డార్క్ చాక్లెట్లు గుండెకు మేలు చేస్తాయనేది ఇప్పటికే పలు పరిశోధనల్లో తెలింది. అదే విషయం దక్షిణ–కొరియన్ పరిశోధనల్లో మరోసారి వెల్లడైంది. చాక్లెట్స్‌లోని కొన్ని పోషకాలు గట్ బ్యాక్టీరియా / గట్ మైక్రోబియమ్ పెంచడం వల్ల మంచి వ్యాధి నిరోధకత పెరుగుతుందనీ, అలాగే... తక్కువ మోతాదులో చక్కెర ఉండే డార్క్ చాక్లెట్స్ తినేవారిలో వాటిలో ఉండే ఫైబర్, ఐరన్‌తో పాటు ఫైటోకెమికల్స్ వల్ల కొన్ని రకాల కేన్సర్లు, మతిమరపు (డిమెన్షియా), ఆర్థరైటిస్, గుండెజబ్బులు, పక్షవాతం వంటి అనేక ఆరోగ్య సమస్యల నివారణ జరుగుతుందంటూ దక్షిణకొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన కాలేజ్ ఆఫ్ హ్యూమన్ ఎకాలజీలోని ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విభాగం నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది.
అంతేకాదు... డార్క్ చాక్లెట్లు మూడ్స్‌ను బాగుపరచి తినేవారు ఉల్లాసంగా, ఆహ్లాదంగా ఉంచేందుకు సహయపడతాయని తేలింది. ఇక డార్క్‌చాక్లెట్స్ తినేవారి మల పరీక్షల్లో తేలిన విషయం ఏమిటంటే... వాళ్ల పేగుల్లో ‘బ్లావుషియా’ అనే ప్రోబయాటిక్ బాక్టీరియా కారణంగానే కడుపు ఆరోగ్యం బాగుండటంతో పాటు వాళ్ల మూడ్స్ మరింత మెరుగయ్యాయని తేలింది. ఈ ఫలితాలన్నీ ‘‘ద జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ’’ అనే మెడికల్ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment