'టిబెటన్ సింగింగ్ బౌల్స్'ని ధ్వనితో అందించే ఒక విధమైన హీలింగ్ చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ గిన్నెలు ఆధ్యాత్మిక అభ్యాసాలలో ముఖ్యంగా బౌద్ధ ఆచారాలలో ఉపయోగిస్తారు. మంచి ఆలోచనలకి, ధ్యానానికి సహాపడతాయని నమ్ముతారు. ఇది మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
'టిబెటన్ సింగింగ్ బౌల్' అనేది ధ్యానం, వైద్యం, విశ్రాంతి కోసం ఉపయోగించే ఒక సంప్రదాయ వాయిద్యం. దీన్ని లోహాల మిశ్రమాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఈ గిన్నెలను మేలట్(ఒక రకమైన సాధనం)తో అంచు వెంబడి కొడితే ప్రతిధ్వనించే శబ్దాలు వస్తాయి. ఈ కంపనాలు ఓదార్పునిచ్చేలా ఒత్తిడిని దూరం చేసి, శరీరంలో సమతుల్యతను పునరుద్ధరించడానికి సహాయపడతాయి. ఈ సౌండ్ థెరపీ అనేది ఒక రకమైన హీలింగ్ థెరపీలా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఇది మానసిక ఉల్లాసానికి, ధ్యానానికి సహాయపడుతుందనేది బౌద్ధుల నమ్మకం.
ఈ టిబెటన్ సింగింగ్ బౌల్స్ మానసిక ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయంటే..
ఒత్తిడిని, ఆందోళనని దూరం చేస్తుంది..
ఈ బౌల్స్ నుంచి వచ్చే కంపనాలు మనస్సుని, శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచడంలో సహాయపడతాయి. ఈ శబ్దాలు వినడం వల్ల ఒత్తడి హర్మోన్ స్థాయిలు తగ్గి తద్వారా ఆందోళనను దూరం చేస్తుంది.
డీప్ రిలాక్సేషన్..
ఈ గిన్నెల ద్వారా వచ్చే ప్రతి ధ్వని ధ్యాన స్థితిలోకి రావడానికి సహాయపడుతుంది. తద్వారా సుదీర్ఘ విశ్రాంతి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సున్నితమైన శబ్దాలు మెదడు తరంగాలను నెమ్మదింప చేయడానికి సహాయపడతాయి.
దృష్టి స్పష్టత మెరుగవుతుంది
ఈ శబ్దాలు దృష్టి కేంద్రీకరించడానికి వీలు కల్పిస్తుంది. అంతేగాదు మానసిక స్పష్టత వచ్చేలా ఏకగ్రతతో ఉండేలా చేస్తుంది.
భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది
ఈ శబ్దాలను క్రమతప్పకుండా వినడం వల్ల భావోద్వేగ సమతుల్యత మెరుగుపడుతుంది. ఈ శబ్దాలు అంతర్గత శాంతి, భావోద్దేవగ స్థిరత్వాన్ని అందిస్తాయి. తద్వారా కోపం లేదా విచారం వంటి ప్రతికూల భావోద్వేగాలను తగ్గుతాయి,
నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది
ఈ కంపనాలు నాడీ వ్యవస్థను శాంతపరిచి మంచి నిద్రపట్టేలా చేస్తుంది. నిద్రలేమితో పోరాడుతున్న వ్యక్తులకు ఈ థెరపీ బాగా ఉపయోగపడుతుంది.
ఎనర్జీని బ్యాలెన్స్‌గా..
ఈ కంపనాలు శరీరంలో చక్రాలుగా పిలిచే శక్తి కేంద్రాలను సమతుల్యం చేస్తుంది. ఇలా సమస్థాయిలో ప్రసారమయ్యే శక్తి స్థాయిలు మంచి మానసిక శ్రేయస్సుని అందిస్తాయి.
డిప్రెషన్ లక్షణాలు..
ఈ సౌండ్ థెరపీ డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. మనస్సుని ఉల్లాసంగా ఉండేలా చేసి నిరాశ నిస్ప్రుహలను దూరం చేస్తుంది.
మైండ్-బాడీ కనెక్షన్..
ఈ కంపనాలు మనస్సు, శరీర సంబంధాన్ని బలోపేతం చేస్తాయి. రోజువారీ పనుల్లో ఎదురయ్యే భావోద్వేగ స్థితులకు తొందరగా ప్రతిస్పందించక బ్యాలెన్స్‌గా ఉంచడమే గాక మానసిక కల్లోలానికి తావివ్వదు. ఫలితంగా మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
(చదవండి: మిల్కీ బ్యూటీ డైట్ సీక్రెట్ ఇదే!.. మెరిసే చర్మం కోసం..)
Comments
Please login to add a commentAdd a comment