పిల్లలు జబ్బుపడితే తల్లిదండ్రులు విలవిల్లాడిపోతారు. అలాంటిది ప్రాణాపాయంలో ఉంటే ఆ పేరెంట్స్ గుండె ఎంత విలవిల్లాడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనక్కూడా అలాంటి పరిస్థితి ఎదురైందంటున్నాడు బాలీవుడ్ నటుడు జాయేద్ ఖాన్.
ఊపిరాడలేదు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'నా పెద్ద కొడుకు జిడాన్‌కు మూడేళ్ల వయసున్నప్పుడు శ్వాసకోస సమస్యతో బాధపడ్డాడు. ఓసారి లండన్‌లో ఉండగా అతడికి శ్వాస తీసుకోవడం కష్టమైంది. నాన్న, ఊపిరాడటం లేదు, సాయం చేయమని అర్థిస్తున్నాడు. ఇంతలో నా భార్య అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. 15 నిమిషాల్లో అంబులెన్స్ రావడంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాం. వాడి పరిస్థితి చూసిన నర్స్ ఒకరు బతకడం కష్టమన్నారు.
దేవుడి దయ వల్ల..
నా సంతకం తీసుకున్నాక జిడాన్‌కు అడ్రినలైన్ ఇంజెక్షన్ ఇచ్చారు. వెంటనే సిటీలో ఎక్కడెక్కడో ఉన్న నలుగురు డాక్టర్లను ఆస్పత్రికి పిలిపించారు. స్టెరాయిడ్లు పని చేయకపోతే మెడ దగ్గర కోసి సర్జరీ చేస్తామన్నారు. దేవుడి దయ వల్ల కాసేపటికే స్టెరాయిడ్స్ పని చేయడంతో సర్జరీ అవసరం లేదన్నారు. లండన్‌లోని హెల్త్ కేర్ సిస్టమ్‌ను కచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే' అన్నాడు. కాగా జాయేద్-మలైకా దంపతులకు 2008లో జిడాన్‌లో జన్మించాడు. 2011లో ఆరిజ్ అనే మరో కుమారుడు పుట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment