హెల్త్‌కార్నర్ | Health Corner | Sakshi
Sakshi News home page

హెల్త్‌కార్నర్

Published Sun, Jul 24 2016 12:25 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

హెల్త్‌కార్నర్

హెల్త్‌కార్నర్

జలుబు, దగ్గుతో బాధపడేవారు ఇంట్లోనే టర్మరిక్ టానిక్ తయారు చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ తేనెను తీసుకొని ఓ గిన్నెలో వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు టీ స్పూన్ చొప్పున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
రోజూ మూడుపూటలా నాలుగుచొప్పున ఎండుద్రాక్షను తింటే... రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది.
 
రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు గ్లాసు మంచినీరు తాగడం వల్ల గుండెపోటు రాకుండా ఉంటుంది. అలాగే స్నానం చేసే ముందు గ్లాసు నీళ్లు తాగితే బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.
 
డిప్రెషన్‌లో ఉన్నప్పుడు నిమ్మకాయను ముక్కు దగ్గరకు పెట్టుకొని వాసన చూడాలి. అలా చేస్తే స్ట్రెస్ తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది.
 
బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు... గోరువెచ్చని నీటితో ఒక ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్‌ను వేసుకోవాలి. దాంతో త్వరగా ఉపశమనం లభిస్తుంది.
 
వేడి నీళ్లలో 1 టీ స్పూన్ సోంపును వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి, అందులో టీ స్పూన్ తేనెను కలిపి మూడుపూటలా తీసుకుంటే... ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement