ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత 25 సంవత్సరాలుగా కంపెనీ నిర్వహిస్తోన్న వెబ్‌సైట్ ర్యాంకింగ్ సర్వీస్ Alexa.comను మూసివేస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ సర్వీస్ ద్వారా పలు వెబ్‌సైట్లకు ఎస్‌ఈవో (సెర్చ్ ఇంజన్ అప్టిమైజేషన్), అనాలిసిస్ టూల్స్‌ను అమెజాన్ అందిస్తోంది.
వచ్చే ఏడాది నుంచి వెబ్‌సైట్‌ల స్టాటిస్టిక్స్, వాటి ర్యాంకింగ్‌లను అందించే సర్వీసులను అమెజాన్ నిలిపివేయనుంది. అలెక్సా ఇంటర్నెట్ షట్ డౌన్ అయిన తర్వాత, API సర్వీసెస్‌ను 2022 డిసెంబర్ నుంచి పూర్తిగా మూసివేయనుందని తెలుస్తోంది. సర్వీస్ షట్ డౌన్ అయ్యేలోపు ఆయా వెబ్‌సైట్ల డేటాను పొందేందుకు వినియోగదారులకు అమెజాన్ వీలును కల్పించనుంది.
పలు వెబ్‌సైట్లకు ర్యాంకింగ్ సేవలను అందించే Alexa.comను మే 2022 మూసివేస్తోందనే కథనాన్ని కంపెనీ వెబ్‌సైట్‌లో తొలిసారిగా ప్రముఖ టెక్ బ్లాగ్ బీపింగ్ కంప్యూటర్ గుర్తించింది. అలెక్సా ఇంటర్నెట్ సర్వీసులను డిసెంబరు 8 నుంచి కొత్త సబ్‌స్క్రిప్షన్‌లను ఆమోదించడం ఆపివేసింది. కాగా ప్రస్తుతం ఉన్న కస్టమర్లకు సర్వీస్ షట్ డౌన్ అయ్యే వరకు సేవలను అందించనుంది.
1996 నుంచి ప్రస్థానం మొదలు..!
ఏప్రిల్ 1996లో అలెక్సా ఇంటర్నెట్‌ను అమెజాన్ ప్రారంభించింది. అత్యంత ప్రజాదరణ పొందిన మెట్రిక్ ట్రాఫిక్ ర్యాంక్ వెబ్‌సైట్‌గా అలెక్సా. కామ్ నిలిచింది.
చదవండి: పరిమితికి మించి సిమ్ కార్డులు తీసుకుంటున్నారా..! అయితే..
Comments
Please login to add a commentAdd a comment