హెల్త్‌కార్నర్ | Health Corner | Sakshi
Sakshi News home page

హెల్త్‌కార్నర్

Published Sun, Jul 31 2016 12:53 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

హెల్త్‌కార్నర్

హెల్త్‌కార్నర్

* రోజూ రెండు మూడు బొప్పాయి పండు ముక్కల్ని తింటే... రుతుక్రమం సమయంలో వచ్చే కడుపు నొప్పి, ఇతర సమస్యల తీవ్రత తగ్గుతుంది. ఆ సమయాల్లో కూడా బొప్పాయి సలాడ్ మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
 
* గుప్పెడు మెంతులను నీళ్లు పోసుకుంటూ నూరి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని వంట చేసేటప్పుడు ఎక్కడైనా కాలితే... ఆ గాయాలపై  రాయాలి. అలా చేస్తే... కాలిన చోట బొబ్బలు రాకుండా, త్వరగా తగ్గిపోతాయి.
 
* రోజూ భోజనంలోకి ఒక చిన్నసైజు ఉల్లిపాయలను కలిపి తీసుకుంటే... శ్వాసకోశ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇది తరచూ వేడి చేసేవారికి కూడా ఉపయోగపడుతుంది.
 
* అధిక బరువుతో బాధపడేవారు... రోజూ పరగడుపున 10-12 కరివేప ఆకులను నమలాలి. అలా చేస్తే ఒంట్లోని కొవ్వు కరిగి, బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
 
* రొమ్ము క్యాన్సర్‌ను నివారించడానికి మిరియాలు బాగా ఉపకరిస్తాయి. రోజు విడిచి రోజు పాలలో చిటికెడు మిరియాల పొడి కలుపుకొని తాగితే ఎంతో మంచిది.
 
* వారానికోసారి ఉలవచారు లేదా ఉలవలను ఉడకబెట్టుకొని తినాలి. ఇలా చేస్తే ఊబకాయం సమస్య నుంచి తప్పించుకోవచ్చు.
 
* విటమిన్- డి లోపంతో బాధపడుతున్న వారు... వారానికి రెండుసార్లైనా తమ కూరల్లో పుట్టగొడుగులను చేర్చుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement