మనకు అందుబాటులో ఉండే అనేక రకాల పండ్లలో బొప్పాయి పండ్లు ఒకటి. వీటిని మనం ఎప్పుడైనా సరే తినవచ్చు. ఇవి మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. అయితే బొప్పాయి పండ్లను తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ వీటితో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బొప్పాయి పండ్లను రోజూ ఒక కప్పు మోతాదులో ఉదయం లేదా మధ్యాహ్నం తినాలి. భోజనం చేసిన అనంతరం ఒక గంట వ్యవధి ఇచ్చి ఈ పండ్ల ముక్కలను తినాలి. దీంతో అనేక లాభాలను పొందొచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. దీంతో అజీర్తి నుంచి బయట పడవచ్చు. అలాగే గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు కూడా ఉండవు. బొప్పాయి పండ్లలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తాన్ని తయారు చేస్తుంది. దీంతో రక్తహీనత సమస్య తగ్గుతుంది. బొప్పాయి పండ్లలో ఉండే పోషకాలు మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
దీని వల్ల దగ్గు, జలుబుతోపాటు మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నుంచి కూడా బయట పడవచ్చు. ఈ వ్యాధులు వచ్చిన వారు రోజూ ఉదయం, సాయంత్రం ఒక్కో కప్పు చొప్పున బొప్పాయి పండ్ల ముక్కలను తినాలి. దీంతో త్వరగా కోలుకుంటారు. అలాగే ప్లేట్‌లెట్స్ కూడా బాగా పెరుగుతాయి. బొప్పాయి పండ్లను తినడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే అధిక బరువు తగ్గుతారు.
ఈ పండ్లను తినడం వల్ల శరీరంలోని కొవ్వు మొత్తం కరిగిపోతుంది. ఈ పండ్లను తింటే అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ఇక షుగర్ ఉన్నవారు ఈ పండ్లను తింటే షుగర్ స్థాయిలు తగ్గుతాయి. ఈ పండ్లలో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది. దీంతో హైబీపీ కంట్రోల్‌లోకి వస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. ఇలా రోజూ ఒక కప్పు లేదా రెండు కప్పుల బొప్పాయి పండ్ల ముక్కలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కనుక ఈ పండ్లను రోజూ తినాలి. అసలు మరిచిపోవద్దు.
(చదవండి: అక్కడ చేపలు జస్ట్ తినడానికి ట్రై చేసినా చాలు..క్యాన్సర్ ఖాయం!)
Comments
Please login to add a commentAdd a comment