
ప్రతీకాత్మక చిత్రం
నోయిడా: కరోనా వైరస్‌ను వ్యాపింపజేసేందుకే దగ్గుతున్నాడని భావించి ఓ వ్యక్తిపై మరొక వ్యక్తి కాల్పులు జరిపిన ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి 9 గంటలకు దయానగర్ గ్రామంలోని ఆలయం వద్ద నలుగురు వ్యక్తులు ల్యూడో గేమ్ ఆడుతున్నారు. అందులో ఒకరైన ప్రశాంత్ సింగ్ అలియాస్ పర్వేశ్ (25) ఆట మధ్యలో దగ్గాడు. కరోనా వ్యాపింపజేసేందుకే దగ్గుతున్నావంటూ ఆట ఆడుతున్న మరో వ్యక్తి జైవీర్ సింగ్ అలియాస్ గుల్లు (30) పర్వేశ్‌తో గొడవపడ్డాయి. గొడవ తీవ్రం కావడంతో జైవీర్ సింగ్ తన వద్ద ఉన్న తుపాకీతో పర్వేశ్‌పై కాల్పులు జరిపి పారిపోయాడు. బాధితున్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కరోనా బాధితుల్లో దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
చదవండి: 12 వేలకు అడుగు దూరంలో..
Comments
Please login to add a commentAdd a comment