హాలీవుడ్ పాపులర్ టీవీ సిరీస్‌లలో ఒకటి 'ది వాకింగ్ డెడ్'. ఇందులో 'పెట్ జాంబీ'గా అద్భుతంగా నటించిన మోసెస్ జె. మోస్లీ అకాల మరణం చెందాడు. 31 ఏళ్ల మోసెస్ ఈ ఏడాది జనవరిలో మరణించాడు. పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన వైద్యులు మోసెస్ తుపాకీ గాయం కారణంగా చనిపోయడని తెలిపారు. అయితే మోస్లీ ప్రమాదవశాత్తు మరణించాడా ? ఆత్మహత్య చేసుకున్నాడా ? లేదా ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతను మరణించిన ప్రదేశంలో ఒక లేఖను కూడా పోలీసులు కనుగొన్నట్లు సమాచారం. పోలీసులు మోసెస్ జె. మోస్లీ మృతదేహాన్ని జార్జియాలోని ఓ పార్కింగ్ లాట్‌లో కనిపెట్టారు. మోసెస్ చనిపోయిన నెలకు పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్స్ రావడం గమనార్హం.
మోసెస్ మృతిపట్ల అవేరి సిస్టర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నివాళి అర్పించింది. తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో సంతాపం తెలుపుతూ పోస్ట్ పెట్టింది. అనేక మంది సెలబ్రిటీలు మోసెస్ మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా మోసెస్ 'పెట్ జాంబీ' పాత్రలో మూడేళ్లు 'ది వాకింగ్ డెడ్' సిరీస్‌లో నటించాడు. వాచ్‌మెన్, టేల్స్, అమెరికన్ సోల్, క్వీన్ ఆఫ్ ది సౌత్ వంటి సినిమాల్లో సహాయక పాత్రలు పోషించాడు. అలాగే లూజ్ స్క్రూస్, అటాక్ ఆఫ్ ది సౌతెర్న్ ఫ్రైడ్ జాంబీస్, డాల్ మర్డర్ స్ప్రీ వంటి మూవీస్‌లలో అలరించాడు. మోసెస్ జె. మోస్లీ చివరిగా నటించిన హాంక్, డిసెండింగ్ చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment