Alexa
-
గ్రామీణ విద్యకు వాయిస్ టెక్నాలజీ దన్ను
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో విద్యాబోధనలో వాయిస్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించగలదని అమెజాన్ ఇండియా డైరెక్టర్ (అలెక్సా) ఆర్ఎస్ దిలీప్ తెలిపారు. అయితే, ఇప్పటికీ దీని ఉపయోగం గురించి చాలా మందికి తెలియదని, ఈ నేపథ్యంలోనే అవగాహన కల్పన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.నాగాలాండ్‌లోని కొన్ని ప్రభుత్వ పాఠశాల్లో అలెక్సా ఎనేబుల్డ్ ఎకో స్మార్ట్ స్పీకర్లను ఉపయోగిస్తుండటమనేది వాయిస్ టెక్నాలజీ వల్ల చేకూరే ప్రయోజనాలను తెలుసుకునేందుకు తోడ్పడగలదని చెప్పారు. చదువుపై విద్యార్థుల్లో ఆసక్తి పెరగడానికి కూడా ఈ సాంకేతికత దోహదపడుతోందని దిలీప్ పేర్కొన్నారు. వాయిస్ టెక్నాలజీ మెరుగుపడే కొద్దీ విద్యారంగంలో మరిన్ని వినూత్న సాధనాలు అందుబాటులోకి రాగలవని, గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభ్యాసం రూపురేఖలు మార్చగలవని ఆయన చెప్పారు. -
13 ఏళ్ల అమ్మాయికి 'ఆనంద్ మహీంద్రా' జాబ్ ఆఫర్: ఎందుకో తెలిస్తే..
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో 13 ఏళ్ల 'నిఖిత' కోతుల దాడి నుంచి తనతోపాటు ఉన్న చిన్నపిల్లను కాపాడిన తీరు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' కూడా ఫిదా అయ్యారు. ఏకంగా జాబ్ ఆఫర్ కూడా చేశారు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిఖిత అమెజాన్ అలెక్సాను ఉపయోగించి ఇంట్లోకి చొరబడ్డ కోతులను భయపెట్టి తరిమేసింది. కోతులు వచ్చినప్పుడు భయపడకుండా సమయస్ఫూర్తితో అలోచించి దైర్యంగా ఎదుర్కొన్న ఆ అమ్మాయిని పలువురు ప్రశంసిస్తున్నారు. దీనికి ముగ్దుడైన ఆనంద్ మహీంద్రా.. తన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒక ట్వీట్ చేశారు. టెక్నాలజీకి మనం బానిసలుగా మారుతామా? లేదా ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో మాస్టర్స్ అవుతామా? అనేది ప్రశ్న. 13 ఏళ్ల అమ్మాయి వేగంగా ఆలోచించి అమెజాన్ అలెక్సాను ఉపయోగించి కోతుల భారీ నుంచి బయటపడింది. ఆమె ప్రదర్శించిన స్ఫూర్తి చాలా గొప్ప విషయం. నిఖిత చదువు పూర్తయిన తరువాత ఎప్పుడైనా కార్పొరేట్ ప్రపంచంలో పనిచేయాలని నిర్ణయించుకుంటే.. ఆమెను మాతో చేరటానికి ఒప్పించగలమని ఆశిస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: ఫీజుకు డబ్బుల్లేక భార్య నగలమ్మిన అనిల్ అంబానీ.. ఎంతటి దుస్థితి! అసలేం జరిగిందంటే? కొంత మంది అతిథులు నిఖిత ఇంటికి వచ్చారని, ఆ సమయంలో గేట్ ఓపెన్ చేసి ఉంచడం వల్ల కోతులు వంటగదిలో ప్రవేశించాయని నిఖిత చెప్పింది. కోతులు వంటగదిలో ప్రవేశించిన తరువాత అక్కడున్న వస్తువులను విసిరివేయడం స్టార్ట్ చేశాయి. ఆ సమయంలో అక్కడనే ఉన్న చిన్నపిల్ల భయపడింది. కానీ నేను మాత్రమే అలెక్సాను కుక్కలాగా శబ్దం చేయమని ఆదేశించాను.. అలెక్స్ చెప్పినట్లు చేసింది. దీంతో కోతులు భయపడి అక్కడ నుంచి పారిపోయాయని చెప్పింది. The dominant question of our era is whether we will become slaves or masters of technology. The story of this young girl provides comfort that technology will always be an ENABLER of human ingenuity. Her quick thinking was extraordinary. What she demonstrated was the… https://t.co/HyTyuZzZBK — anand mahindra (@anandmahindra) April 6, 2024 -
రేపటి నుంచి అలెక్సా పనిచేయదు! కానీ..
ఆధునిక కాలంలో అమెజాన్ అలెక్సా, యాపిల్ హే సిరి వంటి వాయిస్ అసిస్ట్ సర్వీకులు ఎక్కువ వాడుకలో ఉన్నాయి. అయితే అలెక్సా త్వరలో కొన్ని డివైజ్‌లలో పనిచేయదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అమెజాన్ అలెక్సా సర్వీసుకు సంబంధించి సెర్చ్ ఇంజిన్ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇది గూగుల్ నెస్ట్ కిట్‌పై పనిచేయదని సమాచారం. రేపటి నుంచి (2023 సెప్టెంబర్ 29) గూగుల్ లెగసీ నెస్ట్ కిట్ ద్వారా అలెక్సా సేవలు నిలిచిపోతున్నాయి. అయితే ఈ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలంటే కొత్త Google Nest స్కిల్‌ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ముందుగా మీ మొబైల్లోని అలెక్సా యాప్ ఓపెన్ చేసి, ట్యాప్ మరి మీద క్లిక్ చేయాలి. తరువాత స్కిల్ అండ్ గేమ్స్ సెలక్ట్ చేసుకుని, ఫైండ్ యువర్ స్కిల్స్ ఎంచుకోవాలి. ఫైండ్ నెస్ట్ అలెక్సా స్కిల్ సెలక్ట్ చేసి డిసేబుల్ చేయాలి. * అలెక్సా యాప్‌లో ఉన్న నెస్ట్ డివైజెస్ అన్నీ రిమూవ్ చేయాలి. గూగుల్ హోమ్ యాప్‌లో న్యూ గూగుల్ నెస్ట్ అలెక్సా స్కిల్ ప్రారంభించడానికి, ముందుగా యాప్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి + గుర్తు మీద ట్యాప్ చేయాలి. అందులో సర్వీస్ ఎంచుకుని అందులో అమెజాన్ అలెక్సా స్కిల్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత అలెక్సా యాప్ ఓపెన్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి. అమెజాన్ ఎకో స్పీకర్ లేదా డిస్ప్లేను కలిగి ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -
నిద్రపుచ్చుతుంది.. వేళకు మేల్కొల్పుతుంది
ఇది వినూత్నమైన బెడ్‌లైట్. ఉత్త బెడ్‌లైట్ మాత్రమే కాదు, ఇది అలారం కూడా! చక్కగా నిద్రపుచ్చడమే కాకుండా, వేళకు మేల్కొల్పుతుంది. ఇందులోని ఆరు వాట్ల బ్లూటూత్ స్పీకర్ సిస్టమ్ మరో అదనపు సౌకర్యం. పడుకునే సమయంలో ఈ బెడ్లైట్ను ఆన్ చేసుకుని, స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకున్న దీని యాప్ సాయంతో కోరుకున్న సంగీతాన్ని మంద్రంగా వింటూ హాయిగా నిద్రలోకి జారుకోవచ్చు. ఇది అలెక్సా సాయంతో పనిచేస్తుంది. కళ్లకు ఇబ్బంది లేకుండా దీని కాంతిని కోరుకున్న స్థాయిలో, కోరుకున్న రంగుల్లో సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇదీ చదవండి: ఆధార్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. పుట్టిన బిడ్డకు ఎంతో మేలు! పడుకునే ముందు పొద్దున్నే నిద్ర లేవాల్సిన సమయాన్ని అలారంలో సెట్ చేసుకుంటే చాలు. వేళకు ఠంచనుగా నిద్రలేపుతుంది. అమెరికన్ కంపెనీ డబ్ల్యూఐఐఎం ఈ అలారం బెడ్లైట్ను ‘వేకప్ లైట్’ పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర 129 డాలర్లు (రూ.10,584) మాత్రమే! -
అదిరిపోయే స్మార్ట్ ఫ్యాన్..అమెజాన్ అలెక్సా, సిరి ఇంకా ఎన్నో ఫీచర్లు
ఇక్కడ ఫొటోలో ఉన్నది సాదా సీదా పెడెస్టల్ ఫ్యాన్లాగానే కనిపిస్తోంది గాని, ఇది స్మార్ట్ కూలింగ్ ఫ్యాన్. ఈ ఫ్యాన్ ఎయిర్ కూలర్ కంటే అమోఘంగా పనిచేస్తుంది. ‘నాష్ పీఎఫ్–1’ పేరుతో ఎలక్ట్రిక్ పరికరాల తయారీ సంస్థ ‘నాష్’ దీనికి రూపకల్పన చేసింది. ఈ ఫ్యాన్‌లోని సెన్సర్లు పరిసరాల్లోని ఉష్ణోగ్రతల పెరుగుదలను గుర్తించి, గది వేడెక్కక ముందే చల్లబరుస్తుంది. ఈ ఫ్యాన్ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా, సిరి వంటి యాప్స్ ద్వారా వాయిస్ కమాండ్లకు అనుగుణంగా స్పందిస్తుంది. వైఫై కనెక్షన్, స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు, ఈ ఫ్యాన్ చాలా స్మార్ట్‌గా పనిచేస్తూ, వేసవి ధాటిని ఏమాత్రం తెలియనివ్వదు. దీని ధర 249 డాలర్లు (రూ.19,817). -
చనిపోయినా.. వారి గొంతు వినిపిస్తుంది!
మీకు ఎంతో ఇష్టమైన వారిని కోల్పోయామని బాధపడుతున్నారా? మీ ఆప్తులను తిరిగి మీ ఇంటికి తెస్తామంటోంది అమెజాన్ కంపెనీ. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? అయితే ఓ లుక్కేయండి.. అలెక్సా అసిస్టెంట్ కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) సాంకేతికత సాయంతో చనిపోయిన మీ బంధువులను/ఆప్తులను మీ వద్దకు చేరుస్తామంటోంది! వారిని భౌతికంగా తీసుకురాలేనప్పటికీ వారి గొంతుకను మనకు వినిపిస్తామంటోంది. అమెజాన్‌లో బాగా ప్రాచుర్యం పొందిన అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌కు సంబంధించిన కొత్త ఫీచర్‌ను కంపెనీ ఇటీవల ఆవిష్కరించింది. అది చనిపోయిన వారి గొంతుకతో మాట్లాడుతుంది. రికార్డు చేసిన వారి వాయిస్ ఆధారంగా అలెక్సా అచ్చం వారిలాగే మాట్లాడి మనల్ని మురిపిస్తుంది. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో ఇటీవల నిర్వహించిన వార్షిక సదస్సులో అమెజాన్ దీన్ని ప్రదర్శించింది. ఒక నిమిషం కన్నా తక్కువ నిడివి ఉన్న రికార్డెడ్ వాయిస్‌ను విని ఇది ఎవరి గొంతుతోనైనా ఇట్టే మాట్లాడేయగలదని కంపెనీ వెల్లడించింది. నానమ్మా.. కథ చెప్పవా? వాయిస్ అసిస్టెంట్‌కు సంబంధించిన వీడియోను అలెక్సా ఏఐ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్, హెడ్ సైంటిస్ట్ రోహిత్ ప్రసాద్ ఆ సదస్సులో ప్రదర్శించారు. ఆ వీడియోలో ఏముందంటే ఒక పదేళ్ల బాలుడు ‘అమెజాన్ ఎకో డాట్’తో ‘అలెక్సా.. మా నానమ్మ ద్వారా ‘ది విజార్డ్ ఆఫ్ ఓజ్’ కథను నాకు వినిపించవా’ అని అడుగుతాడు. అప్పుడు అలెక్సా.. ఓకే అని చెప్పి ఆ బాలుడు అడిగినట్లు చనిపోయిన వాళ్ల నానమ్మ గొంతుకతో ఆ కథను చదివి వినిపిస్తుంది. ఈ వీడియో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. జ్ఞాపకాలు పదిలంగా.. ‘ప్రస్తుత ప్యాండెమిక్ సమయంలో మనకెంతో ఇష్టమైన వారిని కోల్పోయాం. ఈ కృత్రిమ మేథ వారిని కోల్పోయామన్న బాధను తప్పించలేనప్పటికీ.. వారి జ్ఞాపకాలను మాత్రం మనకు అందిస్తుంది. అలెక్సా ద్వారా వారి జ్ఞాపకాలను మనం పదిలపరుచుకోవచ్చు’ అని రోహిత్ ప్రసాద్ ఉద్వేగంగా చెప్పారు. అయితే ఈ టెక్నాలజీని ఎప్పుడు అందుబాటులోకి తెస్తారో ఆయన వెల్లడించలేదు. – సాక్షి సెంట్రల్‌డెస్క్ -
అలెక్సా:"ఏం చేద్దామంటావ్ మరి!? నువ్వు గమ్మత్తుగా మాట్లాడుతున్నావ్!!
అలెక్సా పాత తెలుగు పాటలు కావాలి? అలెక్సా ఈరోజు వాతావరణం ఎలా ఉంది? అలెక్సా ఈరోజు వార్తలేంటీ? అంటూ చాలా మంది అడుగుతుంటారు. ఇలా మనజీవితాల్లో పర్సనల్ అసిస్టెంట్‌గా మారిన అలెక్సా వినియోగం పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారతీయులు 2020తో పోలిస్తే 2021 అలెక్సాను వినియోగించే వారిసంఖ్య 68శాతం పెరగ్గా అందుల్లో 50శాతం మంది కస్టమర్లు నాన్ - మెట్రోనగరాలకు చెందిన వారేనని తెలుస్తోంది. ఇక అమెజాన్ఇండియా మనదేశంలో అలెక్సా 4వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది.ఈ సందర్భంగా తన వాయిస్ అసిస్టెంట్ అలెక్సా గురించి అమెజాన్ ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ఆసక్తికరంగా, మనదేశంలో గతేడాది మార్చి-ఏప్రిల్ కోవిడ్ సెకండ్ వేవ్ వెలుగులోకి వచ్చినప్పుడు యూజర్లు కోవిడ్ గురించి మనదేశంలో కరోనా సెకండ్ వేవ్ అంట "ఏం చేద్దామంటావ్ మరి!? అలెక్సా అంటూ ప్రశ్నలు సంధించారు. దీంతో పాటు ఆరోగ్యం,వెల్ నెస్ సంబంధిత అంశాల గురించి ప్రతిరోజూ 11,500 ప్రశ్నలు అడిగారు. అమెజాన్ ప్రకారం, క్రీడలు, సినిమా డైలాగ్‌లు, పదాల నిర్వచనాలు, కఠినమైన గణిత సమస్యలు, వాతావరణం, తాజా స్టాక్ మార్కెట్ అప్డేట్లకు సంబంధించి అలెక్సా రోజువారీ 1.7 లక్షల ప్రశ్నలకు సమాధానమిచ్చింది. భారతీయ కస్టమర్లు ప్రతిరోజూ 21.6 లక్షల కంటే ఎక్కువ పాటలను ప్లే చేసారు, పిల్లలు, భక్తి, ప్రాంతీయ భాష వంటి జానర్లు టాప్ 20 పాటల్లో ప్రముఖంగా ఉన్నాయి. అలెక్సా ప్రతిరోజు స్మార్ట్ గృహోపకరణాలను నియంత్రించడం కోసం 2.6 లక్షలకు పైగా అభ్యర్థనలకు ప్రతిస్పందించింది. షావోమీ,వన్ ప్లస్, హింద్‌వేర్, ఆటోమ్ బెర్గ్ వంటి బ్రాండ్ల నుండి కొత్త ఉత్పత్తులతో అలెక్సా స్మార్ట్ హోమ్ ఎంపిక సంవత్సరానికి 72 శాతం పెరిగింది. కస్టమర్లు తమ రోజులను అలెక్సాతో ప్రారంభించడం ముగించడాన్ని ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ "అలెక్సా, గుడ్ మార్నింగ్ "అలెక్సా, గుడ్ నైట్" అని 11,520 సార్లు విష్ చేస్తున్నారు. అలెక్సా వినియోగదారు ప్రశ్నలను అర్థం చేసుకోవడంలో, ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ లోపాలను 25 శాతం తగ్గించిందని అమెజాన్ పేర్కొంది. -
చంద్రుడి మీదకు అలెక్సా, ఆస్ట్రోనాట్స్‌కు న్యూస్‌తో పాటు క్రికెట్ స్కోర్ కూడా!
నాసా సైంటిస్ట్‌లు 'చంద్రుడిపై మానవుడి నివాసం' అనే అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. 1972లో నాసా అపోలో17 ప్రాజెక్ట్‌లో భాగంగా చంద్రుడి మీద అడుగుపెట్టారు. ఇప్పుడు మరోసారి ఆర్టెమిస్ మిషన్ సిరీస్ పేరుతో 2025లోపు సైంటిస్ట్‌ల ప్రయోగాలకు అనువుగా ఉండే చంద్రుడి మీద లూనార్ సౌత్ పోలే'పై కాలుమోపనున్నారు.ఈ నేపథ్యంలో లూనార్ సౌత్ పోలే మీద ఎవరు కాలు మోపనున్నారు? ఆ ప్రాంతం ఎలా ఉంటుందనేది మరింత ఆసక్తికరంగా మారింది. అయితే మనుషుల కంటే ముందే అమెజాన్ వాయిస్ అలెర్ట్ అలెక్సా ఆ ప్రాంతానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. విశ్వంలో భూమి తర్వాత మనుషులు నివసించే అనుకూల గ్రహం కోసం సైంటిస్ట్‌లు ఎన్నో ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరి ఆశలు చంద్రుడి మీదనే ఉన్నాయి. సమీప భవిష్యత్తులో చందమామ మీద నివాసం ఉండే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా..నాసా సైంటిస్ట్‌లు 'నాసా ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్' లో అమెజాన్ లేటెస్ట్ వెర్షన్‌ను అలెక్సాను చంద్రుడి మీద లూనార్ సౌత్ పోలే అనే ప్రాంతం మీదకు పంపనున్నారు. ఈ ప్రయోగంలో భాగంగా నాసా సైంటిస్ట్‌లు అలెక్సా లేటెస్ట్ వెర్షన్‌ను కాలిస్టో పేలోడ్‌లో అమర్చేందుకు అమెజాన్, సిస్కో, లాక్‌హీడ్ మార్టిన్ సంస్థల టెక్ నిపుణులతో కలిసి పనిచేస్తుంది. ఆర్టెమిస్ ప్రయోగ సమయంలో తీవ్రమైన జర్క్‌లు, వైబ్రేషన్, రేడియేషన్ ఎక్స్పోజర్ను తట్టుకునేలా డెవలప్ చేయనున్నారు. స్పేస్‌లో అలెక్సా చంద్రుడి మీద అలెక్సా ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా పని చేసేలా నాసా సైంటిస్ట్‌లు డిజైన్ చేస్తున్నారు. అంతేకాదు చంద్రుని నుండి భూమికి..భూమి నుంచి తిరిగి చంద్రుడి మీదకు ఆలస్యం కాకుండా ఇన్ఫర్మేషన్ స్పీడ్‌గా రిసీవ్ చేసుకుంటుందని అమెజాన్ తెలిపింది. అలెక్సా ఉన్న నాసా ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్' ఎంత స్పీడ్‌గా ప్రయాణిస్తోంది.టెంపరేచర్ ఎంత ఉంది అనే సమాచారాన్ని అలెక్సా ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇవ్వనుంది. దీంతో పాటు ఆస్ట్రోనాట్స్ అలెక్సా ద్వారా న్యూస్, క్రికెట్ స్కోర్ భూమి నుంచి అప్డేట్లు పొందనున్నారని 'అమెజాన్ అలెక్సా ఎవ్రివేర్' వైస్ ప్రెసిడెంట్ ఆరోన్ రూబెన్సన్ అన్నారు. కాగా, అలెక్సాను ఈ ఏడాది మార్చి - ఏప్రిల్ మధ్య కాలంలో చంద్రుడి పంపాలని నాసా సైంటిస్ట్‌లు భావిస్తున్నారు. చదవండి: మరో ఐదేళ్లకు మార్స్‌పై జెండా ఎగరేద్దాం -
అమెజాన్ సంచలన నిర్ణయం..! ఇక పై ఆ సేవలు బంద్..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత 25 సంవత్సరాలుగా కంపెనీ నిర్వహిస్తోన్న వెబ్సైట్ ర్యాంకింగ్ సర్వీస్ Alexa.comను మూసివేస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ సర్వీస్ ద్వారా పలు వెబ్సైట్లకు ఎస్ఈవో (సెర్చ్ ఇంజన్ అప్టిమైజేషన్), అనాలిసిస్ టూల్స్‌ను అమెజాన్ అందిస్తోంది. వచ్చే ఏడాది నుంచి వెబ్సైట్ల స్టాటిస్టిక్స్, వాటి ర్యాంకింగ్‌లను అందించే సర్వీసులను అమెజాన్ నిలిపివేయనుంది. అలెక్సా ఇంటర్నెట్ షట్ డౌన్ అయిన తర్వాత, API సర్వీసెస్‌ను 2022 డిసెంబర్ నుంచి పూర్తిగా మూసివేయనుందని తెలుస్తోంది. సర్వీస్ షట్ డౌన్ అయ్యేలోపు ఆయా వెబ్సైట్ల డేటాను పొందేందుకు వినియోగదారులకు అమెజాన్ వీలును కల్పించనుంది. పలు వెబ్సైట్లకు ర్యాంకింగ్ సేవలను అందించే Alexa.comను మే 2022 మూసివేస్తోందనే కథనాన్ని కంపెనీ వెబ్సైట్లో తొలిసారిగా ప్రముఖ టెక్ బ్లాగ్ బీపింగ్ కంప్యూటర్ గుర్తించింది. అలెక్సా ఇంటర్నెట్ సర్వీసులను డిసెంబరు 8 నుంచి కొత్త సబ్స్క్రిప్షన్లను ఆమోదించడం ఆపివేసింది. కాగా ప్రస్తుతం ఉన్న కస్టమర్లకు సర్వీస్ షట్ డౌన్ అయ్యే వరకు సేవలను అందించనుంది. 1996 నుంచి ప్రస్థానం మొదలు..! ఏప్రిల్ 1996లో అలెక్సా ఇంటర్నెట్ను అమెజాన్ ప్రారంభించింది. అత్యంత ప్రజాదరణ పొందిన మెట్రిక్ ట్రాఫిక్ ర్యాంక్ వెబ్‌సైట్‌గా అలెక్సా. కామ్ నిలిచింది. చదవండి: పరిమితికి మించి సిమ్ కార్డులు తీసుకుంటున్నారా..! అయితే.. -
అలెక్సాతో పనిచేసే టీవీ, ఫీచర్లు ఇలా ఉన్నాయ్!
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సొంతంగా అమెజాన్ బ్రాండెడ్ టీవీని మార్కెట్లోకి విడుదల చేయనుంది. బ్రాండ్ ఫైర్ టీవీ (మల్టీపుల్ మోడల్) తరహాలో 55 నుంచి 75 అంగుళాల నిడివితో ఉన్న టీవీని అక్టోబర్‌లో అందుబాటులో తెచ్చేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఫీచర్స్ బిజినెస్ ఇన్ సైడర్ ప్రకారం.. వర్చువల్ అసిస్టెంట్ డివైజ్ 'అలెక్సా' కమాండ్ కంట్రోల్‌తో పనిచేసేలా రెండేళ్ల నుంచి టీవీపై వర్క్ చేస్తుంది. ఇందుకోసం చైనా ఎలక్ట్రానిక్ కంపెనీ టీసీఎల్ టెక్నాలజీ సంస్థతో చేతులు కలిపింది. ఇక అమెజాన్ - టీసీఎల్ భాగస్వామ్యంలో బిల్డ్ అవుతున్న ఈ టీవీలో అడాప్టివ్ వాల్యూమ్ ఫీచర్‌ను యాడ్ చేస్తుంది. డిష్వాషర్ ధ్వని, వ్యక్తుల మధ్య సంభాషణలు, ఎక్కడైనా ప్లే అవుతున్న మ్యూజిక్ గుర్తించి అలెక్సా స్పందించనుంది.వీటితో పాటు భారత్‌లో అమెజాన్ బేసిక్ బ్రాండెడ్ టీవీలను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. అమెజాన్ ఫైర్ టీవీ సాఫ్ట్వేర్ ఆధారితమైన తోషిబా, ఇన్సిగ్నియా టీవీలను విక్రయించనుంది. ఇందుకోసం కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ కంపెనీ బెస్ట్బైతో ఒప్పందం కుదుర్చుకుంది. సొంత సాఫ్ట్ వేర్ లేదు అమెజాన్ సంస్థ ఇప్పటి వరకు 'వెస్టింగ్‌హౌస్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్' అందించే సాఫ్ట్వేర్, ఇతర ఎక్విప్మెంట్లతో తయారు చేసిన టీవీలను అమెజాన్ మార్కెట్లో విడుదల చేస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా అమెజాన్ సంస్థ సొంతంగా తయారు చేసిన సాఫ్ట్వేర్ ఆధారిత టీవీలను విడుదల చేయాలని భావిస్తుంది.ఇందులో భాగంగా తొలిసారి అమెజాన్ బ్రాండెడ్ టీవీ బిల్డ్ చేస్తుంది. వచ్చే నెలలో అమెరికా, ఆ తరువాత భారత్‌లో విడుదల చేయనుంది. -
ఆ పేరు మార్చండి, అమెజాన్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు
-
ఇక పై హే అలెక్సా.. అంటే అమితాబ్ బచ్చన్ వస్తాడు..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఉత్పత్తుల్లో భాగంగా...మార్కెట్లలోకి అమెజాన్ ఈకో స్మార్ట్ స్పీకర్స్‌ను రిలీజ్ చేసింది. ఈ స్పీకర్లలో అమర్చిన అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా ద్వారా కొన్ని పనులను సులభతరం చేస్తాయి. హే అలెక్సా అనగానే..తన మాటలతో వాయిస్ అసిస్టెంట్ మంత్ర ముగ్దులను చేస్తోంది. అలారమ్ సెట్ చేయడంలో, కొన్ని పనులను సంబంధించి రిమైండ్ చేయడంలో అలెక్సా ఎంతగానో ఉపయోగపడుతుంది. తాజాగా అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌కు సరికోత్త ఫీచర్‌ను యాడ్ చేసింది. ఈ ఫీచర్‌తో హే అలెక్సా అనగానే బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ వస్తుంది. అమెజాన్ గురువారం రోజున తొలిసారిగా ఈ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఉన్న కస్టమర్లతో పాటు, కొత్త వారికి ఈ ఫీచర్ అందుబాటులో ఉండనుంది. అమెజాన్ కొత్త కస్టమర్లను ఆకర్షించుకునేందుకు ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది. అమెజాన్ అమితాబ్ బచ్చన్ వాయిస్‌ను అలెక్సాలో ప్రారంభ ధర రూ. 149 (అసలు ధర రూ. 299) ఏడాదికి చెల్లించడం ద్వారా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి వస్తుంది. సెలెబ్రిటీ వాయిస్ కొనుగోలు చేయడానికి ముందుగా "అలెక్సా, ఇంట్రడ్యూస్ మీ టూ అమితాబ్ బచ్చన్ జీ ’’ అని అలెక్సాతో చెప్పాలి. మీరు ఈ ఫీచర్‌ను అమెజాన్ సైట్ నుంచి నేరుగా పొందవచ్చు . ఒకసారి చెల్లింపు పూర్తైందని నిర్ధారించిన తర్వాత, మీరు అమితాబ్ బచ్చన్ వాయిస్‌తో ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టవచ్చు. అలెక్సా బదులు అమిత్ జీ అని పిలిచి కూడా మీరు బచ్చన్ వాయిస్‌తో ఇంటారక్ట్ అవ్వచును. అమెజాన్ ఇది వరకు అమెరికాలో హాలీవుడ్ సూపర్‌స్టార్ శ్యామ్యూల్ ఎల్ జాక్సన్ వాయిస్‌ను అందుబాటులోకి తెచ్చింది. -
అమెజాన్ కస్టమర్లకు షాక్! ఫిర్యాదుల మోత
సాక్షి,న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం దాకా కొన్ని గంటల పాటు ఆన్లైన్ షాపింగ్‌లో అంతరాయం ఏర్పడింది. గ్లోబల్‌గా కస్టమర్లు షాపింగ్ చేసేటప్పుడు తాత్కాలికంగా సమస్యలను ఎదుర్కొన్నారు. లాగిన్, షాపింగ్ సమస్యలు, ప్రైమ్ వీడియో సేవలకు అంతరాయం లాంటి ఫిర్యాదులతో ట్విటర్ మారు మోగింది. ఇండియాతో పాటు యుకె, కెనడా, ఫ్రాన్స్ , సింగపూర్‌లోని పలు కస్టమర్లు అమెజాన్ డౌన్ అంటూ గగ్గోలు పెట్టారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీనిపై వినియోగ దారుల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అమెజాన్ స్పందించింది. ఇబ్బందులు తలెత్తినమాట నిజమేనని, ప్రస్తుతం ఆ సమస్యలను పరిష్కరించామని, ప్రస్తుతం అంతా సజావుగా నడుస్తోందని అమెజాన్ ప్రతినిధి వెల్లడించారు. అయితే, సేవల అంతరాయానికి గల కారణాలను స్పష్టం చేయలేదు. ఇంటర్నెట్లో అంతరాయాలను గుర్తించే వెబ్సైట్ డౌన్‌డెటెక్టర్.కామ్ ప్రకారం అమెజాన్‌లోని పలు రకాల సేవలు గంటల పాటు నిలిచిపోయాయి. 40 మందికి వేలకు పైగా వినియోగదారులు తమ అమెజాన్ ఖాతా స్పందించడం లేదని నివేదించారు. అమెజాన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌తో పాటు అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో కూడా సమస్య లొచ్చాయని ఆరోపించారు. ఫలితంగా అమెజాన్ ప్రైమ్ వీడియో, అలెక్సా సేవలు కూడా నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. -
Amazon Echo Show : ఎక్కడి నుంచైనా స్పష్టంగా చూడొచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఆధునీకరించిన ఎకో షో–10, ఎకో షో–5 ఉపకరణాలను భారత్‌లో ప్రవేశపెట్టింది. 10.1 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఎకో షో–10 రూపుదిద్దుకుంది. ఇంటెలిజెంట్ మోషన్ ఫీచర్ దీనికి పొందుపరిచారు. దీంతో గదిలో ఎటువైపున ఉన్నా వీడియోలు వీక్షించేందుకు వీలుగా డిస్ప్లే కదులుతుంది. అలెక్సాతో... అమెజాన్ ఎకో షో–10 ధర రూ.24,999. స్మార్ట్ స్పీకర్ ఎకో షో–5 డివైజ్‌కు 5.5 అంగుళాల స్క్రీన్, వీడియో కాల్స్ కోసం అప్‌గ్రేడ్ చేసిన హెచ్డీ కెమెరా ఏర్పాటు చేశారు. ఎకో షో–5 ధర రూ.6,999 ఉంది. అలెక్సా యాప్ ద్వారా డివైజ్‌లోని బిల్ట్ ఇన్ కెమెరా సాయంతో ఇంటిని ఎక్కడి నుంచైనా పర్యవేక్షించవచ్చు. చదవండి : కాఫీడే....చేదు ఫలితాలు -
అమ్మాయిలకు 'ఆ పేరు' పెట్టడం బాగా తగ్గించేశారు..
అలెక్సా..అమెజాన్ తెచ్చిన ఒక పాపులర్ వర్చువల్ అసిస్టెంట్ లేదా డిజిటల్ పనిమనిషి. సాధారణంగా కంపెనీలు తమ కొత్తకొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చినప్పుడు వాటికి రకరకాల కొత్త పేర్లు పెడుతుంటాయి. తదనంతర కాలంలో ఉత్పత్తి ప్రాచుర్యాన్ని బట్టి ఆయా కొత్తపేర్లూ పాపులర్ అవుతాయి. అయితే.. 2014లో అమెజాన్ మార్కెట్లోకి తన వర్చువల్ అసిస్టెంట్‌ను తెచ్చినప్పుడు దానికి అప్పటికే అమెరికాలో ప్రాచుర్యంలో ఉన్న ఒక పేరును పెట్టింది.. అలెక్సా అని.. పాపులర్ పేరు అని ఎందుకు అన్నామంటే.. అమెరికాలోని ఆడపిల్లలకు ఎక్కువగా పెట్టే పేర్లలో అలెక్సా కూడా ఒకటి. ప్రొడక్ట్ పాపులర్ అయింది.. పేరు అన్‌పాపులర్ అయింది.. ఎందుకంటే.. యూఎస్ సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం 2015లో అమెరికాలో పుట్టిన పిల్లల్లో 6,052 మందికి అలెక్సా అనే పేరు పెడితే.. 2019 సరికి అ పేరు పెట్టేవారి సంఖ్య 1995కి తగ్గిపోయిందట. 2015లో ఆడపిల్లలకు పెట్టే పాపులర్ పేర్లలో అలెక్సా 32వ స్థానంలో ఉండగా.. నాలుగేళ్లలో అది 139వ స్థానానికి పడిపోయింది. ఎందుకంటే.. పిల్లలకు అలెక్సా అనే పేరు పెడితే.. జీవితాంతం ఆ పేరు ఒక డిజిటల్ పనిమనిషి పేరుతో ముడిపడి ఉన్నట్లే కదా.. వెళ్లేకొలది ఆ పేరును పెట్టడం మానేసే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు.. -
పైకి ఒక్కరే.. లోపల ఆరుగురు!
అలెక్సా! ఎవరావిడ?! వర్చువల్ అసిస్టెంట్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ. ఒక్క ముక్క తెలుగు లేదు. అలెక్సాకు ఇంగ్లిష్, హిందీతో పాటు మొత్తం ఎనిమిది భాషలు వచ్చు. తెలుగు రాదు. ‘రాదు’ అంటే.. అలెక్సా మనిషా, రావడానికి?! మనిషి లాంటి మనిషి. త్వరలో తెలుగులో కూడా అర్థంచేసుకోబోతున్న మనిషి! మర మనిషి అనుకోండి. కానీ మనిషిలా ఉండదు. మరలా ఉంటుంది. సిలెండర్ ఆకారంలో ఉండే స్పీకర్... అలెక్సా బాహ్యరూపం. అలెక్సా అంతః స్వరూపానికి మాత్రం ఆరు రూపాలు ఉన్నాయి. అన్నీ స్త్రీ రూపాలు. వాటిలో ఐదు జ్ఞానేంద్రియాలు. (ఇందు, టీనా, దీపిక, స్నేహాల్, ప్రాచి) ఆరో రూపం.. స్మృతేంద్రియం (రమ్య). వీళ్లు నడిపిస్తుంటారు అలెక్సాను. అలెక్సా ఎకో స్పీకర్‌ను తెచ్చుకుని, పవర్ సప్లయ్ ఇచ్చి, అమెజాన్ అలెక్సా యాప్‌ని మన స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని, ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయితే చాలు.. అలెక్సా మన ఆదేశాలను ఫాలో అయిపోతుంది. మనకేం కావాలంటే అది చేసి పెడుతుంది. ‘అలెక్సా.. ఆ లైట్ ఆపేయ్’. ఆపేస్తుంది. ‘అలెక్సా.. నిద్ర రావడం లేదు. నిద్రొచ్చే పాటలు వినిపించు’. వినిపిస్తుంది. ‘అలెక్సా నా జర్నీకి టికెట్స్ బుక్ చెయ్’. చేస్తుంది. ‘అలెక్సా ఆన్లైన్లో ఫలానా ఫలానవి షాపింగ్ చెయ్యి’. చేసి పెడుతుంది. ఒక్కమాటలో.. ‘తెలివైన సహాయకురాలు’ అనుకోండి. తెలుగులో అలెక్సాకు సరిగ్గా సరిపోయే మాట కూడా ఇదే! అలెక్సాకు అంత తెలివి, అంత చురుకుదనం, అంత నైపుణ్యం ఈ ఆరుగురు అమ్మాయిల వల్లే వచ్చింది. వీళ్ల గురించి.. క్తుప్లంగా.. సంక్షిప్తంగా. అలెక్సా ఆలోచన ఇందు ప్రసాద్ అలెక్సా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్. 2017లో అలెక్సాలో చేరారు. చిన్న వయసులోనే జర్నలిజంలోకి వచ్చి.. దాదాపు ఇరవై ఏళ్లపాటు స్టార్, జీ వంటి బ్రాండెడ్ టీవీ చానల్స్‌లో పని చేశారు. అలెక్సా ఏవైతే పనులు చేయగలుతోందో అవన్నీ కూడా ఇందు టీమ్ చేయిస్తున్నవే. అలెక్సా తీర్చే సందేహాలు, అలెక్సా ఇచ్చే సలహాలు, అలెక్సా చూపే పరిష్కారాలు, కొన్నిసార్లు అలెక్సా చూపించే ప్రేమ.. అన్నీ కూడా ఇందూ టీమ్వే. అలెక్సా స్పందన దీపికా బాలకృష్ణన్ ‘అలెక్సా ఎక్స్పీరియన్స్ అండ్ ఎంగేజ్మెంట్’ విభాగంలో సీనియర్ మేనేజర్. అలెక్సాను ఉపయోగించే కస్టమర్లకు మంచి అనుభవాలను ఇవ్వడం, తరచు అలెక్సాన వినియోగించేలా చేయడం ఆమె డ్యూటీ. కస్టమర్ల అవసరాలకు అలెక్సా ఎలా స్పందిస్తున్నదీ దీపిక బృందం నిశితంగా పర్యవేక్షిస్లూ అలెక్సాను నియంత్రిస్తుంటుంది. అలెక్సాతో కస్టమర్ల అనుభూతిని అడిగి తెలుసుకుంటూ ఉంటుంది. అలెక్సాలో చేరకముందు అమెజాన్ ప్రైమ్ ఇండియా మార్కెటింగ్‌లో ఉద్యోగి. అతి కష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుండే వారితో కలిసి పని చేస్తుండడం వల్ల నేర్చుకోడానికి ఎంతో ఉంటుందని దీపిక అంటారు. అలెక్సా స్వరగమన టీనా సదానా అలెక్సా స్వరసేవల బృంద నాయిక. ఆరంభం నుంచీ అలెక్సాలో ఉన్నారు. కొనుగోళ్లు, అమ్మకాల విభాగాన్ని చూస్తారు. ‘‘ఇదొక అంతులేని మహా సాగరం. ఇందులో ఈత కొట్టడం బాగుంటుంది. వినియోగదారులు, ఉత్పత్తిదారుల మధ్య అనుసంధానం అటుంచి, వాళ్లమ మధ్య అలెక్సా సంభాషణ ఆసక్తిగా ఉపయుక్తంగా ఉంటుంది’’ అంటారామె. ఎలక్ట్రానిక్స్, టెలికాంలలో ఇంజనీరింగ్ చేశారు టీనా. అలెక్సాకు ముందు ఎయిర్‌టెల్‌లో ఉన్నారు. అలెక్సా అవగాహన స్నేహల్ మేష్రమ్ యు.ఎస్.లో అలెక్సా ఆరంభం అవడానికి ఏడాది ముందే అలెక్సాలో చేరారు. అంతకుముందు మైక్రోసాఫ్ట్ ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్సాన్స్)లో స్పీచ్ అనలిస్ట్‌గా, స్కైప్‌లో ప్రోగ్రామ్ మేనేజర్‌గా చేశారు. అలెక్సాలో ప్రస్తుతం నేచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ (ఎన్.ఎల్.యు.) టీమ్‌లో పని చేస్తున్నారు. ఇండియన్ ఇంగ్లిష్‌లో, హిందీలో కస్టమర్లను అర్థం చేసుకోడానికి అలెక్సాకు స్నేహల్ టీమ్ ఎప్పటికప్పుడు అవగాహన శక్తిని నింపుతుంటుంది. అలెక్సాకు హిందీని అలవాటు చేయడం స్నేహల్‌కు పెద్ద ఛాలెంజింగ్ జాబ్ అయింది. అలెక్సా చేతన రమ్యా పూసర్ల తెలుగమ్మాయి. విశాఖ దగ్గర చిన్న పట్టణం. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో చదివారు. చదువు పూర్తవగానే నేరుగా అమెజాన్‌లో చేరారు. కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్. సాఫ్ట్వేర్ డెవలపర్‌గా చేశారు. అలెక్సాకు శిక్షణ ఇచ్చారు! ఏదైనా ఉద్యోగానికి వెళ్లినప్పుడు అనుభవం ఉందా అని అడుగుతారు కదా.. అలా అలెక్సాకు రమ్య ‘ఎక్స్‌పీరియెన్స్’ శిక్షణ ఇచ్చారు. పెద్ద పనే. ఇప్పుడు కూడా ఆమె, ఆమె టీమ్ చేస్తున్నది అదే. కస్టమర్ తీరుకు అనుగుణంగా అలెక్సా ప్రతి స్పందనల్ని వృద్ధి చెయ్యడం అలెక్సా మన్నన ప్రాచీ ముఖియా అలెక్సా స్కిల్స్‌కి, అలెక్సా వాయిస్ సర్వీసులకు మార్కెటింగ్ చేస్తుంటారు. ఆమె పని ప్రధానంగా ఇండియన్ డెవలపర్లు, ఇండియన్ బ్రాండ్లు, ఇండియన్ ఏజెన్సీలతో ఉంటుంది. అన్ని పర్యావరణ వ్యవస్థలకు అనుగుణంగా వాయిస్–టెక్ని అభివృద్ధి చేస్తుంటుంది ప్రాచీ టీమ్. కస్టమర్లకు అలెక్సాకు మధ్య దృఢమైన స్వరబంధాన్ని ఏర్పరచడం కూడా ఆమె పనే. -
అలెక్సా.. ఓపెన్ అపోలో!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ హాస్పిటల్ చెయిన్ అపోలో గ్రూప్ వాయిస్ ఆధారిత యాప్ ‘అమెజాన్ అలెక్సా స్కిల్– ఆస్క్ అపోలో’ను ఆవిష్కరించింది. దీంతో వాయిస్ కమాండ్‌తో దగ్గర్లోని అపోలో ఆసుపత్రులు, క్లినిక్స్, ఫార్మసీల వివరాలు తెలుసుకోవచ్చని, డాక్టర్ల అపాయింట్మెంట్ తీసుకోవచ్చని అపోలో గ్రూప్ ప్రకటన తెలిపింది. దేశవ్యాప్తంగా 72 అపోలో ఆసుపత్రులు, 5 వేల మంది వైద్యులు, 3,500 ఫార్మసీలు, 90 క్లినిక్స్, 15 డయాగ్నోస్టిక్ సెంటర్లు, 110 టెలిమెడిసిన్ సెంటర్లు, 15 మెడికల్ ఎడ్యుకేషన్ సెంటర్లు ఈ యాప్‌తో అనుసంధానమై ఉన్నట్లు సంస్థ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి తెలిపారు. -
అమెజాన్ ‘ఎకో ఫ్రేమ్స్’పై ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ: అమెజాన్ కంపెనీ రెండు రోజుల క్రితం ‘ఎకో ఫ్రేమ్స్’ పేరిట మార్కెట్లోకి విడుదల చేసిన అలెక్సా స్మార్ట్ గ్లాసెస్ పట్ల వినియోగదారుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ గ్లాసెస్ ధరించిన వారు ఇతరులతో మాట్లాడే ప్రతిమాటను కళ్లజోడుకున్న రెండు మైక్రో ఫోన్లు రిసీఫ్ చేసుకొని అమెజాన్ కంపెనీ కార్యాయలంలోని టేపుల్లో రికార్డు చేసే అవకాశం ఉండడమే వారి ఆందోళన కారణం. తద్వారా తమ ప్రైవసీ దెబ్బతింటుందన్నది వారి వాదన. ఇంతకు ముందు అమెజాన్ కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసి ‘అలెక్సా ఎకో స్పీకర్’ విషయంలోనూ ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి. అమెరికాలో ఓ జంట తమ పడక గది ముచ్చట్లను కూడా అలెక్సా స్పీకర్ రికార్డు చేసిందని ఆరోపిస్తూ కోర్టుకు కూడా ఎక్కారు. మాటలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అలెక్సా ఎకో స్పీకర్‌ను తయారు చేశారు. ఈ స్పీకర్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తే మన మాటల ద్వారా అది స్పందిస్తుంది. అంటే, మనకు కావాల్సిన పాటలు, వార్తలు లేదా జోకులు వినిపించమని నోటి ద్వారా కోరితే అలెక్సా యాప్ స్పందించి ఇంటర్నెట్ నుంచి వాటిని సేకరించి దానికి అనుసంధానించిన స్పీకర్ ద్వారా వినిపిస్తుంది. మన కమాండ్‌ను రిసీవ్ చేసుకుంటోంది కనుక అది మాటలను, ముచ్చట్లను కూడా వినే అవకాశం ఉంటుంది. మనం కమాండ్ ఇచ్చినప్పుడు మాత్రమే స్పందించి మిగతా సమయాల్లో అదంతట అదే ఆఫ్ అయ్యే పద్ధతి ఉండాలి. అది లేదు. అలాంటప్పుడు మన మాటలను, ముచ్చట్లను కంపెనీ టేపుల్లో రికార్డు చేసే అవకాశం ఉండకూడదు. అలెక్సా అంటే, మన మాటలను స్వీకరించి అందుకు అనుగుణంగా స్పందించే సాంకేతిక పరిజ్ఞానం ఇంకా సంపూర్ణంగా అభివద్ధి జరగలేదన్న కారణంగా, భవిష్యత్తు అభివద్ధి కోసం మనం మాట్లాడే మాటలను రికార్డు చేసే పద్ధతిని కంపెనీ యాజమాన్యాలు ప్రవేశ పెట్టాయి. ఒక్కొక్కరి మాట ఒక తీరు ఉంటుంది. కొన్ని ప్రాంతాల భాష, యాస తేడాగా ఉంటుంది. అన్ని తేడాలను గుర్తించి స్పందించే విధంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివద్ధి చేయాలన్న సంకల్పంతోనే తాము ఈ రికార్డులను ఉద్దేశపూర్వకంగా అనుమతిస్తున్నామని, తాము ఎవరు ఏం మాట్లాడారో బయట పెట్టం కనుక, వినియోగదారుల ప్రైవసీకి వచ్చిన నష్టం ఏమీ లేదని ఈ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కంపెనీలు వాదిస్తున్నాయి. ఈ కంపెనీలు టెక్నాలజీ అభివద్ధి కోసం ఈ మాటల టేపులను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తున్నందున ఆ ఏజెన్సీలు అమ్ముకునే అవకాశం ఉందని, తద్వారా తమ ప్రైవసి దెబ్బతింటుందని వినియోగదారులు వాపోతున్నారు. ఏదీ ఏమైన అలెక్సా ఎకో స్పీకర్ తరహాలో పనిచేసే అమెజాన్ ‘ఎకో ఫ్రేమ్స్’ను విడుదల చేసింది. ఆ ఫ్రేముల్లో మన కళ్లకు సరిపడే అద్దాలను బిగించుకోవచ్చు. కళ్లజోడుకు ఇరువైపుల ఉండే రెండు మైక్రోఫోన్లతో ఇంటర్నెట్ ద్వారా మనం కోరుకున్న పాటలను, వార్తలను, జోకులను వినవచ్చు. అంతే కాకుండా జేబులో నుంచి ఫోన్ తీయాల్సిన అవసరం లేకుండా నోటి ద్వారా మిత్రులకు, బంధువులకు కనెక్షన్ కలుపుమని అలెక్సాను అడిగి నేరుగా మాట్లాడవచ్చు. ఇంటర్నెట్ సౌకర్యం కోసం ఓ స్మార్ట్ ఫోన్ మాత్రం ఉండాల్సిందే. (చదవండి: అమెజాన్ నుంచి ‘అలెక్సా’ ఇయర్ బడ్స్) -
బుడుగులకో ‘సెర్చ్ ఇంజన్’!
సాక్షి, న్యూఢిల్లీ : అక్షరాలు సరిగ్గా రాని మూడేళ్లలోపు నర్సరీ పిల్లల కోసం గూగుల్ కంపెనీ ‘గూగుల్ అసిస్టెంట్’ తరహాలో ప్రత్యేక ఇంటర్నెట్ సర్చ్ ఇంజన్‌ను తీసుకొస్తోంది. వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీతో ‘గూగుల్ అసిస్టెంట్’ నడుస్తుందని, మన వాయిస్ కమాండ్ ద్వారా ఇంటర్నెట్లో మనకు కావాల్సిన సమాచారాన్ని అది అందిస్తుందని తెల్సిందే. ఇదే తరహాలో పనిచేసే, పిల్లలకు మరింత ఆకర్షణగా ఉండేలా దీన్ని తీసుకొచ్చేందుకు కషి చేస్తున్నామని. అప్పుడు దీనికి ‘గేమిఫైయింగ్ వాయిస్ సెర్చ్ ఎక్స్పీరియన్స్ ఫర్ చిల్డ్రన్’ పేరిట యూరప్‌లో పేటెంట్‌కు దరఖాస్తు కూడా చేశామని గూగుల్ యాజమాన్యం ప్రకటించింది. గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ ఎకో ‘అలెక్సా’తో ప్రైవసీ దెబ్బతింటోందని గోల చేస్తున్న సామాజిక కార్యకర్తలు దీనివల్ల కూడా ప్రైవసీకి ముప్పుందంటూ మొత్తుకుంటున్నారు. పైగా చిన్నతనంలో పిల్లలను ఇంటర్నెట్కు బానిసలను చేయడం మరింత అన్యాయం అంటున్నారు. పిల్లల్లో ఆటలు సృజనాత్మకతను పెంచుతాయని, తాము రూపొందించాలనుకుంటున్నసెర్చ్ ఇంజన్ కూడా ఓ ఆటలాగే ఉంటుందని యాజమాన్యం చెబుతోంది. పిల్లలు బొమ్మలు చూసి పాఠాలు నేర్చుకున్నట్లే, వాటిని కంప్యూటర్లలో చూస్తూ మరింత వేగంగా నేర్చుకుంటారని వాదిస్తోంది. జీబ్రా, టైగర్ అంటూ పిల్లలు ఉచ్చరించగానే టేబుల్ టాప్‌లో వాటి బొమ్మలు ప్రత్యక్షమవడం వారికి ఆనందనిస్తాయని చెబుతోంది. అయినా తాము పేటెంట్ కోసం దరఖాస్తు చేసినంత మాత్రాన ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని, అది సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ లేదని గూగుల్ చెప్పింది. చాలా ఐటీ కంపెనీలు ఇలా పేటెంట్లు దాఖలు చేసుకోవడం అందులో మూడోవంతు కార్యరూపం దాల్చకపోవడం తెల్సిందేనంటూ తెలిపింది. శిశువుల మల, మూత్ర విసర్జనలతోపాటు వారి తిండి, నిద్రను పర్యవేక్షిస్తూ తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సూచనలు చేసే ‘స్మార్ట్నాపీ’ పేరుతో పాంపర్స్ యాప్ లూమి వచ్చిన నేపథ్యంలోనే గూగుల్ నుంచి ఈ వార్త వెలువడడం హాట్ టాపిక్‌గా మారింది. శిశువుకు గదిలో ఎంత ఉష్ణోగ్రత ఉండాలో ముందుగానే ఫీడ్ చేసుకున్న ఈ యాప్ గదిలో ఉష్ణోగ్రత ప్రమాదకర స్థాయికి వెళ్లినప్పుడు, మూత్ర విసర్జనతో బట్టలు తడిసినప్పడు, డైపర్ మార్చాల్సి వచ్చినప్పుడు ఈ యాప్ స్మార్ట్ ఫోన్ సందేశాలతో తల్లిదండ్రులను హెచ్చరిస్తుంది. ఇది కూడా ప్రైవసీని దెబ్బతీస్తోందని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. -
ఇక రోబో రూపంలో ‘అలెక్సా’
సాక్షి, న్యూఢిల్లీ : అమెజాన్ కంపెనీకి చెందిన వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ ప్రస్తుతం అందిస్తున్న సేవలు గురించి తెల్సిందే. గూగుల్ అసిస్టెంట్ తరహాలో ‘వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ’తో పనిచేసే అలెక్సా మనకు నచ్చిన పాటను ఇంటర్నెట్ నుంచి వెతికి వినిపించడమే కాకుండా ఆటోమేషన్ ద్వారా మన ఇంట్లోని టీవీలను, ఫ్యాన్లను, లైట్లను కంట్రోల్ చేస్తోంది. మన కూర్చున్న చోటు నుంచి లేవకుండానే అలెక్సాకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా టీవీలు, ఫ్యాన్లు, లైట్లను ఆన్, ఆఫ్ చేయవచ్చు. ఇప్పుడు ఇదే తరహాలో అమెజాన్ కంపెనీ మన నడుము ఎత్తుగల అలెక్సా రోబోను తయారు చేస్తోందని, దీనికి ఇంజనీర్ల సాయం కూడా తీసుకుంటోందని ‘బ్లూమ్‌బెర్గ్ డాట్ కామ్’ వెబ్సైట్ వెల్లడించింది. దీనికి ‘వెస్టా’ అని కూడా నామకరణం చేసిందట. దీనికి వీల్స్ మీద ప్రయాణించే సౌదుపాయం ఉంటుంది. వాయిస్ కమాండ్ ద్వారా అది ఎక్కడ ఉన్న దాన్ని మన దగ్గరికి పిలుచుకోవచ్చు. అంటే ఇంటి ముందుకు, పెరట్లోకి దాని పిలిపించుకొని దాని సేవలు వినియోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అరచేతిలో అమరే ‘అలెక్సా’ను ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లే సౌకర్యం ఉన్నప్పుడు ఎందుకు నడుము ఎత్తు రోబోను తయారు చేయడం అన్న ప్రశ్న కూడా వినియోగదారులకు తలెత్తుతోంది. ఒక్క వాయిస్ కమాండ్స్ ఇచ్చినప్పుడే కాకుండా ఇంట్లో మనం మాట్లాడుకునే ప్రతి మాటను అలెక్సా లాంటి వాయిస్ అసిస్టెంట్లు రికార్డు చేస్తున్నాయని, వాటి వల్ల ఇంట్లోని మనుషులకు ప్రైవసీ లేకుండా పోతోందని తాజాగా వెల్లడయిన నేపథ్యంలో ఇంట్లో తిరుగాడే ‘వెస్టా’ వేస్టేగదా! అంటున్న వారు లేకపోలేదు. అలెక్సాను రోబో స్థాయికి తీసుకెళ్లినప్పుడు అందులో వేరే విశేషాలు ఏవో ఉండనే ఉంటాయని ‘అమెజాన్’ వినియోగదారులు ఆశిస్తున్నారు. -
మన పడక గదులకు అవే ‘చెవులు’
సాక్షి, న్యూఢిల్లీ : ఆఫీసు నుంచి నీవు ఎంతో బడలికతో ఇంటికి వస్తావ్. చేతిలోని బ్యాగ్ తీసి సోఫాలో గిరాటేస్తావ్. టై విప్పుకుంటూ సోఫాలో కూలబడతావ్. ‘ఏమేవ్, ఎక్కడ చచ్చావే! వేడి వేడి టీ పట్టుకురావాలని తెలియదా? ఎన్నిసార్లు చెప్పాలి!’ అంటూ భార్య మీద విసుగ్గా అరుస్తావ్. అంతలో ‘గూగుల్’ సేవలు గుర్తొస్తాయ్. ‘హే గూగుల్! ఫ్యాన్ ఆన్చేయి. టీవీ పెట్టు, వ్యాల్యూమ్ తగ్గించు. చీకటవుతోంది బయట వసారాలో లైట్ వేయి, మధ్య రూమ్‌లో ఫ్యాన్, లైట్ ఆర్పేయ్!’...ఇంతలో కాస్త ఆలస్యంగా భార్య వేడి వేడి చాయ్‌తో వస్తుంది. టీ కప్పు చేతికిస్తుంది. ఓ గుక్క టీ తాగి గూగుల్ సేవలు భార్యకన్నా బాగున్నాయ్ అనుకుంటావ్ నీవు. అసలు విషయం తెలిస్తే అదిరిపోతావ్. ఇప్పటి వరకు ‘గూగుల్ అసిస్టెంట్’కు నీవిచ్చిన ఆదేశాలనే కాకుండా అంతకుముందు భార్యను ఉద్దేశించి ‘ఏమేవ్, ఎక్కడ చచ్చావే’ అంటూ నీవు విసుక్కున్న మాటలన్నింటినీ గూగుల్ హోం స్పీకర్లు రికార్డు చేస్తాయ్. పొద్దున మారాం చేస్తున్న పిల్లల్ని విసుక్కోవడం, పిల్లల్ని సరిగ్గా పెంచడం లేదంటూ భార్యను తిట్టడం, ఏందయ్యా గోలంటూ పక్కింటి పరాందమయ్య మందలింపుపై వంటికాలిపై లేవడం, బూతు మాటలందుకోవడం.. అన్నీ రికార్డవుతాయి. అంతేకాదు గత రాత్రి భార్యతో పంచుకున్న ప్రేమ కలాపాల మాటలు రికార్డవుతాయ్! ఇదంతా ‘గూగుల్ అసిస్టెంట్’గా పిలిచే ‘గూగుల్ స్పీచ్ లేదా వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ’ ఫలితం. అమెజాన్ అలెక్సా, సిరి కూడా ఈ టెక్నాలజీకి సంబంధించినవే. ఈ పరికరాలు మనం ఇంట్లో మాట్లాడే ప్రతిమాటను రికార్డు చేస్తాయ్. చేస్తున్నాయ్! వాటిని తమ సంస్థ ఆడియో డేటా బేస్‌కు పంపిస్తాయ్. గూగుల్ కంపెనీ ఆ ఆడియో డేటాలను ‘వాయిస్ రికార్డింగ్ టెక్నాలజీ’ని మరింత అభివృద్ధి చేయడం కోసం సబ్ కాంట్రాక్టర్‌కు పంపిస్తోంది. ఆ సబ్‌కాంట్రాక్టర్ ఉద్యోగులు ఆ ఆడియో టేపులను విని వాటి స్క్రిప్టును కూడా రాసుకుంటారు. అసలు బండారం వీరి వద్ద నుంచే వేగుల ద్వారా బెల్జియంలోని వీఆర్టీ, ఎన్డబ్లూఎస్ ఛానళ్లకు లీకయింది. వాటిలో మచ్చుకు వేయి ఆడియో టీపులను ఈ రెండు సంస్థలు సేకరించాయి. వాటిల్లో భార్యాభర్తలు కొట్టుకోవడం, తింటుకోవడం దగ్గరి నుంచి వారి శృంగార లీలల వరకు ఉండగా, పిల్లల అల్లరి, ఆకతాయి చేష్టలు, వారి మధ్య జరిగే సంభాషణలు అన్నీ ఉన్నాయి. ఇదే విషయంలో అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన ఓ తల్లి అమెజాన్‌కు చెందిన ‘అలెక్సా’కు వ్యతిరేకంగా సియాటిల్‌లోని ఫెడరల్ కోర్టుకు ఆశ్రయించారు. పిల్లల మాటా ముచ్చట్లను, చర్చలను అన్నింటిని అలెక్సా రికార్డు చేస్తోందని, ప్రైవసి లేకుండా పోయిందంటూ ఆ తల్లి తన పదేళ్ల కూతురితోపాటు కొంత మంది పిల్లల తరఫున కోర్టుకెక్కారు. అలాంటి డేటాను తాము ఎక్కడా బహిర్గతం చేయమని అమెజాన్ హామీ ఇస్తుండగా, ఎప్పటికప్పుడే వినియోగదారుడే తమ డివైస్ నుంచి డేటాను తొలగించుకుంటే సరిపోతుందని గూగుల్ యాజమాన్యం ప్రకటించింది. ఇప్పటి వరకు మన ఊరు, పేరు, చిరునామాను బట్టబయలు చేస్తున్నారు, ఇది ప్రైవసీ హక్కులకు విరుద్ధమంటూ ఆధార్ కార్డుపై సుప్రీం కోర్టుకు, మన అభిప్రాయాలను ఫేస్బుక్ అమ్ముతోందంటూ అంతర్జాతీయ కోర్టుకెక్కి గోల చేస్తున్న మనం, ఇప్పుడు మన ఇంటి గుట్టును బజారులో పెడుతున్న ఈ కొత్త టెక్నాలజీపై ఎక్కడిదాకా వెళ్లాలో!? -
అలెక్సా బూతులు తిడుతోంది!
29 ఏళ్ల మైఖేల్ స్లడే ఎప్పటిలాగే ఇంటికొచ్చి అలెక్సాని ఆన్ చేసి ఏదైనా మంచి సంగీతం వినిపించమని అడిగాడు. అయితే అది సంగీతం వినిపించడానికి బదులు బూతులు తిట్టడం మొదలెట్టింది. ఎప్పుడడిగినా పాటలు వినిపించే ఈ వర్చువల్ అసిస్టెంట్... ఉన్నట్టుండి బూతులందుకోవడంతో మైఖేల్ షాక్ తిన్నాడు. ఏం జరిగిందో తెలియక కంగారు పడ్డాడు. అంతకు ముందురోజే మైఖేల్ తన అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం రద్దు చేసుకున్నాడు. దాని విషయమై కస్టమర్ కేర్‌కు చెందిన వ్యక్తితో మాట్లాడాడు. సభ్యత్వం రద్దు చేసుకున్నప్పటి నుంచి అలెక్సా ఇలా వింతగా ప్రవర్తించడంతో దానికీ దీనికీ ఏదైనా సంబంధం ఉందేమోనని అనుమానించాడు. అమెజాన్‌ను సంప్రదిస్తే అలాంటిదేమీ లేదన్నారు. అలెక్సా ఎందుకలా అనుచిత పదాలు వాడుతోందో తమకూ అర్థం కావడం లేదన్నారు. అలెక్సా ఖాతా వివరాలు ఇస్తే ఏం జరిగిందో పరిశీలించి చెబుతామని చెప్పారు. జరిగిన పొరపాటుకు పరిహారంగా అమెజాన్ మైఖేల్‌కు 5 పౌండ్ల నగదు, ఏడాది అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఉచితంగా ఇచ్చింది.‘ఇంటికొచ్చాకా రోజూలాగే అలెక్సాను ఏదైనా సంగీతం వినిపించమని అడిగాను. ‘తప్పకుండా. మీ పాటల జాబితా ఇది......(అని ఓ బూతు పదం వాడింది). తర్వాత క్షమించండి ఏదో పొరపాటు జరిగింది’ అని అలెక్సా చెప్పే సరికి షాక్ తిన్నా. అలెక్సా అలా మాట్లాడటం నమ్మలేకపోయా’ అన్నాడు సౌత్‌వేల్స్‌కు చెందిన మైఖేల్. అమెజాన్ సాంకేతిక నిపుణులు కూడా ఇలా ఎందుకు జరిగిందో చెప్పలేకపోయారన్నాడు. -
రియల్టీ అలెక్సా!
సాక్షి, హైదరాబాద్: అమెజాన్ అభివృద్ధి చేసిన వర్చువల్ అసిస్టెంట్ (వాస్తవిక సహాయకుడు) సేవలు రియల్ ఎస్టేట్‌లోకి విస్తరించాయి. సింగపూర్‌కు చెందిన డిజిటల్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఎలారా టెక్నాలజీస్ స్థిరాస్తికి సంబంధించి తాజా వార్తలు, విశేషాల కోసం అలెక్సా కంపాటిబుల్ స్మార్ట్ హోమ్ డివైజ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో హౌసింగ్.కామ్, ప్రాప్‌టైగర్.కామ్, మకాన్.కామ్ల్లోని వార్తలు, ధరలు, బ్లాగ్ విశేషాలను అలెక్సా అందిస్తుంది. ‘‘ప్రపంచవ్యాప్తంగా వాయిస్ ఆధారిత రియల్టీ సెర్చింగ్స్ ఎక్కువగా ఉంటున్నాయని.. మన దేశంలో ఇది 28 శాతం వరకు, ప్రపంచవ్యాప్తంగా 50 శాతం వరకుంటుందని’’ గ్రూప్ సీపీటీవో రవి భూషన్ తెలిపారు. -
ఇకపై అలెక్సాలో స్కైప్ కాలింగ్...
‘హేయ్ అలెక్సా కాల్ టు మై డాడ్ ఆన్ స్కైప్’ అనగానే మీరు అనుకున్నవారికి వీడియో కాల్ చేసే సదుపాయం ఇప్పుడు అలెక్సా డివైస్‌లకు వచ్చేసింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్ సంస్థలు రెండు కలిసి ఈ మేరకు తమ సర్వీసులను వినియోగ దారులకు అందించనున్నాయి. గతంలో అలెక్సా నుంచి అలెక్సా డివైసెస్‌కు మాత్రమే వాయిస్ కాలింగ్ సదుపాయం ఉండేది. ప్రస్తుతం ఈ సదుపాయం స్కైప్ అకౌంటు ఉన్న ల్యాండ్‌లైన్ ఫోన్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. బ్రిటన్, అమెరికా, ఐర్లాండ్, కెనడా, ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి 39 దేశాల్లో ఈ సౌకర్యం ఇప్పటికే అందుబాటులోకి రాగా ఇతర దేశాలకు కూడా త్వరలో అందుబాటులోకి తెస్తామని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఇంట్రడక్షన్ ఆఫర్ కింద నెలకు వంద నిమిషాల ఉచిత కాలింగ్‌ను రెండు నెలల పాటు అందించనున్నట్లు తెలిపారు. ఈ సదుపాయాన్ని పొందడానికై అలెక్సా డివైస్‌లోని సెట్టింగ్స్ ఓపెన్ చేసి కమ్యూనికేషన్ విభాగంలోని స్కైప్‌తో జత చేయాలి. అలెక్సా అంటే... ! మన స్మార్ట్‌ఫోన్స్‌లో ఉన్న గూగుల్ అసిస్టెంట్, సిరి, కోర్టానా లాగే అలెక్సా కూడా వాయిస్ కమాండ్స్ ఆధారంగా పని చేసే వర్చువల్ అసిస్టెంట్. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఈ డివైస్‌ను డెవలప్ చేసింది. న్యూస్, పాటలు, పోడ్కాస్ట్లను వినిపించడం, నిర్దేశించిన సమయానికి అలారం మోగించడం వంటి పనులు కృత్రిమ మేధ సహకారంతో చేస్తుంది. అప్డేట్ అందుకోనున్న డివైస్‌లు... అమెజాన్ ఎకో ఫస్ట్ జనరేషన్ అమెజాన్ ఎకో సెకండ్ జనరేషన్ అమెజాన్ ఎకో ప్లస్ సెకండ్ జనరేషన్ అమెజాన్ ఎకో డాట్ సెకండ్ జనరేషన్ అమెజాన్ ఎకో డాట్ థర్డ్ జనరేషన్ అమెజాన్ ఎకో షో ఫస్ట్ జనరేషన్ అమెజాన్ ఎకో షో సెకండ్ జనరేషన్ అమెజాన్ ఎకో షో స్పాట్ డివైసెస్ -
అలెక్సా ఒక సంచలనం...వైరల్ వీడియో