అందరూ బొప్పాయి పండుని తినేసి గింజలు పడేస్తారు. ఇది సర్వసాధారణం. అయితే గింజల్లో ఎన్నో పుష్కలమైన విటమిన్స్ ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి పండు శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఇస్తోందో దాని విత్తనాలు కూడా అన్నే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఈ విత్తనాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దామా!.
బొప్పాయి పండు తోపాటు విత్తనాలు కూడాను..
- బొప్పాయి పండు విత్తనాల్లో ఆల్కలాయిడ్స్,ఫ్లేవనాయిడ్స్, పాలీఫీనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అర్థరైటిస్‌ను తగ్గిస్తాయి. ∙బొప్పాయి గింజలు తినడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి. జీర్ణక్రియారేటు పెరుగుతుంది.
- వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఆహారాన్ని విషం కానివ్వవు.
- గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు. హార్ట్‌ఎటాక్ రాదు.
- బొప్పాయి గింజలు కొవ్వుని కరిగించి, బరువుని నియంత్రణలో ఉంచుతాయి.
- ఆల్కహాల్ టాక్సిన్ వల్ల కాలేయానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ బొప్పాయి గింజలు కాపాడతాయి. పైగా కాలేయ పనితీరుని మెరుగుపరుస్తాయి.
- పేగు పరాన్న జీవలకు మంచి నివారిణిగా ఉంటుంది. ఈ బొప్పాయి గింజలను పరగడుపునే కొద్ది మొత్తంలో తాజాగా నూరి తీసుకుంటే పరాన్నజీవులను నిర్మూలించవచ్చు.
- ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అవి చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేగాదు మీ చర్మం, జుట్టు, పోషణ కోసం బొప్పాయి గింజల సారం లేదా నూనెను స్థానికంగా ఉపయోగించొచ్చు.
(చదవండి: సీఫుడ్ తినడం మంచిది కాదా? ముఖ్యంగా ఆ చేపలు తింటే..)
Comments
Please login to add a commentAdd a comment