హిట్‌ జోడీ రిపీట్‌ | Tom Holland and Zendaya Expected To Return For Spider Man 4 | Sakshi
Sakshi News home page

హిట్‌ జోడీ రిపీట్‌

Published Wed, Mar 27 2024 6:09 AM | Last Updated on Wed, Mar 27 2024 12:03 PM

Tom Holland and Zendaya Expected To Return For Spider Man 4 - Sakshi

టామ్‌ హాలండ్, జెండయా హిట్‌ జోడీ. ‘స్పైడర్‌ మేన్‌’ సిరీస్‌లో వెండితెరపై ప్రేమికులుగా కనిపించిన ఈ ఇద్దరూ నిజంగానే ప్రేమికులు కూడా. అయితే బ్రేకప్‌ చెప్పుకున్నారనే వార్తలు ఈ మధ్య వస్తే... ‘అలాంటిదేం లేదు’ అంటూ ఈ జంటను ఇష్టపడేవారిని ఖుషీ చేశారు టామ్‌. ఇప్పుడు హాలీవుడ్‌ నుంచి మరో ఖుషీ కబురు అందింది. ‘స్పైడర్‌మేన్‌’ సిరీస్‌లోని నాలుగో భాగంలోనూ ఈ ఇద్దరూ జంటగా నటించనున్నారన్నది ఆ కబురు. నిజానికి ‘యుఫోరియా’ సిరీస్‌లోని మూడో సీజన్‌లో నటిస్తున్నందున జెండయా ‘స్పైడర్‌మేన్‌ 4’లో నటించడానికి వీలుపడని పరిస్థితి.

అయితే ‘యుఫోరియా’ కథ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆ సిరీస్‌ కమిట్‌ అయిన నటీనటులకు వేరే ప్రాజెక్ట్‌ ఒప్పుకునే వెసులుబాటుని ఇచ్చిందట యూనిట్‌. దాంతో తాను ఎంతగానో ఇష్టపడే ‘స్పైడర్‌మేన్‌’ చిత్రానికి డేట్స్‌ కేటాయించే పని మీద ఉన్నారట జెండయా. ఇక టామ్‌ హాలండ్‌ తాను ఇష్టపడే చిత్రాల్లో ‘స్పైడర్‌మేన్‌’కి ప్రముఖ స్థానం ఉందని అంటుంటారు. సో.... పీటర్‌ పార్కర్‌ (టామ్‌ చేసే స్పైడర్‌మేన్‌ పాత్ర పేరు), ఎమ్‌జె (పీటర్‌ గాళ్‌ ఫ్రెండ్‌గా జెండయా చేసే పాత్ర పేరు)ల ప్రేమను మరోసారి ‘స్పైడర్‌మేన్‌ 4’లో చూడొచ్చన్న మాట. ఈ హిట్‌ జోడీ రిపీట్‌ అయ్యే విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జస్టిన్‌ లిన్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్‌ సెప్టెంబర్‌ లేదా అక్టోబరులో ఆరంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement