Papaya fruit
-
Papaya Seed Health Benefits: బొప్పాయి గింజలు పడేస్తున్నారా..?
అందరూ బొప్పాయి పండుని తినేసి గింజలు పడేస్తారు. ఇది సర్వసాధారణం. అయితే గింజల్లో ఎన్నో పుష్కలమైన విటమిన్స్ ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి పండు శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఇస్తోందో దాని విత్తనాలు కూడా అన్నే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఈ విత్తనాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దామా!. బొప్పాయి పండు తోపాటు విత్తనాలు కూడాను.. బొప్పాయి పండు విత్తనాల్లో ఆల్కలాయిడ్స్,ఫ్లేవనాయిడ్స్, పాలీఫీనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అర్థరైటిస్‌ను తగ్గిస్తాయి. ∙బొప్పాయి గింజలు తినడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి. జీర్ణక్రియారేటు పెరుగుతుంది. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఆహారాన్ని విషం కానివ్వవు. గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు. హార్ట్ఎటాక్ రాదు. బొప్పాయి గింజలు కొవ్వుని కరిగించి, బరువుని నియంత్రణలో ఉంచుతాయి. ఆల్కహాల్ టాక్సిన్ వల్ల కాలేయానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ బొప్పాయి గింజలు కాపాడతాయి. పైగా కాలేయ పనితీరుని మెరుగుపరుస్తాయి. పేగు పరాన్న జీవలకు మంచి నివారిణిగా ఉంటుంది. ఈ బొప్పాయి గింజలను పరగడుపునే కొద్ది మొత్తంలో తాజాగా నూరి తీసుకుంటే పరాన్నజీవులను నిర్మూలించవచ్చు. ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అవి చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేగాదు మీ చర్మం, జుట్టు, పోషణ కోసం బొప్పాయి గింజల సారం లేదా నూనెను స్థానికంగా ఉపయోగించొచ్చు. (చదవండి: సీఫుడ్ తినడం మంచిది కాదా? ముఖ్యంగా ఆ చేపలు తింటే..) -
భలేగా లాభాలు..బొప్పాయి సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులు
బొప్పాయి సాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. రెండేళ్ల కాలపరిమితి పంటైనా సాగు చేసిన ఏడాదికే అన్నదాతలు లాభాలను ఆర్జిస్తున్నారు. ప్రభుత్వం సైతం ప్రోత్సాహాన్ని అందిస్తూ సబ్సిడీపై మల్చింగ్ షీట్లు, తదితరాలను సమకూరుస్తుండటంతో సాగు చేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఆత్మకూరు: బొప్పాయి సాగు రైతుల పాలిట కల్పతరువుగా మారింది. అన్నదాతలు లాభాలు చవి చూస్తుండగా.. తింటున్న వారి ఆరోగ్యం బాగుపడుతుండటంతో బొప్పాయి అందరికీ అనుకూలంగా మారింది. జిల్లాలోని 11 మండలాల్లో 1500 హెక్టార్లలో బొప్పాయి సాగవుతోందని అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. ఏడు నెలలకే తొలి కాపు వాస్తవానికి రెండేళ్ల కాలపరిమితి గల బొప్పాయిని ఆధునిక పద్ధతుల్లో సాగుచేస్తూ ఏడాదికే లాభాలు గడిస్తున్నారు. రెండో పంటనూ వెంటనే చేపడుతున్నారు. ఈ కారణంగా కొంత ఖర్చయినా లాభాలు వస్తుండటంతో రెండేళ్ల కాలపరిమితిని రైతులు పాటించడంలేదు. ఏడు నెలలకే తొలి కాపు వచ్చే బొప్పాయి తోటల్లో అంతర్పంటగా బంతిని సాగుచేస్తూ అదనపు ఆదాయాన్ని గడిస్తున్నారు. కచ్చితమైన లాభాలు వస్తుండటంతో అధిక శాతం మంది బొప్పాయి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఉద్యాన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుండటంతో బొప్పాయి సాగుకు పలువురు రైతులు ఆసక్తి చూపుతున్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రోత్సహిస్తూ.. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా హెక్టార్‌కు 90 శాతం సబ్సిడీతో అందిస్తోంది. కలుపు నివారణకు మల్చింగ్ చేసేందుకు తొలి ఏడాది రూ.18,490, రెండో సంవత్సరం రూ.ఆరు వేలను రైతులకు అందిస్తున్నారు. మల్చింగ్ షీట్ల ఏర్పాటుతో వర్షాకాలంలో వేరుకుళ్లు తెగులు సోకదని, వీటితో సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. సోలాపూర్ రకానికి ప్రాధాన్యం బొప్పాయిలో తైవాన్ రెడ్ లేడీ 786 రకానికి మరో పేరు సోలాపూర్ వైరెటీ. ఈ రకం సాగుకు రైతులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. సోలాపూర్ వెళ్లి మొక్కలు తెస్తుండటంతో తైవాన్ రెడ్ లేడీ పేరు స్థానంలో ఈ పేరొచ్చిందని రైతులు తెలిపారు. ప్రస్తుతం అనంతపురం, రైల్వేకోడూరు నుంచి రైతులు ఈ రకం మొక్కలను తీసుకొస్తున్నారు. ఎకరాకు 1200 వరకు వేయాల్సి ఉన్నా, రైతులు 1050 మొక్కల చొప్పున సాగు చేస్తున్నారు. అధిక ధర సాధారణంగా కాయలను విడిగా రూ.8.50 చొప్పున రైతులు విక్రయిస్తుంటారు. అయితే గతేడాది ఒక్కో కాయను రూ.16 చొప్పున రైతుల వద్దే కొనుగోలు చేయడంతో ఎకరాకు రూ.నాలుగు లక్షలకుపైగా ఆదాయం సమకూరింది. ఈ ఏడాది రూ.పది చొప్పున విక్రయిస్తున్నామని వారు చెప్పారు. ప్రథమ స్థానంలో ఆత్మకూరు సెక్టార్ ఆత్మకూరు సెక్టార్లో 400 ఎకరాలకుపైగా బొప్పాయి సాగవుతూ ప్రథమ స్థానంలో ఉందని ఉద్యానాధికారులు తెలిపారు. చేజర్ల, ఏఎస్‌పేట, మర్రిపాడు, పొదలకూరు, మనుబోలు, కలువాయి, తదితర మండలాల్లోనూ అధికంగా సాగు చేస్తున్నారు. వైద్యుల సూచన మేరకు బొప్పాయి వినియోగం పెరగడంతో కొనుగోళ్లూ భారీగానే జరుగుతున్నాయి. ఎకరాకు 40 టన్నుల దిగుబడి మూడేళ్లుగా బొప్పాయి సాగు చేస్తున్నా. లాభాలు బాగానే ఉన్నాయి. మా తోటను చూసి సమీపంలోని పలువురు రైతులు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొక్కలను అనంతపురం నుంచి తెచ్చుకుంటున్నాం. కలుపు రాకుండా మల్చింగ్ షీట్లను సబ్సిడీలో పొందాం. – సుబ్బారెడ్డి, బొప్పాయి రైతు, బొమ్మవరం, అనంతసాగరం ఎకరాలో బొప్పాయి సాగుకు రూ.70 వేలు ఖర్చవుతోంది. కలుపు రాకుండా మల్చింగ్ షీట్ల ఏర్పాటు, డ్రిప్ ఇరిగేషన్, తదితర ఆధునిక పద్ధతులతో సాగు చేస్తే రూ.లక్ష వరకు అవుతోంది. మొక్కలు నాటిన అనంతరం ఏడు నెలల పది రోజులకే తొలి కాపు చేతికందుతుంది. తొలి కాపులో ఒక టన్ను నుంచి ఒకటిన్నర టన్నుల దిగుబడి.. 20 రోజుల అనంతరం రెండో కాపులో రెండు నుంచి మూడు టన్నులు.. మూడో కాపులో నాలుగు నుంచి ఐదు టన్నుల దిగుబడి వస్తోంది. ఏడాది పొడవునా కాపు ఉంటుందని రైతులు తెలిపారు. దీంతో ఎకరాకు రూ.మూడు లక్షలకుపైగా ఆదాయాన్ని గడిస్తున్నారు. -
బొప్పాయి గుజ్జుతో మేని కాంతి
బొప్పాయి పండు అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ పండుకు సులువుగా ఇంట్లో దొరికే ఇతర పదార్థాలను కలిపితే సౌందర్యం ఇనుమడిస్తుంది. ♦ కొద్దిగా బియ్యప్పిండి తీసుకొని అందులో బొప్పాయి గుజ్జుని చేర్చితే ఒక మిశ్రమంగా తయారవుతుంది. దీనిని ముఖ చర్మానికి రాసుకుంటే మొటిమలు మాయమవడంతోపాటు చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ♦ బొప్పాయిగుజ్జులో ఒక చెంచా పచ్చిపాలు, తేనె, పసుపు, తులసి ఆకుల చూర్ణం కలుపుకొని ముఖానికి పట్టిస్తే, మొటిమలు, తెల్లమచ్చలు తగ్గుతాయి. ♦ బొప్పాయి పండు గుజ్జు, అర స్పూన్ అలోవెరా జ్యూస్, కొంచెం తేనె కలిపి రాసుకుంటే చర్మానికి కావలసిన తేమ, పోషక పదార్థాలు అంది యవ్వనంగా కనిపిస్తారు. ♦ నిమ్మరసం, కొద్దిగా పెసరపిండి కలిపి అందులో కొద్దిగా బొప్పాయి గుజ్జును కలిపి రాసుకొంటే తెల్లని ఛాయను మీ సొంతం చేసుకున్నట్టే. ♦ బొప్పాయి పండుకి ముఖం మీద ముడతలు పోగొట్టే అద్భుత గుణం కూడా ఉంది. కోడిగుడ్డులోని తెల్లసొన కొద్దిగా తీసుకొని ఒకస్పూన్ బొప్పాయి గుజ్జుతో బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. ఒక అరగంట సేపు అలానే ఉంచుకొని ఆరిన తర్వాత ముఖాన్ని చన్నీళ్ళతో కడిగేసుకోవాలి. -
బొప్పాయి పండులో... మరో బొప్పాయి...!
విజయనగరం, తెర్లాం : ‘సాధారణంగా బొప్పాయి పండులో నల్లటి పిక్కలు ఉండడం ఎక్కువగా చూస్తుంటాం. కానీ బొప్పాయి పండు కోయగా పిక్కలకు బదులుగా మరొక కాయ లోపల ఉండడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. తెర్లాంలోని ఎం.ఎల్.ఎస్ పాయింట్ గోదాము ఇన్చార్జిగా పనిచేస్తున్న కుప్పిలి నాగేశ్వరరావు మార్కెట్లో వివిధ రకాల పండ్లు విక్రయించే వారి నుంచి బొప్పాయి పండును కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చారు. బొప్పాయి పండు పైనున్న తొక్కను తీసేసి, పండును రెండు ముక్కలు చేయగా అందులో మరొక బొప్పాయి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. బొప్పాయి పండులో పిక్కలకు బదులుగా కాయ ఉండడంతో చుట్టు పక్కల ఉన్న వారికి ఇదే విషయాన్ని తెలియజేశారు. బొప్పాయి పండులో మరొక కాయ ఉండడం చూసిన ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యానికి గురయ్యారు. బొప్పాయి పండులో మరొక కాయ ఉన్న విషయాన్ని మండల ఉద్యాన వన శాఖ అధికారి వెంకటరత్నం వద్ద ప్రస్తావించగా జన్యుపరమైన సమస్యల వల్ల బొప్పాయి పండులో కాయ వచ్చి ఉండవచ్చని తెలిపారు. -
హెల్త్‌కార్నర్
* రోజూ రెండు మూడు బొప్పాయి పండు ముక్కల్ని తింటే... రుతుక్రమం సమయంలో వచ్చే కడుపు నొప్పి, ఇతర సమస్యల తీవ్రత తగ్గుతుంది. ఆ సమయాల్లో కూడా బొప్పాయి సలాడ్ మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. * గుప్పెడు మెంతులను నీళ్లు పోసుకుంటూ నూరి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని వంట చేసేటప్పుడు ఎక్కడైనా కాలితే... ఆ గాయాలపై రాయాలి. అలా చేస్తే... కాలిన చోట బొబ్బలు రాకుండా, త్వరగా తగ్గిపోతాయి. * రోజూ భోజనంలోకి ఒక చిన్నసైజు ఉల్లిపాయలను కలిపి తీసుకుంటే... శ్వాసకోశ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇది తరచూ వేడి చేసేవారికి కూడా ఉపయోగపడుతుంది. * అధిక బరువుతో బాధపడేవారు... రోజూ పరగడుపున 10-12 కరివేప ఆకులను నమలాలి. అలా చేస్తే ఒంట్లోని కొవ్వు కరిగి, బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. * రొమ్ము క్యాన్సర్‌ను నివారించడానికి మిరియాలు బాగా ఉపకరిస్తాయి. రోజు విడిచి రోజు పాలలో చిటికెడు మిరియాల పొడి కలుపుకొని తాగితే ఎంతో మంచిది. * వారానికోసారి ఉలవచారు లేదా ఉలవలను ఉడకబెట్టుకొని తినాలి. ఇలా చేస్తే ఊబకాయం సమస్య నుంచి తప్పించుకోవచ్చు. * విటమిన్- డి లోపంతో బాధపడుతున్న వారు... వారానికి రెండుసార్లైనా తమ కూరల్లో పుట్టగొడుగులను చేర్చుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.