29 ఏళ్ల మైఖేల్ స్లడే ఎప్పటిలాగే ఇంటికొచ్చి అలెక్సాని ఆన్ చేసి ఏదైనా మంచి సంగీతం వినిపించమని అడిగాడు. అయితే అది సంగీతం వినిపించడానికి బదులు బూతులు తిట్టడం మొదలెట్టింది. ఎప్పుడడిగినా పాటలు వినిపించే ఈ వర్చువల్ అసిస్టెంట్... ఉన్నట్టుండి బూతులందుకోవడంతో మైఖేల్ షాక్ తిన్నాడు. ఏం జరిగిందో తెలియక కంగారు పడ్డాడు. అంతకు ముందురోజే మైఖేల్ తన అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం రద్దు చేసుకున్నాడు. దాని విషయమై కస్టమర్ కేర్‌కు చెందిన వ్యక్తితో మాట్లాడాడు. సభ్యత్వం రద్దు చేసుకున్నప్పటి నుంచి అలెక్సా ఇలా వింతగా ప్రవర్తించడంతో దానికీ దీనికీ ఏదైనా సంబంధం ఉందేమోనని అనుమానించాడు. అమెజాన్‌ను సంప్రదిస్తే అలాంటిదేమీ లేదన్నారు. అలెక్సా ఎందుకలా అనుచిత పదాలు వాడుతోందో తమకూ అర్థం కావడం లేదన్నారు. అలెక్సా ఖాతా వివరాలు ఇస్తే ఏం జరిగిందో పరిశీలించి చెబుతామని చెప్పారు. జరిగిన పొరపాటుకు పరిహారంగా అమెజాన్ మైఖేల్‌కు 5 పౌండ్ల నగదు, ఏడాది అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఉచితంగా ఇచ్చింది.‘ఇంటికొచ్చాకా రోజూలాగే అలెక్సాను ఏదైనా సంగీతం వినిపించమని అడిగాను. ‘తప్పకుండా. మీ పాటల జాబితా ఇది......(అని ఓ బూతు పదం వాడింది). తర్వాత క్షమించండి ఏదో పొరపాటు జరిగింది’ అని అలెక్సా చెప్పే సరికి షాక్ తిన్నా. అలెక్సా అలా మాట్లాడటం నమ్మలేకపోయా’ అన్నాడు సౌత్‌వేల్స్‌కు చెందిన మైఖేల్. అమెజాన్ సాంకేతిక నిపుణులు కూడా ఇలా ఎందుకు జరిగిందో చెప్పలేకపోయారన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment