ఇంతా కాదు. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఇన్ఫినిటీ వార్‌ తెరకెక్కింది. ఇది హాలీవుడ్‌ చరిత్రలో టాప్‌ 4 బడ్జెట్‌ సినిమాల్లో ఒకటి. అంత బడ్జెట్‌ పెట్టారు కాబట్టే, ఇంత మంది స్టార్స్‌ ఒక దగ్గరికి రావడం, ఇంత బెస్ట్‌ ఔట్‌పుట్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగించడం జరుగుతోందని అంటారు ఫ్యాన్స్‌.

బాక్సాఫీస్‌ ‘సూపర్‌ హీరో’... టాప్‌ 4లో చోటు...
‘అవెంజర్స్‌ : ఇన్ఫినిటీ వార్‌’ బడ్జెట్‌లో దాదాపు 300 మిలియన్‌ డాలర్లతో హీరో అయితే, బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హీరో రేంజ్‌లో నాలుగో వారంలోకి అడుగు పెట్టేసరికి 1.7 బిలియన్‌ డాలర్లు (సుమారు 11 వేల కోట్ల రూపాయలు) వసూలు చేసి 2 బిలియన్‌ మార్క్‌ వైపు దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి షోతోనే సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్‌ దగ్గర ఒక ప్రభంజనమే సృష్టిస్తూ వచ్చిందీ సినిమా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement