Health Corner
-
హెల్త్‌కార్నర్
* జీర్ణశక్తిని మెరుగుపరచడానికి పుదీనా కూడా బాగా ఉపయోగపడుతుంది. పుదీనా రసం తరచు తీసుకుంటున్నట్లయితే, జీర్ణకోశ సమస్యలు చాలావరకు నయమవుతాయి. అలాగే, పుదీనా నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది. * ఆకలి మందగించడం, భోజనం తర్వాత వికారం వంటి సమస్యలకు దాల్చినచెక్క చక్కని ఔషధంగా పనిచేస్తుంది. చెంచాడు దాల్చినచెక్క పొడిని గ్లాసు నీళ్లలో వేసి కషాయంగా కాచుకుని, చల్లారిన తర్వాత తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అంతేకాదు, దాల్చినచెక్క రక్తంలో చక్కెరస్థాయిని కూడా అదుపులో ఉంచుతుంది. * జీలకర్రను నీళ్లలో వేసి, కషాయంగా చేసుకుని తాగితే కడుపు ఉబ్బరం, వికారం వంటి జీర్ణసంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. జీలకర్రలో పుష్కలంగా ఉండే ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు అకాల వార్ధక్యాన్ని నివారిస్తాయి. * గర్భిణులకు తలెత్తే వేవిళ్ల సమస్యకు అల్లం బాగా ఉపయోగపడుతుంది. చిన్న అల్లం ముక్కను దంచుకుని, అందులో చిటికెడు ఉప్పు కలుపుకొని బుగ్గన వేసుకుని చప్పరిస్తూ ఉంటే అజీర్తితో పాటు వివిధ కారణాల వల్ల తలెత్తే వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. * వెల్లుల్లి జీర్ణశక్తిని మెరుగుపరచడంతో పాటు బరువును అదుపులో ఉంచుతుంది. రోజూ కనీసం రెండు వెల్లుల్లి రెబ్బలను తింటున్నట్లయితే, జీర్ణప్రక్రియతో పాటు జీవక్రియలు కూడా మెరుగుపడతాయి. శరీరంలో అదనంగా కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. * జ్వరం పడి లేచాక చాలామందికి నోరు అరుచిగా అనిపించడం, ఆకలి మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మిరియాలు ఈ సమస్యలకు విరుగుడుగా పనిచేస్తాయి. మిరియాల కషాయం తాగితే నోటికి రుచి పెరగడమే కాకుండా, ఆకలి కూడా పుడుతుంది. -
హెల్త్‌కార్నర్
* రోజూ రెండు మూడు బొప్పాయి పండు ముక్కల్ని తింటే... రుతుక్రమం సమయంలో వచ్చే కడుపు నొప్పి, ఇతర సమస్యల తీవ్రత తగ్గుతుంది. ఆ సమయాల్లో కూడా బొప్పాయి సలాడ్ మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. * గుప్పెడు మెంతులను నీళ్లు పోసుకుంటూ నూరి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని వంట చేసేటప్పుడు ఎక్కడైనా కాలితే... ఆ గాయాలపై రాయాలి. అలా చేస్తే... కాలిన చోట బొబ్బలు రాకుండా, త్వరగా తగ్గిపోతాయి. * రోజూ భోజనంలోకి ఒక చిన్నసైజు ఉల్లిపాయలను కలిపి తీసుకుంటే... శ్వాసకోశ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇది తరచూ వేడి చేసేవారికి కూడా ఉపయోగపడుతుంది. * అధిక బరువుతో బాధపడేవారు... రోజూ పరగడుపున 10-12 కరివేప ఆకులను నమలాలి. అలా చేస్తే ఒంట్లోని కొవ్వు కరిగి, బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. * రొమ్ము క్యాన్సర్‌ను నివారించడానికి మిరియాలు బాగా ఉపకరిస్తాయి. రోజు విడిచి రోజు పాలలో చిటికెడు మిరియాల పొడి కలుపుకొని తాగితే ఎంతో మంచిది. * వారానికోసారి ఉలవచారు లేదా ఉలవలను ఉడకబెట్టుకొని తినాలి. ఇలా చేస్తే ఊబకాయం సమస్య నుంచి తప్పించుకోవచ్చు. * విటమిన్- డి లోపంతో బాధపడుతున్న వారు... వారానికి రెండుసార్లైనా తమ కూరల్లో పుట్టగొడుగులను చేర్చుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. -
హెల్త్‌కార్నర్
జలుబు, దగ్గుతో బాధపడేవారు ఇంట్లోనే టర్మరిక్ టానిక్ తయారు చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ తేనెను తీసుకొని ఓ గిన్నెలో వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు టీ స్పూన్ చొప్పున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ⇒ రోజూ మూడుపూటలా నాలుగుచొప్పున ఎండుద్రాక్షను తింటే... రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది. ⇒ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు గ్లాసు మంచినీరు తాగడం వల్ల గుండెపోటు రాకుండా ఉంటుంది. అలాగే స్నానం చేసే ముందు గ్లాసు నీళ్లు తాగితే బీపీ కంట్రోల్లో ఉంటుంది. ⇒ డిప్రెషన్లో ఉన్నప్పుడు నిమ్మకాయను ముక్కు దగ్గరకు పెట్టుకొని వాసన చూడాలి. అలా చేస్తే స్ట్రెస్ తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. ⇒ బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు... గోరువెచ్చని నీటితో ఒక ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్‌ను వేసుకోవాలి. దాంతో త్వరగా ఉపశమనం లభిస్తుంది. ⇒ వేడి నీళ్లలో 1 టీ స్పూన్ సోంపును వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి, అందులో టీ స్పూన్ తేనెను కలిపి మూడుపూటలా తీసుకుంటే... ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. -
హెల్త్ కార్నర్
⇒ మధుమేహం వచ్చే సూచనలు ఉన్నవారు అరచెంచా మెంతిపొడిని ప్రతిరోజూ భోజనానికి ముందు తీసుకోవాలి. ఇలా చేస్తే కొన్నేళ్ల వరకు మధుమేహం రాకుండా నివారించ వచ్చు. ⇒ చాలామందికి చిగుళ్ల నుంచి తరచు రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని, అందులో చిటికెడు ఉప్పు వేసి నూరుకోవాలి. ఆ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు చిగుళ్లకు రాస్తే సమస్య తీరుతుంది. ⇒ ప్రతిరోజూ గ్లాసు నీళ్లలో పావు టీ స్పూన్ యాలకుల పొడిని కలుపుకొని తాగితే.. యూరినరీ ఇన్ఫెక్షన్ బాధ నుంచి బయటపడొచ్చు. ⇒ అరిగిన కీళ్లు, ఎముకలతో బాధపడేవారు.. చింతగింజలను వేయించి, వాటి తొక్క తీసి పొడి చేసుకోవాలి. ఒక చెంచా చింతగింజల పొడిని వేడి నీళ్లలో కలుపుకొని రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా చేస్తే ఎముకల మధ్యలో కరిగి పోయిన గుజ్జు తిరిగి తయారవుతుంది. ⇒ ఎండిన ఉసిరికాయలను పొడి చేసి ఓ సీసాలో పెట్టుకోవాలి. ప్రతిరోజూ ఉదయం టీ స్పూన్ ఉసిరిపొడిలో టీ స్పూన్ తేనెను కలిపి తీసుకుంటే ఆస్తమా సమస్య క్రమంగా తగ్గుతుంది. ⇒ కాళ్లు, చేతులు బెణికినప్పుడు.. ఆ ప్రాంతంలో వేడినీళ్లలో ముంచిన క్యాబేజీ ఆకులను పెట్టి బ్యాండేజ్ వేసుకోవాలి. గంట గంటకు క్యాబేజీ ఆకులను మార్చాలి. -
హెల్త్‌కార్నర్
* తరచూ చెవి నొప్పితో బాధపడేవారు.. చెంచా ఉల్లిరసంలో అరచెంచా తేనె వేసి బాగా కలిపి ఓ సీసాలో పెట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు పూటలా 5-10 చుక్కలు నొప్పిగా ఉన్న చెవిలో వేసుకుంటే.. మంచి ఉపశమనాన్ని పొందుతారు. * ఎండలో లేక దుమ్ముగా ఉన్న ప్రాంతాల్లో తిరిగినప్పుడు చాలామందికి కళ్లు ఎర్రగా మారి మంట పుడుతుంటాయి. అలాంటప్పుడు కంటిలో రెండు చుక్కల స్వచ్ఛమైన రోజ్ వాటర్ వేసుకుంటే చాలు.. కొద్ది క్షణాల్లో మంట తగ్గుతుంది. * రోజూ రాత్రి పడుకునే ముందు తాగితే.. సైనస్ కారణంగా బాధించే తలనొప్పి మటుమాయం అవుతుంది.. * తరచూ చిగుళ్ల నుంచి రక్తం వస్తున్నట్లయితే.. రోజూ బ్రష్ చేసుకున్న తర్వాత, అలాగే రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెతో చిగుళ్లకు మర్దనా చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఫలితం త్వరగా కనిపిస్తుంది. * రుతుక్రమం సమయంలో కడుపు, నడుము నొప్పితో బాధపడేవారు.. చెంచా అలోవెరా జెల్లో చిటికెడు నల్ల మిరియాల పొడిని కలిపి రోజుకు మూడు పూటలా తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.. * నోటి దుర్వాసనను దూరం చేసుకోవాలంటే.. ఒక తమలపాకులో రెండు లవంగాలు పెట్టుకొని తింటే సరిపోతుంది. ఇలా రోజుకు ఒక్కసారి మాత్రమే చేయాలి. లవంగానికి బదులుగా వక్కను కూడా ఉపయోగించొచ్చు.