Gunshots
-
బెయిల్‌పై బయటకొచ్చి.. భార్య, ముగ్గురు పిల్లలపై కాల్పులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హత్య కేసులో బెయిల్ బయటకు వచ్చిన ఓ వ్యక్తి.. తన భార్య, ముగ్గురు పిల్లలను అతి కిరాతకంగా కాల్చి చంపాడు. ఈ ఘోరం వారణాసిలోని భైదానీ ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి వెలుగుచూసింది.పోలీసుల వివరాల ప్రకారం.. రాజేంద్ర గుప్తా అనే వ్యక్తి 1997కు సంబంధించి ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాయడు. సోమవారం రాత్రి తన ఇంట్లోకి ప్రవేశించి గాఢ నిద్రలో ఉన్న భార్య నీతూ గుప్తా(45), కుమారులు నవేంద్ర(25), సుబేంద్ర(15), కూతురు గౌరంగి(16)పై కాల్పులు జరిపాడు. వారు మరణించారని ధృవవీకరించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.కుటుంబం హత్యపై సమాచారం అందుకున్న వారణాసి పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడు సైతం వారణాసిలోని రోహనియా ప్రాంతంలో శవమై కనపించాడు. తన భార్య, పిల్లలను చంపిన తర్వాత నిందితుడు హత్య చేసుకొని మరణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా కొన్ని రోజులుగా బార్యభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయని రాజేంద్ర గుప్తా తల్లి పోలీసులకు తెలిపారు.ఈ సంఘటనపై వారణాసి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరవ్ బన్స్వాల్ మాట్లాడుతూ. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని కాల్చి చంపినట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. కుటుంబ కలహాలు, చేతబడి వంటి అనేక కోణాల్లో మేము కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాజేంద్ర గుప్తా మృతదేహాన్ని కూడా వారణాసి నుంచి స్వాధీనం చేసుకున్నామని, అతను హత్యకు గురయ్యాడా లేదా ఆత్మహత్య చేసుకొని మరణించాడా అని తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. -
సత్యసాయి జిల్లాలో కాల్పుల కలకలం..
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరం నియోజకవర్గంలో కాల్పుల కలకలం రేగింది. బత్తలపల్లి మండలం రామాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ చోరీ కేసులో విచారణకు వచ్చిన తెలంగాణ పోలీసులపై దుండగులు దాడికి యత్నించారు. దీంతో పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దొంగలు పరారీ కావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య
అమెరికాలో భారత సంతతి వ్యక్తి మైనాంక్ పటేల్(36) ఓ మైనర్ జరిపిన కాల్పుల్లో హత్య చేయబడ్డారు. నార్త్ కరోలినాలోని తన కన్వీనియన్స్ స్టోర్‌లో దోపిడీకి వచ్చిన మైనర్ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. 2580 ఎయిర్పోర్ట్ రోడ్‌లోని టొబాకో హౌస్ యజమాని అయన మైనాంక్ పటేల్‌పై మంగళవారం ఉదయం ఈ కాల్పులు జరిగినట్లు పేర్కొన్నారు. కాల్పులు జరిపిన మైనర్‌ను రోవాన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం అధికారులు అదుపులోకి తీసుకొని జువైనల్ హోంకు తరలించారు. ‘‘టొబాకో హౌస్ స్టోర్ నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌కు స్పందించాం. స్టోర్‌లో కాల్పులు జరిగినట్లు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న తర్వాత పటేల్ బుల్లెట్ గాయాలతో పడి ఉన్నాడు. దీంతో అతన్ని నోవాంట్ హెల్త్ రోవాన్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అతని పరిస్థితి విషమించటంతో షార్లెట్లోని ప్రెస్బిటేరియన్ ఆసుపత్రికి తరలించి చిక్సిత అందించినప్పటికీ చాలా తీవ్రమైన గాయాల వల్ల మృతి చెందాడు’’ అని రోవాన్ కౌంటీ షెరీఫ్ ఆఫీస్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కెప్టెన్ మార్క్ మెక్‌డానియల్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో ఓ వ్యక్తి సంఘటన స్థలం నుంచి పారిపోతున్నట్లు వెల్లడైందని తెలిపారు. అతను తుపాకీని పట్టుకుని కనిపించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ కాల్పులకు ఖచ్చితమైన కారణం స్పష్టం కాలేదని, దోపిడీ వచ్చిన మైనర్.. కాల్పులు జరిపినట్లు ప్రథమికంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు చెప్పారు. మృతి చెందిన మైనాంక్ పటేల్‌కు భార్య అమీ, 5 ఏళ్ల కుమార్తెను ఉన్నారు. ఆయన భార్య ప్రస్తుతం గర్భవతి. ఆయన మృతితో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అందరితో కలివిడిగా ఉండే ఆయన మృతికి బుధవారం పటేల్ షాప్ ముందు పలువురు పూలు, కార్డులు పెట్టి నివాళులు అర్పించారు. -
మహారాష్ట్ర ఎంఐఎం నేతపై కాల్పులు
ముంబై: మహారాష్ట్రలోని ఏఐఎంఐఎం నేతపై కాల్పులు జరిగాయి. సోమవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు మాజీ మాలెగావ్ మేయర్ అబ్దుల్ మాలిక్ మహమ్మద్ యూనస్ ఇసాపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. మూడు సార్లు కాల్చడంతో మాలిక్ శరీరంపై మూడు చోట్ల బుల్లెట్ గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మాలిక్ శరీరంపై ఎడమవైపు ఛాతి, ఎడమ తొడ, కుడి చెతిపై బెల్లెట్ గాయాలు అయ్యాయి. మహారాష్ట్ర ఎంఐఎం పార్టీలో మాలిక్ చాలా కీలకమైన నేత వ్యవహరిస్తున్నారు. మాలెగాల్ పోలీసుల ప్రకారం..సోమవారం తెల్లవారుజన 1.20 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు. -
లోకేశ్ క్లారిటీ ఇచ్చేశాడు !..అయినా పవన్ ఎందుకు యోచిస్తున్నాడు ?
-
ఢిల్లీ కోర్టులో కాల్పుల కలకలం
న్యూఢిల్లీ: కట్టుదిట్టమైన భద్రత ఉండే ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఆవరణలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. లాయర్ దుస్తుల్లో వచ్చిన కామేశ్వర్ సింగ్ అనే వ్యక్తి ఓ మహిళపై కాల్పులు జరిపి పరారయ్యాడు. దాంతో అంతా పరుగులు తీశారు. మహిళకు ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. ఆర్థిక విభేదాలే ఘటనకు కారణమని భావిస్తున్నామన్నారు. మాజీ లాయర్ అయిన నిందితుడు హరియాణా పోలీసులకు పట్టుబడ్డాడు. గత ఏడాది అతడిని ఢిల్లీ బార్ అసోసియేషన్ బహిష్కరించింది. ఆయన ఎం.రాధ(సుమారు 40 ఏళ్లు) అనే మహిళకు రూ.25 లక్షలు అప్పుగా ఇచ్చాడు. తిరిగివ్వకపోవడంతో చీటింగ్ కేసు పెట్టాడు. విచారణకు శుక్రవారం ఇద్దరూ కోర్టుకు వచ్చారు. 10.30 సమయంలో తగవుపడ్డారు. కామేశ్వర్ తన వెంట తెచ్చుకున్న తుపాకీతో రాధపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. రాధకు రెండు బుల్లెట్లు, పక్కనే ఉన్న లాయర్‌కు ఒక బుల్లెట్ తగిలాయి. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. ఢిల్లీలో సామాన్యులకు భద్రతే లేకుండా పోతుంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. -
మిలిటరీ స్టేషన్లో బుల్లెట్ గాయంతో సైనికుడి మృతి
చండీగఢ్: పంజాబ్‌లోని బటిండా సైనిక స్థావరంలో బుధవారం తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. తాజాగా అదే ప్రాంతంలో ఓ ఆర్మీ సైనికుడు తుపాకీ కాల్పులతో మరణించాడు. కాల్పుల ఘటనలో ఫిరంగి విభాగానికి చెందిన నలుగురు సిబ్బంది మరణించిన 12 గంటల తర్వాత.. బుధవారం మధ్యాహ్నం ఈ జవాను మృతి చెందాడు. ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ.. "భటిండా మిలిటరీ స్టేషన్లో ఏప్రిల్ 12న సాయంత్రం 4:30 గంటలకు ఒక సైనికుడికి తుపాకీ గాయమైంది. అతను తన సేవా ఆయుధంతో సెంట్రీ డ్యూటీలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సైనికుడిని వెంటనే మిలిటరీ ఆసుపత్రికి తరలించామని, అయితే అతను చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. అయితే, తాజా ఘటనకు అంతకుముందు జరిగిన కాల్పులతో ఎలాంటి సంబంధం లేదని అధికారలు పేర్కొన్నారు. ఈ జవాను ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఏదైనా ప్రమాదం జరిగిందా..? అన్నదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో మరణించినట్లు ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, తాజా ఘటనతో 24 గంటల వ్యవధిలోనే బఠిండా సైనిక స్థావరంలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. -
హైదరాబాద్‌లో కాల్పులు.. ఒకరి మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మంగళవారం అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టప్పాచబుత్ర పోలీసుస్టేషన్ పరిధిలోని షబాబ్ బిల్డింగ్స్ ప్రాంతంలో క్రాంతి అనే వ్యక్తి, అతని అనుచరులు జరిపిన కాల్పుల్లో రాహుల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. కాల్పులు జరిపిన వెంటనే క్రాంతి, అతని అనుచరులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే టప్పాచబుత్ర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
గన్ షాట్: ఫ్లవర్ కాదు ఫైర్..!
-
గన్ షాట్ : ఇది సార్.. జగన్ బ్రాండ్
-
గన్ షాట్: ఖమ్మంలో కరకట్ట బాబు వేసిన కన్నింగ్ ప్లాన్ ఏంటి..?
-
గన్ షాట్ ప్రోమో : తేల్చేద్దాం ...గన్ షాట్‌గా...!
-
టాప్ 3 టాపిక్స్.. తేల్చేద్దాం గన్‌షాట్‌గా..!
కమలంతో పొత్తు కోసం బాబుగారి వెంపర్లాట.. ఖమ్మంలో కన్నింగ్ ప్లాన్ అదేనా ? గత ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేసిన టీడీపీ చిత్తయ్యింది. కేవలం 23 సీట్లకే పరిమితమై ఘోర పరాభావం చవిచూసింది. అంటే చంద్రబాబును ప్రజలు నమ్మలేదనే విషయం చాలా క్లియర్‌గా అర్థమైంది. మరి ఈసారి కూడా ఒంటిరిగా వెళితే పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుందనే భావనలో ఉన్న చంద్రబాబు.. కమలంతో పొత్తుకోసం వెంపర్లాడుతున్నారు. బాబు గారి ఖమ్మం పర్యటన కన్నింగ్ ప్లాన్ అదేనా? విద్యే అత్యంత ప్రాధాన్యమని సీఎం జగన్ భావిస్తున్నారా ? ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. సమాజంలో ఉన్న అంతరాలు తొలగిపోయి.. పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియా, డిజిటల్ విద్య అందకూడదనే పెత్తందారీ భావజాలానికి చెక్ పెట్టే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. విద్యార్థులకు అందించే చదువులో సమానత్వం ఉండాలి. మంచి విద్యా విధానంతో తలరాతలు మార్చాలనే యోచన సీఎం జగన్‌ది. భావి తరాల పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం. చదువులో సమానత్వం ఉంటేనే ప్రతి కుటుంబంలో అభివృద్ధి ఉంటుందనేది సీఎం జగన్ ఆలోచన. విద్యే అత్యంత ప్రాధాన్యమని సీఎం జగన్ భావిస్తున్నారా? విశాఖ బ్రాండ్ వాల్యూ విశ్వవ్యాప్తం చేస్తున్నారా ? ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్)గా విశాఖపట్నాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంతర్జాతీయంగా బ్రాండింగ్ కల్పించేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. వరుస అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దేశంలోనే అత్యధిక కార్యక్రమాలు జరుగుతున్న (మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ) నగరంగా విశాఖ పేరు మారుమోగేలా చర్యలు చేపట్టింది. వరుసగా ఇక్కడ అంతర్జాతీయ సదస్సులు చేపట్టడానికి విశాఖ బ్రాండ్ వాల్యూనూ విశ్వవ్యాప్తం చేయడానికేనా? తేల్చేద్దాం ...గన్ షాట్‌గా... శనివారం రాత్రి 7 గంటలకు తిరిగి ఆదివారం ఉదయం 7.30 గంటలకు -
గన్ షాట్: గుజరాత్ మోడల్ పేపర్
-
గన్ షాట్: పవన్ ఓ అజ్ఞానవాసి..
-
గన్ షాట్: చంద్రబాబు నెంబర్ 1 మోసగాడు..
-
టాప్ 3 పొలిటికల్ టాపిక్స్.. తేల్చేద్దాం గన్‌షాట్‌గా..!
బీసీలు, మైనార్టీలను మోసం చేసింది నువ్వే కదా బాబు ? విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ మహాసభ విజయవంతం కావడం టీడీపీ సహించలేకపోతోంది. ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క బీసీని రాజ్యసభకు పంపకుండా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే.. మూడున్నరేళ్లలో రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే అందులో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి సీఎం వైఎస్ జగన్ వారికి సమున్నత గౌరవం ఇచ్చారు. వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచిందెవరు?. బీసీలు, మైనార్టీలను మోసం చేసింది చంద్రబాబు కాదా?.. బీసీలు, మైనార్టీలను మోసం చేసింది నువ్వే కదా బాబు ? రూల్స్ తెలియని వాడు రూలర్ అవుతాడా ? 2019 ఎన్నికల్లో రెండు చోట్ల అసెంబ్లీకి పోటీచేసి ఓటమి పాలైన పవన్ కల్యాణ్ ఇప్పుడు కనీసం తను అయినా గెలవాలని తంటాలు పడుతున్నారు. రాంగ్ రూట్లో పవన్ వెళ్తున్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు మినహా ఏమీ తెలియని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. వారాహి వాహనానికి మిలటరీ వాహనాలకు మాత్రమే వేసే ఆలీవ్ గ్రీన్ రంగు వేశారు. ఇది చట్ట విరుద్ధం కాదా..? రూల్స్ తెలియని వాడు రూలర్ అవుతాడా ? మోదీ బీజేపీ బాహుబలిగా మారారా ? పోయిన చోటే వెతుక్కోవాలంటారు. గత ఎన్నికల్లో త్రుటిలో కోల్పోయిన స్థానాలపై బాగా దృష్టి పెట్టడంలో, దూరమైన వర్గాలను కలుపుకొని పోవడంలో పక్కా ప్రణాళికతో వ్యవహరించిన బీజేపీ గుజరాత్లో తిరుగులేని విజయాన్ని సాధించింది. సీఎంగా 13 ఏళ్లు గుజరాత్‌లోనూ, పీఎంగా ఎనిమిదేళ్లుగా కేంద్రంలోనూ తిరుగులేని నాయకునిగా మోదీ సాధించిన పేరు ప్రఖ్యాతులు కూడా ఈసారి ఫలితాలను బాగా ప్రభావితం చేశాయి. ఒక్కడే వచ్చాడు..156 సీట్లు పట్టుకుపోయాడు.. మోదీ బీజేపీ బాహుబలిగా మారారా ? తేల్చేద్దాం గన్‌షాట్‌గా.. శనివారం రాత్రి 7 గంటలకు తిరిగి ఆదివారం ఉదయం 7.30 గంటలకు సాక్షి టీవీలో -
గన్ షాట్: వచ్చే ఎన్నికల్లో జగన్ తుఫాన్ ఎలా ఉండబోతోంది ..!
-
గన్ షాట్ : చంద్రబాబు అబద్ధాలకు అంతులేదా..?
-
గన్ షాట్ : అతనే ఒక ఆదర్శం
-
గన్ షాట్ : తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది ..?
-
గన్ షాట్ : రాజకీయ లబ్ది కోసం కోర్టులనే తప్పుదోవ పట్టిస్తారా..?
-
గన్ షాట్ : ఎల్లో మీడియా రాతల్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా..?
-
గన్ షాట్ : అమ్ముడు ..కొనుడు ..ఇదేనా నయా రాజకీయం..?
-
గన్ షాట్ : ఎల్లో పాయిజన్ ..
-
గన్ షాట్ : నాడు ఎన్టీఆర్ పై చెప్పులు వేయించింది ఎవరు ..?
-
గన్ షాట్ : సేనాని సిల్లీ ప్లాన్స్
-
పోరాడి ఓడిన సైనిక శునకం.. ఆర్మీ అధికారుల నివాళులు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ జిల్లాలోని టాంగ్పావా ప్రాంతంలో ఉగ్రవాదుల సర్చ్ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన జూమ్ అనే వీర శునకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఉగ్రవాదులను చేజ్ చేసే ఆపరేషన్‌లో రెండు బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోయినా లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడింది. దీంతో వెంటనే అధికారులు జూమ్(కుక్క)ని హుటాహుటిన ఆర్మీ ఆస్పత్రికి తరలించి తగిన చికిత్స అందించారు. ఐతే ఈ ఘటనలో జుమ్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించి ప్రాణాలతో పోరాడుతూ... గురువారం ఉదయం 11. 50 నిమిషాలకు మృతి చెందిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు జూమ్‌కి శ్రీనగర్‌లోని చినార్ వార్ మెమోరియల్ బాదామి బాగ్ కంటోన్మెంట్ వద్ద భారత సైన్య ఘనంగా నివాళులర్పించినట్లు పీఆర్ఓ డిఫెన్స్ కల్నల్ ఎమ్రాన్ ముసావి తెలిపారు. అంతేగాదు ఈ కార్యక్రమంలో పలు ఆర్మీ శునకాలు పాల్గొని మృతి చెందిన వీర శునకం జూమ్‌కి నివాళులర్పించాయి. ఆర్మీ కనైన్ చినార్ వారియర్స్‌లో అమూల్యమైన సభ్యుడిని కోల్పాయమని కల్నల్ ముసావి అన్నారు. జూమ్ పలు ఉగ్రవాదక నిరోధక కార్యకలాపాల్లో వీరోచితంగా పోరాడి ధైర్యసాహసాలను కనబర్చినట్లు తెలిపారు. #WATCH | 29 Army Dog Unit pays tributes to Indian Army Dog 'Zoom' in Jammu. He passed away yesterday at 54 AFVH (Advance Field Veterinary Hospital) in Srinagar where he was under treatment after sustaining two gunshot injuries in Op Tangpawa, Anantnag, J&K on 9th Oct. pic.twitter.com/0nlU7Mm7Ti — ANI (@ANI) October 14, 2022 (చదవండి: మాస్కో విమానంలో బాంబు కలకలం...అప్రమత్తమైన అధికారులు) -
గన్ షాట్ : పచ్చ కీచకులు
-
గన్ షాట్ : కేసీఆర్ పాన్ ఇండియా పార్టీ సక్సెస్ అవుతుందా ...?
-
గన్ షాట్ : కళ్యాణం కమనీయం
-
గన్ షాట్ @7:00PM 24 సెప్టెంబర్ 2022
-
Live Video:తండ్రిని కొట్టాడని నడిరోడ్డులో వ్యక్తిపై బాలుడి కాల్పులు
ఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డున కాల్పులు కలకలం సృష్టించాయి. 36 ఏళ్ల ఓ వ్యక్తి రోడ్డు పక్కన దుకాణం ముందు కూర్చొని ఉండగా ఓ బాలుడు అతడి ముఖంపై కాల్పులు జరిపి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి నలుగురు మైనర్లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. శుక్రవారం సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని జహంగిర్‌పురి ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు వెల్లడించారు. హుటహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తూటా తగిలిన జావేద్ అనే వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. బాధితుడి కుడి కంటికి తీవ్ర గాయమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. #WATCH | Delhi: 4 minor boys apprehended for firing at a man in Jahangirpuri on 15th July. The man has been hospitalised. Case u/s 307 IPC registered. Accused say that the man had beaten up father of one of the minors 7 months back & they had come to take revenge. (Source: CCTV) pic.twitter.com/Icl2i4x3LN — ANI (@ANI) July 16, 2022 బాధితుడు జావేద్ చెప్పిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 4.45 గంటల ప్రాంతంలో పార్క్ సమీపంలోని ఓ దుకాణం ముందు కూర్చుని ఉన్నాడు. ముగ్గురు మైనర్ బాలురు అక్కడికి వచ్చారు. అందులోని ఓ బాలుడు గన్ తీసి ముఖంపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారని డిప్యూటీ కమిషనర్ ఉషా రంఘ్నాని తెలిపారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. జహంగిర్‌పురి స్టేషన్లో హత్యా యత్నం కేసు నమోదు చేసి నలుగురు బాలురను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారి దగ్గరి నుంచి నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అసలు కారణం ఇదీ.. పోలీసుల విచారణలో నిందితుల్లో ఓ బాలుడి తండ్రిని ఏడు నెలల క్రితం బాధితుడు కొట్టినట్లు తెలిసింది. దీంతో కోపం పెంచుకున్న బాలుడు తన స్నేహితులతో కలిసి అతడిని చంపాలని ప్రణాళిక చేశాడు. అందులో భాగంగానే నాటు తుపాకీతో కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. ఇదీ చూడండి: Orissa Crime: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం: భార్య తలను నరికి చేతిలో పట్టుకుని 12 కి.మి.. -
కాల్పుల కలకలం.. పరుగులు పెట్టిన ప్రేక్షకులు; ఊహించని ట్విస్ట్
బాక్సింగ్ మ్యాచ్‌లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత కాల్పుల శబ్దం వినిపించడంతో ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో స్టేడియం బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. బ్రూక్లిన్ వేదికగా బార్క్లేస్ సెంటర్లో గెర్వొంటా డేవిస్, రొనాల్డో రొమేరో మధ్య బాక్సింగ్ ఫైట్ జరిగింది. పోరు ముగిసిన తర్వాత విజేతను ప్రకటిస్తున్న సమయంలో కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో ఎరీనాలోకి అగంతకుడు తుపాకీతో చంపడానికి వచ్చాడేమోనని భయపడిన ప్రేక్షకులు ఒకరినొకరు తోసుకుంటూ బయటికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. కాల్పులు జరిగింది బార్క్లే సెంటర్లో కాదని.. బయట జరిగాయని తేలింది. విషయం తెలుసుకున్న ప్రేక్షకులు శాంతించడంతో కాసేపట్లోనే పరిస్థితి మొత్తం అదుపులోకి వచ్చింది. కాగా అదే బార్క్లే సెంటర్‌కు జపాన్ టెన్నిస్ స్టార్ నయామి ఒసాకా కూడా వచ్చింది. అక్కడ జరిగిన అనుభవాన్ని ఒసాకా తన ట్విటర్లో షేర్ చేసుకుంది. ''నేనప్పుడే బార్క్లే సెంటర్‌లోనికి వచ్చాను. అప్పుడే సడెన్‌గా నాకు కాల్పుల శబ్దం వినిపించడం.. ప్రాణభయంతో ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీయడంతో నాకు భయమేసింది. వెంటనే పక్కనే ఉన్న ఒక రూమ్‌లోకి వెళ్లిపోయి డోర్స్ క్లోజ్ చేసుకున్నాం. ఆ క్షణంలో మాకు ప్రాణం మీద ఆశ కలిగింది. నా జీవితంలో ఇలాంటి అనుభవం ఇదే తొలిసారి అనుకుంటా'' అంటూ పేర్కొంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే గెర్వొంటో డేవిస్.. రొనాల్డో రెమోరోపై నాకౌట్ విజయం సాధించాడు. చదవండి: Viral Video: అదృష్టం బాగుంది.. కొంచెమైతే పరువు పోయేదే! Scary moment as crowds pour back into Barclays Center, my fear was a shooting but those fears proved unfounded. pic.twitter.com/pcBdfwWplt — Ryan Songalia (@ryansongalia) May 29, 2022 DOWN GOES ROMERO 😱 #DavisRomero pic.twitter.com/nKDMPhD89h — CBS Sports (@CBSSports) May 29, 2022 -
గన్ షాట్‌తో చనిపోయిన నటుడు.. హత్య ? ఆత్మహత్య ?
హాలీవుడ్ పాపులర్ టీవీ సిరీస్‌లలో ఒకటి 'ది వాకింగ్ డెడ్'. ఇందులో 'పెట్ జాంబీ'గా అద్భుతంగా నటించిన మోసెస్ జె. మోస్లీ అకాల మరణం చెందాడు. 31 ఏళ్ల మోసెస్ ఈ ఏడాది జనవరిలో మరణించాడు. పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన వైద్యులు మోసెస్ తుపాకీ గాయం కారణంగా చనిపోయడని తెలిపారు. అయితే మోస్లీ ప్రమాదవశాత్తు మరణించాడా ? ఆత్మహత్య చేసుకున్నాడా ? లేదా ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతను మరణించిన ప్రదేశంలో ఒక లేఖను కూడా పోలీసులు కనుగొన్నట్లు సమాచారం. పోలీసులు మోసెస్ జె. మోస్లీ మృతదేహాన్ని జార్జియాలోని ఓ పార్కింగ్ లాట్లో కనిపెట్టారు. మోసెస్ చనిపోయిన నెలకు పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్స్ రావడం గమనార్హం. మోసెస్ మృతిపట్ల అవేరి సిస్టర్స్ ఎంటర్టైన్మెంట్ నివాళి అర్పించింది. తన అధికారిక ఫేస్బుక్ పేజీలో సంతాపం తెలుపుతూ పోస్ట్ పెట్టింది. అనేక మంది సెలబ్రిటీలు మోసెస్ మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా మోసెస్ 'పెట్ జాంబీ' పాత్రలో మూడేళ్లు 'ది వాకింగ్ డెడ్' సిరీస్‌లో నటించాడు. వాచ్మెన్, టేల్స్, అమెరికన్ సోల్, క్వీన్ ఆఫ్ ది సౌత్ వంటి సినిమాల్లో సహాయక పాత్రలు పోషించాడు. అలాగే లూజ్ స్క్రూస్, అటాక్ ఆఫ్ ది సౌతెర్న్ ఫ్రైడ్ జాంబీస్, డాల్ మర్డర్ స్ప్రీ వంటి మూవీస్‌లలో అలరించాడు. మోసెస్ జె. మోస్లీ చివరిగా నటించిన హాంక్, డిసెండింగ్ చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. -
ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును చేధించిన రాచకొండ పోలీసులు
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును రాచకొండ పోలీసులు గురువారం చేధించారు. మట్టారెడ్డి గ్యాంగే హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. మట్టారెడ్డితో పాటు ముగ్గురు అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మట్టారెడ్డి, మొహినుద్దీన్, నవీన్‌తోపాటు మరో ఇద్దురిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్రెడ్డిని కాల్చి చంపింది సుపారీ గ్యాంగ్‌గా తేల్చారు. మోహినుద్దిన్ మట్టారెడ్డి వాచ్‌మెన్‌గా, నవీన్ శ్రీనివాస్‌రెడ్డి బినామీగా పోలీసులు గుర్తిచారు. -
టార్గెట్ శ్రీనివాస్‌రెడ్డా..?లేక రాఘవేందర్‌రెడ్డా..?
హైదరాబాద్/ఇబ్రహీంపట్నం : సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం రియల్టర్ల జంట హత్యల కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ హత్యలో ఏడెనిమిది మంది హంతకులు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు కారు, ద్విచక్ర వాహనంపై వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి దగ్గర్లోనే పెట్రోల్ బంక్ ఉండటంతో అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితులు, వాహనాల రాకపోకలు ఏమైనా నిక్షిప్తమయ్యాయా? అనేదానిని పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగుల కాల్పుల్లో అల్మాస్‌గూడకు చెందిన నవారు శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎన్ రెడ్డి నగర్ ద్వారకామయినగర్ కాలనీకి చెందిన కోమటిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మృతి చెందడంతో.. కేసు ఛేదనలో పోలీసులు పూర్తిగా సాంకేతిక అంశాలపై ఆధారపడాల్సి వచ్చింది. సెల్‌ఫోన్ టవర్ లొకేషన్, కాల్ డేటా రికార్డ్ (సీడీఆర్) ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ప్రత్యక్ష సాక్షుల పాత్ర ఉందా? ► కాల్పులు జరిగిన ఘటనా స్థలానికి అత్యంత చేరువలో 10 నుంచి 15 గుడిసెలు ఉన్నాయి. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారు. వెంచర్‌లోని రోడ్లు, డ్రైనేజీ వర్క్స్, గుంతలు తీయటం వంటి పనులు చేస్తుంటారు. మంగళవారం శివరాత్రి పండగ కావటం, ఉదయం 8 గంటల ప్రాంతంలోనే కాల్పులు జరగడంతో ఆ సమయంలో గుడిసె వాసులు అక్కడే ఉండి ఉంటారని.. అనుమానాస్పద వ్యక్తులు వెంచర్లోకి రావటం, తూటాల శబ్దం వంటివి ఏమైనా గమనించారా? కాల్పులను ప్రత్యక్షంగా చూశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ► గుడిసెవాసుల్లోని 20 మంది మహిళలు, పురుషులను పోలీసులు బుధవారం విచారించారు. మంగళవారం శ్రీనివాస్ రెడ్డి మృతదేహం వద్ద జాగిలంతో పరిశీలించిన డాగ్ స్క్వాడ్‌ను బుధవారం మరోసారి రంగంలోకి దింపారు. ఘటన జరిగిన రోజు నేరుగా ఇబ్రహీంపట్నం రోడ్ వైపు పరుగెత్తిన జాగిలం.. బుధవారం మాత్రం మృతదేహం పడిన చోటే తిరిగింది. వెంచర్ బయటికి వెళ్లకపోవడం గమనార్హం. భూ వివాదాలే కారణం.. కానీ.. ► భూ వివాదాలే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చినప్పటికీ.. ఆ తగాదా కర్ణంగూడలోని 10 ఎకరాల భూమి విషయంలోనా లేక వేరే ఏమైనా భూ తగాదాలా, సెటిల్మెంట్లా? అనేవి తేల్చే పనిలో పోలీసులు పడ్డారు. దీంతో రియల్టర్ల హత్యకు సుపారీ ఎవరు ఇచ్చారనేది పోలీసులకు సవాల్‌గా మారింది. ప్రతి రోజు ఉదయం శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు కర్ణంగూడలోని తమ పొలానికి వచ్చి కాసేపు గడుపుతారనే సమాచారం తెలిసిన వ్యక్తే హత్యకు పథకం రచించి ఉంటాడని, అతనే హంతకులకు వారి సమాచారం అందించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ► శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి ఘటనా స్థలానికి రాకముందే హంతకులు అక్కడ కాపు కాస్తున్నా రని తెలిసింది. మృతులు ఇద్దరికీ ఆయుధ లైసెన్స్‌లు లేవని, స్వాధీనం చేసుకున్న బుల్లెట్, షెల్స్ ఆధారంగా హంతకులు రెండు తుపాకులు వాడినట్లు పోలీసులు నిర్ధారించారు. లాఅండ్ఆర్డర్ పోలీసులతోపాటు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ), సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్), ఇంటలిజెన్స్ వంటి ఎనిమిది ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. స్థిర చరాస్తులపై దర్యాప్తు.. ► భూ వివాదాలు, సెటిల్మెంట్లే హత్యకు కారణ మని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో స్థిర, చరాస్తులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో రియల్టర్ మట్టారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి డ్రైవర్ కృష్ణ, ప్రధాన అనుచరులు హఫీజ్, నవీన్‌లను రెండు రోజుల నుంచి విచారిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డికి నమ్మిన బంటైన కృష్ణ.. చిన్నతనం నుంచి శ్రీనివాస్ వెంటే ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. ► చర్లపటేల్గూడలోని పదెకరాలు కొనుగోలు చేసిన శ్రీనివాస్‌రెడ్డి.. ఆ భూమిని కృష్ణ పేరు మీదనే డెవలప్మెంట్కు తీసుకున్నట్లు సమాచారం. ఎప్పుడూ చుట్టూ అనుచరులు, సెక్యూరి టీతో ఉండే శ్రీనివాస్‌రెడ్డిని మీర్‌పేట నయీంగా పిలుస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ► పట్నంతో పాటు అబ్దుల్లాపూర్‌మెట్, పెద్ద అంబర్‌పేట, అనాజ్‌పూర్, హయత్‌నగర్‌లో పెద్ద మొత్తంలో సెటిల్మెంట్లు చేస్తుంటాడని తెలిసింది. తుర్కయాంజాల్‌లో పెద్ద డీల్‌తో పాటు వనస్థలిపురంలో స్థలంవివాదంపై కోల్‌కతా వెళ్లి సెటిల్మెంట్ చేసినట్లు సమాచారం. ఉప్పందించిందెవరో..? ఇబ్రహీంపట్నం: మండల పరిధిలోని కర్ణంగూడలో మంగళవారం జరిగిన జంట హత్యల కేసు మిస్టరీ వీడలేదు. ఇక్కడ చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో ఇద్దరు రియల్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే. కేసును ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముఖ్యంగా తమ అనుచరులు లేకుండా శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి సైట్ వద్దకు వస్తున్నట్లు దుండగులకు ఎవరు ఉప్పందించారనేది కీలకంగా మారింది. ఈ విషయం తేలితే కేసు మిస్టరీని సులువుగా ఛేదించే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి చెప్పారు. సుపారీ గ్యాంగ్ కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. స్పెషల్ టీంలతో దర్యాప్తు జంట హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు పోలీసు ఉన్నతాధికారులు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్ఓటీ, ఐటీ సెల్, సీసీఎస్, ఎస్బీ, ఇంటెలిజెన్స్ ఇలా వేర్వేరు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీంకు లభించిన ఆధారాలు, బుల్లెట్లను పరిశీలిస్తున్నారు. కాల్పులకు వాడిన తుపాకులు, బుల్లెట్లు అక్రమంగా కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. కాల్పులు జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో ఉన్న గుడిసెవాసులను, లేక్ విల్లాలో పనిచేస్తున్న కూలీలను పోలీసులు బుధవారం విచారించారు. కాల్పుల శబ్దం వినబడిందా? ఈ గొడవను మీరు చూశారా..? దుండగులను మీరు గుర్తు పట్టగలరా..? అనే కోణంలో వారిని విచారించారు. టార్గెట్ ఒక్కరేనా..? దుండగులు ఒక్కరినే టార్గెట్ చేసి వచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి ఒకే వాహనంలో ఉండటంతో దుండగులు ఇద్దరినీ హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. ఎవరిని టార్గెట్ చేసింది ఇంకా నిర్ధారణకు రాలేకపోతున్నారు. వీరి లక్ష్యం భూదందా, సెటిల్మెంట్లలో సిద్ధహస్తుడైన శ్రీనివాస్‌రెడ్డా..? లేక హత్య కేసులో జైలుకెళ్లి వచ్చిన రాఘవేందర్‌రెడ్డా..? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన పాత కేసులను పరిశీలిస్తున్నారు. -
ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ఇబ్రహీంపట్నం కాల్పుల కేసు కీలక మలుపు తిరిగింది. కాల్పుల ఘటనను కిరాయి హంతకుల సుపారి హత్యగా పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణ చేశారు. పాతకక్షల నేపథ్యంలో జరిగిన హత్యలుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక హత్య కేసులో రాఘవేందర్‌రెడ్డి నిందితుడని, శ్రీనివాస్‌రెడ్డిపై సైతం పలు కేసుల్లో ఉన్నట్లు తెలిపారు. వీరిద్దరూ కలిసి కొంతకాలంగా పలు లాండ్ అగ్రిమెంట్స్, డెవలప్మెంట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యలకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఎనిమిది స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. మట్టారెడ్డితో పాటు శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు.. హఫీజ్, కృష్ణలను పోలీసులు విచారిస్తున్నారు. నేడు(బుధవారం) పలువురు భూమి యజమానులను పోలీసులు విచారించనున్నారు. లేక్ వ్యూ విల్లాస్ యజమానులను వద్ద సైతం పోలీసులు వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు కృష్ణా, అఫీజ్‌లపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వివాదస్పద లేక్ విల్లా డెవలప్మెంట్ డ్రైవర్ కృష్ణ పేరుతో అగ్రిమెంట్ ఉన్నట్లు గుర్తించారు. హఫీజ్ పేరు మీద అబ్ధుల్లాపూర్‌మెట్‌లో కొంత భూమి రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
భూమిపై గురిపెట్టి.. నోట్లో గన్ పెట్టి
సాక్షి, హైదరాబాద్/ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నం రూరల్: నగరశివారు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భూవివాదం ఇద్దరు రియల్టర్ల దారుణ హత్యకు దారితీసింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ సమీపంలో చోటుచేసుకుంది. ఉదయం 8 గంటల ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారులు నవారు శ్రీనివాస్‌రెడ్డి (38), కోమటిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి (40)లు తమ వాహనంలో వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారు. అల్మాస్‌గూడకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడ్డ ద్వారకామయినగర్ కాలనీకి చెందిన రాఘవేందర్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనా స్థలాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణలతో కలిసి సందర్శించారు. హతులిద్దరికీ నేరచరిత్ర ఉండటంతో ఈ కేసును ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది. నోట్లో గన్ పెట్టి..: శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్ రెడ్డి ఉదయం 6 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరి తమ స్కార్పియో వాహనంలో కర్ణంగూడలోని లేక్‌విల్లా అర్చిడ్స్కు చేరుకున్నారు. అక్కడ ఓ స్థల వివాదంపై నల్లగొండకు చెందిన మట్టారెడ్డితో మాట్లాడిన అనంతరం తిరుగుముఖం పట్టారు. కొన్ని మీటర్ల దూరం ప్రయాణించారో లేదో గుర్తు తెలియని వ్యక్తులు నాటు తుపాకీతో వీరిపై కాల్పులు జరిపారు. శ్రీనివాస్‌రెడ్డి తలలో రెండు బుల్లెట్లు, రాఘువేందర్రెడ్డి ఛాతి భాగంలో ఒక తూటా వెళ్లాయి. శ్రీనివాస్‌రెడ్డి కారు దూకి పారిపోతుండగా.. దుండగులు ఆయనను పట్టుకొని తుపాకీని నోట్లో పెట్టి కాల్చినట్లు తెలుస్తోంది. రాఘువేందర్ రెడ్డి కారులో పారిపోతుండగా వాహనం అదుపుతప్పింది. దీంతో ఆయన అపస్మారక స్థితికి చేరుకోవడంతో కారులోనే సుమారు అరగంటపాటు కొట్టుమిట్టాడినట్లు స్థానికులు చెప్పారు. పోలీసులు రాఘువేందర్ను బీఎన్‌రెడ్డి నగర్‌లోని ప్రైవేట్ అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఘటనాస్థలంలో పోలీసులకు ఒక బుల్లెట్ లభ్యం కాగా.. కారులో రెండు బుల్లెట్ షెల్స్ లభించాయి. శ్రీనివాస్‌రెడ్డి అనుచరులుగా భావిస్తున్న హఫీజ్, కృష్ణతోపాటు మట్టారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. భూ వివాదమే కారణమా? ఇబ్రహీంపట్నం పరి«ధిలోని చర్లపటేల్‌గూడ రెవెన్యూ పరి«ధిలో ఇరవై ఏళ్ల క్రితం కొంతమంది రైతులు నల్లగొండ జిల్లాకు చెందిన ఇంద్రారెడ్డి అనే రియల్టర్‌కు కొంత భూమిని విక్రయించారు. ఆయన ఆ స్థలాన్ని వేరే వ్యక్తులకు విక్రయించగా.. వాళ్లు లేక్‌విల్లా ఆర్చిడ్స్ పేరుతో సుమారు 200–300 మంది కొనుగోలుదారులకు విక్రయించారు. ఒక్కో ప్లాట్ 1,111 గజాల విస్తీర్ణంలో ఉంటుంది. అయితే ధరణి వచ్చాక ఆ భూమి తిరిగి ఇంద్రారెడ్డి పేరుపై ఉన్నట్లు చూపించింది. రైతుబంధు పథకం కూడా వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈక్రమంలో ఇంద్రారెడ్డి నుంచి పదెకరాల స్థలాన్ని శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్ రెడ్డి కొనుగోలు చేశారు. దీంతో ముగ్గురి మధ్య వివాదం తలెత్తింది. ఎలాగైనా భూమిని దక్కించుకోవాలని భావించి శ్రీనివాస్‌రెడ్డి పదెకరాల పొలం చదును చేసి బోర్లు వేసి వ్యవసాయ భూమిగా మార్చాడు. మట్టారెడ్డి, ఇంద్రారెడ్డిలు శ్రీనివాస్‌రెడ్డితో రాజీ పడాలని నిర్ణయించుకున్నారు. దీనిపై ఇంద్రారెడ్డి, మట్టారెడ్డి సోమవారం రాత్రి ఫోన్లో మాట్లాడుకున్నారు. న్యాయవాది హత్య కేసులో దోషి రాఘవేందర్ రెడ్డి భార్య స్వాతిరెడ్డి హైకోర్టులో అడ్వొకేట్‌గా పనిచేస్తున్నారు. 2004లో ఓ మహిళా న్యాయవాది హత్య కేసులో రాఘవేందర్ రెడ్డి (ఏ–2) నిందితుడిగా ఉన్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ నేరంలో రాఘవేందర్‌కు కోర్టు జీవితకాలం శిక్ష విధించగా, శిక్ష అనంతరం ఇటీవలే రాఘవేందర్ బయటకు వచ్చినట్లు సీపీ చెప్పారు. ఇదిలాఉండగా.. రెండు నెలల క్రితం మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో శ్రీనివాస్ రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైందన్నారు. శ్రీనివాస్ రెడ్డి సొంత బావనే కేసు పెట్టాడని, బావ మీద శ్రీనివాస్ రెడ్డి కూడా కేసు పెట్టాడని వివరించారు. కేసును చాలెంజ్‌గా తీసుకున్నాం: రాచకొండ సీపీ జంట హత్యల కేసు దర్యాప్తునకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ టీమ్‌లో లా అండ్ ఆర్డర్ పోలీసులతోపాటు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) పోలీసులున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ చెప్పారు. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని పేర్కొన్నారు. మృతులు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిల సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి కాల్ డేటా, వాట్సాప్ చాట్ ఇతరత్రా వివరాలను రాబట్టేందుకు సెల్ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. చివరిసారిగా మృతులు ఎవరితో మాట్లాడారు? సంఘటనాస్థలం వద్ద ఎవరెవరి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి? అనే వివరాలు ఆరా తీస్తున్నారు. వీరిని హత్య చేసే అవసరం ఎవరికి ఉంది? ఎవరికి సుపారీ ఇచ్చారు? తుపాకీ ఎక్కడిది? అనే ప్రశ్నలకు పోలీసులు సమాధానం వెతికే పనిలో పడ్డారు. -
అమెరికాలో కాల్పులు: ముగ్గురు మృతి
వాషింగ్టన్: అమెరికాలో కాల్పులు కలకలం రేపాయి. దేశ రాజధాని వాషింగ్టన్లో ఓ గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగబడటంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ దుండగుడు మరణించాడు. చదవండి: ‘టార్గెట్‌లో ఉన్నారు జాగ్రత్త!’ ఆగష్టు 31 డెడ్‌లైన్‌పై బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు -
రూ.10 కోసం గొడవ.. ఇంటికొచ్చి మరీ కాల్చి చంపిన దుండగులు
పట్నా: బిహర్లో దారుణం చోటుచేసుకుంది. పడవ ఛార్జీ అడిగినందుకు ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సమస్తిపూర్ జిల్లాలో బన్‌భౌరా గ్రామానికి చెందిన సికల్ యాదవ్ అనే యువకుడు గత కొద్ది కాలంగా బోటు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బోటులో ప్రయాణించారు. సికల్ యాదవ్ తన బోట్లో ప్రయాణించినందుకు రూ.10 చార్జీగా అడిగాడు. దీంతో ఆ వ్యక్తులు యువకుడుతో తీవ్రంగా ఘర్షణ పడ్డారు. దీంతో బోటులో ప్రయాణిస్తున్న గ్రామస్తులు జోక్యం చేసుకుని వారి నుంచి ఆ యువకుడిని రక్షించారని పోలీసులు తెలిపారు. అనంతరం సోమవారం ఉదయం సికల్ యాదవ్ తన ఇంటి ముందు నిలబడి ఉన్నప్పుడు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆ యువకుడు సంఘటన స్ధలంలో మృతిచెందాడని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామని వెల్లడించారు. చదవండి: 22 రోజులుగా ఫ్రీజర్‌లో కుమారుడి మృతదేహాం.. చివరకు.. -
పాక్‌లో కాల్పులు.. 9 మంది మృతి
కరాచీ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్సుకు చెందిన రెండు గిరిజన తెగల మధ్య జరిగిన గొడవల్లో 9 మంది మరణించారు. మరో అయిదుగురు గాయపడ్డారని అక్కడి మీడియా తెలిపింది. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగా యని చెప్పింది. శనివారం రాత్రి జగిరాని, ఛచార్ తెగల మధ్య ఈ దుర్ఘటన జరిగింది. ఇరు తెగలు ఎంతో కాలం నుంచి వైరం కొనసాగుతోంది. మృతదేహాలను, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. గొడవల కారణంగా స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పరిస్థితిని చక్కబెట్టేందుకు భారీగా పోలీసులు రంగంలోకి దిగారు. చదవండి: యుద్ధం కొనసాగుతుందని నెతన్యాహు హెచ్చరిక -
కంగనా ఇంటి వద్ద కాల్పుల కలకలం
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇంటి వద్ద తుపాకీ కాల్పుల శబ్దం వినిపించడం కలకలం రేకెత్తించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో కంగనా తన సొంతింట్లో ఉన్నపుడు శుక్రవారం రాత్రి పదకొండున్నరకు తుపాకీ చప్పుళ్ళు వినిపించడంతో పోలీసులకు సమాచార మిచ్చారు. దీంతో వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ కాల్పులకు కారణాలేమిటో తెలియరాలేదు. అయితే ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య విషయంలో తాను ఇచ్చిన స్టేట్మెంట్తో, తనను భయపెట్టేందుకే ఇలా చేసి ఉంటారని కంగనా అభిప్రాయపడ్డారు. ఇటువంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. కావాలనే కాల్పులు జరిపారనీ, తన గదికి ఎదురుగా ఉన్న సరిహద్దు గోడకి ఆవల ఎవరో ఉన్నట్లు అనిపించిందని ఆమె చెప్పారు. మరోవైపు, సుశాంత్æ ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ రియాచక్రవర్తిపై పట్నాలో నమోదైన కేసుని ముంబైకి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో రియాచక్రవర్తి దాఖలుచేసిన పిటిషన్ ఆగస్టు 5న విచారణకు రానుంది. పట్నాలో నమోదైన కేసు విచారణ కోసం బిహార్ పోలీసు బృందం ముంబైకి చేరుకుంది. -
కంగనా రనౌత్ ఇంటివద్ద కాల్పుల కలకలం
సాక్షి, ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇంటివద్ద శుక్రవారం అర్థరాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మనాలీలోని కంగనా నివాసం సమీపంలో తుపాకీ శబ్దాలు వినిపించటంతో ఆమె పోలీసులకు సమాచారం అందించారు. నటుడు సుశాంత్ సింగ్ మరణం తరువాత బాలీవుడ్ తీరుతెన్నులపై విమర్శలు గుప్పిస్తున్నకంగనా ముఖ్యమంత్రి కుమారుడిని ‘‘బేబీ పెంగ్విన్’’అని సంబోధిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన తరువాత రోజు ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆమె అభిమానుల్లో ఆందోళన రేపుతోంది. (సుశాంత్ ఆత్మహత్య కేసులో తాజా ట్విస్ట్ ) ఈ ఘటనపై నటి కంగనా రనౌత్ ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు పెద్ద శబ్దం వినిపించిందని, వెంటానే తాను తన సెక్యూరిటీ ఇన్‌ఛార్జిని పిలిచినట్లు తెలిపారు. అయితే, ఆపిల్ తోటల్లో గబ్బిలాలను భయపెట్టడానికి ఎవరైనా తుపాకీతో కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానించారని కానీ పొరుగువారిని అడిగినప్పుడు, వారు దీన్ని ఖండించారని వెల్లడించారు. ఎనిమిది సెకన్ల వ్యవధిలో రెండు షాట్లను విన్నాననీ, తుపాకీ కాల్పులు ఎలా ఉంటాయో తనకు తెలుసంటూ ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు. (కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు) స్థానికుల ద్వారా తనను బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, కేవలం ఏడు, ఎనిమిది వేల రూపాయలు ఇచ్చి ఇలాంటి చేయించడం ముంబైలో పెద్ద కష్టమేమీ కాదని కంగనా వ్యాఖ్యానించారు. అంతేకాదు బహుశా సుశాంత్ ను కూడా ఇలాగే భయపెట్టి ఉంటారని పేర్కొన్నారు. అయినా తాను భయపడేది లేదని ప్రశ్నిస్తూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కొడుకు గురించి వ్యాఖ్యలు చేసిన తర్వాత తనను బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కంగనా అభిప్రాయపడ్డారు. తన ఫిర్యాదు మేరకు బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారని కంగనా తెలిపారు. -
కరోనా: దగ్గుతున్నాడని కాల్చేశాడు
నోయిడా: కరోనా వైరస్‌ను వ్యాపింపజేసేందుకే దగ్గుతున్నాడని భావించి ఓ వ్యక్తిపై మరొక వ్యక్తి కాల్పులు జరిపిన ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి 9 గంటలకు దయానగర్ గ్రామంలోని ఆలయం వద్ద నలుగురు వ్యక్తులు ల్యూడో గేమ్ ఆడుతున్నారు. అందులో ఒకరైన ప్రశాంత్ సింగ్ అలియాస్ పర్వేశ్ (25) ఆట మధ్యలో దగ్గాడు. కరోనా వ్యాపింపజేసేందుకే దగ్గుతున్నావంటూ ఆట ఆడుతున్న మరో వ్యక్తి జైవీర్ సింగ్ అలియాస్ గుల్లు (30) పర్వేశ్‌తో గొడవపడ్డాయి. గొడవ తీవ్రం కావడంతో జైవీర్ సింగ్ తన వద్ద ఉన్న తుపాకీతో పర్వేశ్‌పై కాల్పులు జరిపి పారిపోయాడు. బాధితున్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కరోనా బాధితుల్లో దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. చదవండి: 12 వేలకు అడుగు దూరంలో.. -
పట్టుకున్న చెయ్యే పేల్చిందా..?
సాక్షి, హైదరాబాద్ : ‘కీలక ఆధారాల సేకరణ కోసం నలుగురినీ తీసుకువెళ్లాం. తప్పించుకునే ప్రయత్నం చేసిన నిందితులు పోలీసుల వద్ద తుపాకులు లాక్కుని కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురు కాల్పుల్లో వారు చనిపోయారు’ . ఇది ‘దిశ’ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పోలీసులు చెబుతున్న మాట. అయితే ఈ వ్యవహారంలో గన్ షాట్ రెసిడ్యూ(జీఎస్సార్)విధానం అత్యంత కీలకంగా మారనుంది. ప్రాథమిక ఆధారాలు, ఇతర అంశాలను బట్టి పోలీసులు చెప్పింది నిజమేనని కనిపిస్తున్నా.. సాంకేతికంగా నిరూపించడంతోపాటు పోలీసులపై ఉన్న అనుమానాలు పూర్తిగా నివృత్తి కావడానికి ఎన్కౌంటర్ కేసులో జీఎస్సార్ నివేదికలే కీలకంగా మారనున్నాయి. రెండుగా బుల్లెట్.. తుపాకీలో ఉండే తూటా పైకి ఒకటిలానే కనిపించినా.. అందులో రెండు భాగాలుంటాయి. పేల్చిన వెంట నే దూసుకుపోయే ముందు భాగమైన బుల్లెట్ ఒకటి కాగా.. అలా దూసుకుపోవడానికి అవసరమైన శక్తిని అందించే క్యాట్రిడ్జ్ (బుల్లెట్ కేస్) మరొకటి. రివాల్వర్ విషయానికి వస్తే సిలిండర్‌లో లోడ్ అయి ఉండే తూటాను కాల్చాలని భావించిన వ్యక్తి తన చూపుడు వేలితో ట్రిగ్గర్ను నొక్కుతాడు. ఆ వెంటనే తుపాకీపైన వెనుక భాగంలో ఉండే హేమర్ తూటా వెనుక భాగంలో మధ్యలో ఉండే ప్రైమర్‌ను హిట్ చేస్తుంది. దీంతో బుల్లెట్ కేస్‌లో ఉండే ప్రొపెల్లెంట్గా పిలిచే గన్ పౌడర్ మండుతుంది. ఫలితంగా ఉత్పన్నమయ్యే శక్తి బుల్లెట్‌ను ముందుకు దూసుకుపోయేలా చేస్తుంది. ఇలా కాల్చిన తర్వాత మిగిలే ఎమ్టీ క్యాట్రిడ్జ్ రివాల్వర్ సిలిండర్‌లోనే ఉండిపోతుంది. పిస్టల్ విషయానికి వస్తే కుడివైపు పైభాగాన ఉండే ప్రత్యేక అర నుంచి బయటకు పడిపోతుంది. జీఎస్సార్ అంటే.. తూటాను కాల్చినప్పుడు హేమర్ ధాటికి ప్రైమర్ ప్రేరేపితమై బుల్లెట్ కేస్‌లో ఉండే గన్ పౌడర్‌ను మండిస్తుంది. అత్యంత స్వల్ప వ్యవధిలోనే ముందు భాగంలో ఉండే బుల్లెట్ దూసుకుపోవడంతో గన్ పౌడర్ పూర్తిగా కాలిపోదు. బుల్లెట్ కేస్ నుంచి స్వల్ప మొత్తంలో బయటకు చిమ్ముతుంది. అది ఆ తుపాకీని కాల్చిన వ్యక్తి చేతి బొటన వేలు, చూపుడు వేళ్ల మధ్య భాగంలో పడుతుంది. దీన్నే సాంకేతిక పరిభాషలో జీఎస్సార్ అంటారు. కంటికి కనిపించని ఈ జీఎస్సార్‌ను స్వాబ్స్ ద్వారా సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిస్తారు. ఫలానా తుపాకీని, ఫలానా వ్యక్తే ఫైర్ చేశారు అని అధికారికంగా, సాంకేతికంగా నిర్ధారించడానికి ఈ జీఎస్సార్ నివేదికలు ఎంతో కీలకం. వేరే వ్యక్తులు ఎవరైనా సదరు ఆయుధాన్ని వినియోగించి ఓ వ్యక్తిని హత్య చేసి, ఆపై తుపాకీని చనిపోయిన వ్యక్తి చేతుల్లో పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇలాంటప్పుడు చనిపోయిన వ్యక్తి చేతి వేళ్లపైన జీఎస్సార్ కనిపించదు. ఇలా కీలకం.. దిశ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిలో ప్రధాన నిందితుడు ఆరిఫ్‌తోపాటు నాలుగో నిందితుడు చెన్నకేశవులు పోలీసులపై దాడికి దిగారు. అధికారుల వద్ద ఉన్న సర్వీస్ తుపాకులైన పిస్టల్స్ లాక్కుని ఇద్దరూ కాల్పులు జరిపారన్నది పోలీసులు చెబుతున్న అంశం. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ స్థలికి వెళ్లిన క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆ ఇద్దరి కుడి చేతి బొటన, చూపుడు వేళ్ల మధ్య నుంచి నమూనాలు సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిన అధికారులు.. ఆ నివేదికల ఆధారంగా నిందితులు కాల్పులు జరిపినట్లు నిర్ధారించనున్నారు. ‘ఆ తుపాకులపై ఉన్న నిందితుల వేలిముద్రల్ని బట్టి వాళ్లు వాటిని పట్టుకున్నారని మాత్రమే చెప్పగలం. జీఎస్సార్ నివేదికల ఆధారంగానే ఆ తుపాకీని వాళ్లే కాల్చారా? లేదా? అనేది తేల్చగలం’అని ఫోరెన్సిక్ విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
తుపాకీతో కాల్చుకున్న కానిస్టేబుల్
కామారెడ్డి క్రైం: విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డిలో శుక్రవారం సాయంత్రం కలకలం రేపింది. వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌గౌడ్ కామారెడ్డిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం పాత తహసీల్దార్ కార్యాలయ భవనంలో ఉన్న ట్రెజరీ కార్యాలయ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. సాయంత్రం 7 గంటల సమయంలో తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకున్నాడు. ఎడమ చంక కింది భాగంలో నుంచి బుల్లెట్ దూసుకువెళ్లింది. అతడిని వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ శ్వేత, డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. సహచర కానిస్టేబుళ్లు, శ్రీనివాస్‌గౌడ్ కుటుంబ సభ్యులతో ఎస్పీ మాట్లాడారు. జరిగిన ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాలతోనే కానిస్టేబుల్ తుపాకీతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించామన్నారు. కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి ఎందుకు పాల్పడ్డాడో స్పష్టమైన కారణాలు తెలియాల్సి ఉందని డీఎస్పీ పేర్కొన్నారు. మొదట నిజామాబాద్ ఏఆర్ విభాగంలో పనిచేసిన శ్రీనివాస్‌గౌడ్.. జిల్లాల పునర్విభజనలో భాగంగా రెండున్నర యేళ్ల క్రితం కామారెడ్డికి వచ్చాడు. ప్రమోషన్ రావడంలో ఆలస్యం జరుగుతోందన్న మనస్తాపంతో అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండవచ్చని చెబుతున్నారు. -
అప్పు తీర్చమన్నందుకు.. ప్రాణం తీశాడు
కోల్‌కతా : పాత బాకీ తీర్చమన్నాడన్న కోపంతో బిర్యానీ బండి యాజమానిపై తుపాకీతో కాల్పులు జరిపాడో వ్యక్తి. ఈ సంఘటన ఆదివారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పరగణ జిల్లాలోని భట్పారా పారిశ్రామిక వాడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భట్పారా పారిశ్రామిక వాడకు చెందిన సంజయ్ మండల్(40) తోపుడు బండిపై బిర్యానీ పాయింట్ నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి 9గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫిరోజ్(26) అతని స్నేహితులు అక్కడికి వచ్చారు. తమకు బిర్యానీ పార్శిల్ కట్టాల్సిందిగా సంజయ్‌ని కోరారు. దీంతో సంజయ్ మండల్ ముందుగా డబ్బులు ఇస్తేనే బిర్యానీ ఇస్తానన్నాడు. ఆగ్రహించిన ఫిరోజ్ బిర్యానీ అధిక ధరలకు విక్రయిస్తున్నాడని ఆరోపిస్తూ సంజయ్‌తో గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెద్దది చేయడం ఇష్టంలేని సంజయ్ వారిని పాత బాకీ 190 ఇవ్వాలన్నాడు. పాత బాకీ అడగటంతో కోపగించిన ఫిరోజ్ వెంట తెచ్చుకున్న తుపాకీతో సంజయ్‌పై రెండు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్త స్రావంతో సంజయ్ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మహ్మద్ ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపినపుడు ఫిరోజ్ వెంట ఉన్న మరో ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
ఆర్మీ శిబిరంపై ఉగ్రదాడి
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సుంజ్వాన్‌లోని ఆర్మీశిబిరంపై శనివారం తెల్లవారుజామున 4.45 గంటలకు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టిముట్టి గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. తీవ్రవాదులు ఆర్మీ క్యాంపు వెనక వైపు ఉన్న నాలా ద్వారా చొరబడ్డట్టు తెలుస్తోంది. ఈ దాడిలో ముగ్గురు లేక నలుగురు తీవ్రదాదులు పాల్గొన్నట్టు సమాచారం. ఉగ్రదాడి నేపథ్యంలో ఆర్మీ క్యాంపునకు 500 మీటర్ల వెలుపల ఉన్న అన్ని స్కూళ్లను మూసివేయాల్సిందిగా ఆధికారులు ఆదేశాలు జారీ చేశారు. శనివారం అఫ్జల్ గురు వర్ధంతి సందర్భంగా జైషే ఈ మొహ్మద్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఉగ్రదాడితో కేంద్రహోం శాఖ అప్రమత్తమైంది. జమ్మూ కశ్మీర్ డీజీపీతో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భద్రతా దళాలు, తీవ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. -
విషాదం: డీఎస్పీ తలలోంచి దూసుకెళ్లిన బుల్లెట్..
సాక్షి, చంఢీగఢ్: ప్రమాదవశాత్తూ సర్వీస్ రివాల్వర్ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ ఓ డీఎస్పీ ప్రాణాలు బలిగొంది. ఈ ఘటన పంజాబ్‌లో కలకలం రేపింది. ఐజీ ముఖ్విందర్ సింగ్ కథనం ప్రకారం.. జైతూలోని యూనివర్సిటీ కాలేజీలో నేడు (సోమవారం) విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.మోరల్ పోలీసింగ్ మీద విద్యార్థులు ఆందోళన చేస్తూ.. పోలీసుల నుంచి మాకు, సామాన్యులకు స్వాతంత్ర్యం కావాలంటూ విద్యార్థులు గట్టిగా నినాదాలు చేశారు. పరిస్థితి అదుపుతప్పుతుందని సమాచారం అందుకున్న పంజాబ్‌కు చెందిన డీఎస్పీ బల్జీందర్ సింగ్ సంధు వర్సిటీకి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని డీఎస్పీ బల్జీందర్ సింగ్ విద్యార్థులను హెచ్చరించారు. కానీ విద్యార్థులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ ఆందోళనను ఉధృతం చేశారు.ఈ క్రమంలో అక్కడ తుపాకీ పేలిన శబ్ధం వినిపించిందని, పోలీసులు గమనించేసరికి డీఎస్పీ తలలొంచి దూసుకెళ్లడంతో ఆయన కుప్పకూలిపోయారు.అదే బుల్లెట్ మరో పోలీసును తీవ్రంగా గాయపరించింది. వీరిని చికిత్స నిమిత్తం ఫరీద్‌కోట్‌లోని గురు గోవింద్ సింగ్ మెడికల్ హాస్పిటల్‌కు తరలించారు. డీఎస్పీని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందారని నిర్ధారించారు. బుల్లెట్ గాయమైన మరో పోలీసుకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. సర్వీస్ రివాల్వర్‌ను డీఎస్పీ పేల్చారా.. లేక విద్యార్థులు వినియోగించారా అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఐజీ ముఖ్విందర్ సింగ్ వివరించారు. -
పిచ్చి ప్రయోగం.. కొంచెమైతే గోవింద
ప్రపంచంలో చాలామంది కిక్కు కోసం వింతవింత పనులు చేస్తుంటారు. తమ మనసు ఉల్లాసంగా ఉండటం కోసం ఎలాంటి పర్యావసనాలు ఆలోచించకుడా అనిపించిందే తడువుగా ఆ పని పూర్తి చేస్తారు. ఏదైనా జరిగితేనేమో ఎందుకు చేశాన్రా అని, జరగకుంటే హమ్మయ్య అనుకొని ఊపిరి పీల్చుకుంటారు. ఓ వ్యక్తి కూడా దాదాపు ఓ పిచ్చి ప్రయోగం చేసి రెప్పపాటు ప్రాణగండం నుంచి తప్పించుకున్నాడు. దాదాపు గుండె ఆగిపోయేంతటి దృశ్యాన్ని స్వయంగా ఎదుర్కొన్నాడు. ఇప్పుడా వీడియో యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. ఆ వీడియోలో చూపించిన ప్రకారం.. ఓ వ్యక్తి ఓ రిఫ్రిజిరేటర్‌ను కొంతమంది వ్యక్తుల సహాయంతో తీసుకొచ్చి ఒక మైదానంలో తనకు దూరంగా పెట్టాడు. దాని నిండా కొన్ని పేలుడు పదార్థాలు నింపాడు. అనంతరం రెండు శాఖలుగా విడిపోయిన ఓ చెట్టు చాటుకు వెళ్లి మధ్యలో నుంచి తుపాకీని ఎక్కుపెట్టి నేరుగా ఆ ఫ్రిజ్‌ను షూట్ చేశాడు. దాంట్లో పేలుడు పదార్థాలు ఉన్న కారణంగా అది పెద్ద మొత్తంలో శబ్దం చేస్తూ పేలిపోయింది. అయితే, ఆ ఫ్రిజ్ డోర్ మాత్రం నేరుగా అతడి మీదకే దూసుకొచ్చింది. అదృష్టం కొద్ది అతడి చెట్టు అడ్డుగా ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే తాను తవ్వుకున్న గోతిలోనే తాను తవ్వుకున్న చందంగా పరిస్థితి మారిపోయేది. -
ట్రంప్ వ్యతిరేక ర్యాలీలో కాల్పులు
సీటిల్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ ఎన్నికకు వ్యతిరేకంగా సీటిల్ నగరంలో జరిగిన ర్యాలీలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు గాయపడగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంత మంది వ్యక్తుల మధ్య వాగ్వాదమే ఘటనకు కారణమని చెప్పారు. అయితే, ఆ వాగ్వాదం ట్రంప్ ఎన్నికపై కాదని తెలిపారు. ర్యాలీలో ఉన్న వ్యక్తితో గొడవ పడిన మరో వ్యక్తి జన సమూహం నుంచి బయటకు వచ్చి కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయినట్లు చెప్పారు. ర్యాలీ వద్దే ఉన్న పోలీసు, ఫైర్ డిపార్ట్ మెంట్ శాఖ అధికారులు వెంటనే ఘటనాస్ధలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. -
ఫేస్బుక్ లైవ్ వీడియోలో కాల్పుల కలకలం
న్యూయార్క్: ఫేస్ బుక్ లైవ్ వీడియో స్ట్రీమింగ్ సందర్భంగా అమెరికాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ తరహా ప్రమాద ఘటనలు విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా వర్జీనియాలో స్వంత షూటింగ్ రికార్డింగ్ లో కాల్పుల ఉదంతం రికార్డయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా, మరోవ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వర్జీనియా లోని నార్ ఫోక్ , పరిసరాల్లోని బర్క్లీ లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఫేస్ బుక్ లో ఈ వీడియో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే...టీజే విలియమ్స్ అతని ఇద్దరు స్నేహితులతో కారులో వెడుతూ హిప్ హాప్ సంగీతం వింటూ.. వీడియోను రికార్డు చేస్తున్నారు. ఇంతలో తుపాకీల మోత. దాదాపు ఇరవై సార్లు తుపాకీ గుళ్ల మోత వినిపించింది. దీంతో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు కావడం ఫోన్ ఎగిరి కిందపడడం...క్షణాల్లో జరిగిపోయింది. ఈ కాల్పుల ఘటనను నార్ ఫోక్ పోలీసులు ధృవీకరించారు. బాధితులను సెంటారా జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ఇద్దరికి తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలోఉన్నారని, మరొకరికి స్వల్ప గాయాలతో కోలుకుంటున్నాడని వెల్లడించారు. కాగా సీబీఎస్ న్యూస్ ప్రకారం, చికాగోలో ఇలాంటి మూడు ఘటనలు నమోదయ్యాయి. ఆంటోనియో పెర్కిన్స్ అనే వ్యక్తి ప్రత్యక్ష ప్రసారం కోసం వీడియో చిత్రీకరిస్తుడగా.. ఓ గ్యాంగ్ కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయాడు. రెండవ ఘటనలో మరోవ్యక్తి కాల్పులకు బలయ్యాడు. ఈ ఏడాది మార్చి లో జరిగిన మూడవ ఘటనలో ఓవ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. -
యూనివర్శిటీలో కాల్పులు: ఇద్దరికి గాయాలు
అమెరికా: యూఎస్‌లోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీ క్యాంపస్‌లో గురువారం ఓ వ్యక్తి తుపాకీతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు యూనివర్శిటీ ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే వారిని తల్హాసీ స్మారక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఎలా ఉంది అనే విషయంపై తమకు ఇంతవరకు సమాచారం అందలేదన్నారు. యూనివర్శిటీ క్యాంపస్‌లోని స్ట్రోయిజర్ లైబ్రరీలో వ్యక్తి కాల్పులు జరిపాడని తెలిపారు. క్యాంపస్‌లోని పరిస్థితి ఆందోళనగా ఉంది... ఈ నేపథ్యంలో తగు జాగ్రత్తలు పటించాలని విద్యార్థులను యూనివర్శిటీ అధికారులు అప్రమత్తం చేశారు. ఈ కాల్పులపై మరింత సమాచారం అందవలసి ఉంది. -
ఇమ్రాన్‌ఖాన్ వాహనశ్రేణిపై కాల్పులు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ తెహ్రరిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ వాహనశ్రేణిపై దుండగులు కాల్పులు జరిపారు. ఇమ్రాన్ ఖాన్ వాహనశ్రేణిపై రాళ్లు, చెప్పులు కూడా విసిరారు. గుజ్రాన్వాలాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఇమ్రాన్‌ఖాన్ సురక్షితంగా ఉన్నారని ఆయన తరపు ప్రతినిధి అనీలాఖాన్ తెలిపారు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీగా ఇస్లామాబాద్ కు ఇమ్రాన్‌ఖాన్ బయలుదేరారు. నవాజ్ షరీఫ్ ప్రధాని రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇమ్రాన్‌ఖాన్‌పై దాడికి నిరసనగా ఆయన మద్దతుదారులు ఇస్లామాబాద్ లో ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.