singing
-
కీరవాణిగారూ.. ఒక్క ఛాన్స్ ప్లీజ్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో ఎపుడూ యాక్టివ్‌గా ఉంటారు. కేవలం ఆర్టిసీ సంస్థ,ఉద్యోగులు, సంక్షేమం, సమస్యలు ఇవి మాత్రమే కాకుండా, అనేక సామాజిక అంశాలపై కూడాపలు ఆసక్తికర విషయాలను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా సజ్జనార్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెట్టింట విశేషంగా నిలిచింది.ఒక దివ్యాంగుడు (అంధుడు) ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ 'శ్రీ ఆంజనేయం' సినిమాలోని 'రామ రామ రఘురామ' అనే పాటను అద్భుతంగా ఆలపించిన వీడియోను ఆర్టీసీ ఎండీ ఎక్స్‌లో షేర్ చేశారు. అతన్ని ప్రశంసిస్తూ ఇలా ట్వీట్ చేశారు. 'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ దివ్యాంగుడు అద్భుతంగా పాడారు కదా ఒక అవకాశం ఇచ్చి చూడండి సర్' అంటూ సినీగేయ రచయిత, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మరి దీనిపై కీరవాణి ఎలా స్పందిస్తారో చూడాలి.అద్భుతమైన గొంతుతో ఆ పాటను పాడడమే కాకుండా చేతితో, తాళం వేస్తూ లయబద్దంగా పాడటం ఆకట్టుకుంటోంది. అటు ఆ యువకుడి ప్రతిభకు నెటిజన్లు ముగ్ధులైపోయారు. నిజంగానే మట్టిలో మాణిక్యం అంటూ ప్రశించారు. ఇలాంటి వారికి అవకాశం ఇచ్చి ప్రోత్సాహాన్నివ్వాలని కోరారు.మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..!ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..! ఒక అవకాశం ఇచ్చి చూడండి @mmkeeravaani సర్.@tgsrtcmdoffice @TGSRTCHQ @PROTGSRTC pic.twitter.com/qu25lXVzXS— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 10, 2024 -
మానసిక ఆరోగ్యం కోసం 'టిబెటన్ సింగింగ్ బౌల్స్'! ఎలా ఉపయోగపడతాయంటే..
'టిబెటన్ సింగింగ్ బౌల్స్'ని ధ్వనితో అందించే ఒక విధమైన హీలింగ్ చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ గిన్నెలు ఆధ్యాత్మిక అభ్యాసాలలో ముఖ్యంగా బౌద్ధ ఆచారాలలో ఉపయోగిస్తారు. మంచి ఆలోచనలకి, ధ్యానానికి సహాపడతాయని నమ్ముతారు. ఇది మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 'టిబెటన్ సింగింగ్ బౌల్' అనేది ధ్యానం, వైద్యం, విశ్రాంతి కోసం ఉపయోగించే ఒక సంప్రదాయ వాయిద్యం. దీన్ని లోహాల మిశ్రమాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఈ గిన్నెలను మేలట్(ఒక రకమైన సాధనం)తో అంచు వెంబడి కొడితే ప్రతిధ్వనించే శబ్దాలు వస్తాయి. ఈ కంపనాలు ఓదార్పునిచ్చేలా ఒత్తిడిని దూరం చేసి, శరీరంలో సమతుల్యతను పునరుద్ధరించడానికి సహాయపడతాయి. ఈ సౌండ్ థెరపీ అనేది ఒక రకమైన హీలింగ్ థెరపీలా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఇది మానసిక ఉల్లాసానికి, ధ్యానానికి సహాయపడుతుందనేది బౌద్ధుల నమ్మకం.ఈ టిబెటన్ సింగింగ్ బౌల్స్ మానసిక ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయంటే..ఒత్తిడిని, ఆందోళనని దూరం చేస్తుంది..ఈ బౌల్స్ నుంచి వచ్చే కంపనాలు మనస్సుని, శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచడంలో సహాయపడతాయి. ఈ శబ్దాలు వినడం వల్ల ఒత్తడి హర్మోన్ స్థాయిలు తగ్గి తద్వారా ఆందోళనను దూరం చేస్తుంది. డీప్ రిలాక్సేషన్..ఈ గిన్నెల ద్వారా వచ్చే ప్రతి ధ్వని ధ్యాన స్థితిలోకి రావడానికి సహాయపడుతుంది. తద్వారా సుదీర్ఘ విశ్రాంతి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సున్నితమైన శబ్దాలు మెదడు తరంగాలను నెమ్మదింప చేయడానికి సహాయపడతాయి. దృష్టి స్పష్టత మెరుగవుతుందిఈ శబ్దాలు దృష్టి కేంద్రీకరించడానికి వీలు కల్పిస్తుంది. అంతేగాదు మానసిక స్పష్టత వచ్చేలా ఏకగ్రతతో ఉండేలా చేస్తుంది.భావోద్వేగాలను అదుపులో ఉంచుతుందిఈ శబ్దాలను క్రమతప్పకుండా వినడం వల్ల భావోద్వేగ సమతుల్యత మెరుగుపడుతుంది. ఈ శబ్దాలు అంతర్గత శాంతి, భావోద్దేవగ స్థిరత్వాన్ని అందిస్తాయి. తద్వారా కోపం లేదా విచారం వంటి ప్రతికూల భావోద్వేగాలను తగ్గుతాయి,నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందిఈ కంపనాలు నాడీ వ్యవస్థను శాంతపరిచి మంచి నిద్రపట్టేలా చేస్తుంది. నిద్రలేమితో పోరాడుతున్న వ్యక్తులకు ఈ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఎనర్జీని బ్యాలెన్స్‌గా.. ఈ కంపనాలు శరీరంలో చక్రాలుగా పిలిచే శక్తి కేంద్రాలను సమతుల్యం చేస్తుంది. ఇలా సమస్థాయిలో ప్రసారమయ్యే శక్తి స్థాయిలు మంచి మానసిక శ్రేయస్సుని అందిస్తాయి.డిప్రెషన్ లక్షణాలు..ఈ సౌండ్ థెరపీ డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. మనస్సుని ఉల్లాసంగా ఉండేలా చేసి నిరాశ నిస్ప్రుహలను దూరం చేస్తుంది. మైండ్-బాడీ కనెక్షన్..ఈ కంపనాలు మనస్సు, శరీర సంబంధాన్ని బలోపేతం చేస్తాయి. రోజువారీ పనుల్లో ఎదురయ్యే భావోద్వేగ స్థితులకు తొందరగా ప్రతిస్పందించక బ్యాలెన్స్‌గా ఉంచడమే గాక మానసిక కల్లోలానికి తావివ్వదు. ఫలితంగా మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.(చదవండి: మిల్కీ బ్యూటీ డైట్ సీక్రెట్ ఇదే!.. మెరిసే చర్మం కోసం..) -
వచ్చాడు గెలిచాడు!
తుమ్ ముజేనా యూ బచానా పావోవే’... రఫీ పాడిన ఈ పాటను ఏడేళ్ల అవిర్భవ్ వేదిక మీద పాడుతుంటే అందరికీ కన్నీరు వచ్చింది. ఇంత బాగా పాడిన ఈ బుడతడిని సోనిలో సూపర్‌స్టార్ సింగర్ సీజన్ 3 (మార్చి 2024 నుంచి ఆగస్టు 2024 వరకు) చూసిన వారెవరూ అంత సులభంగా మర్చిపోలేరు. అందుకే మొత్తం 11 మంది ఫైనలిస్ట్‌లలో తమ ఓటింగ్ ద్వారా అవిర్భవ్నే విజేతగా నిలిపారు.పది లక్షల రూపాయల బహుమతి వచ్చేలా చూశారు. జడ్జిల చాయిస్‌గా అధర్వ బక్షి అనే మరో చిన్నోడు విజేతగా నిలిచినా ఈ సీజన్లో సంగీత ప్రియుల హృదయాలను కొల్లగొట్టింది మాత్రం అవిర్భవే. చిన్నగా కోమలమైన ఆకారంతో ఉన్నప్పటికీ అవిర్భవ్ రేంజ్ చాలా గొప్పది. కేరళకు చెందిన అవిర్భవ్ తన సోదరి అనిర్విన్య దగ్గర రెండేళ్ల వయసు నుంచే సంగీతం నేర్చుకున్నాడు.తెలుగు షోస్‌లో కూడా పాల్గొన్నాడు. కాని ఇపుడు సూపర్‌స్టార్ సింగర్ ద్వారా ప్రపంచ ప్రఖ్యాతమయ్యాడు. అర్జిత్ సింగ్ ఇతడి ఫేవరెట్ సింగర్. పెద్దయ్యాక గాయకుణ్ణి అయ్యి సల్మాన్, షారుక్‌ఖాన్‌లకు పాడతానని అంటున్నాడు అవిర్భవ్.ఇవి చదవండి: ఆమె గొంతుక.. మన గుండెల్లో..! -
పబ్‌లో.. ఫస్ట్ టైమ్!
సాధారణంగా సిటీలో పబ్స్, క్లబ్స్‌లో కని/వినపడే డీజేలు, బ్యాండ్స్, సింగర్స్... ఎక్కువగా పాశ్చాత్య పోకడలకు ప్రతీకగా ఉంటారు. వెస్ట్రన్ మ్యూజిక్‌ని ఇష్టపడే యువతను మెప్పించడం వీరి వల్లే సాధ్యమని ఈవెంట్ మేనేజర్లు భావిస్తుండడం వల్ల ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఇటీవలే వీరి స్థానంలో హిందీ, తెలుగు సంగీతాన్ని అందించే బ్యాండ్స్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది.ఆ థోరణి మరింత బలపడి ఇప్పుడు ఏకంగా తెలుగు గాయనీ గాయకులకు కూడా పబ్స్ రెడ్ కార్పెట్ పరుస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో వియ్ కేర్ సంస్థ ఆధ్వర్యంలో తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితురాలైన ప్రముఖ గాయని గీతా మాధురి తన సొంతంగా సమకూర్చుకున్న బ్యాండ్‌తో కలిసి తొలిసారి నగరంలోని ప్రిజ్మ్ పబ్‌లో శుక్రవారం సాయంత్రం సోలో ప్రదర్శన ఇవ్వనున్నారు. – సాక్షి, సిటీబ్యూరోప్రపంచాన్నే మన పాట పాలిస్తోంది.. ఇక పబ్స్‌లో తెలుగు పాట వినిపించడంలో ఆశ్చర్యమేముంది? అంటున్నారు ప్రముఖ నేపథ్యగాయని గీతా మాధురి. ‘సాక్షి’తో పంచుకున్న ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...సోలోగా...ఇదే తొలిసారి.. నగరంలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది పెళ్లిళ్ల నుంచి పార్టీల వరకూ చాలా రకాల కార్యక్రమాల్లో నాకు అనుభవమే. అయితే మోడ్రన్ కల్చర్‌కు కేరాఫ్‌గా ఉండే యూత్ సమక్షంలో ఒక పబ్‌లో సోలోగా పాడడం ఇదే తొలిసారి. అదీ సొంతంగా ఒక బ్యాండ్‌ను సమకూర్చుకుని, వారితో కలిసి రిహార్సిల్స్ చేసి పబ్ షోలో పాడడం కొత్త అనుభవమే. అభిమానుల స్పందన తెలుస్తుంది... అలాగే కార్పొరేట్, కాలేజ్ షోస్ వంటివి కొందరికి మాత్రమే పరిమితమయ్యేవి, అలా కాకుండా ఈ తరహా పబ్లిక్ ఈవెంట్స్ వల్ల ప్రయోజనం ఏమిటంటే.. అభిమాన గాయనీ గాయకుల పాటలు వినాలనుకునే ఎవరైనా షోకి హాజరుకావ్వొచ్చు. అలా మాకు కూడా మా అభిమానుల స్పందనను దగ్గరగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. బ్యాండ్ స్టైల్ అంటే ఇదే... సాధారణంగా లైవ్ పెర్ఫార్మెన్స్లో పూర్తి స్థాయి వాద్య బృందంతో కలిసి పాడతాం. అయితే పబ్‌లో మాత్రం ఇద్దరు గిటారిస్ట్, డ్రమ్మర్, కీబోర్డ్ ప్లేయర్.. ఇలా ఓ ముగ్గురు నలుగురు మాత్రమే ఉంటారు. ఆర్కె్రస్టాతో పాడేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా పాడతాం.. అయితే ఇందులో 3, 4 పాటలు కలిపి బ్యాకింగ్ కొంచెం మార్చి.. ఇలా ఎక్స్‌పిరిమెంటల్ టైప్‌లో ఉంటుంది. ఓ రకంగా పాపులర్ సాంగ్‌ని కొత్త ఫ్లేవర్‌లో వినిపించడమే బ్యాండ్ స్టైల్ అనొచ్చు. మన పాట ప్రపంచవ్యాప్తం... మన తెలుగు పాటలు ప్రపంచం అంతా ఒక ఊపు ఊపుతున్నాయి. కాబట్టి సిటీలో కూడా పబ్ క్లబ్ అని తేడా లేకుండా అన్ని చోట్లా యూత్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లో తెలుగు, హిందీ పాటలు పాడడానికి సిద్ధమవుతున్నా..అయితే అక్కడకు వచ్చే క్రౌడ్‌ని బట్టి వారి టేస్ట్‌ని బట్టి అప్పటికప్పుడు పాడాల్సి ఉంటుంది.భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్స్‌లో పూర్తి స్థాయిలో ఒక పాటల జాబితా ఇచ్చి, దాని ప్రకారం పాడాలనే ఆలోచన ఉంది. ఇక పర్సనల్ లైఫ్‌కి వస్తే..అడపాదడపా సినిమా పాటలు, రెగ్యులర్‌గా కొన్ని ప్రైవేట్ ఈవెంట్స్, ఇవి కాక... ఓటీటీ వేదికగా ఇండియన్ ఐడల్ కు వర్క్ చేస్తున్నాను.ఇవి చదవండి: ఫుల్కారీ ఎంబ్రాయిడరీలో విభిన్న డిజైన్లు.. -
తెలుగులో అమ్మ పాట పాడి అదరగొట్టిన విజయ్ ఆంటోని
-
‘టీ’పాట
‘చాయ్ హోటల్‌కు ఎందుకు వెళతారు?’ అనే ప్రశ్నకు–‘చాయ్ కోసమే వెళతారు’ అనే జవాబు మాత్రమే వినిపిస్తుంది. అయితే సూరత్‌లోని విజయ్భాయి పటేల్ అలియాస్ డాలీ చాయ్‌వాలా అలియాస్ సింగింగ్ చాయ్‌వాలా హోటల్‌కు ‘పాట’ కోసం వెళతారు. డాలీ చాయ్‌వాలా కస్టమర్లకు వేడి వేడి టీ అందిస్తూనే, మైక్రోఫోన్లో అద్భుతంగా పాడుతుంటాడు. ఆయన గానం వింటూ ‘మరో చాయ్’ అనే మాట కస్టమర్ల నోటి నుంచి వినిపించడం అక్కడ సాధారణ దృశ్యం. ఈ ‘సింగింగ్ చాయ్‌వాలా’కు సంబంధించిన వీడియో క్లిప్‌ను ముంబైలోని సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ బయాని ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేస్తే వైరల్ అయింది. -
ఈ కొరియన్ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు!
పాపులర్ ‘కె–పాప్’ మనకు సుపరిచితం. మరి ‘కె–ఖవ్వాలి అంటే?’ అని అడిగితే ‘అదేమిటీ!’ అని మిక్కిలి ఆశ్చర్యపోయేవారితో పాటు ‘ఎక్కడి ఖవ్వాలీ? ఎక్కడి కొరియా’ అని దూరాభారాలను కూడా లెక్కవేసే వాళ్లు ఉంటారు. ‘కొరియన్ సింగర్స్ సింగింగ్ ఖవ్వాలి’ ట్యాగ్‌లైన్‌తో పోస్ట్ చేసిన ఈ ‘కె –ఖవ్వాలి’ వీడియో వైరల్ అయింది. కల్చరల్ ఎక్స్చేంజ్కు అద్దం పట్టే ఈ వీడియోలో కొరియన్ గాయకులు సంప్రదాయక ఖవ్వాలి మెలోడీలను అద్భుతంగా ఆలపించే దృశ్యం, హార్మోని సుమధుర శబ్దం నెటిజనుల చేత ‘వహ్వా వహ్వా’ అనిపిస్తోంది. ‘బ్యూటీఫుల్ కల్చరల్ ఎక్స్చేంజ్’ లాంటి ప్రశంసలు కామెంట్ సెక్షన్లో కనిపించాయి. ఇవి చదవండి: ప్రముఖ కొరియన్ సింగర్ అనుమానాస్పద మరణం: షాక్‌లో ఫ్యాన్స్ -
సీఎం భగవంత్ మాన్ వీడియో వైరల్.. ప్రతిపక్షాల విమర్శలు
లోక్‌సభ ఎన్నికల వేళ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చేస్తున్న పనులకు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ఒకవైపు పంజాబ్‌లోని సంగ్రూర్ లోక్‌సభ నియోజవర్గంలో కల్తీ మద్యం బారినపడిన మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు.. గతంలో ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి, ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. బాలీవుడ్ సింగర్ సుఖ్విందర్ సింగ్, పాటల రచయిత బబ్బు మాన్‌తో కారులో ప్రయాణిస్తూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. While Rome was burning Nero was playing flute ! Following in the foot steps of Nero, Bhagwant Mann ji is singing tappas while people in own constituency Sangrur are dying of illicit liquor. ਜਦੋਂ ਰੋਮ ਸੜ ਰਿਹਾ ਸੀ ਤਾਂ ਨੀਰੋ ਬੰਸਰੀ ਵਜਾ ਰਿਹਾ ਸੀ! ਨੀਰੋ ਦੇ ਨਕਸ਼ੇ-ਕਦਮਾਂ 'ਤੇ ਚੱਲ ਕੇ ਭਗਵੰਤ… pic.twitter.com/uAVvzz9Ybf — Sunil Jakhar(Modi Ka Parivar) (@sunilkjakhar) March 21, 2024 ‘రోమ్ తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ప్లూట్ వాయించినట్ల ఉంది భగవంత్ మాన్ వ్యవహారం. ఒకవైపు కల్తీ మద్యంతో ప్రజలు మరణిస్తుంటే.. భగవంత్ మాన్ పాటలు పాడుతున్నారు’అని పంజాబ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ తీవ్ర విమర్శలు చేశారు. భగవంత్ మాన్కు సంబంధించిన వీడియోను సునీల్ జాఖర్ తన ఎక్స్( ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నా శాంతి భద్రతల పరిస్థితుల విషయంపై కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా మండిపడ్డారు. ‘దిర్బా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎనిమిది మంది కల్తీ మద్యం బారినపడి మరణించారు. ఈ నియోజకవర్గానికి పంజాబ్ ఎక్సైస్ మంత్రి పాతినిధ్యం వహిస్తున్నారు. దిర్బా.. సంగ్రూర్ లోక్‌సభ పరిధితో వస్తుంది. అది సీఎం భగవంత్ మాన్ సొంత జిల్లా. ఆప్ ప్రభుత్వం కనీసం బాధ్యత వహించపోవటం దారణం’అని ప్రతాప్ సింగ్ విమర్శలు చేశారు. ఇక.. ఇటీవల చోటు చేసుకున్న కల్తీ మద్యం మరణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: Punjab CM: ఎన్నికల వేడి.. హోటల్లో రోజంతా సీఎం రిలాక్స్! -
ప్రేమించటానికి సమయం లేదు!
‘ప్రేమించటానికి సమయం లేదు’ అంటూ పాట రూపంలో చెబుతున్నారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఈ బ్యూటీ నటి మాత్రమే కాదు.. మంచి గాయని అనే సంగతి కూడా తెలిసిందే. తండ్రి కమల్‌హాసన్ నటించిన ‘క్షత్రియ పుత్రుడు’ సినిమాలో ‘పోట్రి పాడడి పెన్నే..’ అనే పాట పాడే తొలి అవకాశం శ్రుతికి ఇచ్చారు సంగీత దర్శకుడు ఇళయరాజా. ఆ తర్వాత ఆమె పలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. కమల్‌హాసన్ నటించిన ‘ఉన్నైపోల ఒరువన్’ సినిమాకి సంగీతం అందించారు శ్రుతీహాసన్. అలాగే ‘ఈనాడు’ సినిమాలో ‘నింగికి హద్దు..’, ‘ఓ మై ఫ్రెండ్’లో ‘శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్‌లో..’, ‘ఆగడు’లో ‘అరె జంక్షన్లో..’, ‘రేసు గుర్రం’ మూవీలో ‘డౌన్ డౌన్...’ ఇలా పలు సినిమాల్లో చాలా పాటలు పాడారామె. తాజాగా మరోసారి గాయనిగా మారారు శ్రుతీహాసన్. ‘జయం’ రవి, నిత్యా మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఓ తమిళ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ‘కాదలిక్క నేరమిల్లై..’ (ప్రేమించటానికి సమయం లేదు) పాటని శ్రుతి పాడనున్నారు. -
Pudami Sakshiga : పైకి కనపడవు గానీ, ఈ బుజ్జి పిట్టల అల్లరి అంతా ఇంతాకాదు
వసంత రుతువు రాగానే చెట్లన్నీ పల్లవిస్తే, ఆ హరిత పల్లవాల లోంచి వినిపించే కోకిల గానం గురించి కవులు చెబుతారు. కాని, కాస్తంత ఆకుపచ్చదనం కనిపిస్తే చాలు, అనేక రకాల పక్షులు వచ్చి సంబరాలు చేసుకుంటాయి. జనావాసాల మధ్య పక్షులు ఏషియన్ గ్రీన్ బీ ఈటర్స్ పై సునీత పొత్తూరి ప్రత్యేక కథనం.. పచ్చని ప్రకృతికి బహుమతిగా మళ్లీ కొన్ని చెట్లనిద్దాం...చిన్ని పక్షిని పాడనిద్దాం -ఫైజ్ అహ్మద్ ఫైజ్ మేం టెర్రెస్ గార్డెన్ మొదలు పెట్టాక, మాకు ఈ చిన్ని అతిథుల సందడి పెరిగిందని చెప్పాలి. ఏషియన్ గ్రీన్ బీ ఈటర్స్(Asian green bee eaters)అన్ని రకాల పిట్టల లోనూ ఇదొక ఆకుపచ్చని ఆకర్షణ! ఈ మధ్య వీటి హాడావుడి ఎక్కువే అయింది. సాధారణ పిచుకల పరిమాణంలో ఉండే ఈ పక్షులు ఆకుపచ్చ రంగులో, కంఠం దగ్గర నీలంగాను, తలపైన పింగళవర్ణం(మిశ్రమ రాగి వర్ణం)తోను, తోక సన్నగా పుల్లలా సాగి, ఉంటుంది. తోక తో కలిపి 9 అంగుళాలు (పూర్వపుభాషలో అయితే జానా బెత్తెడు) ఉంటుంది. ఎంత తేలిక అంటే వెదురు కొమ్మ మీద అర డజను పిట్డలు దర్జాగావాలిపోతాయి! ఇందుకు అనుగుణం గా వాటి కాలి గోళ్లు కలసి ఉండటం వల్ల కొమ్మలపైన పట్డు నిలుస్తుందిట. కొమ్మ కదలకుండా ఒకదానికొకటి ఒరుసుకుని కూర్చున్న తీరు నులి వెచ్చని ఎండ లో చలి కాగుతున్నట్డుఉంటుంది.వెదురు మొక్క కొమ్మలకి అటు ఇటూ.. వాలి, పచ్చని తోరణంలా కనువిందు చేస్తుంటాయి. ఫ్లై కాచర్ అన్న పేరుకు తగ్గట్టు చిన్న చిన్న పురుగులను, తేనెటీగలనూ పట్టి తింటాయి. అయితే వేటాడే విధానం..అదొక కళ లా, ప్రత్యేకం గా ఉంటుంది. గాలిలో ఉండగానే తమ ఆహారాన్ని నోటికి అంకించుకుంటాయి. అలా అనిచటుక్కున మింగవు. నింపాదిగా ఇలా ఓ చెట్టుకొమ్మ మీద వాలి, తన ఆహారాన్ని పొడిచి వేరుచేసి తింటాయి. వీటి గూళ్లను మానవ సమూహాలకు దూరంగా లోతట్డు గా ఉండే పొదలు, గడ్డి భూములలో ఏర్పాటుచేసుకుంటాయిట. ఇవి వలస పక్షులు కావు. అంతరించి పోతున్న జాతుల లెక్కలోనూ లేవు. కాని,మాకు వానాకాలం లో కంటే, ఇలా శీతా కాలం లో మా ప్రాంతంలో ఎక్కువగా చూస్తాను. ఉదయం, సాయంత్రంవేళల్లో కోలహాలంగా గుంపులుగా వచ్చే వాటి అరుపు అనునాసికంగా, తంత్రీ వాద్యంలా ట్రిం...ట్రిం.. అంటూ ఉంటుంది. కొమ్మల మీదనుండి ఒక్కసారిగా ఎగిరి పోయేటప్పుడు చేసే శబ్దం మాత్రం అధికంగా ఉంటుంది. ఇది కాక, క్రిమి కీటకాలను వేటాడే పక్షుల నిత్య సందడి సూర్యోదయానికి ముందే మొదలౌతుంది. తేనె పిట్డలు, జిట్టంగి పిట్టలు, బుల్ బుల్(పిగిలి పిట్ట), తేనిటీగల్ని, పురుగుల్ని పట్టితినే పాసరైన్స్, వేటి కవే నిత్యంతమ కలకూజితాలతో- మధురారవాలతో ఉదయస్తమయాలు రాగరంజితం చేస్తుంటాయి. చలికాలం లో మా ముంగిట్లో ఉన్న కోవిదార చెట్టు (Bauhinia) సుందరంగా పూస్తుంది. వీటి మీద ఎగురుతూ తేనెపిట్టలు, passerines చేసే సందడి అంతా ఇంతా కాదు. కనిపించవు గాని, కొమ్మకొమ్మ కో సన్నాయీ...! ఆపిలుపులన్నీ పూలవేనేమో అనిపిస్తాయిసన్ బర్డ్స్ మందార పూలమీద అలా వాలి, ఇలా చటుక్కున తేనె సంగ్రహించి పోతుంటాయి. కెమెరాకి ‘యాక్షన్’ చెప్పేఅవకాశమే ఇవ్వవు. ఈ బుల్లి పిట్టలు గొంతు విప్పితే చెవులు చిల్లుపడాల్సిందే. పిట్ట కొంచెం కూత ఘనం అంటారుకదా.. అలా! పిగిలి పిట్టలు(Bulbul)- గుబురు తలల తో తోక కింద ఎర్రగా ఉండే ఈ పక్షులు మా టెర్రస్ పైన చేసే సందడి తక్కువేంకాదు. మీకు అలారం క్లాక్ అవసరం లేదు. తెల్లవారు జామునే మొదలు .. కిసకిసలు!బ్లాక్ రాబిన్– ఓ సారి నా నడక దారిలో ఓచిత్రం చూసాను. బ్లాక్ రాబిన్ తన ప్లమేజ్ లో ఆకుపచ్చని గడ్డిపరకలుటక్ చేసుకుని లాన్ లో తిరుగుతూ కనబడింది. ఫోటో తీద్దామనే ప్రయత్నం ఫలించలేదు. కింగ్ ఫిషర్ ఒకటి ఒకే సమయానికి దర్శనం ఇస్తూంటుంది. రివ్వున వాలి, కావలసినదేదో దొరకపుచ్చుకుని దూరంగా లైట్ స్తంభం మీదకి గెంతి .. కాస్త తాళి, ఎగిరెళ్లిపోతుంది. కన్నుమూసి తెరచేంతలోనే ఈ విన్యాసాలన్నీ..! ఒక నీలి ఈకను మాత్రం ఓసారి బహుమతి చేసింది. జిట్టంగి పక్షులు.– ఇళ్ల కప్పులెక్కి, ఈల వేస్తూ హెచ్చరిస్తూ సందడి చేస్తూంటాయి ఉదయాస్తమయాల వేళల్లో. సిల్వర్ బిల్ మునియాలు. గుంపుగా వచ్చి, తమ చిన్ని ముక్కులను నీటి లో తడుపుకొని, జలకాలాడుతూ తెగ సందడి చేస్తాయి. వెదురు ఆకులను ఒడుపుగా చీల్చి గూటికోసం తీసుకుని పోతూంటాయి. అరగదీసినట్లు నునుపు దేలిన ముక్కు(bill), పొట్ట భాగం లో స్కేలింగ్ వుండి కాస్త బ్రౌన్‌గా ఉండే ఈ పిచుకల్లాటి మునియాలు గార్డెన్ లో చెట్ల కొమ్మల్లో జంటలుగా వచ్చి వాలుతాయి. మన ఇళ్ల దగ్గర ప్రమాదస్థాయిలో బ్రీడింగ్ అవుతున్న మరో పక్షి పావురం. పావురాళ్లు గూడు పెట్టని చోటు లేదు. వాటి సంతతి పెరిగిపోతూనే ఉండటంతో, కొన్ని వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. పావురాలకు ధాన్యపు గింజలను వేయడం వల్ల సహజమైన ఆహారవేటను ఆపేసాయంటారు. ఏదేమైనా చిన్న చిన్నపావురాల కువకువలు మాత్రం బాగుంటాయి. ఇక పోతే కాకులూ, పిచికలూ ఒకప్పుడు మనకి సర్వసాధారణంగా కనిపించే పక్షులు. మన సంస్కృతి లో భాగం.పిచికలకు ముంగిట్లో ధాన్యపు కంకులను వేలాడదీసేవారు. కాకులు సరేసరి. మన పితృదేవతలు కాకిరూపం లోవచ్చి పిండం ముట్టి పోతాయని నమ్మకం.కాని ఇవీ ఇపుడు అరుదైపోయాయిఎక్కడపడితే అక్కడ విచక్షణారహితంగా సెల్ టవర్స్ నిర్మింవడం వల్ల, ఎలక్ట్రో మాగ్నటిక్ రేడియేషన్ కి, దాదాపు ఊర పిచుకలు తుడిచి పెట్డుకుని పోయాయి. అలాగే కాకులు కూడా, పట్టణీకరణ పేరుతో వాటి ఆవాసాలనుంచి,వాటికి అనుకూలమైన చోట గూళ్లు ఏర్పరుచుకుని, సంతానోత్పత్తి చేయడానికి వీలు లేకుండా తరిమి వేయబడ్డాయి. పక్షులు పర్యావరణానికి ఎంత మేలు చేస్తాయి అన్నది ప్రత్యేకించి ఎవరికీ చెప్పనక్కరలేదు. క్రిమి కీటకాల బెడదనుంచి పంటలను కాపాడ్డం తో బాటు, పాలినేషన్కు విత్తనాల విస్తరణకు పక్షుల ఉనికిఅవసరమన్నది అందరికీ తెలిసిన సంగతే. ప్రకృతిమీద జరిపిన తిరుగుబాటు వల్ల కలిగిన దుష్పరిణామం ఏమిటో చైనా ఉదంతం ఒకటి చెబుతారు. ఆహారధాన్యాలను పిచుకలు తింటున్నాయని, పిచుకలను పట్డి చంపిస్తారు చైర్మన్ మావో సమయంలో. తర్వాత వాటి పొట్ట కోసి చూసి తెల్లబోయారట శాస్త్రజ్ణులు. ఆహారధాన్యాల కంటే ఎక్కువ క్రిమి కీటకాలను పట్టి తింటాయనితెలిసి. ఆ తరవాత క్రిమికీటకాల అదుపు లేక పంట నష్టం తీవ్రమై కరవు సంభవించిందిట. మిడతలను చంపడానికి క్రిమి కీటకాల నాశకాలను వాడగా, ఫలితంగా భూమిలోని సారం తగ్గిపోయిందిట. ఇదొక గుణపాఠం. అయినా...మనిషి మారలేదు; ఆతని కాంక్ష తీరలేదు–అని సినీకవి తీర్పు ఇచ్చినట్టు జరిగేవి జరుగుతూనే ఉన్నాయి.ప్రకృతిలో సమతౌల్యతకు పక్షుల ఉనికి ఎంత అవసరమన్నది మానవాళికి అర్థం అయేసరికి, ఆధునీకరణ పేరుతో చాలా నష్టమే జరిగిందని చెప్పుకోవాలి. అందుచేత నేడు ఆవాసాల వద్ద ఎంతో కొంత గ్రీనరీ వుండేలా చూసుకోవడంసామాజిక బాధ్యత అయింది. రచయిత : సునీత పోతూరి ఫోటో : శ్యాం సుందర్ తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
‘ఓల్డ్ బట్ గోల్డ్’ యూట్యూబ్ చానల్‌తో.. షోమ్ మ్యూజికల్ జర్నీ..
'షహన షోమ్' మ్యూజికల్ జర్నీ తన అధికార యూట్యూబ్ చానల్ ‘వోల్డ్ బట్ గోల్డ్’తో మొదలైంది. దీని ద్వారా బాలీవుడ్ టైమ్‌లెస్ మెలోడిస్‌ను వినిపించి ఆబాలగోపాలాన్ని అలరిస్తోంది. ‘మొహబ్బత్ కర్నే వాలే’ లాంటి క్లాసిక్‌తో పాటు ‘సేవ్ ది గర్ల్‌చైల్డ్’ ‘ఎడ్యుకేషన్ ఫర్ ది అండర్ప్రివిలేజ్డ్’ లాంటి సామాజిక స్పృహతో కూడిన ఇతివృత్తాలతో పాటలు పాడుతుంది. చిన్నప్పుడు సినిమా పాటలే కాదు క్లాసిక్ గజల్స్, కీర్తనలు పాడేది. ప్రముఖ సంగీతకారుల వర్థంతిని దృష్టిలో పెట్టుకొని వారికి నివాళిగా యూట్యూబ్‌లో చేసే పాటల కార్యక్రమాలు సూపర్‌హిట్ అయ్యాయి.పాత పాటలు పాడుతుంటే కాలమే తెలియదు. 'టైమ్మెషిన్లో గతంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది’ అంటున్న షహనకు దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తన పాటల ద్వారా వివిధ సామాజిక సేవాకార్యక్రమాలకు నిధులను సేకరించడంలో కూడా ముందు ఉంటుంది. 'పాటల ద్వారా సామాజిక సందేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం నా లక్ష్యాలలో ఒకటి’ అని చెబుతుంది షహన. ఇవి చదవండి: ముగ్గురు మిత్రుల ముచ్చటైన విజయం -
నా పాట తీసేస్తే కోపంతో చెక్కు చించి ముఖం మీద వేసాను
-
నా పాట నచ్చి మా ఆయన పెళ్లి చేసుకుంటా అని..!
-
యాక్టింగ్ ఛాన్సులు వచ్చినా వదులుకుంది.. కేతకి ఇంట్రెస్ట్ అదేనట
ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది...అన్నట్లు సంగీతకారుల కుటుంబంలో జన్మించిన కేతకి మతేంగోకర్కు చిన్నప్పటి నుంచే పాట అంటే ఇష్టం. తండ్రి ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. తల్లి సువర్ణ సింగర్. నటిగా కూడా మెప్పించింది కేతకి. ‘షాల’ ఆమె డెబ్యూ ఫిల్మ్. ఈ సినిమా కోసం అవకాశం తనను వెదుక్కుంటూ వచ్చింది. దర్శకుడు సుజిత్ ఒక టెలివిజన్ మ్యూజిక్ షోలో కేతకిని చూసి తన సినిమాలోని పాత్రకు ఎంపిక చేశాడు. నటనలో మంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ ‘నటన’ కంటే సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంటోంది కేతకి. రోజుకు నాలుగు గంటల పాటు సంగీత సాధన చేస్తుంది. ‘మహేష్ మంజ్రేకర్ సినిమాలో నటించిన తరువాత ఎన్నో అవకాశాలు వెదుక్కుంటూ వచ్చినా సంగీతానికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మంచి సింగర్‌గా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. క్లాసిక్ నుంచి కాంటెంపరరీ మ్యూజిక్ వరకు నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను’. గత సంవత్సరం ‘మాయి’ ఆల్బమ్‌తో మ్యూజిక్ కంపోజర్‌గా కూడా తన ప్రతిభ చాటుకుంది కేతకి. ఈ ఆల్బమ్‌లోని తొమ్మిది పాటలను శంకర్ మహాదేవన్, మహాలక్ష్మీ అయ్యర్‌లాంటి ప్రసిద్ధ గాయకులు పాడారు. ‘మన దగ్గర ఉమెన్ మ్యూజిక్ కంపోజర్లు తక్కువగా ఉన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. మంచి మ్యూజిక్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారు. చాలామందికి మ్యూజిక్ కంపోజిషన్‌లో అద్భుత ప్రతిభ ఉన్నా ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల దూరంగా ఉంటున్నారు’ అంటుంది కేతకి. -
వైట్‌హౌస్‌లో పాటలతో హుషారు! ఎవరీ కుర్రాళ్లు?
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్.. వేలాది మంది భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం ఎదురు చూస్తున్నారు. వైట్ హౌస్ మెట్ల వద్ద నలుపు రంగు కోట్లు ధరించిన కొందరు కుర్రాళ్లు "చయ్య చయ్య", "దిల్ సే", "జాష్న్-ఎ-బహారా" బాలీవుడ్ పాటలతో అక్కడున్నవారందరినీ ఉర్రూతలూగించారు. ఇంతకీ ఎవరీ కుర్రాళ్లు అంటే.. స్వరాలే వాద్యాలుగా.. ‘పెన్ మసాలా’.. ప్రపంచంలో మొట్టమొదటి దక్షిణాసియా ఎ క్యాపెల్లా (A Capella) గ్రూప్. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన 19 మంది విద్యార్థులతో ఇది ఏర్పాటైంది. ఎ క్యాపెల్లా అంటే వాద్య సహకారం లేకుండా పాటలు పాడే బ్యాండ్. స్వయంగా తమ స్వరంతోనే వాద్య శబ్ధాలను వీరు అనుకరిస్తారు. 1996 నుంచి ఈ బ్యాండ్ ఉనికిలో ఉంది. ఈ బృందం దేశాధినేతలు, ఇతర ప్రముఖులు పర్యటనలకు వచ్చినప్పుడు పాడటం ద్వారా పేరు తెచ్చుకుంది. ఇటీవల వైట్ హౌస్‌లో అధ్యక్షుడు బైడెన్ భారత ప్రధాని మోదీ కోసం ఇచ్చిన విందు సందర్భంగా ప్రదర్శన ఇవ్వడానికి తమకు అవకాశం, గౌరవం దక్కిందని పెన్ మసాలా గ్రూప్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. వైట్ హౌస్‌లో వేలాది మంది భారతీయుల సమక్షంలో ప్రదర్శన ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ బ్యాండ్ ఇంతకుముందు అప్పటి ప్రెసిడెంట్ ఒబామా కోసం వైట్ హౌస్‌లో, ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చింది. పిచ్ పర్ఫెక్ట్ 2 అనే హాలీవుడ్ చిత్రానికి సౌండ్‌ట్రాక్ అందించింది. దీనికి 2015లో ఉత్తమ సౌండ్‌ట్రాక్‌గా అమెరికన్ మ్యూజిక్ అవార్డు లభించడం విశేషం. -
అవ్వ, తాత మస్తు హుషారు
-
పాట పాడలేదని భర్తపై ఫిర్యాదు.. పోలీసుల ముందు పాడి భార్యను ఫిదా చేశాడు
-
ఆ బుడ్డోడి కాన్ఫిడెన్స్‌కి మంత్రి ఫిదా!
చిన్నారులకు సంబంధించిన పలు వీడియోలు చూసి ఉంటాం. వాటిల్లో వాళ్ల అమ్మనాన్నలు లేదా గురువులు వారి చేత దగ్గరుండి పాడించటం లేదా డ్యాన్సులు చేయించడం వంటివి చేస్తారు. అప్పుడూ ఎవరైన ధైర్యంగా చేయడం వేరు. కానీ ఇక్కడొక బుడ్డోడు మాత్రం పాఠశాలలో తన క్లాస్మేట్స్ అందరి ముందు ఏ మాత్రం బెణుకులేకుండా భలే అద్భుతంగా పాట పాడాడు. అతను పాడే విధానం ఏదో ఒక పెద్ద స్టార్ సింగర్ మాదిరి ఓ రేంజ్లో మంచి కాన్ఫిడెన్స్‌తో పాడాడు. దీన్ని చూసి నాగాలాండ్ ఉన్నత విద్య, గిరిజన వ్యవహారాల మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ ఫిదా అయ్యారు. ఇలాంటి ఆత్మవిశ్వాసమే జీవితంలో కావలని క్యాప్షెన్న్ జోడించి మరీ అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆత్మివశ్వాసం అంటే భయం లేకపోవడం కాదు, దానిని ఎదుర్కొంటూ ముందుగు సాగే సామర్థ్యం! అని చెబుతూ ఆ పిల్లవాడికి హ్యాట్సాప్ అంటూ ప్రశంసిస్తూ.. ట్వీట్ చేశారు. Bas itna confidence chahiye life me. 😀 "ज़िन्दगी जीने के लिए नज़रो की नहीं ! नज़ारो की ज़रूरत होती है !!" pic.twitter.com/EcGrUnXtUi — Temjen Imna Along (@AlongImna) January 18, 2023 (చదవండి: మోదీ ఇలా అనడం తొలిసారి కాదు!: బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు) -
జైల్లో పాట.. దెబ్బకు ఫేమస్.. ఫేట్ మారింది
వైరల్: ఊచల వెనుక పాడిన పాటను పోలీసు వాళ్లే చిత్రీకరించారు. అతని మధుర గాత్రానికి ఫిదా అయ్యి వైరల్ చేశారు. కటకటాల వెనుక పాడిన పాటకు ఇంటర్నెట్ ఫిదా అయ్యింది. ఆ వ్యక్తి మరింత ఫేమస్ అయ్యాడు. జైలు నుంచి రిలీజ్ అయ్యాక.. తన పాట ఫేమస్ కావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాడతను. దానికి కొనసాగింపుగానూ అతనికి ప్రభుత్వ సాయం ప్రకటనతో పాటు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్‌లోని కైమూర్ దహ్రక్ గ్రామానికి చెందిన కన్హయ్యరాజ్ను.. మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో బక్సర్ పోలీసులు అరెస్టు చేశారు. యూపీ నుంచి తాగొచ్చాడని(బీహార్‌లో మద్యపాన నిషేధం అమలు ఉండడంతో) పోలీసులు అతని ఆ రాత్రి జైల్లో ఉంచారు. అయితే ఆ పూట జైలు శిక్ష అతని జీవితాన్ని మార్చేసింది. ఉదయం విడుదలై బయటకు వచ్చిన కన్హయ్యను.. ఆ తర్వాత అంతా కొత్తగా చూడడం మొదలుపెట్టారు. అతని పాట ఫేమస్ అయ్యిందని వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్‌లలో చక్కర్లు కొడుతోందని స్నేహితులు చెప్పారు. దీంతో తన గొంతు విన్న కన్హయ్య తెగ ఖుష్ అయ్యాడు. అయితే.. మద్యం సేవించినందుకు తనను పోలీసులు అరెస్ట్ చేయలేదని, పవన్ సింగ్(భోజ్‌పురి హీరో) పాట పాడినందుకు.. ఆ పాటలో ఒక పదం అభ్యంతకరంగా ఉందని ఆ హీరో ఫ్యాన్ ఫిర్యాదు చేసినందుకే తనను అరెస్ట్ చేశారని కన్హయ్య చెప్తున్నాడు. కానీ, ఆ వీడియోను తాను అప్పుడే డిలీట్ చేశానని వివరణ ఇచ్చాడతను. ఇక ఆ రాత్రి జైల్లో గడిపిన తాను సరదాగా పాట పాడనని, అది ఎవరు వీడియో తీశారు, ఎలా వైరల్ అయ్యిందో కూడా తనకు తెలియదని అంటున్నాడతను. ఆర్థిక కష్టాలతో చిన్నతనంలోనే చదువుకు తాను దూరం అయ్యానని, రిపబ్లిక్‌డే, ఇతర ఫంక్షన్లకు పాటలు కూడా పాడతానని చెప్తున్నాడు కన్హయ్య. ఇక జైలు వీడియో వైరల్ కావడంతో బాలీవుడ్ సింగర్ కమ్ మ్యూజిక్ కంపోజర్ అంకిత్ తివారీ తన మ్యూజిక్ ఆల్బమ్‌లో పాడేందుకు కన్హయ్యకు అవకాశం ఇస్తానని ప్రకటించాడు. మరోవైపు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి మట్టిలో మాణిక్యాలను రాటు దేల్చాల్సిన అవసరం ఉందని, అతని కుటుంబానికి అవసరమయ్యే సాయం అందిస్తామని ప్రకటించడం గమనార్హం. తనలో దాగున్న ప్రతిభ నలుగురికి తెలియడం, దాని ద్వారా తన కుటుంబ పరిస్థితిని మార్చుకునే అవకాశం దొరికినందుకు ఆ దేవుడికి, తనను వైరల్ చేసినవాళ్లకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడతను. नशा एक सामाजिक बुराई है और सिर्फ कला में शक्ति है इस बुराई को हराने की ।@shalabhmani जी मैं इस व्यक्ति को अपनी म्यूजिक कंपनी @MistMusic_ की तरफ से एक गाना गाने का मौका देता हूं । 🙏 https://t.co/qug7cto5Rp — Ankit Tiwari (@officiallyAnkit) January 9, 2023 -
అమ్మ మరిచిన పాట
పక్క ఫ్లాట్‌లో పాపాయి పుట్టింది. బుజ్జిగా ఉండుంటుంది. కళ్లు తెగ తెరిచి తల్లిని చూస్తూ ఉండుంటుంది. పాలు సరిపోతుండొచ్చు. గుండెలకు హత్తుకుని ఇచ్చే వెచ్చదనం సరిపోతుండొచ్చు. అయినా సరే కయ్‌మని ఏడుస్తుంది. నేను ఏడుస్తున్నానహో అని చెప్పడానికి ఏడుస్తున్నట్టుంది. నాకేదో కావాలహో అని చెబుతున్నట్టు ఏడుస్తుంటుంది. అమ్మకు పాతికేళ్లుంటాయి. ఎత్తుకుని సముదాయిస్తుంది. అటూ ఇటూ తిప్పుతూ ఊరుకోబెడుతుంది. పాపాయి ఏడుపు ఆపదే! బహుశా అమ్మ పాడాలేమో! యుగాలుగా తల్లులందరూ పసికందుల కోసం మనోహరమైన గాయనులై ఎత్తే గొంతును ఆ తల్లి కూడా ఎత్తాలేమో! ‘ఆయి ఆయి ఆయి ఆపదలు కాయీ’. ఆహా. ఒకప్పుడు ఏ అమ్మయినా ఈ పాట అందుకుంటే పసినోరు ఠక్కున మూతపడేది. గొంతులో లయ ఊయల ఊపుతున్నట్టుండేది. ఏదమ్మా... మళ్లొకసారి పాడు అన్నట్టుగా పాపాయి మెడ కదిలించేది. ‘ఆయి ఆయి ఆయీ... ఆపదలు కాయీ’. చిట్టి బంగారు తల్లికి ఏ ఆపదలూ రాకూడదు. ఈ బంగరు బుజ్జాయి బొజ్జ నిండా పాలు తాగి, కంటి నిండా కనుకు తీయాలి. వివశుల్ని చేసే చిర్నవ్వు నిదురలో నవ్వాలి. గుప్పిళ్లు బిగించాలి. ఉత్తుత్తికే ఉలికి పడాలి. అందుకు తల్లి ఏం చేయాలి? పాడాలి. ‘ఏడవకు కుశలవుడ రామకుమార... ఏడిస్తె నిన్నెవ్వరెత్తుకుంటారు?’ సీతాదేవి పాడకుండా ఉందా? అడవిలో తావు కాని తావులో, లోకుల మధ్య ఇద్దరు కుమారులను కని, వారికి సర్వం తానై, వారు ఒడిలో ఉంటే అదే పెన్నిధిగా భావించి, ఆ కారడవిలో, రాత్రివేళ, ఏనాడైనా దడుపు వల్లో కలత చేతో ఏడిస్తే సీత పాడకుండా ఉందా? ‘ఉంగరమ్ములు కొనుచు ఉయ్యాల గొనుచు ఊర్మిళా పినతల్లి వచ్చె ఏడవకు. పట్టు అంగీ గొనుచు పులిగోరు గొనుచు భూదేవి అమ్మమ్మ వచ్చె ఏడవకు’. సీతాదేవి పాడుతున్నదా? పిల్లలకు తన సొద చెప్పుకుంటున్నదా? ఆశను వారిలో సజీవంగా ఉంచు తున్నదా? ఏమో! పాడటం మాత్రం మానలేదు. వాళ్ల నాన్న విన్న పాటను తిరిగి వల్లెవేయక ఉండ లేదు. ‘రామా లాలీ మేఘ శ్యామా లాలి... తామరస నయన దశరథ తనయా లాలీ’... తల్లి గొంతు ఎలా ఉంటే ఏమి? బిడ్డ కోసం పాడితే అందులోకి అమృతం వచ్చేస్తుంది. వాత్సల్యపు తేనె తొర్లి పడుతుంది. నా పంచప్రాణాలు నీవే కన్నా అనే భావం మాటలు రాని చిట్టిగుండెకు గట్టిగా చేరుతుంది. పాపాయికి అది కావాలి. పసివాడికి ఆ మాట చెవిన పడాలి. అందుకై చెవి రిక్కిస్తుంది ఒడిలో ఉండే కలువమొగ్గ. ‘జో అచ్యుతానంద జోజో ముకుంద.. రార పరమానంద రార గోవింద’... వింటుంటే నిద్రాదేవి బింకం చెదిరేలా లేదూ! అయ్యో తల్లి... నీ బిడ్డను చేరి హాయిగా నిద్ర పుచ్చుతాలే అని బెట్టు తీసి గట్టున పెట్టేట్టు లేదూ!! శ్రీమంతుల ఇంట్లో వారసుడు పుట్టాడట. సంగీతం వినిపించే ఖరీదైన ఆట వస్తువులు కొంటారు. యూట్యూబ్‌లో జింగిల్స్ వినిపిస్తారు. మధ్యతరగతి ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందట. కొత్త గౌన్లు కొంటారు. బంగరు దండ వేస్తారు. ఏడ్చిన ప్రతిసారీ పాలకే అని భ్రమసి ఎదను నోటికంది స్తారు. పేదవాడి గుడిసెలో ముత్యాలమూట ఒడిలోకొచ్చి పడిందట. ముద్దులు పుణుకుతారు. కంటి మీద రెప్పేయక కాచుకుంటారు. ఏడుస్తూ ఉంటే అగ్గిపెట్టె మీద దరువేసి వినిపిస్తారు. తెలుగు ఉంది మనకు. భాష ఉంది మనకు. రాగం ఉంది, పసికందుల నిదురకై భావం ఉంది మనకు. పాడమని చెప్పారు పెద్దలు పిల్లల కోసం. పాటలు అందించి వెళ్లారు పిల్లల కోసం. తల్లిపాలు పోయి పోత పాలు వచ్చె. లాలిపాట పోయి హోరుపాట వచ్చె. పిల్లలకు తెలుసు ఇది బాగలేదని. అందుకే ఏడుస్తారు. తల్లికి అమ్మమ్మ పాట ఇవ్వలేదు. తల్లి తనకు పుట్టిన బిడ్డకు పాట ఇవ్వబోదు. లాలిపాట అదృశ్యమయ్యే నేలా మనది? ‘నిద్ర నీ కన్నుల్లు మబ్బు మొగముల్లు నిద్రకూ నూరేళ్లు నీకు వెయ్యేళ్లు... నిన్ను గన్నయ్యకూ నిండు నూరేళ్లు... జో జో’.... తల్లి బిడ్డతో చేసే తొలి సంభాషణ లాలిపాట. బిడ్డ జీవితంలో సంగీ తాన్ని తొలిగా ప్రవేశపెట్టేదే లాలిపాట. శ్రుతి తప్పని జీవితాన్ని కాంక్షించేదే లాలిపాట. ఒంటరితనం మిగిలినప్పుడు పాటను తోడు చేసుకొమ్మని ఉపదేశం చేసేదే లాలిపాట. సర్వం సంగీతమయమైన ఈ జగత్తులో బిడ్డకు స్వాగతం పలికేదే లాలిపాట. కాని తల్లి గొంతు ఫోన్లో బిజీ. తల్లి గొంతు ఏదో పని పురమాయింపులో బిజీ. తల్లి గొంతు ఇరుగు పొరుగు పలకరింపుల్లో బిజీ. బిడ్డ పుడితే చేయవలసిన సాంగేలు అనేకం పోయాయి. బిడ్డ పుడితే హాజరు కావాల్సిన బంధుమిత్రులు ముఖం చూపించలేనంత బిజీగా ఉన్నారు. చీటికి మాటికి వచ్చి ఆ చిట్కా, ఈ విరుగుడు చెప్పే ముసలమ్మలు సొంతింట, పరాయింట కాన రావడం లేదు. దిష్టి చుక్కలు, సాంబ్రాణి ధూపాలు లేవు. గోరువెచ్చని నీళ్లతో కాళ్లన బోర్లించి స్నానం చేయించి ఇచ్చే అమ్మలక్కలు లేరు. సంస్కృతి అంటే ఏమిటి? అది ఏదో మహా విగ్రహాల్లో, అపూర్వ ఉత్సవాల్లో ఉండదు. కుటుంబంలో నిబిడీకృతం అయ్యే చిన్నచిన్న ఆనందాల్లో, ముచ్చట్లలో ఉంటుంది. ముగ్గు, మామిడి తోరణం లేనిది కూడా ఇల్లే. కాని అవి రెండూ ఉన్న ఇల్లు తెలుగుదనపు ఇల్లు. ఏడుపు ఆపి, పిల్లలు బుల్లి పెదాలు విప్పి, భలే నవ్వాలి. ఇంటింటా బిడ్డ కోసం పాడి తల్లి ఆవులించాలి. ‘ఏడవకు ఏడవకు వెర్రి నాగన్న... ఏడిస్తే నీ కళ్లు నీలాలు కారు... నీలాలు కారితే నే చూడలేను... పాలైన కారవే బంగారు కళ్లు...’. -
ప్రపోజల్స్‌పై ‘జీ సరిగమప’ విన్నర్ శ్రుతిక ఆసక్తిర వ్యాఖ్యలు
జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్ షో తన గాత్రంతో ఎంతోమందిని ఆకట్టుకుని విజేతగా నిలిచింది శ్రుతిక సముద్రాల. ఆరేళ్లకే సంగీతంలో అడుగు పెట్టిన శ్రుతిక సముద్రాల 'జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్' ఫినాలే కార్యక్రమంలో 'ఏమాయె నా కవిత', 'మెరిసేటి పువ్వా', 'సంకురాత్రి కోడి', 'కొంచెం నీరు', 'ఆనతినీయరా' వంటి పాటలతో అదరగొట్టింది. అంతేకాకుండా విన్నర్ కాకముందే పలు బహుమతులను కూడా గెలుచుకుంది. ఫినాలేకు 8 మంది ఫైనలిస్ట్‌లు చేరగా, అందులో అత్యత్భుదమైన ప్రదర్శన కనబరిచి టైటిల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. చదవండి: Anasuya Bharadwaj: ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి: అనసూయ సంచలన వ్యాఖ్యలు జీ సరిగమప షో విజేతగా నిలిచిన శ్రుతిక ఇటీవల సాక్షితో ముచ్చటిందచింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తను చిన్నప్పటి నుంచి దివంగత లెజెండరి గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, సింగర్స్ చిత్ర, సుశీల గారిని ఫాలో అయ్యానని, అయితే తన ఫేవరేట్ సింగర్స్ మాత్రం చిత్రమ్మ, శ్రేయా ఘోషల్ అని చెప్పంది. ఇక చిత్రగారు పాడిన పాటల్లో ముంబైలోని ‘కన్నాను లే కళయికలు ఏడాడు ఆగవులే..’ అంటూ అచ్చం చిత్రగారిలా పాడి వినిపించింది. అనంతరం ఇక తనకు వచ్చిన మెసేజ్‌లో ప్రపోజల్స్ కూడా వస్తుంటాయి కదా.. అలా మీకు ఏమైన వచ్చాయా? అని యాంకర్ అడగ్గా.. శ్రుతిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: ది ఘోస్ట్‌లో నాగార్జున వాడిన ‘తమ హగనే’ అర్థమేంటో తెలుసా? ‘‘ఏంటో కానీ నాకు ఎక్కువగా అక్క అక్క అక్క అనే వస్తున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రపోజల్స్ రాలేదు. నేను చూసిన మెసేజ్‌లో అన్ని అక్క అనే ఉన్నాయి. ‘వీ సపోర్ట్ యూ అక్క’ అని మెసేజ్ పెడుతున్నారు. అవి చూసి నాకు షాకింగ్‌గా అనిపించింది. ఎందుకంటే అందరు నన్న అంత పెద్దదాన్ని అనుకుంటున్నారా? ఏంటి.. అంత పెద్దదానిలా కనిపిస్తున్నానా? అని అనిపిస్తోంది’ అంటూ శ్రుతిక చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన గురించి పంచుకున్న మరిన్ని విశేషాలను ఇక్కడ చూడండి. -
జాతి పండగకు జేజేలు
సాక్షి, హైదరాబాద్: భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా నగరంలోని అబిడ్స్ జీపీఓ సర్కిల్ నెహ్రూ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన జరగనుంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఉద్యోగులతో పాటు కళాశాల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గోనున్నారు. జీపీఓ సర్కిల్ వద్ద స్వాతంత్య్ర సమరయోధుల చిత్ర పటాలు ప్రదర్శించనున్నారు. రంగురంగుల బ్యానర్లు, గీతాలాపన చేయడానికి మైక్ ఏర్పాట్లు చేశారు. గోల్కొండ కోటలో జాతీయ పతాకంతో కళాకారుడి ఆనంద హేల సామూహిక గీతాలాపన ఏర్పాట్లను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జీఏడీ కార్యదర్శి శేషాద్రి, అడిషనల్ డీజీపీ జితేందర్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, కార్యదర్శి వాకాటి కరుణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు ఉన్నారు. ర్యాలీ నిర్వహిస్తున్న అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యాపకులు తిరంగా సంబరం తరంగమై ఎగిసింది. నగరం అంగరంగ వైభవంగా మెరిసింది. మువ్వన్నెల జెండా వజ్రోత్సవంలా మురిసింది. స్వాతంత్య్ర శోభ వెల్లివిరిసింది. ఇళ్లు, వీధులు, వాహనాలపై త్రివర్ణ పతాకాలు సమున్నతంగా ఆవిష్కృతమయ్యాయి. సోమవారం నగరంలో స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు అంబరమంటాయి. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో భారీ జెండాలతో బైక్ ర్యాలీలు, కారు ర్యాలీలు జోరుగా సాగాయి. భారీ జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాతబస్తీలో జాతీయ జెండాలతో ఉత్సాహంగా ముస్లిం మహిళలు వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి పది మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన పతాకాలు చూడముచ్చగా కనువిందు చేశాయి. సంజీవయ్య పార్క్ సమీపంలో జాతీయ జెండాలతో వింటేజ్ కార్లతో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. అబిడ్స్ మొజంజాహీ మార్కెట్ వేదికగా అతి పొడవైన జాతీయ జెండాతో చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాశాలు, స్కూళ్లలో వేడుకలు ఆనందోత్సాహాలతో సాగాయి. కళాకారులు దేశభక్తి ఉట్టిపడేలా తయారైన విధానం అందరినీ ఆకట్టుకుంది. ట్యాంక్‌బండ్‌పై త్రివర్ణ పతాకాలతో ర్యాలీ నగరంలోని చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలతో పాటు నలుమూలలా వ్యాపించి ఉన్న కార్పొరేట్ ఆఫీసుల్లో, ఐటీ కంపెనీల్లో, విద్యా సంస్థల్లో 75 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గోల్కొండ కోట వేదికగా ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలతో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈసారి స్వాతంత్య్ర దినోత్సవాల్లో నగర యువత ఆసక్తిగా పాల్గొని సందడి చేశారు. వజ్రోత్సవాల్లో భాగంగా నగరానికి చెందిన మైక్రో ఆరి్టస్టు కృష్ణ ఉట్ల బియ్యపు గింజపై జాతీయ జెండాను రూపొందించారు. చిన్న పరిమాణంలో ఉండే బియ్యపు గింజపై అశోక చక్రం, మూడు వర్ణాలతో ఉన్న జాతీయ జెండాను వేసి దేశభక్తిని చాటుకున్నాడు. – సాక్షి, సిటీబ్యూరో (చదవండి: దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ శక్తులను అడ్డుకోవాలి) -
వైరల్ ప్రధాని మెచ్చారు!
జాతీయోద్యమ కాలంలో పాట చూపించిన ప్రభావం తక్కువేమీ కాదు. ఊరూరు తిరిగింది... ఉర్రూతలూగించింది. అణువణువులో దేశభక్తి నింపుకొని కదం తొక్కింది.... పాట బలమైన ఆయుధం అయింది. అలాంటి తమిళ దేశభక్తి గీతం ఒకటి ఇప్పుడు సామాజిక వేదికలలో వైరల్ అయింది. ‘అద్భుతం’ అనిపించిన ఆ పాటను ఆలపించింది తమిళులు కాదు... అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు... అశప్‌మై, కుమారి బెహల్టీలు స్వాతంత్య్ర సమరయోధుడు, మహాకవి సుబ్రహ్మణ్య భారతి రాసిన తమిళ దేశభక్తి గేయం ‘పారుక్కుళ్లే నల్ల నాళ్ ఎంగళ్ భారతినాడు’ను ఆలపించారు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటిసారి ఈ వీడియోను అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ ట్విట్టర్లో పోస్ట్ చేసి ప్రశంసావాక్యాలు రాశారు. 24 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను చూసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో స్పందించారు. ‘ఈ వీడియోను చూసి చాలా సంతోషంగా, గర్వంగా అనిపించింది. ఈ షైనింగ్ స్టార్స్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను. అరుణాచల్ సిస్టర్స్ గొంతులో వినిపించిన తమిళదేశభక్తి గీతం ఏక్ భారత్, శ్రేష్ఠభారత్ స్ఫూర్తిని చాటుతుంది’ అని ట్వీట్ చేశారు ప్రధాని. ఇక సోషల్ మీడియా ‘కామెంట్ సెక్షన్’లో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రశంసలు వచ్చాయి. ‘అచ్చం తమిళ సిస్టర్స్ పాడినట్లుగానే ఉంది’ అని ఎంతోమంది అరుణాచల్ ప్రదేశ్ సిస్టర్స్‌ను ఆకాశానికెత్తారు. ‘మా అమ్మాయిలు కూడా అరుణాచల్‌ప్రదేశ్‌లోని గొప్పదేశభక్తి పాటలు పాడడానికి సిద్ధం అవుతున్నారు’ అని ఒక తమిళియన్ కామెంట్ పెట్టాడు. ‘మన దేశంలో ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో దేశభక్తి గీతాలు ఉన్నాయి. అవి ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమై పోకుండా, అందరికీ సుపరిచితమై పోవాలంటే ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలి’ అని ఒకరు స్పందించారు. మంచిదే కదా! -
స్ఫూర్తి: తలవంచని పాట
పాడటం తప్పు కాదు... అదొక అద్భుతమైన కళ అయితే ఆ కళ కొందరికి కంటగింపుగా మారింది కశ్మీర్లో బహిరంగ వేదిక ఎక్కి ఒక అమ్మాయి పాట పాడటం అనేది అంత తేలికైన విషయం కాదు! వెర్రితలలు వేసే వెక్కిరింపులతో పాటు, ‘ప్రాణాలు తీస్తాం’ అని బెదిరింపులు కూడా ఎదురవుతుంటాయి. ఆ బెదిరింపులకు భయపడి ఉంటే కశ్మీర్‌లోని మారుమూల పల్లెలో పుట్టిన షాజియా బషీర్ గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో రాణించేది కాదు. ఎంతోమంది యువకళాకారులకు స్ఫూర్తిని ఇచ్చి ఉండేది కాదు... దక్షిణ కశ్మీర్‌లోని తాజివర అనే ఊళ్లో పుట్టింది షాజియ. చిన్నప్పటి నుంచి పాటలు అద్భుతంగా పాడేది. సంగీతంలో ఎక్కడా శిక్షణ తీసుకోకపోయినా, ఆ అందమైన ప్రకృతే ఆమెకు రాగాలు నేర్పిందేమో అన్నట్లుగా ఉండేది. పెరిగి పెద్దయ్యాక కూడా ఆమె పాట బాటను వీడలేదు. మిలే సుర్ (డిడి కశ్మీర్) అనే టీవీ కార్యక్రమానికి ఎంపిక కావడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. రకరకాల వడపోతల తరువాత ఎంపికైన నలుగురిలో తానొక్కతే అమ్మాయి. ఈ కార్యక్రమంతో షాజియాకు గాయనిగా ఎంతో పేరు వచ్చింది. మరోవైపు ‘రేడియో కశ్మీర్’ కోసం తాను పాడిన పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. ఏ ఊళ్లో సంగీత కార్యక్రమం జరిగినా తనను పిలిపించి పాడించేవారు. బాలీవుడ్ మసాలా పాటలు కాకుండా కశ్మీరి సంప్రదాయ జానపదగీతాలను పాడి అలరించేది. కొత్తతరానికి అవి కొత్త పాటలు, పాతతరానికి అవి మళ్లీ గుర్తు చేసుకునే మధురమైన పాటలు. ఎక్కడికైనా బస్‌లోనే వెళ్లేది. ఎంత రాత్రయినా తల్లిదండ్రులు తన కోసం బస్‌స్టాప్‌లో ఎదురు చూసేవారు. ఒకవైపు షాజియా గానమాధుర్యానికి అబ్బురపడి మెచ్చుకునేవాళ్లతో పాటు, మరోవైపు ‘వేదికలు ఎక్కి పాడడం ఏమిటి. ఊరూరూ తిరగడం ఏమిటీ’ అని విమర్శించేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. బెదిరింపులు కూడా వచ్చాయి. ఆ రోజులన్నీ తనకు నిద్రలేని రాత్రులే. ఈ వెక్కిరింపులు, బెదిరింపులను తట్టుకోవడం తన వల్ల కాదనుకొని ఒకానొక సమయంలో ‘పాట’కు శాశ్వతంగా దూరంగా జరగాలని అనుకుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు, సోదరుడు ధైర్యం చెప్పారు. తనను పాటకు మరింత దగ్గర చేశారు. ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఎన్నెన్నో దేశాల్లో తన పాటల అమృతాన్ని పంచింది షాజియ. నసీమ్ అక్తర్ మెమోరియల్ అవార్డ్, బక్షీ మెమోరియల్ కమిటీ అవార్డ్, సంగీత్ నాటక్ అకాడమీ... లాంటి ఎన్నో అవార్డ్లు అందుకున్న షాజియ సూఫీగీతాలతో పాటు హిందూ భక్తిగీతాలను మధురంగా ఆలపించడంలో అద్భుతం అనిపించుకుంది. 2014లో తండ్రి చనిపోవడంతో షాజియ గొంతులో దుఃఖం తప్ప ఏమీ లేకుండా పోయింది. అవి తనకు చీకటి రోజులు. అదేసమయంలో తండ్రి మాట ‘నువ్వు పాట ఎప్పుడూ ఆపవద్దు’ గుర్తుకు వచ్చి మళ్లీ పాడటం మొదలుపెట్టింది. తన పాట ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చింది. షాజియాను ఆదర్శంగా తీసుకొని ఈ తరం యువతులు సంగీతరంగంలో రాణిస్తున్నారు. ‘ఏ రంగంలో అయినా కష్టపడడం తప్ప విజయానికి దగ్గరి దారి అనేది లేదు’ అంటున్న షాజియా కష్టపడే తత్వానికి ఆత్మస్థైర్యాన్ని కూడా జోడించింది. -
జగమంతా శివపదం
ఋషీపీఠం ఆధ్వర్యంలో రెండో శివపదాల అంతర్జాతీయ పోటీలు జరిగాయి. మే 13 నుంచి 15 వరకు యూట్యూబ్ మాధ్యమంగా ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నాలుగు ఖండాలలోని పద్నాలుగు దేశాలకు చెందిన 300 మంది ఔత్సాహిక గాయకులు ఈ పాటల పోటీల్లో పాల్గొన్నారు. సామవేదం షణ్ముఖ శర్మ రచించిన వెయ్యికి పైగా శివపద గీతాల్లో కొన్నింటిని ఈ పోటీలో ఆలపించారు. షణ్ముఖుని శివుని ఆరు విభాగాలతో తలపిస్తు ఆరు పూటల జరిగిన ఈ కార్యక్రమం కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పరిచయవ్యాఖ్యలతో మొదలయ్యింది. ప్రవాసులయిన ఎందరో పిల్లలు సంప్రదాయబద్ధమైన వస్త్రధారణతో, స్పష్టమైన ఉఛ్చారణతో శృతి, లయ బద్ధంగా అద్భుతముగా ఆలపించారు. చిన్మయ జ్యోతిర్మయలింగం, పాలవన్నెవాడు, శివుడు ధరించిన, సకలమంత్రముల సంభవమూలం, సభాపతి పాహిపాహిమామ్ శివపద కల్యాణం తదితర గీతాలు ఆలపించారు. శివపదం కోసం తన జీవితపరమావధిగా, సార్ధకతగా రాసుకున్న పాటలను, ఇంత మంది వాటిని చక్కగా పాడటం ఎంతో ఆనందాన్ని కలిగించిందని షణ్ముఖ శర్మ అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వాణి, రవి గుండ్లపల్లిలను అభినందించారు. ఈ కార్యక్రమానికి భారత్, ఆస్ట్రేలియా, సింగపూర్, అమెరికాలకు చెందిన పదహారు మంది సంగీత దర్శకులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. చదవండి: సింగపూర్‌లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు