Cough
-
రెండేళ్లుగా తగ్గని దగ్గు.. కారణం తెలిసి షాకైన వైద్యులు
సాధారణంగా దగ్గు సమస్య అందరినీ వేధిస్తుంటుంది. గాలిలోని కాలుష్యం, ముక్కుల్లో ఇన్ఫెక్షన్, అలర్జీ, సైనుసైటిస్, గొంతు నొప్పి, గుండె జబ్బులు.. ఇలా రకరకాల కారణాల ద్వారా దగ్గు వస్తుంటుంది. ఇలాగే చైనాకు చెందిన ఓ వ్యక్తికి దగ్గు అంటుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రేండేళ్లపాటు అతడికి దగ్గు వదల్లేదు. దీంతో క్యాన్సర్ వ్యాధి ఏమైనా వచ్చిందోనని భయాందోళనకు గురయ్యాడు. కానీ చివరకు తన దగ్గుకు గల కారణం తెలిసి..హమ్మయ్యా అనుకున్నాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..తూర్పు చైనీస్ పప్రావిన్స్ జెజియాంగ్‌కు చంఎదిన 54 ఏళ్ల వ్యక్తి జుకి కొంతకాలంగా దగ్గు వేధిస్తోంది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా, మందులు, సిరప్లు వాడినా ఎంతకీ దగ్గు తగ్గలేదు. ఇలా రెండేళ్లు గడిచాయి. గత నెల జూన్‌లో జెజియాంగ్ హాస్పిటల్లో థొరాసిక్ సర్జరీ విభాగంలో స్కాన్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.అక్కడ అతనికి సిటీ స్కాన్ చేశారు. అందులో వ్యక్తి కుడి ఊపిరితిత్తులో ఒక సెంటీమీటర్ పొడుతున్న కణతి ఉన్నట్లు తేలింది. అది న్యుమోనియా లేదా క్యాన్సర్ కణితీగా తొలుత భావించారు. ఇక జు తనకు కచ్చితంగా క్యాన్సర్ వచ్చి ఉంటుందని ఫిక్స్ అయిపోయి భయంతో అల్లాడిపోయాడుజూలై 3న ఊపిరితిత్తుల కణజాలంలో కొంత భాగాన్ని తొలగించడానికి థొరాకోస్కోపీని చేసుకున్నాడు. దీనిలో క్యాన్సర్‌ని నిర్ధారించడానికి ఒక పరీక్ష చేస్తారు. అయితే అక్కడే అసలు విషయం బయటపడింది. అతనికి ఊపిరితిత్తుల్లో దాగుంది చిల్లీ పెప్పర్ కొన(మిర్చి ముక్క) గుర్తించి వైద్యులు ఆశ్చర్యపోయారు. జు రెండు సంవత్సరాల క్రితం హాట్‌పాట్ భోజనం చేసిన రోజును గుర్తు చేసుకున్నారు. ఆరోజు మిరియాలు పీల్చడం వల్ల అసౌకర్యానికి గురవ్వడం, దగ్గడం వంటివి జరిగినట్లు నిర్ధారించుకొని ఊపిరి పీల్చుకున్నాడు.దీంతో మిరపకాయ అతని ఊపిరితిత్తులలోకి వెళ్లి ఉండవచ్చని జెజియాంగ్ హాస్పిటల్‌లోని థొరాసిక్ సర్జరీ విభాగం డైరెక్టర్ జు జిన్హై చెప్పారు. ఇది అతని కణజాలం కింద దాగిపోయిందని, దీనిని గుర్తించడం సవాలుగామారిందని తెలిపారు.పెప్పర్ చాలా కాలం అతని శ్వాసనాళంలో ఉన్నందున, అది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్నుదారి తీసిందని. అందుకు రెండు సంవత్సరాలకు పైగా దగ్గు వచ్చినట్లు పేర్కొన్నారు. -
తుమ్మితే పేగులు బయటికొచ్చాయి!
వాషింగ్టన్: ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఇటీవల మూత్రకోశం ఆపరేషన్ చేయించుకున్న 63 ఏళ్ల రోగి అనూహ్యమైన మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొన్నారు. గట్టిగా తుమ్మి, దగ్గడంతో పేగులు బయటికొచ్చాయి. దీంతో ఆయనను అత్యవసరంగా ఆస్పత్రిలో చేర్పించి ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకుండా కాపాడారు. ఫ్లోరిడావాసికి జరిగిన ఈ విచిత్ర ఘటన వివరాలు ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ కేస్ రిపోర్ట్స్’లో ప్రచురితమయ్యాయి. యూరినరీ బ్లాడర్ ఆపరేషన్ తర్వాత కోలుకున్న ఆ వ్యక్తికి ఇటీవల ఆస్పత్రికి వెళ్లారు. ఆపరేషన్ సమయంలో పై నుంచి వేసిన కుట్లను విప్పేశారు. ఆపరేషన్, కుట్లు విప్పడం అంతా సవ్యంగా జరగడంతో చిన్న పార్టీ చేసుకుందామనుకుని ఆ దంపతులు తర్వాతి రోజు ఉదయాన్నే దగ్గర్లోని రెస్టారెంట్‌కు వెళ్లి అల్పాహారం తినేందుకు కూర్చున్నారు. ఆ సమయంలో ఆ వ్యక్తి బిగ్గరగా తుమ్మడంతోపాటు దగ్గారు. దీంతో ఆపరేషన్ కోసం గతంలో కోత పెట్టిన ప్రాంతం నుంచి పేగుల్లో కొంతభాగం బయటికొచ్చింది. హుతాశుడైన వ్యక్తి వెంటనే ధైర్యం తెచ్చుకుని సొంతంగా డ్రైవింగ్ చేస్తూ ఆస్పత్రికి వెళ్దామనుకున్నాడు. భార్య వద్దని వారించడంతో అంబులెన్సులో ఆస్పత్రికి వెళ్లారు. పరిస్థితి చూసి అవాక్కవడం వైద్యుల వంతయింది. ముగ్గురు నిష్ణాతులైన యూరాలజీ సర్జన్లు జాగ్రత్తగా వాటిని మళ్లీ యథాస్థానంలోకి వెనక్కి నెట్టారు. ఇలాంటి ఘటన జరగడం మాకు తెలిసి ఇదే తొలిసారి అని అక్కడి వైద్యులు వ్యాఖ్యానించారు. -
Pomegranate Peel Tea దానిమ్మ తొక్కల టీ, అద్భుత ప్రయోజనాలు
#PomegranatePeelTea దానిమ్మ గింజలతో మంచి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శరీరం అంతటా రక్త ప్రసరణను మెరుగు పరచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే రక్తహీనతతో బాధపడేవారికి దానిమ్మ గింజల జ్యూస్ బాగా ఉపయోగడపతాయి. అలాగే దానిమ్మ తొక్కలతో చేసిన టీ రెగ్యులర్‌గా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి దానిమ్మ టీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. దానిమ్మ తొక్కల్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుతో దానిమ్మ తొక్కలతో తయారు చేసిన టీని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బాడీలోని మలినాల్ని బైటికి పంపించేందుకు, జలుబు దగ్గు, చర్మ సమస్యలు, జుట్టు రాలడానికి చికిత్స చేయడంలో సహాయపడతాయంటున్నారు నిపుణులు ఇంకా మధుమేహం, రక్తపోటు , కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. దానిమ్మ తొక్కల టీ తయారీ: దానిమ్మ కాయనుంచి వలిచిన తొక్కల్ని శుభ్రంగా కడిగి తొక్కలను ఎండబెట్టాలి. ఇతర సందర్భాల్లో, మైక్రోవేవ్ ఉపయోగించి వేడి చేయవచ్చు. ఆ తరువాత, పీల్స్ బాగా చూర్ణం చేయాలి. దీన్ని తడి లేని సీసాలో నిల్వ ఉంచుకోవచ్చు. ఒక కప్పు నీటినిలో టీస్పూన్ దానిమ్మ తొక్కలను వేసి బాగా మరిగించాలి. దీన్ని చక్కగా వడకట్టి, రుచికి తగినట్టుగా తేనె కలుపుకొని తాగాలి. ఈ టీని రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బాడీ డీటాక్సిఫై: విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని నెగిటివ్ టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది. చర్మాన్ని బాగా హైడ్రేట్ గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. వైరల్ జ్వరం, దగ్గు, గొంతు నొప్పి , సాధారణ జలుబు నివారణలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన దంతాలు: దానిమ్మ తొక్కలతో తయారు చేసిన టీ తాగడం వల్ల చిగుళ్లు, దంత సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది: దానిమ్మ తొక్కల్లో టానిన్లుతో పేగుల్లో మంట తగ్గుతుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తాన్ని కూడా శుభ్రపరుస్తుంది. కాబోయే తల్లులకూ మేలు చివరగా, గర్భిణీ స్త్రీలకు దానిమ్మ తొక్క చాలా మంచిదట. ముఖ్యంగా గర్భధారణ ప్రారంభంలో దాని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణం పాలీఫెనోలిక్ సమ్మేళనాలు ఫోలిక్ యాసిడ్ , విటమిన్ సీ ఎదుగుతున్న పిండానికి సరైన పోషకాహారాన్ని అందిస్తుంది. గర్భిణీ స్త్రీలు జీర్ణక్రియ సమస్యలను నివారిస్తుంది. ఇంకా పిగ్మెంటేషన్, జుట్టు రాలడం సమస్య ఉన్నవారు కూడా దానిమ్మతొక్కల టీని సేవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
జలుబు, దగ్గు, గొంతు నొప్పి వేధిస్తున్నాయా?
వాతావరణం కొద్దిగా మారిందంటే చాలు జలుబు, దగ్గు, గొంతు నొప్పి చుట్టుముడతాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ సీజనల్ వ్యాధుల బారిన పడతారు. ముఖ్యంగా జలుబు, దగ్గు ఒక్క పట్టాన తగ్గదు. దీనికి తోడు చాలా నీరసం, అలసట. అయితే సాధారణ జలుబు, దగ్గును చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది. యాంటీ బయాటిక్స్ అవసరాన్ని దాదాపు నివారించవచ్చు. సాధారణ జలుబును వైద్యపరంగా వైరల్ ఇన్ఫెక్షన్ లేదా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ అంటారు. జలుబు లేదా ఫ్లూ ఉన్నప్పుడు కనిపించే మరో లక్షణం దగ్గు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యలను దాదాపు వంట ఇంట్లోని దినుసులతోనే తగ్గించు కోవచ్చు. అల్లం, తులసి, వాము ఆకులతో కషాయాన్ని చేసుకొని, కొద్దిగా తెనె కలుపుకుని తాగవచ్చు. అలాగే వేడి పాలల్లో సేంద్రీయ పసుపు కలుపుకొని తాగవచ్చు. నల్ల మిరియాల టీ నల్ల మిరియాల్లో విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది సహజంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కనుక నల్ల మిరియాలు, బెల్లం, నాలుగు తులసి ఆకులు వేసుకొని టీ కాచుకొని తాగవచ్చు. అలాగే ధనియాల కషాయం కూడా. ఇది చేసుకోవడం చాలా సులభం కూడా. మరి ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలేంటో తెలుసు కుందాం. ఒక టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ వాము, జీల కర్ర, యాలకులు, ఐదు లవంగాలు, ఐదు మిరియాలు, అర టీ స్పూన్ శొంఠి పొడి, చిన్న దాల్చిన చెక్క ముక్కను తీసుకొని తడి లేని మిక్సీ జార్లో మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఈ పౌడర్ని ఓ గాజు సీసాలో భద్ర పరుచుకోవాలి. తయారీ విధానం ఒక గిన్నెలో ఒక గ్లాసు నీళ్లు తీసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ పొడిని వేయాలి. ఇలా ఐదు నుంచి 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈ మిశ్రమానికి ఒక స్పూన్ తేనె కలుపు కోవచ్చు. దీన్ని వేడి, వేడిగా తాగాలి. దీంతో ముక్కు దిబ్బడ తగ్గి శ్వాస సాఫీగా అవుతుంది. వాస్తవానికి తేనె దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే వాతావరణం మార్పుల ద్వారా వచ్చే వ్యాధులు ఉంచి ఉపశమనం మాత్రమే కాదు, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ హోమ్ టిప్స్ వల్ల ప్రయోజనాలే కానీ సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవు. ఆవిరి పట్టడం యూకలిప్టస్ లేదా రోజ్మేరీ ఆయిల్ లేదా కాస్తంత పసుపు వేసి, బాగా కాగిన వేడి నీటి ఆవిరి పడితే మంచిది. సుమారు 10-15 నిమిషాలు పాటు స్టీమ్ పడితే గొంతులోని కఫం కరిగి, గొంతు నొప్పితోపాటు, దగ్గు కూడా తగ్గుతుంది. రోజుకు రెండు సార్లు ఇలా ఆవిరి పట్టవచ్చు. నోట్: జలుబు ఏమాత్రం తగ్గకుండా, దగ్గు మరీ ఎక్కువగా వేధిస్తుంటే మాత్రం వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. లేదంటే ఒక్కోసారి ఈ ఇన్ఫెఫెక్షన్ ఇతర భాగాలకు కూడా పాకే ప్రమాదం ఉంటుంది. -
ఆస్తమా 'దమ్ముందా'? ఇలా చేసి చూడండి! వెంటనే..
'చలికాలంలో చర్మసమస్యలు, జుట్టు రాలిపోవడం వంటివి ఎంత సాధారణమో, ఆస్త్మారోగులకు ఆయాసం ఎక్కువ కావడం, ఆర్థరైటిస్ అంటే కీళ్ల జబ్బులు ఉన్నవారికి కీళ్లనొప్పులు పెరగడం అంతే సహజం. గతవారం మనం కీళ్లజబ్బులకు పరిష్కార మార్గాలు తెలుసుకున్నాం కాబట్టి ఈవారం ఆస్త్మా రోగులు ఏం చేయాలి, ఏం చేయకూడదు.. వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.' దగ్గు, బ్రాంకైటిస్, ఉబ్బసం, న్యుమోనియా మొదలైనవన్నీ శ్వాసవాళాలకి, ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధులే. ఆస్తమా లేదా ఉబ్బసం అనేది ఒక దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధ వ్యాధి. దీనికి వయసుతో నిమిత్తంలేదు. చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా ఎవరికైనా రావచ్చు. సరిపడని తత్వం అంటే ఎలర్జీ, దుమ్ము, ధూళి, పొగ, ధూమపానం, ఘాటైన వాసనలు, కాలుష్య వ్యర్థాలు, చలి వాతావరణం సరిపడకపోవటం వంటివి. ముందుగా శీతాకాలంలో ఆస్త్మా రోగులు ఎలా ఉండాలో చూద్దాం! శరీర తత్వాన్ని అనుసరించి ఏ పదార్థం తీసుకుంటే ఉబ్బసం వస్తుందో, ఆ పదార్థం లేదా పదార్థాలను పూర్తిగా మానివేయాలి. నిల్వ ఉన్న పదార్థాలకు ఉబ్బసం వ్యాధిగ్రస్థులు దూరంగా ఉండాలి. మంచినీరు ఎక్కువగా తాగాలి. ఉబ్బసం ప్రకోపించినప్పుడు, మరింతగా ఎక్కువ నీరు తాగాలి. రోగ నిరోధకశక్తిని పెంచేది విటమిన్–సి. అందువలన విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉండే పండ్లు, కూరలు అవసరం. ఆ క్రమంలో ప్రతిరోజు కనీసం ఒక సిట్రస్ పండు అయినా తప్పనిసరిగా తినాలి. మాంసాహారులయితే ఒమేగా–3 ఫాటీ యాసిడ్స్‌తో కూడిన చేపలను, కోడిమాంసాన్ని తీసుకోవచ్చు. శ్వాసనాళాలలోని జిగురు పొర పల్చబడకుండా ఉండటానికి కోడి మాంసం దోహదం చేస్తుంది. ఉబ్బసానికి వాడే అల్లోపతి మందులు చాలావరకు స్టెరాయిడ్ మందులు. వీటి వలన మంచితోబాటు కీడు కూడా జరుగుతుంది. ఉదయం పూట వేప నూనె ముక్కులో రెండు చుక్కలు వేసుకోవాలి. రాత్రి నిద్రించే ముందు ఆవు నెయ్యి గోరువెచ్చగా చేసి ముక్కులో వేసుకోవాలి. రాత్రి పడుకొనే ముందు ఆవాల నూనె ఛాతీ మీద, గొంతుకు రాయాలి. ఆస్తమాతో బాధపడుతున్న వారు చికిత్సకు ప్రాధాన్యం ఇస్తున్నట్టే.. ఆహారపరమైన మార్పులు చేసుకోవడం కూడా అవసరం అవుతుంది. కొన్ని రకాల ఆహార పదార్థాల విషయంలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా స్పందించినప్పుడు అది ఆహారపరమైన అలర్జీలకు దారితీస్తుంది. ఇది కొంతమందిలో ఆస్తమాకు దారితీయవచ్చని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ 'డి' ఆస్తమా నుంచి రక్షణనిచ్చే వాటిలో విటమిన్ డి ది కీలక పాత్ర. ముఖ్యంగా 6 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు డి విటమిన్ లోపం లేకుండా చూసుకోవాలి. గుడ్లు, చేపలు, పాలు రూపంలో విటమిన్ డి అందుతుంది. పాలు, గుడ్లు కొందరిలో అలర్జీకి కారణమవుతాయి. పడని వారు వీటిని తీసుకోకూడదు. విటమిన్ 'ఎ' శరీరంలో విటమిన్ ఎ తగినంత ఉన్న పిల్లలకు ఆస్తమా సమస్య తక్కువగా ఉంటున్నట్టు పలు అధ్యయనాలు గుర్తించాయి. పిల్లలలో విటమిన్ ఎ అధికంగా ఉంటే వారి ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉంటుందట. క్యారట్, బ్రకోలీ, ఆలుగడ్డ, పాలకూర తదితర వాటిల్లో విటమిన్ ఎ ఎక్కువగా లభిస్తుంది. పండ్లు రోజూ ఒక యాపిల్ తీసుకుంటే ఆస్తమా రిస్క్ తగ్గుతుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. అరటిపండులో ఉండే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఆస్తమా నివారణకు ఉపయోగపడతాయి. మెగ్నీషియం మెగ్నీషియం తక్కువగా ఉంటే శ్వాసకోశ వ్యవస్థ పనితీరు కూడా తగ్గుతుందని వైద్యులు అంటున్నారు. కనుక గుమ్మడి గింజలు, చేపలు, డార్క్ చాక్లెట్, పాలకూర తదితర మెగ్నీషియం తగినంత లభించే వాటిని తీసుకోవాలి. చలికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆస్తమా వ్యాధిగ్రస్థులకు ఉపశమనం. వీటిని దూరం పెట్టాలి.. పులిసిన పదార్థాలు, పొగతాగటం, మత్తుపానీయాలను సేవించటం, మసాలా దినుసులు, తీపి పదార్థాలు. కడుపునిండా తినడం కొన్ని ఆహార పదార్థాలు ఆస్తమాకు కారణం కాకపోయినా, ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. కనుక వాటికి దూరంగా ఉండడం అవసరం. సల్ఫైట్స్ అనే ప్రిజర్వేటివ్ ఆస్తమా లక్షణాలను పెంచుతుంది. ప్యాకేజ్డ్ పచ్చళ్లు, ప్యాకేజ్డ్ లెమన్ జ్యూస్, డ్రై ఫ్రూట్స్ పై సల్ఫైట్స్ ఉంటాయి. కాఫీ, టీ, కొన్ని రకాల సుగంధ, మసాల దినుసుల్లోని శాలిసిలేట్స్ కూడా ఉబ్బసాన్ని పెంచుతాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో వాడే ప్రిజర్వేటివ్‌లు, ఆర్టిఫీషియల్ కలర్స్, ఫ్లావర్స్ తోనూ సమస్య పెరుగుతుంది. ఇవి చదవండి: అర్ధరాత్రి 1-4గంటల మధ్యలో నిద్ర లేస్తున్నారా? ఆత్మలు కల్లోకి.. -
యూకేలో కలవరపెడుతున్న 'వందరోజుల దగ్గు'! అధికారులు వార్నింగ్
యూకేలో వంద రోజుల దగ్గు(100-దగ్గు) వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో దగ్గి..దగ్గి గొంతులో పుండ్లు, మధ్య చెవిలో ఇన్ఫెక్షన్లు, ఆపుకోలేని మూత్ర విసర్జన తదితర సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులు యూకే అంతట వేగంగా పెరుగుతున్నట్లు వెల్లడించారు ఆరోగ్య నిపుణులు. ఇది మూడు నెలలు వరకు సాగే సుదీర్ఘమైన తీవ్ర దగ్గుగా పేర్కొన్నారు. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకారం.. గతనెల జూలై నుంచి నవంబర్ మధ్య కాలంలోనే దాదాపు 716కు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు అధికారులు. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన బ్యాక్టీరియా సంక్రమణం అని చెబుతున్నారు. ఇది గతేడాది 2022లో కాలంలోనే మూడు రెట్లు అధికంగా ఉండేదని, అదికాస్తా ఇప్పుడు మరింత తీవ్రమయ్యిందని తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో లాక్డౌన్, సామాజిక దూరం వంటి ఆంక్షలు కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి తక్కువుగా ఉండేదని, ఇప్పుడూ మాత్రం కేసులు మళ్లీ వేగంగా పెరుతున్నాయని ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఇది కోరింత దగ్గు రకానికి చెందిన సుదీర్ఘ దగ్గే ఈ వంద రోజుల దగ్గు. ఇంతకీ అసలు కోరింత దగ్గు అంటే.. కోరింత దగ్గు అంటే.. ఇది బోర్టెటెల్లా పెర్టుస్సిస్ బ్యాక్టీరియా వల్ల ఊపిరితిత్తుల వాయుమార్గాల ఇన్ఫెక్షన్ అయ్యి అదేపనిగా దగ్గు వస్తుంది. కనీసం ఏం తినలేక దగ్గి.. దగ్గి.. శరీరం అంతా పులపరంగా ఉండి నీరసించిపోతారు. ఇది శిశువుల్లో, వృద్దుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే 1950లలో టీకా రావడంతో ఆ సమస్య నెమ్మదించింది. అంతేగాదు 1960లలో ప్రతి మూడు ఏళ్లకు ఒకసారి ఈ అంటు వ్యాధులు ప్రబలేవని, టీకాలు వేయడంతో నియంత్రణలోకి వచ్చేదని బ్రిటన్‌కి చెంది బ్రిస్ట్ విశ్వవిద్యాలయ పీడియాట్రిక్స్ చెబుతున్నారు. ఈ వ్యాధి బారిన ముఖ్యంగా శిశువులు, వృద్ధులే పడతారని చెబుతున్నారు. ఎదురయ్యే సమస్యలు.. జలుబుని పోలీ ఉండే లక్షణాలు ఉత్పన్నమవుతాయి. దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. తీవ్రమైన దగ్గు ఒక్కోసారి వాంతులు లేదా పక్కటెముకలు విరగడం, గొంతు నొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది. నివారణ శిశువుల్లో, వృద్ధుల్లో వచ్చే ఈ కోరింత దగ్గుని తగ్గించొచ్చు. దీనికి అందుబాటులో టీకా కూడా ఉందని ఎన్హెచ్ఎస్ పేర్కొంది. చదవండి: భారత్‌లో 'వాకింగ్ న్యూమోనియా' కేసుల కలకలం! ఎవరికీ ఎక్కువ ప్రమాదం అంటే..? -
విపరీతమైన దగ్గు, ఆయాసంతో ఊపిరి సలపనివ్వడం లేదా? ఐతే ..
ఇది పొగచూరడం లాంటి ఏవో అడ్డంకులతో, ఊపిరిత్తుల్లో వచ్చే సమస్యతో, దీర్ఘకాలం పాటు కొనసాగుతూ బాధితుల్ని వేధించే జబ్బు అని పేరును బట్టి తెలుస్తుంది. దగ్గు, ఆయాసంతో వ్యక్తమయ్యే ఈ సమస్య ప్రధానంగా పెద్దవారినే వేధిస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక (జన్యు) కారణాలతో చిన్న వయసువారిలో కూడా కనిపించవచ్చు. పొగతాగే అలవాటుతో పురుషుల్లో, ఇంకా కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తూ ఉంటే... ఈ కారణంగా మహిళల్లో ఈ జబ్బు కనిపించే అవకాశాలెక్కువ. అసలే దగ్గుతో ఊపిరి సలపనివ్వని ఈ సమస్య, చలి కాలంలోని చల్లటి వాతావరణానికి మరింత పెచ్చరిల్లే అవకాశం ఉంది. దీని పేరే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్. సంక్షిప్తంగా సీఓపీడీ అని పిలిచే ఈ ఆరోగ్య సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం. దగ్గు ప్రధానంగా లక్షణంగా వ్యక్తమయ్యే సీవోపీడీ సమస్య పెద్దల్లో... అందునా 40 ఏళ్లు దాటినవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. సిగరెట్లూ, బీడీలూ, చుట్టలూ, హుక్కా కాల్చే వారిలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. వాతావరణ కాలుష్యాల్లో ఉండే దుమ్మూ, ధూళితో పాటు బొగ్గుగనులు, సిమెంట్, టెక్స్టైల్స్, రసాయనాల కాలుష్యం వెలువడే పరిశ్రమల దగ్గర ఉండేవారిలోనూ, ఆభరణాలకు పూతపూసే ఎలక్ట్రోప్లేటింగ్ వంటి కార్ఖానాల్లో పనిచేసేవారిలో కూడా ఇది ఎక్కువ. కారణాలు.. పొగతాగే అలవాటు ఉన్నవారిలో లేదా నిత్యం కాలుష్యాలకు ఎక్స్పోజ్ అవుతున్నవారిలో ఊపిరితిత్తుల్లోకి గాలిని తీసుకెళ్లే శ్వాసనాళాలు వాపునకు గురవుతాయి. దాంతో ఊపిరి సరిగా అందదు. లంగ్స్ నిండుగా, కాస్త బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది. ఛాతీ పట్టేసినట్లుగా ఉంటుంది. ఇక ఆస్తమా ఉన్న వ్యక్తులు సరైన చికిత్స తీసుకొని దాన్ని కంట్రోల్లో ఉంచుకోని సందర్భాల్లో... దీర్ఘకాలిక దుష్ప్రభావంగా సీవోపీడీ రావచ్చు. లక్షణాలు.. సీవోపీడీలో దగ్గు, ఆయాసాలు ప్రధాన లక్షణాలు. అయితే తీవ్రతను బట్టి ఇతరత్రా లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలా తీవ్రతను బట్టి ఈ వ్యాధిని నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి... గోల్డ్ 1 (మైల్డ్), గోల్డ్ 2 (మోడరేట్), గోల్డ్ 3 (సివియర్), గోల్డ్ 4 (వెరీ సివియర్). ఇక్కడ గోల్డ్ అనేది ‘గ్లోబల్ అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్’ అనే సంస్థకు సంక్షిప్త రూపం. ‘గోల్డ్’ సంస్థ... సీవోపీడీ మీద పరిశోధనలు చేస్తూ పల్మనాలజిస్టులకు ఎప్పటికప్పుడు సూచనలు అందజేస్తుంది. సీవోపీడీ అనగానే కేవలం ఊపిరితిత్తుల సమస్య అనే అనుకుంటాం. కానీ బాధితులలో వివిధ అవయవాలకు సంబంధించిన ఇతర సమస్యలూ ఎక్కువే ఉంటాయి. మచ్చుకు... ఆస్టియో పోరోసిస్, హార్ట్ ఫెయిల్యూర్, డయాబెటిస్, కిడ్నీ ఫెయిల్యూర్, కార్పెల్ పల్మొనాలె... మొదలైన సమస్యలతో ఇది కలిసి ఉంటుంది. అందువల్ల ఈ లక్షణాలను గుర్తిస్తూ, చికిత్స అందించాల్సి ఉంటుంది, దీనినే ‘సిండమిక్ అప్రోచ్’ అంటారు. ఈ నెలలోనే 2024కు సంబంధించిన కొత్త చికిత్స మార్గదర్శకాలను ‘గోల్డ్’ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చిందని డాక్టర్లు చెబుతున్నారు. వ్యాధి నిర్ధారణ.. స్పైరోమీటర్ అనే పరికరం సహాయంతో సీవోపీడీని నిర్ధారణ చేస్తారు. దీనితో కొన్ని శ్వాస పరీక్షలు చేసి, సమస్య తీవ్రత ఎంతో తెలుసుకుంటారు. అంటే మైల్డ్, మోడరేట్ లేదా సమస్య తీవ్రం (సివియర్)గా ఉందా అని తెలుసుకుంటారు. ఈ పరీక్షకు ముందరే... బాధితులను వ్యక్తిగతంగా / క్లినికల్‌గా పరీక్షించడంతో డాక్టర్లకు కొంత అవగాహన వస్తుంది. ఇలా చేసే క్లినికల్ పరీక్షల్లో బాధితుల వృత్తి వివరాలూ (ప్రొఫెషనల్ హజార్డ్స్), వారు పనిచేసే చోటు, వారుండే చోట కాలుష్య ప్రభావాలూ, పొగతాగడంలాంటి వారి అలవాట్లు... ఇవన్నీ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. ఐఓఎస్ అనే పరికరం ప్రారంభ దశలో ఉన్న సీవోపీడీని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అపోహ–వాస్తవం ఈ వ్యాధి ఉన్నవారు ఎడతెరిపి లేకుండా దగ్గుతూ ఉంటారు. దాంతో ఇదో అంటువ్యాధిలా అనిపిస్తుంది గానీ నిజానికి ఇది అంటువ్యాధి కానే కాదు. చికిత్స.. పేరులోనే దీర్ఘకాలిక సమస్య అని చెప్పే ఈ వ్యాధికి చికిత్స కూడా దీర్ఘకాలికంగానే అవసరమవుతుంది. సీవోపీడీ లక్షణాలు కనిపించినప్పుడు దగ్గు కొద్దిగా ఉన్నప్పుడే డాక్టర్‌ను సంప్రదించాలి. లక్షణాలు పెరిగేదాకా ఆగడం లాంటి నిర్లక్ష్యం చేయకూడదు. చికిత్స ఎంత త్వరగా జరిగితే ఫలితాలు అంత బాగుంటాయి, సీవోపీడీని అంత తేలిగ్గా/సమర్థంగా అదుపు చేయవచ్చు. వాయునాళాలను వెడల్పు చేసేందుకు పీల్చే మందులైన ‘బ్రాంకోడయలేటర్స్’ (ఇన్హేలర్స్ / నెబ్యులైజర్స్)ను ఉపయోగిస్తారు. వాటిని ఉపయోగించగానే అవి శ్వాసనాళాలను వెడల్పు చేసి మరింత హాయిగా, తేలిగ్గా శ్వాస పీల్చుకోడానికి తోడ్పడతాయి. సీవోపీడీకి దీర్ఘకాలం చికిత్స అవసరం కాబట్టి దగ్గు వంటి లక్షణాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధి పూర్తిగా తగ్గినట్లుగా అనుకోకూడదు. లక్షణాలు తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ డాక్టర్లు సూచించినట్లు ఫాలో అప్‌కు వెళ్తూ చికిత్స పూర్తయ్యేవరకు కొనసాగించాలి. నాన్ ఫార్మలాజికల్ థెరపీ.. సీవోపీడీతో బాధపడేవారిలో ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోతుంది. దానిని క్లియర్ చేసే ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని డాక్టర్లు సూచించిన విధంగా వాడాల్సి ఉంటుంది. హోమ్ ఆక్సిజన్ థెరపీ : ఇది చికిత్సలో మరో ప్రక్రియ. తీవ్రతను బట్టి అవసరం ఉన్నవారికి 19 గంటల పాటు ఇంటి దగ్గరే ఆక్సిజన్ వాడాల్సి ఉంటుంది. పల్మునరీ రీ–హ్యాబిలిటేషన్: ఇది చికిత్సలో ఇంకో ప్రక్రియ. తేలిక నుంచి ఓ మోస్తరు వరకు అవసరమున్న వ్యాయామాలు (పర్స్ లిప్ బ్రీతింగ్), అబ్డామినల్ బ్రీతింగ్‌తో పాటు చిన్న బరువులతో కండరాలను బలంగా చేసే (మజిల్ స్ట్రెంతెనింగ్) వ్యాయామాలు చేయడం అవసరం. నివారణ.. పొగతాగే అలవాటునుంచి దూరంగా ఉండటం / అప్పటికే పొగతాగే అలవాటుంటే వెంటనే మానేయడం మంచి నివారణ. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్తున్నకొద్దీ అది వాయునాళాలను మరింతగా మూసుకుపోయేలా చేస్తుంది. దాంతో శ్లేష్మం/కళ్లె మరింత ఎక్కువగా పెరుగుతూ పోతుంది. ఫలితంగా ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ మోతాదు బాగా తగ్గి, పనిచేసే శక్తి, సామర్థ్యాలు తగ్గుతాయి. (చదవండి: ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?) ∙ -
మందులు వేసుకున్నా దగ్గు తగ్గడం లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి
హెల్త్ టిప్స్ ►నీళ్ళలో తులసి ఆకులు వేసి మరిగించి, ఆ తర్వాత మరిగిన తులసి నీటిని కాస్త చల్లార్చి తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. ► కొంచెం గోరువెచ్చని నీళ్లలో కరక్కాయ పొడిని కలుపుకుని తాగినా, కరక్కాయ ముక్క బుగ్గన పెట్టుకుని ఆ రసాన్ని మింగుతూ ఉన్నాపొడి దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. ► అర టీ స్పూన్ సొంఠి పొడి లో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకున్నా దగ్గు నుంచి రిలీఫ్ లభిస్తుంది. ► టీ స్పూన్ తేనెలో 1 టీ స్పూన్ అల్లం రసం, 1 టీ స్పూన్ దానిమ్మరసం మూడింటిని బాగా కలిపి తీసుకోవాలి. ఇలా రోజుకి 2 లేదా మూడు సార్లు చేస్తే రిజల్ట్ మీకే తెలుస్తుంది. ► రెండు, మూడు రోజుల పాటు రెండు మిరియాల గింజలు, మెలమెల్లగా నములుతూ, ఆ రసం మింగితే దగ్గు తగ్గుతుంది. ► సీతాఫలం విత్తనాలు, ఆకులు మెత్తగా నూరి పట్టిస్తే, పేలు పోతాయి. ► అరటిపండు, తేనెతో కలిపి తీసుకంటే క్షయవ్యాధిగ్రస్తులకు మంచిది. ► నేరేడు ఆకులు నీటిలో మరిగించి, వడగట్టి, ఆ నీటిని పుక్కిలిస్తే నోటిపూతలు తగ్గుతాయి. ► వేప చెట్టు బెరడును పెనంపై బాగా కాల్చి, మెత్తగా పొడి చేయాలి. ఆ పొడికి కొద్దిగా కొబ్బరి నూనె చేర్చి, కురుపులపై రాస్తే ఉపశమనం వుంటుంది. ∙వేపాకు రసం, దానికి సమాన భాగంలో పెరుగు జోడించి, కాస్త నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది. మీకు తెలుసా? ►వంట పూర్తయిన తర్వాత అంట్లను కొందరు వంటింటి షింకులోనే అలా ఉంచేస్తుంటారు. అలా చేయకండి. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకోవడమో లేకపోతే బయట వేసుకోవడమో చేయండి. సింకులో గిన్నెలు పడి ఉండటం వల్ల వాటిలో బ్యాక్టీరియా చేరి దుర్వాసన రావడం ప్రారంభం అవుతుంది. వాటిని వాడటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ►సాధారణంగా చాలా మంది వంటింట్లోనే చెత్త డబ్బాను పెట్టుకుంటుంటారు. ఒకటి రెండు రోజులు గనుక అది అలాగే ఉండిపోతే సూక్ష్మ జీవులు చేరి కంపు రావడం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఏ రోజుకారోజు చెత్తను తీసివేయండి. వెసులుబాటు ఉంటే గనుక అసలు దీన్ని వంటింటి బయట వైపు ఏర్పాటు చేసుకోవడం మంచిది. -
జలుబు, దగ్గు నుంచి బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి
వేసవికాలం ముగిసింది. వర్షాకాలం వచ్చేస్తోంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా దగ్గు, జలుబులు వంటివి సర్వసాధారణం. ఈ సమస్య అంత ప్రమాదకరమైనది కానప్పటికీ, ఇది ఒకరి నుంచి మరొకరి అంటుకునే అవకాశం ఉంటుంది. తరచుగా దగ్గు, జలుబు నుంచి వంటింటి చిట్కాలతో సత్వర ఉపశమనం పొందొచ్చు. తులసి ఆకుల రసంలో అంతే మొత్తంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ఓ నాలుగైదు తమలపాకులను వెచ్చచేసి, వాటిని నూరి రసం తీసి, దానిలో అంతే మొత్తంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ఓ రెండు చెంచాల నూనెను కాచి, ఒక పెద్ద చెంచాడు కర్పూరాన్ని పొడిచేసి నూనెలో కలిపి ఒక సీసాలో నిల్వ ఉంచాలి. దీనిని ఛాతీకి, గొంతుకకూ రాస్తే దగ్గు, జలుబు తగ్గుతాయి. గుప్పెడు జామాయిలు (యూకలిప్టస్ ) ఆకుల్ని రెండు గ్లాసుల నీళ్లల్లో పోసి అవి మరిగి ఒక గ్లాసు అయ్యేదాకా మరగబెట్టాలి. అనంతరం ఆ నీటిని వడగట్టి అందులో కొంచెం పంచదార కలిపి, రోజుకు మూడుసార్లు తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. -
Health: ఏది పడితే ఆ టాబ్లెట్ వేసుకోవద్దు! పైనాపిల్, నిమ్మ, కివి పండ్లు.. ఇంకా తులసితో..
గత కొద్దిరోజులుగా వాతావరణంలో వస్తున్న రకరకాల మార్పుల వల్ల దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. చాలామంది మెడికల్ షాప్‌కు వెళ్లి వాళ్లు ఇచ్చిన మందులు తెచ్చుకుని వేసుకుంటూ ఉంటారు. అది చాలా ప్రమాదం. దానివల్ల రకరకాల దుష్ఫలితాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. దగ్గు, జలుబుకు సహజమైన చిట్కాలు పాటించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అవేమిటో తెలుసుకుందాం. అసలు దగ్గు, జలుబు రాకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తిన్నట్లయితే తొందరగా ఈ అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బలవర్థకమైన ఆహారం తీసుకొని శరీరాన్ని బలంగా ఉంచుకుంటే, అసలు ఇవి రాకుండానే ఉంటాయి. జలుబు, దగ్గు వంటి సమస్యల నివారణకు యాంటీబయాటిక్స్ ఉపయోగించటం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. సహజ చిట్కాలు... ►తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే జలుబు, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. ►రోజుకు రెండుసార్లు పసుపు, వేడి పాలను కలిపి తీసుకుంటే కూడా ఉపశమనం దొరుకుతుంది. ►మిరియాల కషాయాన్ని తాగినా, లవంగాలు బుగ్గన పెట్టుకుని వాటి రసాన్ని మింగుతున్నా, వేడి వేడి మసాలా టీ తయారు చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది ►చెంచాడు నిమ్మరసాన్ని, రెండు స్పూన్ల తేనెను వేడినీళ్లలో కలుపుకొని తాగితే ఉపశమనం దొరుకుతుంది. ►అల్లాన్ని దంచి కషాయం చేసుకుని తాగినా, అల్లం టీ చేసుకుని తాగినా కూడా రిలీఫ్ ఉంటుంది ►కొద్దిగా పసుపు, ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో పుక్కిట పట్టడం వల్ల గొంతుకు ఉపశమనం దొరుకుతుంది∙ ►కొన్ని తులసి ఆకులు, చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి ముక్కలు, టీ స్పూన్ వాము, మెంతులు, పసుపు, నాలుగైదు నల్ల మిరియాలు వేసి నీళ్లు పోసి బాగా మరిగించి కషాయం తయారు చేసుకుని తాగితే మరింత మంచి ఫలితం ఉంటుంది. వేడినీళ్ళకే ఓటేయండి... ►దగ్గు, జలుబుతో బాధపడేవారు శీతల పానీయాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ►అదేవిధంగా ఫ్రిజ్‌లో నుంచి తీసిన చల్లటి నీళ్లను తాగడానికి బదులు ఎప్పుడు నీళ్లు తాగినా కాస్త వేడిగా ఉన్న నీటిని మాత్రమే తాగడం మంచిది. ఈ పండ్లు మంచివి పైనాపిల్, నిమ్మ, కివి వంటి పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కూడా జలుబు, దగ్గు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. చదవండి: Health: బీరకాయ, నేతి బీరకాయ తరచుగా తింటున్నారా? ఇందులోని అధిక సెల్యులోజ్ వల్ల.. Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే.. -
20 లక్షల కరోనా వ్యాక్సిన్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నియంత్రణకు అవసరమైన 20 లక్షల కరోనా వ్యాక్సిన్లను సరఫరా చేయాలంటూ కేంద్రానికి విన్నవిస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ మేరకు లేఖ రాయాలని నిర్ణయించామన్నారు. కరోనా కేసుల పెరుగుదల, కేంద్రం అప్రమత్తం చేసిన నేపథ్యంలో శుక్రవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జూమ్ ద్వారా జరిగిన సమీక్షలో వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఈ రమేశ్ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉండండి: ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని హరీశ్ చెప్పారు. దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి కోవిడ్ లక్షణాలు ఉన్న వారు సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకొని, అవసరమైన వారు చికిత్స పొందాలని సూచించారు. కోవిడ్ వ్యాక్సినేషన్లో తెలంగాణ దేశానికి ఆదర్శవంతంగా నిలిచిందని, ముఖ్యంగా ప్రికాషన్ డోసు పంపిణీ చేయడంలో మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఇప్పటివరకు 7.75 కోట్ల వ్యాక్సిన్లను అర్హులైన వారికి అందించనున్నారు. 1.35 కోట్ల ప్రికాషన్ డోసులు పంపిణీ చేయగా, 1.62 కోట్ల ప్రికాషన్ డోసు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలు, కేన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని, ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అర్హులైన వారు తమ వంతుగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
అడెనోవైరస్ కలకలం.. పిల్లలకు మాస్కులు తప్పనిసరి చేసిన సర్కార్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అడెనోవైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. పిల్లలందరూ కచ్చితంగా మాస్కు ధరించాలని సీఎం మమతా బెనర్జీ సూచించారు. చిన్నారులు భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. బెంగాల్లో అడెనోవైరస్ బారినపడి ఇప్పటివరకు 19 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరిలో 13 మంది చిన్నారులకు దీర్ఘకాలిక రోగాలున్నాయని మమత చెప్పారు. పిల్లలలో దగ్గు, జలుబు లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, ఒకవేళ జ్వరం ఉంటే తక్షణమే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం వివరాల ప్రకారం అడెనోవైరస్ ఫ్లూ లాంటిదే. ఇది సోకిన చిన్నారులు సాధారణ జ్వరం నుంచి తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా పిల్లల శ్వాసకోశ వ్యవస్థపై ఈవైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. అడెనోవైరస్ అన్ని వయస్కుల పిల్లలకు సోకుతుంది. అయితే ఎక్కువగా నవజాత శిశువులు, 10 ఏళ్లుపైబడిన పిల్లలు దీని బారినపడుతున్నారు. అడెనోవైరస్ లక్షణాలు ► జ్వరం ► జలుబు ► దగ్గు ► గొంతులో నొప్పి ► కళ్లు గులాబీ రంగులోకి మారడం ► న్యుమోనియా ► శ్వాసనాళాల వాపు ► జీర్ణాశయంలో ఇన్ఫెక్షన్ రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న, శ్వాససంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు అడెనోవైరస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం బెంగాల్ రాష్ట్రంలోని అనేక ఆస్పత్రులు చిన్నారులతో నిండిపోయాయి. దీంతో అన్ని జిల్లాల వైద్య అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అవసరమైన సదుపాయాలు, వైద్య పరికరాలు సమాకూర్చాలని ఆదేశించింది. చదవండి: వాళ్లు గుంపుల్లో తిరగొద్దు.. కర్ణాటక ఆరోగ్య మంత్రి హెచ్చరిక.. -
Health Tips: ద్రాక్ష రసాన్ని కొంచెం తేనెలో కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే
♦ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు మూడు వెల్లుల్లి రేకులు తింటే రక్తపోటు, కడుపులో మంట, నులిపురుగుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ♦ కొన్ని స్పాంజి ముక్కలను నీళ్ళలో తడిపి ఫ్రీజర్‌లో ఉంచండి. చెయ్యి కాలినా లేదా ఏ తలుపు సందులోనో పడి నలిగినా ఒక స్పాంజి ముక్కను తీసి బాధ ఉన్న ప్రదేశంలో కొద్దిసేపు ఉంచితే నొప్పి, వాపు వెంటనే తగ్గుతాయి. ♦ పళ్ళు వచ్చే ముందు పిల్లలు ప్రతిదాన్నీ కొరుకుతూ చిగుళ్ళు నొప్పి పుట్టి ఏడుస్తూ ఉంటారు. అటువంటప్పుడు సారింజ తొనలలోని విత్తనాలు తీసేసి, ఆ తొనలను కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి వాటిని పిల్లలకు ఇస్తే ఆ చల్లదనం వారి బాధను పోగొట్టి రిలీఫ్ ఇస్తుంది. వారికి అవసరమైన ‘సి’ విటమిన్ కూడా లభిస్తుంది. ♦ ద్రాక్ష రసాన్ని కొంచెం తేనెలో కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. ♦ కొబ్బరినూనె, నిమ్మరసం సమపాళ్ళలో తీసుకుని బాగా కలిపి కొద్దిగా వేడిచేసి నొప్పిగా ఉన్న ప్రాంతం లో మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ♦ కిడ్నీ వ్యాధుల నివారణకు రెండు వంతుల దోసకాయ రసానికి, ఒక వంతు ద్రాక్ష రసాన్ని కలిపి ఉదయం, సాయంత్రం ఒక కప్పు చొప్పున తాగి చూడండి ♦ బచ్చలి రసం, అనాసరసం సమపా ళ్లలో తీసుకుని దానిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. -
Amarnath Vasireddy: మూడు వారాలుగా దగ్గు, జలుబు ఆగకుండా వస్తున్నాయా?
గత మూడు వారాలుగా మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ జలుబు- దగ్గు ఆగకుండా వస్తోందా? ఒక వేళ తగ్గినా మళ్ళీ తిరగపెడుతోందా..? భయపడకండి. ఇది కరోనా కాదు. ఇప్పుడు లక్షలాది మంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. మరో వారం పది రోజుల్లో సమస్య దానంత అదే పరిష్కారమైపోతుంది. ఎందుకిలా..? రెండు రకాలు: ►ఎలర్జీలు ►శక్తివంతమయిన బాక్టీరియా వైరస్లు. గమనించారా ? ఒక రోజు విపరీతమయిన చలి. పొగ మంచు. ఉన్నట్టుండి ఇంకో రోజు ఫ్యాన్ వేసుకోకపోతే నిద్రపట్టనంత ఉక్కపోత. వాతావరణంలో విపరీత మార్పులు. పొగ మంచు. దీనికి తోడు వాతావరణ కాలుష్యం. ఫాగ్.. స్మోక్.. రెండూ కలిసి స్మోగ్. దీనివల్ల చాలా మందిలో ఎలర్జీ లు వస్తున్నాయి. జలుబు అయితే తుమ్ములు నెమ్మదిగా వస్తాయి. అదే ఎలర్జీ అయితే ఒక్కో సారి ఆగకుండా వస్తాయి. ఎలర్జీ కి మందు లేదు. బయట మంచు ఉన్నా బెడ్ రూమ్ లో ఉన్న మీకు పచక్ పచక్ అని తుమ్ములొస్తున్నాయా ? అయితే ఎలర్జీ. జస్ట్ రిలాక్స్. మరో వారం లో వాతావరణం సెట్ అయిపోతుంది. అప్పుడు పోతుంది. కాకపోతే ప్రతి వింటర్ లో మీకు ఈ బాధ తప్పదు. వీలైనంతవరకు మంచు అదే స్మోగ్ లో బయటకు పోవద్దు. ఎండ వచ్చి పొగ మంచు తగ్గాక బయటకు వెళ్ళండి. కర్టైన్స్ తో కిటికీలు మూసి ఉంచండి. ఇక రెండో ది మొండి వైరస్ బాక్టీరియాలు. నిజానికి అవి మొండి కావు. అవి వృద్ధి చెందడానికి అనుకూల వాతావరణం.. బయట + మీ శరీరం లోపల.. రెండు చోట్లా ! బయటేమో స్మోగ్. లోపల మీ ఇమ్మ్యూనిటి వీక్. రెండేళ్లుగా మాస్క్‌లు వేసుకొని మీ ఇమ్మ్యూనిటీని బజ్జో పెట్టేశారు. తక్కువ మొత్తంలో వైరస్లు బాక్టీరియాలు సోకాలి. ఇమ్యూనిటీ కణాలు వాటిని చంపాలి. అదే దానికి బాటింగ్ ప్రాక్టీస్. రెండేళ్లు నెట్ ప్రాక్టీస్ లేకుండా బాట్స్మన్ పిచ్‌పైకి దిగితే ? ఇంకేముంది..? బాతే. అదే డక్ అవుట్. ఇప్పుడు అదే జరుగుతోంది. పోనీ లెండి. ఇప్పుడైనా బాటింగ్ ప్రాక్టీస్ అవుతోంది. ఇలా చేయండి. ►దగ్గుమందు తాగొద్దు. దాని వల్ల నష్టం తప్ప లాభం ఉండదు. ►వేడి నీరు తాగాలి. పురుషులు నాలుగు లీటర్లు. స్రీలు మూడు. పిల్లలు వయసు బట్టి ఒకటి నుంచి రేండు లీటర్ లు. వేడి నీటిలో ఉప్పు వేసుకొని నోట్లో పోసుకొని గార్గిల్ చేయాలి. ►అవసరం అయితే అల్లం పసుపు కాషాయం చేసి తాగండి. జస్ట్ టీ కప్పులో కొద్దిగా. రోజుకు ఒక సారి. మూడు నాలుగు రోజులు మాత్రం. ►శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. బాగా నిద్ర పోవాలి. స్ట్రెస్ కి దూరంగా ఉండాలి. -వాసిరెడ్డి అమర్నాథ్, ప్రముఖ ఉపాధ్యాయులు, వ్యక్తిత్వ, మానసిక పరిశోధకులు -
వామ్మో! దగ్గితే పక్కటెముకలు విరిగిపోవడమా!
ఏదైన ప్రమాదం బారిన పడితేనో లేక పోట్లాడినప్పుడో ఎముకలు విరగడం జరుగుతుంది. మహా అయితే ఏదైన వ్యాయమం చేసినప్పుడూ ఏదైన ఎముక బెణికి విరిగే అవకాశం ఉంటుంది. అంతేగానీ ఉత్తిపుణ్యానికి అదికూడా కేవలం దగ్గితే ఎముకలు విరగడం గురించి విన్నారా! వాస్తవానికి ఏదైన జన్యులోపంతో ఎముకలు బలహీనంగా ఉండి విరిగిపోవడం జరుగుతుంది. కానీ కేవలం దగ్గితే ఎముకలు విరిగిపోవడం ఏమిటి అని ఆశ్చర్యంగా అనిపించినా అది నిజం. వివరాల్లోకెళ్తే...చైనాలోని షాంఘైకి చెందిన హువాంగ్ అనే మహిళకు దగ్గినందుకు ఛాతీలోని నాలుగు పక్కటెముకలు విరిగిపోయాయి. ఆమె ఒక రోజు స్పైసీ ఫుడ్ తింటున్నప్పుడూ విపరీతమైన దగ్గు వచ్చింది. అప్పుడూ ఆమెకు ఏదో లోపల విరిగిన శబ్దం వచ్చింది కూడా. ఐతే ఆమె మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత నుంచి ఆమె గాలి పీల్చుకుంటున్న, మాట్లాడుతున్న విపరీతమైన నొప్పి రావడం ప్రారంభమైంది. దీంతో ఆమె ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ హువాంగ్‌కి స్కాన్ చేయగా మొత్తం నాలుగు పక్కటెముకలు విరిగినట్లు గుర్తించారు వైద్యులు. ఆ తర్వాత ఆమెకు బ్యాడేజ్ వేసి నయం అయ్యేంతవరకు నెలరోజులు విశ్రాంతి తీసుకోమని సూచించారు వైద్యులు. ఐతే స్థానిక మీడియా దగ్గితే పక్కటెముకలు విరగడం ఏమిటని వైద్యులను ప్రశ్నించింది. హువాంగ్ బరువు తక్కువగా ఉండటమే అందుకు కారణమని వైద్యులు తేల్చి చెప్పారు. ఆమె సుమారు 171 సెంటిమీటర్లు పొడవు ఉంటుందని, బరువు కేవలం 57 కిలోగ్రాములే ఉంటుందని చెప్పారు. ఆమె శరీరంలో పైభాగం చాలా బలహీనంగా ఉండటమే గాక శరీరం నుంచి ఎముకలు చాలా స్పష్టంగా కనిపిస్తాయని చెబుతున్నారు. ఎముకలకు మద్దతు ఇచ్చేలా కండ లేకపోవడంతో.. దగ్గినప్పుడల్లా... పక్కటెముకలు సులభంగా విరిగిపోతాయని చెప్పారు వైద్యులు. ఆమె కోలుకున్నాక కచ్చితంగా బరువు పెరిగేందుకు వ్యాయమాలు చేస్తానని చెబుతోంది. (చదవండి: -
దగ్గును బలవంతంగా ఆపుకోకండి!
పదిమంది మధ్య ఉన్నప్పుడు బలంగా అదేపనిగా దగ్గు వస్తుంటే చాలామంది ఆపుకోడానికి ప్రయత్నిస్తుంటారు. దగ్గడం అన్నది సాధారణంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యానికి సూచన. చాలా జబ్బుల్లో అదో లక్షణం. అదే సమయంలో దగ్గడం అనే ప్రక్రియ మనల్ని కొన్ని సమస్యల నుంచి రక్షిస్తుంది కూడా. అందుకే దగ్గు వస్తున్నప్పుడు మీటింగ్‌లో ఉన్నామనో, లేదా నలుగురిలో ఇబ్బంది అనో దాన్ని ఆపకూడదనీ, అణచివేయకూడదని సూచిస్తున్నారు వైద్యనిపుణులు. దగ్గినప్పుడు మన శ్వాసనాళాల్లోని గాలి చాలా వేగంగా బయటకు వస్తుంటుంది. దాంతో దేహంలోపల ఉన్న అవాంఛిత స్రావాలు బయటకు వెళ్లిపోతాయి. ఊపిరితిత్తుల్లో స్రావాలు అక్కడే ఉండిపోయినా, అక్కడి వాయునాళాల్లో అవి అడ్డుపడ్డా, గట్టిగా దగ్గు వస్తుంది. అలాంటప్పుడు దగ్గితే... కళ్లె / కఫం బయటపడుతుంది. ఫలితంగా మనకు కీడు చేసే స్రావాలను దగ్గు బయటకు పంపించి వేస్తుంది కాబట్టే దగ్గును ఆపుకోకూడదు. వీలైతే మందులతోనూ అణచివేయకూడదు. కానీ దగ్గు వల్ల బాధితులకు నిద్రలేకపోయినా, లేదా పనులకు ఆటంకం కలుగుతున్నా, హెర్నియా వంటి జబ్బులు ఉన్నా... కేవలం ఇలాంటి కొన్ని సందర్భాల్లో మాత్రమే పొడి దగ్గును ఆపడానికి మందులు వాడాలి. నిజానికి దగ్గు అనేది జబ్బు కాదు. మనల్ని రక్షించేందుకు ఉన్న ప్రక్రియ. అందుకే దగ్గు వస్తున్నప్పుడు అది ఏ కారణంగా వస్తుందో తెలుసుకొని, దానికి చికిత్స తీసుకోవాలి. అప్పుడు సమస్యా తగ్గుతుంది. ఆటోమేటిగ్గా దగ్గు కూడా తగ్గుతుంది. చదవండి: నరకానికి ప్రవేశ ద్వారం.. 2200 సంవత్సరాలుగా! -
హై ఫీవర్, దగ్గు, ఆయాసం.. 5 రోజుల్లో తగ్గకుంటే జర జాగ్రత్త!
►కరోనా వ్యాప్తి తీవ్రమవుతోంది. కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆసుపత్రులకు వచ్చే ఔట్పేషెంట్లు, ఇతర విభాగాలకు వచ్చేవారు, పీహెచ్‌సీలు, ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు చేసుకుంటున్న వారూ పెద్దసంఖ్యలో ఉంటున్నారు. పలువురు జ్వరం, జలుబు, తలనొప్పి, దగ్గు వంటి స్వల్ప లక్షణాలు కనిపించగానే ఇళ్లల్లోనే ఐసోలేషన్‌లో గడుపుతున్నారు. ఇప్పుడున్న ఈ భిన్నమైన వాతావరణంలో ఆయావర్గాల ప్రజల్లో కోవిడ్ టెస్ట్, ఐసోలేషన్, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చింది ఒమిక్రానా, డెల్టానా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా కరోనా చికిత్సలో నిమగ్నమైన కిమ్స్ ఆసుపత్రి పల్మనాలజీ, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్ డాక్టర్ వీవీ రమణప్రసాద్ ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై స్పష్టతనిచ్చారు. ఇవీ ముఖ్యాంశాలు... – సాక్షి, హైదరాబాద్ ప్రస్తుత పరిస్థితి.. 90 శాతం ఒమిక్రాన్‌తోపాటు 10 శాతం డెల్టా కేసులు కూడా వస్తున్నాయి. డెల్టా తీవ్రత పట్ల జాగ్రత్త పడాలి. ఔట్‌పేషెంట్ విభాగానికి వచ్చేవారిలో ఎక్కువమందిలో ఒకే రకమైన స్వల్ప లక్షణాలుంటున్నాయి. త్రీ జీన్ డ్రాపౌట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్‌ల్లో అధికంగా ఒమిక్రాన్ కేసులే బయటపడుతున్నాయి. ఒకవేళ టెస్ట్‌ల్లో ఎస్ జీన్ పాజిటివ్ వస్తే అవి డెల్టా లేదా ఒమిక్రాన్, మరో వేరియెంట్ బీ ఏ 2 కావొచ్చు. అందువల్ల అయోమయంతో కొందరు వైద్యులు మోనోక్లోనల్ యాంటీ బాడీ కాక్టెయిల్ థెరపీ ఇస్తున్నారు. ఇది అవసరం లేదు. ఐదురోజుల వరకు వేచి చూసి, లక్షణాలు తగ్గకుంటే, అప్పుడు కాక్టెయిల్ ఇవ్వొచ్చు. ఒక్క డోస్ టీకా కూడా తీసుకోనివారు లేదా ఒక్కడోసే తీసుకున్నవారు, పెద్దవయసు వారు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిలో కేసులు పెరుగుతున్నాయి. ఆక్సిజన్ స్థాయిల తగ్గుదలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఆక్సిజన్ లెవల్స్ తగ్గి, ‘లంగ్ షాడో’స్తో డెల్టా కేసులొస్తున్నాయి. అందువల్ల డెల్టా అనేది పూర్తిగా లేదని చెప్పలేం. మరి, చికిత్స.. ఒమిక్రాన్ స్వల్ప లక్షణాలున్న కేసుల్లో మామూలు చికిత్స అందిస్తే సరిపోతుంది. మోల్నుపిరవిల్ యాంటీ వైరల్ లేదా మోనోక్లోనల్ యాంటీ బాడీ మందు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకటి, రెండురోజులు జ్వరం వచ్చి తగ్గినా, 2, 3 రోజులు జలుబు ఉండి తగ్గినా, 4, 5 రోజులకు గొంతులో గరగర తగ్గిపోయినా వీరంతా ఐదురోజులు ముగిసేనాటికి దాదాపు సాధారణస్థాయికి చేరుకుంటున్నారు. రక్తం పలుచన చేసే మందులు వాడాల్సిన అవసరం అంతగా పడటంలేదు. ఎక్కువ శాతం మంది 3 నుంచి 5 రోజుల్లో మామూలు స్థితికి చేరుకుంటున్నారు. కొంచెం నీరసంగా ఉన్నా ఏడో రోజుకల్లా విధుల్లో చేరుతున్నవారే ఎక్కువ. ఐదు రోజుల తర్వాత కూడా తగ్గకపోతే.. ఐదురోజుల తర్వాత కూడా హైగ్రేడ్ టెంపరేచర్‌తో జ్వరం, కొత్తగా దగ్గు, ఆయాసం వంటివి వచ్చి చేరడం, ఆక్సిజన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయంటే అలాంటివి డెల్టా వేరియంట్ కేసులయ్యే అవకాశాలు ఎక్కువ. ఐదురోజుల తర్వాత కూడా తీవ్రత తగ్గని వారికి దగ్గు, జలుబు, ఇతర లక్షణాలు కొనసాగే వారు యాంటీ డికంజెస్టెంట్లు, బ్రాంకోడైలేటరల్తో చికిత్స చేయించుకోవాలి. గోరువెచ్చని నీళ్లు తాగడం, ఫ్రిజ్‌లో ఉన్న చల్లటి పదార్థాలు తినకపోవడం, వేడిపదార్థాలే భుజించడం, వేడి పానీయాలు వంటివి తీసుకున్నవారిలో అత్యధికులు పదోరోజుకల్లా సాధారణస్థితికి వచ్చేస్తున్నారు. ఒమిక్రాన్ కేసుల గుర్తింపు... గొంతులో నస, జ్వరం, జలుబు, తలనొప్పి, 3 నుంచి 5 రోజుల్లో తగ్గే ఆయాసం, ఆక్సిజన్ స్థాయిల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోతే వాటిని ఒమిక్రాన్ కేసులుగా చెప్పవచ్చు. డెల్టా లక్షణాలు... ఇప్పటికీ డెల్టా కేసులు వస్తున్నాయి. రుచి, వాసన లేకపోవడం, విరేచనాలు, దగ్గు, ఆయాసం, ఆక్సిజన్ స్థాయిల తగ్గుదలను డెల్టా లక్షణాలుగా భావించి జాగ్రత్తపడాలి. లేదంటే వ్యాధి ముదిరి న్యూమోనియాకు దారితీసి, నీరసం, జ్వరం వంటివి కొనసాగి ఆసుపత్రుల్లో, ఐసీయూల్లో చేరే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీళ్లు అంటించేస్తున్నారు... ఒమిక్రాన్ లేదా డెల్టా బారిన పడినా ఆ లక్షణాలు బయటపడని, కనిపించని పేషెంట్లు సమాజంలో, కుటుంబంలోని ఇతరులకు అంటించేస్తున్నారు. ఒమిక్రాన్‌లో డబ్లింగ్ ఇంపాక్ట్ రెండురోజులే కావడంతో కేసులు పెరుగుతున్నాయి. లక్షణాలు లేని వారిని వారం సెల్ఫ్ ఐసోలేషన్‌లో పెడితే సరిపోతుంది. ఆసుపత్రుల్లో టెస్ట్ చేశాక పాజిటివ్‌గా తేలిన కేసుల్లో అత్యధికుల ఇళ్లలోని వాళ్లకు అప్పటికే లక్షణాలున్నట్టు తేలింది. దీంతో వాళ్లు ఆస్పత్రులకు వస్తున్నట్టు నిర్ధారణైంది. -
నోటి నుంచి దుర్వాసన, దగ్గు, పుండ్లతో బాధపడుతున్నారా.. ఇవి పాటిస్తే!
ఇమ్యునిటీ బలహీనంగా ఉంటే సీజనల్ వ్యాధులు ఎప్పుడూ పొంచి ఉంటాయి. ఇక జలుబు, దగ్గు వంటి వ్యాధులైతే దాడి చేస్తూనే ఉంటాయి. గొంతు పొడిబారటం, పొడి దగ్గు రావటం వీటి ప్రధాన లక్షణాలు. సాధారణంగా కఫం ఉత్పత్తికాకపోతే దగ్గు వస్తుంది. ఒక్కోసారి అయితే వైరల్ ఇన్ఫెక్షన్లు, అలర్జీల వల్ల కూడ దగ్గు వస్తుంది. ఇది ఎక్కువకాలం కొనసాగితే ఆహారం నమలడం, మింగడంలో సమస్యలు తలెత్తుతాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ అండ్ క్రానియోఫేషియల్ రీసెర్చ్ నివేదికల ప్రకారం నోరు మంట, పెదాల పగుళ్ళు, గొంతులో చికాకు, దగ్గు, నోటి పుండ్లు, దుర్వాసన వంటివి పొడిగా ఉండే నోటి లక్షణాలు. మనలో చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య ఇది. అయితే ఇంటిలో సులభంగా తయారు చేసుకునే రెమిడీలతో వీటినుంచి ఉపశమనం పొందవచ్చు! నిపుణులు సూచించిన ఈ చిట్కాల ద్వారా పొడిగొంతు సమస్యను ఏ విధంగా అధిగమించవచ్చో తెలుసుకుందాం.. తులసి, తేనెలతో టీ పూర్వం నుంచే మన ఆయుర్వేద శాస్త్రంలో తులసి, తేనెలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రకృతి అందించే సహజసిద్ధమైన తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటి ఫంగల్ కారకాలు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలను నివారించడంలో తోడ్పడతాయి. అలాగే తులసిలో కూడా ఔషద గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇంటి వైద్యం, నాటు వైద్యాలలో వీటికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తులసి, తేనెలతో తయారు చేసిన టీ పొడి దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పసుపు కలిపిన పాలు పొడి గొంతు సమస్యలకు, దగ్గు సంబంధిత రుగ్మతలకు ఇది బాగా పనిచేస్తుంది. పసుపును ఆహారంలో భాగంగా తీసుకున్నట్టయితే వ్యాధుల బారి నుంచి కాపాడటమేకాక, ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. గ్లాసు వేడిపాలల్లో, చిటికెడు పసుపు వేపి తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. నెయ్యితో మిరియాల పొడి యాంటీ బ్యాక్టీరియల్ (సూక్ష్మజీవుల వినాశక), యాంటీ ఫంగల్ (తాపనివారక) లక్షణాలు నెయ్యిలో అధికంగా ఉంటాయి. ఒక టేబుల్ స్ఫూన్ వేడి నెయ్యిలో చిటికెడు మిరియాల పొడిని కలిపి తినండి. గొంతు తడిగా ఉంచడానికి ఇది బాగా పనిచేస్తుంది. అయితే దీనిని తిన్నతర్వాత ఏ విధమైన పానియాలు తాగకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ములేథి లేదా లికోరైస్ మూలిక చూర్ణం లికోరైస్ అనేది ఒక ఆయుర్వేద మూలిక. ఈ ఔషధ మొక్క రుచి తియ్యగా ఉండటం వల్ల దీనిని అతిమధురం అని కూడా అంటారు. ఈ మూలికను చిన్న ముక్కగా తుంచి, నోట్లో వేసుకుని నమలడం వల్ల రోజంతా గొంతును తడిగా ఉంచుతుంది. సాధారణంగా దీనిని శ్వాస, పేగు సంబంధిత రుగ్మతల నివారణకు వినియోగిస్తారు. ఉప్పునీరు పొడి గొంతు సమస్య నివారణకు తేలికైన, అత్యంత ప్రభావవంతమైన మరొక పద్ధతి ఉప్పు నీటి పుక్కిలింత. వేడి నీటిలో ఉప్పు కలిపి రోజుకి కనీసం రెండు సార్లైనా పుక్కిలించాలి. ఈ విధంగా చేయడం వల్ల గొంతులో పేరుకుపోయిన జిగట వంటి శ్లేష్మాన్ని కరిగించి పలచబరుస్తుంది. తక్షణ ఉపశమనానికి ఇది చక్కని మార్గం. హెర్బల్ టీ కాలుష్యం, దుమ్మూ ధూళి వల్ల గొంతులో చికాకుపుట్టించే సమస్యలకు శ్రేష్ఠమైన పరిష్కారం హెర్బల్ టీ. వీటివల్ల ఊపిరితిత్తులు కూడా ప్రభావితం అవుతాయి. పచ్చ యాలకులు, లవంగ మొగ్గలు వంటి సమాలా దినుసుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటితో తయారు చేసిన టీ తాగడం వల్ల కాలుష్యకారకాలైన ధూళికణాలు ఆరోగ్యానికి హాని తలపెట్టకుండా నిరోధించడంలో తోడ్పడుతుంది. మెంతుల డికాషన్ వివిధ రకాల గొంతు రుగ్మతలను నివారించడంతోపాటు, పలు ఆరోగ్య సమస్యల నివారణలో కూడా మెంతులు ఉపయోగపడతాయి. మెంతి గింజలను నీటిలో వేసి రంగు మారేంతవరకు ఉడికించాలి. అనంతరం ఈ డికాషన్‌ను చల్లార్చి, రోజుకు రెండు సార్లైనా పుక్కిలించాలి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా పొడి దగ్గు, గొంతు పొడిబారడం వంటి రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: Weight Loss: ప్రతి ఉదయం ఈ డ్రింక్ తాగారంటే.. మీరే ఆశ్చర్యపోతారు!! -
తెమడ రంగును బట్టి జబ్బును ఊహించవచ్చు!
మనకు కొన్నిసార్లు దగ్గు వచ్చి తెమడ / కళ్లె / గల్ల పడుతుంటుందన్న విషయం తెలిసిందే. ఇలా తెమడ / కళ్లె / గల్ల పడటాన్ని తడి దగ్గు అంటుంటారు. ఇలా పడే తెమడ (కళ్లె) రంగును బట్టి రకరకాల వ్యాధులను కొంతవరకు అనుమానించి, వాటికి తగిన విధంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించవచ్చు. ఉదాహరణకు తెమడ రంగు... ఆకుపచ్చగా ఉంటే... దాన్ని సూడోమోనాడ్ అనే కుటుంబానికి చెందిన సూడోమొనాస్ అనే ఒక రకం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల దగ్గు వస్తుండవచ్చు. పసుపుపచ్చగా ఉంటే... క్లెబ్సిల్లా నిమోనియా తరహా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పడు వచ్చే దగ్గుతో పాటు ఈ రంగులో తెమడ (కళ్లె) పడవచ్చు. ఎర్రగా ఉంటే... సూడోమొనాలీ, నీమోకోకల్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు ఎర్రరంగులో కళ్లెపడవచ్చు. కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా ఎర్రరంగు కళ్లె పడవచ్చు. అయితే ఇలా ఎర్రరంగు పడ్డప్పుడల్లా అది క్యాన్సర్‌కు సూచన అని అందోళన పడాల్సిన అవసరం లేదు. ఇలా కనిపించేవాళ్లలోనూ క్యాన్సర్ ఉండేవారి శాతం చాలా తక్కువ. నల్లగా ఉంటే... కాలుష్యం బారిన పడటం, పొగతాగడం వంటివి జరిగి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వస్తే అప్పడు దగ్గుతో పాటు వచ్చే కళ్లె నల్లగా ఉండవచ్చు. చదవండి: పుట్టుమచ్చలా... ఈ ‘ఏ, బీ, సీ, డీ’లు గుర్తుంచుకోండి! -
దగ్గు కూడా మన మంచికే..
నిజానికి దగ్గు అన్నది ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పటి లక్షణం కంటే... దాన్ని ఓ రక్షణ వ్యవస్థ అనడమే కరెక్ట్. మనం దగ్గినప్పుడు మన శ్వాసనాళాల్లోని గాలి చాలా వేగంగా ప్రవహిస్తుంది. దానివల్ల లోపలి స్రావాలు బయటకు వెళ్లిపోతాయి. అలా దగ్గు అన్నది మనలో ఒక రక్షణ ప్రక్రియలా ఉపయోగపడుతుంది. అందుకే దగ్గును మందులతో అణచివేయకూడదు. మన ఊపిరితిత్తుల్లో స్రావాలు చిక్కబడ్డా, అక్కడ వాయునాళాల్లో ఏదైనా అడ్డుపడ్డా, మనకు దగ్గు పెరుగుతుంది. దగ్గుతో పాటు కళ్లె / కఫం పడుతుంది. అలా అవాంఛిత స్రావాలను దగ్గు బయటకు పంపించి వేస్తుంది కాబట్టే దగ్గును మందులతో అణచివేయకూడదు. అయితే దగ్గు వల్ల రోగికి నిద్రాభంగం అవుతున్నా, పనికి ఆటంకం కలుగుతున్నా, హెర్నియా వంటి జబ్బులు ఉన్నా పొడి దగ్గును ఆపడానికి మాత్రమే మందులు వాడాలి. దగ్గు ఉన్నప్పుడు అది ఏ కారణంగా వస్తుందో డాక్టర్ల చేత పరీక్షలు చేయించుకుని, దేహం లోపల ఉన్న కారణాన్ని (అండర్లైయింగ్ కాజ్‌ను) కనుగొని, దానికి చికిత్స చేయించుకుంటే దగ్గు దానంతట అదే తగ్గుతుంది. -
ఒక్క దగ్గు తుంపర = 6.6 మీ. దూరం
సాక్షి, హైదరాబాద్: ఒక దగ్గు తుంపర లేదా సూక్ష్మకణం ప్రయాణించే దూరమెంతో తెలుసా?.. 6.6 మీటర్లు. అదే పొడి వాతావరణంలోనైతే మరింత దూరం ప్రయాణిస్తుందట. సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అధ్యయనం ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది. కోవిడ్ నేపథ్యంలో వ్యక్తుల మధ్య దూరం పాటించడం ఎంత ముఖ్యమో ఈ పరిశోధన తెలియచెబుతోంది. కరోనా సోకిన వ్యక్తి మాట్లాడినప్పుడు, తగ్గినపుడు, తుమ్మినపుడు సూక్ష్మరూపంలో వైరస్ కణాలు వెలువడి.. మీటరు దూరంలో ఉండే వ్యక్తులు వాటి బారినపడే అవకాశాలు ఎక్కువున్నట్టు గతంలోనే అంచనా వేశారు. వివిధ సంస్థలు నిర్వహించిన పరిశీలనల్లో భాగంగా దగ్గు తుంపర్లు (డ్రాప్‌లెట్లు) ఏ దిశలో ఎలా పయనిస్తాయనేది అధ్యయనం చేశారు. వీటికి భిన్నంగా సింగపూర్ ఇన్స్టిట్యూట్ పరిశోధనలో మాత్రం ఒక్క దగ్గు తుంపర (సింగిల్ కాఫ్ డ్రాప్లెట్) సెకనుకు 2 మీటర్ల వాయువేగం ఉన్న పరిస్థితుల్లో 6.6 మీటర్ల దూరం ప్రయాణిస్తుందని, పొడి వాతావరణంలో మరింత దూరం వెళ్లే అవకాశాలున్నాయని తేల్చింది. కరోనా కణాల వైరల్ ట్రాన్సిమిషన్‌ను మరింతగా అర్థం చేసుకునేందుకు ‘ఫ్లూయిడ్ సైన్సెస్’అంశాలను అధ్యయనంలో భాగంగా చేర్చారు. దగ్గినపుడు వివిధ సైజుల్లో వెయ్యి తుంపర్లు సాధారణంగా ఒక వ్యక్తి దగ్గినపుడు వివిధ పరిమాణాల్లో వెయ్యిదాకా తుంపర్లు వెలువడతాయి. వాటిలో బరువు ఎక్కువగా ఉన్నవి త్వరగా నేలపై పడిపోతాయి. అయితే గాలి వేగం లేకున్నా ఒక మీటర్ వరకైతే ప్రయాణిస్తాయని ఈ పరిశోధకులు వెల్లడించారు. ‘సైజులో మధ్యస్తంగా ఉన్న దగ్గు తుంపర్లు చిన్నచిన్నవిగా విడిపోయి గాలితో పాటు మరింత దూరం ప్రయాణిస్తాయి. అవి ఆవిరైపోయే క్రమంలో ఏరోసోల్స్‌గా మార డం వల్ల ఊపిరి పీల్చినపుడు సులభంగా ఊపిరితిత్తులోకి చేరి శ్వాసతీసుకునే మార్గంలో ప్రవేశిస్తాయి. ఆవిరి కాని తుంపర్ల కంటే ఆవిరై ఏరోసోల్స్‌గా మారే కణాలు లేదా డ్రాప్‌లెట్లతోనే మరింత ప్రమాదం’అని తాజా పరిశోధనలో పేర్కొన్నారు. వాయు ప్రసారం, వేగంతో పాటు వాతావరణంలోని వివిధ అంశాల ప్రభావం, వివిధ స్థాయిల్లోని గాలి వేగం వల్ల మనుషుల శరీరాల చుట్టూ గాల్లోని దగ్గు తుంపర్లు ఏ మేరకు ప్రయాణిస్తాయనేది ‘మ్యాథమేటికల్ ఫార్ములేషన్స్’తో పరిశీలించారు. దగ్గర్లోని వ్యక్తులకు దగ్గు తుంపర్లు ఎలా చేరుకుంటాయనేది సైతం అధ్యయనం చేశారు. పరిశోధనలో భాగంగా సమశీతోష్ణస్థితి ఉన్న వాతావరణంలో, బహిరంగ ప్రదేశాల్లో గాలిలో ప్రయాణించే దగ్గు తుంపర్లు లేదా కణాలపై దృష్టిపెట్టారు. ఇందులో సాధించిన ఫలితాలు, అంచనాలను ఇండోర్ ప్రదేశాలతో పాటు బహిరంగ ప్రదేశాలు, ఎక్కువ మంది గుమికూడే కాన్ఫరెన్స్ హాల్స్, థియేటర్ల వంటి చోట్ల కూడా తమ పరిశోధనలతో మరింత లోతుగా పోల్చిచూసేందుకు సింగపూర్ ఇన్స్టిట్యూట్ సిద్ధమవుతోంది. -
ఎడతెగని దగ్గు, శ్రీమతికి గోల్డెన్ చాన్స్ మిస్
వాషింగ్టన్: కరోనావైరస్ సోకిన తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ఎడతెగని దగ్గుతో బాధపడుతున్నారు. దీంతో రానున్న అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అరుదైన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారని ప్రతినిధి వెల్లడించారు. మెలానియ భర్త, ట్రంప్ తో కలిసి ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సిన అరుదైన అవకాశాన్ని మెలానియా వదులుకున్నారని స్టెఫానీ గ్రిషామ్ ఒక ప్రకటనలో తెలిపారు. వైరస్ నుంచి మెలానియా ట్రంప్ ఆరోగ్యం రోజురోజుకూ చక్కబడుతోంది. కానీ దగ్గు మాత్రం తగ్గడంలేదు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ఆమె తన ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారని స్టెఫానీ తెలిపారు ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆమె, కోలుకుంటున్నప్పటికీ, విపరీతంగా దగ్గుతూ ఉండటంతో ఆమె పెన్సిల్వేనియాలో జరగనున్న ర్యాలీకి వెళ్లడం లేదన్నారు. గత రెండు వారాల్లో ట్రంప్ రోజుకు కనీసం ఒక ర్యాలీతో ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. 2019 నుండి తన భార్యతో వేదికపై కనిపించలేదు. మెలానియా పెన్సిల్వేనియాకు వెళ్లి ఉంటే, దాదాపు సంవత్సరం తరువాత భర్తతో కలిసి అతి కీలకమైన ర్యాలీలో పాల్గొనే అవకాశం దక్కేది. కానీ అనారోగ్యం కారణంగా ఆ గోల్డెన్ చాన్స్ ను మెలానియా మిస్ అవుతున్నారని భావిస్తున్నారు. కాగా ఈ నెల ఆరంభంలో ట్రంప్, మెలానియాలతో పాటు వారి కుమారుడు బారోన్ (14) కు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. -
దగ్గు రాకపోయినా దగ్గితే పనిష్మెంట్
లండన్: ఇప్పట్లో కోవిడ్ దశ ముగిసే సూచనలు కనిపించడం లేదు. దీంతో ఎన్నాళ్లని లాక్డౌన్ అంటూ భయంతో బతుకు వెళ్లదీయడం అని ఒక్కొక్కటిగా అన్నిరకాల కార్యకలాపాలను తెరుచుకునేందుకు అనుమతులు ఇస్తున్నారు. అందులో భాగంగానే బడులకు కూడాఆ పచ్చజెండా ఊపుతున్నారు. దీంతో యునైటెడ్ కింగ్డమ్లో నిన్నటి నుంచే స్కూళ్లు పున: ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా తూర్పు ససెక్స్‌లోని ఆర్క్ అలెక్జాండ్ర అకాడమీ కరోనా వైరస్ రెడ్ లైన్స్ పేరిట ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. "విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా దగ్గకూడదు, తుమ్మకూడదు. కరోనా గురించి ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయరాదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీస దూరం ఉండాల్సిందే. (చదవండి: 66 రోజుల్లో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్?) ఈ ఆంక్షలను ఉల్లంఘించే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వారిని స్కూలు నుంచి ఇంటికి పంపించేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అని పాఠశాల యాజమాన్యం హెచ్చరించింది. ఒక్క మాటలో చెప్పాలంటే దగ్గు రాకపోయినా సరే దగ్గుతూ నటించినా, కరోనా మీద కుళ్లు జోకులు వేసినా వారిపై చర్యలు తప్పవు. కఠినంగా అనిపిస్తోన్న ఈ నిబంధనలను పిల్లలు అలవాటు చేసుకుంటారో, లేదా రూల్స్ అతిక్రమించి పనిష్మెంట్ తీసుకుంటారో! కాగా వీటితో పాటు ప్రభుత్వం ఆదేశించిన నిబంధనలను కూడా విద్యార్థులు పాటించాల్సిందే. ఫేస్ మాస్క్ ధరించడం, ఒకరికి మరొకరికి మధ్య భౌతికదూరం పాటించడం వంటివి తప్పనిసరి. (చదవండి: ‘టీసీ’ లేకున్నా అడ్మిషన్..) -
ఈ ఐదు లక్షణాలు కనిపిస్తున్నాయా.. జాగ్రత్త!
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన నాటి నుంచి జనాల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువయ్యింది. ఇంటి, ఒంటి శుభ్రతతో పాటు తినే ఆహారంలో కూడా తగన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనాకు ముందు బయటి ఆహారాన్నే ఇష్టపడ్డవారు సైతం ఇప్పుడు ఇంటి భోజనమే బెటర్ అంటున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెంచే తిండికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మన శరీరం చూపే కొన్ని లక్షణాలను బట్టి మన రోగనిరోధక శక్తి బలంగా ఉంది లేనిది అనే దాని గురించి తెలుసుకోవచ్చు అంటున్నారు వైద్యులు. అవేంటో చూడండి.. (చదవండి: నాటుకోడి నోరూరిస్తోంది..!) తరచు జలుబు, దగ్గు.. తరచుగా జలుబు చేసినా.. గొంతులో చిరాకుగా ఉండి దగ్గు సూచనలు కనిపించినా మీ ఇమ్యూనిటీ వీక్‌గా ఉన్నట్లే అంటున్నారు నిపుణులు. ఒకవేళ మీకు గనక సంవత్సరంలో నాలుగు సార్లకంటే అధికంగా దగ్గు, జలుబు వచ్చాయంటే మీ ఇమ్మూనిటీ లెవల్స్ బలహీనంగా ఉన్నాయని అర్థం. నిద్ర లేచాక.. భారంగా ఉంటుందా.. రాత్రి నిద్రపోయాక తరచుగా మెలకువ వస్తుందా.. అలానే 7-8 గంటలు నిద్ర పోయి లేచిన తర్వాత కూడా మీకు భారంగా అనిపిస్తుందా. ఈ రెండు ప్రశ్నలకు మీ సమాధానం అవును అయితే.. మీ రోగ నిరోధక శక్తి ప్రమాదంలో ఉన్నట్లే. తరచుగా జీర్ణసంబంధ సమస్యలు తలెత్తడం.. మీరు బయట ఆహారం తిన్నారు.. కడుపులో అనిజీగి ఉందా. అయితే మీ ఇమ్యూనిటీ వ్యవస్థ బలహీనంగా ఉన్నట్లే. ఎందుకంటే రోగనిరోధక శక్తిని పెంచే 70 శాతం కణజాలం జీర్ణవ్యవస్థలోనే ఉంటుంది. కనుక జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే మిగత శరీర భాగాలు కూడా రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. గాయాలు నెమ్మదిగా నయమవుతున్నాయా.. దెబ్బ తగిలినప్పుడు.. కాలినప్పుడు కొత్త చర్మ కణాలు ఉత్పత్తి అయ్యి ఆ గాయాలు మానిపోతాయి. అయితే ఈ ప్రక్రియకు చాలా సమయం తీసుకుంటే.. గాయాలు నెమ్మదిగా మానితే.. మీ రోగనిరోధక శక్తి మందగించిందని అర్థం. అంతేకాక మీ శరీరం, చర్మాన్ని రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలను అందించడం లేదనడానికి గుర్తు. తరచుగా ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారా.. మీరు జలుబు, దగ్గుతో పాటు మూత్ర, చెవి, సైనస్ సమస్యలకు తరచుగా గురవుతున్నారంటే ఇమ్యూనిటీ వీక్‌గా ఉందని అర్థం. మీ రోగనిరోధక వ్యవస్థ మీ శరీరంపై దాడి చేసిన వైరస్లు, బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా తగినన్ని ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయలేకపోతుందనడానికి ఇది సంకేతం. ఈ పైలక్షణాలు మీకు కనిపిస్తే.. వెంటనే మీ రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవడం.. వ్యాయమాలు చేయడం ప్రారంభించండి అంటున్నారు వైద్యులు. (చదవండి: ‘ప్రోటీన్ల’ను పట్టించుకోరేమీ!) -
టీబీ అండ్ కరోనా
టీబీ అనగానే దాని ప్రధాన లక్షణం దగ్గడం గుర్తొస్తుంది. కరోనాలో ముఖ్య లక్షణం దగ్గే. టీబీ వ్యాధి రోగి దగ్గుతున్నప్పుడు అతడిలోనుంచి సూక్ష్మజీవులు ఆరోగ్యకరమైన వ్యక్తిని తాకుతాయి. రోగి తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు, రోగి శ్వాస నుంచి వచ్చిన సూక్ష్మజీవులు కూడా ఆరోగ్యవంతుడిని తాకవచ్చు. కోవిడ్–19లో కూడా అచ్చం అలాగే. కాకపోతే... ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్లస్ అనే బ్యాక్టీరియాతో టీబీ వస్తుంది. నావల్ కరోనా వైరస్ వల్ల కోవిడ్–19 వస్తుంది. టీబీ మనిషి ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. కరోనా కూడా అంతే. అయితే టీబీ కేవలం ఊపిరితిత్తులనే కాదు... మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు, యుటెరస్ వంటి కీలక అవయవాలను సైతం ప్రభావితం చేస్తుంది. కరోనా వైరస్ మాత్రం ఊపిరితిత్తులను మాత్రమే గాక కొంతవరకు జీర్ణవ్యవస్థలోని పేగులనూ, చాలా అరుదైన సందర్భాల్లో మెదడునూ ప్రభావితం చేస్తుంది. ఇక టీబీకీ పూర్తి చికిత్స అందుబాటులోఉంది. కరోనాకు ఇంకా లేదు. కానీ లక్షణాలన్నీ ఒకేలా ఉండటంతో కొన్ని సందర్భాల్లో దేహంలో టీబీ ఉన్నప్పటికీ... ప్రస్తుత నేపథ్యంలో కోవిడ్–19ను తలపించవచ్చు. అందుకే టీబీని గురించి తెలుసుకుంటే... అది చికిత్స ఇంకా అందుబాటులో లేని కోవిడ్–19 కాదనీ... టీబీ కావచ్చని తెలుసుకోవచ్చు. టీబీ, కరోనాల పోలికలూ, తేడాల పట్ల అవగాహన పెంచుకునేందుకే ఈ కథనం. టీబీ ఎలా వ్యాప్తిచెందుతుంది..? టీబీ వ్యక్తి నుంచి వ్యక్తికి సోకుతుంది. అప్పటికే టీబీ ఉన్న వ్యక్తి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తికి సోకిన సూక్ష్మక్రిమి మొదట ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడ పెరగడం మొదలుపెడుతుంది. అలాగే ఈ సూక్ష్మక్రిమి గాలి, వెలుతురు (సరైన వెంటిలేషన్) లేని చోట బాగా పెరుగుతుంది. ధారాళమైన గాలి, వెలుతురు ఉన్న చోట రోగ క్రిమి మనుగడ సాధించలేదు. (అందుకే టీబీకి మంచి మందులు కనుగొనక ముందు టీబీ రోగులను వేరు చేసి ధారాళంగా గాలి, వెలుతురు వచ్చే చోట్ల ఉంచి నయం చేసేవారు. ఆ క్షయ వ్యాధి చికిత్స కేంద్రాలను శానిటోరియమ్స్ అనేవారు). ఇక టీబీ వ్యాధిగ్రస్తులు ఎప్పుడూ తలుపులు మూసి ఉండే ఏసీ గదుల్లో ఉంటే... వారి నుంచి అక్కడ పనిచేసే ఇతరులకూ వ్యాధి సోకే అవకాశం ఎక్కువ. కరోనా విషయంలోనూ అంతే. అది కూడా టీబీ లాగే వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం కరోనాకు మందు లేకపోవడం వల్ల ఈ రోగులు సైతం గాలీ, వెలుతురు బాగా వచ్చే (మంచి వెంటిలేషన్ ఉండే) గదిలో ఒక్కరే (ఐసోలేషన్‌లో) ఉండిపోవాలి. ల్యాటెంట్ టీబీ ఇన్ఫెక్షన్ అంటే...? మన సమాజంలో ఉన్న చాలా మందిలో టీబీ సూక్ష్మక్రిమి లోపల ఉంటుంది. కానీ వారిలో రోగలక్షణాలూ ఉండవు. పూర్తిగా ఆరోగ్యవంతుల్లా ఉంటారు. వీళ్ల నుంచి ఆరోగ్యవంతుడికి వ్యాధి వ్యాపించదు. వీళ్లకు టీబీ పరీక్ష నిర్వహించినప్పుడు టీబీ ఉన్నట్లు తెలుస్తుంది. కానీ కొందరిలో అనేక కారణాల వల్ల వాళ్లలో సహజంగా ఉండే రోగనిరోధకశక్తి తగ్గుతుంది. (ఉదా: డయాబెటిస్, మహిళల్లో గర్భధారణ వల్ల, క్యాన్సర్, ట్రాన్స్‌ప్లాంట్ జరిగినప్పుడు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు, ఎస్‌ఎల్‌ఈ లేదా హెచ్ఐవీ సోకడం వంటి కారణాల వల్ల). అలాంటి వారిలో టీబీ క్రిమి మళ్లీ క్రియాశీలం అయి, వ్యాధి బయటపడుతుంది. మన దేశంలోనైతే... ప్రత్యేకంగా వ్యాధి లక్షణాలను బయటపడ్డప్పుడే చికిత్స అవసరం. లక్షణాలు లేకపోతే మందులు అవసరం లేదు. టీబీ నిర్ధారణ... కళ్ల పరీక్ష: దగ్గినప్పుడు పడే తెమడను పరీక్షించడం ద్వారా టీబీ బ్యాసిల్లై (సూక్ష్మక్రిమి) ఉందా లేదా అని పరీక్షించి, నిర్ధారణ చేయవచ్చు. రెండు రోజుల వ్యవధిలో రోగి నుంచి రెండు కళ్లె శాంపిళ్లను సేకరించి పరీక్ష చేసి దీన్ని నిర్ధారణ చేస్తారు. ఛాతీ ఎక్స్‌రే: ఊపిరితిత్తులకు సోకిన టీబీని ఎక్స్–రే ద్వారా గుర్తించవచ్చు. అలాగని కేవలం ఎక్స్–రే ద్వారానే పూర్తి నిర్ధారణ కూడా సాధ్యం కాదు. ∙చర్మం పరీక్ష: టీబీ నిర్ధారణకు చర్మ పరీక్షను చాలా దేశాల్లో ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా పాశ్చాత్య దేశాల్లో ఇది ల్యాటెంట్ టీబీ నిర్ధారణకు ఉపయోగపడుతుంది. అయితే నేషనల్ కాలేజ్ ఆఫ్ ఛెస్ట్ ఫిజీషియన్స్ (ఎన్‌సీసీపీ), ఐసీఎస్ (ఇండియన్ ఛెస్ట్ సొసైటీ) మార్గదర్శకాల మేరకు... లక్షణాలేమీ కనిపించని ల్యాటెంట్ టీబీకి చికిత్స అవసరం లేదు. టీబీ ఇంటర్ఫెరాన్ గామా రిలీజ్ ఎస్సే (ఐజీఆర్ఏఎస్): దీన్ని ఎక్కువగా క్వాంటిఫెరాన్ టీబీ గోల్డ్ టెస్ట్ అని పిలుస్తారు. ఇది సరికొత్త నిర్ధారణ పరీక్ష. దాంతోపాటు చర్మపు పరీక్షకంటే అధునాతనమైనది, కచ్చితమైనది. ఇక ఇది టీబీ సూక్ష్మక్రిమికి మన శరీరంలోని వ్యాధినిరోధక శక్తి ఏ మేరకు స్పందిస్తుందో అన్న విషయాలనూ తెలుపుతుంది. టీబీ సీరలాజికల్ పరీక్షలు: ఇవి రోగి రక్తాన్ని సేకరించి నిర్వహించే పరీక్షలు. కల్చర్ పరీక్ష : టీబీ సూక్ష్మజీవుల పెరుగుదలను పరీక్షించడం వల్ల టీబీ చికిత్స ప్రక్రియను ఎంపిక చేసేకునేందుకు అవకాశం ఉన్న పరీక్ష ఇది. కరోనా పరీక్ష: గొంతులో ఉన్న స్వాబ్స్ సేకరించడం ద్వారా కరోనా నిర్ధారణ పరీక్ష చేసి వ్యాధి ఉన్నదీ లేనిదీ నిర్ధారణ చేస్తారు. టీబీ చికిత్స : టీబీని పూర్తిగా నయం చేయడానికి రోగి క్రమం తప్పకుండా ఫిజీషియన్ పర్యవేక్షణలో ఉండటం అవసరం. మందుల క్రమం అస్సలు తప్పడానికి వీల్లేదు. కరోనా చికిత్స : ఇప్పటికైతే కరోనా వల్ల వచ్చే కోవిడ్–19కు లక్షణాల ఆధారంగానే చికిత్స ఉంది. రెమ్డిస్విర్, ఫావిపిరావిర్ లాంటి మందులు మార్కెట్లోకి వచ్చినప్పటికీ అవి మైల్డ్‌గా, మాడరేట్‌గా ఉన్న వ్యాధిని మరింత తీవ్రతరం కాకుండా నియంత్రించేవే తప్ప... పూర్తిగా నయం చేసే మందులు కావు. అయితే టీబీకి పూర్తి చికిత్స అందుబాటులో ఉంది. ఒకవేళ పూర్తి చికిత్స తీసుకోకపోతే ఇది అత్యంత ప్రమాదకారిగా మారవచ్చు. మృత్యువుకూ దారి తీయవచ్చు. కరోనాకు మందులేకపోయినా... ఒకవేళ మైల్డ్‌గా ఉండి మందులేమీ వాడకపోయినా తగ్గవచ్చు. అందుకే కరోనాకైనా మందులు వాడాల్సిన అవసరం ఉండదేమోగానీ...టీబీకి మాత్రం తప్పక వాడాల్సిందే. దగ్గు, జ్వరంతో వ్యాధిని కల్పించే కారకాల్లో టీబీ... బ్యాక్టీరియా వల్ల; కోవిడ్–19 కరోనా వైరస్ వల్ల వచ్చి... లక్షణాలూ, వ్యాపించే తీరు దాదాపుగా ఒకేలా ఉన్నప్పటికీ టీబీ – కరోనాల విషయంలో పోలికలూ, తేడాలను గుర్తించి, రెండింటి పట్ల అవగాహన పెంచుకుని, ఇరు వ్యాధుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం అవసరం. వ్యాప్తిలోనూ పోలికే... టీబీ సూక్ష్మక్రిమి సోకినంతనే ఆరోగ్యవంతుడు వ్యాధిబారిన పడడు. అతడిలో రోగ లక్షణాలేమీ బయటపడవు. అలాంటి వారిని ల్యాటెంట్ టీబీ ఇన్ఫెక్షన్ ఉన్నట్లుగా చెబుతారు. అయితే ఏదైనా కారణం వల్ల వ్యక్తికి రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు వ్యాధి బయటపడుతుంది. అయితే అదృష్టవశాత్తూ ఇప్పుడు టీబీని పూర్తిగా నయం చేయగల మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని డాక్టర్లు నిర్దేశించిన ప్రకారం... ఆ కాలపరిమితి పొడవునా తప్పనిసరిగా మందులు వాడాలి. అలాగే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వ్యక్తులోనూ కరోనా వైరస్ సోకగానే అతడికి కోవిడ్–19 రాకపోవచ్చు. అలా లక్షణాలేమీ కనపడకుండానే కొందరిలో తగ్గిపోవచ్చు. సరికొత్త పరిశోధనల ప్రకారం ఇలా లక్షణాలేమీ లేనివారు (ఎసింప్టమ్యాటిక్) కోవిడ్–19ను వ్యాప్తి చేయలేరు. కానీ కొద్దిపాటి లక్షణాలు కనిపించడం ప్రారంభం కాగానే (ప్రి–సింప్టమ్యాటిక్) మాత్రం కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తారని అధ్యయనాల్లో తేలింది. టీబీ అండ్ కరోనా లక్షణాలలో పోలికలు శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు టీబీ క్రిమి పెరగడం ప్రారంభిస్తుంది. అది తనను వృద్ధి చేసుకుంటూ ఉండటంతో రోగలక్షణాలు బయటపడతాయి. ఒకసారి వృద్ధి చెందడం మొదలుపెట్టాక అది వేర్వేరు కణజాలాలపై దాడి చేసి వాటిని నాశనం చేయడం మొదలుపెడుతుంది. అది ఊపిరితిత్తుల కణజాలాన్ని నాశనం చేయడం మొదలుపెడితే కొందరిలో ఊపిరితిత్తులకు కన్నం పడే అవకాశం కూడా ఉంది. ఊపిరితిత్తుల్లో సూక్ష్మక్రిమి ఉన్నప్పడు... కనిపించే లక్షణాలివి... ∙విపరీతమైన దగ్గు... కనీసం మూడు వారాల పాటు ఎడతెరిపి లేకుండా దగ్గుతుంటే టీబీ కావచ్చని అనుమానించవచ్చు ∙ ఛాతీలో నొప్పి ∙బలహీనంగా ఉండటం, విపరీతమైన నీరసం ∙బరువు గణనీయంగా తగ్గడం ఆకలి లేకపోవడం ∙చలిజ్వరం ∙జ్వరం ప్రధానంగా సాయంత్రాలు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుండటం ∙రాత్రివేళల్లో చెమటలు పట్టడం. అయితే అది ఎలాంటి దగ్గు అయినప్పటికీ మూడు వారాల పాటు అదేపనిగా కనిపిస్తే తప్పక టీబీ అని అనుమానించాలి. అయితే జ్వరం అనేది టీబీ, కరోనా... ఈ రెండు జబ్బుల్లో ఉన్నప్పటికీ... కరోనా విషయంలో మాత్రం ఇలా రాత్రిళ్లు చెమటలు పట్టడం, సాయంత్రాలు మాత్రమే ఉష్ణోగ్రత పెరగడం ఉండకపోవచ్చు. -
ఇది.. ఆ దగ్గేనా?
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి రావడంతో అనుమానితుల తాకిడి పెరిగింది. వైద్యుల ధ్రువీకరణతో ఈ పరీక్షలు చేయాల్సి ఉండగా.. కాస్త లక్షణాలు కనిపించిన వారు కూడా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వ ల్యాబ్‌లో నిర్దేశించిన లక్షణాలున్న వారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. లక్షణాలు లేని వాళ్లను తిరస్కరిస్తుండటంతో ప్రైవేటు ల్యాబ్‌ల వైపు పరుగులు పెడుతున్నారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష ఫీజును ప్రభుత్వం రూ.2,200గా నిర్ణయించింది. అయితే ఇంటి వద్దకు వచ్చి శాంపిల్ సేకరించే ప్రైవేటు ల్యాబ్‌కు పరీక్ష ఫీజును రూ.2,800గా స్వీకరించే వెసులుబాటు కల్పించింది.(ఈ మాస్క్ ఉంటే చాలు.. వైరస్ ఖతం) వాతావరణ మార్పులతోనే.. కరోనా వైరస్ పరీక్షల నిర్ధారణకు తీవ్రమైన దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తెమడ, వాసన, రుచి గుర్తించే గుణాల్ని కోల్పోవడం లాంటి లక్షణాలుండాలి. కానీ ప్రస్తుతం ప్రైవేటు ల్యాబ్‌లు ఈ లక్షణాల్లో కొన్ని ఉన్నా.. కొన్ని సందర్భాల్లో లేకున్నా పరీక్షలు చేస్తున్నా యి. వాతావరణంలో వస్తున్న మార్పులతో శరీరంలో మార్పులు జరుగుతాయి. ఈ క్రమంలో జలుబు, దగ్గు రావడం సహజమే. కానీ ఈ లక్షణాలను కరోనాకు సంబంధించినవిగా పరిగణిస్తున్నారు. ప్రభుత్వం కరోనా మార్గదర్శకాలు విడుదల చేసినా కొందరు కరోనా పరీక్షలు చేయించుకునేందుకు మొగ్గు చూపుతుండగా.. ప్రైవేటు ల్యాబ్‌లు దీన్ని సొమ్ము చేసుకుంటున్నాయి.(మళ్లీ లాక్డౌన్ ఉండదు) సాధారణంగా ప్రభుత్వ ల్యాబ్‌లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్‌గా రిజల్ట్ వస్తే వెంటనే వైద్య శాఖ యంత్రాంగం అప్రమత్తమవుతుంది. కానీ, మంగళవారం ఓ డయాగ్నస్టిక్ సెంటర్లో కరోనా పరీక్ష నిర్వహించుకున్న ఓ అమ్మాయికి పాజిటివ్‌గా తేలింది. వైద్య శాఖ అధికారులు, స్థానిక ఏఎన్ఎం, ఆశ కార్యకర్త నుంచి ఫోన్ రాకపోవడంతో సదరు ల్యాబ్ నిర్వాహకులు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారా? లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ల్యాబ్‌ల్లో పరీక్షల వేగం పెరిగింది. క్షేత్రస్థాయిలో పరీక్షల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 50 వేల పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. అలాగే ఇతర ప్రభుత్వ ల్యాబ్‌ల్లో, మెడికల్ కాలేజీల్లోనూ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు వేగవంతం చేశారు. దీంతో ప్రభుత్వ ల్యాబ్‌ల్లో పరీక్షల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. -
ఒక్కసారి కూడా దగ్గు రాకపోతే?
మనిషి అన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా? అని మనం చాలాసార్లు అనుకుంటాంగానీ మనిషన్న వాడు ఒక్కసారి కూడా దగ్గకుండా ఉంటాడా? అని అనుకోం. ఎందుకంటే అది అసాధ్యం కాబట్టి! ఊపిరితిత్తుల అంతరాళాల నుంచి వెలువడే పేలుడు లాంటి దగ్గును నిభాయించుకోవటం అంత సులువేమీ కాదు. ఒకవేళ ఇదే జరిగిందనుకోండి. నిజానికి దగ్గు అనేది ఊపిరితిత్తుల్లో మొదలు కాదు. మనం ఊపిరి తీసుకునే క్రమంలో గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకునేటప్పుడే మొదలవుతుంది. ఛాతీ, కడుపు, డయాఫ్రంలలోని కండరాలు ఒక్కసారి కుంచించుకుపోతాయి. మామూలుగానైతే ఇది మన ముక్కులు, నోటి నుంచి గాలిని బయటకు తోస్తాయి కానీ కొండ నాలుక అడ్డుగా ఉంది కాబట్టి ఊపిరితిత్తుల్లో ఒత్తిడి పెరిగిపోతుంది. కొండ నాలుక తెరుచుకోగానే ఈ ఒత్తిడితో కూడిన గాలి మొత్తం నోటి ద్వారా వేగంగా బయటకు వస్తుంది. ఈ క్రమంలోనే ఖళ్లు ఖళ్లు మన్న శబ్దాలూ వెలువడతాయి. ఒకవేళ మనిషికి దగ్గు అనేది రాకపోతే కొండనాలుక మూతపడదు కాబట్టి ఊపిరితిత్తులు, అన్నవాహికలో గాలి చిక్కుకుపోదు. ఖళ్లు ఖళ్లు మన్న శబ్దాలూ ఉండవు. భలే ఉందే ఇది.. ఇలాగే జరిగితే బాగుంటుంది కదా అనుకుంటున్నారా? అక్కడే ఉంది చిక్కు. దగ్గు అనేది లేకపోతే మన గొంతు, శ్వాస వాహికలను చికాకుపెట్టే దుమ్ము, ధూళి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరిపోతాయి. వాటితోపాటు వచ్చే బ్యాక్టీరియా కూడా అక్కడే మకాం వేస్తుంది. వేగంగా అనారోగ్యం బారిన పడిపోతాం. ఆ విషయం మీకు తెలియను కూడా తెలియదు. ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువ అవుతుంది. శ్వాస ఆగిపోతుంది. దీంతో జనాలు దుమ్ము, ధూళి ఊపిరితిత్తుల్లోకి చేరకుండా ఉండేందుకు బహిరంగ ప్రదేశాల్లో తిరగడం నిలిచిపోతారు. అంటే ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తుందన్నమాట. ఇది మళ్లీ మానసిక కుంగుబాటుకు, ఆందోళనకు దారితీస్తుంది. పనిచేయబుద్ధి కాదు. ఉత్పాదకత తగ్గుతుంది. ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతాయి. మీకు తెలుసా? ఒక వ్యక్తి రోజులో కనీసం 11సార్లు దగ్గుతారట. మన మనుగడకు దగ్గు ఎంత ముఖ్యమైనదంటే వైద్యులు ఇటీవలి కాలంలో ఊపిరితిత్తుల్లోని కఫాన్ని బయటకు తోసేసేందుకు రోగులతో బలవంతంగా దగ్గిస్తున్నారు. దీనికి అసిస్టివ్ కాఫ్ అని పేరు. అదృష్టం ఏమిటంటే కనురెప్పలు మూసినంత సహజంగా మనం దగ్గగలగడం. కావాల్సినప్పుడు ఆన్/ఆఫ్ చేయలేకపోవడం. కాబట్టి... దగ్గు వచ్చిందనుకోండి... ముఖానికి ఏదో ఒకటి అడ్డుపెట్టుకొని ఖళ్లు ఖళ్లు మనిపిస్తే సరి! అయితే వీలైనప్పుడల్లా చేతులు కడుక్కోవడం మరిచిపోకండి సుమా! -
కరోనా: దగ్గుతున్నాడని కాల్చేశాడు
నోయిడా: కరోనా వైరస్‌ను వ్యాపింపజేసేందుకే దగ్గుతున్నాడని భావించి ఓ వ్యక్తిపై మరొక వ్యక్తి కాల్పులు జరిపిన ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి 9 గంటలకు దయానగర్ గ్రామంలోని ఆలయం వద్ద నలుగురు వ్యక్తులు ల్యూడో గేమ్ ఆడుతున్నారు. అందులో ఒకరైన ప్రశాంత్ సింగ్ అలియాస్ పర్వేశ్ (25) ఆట మధ్యలో దగ్గాడు. కరోనా వ్యాపింపజేసేందుకే దగ్గుతున్నావంటూ ఆట ఆడుతున్న మరో వ్యక్తి జైవీర్ సింగ్ అలియాస్ గుల్లు (30) పర్వేశ్‌తో గొడవపడ్డాయి. గొడవ తీవ్రం కావడంతో జైవీర్ సింగ్ తన వద్ద ఉన్న తుపాకీతో పర్వేశ్‌పై కాల్పులు జరిపి పారిపోయాడు. బాధితున్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కరోనా బాధితుల్లో దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. చదవండి: 12 వేలకు అడుగు దూరంలో.. -
ఒక టీస్పూన్ లాలాజలంలో ఎంత వైరసో తెలుసా?
అంటుకుంటే వదలదు...అక్షరాలా.. యాభై వేల కోట్లు! కోవిడ్ బాధితుడి ఒక టీస్పూన్ లాలాజలంలో ఉండే కరోనా వైరస్ల సంఖ్య ఇది. ఒక్క దగ్గు లేదా తుమ్ము చాలు.. ఈ వేల కోట్ల వైరస్లలో కొన్ని తుంపర్లతో కలిసి పరిసరాల్లోకి చేరిపోయేందుకు.. ఆ క్షణంలో ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నా సరే.. కొంచెం అటుఇటుగా 32,456 వైరస్లు నోరు, గొంతు పైపొరల్లోకి చేరిపోతాయి. ఆ సెకను నుంచి శరీరంలో వైరస్లు ఇబ్బడిముబ్బడి కావడం మొదలవుతుంది. ఆ తరువాత ఒక్కో దశలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే..కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలు ఇంతటి కఠిన చర్యలు ఎందుకు తీసుకుంటున్నాయో ఇట్టే అర్థమైపోతుంది. సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ (కోవిడ్-19) బాధితుడు ఒక్కసారి తుమ్మినా, దగ్గినా కోటానుకోట్ల వైరస్లు పరిసరాల్లోని ఉపరితలాలపై చేరిపోతాయి. చేతిని అడ్డం పెట్టుకుని ఉంటే ఆ చేతులతో తాకిన ప్రతిచోటా వైరస్ ఉండిపోతుంది. ఉపరితలాన్ని బట్టి ఈ వైరస్ రెండు గంటల నుంచి మూడు రోజుల పాటు సజీవంగా ఉంటుందని ఇటీవలే అమెరికాలో జరిగిన పరిశోధన ఒకటి స్పష్టం చేసింది. అంటే.. తరచూ చేతులు శుభ్రం చేసుకుంటున్నా.. మనుషులకు మీటర్ ఎడంగానే ఉంటున్నా కొంచెం కష్టమైనా సరే.. బలవంతంగా చేతులను ముఖానికి తాకకుండా జాగ్రత్త పడుతున్నా కూడా వైరస్ బారిన పడే అవకాశాలు ఇంకా మిగిలే ఉంటాయన్నమాట. ఒక్కసారి ఒక వ్యక్తి శరీరంలోకి ప్రవేశించిన తరువాత వైరస్ ఎలా ప్రవర్తిస్తుంది? ఎంత చేటు తెస్తుందన్నది చూస్తే... (కరోనా వ్యాప్తి: మాస్క్.. మాఫియా..!) తుమ్మినా... దగ్గినా..మాట్లాడినా డేంజరే... కరోనా వైరస్ బాధితుడు ఒక్క మాట మాట్లాడితే చాలు.. అతడి గొంతు నుంచి పైకి వచ్చే గాలి ద్వారా వైరస్‌లతో కూడిన చిన్నచిన్న తుంపరలు బయటకు వచ్చేస్తాయి. కొన్ని వైరస్లు ఇతరులు తినే ఆహారంపై చేరిపోవచ్చు. మరికొన్ని వేళ్లమధ్యలో ఉండిపోవచ్చు. మరికొన్ని ముక్కు ద్వారా సైనస్‌లోకి చేరి మళ్లీ గొంతులో స్థిరపడిపోవచ్చు. ఈ దశలో ఒక్క షేక్‌హ్యాండ్ ఇచ్చినా సరే.. అవతలి వ్యక్తి చేతులపై కనీసం 43,654 వైరస్లు పోగుపడతాయని, షేక్‌హ్యాండ్ పూర్తయ్యేసరికి ఈ సంఖ్య 3,12,405కు చేరుతుందని అంచనా. ఇప్పుడు గొంతులో మిగిలిపోయిన వైరస్ల సంగతి చూద్దాం. కొన్ని వైరస్లు లాలాజలపు చుక్కలతో కలిసి ఊపిరితిత్తుల్లోని ఒక కొమ్మపై చేరిపోతాయి. వెచ్చగా, తడిగా ఉండే కణజాలంపై ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. ఈ వైరస్లు ఎంత సూక్ష్మస్థాయిలో ఉంటాయంటే.. మన వెంట్రుకను ఫుట్‌బాల్ మైదానం అంత సైజుకు పెంచితే వైరస్ సైజు నాలుగు అంగుళాలు మాత్రమే ఉండేంత! (జనతా కర్ఫ్యూ: ఆ 14 గంటల్లో ఏం జరగబోతుంది?) -
కాఫ్ & క్లూస్
గాలిని నిరంతరం ఊపిరితిత్తుల్లోకి పీల్చుకుని మళ్లీ వదిలేసే ప్రక్రియే శ్వాసక్రియ. నోరు, ముక్కు నుంచి ఊపిరితిత్తుల మార్గమధ్యంలో... అంటే సరిగ్గా గొంతులో గ్లాటిస్ అనే భాగం ఉంటుంది. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన గాలి ఆ గ్లాటిస్నుంచి ఒక్కసారిగా బలంగా నోటి నుంచి బయటకు రావడాన్ని ‘దగ్గు’ అంటారు. అది ఒకే ఒకసారి రావచ్చు. లేదా అలా వస్తూనే ఉండవచ్చు. దగ్గులో రకాలు... తడి దగ్గు : మన ఊపిరితిత్తుల్లో వాయువుల మార్పిడి జరిగే చోట తడిగా ఉంచేందుకు కొన్ని స్రావాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఈ స్రావాలు మామూలుగానైతే బయటకు రావు. ఏవైనా కారణాల వల్ల ఈ స్రావాల ఉత్పత్తి సాధారణం కంటే ఎక్కువగా జరుగుతుంటే దగ్గుతో పాటు అవి బయటకు వస్తుంటాయి. అలా వచ్చేదాన్ని తడి దగ్గు (వెట్ కాఫ్) అంటారు. పొడి దగ్గు : దగ్గుతున్నప్పుడు స్రావాలు ఏమీ రాకుండా వచ్చే దాన్ని పొడి దగ్గు అంటారు. తడి, పొడి దగ్గులను బట్టి కొన్ని వ్యాధులను తొలిదశలో ప్రాథమికంగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు పొడి దగ్గు వస్తుంటే వ్యాధి శ్వాసకోశనాళాల తొలి భాగం (అప్పర్ రెస్పిరేటరీ ఎయిర్–వే)లో ఉందని, తడి దగ్గు అయితే ఊపిరితిత్తుల్లోపల వ్యాధులు (బ్రాంకైటిస్, నిమోనియా, ఆస్తమా) ఉండవచ్చునని డాక్టర్లు ఒక అంచనాకు వస్తుంటారు. రాత్రీ – పగలూ తేడాను బట్టి... దగ్గు వచ్చే వేళల్లో తేడాను బట్టి కొన్ని వ్యాధిలను అనుమానించవచ్చు. రాత్రి వేళల్లో దగ్గు వస్తుంటే అది అలర్జీ కారణంగా వస్తుందని అనుమానించవచ్చు. మధ్యాహ్నం పూట దగ్గు ఎక్కువగా ఉంటే దానికి ఏవైనా ఇన్ఫెక్షన్స్ కారణం కావచ్చని ఊహిస్తారు. తెమడను బట్టి... తడి దగ్గు వచ్చే సమయంలో బయటకు వచ్చే తెమడ /కళ్లె (స్ఫుటమ్/ఫ్లెమ్) రంగును బట్టి రకరకాల వ్యాధులను అనుమానించి, వాటికి తగిన విధంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించవచ్చు. ఉదాహరణకు ►ఆకుపచ్చరంగులో తెమడ ఉంటే... సూడోమొనాస్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల దగ్గు వస్తుండవచ్చు. ►పసుపుపచ్చగా ఉంటే... క్లెబ్సిల్లా నిమోనియా ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. ►ఎర్రగా ఉంటే... సూడోమొనాలీ, నీమోకోకల్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు ఎర్రరంగులో కళ్లెపడవచ్చు. ►నలుపు రంగులో ఉంటే... కాలుష్యం బారిన పడటం, పొగతాగడం వంటివి జరిగి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వస్తే అప్పడు దగ్గుతో పాటు వచ్చే కళ్లె నల్లగా ఉండవచ్చు. మరెన్నో జబ్బులకు సూచిక... దగ్గుతో అలర్జీ, టీబీ, నిమోనియా వంటి జబ్బులని అనుమానించవచ్చు. అలాగే... ►ఊపిరితిత్తుల్లో నీరు నిలిచిపోయే ప్లూరల్ ఎఫ్యూజన్ ►కీళ్ల నొప్పులతో వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ►కీళ్లకు సంబంధించిన లూపస్ అరిథమెటోసిస్ వంటి జబ్బులు ఉన్నప్పుడు కూడా పొడి దగ్గు వస్తూ ఉంటుంది. క్యాన్సర్లలో... స్వరపేటిక, ఊపిరితిత్తులు, నోటికి సంబంధించి క్యాన్సర్లలో మొదటి లక్షణంగా దగ్గు కనిపించవచ్చు. చికిత్స ఏ కారణం వల్ల దగ్గు వస్తోందో నిర్ధారణ చేశాక దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. సాధారణంగా దగ్గు కనిపించగానే చాలామంది మందుల దుకాణాల్లో దొరికే దగ్గు మందులు వాడుతుంటారు. దాంతో తాత్కాలిక దగ్గు తగ్గినా వ్యాధి మాత్రం అలాగే లోపల ఉండిపోతుంది. అసలు ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తుందంటేనే అది లోపలేదో తీవ్రమైన సమస్య ఉందని చెప్పడానికి ఒక సూచన. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా పూర్తిస్థాయి చికిత్స తీసుకోవాలి. దగ్గు వచ్చిన సందర్భాల్లో సాధారణంగా యాంటీబయాటిక్స్, యాంటీ టీబీ మందులు, శ్వాసనాళాలను వెడల్పు చేసే బ్రాంకోడయలేటర్స్, తెమడను బయటకు తెచ్చే మందులైన ఎక్స్పెక్టరెంట్స్ వంటి మందులు ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆవిరి పట్టడం కూడా దగ్గు నుంచి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. వృద్ధాప్యంలో దగ్గు ఎడతెరిపిలేకుండా వస్తుంటే కేంద్ర నాడీ వ్యవస్థలో దగ్గును ప్రేరేపించే కేంద్రాన్ని ఉపశమింపజేయడానికి కోడిన్ వంటి మందులు ఉపయోగిస్తారు. వయసును బట్టి.. దగ్గు కనిపించినప్పుడు రోగి వయసును బట్టి కూడా దాని కారణాన్ని అంచనా వేస్తుంటారు. ఉదాహరణకు... ►పిల్లల్లో (ఇన్‌ఫాంట్స్ మొదలుకొని ఐదేళ్ల వరకు) దగ్గు వస్తుంటే అది ఏదైనా బయటి పదార్థం (ఫారిన్‌బాడీ) ఊపిరితిత్తుల్లోపలికి వెళ్లడం వల్ల కావచ్చునని డాక్టర్లు అనుమానిస్తారు. అంటే... సాఫ్ట్టాయ్స్లో ఉండే నూగు, రగ్గుల్లో ఉండే నూలు, దుమ్ము, ధూళి వంటివి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించినప్పుడు వచ్చే అలర్జీ వల్ల దగ్గు రావచ్చు. ►గొంతు, ముఖంలో ఉండే ఖాళీ ప్రదేశాలైన సైనస్‌లు, శ్వాసనాళంలోని కింది భాగమైన బ్రాంకైలలో వైరల్ ఇన్ఫెక్షన్తో దగ్గు రావచ్చు. ►పిల్లల్లో బోర్డెటెల్లా పెర్ట్యుసిస్ అనే బ్యాక్టిరియమ్ ఇన్ఫెక్షన్ వల్ల నిరంతరాయం దగ్గు రావచ్చు. దీన్నే మనమంతా ‘కోరింత దగ్గు’ (ఊఫింగ్ కాఫ్) అంటుంటాం. అంతేకాదు... మరికొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా దగ్గురావచ్చు. ►పిల్లల్లో గుండె కవాటాలు, గుండె గోడల్లోని చిల్లులకు సంబంధించిన వ్యాధులు (వీఎస్డీ, ఏఎస్డీ, పీడీఏ) వంటివి ఉన్నప్పుడు కూడా దగ్గు ఎక్కువగా కనిపిస్తుంది. దాంతోపాటు ఆయాసం కూడా ఉంటుంది. కొందరు పిల్లలు నీలంగా మారిపోతుంటారు. ఇలా నీలంగా మారే లక్షణాన్ని ‘సైనోసిస్’ అంటారు. దగ్గుతో పాటు ఈ లక్షణం కనిపిస్తే దాన్ని గుండె జబ్బుగా అనుమానించి తక్షణం చికిత్స అందించాలి. ఐదేళ్ల నుంచి 14 ఏళ్ల పిల్లల్లో... దగ్గు ఎక్కువగా వస్తుంటే అలర్జీ వల్ల శ్వాసనాళాలు కుంచించుకుపోయాయేమో అని అనుమానించాలి. ఎందుకంటే... అలర్జీ కారణంగా వచ్చే ఆస్తమాలో పిల్లికూతల (వీజింగ్) కంటే మొట్టమొదటగా దగ్గు కనిపిస్తుంటుంది. పెద్దల్లో వచ్చే దగ్గు... పొగతాగడం వల్ల : పొగతాగేవారిలో ఊపిరితిత్తులోకి అనేక విషపూరితమైన రసాయనాలు వెళ్తాయి. పొగతాగడం అలవాటయ్యాక తొలి సిగరెట్లోలా వెంటనే దగ్గు రాకపోయినా, సుదీర్ఘకాలం పొగతాగిన వారిలో ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్ల దగ్గు వస్తూ నల్ల రంగులో తెమడ కూడా పడుతుంటుంది. అలర్జీతో : పెద్దల్లో తగ్గు వస్తుంటే అది అలర్జీ వల్ల అయి ఉంటుందని అనుమానించాలి. ఇన్ఫెక్షన్లతో : టీబీ వ్యాధి ఉన్నవారిలో దగ్గు ప్రధానంగా కనిపిస్తుంది. మన జనాభాలో 75 శాతం నుంచి 85 శాతం మంది దేహాల్లో టీబీకి సంబంధించిన బ్యాక్టీరియా ఉంటుంది. అయితే మనలోని వ్యాధి నిరోధకశక్తి (ఇమ్యూనిటీ) వల్ల అది నిర్వీర్యంగా అలా ఉండిపోతుంది. కాని... కొందరిలో ఏవైనా ఇన్ఫెక్షన్లతో వ్యాధినిరోధక శక్తి లోపించినప్పుడు టీబీ వ్యాధి బయటపడుతుంది. అయితే టీబీ ఉన్న ప్రతివారికీ అలా ఎడతెరిపి లేకుండా దగ్గు రాదు. అప్పుడప్పుడు మాత్రమే దగ్గు వస్తూ, కొందరిలో తెమడ పడుతుంది. అయితే సాయంత్రం వేళల్లో శరీర ఉష్ణోగ్రత (టెంపరేచర్) పెరుగుతుంది. ఈ మూడు లక్షణాలు కనిపిస్తూ సాయంత్రం వేళ జ్వరం కనిపిస్తున్నప్పుడు అది టీబీ వ్యాధి కావచ్చేమోనని అనుమానించాలి. అంతేకాదు... టీబీ కనిపించిందంటే... వారిలో వ్యాధినిరోధకశక్తి తగ్గడానికి హెచ్ఐవీ లాంటి కారణాలేమైనా ఉన్నాయా అని తగిన పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది. నిమోనియా: ఈ కారణంగా వచ్చే దగ్గుతో పాటు తెమడ ఆకుపచ్చగా లేదా పసుపు రంగులో పడవచ్చు. కొన్ని రకాల మందులు : పెద్దలకు హైబీపీ తగ్గించే కొన్ని మందులు వాడుతున్నప్పుడు వారిలో కొందరిలో దగ్గు కనిపించవచ్చు. ఈ మందులు ఆపగానే దగ్గు తగ్గిపోతుంది. అలాంటప్పుడు వారికి మందులు మార్చాల్సి ఉంటుంది. వృద్ధుల్లో... వయసు పెరుగుతున్న కొద్దీ మనలో తెమడను బయటకు పంపించే శక్తి (కాఫ్ రిఫ్లక్స్) తగ్గుతుంది. దాంతో తెమడ శ్వాసనాళంలోనే ఇరుక్కుపోవడంతో వృద్ధుల్లో దగ్గు చాల సాధారణంగా కనిపిస్తుంటుంది. నివారణ ఇలా... ►మన పరిసరాలను, వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ►పొగతాగే దురలవాటును పూర్తిగా మానేయాలి. ►సరిపడని వారు పెంపుడు జంతువుల నుంచి దూరంగా ఉండాలి. ►పక్కబట్టలను శుభ్రంగా ఉంచుకోవాలి. ►పుస్తకాల అరలను సాధ్యమైనంతవరకు మూసి ఉంచాలి ►వీలైనంత వరకు ఘాటైన వాసనలు వచ్చే సుగంధద్రవ్యాలు (పెర్ఫ్యూమ్స్)ను ఉపయోగించకపోవడం వంటి జాగ్రత్తలతో దగ్గునుంచి దూరంగా, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చు. డాక్టర్ జి. హరికిషన్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ చెస్ట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
వాతావరణంలో మార్పులతో... వెంటనే తుమ్ములు, జలుబు
మా పాప వయసు 12 ఏళ్లు. వాతావరణంలో మార్పులు వచ్చాయంటే చాలు... అదేపనిగా తుమ్ములు, జలుబు, ముక్కుదిబ్బడతో బాధపడుతూ ఉంటుంది. స్కూల్‌కు కూడా పోవడం లేదు. మా పాప సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? అలర్జీ గురించి మనం సాధారణంగా రోజూ వింటూ ఉంటాం. అలర్జీ అనేది రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన ఒక రుగ్మత. వర్షాకాలం తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం ఇస్తుంది. అలాగే అది పలు రకాల వ్యాధులతో బాధపెట్టవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వర్షాకాలంలో అలర్జీ సమస్య చాలామందిని వేధిస్తూనే ఉంటుంది. తుమ్ములూ, దగ్గులు మాత్రమే కాదు... ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఈ జలుబు, దగ్గు రావడం సహజంగా వైరల్ జ్వరాలకు దారితీస్తుంది. వర్షాకాలంలో ఆస్తమా, అలర్జీ, బ్రాంకైటిస్, ఫ్లూ వంటి వ్యాధులను ఎక్కువగా చూస్తుంటాం. అలాగే మన ఆధునిక జీవితం, పారిశ్రామిక ప్రాంతాలు, పెద్ద పెద్ద నగరాలూ, పట్టణాల్లో వాతావరణ కాలుష్యం కూడా ఈ అలర్జీకి ఒక పెద్ద కారణం. అలర్జీతో ఇబ్బందులు పడేవారి బాధ వర్ణనాతీతం. వయసుతో నిమిత్తం లేకుండా చిన్నా పెద్దా అందరూ అలర్జీతో బాధపడుతుంటారు. అలర్జీని కలిగించే పదార్థాలను ‘అలర్జెన్స్’ అంటారు. అలర్జీతో బాధపడేవారిలో వారు ఏదో ఒక ప్రత్యేకమైన పదార్థానికి దగ్గరగా వచ్చినప్పుడు లేదా దాన్ని తీసుకున్నప్పుడు మన రక్తంలో ఉండే ఒక రకమైన యాంటీబాడీస్‌తో ఈ అలర్జెన్స్ కలవడం వల్ల హిస్టమిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. దీని కారణంగానే వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతాయి. ఒక వ్యక్తి తాలూకు తత్వం, వాతావరణం, వంశపారంపర్య చరిత్రతో పాటు గాలి, నీరు, ఆహారంలో మార్పులు, కాలుష్యాల వల్ల రక్తంలో జరిగే మార్పులతో ఈ లక్షణాలు బయటపడతాయి. అం్ట కొన్ని రకాల పదార్థాలు, వస్తువులు ఈ అలర్జీకి కారణమవుతాయన్నమాట. కారణాలు : ►దుమ్ము, ►పుప్పొడి రేణువులు ►పెంపుడు జంతువుల వెంట్రుకలు ►ఘాటైన వాసనలు ►చల్లటిగాలి ►శీతలపానియాలు ఐస్‌క్రీమ్‌లు ►మస్కిటో రిపల్లెంట్స్ వాతావరణంలో మార్పులు లక్షణాలు : ►తుమ్ములు ►ఆయాసం ►శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు / ఉబ్బసం ►వాంతులు ►ముక్కుకారడం ►ఒంటిపై దద్దుర్లు ►కళ్లు దురదలు పెట్టడం. వ్యాధి నిర్ధారణ : సీబీపీ, ఈఎస్ఆర్, ఇజినోఫిల్ కౌంట్, ఐజీ–ఈ యాంటీబాడీస్, ఎక్స్‌రే, పల్మునరీ ఫంక్షన్ టెస్ట్, సీటీ స్కాన్, అలర్జిక్ ప్రొఫైల్... మొదలైనవి. చికిత్స : హోమియోలో అలర్జీ నుంచి పూర్తిగా ఉపశమనం కలిగించే మందులు అందుబాటులో ఉన్నాయి. అవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. వాటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే అలర్జీ సమూలంగా తగ్గిపోతుంది. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఒళ్లంతా తెల్లటి మచ్చలు... తగ్గేదెలా? నా వయసు 42 ఏళ్లు. నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. మొదట్లో కాస్త చిన్నవిగా ఉండి, ఇప్పుడు క్రమంగా పెద్దవవుతూ అందరూ గమనించేలా ఉంటున్నాయి. ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాను. నాకు హోమియోలో పరిష్కారం సూచించండి. శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్ కూడా ఉంటాయి. ఏ ప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. ఇప్పుడు మీరు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల లోపిస్తుంది. దాంతో మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. ►బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు. డిప్రైషన్, యాంగై్జటీ న్యూరోసిస్ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు. ►పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు. ►జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు. దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు : ►ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల గానీ, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు కనిపించవచ్చు. ►మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ►కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్స్ లోపాలు, డయాబెటిస్‌లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది. ►వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల మన సొంతకణాలే మనపై దాడి చేయడం వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది. లక్షణాలు : మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాల్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు. చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
శబ్దాలను బట్టి జబ్బులు గుర్తించే ఆప్!
పిల్లలు అదేపనిగా దగ్గుతున్నప్పుడు, సమస్య ఏమిటో తెలుసుకునేందుకు మనం వారిని డాక్టర్ దగ్గరకు తీసుకెళతాం. అయితే ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల ప్రయోగాలు ఫలిస్తే సమీప భవిష్యత్తులోనే సమస్య ఏమిటో ఇంట్లోనే గుర్తించవచ్చు. అదెలాగంటారా? చాలా సింపుల్.. దగ్గు తాలూకూ ధ్వనుల ద్వారా జబ్బు ఏమిటో తెలుసుకునేందుకు వీరు ఒక స్మార్ట్‌ఫోన్ యాప్‌ను తయారు చేస్తున్నారు మరి. ఆసుపత్రిలో చేరిన పిల్లలు (29 రోజుల వయసు నుండి 12 ఏళ్ల వయసు వరకూ) దగ్గినప్పుడు వచ్చే శబ్దాలను రికార్డు చేయడం.. సాధారణ పద్ధతుల్లో గుర్తించిన ఆరోగ్య సమస్యలను వీటికి జోడించడం ఈ ప్రాజెక్టులో కీలక అంశం. ఇప్పటికే 1437 మంది శబ్దాలను రికార్డు చేసిన శాస్త్రవేత్తలు మెషీన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా వాటిని నిశితంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. న్యుమోనియా, ఉబ్బసం, బ్రాంకైటిస్‌లతో పాటు సాధారణ ఊపిరితిత్తుల సమస్యలకు సంబంధించిన ధ్వనులను అప్లికేషన్ ద్వారా గుర్తించేలా చేశారు. అప్లికేషన్ పూర్తయిన తరువాత దగ్గు ధ్వనులను రికార్డు చేసిన పిల్లలు 585 మంది మీద పరీక్షలు జరిపారు. ఎవరికి ఏ జబ్బు ఉందో 81 నుంచి 97 శాతం కచ్చితత్వంతో గుర్తించింది ఆ అప్లికేషన్ అని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త పాల్ పోర్టర్ తెలిపారు. వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో పిల్లల సమస్యలను గుర్తించేందుకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుందని, మరింత సమర్థంగా పనిచేయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. -
హెల్త్ టిప్
వాతావరణం మారుతున్న ఈ కాలంలో చాలామందికి తుమ్ములు, దగ్గు, జలుబు, గొంతునొప్పి సహజం. ప్రతిదానికీ ట్యాబ్లెట్లు వేసుకునేకంటే కప్పు పాలల్లో ఒక స్పూను అల్లం తురుము, చిటికెడు పసుపు వేసుకుని మరిగించి, వడపోసుకుని తాగితే చక్కటి ఉపశమనం లభిస్తుంది. అసలు హాచ్ హాచ్లు రాకుండా ఉండాలంటే ఆహారం లో అల్లం, జీలకర్ర, పసుపు ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. -
కేజ్రీవాల్‌కు అవమానం.. సాయం చేసిన బీజేపీ మంత్రి
న్యూఢిల్లీ : అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆకతాయిల చేతిలో టార్గెట్ అవుతూనే ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఇంక్ నుంచి కారం పొడి చల్లడం వరకూ అన్ని రకాల అవమానాలు చవి చూశారు. కానీ గురువారం కేజ్రీవాల్‌కు ఎదురైన పరాభవం వీటన్నింటిని మించింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘క్లీన్ గంగ’ కార్యక్రమం మాదిరిగానే యుమునా నదిని కూడా శుభ్రం చేయాలనే ఉద్దేశంతో కేజ్రీవాల్ ప్రభుత్వం ‘క్లీన్ యమున’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా గురువారం ఓ పబ్లిక్ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. దీనికి కేజ్రీవాల్‌తో పాటు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్ష వర్ధన్లు కూడా హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతుండగా ముందు వరుసలో కూర్చున్న కొందరు వ్యక్తులు కేజ్రీవాల్ అనారోగ్యాన్ని ఎత్తి చూపుతూ దగ్గడం ప్రారంభించారు. ఫలితంగా అక్కడ కాస్తా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. తనను ఎగతాళి చేయడం కోసమే వారు అలా చేస్తున్నారని కేజ్రీవాల్‌కు అర్థమైనప్పటికి ఆయన మౌనంగానే ఉన్నారు. అప్పుడు అక్కడే ఉన్న బీజేపీ మంత్రులు నితిన్ గడ్కరీ, హర్ష వర్ధన్ దగ్గుతున్న వారి దగ్గరకు వెళ్లి ‘ఇది పబ్లిక్ మీటింగ్.. దయ చేసి మౌనంగా ఉండండ’ని విజ్ఞప్తి చేశారు. దాంతో పరిస్థితి కాస్తా సద్దుమణిగింది. కేజ్రీవాల్‌కు 40 ఏళ్ల నుంచి దగ్గు సమస్య ఉంది. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో అది బాగా ఎక్కువయ్యింది. చికిత్స నిమిత్తం కేజ్రీవాల్ 2016, సెప్టెంబర్‌లో బెంగళూరు వెళ్లి ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. -
నా ఎడతెరిపి లేని దగ్గుకు కారణాలు?
కార్డియాలజీ కౌన్సెలింగ్స్ నా వయసు 47 ఏళ్లు. ఈమధ్య రెండు మూడు నెలల నుంచి విపరీతమైన దగ్గు విడవకుండా వస్తోంది. డాక్టర్‌కు చూపించుకుంటే దగ్గు మందులు, అలర్జీ మందులు ఇచ్చారు. కొద్దిరోజులు ఉపశమనం కనిపించినా మళ్లీ దగ్గు యధావిధిగా తిరగబెడుతోంది. విపరీమైన అలసట, పక్కటెముకల్లో నొప్పితో బాధపడుతున్నాను. ఇంట్లో పరిశుభ్రత పాటిస్తాం. వంటల్లో మసాలాలు కూడా ఎక్కువగా వాడతాం. ఇలా ఎడతెరిపి లేకుండా దగ్గు ఎందుకు వస్తోంది? దీనికి చికిత్స ఏమిటో వివరంగా చెప్పండి. – కె. వసుంధర, మందమర్రి మీకు వచ్చిన దగ్గును దీర్ఘకాలిక దగ్గు (క్రానిక్ కాఫ్) గా చెప్పవచ్చు. వయోజనుల్లో ఎనిమిది వారాల... ఆ పైన కూడా తగ్గకుండా దగ్గు వస్తోంటే దాన్ని క్రానిక్ కాఫ్గా పరిగణిస్తారు. విడవకుండా వచ్చే ఈ దగ్గు వ్యక్తిని నిద్రకు సైతం దూరం చేస్తుంది. తీవ్రమైన అలసటకు గురిచేస్తుంది. దీర్ఘకాలిక దగ్గు వల్ల కొన్నిసార్లు వాంతులు, మత్తుకమ్మినట్టు ఉండటం జరుగుతుంది. దగ్గీ దగ్గీ పక్కటెముకల్లో పగుళ్లూ ఏర్పడవచ్చు. ఈ రకమైన దగ్గుకు నిర్దిష్టంగా కారణం చెప్పడం సాధ్యం కానప్పటికీ కొన్ని పరిస్థితులు దీనికి దోహదం చేయవచ్చు. ఆస్తమా, పులితేన్పులు, ఇన్ఫెక్షన్ల వల్ల కూడా దగ్గు విడవకుండా వస్తుంది. దగ్గుకు కారణమైన పరిస్థితులను తొలగిస్తే దీర్ఘకాలిక దగ్గు కూడా దానంతట అదే అదృశ్యమైపోతుంది. అయితే ఎండోకారై్డటిస్ (గుండెకు సంబంధించిన ఒక ఇన్ఫెక్షన్) వల్ల వచ్చే దగ్గు నెలల తరబడి విడవకుండా ఉండి ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితికి దారితీయవచ్చు. ఎండోకారై్డటిస్ అనేది గుండె లోపలి పొర (ఎండోకార్డియం)కు ఇన్ఫెక్షన్ సోకవడం వల్ల వచ్చే వ్యాధి. దీనిలో ప్రధానంగా కనిపించే మొదటి లక్షణం విడవకుండా వచ్చే దగ్గు. నోరు, ఇతర శరీర భాగాలలోని బ్యాక్టీరియా... రక్తంతో పాటు వెళ్లి గుండెపొరకు ఇన్ఫెక్షన్ కలగజేస్తాయి. గుండెలో అప్పటికే దెబ్బతిని ఉన్న భాగాలను ఈ బ్యాక్టీరియా ఎంచుకొని ప్రభావితం చేస్తాయి. ఎండోకారై్డటిస్ను గుర్తించి చికిత్స చేయకపోతే అది ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. చాలా సందర్భాల్లో మందులతోనూ, తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స ద్వారా దీనికి చికిత్స చేస్తారు. ఆరోగ్యకరమైన గుండె గలవారికి ఈ వ్యాధిసోకడం చాలా అరుదు. గుండెకవాటాలు చెడిపోయిన, కృత్రిమ కవాటాలు అమర్చినవారిలో, గుండెకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నవారిలో ఎండోకారై్డటిస్ ఎక్కువగా కనిపిస్తుంది. దీర్ఘకాలపు దగ్గు ఉండి విపరీతమైన అలసట, మూత్రంలో రక్తం పడటం, అకారణంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌కు చూపించుకోవాలి. విడువకుండా వేధించే దగ్గుకు దారితీసే సాధారణ కారణాల ఆధారంగా డాక్టర్లు చికిత్స ప్రారంభిస్తారు. ఆపైన దీర్ఘకాలపు దగ్గుకు అసలు కారణాలైన వ్యాధులను నిర్ధారణ చేసేందుకు పరీక్షలు చేయిస్తారు. అవసరమైతే కార్డియాలజిస్టుకు సిఫార్సు చేస్తారు.మీ విషయానికి వస్తే మీరు కూడా మరోసారి డాక్టర్‌కు చూపించుకోండి. మీ దగ్గుకు కారణం ఎండోకారై్డటిస్ అవునో, కాదో నిర్ధారణ చేసి, దాన్ని బట్టి మీకు అవసరమైన చికిత్స అందిస్తారు. డయలేటెడ్ కార్డియో మయోపతి అంటే ఏమిటి? నా వయసు 56 ఏళ్లు. గడచిన ఏడెనిమిది నెలల నుంచి విపరీతమైన అలసట కలుగుతోంది. ఒక్కోసారి శ్వాస అందని పరిస్థితి ఏర్పడుతోంది. పదిహేను రోజుల కిందట హఠాత్తుగా స్పృహ తప్పిపోయాను. డాక్టరుకు చూపిస్తే పరీక్షలు చేయించారు. డయలేటెడ్ కార్డియోమయోపతి అని చెప్పి చికిత్స ప్రారంభించారు. ఈ వ్యాధి ఏమిటి? ఎందుకు వస్తుంది? దీనికి చికిత్స ఏమిటి? దయచేసి వివరంగా చెప్పండి. – బి. ఈశ్వరరావు, దేవరకొండ కార్డియోమయోపతి అన్నది గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి. మొదట్లో ఎలాంటి ప్రత్యేక లక్షణాలు వ్యక్తం కావు. కొంతకాలం తర్వాత తీవ్రమైన అలసట, శ్వాస అందకపోవడం, స్పృహతప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కార్డియోమయోపతిని గుర్తించి చికిత్స చేయించడం ఆలçస్యమైతే అది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తుంది. కొంతమందిలో అకాల మరణానికి కారణం అవుతుంది. కార్డియోమయోపతిలో మూడు ప్రధాన రకాలు కనిపిస్తాయి. వీటిలో ప్రధానమైనది డయలేటెడ్ కార్డియోమయోపతియే. కార్డియోమయోపతి వ్యాధుల్లో 95 శాతం ఈ రకానికి చెందినవే. దీనిలో ఎడమ జఠరిక (వెంట్రికల్) వ్యాకోచిస్తుంది. గుండె బలహీనపడి వెంట్రికల్లోని రక్తాన్ని ముందుకు పంపించలేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో వెంట్రికల్ గోడలు చాలా పలుచబడిపోతాయి. బాగా సాగి సంచిలా తయారైన వెంట్రికిల్ తగినంత రక్తాన్ని పంప్ చేయలేదు. చాలా సందర్భాల్లో డయలేటెడ్ కార్డియోమయోపతి నెమ్మదిగా పెరుగుతూ పోతుంది. కానీ కొంతమందిలో వ్యాధి నిర్ధారణ చేయడానికి ముందే తీవ్రమైన లక్షణాలు వ్యక్తమవుతాయి. శ్వాసతీసుకోవడం కష్టంగా ఉండటం, పొట్ట–చీలమండల వాపు, విపరీతమైన అలసట, గుండెదడ ఈ డయలేటెడ్ కార్డియోమయోపతిలో కనిపించే ప్రథమ లక్షణాలు. ఇవన్నీ గుండె విఫలమవుతోందనడానికి ముఖ్య లక్షణాలు. పలు కారణాల వల్ల డయలేటెడ్ కార్డియోమయోపతి రావడానికి అవకాశం ఉంది. వైరస్ల కారణంగా ఇన్ఫెక్షన్, అదుపు తప్పిన అధిక రక్తపోటు (హైబీపీ), గుండెకవాటాలకు సంబంధించిన సమస్యలు, మితిమీరి మద్యపానం ఈ వ్యాధికి దారితీసే ప్రధాన కారణాలు. వీటితో పాటు గర్భవతులు కొందరిలో కూడా డయలేటెడ్ కార్డియోమయోపతి కనిపిస్తుంది. కొన్ని కుటుంబాల్లో జన్యువుల మార్పు లేదా మ్యుటేషన్ కారణంగా వంశపారంపర్యంగా కూడా వస్తుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి డయలేటెడ్ కార్డియోమయోపతి ఉంటే పిల్లల్లో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ వ్యాధి నిర్ధారణకు డాక్టర్లు సిఫార్సు చేసే పరీక్ష ఈసీజీ. గుండె విద్యుత్ స్పందనలు నమోదు చేసే ఈ పరీక్ష గుండె రక్తాన్ని పంప్ చేయగలుగుతున్న తీరును గుర్తిస్తుంది. దీంతోపాటు అవసరాన్ని బట్టి ఎమ్మారై, ఎక్సర్సైజ్ టెస్టులను కూడా చేయిస్తారు. డయలేటెడ్ కార్డియోమయోపతి చికిత్సలో ప్రధానంగా వ్యాధి లక్షణాలను అదుపుచేయడం, తీవ్ర సమస్యలకు దారితీయకుండా జాగ్రత్తతీసుకోవడం పైనే కేంద్రీకృతం చేస్తారు. అయితే డయలేటెడ్ కార్డియోమయోపతి కారణంగా గుండె కొట్టుకోవడంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు (ఎరిథిమియాస్), ఛాతీలో నొప్పి, రక్తం గడ్డకట్టడం వంటి మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వాటి తీవ్రతను బట్టి చికిత్స చేస్తారు. అధిక రక్తపోటు, గుండె స్పందనల్లో విపరీతమైన హెచ్చుతగ్గులను మందులతో అదుపు చేస్తారు. గుండె కొట్టుకోవడంలో అసాధారణ మార్పులను అదుపు చేయడానికి అవసరమైతే పేస్‌మేకర్‌ను అమరుస్తారు. మరికొంతమందిలో గుండె కొట్టుకోవడంలోని అసాధారణ స్థితిని సరిచేయడానికి ఐసీడీ (ఇంప్లాంటబుల్ కార్డియాక్ డిఫిబ్రిలేటర్) పరికరాన్ని అమర్చాల్సి వస్తుంది. డాక్టర్ పంకజ్ జరీవాలా, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
కస్తూర్బా విద్యార్థినులకు అస్వస్థత
కొమురవెల్లి(సిద్దిపేట) : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ కస్తూరిబా బాలికల పాఠశాలలో 9 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. దీంతో వారిని సోమవారం హైదరాబాద్ నగరంలోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. వివరాలు... మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో మొత్తం 86 మంది విద్యార్థులున్నారు. కాగా మూడు రోజుల క్రితం పూజిత అనే విద్యార్థిని దగ్గుతూ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఇంటికి పంపించారు. పూజిత ఆదివారం తిరిగి కస్తూరిబా పాఠశాలకు వచ్చింది. పాఠశాలలో పూజితతో కలిసి ఉన్న రూమ్‌లోని హారిక, శ్రీవాణిలకు తీవ్రమైన దగ్గు సోకింది. దీంతో పూజితతో పాటు హారిక, శ్రీవాణిలను చికిత్స కోసం స్థానిక ఆర్ఎంపీల వద్దకు తీసుకెళ్లారు. ముగ్గురి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వెంటనే వారిని పాఠశాల ఉపాధ్యాయులు, ఎంఈఓ రాములు వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషయమించడంతో వారిని వెంటనే నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. 6వ తరగతికి చెందిన కె. పూజిత, సీహెచ్.అంజలి, 7వ తరగతి చదివే ఈ.అంజలి, ఏ.రేఖ, జి.అశ్విత, 8వ తరగతి చదువుతున్న పి. భాను, ఎస్.అంబికలతో పాటు హైదరాబాద్‌కు తరలించిన 7వ తరగతి విద్యార్థిని టి.హరిక, 8వ తరగతికి చెందిన శ్రీవాణిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కస్తూరిబా పాఠశాలలో ఆదివారం ఉదయం విద్యార్థులకు చపాతీ, మధ్యాహ్నం చికెన్, రాత్రి క్యాబేజీ వండి పెట్టారు. ఉదయం అల్పాహారం కోసం పులిహోర చేసి పెట్టారు. ఈ విషయమై కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ నీరజను వివరణ కోరగా కేజీబీవీ పాఠశాల చుట్టూ వరి పొలాలకు వాడిన రసాయన ఎరువుల ప్రభావగంతోనే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ భిక్షపతి పాఠశాలకు చేరుకుని మిగతా విద్యార్థులకు వ్యాధి సోకకుండా స్థానిక పీహెచ్సీ వైద్యులతో మాట్లాడి మందులను పంపిణీ చేశారు. అందరికీ మాస్క్‌లు అందించారు. -
రెండు నెలల నుంచి ఎడతెరిపి లేకుండా దగ్గు!
పల్మునాలజీ కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు 13 ఏళ్లు. అతడు ఎప్పుడూ పొడి దగ్గుతో బాధపడుతున్నాడు. గత రెండు నెలలుగా కొద్దిపాటి జ్వరంతో ఉంటోంది. శ్వాస కూడా సరిగా తీసుకోలేకపోతున్నాడు. మాకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడినా సమస్య తగ్గడం లేదు. మావాడి సమస్యకు పరిష్కారం సూచించండి. – ఎమ్. కృష్ణమూర్తి, మేదరమెట్ల మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ అబ్బాయి కాఫ్ వేరియంట్ ఆస్తమాతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది ఆస్తమాలోనే ఒక రకం. ఇది వచ్చిన వారిలో తెమడ పడదు. పొడిదగ్గు ఉంటుంది. పిల్లికూతలు కూడా మొదట్లో ఉండవు. దీన్నే ‘క్రానిక్ కాఫ్’ అని కూడా అంటారు. రాత్రీ పగలూ తేడా లేకుండా దగ్గుతుంటారు. ఆ దగ్గు వల్ల రాత్రుళ్లు నిద్ర కూడా పట్టదు. ఈ రోగులు తమకు సరిపడని ఘాటైన వాసనలు, దుమ్ము, ధూళి వంటి వాటికి ఎక్స్పోజ్ అయితే ఆ అలర్జెన్స్ ఆస్తమాను మరింతగా ప్రేరేపిస్తాయి. కాఫ్ వేరియెంట్ ఆస్తమా సమస్య ఎవరికైనా, ఏ వయసు వారిలోనైనా కనిపించినప్పటికీ చిన్న పిల్లల్లో ఇది ఎక్కువ. ఇది ఆ తర్వాత సాధారణ ఆస్తమాకు దారితీస్తుంది. అంటే శ్వాస అందకపోవడం, పిల్లికూతలు వంటి లక్షణాలు తర్వాతి దశలో కనిపిస్తాయి. సాధారణ ఆస్తమా లాగే కాఫ్ వేరియెంట్ ఆస్తమాకూ కారణాలు అంతగా తెలియవు. తమకు సరిపడని పదార్థాలు, చల్లగాలి దీనికి కారణాలుగా భావిస్తుంటారు. కొందరిలో అధిక రక్తపోటు, గుండెజబ్బులు, హార్ట్‌ఫెయిల్యూర్, మైగ్రేన్, గుండెదడ (పాల్పిటేషన్స్) వంటి జబ్బులకు వాడే మందులైన బీటా–బ్లాకర్స్ తీసుకున్న తర్వాత ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ మొదలు కావచ్చు. కొందరిలో గ్లకోమా వంటి కంటిజబ్బులకు వాడే చుక్కల మందులోనూ బీటా బ్లాకర్స్ ఉండి, అవి కూడా ఆస్తమాను ప్రేరేపిస్తాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరిలో ఆస్పిరిన్ సరిపడకపోవడం వల్ల కూడా దగ్గుతో కూడిన ఆస్తమా రావచ్చు. కాఫ్ వేరియెంట్ ఆస్తమాలో కేవలం దగ్గు తప్ప ఇతర లక్షణాలేమీ కనిపించకపోవడం వల్ల దీని నిర్ధారణ ఒకింత కష్టమే. ఎందుకంటే కాఫ్ వేరియెంట్ ఆస్తమా విషయంలో సాధారణ పరీక్షలైన ఛాతీఎక్స్‌రే, స్పైరోమెట్రీ వంటి పరీక్షలూ నార్మల్‌గానే ఉంటాయి. మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న ఛాతీ నిపుణుడిని కలవండి. కొన్ని వైద్య పరీక్షలు, వ్యాధి నిర్ధారణ తర్వాత నిపుణులు తగిన చికిత్స అందిస్తారు. నా వయసు 37. డస్ట్ అలర్జీ ఉంది. ఇటీవల వ్యాయామం మొదలుపెట్టాను. కానీ ఇలా మొదలుపెట్టగానే ఆయాసం వస్తోంది. దాంతో వ్యాయామం సాగడం లేదు. నాకు తగిన సలహా ఇవ్వండి. – గోపాలకృష్ణ, ఖమ్మం వ్యాయామం కొన్నిసార్లు ఆస్తమాను ప్రేరేపించి, ఆయాసం వచ్చేలా చేసే అవకాశం ఉంది. దీన్నే ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అని కూడా అంటారు. సాధారణంగా మనం శ్వాస తీసుకునే సమయంలోనే ముక్కురంధ్రాల్లోకి ప్రవేశించాక, ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి అనుకూలమైన ఉష్ణోగ్రతను సంతరించుకుంటుంది. కానీ వ్యాయామం చేసే సమయంలో గాలి ఎక్కువగా తీసుకోవడం కోసం నోటితోనూ గాలిపీలుస్తుంటారు. అంటే వారు తేమలేని పొడిగాలినీ, చల్లగాలినీ నోటితో పీలుస్తుంటారన్నమాట. ఆ చలిగాలిలో లోనికి ప్రవేశించగానే... ఆ గాలిని తీసుకెళ్లే మార్గాలు ముడుచుకుపోతాయి. ఫలితంగా గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకేళ్లే దారులు సన్నబడతాయి. దాంతో కొన్ని లక్షణాలు కనబడతాయి. అవి... ∙పొడి దగ్గు వస్తుండటం ∙ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ∙పిల్లికూతలు వినిపించడం ∙వ్యాయామం తర్వాత తీవ్రమైన అలసట (మామూలుగా వ్యాయామం చేసేవారిలో ఇంత అలసట ఉండదు) ∙వ్యాయామ సమయంలో గాలి తీసుకోవడంలో ఇబ్బంది / ఆయాసం. సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఈ లక్షణాలు కనిపించడం లేదా కొద్దిగా వ్యాయామం చేసి ఆపేశాక 5 – 10 నిమిషాల తర్వాత ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. ఇలాంటి సమయాల్లో డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. అయితే వ్యాయామంతో వచ్చే ఆయాసం (ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా) కారణంగా వ్యాయామ ప్రక్రియను ఆపాల్సిన అవసరం లేదు. దీన్ని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందుగా పీల్చే మందులైన బ్రాంకోడయలేటర్స్ వాడి, వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇక తక్షణం పనిచేసే లెవోసాల్‌బ్యుటమాల్ వంటి బీటా–2 ఔషధాలను వ్యాయామానికి 10 నిమిషాల ముందుగా వాడి, వ్యాయామ సమయంలో గాలిగొట్టాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. దీనితో పాటు వ్యాయామానికి ముందర వార్మింగ్ అప్, వ్యాయామం తర్వాత కూలింగ్ డౌన్ ప్రక్రియలను చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. తొలుత చాలా కొద్ది సమయం పాటే వ్యాయామం చేస్తూ, ఆ వ్యవధిని పెంచుకుంటూ పోవడం వల్ల మీరు ఈ సమస్యను అధిగమించవచ్చు. వ్యాధి నిర్ధారణ తర్వాతే మందులు! నా వయసు 44 ఏళ్లు. నాకు ఎడతెరిపిలేకుండా దగ్గు వస్తోంది. నాకు టీబీ అయి ఉండవచ్చా? చాలామంది ఫ్రెండ్స్ నాకు టీబీ ఉందనీ, మందులు వాడమని సూచిస్తున్నారు. నాకు తగిన మందులు సూచించండి. – ఫల్గుణరావు, కాకినాడ టీబీ ఉన్నవారికి దగ్గు రావడం ఒక లక్షణమే అయినా... దగ్గు వచ్చిన వారందరికీ టీబీ ఉన్నట్లే అనుకోకూడదు. దగ్గు అనేది ప్రకృతి మనకు ఇచ్చిన ఒక స్వాభావిక రక్షణ ప్రక్రియ. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన గాలి గ్లాటిస్ నుంచి అత్యధిక పీడనంతో బలంగా నోటి ద్వారా ఒక్కసారిగా బయటకు వెలువడటాన్ని దగ్గు అంటారు. మన ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన అనేక వ్యర్థాలను, ప్రమాదకరమైన ద్రవాలను బయటకు బయటకు పంపడానికి దగ్గు ఉపయోగపడుతుంది. ఇక దగ్గు అనేది కేవలం టీబీ లక్షణం మాత్రమే కాదు. సైనుసైటిస్, నిమోనియా, ఆస్తమా వంటి జబ్బుల నుంచి గుండెజబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వరకు అనేక వ్యాధుల్లో దగ్గు కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా మీకు దగ్గర్లోని డాక్టర్ని కలవండి. ఆయన కొన్ని పరీక్షలతో మీ దగ్గుకు అసలు కారణాన్ని కనుగొంటారు. దాని ఆధారంగా మీకు తగిన చికిత్స అందిస్తారు. అంతేగానీ దగ్గు వచ్చిన ప్రతివారూ సొంతంగానో లేదా తమ ఫ్రెండ్స్ చెప్పినదాన్ని బట్టి తమకు తామే ఏదో జబ్బును ఊహించుకోవడం సరికాదు. -
ఒత్తిడి తగ్గదు సరికదా... ఎక్స్ట్రా డేంజర్స్
పల్మనాలజీ కౌన్సెలింగ్ నా వయసు 49 ఏళ్లు. చాలా ఒత్తిడి ఉండే వృత్తిలో ఉన్నాను. తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాను. ఆ ఒత్తిడి తగ్గించుకోడానికి రోజూ సిగరెట్లు కాలుస్తుంటాను. రోజూ దాదాపు మూడు నాలుగు పెట్టెల సిగరెట్లు తాగుతుంటాను. ఇటీవల నాకు తీవ్రమైన ఆయాసం, దగ్గు వస్తోంది. సరిగా నిద్రపట్టడం లేదు. మామూలు సమస్యే కదా తగ్గిపోతుంది అనుకున్నాను. దగ్గు ఎడతెరిపి లేకుండా వస్తోంది. మందులు వాడుతున్నా రోజురోజుకూ పెరుగుతోంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – శామ్యూల్, కరీంనగర్ సిగరెట్ కాల్చడం ఒత్తిడిని తగ్గించకపోగా అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలగజేస్తుంది. మొదట్లో సరదాగా ప్రారంభమయ్యే అలవాటు... ఆ తర్వాత వదులుకోలేని వ్యసనంగా మారి ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. రోజుకు మూడు పాకెట్ల సిగరెట్లు కాల్చడం అంటే చాలా పెద్ద విషయం. అది ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతుంది. ఊపిరితిత్తులు పాడైపోయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. పొగతాగడం వల్ల శరీరంలోని రక్తనాళాలు పూడుకుపోయి గుండె సంబంధిత సమస్యలు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ), నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు... చర్మసంబంధిత వ్యాధులు కూడా రావచ్చు. కాబట్టి మీరు వెంటనే ధూమపానం మానేయండి. వైద్యులను సంప్రదించి వారు సూచించిన పరీక్షలు చేయించుకోండి. పొగతాగడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. సిగరెట్ ఒత్తిడిని తగ్గిస్తుందన్నది కేవలం అపోహ మాత్రమే. మీరు ఎంత త్వరగా పొతతాగడం మానేస్తే... అది మీ ఆరోగ్యానికి అంత మేలు చేస్తుంది. డాక్టర్ పి. నవనీత్ సాగర్‌రెడ్డి,సీనియర్ పల్మునాలజిస్ట్, యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ, హైదరాబాద్ ఐబీఎస్... భయపడాల్సిందేమీలేదు! హోమియో కౌన్సెలింగ్ నా వయసు 38. భోజనం తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. బయటకు ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. మలంలో జిగురు కనిపిస్తోంది. కొద్దిగా నొప్పి ఉండి మెలిపెట్టినట్లుగా అనిపిస్తోంది. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన ఉన్నాయి. ఆత్మన్యూనతతో బాధపడుతున్నాను. – మహేశ్‌కుమార్, తాడేపల్లిగూడెం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ∙దీర్ఘకాల జ్వరాలు ∙మానసిక ఆందోళన ∙కుంగుబాటు ∙ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం జన్యుపరమైన కారణాలు ∙చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్‌కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. రోగ లక్షణాలను బట్టి, కడుపులో పరాన్నజీవులు ఉన్నాయా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా వ్యాధి నిర్ధారణ చేస్తారు. మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ పరీక్షలు నిర్ధారణకు తోడ్పడతాయి. వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు : పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ఒత్తిడిని నివారించుకోవాలి ∙పొగతాగడం, మద్యంపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ∙రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. హోమియోలో చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే... జీర్ణవ్యవస్థలో ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ చికిత్స ద్వారా చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరక్టర్, పాజిటివ్ హోమియోపతి విజయవాడ, వైజాగ్ -
మాటిమాటికీ దగ్గు, జ్వరం?!
హోమియో కౌన్సెలింగ్ మా బాబు వయసు ఆరేళ్లు. మాటిమాటికీ జ్వరం, దగ్గుతో బాధపడుతూ ఉన్నాడు. డాక్టర్గారికి చూపిస్తే... ఇంతకుముందు నిమోనియా ఏదైనా వచ్చిందా అని అడుగుతున్నారు. నిమోనియా అంటే ఏమిటి? హోమియోలో దీనికి చికిత్స ఉందా? – శ్రీనివాస్ కె., వరంగల్ చలికాలంలో ముప్పుతిప్పలు పెట్టే సమస్యల్లో నిమోనియా ఒకటి. ముఖ్యంగా పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఊపిరితిత్తులకు కలిగే అనారోగ్యాన్ని నిమోనియా లేదా నెమ్మువ్యాధి అంటారు. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, అధిక చల్లదనం వల్ల ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, సులువుగా శ్వాస తీసుకోలేని పరిస్థితి ఏర్పడతాయి. ఇతర దేశాల్లో ఇన్ఫ్లుయెంజా, రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్ వంటి వైరస్ల కారణంగా నిమోనియా సంక్రమిస్తే... మన దేశంలో ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా ఎక్కువ శాతం ఈ వ్యాధి వస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. పిల్లల్లో నిమోనియా వ్యాధిని సకాలంలో గుర్తించకపోవడంతో వ్యాధి తీవ్రత పెరిగి ప్రమాదస్థాయికి చేరుకుంటోంది. కారణాలు: ∙బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ల వల్ల ∙స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా వల్ల ∙వాతావరణంలో కలిగే మార్పుల వల్ల లక్షణాలు: ∙ఆయాసం ∙తీవ్రమైన జ్వరం ∙వికారం ∙పొడిదగ్గు ∙కఫం ∙ఆకలి లేకపోవడం ∙ఛాతీనొప్పి ∙బలహీనపడటం ∙ఊపిరి పీల్చుకోవడంలో అస్వస్థత ∙బరువు తగ్గడం ∙చర్మం నీలం రంగులోకి మారడం వ్యాధి నిర్ధారణ: ఛాతీ ఎక్స్‌రే, రక్త పరీక్ష, సీటీ స్కాన్ చికిత్స: హోమియోలో నిమోనియాకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. అవి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా వ్యాధిని తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. హోమియోపతిలో వ్యాధి మూలకారణాన్ని గుర్తించి చికిత్స చేయడం జరుగుతుంది. హోమియోలో నిమోనియా సమస్యకు ఫెర్రమ్ ఫాస్ఫోరికమ్, అకోనైట్, అయోడిన్, బ్రయోనియా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ బైక్ నడిపితే నడుం నొప్పి వస్తుందా? లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ నా వయసు 28 ఏళ్లు. బైక్‌పై ఎక్కువగా తిరుగుతుంటాను. నాకు తీవ్రమైన నడుం నొప్పి వస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – రమేశ్, హైదరాబాద్ ఈ వయసులో నడుం నొప్పి అంత సాధారణం కాదు కాబట్టి బైక్ నడపడంలో మీరు అనుసరిస్తున్న కొన్ని అంశాల వల్ల ఈ నొప్పి వస్తుండవచ్చు. సాధారణంగా బైక్‌ల తయారీదారులు హ్యాండిల్‌బార్స్, ఫుట్‌రెస్ట్ వంటి అంశాల్లో కొన్ని ప్రమాణాలను పాటిస్తుంటారు. మీ బైక్ ఆ ప్రమాణాలకు అనుగుణంగా తయారైనదైతే మంచిదే. వాటిని అనుసరించడం వల్ల కొన్ని అవయవ సమస్యలు రావు. ఒకవేళ మీ బైక్‌లోని వివిధ అంశాలు సరైన ప్రమాణాలు లేకపోతే వాటివల్లనే మీకు నడుము నొప్పి వస్తోందని భావించాలి. మీరు మీ బైక్ విషయంలో ఈ కింద పేర్కొన్న అంశాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. బైక్‌ల హ్యాండిల్స్ సాధారణంగా తగినంత విశాలంగా, రెండు చేతులు బాగా పట్టుకోవడానికి వీలైనంత నిడివితో ఉండాలి. పొట్టిగా ఉండే షార్ట్‌హ్యాండిల్స్ వల్ల ఒంటిపై భారం పడి శరీరభాగాల్లో నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ∙మనం కాళ్లు పెట్టుకునే ఫుట్‌రెస్ట్ మన శరీరానికి మరీ దూరంగా ఉండకూడదు. దీనివల్ల కాళ్లు సాగినట్లుగా అయిపోయి నడుముపై భారం ఎక్కువగా పడుతుంది. దాంతో నడుమునొప్పి రావచ్చు ∙బైక్‌పై కూర్చొనే సమయంలో వీపు భాగమంతా నిటారుగా ఉండి, మన వెన్ను ఒంగకుండా ఉండాలి. సాధారణ బైక్‌ల నిర్మాణం ఇలాగే ఉంటుంది. కానీ కొన్ని స్పోర్ట్స్ బైక్‌లలో సీట్లు ఏటవాలుగా ఉండి, మనం కూర్చొనే భంగిమ వాలుగా ఉండేలా నిర్మితమై ఉంటాయి. దాంతో ముందుకు వాలినట్లుగా కూర్చోవాల్సి వస్తుంది. ఇలా వాలిపోయినట్లుగా కూర్చొనేలా రూపొందించిన ఫ్యాషన్ బైక్స్ వల్ల మన వెన్ను నిటారుగా నిలపలేకపోవడంతో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ∙బైక్‌లపై వెళ్లేవారు వీపుపై ఉండే బ్యాగ్స్ (బ్యాక్‌ప్యాక్స్) పెట్టుకొని వెళ్తుండటం సాధారణం. ఈ భారం నడుంపైనా భారం పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. ఇలాంటివారు ఆ బ్యాగ్ భారం వీపుపై కాకుండా సీట్‌పై పడేలా చూసుకోవాలి. మీ బైక్‌లో పైన పేర్కొన్న భాగాల అమరిక, మీరు కూర్చొనే భంగిమ ఎలా ఉందో పరీక్షించుకొని, లోపాలు ఉన్నట్లయితే సరిచేసుకోండి. మీ నొప్పి దూరం కావచ్చు. అప్పటికీ నడుం నొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించండి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ సీఏబీజీ సర్జరీ అంటే ఏమిటి? కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 65 ఏళ్లు. ఒక రోజు ఛాతీనొప్పి వస్తే పరీక్షించిన డాక్టర్లు సీఏబీజీ సర్జరీ చేయాలని అని చెప్పారు. అంటే ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – సరళ, భద్రాచలం గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కీలకమైన ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు, రక్తసరఫరా అవరోధం కలగకుండా, సీఏబీజీ అనే సర్జరీ చేసి, రక్తాన్ని ఇతర మార్గాల్లో (బైపాస్ చేసిన మార్గంలో) గుండెకండరానికి అందేలా చేసే ఆపరేషనే సీఏబీజీ. మనం ఇంగ్లిష్‌లో సాధారణంగా ‘బైపాస్ సర్జరీ’ అని పిలిచే దీన్ని వైద్యపరిభాషలో కరొనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అని వ్యవహరిస్తారు. దాని సంక్షిప్తరూపమే ఈ సీఏబీజీ ఆపరేషన్. ఇందులో కాళ్లు లేదా చేతులపై ఉన్న రక్తనాళాలను తీసి, గుండెకు అడ్డంకిగా ఏర్పడిన రక్తనాళాలకు ప్రత్యామ్నాయంగా, రక్తాన్ని బైపాస్ మార్గంలో అందించేలా అమర్చుతారు. సాధారణంగా ఒక బ్లాక్ (అడ్డంకి)ని బైపాస్ చేయాలంటే ఒక రక్తనాళం అవసరం. గుండె వద్ద ఉన్న రక్తనాళాన్ని నేరుగా బైపాస్ చేసే ప్రక్రియను రీ–వాస్క్యులరైజేషన్ అంటారు. ఛాతీకీ కుడి, ఎడమ వైపున ఉన్న రక్తనాళాలను ఇంటర్నల్ మ్యామరీ ఆర్టరీ అంటారు. గుండెకు ఎడమవైపున ఉన్న నాళాన్ని లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ అర్టరీ అని అంటారు. ఈ రక్తనాళాన్ని బ్లాక్ అయిన నాళాల వద్ద బైపాస్ మార్గంలా కలుపుతారు. దీర్ఘకాల ప్రయోజనాలతో పాటు రోగి త్వరగా కోలుకుంటున్నందున ఇప్పుడు బైపాస్‌లోనూ సరికొత్త విధానాన్ని పాటిస్తున్నారు. బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత, భవిష్యత్తులో ఇలా మార్చిన రక్తనాళాల్లోనూ కొవ్వు పేరుకోకుండా హృద్రోగులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రక్తనాళాల్లో పేరుకున్న బ్లాక్స్‌ను అధిగమించి, రక్తాన్ని గుండెకు చేరవేసేందుకు వీలుగా బైపాస్ సర్జరీ చేస్తారు. అంతే తప్ప ఇది చేయడం వల్ల అప్పటికే ఉన్న గుండెజబ్బు తొలగిపోయిందని పేషెంట్ అపోహ పడకూడదు. అందుకే రోగి మళ్లీ ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవే... రోగికి హైబీపీ ఉన్నట్లయితే దాన్ని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకునేలా డాక్టర్ సూచించిన మందులు తీసుకోవాలి. అలాగే రోగికి డయాబెటిస్ ఉంటే, రక్తంలోని చక్కెరపాళ్లు ఎల్లప్పుడూ అదుపులో ఉండేలా మందులు తీసుకుంటూ, కొవ్వులు తక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ఇక పొగతాగే అలవాటు ఉంటే దాన్ని తక్షణం పూర్తిగా మానేయాలి. డాక్టర్లు సూచించిన తగిన వ్యాయామాలు చేస్తూ ఉండాలి. డాక్టర్ అనుజ్ కపాడియా సీనియర్ కార్డియాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ హైదరాబాద్ -
ఏదీ ఒకసారి దగ్గండి
దగ్గు... అనారోగ్యానికి ఒక థర్మామీటర్ లాంటిది. అన్ని దగ్గులూ ఒకటి కాదు. అది కనిపించే వేళలను బట్టి, అది వచ్చే వయసును బట్టి... దాని తీరును బట్టి సమస్యలు వేర్వేరుగా ఉంటాయి. ప్రతి దగ్గుకూ ఒక హెచ్చరిక ఉంటుంది. ఈ కథనం చదివితే అది అర్థమవుతుంది. ఏదీ ఒకసారి దగ్గండి.. ప్లీజ్ దగ్గు... మన కోసం ప్రకృతి చేసిన ఒక రక్షణ ప్రక్రియ. దగ్గు ఒక వ్యాధి కాదు. అది ఒక లక్షణం మాత్రమే. ఎన్నో రుగ్మతలకు సూచిక. దగ్గు వస్తున్న వారు తమ అసలు సమస్య గురించి తెలుసుకోవడం, అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడేదే ఈ కథనం. దగ్గు అంటే...? మనం నిత్యం శ్వాస తీసుకుంటూ ఉంటాం. గాలిని మామూలుగా ఊపిరితిత్తుల్లోకి పీల్చుకుని సాఫీగా వదిలేస్తాం. నోరు, ముక్కు నుంచి ఊపిరితిత్తుల మార్గమధ్యంలో అంటే సరిగ్గా గొంతులో గ్లాటిస్ అనే భాగం ఉంటుంది. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన గాలిని ఆ గ్లాటిస్ నుంచి తీవ్ర ఒత్తిడితో బలంగా నోటి నుంచి ఒక్కసారిగా బయటకు వదిలేసినప్పుడు అది దగ్గు రూపంలో వస్తుంది. అలా గాలిని తెరలు తెరలుగా బలంగా బయటకు వదలడాన్ని దగ్గు అంటారు. దగ్గులో రకాలు... దగ్గుకు అనేక కారణాలుంటాయి. మనకు దగ్గు వచ్చే వేళను బట్టి, తెమడలోని రంగును బట్టి దగ్గులో అనేక రకాలుగా విభజించవచ్చు. అలా వ్యాధిని కూడా కొంతవరకు ముందే అనుమానించి, తగిన నిర్ధారణ పరీక్షలు చేయించవచ్చు. సాధరణ పరిభాషలో దగ్గును రెండు రకాలుగా పేర్కొంటారు. దగ్గినప్పుడు తెమడ పడటం, సాధారణ ఉమ్మి కంటే చిక్కగా ఉండే స్రావాలు పడితే దాన్ని తడి దగ్గు అని, అలాంటివేవీ పడకుండా ఉండే దగ్గును పొడి దగ్గు అని అంటారు. తడి దగ్గు: సాధారణంగా ఊపిరితిత్తుల్లో వాయువుల మార్పిడి చోట ఉపరితలాన్ని తడిగా ఉంచేందుకు ఉత్పత్తి అయ్యే స్రావాలు బయటకు రావు. అవి రక్తనాళాల నుంచి గుండెకు చేరి అక్కడి నుంచి శరీరంలోకి ఇంకిపోతాయి (మెటబొలైజ్ అవుతాయి). అయితే ఏదైనా కారణాల వల్ల ఈ స్రావాల ఉత్పత్తి పెరిగి అది దగ్గుతో పాటు బయటకు వస్తే... దాన్ని తడి దగ్గు (వెట్ కాఫ్) అంటారు. తడి దగ్గు వస్తుంటే అది శ్వాసనాళాలో సమస్య (ఎయిర్వేస్ ప్రాబ్లమ్) అంటే ఆస్తమా, సీవోపీడీ, బ్రాంకైటిస్ కావచ్చు. లేదా ఇన్ఫెక్షన్స్ (నిమోనియా, టీబీ కావచ్చు పొడి దగ్గు: దగ్గుతున్నప్పుడు స్రావాలు ఏమీ రాకుండా వచ్చే దాన్ని పొడి దగ్గు అంటారు. ఇది వస్తుంటే సమస్య ఇంటెస్టిషియల్ లంగ్ డిసీజ్ (ఐఎల్‌డీ) కావచ్చు. ⇔సాధారణంగా ఒక రోగికి వచ్చేది ఏ రకమైన దగ్గు అన్నదాని ఆధారంగానే తొలిదశలో వ్యాధి ఏమిటో అనుమానించడం జరుగుతుంటుంది. నీరు చేరడం (ప్లూరల్). ⇔ దగ్గు వచ్చే వ్యవధి (డ్యూరేషన్)ను బట్టి సమస్యలను మూడు రకాలుగా చెప్పవచ్చు. రెండు వారాల లోపు మాత్రమే ఉంటే అక్యూట్ అని, 2 - 8 వారాల పాటు ఉంటే సబ్-అక్యూట్ అని, అంతకంటే దీర్ఘకాలం ఉంటే దాన్ని క్రానిక్ అని పేర్కొంటారు. రాత్రీ - పగలూ తేడా... దగ్గు వచ్చే వేళల్లో తేడాను బట్టి కూడా వ్యాధిని అనుమానించవచ్చు. సాధారణంగా అలర్జీ వచ్చే దగ్గు రాత్రి వేళల్లో ఎక్కువగా ఉంటుంది. నివారణ ఇలా... ⇔ మన పరిసరాలను, చుట్టుపక్కల వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ⇔ పొగతాగే దురలవాటును మానేయడం ⇔ పెంపుడు జంతువుల నుంచి దూరంగా ఉండటం ⇔ పడక గదులను దుమ్మూ ధూళీ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడం, తేమ లేకుండా చూసుకోవడం. ⇔ పుస్తకాల అరలను మూసి ఉంచడం ⇔ వీలైనంత వరకు ఘాటైన వాసనలు వచ్చే అగర్బత్తీలు, సుగంధద్రవ్యాలు (పెర్ఫ్యూమ్స్)ను ఉపయోగించకపోవడం వంటి జాగ్రత్తలతో దగ్గునుంచి దూరంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. వయసును బట్టీ వర్గీకరణ... ⇔ దగ్గు కనిపించినప్పుడు రోగి వయసును బట్టి కూడా దాని కారణాన్ని ఊహిస్తారు. ⇔ పిల్లల్లో (ఇన్‌ఫాంట్స్ మొదలుకొని ఐదేళ్ల వరకు) దగ్గు వస్తుంటే అది ఏదైనా బయటి పదార్థం (ఫారిన్‌బాడీ) ఊపిరితిత్తుల్లోపలికి వెళ్లడం వల్లనేమో అని డాక్టర్లు అనుమానిస్తారు. అంటే... సాఫ్ట్ టాయ్స్‌లో ఉండే నూగు, రగ్గుల్లో ఉండే నూలు (ఊల్), పెంపుడు జంతువుల మృదువైన వెంట్రుకలు దుమ్ము, ధూళి వంటివి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించినప్పుడు వచ్చే అలర్జీ వల్ల దగ్గు రావచ్చు. ⇔ పిల్లల్లో బోర్డెటెల్లా పెర్ట్యుసిస్ అనే బ్యాక్టిరియమ్ ఇన్ఫెక్షన్ వల్ల నిరంతరాయం దగ్గు రావచ్చు. దీన్నే సాధారణ పరిభాషలో ‘కోరింత దగ్గు’ అంటారు. ఇదేగాక మరికొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్లా దగ్గురావచ్చు. ⇔ పిల్లల్లో గుండె కవాటాలు, గుండె గోడల్లోని చిల్లులకు సంబంధించిన వ్యాధులు (వీఎస్డీ, ఏఎస్డీ, పీడీఏ) వంటివి ఉన్నప్పుడు కూడా దగ్గు ఎక్కువగా కనిపిస్తుంది. దాంతోపాటు ఆయాసం కూడా ఉంటుంది. కొందరు పిల్లలు నీలంగా మారిపోతుంటారు. ఇలా నీలంగా మారే లక్షణాన్ని సైనోసిస్ అంటారు. ఈ లక్షణం కనిపిస్తే దాన్ని తప్పక గుండె జబ్బుగా అనుమానించి తక్షణం చికిత్స చేయాలి. ఐదేళ్ల నుంచి 14 ఏళ్ల పిల్లల్లో... దగ్గు ఎక్కువగా వస్తుంటే అలర్జీ వల్ల శ్వాసనాళాలు కుంచించుకుపోయాయేమో అని అనుమానించాలి. ఎందుకంటే... అలర్జీకి సంబంధించిన ప్రధాన వ్యాధి ఆస్తమాకు ప్రధాన లక్షణమైన పిల్లికూతల (వీజింగ్) కంటే మొట్టమొదట కనిపించే లక్షణం దగ్గే. దగ్గు వస్తూ ఉంటే ఏం చేయాలి? ⇔ రోగి ఆరోగ్య చరిత్ర (హిస్టరీ)ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. రోగికి ఆ లక్షణం ఎందుకు కనిపిస్తుందో తెలుసుకుంటే సగం సమస్య తీరినట్టే. ⇔ అది తడి దగ్గో, పొడి దగ్గో చూసి అందుకు కారణాలను అనుమానించాలి. జ్వరం కూడా ఉందా అన్న అంశాన్ని పరిశీలించాలి. ⇔ ఎక్స్-రే సహాయంతో ఊపిరితిత్తులు రెండూ స్పష్టం (క్లియర్)గా ఉన్నాయా లేదా చూడాలి. (టీబీ, నిమోనియా, క్యాన్సర్లు వంటి వ్యాధులను దాదాపు 99 శాతం ఎక్స్-రేతో తెలుసుకోవచ్చు). సీటీ స్కాన్ (ఛాతి) కూడా వ్యాధి నిర్ధారణకు తోడ్పడుతుంది. ఒకవేళ దగ్గు - బాక్టీరియా (టీబీ) వల్ల అయితే అందుకోసం కళ్లె పరీక్ష చేసి నిర్ధారణ చేయవచ్చు. దగ్గు వచ్చే రోగులకు రొటీన్‌గా చేసే రక్తపరీక్ష, షుగర్, ఈసీజీ, టూ డీ ఎకో పరీక్షలు కూడా చేస్తారు. పీఎఫ్‌టీ, తెమడ పరీక్ష వంటివి కూడా చేస్తారు. పెద్దల్లో కనిపించే దగ్గు.. ⇔ అలర్జీతో : పెద్దల్లో కనిపించే తగ్గు ప్రధానంగా అలర్జీ వల్ల అయి ఉంటుందని అనుమానించాలి. ⇔ పొగతాగడం వల్ల : స్మోకర్స్లో పొగాకు వినియోగం వల్ల అనేక రసాయనాలు ఊపిరితిత్తులోకి వెళ్తాయి. దీర్ఘకాలం పొగతాగిన వారిలో ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్ల దగ్గు వస్తూ నల్ల రంగు తెమడ కూడా పడుతుంది. ⇔ ఇన్ఫెక్షన్లతో : పెద్దల్లో కనిపించే దగ్గు ప్రధానంగా టీబీ వల్ల రావచ్చు. మన జనాభాలో 75 శాతం నుంచి 85 శాతం మందిలో టీబీకి సంబంధించిన బ్యాక్టీరియా ఉంటుంది. అయితే మనలోని వ్యాధి నిరోధకశక్తి (ఇమ్యూనిటీ) వల్ల అది నిర్వీర్యంగా అలా ఉండిపోతుంది. కాని... కొందరిలో ఏవైనా కారణాలతో వ్యాధినిరోధక శక్తి లోపించినప్పుడు టీబీ వ్యాధి కనిపిస్తుంది. అయితే టీబీ ఉన్న ప్రతివారికీ అలా ఎడతెరిపి లేకుండా దగ్గు రాదు. అప్పుడప్పుడు మాత్రమే దగ్గు కనిపిస్తుంటుంది. కొందరిలో తెమడ పడుతుంది. అయితే సాయంత్రం వేళల్లో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. బరువు, ఆకలి తగ్గుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తూ సాయంత్రం వేళ జ్వరం కనిపిస్తున్నప్పుడు తప్పక టీబీ వ్యాధిని అనుమానించాలి. అంతేకాదు... టీబీ కనిపించిందంటే వ్యాధినిరోధకశక్తి తగ్గడానికి హెచ్ఐవీ లాంటి ఇంకేదైనా ఇతర ఇన్ఫెక్షన్ కారణమయ్యిందా అన్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఇతరత్రా వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా చేయాలి. పెద్దల్లో కంటే పిల్లల్లో ఎందుకు ఎక్కువ...? పెద్దల్లో కంటే పిల్లల్లో దగ్గు ఎక్కువగా కనిపించడం సహజమే. పెద్దల్లోలా పిల్లలు తమలో ఉత్పత్తి అయ్యే తెమడను బయటకు లాగివేయలేరు. అందుకే అది వాళ్ల కడుపులోకి వెళ్తుంది. దాంతో వాంతి అయి అది బయటకు వచ్చేస్తుంది. ఇలా జరిగినప్పుడు చాలామంది పిల్లలకు వాంతులు అవుతున్నాయేమో అని అనుమానిస్తారు. కాని వాళ్ల ఊపిరితిత్తుల్లో ఊరే స్రావాలే దీనికి కారణం. ⇔ నిమోనియా : దీంతో వచ్చే దగ్గుతో పాటు తెమడ ఆకుపచ్చగా లేదా పసుపు రంగులో పడవచ్చు. జ్వరం ఉంటుంది. కొందరిలో ఆయాసం కూడా రావచ్చు. ⇔ కొన్ని రకాల మందులు : పెద్దలకు హైబీపీ తగ్గించే ఏసీ ఇన్హిబిటార్స్ అనే మందులు (ఉదాహరణకు కార్డేజ్, ఇనామ్, ఇనేస్ వంటివి) వాడుతుంటే కొందరిలో దగ్గు కనిపించవచ్చు. ఈ మందుల వాడకాన్ని ఆపగానే దగ్గు తగ్గిపోతుంది. అలాంటప్పుడు వారికి ప్రత్యామ్నాయ ఔషధాలు వాడాల్సి ఉంటుంది. ⇔ గుండె జబ్బులు : హార్ట్ ఫెయిల్యూర్, పడుకుంటే దగ్గు రావడం, ఆయాసం, గుండెదడ, చాతీనొప్పి వంటివి కూడా కనిపించవచ్చు. తెమడ రంగును బట్టి... తడి దగ్గులో వచ్చే తెమడ (కళ్లె) రంగును బట్టి రకరకాల వ్యాధులను అనుమానించి, వాటికి తగిన విధంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించవచ్చు. తెమడ రంగు... ⇔ ఎర్రగా ఉంటే... ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చినప్పుడు ఎర్రరంగు కళ్లె పడవచ్చు. అయితే ఇలా ఎర్రరంగు పడ్డప్పుడల్లా అది క్యాన్సర్‌కు సూచన అని అందోళన పడాల్సిన అవసరం లేదు. ఇలా కనిపించేవాళ్లలోనూ క్యాన్సర్ ఉండేవారి శాతం చాలా తక్కువ. ⇔ నల్లగా ఉంటే... కాలుష్యం బారిన పడటం, పొగతాగడం వంటివి జరిగి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వస్తే అప్పడు దగ్గుతో పాటు వచ్చే కళ్లె నల్లగా ఉండవచ్చు. ఫ్యాక్టరీలకు, గనులకు దగ్గరగా ఉండేవారిలో నల్లరంగు కళ్లె కనిపించవచ్చు. చికిత్స: ఏ కారణం వల్ల దగ్గు వస్తోందో నిర్ధారణ చేశాక దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. సాధారణంగా దగ్గు తగ్గడానికి చాలామంది మందుల దుకాణాల్లో దొరికే దగ్గు మందులు వాడుతుంటారు. దాంతో తాత్కాలిక ఉపశమనంగా దగ్గు తగ్గినా వ్యాధి మాత్రం అలాగే లోపల ఉండిపోతుంది. ఒకవేళ సమస్య ముదిరితే అది ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అందుకే దగ్గు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా పూర్తిస్థాయి చికిత్స తీసుకోవాలి. దగ్గు వచ్చిన సందర్భాల్లో సాధారణంగా యాంటీబయాటిక్స్, యాంటీ టీబీ మందులు, శ్వాసనాళాలను వెడల్పు చేసే బ్రాంకోడయలేటర్స్, తెమడను బయటకు తెచ్చే మందులైన ఎక్స్పెక్టరెంట్స్ వంటి మందులు ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆవిరి పట్టడం కూడా దగ్గు నుంచి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. హెల్త్ క్విజ్ 1 మూత్రపిండాల్లోని రాళ్లను, ఇలా రాళ్లు ఏర్పడే ప్రక్రియను వైద్య పరిభాషలో ఏమంటారు? 2. కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో చికిత్స ఎలా చేస్తారు? 3. పైవిధంగా చేసే చికిత్స ప్రక్రియ పేరు ఏమిటి? 4. రాయిని బ్లాస్ట్ చేసినప్పుడు మూత్రనాళంలో స్టెంట్ ఎందుకు వేస్తారు? 5. మూత్రపిండాలలో రాళ్లు రాకుండా చూసుకోడానికి చేయాల్సిన అత్యంత ప్రధానమైన నివారణ చర్య ఏమిటి? జవాబులు : 1. రీనల్ క్యాల్క్యులీ అనీ, నెఫ్రోలిథియాసిస్ అనీ అంటారు. 2. లేజర్, అల్ట్రాసోనిక్ ప్రక్రియ ద్వారా రాయిని చిన్న చిన్న పలుకులు లేదా పొడి అయిపోయేలా చేస్తారు. 3. నాన్ ఇన్వేజివ్ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ (ఇఎస్డబ్ల్యుల్) 4. మూత్ర విసర్జన ప్రక్రియలో ఈ రాతి పలుకులు- మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయం గోడలకు ఒరుసుకుపోకుండా నివారించాలి కాబట్టి స్టెంట్‌ను వేస్తారు. 5. నీళ్లు ఎక్కువగా తాగాలి. -
హెల్త్‌కార్నర్
జలుబు, దగ్గుతో బాధపడేవారు ఇంట్లోనే టర్మరిక్ టానిక్ తయారు చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ తేనెను తీసుకొని ఓ గిన్నెలో వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు టీ స్పూన్ చొప్పున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ⇒ రోజూ మూడుపూటలా నాలుగుచొప్పున ఎండుద్రాక్షను తింటే... రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది. ⇒ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు గ్లాసు మంచినీరు తాగడం వల్ల గుండెపోటు రాకుండా ఉంటుంది. అలాగే స్నానం చేసే ముందు గ్లాసు నీళ్లు తాగితే బీపీ కంట్రోల్లో ఉంటుంది. ⇒ డిప్రెషన్లో ఉన్నప్పుడు నిమ్మకాయను ముక్కు దగ్గరకు పెట్టుకొని వాసన చూడాలి. అలా చేస్తే స్ట్రెస్ తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. ⇒ బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు... గోరువెచ్చని నీటితో ఒక ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్‌ను వేసుకోవాలి. దాంతో త్వరగా ఉపశమనం లభిస్తుంది. ⇒ వేడి నీళ్లలో 1 టీ స్పూన్ సోంపును వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి, అందులో టీ స్పూన్ తేనెను కలిపి మూడుపూటలా తీసుకుంటే... ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. -
సకాల చికిత్సతో పక్షవాతం దుష్ర్పభావాన్ని నివారించవచ్చు
పల్మునాలజీ కౌన్సెలింగ్ నాకు గత ఆర్నెల్లుగా దగ్గు, ఆయాసం వస్తోంది. చాలామంది డాక్టర్లకు చూపించుకున్నాను. చివరకు ఒక పెద్ద డాక్టర్‌గారు దాన్ని పల్మునరీ ఫైబ్రోసిస్ అని నిర్ధారణ చేశారు. ఆ తర్వాత ‘జబ్బుకు కారణమేమిటో తెలుసుకోవా’లన్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి ఈ విషయంలో తగిన సూచనలు ఇవ్వగలరు. - ఆనందరావు, ఇల్లందు పల్మునరీ ఫైబ్రోసిస్ అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక జబ్బు. ఇందులో ఊపిరితిత్తుల మీద చారల్లాగా వస్తాయి. ఇలా చార (స్కార్) రావడం పెరిగిపోతే అది కనెక్టివ్ టిష్యూ అనే కణజాలమంతా ఒకేచోట పోగుబడుతుంది. దాంతో మృదువుగా ఉండాల్సిన ఊపిరితిత్తుల గోడలు మందంగా మారతాయి. ఫలితంగా రక్తానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీనివల్ల రోగులు ఆయాసపడుతూ ఉంటారు. కొంతమంది రోగుల్లో దీనికి కారణం ఏమిటో తెలుసుకుంటారు. అయితే కొందరికి ఇలా జరగడానికి కారణం ఏమిటో తెలియదు. ఇలాంటి జబ్బును ఇడియోపథిక్ పల్మునరీ ఫైబ్రోసిస్ అంటారు. సాధారణంగా ఆయాసం, ఏదైనా పనిచేస్తున్నప్పుడు అది మరింత ఎక్కువ కావడం, ఎప్పుడూ పొడిదగ్గు వస్తుండటం, అలసట, ఛాతీలో ఇబ్బంది, కొంతమందిలో ఛాతీనొప్పి, ఆకలి తగ్గడం, నీరసం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఇది ప్రధాన జబ్బు కాదు. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య తర్వాత రెండో (సెడంటరీ) సమస్యగా ఇది వస్తుంది. కొన్నిసార్లు మన వ్యాధి నిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం (ఆటోఇమ్యూన్), వైరల్ ఇన్ఫెక్షన్స్, టీబీ లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వంటి కారణాలతో ఇది వస్తుంది. ఇక ఎప్పుడూ ఆస్బెస్టాస్, సన్నటి ఇసుక రేణువులనూ, సిమెంటు నిండి గాలి పీలుస్తుండటం, నిమోనియాను కల్పించే బ్యాక్టీరియా, ఫంగస్‌లతో ఉన్న గాలిని పీల్చడం, కోడిదాణా వంటి వ్యవసాయ పరిశ్రమలకు సంబంధించిన వాసనలు ముక్కుకు తగులుతూ ఉండటం వల్ల కూడా ఈ జబ్బు రావచ్చు. సిగరెట్ పొగ ఈ కండిషన్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది. సాధారణంగా దీనికి చాలా పరిమితమైన చికిత్స మాత్రమే లభ్యమవుతోంది. మంచి మందులు ఇంకా ప్రయోగదశలోనే ఉండి, అందుబాటులోకి రావల్సి ఉంది. ప్రస్తుతం కార్టికోస్టెరాయిడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు వాడుతూ ఊపిరితిత్తుల్లో వచ్చే వాపు, నొప్పి, ఎర్రబారే పరిస్థితిని (ఇన్ఫ్లమేషన్ను) అదుపు చేసే స్థితిలోనే వైద్యశాస్త్రం ఉంది. దీనికి తోడు అవసరమైనప్పుడు ఆక్సిజన్ పెట్టాల్సి ఉంటుంది. మీరు పెద్ద సెంటర్లలో నిపుణులైన పల్మునాలజిస్ట్లను సంప్రదించండి. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్. గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. నాకు తరచూ ఛాతీ ఎడమభాగంలో నొప్పి వస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈ నొప్పితో బాధపడుతున్నాను. కార్డియాలజిస్టును కలిసి గుండె సంబంధించిన అన్ని పరీక్షలూ చేయించుకున్నాను. సమస్య ఏమీ లేదని అంటున్నారు. కానీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. రాత్రివేళల్లో నొప్పి మరీ ఎక్కువ అవుతోంది. సమస్య ఏమై ఉంటుంది? ఈ నొప్పి తగ్గే మార్గం లేదా? - సురేశ్‌బాబు, పిడుగురాళ్ల మీరు తెలిపిన వివరాలు, పేర్కొన్న లక్షణాలను బట్టి మీకు ఆహార వాహికకు సంబంధించిన ‘రిఫ్లక్స్ డిసీజ్’తో బాధపడుతున్నట్లు అర్థమవుతోంది. ఇది సాధారణంగా స్థూలకాయం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఒకసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోండి. అందులో మీ రిఫ్లక్స్ డిసీజ్ తీవ్రత తెలుస్తుంది. రాత్రివేళల్లో నొప్పి ఎక్కువ అంటున్నారు కాబట్టి గ్యాస్ట్రో ఎంటరాలజిస్టును కలసి, ఆ నొప్పిని తగ్గించుకునే మందులు వాడండి. మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహారపదార్థాలు మీ సమస్యను తీవ్రతరం చేస్తాయి. వాటిని వాడటం వల్ల లక్షణాలు పెరుగుతాయి. వాటిని గుర్తించి, వాటినుంచి దూరంగా ఉండాలి. ఇటువంటి మార్పులతో మీ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. నా వయసు 32 ఏళ్లు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాను. మా దగ్గర నిర్వహించిన మెడికల్ క్యాంప్‌లో నాకు హెచ్‌బీఎస్‌ఏజీ పాజిటివ్ వచ్చిందని తెలిసింది. దీనివల్ల కాలేయం చెడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. నిజమేనా? నా వ్యాధి మందులతో తగ్గిపోతుందా? - ఎస్.ఆర్., హైదరాబాద్ మీరు హెపటైటిస్-బి అనే ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఈ వైరస్ రక్తంలో ఉన్నంత మాత్రాన కాలేయం చెడిపోయే అవకాశం లేదు. రక్తంలో ఈ వైరస్ ఉండే దశను బట్టి లివర్ చెడిపోయే అవకాశం ఉంటుంది. వైరస్ ఏ దశలో ఉందో తెలుసుకోడానికి కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. లివర్ ఫంక్షన్ పరీక్షలో తేడా వస్తే ఒకసారి మీకు దగ్గర్లో ఉండే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి చికిత్స తీసుకోవచ్చు. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ న్యూరాలజీ కౌన్సెలింగ్ మా అమ్మగారి వయసు 62 ఏళ్లు ఇటీవల ఆమెకు పక్షవాతం వచ్చింది. ఆ టైమ్‌లో ఇంట్లో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయాం. ఆసుపత్రికి తీసుకురావడం చాలా ఆలస్యం అయ్యింది. త్వరగా తీసుకొచ్చి ఉంటే ఇంకా మెరుగైన ఫలితం ఉండేదని తెలిపారు. ప్రస్తుతం మా అమ్మగారు మంచానికే పరిమితమై మాట్లాడలేకపోతున్నారు. క్రమం తప్పకుండా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నాం. పక్షవాతం వస్తే అది పూర్తిగా నయం కాదా? అసలు పక్షవాతం ఎందుకు వస్తుంది? వస్తే ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. దయచేసి మా అమ్మగారి సమస్యకు పరిష్కారం చూపించగలరు. - కళ్యాణి, చిత్తూరు పక్షవాతం విషయంలో ‘సమయం’ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారికి మొదటి మూడు గంటలలోపు చికిత్స ప్రారంభిస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. టైముకు హాస్పిటల్‌కు తీసుకొస్తే క్లాట్ బరస్టింగ్ థెరపీ ద్వారా ప్రాణాపాయం లేకుండా, కాళ్లు, చేతులు చచ్చుబడిపోకుండా, మాటపడిపోకుండా కాపాడవచ్చు. ఆలస్యం అయ్యే కొద్దీ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పక్షవాతం బారిన పడడానికి ప్రతి ఒక్కరిలో ముందస్తుగా కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఈ ప్రమాద ఘంటికలను ఏమాత్రం నిర్లక్షం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదిస్తే చాలా వరకు సమస్యను అధిగమించవచ్చు. మెదడులో రక్తసరఫరా ఆగిన చోటుపై లక్షణాలు ఆధారపడి ఉంటాయి. ముఖం బలహీనం కావడం, మూతి వంకరపోవడం, నడకలో తేడా రావడం, అస్పష్టంగా కనిపించడం, చేతులు బలహీనం కావడం, మాట్లాడడంలో ఇబ్బంది కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో సరైన చికిత్స అందిస్తే వైకల్యం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి. మీ అమ్మగారు మానసికంగా కుంగిపోకుండా చూసుకోండి. క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ సరైన చికిత్స అందించేలా చూడండి. పక్షవాతానికి జన్యుపరమైన కారణాలతో పాటు మారుతున్న జీవనశైలి, జంక్ఫుడ్స్, ఒత్తిడి, పొగతాగడం, మద్యపానం, స్థూలకాయం, మధుమేహం, హైపర్‌టెన్షన్ వంటి కారణాలుంటాయి. పక్షవాతం లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. మీకుగానీ, మీ తోబుట్టువులకు గానీ షుగర్, హైబీపీ గానీ ఉంటే మీరూ జాగ్రత్త తీసుకోవడం అవసరం. వాటిని నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. ఎక్కువగా తాజా ఆకుకూరలు, పండ్లతో పాటు మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకునేలా చూడండి. ఒత్తిడికి దూరంగా ఉంచేందుకు ప్రయత్నించండి. డాక్టర్ వికాస్ అగర్వాల్ సీనియర్ న్యూరో ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్. -
‘బైపాస్’ తర్వాత జాగ్రత్తలు...
ఆయుర్వేదం కౌన్సెలింగ్ మా పాపకు ఏడేళ్లు. నాలుగు నెలల నుండి పొడి దగ్గుతో బాధపడుతోంది. అప్పుడప్పుడు కొంచెం కళ్లె పడుతోంది. డాక్టర్లు ఎక్స్‌రే, రక్తపరీక్షలు చేసి ‘బ్రాంకైటిస్’ అని చెప్పారు. ఇది పూర్తిగా నయమవడానికి ఆయుర్వేద మందులు సూచించండి. - వరలక్ష్మి, రాజమండ్రి ఆయుర్వేద వైద్య పరిభాషలో దగ్గుని ‘కాస’ అంటారు. ఈ వయసు పిల్లల్లో ఇది తరచుగా కన్పిస్తుంది. మీరు రాసిన లక్షణాలను బట్టి దీన్ని పిత్త ప్రధానమైన, కఫానుబంధ కాసగా పరిగణించవచ్చు. ఈ కింద వివరించిన సూచనలు పాటించి మందులు వాడండి. ఒక నెలలో పూర్తిగా తగ్గిపోతుంది. ఆహారం: బయటి ఆహారం ఏ రూపంలోనూ సేవించకూడదు. ముఖ్యంగా చాక్లేట్లు, బిళ్లలు, లాలీపాప్‌లు, ఐస్‌క్రీమ్‌లు, శీతల పానీయాలను దూరంగా ఉంచాలి. వాటి తయారీలో వాడే రంగులు, తీపి కల్గించే పదార్థాలు, నిల్వ చేయడం కోసం వాడే ద్రవ్యాలు చాలా హానికరం. అలర్జీలు కల్గించే అవకాశం హెచ్చు. ఇక కల్తీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటికి తోడు రోగ నిరోధక శక్తిని తగ్గించడం, ఇన్ఫెక్షన్లకు గురికావడం సర్వసాధారణం. ఈ విషయాలను సమగ్రంగా అవగాహన చేసుకొని తల్లిదండ్రులు జాగ్రత్త వహించక పోతే, మందుల ప్రయోజనం నామమాత్రమే అవుతుంది. దగ్గు మాటిమాటికీ తిరగబెడుతూనే ఉంటుంది. క్షయ వ్యాధులు కలగటానికి కూడా అవకాశం ఉంటుంది. మనం నివసించే ప్రాంతంలోని వాతావరణ కాలుష్యం కూడా ఇలాంటి దగ్గులను కల్గించగలదు. కాబట్టి ఇక్కడ మందులతో బాటు ‘నిదానపరివర్జనం’ కూడా చాలా ముఖ్యమైన అంశం. అంటే వ్యాధి కారణాన్ని దూరం చేయటం, లేదా, ఆకారణాలకు మనం దూరమవటం. పాలు, పండ్లు, పెరుగు, పప్పులు, ఆకుకూరలు, ఇతర కూరగాయలు, ఎండు ఫలాలు, ఇతర మాంసకృత్తులు మిన్నగా లభించే ఆహారాన్ని, సమతుల్యంగా సేవించవలసి ఉంటుంది. ఆవు నెయ్యి, ఆవుపాలు, ఆవు పెరుగు పుష్టికరమని గుర్తుంచుకోండి. ఉప్పు, పులుపు, మసాలాలను ఎంత తక్కువ తింటే అంత మంచిది. విహారం: వయసుని బట్టి తగు రీతిలో శారీరక శ్రమ, అంటే ఆటల రూపంలో వ్యాయామం చాలా అవసరం. ప్రాణాయామం చేస్తే, ఊపిరితిత్తుల శక్తి పెరుగుతుంది. వీటన్నిటికంటే ముఖ్యమైనది మానసిక ఒత్తిడి. కేవలం దగ్గే కాదు; కడుపునొప్పి; మలబద్దకం, విరేచనాలు, తలనొప్పి వంటి రుగ్మతలు కూడా ఆ ‘ఒత్తిడి’ వల్ల సంభవిస్తాయి. మందులు: 1) అభ్రకభస్మ 100 మి.గ్రా. + ప్రవాళపిష్ఠి 100 మి.గ్రా. కలిపి తేనెతో రోజూ రెండు పూటలా నాకించాలి. 2) వాసా కంట కారీ లేహ్యం: ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా చప్పరించాలి. 3) వ్యోషాదివటి మాత్రలు: ఉదయం 1, రాత్రి 1 ఈ మందులు ఒక నెల రోజులు వాడి పరిస్థితిని సమీక్షించుకోవలసి ఉంటుంది. కార్డియాలజీ కౌన్సెలింగ్ మా అమ్మకు బైపాస్ సర్జరీ అయ్యింది. ఆమె విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - రవికుమార్, శ్రీకాకుళం అన్ని కండరాలకు అందినట్టే గుండెకండరానికి కూడా రక్తం ద్వారా పోషకాలు, ఆక్సిజన్ అందాలి. కానీ గుండెకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడిన వాళ్ల గుండె కండరానికి తగినంత రక్తం అందదు. దాంతో క్రమంగా గుండె కండరం చచ్చుబడిపోతుంది. గుండెకు తగినంత రక్తం అందేలా చేయడం కోసం చేసే ఈ శస్త్రచికిత్సలో కాలినుంచి రక్తనాళాన్ని తీసుకుని, దాని ద్వారా గుండెకండరానికి రక్తం అందేలా బైపాస్ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. ఈ సర్జరీ వాళ్లు మొదటి ఆరు వారాల్లో పాటించాల్సిన జాగ్రత్తలివి. డాక్టర్లు సూచించిన ఆరోగ్యకరమైన వ్యాయామాలను రోజుకు రెండుసార్లు... పదినిమిషాల పాటు చేయాలి ఏమాత్రం భారం పడకుండా పది పదిహేను నిమిషాల పాటు రోజుకు రెండుసార్లు నడక (వాకింగ్)కు ఉపక్రమించాలి అకస్మాత్తుగా ముందుకు, వెనక్కు, పక్కలకు ఒంగడం వంటివి చేయకూడదు మూడు కిలోలకు మించిన బరువు కనీసం నెలరోజుల పాటు ఎత్తవద్దు నేల మీద కూర్చోవడం, కాలుమీద కాలేసుకోవడం వంటివి చేయకండి శస్త్రచికిత్స కోసం శరీరంపై గాటు పెట్టిన చోట ఎలాంటి ఒత్తిడీ పడకుండా చూసుకోండి భారమైన పనులు చేయకండి డాక్టర్లు సూచించిన మందులు క్రమం తప్పకుండా చేయండి. శస్త్రచికిత్స అయిన ఆరు వారాల తర్వాత : దీర్ఘకాలంలో గుండెపై కలిగే దుష్ర్పభాలను నివారించడానికి ఈ జాగ్రత్తలు తోడ్పడతాయి. అవి... కొలెస్ట్రాల్ పాళ్లను అదుపులో ఉంచుకోండి. అందుకు తగినట్లుగా డాక్టర్ల సూచన మేరకు ఆహార, వ్యాయామ నియమాలను పాటించండి రక్తపోటును అదుపులో ఉంచుకోండి. ఇందుకోసం డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూనే... రిలాక్సేషన్ ప్రక్రియలైన ధ్యానం, యోగా వంటివి చేయండి. రక్తంలో చక్కెర పాళ్లను తెలుసుకునే పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకుంటూ, మీ డాక్టర్‌కు తెలియజేస్తూ ఉండండి. అందులో వచ్చిన మార్పులను బట్టి వైద్యులు మీ మందులను మార్చడం వంటివి చేస్తారు సిగరెట్ పొగకు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎక్స్పోజ్ కావద్దు. అది రక్తనాళాల మృదుత్వాన్ని దెబ్బతీయడంతో పాటు అవి రక్తనాళాలు సన్నబారేలా చేయవచ్చు. పైగా ఆ పొగ గుండె వేగాన్ని పెంచుతుంది. కాబట్టి పొగాకు ఏరూపంలోనైనా తగదు మద్యంకూడా గుండెకు హానిచేసేదే ఒత్తిడికి గురికావడం రక్తపోటును పెంచి, గుండెపోటుకు దారితీసేలా చేసే అంశం. కాబట్టి ఒత్తిడి లేకుండా చూసుకోండి ఒకే చోట కూర్చొని ఉండకండి. చురుగ్గా ఉండే జీవనశైలి మార్పుతోనూ గుండెజబ్బును నివారించుకోండి. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 33 ఏళ్లు. ఆఫీసులో కంప్యూటర్‌పై ఎక్కువగా పనిచేస్తుంటాను. నా కుడిభుజంలో గత మూడు నెలలుగా నొప్పి వస్తోంది. ఇది చాలా ఇబ్బంది కలిగించేలా డల్ పెయిన్ మాదిరి వచ్చినా ఒక్కోసారి తీవ్రంగా లోపల గుచ్చుతున్నట్లుగా నొప్పి (షార్ప్ పెయిన్)గా మారిపోతోంది. ముఖ్యంగా నా చేతిని తల కంటే పైకి ఎత్తినప్పుడు ఈ నొప్పి వస్తోంది. మధ్యమధ్యన నొప్పి తెలియడం లేదు. కానీ ఇది తరచూ తిరగబెడుతోంది. నేను బాడ్మింటన్ ఎక్కువగా ఆడుతుంటాను. దీని వల్ల నొప్పి పెరుగుతోందా అన్న విషయం నాకు తెలియడం లేదు. నేను వ్యాయామం చేస్తే నొప్పి తగ్గుతుందని అంటున్నారు. కానీ నిజానికి నా నొప్పి వ్యాయామం తర్వాత మరింత పెరుగుతోంది. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పగలరు. - చంద్రశేఖర్, రాజేంద్రనగర్ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీకు భుజంలోని రొటేటర్ కఫ్ అని పేరుండే కొన్ని కండరాల సమూహంలో సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. ఇవి ఏదైనా ఎత్తడానికి ఉపయోగపడతాయి. భుజానికి సంబంధించిన రెండు ఎముకల మధ్యలోంచి వెళ్తాయి. ఆ కండరాలకు ఏదైనా సమస్య వస్తే వాటిలో వాపు వస్తుంది. అప్పుడు మనం భుజం ఎత్తడానికి ప్రయత్నిస్తుంటే ఈ కండరాలు రెండు ఎముకల మధ్య నలిగిపోతుంటాయి. ఒక్కోసారి ఈ కండరాలు కొద్దిగా చిట్లిపోవచ్చు కూడా. ఇది అక్కడ గాయం అయ్యేలా చేస్తుంది. మీరు భుజంతో చేసే పనుల వల్ల ఈ గాయం మరింత రేగే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో ఇది తగ్గడం కోసమే ఉద్దేశించిన ప్రత్యేకమైన వ్యాయామాలు చేయాలి. ఇలా రొటేటర్ కఫ్ సమస్య వచ్చినప్పుడు క్రికెట్, బాడ్మింటన్ వంటి ఆటలు ఆడటం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. మీరు ఒకసారి మీ భుజం ఎక్స్‌రే, ఎమ్మారై స్కాన్ వంటివి పరీక్షలు చేయించుకొని, ఆర్థోపెడిక్ సర్జన్‌ను చూడాలి. -
భళా బలియా..!
జలుబు, దగ్గు వస్తే ఇంట్లోనే పసుపు మింగో, నాలుగు తులసి ఆకులు నమిలో తగ్గించుకుంటాం. జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటివి వస్తే డాక్టరు దగ్గరకు వెళ్లి నయం చేసుకుంటాం. ఎందుకంటే అవి వాతావరణ మార్పిడి వల్ల వచ్చి వెళ్తుంటాయి కాబట్టి. మరి రోజూ తాగే నీరే కలుషిత మైతే, దానివల్ల జబ్బులు చుట్టుముడితే ఏం చేయాలి? ఉత్తరప్రదేశ్‌లోని బలియా గ్రామస్తులు ఇదే ప్రశ్న వేశారు. ఒకరోజు రెండు రోజులు కాదు... కొన్ని నెలలు! కానీ వారికి ఎవరూ సమాధానం చెప్పలేదు. అందుకే ఆ సమాధానాన్ని వాళ్లే వెతుక్కున్నారు. ప్రజలకు సురక్షితమైన నీరు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో బోర్లు వేయించి చేతి పంపులు అమర్చింది. ఆ రోజు బలియా గ్రామస్తుల సంతోషం అంతా ఇంతా కాదు. అయితే అంతటి సంతోషం కొద్ది రోజుల్లో ఆవిరైపోయింది. బోరింగ్ నీళ్లు తాగడం మొదలు పెట్టిన తర్వాత చర్మ వ్యాధులు రావడం మొదలైంది. చర్మంపై దద్దుర్లు రావడం, చర్మం రంగు మారడం, కాళ్లూ చేతులు వాయడం వంటి సమస్యలు తలెత్తాయి. తర్వాత కొన్ని రోజులకే దగ్గు, అజీర్తి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లాంటి సమస్యలు కూడా ముంచెత్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తిరిగారు. అధికారులకు తమ గోడును విన్నవించు కున్నారు. రెండేళ్లకు గానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. సర్వే చేయించలేదు. తీరా చేయించాక తెలిసిందేమిటంటే... బోరింగుల్లోని నీటిలో ఆర్సెనిక్ అనే రసాయనం ఉందని, దాని కారణంగానే ఈ రోగాలు వస్తున్నాయని. అయితే పరిష్కార మార్గాలు వెతకడానికి సమయం కావాలన్నారు అధికారులు. ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్న పని కదా! అయితే యేళ్లు గడిచాయి. సమస్యలు ఉధృతమయ్యాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. చూసి చూసి విసిగిపోయారు గ్రామస్తులు. కళ్లముందే తమవాళ్లు నరకయాతన పడుతుంటే చూడలేకపోయారు. ఎవరి సాయం కోసం చూడకుండా తామే సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా అడుగులు వేయడం మొదలు పెట్టారు. తమ ప్రాంతంలో 30-40 మీటర్ల లోతులోనే ఈ ఆర్సెనిక్ రసాయనం ఉందన్న విషయం అధికారుల ద్వారా తెలిసింది గ్రామస్తులకి. తమ ఇళ్లలోని బావుల లోతు వాటి కంటే తక్కువే. కాబట్టి బావుల నీటిలో ఆర్సెనిక్ ఉండదు. అంటే ఆ నీరు సురక్షితమే. తాగొచ్చు. కానీ బోర్లు పడ్డాయి కదా అని బావుల్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. అవన్నీ చెత్తతో పూడుకుపోయే స్థితికి చేరుకున్నాయి. ఇప్పటికైనా బాగు చేయకపోతే పూర్తిగా మూసుకుపోతాయి. అందుకే ఇక ఆలస్యం చేయలేదు. బావుల్ని పునరుద్ధరించే పని మొదలు పెట్టారు. బలియా గ్రామానికి చెందిన దిలీప్ అనే యువకుడు, ధనిక్‌రామ్ వర్మ అనే 95 ఏళ్ల వృద్ధుడు ఈ మహాయజ్ఞానికి నాంది పలికారు. ఊళ్లోవాళ్లందరినీ ఒక్కచోటికి చేర్చారు. తాము చేయవలసినదేమిటో వివరించారు. అందరినీ కలుపుకుని బావుల పునరుద్ధరణ ప్రారంభించారు. చేయి చేయి కలిస్తే, అందరూ ఒక్క తాటి మీద నడిస్తే... సాధ్యం కానిది ఏముం టుంది! వారి ప్రయత్నం ఫలించింది. ఊరి బావులకు కొత్త కళ వచ్చింది. వాటిలోని నీరు వారికి ఆధారమైంది. వారి రోగాలకు ముగింపు పలికింది. జీవితాలను మళ్లీ ఆనందమయం చేసింది. అయితే ధనిక్‌రామ్ వర్మ దానితోనే సంతోషపడి ఊరుకోలేదు. ఆ రాష్ట్రంలో 31 జిల్లాల్లో ఈ ఆర్సెనిక్ సమస్య ఉందని తెలుసుకొని, తన గ్రామస్తులతో కలిసి ఆ ఊళ్లన్నీ తిరిగాడు. తాము అనుసరించిన విధానాన్నే వారికీ నేర్పించాడు. పాడు బడిన బావుల్ని బాగు చేయించాడు. అసలు బావులే లేని చోట తవ్వించాడు. ఇప్పుడు ఆ గ్రామాలన్నీ ఆర్సెనిక్ నుంచి విముక్తి పొందాయి. ఆరోగ్య కరమైన నీటినే తాగుతూ ఆనందంగా ఉంటున్నాయి. ఇదంతా బలియా గ్రామస్తుల చలవ అని గొప్పగా చెబుతు న్నాయి. నిజమే మరి. వాళ్లే కనుక ముంద డుగు వేయకపోతే, అంత పెద్ద సమస్య పరిష్కారమయ్యేది కాదు. ఇందరి జీవితా ల్లోకి సంతోషం వచ్చేదీ కాదు. - నిఖిత నెల్లుట్ల -
పల్మునాలజీ కౌన్సెలింగ్
బాబుకు ఎప్పుడూ పొడి దగ్గే, ఏం చేయాలి? మా అబ్బాయి వయసు 16 ఏళ్లు. వాడు ఎప్పుడూ పొడి దగ్గుతో బాధపడుతున్నాడు. శ్వాస అందడం లేదు. కొద్దిగా జ్వరం కూడా వస్తోంది. మా డాక్టర్‌ను సంప్రదిస్తే వాడిది ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ అని చెప్పారు. అంటే ఏమిటి? - ఖాసీమ్, మహబూబ్‌నగర్ ఆస్తమా వ్యాధులలో అనేక రకాలు ఉంటాయి. కాఫ్ వేరియెంట్ ఆస్తమా అనేది ఆస్తమాలోనే ఒక రకం. దీనిలో బాధితుడికి ఎప్పుడూ పొడిదగ్గు వస్తూ ఉంటుంది. అంటే తెమడ పడదన్నమాట. వీళ్లకు పిల్లికూతలు లాంటి సంప్రదాయ ఆస్తమా లక్షణాలు కనపడవు. దీన్నే కొన్నిసార్లు ‘క్రానిక్ కాఫ్’ (దీర్ఘకాలం వచ్చే దగ్గు) అని కూడా అంటారు. అంటే ఇది ఆరు నుంచి ఎనిమిది వారాల పైగానే కొనసాగుతుంది. రాత్రీ పగలూ అనే తేడా లేకుండా దగ్గు వస్తూనే ఉంటుంది. రాత్రివేళ ఎడతెరపి లేని దగ్గు వల్ల నిద్రపట్టదు. ఇలాంటి రోగుల్లో వాళ్లకు సరిపడని దానికి ఎక్స్పోజ్ అయితే అది ఆస్తమాను ప్రేరేపిస్తుంది. ఉదాహరణకు ఘాటైన వాసనలు, దుమ్ము, చల్లగాలి వంటివి. ఈ కాఫ్ వేరియెంట్ ఆస్తమా ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇది ఎక్కువ. ఇది ఆ తర్వాత సాధారణ ఆస్తమాకు దారితీస్తుంది. అంటే శ్వాస అందకపోవడం, పిల్లికూతలు తర్వాతి దశలో వస్తాయన్నమాట. సాధారణ ఆస్తమా లాగే కాఫ్ వేరియెంట్ ఆస్తమాకు కూడా కారణాలు అంతగా తెలియవు. కాకపోతే సరిపడని వస్తువులు, చల్లగాలి దీనికి కారణాలుగా భావిస్తుంటారు. కొందరిలో అధిక రక్తపోటు, గుండెజబ్బులు, హార్ట్‌ఫెయిల్యూర్, మైగ్రేన్, గుండెదడ (పాల్పిటేషన్స్) వంటి జబ్బులకు వాడే మందులైన బీటా-బ్లాకర్స్ తీసుకున్న తర్వాత ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ మొదలైన దాఖలాలు కొన్ని ఉన్నాయి. అలాగే గ్లకోమా వంటి కంటిజబ్బులకు వాడే చుక్కల మందులోనూ బీటా బ్లాకర్స్ ఉండి, అవి ఆస్తమాను ప్రేరేపిస్తాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరిలో ఆస్పిరిన్ సరిపడకపోవడం వల్ల కూడా దగ్గుతో కూడిన ఆస్తమా రావచ్చు. కాఫ్ వేరియెంట్ ఆస్తమాలో కేవలం దగ్గు తప్ప ఇతర లక్షణాలేమీ కనిపించకపోవడం వల్ల దీని నిర్ధారణ ఒకింత కష్టమే. ఎందుకంటే కాఫ్ వేరియెంట్ ఆస్తమా విషయంలో సాధారణ పరీక్షలైన ఛాతీఎక్స్‌రే, స్పైరోమెట్రీ వంటి పరీక్షలూ నార్మల్‌గానే ఉంటాయి. కాబట్టి మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న ఛాతీ నిపుణుడిని కలవండి. ఆ డాక్టర్ మీ కుమారుడిని అనేక ప్రశ్నలు అడిగి తెలుసుకొని, మీ కుటుంబ వ్యాధుల చరిత్రను అధ్యయనం చేసి, శ్వాసించే తీరును విని వ్యాధి నిర్ధారణా, తగిన చికిత్సా చేస్తారు. -
దగ్గుకు దివ్యౌషధం
ఇది సీజన్ మారుతున్న తరుణం. ఈ సమయంలో చిన్నారులను జలుబు, దగ్గు బాధిస్తుంటాయి. ఇటువంటప్పుడు చాలామంది చేసే పని- మెడికల్ షాపులలో దగ్గుమందు కొనుక్కొచ్చి ఇవ్వడం! అయితే పిల్లలకు అలా విచక్షణా రహితంగా దగ్గుమందులు ఇవ్వడం అంత మంచిది కాదు. దాని బదులు వారికి రెండుస్పూన్లు తేనె నాకించడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. శరీరంలో తీపిని నియంత్రించే నాడులకు, దగ్గును నియంత్రించే నాడులకు దగ్గరి సంబంధం ఉంటుందట. అందువల్ల తేనెలోని తీపి, విటమిన్ సి, సహజమైన ఫ్లేవనాయిడ్లు లాలాజలాన్ని పలచబార్చి, దగ్గును తగ్గిస్తాయట. కేవలం దగ్గు వచ్చినప్పుడే కాకుండా రాత్రిపూట పడుకునేముందు రెండుస్పూన్ల తేనెను నాకిస్తే మంచిదని వైద్యులు చెబుతున్నారు. -
వీటిని ఎందుకు నిషేధించారంటే..!
నిషేధిత మందులు జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ అనారోగ్యాలు వస్తే మందుల దుకాణానికి వెళ్లి తెలిసిన మందులేవో వేసుకోవడం పరిపాటి. కానీ వాటిల్లో కొన్ని నిషేధించిన మందులని చాలామందికి తెలియకపోవచ్చు. నిషేధించినప్పటికీ దుకాణాల్లో దొరుకుతున్న కొన్ని మందుల వివరాలు, వాటిని నిషేధించడానికి కారణాలు ఇవి. జలుబు, దగ్గును తగ్గించే ఫెనిల్ప్రోపనోలమైన్ వాడకం వల్ల దీర్ఘకాలంలో పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. నొప్పి నివారణి అనాల్జిన్ వల్ల, వాపులకు వాడే ఆక్సిఫెన్బుటాజోన్ వల్ల ఎముకల్లోని మూలుగు బలహీనపడుతుంది. జ్వరం, ఒళ్లు నొప్పులకు వాడే నిమెసులైడ్ కారణంగా కాలేయం దెబ్బతింటుంది. ఎసిడిటీ, మలబద్దకం తగ్గడానికి వాడే సిసాప్రైడ్ వాడడం వల్ల గుండె పనితీరు క్రమం తప్పుతుంది(ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్). ఒత్తిడిని తగ్గించే డ్రోపెరిడోల్ వల్ల కూడా గుండె పనితీరులో ఒడుదొడుకులు వస్తాయి. డయేరియాను తగ్గించే ఫురాజోలిడోన్, గాయాలకు రాసే పూతమందు (యాంటీబ్యాక్టీరియల్ క్రీమ్) నైట్రోఫురాజోన్ వల్ల క్యాన్సర్ ముప్పు ఉంటుంది, క్వినిడోస్లార్ వల్ల కంటి చూపు మందగించే ప్రమాదం ఉంటుంది.నులిపురుగులు తగ్గడానికి వాడే పైపరేజైన్తో నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. -
చలి చంపేస్తోంది!
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: బారెడు పొద్దెక్కినా నిద్ర లేచేందుకు శరీరం సహకరించని పరిస్థితి. వ్యాయామం చేసేందుకు తెల్లవారుజామున బయటకొస్తే చలి కొరికేస్తోంది. సాయంత్రం నుంచే ప్రజలు ముడుచుకుపోతున్నారు. వారం రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 8 గంటలు దాటినా తీవ్రత తగ్గడం లేదు. గరిష్టంగా 30, కనిష్టంగా 16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. గత నెల రోజులుగా వరుస తుపానులే ఇందుకు కారణంగా వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇకపై చలి తీవ్రత మరింత పెరుగుతుందనే సమాచారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా మఫ్లర్లు, స్వెట్టర్లు, దుప్పట్లు, మంకీ క్యాప్‌లకు గిరాకీ పెరుగుతోంది. చిన్న పిల్లలను బయట తిప్పేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం, ఆస్తమా, అలర్జీ బాధితులు వైద్యుల వద్దకు పరుగులు తీస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త - డాక్టర్ జి.సుధాకర్, చిన్నపిల్లల వైద్యనిపుణులు చలికాలంలో బరువు తక్కువగా ఉండి జన్మించిన పిల్లలు, నెలలు నిండకముందే జన్మించిన చిన్నారులతో పాటు ఏడాదిలోపు వయస్సు చిన్నారుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వీరి శరీర ఉష్ణోగ్రత 36.5 డిగ్రీల సెల్సియస్, 98.4 ఫారెన్‌హీట్ డిగ్రీలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇళ్లలో ఉంటే తలుపులు, కిటికీలు మూసివేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో నులకమంచం కింద కుంపట్లు పెట్టేవారు. అలా కాకపోతే రూంహీటర్లు వినియోగించాలి. ఎట్టి పరిస్థితుల్లో చన్నీటి స్నానం చేయించకూడదు. గోరువెచ్చని నీటితో కాస్త ఎండపడ్డాక 5 నిమిషాల్లో స్నానం ముగించాలి. వ్యాధుల బారిన పడితే వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. -
దగ్గు ఆయాసం, అలర్జీ - అస్తమాకు హోమియోలో తగిన చికిత్స
మానవ శరీరం ఒక అద్భుతం! శరీరంలోని ఎలాంటి పదార్థాలు, క్రిములు వచ్చినా వాటిని ఎదుర్కొని పోరాడేలా దేవుడు దానిని నిర్మించాడు. దీనినే మనం ‘‘ఇమ్మూనిటీ’’ లేదా రోగ నిరోధక వ్యవస్థ అంటారు. దీని వలన మన శరీరంలోనికి గాలి ద్వారా, నీటిద్వారా, ఆహారం ద్వారా ఎలాంటి ప్రతికూల పదార్థములు బాక్టీరియా, వైరస్, ఫారెన్ ప్రొటీన్లు వచ్చినా తెల్లరక్తకణాలు వాటితో పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే కొంత మందిలో ఈ వ్యాధినిరోధక వ్యవస్థ ఇతరులకు ఎలాంటి హాని కలిగించని పదార్థాల వలన కూడా సున్నితంగా ప్రతిస్పందిస్తుంది. దీనినే ‘‘హైపర్ సెన్సిటివీటి’’ లేదా ‘‘అలర్జీ’’ అని అంటారు. గాలిలో దుమ్ము, పుప్పొడి వంటివి ఉన్నప్పుడు అలర్జీతో బాధపడేవారికి ఇక అదే పనిగా వరుసబెట్టి తుమ్ములు వస్తాయి. ఆ తర్వాత ముక్కు ఎరుపెక్కి, జలుబు చేసి, పల్చని నీరులా స్రవిస్తుంది. దానితో పాటు కళ్ళు ఎరుపెక్కి కళ్ళ నుండి నీరు కారుతుంది. దీనిని అశ్రద్ధ చేసినట్లయితే ముక్కు దిబ్బడ, గాలి సరిగ్గా ఆడకపోవడం, గొంతులోనికి కళ్ళె వస్తూ ఉండడం, ముఖం లోపలిభాగంలో నొప్పి, తలనొప్పి మొదలైతే ‘‘అలర్జిక్ సైనసైటిస్’’ అని, గాలి గొట్టాలలోనికి, ఊపిరితిత్తులకు సోకి పొడి దగ్గు, కళ్లెతో కూడి దగ్గు మొదలైతే ‘‘అలర్జిక్ బ్రాంకైటిస్’’ అని ఆయాసం, ఎగపోయడం, పిల్లికూతలు వంటి లక్షణాలు కన్పిస్తే ‘‘అలర్జిక్ ఆస్థ్మా’’ అని అంటారు. ***************** దగ్గు అనేది సాధారణంగా అందరిలో కనిపించే ఒక లక్షణం. ఏదైనా దుమ్ము, ధూళి లేదా అలర్జీలు లోపలికి ప్రవేశించేటప్పుడు, దగ్గు అనే ప్రక్రియ ద్వారా అని బయటకు రావటం జరుగుతుంది. ఒక్కొక్కసారి పొడిదగ్గు లేదా శ్లేష్మంతో కూడిన దగ్గు కూడా వస్తూ ఉంటుంది. సాధారణంగా, దగ్గు చాలా ఎక్కువగా చిన్న పిల్లల వయసు నుంచి గమనిస్తూ ఉంటాము. శ్లేష్మంతో కూడిన దగ్గు ముక్కు నుంచి గొంతులోకి పోయి, అక్కడి నుంచి సైనస్ లేదా ఊపిరితిత్తులలోకి ప్రవేశించడం జరుగుతుంది. శ్లేష్మంతో కూడిన దగ్గుకి చాలా త్వరితంగా చికిత్స చేయలేకపోతే అది ఆస్త్మా కిందకు మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కారణాలు: వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన దీర్ఘకాలికంగా ఊపిరితిత్తులకు వ్యాధులుసోకిన గ్యాస్ట్రో ఈసోఫెజియల్ రిఫ్లక్స్ డిసీజ్‌తో ముక్కునుంచి వచ్చే స్రావం గొంతులోకి వెళ్ళటం పొగతాగటం దుమ్ము, ధూళిలో తిరగడం వలన ఏదైనా పదార్థం గొంతులో అడ్డుపడటం వలన ఇంచు మించు శ్లేష్మం ఉన్నా, లేకపోయినా, దగ్గు గనుక 2-3 రోజుల నుంచి మొదలై, 7 నుంచి 10 రోజులలో తగ్గిపోతుంది. దానిని ‘అక్యూట్ బ్రాంకైటిస్’ అంటారు. ఈ స్టేజ్‌లో ఉన్న వ్యాధికి సరిగ్గా చికిత్స లేకపోతే అది దీర్ఘకాలికంగా అంటే 2 నుంచి 3 నెలల వరకు పూర్తిగా తగ్గకుండా ఉంటే దానిని ‘క్రానిక్ బ్రాంకైటిస్’ అంటారు. కాని దగ్గు త్వరితంగా లేదా దీర్ఘకాలికంగా ఉన్నా, మొదటగా వ్యాధి నిరోధక వ్యవస్థ శక్తి క్షీణించటం వలన ఇన్ఫెక్షన్ శరీరం మీదకి ముఖ్యంగా వ్యక్తుల తత్తాన్ని బట్టి ఊపిరితిత్తుల మీదకు ప్రభావితం కావటం జరుగుతుంది. ఈ బ్రాంకైటిస్ సమస్యను మూలకారణం నుంచి ఎనాలిసిస్ చేయలేక, వ్యాధిని పూర్తిగా నివారించక పోతే ఇది ‘బ్రాంకియల్ ఆస్త్మా కింద మారుతుంది. దీనిలో ముఖ్యంగా విపరీతమైన దగ్గు, ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవటం, ఛాతీ అంతా పట్టేసినట్లు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ***************** కొంతమందికి వంకాయ, మునక్కాయ, పల్లీలు వంటి ఆహార పదార్థాలు తినగానే శరీరంపైన దద్దుర్ల మాదిరిగా ఎర్రగా, ఉబ్బెత్తుగా, తీవ్రమైన దురద వస్తాయి. ఈ ర్యాష్ 24 గంటల్లో తగ్గుతుంది. కొంతమందిలో లేటెక్స్ సంబంధిత వస్తువులు తగిలిన స్థలాలో చర్మమంతటా పొక్కులు వస్తాయి. దీనిని ‘అలర్జిక్ డెర్మటైటస్’ అని అంటారు. ఇలా అలర్జీలలో అనేక రకాలు ఉన్నప్పటికి ఎక్కువ మందిలో కనబడేవి శ్వాసకోశ సంబంధిత అలర్జీలు. అనగా రైనైటిస్, సైనసైటిస్, బ్రాంకైటిస్, బ్రాంక్రియల్ ఆస్త్మా. శ్వాసకోశ సంబంధిత అలర్జీలను కలిగించే వాటిలో ప్రధానమైనవి-పుప్పొడి, దుమ్ములో ఉండే క్రిములు, మోల్డ్, బొద్దింకలు, పశువుల పేడ మొదలైనవి. కొంతమందికి పూలవాసన, పర్ఫ్యూమ్స్, కూరపోపు లాంటివి కూడా పడవు. ************** పాజిటివ్ హోమియోపతిలో ఈ దగ్గు, ఆయాసం, అలర్జీ, ఆస్త్మాలకు పూర్తిస్థాయిలో పరిష్కారం ఉంటుంది. వ్యాధి త్వరితంగా ఉన్నా లేదా దీర్ఘకాలికంగా ఉన్నా, దాని మూలకారణం నుంచి వ్యాధిని తీసేయాలి.ముఖ్యంగా తత్వం ప్రకారం చికిత్సను మొదలు పెట్టి, ఏదైనా మానసిక ఒత్తిడి, ఆందోళనలు ఉంటే, ఆ మానసిక స్థాయి నుంచి చికిత్సను ఇవ్వడం ఉత్తమం. వాతావరణంలో ఉండే మార్పులను బట్టి మనిషి తత్వాన్ని ఎనాలసిస్ చేసి, చికిత్సను ఇస్తే పూర్తి స్థాయిలో పరిష్కారం ఉంటుంది. డా॥టి. కిరణ్‌కుమార్ పాజిటివ్ హోమియోపతి అపాయింట్మెంట్ కొరకు 9246199922 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై www.positivehomeopathy.com