Year Ender 2024: భారతీయులు అలెక్సాను అడిగిన ‍ప్రశ్నలివే.. జాబితా షేర్‌ చేసిన అమెజాన్‌ | Indian Users Asked These Questions to Alexa in 2024 | Sakshi
Sakshi News home page

Year Ender 2024: భారతీయులు అలెక్సాను అడిగిన ‍ప్రశ్నలివే.. జాబితా షేర్‌ చేసిన అమెజాన్‌

Published Tue, Dec 24 2024 1:22 PM | Last Updated on Tue, Dec 24 2024 1:22 PM

Indian Users Asked These Questions to Alexa in 2024

2024 ముగియడానికి ఇక కొద్దిరోజులే మిగిలున్నాయి. ఈ నేపధ్యంలో ఈ ఏడాదిలో జరిగిన ఘటనలను ఒకసారి గుర్తు చేసుకోవడం పరిపాటి. వీటిలో కొన్ని విషయాలు మనకు ఎంతో వినోదాన్ని పంచుతాయి. అలాంటివాటిలో అలెక్సా వినియోగం ఒకటి.

అమెజాన్‌కు చెందిన వాయిస్ అసిస్టెంట్ పరికరం అలెక్సా(alexa)ను ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. కొంతమంది దీనిని వినోదం కోసం ఉపయోగిస్తుండగా, మరికొందరు విద్య, వ్యక్తిగత జీవితం, వంటకాలు లేదా రోజువారీ జీవితానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ప్రశ్నలు సంధిస్తూ ఉపయోగించుకుంటున్నారు. అలెక్సా యూజర్ల ప్రశ్నలకు సరైన సమాధానమిస్తుంటుంది.

2024లో భారతీయులు(Indians) అలెక్సాను అడిగిన కొన్ని ప్రశ్నల జాబితాను అమెజాన్ విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం అలెక్సా యూజర్స్‌.. క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలను అధికంగా అడిగారు. అలాగే సెలబ్రిటీలు, గ్లోబల్ ఈవెంట్‌లు, పబ్లిక్ ఫిగర్‌లకు సంబంధించిన ‍ప్రశ్నలను కూడా అడిగారు.  ఈ సంవత్సరం అలెక్సా ఒక కిచెన్ గైడ్‌గా  చాలామందికి సహాయపడిందని అమెజాన్‌ తెలిపింది.

యూజర్స్‌ క్రికెట్‌పై అత్యధికంగా అడిగిన ప్రశ్నలివే..
‘అలెక్సా, క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?’
‘క్రికెట్ స్కోర్ ఎంత?’
‘ఇండియా మ్యాచ్ ఎప్పుడు?’
‘ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా స్కోరు ఎంత?’
‘ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా స్కోరు ఎంత?’
‘తదుపరి క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు?’

ఈ ప్రముఖుల హైట్‌ ఎంత అని అడిగారు
విరాట్ కోహ్లీ
క్రిస్టియానో ​​రొనాల్డో(Cristiano Ronaldo)
లియోనెల్ మెస్సీ
షారుక్ ఖాన్
అమితాబ్ బచ్చన్
కృతి సనన్
దీపికా పదుకొనే
హృతిక్ రోషన్

ఈ ప్రముఖుల వయసు ఎంతని అడిగారు
నరేంద్ర మోదీ
విరాట్ కోహ్లీ
షారుక్ ఖాన్
అమితాబ్ బచ్చన్
క్రిస్టియానో ​​రొనాల్డో
సల్మాన్ ఖాన్
ఎంఎస్‌ ధోని
రోహిత్ శర్మ
హృతిక్ రోషన్
టేలర్ స్విఫ్ట్

ఈ ప్రముఖుల ఆస్తులకు సంబంధించి..
2024లో యూజర్స్‌  ప్రముఖుల ఆస్తుల విలువను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ, మిస్టర్ బీస్ట్, ఎలాన్ మస్క్, క్రిస్టియానో ​​రొనాల్డో, షారుక్ ఖాన్, జెఫ్ బెజోస్, లియోనెల్ మెస్సీ, విరాట్ కోహ్లీ, రతన్ టాటా, బిల్ గేట్స్, విరాట్ కోహ్లీ, క్రిస్టియానో ​​రొనాల్డో, హార్దిక్ పాండ్యా, సల్మాన్ ఖాన్‌ తదితరులున్నారు.

వింత ప్రశ్నలు కూడా..
వాయిస్ అసిస్టెంట్ అలెక్సా పరికరాన్ని ఉపయోగించిన వినియోగదారులు  పలు ఫన్నీ ప్రశ్నలు కూడా అడిగారు. ‘అలెక్సా, మీరు ఏమి చేస్తున్నారు?’, ‘అలెక్సా, మీరు నవ్వగలరా?’ ‘అలెక్సా, మీ పేరు ఏమిటి?’ లాంటి ప్రశ్నలను అడిగారు.

ఇది కూడా చదవండి: అవి క్రిస్మస్‌ పక్షులు.. వాటి కువకువలు సుమధుర సరాగాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement