అలియా లాంటి మెరిసే చర్మం కోసం..! | Winter Beauty Tips For Healthy Skin That Glows Without Makeup Like Alia Bhatt | Sakshi
Sakshi News home page

అలియా లాంటి ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం..!

Oct 21 2024 5:21 PM | Updated on Oct 21 2024 6:37 PM

Winter Beauty Tips For Healthy Skin That Glows Without Makeup Like Alia Bhatt

బాలీవుడ్‌ నటి అలియా భట్‌ ఎంత గ్లామరస్‌గా కనిపిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. మచ్చలేని చందమామలా ఉండే అలియా సౌందర్యాన్ని ఇష్టపడని వారుండదరు. అలాంటి మెరిసే చర్మం కోసం ఈ టిప్స్‌ ఫాలో అయితే చాలంటున్నారు నిపుణులు. 

ప్రస్తుతం అలియా కాశ్మీర్‌లో ఉంది.  త్వరలో ప్రేక్షకుల మందుకు రానున్న అల్ఫా మూవీ చిత్రీకరణలతో బిజీగా ఉంది. అక్కడ నో మేకప్‌ లుక్‌లో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. సూర్యుడే దిగి వచ్చి ముద్దాడేలా క్యూట్‌గా ఉన్న ఆమె ముఖ కాంతికి ఫిదా కాకుండా ఉండలేం. 

 

అంతటి చలిలో కూడా చక్కగా గ్లామర్‌ మెయింటైన్‌ చేస్తూ..అలియాలా అందంగా కనిపించాలంటే నిపుణులు ఈ చిన్నపాటి చిట్కాలను ఫాలోకండి అని చెబతున్నారు. శీతాకాలంలో సైతం చర్మం పాడవ్వకుండా అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఐదు బ్యూటీ టెక్నిక్స్‌ ఫాలో అవ్వాలని తెలిపారు బ్రైన్ మావర్ డెర్మటాలజిస్ట్, డాక్టర్ హుసింజాద్

తరుచుగా మాయిశ్చరైజర్‌ చేయడం..
సెరామైడ్‌లు, హైలురోనిక్ యాసిడ్, పెట్రోలియం జెల్లీ కలిగిన మాయిశ్చరైజర్‌లు చర్మంలోని తేమని నిలుపుకోవడంలో సహాయపడతాయి. తేలికపాటి లోషన్ల కంటే చిక్కటి క్రీములు ఎంచుకోండి. శీతాకాలంలో ఇలాంటి మాయిశ్చరైజర్లు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి.

హైడ్రేటింగ్ క్లెన్సర్‌లకు మారండి
చలికాలంలో, ముఖంపై కఠినమైన క్లెన్సర్‌లను నివారించండి. అంటే బాగా గాఢత గల ఫేస్‌వాష్‌లను నివారించండి. ముఖం తేమతో ఉండేలా చేసి, శుభ్రపరిచే మంచి ఫేస్‌వాష్‌ని ఉపయోగించండి.

వేడి నీళ్లు ఎక్కువగా ఉపయోగించొద్దు..
శీతాకాలం సాధారణంగా వేడినీళ్లు ముఖంపై జల్లుకునేందుకు ఇష్టపడతాం. కానీ నిపుణులు అభిప్రాయం ప్రకారం..ఇలా అస్సలు వద్దని చెబుతున్నారు. గోరువెచ్చని నీటిని ఉపయోగించమని సూచిస్తున్నారు. బాగా వేడి నీళ్లు ఉపయోగిస్తే చర్మం పొడిగా మారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు

కఠినమైన స్క్రబ్‌లు,సువాసనగల ఉత్పత్తులను నివారించండి
కఠినమైన స్క్రబ్‌లు,సువాసనగల ఉత్పత్తులు పొడి చర్మంపై చికాకుని తెప్పిస్తాయి. మంటకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. ఆరోగ్యకరమైన చర్మం కోసం శీతాకాలంలో వీటిని నివారించండి. పొడిచర్మం కలవాళ్లు గాఢమైన సువాసనలేని సబ్బులు, బాడీ వాష్‌లు ఉపయోగించండి.

హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి..
శరీరంలో నీటి శాతాన్ని పెంచడానికి శీతాకాలంలో హైడ్రేషన్ అవసరం. చలికాలంలో పానీయాలు , ఆల్కహాల్ వినియోగం  శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే శీతాకాలంలో సైతం ఆరోగ్యకరమైన మెరిసే చర్మం మన సొంతం అని చెబుతున్నారు నిపుణులు. 

(చదవండి: మానసిక ఆరోగ్యం కోసం 'టిబెటన్‌ సింగింగ్‌ బౌల్స్‌'! ఎలా ఉపయోగపడతాయంటే..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement